Virata Parvam Movie Team Meets Real Life Sarala Family, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Virata Parvam-Sai Pallavi: సాయి పల్లవికి చీర పెట్టిన సరళ కుటుంబ సభ్యులు

Jun 20 2022 4:00 PM | Updated on Jun 20 2022 4:37 PM

Virata Parvam Movie Team Meets Sarala Family Venu Udugula Shares Video - Sakshi

రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘విరాట పర్వం’. జూన్‌ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం హిట్‌ టాక్‌తో దూసుకుపోతుంది. నక్సలిజం నేపథ్యంలో ఓ అందమైన ప్రేమకథగా వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికి ఈ మూవీ హౌజ్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది.  ఈ సినిమాకు సాధారన ప్రేక్షకులు మాత్రమే కాదు సెలబ్రెటీలు సైతం ఫిదా అవుతున్నారు. వేణు ఉడుగుల తెరకెక్కించిన ఈ చిత్రంపై సినీ స్టార్స్‌, దర్శక-నిర్మాతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. 1990లో సరళ అనే అమ్మాయి నిజ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని  వేణు ఊడుగుల రూపొందించాడు.

చదవండి: ‘విరాట పర్వం’ మూవీపై తమిళ స్టార్‌ డైరెక్టర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఈ నేపథ్యంలో విరాట పర్వం మూవీ టీం సరళ కుటుంబాన్ని కలిసిన వీడియోను తాజాగా వేణు ఉడుగుల షేర్‌ చేశాడు. వరంగల్‌లోని నివసిస్తున్న సరళ కుటుంబాన్ని దర్శకుడు వేణు ఉడుగుల, హీరో రానా, హీరోయిన్‌ సాయిపల్లవి ఇతర టీం సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా విరాట పర్వం మూవీ టీంకు సరళ కుటుంబ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం కాసేపు మూవీ టీం ఆమె కుటుంబంతో ముచ్చటించింది. ఇక చివరకు సరళ కుటుంబ సభ్యులు సాయి పల్లవి చీర బహుకిరంచి బోట్టు పెట్టారు. దర్శకుడు వేణు ఉడుగుల షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతుంది. 

చదవండి: ‘విక్రమ్‌’ మూవీలో విలన్స్‌తో ఫైట్‌ చేసిన ఈ పని మనిషి ఎవరో తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement