మద్రాస్‌ నేపథ్యంలో... | Dulquer Salmaan And Rana Daggubati Bilingual Film Kaantha Launched, Photo Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

మద్రాస్‌ నేపథ్యంలో...

Published Tue, Sep 10 2024 12:21 AM | Last Updated on Tue, Sep 10 2024 11:52 AM

Dulquer Salmaan And Rana Daggubati Bilingual Film Kaantha Launched

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా ‘కాంత’ సినిమా షురూ అయింది. సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘మిస్టర్‌ బచ్చన్‌’ మూవీ ఫేమ్‌ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌. స్పిరిట్‌ మీడియా, వేఫేరర్‌ ఫిల్మ్స్‌ పతాకాలపై రానా దగ్గుబాటి, దుల్కర్‌ సల్మాన్, ప్రశాంత్‌ పొట్లూరి, జోమ్‌ వర్గీస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. ముహూర్తపు సన్నివేశానికి హీరో వెంకటేష్‌ క్లాప్‌ ఇచ్చారు. రానా దగ్గుబాటి మాట్లాడుతూ– ‘‘ సురేశ్‌ ప్రోడక్షన్స్ 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, మా స్పిరిట్‌ మీడియాతో కొత్త శకానికి నాంది పలికేందుకు సరైన చిత్రం ‘కాంత’. సోమవారం నుంచే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించాం’’ అన్నారు.

‘‘మానవ భావోద్వేగాల లోతులను ఆవిష్కరించే అందమైన కథ ‘కాంత’’ అని దుల్కర్‌ సల్మాన్‌ తెలిపారు. ‘‘1950 మద్రాస్‌ నేపథ్యంలో సాగే సినిమా ఇది. మానవ బంధాలు, సామాజిక మార్పులతో గొప్ప అనుభూతిని పంచేలా ఈ చిత్రం ఉంటుంది’’ అని సెల్వమణి సెల్వరాజ్‌ పేర్కొన్నారు. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రోడ్యూసర్‌: సాయికృష్ణ గద్వాల్, లైన్‌ ప్రోడ్యూసర్‌: శ్రవణ్‌ పాలపర్తి, కెమెరా: డాని శాంచెజ్‌ లోపెజ్, సంగీతం: జాను.

దుల్కర్‌ చేతికి ‘క’ మలయాళ రిలీజ్‌ హక్కులు
కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించిన భారీ పీరియాడిక్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘క’. దర్శక ద్వయం సుజీత్, సందీప్‌ తెరకెక్కించిన ఈ మూవీలో నయన్‌ సారిక, తన్వీ రామ్‌ హీరోయిన్లుగా నటించారు. చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో త్వరలో విడుదలకానుంది. కాగా ‘క’ సినిమా మలయాళ థియేట్రికల్‌(వరల్డ్‌ వైడ్‌) రైట్స్‌ను హీరో దుల్కర్‌ సల్మాన్‌ ప్రోడక్షన్‌ కంపెనీ వేఫేరర్‌ ఫిలింస్‌ సొంతం చేసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement