
సీతారామం.. సినిమా అంత ఈజీగా మెదళ్లను వదిలి వెళ్లడం లేదంటున్నారు ప్రేక్షకులు. ఒకసారి మూవీ చూశాక దాని జ్ఞాపకాలు వెంటాడుతున్నాయంటున్నారు. అంతలా జనాలకు కనెక్ట్ అయిందీ చిత్రం. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా.. ఇలా అందరూ అద్భుతంగా నటించిన సీతారామం సినిమాను డైరెక్టర్ హను రాఘవపూడి ఓ అద్భుత కావ్యంగా మలిచారు. వీరి కష్టం వృథా కాలేదు. సినిమా సూపర్ హిట్టయింది.
మూడు రోజుల్లోనే రూ.25 కోట్లు రాబట్టిన ఈ సినిమా మొత్తంగా ఐదు రోజులు పూర్తయ్యే సరికి రూ.33 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్‌లోనూ సినిమా దుమ్మురేపుతోంది. ఇప్పటివరకు అక్కడ 750 వేల డాలర్లు రాబట్టింది. చూస్తుంటే త్వరలోనే వన్ మిలియన్ డాలర్ క్లబ్బులో చేరేట్లు కనిపిస్తోంది.
చదవండి: హీరోయిన్ లయను బాలయ్య చెల్లెలి పాత్రకు అడిగితే ఏడ్చేసింది
బెడ్ షేర్ చేసుకోవాలనుందని అడిగిందంటే ఆమె ఆడదే కాదు: నటుడు
Comments
Please login to add a commentAdd a comment