Dulquer Salmaan
-
మద్రాస్ నేపథ్యంలో...
దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) హీరోగా నటించిన లేటెస్ట్ పీరియాడికల్ ఫిల్మ్ ‘కాంత(Kantha)’. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో సముద్రఖని ఓ లీడ్ రోల్ చేశారు. ‘ది హంట్ ఫర్ వీరప్పన్’ డాక్యుమెంటరీ ఫేమ్ సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. ఈ మల్టీ లాంగ్వేజ్ ఫిల్మ్‌ని రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మించారు.నటుడిగా దుల్కర్ పదమూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘కాంత’లోని ఆయన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘1950 నాటి మద్రాస్(చెన్నై) నేపథ్యంలో ‘కాంత’ ఉంటుంది. అప్పటి మానవీయ సంబంధాలు, సామాజిక పరిస్థితుల నేపథ్యంతో ఈ మూవీ కొత్తగా ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: జాను. -
లక్కీ భాస్కర్ వెరీ లక్కీ.. తెలుగులో మరో భారీ ప్రాజెక్ట్
లక్కీ భాస్కర్‌తో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న మలయాళ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan). తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు సిద్ధమయ్యారు. టాలీవుడ్లోనే మరో సినిమాను ప్రకటించారు. ఈ సారి టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాధినేనితో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో రానున్న చిత్రానికి 'ఆకాశంలో ఒకతార' అనే టైటిల్ ఖరారు చేశారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు.ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పిస్తుండగా లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లో తెరకెక్కించనున్నారు. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా.. మరో నిర్మాత అశ్వనీ దత్ కెమెరా స్విచ్చాన్ చేశారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన హీరోయిన్‌తో పాటు నటీనటుల వివరాలను మేకర్స్ ప్రకటించనున్నారు. మరికొద్ది రోజుల్లోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.Finally a Little Sandhadi…❤️The Legendary Trio comes together to take our Star forward…💫#AakasamloOkaTara Journey Begins…❤️🔥#AOTMovie @dulQuer @Lightboxoffl @GeethaArts @SwapnaCinema @pavansadineni @sunnygunnam @Ramya_Gunnam @SwapnaDuttCh @sujithsarang pic.twitter.com/3OuZlFeqG0— Geetha Arts (@GeethaArts) February 2, 2025 -
‘ఆకాశంలో ఒక తార’అంటూ రాబోతున్న దుల్కర్ సల్మాన్
మల్టీటాలెంటెడ్, దక్షిణాది స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ సినిమా సినిమాకీ అభిమాన గణాన్ని పెంచుకుంటూ పోతోన్నారు. దుల్కర్‌కు ప్రస్తుతం తెలుగులో తిరుగులేని క్రేజ్ ఏర్పడింది. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో తెలుగు ఆడియెన్స్‌ను మెప్పిస్తున్నారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ క్రేజీ డైరెక్టర్ పవన్ సాదినేనితో సినిమా చేస్తున్నారు.లైట్ బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘ఆకాశంలో ఒక తార’ అనే టైటిల్‌ను పెట్టారు. ఇక ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ కోసం ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వినీదత్, గుణ్ణం గంగరాజు కలిసి ముందుకు వచ్చారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా వంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు ఈ చిత్ర నిర్మాణంలో భాగమయ్యాయి. ‘ఆకాశంలో ఒక తార’ ఆదివారం నాడు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, అశ్విని దత్ వంటి వారు హాజరయ్యారు. ముహూర్తం షాట్‌కు అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, అశ్విని దత్ కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి గుణ్ణం గంగరాజు దర్శకత్వం వహించారు. నటీనటులు, ఇతర సిబ్బందికి సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. టాలెంటెడ్ సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫర్‌గా, శ్వేత సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేయనున్నారు. ‘ఆకాశంలో ఒక తార’ తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. -
ఆప్తుడి ఇంటి వేడుకలో మమ్మూటీ, దుల్కర్ల సందడి (ఫొటోలు)
-
లక్కీ భాస్కర్ తర్వాత 'దుల్కర్ సల్మాన్' చేతిలో రెండు సినిమాలు
లక్కీ భాస్కర్‌తో ప్రేక్షకులను మెప్పించిన దుల్కర్ సల్మాన్.. ఇప్పుడు మరో తెలుగు చిత్రం ప్రారంభించేందుకు రెడీగా ఉన్నారు. షూటింగ్ పనులు మొదలు కూడా త్వరలో మొదలు కానున్నట్లు తెలుస్తోంది. పవన్ సాధినేని దర్శకత్వంలో ‘ఆకాశంలో ఒక తార’ అనే సినిమా తెరకెక్కించనున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు.ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో స్వప్నా సినిమాస్, వైజయంతీ మూవీస్, లైట్‌బాక్స్ ఎంటర్టైన్మెంట్, గీతా ఆర్ట్స్ పతాకాలపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ సినిమాను నిర్మించనున్నారు. దుల్కర్ మునుపెన్నడూ నటించన విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతుంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీత దర్శకుడిగా ఈ ప్రాజెక్ట్‌కు పనిచేస్తుండగా.. సుజిత్ సారంగ్ కెమెరామెన్‌గా వ్యహరించనున్నట్లు తెలిసింది. దుల్కర్ సల్మాన్ తెలుగులో ఇప్పటికే 'కాంత' అనే మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇది చిత్రీకరణ దశలో కొనసాగుతుంది. ‘నీలా’ ఫేమ్ సెల్వమణి సెల్వరాజ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. రానా కీలక పాత్రలో కనిపించనున్నారు. భాగ్యశ్రీ బోర్సే ఈ చిత్రంలో నటిస్తుంది.ఇక ‘ఆకాశంలో ఒక తార’ సినిమాలో హీరోయిన్ పాత్రకు సాయి పల్లవిని తీసుకోవాలని చిత్రయూనిట్ భావిస్తోందని, ఈ కథ సాయి పల్లవికి వినిపించగా, ఆమె కూడా సినిమా చేయడానికి ఒప్పుకున్నారని టాక్. మరి... దుల్కర్–సాయి పల్లవి జోడీ కుదురుతుందా? అంటే వేచి చూడాల్సిందే. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమా పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని యూనిట్ పేర్కొంది. -
దుల్కర్ సల్మాన్ - అమల్ సూఫియాల బంధానికి 13ఏళ్లు (ఫోటోలు)
-
లక్కీ భాస్కర్.. హీరోయిన్ను మెచ్చుకోవాల్సిందే! : పరుచూరి గోపాలకృష్ణ
మహానటి, సీతారామం చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు హీరో దుల్కర్ సల్మాన్. ఈ ఏడాది లక్కీ భాస్కర్ మూవీతో మరోసారి అలరించాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. తాజాగా ఈ సినిమాను వీక్షించిన ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ.. లక్కీ భాస్కర్ ఎలా ఉందో తెలియజేస్తూ యూట్యూబ్‌లో ఓ వీడియో రిలీజ్ చేశాడు.ముందు జాగ్రత్తమధ్యతరగతి జీవితంలో జరిగిన అద్భుతమే ఈ సినిమా. కథ ముంబైలో జరుగుతుంది, పాత్రలు తెలుగులో మాట్లాడతాయి అని ముందే చెప్పేశారు. ముంబైలో తెలుగు మాట్లాడటమేంటని ఎవరూ విమర్శించకుండా జాగ్రత్తపడ్డారు. సినిమా ప్రారంభ సన్నివేశం బాగుంది. దర్శకుడు వెంకీ అట్లూరి స్క్రీన్‌ప్లేతో ఆటాడుకున్నారు. ఎన్నిరకాలుగా డబ్బును కాజేయొచ్చనేది సినిమాలో చూపించారు. దిగువమధ్యతరగతి స్థాయిలో ఉన్న భాస్కర్ వందకోట్లకు అధిపతి అయిపోతాడు. అసలు గేమ్ప్రపంచంలో కొందరు కోటీశ్వరులుగా ఎలా ఎదుగుతున్నారన్నది సినిమాలో చూపించారు. ప్రేమకథపై కాకుండా ఒరిజినల్ కథపైనే ఎక్కువ దృష్టి సారించడం బాగుంది. మొదట అతడి కష్టం, కన్నీళ్లు చూపించాక అసలైన గేమ్ మొదలుపెట్టారు. చివర్లో తను సంపాదించిన డబ్బంతా చెక్కులపై రాసిచ్చేసినప్పుడు ప్రేక్షకులకు బాధేస్తుంది. కట్ చేస్తే ఉద్యోగానికి రాజీనామా చేసి అమెరికాలో గ్రీన్ కార్డ్ సంపాదించి అక్కడ ప్రశాంతంగా ఉన్నాడు.ట్విస్టులు బాగున్నాయిప్రతి రూపాయిని బ్లాక్మనీలా కాకుండా వైట్ మనీ చేసుకున్న హీరో బ్రెయిన్‌ను చూస్తుంటే ముచ్చటేస్తుంది. సినిమాలో ట్విస్టులు బాగున్నాయి. వంద కోట్ల కలెక్షన్స్ సాధించిందంటే మూడు రెట్ల లాభాలు వచ్చాయి. చిన్న పాత్ర అని తెలిసినా ఒప్పుకుని నటించిన హీరోయిన్ మీనాక్షి చౌదరిని అభినందించాల్సిందే! అని పరుచూరి చెప్పుకొచ్చాడు.చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు -
ఓటీటీలో 'లక్కీ భాస్కర్'.. అధికారిక ప్రకటన
దీపావళి సందర్భంగా 'లక్కీ భాస్కర్' సినిమాతో దుల్కర్ సల్మాన్ మరోసారి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. మహానటి, సీతారామం సినిమాలతో తెలుగులోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్న ఆయన ఈసారి లక్కీ భాస్కర్‌తో అక్టోబర్ 31న థియేటర్స్‌లోకి వచ్చేశాడు. సుమారు రూ. 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి టాలీవుడ్లో తన సత్తా నిరూపించుకున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేందుకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. దీంతో అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా 'లక్కీ భాస్కర్' చిత్రాన్ని నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకున్న ఈ మూవీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ఆ సంస్థ ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. నవంబర్ 28 నుంచి లక్కీ భాస్కర్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో అందుబాటులో ఉండనుంది. కథేంటి?ఈ కథ అంతా ముంబైలో 1989-92 మధ్యలో జరుగుతుంది. భాస్కర్ కుమార్(దుల్కర్ సల్మాన్).. మగధ బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేస్తుంటాడు. ఇంటి నిండా అప్పులే. కనీసం ప్రమోషన్ వస్తే చాలు.. కష్టాలు తీరుతాయి అనుకుంటాడు. కష్టపడి పనిచేసినా అది వేరే వాళ్లకు దక్కుతుంది. దీంతో డబ్బు అవసరమై ఆంటోనీ(రాంకీ) అనే వ్యక్తితో కలిసి బ్యాంక్ డబ్బులతో చిన్న చిన్న స్కామ్స్ చేస్తాడు. అంతా బాగానే ఉంటది. డబ్బులు బాగానే సంపాదిస్తాడు. కొన్ని కారణాల వల్ల ఇదంతా ఆపేస్తాడు. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఏకంగా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ అవుతాడు. కోట్లకు కోట్లు సంపాదిస్తాడు. ఇంత డబ్బు ఎలా సంపాదించాడు? భాస్కర్ ని సీబీఐ వాళ్ళు ఎందుకు ఎంక్వయిరీ చేశారు? ఈ కథకి బిగ్ బుల్ హర్ష మెహ్రాకి సంబంధం ఏంటనేది మిగిలిన స్టోరీ. -
ఓటీటీలోకి రీసెంట్ తెలుగు బ్లాక్‌బస్టర్ సినిమా!
దుల్కర్ సల్మాన్.. పేరుకే మలయాళ హీరో కానీ తెలుగు హ్యాట్రిక్స్ హిట్స్ కొట్టాడు. 'మహానటి', 'సీతారామం' సినిమాలతో గుర్తింపు రాగా.. దీపావళికి రిలీజైన 'లక్కీ భాస్కర్'.. సక్సెస్‌తో పాటు రూ.100 కోట్ల కలెక్షన్స్ కూడా సాధించి పెట్టింది. ఈ మూవీ ఇప్పటికే థియేటర్లలో పలుచోట్ల ఆడుతోంది. ఇదలా ఉండగానే ఓటీటీ స్ట్రీమింగ్ కూడా ఫిక్సయినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: సుకుమార్ ఇంట్లో పనిమనిషికి ప్రభుత్వం ఉద్యోగం)దుల్కర్ సల్మాన్-మీనాక్షి చౌదరి నటించిన 'లక్కీ భాస్కర్'. 1990ల్లో జరిగిన బ్యాంక్ స్కామ్ కాన్సెప్ట్‌తో తీసిన సినిమా. 'సార్' చిత్రంతో ఆకట్టుకున్న వెంకీ అట్లూరి.. ఈసారి బ్యాంక్ కథతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. రిలీజ్‌కి ముందే ఈ మూవీ ఓటీటీ డీల్ క్లోజ్ అయింది. నెట్‌ఫ్లిక్స్ సంస్థ డిజిటల్ హక్కుల్ని దక్కించుకుంది.ఇకపోతే 'లక్కీ భాస్కర్' ఓటీటీ డీల్‌ని నెట్‌ఫ్లిక్స్ నాలుగు వారాల కోసమని మాట్లాడుకుందట. అలా అక్టోబరు 31న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం.. నవంబర్ 30న స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. దాదాపు ఇది కన్ఫర్మ్ అయినప్పటికీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీనితో పాటే థియేటర్లలో రిలీజైన 'క', 'అమరన్' కూడా త్వరలోనే ఓటీటీలోకి వచ్చే అవకాశముంది.(ఇదీ చదవండి: నా జీవితంలోని అద్భుతం నువ్వు.. 'బేబి' వైష్ణవి పోస్ట్ వైరల్) -
తెలుగులో సూపర్ హిట్ మూవీ.. ఆ భాషలోనూ గ్రాండ్ రిలీజ్!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 'క' మూవీతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. సుజిత్- సందీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా థియేటర్లలో సందడి చేసింది. లక్కీ భాస్కర్, అమరన్ చిత్రాలతో పోటీపడి బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో క టీమ్ సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది.తెలుగులో సూపర్‌హిట్‌గా నిలిచిన క మూవీని తాజాగా మలయాళంలోనూ విడుదల చేయనున్నారు. ఈ మేరకు హీరో కిరణ్ అబ్బవరం పోస్టర్‌ను షేర్ చేశారు. మాలీవుడ్‌లో హీరో దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. దుల్కర్‌కు చెందిన వేఫేరర్ ఫిల్మ్స్ క మూవీ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ నెల 22న మలయాళంలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. కాగా.. దుల్కర్ సల్మాన్ తెలుగులో లక్కీ భాస్కర్‌తో సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.Nov 22nd ❤️@DQsWayfarerFilm #KA pic.twitter.com/bifoaytvs9— Kiran Abbavaram (@Kiran_Abbavaram) November 13, 2024 -
అది నా అదృష్టం : వెంకీ అట్లూరి
‘నా మొదటి సినిమా 'తొలిప్రేమ' విజయం సాధించినప్పటికీ, ఒక ఐదు శాతం మంది ప్రేమకథే కదా అన్నట్టుగా కాస్త నెగటివ్ గా మాట్లాడారు. కానీ 'లక్కీ భాస్కర్'కి మాత్రం ఒక్క శాతం కూడా అలాంటి నెగటివ్ స్పందన రాలేదు. ప్రీమియర్ల నుంచే అన్ని చోట్లా పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రేక్షకులు, రివ్యూ రైటర్లు అందరూ సినిమా బాగుంది అన్నారు. ఒక సినిమాని ఇలా చూసిన వారందరూ బాగుందని చెప్పడం నిజంగా గొప్ప విషయం. అదృష్టంగా భావిస్తున్నాను’అన్నారు డైరెక్టర్ వెంకీ అట్లూరి. ఆయన దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలై మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ వెంకీ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ 'లక్కీ భాస్కర్' కథ విని అందరూ బాగుంది అన్నారు. కానీ, కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందా అనే సందేహం వ్యక్తం చేశారు. అలాంటి సమయంలో సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువ అవుతుందని భరోసా ఇచ్చారు.→ నేను సాధారణ ప్రేక్షకులతో కలిసి సినిమా చూసినప్పుడు.. ప్రతి సన్నివేశానికి, ప్రతి సంభాషణకి వారి నుంచి వచ్చిన స్పందన చూసి చాలా చాలా సంతోషం కలిగింది. కొన్ని సంభాషణలు అప్పటికప్పుడు చిత్రీకరణ సమయంలో రాయడం జరిగింది. వాటికి కూడా ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన లభించింది.→ సినిమా సెట్ లో హీరోనే మెయిన్ పిల్లర్. హీరో డల్ గా ఉంటే సెట్ మొత్తం డల్ గా ఉంటుంది. దుల్కర్ ఉదయం రావడమే ఫుల్ ఎనర్జీతో వచ్చేవారు. ఆయన ఈ కథని నమ్మడం వల్ల, సెట్ లో అంత సంతోషంగా ఉండటం వల్లే ఇంతమంచి అవుట్ పుట్ వచ్చింది. సన్నివేశాలు, సంభాషణలు చదివి బాగున్నాయని అభినందించే వారు. దాని వల్ల మరింత ఉత్సాహంగా ఇంకా మెరుగ్గా రాసేవాడిని.→ మొదట కథ రాసుకున్నప్పుడు ఇంత భారీ సినిమా అవుతుందని నేను అనుకోలేదు. నిజమైన లొకేషన్స్ లో షూటింగ్ చేసి, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేయొచ్చనే ఆలోచనలో ఉన్నాను. కానీ నిర్మాత వంశీ ఈ కథని ఎంతో నమ్మారు. కథకి తగ్గ భారీతనం తీసుకురావడం కోసం సెట్లు వేయాలని నిర్ణయించారు. కథని అంతలా నమ్మారు కాబట్టే వంశీ గారు ఎక్కడా రాజీ పడకుండా సినిమాని భారీస్థాయిలో నిర్మించారు.→ బ్యాంకింగ్ నేపథ్యం సాగే కథ ఇది. దీని కోసం ఎంతో రీసెర్చ్ చేశాను. కొన్ని సిరీస్ లు చూశాను. అయితే అవి టెక్నికల్ గా సాధారణ ప్రేక్షకులు అర్థం చేసుకునేలా లేవు. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకొని.. చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలా ప్రతి సన్నివేశాన్ని రాసుకోవడం జరిగింది.→ సినిమాలు ఎడిట్ టేబుల్ మీద తయారవుతాయని భావిస్తాను. ఎడిటర్ నవీన్ నూలితో తొలిప్రేమ సినిమా నుంచి ట్రావెల్ అవుతున్నాను. నవీన్ ని ఎంతో నమ్ముతాను. ఏదైనా తప్పు అనిపిస్తే నిర్మొహమాటంగా చెప్తాడు. ఎడిటర్ గా లక్కీ భాస్కర్ కి పూర్తి న్యాయం చేశాడు. ఈ సినిమా ఎడిటింగ్ గురించి అందరూ అందుకే అంత గొప్పగా మాట్లాడుకుంటున్నారు.→ ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్ ఏది ఒప్పుకోలేదు. ఏ జానర్ సినిమా చేయాలనే నిర్ణయానికి ఇంకా రాలేదు. ప్రస్తుతం కొన్ని కథా ఆలోచనలు ఉన్నాయి. ఖచ్చితంగా మరో మంచి చిత్రంతో అలరించడానికి ప్రయత్నిస్తాను. -
అది లక్కీ భాస్కర్‌తో నెరవేరింది
‘‘నేను ఎప్పటి నుంచో వాస్తవానికి దగ్గరగా ఉండే ఒక మధ్యతరగతి తండ్రి పాత్ర చేయాలనుకుంటున్నాను. అది ‘లక్కీ భాస్కర్’ సినిమాతో నెరవేరింది. డైరెక్టర్ వెంకీ బ్యాంకింగ్ నేపథ్యంలో మధ్యతరగతి కుటుంబ కథ చెప్పడం కొత్తగా అనిపించింది. సినిమాలో హర్షద్ మెహతా లాంటివాడు భారీ స్కాం చేస్తుంటే, చిన్న బ్యాంక్ ఉద్యోగి అయిన భాస్కర్ తన పరిధిలో స్కాం చేయడం కొత్తగా అనిపించింది.మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని హీరో దుల్కర్ సల్మాన్ అన్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మీనాక్షీ చౌదరి జంటగా నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా అక్టోబరు 31న విడుదలైంది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో దుల్కర్ సల్మాన్ విలేకరులతో పంచుకున్న విశేషాలు...⇒ నేను తెలుగులో నటించిన ‘మహానటి, సీతా రామం, లక్కీ భాస్కర్’ సినిమాలు హ్యాట్రిక్ విజయాలు సాధించడంతో కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని సంతోషంగా ఉంది. నటుడిగా అన్నిరకాల పాత్రలు చేయాలి. షారుఖ్ ఖాన్ లాంటివారు కూడా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేశారు. మనలోని నటుణ్ణి బయటకు తీసుకురావాలంటే ఇలాంటి విభిన్న పాత్రలు చేయాలి. ‘లక్కీ భాస్కర్’ చిత్రంలోని భాస్కర్ పాత్రలో నెగటివ్ షేడ్స్‌తో పాటు ఎన్నో భావోద్వేగాలున్నాయి. నటుడిగా ఇలాంటి పాత్రలు సంతృప్తిని ఇస్తాయి. ఈ సినిమా షూటింగ్‌ని ప్రతిరోజూ చాలా ఎంజాయ్ చేశాను. నాకు ఎంతో సంతృప్తి ఇచ్చిన చిత్రమిది.⇒ నేను నటుడు మమ్ముట్టిగారి కొడుకుని అయినప్పటికీ సాధారణ యువకుల్లాగానే ఆలోచిస్తాను. లాటరీ తగిలితే సొంతంగా నాకు నచ్చినవన్నీ కొనుక్కోవచ్చు అని చిన్నప్పుడు కలలు కనేవాడిని. ‘లక్కీ భాస్కర్’ చూసిన నాన్నగారు నాతో ఏం చెప్పలేదు. కానీ, వెంకీతో మాట్లాడి యూనిట్‌ని ప్రత్యేకంగా అభినందించారు. నాకు బాగా నచ్చిన కథల గురించి నాన్నకి చెబుతుంటాను. ‘లక్కీ భాస్కర్’ కథకి తగ్గట్టుగా, ప్రతి భావోద్వేగాన్ని ప్రేక్షకులు అనుభూతి చెందేలా జీవీ ప్రకాష్ సంగీతం అందించారు. సినిమాకి వస్తున్న స్పందన చూసి నిర్మాతలు నాగవంశీ, సాయి సౌజన్యగార్లు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం తెలుగులో ‘ఆకాశంలో ఒక తార’ సినిమా చేస్తున్నాను. -
దిల్ రాజు సినిమా చాన్స్ ఇస్తే.. చేయనని చెప్పేశా: దుల్కర్ సల్మాన్
‘మంచి మనసున్న మనుషులంతా కలిస్తే గొప్ప సినిమా తెరకెక్కించవచ్చని నేను నమ్ముతా. దానికి ‘లక్కీ భాస్కర్’ చిత్రమే ఓ మంచి ఉదాహరణ. ఈ సినిమాలో పని చేసినవారంతా గొప్ప వ్యక్తులు. వారి వారి పాత్రల్లో చక్కగా నటించారు. అందుకే ఇంత పెద్ద విజయం లభించింది.తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరిస్తున్నారు. వారితో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. ఇకపై కూడా మంచి కథలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తాను’అని అన్నారు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 31న విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించింది. చిత్ర బృందంతో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ప్రముఖ దర్శకులు నాగ్ అశ్విన్, హను రాఘవపూడి తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా దుల్కర్ మాట్లాడుతూ.. ‘సినిమా బ్లాక్ బస్టర్ అని నాకు ఫస్ట్ మెసేజ్ చేసింది జి.వి. ప్రకాష్. వెంకీ-జి.వి ఇద్దరూ డైనమిక్ కాంబో. నిర్మాతలకు జి.వి. ప్రకాష్ లాంటి టెక్నీషియన్స్ కావాలి. ఎందుకంటే పాటలు గానీ, నేపథ్య సంగీతం గానీ ఆలస్యం చేయరు. డీఓపీ నిమిష్, ప్రొడక్షన్ డిజైనర్ బంగ్లాన్, ఎడిటర్ నవీన్ అందరూ సినిమా అద్భుతంగా రావడానికి ఎంతో కృషి చేశారు. తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరిస్తున్నారు. వారితో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. ‘ఓకే బంగారం’ విడుదలయ్యాక నిర్మాత దిల్‌రాజు నాకొక అవకాశం ఇచ్చారు. తెలుగు సరిగ్గా రాకపోవడంతో ఆ సినిమా అంగీకరించలేకపోయా. నాగి, స్వప్న 'మహానటి' కోసం నన్ను సంప్రదించినప్పుడు నాకు తెలుగు రాదనే చెప్పాను. కానీ నన్ను తీసుకొచ్చి, ఈరోజు ఇలా నిలబెట్టారు. ఆ తర్వాత హను గారు 'సీతారామం'తో నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాన్ని అందించారు. ఇప్పుడు వెంకీ. చూడటానికి కుర్రాడిలా ఉంటాడు. కానీ ఎంతో ప్రతిభ ఉంది. అందుకే ఇంత గొప్ప సినిమాలు చేస్తున్నాడు. లక్కీ భాస్కర్ సినిమాకి, ఇందులోని పాత్రలకు ప్రాణం పోసిన వెంకీకి థాంక్స్. అలాగే ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని అన్నారు.హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ, "ఈ సినిమాలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను. టీం అందరం ఎంతో కష్టపడి పని చేశాము. ఆ కష్టానికి తగ్గ ఫలితంగా ప్రేక్షకుల నుంచి లభిస్తున్న స్పందన చూసి ఎంతో సంతోషంగా ఉంది. ఇందులో నేను పోషించిన సుమతి పాత్ర పట్ల ఎంతో ప్రేమను కురిపిస్తున్నారు. దుల్కర్ గారితో కలిసి నటించడం ఆనందంగా ఉంది’ అన్నారు. ‘పేరుతో పాటు, సినిమాకి డబ్బులు కూడా రావడం సంతోషంగా ఉంది’ అని దర్శకుడు వెంకీ అట్లూరి అన్నారు. -
దుల్కర్‌కు జోడీగా...
దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే సమాధానమే ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో ‘ఆకాశంలో ఒక తార’ అనే సినిమా తెరకెక్కనుంది. దుల్కర్ పుట్టినరోజు (జూలై 28) సందర్భంగా ఈ సినిమాను ఈ ఏడాది జూలైలో అధికారికంగా ప్రకటించారు. కానీ దుల్కర్ ఇతర ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు.ఈ ఏడాది చివర్లో సెట్స్‌పైకి తీసుకుని వెళ్లాలనుకుంటున్నారట. ఇక ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు సాయి పల్లవిని తీసుకోవాలని చిత్రయూనిట్ భావిస్తోందని, ఈ కథ సాయి పల్లవికి వినిపించగా, ఆమె కూడా సినిమా చేయడానికి ఒప్పుకున్నారని టాక్. మరి... దుల్కర్–సాయి పల్లవి జోడీ కుదురుతుందా? అంటే వేచి చూడాల్సిందే. స్వప్నా సినిమాస్, వైజయంతీ మూవీస్, లైట్‌బాక్స్ ఎంటర్టైన్మెంట్, గీతా ఆర్ట్స్ పతాకాలపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ సినిమాను నిర్మించనున్నారు. -
'లక్కీ భాస్కర్' సినిమా రివ్యూ
టైటిల్: లక్కీ భాస్కర్నటీనటులు: దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, సచిన్ ఖేడ్కర్, టిను ఆనంద్ తదితరులునిర్మాత: నాగవంశీడైరెక్టర్: వెంకీ అట్లూరిమ్యూజిక్: జీవీ ప్రకాష్ కుమార్విడుదల తేదీ: 2024 అక్టోబర్ 31మహానటి, సీతారామం సినిమాలతో తెలుగులోనూ చాలా క్రేజ్ తెచ్చుకున్న హీరో దుల్కర్ సల్మాన్. ఇతడి లేటెస్ట్ తెలుగు మూవీ 'లక్కీ భాస్కర్'. దీపావళి సందర్భంగా థియేటర్లో రిలీజ్ చేశారు. ఓ రోజు ముందే ప్రిమియర్స్ వేశారు. ఇంతకు సినిమా ఎలా ఉంది? దుల్కర్ మరో హిట్టు కొట్టాడా? తెలియాలంటే రివ్యూ చూసేయండి.కథేంటి?ఈ కథ అంతా ముంబైలో 1989-92 మధ్యలో జరుగుతుంది. భాస్కర్ కుమార్(దుల్కర్ సల్మాన్).. మగధ బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేస్తుంటాడు. ఇంటి నిండా అప్పులే. కనీసం ప్రమోషన్ వస్తే చాలు.. కష్టాలు తీరుతాయి అనుకుంటాడు. కష్టపడి పనిచేసినా అది వేరే వాళ్లకు దక్కుతుంది. దీంతో డబ్బు అవసరమై ఆంటోనీ(రాంకీ) అనే వ్యక్తితో కలిసి బ్యాంక్ డబ్బులతో చిన్న చిన్న స్కామ్స్ చేస్తాడు. అంతా బాగానే ఉంటది. డబ్బులు బాగానే సంపాదిస్తాడు. కొన్ని కారణాల వల్ల ఇదంతా ఆపేస్తాడు. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఏకంగా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ అవుతాడు. కోట్లకు కోట్లు సంపాదిస్తాడు. ఇంత డబ్బు ఎలా సంపాదించాడు? భాస్కర్ ని సీబీఐ వాళ్ళు ఎందుకు ఎంక్వయిరీ చేశారు? ఈ కథకి బిగ్ బుల్ హర్ష మెహ్రాకి సంబంధం ఏంటనేది మిగిలిన స్టోరీ.ఎలా ఉంది? 1992లో జరిగిన హర్షద్ మెహతా స్కామ్ గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆల్రెడీ దీని మీద వెబ్ సిరీస్ కూడా తీశారు. హర్షద్ మెహతా.. ప్రభుత్వాన్ని, స్టాక్ ఎక్సేంజ్ ని బురిడీ కొట్టించాడు. ఒకవేళ అతడ్ని ఓ బ్యాంక్ లో పనిచేసే కామన్ మాన్ బురిడీ కొడితే ఎలా ఉంటది అనే కాన్సెప్ట్ తో తీసిన సినిమానే లక్కీ భాస్కర్.ఈ స్టాక్ ఎక్సేంజ్, బ్యాంక్ ల్లో చాలా స్కామ్ లు జరుగుతుంటాయి. అప్పుడప్పుడు మనం న్యూస్ లో చూస్తుంటాం కానీ ఓ పట్టాన అర్థం కావు. ఒకవేళ ఎవరైనా అర్థం అయ్యేలా చెబితే.. కాదు కాదు చూపిస్తే ఎలా ఉంటుంది. వినడానికే భలే థ్రిల్లింగ్ గా అనిపించింది కదా. లక్కీ భాస్కర్ చూస్తున్న ప్రతి సెకండ్ అలానే అనిపిస్తుంది.సీబీఐ వాళ్ళు భాస్కర్ ని అదుపులోకి తీసుకుని, బ్యాంక్ కి తీసుకుని వెళ్లి, విచారణ ప్రారంభించడంతో సినిమా మొదలౌతుంది. కట్ చేస్తే కథ మూడేళ్ల వెనక్కి వెళ్తుంది. అసలు భాస్కర్ ఎవరు? అతడి ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు అనేది స్వయంగా భాస్కర్.. ప్రేక్షకుల వైపు చూసి చెప్తుంటాడు. ఈ జర్నీలో డబ్బు.. భాస్కర్ ని ఎలా మార్చింది. కొందరి వల్ల చివరకు భాస్కర్.. ఈ స్కామ్ లో నుంచి బయట పడ్డాడా లేదా అనేది మీరు థియేటర్ లోనే చూడాలి.ఇందులో పేరుకే భాస్కర్ హీరో క్యారెక్టర్ కానీ.. అతడి కూడా ఉండే ప్రతి పాత్ర కథలో భాగమే.. ఏదో ఓ సందర్భంలో ఓ పాత్ర వల్ల స్టోరీ మలుపు తిరుగుతుంది. ఆ ట్విస్ట్ లు గురించి ఇక్కడ చెప్తే మీరు థ్రిల్ మిస్ అవుతారు.అన్ని ప్లస్ లేనా మైనస్ పాయింట్స్ ఏం లేవా అంటే కొన్ని కొన్ని ఉన్నాయి. ఈ సినిమా కథలో బ్యాంక్, స్టాక్ మార్కెట్ లో షేర్స్, హవాలా లాంటివి వినిపిస్తుంటాయి. కాబట్టి వాటి మీద మినిమం అవగాహన ఉంటే పర్లేదు. లేదంటే మాత్రం సినిమా అర్థం కాదు. కొన్ని చోట్ల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎందుకో లౌడ్ గా అనిపించింది.ఈ సినిమా 1992 టైం లైన్ లోనే జరుగుతుంది. దీంతో హర్షద్ మెహతా ని పోలిన పాత్ర ఒకటి పెట్టారు. హర్ష మెహ్రా అనే పేరు పెట్టారు. కానీ ముఖాన్ని మాత్రం చూపించలేదు. ఐతే ప్రైవేటు బ్యాంక్ ల్లో ఎలాంటి స్కాములు జరుగుతాయి అనేది మాత్రం ఓ సగటు ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యేలా కన్విన్సింగ్ గా చెప్పడం బాగుంది.ఎవరెలా చేశారు?భాస్కర్ పాత్రలో దుల్కర్ జీవించేసాడు. ప్రతి సందర్భంలోనూ భాస్కర్ గెలవాలని మనం అనుకుంటాం. భాస్కర్ భార్య సుమతిగా చేసిన మీనాక్షి చూడ్డానికి బాగుంది. కాకపోతే భాస్కర్ రోల్ వల్ల ఈమెకు సరైన స్పేస్ దక్కలేదేమో అనిపిస్తుంది. కొడుకు, తండ్రి పాత్రలు ఎందుకు ఉన్నాయిలే అనుకుంటాం. వీటితో పాటు ఆంటోనీ రోల్ కథని మలుపు తిప్పుతాయి. వీళ్లతో పాటు బ్యాంక్ మేనేజర్, భాస్కర్ ఫ్రెండ్, బార్ డ్యాన్సర్.. ఇలా ఒకటేమిటి చివరకు బిచ్చగాడి పాత్రని కూడా వేరే లెవెల్ లో వాడేసారంతే.టెక్నికల్ విషయాలకు వస్తే డైరెక్టర్ ని ఎంత మెచ్చుకున్న తక్కువే. రెగ్యులర్ గా మనం న్యూస్ పేపర్స్ లో చదివే స్కామ్స్ తో ఓ కల్పిత కథ రాసి, దాన్ని రేసీ థ్రిల్లర్ మూవీలా తీయడం సూపర్. డైలాగ్స్ కూడా ఆలోచింపజేసేలా ఉన్నాయి. శ్రీమతి గారు పాట బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గుడ్. సినిమాటోగ్రఫీ సూపర్. సెట్స్ గురించి బాగా డబ్బులు ఖర్చుపెట్టారు. ప్రతి సీన్ లో అది కనిపిస్తుంది. ఫైనల్ గా చెప్పాలంటే.. సినిమాలో హీరో లక్కీ. ఈ మూవీ చూసిన ప్రేక్షకుడు అంతకంటే లక్కీ..Rating : 3.25/5- చందు డొంకాన -
నన్ను నేను సవాల్ చేసుకుంటాను
‘‘ఫలానా పాత్రలే చేయాలి. వయసుకు తగ్గ పాత్రలే చేయాలని నేనేం పరిమితులు పెట్టుకోలేదు. ఒకే తరహా పాత్రలు చేస్తే నటిగా నాకే కాదు... స్క్రీన్‌పై నన్ను చూసే ఆడియన్స్‌కు కూడా బోర్ కొడుతుంది. అందుకే నటిగా ఎప్పటికప్పుడు నన్ను నేను సవాల్ చేసుకుంటుంటాను. వైవిధ్యమైన పాత్రలు చేయడానికి ఇష్టపడతాను. ‘లక్కీ భాస్కర్’ సినిమాలో తొలిసారిగా నేను అమ్మ పాత్ర చేశాను. ఇక ‘మట్కా, మెకానిక్ రాకీ’ చిత్రాల్లోనూ డిఫరెంట్ రోల్స్ చేశాను’’ అన్నారు హీరోయిన్ మీనాక్షీ చౌదరి. దుల్కర్ సల్మాన్, మీనాక్షీ చౌదరి జంటగా నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా మీనాక్షీ చౌదరి చెప్పిన విశేషాలు. ⇒ ‘లక్కీ భాస్కర్’లో మధ్యతరగతి గృహిణి సుమతి పాత్ర చేశాను. ప్రేమను పంచే కుటుంబం, జీవించడానికి అవసరమైనంత డబ్బు ఉంటే చాలనుకునే స్వభావం భాస్కర్ (దుల్కర్ పాత్ర)ది. కానీ ఎక్కువ డబ్బు, దురాశల కారణంగా భాస్కర్–సుమతిల మధ్య ఏం జరిగింది? అనేది ఈ సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. ఒకప్పుడు మాది మధ్యతరగతి ఫ్యామిలీయే. నా చిన్నప్పుడు మా అమ్మ ఎలా ఉంటారో తెలుసుకుని, అందుకు తగ్గట్లుగా ఈ పాత్ర చేశాను. సుమతి పాత్రతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అవుతాననుకుంటున్నాను. ⇒ నేను నటించిన ‘మట్కా, మెకానిక్ రాకీ’ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం వెంకటేశ్‌గారితో ఒక సినిమా చేస్తున్నాను. -
ఘనంగా దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
దుల్కర్ తన రోడ్డు తాను వేసుకున్నాడు: దర్శకుడు త్రివిక్రమ్
‘‘మమ్ముట్టీగారు మర్రి చెట్టు. మర్రి చెట్టు నీడలో మొక్కలు బతకవు అని చెబుతుంటారు. కానీ దాన్నుంచి బయటకు వచ్చి, తన రోడ్డు తాను వేసుకున్నాడు దుల్కర్. ‘మహానటి, సీతారామం’ సినిమాలకు భిన్నమైన పాత్రను దుల్కర్ ఈ సినిమాలో చేశాడు. వన్నాఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ విజయ్ దేవరకొండ. తక్కువ వయసులోనే ఎంతో ప్రేమను... అంతే ద్వేషాన్ని చూశాడు విజయ్.. చాలా గట్టివాడు’’ అని అన్నారు దర్శకుడు త్రివిక్రమ్. దుల్కర్ సల్మాన్స్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’.ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్స్ గా నటించారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ‘లక్కీ భాస్కర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శకుడు త్రివిక్రమ్, హీరో విజయ్ దేవరకొండ అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘లక్కీభాస్కర్’ సినిమా చూశాను. ఈ సినిమాలోని ప్రతి పాత్ర కథను ఇంపాక్ట్ చేస్తుంది. ఓ మధ్య తరగతివాడు ఓ సాహసం చేస్తే నెగ్గాలని మనకు కచ్చితంగా అనిపిస్తుంటుంది. నేనూ అక్కడ్నుంచే వచ్చాను. ఆ అడ్వెంచర్‌ను వెంకీ సక్సెస్‌ఫుల్‌గా తీశాడు. ఈ సినిమా చూసిన తర్వాత తడిసిన కళ్లతో, నవ్వుతున్న పెదాలతో ఆడియన్స్ థియేటర్స్ నుంచి బయటకు వస్తారు’’ అన్నారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘పెళ్లిచూపులు’ సినిమా తర్వాత నాకు ఫస్ట్ చెక్ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చింది. త్రివిక్రమ్‌గారు పిలిపించి, మాట్లాడి చెక్ ఇప్పించారు. సితారలో ఇప్పుడు ‘వీడీ 12’ సినిమా చేస్తున్నాను. ‘లక్కీ భాస్కర్’ను వెంకీ బాగా తీశాడనిపించింది. ‘మహానటి, కల్కి 2898 ఏడీ’ సినిమాలో నేను, దుల్కర్ నటించాం. కానీ స్క్రీన్స్ షేర్ చేసుకోలేదు. ‘లక్కీ భాస్కర్ బ్లాక్‌బస్టర్ కావాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ– ‘‘నాకు నచ్చిన చిత్రాల్లో ‘అల.. వైకుంఠపురములో..’ ఒకటి. త్రివిక్రమ్‌గారి రైటింగ్‌లో మంచి డెప్త్ ఉంటుంది.విజయ్ నా లక్కీ చార్మ్. తెలుగులో నేను చేసిన తొలి సినిమా ‘మహానటి’ ఈవెంట్లో ఇతను దుల్కర్ అంటూ ఆడియన్స్ కు నన్ను పరిచయం చేశాడు. ఆ తర్వాత ‘సీతారామం’ ఈవెంట్లో ఉన్నాడు. ఇప్పుడు ‘లక్కీ భాస్కర్’ ఈవెంట్లో ఉన్నాడు. ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను. వెంకీ స్క్రిప్ట్‌లోని పాత్రలు మెచ్యూర్డ్‌గా ఉంటాయి. ఇలాంటి సినిమాను నిర్మించాలంటే చాలా ధైర్యం కావాలి. నాగవంశీ ధైర్యంతో ఈ సినిమా తీశాడు’’ అని పేర్కొన్నారు దుల్కర్ సల్మాన్స్ . ‘‘బ్యాంకింగ్ వరల్డ్‌పై సినిమా తీయాలని ‘లక్కీ భాస్కర్’ తీశాను. డబ్బు అంటే ఇష్టం, అవసరం అనుకునే ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది’’ అని తెలిపారు వెంకీ అట్లూరి. పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి, నిర్మాత చినబాబు తదితరులు పాల్గొన్నారు. -
అనారోగ్య కారణాల వల్లే సినిమాలకు బ్రేక్
-
లక్కీ భాస్కర్ నాకు చాలా ప్రత్యేకం: దుల్కర్ సల్మాన్
‘‘దాదాపు 14 నెలల తర్వాత నా నుంచి వస్తున్న సినిమా ‘లక్కీ భాస్కర్’. ఇది నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. ఇందులో వినోదం, భావోద్వేగాలు, సంగీతం బాగుంటాయి. కుటుంబ ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు ఉంటాయి. ట్రైలర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. అలాగే ఈ సినిమా కూడా అన్నివర్గాల వారికి నచ్చుతుందని నమ్ముతున్నాను’’ అని దుల్కర్ సల్మాన్ తెలిపారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’.దుల్కర్ సల్మాన్, మీనాక్షీ చౌదరి జోడీగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 31న తెలుగు, మలయాళ, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మీనాక్షీ చౌదరి మాట్లాడుతూ–‘‘ఇప్పటివరకు నేను చేసిన ΄పాత్రల్లో ఈ చిత్రంలో చేసిన సుమతి నాకు బాగా ఇష్టమైన ΄పాత్ర’’ అన్నారు. ‘‘బ్యాంకింగ్ నేపథ్యంలో కుటుంబ భావోద్వేగాలతో నడిచే ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది’’ అని సూర్యదేవర నాగవంశీ తెలిపారు. -
దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' ట్రైలర్
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం 'లక్కీ భాస్కర్'. ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను మెప్పించాయి. ఇందులో మీనాక్షీ చౌదరి హీరోయిన్,సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ అంచనాలతో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. అయితే, తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.'లక్కీ భాస్కర్' దీపావళి కానుకగా థియేటర్లోకి రానున్నాడు. తెలుగు, మలయాళ, తమిళ, హిందీ భాషల్లో అక్టోబరు 31న రిలీజ్ చేయనున్నామనీ మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఓ సాధారణ వ్యక్తికి చెందిన అసాధారణ ప్రయాణమే ఈ చిత్రమని వారు చెప్పుకొచ్చారు. 1980ల నాటి బొంబాయి నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. -
ఆ కారణం వల్లే బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది: దుల్కర్
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నుంచి సినిమా వచ్చి ఏడాదిపైనే అవుతోంది. గతేడాది ఆగస్టులో కింగ్ ఆఫ్ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తర్వాత కల్కి 2898 ఏడీ మూవీలో చిన్న పాత్రలో మెరిశాడు. తర్వాత ఎక్కడా కనిపించలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తను బ్రేక్ తీసుకోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు.అందుకే గ్యాప్ వచ్చిందినా గత సినిమా అంతగా ఆడలేదు. అందులో ఎవరి తప్పూ లేదు. అయితే నాకు చిన్న బ్రేక్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని అనారోగ్య సమస్యలు వెంటాడాయి. అందుకే గతేడాది ఒకే ఒక్క సినిమా చేయగలిగాను. నేను ఆరోగ్యంపై శ్రద్ధ చూపించలేదు. అది నా తప్పే అని చెప్పుకొచ్చాడు.సినిమాల విషయానికి వస్తే..దుల్కర్ ప్రధాన పాత్లలో నటించిన ఈ నెల 31న విడుదల కానుంది. అలాగే ఇతడు పీరియాడికల్ ఫిలిం కాంత సినిమా చేస్తున్నాడు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘మిస్టర్ బచ్చన్’ మూవీ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. . 1950 మద్రాస్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. అలాగే పవన్ సాధినేని డైరెక్షన్లో ఆకాశంలో ఒక తార సినిమా చేస్తున్నాడు. -
మద్రాస్ నేపథ్యంలో...
దుల్కర్ సల్మాన్ హీరోగా ‘కాంత’ సినిమా షురూ అయింది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘మిస్టర్ బచ్చన్’ మూవీ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. స్పిరిట్ మీడియా, వేఫేరర్ ఫిల్మ్స్ పతాకాలపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. ముహూర్తపు సన్నివేశానికి హీరో వెంకటేష్ క్లాప్ ఇచ్చారు. రానా దగ్గుబాటి మాట్లాడుతూ– ‘‘ సురేశ్ ప్రోడక్షన్స్ 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, మా స్పిరిట్ మీడియాతో కొత్త శకానికి నాంది పలికేందుకు సరైన చిత్రం ‘కాంత’. సోమవారం నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాం’’ అన్నారు.‘‘మానవ భావోద్వేగాల లోతులను ఆవిష్కరించే అందమైన కథ ‘కాంత’’ అని దుల్కర్ సల్మాన్ తెలిపారు. ‘‘1950 మద్రాస్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. మానవ బంధాలు, సామాజిక మార్పులతో గొప్ప అనుభూతిని పంచేలా ఈ చిత్రం ఉంటుంది’’ అని సెల్వమణి సెల్వరాజ్ పేర్కొన్నారు. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: సాయికృష్ణ గద్వాల్, లైన్ ప్రోడ్యూసర్: శ్రవణ్ పాలపర్తి, కెమెరా: డాని శాంచెజ్ లోపెజ్, సంగీతం: జాను.దుల్కర్ చేతికి ‘క’ మలయాళ రిలీజ్ హక్కులుకిరణ్ అబ్బవరం హీరోగా నటించిన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ చిత్రం ‘క’. దర్శక ద్వయం సుజీత్, సందీప్ తెరకెక్కించిన ఈ మూవీలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు. చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో త్వరలో విడుదలకానుంది. కాగా ‘క’ సినిమా మలయాళ థియేట్రికల్(వరల్డ్ వైడ్) రైట్స్‌ను హీరో దుల్కర్ సల్మాన్ ప్రోడక్షన్ కంపెనీ వేఫేరర్ ఫిలింస్ సొంతం చేసుకుంది. -
దీపావళికి లక్కీ భాస్కర్
అనుకున్న సమయాని కన్నా కాస్త లేట్‌గా థియేటర్స్‌లోకి రానున్నాడు లక్కీ భాస్కర్. దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 7న విడుదల చేయాలనుకున్నారు.కానీ నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి కావడానికి మరికొంత టైమ్ పడుతుందని, అందుకే వాయిదా వేసి, దీపావళికి తెలుగు, మలయాళ, తమిళ, హిందీ భాషల్లో అక్టోబరు 31న రిలీజ్ చేయనున్నామనీ మేకర్స్ ప్రకటించారు. ‘‘ఓ సాధారణ వ్యక్తికి చెందిన అసాధారణ ప్రయాణమే ఈ చిత్రం. ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతినివ్వడం కోసం డబ్బింగ్‌తో సహా అన్ని సాంకేతిక విభాగాల విషయంలో రాజీ పడకుండా పని చేస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. -
దుల్కర్ సల్మాన్ మూవీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
సీతారామం మూవీతో టాలీవుడ్లో క్రేజ్ దక్కించుకున్న మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం ఆయన హీరోగా లక్కీ భాస్కర్ చిత్రంలో నటిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దుల్కర్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. కాగా.. ఇప్పటికే వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 7న ఈ మూవీని రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.తాజాగా లక్కీ భాస్కర్ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అభిమానులకు మంచి క్వాలిటీతో సినిమాను అందించాలనే ఉద్దేశంతో పోస్ట్‌పోన్ చేస్తున్నామని వెల్లడించారు. ద్విభాషా చిత్రంగా రూపొందిస్తున్నప్పటికీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నామని తెలిపారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా పోస్టర్‌ను పంచుకున్నారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న లక్కీ భాస్కర్ సందడి చేయనున్నట్లు పోస్ట్ చేశారు. కాగా.. 1980-90 కాలంలో ఓ బ్యాంక్ క్యాషియర్ అసాధారణస్థాయికి ఎలా ఎదిగాడనే కథాంశంతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.అయితే అక్టోబర్ 31న మరో యంగ్ హీరో సినిమా రిలీజ్ కానుంది. మాస్కా దాస్ విశ్వక్సేన్ హీరోగా నటిస్తోన్న మెకానిక్ రాకీ అదే రోజు విడుదలవుతోంది. ఈ చిత్రంలోనూ హీరోయిన్ మీనాక్షి చౌదరి కావడం మరో విశేషం. దీంతో ఓకే రోజు రెండు సినిమాలతో అభిమానులను అలరించేందుకు గుంటూరు కారం భామ సిద్ధమైంది. Postponing releases can impact social media reputation, but it's essential for our film's quality! 😔#LuckyBaskhar is set to make your Diwali special in theaters worldwide. 🏦🎇Grand release on Oct 31st, 2024. #LuckyBaskharOnOct31st 💵@dulQuer #VenkyAtluri @Meenakshiioffl… pic.twitter.com/cJCbFdeFr2— Sithara Entertainments (@SitharaEnts) August 20, 2024 -
ఈ ఫొటోలోని ఇద్దరూ స్టార్ హీరోలే.. తండ్రి కొడుకులే కానీ!
వారసత్వంతో ఎంట్రీ ఇవ్వడానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. కానీ దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఏ రంగంలో అయినా ఇది అనుకున్నంత సులభమైతే కాదు. పైన కనిపిస్తున్న పిల్లాడు కూడా అలానే తండ్రి పేరుతో సినిమాల్లోకి వచ్చాడు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీలో సినిమాలు చేస్తూ అసలైన పాన్ ఇండియా స్టార్ అనిపించుకుంటున్నాడు. ఇంతలా చెప్పాం కదా మరి వీళ్లు ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: తల్లి పుట్టినరోజున తిరుమలలో జాన్వీ కపూర్)పైన ఫొటోలో కనిపిస్తున్న వాళ్లలో పిల్లాడి పేరు దుల్కర్ సల్మాన్. వ్యక్తి పేరు మమ్ముట్టి. 'సీతారామం', 'మహానటి' సినిమాలతో తెలుగులోనూ సెపరేట్ ఫ్యాన్ బేస్ సృష్టించిన హీరోనే పైన ఫొటోలో ఉన్న పిల్లాడు. తండ్రి మమ్ముట్టి మలయాళంలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడంతో సులభంగానే దుల్కర్ ఇండస్ట్రీలోకి వచ్చేశాడు. కానీ ఎంతో కష్టపడి ఇప్పుడున్న పొజిషన్‌కి చేరుకున్నాడు.వైవిధ్యమైన సినిమాలకు పెట్టింది పేరైన దుల్కర్ సల్మాన్.. సొంత భాష మలయాళంలో బోలెడన్ని మూవీస్ చేశాడు. తెలుగులోనూ మహానటి, సీతారామం చేశాడు. ప్రస్తుతం 'లక్కీ భాస్కర్' అనే మూవీ చేస్తున్నాడు. తమిళం, హిందీలోనే ఇదివరకే హీరోగా మూవీస్ చేసి మరీ హిట్స్ కొట్టాడు. పేరుకే తండ్రి కొడుకు గానీ మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్.. దేశవ్యాప్తంగా ఒకరిని మించి మరొకరు గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.(ఇదీ చదవండి: ఉన్న కార్లు అమ్మేసి కొత్త కారు కొన్న దళపతి విజయ్) -
హీరో దుల్కర్ భార్యని చూశారా? హీరోయిన్ల కంటే అందంగా! (ఫొటోలు)
-
ఆకాశంలో ఒక తార
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించనున్న సినిమాకు ‘ఆకాశంలో ఒక తార’ అనే టైటిల్ ఖరారైంది. పవన్ సాధినేని ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్ బాక్స్ మీడియా సమర్పణలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనేప్రారంభం కానుంది. కాగా ఆదివారం (జూలై 28) దుల్కర్ సల్మాన్ బర్త్ డే సందర్భంగా ‘ఆకాశంలో ఒక తార’ సినిమాను అధికారికంగా ప్రకటించి,పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని యూనిట్ పేర్కొంది. ఇదిలా ఉంటే.. దుల్కర్ సల్మాన్ నటించిన పీరియాడికల్ మూవీ ‘లక్కీభాస్కర్’. మీనాక్షీ చౌదరి హీరోయిన్ గా నటించారు.వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో సెప్టెంబర్ 7న విడుదల కానుంది. దుల్కర్ బర్త్ డే సందర్భంగా ‘లక్కీభాస్కర్’ టైటిల్ ట్రాక్‌ను ఆదివారం విడుదల చేశారు మేకర్స్.రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించిన ఈపాటను ఉషా ఉతుప్పాడారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్ స్వరకర్త. -
స్టార్ హీరో తనయుడు.. ఒక్క సినిమాతో తెగ నచ్చేశాడు! (ఫోటోలు)
-
భాస్కర్ డేట్ ఫిక్స్
భాస్కర్‌గా దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్లో కనిపించనున్న చిత్రం ‘లక్కీ భాస్కర్’. మీనాక్షి చౌదరి కథానాయిక. 1980–90ల కాలంలో అసాధారణ స్థాయికి చేరుకున్న ఒక సాధారణ బ్యాంక్ క్యాషియర్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. సెప్టెంబర్ 7న ‘లక్కీ భాస్కర్’ని రిలీజ్ చేయనున్నట్లు సోమవారం యూనిట్ పేర్కొంది.తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ‘‘ముంబైలోని బ్యాంకులో పని చేసే క్యాషియర్‌గా కనిపిస్తారు దుల్కర్. నాటి ముంబై నగరాన్ని, భారీ బ్యాంకు సెట్‌ని హైదరాబాద్‌లో రూపొందించాం. భాస్కర్ అసాధారణ ప్రయాణంలో ప్రేక్షకులు లీనమైపోతారు’’ అని యూనిట్ పేర్కొంది. -
వరసగా తెలుగు సినిమా కమిట్ అవుతున్న దుల్కర్..
-
వరసగా తెలుగు సినిమా కమిట్ అవుతున్న దుల్కర్..
-
కోపాలు చాలండి శ్రీమతి గారు.. సాంగ్ విన్నారా?
"మహానటి", "సీతారామం" సినిమాలతో తెలుగులో ఘన విజయాలను సొంతం చేసుకున్న దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం "లక్కీ భాస్కర్". వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే రిలీజై ఆకట్టుకుంది. బుధవారం ఈ చిత్రం నుంచి "శ్రీమతి గారు" అనే మొదటి గీతాన్ని విడుదల చేశారు.సాంగ్ అదిరిందిజి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ మెలోడీ ఎంతో వినసొంపుగా ఉంది. విశాల్ మిశ్రా, శ్వేతా మోహన్‌లు తమ మధుర స్వరాలతో చక్కగా ఆలపించి, పాటకు మరింత అందాన్ని తీసుకువచ్చారు. గీతరచయిత శ్రీమణి అందించిన సాహిత్యం ఈ గీతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. "కోపాలు చాలండి శ్రీమతి గారు.. కొంచెం కూల్ అవ్వండి మేడం గారు" అంటూ అందరూ పాడుకునేలా, తేలికైన పదాలతో అర్థవంతమైన సాహిత్యం అందించారు. పాన్ ఇండియా స్థాయిలో..మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి నిమిష్ రవి ఛాయాగ్రాహకుడిగా, నవీన్ నూలి ఎడిటర్‌గా పని చేస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. -
కమల్ హాసన్- మణిరత్నం కాంబో.. ఆ హీరోలు మళ్లీ..!
కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో దాదాపు 34 ఏళ్ల ముందు రూపొందిన చిత్రం నాయకన్. ఆ చిత్రం అప్పట్లో సాధించిన సంచలన విజయం సాధించింది. కాగా అదే కాంబినేషన్లో మళ్లీ ఇప్పుడు రూపొందుతున్న భారీ చిత్రం థగ్ లైఫ్. దీనిని మణిరత్నానికి చెందిన మెడ్రాస్ టాకీస్, కమలహాసన్‌కు చెందిన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా ని ర్మిస్తున్నాయి. ఇందులో కమలహాసన్ సరసన నటి త్రిష నటిస్తుండగా నటుడు జయం రవి, దుల్కర్ సల్మాన్, సిద్ధార్థ్ ముఖ్య పాత్రలో పోషిస్తున్నట్లు చిత్ర వర్గాలు ప్రకటించాయి. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చైన్నెలో ప్రారంభమై ఆ తరువాత విదేశాల్లో చిత్రీకరణకు సినీ వర్గాలు వెళ్లాయి. అయితే అలాంటి సమయంలో తమిళనాడులో పార్లమెంట్ ఎన్నికల నగారా మోగడంతో నటుడు కమలహాసన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చైన్నెకి తిరిగి వచ్చారు. దీంతో థగ్స్ లైఫ్ చిత్ర షూటింగ్ వాయిదా పడింది. ఈ చిత్ర షెడ్యూల్ వాయిదా పడడంతో నటుడు జయం రవి ఆ తరువాత దుల్కర్ సల్మాన్ ఇటీవల సిద్ధార్థ్ కూడా థగ్స్ లైఫ్ నుంచి వైదొలగినట్లు ప్రచారం జోరుగా సాగింది. అలాగఇందులో నటుడు శింబును ఒక ముఖ్యపాత్రకు ఎంపిక చేసినట్లు ప్రచారం జరిగింది. అలాంటిది ఇప్పుడు ముందుగా ఈ చిత్రం నుంచి వైదొలగినట్లు ప్రచారం జరిగిన జయంరవి, దుల్కర్ సల్మాన్‌లు మళ్లీ ఈ చిత్రంలో నటించడానికి తిరిగి వస్తున్నట్లు తాజా సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా పార్లమెంటు ఎన్నికల ముగిసిన వెంటనే కమలహాసన్ థగ్స్ లైఫ్ చిత్ర షూటింగ్లో పాల్గొంటారన్నది తాజా సమాచారం. -
గుండె బద్దలైంది.. బయటపడటానికి చాలా టైమ్ పట్టింది: మృణాల్
తెలుగులో ఒకటి రెండు సినిమాలతోనే స్టార్స్ అయిన హీరోయిన్లు తక్కువ మంది ఉంటారు. అందులో మృణాల్ ఠాకుర్ ఒకరు. సీతారామం, హాయ్ నాన్న చిత్రాలతో సూపర్ హిట్స్ కొట్టింది. కానీ 'ఫ్యామిలీ స్టార్'తో ఈమెకు ఫస్ట్ దెబ్బ పడింది. అయితే ఈమెని ఇప్పటికీ 'సీతారామం' బ్యూటీ అనే పిలుస్తారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మృణాల్.. ఆ చిత్ర అనుభవాలని పేర్కొంది. (ఇదీ చదవండి: సాయిపల్లవికి రికార్డ్ రెమ్యునరేషన్.. 'రామాయణ' కోసం అన్ని కోట్లా?) 'నా ఫ్రెండ్, మార్గదర్శి అంతా నటుడు దుల్కర్ సల్మానే. 'సీతారామం' షూటింగ్ టైంలో ఆయన సహకారం అస్సలు మరిచిపోను. చాలా కష్టమైన విషయం ఏమిటంటే ఓ చిత్రాన్ని పూర్తి చేసి వెళ్తున్నప్పుడు గుండె బద్దలైనట్లు అనిపిస్తుంది. పాత్రను ఇష్టపడి చేస్తే ఆ పాత్రలా పూర్తిగా మారిపోతా. అలా నటించిందే 'సీతారామం'లోని సీతామహాలక్ష్మి పాత్ర. ఈ పాత్ర నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టింది' తెలుగులో ఇప్పటివరకు చేసిన మూడు సినిమాల్లోనూ ఒకే తరహాలో డబ్బింటి అమ్మాయి తరహా పాత్రలు చేసిన మృణాల్.. హిందీలో మాత్రం గ్లామరస్ రోల్స్ చేసింది. తెలుగులోనూ ఈమెకు అలాంటి పాత్రలు ఎవరైనా ఆఫర్ చేస్తే, మృణాల్ చేయడానికి రెడీగా ఉంది. కానీ దర్శకనిర్మాతలు మాత్రం ఇంకా ఈమెని 'సీతారామం' బ్యూటీగానే చూస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో కొత్త ప్రాజెక్టులేం ఒప్పుకోలేదు. తమిళంలోకి త్వరలో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. (ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన 'యాత్ర 2'.. స్ట్రీమింగ్ అందులోనే) -
'లక్కీ భాస్కర్' బ్యాంక్ ఖాతాలో కోట్లలో డబ్బు.. ఆసక్తిగా టీజర్
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా లక్కీ భాస్కర్.. పుష్కర కాలం పాటు ఆయన ఎన్నో చిత్రాలతో మెప్పించారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వినూత్న చిత్రాలు, పాత్రలు చేస్తూ వస్తున్నారు దుల్కర్. ఇక పన్నెండేళ్లయిన సందర్భంగా దుల్కర్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైన సమయం నుంచి ఆసక్తిని పెంచుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నారు. దుల్కర్ సరసన మీనాక్షి చౌదరి నటిస్తుంది. 'మగధ బ్యాంక్‌లో క్యాషియర్‌గా పని చేసే పాత్రలో దుల్కర్ కనిపించారు. 1980ల నాటి బొంబాయి నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఒక సాధారణ మనిషి తాలూకు అసాధారణమైన ప్రయాణమే ఈ సినిమా. నమ్మశక్యం కాని విధంగా ఉన్నత శిఖరాలకు చేరిన ఒక సాధారణ మనిషి కథగా రూపొందనున్న సినిమా ‘లక్కీ భాస్కర్’. దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్లో నటించనున్న సినిమా ఇది. ‘లక్కీ భాస్కర్’ టీజర్‌ను గమనిస్తే డబ్బు చుట్టూ ఈ కథ నడుస్తుందని తెలుస్తోంది. నమ్మశక్యం కాని విధంగా ఉన్నత శిఖరాలకు చేరిన వ్యక్తి కథ అంటూ చిత్ర యూనిట్ పేర్కొంది. సో..‘లక్కీ భాస్కర్’ కథలోని ప్రధానాంశం డబ్బే అని తెలుస్తోంది. జులై నెలలో ఈ చిత్రం విడుదల కానుంది. -
మణిరత్నంకు నో చెప్పిన దుల్కర్ సల్మాన్
-
‘లక్కీ భాస్కర్’తో దుల్కర్ అసాధారణమైన ప్రయాణం
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కెరీర్ ఆరంభమై పుష్కర కాలం అయింది. ఇన్నేళ్లల్లో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వినూత్న చిత్రాలు, పాత్రలు చేస్తూ వస్తున్నారు దుల్కర్. ఇక పన్నెండేళ్లయిన సందర్భంగా దుల్కర్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు చిత్ర నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మీనాక్షి చౌదరి కథానాయిక. ‘‘ఈ చిత్రంలో మగధ బ్యాంక్‌లో క్యాషియర్‌గా పని చేసే దుల్కర్ లుక్‌ని విడుదల చేశాం. 1980ల నాటి బొంబాయి నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఒక సాధారణ మనిషి తాలూకు అసాధారణమైన ప్రయాణమే ఈ సినిమా. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది’’ అని యూనిట్ పేర్కొంది. తెలుగు, మలయాళ, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
స్టూడెంట్
‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’) వంటి విజయవంతమైన చిత్రం తర్వాత హీరో సూర్య, దర్శకురాలు సుధ కొంగర కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, నజ్రియా ఫాహద్, విజయ్ వర్మ కీలక పాత్రలు పోషించనున్నారు. పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా 1970 నేపథ్యంలో ఉంటుందని, సూర్య క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని, అందులో ఒకటి స్టూడెంట్ రోల్ అని కోలీవుడ్ సమాచారం. ఫిబ్రవరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుందట. 2డీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ చిత్రం 2025లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
రంగరాయ శక్తివేల్ నాయకర్.. థగ్‌లైఫ్
‘నాయగన్ ’(1987) చిత్రం తర్వాత హీరో కమల్‌హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో రూ΄÷ందుతున్న తాజా చిత్రానికి ‘థగ్ లైఫ్’ టైటిల్‌ని ఖరారు చేసి, టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోను సోమవారం రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే ఈ చిత్రంలో త్రిష, దుల్కర్ సల్మాన్, ‘జయం’ రవి కీలక ΄ాత్రలు ΄ోషించనున్నట్లు కూడా వెల్లడించారు. ‘రంగరాయ శక్తివేల్ నాయకర్.. నాది కాయల్ పట్టినమ్’, ‘రంగరాయ శక్తివేల్ నాయకర్ అంటే క్రిమినల్, గూండా, యాకుజా. యాకుజా అంటే జపనీస్‌లో గ్యాంగ్‌స్టర్ అని అర్థం’, ‘చావు నా కోసం ఎదురుచూడటం ఇదేం తొలిసారి కాదు. చివరిసారి కూడా కాదు’, ‘నా పేరు రంగరాయ శక్తివేల్ నాయకర్.. మర్చి΄ోవద్దు’ అని కమల్‌హాసన్ చెప్పే డైలాగ్స్ ‘థగ్స్ లైఫ్’ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోలో ఉన్నాయి. కమల్‌హాసన్, మణిరత్నం, ఆర్ మహేంద్రన్, శివ అనంత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నేడు కమల్ బర్త్ డే సందర్భంగా ‘థగ్ లైఫ్’కి సంబంధించిన విశేషాలను సోమవారం వెల్లడించారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్, కెమెరా: రవి కె.చంద్రన్. -
హిట్ కాంబినేషన్ రిపీట్
‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో సూర్య, దర్శకురాలు సుధా కొంగర కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త సినిమా ప్రకటన గురువారం వెల్లడైంది. సూర్య కెరీర్లో 43వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, నటి నజ్రియా ఫాహద్, నటుడు విజయ్ వర్మ కీలక పాత్రల్లో నటించనున్నారు. 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జ్యోతిక, సూర్య, రాజశేఖర్, కర్పూర సుందరపాండియన్ ఈ సినిమాను నిర్మించనున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ స్వరకర్త. అతనికి సంగీత దర్శకుడిగా ఇది నూరవ చిత్రం కావడం విశేషం. ఇదిలా ఉంటే.. 68వ జాతీయ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడు, ఉత్తమ నేపథ్య సంగీతం, ఉత్తమ నటి, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ చిత్రం విభాగాల్లో ‘సూరరై పోట్రు’ సినిమా అవార్డులు సాధించింది. తాజా చిత్రంతో సూర్య–సుధల హిట్ కాంబో రిపీట్ అవుతోంది. -
ఓటీటీలో దుల్కర్ యాక్షన్ మూవీ, స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ప్రేమకథలకు చిరునామాగా మారిన దుల్కర్ సల్మాన్ తొలిసారి యాక్షన్ అవతారమెత్తిన చిత్రం కింగ్ ఆఫ్ కొత్త. కొత్త అంటే మలయాళంలో టౌన్ అని అర్థం. అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించాయి. అన్ని భాషల్లోనూ దుల్కర్ తనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు. ఆగస్టు 24న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సెప్టెంబర్ 22న ఓటీటీలోకి వస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. సడన్‌గా ఓటీటీలో వస్తుందేమో అంటే అదీ జరగలేదు. దీంతో ఈ నెల 28 లేదా 29న ఏదో ఒకరోజు ఓటీటీలోకి రానుందని ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి తెర దించుతూ అధికారిక ప్రకటన వెలువడింది. హాట్‌స్టార్‌లో సెప్టెంబర్ 29 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు హాట్‌స్టార్ ప్రకటించింది. తెలుగు, మలయాళం, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేస్తున్నారా? లేదా? అన్నది మాత్రం స్పష్టత లేదు. సినిమా కథేంటంటే.. కింగ్ ఆఫ్ కొత్త కథ 80,90వ దశకంలో సాగుతుంది. కోతా అనే టౌన్‌కి చెందిన రాజు(దుల్కర్ సల్మాన్) తండ్రి రవిలాగే తాను కూడా ఓ పెద్ద రౌడీ కావాలని చిన్నప్పటి నుంచి కలలు కంటాడు. దాన్ని సాకారం చేసుకుంటాడు. అతనికి చెల్లి రీతూ(అనికా సురేంద్రన్)అంటే చాలా ఇష్టం. కొడుకు రౌడీ కావడంతో తల్లి అతనితో మాట్లాడేది కాదు. దీంతో కోతా టౌన్లోనే స్నేహితుడు కన్నా(షబీర్ కళ్లరక్కల్)తో కలిసి వేరుగా ఉండేవాడు. రాజుకి అదే ప్రాంతానికి చెందిన తార(ఐశ్వర్య లక్షీ) అంటే చాలా ఇష్టం. ఆమె కోసమే కోతాలో డ్రగ్స్ అనేది లేకుండా చేస్తాడు. ఓ కారణంగా రాజుకు తాగుడు బానిసైతాడు. నెమ్మదిగా కోతా ప్రాంతాన్ని తన చేతుల్లోకి తెచ్చుకున్న కన్నా.. కన్నాభాయ్‌గా మారి ఆ ప్రాంతంలో డ్రగ్స్‌ని విచ్చలవిడిగా అమ్మేస్తుంటాడు. అయితే ఎంతో మంది గ్యాంగ్‌స్టర్స్‌ని మట్టుపెట్టిన సీఐ శావుల్(ప్రసన్న) కోతాకి ట్రాన్స్ఫర్ అవుతాడు. కన్నాభాయ్‌కి చెక్ పెట్టేందుకుగానూ రాజుని మళ్లీ కోతా వచ్చేలా చేస్తాడు. అసలు రాజు ఎందుకు కోతాని వదిలి వెళ్లాడు? ప్రాణ స్నేహితులుగా ఉన్న కన్నా, రాజులు ఎందుకు శత్రువులుగా మారారు? చివరకు కోతా ఎవరి ఆధీనంలోకి వెళ్లింది? అనేది తెలియాలంటే ‘కింగ్ ఆఫ్ కోతా’ను ఓటీటీలో చూడాల్సిందే. చదవండి: శరత్ బాబు రెండో భార్యగా నా ఫోటోలు.. చాలా బాధేసింది!! -
లక్కీ భాస్కర్ షురూ
‘మహానటి, సీతారామం’ వంటి హిట్ చిత్రాల తర్వాత దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న స్ట్రయిట్ తెలుగు చిత్రం ‘లక్కీ భాస్కర్’ షూరూ అయింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘‘ఒక సాధారణ మనిషి ఉన్నత శిఖరాలకు చేరిన అసాధారణమైన ప్రయాణంగా ‘లక్కీ భాస్కర్’ రూపొందుతోంది. ‘సార్’(తమిళంతో ‘వాతి’) చిత్రం తర్వాత వెంకీ అట్లూరితో మేము నిర్మిస్తున్న రెండో పాన్ ఇండియా చిత్రం ‘లక్కీ భాస్కర్’. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నిమిష్ రవి, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్. -
దుల్కర్‌కు జోడీగా..?
తెలుగు పరిశ్రమలో కథానాయికగా మీనాక్షీ చౌదరికి అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’, వరుణ్‌తేజ్ ‘మట్కా’, విశ్వక్ సేన్ సినిమాల్లో హీరోయిన్గా చేస్తున్నారీ బ్యూటీ. తాజాగా దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందనున్న ‘లక్కీభాస్కర్’ చిత్రంలోని హీరోయిన్ చాన్స్ కూడా మీనాక్షీకే లభించిందని టాలీవుడ్ లేటెస్ట్ సమాచారం. పాన్ ఇండియా ఫిల్మ్‌గా ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. నవంబరులో షూటింగ్ ప్రారంభం కానుందట. -
కింగ్ ఆఫ్ కొత్త.. దుల్కర్ సినిమాకు పేలవమైన కలెక్షన్స్
దుల్కర్ సల్మాన్.. ఎప్పుడూ కొత్త కాన్సెప్ట్‌లను ఎంచుకుంటూ కొత్తదనాన్ని ఎంకరేజ్ చేస్తుంటాడీ హీరో. సీతారామం సినిమాతో తెలుగువారికీ దగ్గరైన ఈ హీరో తొలిసారి పూర్తి మాస్ యాక్షన్ సినిమా చేశాడు. దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన చిత్రం ‘కింగ్ ఆఫ్ కొత్త’. అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించాయి. తెలుగు, మలయాళం, తమిళ్, హిందీలో ఈ నెల 24న ఈ సినిమా రిలీజైంది. అన్నట్లు అన్ని భాషల్లోనూ దుల్కర్ తనే స్వయంగా డబ్బింగ్ చెప్పాడు. గురువారం విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ఈ గ్యాంగ్‌స్టర్ సినిమా అంతగా వర్కవుట్ కానట్లు కనిపించింది. ఫలితంగా ఈ చిత్రం రూ.7.70 కోట్ల మేర కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.60 కోట్ల మేర బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ డే పది కోట్లు కూడా రాబట్టలేకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. రానున్న రోజుల్లోనూ కలెక్షన్స్ ఇలాగే ఉంటే డిజాస్టర్ దిశగా ప్రయాణించడం ఖాయం అని చెప్తున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కుల విషయానికి వస్తే.. ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఈ మూవీ డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాకు పెద్దగా పాజిటివ్ బజ్ లేదు, కలెక్షన్స్ కూడా డల్ ఉన్నందున వచ్చే నెలలో ఓటీటీలో ప్రత్యక్షం కానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే మొదట్లో ఈ సినిమా పేరును కింగ్ ఆఫ్ కోతగానే ఉంచారు. దుల్కర్ సైతం అలాగే పలికాడు. కానీ మలయాళంలో కొత్త అంటే టౌన్ అని అర్థం వస్తుండటంతో దాన్ని మార్చేసి కింగ్ ఆఫ్ కొత్తగా రిలీజ్ చేశారు. చదవండి: థియేటర్లో రిలీజైన వారం రోజులకే ఓటీటీలోకి.. మరో మూడు సినిమాలు స్ట్రీమింగ్.. ఎక్కడంటే? -
ఈ సినిమాలో ప్రతి పాత్ర.. కథని మలుపు తిప్పేదే
‘‘నేను ఇప్పటి వరకూ గ్యాంగ్‌స్టర్ సినిమాలు చేయలేదు. తొలిసారి ‘కింగ్ ఆఫ్ కొత్త’ చేశాను. ఈ కథ రెండు పీరియడ్స్‌లో ఉంటుంది. పాటలు, యాక్షన్ సీక్వెన్స్, ఫుట్ బాల్.. ఇలా అన్ని వాణిజ్య అంశాలున్నాయి. ఇందులో ప్రతి పాత్ర కథని మలుపు తిప్పుతుంది. అది నాకు చాలా నచ్చింది’’ అని హీరో దుల్కర్ సల్మాన్ అన్నారు. అభిలాష్ జోషి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన చిత్రం ‘కింగ్ ఆఫ్ కొత్త’. జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమా తెలుగు, మలయాళం, తమిళ్, హిందీలో ఈ నెల 24న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ పంచుకున్న విశేషాలు.... ► అభిలాష్, నేను చిన్ననాటి స్నేహితులం. ఎప్పటి నుంచో సినిమా చేయాలనుకుంటే ‘కింగ్ ఆఫ్ కొత్త’కి కుదిరింది. మంచి గ్యాంగ్ స్టర్ డ్రామా ఇది. స్నేహం కూడా ఉంటుంది. నేను ఏడాదికి మూడు సినిమాలు చేస్తాను. కానీ, ప్రేక్షకులకు మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ఇవ్వాలని ఈ మూవీ కోసం ఏడాది శ్రమించా. సాంకేతికంగా ఈ మూవీ పెద్ద స్థాయిలో ఉంటుంది. ► కొత్త అంటే మలయాళంలో టౌన్ అని అర్థం. అదొక ఫిక్షనల్ టౌన్. అయితే తెలుగులో కొత్త అనే పదానికి కొత్తది అనే అర్థం వస్తుంది. అందుకే డబ్బింగ్లో కోత అని చెప్పాం. ప్రేక్షకులకు నేను ఎక్కువగా లవర్ బాయ్‌గా గుర్తుంటాను(నవ్వుతూ). ఒకేరకమైన కథలు, పాత్రలు చేయాలని ఉండదు. ప్రేక్షకులతో పాటు నటుడిగా నాకు నేను సర్ప్రైజ్ అయ్యే పాత్రలు చేయాలని ఉంటుంది. ఈ మూవీ కోసం తెలుగు, మలయాళం, తమిళ్, హిందీ భాషల్లో నేనే డబ్బింగ్ చెప్పాను. ఓ రకంగా ఇప్పుడు నేను డబ్బింగ్ ఆర్టిస్ట్‌ని కూడా (నవ్వుతూ). ► ఐశ్వర్య లక్ష్మి చాలా ప్రతిభ ఉన్న నటి. ఈ మూవీలో తన పాత్ర కీలకంగా ఉంటుంది. నిమేష్ రవి విజువల్స్, జాక్స్ బిజోయ్ సంగీతం సినిమాకు ప్లస్. సినిమాని కాపాడాలి, మంచి సమయంలో రిలీజ్ చేయాలంటే మనమే నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్లో ఉండాలని వేఫేరర్ ఫిల్మ్స్ స్టార్ట్ చేశాను. ప్రస్తుతం నేను, రానా కలిసి ‘కాంత’ చేస్తున్నాం. తెలుగు, ఇతర పరిశ్రమల నుంచి నేర్చుకున్న ఎన్నో విషయాలను మలయాళంలో అనుసరిస్తున్నాను. ప్రస్తుతం తెలుగులో వెంకీ అట్లూరిగారి దర్శకత్వంలో ‘లక్కీ భాస్కర్’ సినిమా చేస్తున్నాను. మరికొన్ని కథలు వింటున్నాను. ప్రభాస్‌గారి ‘కల్కి 2898 ఏడీ’లో నేను నటిస్తున్నానా? లేదా? అన్నది మేకర్సే చెప్పాలి. -
ఆమె ఎందుకలా చేసిందో తెలియదు: దుల్కర్ సల్మాన్ షాకింగ్ కామెంట్స్
సీతారామం సినిమాతో టాలీవుడ్లో క్రేజ్ దక్కించుకున్న హీరో దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు మలయాళ సినిమాలతో బిజీగా ఉన్నారు. 'కింగ్ ఆఫ్ కోతా' అంటూ అభిమానులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. అంతే కాకుండా దుల్కర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్ గన్స్ అండ్ గులాబ్స్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం కింగ్ ఆఫ్ కోత మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న దుల్కర్ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా మహిళ అభిమానులు తన పట్ల వ్యవహరించిన తీరుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక మహిళా అభిమాని తనను అనుచితంగా తాకిందని వెల్లడించారు. (ఇది చదవండి: అలా చేయమని ఒత్తిడి.. డైరెక్టర్ చెంప చెళ్లుమనిపించా: నటి) దుల్కర్ మాట్లాడుతూ..'సాధారణంగా అభిమానులు సెలబ్రిటీలకు హాని కలిగించాలని అనుకోరు. కానీ కొన్నిసార్లు ఉత్సాహంతో కొన్నిసార్లు అలా ప్రవర్తిస్తారు. కానీ ఓ సంఘటన నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఓ మహిళ తన కాళ్లపై చేతులతో రుద్దింది. ఆమె అలా ఎందుకు చేసిందో తెలియదు. ఆ సమయంలో నాకు చాలా నొప్పిగా అనిపించింది. ఆమె వయసులో నాకన్న చాలా పెద్దది. ఆమె అలా ఎందుకు చేసిందో అర్థం కాలేదు. అక్కడే వేదికపై చాలా మంది ఉన్నారు.' అని తన అనుభవాన్ని పంచుకున్నారు. కొందరు తమ చేతులను ఎక్కడ ఉంచుకోవాలో తెలియనప్పుడు ఇలా జరుగుతుందని దుల్కర్ సల్మాన్ అన్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో చాలా అసౌకర్యంగా అనిపిస్తుందని తెలిపారు. ఆ సమయంలో ఏం జరుగుతుందోనని ఆశ్చర్యపోయా.. దాని నుంచి ఎలా బయటపడాలో నాకు తెలియలేదంటూ దుల్కర్ పంచుకున్నారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ నటించిన 'గన్స్ అండ్ గులాబ్స్' ఆగస్టు 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో రాజ్‌కుమార్ రావు, పూజా గోర్, గుల్షన్ దేవయ్య, ఆదర్శ్ గౌరవ్ కూడా కీలక పాత్రల్లో నటించారు. దుల్కర్ నటించిన కింగ్ ఆఫ్ కోత ఆగస్టు 24న థియేటర్లలోకి రానుంది. (ఇది చదవండి: భార్యతో విడాకులు తీసుకున్న బిగ్ బాస్ ఫేమ్!) -
నా స్క్రీన్ టైమ్ తక్కువే కానీ..
‘‘దర్శకుడు అభిలాష్ జోషి ‘కింగ్ ఆఫ్ కోత’ సినిమా స్కేల్ గురించి చెప్పినప్పుడు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ప్రొడక్షన్ పరంగా చాలా పెద్ద సినిమా. ప్రతి షాట్ చాలా నిండుగా అచ్చమైన తెలుగు సినిమాలా ఉంటుంది. మలయాళంలో ఇంత పెద్ద స్కేల్ సినిమాలో భాగం కావడం నాకు ఇదే తొలిసారి’’ అని హీరోయిన్ ఐశ్వర్యా లక్ష్మి అన్నారు. దుల్కర్ సల్మాన్, ఐశ్వర్యా లక్ష్మి జంటగా అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన చిత్రం ‘కింగ్ ఆఫ్ కోత’. జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఐశ్వర్యా లక్ష్మి మాట్లాడుతూ– ‘‘కింగ్ ఆఫ్ కోత’లో తార పాత్ర చేశాను. దుల్కర్ పేరు రాజు. తార, రాజు మధ్య అందమైన లవ్ స్టోరీ ఉంటుంది. నా పాత్రకి స్క్రీన్ టైమ్ తక్కువగానే ఉన్నప్పటికీ కథలో చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ చిత్రంలో భావోద్వేగ సన్నివేశాలు చేసినప్పుడు సవాల్‌గా అనిపించింది. నాకంటూ డ్రీమ్ రోల్స్ ప్రత్యేకంగా లేవు. కానీ, నేను చేసిన పాత్రలు గుర్తుండిపోవాలని కోరుకుంటాను. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్నాను’’ అన్నారు. -
దుల్కర్‌తో వన్స్‌మోర్ అంటున్న హీరోయిన్!
మాలీవుడ్ సూపర్‌స్టార్ మమ్ముట్టి వారసుడిగా సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు దుల్కర్ సల్మాన్. తక్కువకాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వైవిధ్యభరిత చిత్రాలు చేస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా రాణిస్తున్నాడు. మాతృభాష మలయాళంలో నటిస్తూనే తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ సత్తా చాటుతున్నాడు. తమిళంలో మణిరత్నం దర్శకత్వంలో ఓ కాదల్ కణ్మణి, హే అనామికా వంటి కొత్త తరహా కథా చిత్రాల్లో నటించి అలరించాడు. తెలుగులో మహానటి, సీతారామం వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ మరో చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నాడు. తమిళం, మలయాళ భాషల్లో రూపొందనున్న ఈ చిత్ర తమిళ వెర్షన్‌కు కోలి అనే టైటిల్‌ను నిర్ణయించారు. అట్లీ శిష్యుడు కార్తీకేయన్ వేలప్పన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో దుల్కర్‌సల్మాన్‌కు జంటగా హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ నటించనున్నట్లు తెలిసింది. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రాన్ని జీ.స్టూడియోస్ సంస్థ నిర్మించనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా మానాడు చిత్రంలో శింబు సరసన నటించిన కల్యాణి ప్రియదర్శన్ తాజాగా కోలీ చిత్రం ద్వారా కోలీవుడ్‌లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. దుల్కర్, కల్యాణి ఇద్దరూ గతంలో వరనే అవశ్యముంద్(తెలుగులో పరిణయం) సినిమాలో నటించారు. చదవండి: ఈ ప్రేమకథలకు ట్రెండ్‌తో సంబంధం లేదు -
అతి చేసిన బాలీవుడ్ హీరోయిన్.. కోపంతో నేలకేసి కొట్టా..: రానా
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సినిమా 'కింగ్ ఆఫ్ కోత'. అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీ స్టూడియోస్, వెఫేరర్ ఫిలింస్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ మూవీ ఆగస్టు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భళ్లాల దేవ రానా దగ్గుబాటి దుల్కర్ సహనంపై పొగడ్తలు కురిపిస్తూ ఓ హీరోయిన్‌పై విమర్శలు గుప్పించారు. షాపింగ్ గురించి కబుర్లు రానా మాట్లాడుతూ.. 'దుల్కర్ చాలా పద్ధతైన మనిషి. ఆయన గతంలో ఒక హిందీ సినిమా చేశాడు. దాని నిర్మాతలు నా ఫ్రెండ్సే! ఒకరోజు మా ఇంటి దగ్గరే షూటింగ్ జరుగుతుంటే వెళ్లాను. బాలీవుడ్లో పెద్ద హీరోయిన్ ఆ సినిమాలో నటించింది. నేను సెట్‌కు వెళ్లేసరికి మూడో టేక్ తీసుకుంటున్నారు. దుల్కర్ ఎండలో నిలబడ్డాడు. ఆమె ఫోన్ మాట్లాడుతోంది. ఏమైనా అర్జంట్ విషయమా? అంటే ఆమె భర్త లండన్‌లో షాపింగ్ చేస్తున్నాడట! ఆ షాపింగ్ గురించి మాట్లాడుతోంది. తర్వాత ఫోన్ కట్ చేసి వచ్చాక నన్ను చూసి హాయ్ అంటూ పలకరించింది. డైలాగులు మర్చిపోతోంది కెమెరా ముందుకు వెళ్లాక డైలాగులు మర్చిపోతోంది.. అంతలోనే మళ్లీ ఫోన్ మాట్లాడుతోంది. ఇదంతా చూసి కోపమొచ్చి నా చేతిలోని బాటిల్ నేలకేసి కొట్టాను. దుల్కర్ మాత్రం ఓపికగా అలాగే నిల్చుంటూ ఎన్ని టేకులైతే అన్ని టేకులు చేస్తూనే పోయాడు. ప్యాకప్ అయిపోయాక ఆమె తన స్టాఫ్‌తో మూడు, నాలుగు కార్లలో వెళ్తే మనవాడు మాత్రం తన అసిస్టెంట్‌తో చిన్న ఇన్నోవా కారులో వెళ్లిపోయాడు. అప్పుడు నేను సెట్స్‌లో హీరోయిన్ ప్రవర్తన గురించి లైట్ తీసుకుంటున్న నిర్మాతలను అరగంటసేపు తిట్టిన తర్వాత బయటకు వెళ్లిపోయాను. అలాంటి దుల్కర్ ఈరోజు వైల్డ్ సినిమా చేస్తుంటే నాకన్నా ఎగ్జయిట్‌గా ఎవరూ ఉండరు' అని రానా చెప్పుకొచ్చాడు. ఆ హీరోయిన్ తనేనా? ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే చాలామంది ఆ హీరోయిన్ సోనమ్ కపూర్ అని అభిప్రాయపడుతున్నారు. గతంలో వీరిద్దరూ 'ద జోయా ఫ్యాక్టర్' అనే సినిమా చేశారు. కాగా సోనమ్ 2018లో ఆనంద్ అహుజాను పెళ్లాడింది. వీరికి ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ ఆస్తులు ఉన్నాయి. లండన్‌లో వీరికి సొంతిల్లు కూడా ఉంది. సోనమ్ తరచూ అక్కడికి వెళ్లి వస్తూ ఉంటుంది. సోనమ్.. రానా భార్య మిహికా బజాజ్‌కు మంచి స్నేహితురాలు కూడా! చదవండి: జైలర్‌కు ఈ రేంజ్ కలెక్షన్సా? నాలుగోసారి రూ.300 కోట్ల క్లబ్బులో -
'King Of Kotha' Pre Release Event: దుల్కర్ సల్మాన్ ‘కింగ్ ఆఫ్ కోత’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఆ పదం నాకు పెద్దగా నచ్చదు
‘‘మనందరం ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ అంటున్నాం. ఆ పదం నాకు పెద్దగా నచ్చదు. కానీ, నాకు తెలిసిన యాక్టర్స్‌లో పాన్ ఇండియా యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది దుల్కర్ మాత్రమే. ఎందుకంటే ఓ హిందీ దర్శకుడు దుల్కర్ కోసం కథ రాసుకుంటాడు. ఓ తెలుగు దర్శకుడు తన కోసం కథ రాసుకుంటాడు. ఓ తమిళ దర్శకుడు కూడా దుల్కర్ కోసం స్క్రిప్ట్ రాసుకుంటాడు. ఓ మలయాళ దర్శకుడూ అతని కోసం కథ రాస్తాడు. ఓ పాన్ ఇండియా యాక్టర్‌కు నిజ మైన నిర్వచనం ఇదే’’ అన్నారు నాని. దుల్కర్ సల్మాన్ , ఐశ్వర్యా లక్ష్మి జంటగా నటించిన చిత్రం ‘కింగ్ ఆఫ్ కోత’. అభిలాష్ జోషి దర్శకత్వంలో జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన నాని మాట్లాడుతూ– ‘‘దుల్కర్ ‘ఓకే బంగారం’ సినిమాలో నా వాయిస్ ఉంది. తన జర్నీలో నా భాగస్వామ్యం కూడా ఉన్నట్లు నేను ఫీలవుతున్నాను. ‘సీతారామం’తో తను తెలుగు ప్రేక్షకుల మనసు గెల్చుకున్నాడు. ఈ సినిమాతో ఆ ప్రేమ నెక్ట్స్ లెవల్‌కు వెళ్లాలని కోరుకుంటున్నాను. ‘కింగ్ ఆఫ్ కోత’ పెద్ద విజయం సాధించాలి. ’’ అన్నారు. హీరో రానా మాట్లాడుతూ–‘‘దుల్కర్ ఓ వైల్డ్ యాక్షన్ ఫిల్మ్ చేశాడంటే నాకు చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది’’ అన్నారు. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ–‘‘ నా కెరీర్లో బిగ్గెస్ట్ ఫిల్మ్ ‘కింగ్ ఆఫ్ కోత’. నాలుగు భాషల్లోనూ నేనే డబ్బింగ్ చెప్పాను’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో దుల్కర్ కొత్తగా కనిపిస్తారు’’ అన్నారు జీ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ నిమ్మకాయల ప్రసాద్. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ్స ఐశ్వర్యా లక్ష్మి, అనిఖా సురేంద్రన్ , నటుడు షబ్బీర్, నిర్మాత ‘స్రవంతి’ రవికిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తమ చిత్రంగా 'సీతారామం'.. మృణాల్‌ను వరించిన అవార్డ్
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (IFFM) అవార్డు వేడుకల్లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. మెల్బోర్న్ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన ఈ వేడుకలు ఈ నెల 20 వరకు జరగనున్నాయి. (ఇదీ చదవండి: బాహుబలి కట్టప్ప కుటుంబంలో తీవ్ర విషాదం) ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సీతారామం' ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందకుంది. ఈ సినిమాలోని ప్రతి పాత్ర ప్రేక్షకుల మదిని తాకుతుంది. హను రాఘవపూడి దర్శకుడుగా తెరక్కెకిన ఈ చిత్రంలో సీత, రామ్‌గా మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ అద్భుతంగా మెంప్పించారు. తాజాగా ఈ రొమాంటిక్ పిరియాడిక్ చిత్రానికి ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ IFFM అవార్డు వేడుకల్లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. దీంతో చిత్ర యూనిట్ సంతోషంలో ఉంది. (ఇదీ చదవండి: ఆరుదైన ఫీట్ చేరుకున్న రాధిక శరత్‌కుమార్) ఉత్తమ వెబ్ సిరీస్‌గా విభాగంలో 'జూబ్లీ' ఉండగా ఉత్తమ డాక్యుమెంటరీగా 'టు కిల్ ఏ టైగర్' నిలిచింది. మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వేలో అదిరిపోయే నటనతో మెప్పించిన రాణీ ముఖర్జీకి బెస్ట్ యాక్టర్ (ఫిమేల్) అవార్డు దక్కింది. మోహిత్ అగర్వాల్ (ఆగ్రా) బెస్ట్ యాక్టర్ మేల్ కాగా పృథ్వీ కొననూర్కు బెస్ట్ డైరెక్టర్‌గా అవార్డు వరించింది. సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ డైవర్సిటీ అవార్డు అందుకున్నారు. View this post on Instagram A post shared by Indian Film Festival of Melbourne (@iffmelbourne) View this post on Instagram A post shared by Indian Film Festival of Melbourne (@iffmelbourne) View this post on Instagram A post shared by Indian Film Festival of Melbourne (@iffmelbourne) View this post on Instagram A post shared by Indian Film Festival of Melbourne (@iffmelbourne) -
అసాధారణ ప్రయాణం
దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కింగ్ ఆఫ్ కోత’. అభిలాష్ జోషి దర్శకత్వంలో జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్ నిర్మించాయి. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. ఈ నెల 24న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళ, తమిళ ట్రైలర్స్‌ని హీరోలు నాగార్జున, షారుక్ ఖాన్, మోహన్ లాల్, సూర్య విడుదల చేశారు. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ– ‘‘కింగ్ ఆఫ్ కోత’ ఒక అసాధారణ ప్రయాణం. గొప్ప పాత్రలు, క్లిష్టమైన కథతో రూపొందించాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది’’ అన్నారు జీ స్టూడియోస్ సౌత్ హెడ్ అక్షయ్ కేజ్రీవాల్. -
పోటీ లేదులే..
‘కొత్త ఊరిలో తోపు మనమే.. పోటీ లేదులే... కొట్టలేరులే..’ అంటూ సాగే పాట ‘కింగ్ ఆఫ్ కోత’ చిత్రం లోనిది. దుల్కర్ సల్మాన్ హీరోగా అభిలాష్ జోషి దర్శకత్వంలో రూపొందిన మలయాళ యాక్షన్ చిత్రం ‘కింగ్ ఆఫ్ కోత’. జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టులో విడుదల కానుంది. ఈ చిత్రంలోని ‘హల్లా మచారే’ పాట తెలుగు వెర్షన్ లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, కృష్ణ కాంత్ సాహిత్యం సమకూర్చారు. ఎల్వీ రేవంత్, సింధూజ శ్రీనివాసన్ పాడారు. -
సౌత్‌లోనే క్రేజీ హీరో.. కానీ ఈయన్ని నటుడిగానే చూడని భార్య!
చిన్న వయసులోనే కారు నడుపుతున్న ఈ హీరో ఇప్పుడు పెద్ద స్టార్. ఇతడి కంటే ఆయన తండ్రి ఇంకా పెద్ద స్టార్. అగ్రహీరో వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి మాతృ భాషలోనే కాకుండా ఇతర భాషల్లోనూ టాప్ హీరోగా రాణిస్తున్నాడు. మహానటిలో ఓ ముఖ్యపాత్రలో నటించిన ఇతడు గతేడాది తెలుగులో హీరోగా చేసి బ్లాక్‌బస్టర్ హిట్ సాధించాడు. తాజాగా మరో తెలుగు డైరెక్టర్‌తో కలిసి పని చేసేందుకు రెడీ అయ్యాడు. అతడే దుల్కర్ సల్మాన్. రెండో సినిమాతో సక్సెస్ మలయాళ మెగా స్టార్ మమ్ముట్టి కుమారుడే దుల్కర్ సల్మాన్. ఇతడు 1986 జూలై 28న జన్మించాడు. ముందు చదువుపైనే ధ్యాస పెట్టిన ఇతడు దుబాయ్‌లో ఐటీ ఉద్యోగం చేశాడు. అయితే తండ్రి బాటలోనే నడవాలని మనసు లాగడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ఇండియా తిరిగొచ్చేశాడు. ముందుగా నటనలో శిక్షణ తీసుకుని సెకండ్ షో అనే మలయాళ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రంతోనే సినీప్రపంచంలో అడుగుపెట్టాడు కానీ అంత గుర్తింపు అయితే రాలేదు. తర్వాత చేసిన ఉస్తాద్ హోటల్ బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్ కొట్టింది. ఈ సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు సైతం పొందాడు. ఆ తర్వాత ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేసుకుంటూ పోయాడు. సీతారామంతో అమాంతం పెరిగిన క్రేజ్ తమిళ, మలయాళంలోనూ సినిమాలు చేశాడు. తెలుగులో ఓకే బంగారం, మహానటి చిత్రాలతో కావాల్సినంత గుర్తింపు సంపాదించాడు. సీతారామం సినిమాతో దుల్కర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. లెఫ్టినెంట్ రామ్‌గా అభిమానులు ఆయన్ను ఆరాధించారు. తెలుగు ప్రేక్షకుల అభిమానానికి ఉప్పొంగిపోయిన ఇతడు ప్రస్తుతం కింగ్ ఆఫ్ కోట అనే మలయాళ సినిమా చేస్తున్నాడు. జూలై 28న ఆయన బర్త్‌డే రోజు తెలుగులో మరో కొత్త సినిమాకు కూడా సంతకం చేసినట్లు వెల్లడించాడు. సార్ సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్ వెంకీ అట్లూరితో ఓ సినిమా చేస్తున్నట్లు తెలిపాడు. ఈ చిత్రానికి లక్కీ భాస్కర్ టైటిల్ ఫిక్స్ చేశారు. నేను ఎంతపెద్ద స్టార్ అయినా నా భార్య మాత్రం నన్ను కనీసం నటుడిగా కూడా చూడదు. మరోపక్క నాన్న(మమ్ముట్టి).. ఏడాదికి నాలుగైదు సినిమాలు చేయకపోతే ఇంట్లోకి కూడా రానివ్వనని కండీషన్ పెట్టాడు. ఒక్క సినిమా చేయడానికి ఇంత సుదీర్ఘ సమయం ఎందుకు? అని ప్రశ్నిస్తాడు. వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేస్తేనే ఇంట్లోకి అడుగుపెట్టనిస్తానని సరదాగా హెచ్చరిస్తూ ఉంటాడు. - దుల్కర్ సల్మాన్ -
'సీతారామం' హీరో మరో తెలుగు మూవీ.. అలాంటి కాన్సెప్ట్‌తో!
దుల్కర్ సల్మాన్ పలు భాషల్లో స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. పాన్-ఇండియా స్థాయిలో అలరిస్తూ, ప్రస్తుత ఉత్తమ నటులలో ఒకడిగా ఫేమ్ సంపాదించాడు. తన గత చిత్రం 'సీతారామం'తో బ్లాక్ బస్టర్ కొట్టిన దుల్కర్.. ఇప్పుడు మరోసారి తెలుగు దర్శకుడితో పనిచేసేందుకు రెడీ అయిపోయాడు. హీరో పుట్టినరోజు సందర్భంగా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: BRO Movie Review: ‘బ్రో’మూవీ రివ్యూ) ధనుష్ తో చేసిన 'సార్'(వాతి)తో వెంకీ అట్లూరి బిగ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న వెంకీ అట్లూరి.. ఇప్పుడు తన ప్రతిభను పాన్-ఇండియా స్థాయికి తీసుకెళ్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. 'నమ్మశక్యం కాని విధంగా ఉన్నత శిఖరాలకు చేరిన ఒక సాధారణ మనిషి కథ'గా ఈ చిత్రం రూపొందుతోందని నిర్మాతలు చెప్పుకొచ్చాడు. ఈ మూవీకి 'లక్కీ భాస్కర్' టైటిల్ ఫిక్స్ చేశారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. Presenting to you #LuckyBaskhar - Embark on a Captivating Journey, The Unraveling Triumphs of an Ordinary Man! 📈🎬#VenkyAtluri @gvprakash @vamsi84 @Banglan16034849 @NavinNooli #SaiSoujanya @sitharaents @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/NwNaZ9NAwC — Dulquer Salmaan (@dulQuer) July 28, 2023 (ఇదీ చదవండి: బ్రో మూవీ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!) -
అభిమానుల్ని మోసం చేస్తున్న స్టార్ హీరోలు!
స్టార్ హీరోలు.. తమ అభిమానుల ఎమోషన్స్‌తో ఆడుకుంటున్నారు! దారుణంగా మోసం చేస్తున్నారు! అవును మీరు విన్నది నిజమే. ఈ మధ్య కాలంలో ఈ తరహా సంఘటనలు మరీ ఎక్కువవుతున్నాయి. తాాజాగా స్టార్ హీరోలు దుల్కర్ సల్మాన్, రామ్ చరణ్ చేసిన పనికి ఫ్యాన్స్ పూర్తిగా డిసప్పాయింట్ అవుతున్నారు. తమని తామే తిట్టుకుంటున్నారు. ఇంతకీ అసలేం జరిగింది? వీడియో దానికోసమా? మిగతా హీరోల సంగతేమో గానీ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరోలు ఏం చేసినా సరే అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. 'మహానటి', 'సీతారామం' సినిమాలతో తెలుగులోనూ క్రేజ్ తెచ్చుకున్న మలయాళ హీరో దుల్కర్ సల్మాన్.. కొన్నిరోజుల ముందు ఓ వీడియో పోస్ట్ చేసి, డిలీట్ చేసేశాడు. తనకు సరిగా నిద్రపట్టడం లేదని ఆ వీడియోలో బాధపడ్డాడు. కట్ చేస్తే.. ఇదంతా కూడా ఓ ఫోన్ బ్రాండ్ ప్రమోషన్ కోసమేనని తాజాగా క్లారిటీ వచ్చేసింది. (ఇదీ చదవండి: సలార్-కేజీఎఫ్ కనెక్షన్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత) రామ్‌చరణ్ కూడా పైన దాంట్లో దుల్కర్ వీడియో పెట్టి కావాలని డిలీట్ చేసి, అభిమానుల ఎమోషన్స్ తో ఆడుకున్నాడు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం అలా ఏం చేయలేదు. కాకపోతే రెండు రోజుల ముందు ఓ వీడియో రిలీజ్ చేయగా.. అందులో రామ్ చరణ్, రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె లాంటి స్టార్స్ కనిపించారు. ఇదేదో వెబ్ సిరీస్ లేదా సినిమా కోసమో అని ఫ్యాన్స్ అనుకున్నారు. అయితే ఇదీ ఓ బట్టలు విక్రయించే ఓ యాప్ కోసం ప్రమోషన్ అని తేలిపోయింది. ఇలా పైన చెప్పిన రెండు సందర్భాలే కాదు.. ఈ మధ్య పలువురు హీరోహీరోయిన్లు ఇలానే ఏదో ఓ వీడియో రిలీజ్ చేయడం, అభిమానుల్లో హైప్ వచ్చేలా చేయడం, తీరా చూస్తే అది ఏదో బ్రాండ్ ప్రమోషన్ కోసం అని తెలిసి మోసపోవడం. ఫ్యాన్స్ కి అలవాటు అయిపోయింది. ఈ క్రమంలో సొంత హీరోహీరోయిన్లనీ ఏం అనలేక అభిమానులు తమని తామే తిట్టుకుంటున్నారు. కాబట్టి స్టార్స్ ఏదైనా వీడియో, పోస్ట్ పెట్టేటప్పుడు కాస్త ఆలోచించండి. మీకే ఓ క్లారిటీ వచ్చేస్తుంది. (ఇదీ చదవండి: చంపేస్తానని బెదిరిస్తున్నాడు.. యువ హీరోయిన్ ఫిర్యాదు) -
ఆ సంఘటనతో నిద్రలేని రాత్రులు.. వీడియో డిలీట్ చేసిన దుల్కర్
మలయాళ స్టార్ మమ్ముట్టి తనయుడిగా వెండితెరపై అడుగుపెట్టాడు దుల్కర్ సల్మాన్.. తమిళ, మలయాళ భాషల్లో హీరోగా సత్తా చాటిన ఇతడు మహానటి, సీతారామం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యాడు. ప్రస్తుతం అతడు సార్ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ అక్టోబరులో ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే ఆదివారం రాత్రి దుల్కర్ సల్మాన్ సోషల్ మీడియాలో భావోద్వేగ వీడియో షేర్ చేశాడు. 'తొలిసారి నేను ఓ సంఘటనను ఎదుర్కొన్నాను, అప్పటినుంచి పరిస్థితులు మారిపోయాయి. దానివల్ల నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాను. జరిగిన సంఘటన నా మైండ్‌లో నుంచి పోవడం లేదు. ఇంకా చాలా చెప్పాలని ఉంది, కానీ దాన్ని నేను చెప్పలేకపోతున్నాను' అంటూ ఎమోషనలయ్యాడు. తర్వాత కాసేపటికే సదరు వీడియోను డిలీట్ చేశాడు. దీంతో అభిమానులు దుల్కర్ మానసిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుల్కర్‌కు ఏమైంది? అతడి వ్యక్తిగత జీవితం బానే ఉంది కదా? అని కంగారుపడుతున్నారు. కొంతమంది మాత్రం ఇదంతా యాక్టింగే, తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రమోషనల్ స్టంట్ అయి ఉంటుందిలే అని కామెంట్లు చేస్తున్నారు. మరి ఏం జరిగిందనేది హీరోనే స్వయంగా చెప్తే కానీ తెలియదు. ఇదిలా ఉంటే దుల్కర్ నటించిన కింగ్ ఆఫ్ కోట ఆగస్టు 25న రిలీజ్ అవుతోంది. What happened to #DulquerSalmaan 🥺🥺. He posted and deleted it later. Is everything alright to him ?. #KingOfKotha pic.twitter.com/PyGnrwnorw — DON BOY (@preethamtweets_) July 2, 2023 చదవండి: ఈ వారం ఓటీటీలో ఏకంగా 24 సినిమాలు -
హీరోయిన్ తో డాన్స్ చేసిన సీతారామం హీరో
-
అన్నీ మంచి శకునములే ప్రీ రిలీజ్ ఈవెంట్లో దుల్కర్ సల్మాన్
-
మరో స్ట్రయిట్ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దుల్కర్
‘మహానటి’, ‘సీతారామం’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ మరో స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. తెలుగులో ‘తొలిప్రేమ’, ‘రంగ్ దే’, ‘సార్’ వంటి సినిమాలను తెరకెక్కించిన వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్న చిత్రంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించనున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించనున్నారు. ‘‘అక్టోబరులో షూటింగ్‌ను ఆరంభించి, వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాం. ప్రేక్షకులను అలరించే మరో మంచి కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్‌గా ఈ చిత్రం ఉంటుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
సీతారామం తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ ఫోన్‌కాల్ తనదే: హీరో
‘‘అన్నీ మంచి శకునములే..’ ట్రైలర్, టీజర్లో పాజటివ్ ఎనర్జీ కనిపించింది. ఈ సినిమాకు ‘అన్నీ మంచి శకునములే..’. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ అవుతుందని నమ్ముతున్నా’’ అని అన్నారు నాని. సంతోష్ శోభన్ , మాళవికా నాయర్ జంటగా నందినీరెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. మిత్రవిందా మూవీస్, స్వప్నా సినిమాస్‌పై ప్రియాంకా దత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హీరోలు నాని, దుల్కర్ సల్మాన్ అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో నాని ఇంకా మాట్లాడుతూ– ‘‘మంచి ఈజ్, బ్రహ్మాండమైన కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్ సంతోష్. అతన్ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్లుగా అనిపిస్తోంది. నందినీకి మరో నాని దొరికాడనిపిస్తోంది. ‘అన్నీ మంచి శకునములే’కి విజువల్స్, సాంగ్స్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ బాగా కుదిరినట్లు అనిపిస్తోంది. ప్రేక్షకులందరికీ గుర్తుండిపోయే ఓ స్పెషల్ చిత్రంగా నిలుస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు నాని. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ– ‘‘వైజయంతీ మూవీస్ నాకు ఓ ఫ్యామిలీలాంటిది. రాజేంద్రప్రసాద్‌గారికి నేను అభిమానిని. ‘మహానటి’కి ఆయనతో కలిసి వర్క్ చేశాను. ‘సీతారామం’ తర్వాత నాకు తొలి ఫోన్ కాల్ నందినీ రెడ్డిగారి నుంచి వచ్చింది. ‘అన్నీ మంచి శకునములే’ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘నా లైఫ్‌లో నేను చేసిన పెద్ద సినిమా ఇది. వీకే నరేశ్, రాజేంద్రప్రసాద్, గౌతమీ, వాసుకి, ‘షావుకారు’ జానకి, అంజు.. ఇలా వీరందరూ కలిసి నేను రాసుకున్న కథను పది రెట్లు పెంచారు. ఈ సినిమాకు లైఫ్ లైన్ సంగీత దర్శకులు మిక్కీ జే మేయర్. ఫ్యామిలీ ప్రొడ్యూసర్స్‌తో కలిసి వర్క్ చేసిన ఫీలింగ్ ప్రియాంక, స్వప్నాల వల్ల కలిగింది’’ అన్నారు నందినీ రెడ్డి. ‘‘సమ్మర్‌కు మన అమ్మమ్మగారి ఇంటికి వెళ్లొచ్చిన జ్ఞాపకంలా ‘అన్నీ మంచి శకునములే’ ఉంటుంది’’ అన్నారు స్వప్నా దత్, ప్రియాంకా దత్. ‘‘చాలాకాలం ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే చిత్రమిది’’ అన్నారు సంతోష్ శోభన్.. ‘‘వైజయంతీ మూవీస్ సంస్థను మా పిల్లలు (స్వప్నా, ప్రియాంక) సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నారు. వీరి ఆలోచనలు అప్పట్లో నాకు రాలేదని ఈర్ష్యగా ఉంది’’ అన్నారు నిర్మాత అశ్వినీదత్. ‘‘అసలు మనం ఎందుకు పుట్టాం? హిందూ ధర్మంలో మనం సెంటిమెంట్‌కు ఎంత వేల్యూ ఇస్తాం. ఆ సెంటిమెంట్ వల్ల మనం ఎలా ఉన్నాం? వంటి అంశాలు ‘అన్నీ మంచి శకునములే..’లో ఉన్నాయి. ఒక అద్భుత సినిమాను చూసిన అనుభూతిని ప్రేక్షకులకు ఇస్తుందని గ్యారంటీ ఇస్తున్నాను’’ అన్నారు రాజేంద్రప్రసాద్. ‘‘పదహారు కూరల రుచుల సమ్మేళనం ఈ చిత్రం’’ అన్నారు వీకే నరేశ్. ఈ వేడుకలో దర్శకులు నాగ్ అశ్విన్, హను రాఘవపూడి, అనుదీప్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.3 కోట్లు పెట్టి దుల్కర్ సల్మాన్ కొన్న కొత్త కారు ఏంటో తెలుసా?
సౌత్ ఇండియా స్టార్ హీరోలు, కేరళకు చెందిన తండ్రీకొడుకులు మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్‌లకు కార్లంటే అమితమైన మోజు. వారి వద్ద పలు ప్రత్యేకమైన, ఖరీదైన కార్లు ఉన్నాయి. వారికి '0369 గ్యారేజ్' పేరుతో ప్రత్యేక కార్ల కలెక్షన్ ఉంది. అందులో కార్లన్నిటికీ రిజిస్ట్రేషన్ నంబర్ 0369. తాజాగా ఈ గ్యారేజీకి సరికొత్త మెర్సిడెస్-మేబ్యాక్ GLS 600 కారు చేరింది. (ఐఫోన్ 15 రాకతో కనుమరుగయ్యే ఐఫోన్ పాత మోడళ్లు ఇవే..) GLS 600 అనేది మెర్సిడెస్ బెంజ్ నుంచి వచ్చిన ఫ్లాగ్షిప్ ఎస్యూవీ. ఈ కారు కంపెనీ అల్ట్రా-లగ్జరీ విభాగమైన మెర్సిడెస్-మేబ్యాక్ కిందకు వస్తుంది. 0369 గ్యారేజ్‌లోకి చేసిన GLS 600 మమ్మద్ కుట్టి పేరు మీద రిజిస్టర్ అయింది. ఇది మమ్ముట్టి అసలు పేరు. మమ్ముట్టి కుమారుడు యువ హీరో దుల్కర్ సల్మాన్ బ్లాక్ కలర్ GLS 600 కారును డెలివరీ తీసుకుంటున్న వీడియో ఇంటర్నెట్లో కనిపించింది. ఇది కేరళ రాష్ట్రంలో కొనుగోలు చేసిన మొదటి మెర్సిడెస్-మేబ్యాక్ GLS 600 కారు. తన అన్ని కార్ల మాదిరిగానే ఈ కారును కూడా మమ్ముట్టి 0369 నంబర్‌తో రిజిస్టర్ చేయించుకున్నారు. ఈ ప్రత్యేక నంబర్ కోసం రూ.1.85 లక్షలు చెల్లించినట్లు సమాచారం. ఇక మెర్సిడెస్-మేబ్యాక్ GLS 600 కారు ధర సుమారు రూ. 2.92 కోట్లు (భారత్‌లో ఎక్స్-షోరూమ్ ధర). దక్షిణ భారతదేశం నుంచి ఈ మెర్సిడెస్-మేబ్యాక్ GLS 600 కారును కొన్న రెండో సినీ నటుడు దుల్కర్ సల్మాన్. ఇతని కంటే ముందు తెలుగు హీరో రామ్ చరణ్ 2022లోనే ఈ కారును కొన్నారు. వీరితో పాటు అర్జున్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా, కృతి సనన్, రణ్వీర్ సింగ్, అనిల్ కపూర్, శిల్పా శెట్టితో సహా మరికొంత మంది బాలీవుడ్ ప్రముఖులు కూడా తమ కార్ కలెక్షన్లకు ఈ GLS 600ని జోడించారు. -
అందుకే సీతారామంకు తెలుగు వారిని తీసుకోలేదు: హను రాఘవపూడి
సీతారామం.. ఎన్నేళ్లు గడిచిన ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయే చిత్రం ఇది. అందమైన ప్రేమకావ్యంగా ప్రేక్షకుల మనసులను హత్తుకుంది ఈ చిత్రం. చిన్న సినిమాగా వచ్చిన చిత్రం అంచనాలను మించి రెట్టింపు రెస్పాన్స్ అందుకుంది. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, మరాఠి భామ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమాకు టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 100 కోట్లకు పైగా వసూళు చేసింది సీతారామం. చదవండి: ‘డబ్బు కోసం ఆరాటపడే వ్యక్తిని కాదు.. నాకు అదే ముఖ్యం’ యుద్ధంలో నుంచి పుట్టిన ప్రేమకథ అంటూ వెండితెరపై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది ఈ చిత్రం. అంతగా ప్రతి ప్రేక్షకుడి మనసును గెలిచిన ఈ చిత్రం కథ ఎక్కడిది, ఎలా వచ్చిందో తాజాగా తెలిపాడు డైరెక్టర్ హనురాఘవపూడి. ఇటీవల ఓ టాక్ షోలో పాల్గొన్న ఆయన సీతారామంకు తెలుగు యాక్టర్స్‌ను తీసుకోకపోవడంపై క్లారిటీ ఇచ్చాడు. ఈ సందర్భంగా హనురాఘవపూడి సీతారామం విశేషాలను పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. ‘నాకు పుస్తకాలు చదడం అలవాటు. అలా నేను ఓ రోజు కోఠిలో సెకండ్ హ్యాండ్ పుస్తకం కొన్నాను. అందులో ఓ లెటర్ ఉంది. అది ఒపెన్ చేసి కూడా లేదు. హాస్టల్లో ఉంటున్న అబ్బాయికి వాళ్ల అమ్మ రాసిన లెటర్ అది. సెలవులకు ఇంటికి రమ్మని ఆమె రాశారు. కానీ అది చదివాక నాకు ఓ ఆలోచన వచ్చింది. ఒకవేళ ఆ లెటర్లో ఏదైనా ముఖ్యమైన సమాచారం ఉంటే? అని అనుకున్నా. ఆ ఆలోచనే ‘సీతారామం’ సినిమా రావడానికి మూలకారణం. కథ రాసుకున్న తర్వాత నిర్మాత స్వప్న గారికి చెప్పాను. ఆమె వెంటనే చేద్దాం అన్నారు. ఆ తర్వాత హీరోగా ఈ కథకు దుల్కర్ సరిగ్గా సరిపోతాడని అనిపించింది. అందుకే తనని సెలెక్ట్ చేశాం’ అని చెప్పాడు. చదవండి: హీరోయిన్ల రెమ్యునరేషన్‌పై మృణాల్ షాకింగ్ కామెంట్స్ అలాగే ‘సీత పాత్ర కోసం మృణాల్‌ను ఎంపిక చేశాం. కొత్తగా ఉండాలని అనుకుంటుంటే స్వప్న.. మృణాల్ గురించి చెప్పింది. ఆమెను చూడగానే సీతపాత్రకు సరిపోతుందని అనిపించింది. ఇక తెలుగు అమ్మాయిని ఎందుకు తీసుకోలేదంటే.. తెలుగు వాళ్ల ప్రొఫైల్స్ ఎక్కడా కనిపించలేదు. ఫలానా అమ్మాయి ఉందని తెలిస్తే తను పాత్రకు సరిపోతుందా లేదా అని చూడొచ్చు. కానీ, ఎక్కడా తెలుగు అమ్మాయిల ప్రొఫైల్స్ కనిపించలేదు. తెలుగు వాళ్లు దొరికితే ఇంకా మాకే హాయి.. ఎందుకంటే వాళ్లకు భాష వచ్చి ఉంటుంది’ అని చెప్పుకొచ్చాడు. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న సీతారామం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అందమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక, సుమంత్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. తాజాగా ఈ చిత్రం హిందీ వర్షన్ ఓటీటీకి సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. (చదవండి: న్యూజెర్సీలో సీతారామం టీమ్ సందడి, దుల్కర్, మృణాల్‌కు లవ్ లెటర్స్) సీతారామం హిందీ వర్షన్ ఓటీటీ అఫీషియల్ డేట్ వచ్చేసింది. ఈనెల 18 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. రిలీజ్ రోజు నుంచే హిట్ టాక్ రావడంతో హిందీలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేశారు. అక్కడ కూడా బాలీవుడ్ అభిమానుల నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. టాలీవుడ్ వర్షన్ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం హిందీ వర్షన్ కూడా ఓటీటీలోకి రానుండడంతో థియేటర్లలో చూడలేని వారికి ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. #Sitaramam (Hindi) Premieres on Disney+ Hotstar - November 18th. 🤩😍#SitaRamamHindi @dulQuer @mrunal0801 @iamRashmika https://t.co/uqC5GgRHtS — South Hindi Dubbed Movies (@SHDMOVIES) November 9, 2022 -
దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా పోస్టర్ వచ్చేసింది
దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కింగ్ ఆఫ్ కోతా. మలయాళ సీనియర్ దర్శకులు జోషి కుమారుడు అభిలాష్ జోషి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవల మధురైలో ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. 'అతడికి కొంతమంది భయపడతారు..మరికొంతమంది గౌరవిస్తారు.. ఇంకొంతమంది ప్రేమిస్తారు, కానీ అతని నిజస్వరూఐపం తెలిసినవారు చాలా తక్కువమంది' అంటూ దుల్కర్ పాత్రను చెప్పే ప్రయత్నం చేశారు చిత్ర యూనిట్. ఈ మూవీలో హీరోయిన్ పాత్రకు సమంత, ఐశ్వర్యలక్ష్మీల పేర్లు తెరపైకి వచ్చాయి. -
‘సీతారామం’ మూవీపై ‘ది కశ్మీర్ ఫైల్స్ ’డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన అందమైన ప్రేమ కావ్యం ‘సీతారామం’. ఇటీవలె ప్రేక్షకుల ముందకు వచ్చిన ఈచిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆగస్ట్ 5న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రూ.75 కోట్ల కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. ఈ ప్రేమ కావ్యం అమెరికాలో సైతం మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఇటీవల ఈ మూవీ హిందీ వెర్షన్లో కూడా విడుదలైంది. చదవండి: రూ. 750 అద్దె ఇంట్లో నివాసం, సీనియర్ నటి దీనస్థితి.. మంత్రి పరామర్శ ఇక ఈ సినిమా చూసిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి సీతారామంపై ప్రశంసలు కురిపించాడు. అంతేకాదు హీరోహీరోయిన్లు దుల్కర్, మృణాల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ‘నిన్న రాత్రే హను రాఘవపూడి తెరకెక్కించిన 'సీతారామం' సినిమా చూశాను. ఇక దుల్కర్ సల్మాన్ నటన నన్ను బాగా ఆకట్టుకుంది. అతడి నటన చాలా సహాజంగా ఉంది. రిఫ్రెషింగ్‌గా అనిపించింది. ఇక యువ నటి మృణాలి ఠాకూర్ గురించి ఏం చెప్పిన తక్కువే. తొలిసారి తన నటన చూశాను. చాలా ఫ్రెష్‌గా సహాజంగా ఉంది. తను పెద్ద స్టార్ అవుతుంది. సీతారామం టీంకు నా శుభాకాంక్షలు’ అంటూ ఆయన కొనియాడాడు. I watched @hanurpudi’s #SitaRamam last night. So refreshing to see @dulQuer… so impressive, his power comes from his genuineness. And what to say about young @mrunal0801 this is the first time I saw her performance… so fresh and original… she will be a big star. Wow. Congrats! — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) September 19, 2022 చదవండి: బిగ్‌బాస్ హౌజ్‌లో నాకు అన్యాయం జరిగింది: అభినయ శ్రీ -
మరో ప్రేమకథతో రాబోతున్న ‘సీతారామం’ టీం!, ఆ నిర్మాత క్లారిటీ..
ఎలాంటి అంచనాలు లేకుండ వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రం ‘సీతారామం’. యుద్దం భూమిలో పుట్టిన అందమైన ప్రేమకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఈ మూవీ విడుదలైన నెల దాటిన ఇప్పటికీ థియేటర్లో సందడి చేస్తోంది. అంతేకాదు ఓటీటీలో సైతం ఈమూవీ దూసుకుపోతోంది. అమెజాన్ ప్రైంలో ప్రస్తుతం సీతారామం స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో లీడ్‌రోల్స్ పోషించిన హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ల నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది. చదవండి: లారెన్స్ షాకింగ్ ప్రకటన.. ‘ఇకపై నేనే నమస్కరిస్తా’ ఇదిలా ఉంటే దుల్కర్, మృణాల్ హీరోహీరోయిన్లుగా మరో చిత్రం ప్రేమకథా చిత్రం రాబోతుందంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్వినిదత్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు బలం చెకూరుస్తున్నాయి. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అయిన సందర్భంగా ఇటీవల ఓ చానల్‌తో ముచ్చటించారు అశ్విని దత్. ఈ సందర్భంగా సీతారామం చిత్ర విశేషాలను పంచుకున్న ఆయన వైజయంతి బ్యానర్లో మరో ప్రేమ కథ చిత్రం రాబోతుందన్నారు. అదే సీతారామం కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుందన్నారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకుర్ హీరోహీరోయిన్లుగా హనురాఘవపూడి దర్శకత్వంలో మరో లవ్‌స్టోరీని రూపొందించనున్నట్లు ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. చదవండి: ఈ చిత్రంలో రజనీ నటిస్తానంటే వారి మధ్య చిక్కుకునేవారు: మణిరత్నం ఇక ఇది తెలిసి ఆడియన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఓ చక్కటి ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ చూశామని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో మళ్లీ అదే టీంతో సీతారామం లాంటి చిత్రం వస్తుందని చెప్పడంతో ప్రేక్షకుల్లో అంచానాలు పెరిగిపోయాయి. మరి హనురాఘవపూడి ఈసారి ఎలాంటి ప్రేమకథతో వస్తారనేతి ఆసక్తిని సంతరించుకుంది. కాగా దుల్కర్ తాజాగా నటించిన బాలీవుడ్ చిత్రం చుప్ సెప్టెంబర్ 23 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక సీతారామం మూవీతో తెలుగులో అడుగుపెట్టిన మృణాల్ వైజయంతి బ్యానర్లోనే ఓ సినిమాకు సంతకం చేసిందని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. -
‘సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు, ఆ స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకున్నా’
స్టార్ కిడ్ అయిన దుల్కర్ సల్మాన్ సైతం ట్రోల్స్ బారిన పడ్డాడట. తనని వ్యక్తిగతం టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో విమర్శించారని, వాటికి సంబంధించిన స్క్రిన్‌షాట్స్ కూడా ఉన్నాయంటూ చెప్పుకొచ్చాడు. సీతారామంతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న దుల్కర్ తాజాగా నటించిన బాలీవుడ్ చిత్రం ‘చుప్: రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’. సెప్టెంబర్ 23న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మూవీ ప్రమోషన్లో భాగంగా దుల్కర్ మీడియాతో మాట్లాడుతూ పలు వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోల్స్‌పై స్పందించాడు. చదవండి: Sudheer Babu: అందుకే ‘బ్రహ్మాస్త్ర’ మూవీ ఆఫర్ వదులుకున్నా ఈ మేరకు దుల్కర్ మాట్లాడుతూ.. ‘గతంలో అభిషేక్ బచ్చన్ గురించి ఓ వార్త విన్నాను. ఆయనను విమర్శిస్తు రాసిన ఆర్టికల్‌కు సంబంధించిన పేపర్ కట్టింగ్స్‌ను అద్దంపై అతికించుకుంటారట. వాటిని రోజు చదువుతారని విన్నాను. నా విషయానికి వస్తే నేను కూడా అలాగే చేస్తాను. నా ఫోన్ గ్యాలరీ చూస్తే మీకు అన్ని స్క్రీన్షాట్స్యే కనిపిస్తాయి. సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తూ చేసిన విమర్శల తాలుకు స్క్రిన్‌షాట్స్ అవి. ట్విటర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలా అన్నింటి స్క్రీన్ షాట్స్ సేవ్ చేసి పెట్టుకుంటాను. వాటిని అప్పుడప్పుడు చూస్తుంటా. అందులో నన్ను పర్సనల్‌గా అటాక్ చేసిన ఐడీలు కూడా నాకు బాగా గుర్తున్నాయి’ అని చెప్పాడు. -
‘సీతారామం’ సీక్వెల్ ఉంటుందా? దుల్కర్ ఏమన్నారంటే..
ఒక సినిమా హిట్ అయితే చాలు.. దాని సిక్వెల్ తీస్తున్నారు నేటి దర్శకనిర్మాతలు. బాహుబలి తర్వాత టాలీవుడ్‌లోనూ ఈ సీక్వెల్ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. ప్రేక్షకులు కూడా హిట్ సినిమాల కొనసాగింపుపై ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన ‘సీతారామం’ మూవీకి కూడా సీక్వెల్ ఉంటే బాగుండని చాలా మంది కోరుకుంటున్నారు. తాజాగా ఇదే విషయాన్ని ఓ రిపోర్టర్ దుల్కర్ సల్మాన్ వద్ద ప్రస్తావించగా.. సీక్వెల్‌పై ఆయన అభిప్రాయాన్ని వెల్లడించాడు. (చదవండి: మహేశ్-రాజమౌళి సినిమా: జక్కన్న భారీ స్కెచ్...హీరోయిన్ ఆమేనా?) ‘ఏదైనా ఒక సినిమాకి విశేష ప్రేక్షకాదారణ లభించి, క్లాసిక్‌గా నిలిస్తే దాన్ని మళ్లీ టచ్ చేయకూడదనే విషయాన్ని నేను నటుడిని కాకముందు నుంచే తెలుసుకున్నా. మేం కథను బాగా నమ్మాం. సీతారామం ఒక క్లాసిక్ మూవీగా నిలస్తుందని భావించాం. అనుకున్నట్లే ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తమ హృదయాల్లో దాచుకున్నారు. అందుకే ఈ చిత్రానికి కొనసాగింపు ఉండదనుకుంటున్నా’అని దుల్కర్ చెప్పుకొచ్చాడు. అలాగే రీమేక్ కూడా ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. హనురాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ అందమైన ప్రేమ కావ్యంలో మృణాళిక ఠాకూర్ హీరోయిన్గా నటించగా, రష్మిక,తరుణ్ భాస్కర్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ అమెజాన్ ఫ్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. -
నేను సినిమాలు మానేయాలని కోరుకున్నారు, అది బాధించింది: దుల్కర్
హీరో దుల్కర్ సల్మాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మలయాళ నటుడు మమ్ముట్టి తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దుల్కర్ తనదైన నటన, స్టైల్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సౌత్ స్టార్ హీరోలలో ఒక్కడిగా మారాడు. ఒకే బంగారం మూవీతో తెలుగు ఆడియన్స్‌ని పలకరించిన దుల్కర్ ‘మహానటి’తో టాలీవుడ్లో అడుగుపెట్టాడు. ఇక రీసెంట్గా విడుదలైన ‘సీతారామం’ చిత్రంతో రామ్‌గా ప్రేక్షకు హృదయాలను కొల్లకొట్టాడు. ఇందులో దుల్కర్ లెఫ్టినెంట్ రామ్ అనే ఆర్మీ యువకుడిగా కనిపించాడు. చదవండి: వందల ఎకరాలు, రాజభవనం.. కృష్ణంరాజు ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా! ఈ సినిమాతో తెలుగులో మరో కమర్షియల్ హిట్ అందుకున్నద దుల్కర్ త్వరలో ‘చుప్: రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’ మూవీతో బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఆర్ బాల్కీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో దుల్కర్ నెగిటివ్ రివ్యూస్, చెడు విమర్శలు ఎదుర్కొనే నటుడిగా కనిపించనున్నాడు. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా తాజాగా ఓ ఇంగ్లీష్ చానల్‌తో ముచ్చటించిన అతడు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. చదవండి: పెళ్లి చేసుకోకపోయినా.. పిల్లల్ని కంటాను: ‘సీతారామం’ బ్యూటీ షాకింగ్ కామెంట్స్ ఈ సందర్భంగా మొదట్లో తనపై కూడా చాలా నెగిటివ్ రివ్యూస్, విమర్శలు వచ్చాయని, అవి చదివి చాలా బాధపడ్డానని చెప్పాడు. ‘‘కెరీర్ ప్రారంభంలో నా సినిమాల రివ్యూ చదువుతూ ఉండేవాడిని. అందులో ఎక్కువగా నా నటనను విమర్శిస్తూ నెగిటివ్ కామెంట్స్ చేసేవారు. ‘నాకు యాక్టింగ్ రాదని, నేను సినిమాలు ఆపేస్తే మంచిదని కూడా కొరుకున్నారు. నా తండ్రిలా నేను నటుడిగా రాణించలేనని.. యాక్టర్‌గా పనికి రాననన్నారు. అందుకే నేను ఇండస్ట్రీలో ఉండకూడదని కోరుకుంటున్నాం’ అంటూ అంటూ నాపై నెగిటివ్ కామెంట్స్ చేశారు. అది నన్ను చాలా బాధించింది’’ అంటూ దుల్కర్ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న సీతారామం సినిమా.. డేట్ ఫిక్స్
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో,హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించారు. రష్మిక మందన్నా, సుమంత్,తరుణ్ భాస్కర్ కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమా తొలిరోజు నుంచే హిట్‌టాక్‌ను సొంతం చేసుకొని సుమారు రూ. 80కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇటీవలె హిందీలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయగా అక్కడ కూడా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపుగా పూర్తికావడంతో ఓటీటీ విడుదలకు రెడీ అయ్యింది. ఈనెల 9నుంచి సీతారామం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించి డిజిటల్ హక్కులను అమెజాన్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. -
చక్కటి ప్రేమకావ్యం.. ‘సీతారామం’పై చిరు ప్రశంసలు
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సీతారామం’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఆగస్ట్ 5న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రూ.75 కోట్ల కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. ఈ ప్రేమ కావ్యానికి అమరికాలో కూడా మంచి ఆదరణ లభించింది. అక్కడ ఇప్పటివరకు 1.3 మిలియన్ డాలర్స్ వసూళ్లు సాధించింది. సాధారణ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా సీతారామంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలు సీతారామం చిత్రాన్ని ప్రశంసిస్తూ ట్వీట్స్ చేశారు. తాజాగా ఆ లిస్ట్‌లో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరారు. రీసెంట్ ఈ సినిమా వీక్షించిన చిరు.. ట్వీటర్ వేదికగా చిత్రబృందాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. (చదవండి: వాట్ ఏ ట్రాన్స్ఫర్మేమషన్.. ఈ హీరోయిన్స్ ఎంతలా మారిపోయారో) ‘సీతారామం’చూశాను. ఒక చక్కటి ప్రేమకావ్యం చూసిన అనుభూతి. ముఖ్యంగా ఎంతో విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో ఈ ప్రేమ కథని ఆవిష్కరించిన విధానం ఎంతగానో నచ్చింది. మనసులో చెరగని ముద్ర వేసే ఇలాంటి చిత్రాన్ని ఎంతో ఉన్నతమైన నిర్మాణ విలువలతో నిర్మించిన అశ్వినీదత్ గారికి, స్వప్నాదత్, ప్రియాంక దత్‌లకు, ఒక ప్యాషన్‌తో చిత్రీకరించిన దర్శకుడు హను రాఘవపూడికి, కలకాలం నిలిచే సంగీతాన్ని అందించిన విశాల్ చంద్రశేఖర్‌కి, అన్నిటికన్నా ముఖ్యంగా సీతా-రామ్‌లుగా ఆ ప్రేమకథకి ప్రాణం పోసిన మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్‌లకు, సూత్రధారి పాత్రని పోషించిన రష్మిక మందన్నకి మొత్తం టీం అందరికీ నా శుభాకాంక్షలు! ప్రేక్షకుల మనసులు దోచిన ఈ చిత్రం మరెన్నో అవార్డులను, రివార్డులను జాతీయ స్థాయిలో గెలవాలని మనస్పూర్తిగా అభిలాషిస్తున్నాను’అని చిరంజీవి ట్వీట్ చేశారు. Kudos Team #SitaRamam 💐@VyjayanthiFilms @AshwiniDuttCh @SwapnaDuttCh #PriyankaDutt @dulQuer @mrunal0801 @iamRashmika @hanurpudi @iSumanth @Composer_Vishal #PSVinod pic.twitter.com/BEAlXhWPa3 — Chiranjeevi Konidela (@KChiruTweets) August 27, 2022 -
సీతారామం మ్యాజిక్.. ఇప్పటికాదా ఎంత వచ్చిందంటే?
అందమైన ప్రేమకావ్యంగా ప్రేక్షకుల మనసులను హత్తుకుంది సీతారామం. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమాను హను రాఘవపూడి డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా సక్సెస్ కావడంతో బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌కు తెలుగులో మంచి అరంగేట్రం లభించినట్లైంది. రష్మిక మందన్నా, సుమంత్ పాత్రలకు మంచి మార్కులు పడ్డాయి. సి.అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 5న విడుదలై ఇప్పటికీ పలు థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటివరకు బాక్సాఫీస్‌పై రూ.75 కోట్ల కలెక్షన్ల వర్షం కురిపించింది. ఒక్క అమెరికాలోనే ఇప్పటివరకు 1.3 మిలియన్ డాలర్స్ వసూళ్లు సాధించింది. ఈ సందర్భంగా సీతారామంపై ఇంత ప్రేమాభిమానం చూపించిన ప్రేక్షకలోకానికి ధన్యవాదాలు తెలిపింది చిత్రయూనిట్. Thank you for all the love pouring in for #SitaRamam 🦋💖@dulQuer @mrunal0801 @iamRashmika @iSumanth @hanurpudi @AshwiniDuttCh @TharunBhasckerD @vennelakishore @Composer_Vishal @VyjayanthiFilms @SwapnaCinema @SonyMusicSouth @penmovies @DQsWayfarerFilm @LycaProductions pic.twitter.com/jI2BoTO15k — Vyjayanthi Movies (@VyjayanthiFilms) August 27, 2022 చదవండి: జూ.ఎన్టీఆర్-కొరటాల ప్రాజెక్ట్‌కు నో చెప్పిన సమంత! ఎందుకో తెలుసా? ఓటీటీలో రామారావు ఆన్ డ్యూటీ, అప్పటినుంచే స్ట్రీమింగ్ -
జోడీ రిపీట్?
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సీతారామం’కి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. అలా ఈ చిత్రంతో బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌కు తెలుగులో మంచి అరంగేట్రం లభించింది. ‘సీతారామం’ను నిర్మించిన వైజయంతీ మూవీస్‌లోనే మృణాల్ మరో సినిమా సైన్ చేశారట. ఈ సినిమాను తెరకెక్కించే దర్శకుల్లో హను రాఘవపూడి, నందినీ రెడ్డి పేర్లు తెరపైకి వచ్చాయి. అలాగే హీరో పాత్రకు దుల్కర్ సల్మాన్ పేరు పరిశీలనలో ఉందట. ఒకవేళ ఈ సినిమాలో హీరోగా దుల్కర్ సల్మాన్ ఫిక్స్ అయితే ‘సీతారామం’ జోడీ రిపీటైనట్లే. మరి.. దుల్కర్, మృణాల్ మళ్లీ జోడీ కడతారా? వేచి చూడాల్సిందే. -
అందుకే 'సీతారామం'లో నటించాను: దుల్కర్ సల్మాన్
ప్రస్తుత రోజుల్లో సినిమాల సక్సెస్ అరుదైపోయిందనే చెప్పాలి. అసలు ప్రేక్షకులు థియేటర్లకు రావడానికే సుముఖత చూపడం లేదు. ఎందుకు కారణాలు ఎన్నైనా ఉండవచ్చు. అయితే మంచి కంటెంట్‌తో వచ్చిన చిత్రాలను ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధమే. ఇందుకు ఉదాహరణ సీతారామం. తమిళంలో అనువాద చిత్రంగా రూపొందిన తెలుగు చిత్రం ఇది. దుల్కర్ సల్మాన్, ఉత్తరాది భామ మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన ఇందులో నటి రష్మిక మందన్నా, టాలీవుడ్ నటుడు సుమంత్ తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. అశ్వినీదత్ సమర్పణలో వైజయంతి మూవీస్ సంస్థ నిర్మించిన ఈచిత్రానికి హను రాఘవపూడి దర్శకుడు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం గత 5వ తేదీన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం భాషల్లో విడుదలై విశేష ప్రేక్షకాదరణతో ప్రదర్శింపబడుతోంది. త్వరలో హిందీలోనూ వి డుదల కానుంది. కాగా ఈ చిత్రాన్ని తమిళనాడులో లైకా సంస్థ విడుదల చేసింది. శుక్రవారం సాయంత్రం చెన్నైలో చిత్ర సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. ముందుగా లైకా సంస్థ నిర్వాహకుడు త మిళ్ కుమరన్ మాట్లాడుతూ లైకా ప్రొడక్షన్స్ విజయవంతమైన చిత్రాల వరుసలో సీతారామం నిలవడం సంతోషంగా ఉందన్నారు. ఇకపై కూడా మంచి కథా చిత్రాలను అందిస్తామని పేర్కొన్నారు. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ సీతారామం కథ విన్నప్పుడే ఇది డ్రీమ్ చిత్రం అని భావించానని చేశారు. ఇది అద్భుతమైన క్లాసికల్ ప్రేమ కావ్యం అని పేర్కొన్నారు. ఇంతకుముందు వినని కథ కావడం, చాలా ఒరిజినల్‌గా అనిపించడంతో తాను నటించడానికి అంగీకరించానన్నారు. ఇది తన జీవితంలో మరిచిపోలేని చిత్రం అన్నారు. చిత్రానికి ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. చిత్ర దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ సీతారామం చిత్రం తమిళనాడులోనూ ఘన విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. చిత్రం వావ్ అనిపించడం వెనుక పెద్ద వార్ ఉందన్నారు. ముఖ్యంగా చిత్ర యూనిట్ మూడున్నర ఏళ్ల శ్రమ ఉంటుందన్నారు. కాశ్మీర్‌లోని డిఫరెంట్ డిఫికల్ట్ లొకేషన్లో మైనస్ 24 డిగ్రీల చలిలో షూటింగ్ నిర్వహించామన్నారు. నటుడు దుల్కర్ సల్మాన్, ఇతర నటీనటులు, యూనిట్ సహకారంతోనే ఇది సాధ్యం అయ్యిందని చెప్పారు. -
'సీతారామం' మూవీ సక్సెస్ మీట్.. ఫోటోలు వైరల్
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన తాజా చిత్రం ‘సీతారామం’. మరాఠి భామ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించగా.. రష్మిక మందన్నా ప్రధాన పాత్ర పోషించింది. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి వాతావరణాన్ని తీసుకొచ్చిందీ సినిమా. సీత, రామ్‌ల లవ్‌స్టోరీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. -
‘సీతారామం’ నేను చేయాల్సింది.. దుల్కర్‌కు వెళ్లింది!: నాగార్జున
‘‘గత వారం విడుదలైన ‘బింబిసార, సీతారామం’ చిత్రాలను గొప్పగా ఆదరించారు. మంచి సినిమా తీస్తే చూస్తామనే నమ్మకం ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు పాదాభివందనాలు. మంచి సినిమా అందించి అశ్వనీదత్‌గారు థియేటర్‌కి మళ్లీ ప్రేక్షకులను తీసుకొచ్చి మా అందరికీ మరోసారి నమ్మకం కలిగించారు’’ అన్నారు హీరో నాగార్జున. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా, రష్మికా మందన్న కీలక పాత్రలో నటించిన చిత్రం ‘సీతారామం’. చదవండి: విజయ్ ఎప్పుడూ ప్రత్యేకమే! హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలైన మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన ఈ మూవీ థ్యాంక్స్ మీట్లో పాల్గొన్న నాగార్జున మాట్లాడుతూ.. ‘‘సీతారామం’లాంటి సినిమా తీయడానికి ధైర్యం కావాలి. స్వప్న, ప్రియాంకలు అశ్వనీదత్‌గారికి పెద్ద అండగా నిలుస్తున్నారు. ‘మహానటి, జాతిరత్నాలు, సీతారామం’ వంటి హిట్ చిత్రాలు నిర్మించారు. ‘సీతారామం’ చూసి అసూయపడ్డాను. నాకు రావాల్సిన రోల్ దుల్కర్‌కి వెళ్లింది (నవ్వుతూ). చదవండి: 3,4 రోజుల వసూళ్లకే సంబరాలు చేసుకోవద్దు: తమ్మారెడ్డి భరద్వాజ ఈ సినిమా చూస్తున్నప్పుడు ‘గీతాంజలి, సంతోషం, మన్మథుడు’ రోజులు గుర్తొచ్చాయి’’ అన్నారు. ‘‘నాపై ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ మాటల్లో చెప్పలేనిది’’ అన్నారు దుల్కర్. ‘‘నేను నాలుగు సినిమాలు తీశాను.. కానీ ‘సీతారామం’ వంటి ఆదరణ లేదు. ఈ సినిమాకి లభిస్తున్న ఆదరణ మరచిపోలేని అనుభూతి ఇచ్చింది’’ అన్నారు హను. ‘‘నాగార్జునగారు మా బేనర్లో ఐదు సినిమాలు చేశారు.. ‘మహానటి, సీతారామం’తో మా బ్యానర్‌కి రెండు విజయాలు ఇచ్చిన దుల్కర్ మా సొంత హీరో అయిపోయాడు’’ అన్నారు అశ్వనీదత్. -
సీతారామం కలెక్షన్స్: ఐదు రోజుల్లో ఎంత రాబట్టిందంటే?
సీతారామం.. సినిమా అంత ఈజీగా మెదళ్లను వదిలి వెళ్లడం లేదంటున్నారు ప్రేక్షకులు. ఒకసారి మూవీ చూశాక దాని జ్ఞాపకాలు వెంటాడుతున్నాయంటున్నారు. అంతలా జనాలకు కనెక్ట్ అయిందీ చిత్రం. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా.. ఇలా అందరూ అద్భుతంగా నటించిన సీతారామం సినిమాను డైరెక్టర్ హను రాఘవపూడి ఓ అద్భుత కావ్యంగా మలిచారు. వీరి కష్టం వృథా కాలేదు. సినిమా సూపర్ హిట్టయింది. మూడు రోజుల్లోనే రూ.25 కోట్లు రాబట్టిన ఈ సినిమా మొత్తంగా ఐదు రోజులు పూర్తయ్యే సరికి రూ.33 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్లోనూ సినిమా దుమ్మురేపుతోంది. ఇప్పటివరకు అక్కడ 750 వేల డాలర్లు రాబట్టింది. చూస్తుంటే త్వరలోనే వన్ మిలియన్ డాలర్ క్లబ్బులో చేరేట్లు కనిపిస్తోంది. చదవండి: హీరోయిన్ లయను బాలయ్య చెల్లెలి పాత్రకు అడిగితే ఏడ్చేసింది బెడ్ షేర్ చేసుకోవాలనుందని అడిగిందంటే ఆమె ఆడదే కాదు: నటుడు