లక్కీ భాస్కర్‌తో ప్రేక్షకులను మెప్పించిన దుల్కర్ సల్మాన్.. ఇప్పుడు మరో తెలుగు చిత్రం ప్రారంభించేందుకు రెడీగా ఉన్నారు. షూటింగ్ పనులు మొదలు కూడా త్వరలో మొదలు కానున్నట్లు తెలుస్తోంది. పవన్ సాధినేని దర్శకత్వంలో ‘ఆకాశంలో ఒక తార’ అనే సినిమా తెరకెక్కించనున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు.
ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో స్వప్నా సినిమాస్, వైజయంతీ మూవీస్, లైట్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్, గీతా ఆర్ట్స్ పతాకాలపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ సినిమాను నిర్మించనున్నారు. దుల్కర్ మునుపెన్నడూ నటించన విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతుంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీత దర్శకుడిగా ఈ ప్రాజెక్ట్‌కు పనిచేస్తుండగా.. సుజిత్ సారంగ్ కెమెరామెన్‌గా వ్యహరించనున్నట్లు తెలిసింది.
దుల్కర్ సల్మాన్ తెలుగులో ఇప్పటికే 'కాంత' అనే మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇది చిత్రీకరణ దశలో కొనసాగుతుంది. ‘నీలా’ ఫేమ్ సెల్వమణి సెల్వరాజ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. రానా కీలక పాత్రలో కనిపించనున్నారు. భాగ్యశ్రీ బోర్సే ఈ చిత్రంలో నటిస్తుంది.
ఇక ‘ఆకాశంలో ఒక తార’ సినిమాలో హీరోయిన్ పాత్రకు సాయి పల్లవిని తీసుకోవాలని చిత్రయూనిట్ భావిస్తోందని, ఈ కథ సాయి పల్లవికి వినిపించగా, ఆమె కూడా సినిమా చేయడానికి ఒప్పుకున్నారని టాక్. మరి... దుల్కర్–సాయి పల్లవి జోడీ కుదురుతుందా? అంటే వేచి చూడాల్సిందే. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమా పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని యూనిట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment