
Director Raghavendra Rao Praises Virata Parvam: టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన సినిమాల్లో ‘విరాటపర్వం’ ఒకటి. దగ్గుబాటి రానా, టాలెంటెడ్ హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటించడం, తొలిసారి నక్సలిజం నేపథ్యంలో ఓ ప్రేమ కథా చిత్రం వస్తుండడంతో సినీ ప్రేమికులకు ‘విరాటపర్వం’పై ఆసక్తి పెరిగింది. ఈ మూవీ అనేక అంచనాల మధ్య జూన్ 17న విడుదలైంది. రిలీజైనప్పటి నుంచి మంచి టాక్‌తో దూసుకుపోతోంది. రానా, సాయి పల్లవి నటనపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ క్రమంలోనే ప్రముఖ డైరెక్టర్ దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు 'విరాట పర్వం' సినిమాను కొనియాడారు. 'కుర్రవాడైన వేణు ఊడుగుల దర్శకత్వం ఎంతో అద్భుతంగా ఉంది. చాలా అనుభవమున్న డైరెక్టర్ అనిపించుకున్నాడు. అలాగే రానా, సాయి పల్లవి నటన ఎక్సలెంట్. కచ్చితంగా చూడాల్సిన చిత్రం విరాట పర్వం.' అని దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు కితాబిచ్చారు.
చదవండి: థియేటర్‌లో అందరిముందే ఏడ్చేసిన సదా.. వీడియో వైరల్
ఆ హీరోలా ఎఫైర్స్ లేవు.. కానీ ప్రేమలో దెబ్బతిన్నా: అడవి శేష్
ఓటీటీలోకి 'విరాట పర్వం'.. ఎప్పుడంటే ?