box office collections
-
కలెక్షన్స్ లో మ్యాడ్ స్క్వేర్ మ్యాజిక్.. పోటీ ఇవ్వలేకపోయిన నితిన్
-
మలయాళంలో బిగ్గెస్ట్ ఓపెనింగ్.. ఎల్ ఎంపురాన్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
మలయాళ స్టార్ మోహన్‌లాల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీ లూసిఫర్ (Lucifer Movie) ఒకటి. 2019లో వచ్చిన ఈ మలయాళ చిత్రం ఘనవిజయం సాధించింది. రూ.30 కోట్లతో తీస్తే రూ.125 కోట్లు రాబట్టింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘L2: ఎంపురాన్’ (L2: Empuraan Movie) తెరకెక్కించారు. తొలి భాగాన్ని రూపొందించిన పృథ్వీరాజ్ ఈ సినిమాకు సైతం దర్శకుడిగా పని చేశాడు. అలాగే కథలోనూ కీలక పాత్రలో కనిపించాడు. లూసిఫర్ అంటే దైవదూత అని అర్థం కాగా ఎంపురాన్ అంటే రాజు కంటే ఎక్కువ.. దేవుడి కంటే తక్కువ అని అర్థం.తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?L2: ఎంపురాన్ మూవీ మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తున్నప్పటికీ ఫస్ట్ డే కలెక్షన్స్ అదిరిపోయాయి. కేవలం భారత్‌లోనే రూ.22 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. మలయాళంలో ఈ రేంజ్ వసూళ్లు అందుకున్న తొలి చిత్రంగా ఎంపురాన్ నిలిచింది. అంతకుముందు ఈ రికార్డు 'ద గోట్ లైఫ్' పేరిట ఉంది. పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ఈ సినిమా దేశంలో రూ.8.95 కోట్ల (నెట్) వసూలు చేసింది. ఇకపోతే ఎంపురాన్ సినిమా విదేశాల్లోనూ అదరగొడుతున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోనూ భారీ ఓపెనింగ్స్ వచ్చినట్లు భోగట్టా!ఆ రికార్డు బ్రేక్ చేస్తుందా?2019 వరకు మలయాళంలో రూ.100 కోట్లు రాబట్టిన సినిమాలే లేవు. లూసిఫర్ సినిమా ఈ సంకెళ్లను తెంచుకుని రూ.100 కోట్లు రాబట్టిన తొలి మలయాళ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన మంజుమ్మల్ బాయ్స్ రూ.200 కోట్లు రాబట్టిన ఏకైక మలయాళ మూవీగా రికార్డుకెక్కింది. మరి ఈ రికార్డును ఎంపురాన్ బ్రేక్ చేస్తుందేమో చూడాలి! We made history! Biggest opening ever for a Malayalam movie. Our heartfelt gratitude to each of you for making this happen.#L2E #Empuraan in theatres now! pic.twitter.com/iN2bdhZz1E— Mohanlal (@Mohanlal) March 28, 2025 #Empuraan sets sail to New Zealand, claiming the Biggest Indian Opener!#L2E #Empuraan in theatres near you!@mohanlal @PrithviOfficial #MuraliGopy @antonypbvr @aashirvadcine @GokulamGopalan @GokulamMovies #VCPraveen #BaijuGopalan #Krishnamoorthy @DreamBig_film_s @jsujithnair… pic.twitter.com/3NtUzx17DV— Aashirvad Cinemas (@aashirvadcine) March 28, 2025చదవండి: Robinhood: ‘రాబిన్‌హుడ్’ మూవీ ట్విటర్ రివ్యూ -
నాలుగు నెలల్లో రూ.3,000 కోట్ల కలెక్షన్స్! బాక్సాఫీస్ క్వీన్‌గా రష్మిక
రష్మిక మందన్నా (Rashmika Mandanna).. ఇండస్ట్రీ ఏదైనా ఆమె అడుగు పెడితే బ్లాక్ బస్టర్ వెల్ కమ్ చెపాల్సిందే. హీరో ఎవరైనా సరే.. ఆమె జోడి కడితే కెరీర్ లో బిగ్ హిట్ అందుకోవాల్సిందే. అలా అని మహానటి పేరు లేదు. గ్లామర్ క్వీన్ అనే క్రేజ్ కూడా లేదు. టోటల్‌గా లక్ ఫ్యాక్టర్ బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తోంది. ఇండియన్ సినిమాలో తనని తిరుగులేని నటిగా నిలబెడుతోంది. రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది.నాలుగు నెలల్లో మూడు వేల కోట్లు!రష్మిక కథానాయికగా నటించిన పుష్ప 2 (Pushpa 2: The Rule) గతేడాది డిసెంబర్లో రిలీజ్ అయింది. ఈ మూవీతో 1800 కోట్ల వసూళ్లు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఛావా రిలీజ్.. 800 కోట్ల కలెక్షన్స్. అంటే ఏడాదిలోపే, 2600 కోట్ల వసూళ్లు. ఇప్పుడు ఈద్‌కు మరో బాలీవుడ్ ఫిలిం సికిందర్ సినిమా రిలీజ్ అవుతోంది. ఎంత లేదనుకున్నా ఈద్ సమయంలో సల్మాన్ సినిమా అంటే ఈజీగా మూడు నాలుగు వందల కోట్లు కొల్లగొడుతుంది. కేవలం నాలుగు నెలల వ్యవధిలో మూడు వేల కోట్ల వసూళ్లకు రష్మిక కేరాఫ్ అడ్రస్‌గా మారనుంది అనేది సంచలనం సృష్టిస్తోంది.దేశ సినీచరిత్రలోనే..బాలీవుడ్‌ను ఏళ్లకు ఏళ్లు ఏలిన దీపిక, ఆలియా భట్, కత్రినాకైఫ్‌కు కూడా ఇలాంటి రికార్డ్ లేదు. భవిష్యత్తులో వారు అందుకునే ఛాన్స్ కూడా లేదు. వీటికి అంతకు ముందు రష్మిక నటించిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ యానిమల్ కలెక్షన్స్ కూడా కలుపుకుంటే హిందీ ఇండస్ట్రీలో రష్మిక కలెక్షన్స్ రికార్డ్ రూ.3500 కోట్లు దాటుతుంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరే హీరోయిన్‌కు ఈ స్థాయి బ్లాక్ బస్టర్స్ లేవు. ఈ రేంజ్ కలెక్షన్స్ లేవు. అందుకే రష్మిక నేమ్ అంత స్పెషల్ గా మారింది. బాలీవుడ్ లేటెస్ట్ బాక్సాఫీస్ క్వీన్ అనిపించుకుంటోంది.(చదవండి: మీరు లేకపోతే నా జర్నీ ఇలా ఉండేది కాదు.. మహాతల్లి ఎమోషనల్ పోస్ట్)కొంత కష్టం.. కొంత అదృష్టంకెరీర్ బిగినింగ్ నుంచి రష్మికకు లక్ ఫ్యాక్టర్ ఎక్కువ. పైగా కష్టపడం ఈ హీరోయిన్‌కు మరింత ఇష్టం. అందుకే ఇంత అందలం. ఆకాశమే హద్దుగా స్టార్ డమ్. ఒక్క బ్లాక్ బస్టర్ అందివస్తేనే కెరీర్ పరుగులు పెడుతుంది. అలాంటిది బాలీవుడ్లో రష్మికపై బ్లాక్ బస్టర్స్ వర్షం కురుస్తోంది. హిట్ మీద హిట్, రికార్డుల మీద రికార్డులు వస్తున్నాయి, పడుతున్నాయి. సికందర్లో తనకంటే 31 ఏళ్ల పెద్ద వయసు ఉన్న సల్మాన్ ఖాన్ (Salman Khan)తో ఆడిపాడింది రష్మిక. ఇక్కడ కూడా మంచి మార్కులే వేయించుకుంది. తనదైన నటనతో సల్మాన్ మనసు గెల్చుకుంది. అందుకే భాయ్ జాన్.. ఏజ్ గ్యాప్‌పై ఓపెన్ అయిపోయాడు.రష్మికకు, వాళ్ల ఫాదర్ కు లేని ఇబ్బంది మిగతా వాళ్లకు ఎందుకని ప్రశ్నించాడు. సికిందర్ తర్వాత కూడా మరిన్ని క్రేజీ మూవీస్ చేయబోతోందీ బ్యూటీ. అందులో స్త్రీ సిరీస్ లాంటి హారర్ కామెడీ మూవీ కూడా ఉంది. సికిందర్ బాక్సాఫీస్ రిజల్ట్ అనుకున్న స్థాయిలో ఉన్నా, లేకపోయినా ఆ తర్వాత కనిపించే హారర్ కామెడీ మెప్పించకపోయినా బాలీవుడ్లో రష్మిక కెరీర్‌కు వచ్చిన ఢోకా ఏం లేదు. ఎందుకంటే యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ లైన్లో ఉంది. ఆలాగే పుష్ప-3 పట్టాలెక్కాల్సి ఉంది. ఈ రెండు సీక్వెల్స్‌తో రష్మిక నేమ్, రష్మిక రికార్డ్స్, రష్మిక కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.చదవండి: కమెడియన్ ధనరాజ్‌తో గొడవలు- విడాకులు.. క్లారిటీ ఇచ్చిన భార్య -
ఫిబ్రవరిలో ఒక్కటి తప్ప అన్నీ ఫ్లాపే.. ఒక సినిమాకైతే రూ.10 వేలే వచ్చాయ్!
హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. అలా మలయాళంలో (Mollywood) గత నెలలో 17 సినిమాలు రిలీజయ్యాయి. అందులో ఎన్ని హిట్టయ్యాయి? ఎన్ని నష్టాల్ని మిగిల్చాయి? అన్న నివేదిక బయటకు వచ్చింది. కేరళ చలనచిత్ర నిర్మాతల మండలి (కేఎఫ్‌పీఏ) ఫిబ్రవరి బాక్సాఫీస్ రిపోర్టు (Malayalam Film Industry Report- February 2025)ను విడుదల చేసింది. మాలీవుడ్‌కు రూ.53 కోట్ల నష్టంఈ నివేదిక ప్రకారం.. గత నెలలో 17 సినిమాలు రిలీజ్ చేస్తే అందులో ఆఫీసర్ ఆన్‌డ్యూటీ సినిమా (Officer on Duty Movie) మాత్రమే బడ్జెట్‌కు దగ్గరగా వసూళ్లు రాబట్టింది. మిగతా చిత్రాలన్నీ తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. 17 సినిమాల బడ్జెట్ అంతా కలిపితే రూ.75 కోట్లు కాగా.. అందులో కేవలం రూ.23.55 కోట్లు మాత్రమే వెనక్కు రావడం గమనార్హం. అంటే దాదాపు రూ.53 కోట్ల నష్టం వాటిల్లింది. రూ.13 కోట్లతో నిర్మితమైన ఆఫీసర్ ఆన్‌డ్యూటీ సినిమా ఇప్పటివరకు రూ.11 కోట్ల షేర్ (రూ.50 కోట్ల గ్రాస్) సాధించింది. ఇప్పటికీ విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. కాపాడలేకపోయిన స్టార్ హీరోఅయితే ఈ మూవీ నేడు (మార్చి 20) నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చేసింది. దీని ప్రభావం బాక్సాఫీస్ కలెక్షన్లపై పడనుంది. మార్కో వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ఉన్నిముకుందన్ హీరోగా నటించిన చిత్రం గెట్ సెట్ బేబీ. రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ కేవలం రూ.1.40 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవడం కూడా కష్టమే! లవ్ డేల్ అనే సినిమా అయితే రూ.1.60 కోట్లు పెట్టి తీయగా కేవలం రూ.10 వేలు మాత్రమే తెచ్చిపెట్టి నిర్మాతలను నిండా ముంచేసింది.పేరు ఘనం.. కలెక్షన్స్ శూన్యంమలయాళ చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉన్నారు. అయినా పేరు ఘనం.. ఫలితం శూన్యం అన్నట్లు ఎప్పుడూ ఈ ఇండస్ట్రీ నష్టాల్లోనే కొట్టుమిట్టాడుతోంది. చాలామంది ఈ చిత్రాలను థియేటర్లలో కన్నా ఓటీటీలోనే ఎక్కువగా ఆదరిస్తున్నారు. దీనికి తోడు నిర్మాణ వ్యయాలు పెరగడం, నటీనటులు పారితోషికం పెంచడంతో బడ్జెట్ తడిసిమోపడవుతోంది. కనీసం లాభాలు కాదుకదా పెట్టుబడి వెనక్కి వచ్చినా చాలనుకునే దయనీయ స్థితి మాలీవుడ్‌లో కనిపిస్తోంది.కేరళ చలనచిత్ర నిర్మాతల మండలి విడుదల చేసిన నివేదిక నిజంగా షాక్‌కు గురిచేసింది. ఫిబ్రవరిలో రిలీజైన 17 సినిమాల్లో ఆఫీసర్ ఆన్‌డ్యూటీ మూవీ మాత్రమే పెట్టిన పెట్టుబడికి సమీపంలో వసూళ్లు రాబట్టింది. అన్నింటికీ కలిపి రూ.73 కోట్లు పెడితే కేవలం రూ.23.55 కోట్లు మాత్రమే వెనక్కు రావడం విచారకరం.- శ్రీధర్ పిళ్లై, సినీ విశ్లేషకుడుగ్రాస్: మొత్తం సినిమా టికెట్ల అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బునెట్: గ్రాస్ వసూళ్ల నుంచి ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టగా మిగిలేది నెట్షేర్: నెట్ వసూళ్ల నుంచి థియేటర్ అద్దె, నిర్వహణ వంటి ఖర్చులు తీసేయగా మిగిలేది షేర్చదవండి: హీరో అజిత్‌ను పేరు పెట్టి పిలిచా.. అందరూ షాకయ్యారు: నటుడు -
Chhaava Movie: ఇండియాలోనే 500 కోట్లు దాటిన కలెక్షన్లు
-
93% సినిమాలు ఫ్లాప్.. వెయ్యి కోట్ల నష్టం.. నిర్మాతల కంట రక్తకన్నీరు!
రిలీజైన ప్రతి సినిమా హిట్టవదు. కంటెంట్‌లో దమ్మున్నవి మాత్రమే హిట్టు, సూపర్ హిట్టుగా నిలుస్తాయి. కథలో ఏమాత్రం పస లేకపోయినా సినిమాను నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్ చేస్తారు. అలా తమిళ సినిమాలోనూ వందల సినిమాలను ప్రేక్షకులు తిరస్కరించారు. 2024లో తమిళ ఇండస్ట్రీలో విడుదలైన సినిమాలెన్ని? (Kollywood Box Office Report - 2024) లాభనష్టాలేంటి? అనేవి ఓసారి చూసేద్దాం..రూ.1000 కోట్ల నష్టంకోలీవుడ్ (Tamil Cinema Industry)లో గతేడాది 241 సినిమాలు రిలీజయ్యాయి. వీటికోసం తమిళ ఫిలిం మేకర్స్ దాదాపుగా రూ.3000 కోట్లు ఖర్చుపెట్టారు. ఖర్చుకు వెనకాడకుండా సినిమాలు తీసిన నిర్మాతలకు బాక్సాఫీస్ దగ్గ భంగపాటు ఎదురైంది. ఏకంగా 223 సినిమాలు బ్రేక్ ఈవెన్ కూడా అందుకోలేకపోయాయి. దీంతో వెయ్యి కోట్ల మేర నష్టం వాటిల్లింది. సూర్య, కమల్ హాసన్, రజనీకాంత్ వంటి హీరోల సినిమాలు సైతం చతికిలపడ్డాయి. రూ.350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన కంగువా రూ.1000 కోట్లు రాబడుతుందనుకున్నారు. అతి కష్టమ్మీద రూ.100 కోట్లు!తీరా చూస్తే కేవలం రూ.106 కోట్లు మాత్రమే వసూలు చేసింది. నిర్మాతలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. అలాగే టాప్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో, కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఇండియన్ 2 సినిమా (Indian 2 Movie)ను రూ.250 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. చివరకు ఇది కూడా కంగువా బాటలోనే పయనించింది. రూ.150 కోట్లకంటే ఎక్కువ రాబట్టలేకపోయింది. రజనీకాంత్ వేట్టైయాన్ చిత్రాన్ని సైతం ప్రేక్షకులు ఇలాగే తిరస్కరించారు.చదవండి: పెళ్లి వద్దనుకుని 'కళార్పణ'కు అంకితమైన శోభన93% సినిమాలు ఫ్లాప్2024లో కేవలం 18 చిత్రాలు మాత్రమే హిట్టయ్యాయి. ఈ లెక్కన గతేడాది 93% చిత్రాలు ఫ్లాప్ లిస్ట్‌లో చేరిపోగా ఏడు శాతం మాత్రమే సక్సెస్ అయ్యాయి. ఆ సక్సెస్ జాబితాలో అమరన్ (Amaran Film), ద గోట్, రాయన్ వంటివాటితో పాటు లబ్బర్ పందు, గరుడన్, డిమాంటి కాలనీ 2, వాళై చిత్రాలూ ఉన్నాయి. 2025కి తమిళ ఇండస్ట్రీ శుభారంభం పిలికింది. మదగజరాజ, కుడుంబస్తాన్ చిత్రాలు హిట్లుగా నిలిచాయి. కానీ గేమ్ ఛేంజర్ డిజాస్టర్‌గా నిలిచింది.ఆశలన్నీ ఈ ఏడాదిపైనే!2023లో జైలర్, పొన్నియన్ సెల్వన్ 2 వంటి భారీ బడ్జెట్ చిత్రాలు కాసులవర్షం కురిపించాయి. కానీ 2024లో మాత్రం ఇండియన్ 2, కంగువా, వేట్టైయాన్ వంటి పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా చతికిలపడ్డాయి. ద గోట్, అమరన్, మహారాజా, రాయన్, అరణ్మణై 4 వంటి కొన్ని చిత్రాలు మాత్రమే హిట్టందుకున్నాయి. 2024 అత్యంత చెత్త సంవత్సరంగా నిలిచింది. 2025లో ఈ పరిస్థితి మారుతుందని ఆశిస్తున్నాం.- నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ జి. ధనాంజనేయన్చదవండి: Madha Gaja Raja Review: ‘మదగజరాజా’ మూవీ రివ్యూ -
బ్లాక్‌బస్టర్ పొంగల్.. కలెక్షన్స్ ఎంత వచ్చాయంటే?
ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అంటారు. గతేడాది సంక్రాంతికి సైంధవ్‌తో పలకరించాడు విక్టరీ వెంకటేశ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా చతికిలపడింది. ఈసారి తన ఎవర్గ్రీన్ జానర్ కామెడీనే నమ్ముకున్నాడు. అలా అనిల్ రావిపూడితో సంక్రాంతికి వస్తున్నాం సినిమా (Sankranthiki Vasthunam Movie) చేశాడు. ఈ మూవీ జనవరి 14న విడుదలైంది. అలా ఈసారి సంక్రాంతికి వస్తూనే పండగ కళను తీసుకొచ్చారు. పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవడానికి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ ఎదుట క్యూ కడుతున్నారు.రెండు రోజుల్లోనే రూ.77 కోట్లుమొత్తానికి సంక్రాంతికి వస్తున్నాం చిత్రయూనిట్ ఈసారి బ్లాక్‌బస్టర్ పొంగల్ సెలబ్రేట్ చేసుకుంటోంది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్లు రాబట్టిన ఈ సినిమా రెండో రోజు రూ.32 కోట్లు వసూలు చేసింది. అంటే రెండు రోజుల్లోనే రూ.77 కోట్ల కలెక్షన్స్ సాధించింది. బాక్సాఫీస్ ర్యాంపేజ్ ఆడిస్తున్న వెంకీ మామ రెండు రోజుల్లో రూ.100 కోట్ల మార్క్ దాటడం ఖాయంగా కనిపిస్తోంది.తగ్గని డాకు మహారాజ్ జోరుమరోవైపు నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా (Daaku Maharaaj Movie) కూడా బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. తొలి రోజు రూ.56 కోట్లు రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. జనవరి 12న రిలీజైన ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే సెంచరీ క్లబ్‌లోకి చేరింది. డాకు మహారాజ్ రూ.105 కోట్లు రాబట్టిందంటూ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ స్పెషల్ పోస్టర్ ద్వారా వెల్లడించింది. అంతేకాదు, ఈ సినిమాను తమిళంలో రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. జనవరి 17 నుంచి తమిళనాడులోని థియేటర్లలో డాకు మహారాజ్ ప్రత్యక్షం కానుందని వెల్లడించారు. KING OF SANKRANTHI #DaakuMaharaaj has turned into a CELEBRATION with the audience's love ❤️#BlockbusterHuntingDaakuMaharaaj crosses 𝟏𝟎𝟓 𝐂𝐫𝐨𝐫𝐞𝐬+ 𝐖𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐆𝐫𝐨𝐬𝐬 𝐢𝐧 𝟒 𝐝𝐚𝐲𝐬 sweeping all territories into his zone 🪓🔥𝐓𝐇𝐄 𝐇𝐔𝐍𝐓 𝐈𝐒 𝐎𝐍 ~ Book… pic.twitter.com/JPF8US64bO— Sithara Entertainments (@SitharaEnts) January 16, 2025The ‘VICTORY RAMPAGE’ continues at the box office 🔥🔥🔥77CRORE+ Worldwide Gross in 2 days for #BlockbusterSankranthikiVasthunam ❤️🔥And Day3 already begun on a sensational note 💥💥#SankranthikiVasthunam IN CINEMAS NOW 🫶Victory @venkymama @anilravipudi @aishu_dil pic.twitter.com/IfkZ1tSa1q— Sankranthiki Vasthunam (@SVMovieOfficial) January 16, 2025 The sensation that shook the box office and won hearts in Telugu 😎Now ready to ROAR in Tamil from tomorrow! 🔥Experience the #BlockbusterHuntingDaakuMaharaaj with your loved ones ❤️#DaakuMaharaaj ❤️🔥𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺 #NandamuriBalakrishna @thedeol @dirbobby… pic.twitter.com/0Vg08BOWNY— Sithara Entertainments (@SitharaEnts) January 16, 2025 చదవండి: సైఫ్ అలీఖాన్‌పై దాడి.. షాకయ్యా: జూనియర్ ఎన్టీఆర్ -
కలెక్షన్స్ సునామీ.. పుష్పరాజ్ తగ్గేదేలే !
-
సరికొత్త రికార్డు సృష్టించిన పుష్ప 2
-
నార్త్ మార్కెట్ ను టార్గెట్ చేస్తున్న టాలీవుడ్
-
రికార్డులన్నీ రప్ప...రప్ప...
-
పుష్ప 2 దెబ్బకి అన్ని రికార్డ్స్ బ్రేక్
-
ఫస్ట్ డే కలెక్షన్స్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన పుష్ప-2
-
'పుష్ప2' ఫస్ట్ డే కలెక్షన్స్.. బాలీవుడ్ కింగ్‌గా అల్లు అర్జున్
తెలుగు సినిమాల ఓపెనింగ్ కలెక్షన్స్ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. హిందీ సినిమాలు కూడా ఆ టార్గెట్‌ను అందుకోవాలంటే కాస్తా కష్టమే అనేలా ఉన్నాయి. బాలీవుడ్లో పుష్ప2 కలెక్షన్స్ రికార్డ్ క్రియేట్ చేశాయి. ఈమేరకు చిత్ర యూనిట్ అధికారికంగా ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. బాలీవుడ్లో షారుఖ్‌ఖాన్, అమీర్‌ఖాన్,సల్మాన్‌ఖాన్ వంటి స్టార్స్‌కు కూడా సాధ్యం కానీ రికార్డ్ అల్లు అర్జున్ క్రియేట్ చేశాడు.బాలీవుడ్లో ఇప్పటి వరకు మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా షారుఖ్‌ఖాన్ 'జవాన్' రూ. 65.5 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. అయితే, ఇప్పుడు 'పుష్ప2' ఆ రికార్డ్‌ను దాటేసింది. హిందీలో ఫస్ట్ డే రూ.72 కోట్ల నెట్ రాబట్టి ఫస్ట్ ప్లేస్‌లోకి పుష్ప2 చేరిపోయింది. బన్నీ స్టార్‌డమ్‌తోనే హిందీ 'పుష్ప'కి భారీ ఓపెనింగ్స్ వచ్చాయని అక్కడి ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. బాలీవుడ్ ఫస్ట్ కలెక్షన్స్ టాప్ టెన్ లిస్ట్‌లో పుష్ప2 చిత్రం మాత్రమే ఉండటం విశేషం. ఆ తర్వాతే టాలీవుడ్ నుంచి బాహుబలి2 ( 41 కోట్లు), ఆదిపురుష్ ( రూ 37.25 కోట్లు), సాహో ( రూ.24.4 కోట్లు), కల్కి (రూ. 22.5 కోట్లు) వంటి చిత్రాలు ఉన్నాయి.బాలీవుడ్లో ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్స్ 1. పుష్ప2 ( రూ. 72 కోట్ల నెట్)2. జవాన్ (రూ. 65.5 కోట్ల నెట్)3. స్త్రీ2 ( రూ.55 కోట్లు)4. పఠాన్ ( రూ. 55 కోట్లు)5. యానిమల్ ( రూ.54.75 కోట్లు)6. కేజీఎఫ్2 ( రూ.53.95 కోట్లు)7. వార్ (రూ. 51.60 కోట్లు)8. థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ ( రూ. 50 కోట్లు)9. సింగం ఎగైన్ (రూ. 43.5 కోట్లు)10. టైగర్3 (రూ.43 కోట్లు) View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) -
కిరణ్ అబ్బవరం 'క' సినిమా కలెక్షన్స్.. రెండురోజులకు ఎంతో తెలుసా..?
కిరణ్ అబ్బవరం హీరోగా, నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించిన పీరియాడికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘క’.దీపావళి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మొదటిరోజు మంచి కలెక్షన్లతో రికార్డ్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. రెండోరోజు కూడా సత్తా చాటుతుంది. ఇక నవంబర్ 2,3 తేదీలు వీకెండ్ కాబట్టి భారీగా కలెక్షన్స్ రాబట్టొచ్చని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి.'క' సినిమా మొదటిరోజు రూ. 6.18 కోట్లు రాబట్టి కిరణ్ అబ్బవరం కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే, సినిమాకు ఎక్కడ చూసినా పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్స్ అన్నీ హౌస్‌ఫుల్ అవుతున్నాయి. దీంతో రెండో రోజు కూడా కలెక్షన్ల పరంగా సత్తా చాటింది. కేవలం రెండురోజుల్లోనే రూ. 13.11 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. 'క' ఫైనల్ కలెక్షన్స్ సుమారు రూ. 30 కోట్ల మార్క్‌ను అందుకోవచ్చని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.సుజీత్–సందీప్ దర్శకత్వంలో చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణా రెడ్డి 'క' చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని వంశీ నందిపాటి డిస్ట్రిబ్యూట్ చేశారు. సినిమా ఇంతటి విజయం అందుకోవడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో మొదట 18 ప్రీమియర్స్‌తో సినిమా స్టార్ట్ చేస్తే ఇప్పుడు 71 షోస్‌కు చేరుకుందని ఆయన అన్నారు. ఇందులో 56 షోస్ హౌస్ ఫుల్ అయినట్లు వంశీ చెప్పుకొచ్చారు. సినిమాలో కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని వారు తెలిపారు. -
ఇదీ ప్రభాస్ రేంజ్! ఆర్ఆర్ఆర్ రికార్డునూ బ్రేక్ చేసిన కల్కి
-
పేరుకు పెద్ద స్టార్ కలెక్షన్స్ మాత్రం నిల్..
-
16 రోజుల్లో 1000 కోట్లు కొల్లగొట్టిన ఏకైక హీరో ప్రభాస్
-
గామికి సూపర్ హిట్ టాక్.. ఫస్ట్ డే ఎంతొచ్చిందంటే?
అన్ని సినిమాల్లోలాగా ఫైట్స్, డైలాగ్స్, సాంగ్స్ వంటి కమర్షియల్ అంశాలు ఏవీ గామి చిత్రంలో ఉండవు. ఈ సినిమాకు ఉన్న ప్రధాన బలం భావోద్వేగం. 2017లోనే ఈ కథ విన్నాడు విశ్వక్ సేన్. ఒక్క ఏడాదిలో పూర్తి చేసే చిత్రం కాదని ఆనాడే అనుకున్నాడు. అన్నట్లుగానే సినిమా పూర్తి చేయడానికి ఐదారేళ్ల సమయం పట్టింది. ఇందులో చాందీ చౌదరి హీరోయిన్గా నటించగా విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించాడు. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే? వి సెల్యులాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీకి అంతటా హిట్ టాక్ వస్తోంది. తొలి రోజు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.9.07 కోట్లు రాబట్టింది. సినీప్రియుల ఫస్ట్ చాయిస్ గామి అంటూ చిత్రయూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్ మీ ఇన్నేళ్ల కష్టం వృథా పోలేదు అని కామెంట్లు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ వసూళ్ల సంఖ్య పెరిగే అవకాశం లేకపోలేదంటున్నారు. గామి ప్రత్యేకతలు.. ఇక గామి సినిమా కోసం చిత్రయూనిట్ ఎన్నో కష్టాలు పడింది. మైనస్ 25 డిగ్రీల చలిలో షూట్ చేశారు. వారి ప్రాణలు పణంగా పెట్టి సినిమా తీశారు. సినిమా మొత్తంలో విశ్వక్‌కు రెండు పేజీల డైలాగ్స్ మాత్రమే ఉన్నాయి. విశ్వక్‌కు అఘోరాగా మేకప్ వేయడానికే రెండు గంటలకు పైగా సమయం పట్టేది. ఈ సినిమాకు విశ్వక్ ఇంతవరకు పారితోషికం తీసుకోనేలేదు. సినిమా ఆరేళ్ల క్రితమే మొదలైంది. కానీ డైరెక్టర్ ఈ సినిమాపై తొమ్మిదేళ్లుగా వర్క్ చేయడం విశేషం. EPIC RESPONSE for 𝗧𝗛𝗘 𝗕𝗥𝗘𝗔𝗧𝗛𝗧𝗔𝗞𝗜𝗡𝗚 𝗘𝗣𝗜𝗖 𝗙𝗥𝗢𝗠 𝗧𝗘𝗟𝗨𝗚𝗨 𝗖𝗜𝗡𝗘𝗠𝗔 ❤🔥#Gaami collects a gross of 9.07 CRORES on Day 1 💥💥💥 A sensational first weekend on cards with fast fillings all over 🔥 🎟️ https://t.co/GPGN6SF5RL@VishwakSenActor… pic.twitter.com/itvPC6Z9Iw — UV Creations (@UV_Creations) March 9, 2024 చదవండి: పందిలా తింటాడు.. ఇప్పటికీ నాన్న దగ్గర డబ్బులడుక్కుని.. -
కలిసొచ్చిన రిపబ్లిక్ డే.. రికార్డు సాధించిన హనుమాన్
అటు అయోధ్య రామమందిర ప్రారంభం ఎంత ఘనంగా జరిగిందో ఇటు హనుమాన్ కలెక్షన్స్ అంత భారీగా రాబడుతోంది. అక్కడ రాముడు పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ హనుమాన్ కోట్లాది రూపాయల వసూళ్లు రాబడుతున్నాడు. మొత్తానికి ఈ సినిమా సంక్రాంతి విజేతగా నిలిచింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ కళాఖండంలో తేజ సజ్జ హీరోగా నటించాడు. హనుమాన్ ప్రభంజనం.. ఇప్పటికే రెండు వందల కోట్ల క్లబ్బులో చేరి ఈ మూవీ అందరినీ ఆశ్చర్యపరిచింది. నిన్న గణతంత్ర దినోత్సవం కావడంతో వసూళ్ల సంఖ్య మరింత పెరిగింది. తాజాగా ఈ చిత్రం మరో రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లు కొల్లగొట్టింది. ఈ మేరకు చిత్రయూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది. చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ కేవలం 15 రోజుల్లోనే ఈ అరుదైన ఘనత సాధించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ చేతిలో 12 కథలు ఇక హనుమాన్ సినిమాకు సీక్వెల్‌గా జై హనుమాన్ ఉంటుందని దర్శకుడు ప్రకటించిన విషయం తెలిసిందే! ఇది భారీ బడ్జెట్‌తో పెద్ద ఎత్తున ఉండబోతుందని తెలిపాడు. సౌత్, బాలీవుడ్ హీరోలు కూడా ఇందులో ఉంటారని చెప్పాడు. ఈ ఒక్కటే కాదు తన దగ్గర మొత్తం 12 కథలు ఉన్నాయన్నాడు. మరి ఆ సినిమాలతో ప్రశాంత్ వర్మ ఇంకా ఎన్ని అద్భుతాలు చేస్తాడో చూడాలి! చదవండి: వచ్చే జన్మలో పూర్ణ కడుపున పుడతానన్న దర్శకుడు.. నటి ఎమోషనల్ -
200 కోట్లు దాటిన హనుమాన్ కలెక్షన్స్
-
హనుమాన్ దెబ్బ అదుర్స్.. కేజీఎఫ్, కాంతార రికార్డులు బద్ధలు..
కథలో దమ్ముంటే చాలు జనాలు ఇట్టే కనెక్ట్ అవుతారు. అది హనుమాన్తో నిరూపితమైంది. ఇప్పటివరకు హాలీవుడ్ సూపర్ హీరోలనే ఇష్టపడిన జనాలు హనుమాన్ చూసి యూటర్న్ తీసుకుంటున్నారు. హనుమాన్ను అందరికంటే బెస్ట్ సూపర్ హీరోగా కొనియాడుతున్నారు. పాజిటివ్ టాక్, సెలవుల కారణంగా రోజురోజుకీ వసూళ్లు పెంచుకుంటూ పోతోందీ చిత్రం. పుష్పతో సమానంగా.. తాజాగా ఈ విషయాన్ని ప్రముఖ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. '2024లో బోణీ కొట్టిన తొలి సినిమా హనుమాన్. మొదటి మూడు రోజుల ఓపెనింగ్స్.. కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్, కాంతార హిందీ డబ్బింగ్ వర్షన్స్ వసూళ్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. పుష్ప హిందీ వర్షన్‌తో సమానంగా వసూళ్లు రాబడుతోంది. కేవలం హిందీ వర్షన్ తొలి రోజు రూ.2.15 కోట్లు రాబట్టగా రెండో రోజు రూ.4.05 కోట్లు, మూడో రోజు ఏకంగా రూ.6.06 కోట్లు వచ్చాయి. జనవరి 25వరకు పెద్ద సినిమాలేమీ లేకపోవడంతో హనుమాన్ కలెక్షన్స్ మరింత పుంజుకునే ఛాన్స్ ఉంది' అని ఎక్స్(ట్విటర్)లో రాసుకొచ్చాడు. హాఫ్ సెంచరీకి చేరువలో మరోవైపు హనుమాన్కు మౌత్ టాక్ ద్వారా పబ్లిసిటీ జరుగుతోంది. ఈ కారణంగా రోజురోజుకీ కలెక్షన్స్ పెరుగుతూ వస్తున్నాయి., ఇప్పటివరకు ఈ మూవీ కలెక్షన్స్ రూ.40 కోట్ల పైనే వసూళ్లు రాబట్టి ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే చిత్రయూనిట్ బాక్సాఫీస్ లెక్కలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. హీరో రానా తన చెప్పులు ఓ మూలన విడిచేసి హనుమాన్ పోస్టర్, గద ముందు ఫోటోలు దిగాడు. ఇది చూసిన జనాలు రానాను మెచ్చుకుంటున్నారు. మొదటి విరాళం ఎన్ని లక్షలంటే? ఇదిలా ఉంటే ఈ సినిమా ఆడినన్ని రోజులు ప్రతి టికెట్‌పై వచ్చే డబ్బులో ఐదు రూపాయలు అయోధ్యలోని రామమందిరానికి విరాళంగా ఇస్తామని చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ మేరకు తొలిరోజు కలెక్షన్స్ ఆధారంగా రూ.14 లక్షలను అయోధ్య రామాలయానికి విరాళంగా ఇచ్చారు. బాక్సాఫీస్ దగ్గర దూకుడు చూస్తుంటే రానున్న రోజుల్లో దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి.. కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చేట్లు కనిపిస్తున్నారు. Here’s the BIGGG SURPRISE… #HanuMan first *3-day* [opening weekend] total is HIGHER than #KGF [first part] and #Kantara, at par with #Pushpa [note: all #Hindi dubbed versions]… Yes, you read it right!#HanuMan emerges FIRST HIT OF 2024… Packs an impressive total in its… pic.twitter.com/OkzYxnmkmc — taran adarsh (@taran_adarsh) January 15, 2024 South Indian actor #RanaDaggubati removing shoes before standing next to the poster of #HanumanMovie and Gada (mace). pic.twitter.com/568GOfGWc3 — Smriti Sharma (@SmritiSharma_) January 15, 2024 చదవండి: ఆఫీసుల చుట్టూ తిరిగా.. అవమానించారు.. భరించలేక వెళ్లిపోదామనుకున్నా! -
Guntur Kaaram Collection Day 1: రచ్చ లేపిన గుంటూరు కారం.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
మాస్ యాంగిల్లో దుమ్ములేపాడు మహేశ్‌బాబు. గుంటూరు కారం సినిమాలో తన యాక్టింగ్‌తో ఫ్యాన్స్‌కు ఫుల్ బిర్యానీ తినిపించాడు. కానీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసే అక్కడక్కడా తడబడ్డట్లు కనిపించింది. అయితే పాటలు, ట్రైలర్ బాగా క్లిక్ అవ్వడంతో అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజులో జరిగాయి. దీంతో సంక్రాంతి పందెంలో దిగిన గుంటూరు కారం తొలి రోజు బీభత్సంగా రాబట్టింది. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఫస్ట్‌డే రూ.94 కోట్లు రాబట్టింది. కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సూపర్ స్టార్ మహేశ్ తన కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నాడంటూ చిత్రయూనిట్ ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసింది. ఇది చూసిన అభిమానులు జై బాబు, రికార్డ్స్ బ్రేకింగ్ రమణ అంటూ సంతోషంతో కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. జగపతిబాబు, రమ్యకృష్ణ, వెన్నెల కిషోర్, సునీల్, ప్రకాశ్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. తమన్ సంగీతమందించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. సంక్రాంతి బరిలో విజయం సాధించేనా? ఇప్పటికే గుంటూరు కారం చిత్రానికి పోటీగా హనుమాన్, సైంధవ్ రంగంలోకి దిగాయి. వీటిలో హనుమాన్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.20 కోట్ల మేర రాబట్టినట్లు తెలుస్తోంది. కానీ మౌత్ టాక్ వల్ల హనుమాన్ సినిమా కలెక్షన్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. రేపు(జనవరి 14న) ఈ మూడు సినిమాలకు పోటీగా నా సామిరంగ రిలీజ్ కానుంది. బాక్సాఫీస్ వద్ద జరిగే ఫైట్‌లో ఈ నాలుగింటిలో ఏది విజేతగా నిలుస్తుందో రానున్న రోజుల్లో తేలనుంది! Biggest opening day ever for the Reigning Super 🌟 @urstrulyMahesh 🕺😎#GunturKaaram strikes a 𝐑𝐄𝐂𝐎𝐑𝐃 𝐁𝐑𝐄𝐀𝐊𝐈𝐍𝐆 𝟗𝟒 𝐂𝐑 𝐆𝐫𝐨𝐬𝐬 Worldwide on Day 1 ~ 𝗔𝗟𝗟 𝗧𝗜𝗠𝗘 𝗥𝗘𝗖𝗢𝗥𝗗 in regional cinema! 🔥🔥 Watch the #BlockbusterGunturKaaram at cinemas near you… pic.twitter.com/TNNMBjVLeI — Haarika & Hassine Creations (@haarikahassine) January 13, 2024 చదవండి: హను-మాన్ తొలి రోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే? అప్పుడు శోభన్ బాబు.. ఇప్పుడు అక్కినేని నాగేశ్వర రావు -
హాయ్ నాన్న బ్లాక్‌బస్టర్ హిట్.. మొత్తం కలెక్షన్స్ ఎంతంటే?
నేచురల్ స్టార్ నాని బాక్సాఫీస్ లెక్కల కన్నా ప్రేక్షకుల మనసులు గెలుచుకోవడమే ముఖ్యమని ఫీలవుతుంటాడు. అయితే తను ఎంచుకునే వైవిధ్యమైన కంటెంట్‌కు కొన్నిసార్లు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్లే వస్తుంటాయి. అది దసరా సినిమాతో నిరూపితమైంది. తాజాగా హాయ్ నాన్నతో మరో బ్లాక్‌బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడీ హీరో. డిసెంబర్ 7న రిలీజైన హాయ్ నాన్న నాని, మృణాల్ ఠాకూర్ జంటగా, బేబీ కియారా ఖన్నా కీలకపాత్రలో నటించిన చిత్రం ‘హాయ్ నాన్న’. శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. ఈ నెల 7న రిలీజైన ఈ చిత్రానికి పాజిటివ్ స్పందన లభించింది. ఫలితంగా మంచి కలెక్షన్లు రాబట్టింది. అయితే డిసెంబర్ 22న విడుదలైన సలార్ హాయ్ నాన్న మూవీకి గట్టి పోటీనిచ్చింది. ఇప్పటివరకు వచ్చిందెంతంటే? సోషల్ మీడియాలో అంత హడావుడి లేకపోయినా సైలెంట్‌గా బాగానే రాబట్టింది. తాజాగా ఈ సినిమా అధికారిక కలెక్షన్లను ప్రకటించింది చిత్రయూనిట్. హాయ్ నాన్న ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్లకు పైగా రాబట్టిందని తెలిపింది. ఇక ఈ మూవీ థియేటర్లలో ఆడుతుండగానే ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. నెట్‌ఫ్లిక్స్‌లో జనవరి 4 నుంచి అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. మరి థియేటర్లలో ఈ సినిమా చూడటం మిస్ అయినవారు ఓటీటీలో చూసి ఆనందించండి. Ending the year on a BLOCKBUSTER NOTE 💥🧨 Thank you all for embracing good cinema and giving us a warm hug 🤗#HiNanna magic has made a 75Crore+ Worldwide Gross ❤️🔥 and this is our victory 🤗#BlockbusterNanna Natural 🌟 @NameIsNani @Mrunal0801 @PriyadarshiPN @shouryuv… pic.twitter.com/Ywl7pFPAEz — Vyra Entertainments (@VyraEnts) December 31, 2023 చదవండి: తెలుగులో అదే చివరి సినిమా.. హీరోయిన్ నుంచి ప్రాధాన్యత లేని పాత్రల్లో.. -
యానిమల్ అందుకే 1000 కోట్లు అందుకోలేకపోయింది..
-
సెంచరీ కొట్టిన యానిమల్.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?
బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, రష్మికా మందన్నా, అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం యానిమల్. ఫస్ట్ లుక్ రిలీజైనప్పటి నుంచి ఈ సినిమాకు బోలెడంత హైప్ వచ్చింది. టీజర్, ట్రైలర్ రిలీజయ్యాక ఆ అంచనాలు ఆకాశాన్నంటాయి. రణ్‌బీర్ యాక్టింగ్ చూసి మెంటలొచ్చేసిందని సూపర్‌స్టార్ మహేశ్‌బాబే చెప్పడం విశేషం. తండ్రీకొడుకుల భావోద్వేగం చుట్టూ తిరిగే ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూడుగంటల ఇరవై నిమిషాల నిడివి ఉన్నప్పటికీ ఈ చిత్రానికి పాజిటివ్ స్పందన లభిస్తోంది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా దర్శకత్వం వహించిన సినిమా కావడంతో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. తాజాగా ఈ సినిమా తొలిరోజు ఎంత రాబట్టిందనే విషయాన్ని యానిమల్ మూవీ నిర్మాణ సంస్థ టీ సిరీస్ అధికారికంగా వెల్లడించింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.116 కోట్ల కలెక్షన్లు సాధించిందని పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ దూకుడు ఇలాగే కొనసాగితే యానిమల్ రూ.500 కోట్ల క్లబ్బులో చేరడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి యానిమల్ రానున్న రోజుల్లో ఎటువంటి రికార్డులు బద్ధలు కొడుతుందో చూడాలి! He has come to conquer all the records 🤙🏼🔥🪓#AnimalHuntBegins Book Your Tickets 🎟️ https://t.co/QvCXnEetUb#Animal#AnimalInCinemasNow #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23@imvangasandeep #BhushanKumar… pic.twitter.com/bF8nV2Nw09 — T-Series (@TSeries) December 2, 2023 చదవండి: అందుకే నా సినిమా కలెక్షన్స్ తగ్గుతున్నాయి: సల్మాన్ ఖాన్ -
కీడా కోల, మా ఊరి పొలిమేర 2.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
ఈ మధ్య కాలంలో కామెడీ సినిమాలు భలే క్లిక్ అవుతున్నాయి. ఇటీవల వచ్చిన మ్యాడ్ మూవీ జనాలను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించింది. శుక్రవారం (నవంబర్ 3న) రిలీజైన కీడా కోలా సినిమా కూడా అదే కోవలోకి వస్తుంది. ఈ కామెడీ మూవీని దర్శకనటుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించాడు. ఈ నగరానికి ఏమైంది సినిమా తర్వాత దాదాపు ఐదేండ్లు గ్యాప్ తీసుకుని ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. దర్శకుడిగానే కాకుండా కీడా కోలాలో ముఖ్యపాత్రలోనూ నటించాడు. ఈ చిత్రానికి తొలిరోజు భారీగా వసూళ్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా కీడాకోలా తొలి రోజు రూ. 6.03 కోట్లు రాబట్టింది. శని, ఆది వారాల్లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు నవంబర్ 3న సత్యం రాజేశ్ మా ఊరి పొలిమేర 2 సినిమా రిలీజైంది. 2021 డిసెంబర్లో ఓటీటీలో రిలీజైన పొలిమేర సినిమాకు ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది. తొలి భాగానికి దర్శకత్వం వహించిన డాక్టర్ అనిల్ విశ్వనాథ్యే ఈ సీక్వెల్ బాధ్యలు భుజాన వేసుకున్నాడు భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిచ్చిన ఈ మూవీ తొలి రోజు రూ.3 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కీడా కోల, మా ఊరి పొలిమేర 2 సినిమాలు వీకెండ్లో ఏ మేర కలెక్షన్స్ రాబడతాయో చూడాలి! A BLOCKBUSTER OPENING for the #BlockbusterKeedaaCola 🥁 6.03crs worldwide gross Day 1 Book your tickets now for #KeedaaColahttps://t.co/YynaYuDRr2@TharunBhasckerD @RanaDaggubati @VGSainma @IamChaitanyarao @smayurk @tweetfromRaghu @JeevanKumar459 @IamVishnuOi @RavindraVijay1 pic.twitter.com/ZmMDGxpdKu — Suresh Productions (@SureshProdns) November 4, 2023 Blockbuster Opening - Day 1 World Wide Gross 3 Cr + #Polimera2 💥🎊 pic.twitter.com/58wZCfzO5H — Hanu (@HanuNews) November 4, 2023 చదవండి: శోభ సేఫ్, తేజ ఎలిమినేట్.. చేసిన పాపం ఊరికే పోతుందా? -
భగవంత్ కేసరి కలెక్షన్స్.. మొదటి రోజు కంటే తక్కువే!
నందమూరి బాలకృష్ణ పండల మీద గురి పెట్టాడు. సంక్రాంతికి వీరసింహారెడ్డితో పలకరించిన ఈయన భగవంత్ కేసరితో దసరా బరిలోకి దిగాడు. కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అనిల్ రావిపూడి తొలిసారి ఆ జానర్‌ను వదిలేసి ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను తెరకెక్కించాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై హరీశ్ పెద్ది, సాహు గారపాటి నిర్మించారు. తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించిన ఈ మూవీ అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భగవంత్ కేసరి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.32.33 కోట్లు రాబట్టింది. తాజాగా రెండు రోజుల కలెక్షన్స్‌ను వెల్లడించింది చిత్రయూనిట్. రెండో రోజు ఈ చిత్రం దాదాపు రూ.19 కోట్ల మేర రాబట్టింది. అంటే రెండు రోజుల్లో రూ.51.12 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు తెలిపింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ విడుదల చేసింది. మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు వసూళ్లు కొంత నెమ్మదించినట్లు కనిపిస్తోంది. మరి వీకెండ్లో అయినా భగవంత్ కేసరి పుంజుకుంటుందేమో చూడాలి! మరోపక్క టైగర్ నాగేశ్వరరావు, లియో సినిమాలు భగవంత్ కేసరి సినిమాకు గట్టి కాంపిటీషనే ఇస్తున్నాయి. ఈ పోటీని తట్టుకుని బాలకృష్ణ మూవీ బాక్సాఫీస్ దగ్గర నిలబడుతుందా? కలెక్షన్లు పెంచుకుంటుందా? లేదా? చూడాలి! A #BlockbusterDawath at the Box office 🔥#BhagavanthKesari Grosses 51.12 CR WORLDWIDE IN 2 DAYS 💥💥 - https://t.co/rrWPhVwU6B In cinemas now❤️🔥#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman @harish_peddi @sahugarapati7 @JungleeMusicSTH pic.twitter.com/puSAke2was — Shine Screens (@Shine_Screens) October 21, 2023 చదవండి: సింగర్ గీతా మాధురితో విడాకులు.. క్లారిటీ ఇచ్చిన నందు! -
వండర్స్ క్రియేట్ చేస్తున్న జవాన్
-
జవాన్ కలెక్షన్స్ 800 కోట్లు సీక్వెల్స్ మాయలో పడ్డ ఖాన్స్
-
బాక్సాఫీస్ దగ్గర జవాన్ కలెక్షన్ల తుపాన్.. రెండో రోజు ఎన్ని కోట్లంటే?
జవాన్ సినిమాకు సినీప్రియులు జై కొడుతున్నారు. షారుక్ ఖాన్ యాక్టింగ్, యాక్షన్ ఇంకా కళ్లముందే కదలాడుతోందంటున్నారు. జవాన్ చిత్రాన్ని ఒక్కసారి చూస్తే తనివి తీరదని మరోసారి చూస్తే కానీ దిల్ ఖుష్ అయ్యేలా లేదని ఫీలవుతున్నారు. మొత్తానికి రికార్డులు సృష్టించాలన్నా నేనే, రికార్డులు తిరగరాయాలన్నా నేనే అన్నట్లుగా షారుక్ బాక్సాఫీస్ దగ్గర విజృంభిస్తున్నాడు. పఠాన్ మొదటి రోజు రూ.106 కోట్లు రాబడితే జవాన్ ఆ రికార్డును బ్రేక్ చేసింది. తొలిరోజు ఈ సినిమా రూ.126 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది. రెండో రోజు కూడా తగ్గేదేలే అన్న రీతిలో కలెక్షన్స్ రాబట్టింది. ఏకంగా రూ.113 కోట్ల మేర వసూలు చేసినట్లు తెలుస్తోంది. అంటే రెండు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్బులో చేరింది. ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి రూ.500 కోట్ల క్లబ్బులో చేరే ఛాన్స్ ఉందంటున్నారు సినీప్రియులు. మరోపక్క బాక్సాఫీస్ దగ్గర తిరుగు లేకుండా దూసుకుపోతున్న గదర్ 2 చిత్రానికి జవాన్ బ్రేక్ వేసింది. ఈ మూవీ నిన్నటివరకు రూ.510 కోట్లు రాబట్టింది. తాజాగా రిలీజైన జవాన్ గట్టి పోటీ ఇస్తుండటంతో గదర్ 2 కలెక్షన్స్‌కు భారీ స్థాయిలో గండి పడనున్నట్లు కనిపిస్తోంది. చదవండి: అర్ధరాత్రి శివాజీ, షకీలా డ్రామా.. పిచ్చోళ్లను చేస్తున్నారా? -
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి.. తొలిరోజు పేలవమైన కలెక్షన్స్
నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి తొలిసారి జంటగా నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. కామెడీ, ఎమోషన్స్ కలగలిపి తీసిన ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు తొలి రోజు కలెక్షన్స్ మాత్రం పేలవంగా వచ్చాయి. ఇండియాలో కేవలం రూ.4 కోట్లు మాత్రమే రాబట్టినట్లు తెలుస్తోంది. రిలీజ్‌కు ముందు పెద్దగా బజ్ లేకపోవడం, ప్రమోషన్స్‌కు అనుష్క దూరం కావడం వల్లే వసూళ్లు ఇంత పేలవంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే మౌత్ టాక్ బాగుండటంతో రానున్న రోజుల్లో కలెక్షన్స్ నెంబర్ పెరిగే అవకాశం ఉంది. మరోపక్క అదేరోజు రిలీజైన బాలీవుడ్ మూవీ జవాన్ బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్లో దూసుకుపోతోంది. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.125 కోట్ల మేర వసూళ్లు రాబట్టి రికార్డుల వేటకు సిద్ధమని సమరశంఖం పూరించింది. జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రాలు ఒకేరోజు రిలీజవడం నవీన్-అనుష్కల సినిమాకు పెద్ద మైనస్‌గా మారింది. జవాన్‌కు హిట్ టాక్ రావడంతో థియేటర్లు హౌస్‌ఫుల్ అవుతున్నాయి. మరి జవాన్ పోటీని తట్టుకుని మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి బాక్సాఫీస్ దగ్గర నిలదొక్కుకుంటుందా? లేదా? అన్నది చూడాలి! చదవండి: బేబి పెళ్లికొడుకు.. రియల్ లైఫ్‌లోనూ బేబి స్టోరీ.. మూడు బ్రేకప్‌లు.. సూసైడ్ ఆలోచనలు.. -
కింగ్ ఆఫ్ కొత్త.. దుల్కర్ సినిమాకు పేలవమైన కలెక్షన్స్
దుల్కర్ సల్మాన్.. ఎప్పుడూ కొత్త కాన్సెప్ట్‌లను ఎంచుకుంటూ కొత్తదనాన్ని ఎంకరేజ్ చేస్తుంటాడీ హీరో. సీతారామం సినిమాతో తెలుగువారికీ దగ్గరైన ఈ హీరో తొలిసారి పూర్తి మాస్ యాక్షన్ సినిమా చేశాడు. దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన చిత్రం ‘కింగ్ ఆఫ్ కొత్త’. అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించాయి. తెలుగు, మలయాళం, తమిళ్, హిందీలో ఈ నెల 24న ఈ సినిమా రిలీజైంది. అన్నట్లు అన్ని భాషల్లోనూ దుల్కర్ తనే స్వయంగా డబ్బింగ్ చెప్పాడు. గురువారం విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ఈ గ్యాంగ్‌స్టర్ సినిమా అంతగా వర్కవుట్ కానట్లు కనిపించింది. ఫలితంగా ఈ చిత్రం రూ.7.70 కోట్ల మేర కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.60 కోట్ల మేర బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ డే పది కోట్లు కూడా రాబట్టలేకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. రానున్న రోజుల్లోనూ కలెక్షన్స్ ఇలాగే ఉంటే డిజాస్టర్ దిశగా ప్రయాణించడం ఖాయం అని చెప్తున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కుల విషయానికి వస్తే.. ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఈ మూవీ డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాకు పెద్దగా పాజిటివ్ బజ్ లేదు, కలెక్షన్స్ కూడా డల్ ఉన్నందున వచ్చే నెలలో ఓటీటీలో ప్రత్యక్షం కానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే మొదట్లో ఈ సినిమా పేరును కింగ్ ఆఫ్ కోతగానే ఉంచారు. దుల్కర్ సైతం అలాగే పలికాడు. కానీ మలయాళంలో కొత్త అంటే టౌన్ అని అర్థం వస్తుండటంతో దాన్ని మార్చేసి కింగ్ ఆఫ్ కొత్తగా రిలీజ్ చేశారు. చదవండి: థియేటర్లో రిలీజైన వారం రోజులకే ఓటీటీలోకి.. మరో మూడు సినిమాలు స్ట్రీమింగ్.. ఎక్కడంటే? -
మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా.. 4 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
సయ్యద్ సోహైల్ రియాన్.. బిగ్‌బాస్ తర్వాతే ఈ పేరు చాలామందికి తెలిసొచ్చింది. అప్పటికే కొత్తబంగారు లోకం, జనతా గ్యారేజ్ వంటి చిత్రాల్లో హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో ఒకరిగా కనిపించిన అతడు వెండితెరపై హీరోగా రాణించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే యురేక, లక్కీ లక్ష్మణ్ సినిమా చేసిన సోహైల్ ఇటీవలే మిస్టర్ ప్రెగ్నెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో రూపా కొడువాయుర్ హీరోయిన్గా నటించింది. ఆగస్టు 18న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది. ఫలితంగా రోజురోజుకూ వసూళ్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కేవలం 4 రోజుల్లోనే రూ.4.6 కోట్లు రాబట్టింది. ఈ మేరకు చిత్రయూనిట్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది. సోహైల్ ఎట్టకేలకు మంచి హిట్ కొట్టడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో శ్రీనివాస్ వింజనంపాటి దర్శకుడిగా పరిచయమయ్యాడు. మైక్ మూవీస్ బ్యానర్లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించారు. నిజానికి మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాను శ్రీనివాస్ ఎవరైనా పెద్ద హీరోతో చేయాలనుకున్నాడు. ఎందుకంటే కొత్తవాళ్లతో చేస్తే సినిమాకు క్రేజ్ రాదని భావించాడు. అలా తన స్నేహితుడైన సోహైల్‌ను పక్కనపెట్టాడు. కానీ అతడు బిగ్‌బాస్ నుంచి రాగానే నువ్వే హీరో అని చెప్పి సోహైల్‌తో సినిమా తీసి హిట్ కొట్టాడు. ప్రస్తుతం సోహైల్.. బూట్ కట్ బాలరాజుతో పాటు, కథ వేరే ఉంటది అనే సినిమా చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Mic Movies (@mic_movies) View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) చదవండి: బర్త్‌డే పార్టీలో డ్యాన్స్ చేసేదాన్ని.. ఆ డబ్బుతో పూట గడిచేది.. -
జైలర్‌కు తెలుగులో ఈ రేంజ్ కలెక్షన్సా? అప్పుడే మూడు రెట్ల లాభాలు!
బాక్సాఫీస్ దగ్గర జైలర్ జోరు కొనసాగుతోంది. చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న రజనీకాంత్‌కు బ్లాక్‌బస్టర్ హిట్ పడింది. ఆగస్టు 10న తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజైన ఈ చిత్రం తమిళనాట మాత్రమే కాదు, తెలుగులోనూ భారీగా కలెక్షన్స్ రాబడుతోంది. కేవలం నాలుగురోజుల్లోనే ఇక్కడ రూ.32 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. నిజానికి రజనీకాంత్ గత సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో జైలర్ తెలుగు రైట్స్‌కు పెద్ద ధర పలకలేదు. తక్కువ బిజినెస్.. ఎక్కువ లాభాలు గతంలో కబాలి సినిమా రైట్స్ తెలుగు రాష్ట్రాల్లో రూ.31 కోట్లకు అమ్మారు. రోబో 2.0 సినిమాకు దాదాపు రూ.70 కోట్ల మేర బిజినెస్ జరిగింది. కానీ పేట, దర్బార్ మాత్రం పదిహేను కోట్లలోపే బిజినెస్ జరిగింది. ఈ క్రమంలో జైలర్ థియేట్రికల్ హక్కులను కేవలం రూ.12 కోట్లకు మాత్రమే ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ తలైవా సినిమాకు తొలి రోజే పెట్టిన పెట్టుబడి అంతా వచ్చేయగా ఈ నాలుగురోజుల్లో దాదాపు మూడు రెట్ల లాభాలు వచ్చాయి. రానున్న రోజుల్లోనూ కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉండటంతో నిర్మాతలకు మరింత లాభం చేకూరనుంది. రూ.300 కోట్ల క్లబ్బులో జైలర్ జైలర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.300 కోట్లు రాబట్టింది. రజనీకి ఈ రికార్డు కొత్తేం కాదు, గతంలో ఆయన నటించిన రోబో 2.0, కబాలి, ఎంతిరన్ సినిమాలు సైతం రూ.300 కోట్ల క్లబ్బులో చేరాయి. అయితే జైలర్ హవా ఇక్కడితో ఆగిపోయేట్లు కనిపించడం లేదు. లాంగ్ రన్లో రూ.500 కోట్లు సులువుగా సాధించేట్లు కనిపిస్తోంది. జైలర్ సినిమా విషయానికి వస్తే రజనీకాంత్, రమ్యకృష్ణ, శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, తమన్నా, ప్రియాంక మోహన్, జాకీ ష్రాఫ్, మీర్నా మీనన్, వసంత రవి ప్రధాన పాత్రలు పోషించారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. Super 🌟 @rajinikanth's Rampage Continues at the Telugu box office grossing 32CR in just 4⃣ Days Across AP/TS 🔥💥 Book Your Tickets Now 🎟 https://t.co/xMpl1jGcVT@Nelsondilpkumar @tamannaahspeaks @anirudhofficial @sunpictures @AsianCinemas_ @UrsVamsiShekar #JailerTelugu pic.twitter.com/hov3e6m2Ro — Suresh Productions (@SureshProdns) August 14, 2023 #Jailer crossed the ₹ 300 Crs gross Mark at the WW Box office in 4 days! This is the 4th movie for #SuperStar @rajinikanth to enter the 300cr Club.. #Enthiran#Kabali#2Point0#Jailer — Ramesh Bala (@rameshlaus) August 14, 2023 చదవండి: నేనలా అనలేదు, ఇమేజ్ దెబ్బ తీయొద్దు: కార్తికేయ -
జైలర్ రికార్డు స్థాయి వసూళ్లు, తొలిరోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
సక్సెస్ కోసం రజనీకాంత్.. రజనీ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. జైలర్ చిత్రంతో వీరి కల నిజమైంది. తలైవా స్టైల్, యాక్షన్, డైలాగ్ డెలివరీకి అభిమానులు ముచ్చటపడిపోతుంటే.. పాజిటివ్ టాక్ రావడంతో రజనీ పండగ చేసుకుంటున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 10న థియేటర్లలో విడుదలైంది. ఒక్క తమిళనాడులోనే ఈ చిత్రం రూ.24 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది. కేరళలో రూ.6 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో చెరో రూ.5 కోట్లు, కర్ణాటకలో రూ.10 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్లోనూ అదిరిపోయే కలెక్షన్స్ రాగా.. వీటన్నింటినీ కలుపుకుని మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.75-85 కోట్ల మేర సాధించినట్లు తెలుస్తోంది. వీకెండ్ కాకపోయినా ఇన్ని కోట్లు రాబట్టిందంటే మామూలు విషయం కాదంటున్నారు ఫ్యాన్స్. కొందరు హీరోలకు ఇవి లైఫ్‌టైమ్ వసూళ్లు అని కామెంట్లు చేస్తున్నారు. ఇక తొలి రోజు థియేటర్ల వద్ద రజనీ అభిమానులు సందడి చేశారు. ఈ క్రమంలో సినిమా బాలేదని నెగెటివ్ రివ్యూ ఇచ్చిన ఇద్దరినీ చెన్నైలో చితక్కొట్టారు. సోషల్ మీడియా ప్రచారం ఎలా ఉన్నా మౌత్ టాక్‌తో సినిమాకు లాభాల పంట పండటం ఖాయంగా కనిపిస్తోంది. జైలర్ సినిమా విషయానికి వస్తే.. ఇందులో మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్, యోగిబాబు, రమ్యకృష్ణ తమన్నా, సునీల్, జాకీ ష్రాఫ్ ముఖ్యపాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. ఇతడి సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచినట్లు తెలుస్తోంది. చదవండి: జేమ్స్‌బాండ్‌లా పోజు కొడుతున్న ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా? -
ప్రపంచంలోనే ఎక్కువ లాభాలు తెచ్చిన సినిమా ఇదే! చెక్కుచెదరని రికార్డు!
అతివృష్టి, అనావృష్టి.. వర్షం విషయంలోనే కాదు బాక్సాఫీస్ విషయంలోనూ ఇది జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి భారీ బడ్జెట్ సినిమాలు కనీస వసూళ్లు కూడా రాబట్టలేక చతికిలపడుతుంటే చిన్న చిత్రాలు మాత్రం ఊహించని స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేస్తుంటాయి. మొదటి సందర్భంలో నిర్మాత పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోతే రెండో సందర్భంలో మాత్రం నిర్మాత పంట పండినట్లే! మరి ప్రపంచంలోనే అత్యధికంగా లాభాలు తెచ్చిపెట్టిన సినిమా ఏదో మీకు తెలుసా? లక్షలు పెట్టి తీస్తే వేల కోట్లు కొల్లగొట్టిన ఆ సినిమా ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే! కశ్మీర్ ఫైల్స్.. పెట్టుబడి రూ.15 కోట్లు వసూళ్లు.. కలెక్షన్స్ రూ.350 కోట్లు. వావ్, గ్రేట్ అని నోరెళ్లబెడుతున్నారేమో.. 'పారానార్మల్ యాక్టివిటీ' సినిమా సంగతి చెప్తే దిమ్మ తిరిగి బొమ్మ కనబడటం ఖాయం! ఈ హాలీవుడ్ సినిమా ఏకంగా 13,30,000 శాతం లాభాలను అందుకుంది. ఈ సినిమాను 2007లో హాలీవుడ్ డైరెక్టర్ ఓరెన్ పెలి తెరకెక్కించాడు. తనే కథ రాసుకుని, దర్శకత్వం వహించి స్వయంగా నిర్మించాడు. ఈ సినిమాలో నలుగురు మనుషులు, ఒక అస్థిపంజరం ఇవి మాత్రమే కనిపిస్తాయి. ఈ సినిమా తీయడానికి ఆయనకు 15 వేల డాలర్లు (2007లో భారతీయ కరెన్సీ ప్రకారం రూ.6 లక్షలు) ఖర్చయ్యాయి. అయితే పారామౌంట్ పిక్చర్స్ బ్యానర్ ఈ సినిమాను సొంతం చేసుకుని క్లైమాక్స్‌లో కాస్త మార్పులుచేర్పులు చేసి దానికి మరిన్ని హంగులు అద్ది రిలీజ్ చేసింది. దీనికి దాదాపు రూ.90 లక్షలు ఖర్చయ్యాయి. ఈ సినిమా ఎవరూ ఊహించనంతగా హిట్టయింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 193 మిలియన్ డాలర్లు (2007లో భారతీయ కరెన్సీ ప్రకారం రూ.800 కోట్లు) రాబట్టింది. ప్రపంచంలోనే తక్కువ బడ్జెట్లో ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. అప్పటివరకు లాభాల పంట పండించిన చిత్రంగా 'ద బ్లైయిర్ విచ్ ప్రాజెక్ట్' పేరిట ఉన్న రికార్డును పారానార్మల్ యాక్టివిటీ మూవీ తన స్వాధీనం చేసుకుంది. ఈ ఊపుతో 'పారానార్మల్ యాక్టివిటీ' సినిమాకు సీక్వెల్స్ కూడా తీశారు. వరుసగా ఆరు సీక్వెల్స్ తీయగా ఇవి మొత్తంగా రూ.7320 కోట్లు రాబట్టాయి. ఇలా తక్కువ బడ్జెట్‌తో ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన సినిమాల్లో ద బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్ రెండో స్థానంలో ఉంటుంది. 1999లో వచ్చిన 'ద బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్' రూ.85 లక్షలతో తెరకెక్కగా రూ.1045 కోట్లు రాబట్టింది. 2003లో వచ్చిన టార్నేషన్ కేవలం రూ10,000తో తెరకెక్కగా రూ.5.5 కోట్లు సాధించింది. రెండు లక్షలతో తెరకెక్కిన పోర్నోగ్రఫీ చిత్రం 'డీప్ త్రోట్' రూ.17 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. రూ.87వేలతో నిర్మితమైన 'ఎరేజర్ హెడ్' సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.6 కోట్లు కలెక్షన్ల వర్షం కురిపించింది. చదవండి: బ్రో సహా మరో బాలీవుడ్ సినిమాకు ఆదరణ కరువు, రిటైర్మెంట్ తీసుకోమన్న కంగనా పెళ్లైన 6 ఏళ్లకే విడాకులు.. విడిపోవడం కష్టంగా ఉందని నటి పోస్ట్ -
కొత్త రికార్డ్ క్రియేట్ చేసిన బేబీ.. బాక్సాఫీస్ బద్దలు
-
బాక్సాఫీస్ వద్ద ఆదిపురుష్ ప్రభంజనం.. కలెక్షన్స్ ఎంతంటే?
ఆదిపురుష్ సినిమాను పొగిడేవాళ్లు పొగుడుతున్నారు, తిట్టేవాళ్లు తిడుతున్నారు. ఏదేమైనా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అనుకున్నంత పాజిటివ్ స్పందనను మాత్రం రాబట్టలేకపోయింది. పైపెచ్చు వివాదాలు, విమర్శలు సినిమాను చుట్టుముట్టాయి. అయినప్పటికీ ఈ అడ్డంకులను అధిగమించి ఆదిపురుష్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తోంది. మొదటి రోజు రూ.140 కోట్ల గ్రాస్ వసూలు చేయగా రెండో రోజు రూ.100 కోట్లు రాబట్టింది. ముచ్చటగా మూడో రోజు కూడా సెంచరీ కొట్టిందీ చిత్రం. దీంతో ఇప్పటివరకు సినిమా కలెక్షన్స్ రూ.340 కోట్లకు చేరాయి. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. శని, ఆది వారాలు కలిసి వచ్చాయి కాబట్టి సినిమా ఈ రేంజ్లో వసూళ్లు రాబట్టింది. సోమవారం నుంచి సినిమాకు అసలు సిసలు పరీక్ష మొదలు కానుంది. ఈరోజు నుంచి వచ్చే కలెక్షన్సే సినిమా ఫలితాన్ని నిర్దేశించనున్నాయి. మరి వీక్ డేస్‌లో ఆదిపురుష్ ఏ మేర వసూళ్లు రాబడుతుందో చూడాలి! ఇకపోతే ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్, కృతీ సనన్, సన్నీ సింగ్, సైఫ్ అలీ ఖాన్, దేవదత్తా నాగే.. తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఓం రౌత్ దర్శకత్వం వహించారు. దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం జూన్ 16న విడుదలైంది. Adipurush continues to captivate audiences across generations, crossing an astounding ₹340 crores on the opening weekend at the box office! Jai Shri Ram 🙏#AdipurushBlockbusterWeekend Book your tickets on: https://t.co/0gHImE23yj#Adipurush now in cinemas near you ✨… pic.twitter.com/vwIubHPGbK — T-Series (@TSeries) June 19, 2023 చదవండి: రాకేశ్ మాస్టర్ భౌతిక కాయాన్ని చూసి ఏడ్చేసిన శేఖర్, జానీ మాస్టర్ -
రూ.200 కోట్ల క్లబ్లో ది కేరళ స్టోరీ! చావు దెబ్బ కొట్టిందన్న ఆర్జీవీ
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలు కనీస వసూళ్లు రాబట్టడానికి అపసోపాలు పడుతుంటే చిన్న సినిమాలు మాత్రం కేవలం మౌత్ టాక్‌తోనే భారీగా కలెక్షన్స్ రాబడుతూ రికార్డులు సృష్టిస్తున్నాయి. చిన్న సినిమాల పని అయిపోయిందనుకున్న సమయంలో బలమున్న కంటెంట్‌తో బరిలోకి దిగి బడా సినిమాలను సైతం వెనక్కు నెట్టి విజయాలు సాధిస్తున్నాయి. ఆ కోవలేకే వస్తుంది ది కేరళ స్టోరీ. తీవ్ర వ్యతిరేకత మధ్య విడుదలైన ది కేరళ స్టోరీ మూవీ తొలి రోజు నుంచే దూసుకుపోతోంది. రికార్డుల దుమ్ము దులుపుతున్న ఈ సినిమా ఇప్పటిదాకా రూ.198 కోట్లు వసూలు చేసింది. నేడు వచ్చే కలెక్షన్స్‌తో రూ.200 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ లెక్కన బాలీవుడ్లో ఇటీవల వచ్చిన రణ్‌బీర్ తు ఝూఠీ మై మక్కర్ సినిమా లాంగ్ రన్లో రెండు వందల కోట్లు సాధిస్తే కేరళ స్టోరీ మాత్రం కేవలం రెండున్నర వారాల్లోనే ఆ మార్క్‌ను దాటేస్తుండటం విశేషం. ఇక ఈ సినిమాపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ప్రశంసలు కురిపించాడు. 'మనకు అబద్ధాలు అలవాటైపోయాయి. అలాంటిది ఎవరైనా నిజం చెప్తున్నారంటే, ఆ నిజాన్ని వెలికి తీసి చూపిస్తుంటే షాకవుతాం. కేరళ స్టోరీ విజయం బాలీవుడ్‌ను చావుదెబ్బ కొట్టింది' అని ట్వీట్ చేశాడు. కాగా ది కేరళ స్టోరీ సినిమాలో హీరోయిన్ అదా శర్మ ప్రధాన పాత్రలో నటించింది. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించగా విపుల్ షా నిర్మాతగా వ్యవహరించాడు. We are so comfortable in telling lies to both others and ourselves that when someone goes ahead and shows the truth we get SHOCKED..That explains the DEATH like SILENCE of BOLLYWOOD on the SHATTERING SUCCESS of #KeralaStory — Ram Gopal Varma (@RGVzoomin) May 21, 2023 The #KeralaStory is like a BEAUTIFUL GHOSTLY MIRROR showing the DEAD face of Main stream BOLLYWOOD to itself in all its UGLINESS — Ram Gopal Varma (@RGVzoomin) May 21, 2023 The #KeralaStory will haunt like a mysterious fog in every story discussion room and every corporate house in BOLLYWOOD forever — Ram Gopal Varma (@RGVzoomin) May 21, 2023 It’s difficult to learn from #KeralaStory because it’s EASY to copy a LIE but very DIFFICULT to copy TRUTH — Ram Gopal Varma (@RGVzoomin) May 21, 2023 DOUBLE CENTURY… #TheKeralaStory will hit ₹ 200 cr TODAY [Mon; Day 18]… The second #Hindi film to cross the coveted number in 2023, after #Pathaan [Jan 2023]… [Week 3] Fri 6.60 cr, Sat 9.15 cr, Sun 11.50 cr. Total: ₹ 198.97 cr. #India biz. Nett BOC. #Boxoffice pic.twitter.com/PIdIwl4c8J — taran adarsh (@taran_adarsh) May 22, 2023 చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజయ్యే సినిమాలివే! గ్రాండ్‌గా నిర్మాత డీవీవీ దానయ్య తనయుడి వివాహం -
కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ది కేరళ స్టోరీ, రెండో రోజు ఎంత వచ్చిందంటే?
ది కేరళ స్టోరీ.. ట్రైలర్ రిలీజైనప్పటి నుంచి ఈ సినిమాపై వివాదం చెలరేగింది. బలవంత మతమార్పిడికి గురై ఐసిస్‌లో చేరిన మహిళల కథే కేరళ స్టోరీ. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అదా శర్మ ప్రధాన పాత్రలో నటించింది. విపుల్ షా నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా మే 5న విడుదలైంది. ఒక వర్గాన్ని కించపరిచేలా ఉన్న ఈ సినిమాను నిషేధించాలంటూ కేరళ, తమిళనాడుల్లోకి కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు సైతం జరిగాయి. ఈ వివాదాల మధ్య కేరళ స్టోరీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజు రూ.8.03 కోట్లు రాబట్టిన ఈ సినిమా రెండో రోజుకు అంతకుమించిన వసూళ్లు రాబట్టింది. శనివారం ఒక్కరోజే రూ.11.22 కోట్లు వసూలు చేసింది. మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు 39.73% వృద్ధి కనబర్చింది. కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా రూ.19.25 కోట్లు వసూలు చేసింది. ఆదివారం కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బల్రానీ ముఖ్య పాత్రలు పోషించారు. చాలామంది ఈ సినిమాను వ్యతిరేకిస్తుంటే మధ్యప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ది కేరళ స్టోరీ సినిమాకు ట్యాక్స్ రద్దు చేయడం విశేషం. #TheKeralaStory is SENSATIONAL, sets the #BO on 🔥🔥🔥 on Day 2… Shows BIGGG GAINS across all circuits… Hits double digits, a REMARKABLE ACHIEVEMENT for a film that’s *not* riding on stardom, but word of mouth… Fri 8.03 cr, Sat 11.22 cr. Total: ₹ 19.25 cr. #India biz.… pic.twitter.com/3FDHvSApjt — taran adarsh (@taran_adarsh) May 7, 2023 చదవండి: బలవంతంగా బంధాల్లో ఉండేకంటే ఒంటరిగా ఉండటమే బెటర్: సదా -
ఊహించని కలెక్షన్స్ తో దుమ్మురేపుతున్న సర్ మూవీ
-
‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ రావడానికి అదే కారణం..: రామ్‌చరణ్
లాస్ ఏంజిల్స్‌లో ఇటీవల జరిగిన 95వ ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో సంగీతదర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డులను అందుకున్న విషయం తెలిసిందే. ఈ అవార్డు వేడుక కోసం లాస్ ఏంజిల్స్ వెళ్లిన దర్శకుడు రాజమౌళి, ఆయన సతీమణి, కాస్ట్యూమ్ డిజైనర్ రమా రాజమౌళి, తనయుడు కార్తికేయ, సంగీతదర్శకుడు కీరవాణి, గాయకుడు కాలభైరవ, నటుడు శ్రీ సింహా తదితరులు శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. కాగా ఆస్కార్ అవార్డు సాధించడం గురించి రాజమౌళిని స్పందించమని విలేకర్లు అడగ్గా.. ఆయన ‘జైహింద్’ అన్నారు. ఇక ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు లాస్ ఏంజిల్స్ నుంచి శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు రామ్‌చరణ్. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడం గురించి స్పందిస్తూ– ‘‘భారతీయ అభిమానులందరూ ‘ఆర్ఆర్ఆర్’ను ఆదరించారు. ‘నాటు నాటు’ పాటను సూపర్ హిట్ చేశారు. ‘నాటు నాటు’ పాట మాది కాదు.. ప్రజల పాట. ప్రేక్షకుల అభిమానమే ఆస్కార్‌కి దారి వేసింది, అవార్డు వరించేలా చేసింది. వారితో పాటు కీరవాణి, చంద్రబోస్, రాజమౌళిగార్లకి కూడా థ్యాంక్స్ చెబుతున్నాను’’ అని పేర్కొన్నారు రామ్‌చరణ్. తప్పుగా అర్థం చేసుకున్నారు: కాలభైరవ ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ పాటను పాడినందుకు ఆనందంగా ఉందంటూ ఓ నోట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు కాలభైరవ. ‘‘ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ పాటను ప్రదర్శించినందుకు గర్వపడుతున్నాను. నాకు ఈ విలువైన క్షణాలు దక్కడానికి రాజమౌళి బాబా, నాన్న (కీరవాణి), కొరియోగ్రాఫర్ ప్రేమ్‌రక్షిత్ మాస్టర్, కార్తికేయ అన్న, అమ్మ, పెద్దమ్మ... ఇలా మరికొందరు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారణమయ్యారు. యూఎస్ టీమ్ కూడా హెల్ప్ చేసింది. వీరి సహకారం, ప్రోత్సాహం లేకపోతే ఆస్కార్ వేదికపై నా ప్రదర్శన వీలయ్యేది కాదు’’ అని ఆ నోట్లో చెప్పు కొచ్చారు కాలభైరవ. కాగా ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల పేర్లను కాలభైరవ ప్రస్తావించకపోవడంతో ఈ ఇద్దరి హీరోల అభిమానులు, కొందరు నెటిజన్లు తప్పుబడుతూ కామెంట్స్ చేశారు. దీంతో ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా కాలభైరవ స్పందించారు. ‘‘ఆర్ఆర్ఆర్’ సినిమా, ఇందులోని ‘నాటు నాటు’ పాట సక్సెస్‌కు తారక్ అన్న, చరణ్ అన్న ముఖ్యులు. అందులో సందేహం లేదు. అయితే నేను ఆస్కార్ వేదికపై నా ప్రదర్శనకు సంబంధించిన విషయం గురించి మాత్రమే ఆ నోట్లో ప్రస్తావించాను. అది తప్పుగా అర్థమైనట్లుంది. అయినప్పటికీ నా మాటలను క్షమించమని అడుగుతున్నాను’’ అని కాలభైరవ పేర్కొన్నారు. ఆస్కార్ వేదికపై షాక్ అయ్యా: గునీత్ మోంగా ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’కు డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ విభాగంలో ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ డాక్యుమెంటరీ నిర్మాత గునీత్ మోంగా శుక్రవారం ముంబై చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. మామూలుగా ఆస్కార్ అవార్డు అందుకున్నవారు తమ యాక్సెప్టెన్సీ స్పీచ్‌ను 45 సెకన్లలో పూర్తి చేయాలి. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ దర్శకురాలు కార్తీకి అన్ని సెకన్లలోనే పూర్తి చేశారు. కానీ నిర్మాత గునీత్ మోంగా కాస్త ఎక్కువ టైమ్ తీసుకుని మాట్లాడుతుండగా స్పీచ్ ఆపాలన్నట్లుగా వెనకనుంచి మ్యూజిక్ ప్లే చేశారు ఆస్కార్ నిర్వాహకులు. అలాగని నిర్వాహకులు ఈ 45 సెకన్ల నియమంలో కఠినంగా ఏమీ లేరు. బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ అవార్డు గెల్చుకున్న చార్లీ మాక్సే, మ్యాథ్యూ ఫ్రౌండ్లు 45 సెకన్ల కన్నా ఎక్కువగా మాట్లాడినా, నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఈ విషయంపై గునీత్ మోంగా స్పందించారు. ‘‘ఇండియాకు తొలి ఆస్కార్ అవార్డును సాధించామనే గొప్ప విషయం గురించి చాలా మాట్లాడాలనుకున్నాను. కానీ నా స్పీచ్‌ను కట్ చేశారు. షాక్ అయ్యాను. ఇండియా తరఫున నేను మాట్లాడే అవకాశాన్ని నా నుంచి ఎవరో లాగేసుకున్నట్లుగా అనిపించింది. నేను మళ్లీ ఆస్కార్‌కు వెళతాను. అప్పుడు తప్పకుండా నా గొంతు మళ్లీ వినిపిస్తాను’’ అని పేర్కొన్నారు గునీత్. అత్యధిక కలెక్షన్ల జాబితాలో ఆర్ఆర్ఆర్ మూడో స్థానం.. భారతీయ చిత్రాల్లో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించిన జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ మూడోస్థానంలో నిలిచింది. ఇదివరకు ఈ స్థానంలో ‘కేజీఎఫ్: చాఫ్టర్ 2’ ఉండేది. తొలుత అత్యధిక గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించిన ఇండియన్ చిత్రాల జాబితాలో వరుసగా ‘దంగల్’ (దాదాపు రూ. 1900 కోట్లు), ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’(రూ. 1800 కోట్లు), ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ (రూ. 1230 కోట్లు), ‘ఆర్ఆర్ఆర్’ (దాదాపు రూ. 1150 కోట్లు), ‘పఠాన్’ (రూ. 1050 కోట్లు.. ఇంకా ప్రదర్శిత మవుతోంది) ఉన్నాయి. అయితే గత ఏడాది అక్టోబరులో జపాన్‌లో విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటికీ ప్రదర్శితమవుతోంది. జపాన్ బాక్సాఫీస్ వద్ద ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటివరకు రూ. 80 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. అలాగే ‘ఆస్కార్’ ప్రచారంలో భాగంగా అమెరికాలో ఈ నెల 3న, తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 10న ‘ఆర్ఆర్ఆర్’ను రీ రిలీజ్ చేశారు. దీంతో మరికొన్ని కలెక్షన్స్ వచ్చాయి. ఈ వసూళ్లు మొత్తాన్ని కలిపితే ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ గ్రాస్ కలెక్షన్స్‌ను ‘ఆర్ఆర్ఆర్’ దాటిందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. -
చిన్న సినిమా పెద్ద హిట్.. బలగం కలెక్షన్స్ ఎంతంటే?
ఈ మధ్య సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నాయి. లవ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు ఎక్కువైన తరుణంలో ఫ్యామిలీ ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేస్తూ థియేటర్లో అడుపెట్టింది బలగం. మాయమైపోతున్న కుటుంబ బంధాలను, ఆప్యాయతలను, ఎమోషన్స్‌ను కళ్లకు కట్టినట్లు చూపించి చివర్లో కళ్లు తుడుచుకునేలా చేసింది. మార్చి 3న విడుదలైన ఈ సినిమాకు ప్రమోషన్స్ కన్నా పబ్లిక్ టాకే ఆయుధంగా పని చేసింది. ఫలితంగా రోజురోజుకూ వసూళ్లు పెరుగుతూ వస్తున్నాయి. చాలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం వారం రోజుల్లోనే లాభాల పట్టింది. మొదటి రోజు రూ.55 లక్షలు, రెండో రోజు రూ.80 లక్షలు రాబట్టగా మూడో రోజు వచ్చేసరికి ఏకంగా రూ.1.75 కోట్లు వసూలు చేసింది. ఇప్పటివరకు మొత్తంగా ఏడు కోట్ల మేర గ్రాస్ (రూ. 3.07 కోట్ల షేర్) రాబట్టినట్లు తెలుస్తోంది. కాగా మల్లేశం సినిమాతోనే తన సత్తా ఏంటో నిరూపించుకున్న ప్రియదర్శి బలగంలో తెలంగాణ యువకుడిగా నటించాడు. ప్రియదర్శి తాత పాత్రలో సుధాకర్ రెడ్డి జీవించాడు. జబర్దస్త్ వేణు ఈ మూవీతో దర్శకుడిగా పరిచయమవగా దిల్ రాజు నిర్మించాడు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. The love for #Balagam is getting stronger with each passing day♥️💪 Thank you for your overwhelming appreciation and support! In Cinemas Now@offlvenu @priyadarshi_i @kavyakalyanram @dopvenu #Bheemsceciroleo @LyricsShyam@DilRajuProdctns pic.twitter.com/4bnNPfe4ze — Dil Raju Productions (@DilRajuProdctns) March 8, 2023 -
దుమ్మురేపిన సార్.. సెంచరీ కొట్టేశాడుగా!
హీరో ధనుష్‌కు కోలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన సినిమాలన్నీ తెలుగులోనూ డబ్ చేసి వదలగా ఎన్నో సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఈ క్రమంలో ఇక్కడి ప్రేక్షకుల కోసం ధనుష్ డైరెక్ట్ తెలుగు సినిమా చేశాడు. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రమే సార్. ఈ మూవీ తమిళంలో వాత్తి పేరిట రిలీజైంది. విద్య కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లి పెద్ద వ్యాపారంగా ఎలా మారింది? అది పేద విద్యార్థులకు ఎలా భారమవుతోంది? దాన్ని మార్చడానికి యువ ఉపాధ్యాయుడు ఎలా పోరాడాడన్నదే సినిమా. తెలుగు, తమిళ భాషల్లో ఫిబ్రవరి 17న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు రాబట్టింది. కేవలం 15 రోజుల్లోనే సార్ సెంచరీ కొట్టిన విషయాన్ని సితార ఎంటర్టైన్మెంట్ స్పెషల్ పోస్టర్ ద్వారా వెల్లడించింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా ఇటీవల ధనుష్.. ఈ సినిమాలోని మాస్టారు మాస్టారు పాటను తనే స్వయంగా ఆలపించిన విషయం తెలిసిందే! తెలుగు, తమిళ రెండు భాషల్లోనూ ఆయన పాడగా అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాను ఓ ఊపు ఊపాయి. ధనుష్ నటనలోనే కాకుండా గొంతులోనూ తెలియని మ్యాజిక్ ఉందంటూ కామెంట్లు వెల్లువెత్తాయి. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించాడు. Love for #Vaathi / #SIRMovie is UNSTOPPABLE ❤️ The film has crossed a massive 1️⃣0️⃣0️⃣ crores gross worldwide 🌎 Thank you all for the phenomenal support 😇@dhanushkraja #VenkyAtluri @iamsamyuktha_ @gvprakash @dopyuvraj @NavinNooli @vamsi84 @SitharaEnts @7screenstudio pic.twitter.com/GOKevvLQo4 — Sithara Entertainments (@SitharaEnts) March 4, 2023 -
దూసుకుపోతున్న సార్.. ఇప్పటిదాకా ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కోలీవుడ్ స్టార్ ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన ద్విభాషా చిత్రం వాత్తీ. తెలుగులో సార్ పేరుతో రిలీజైంది. కేరళ కుట్టి సంయుక్త హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదలవగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకుడిగా వ్యవహరించారు. ఈ మూవీ కలెక్షన్ల విషయానికి వస్తే ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్లు రాబట్టింది. ఈ విషయాన్ని సితార ఎంటర్టైన్మెంట్ ..తొమ్మిది రోజుల్లోనే రూ.75 కోట్ల మార్క్ దాటిందంటూ స్పెషల్ పోస్టర్ ద్వారా తెలియజేసింది. ఇది చూసిన ఫ్యాన్స్.. సార్ త్వరలోనే వంద కోట్ల క్లబ్బులో చేరడం ఖాయమని కామెంట్లు చేస్తున్నారు. Our beloved #Vaathi / #Sir has garnered unconditional love ❤️ & 75+ crores gross worldwide 💸 Blockbuster Classes All Over! 🌎@dhanushkraja #VenkyAtluri @iamsamyuktha_ @iSumanth @gvprakash @dopyuvraj @NavinNooli @vamsi84 #SaiSoujanya @SitharaEnts @7screenstudio @adityamusic pic.twitter.com/shZXZXBTiP— Sithara Entertainments (@SitharaEnts) February 25, 2023 చదవండి: జోర్దార్గా రాకింగ్ రాకేశ్, సుజాతల హల్ది ఫోటోలు వైరల్ -
వినరో భాగ్యము విష్ణు కథ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, కశ్మీర పరదేశి జంటగా నటించిన చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ. నర్తనశాల తర్వాత కశ్మీర చేస్తున్న రెండవ సినిమా ఇది. తిరుపతి నేపథ్యంగా సాగే ఈ చిత్రంతో మురళీ కిషోర్ అబ్బురు దర్శకుడిగా పరిచయమయ్యారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 18న థియేటర్లలోకి వచ్చిందీ చిత్రం. ఈ సినిమా మొదటిరోజే రూ.2.75 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ స్పెషల్ పోస్టర్‌తో వెల్లడించింది. సినిమాకు పాజిటివ్ స్పందన లభిస్తోందని, సినిమా కమర్షియల్ హిట్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తోంది చిత్రయూనిట్. ఇక ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. #VinaroBhagyamuVishnuKatha grosses over 𝟐.𝟕𝟓 𝐂𝐑 worldwide on DAY 1 🔥 Thank you all for the blockbuster response 🫶🏻❤️#VBVK in cinemas near you! 🤩 🎫 - https://t.co/CO9hpOhbzQ #AlluAravind #BunnyVas @Kiran_Abbavaram @kashmira_9 @KishoreAbburu @chaitanmusic @GA2Official pic.twitter.com/0ohLFkmhsp — GA2 Pictures (@GA2Official) February 19, 2023 Team #VBVK visited Nexus Mall, Kukatpally last night! 🤩 Love from the audience keeps pouring in for #VinaroBhagyamuVishnuKatha ❤️#VBVK in cinemas now! 🤩 🎫 - https://t.co/CO9hpOhbzQ #BunnyVas @Kiran_Abbavaram @kashmira_9 @KishoreAbburu @chaitanmusic @GA2Official pic.twitter.com/LQ3mA7koFz — GA2 Pictures (@GA2Official) February 19, 2023 చదవండి: మాట తప్పని కౌశల్.. తండ్రికి ఊహించని సర్ప్రైజ్ -
దంగల్ను దాటేసిన పఠాన్.. నెం.1 మూవీగా రికార్డు
బాలీవుడ్ పని అయిపోయింది.. హిందీ స్టార్ హీరోలు ఇక రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే! వాళ్ల సినిమాలకు కలెక్షన్లు రావడం ఇక కలే.. ఈ మాటలన్నింటికి పఠాన్‌తో సమాధానం చెప్పాడు షారుక్ ఖాన్. వందల కోట్లు కొల్లగొడుతూ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ బాలీవుడ్ బాయ్‌కాట్ గ్యాంగ్ నోరు మూయించాడు. తాజాగా మరో రికార్డు బద్ధలు కొట్టాడు షారుక్. ఇప్పటికే పీకే, టైగర్ జిందా హై సినిమాలను దాటేసిన పఠాన్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన హిందీ సినిమా దంగల్ను సైతం అధిగమించింది. రూ.729 కోట్లతో వరల్డ్‌వైడ్ భారీ వసూళ్లు రాబట్టిన హిందీ చిత్రంగా ప్రథమ స్థానంలో నిలిచింది. నిజానికి దంగల్ ప్రపంచవ్యాప్తంగా రూ.2000 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. కానీ ఇందులో అధిక వాటా చైనాదే! అక్కడ హిందీలో కాకుండా మాండరిన్ భాషలో రిలీజ్ చేయగా రూ.1200 కోట్ల పైనే రాబట్టింది. ఇక పఠాన్ విషయానికి వస్తే.. షారుక్ నాలుగేళ్ల తర్వాత నటించిన చిత్రమిది. ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమాకు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా సల్మాన్ అతిథి పాత్రలో మెరిశాడు. Action aur entertainment ka 💥 combo #Pathaan is getting love across the world!Book your tickets now! https://t.co/SD17p6x9HI | https://t.co/VkhFng6vBj Celebrate #Pathaan with #YRF50 only at a big screen near you, in Hindi, Tamil and Telugu. pic.twitter.com/5VPnM9mHTY — Yash Raj Films (@yrf) February 4, 2023 చదవండి: వాణి జయరామ్ పోస్ట్‌మార్టమ్ పూర్తి -
వసూళ్ల ఊచకోత.. మరో రికార్డు బద్ధలు కొట్టిన పఠాన్
బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా కలెక్షన్స్ సాధిస్తోంది పఠాన్. రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తూ బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తోంది. కోట్లకు కోట్లు కొల్లగొడుతూ బాయ్‌కాట్ బాలీవుడ్ అన్నవారి నోళ్లు మూయించింది. షారుక్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన ఈ చిత్రం రూ.417 కోట్ల గ్రాస్(రూ.348.50 కోట్ల నెట్) రాబట్టింది. ఓవర్సీస్లో రూ.250 కోట్లు వసూలు చేసింది. అంటే ప్రపంచవ్యాప్తంగా పఠాన్ రూ.667 కోట్ల మేర కలెక్షన్స్ సాధించింది. కాగా బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన మొదటి చిత్రంగా దంగల్(రూ.374.53 కోట్లు), రెండో స్థానంలో టైగర్ జిందా హై(రూ.339 కోట్లు), మూడో స్థానంలో పీకే (రూ.337.72 కోట్లు) ఉండేది. కానీ తాజాగా పఠాన్ రూ.348 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టడంతో పీకే, టైగర్ జిందా హై సినిమాలను దాటేసి రెండో స్థానానికి చేరుకుంది. పఠాన్ దూకుడు చూస్తుంటే అతి త్వరలో దంగల్ను దాటేసి అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ చిత్రంగా రికార్డు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. #Pathaan ki party continues 🎉🎉🎉 Book your tickets now! https://t.co/SD17p6x9HI | https://t.co/VkhFng6vBj Celebrate #Pathaan with #YRF50 only at a big screen near you, in Hindi, Tamil and Telugu. pic.twitter.com/kc1FjITfRy — Yash Raj Films (@yrf) February 2, 2023 చదవండి: నాతో స్టార్ హీరో సీక్రెట్ అఫైర్.. నటి పెళ్లికి ఆ డ్రెస్‌లో వేస్తావా? వేరే దొరకలేదా?: కీర్తి సురేశ్‌పై ట్రోలింగ్ -
పఠాన్‌ను ఎవరూ ఆపలేరు.. ఎన్ని వందల కోట్లు వచ్చాయంటే?
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు. ఆకలితో ఉన్న పులి పంజా విసిరినట్లుగా నాలుగేళ్లు వెండితెరకు దూరంగా ఉన్న ఆయన బాక్సాఫీస్ మీద యుద్ధమే చేస్తున్నాడు. కోట్లకు కోట్లు కొల్లగొడుతూ బాయ్‌కాట్ గ్యాంగ్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. తాజాగా పఠాన్ మూవీ రూ.500 కోట్ల మార్క్‌ను చేరుకుంది. ఇండియాలో రూ.335 కోట్లు రాబట్టగా ఓవర్సీస్లో రూ.207 కోట్లు కొల్లగొట్టింది. మొత్తంగా పఠాన్ ఐదు రోజుల్లోనే రూ.542 కోట్లు వసూలు చేయడంతో షారుక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. చూస్తుంటే పఠాన్ త్వరలోనే రూ.700 కోట్ల క్లబ్బులో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా ఈ సినిమాలో షారుక్ సరసన హీరోయిన్ దీపికా పదుకొణె నటించింది. సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాను ఎవరూ చూడొద్దంటూ సోషల్ మీడియాలో బాయ్‌కాట్ గ్యాంగ్ తెగ హల్చల్ చేసింది. కానీ షారుక్ స్టార్డమ్ ముందు బాయ్‌కాట్ నినాదం పని చేయలేదు. పైగా ఆయన సినిమా రిలీజై దాదాపు నాలుగేళ్లవుతుండటంతో పఠాన్‌ను చూసేందుకు ఎగబడుతున్నారు జనం. #JhoomeJoPathaan meri jaan mehfil hi loot jaaye ❤️🔥 the FANtastic party outside #Mannat gets PATHAANfied 🔥 Book your tickets now: https://t.co/z4YLOG2NRI | https://t.co/lcsLnUSu9Y@iamsrk @yrf#ShahRukhKhan #Pathaan #PathaanReview #YRF50 pic.twitter.com/OwyULyq8G3 — Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) January 29, 2023 ‘PATHAAN’ CROSSES ₹ 500 CR MARK: ₹ 542 CR WORLDWIDE *GROSS* IN 5 DAYS… #Pathaan WORLDWIDE [#India + #Overseas] *Gross* BOC… *5 days*… ⭐️ #India: ₹ 335 cr ⭐️ #Overseas: ₹ 207 cr ⭐️ Worldwide Total *GROSS*: ₹ 542 cr 🔥🔥🔥 pic.twitter.com/UZvYoipsx0 — taran adarsh (@taran_adarsh) January 30, 2023 చదవండి: అసభ్యంగా తాకబోయాడు.. క్యాస్టింగ్ కౌచ్‌పై నటుడు పెళ్లైన 10 ఏళ్లకు సీమంతం.. భావోద్వేగంలో నటి -
పిచ్చెక్కిస్తున్న పఠాన్... 4 రోజుల్లో రూ.400 కోట్లు!
'షారుక్‌ను ఆపొచ్చేమో కానీ పఠాన్‌ను ఎలా ఆపగలరు?' గతేడాది మార్చిలో కండలు తిరిగిన ఫోటో షేర్ చేస్తూ దానికి ఈ క్యాప్షన్ జోడించాడు షారుక్ ఖాన్. సరిగ్గా ఇప్పుడదే జరుగుతోంది. బాక్సాఫీస్ దగ్గర పఠాన్‌ను ఆపడం ఎవ్వరి తరం కానట్లే కనిపిస్తోంది. కోట్లకు కోట్లు కొల్లగొడుతూ భారీ కలెక్షన్లు లేక బోసిపోయిన బాలీవుడ్‌కు కొత్త కళను తీసుకొచ్చింది. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబడుతూ రికార్డులు తిరగరాస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.429 కోట్లు రాబట్టింది. ఇందులో ఒక్క ఇండియాలోనే రూ.265 కోట్లు రాగా ఓవర్సీస్లో రూ.164 కోట్లు వసూలు చేసింది. దీంతో షారుక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా పఠాన్ సినిమాలో షారుక్ సరసన దీపికా పదుకొణె హీరోయిన్గా నటించింది. సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో జాన్ అబ్రహం విలన్ పాత్రలో నటించాడు. ‘PATHAAN’: ₹ 429 CR WORLDWIDE *GROSS* IN 4 DAYS… #Pathaan WORLDWIDE [#India + #Overseas] *Gross* BOC… *4 days*… ⭐️ #India: ₹ 265 cr ⭐️ #Overseas: ₹ 164 cr ⭐️ Worldwide Total *GROSS*: ₹ 429 cr 🔥🔥🔥 pic.twitter.com/Qd8xriCFvX — taran adarsh (@taran_adarsh) January 29, 2023 ‘PATHAAN’ NEW MILESTONE: FASTEST TO HIT ₹ 250 CR… AGAIN OVERTAKES ‘KGF2’, ‘BAAHUBALI 2’, ‘DANGAL’… ⭐️ #Pathaan: Will cross ₹ 250 cr today [Day 5] ⭐️ #KGF2 #Hindi: Day 7 ⭐️ #Baahubali2 #Hindi: Day 8 ⭐️ #Dangal: Day 10 ⭐️ #Sanju: Day 10 ⭐️ #TigerZindaHai: Day 10#India biz. pic.twitter.com/DFsXcptErD — taran adarsh (@taran_adarsh) January 29, 2023 చదవండి: ఖరీదైన కారు కొన్న బుల్లితెర నటి సుశాంత్ చనిపోయేముందు మెసేజ్ వచ్చింది, కానీ నేనే పట్టించుకోలే -
వసూళ్ల వర్షం కురిపిస్తున్న పఠాన్, షారుక్ ట్వీట్
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పఠాన్. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా జనవరి 25న విడుదలైంది. తొలిరోజు నుంచే వసూళ్ల వేట మొదటి పెట్టిన ఈ సినిమా మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత షారుక్ ఖాన్ వెండితెరపై సందడి చేయడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 'వెనక్కు తిరిగిరావడం కోసం ప్లాన్ చేసుకోవద్దు. మున్ముందుకే అడుగులు వేయాలి. వెనక్కి తగ్గొద్దు. ప్రారంభించిన పనిని ముగించేందుకు ప్రయత్నించండి' అని సోషల్ మీడియాలో కింగ్ ఖాన్ సూచించారు. ఈ సినిమా విజయం పట్ల షారుక్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘PATHAAN’: ₹ 219.60 CR WORLDWIDE *GROSS* IN 2 DAYS… #Pathaan #India + #Overseas *Gross* BOC… ⭐️ Day 1: ₹ 106 cr ⭐️ Day 2: ₹ 113.60 cr ⭐️ Worldwide *GROSS* Total: ₹ 219.60 cr 🔥🔥🔥 pic.twitter.com/MFnr6gMK9z — taran adarsh (@taran_adarsh) January 27, 2023 Gattaca movie “I never saved anything for the swim back” I think life is a bit like that….You aren’t meant to plan your return…U r meant to move forward. Don’t come back…try to finish what u started. Just a 57yr olds’ advice things. — Shah Rukh Khan (@iamsrk) January 27, 2023 #Pathaan crosses ₹ 300 Crs Gross at the WW Box office in 3 days.. 🔥— Ramesh Bala (@rameshlaus) January 28, 2023 చదవండి: జమున బయోపిక్‌లో స్టార్ హీరోయిన్ కూతుర్ని హీరోయిన్గా చూడాలనుకున్న జమున -
‘పఠాన్’ సినిమా బ్లాక్ బస్టర్.. ఇంత మంది మూర్ఖులా!
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. నాలుగేళ్ల విరామం తర్వాత ‘పఠాన్’గా తెరపైకి దూసుకొచ్చిన షారూఖ్ సత్తా చాటాడు. వివాదాల నడుమ విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. అయితే ఈ సినిమాపై వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ అభిప్రాయాలను ట్విటర్ వేదికగా వెల్లడిస్తున్నారు. ఏముందని చూస్తున్నారు? ‘పఠాన్’ సినిమా విజయంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ ఖట్జూ తనదైన శైలిలో స్పందించారు. ‘పఠాన్ సినిమాకు వస్తున్న స్పందన చూసిన తర్వాత, ఇండియాలోని మూర్ఖుల సంఖ్య మీద నా అంచనా 90 శాతం నుంచి 95 శాతానికి పెరిగింద’ని ట్వీట్ చేశారు. నల్లమందు ధర పెరిగింది కాబట్టి.. చౌకైన ప్రత్యామ్నాయంగా ‘పఠాన్’ను కనుగొన్నారని సెటైర్ వేశారు. My estimate of fools in India has gone up from 90% to 95% after seeing the response to the film Pathan — Markandey Katju (@mkatju) January 26, 2023 అన్నీ ఉన్నాయి 2023లో ఇదే మొదటి బ్లాక్ బస్టర్ అంటూ సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. ‘పఠాన్’లో అన్నీ ఉన్నాయి. స్టార్ పవర్, స్టైల్, హంగు, ఆత్మ, విషయం, ఆశ్చర్యాలు, ఇంకా అన్నింటికంటే ముఖ్యంగా ప్రతీకారేచ్ఛతో వచ్చిన షారుక్ ఖాన్. 2023లో ఇదే మొదటి బ్లాక్ బస్టర్!’అని ట్వీట్ చేశారు. అంతేకాదు ట్విటర్లో ‘పఠాన్’సినిమాకు నాలుగున్న స్టార్స్ రేటింగ్ కూడా ఇచ్చారు. #OneWordReview...#Pathaan: BLOCKBUSTER. Rating: ⭐️⭐️⭐️⭐️½#Pathaan has it all: Star power, style, scale, songs, soul, substance and surprises… And, most importantly, #SRK, who’s back with a vengeance… Will be the first #Blockbuster of 2023. #PathaanReview pic.twitter.com/Xci1SN72hz — taran adarsh (@taran_adarsh) January 25, 2023 కాగా, పఠాన్ సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 170 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. మున్ముందు కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముందని అంచనా. (క్లిక్ చేయండి: షారుక్ పని అయిపోయిందంటూ ట్వీట్.. చివర్లో ట్విస్ట్!) -
స్టార్ వార్.. ఇక బాక్సాఫీస్ బద్దలే..!
బాక్సాఫీస్ వసూళ్ల కోసం గ్యాంగ్‌వార్‌కు రంగం సిద్ధమవుతోంది. ఆల్రెడీ కొందరు స్టార్స్ వార్ డిక్లేర్ చేసి సెట్స్‌లో బిజీగా ఉన్నారు. మరికొందరు రెడీ అవుతున్నారు. ఈ బాక్సాఫీస్ గ్యాంగ్‌వార్ పై ఓ లుక్ వేద్దాం. పోలీసాఫీసర్‌గా ప్రభాస్ నటించనున్న సినిమా ‘స్పిరిట్’. ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్న ఈ సినిమా పనులు ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానున్నాయి. ప్రభాస్ కెరీర్లో 25వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ ‘స్పిరిట్’ ముంబైలో జరిగే గ్యాంగ్‌వార్ బ్యాక్ డ్రాప్లో ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. అలాగే సందీప్‌రెడ్డి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న హిందీ ‘యానిమల్’ కూడా ఇలాంటి తరహా చిత్రమే. రణ్‌బీర్ కపూర్ హీరోగా రూపొందుతున్న కంప్లీట్ గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ ఇది. తండ్రి కోసం ఓ యువకుడు గ్యాంగ్‌వార్‌లో ఎలా చిక్కుకున్నాడు? అనే కోణంలో ఈ సినిమా సాగుతుందని బాలీవుడ్ టాక్. ఈ ఏడాది ఆగస్టులో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక దర్శకుడు సుజిత్ తెరకెక్కించనున్న సినిమాలో పవన్ కల్యాణ్ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్మెంట్ టైమ్‌లో ‘దే కాల్ హిమ్ ఓజీ’ అనే ట్యాగ్‌లైన్ తెరపైకి వచ్చింది. ‘ఓజీ’ అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అని ప్రచారం జరిగింది. దీంతో పవన్–సుజిత్ కాంబినేషన్లోని మూవీ గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్ అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన సినిమా ‘పుష్ప’. ఆల్రెడీ విడుదలైన ‘పుష్ప’ తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’లో కొన్ని గ్యాంగ్‌వార్ సీన్స్ చూశాం. అలాగే ‘పుష్ప: ది రైజ్’కు కొనసాగింపుగా రానున్న ‘పుష్ప: ది రూల్’లోనూ కొన్ని గ్యాంగ్ వార్ సన్నివేశాలు ఉంటాయనుకోవచ్చు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాగా సీనియర్ యాక్టర్ రాజశేఖర్ సైతం ఈ వెండితెర గ్యాంగ్‌వార్‌లో భాగమయ్యారు. పవన్ సాధినేని దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కుతున్న ‘మాన్స్టర్’ గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అలాగే యువ హీరో సందీప్ కిషన్ టైటిల్ రోల్లో, విజయ్ సేతుపతి ఓ లీడ్ రోల్లో నటించిన ‘మైఖేల్’ కూడా గ్యాంగ్‌స్టర్ డ్రామానే. ఇంకోవైపు ‘మాస్టర్’ చిత్రం తర్వాత తమిళ ప్రముఖ హీరో విజయ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తాజాగా మరో సినిమా రూపొందనుంది. ముంబై నేపథ్యంలో సాగే గ్యాంగ్‌వార్‌గా ఈ సినిమా ఉంటుందనే టాక్ ఆల్రెడీ కోలీవుడ్‌లో మొదలైంది. ఈ సినిమాలో సంజయ్ దత్, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలు చేయనున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు లోకేష్ అండ్ కో. అదే విధంగా ఈ సినిమా తర్వాత కార్తీతో ‘ఖైదీ’కి సీక్వెల్‌గా ‘ఖైదీ 2’ తీయనున్నారు లోకేష్. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో సాగిన ‘ఖైదీ’ సినిమాకు సీక్వెల్‌గా రానున్న ‘ఖైదీ 2’ గ్యాంగ్‌వార్ ఫిల్మ్ అట. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. అటు కన్నడంలో ఉపేంద్ర, కిచ్చా సుదీప్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కబ్జా’. ఆర్. చంద్రు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 1960–1984 బ్యాక్‌డ్రాప్‌లోని గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ అని తెలుస్తోంది. కాగా, ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన దుల్కర్ సల్మాన్ చేస్తున్న మలయాళ చిత్రం ‘కింగ్ ఆఫ్ కోతా’. పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు అభిషేక్ జోషి దర్శకుడు. దుల్కర్ కెరీర్లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలతో పాటు మరికొన్ని చిత్రాలు గ్యాంగ్‌వార్ నేపథ్యంలో ప్రేక్షకులను అలరించనున్నాయి. -
Varasudu Collections: వారం కాకముందే సెంచరీ కొట్టిన విజయ్
దళపతి విజయ్ కథానాయకుడి నటించిన ద్విభాషా చిత్రం వారిసు. ఈ సినిమా వారసుడు పేరిట తెలుగులోనూ రిలీజైంది. నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేశాడు. దిల్ రాజు, శిరీష్, పరమ్, వి.పొట్లూరి, పెరల్ నిర్మించిన ఈ చిత్రం తమిళ్లో జనవరి 11న విడుదలవగా తెలుగులో 14న విడుదలైంది. కలెక్షన్లపరంగా రెండు చోట్లా దూసుకుపోతోందీ సినిమా. రిలీజై వారం రోజులు కూడా కాకముందే వంద కోట్ల క్లబ్లో చేరింది. అటు కేరళలో, ఇటు నార్త్‌లో హిందీలోనూ రిలీజవడంతో అక్కడ కూడా బాగానే వసూళ్లు రాబడుతోంది. ఆదివారంతో సంక్రాంతి పండగ హవా ముగియనుండటంతో వసూళ్ల మీద ఎఫెక్ట్ పడే అవకాశముంది. అటు అజిత్ తునివు, ఇటు చిరంజీవి వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలు గట్టి పోటీనిచ్చినా వాటన్నింటినీ తట్టుకుని నిలబడి వారసుడు వంద కోట్లు రాబట్టడంతో సంతోషంలో మునిగి తేలుతున్నారు ఫ్యాన్స్. కాగా విజయ్‌కు వంద కోట్లు సాధించడం పెద్ద లెక్కేం కాదు. ఇప్పటికే అతడి తొమ్మిది సినిమాలు ఈ ఘనత సాధించగా తాజాగా వారిసు సెంచరీ కొట్టి ఆ జాబితాలోకెక్కింది. తునివు కూడా వంద కోట్ల మార్క్ దాటడం విశేషం. #Varisu TN Box Office FINALLY the film crossed ₹50 cr mark in the 5th day. Day 1 - ₹ 19.43 cr Day 2 - ₹ 8.75 cr Day 3 - ₹ 7.11 cr Day 4 - ₹ 7.24 cr Day 5 - ₹ 9.08 cr Total - ₹ 51.61 cr#Vijay — Manobala Vijayabalan (@ManobalaV) January 16, 2023 #Varisu has entered the ₹ 100 Cr Club at the #India Box office.. — Ramesh Bala (@rameshlaus) January 16, 2023 చదవండి: రష్మిక టాటూ వెనక స్టోరీ -
బాస్ ఈజ్ బ్యాక్.. ‘వాల్తేరు వీరయ్య’ తొలిరోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే!
ఈ సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్‌తో దుమ్ములేపుతున్నాడు వాల్తేరు వీరయ్య. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా శుక్రవారం(జనవరి 13న) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ సినిమా మాస్ హిట్‌ను అందుకుంది. విడుదలైన తొలి షో నుంచే ఈ మూవీ పాజిటివ్ తెచ్చుకుంది. చదవండి: నేను ఆ డిజార్డర్‌తో బాధపడుతున్నా! షాకిచ్చిన అనసూయ.. ఇందులో మెగాస్టార్ మాస్, యాక్షన్, కమెడీకి ప్రేక్షకులంత ఈళలు వేస్తూ రచ్చ రచ్చ చేశారు. దీనికి తోడు రవితేజ మాస్ యాక్షన్ జత కావడంతో ఇక ఫ్యాన్స్ జోరు ఆకాశాన్ని తాకింది. అలా తొలి రోజు ఈ మూవీ బాక్సాఫీసు వద్ద వసూళ్లతో సత్తా చాటింది వాల్తేరు వీరయ్య. తొలిరోజు వరల్డ్ వైడ్ రూ. 29 కోట్ల గ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో రూ. 23 పైగా కోట్లు షేర్ చేసినట్లు ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ ఇలా ఉన్నాయి: నైజాం- రూ.6.10 కోట్లు సీడెడ్- రూ.4.20 కోట్లు ఉత్తరాంధ్ర- రూ.2.60 కోట్లు ఈస్ట్- రూ.2.68 కోట్లు వెస్ట్- రూ.2.06 కోట్లు కృష్ణా- రూ.1.49 కోట్లు గుంటూరు- రూ.2.76 కోట్లుఔ నెల్లూరు- 1.05 కోట్లు ఇలా వాల్తేరు వీరయ్య తోలి రోజు బాక్సాఫీసు వద్ద వసూళ్లు కురిపించింది. ఇక రెండో రోజు ఈ మూవీ అదే జోరును కొసాగిసోందట. శనివారం వాల్తేరు వీరయ్య అన్ని షోలు హౌజ్ ఫుల్ బకింగ్ ఉన్నట్లు సమాచారం. కాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. -
విజయ్ , అజిత్ పదోసారి బాక్సాఫీస్ వార్.. ఎవరిది పైచేయి ..?
-
రూ. 100 కోట్ల క్లబ్‌లోకి ధమాకా.. రవితేజ కెరీర్లోనే తొలి రికార్డు!
మాస్ మహారాజా రవితేజ, ‘పెళ్లి సందD’ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ధమాకా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సక్సెఫుల్‌గా మూడో వారంలోకి అడుగుపెట్టింది. విడుదలైన తొలి షో నుంచే ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ టాక్‌ను సొంతంగా చేసుకుంది. బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రం తాజాగా రూ. 100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. విడుదలైన రెండు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల పైనే గ్రాస్ వసూళు చేసిన చిత్రంగా ధమాకా రికార్డు క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని స్వయంగా మూవీ టీం ప్రకటించింది. ఇక రవితేజ కెరీర్లో రూ. 100 కోట్ల కలెక్షన్స్ సాధించిన తొలి చిత్రంగా ధమాకా నిలిచింది. ఫుల్ అవుట్ అండ్ అవుట్ మాస్, యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇందులో రవితేజ స్క్రిన్ ప్రెజెన్స్, ఎనర్సీ, ఆయన కామెడీ టైమింగ్ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మరోసారి రవితేజ ఈ సినిమాతో తన మాస్ మార్క్‌ను చూపించారు. రవితేజ మాస్ స్టామినా, స్టార్ పవర్‌తో ధమాకా పైసా వసూల్ ఎంటర్టైనర్గా నిలిచింది. కాగా నక్కిన త్రినాథరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. రవితేజకు జోడీగా నటించిన హీరోయిన్ శ్రీలీల తన అందంతో, డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టింది. చదవండి: పఠాన్ డిజాస్టర్ అయ్యిందిగా..! నెటిజన్ విమర్శకు షారుక్ స్ట్రాంగ్ కౌంటర్ అందుకే నా ట్విటర్ అకౌంట్‌ను నిలిపివేశారు: నటుడు -
రూ. 25 కోట్ల గ్రాస్ సాధించిన నిఖిల్, అనుపమ ‘18 పేజెస్’ చిత్రం
యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్ర 18 పేజెస్. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మంచి విజయం సాధించింది. విడుదలైన తొలి షో నుంచే ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. దీంతో మొదటి రోజే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్‌తో దూసుకెళ్లింది. కేవలం మౌత్ టాక్‌తోనే ఈ చిత్రానికి రోజు రోజుకు ఆదరణ మరింత పెరుగుతోంది. ఈ సినిమా విడుదలై 10 రోజులు గడుస్తున్నా ఇప్పటికి థియేటర్లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ ఫీల్ గుడ్ లవ్‌స్టోరీని చూసేందుకు మళ్లీ మళ్లీ థియేటర్‌కు వస్తున్నారు. ఫలితంగా ఈ సినిమా ఇప్పటివరకు రూ. 20 కోట్ల గ్రాస్ సాధించింది. కాగా బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాను, మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పించారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథ అంధించిన సంగతి తెలిసిందే. ఆయన శిష్యుడు ‘కుమారి 21ఎఫ్’ చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రాన్ని ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా మలిచారు. ఇందులో హీరోహీరోయిన్ల పాత్రలను మలిచిన తీరు, పాటలు, కొన్ని అందమైన విజువల్స్, వీటన్నింటిని మించి సుకుమార్ మార్క్‌తో కూడిన క్లైమాక్స్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. చదవండి: నటి నయని పావని ఇంట తీవ్ర విషాదం, తండ్రి మృతి.. ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ లిరిక్స్ వివాదం.. యండమూరికి చంద్రబోస్ గట్టి కౌంటర్ -
ఆగని ధమాకా జోరు.. కలెక్షన్ల మోత మోగిస్తున్న రవితేజ
మాస్ మహారాజ రవితేజ 2022కి గ్రాండ్‌గా ముగింపు పలికాడు. రామారావు ఆన్ డ్యూటీతో అభిమానులను నిరుత్సాహపరిచినా ధమాకాతో డబుల్ కిక్ ఇచ్చాడు. నక్కిన త్రినాథరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా నటించింది. ప్రసన్నకుమార్ కథ అందించాడు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 23న విడుదలైంది. రిలీజైన మొదటి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం మరో రికార్డు బద్ధలు కొట్టింది. కేవలం తొమ్మిది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.77 కోట్లు రాబట్టింది. గతవారం తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ దగ్గర ఎక్కువ వసూళ్లు రాబట్టిన మొదటి చిత్రంగా నిలిచింది. మాస్ మహారాజ దూకుడుకు వీకెండ్ బాగా కలిసిరావడంతో కలెక్షన్ల వర్షం కురిసింది. Most Watched & Most Celebrated Film #Dhamaka 💥🤩#DhamakaBlockBuster Book your 🎫 👇https://t.co/iZ40p9utmY@RaviTeja_offl @sreeleela14 @TrinadharaoNak1 @vishwaprasadtg @vivekkuchibotla @KumarBezwada@sujithkolli pic.twitter.com/PTlu0nakay — People Media Factory (@peoplemediafcy) December 31, 2022 MassMaharaja @RaviTeja_offl 's MASSive 9️⃣ Days NonStop Rampage 💥#DhamakaBlockBuster in Cinemas Now 🥳🤩#Dhamaka Book your tickets nowhttps://t.co/iZ40p9utmY@sreeleela14 @TrinadharaoNak1 @vishwaprasadtg @vivekkuchibotla @KumarBezwada pic.twitter.com/9XQM56e3iF — People Media Factory (@peoplemediafcy) January 1, 2023 చదవండి: నవీన్ అన్నా, ఉన్నావా? చచ్చావా? నా తప్పుల నుంచి ఎన్నో నేర్చుకున్నా -
కలెక్షన్ల సునామి సృష్టించనున్న సలార్
-
ధమాకా.. మూడు రోజుల కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
Dhamaka Movie Box Office Collection Day 3: మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ధమాకా. పెళ్లిచూపులు బ్యూటీ శ్రీలీల రవితేజతో జోడీ కట్టింది. బాక్సాఫీస్ వద్ద వీరిద్దరి జోడీ కాసుల వర్షం కురిపిస్తోంది. మాస్ యాక్షన్‌కు, తీన్మార్ స్టెప్పులకు ప్రేక్షకులు థియేటర్లలో ఈలలు వేస్తున్నారు. త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేసిన ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. గత శుక్రవారం (డిసెంబర్ 23న) రిలీజైన ఈ చిత్రం మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. మొదటిరోజే రూ.10 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ మూవీ మూడు రోజుల్లో రూ.32 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. చూస్తుంటే క్రిస్మస్ సెలవులను ధమాకా బాగానే క్యాష్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. MassMaharaja @RaviTeja_offl 's MASSive 3️⃣ Days MASS Rampage 💥#DhamakaBlockBuster in Cinemas Now 🥳🤩#Dhamaka Book your tickets nowhttps://t.co/iZ40p9utmY@sreeleela14 @TrinadharaoNak1 @vishwaprasadtg @vivekkuchibotla @KumarBezwada pic.twitter.com/6sD6Ev5F7O — People Media Factory (@peoplemediafcy) December 26, 2022 చదవండి: సెన్సేషన్‌గా అవతార్ 2, మొత్తం కలెక్షన్స్ ఎంతంటే? -
సెన్సేషన్‌గా అవతార్ 2.. ఇండియాలో ఎంత వచ్చిందంటే?
హాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం అవతార్: ది వే ఆఫ్ వాటర్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తోంది. మొదటి వారం కలెక్షన్లతో ఇరగదీసిన ఈ మూవీ రెండోవారం కూడా అదే జోరు కొనసాగించింది. గత వారంలో క్రిస్మస్ సెలవులు ఉండటంతో సినిమాకు బాగా కలిసొచ్చింది. ఈ హాలీడేస్‌ను బాగా క్యాష్ చేస్తున్న అవతార్ 2 ఒక్క ఇండియాలోనే రూ.300 కోట్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఏడు వేల కోట్లు రాబట్టింది. ఈ సినిమాకు పోటీగా ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఏ చిత్రం కూడా లేకపోవడంతో వసూళ్ల సునామీ ఇప్పుడప్పుడే ఆగేట్లు కనిపించడం లేదు. శుక్రవారం నాడు బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ సర్కస్ సినిమా రిలీజ్ అయినప్పటికీ దానికి స్పందన అంతంత మాత్రమే! దీంతో హిందీ ఆడియన్స్ కూడా అవతార్ సీక్వెల్‌ను ఎగబడి మరీ చూస్తున్నారు. అవతార్ 2 రిలీజైన రెండో శనివారం కూడా అత్యధికంగా రూ.21(నెట్) కోట్లు వసూలు చేసింది. దీంతో ఇండియాలో రెండో శనివారం అత్యధిక వసూళ్లు రాబట్టిన హాలీవుడ్ చిత్రంగా రికార్డు సృష్టించిందీ మూవీ. కాగా జేమ్స్ కామెరూన్ డైరెక్ట్ చేసిన అవతార్(2009) చిత్రం ఎన్నో అద్భుతాలు సృష్టించింది. విజువల్ వండర్‌గా వరల్డ్ వైడ్ బ్లాక్బాస్టర్గా నిలిచిన ఈ మూవీకి పదమూడేళ్ల తర్వాత సీక్వెల్‌గా వచ్చింది అవతార్: ది వే ఆఫ్ వాటర్. ఈ నెల 16న రిలీజైన ఈ చిత్రంలో సిగర్నీ వీవర్, కేట్ విన్స్లెట్, క్లిఫ్ఫ్ కర్టిస్, ఈడీ ఫాల్కో, జెమైన్ క్లెమెంట్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇండియాలో తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజైంది. చదవండి: అవతార్ 2 ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు తగ్గాయ్ రెండు థియేటర్లు అమ్మేశారు.. బాబాయి పోయిన నెలకే నాన్న: కమెడియన్ కూతురు -
మైండ్ బ్లాక్ చేస్తున్న అవతార్ 2 తొలిరోజు కలెక్షన్స్
-
‘కాంతార’కు కాసుల పంట.. ఒక్క తెలుగులోనే రూ.50 కోట్లు వసూళ్లు
చిన్న చిత్రంగా విడుదలై భారీ విజయం సాధించిన తాజా కన్నడ చిత్రం ‘కాంతార’. ఈ చిత్రం కన్నడ వెర్షన్ సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టించింది. దీంతో ఈ సినిమాను అన్ని భాషల్లో డబ్బింగ్ చేసి రిలీజ్చేశారు. టాలీవుడ్లో అక్టోబర్ 15న విడుదలైన ఈ చిత్రం.. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. కాంతార చిత్రం విడుదలైన 2 వారాల్లోనే 45 కోట్లు వసూళ్లు సాధించి రికార్డు సాధించింది. తాజాగా ఈ చిత్రం రూ.50 కోట్ల క్లబ్లో చేరింది. ఒక డబ్బింగ్ సినిమా ఈ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడం రికార్డు అని సినీ వర్గాలు చెబుతున్నాయి. కాంతార కేవలం తెలుగులోనే కాకుండా ఇండియా వైడ్ కూడా ఈ సినిమా చాలా బాగా ఆడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరాంగదుర్ నిర్మించారు. తెలుగులో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ‘గీతాఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్’ ద్వారా విడుదల చేశారు. (క్లిక్ చేయండి: యాంకర్ విష్ణుప్రియ ఫేస్బుక్లో అశ్లీల వీడియోలు కలకలం!) -
Kantara Movie: కాంతార సినిమా పై ప్రభాస్, అనుష్క కామెంట్స్.. దిమ్మతిరిగే కలెక్షన్స్ తో దుసుకుపోతుంది
-
కాసుల వర్షం కురిపిస్తున్న 'కాంతార'.. మౌత్‌టాక్‌తోనే సూపర్ హిట్
రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం 'కాంతార'. కన్నడలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం తెలుగులోనూ అదిరిపోయే కలెక్షన్లతో దుమ్మురేపుతుంది. రిలీజైన తొలిరోజు నుంచే హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. కాంతార రైట్స్ కేవలం రూ. 2 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. మొదటిరోజు 1.95 కోట్ల గ్రాస్ ను సాధించిన ఈ చిత్రం రెండవ రోజు ఏకంగా రూ. 11.5 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది. కేవలం మౌత్‌టాక్‌తోనే ఇంత పెద్ద విజయం సాధించడం అరుదైన విషయం. కన్నడలో భారీ విజయం సాధించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తెలుగులో రిలీజ్ చేశారు. రిషబ్ శెట్టి అద్భుతమైన నటన, విజువల్స్‌కి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ తోడై కాంతార థియేటర్స్‌లో మాస్ జాతర చేస్తోంది. కన్నడలో 17 రోజుల కలెక్షన్స్ ను తెలుగులో కేవలం రెండు రోజుల్లోనే కొల్లగొట్టిందీ చిత్రం. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది కాంతార. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్‌తో దూసుకుపోతుంది. ముఖ్యంగా ఈ ‘కాంతార’ క్లైమాక్స్ సినిమా విజయంలో ప్రధాన పాత్ర పోషించింది. చివరి 20 నిమిషాలు అరాచకానికి అర్థం చూపించాడు రిషబ్ శెట్టి. అప్పటివరకు మాములుగా సాగుతున్న సినిమాను క్లైమాక్స్ లో వేరే లెవెల్ కి తీసుకెళ్లాడు. ఇప్పటికే కన్నడలో సంచలనం సృష్టించిన ఈ చిత్రం, తెలుగులో కూడా అంతకు మించిన విజయఢంకా మోగిస్తోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Tremendous response from the audience for #KantaraTelugu 🔥 95% rating on @bookmyshow 💥 Watch #Kantara in theaters near you now! 💥 🎟️: https://t.co/WNkTI6j3BF #Kantara @shetty_rishab @VKiragandur @hombalefilms @GeethaArts @gowda_sapthami @AJANEESHB @actorkishore pic.twitter.com/p5YnWJiCe9 — Geetha Arts (@GeethaArts) October 16, 2022 -
గాడ్‌ఫాదర్ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే
చిరంజీవి-మోహన్ రాజా కాంబినేషన్లో రూపొందిన లేటెస్ట్ మూవీ 'గాడ్ ఫాదర్'. దసరా సందర్భంగా బుధవారం(అక్టోబర్ 5న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి షో నుంచే హిట్ తెచ్చుకుంది. దీంతో తొలి రోజు ఈ మూవీ భారీగా వసూళ్లు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం తొలి రోజు రూ. 38 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో 20.9 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం. గాడ్ ఫాదర్ వసూళ్లు ఎలా ఉన్నాయంటే.. నైజాం: రూ. 3.25 కోట్లు ఉత్తరాంధ్ర: రూ. 1.25 కోట్లు సీడెడ్: రూ.3.05 కోట్లు నెల్లూరు: రూ.57 లక్షలు గుంటూరు: రూ.1.75 కోట్లు కృష్ణా జిల్లా: రూ.73 లక్షలు తూర్పు గోదావరి: రూ.1.60 కోట్లు పశ్చిమ గోదావరి: రూ.80 లక్షలు ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఏపీలో 6.70 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే.. 'గాడ్ ఫాదర్' సినిమాకు మొదటి రోజు 13 కోట్ల రూపాయల షేర్ వచ్చినట్లు సమాచారం. -
‘పొన్నియన్ సెల్వన్’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే
ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన హిస్టారికల్ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. కల్కి కృష్ణ మూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు. అందులో మొదటి భాగం శుక్రవారం(సెప్టెంబర్ 30న) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. చియాన్ విక్రమ్, హీరో కార్తీ, ఐశ్వర్యరాయ్, ‘జయం’ రవి, త్రిష, ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్ వంటి తదితర భారీ తారాగణంతో రూపొందిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మిక్స్డ్ టాక్ తెచ్చుకోగా.. తమిళనాట భారీ వసూళ్లు చేసినట్లు ట్రెడ్ వర్గాలు పేర్కొన్నాయి. తమిళనాడులో తొలి రోజు రికార్ట్ కలెక్షన్స్ చేసినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. చదవండి: పృథ్వీరాజ్‌కు ఫ్యామిలీ కోర్టు షాక్, భార్యకు ప్రతి నెల రూ. 8 లక్షలు చెల్లించాలి పొన్నియన్ సెల్వన్ మొదటి రోజు కలెక్షన్స్.. ఈ ఏడాది కోలీవుడ్ బెస్ట్ ఓపెనింగ్స్‌లో మూడో స్థానంలో నిలిచినట్లు తెలుస్తోంది. మొదటి రోజు రూ. 25.86 కోట్లు గ్రాస్ వసూల్ చేసి.. ఈ ఏడాది వలిమై రూ. 36.17 కోట్లు, బీస్ట్ రూ. 26.40 కోట్లు తర్వాత మూడో స్థానంలో పొన్నియన్ సెల్వన్ నిలిచింది. కేవలం తమిళంలోనే పొన్నియన్ సెల్వన్ రూ. 25.86 కోట్లు రాబడితే.. వరల్డ్ వైడ్ మంచి నెంబర్ వచ్చే అవకాశం ఉంది అంటున్నాయి ట్రెడ్ వర్గాలు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ టాక్ ఎలా ఉన్నప్పటికీ సాయంత్రం, నైట్ షోలకు హౌజ్‌ఫుల్ కలెక్షన్స్ చేసినట్లు సమాచారం. ఈ లెక్కన తెలుగులో కూడా పొన్నియన్ సెల్వన్ బాగానే కలెక్షన్స్ చేసిందంటున్నారు. అలాగే బి-టౌన్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సుమారు రూ. 1.75 కోట్ల కలెక్షన్లు రాబట్టిందని సమాచారం. చదవండి: పుట్టినరోజుకి ముందు అవార్డు అందుకున్నాను: నటి ఆశా పారేఖ్ #PonniyinSelvan part 1 is off to a FANTASTIC start at the box office. The film has grossed ₹25.86 cr on Day 1 in the state. 3rd BIGGEST opener of the year.#PonniyinSelvan1 — Manobala Vijayabalan (@ManobalaV) October 1, 2022 Top TN openers of 2022#Valimai- ₹36.17cr#Beast- ₹26.40cr#PS1- ₹25.86cr#Vikram- ₹20.61cr#ET- ₹15.21cr#RRRMovie- ₹12.73cr#Thiruchitrambalam- ₹9.52cr#Don- ₹9.47cr#Cobra- ₹9.28cr#KGFChapter2- ₹8.24cr#NaaneVaruvean - ₹7.37cr#Viruman- ₹7.21cr#VTK- ₹6.85cr — Manobala Vijayabalan (@ManobalaV) October 1, 2022 -
రెండో రోజు కలెక్షన్లతో అదరగొట్టిన 'కృష్ణ వ్రింద విహారి'
యంగ్ హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రం 'కృష్ణ వ్రింద విహారి'. న్యూజిలాండ్ గాయని, నటి షిర్లే సెటియా ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యింది. అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఐరా క్రియేషన్స్‌పై ఉష ముల్పూరి నిర్మించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజు నుంచే మంచి కలెక్షన్లను రాబట్టిందీ చిత్రం. అయితే తాజాగా తొలిరోజు కంటే రెండోరోజు ఎక్కువ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు. అటు అమెరికాలోనూ ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఇప్పటివరకు అక్కడ లక్షడాలర్లకు పైగా వసూళ్లను రాబట్టింది. కాగా నాగశౌర్య ఇందులో సంప్రదాయ కుటుంబానికి చెందిన యువకుడి పాత్రలో కనిపించాడు.బ్రహ్మాజీ, సత్య మరియు వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లొ నటించారు. Thanks to all the Overseas Audience for the Immense LOVE for our #KrishnaVrindaVihari 😊✨ $100k+ US Gross in 2 Days! ❤️🔥 Watch our #HilariousBlockbuster In Cinemas now! 🎟️ https://t.co/ZN7BGCyB6k#KVV @ShirleySetia #AnishKrishna @mahathi_sagar @ira_creations @saregamasouth pic.twitter.com/tHMigqo57b — Naga Shaurya (@IamNagashaurya) September 25, 2022 -
సీతారామం మ్యాజిక్.. ఇప్పటికాదా ఎంత వచ్చిందంటే?
అందమైన ప్రేమకావ్యంగా ప్రేక్షకుల మనసులను హత్తుకుంది సీతారామం. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమాను హను రాఘవపూడి డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా సక్సెస్ కావడంతో బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌కు తెలుగులో మంచి అరంగేట్రం లభించినట్లైంది. రష్మిక మందన్నా, సుమంత్ పాత్రలకు మంచి మార్కులు పడ్డాయి. సి.అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 5న విడుదలై ఇప్పటికీ పలు థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటివరకు బాక్సాఫీస్‌పై రూ.75 కోట్ల కలెక్షన్ల వర్షం కురిపించింది. ఒక్క అమెరికాలోనే ఇప్పటివరకు 1.3 మిలియన్ డాలర్స్ వసూళ్లు సాధించింది. ఈ సందర్భంగా సీతారామంపై ఇంత ప్రేమాభిమానం చూపించిన ప్రేక్షకలోకానికి ధన్యవాదాలు తెలిపింది చిత్రయూనిట్. Thank you for all the love pouring in for #SitaRamam 🦋💖@dulQuer @mrunal0801 @iamRashmika @iSumanth @hanurpudi @AshwiniDuttCh @TharunBhasckerD @vennelakishore @Composer_Vishal @VyjayanthiFilms @SwapnaCinema @SonyMusicSouth @penmovies @DQsWayfarerFilm @LycaProductions pic.twitter.com/jI2BoTO15k — Vyjayanthi Movies (@VyjayanthiFilms) August 27, 2022 చదవండి: జూ.ఎన్టీఆర్-కొరటాల ప్రాజెక్ట్‌కు నో చెప్పిన సమంత! ఎందుకో తెలుసా? ఓటీటీలో రామారావు ఆన్ డ్యూటీ, అప్పటినుంచే స్ట్రీమింగ్ -
'లైగర్' ఫస్ట్‌డే కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ రావాలంటే అన్ని కోట్లు రావాల్సిందే!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన చిత్రం 'లైగర్'. భారీ అంచనాల నడుమ నిన్న(గురువారం) ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది. కానీ సినిమా మాత్రం అనుకున్నంతగా ఆడియెన్స్‌ను మెప్పించలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగానూ నిరాశపరిచింది. పాన్ ఇండియా స్థాయిలో హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా తొలిరోజు రూ. 12కోట్ల షేర్‌ను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ నెగిటివ్ టాక్ కారణంగా ఆ టెర్గెట్ను లైగర్ అందుకోలేకపోయింది. తొలిరోజు తెలంగాణ, ఏపీలో కలిపి రూ. 9. 57కోట్ల షేర్ని మాత్రమే రాబట్టింది. తెలుగురాష్ట్రాల్లో కలెక్షన్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి... నైజాంలో రూ. 4.2కోట్లు సీడెడ్‌లో రూ. 1.32కోట్లు వైజాగ్‌లో రూ. 1.30కోట్లు ఈస్ట్‌లో రూ.. 64లక్షలు వెస్ట్‌లో రూ. 39లక్షలు కృష్ణలో రూ. 48 లక్షలు గుంటూరులో రూ. 83లక్షలు నెల్లూరులో రూ. 40 లక్షల వసూళ్లను రాబట్టింది. ట్రేడ్ అంచనాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు రూ. 12 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా 15.40 కోట్ల గ్రాస్, రూ. 9.57కోట్ల షేర్‌ను రాబట్టింది. ఓవర్ సీస్ సహా వరల్డ్ వైడ్ గా లైగర్ సినిమా తొలి రోజు 33.12 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ రూ. 90కోట్లు ఉండగా, ఇంకా రూ.76.55 కోట్ల వసూళ్లు రావాల్సి ఉంది. -
వంద కోట్ల క్లబ్లో చేరే దిశగా కార్తికేయ 2
హీరో నిఖిల్ సిద్దార్థ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కార్తికేయ 2. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. ఆగస్టు 13న రిలీజైన ఈ చిత్రం టాలీవుడ్లో, బాలీవుడ్లో ఓ రేంజ్లో దూసుకుపోతోంది. రోజులు గడిచేకోద్దీ వసూళ్లు తగ్గుతాయి. కానీ ఈ సినిమా మాత్రం ఏరోజుకారోజు అధిక వసూళ్లు సాధిస్తూ రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.75.33 కోట్లు రాబట్టింది. ఈ సినిమా దూకుడు చూస్తుంటే త్వరలోనే వంద కోట్ల క్లబ్లో చేరేట్లు కనిపిస్తోంది. Thank You🙏🏽 Indian Movie Lovers ki 🙏🏽🙏🏽🙏🏽🔥 #Karthikeya2 #Karthikeya2Hindi pic.twitter.com/CL7a5Uuthj — Nikhil Siddhartha (@actor_Nikhil) August 22, 2022 #Karthikeya2Hindi growth is outstanding. 2nd week numbers- Fri: ₹2.46 cr Sat: ₹3.04 cr Sun: ₹4.07 cr Total: ₹15.32 cr 🔥 At the same time, a film starring Tapsee and directed by Anurag Kashyap #Dobaaraa gets Fri: ₹72 lacs Sat: ₹1.02 cr Sun: ₹1.24 cr Total: ₹2.98 cr pic.twitter.com/vsMVigH3Ii — idlebrain jeevi (@idlebrainjeevi) August 22, 2022 చదవండి: విడాకుల తర్వాత ఒక్కటిగా కనిపించిన ధనుష్, ఐశ్వర్య.. ఫొటో వైరల్ నెపోటిజంపై నోరు విప్పిన నాగ చైతన్య.. ఏమన్నాడంటే -
కావాలనే టార్గెట్ చేశారు.. అందుకే ఓపెనింగ్స్ తగ్గాయి: కరీనా కపూర్
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం 'లాల్‌సింగ్ చడ్డా'. కరీనా కపూర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో నాగచైతన్య కీలక పాత్రలో నటించారు. అద్వెత్ చందన్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. తాజాగా ఈ వ్యవహారంపై కరీనా కపూర్ స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో లాల్ సింగ్ చడ్డా ఓపెనింగ్స్‌పై ఆమె మాట్లాడుతూ.. 'కొందరు కావాలనే ఈ సినిమాను టార్గెట్ చేశారని ఆరోపించింది. కేవలం ఒక్కశాతం ప్రేక్షకులే ఇలా చేస్తున్నారు. విడుదలకు ముందే ‘బాయ్‌కాట్ లాల్ సింగ్ చద్దా’ అంటూ దుష్ప్రచారం చేశారు. ఆ వ్యతిరేక ప్రచారం వల్లే ఓపెనింగ్స్ తగ్గాయి. ఈ సినిమాను బహిష్కరిస్తే మంచి సినిమాను దూరం చేసినవారవుతారు. మూడేళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డాం. దయచేసి మా సినిమాను బహిష్కరించకండి' అంటూ కరీనా విఙ్ఞప్తి చేసింది. -
సీతారామం కలెక్షన్స్: ఐదు రోజుల్లో ఎంత రాబట్టిందంటే?
సీతారామం.. సినిమా అంత ఈజీగా మెదళ్లను వదిలి వెళ్లడం లేదంటున్నారు ప్రేక్షకులు. ఒకసారి మూవీ చూశాక దాని జ్ఞాపకాలు వెంటాడుతున్నాయంటున్నారు. అంతలా జనాలకు కనెక్ట్ అయిందీ చిత్రం. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా.. ఇలా అందరూ అద్భుతంగా నటించిన సీతారామం సినిమాను డైరెక్టర్ హను రాఘవపూడి ఓ అద్భుత కావ్యంగా మలిచారు. వీరి కష్టం వృథా కాలేదు. సినిమా సూపర్ హిట్టయింది. మూడు రోజుల్లోనే రూ.25 కోట్లు రాబట్టిన ఈ సినిమా మొత్తంగా ఐదు రోజులు పూర్తయ్యే సరికి రూ.33 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్లోనూ సినిమా దుమ్మురేపుతోంది. ఇప్పటివరకు అక్కడ 750 వేల డాలర్లు రాబట్టింది. చూస్తుంటే త్వరలోనే వన్ మిలియన్ డాలర్ క్లబ్బులో చేరేట్లు కనిపిస్తోంది. చదవండి: హీరోయిన్ లయను బాలయ్య చెల్లెలి పాత్రకు అడిగితే ఏడ్చేసింది బెడ్ షేర్ చేసుకోవాలనుందని అడిగిందంటే ఆమె ఆడదే కాదు: నటుడు -
కలిసొచ్చిన సండే, ఇప్పటిదాకా సీతారామం ఎంత వసూలు చేసిందంటే?
చాలా రోజుల తర్వాత థియేటర్లో చూసిన అందమైన ప్రేమకావ్యం సీతారామం.. సినిమా చూశాక ప్రేక్షకులు సంతోషంతో చెప్తున్న మాటిది.. హీరోహీరోయిన్ల నటన, సాంగ్స్, ప్రతి సీనూ అద్భుతంగా ఉండటంతో సీతారామం సినిమాకు పాజిటివ్ స్పందనే కాదు అంతకుమించిన కలెక్షన్లు కూడా వస్తున్నాయి. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ మూవీని హను రాఘవపూడి తెరకెక్కించాడు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న థియేటర్లలో రిలీజైంది. విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.5.60 కోట్ల గ్రాస్, రూ.3.05 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. రెండో రోజు ఈ వసూళ్లు కొంత పెరగడంతో రూ.7.25 కోట్ల గ్రాస్ రాగా రూ.3.63 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక మూడో రోజు ఆదివారం కావడంతో ఈ కలెక్షన్లు రెట్టింపయ్యాయి. కేవలం మూడు రోజుల్లోనే సీతారామం ప్రపంచవ్యాప్తంగా రూ.25 కోట్ల గ్రాస్ సాధించింది. మొత్తానికి సీతా, రామ్‌ల మ్యాజిక్ ఇంకా కొనసాగేలా కనిపిస్తోంది. Timeless Blockbuster #SitaRamam Grossed 25 Crores Worldwide in 3️⃣ days 💥 💥 #SitaRamamInCinemas @dulQuer @mrunal0801 @iamRashmika @iSumanth @hanurpudi @AshwiniDuttCh @VyjayanthiFilms @SwapnaCinema @DQsWayfarerFilm @LycaProductions @SonyMusicSouth @proyuvraaj pic.twitter.com/soLWFzobVg — Ramesh Bala (@rameshlaus) August 8, 2022 #SitaRamam gaining love ❤ from everywhere! Watch the classical love story 💌 of Ram & Sita 💕 in Theaters near you for the amazing visual experience! ✨@dulQuer @mrunal0801 @iamRashmika @iSumanth @hanurpudi @AshwiniDuttCh @LycaProductions @proyuvraaj pic.twitter.com/b7bbY6nDWR — Ramesh Bala (@rameshlaus) August 8, 2022 చదవండి: థియేటర్, ఓటీటీలో సందడి చేసే సినిమాలివే! శ్రీదేవి సినిమాలను రీమేక్ చేస్తారా? జాన్వీ ఆన్సరిదే -
వారియర్ మొదటి రోజు ఎంత రాబట్టిందంటే?
రామ్ పోతినేని, కృతీశెట్టి జంటగా నటించిన మూవీ వారియర్. ఆది పినిశెట్టి విలన్‌గా, అక్షర గౌడ ముఖ్యపాత్రలు పోషించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో జూలై 14న విడుదలైంది. కాన్సెప్ట్ కొత్తగా ఉందని, రామ్ మరోసారి తన నటనతో, స్టెప్పులతో ఇరగదీశాడంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి. అదే సమయంలో కథనం మాత్రం సరికొత్తగా ఏమీ లేదంటూ కొందరు సినీవిశ్లేషకులు బాహాటంగానే విమర్శించారు. మరి మిశ్రమ స్పందన అందుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు ఎంత షేర్ సాధించిందో తెలుసా? రూ.8.73 కోట్లు. మొత్తంగా రూ.39.10 కోట్లు ప్రీరిలీజ్ బిజినెస్ జరిపిన వారియర్ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.39 కోట్లు రాబట్టాలి. మరి మొదటి రోజు వారియర్ ఏయే ప్రాంతాల్లో ఎంత వసూలు చేసిందో కింద చూసేయండి.. ♦ నైజాం : రూ.1.96 కోట్లు ♦ సీడెడ్ : రూ.1.04 కోట్లు ♦ యూఏ : రూ.1.02 కోట్లు ♦ తూర్పు గోదావరి : రూ.51 లక్షలు ♦ పశ్చిమ గోదావరి: రూ.67 లక్షలు ♦ గుంటూరు : రూ.1.19 కోట్లు ♦ కృష్ణా: రూ.38 లక్షలు ♦ నెల్లూరు : రూ.29 లక్షలు ♦ వైజాగ్: రూ.1.02 కోట్లు ► ఆంధ్రా, తెలంగాణ మొత్తం షేర్ : రూ.7 కోట్ల పైచిలుకు ♦ కర్ణాటక: రూ.32 లక్షలు ♦ తమిళనాడు: రూ.94 లక్షలు ♦ ఓవర్సీస్: రూ. 30 లక్షలు ► ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వసూళ్లు: రూ.8.73 కోట్లు చదవండి: రూ. 1000 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిన హీరో? అన్నదమ్ములతో హీరోయిన్ల డేటింగ్ !.. ఫొటోలు వైరల్ -
2.0 తర్వాత ఆ రికార్డు అందుకున్న ఏకైక చిత్రం 'విక్రమ్'
కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘విక్రమ్’. కోలీవుడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని తెలుగులో హీరో నితిన్, నిర్మాత సుధాకర్ రెడ్డి విక్రమ్: హిట్ లిస్ట్ పేరుతో రిలీజ్ చేశారు. జూన్ 3న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి జనం బ్రహ్మరథం పట్టారు. ఉలగనాయన్(లోక నాయకుడు) ఈజ్ బ్యాక్ అంటూ నెట్టింట తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తాజాగా ఈ సినిమా రిలీజైన నెల రోజుల్లోపే రూ.400 కోట్ల వసూళ్లు సాధించింది. రోబో 2.0 తర్వాత ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లు వసూలు చేసిన రెండో తమిళ చిత్రంగా విక్రమ్ రికార్డు సృష్టించింది. కాగా ఈ సినిమా సక్సెస్ సాధించిన సంతోషంలో చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన వారికి, థియేటర్ యజమానులకు ఇటీవల స్పెషల్ పార్టీ ఇచ్చింది మూవీ యూనిట్. ఇక కమల్ హాసన్ అయితే ఏకంగా 13 మంది అసిస్టెంట్ డైరెక్టర్లకు బైకులు, రోలెక్స్ పాత్రలో నటించిన సూర్యకు ఖరీదైన రోలెక్స్ వాచ్, డైరెక్టర్ శోకేశ్ కగనరాజుకు కోటి విలువ చేసే లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే! #Vikram - 400 CR total WW gross done 🔥👌👏 as it approaches the 25 days mark in theaters tomorrow. Just WOW! "Once upon a time" kinda success this is! #400CRVikram Naanooru Kodi dawwww! #KamalHaasan𓃵 — Kaushik LM (@LMKMovieManiac) June 26, 2022 చదవండి: ప్రేమ వివాహానికి రెడీ అవుతున్న హీరో రామ్, త్వరలో ప్రకటన?! నాలుక కొరికేసుకో.. బండ్ల గణేశ్‌కు పూరీ జగన్నాథ్ వార్నింగ్?! -
16 రోజుల్లో రూ. 300 కోట్లు.. బాహుబలి 2 రికార్డు బద్దలు..
సుమారు నాలుగేళ్ల తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేశాడు ఉలగ నాయగన్ (లోక నాయకుడు) కమల్ హాసన్. ఆయన తాజాగా నటించి సూపర్ బ్లాక్‌బ్లస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం 'విక్రమ్'. కమల్‌తోపాటు విజయ్‌సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య విభిన్న పాత్రల్లో అలరించిన ఈ సినిమాకు లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించారు. నాలుగేళ్ల తర్వాత ఈ సినిమాతో పవర్ఫుల్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు కమల్ హాసన్. అయితే ఈ మూవీ విడుదలైన 16 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్లలో సగం అంటే రూ. 150 కోట్లు ఒక్క తమిళనాడు రాష్ట్రం నుంచే వచ్చాయట. దీంతో ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో ఉన్న బాహుబలి 2 సినిమా కలెక్షన్ల రికార్డును విక్రమ్ బద్దలు కొట్టినట్లయింది. వచ్చే రోజుల్లో విక్రమ్ మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా ఇటీవల ఈ సినిమా సక్సెస్ సాధించిన సంతోషంలో చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన వారికి, థియేటర్ యజమానులకు స్పెషల్ పార్టీ ఇచ్చింది మూవీ యూనిట్. మూవీని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది. చదవండి: 'విక్రమ్' సక్సెస్ డిన్నర్ పార్టీ.. విందులోని వంటకాలు ఇవే.. చెత్త ఏరిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్ కామంతో కళ్లు మూసుకుపోతే.. -
'అంటే.. సుందరానికీ' వచ్చిన కలెక్షన్లు ఎంతంటే ?
Nani Ante Sundaraniki First Week Box Office Collections: నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లెటెస్ట్ మూవీ ‘అంటే..సుందరానికీ’.‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’లాంటి చిత్రాలతో చక్కటి గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో నాని ఓ బ్రాహ్మణ కుర్రాడిగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయిగా జోడి కట్టారు. ప్యూర్ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 10న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సంపాదించుకుంది. ఈ సినిమా మొదటి వారం హిట్ టాక్‌తో దూసుకెళ్లినా, తర్వాత కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. ఈ సినిమా ఫస్ట్ వీక్ పూర్తయ్యే సరికి వరల్డ్‌వైడ్‌గా రూ. 18.39 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ. 32.60 కోట్లు కొల్లగొట్టి నాని కెరీర్లో మంచి హిట్ మూవీగా సినిమా నిలిచిందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఏరియాలా వారీగా ఈ మూవీ మొదటి వారం కలెక్షన్లు ఈ కింది విధంగా ఉన్నాయి. నైజాం- రూ. 5.58 కోట్లు సీడెడ్- రూ. 1.13 కోట్లు ఉత్తరాంధ్ర- రూ. 1.33 కోట్లు ఈస్ట్- రూ. 0.93 కోట్లు వెస్ట్- రూ. 0.79 కోట్లు గుంటూరు- రూ. 0.87 కోట్లు కృష్ణా- రూ. 0.84 కోట్లు నెల్లూరు- రూ. 0.58 కోట్లు మొత్తం ఏపీ, తెలంగాణ కలిపి- 12.05 కోట్లు (రూ. 20.40 కోట్లు గ్రాస్) కర్ణాటకతోపాటు దేశవ్యాప్తంగా- 1.34 కోట్లు ఓవర్సీస్- 5 కోట్లు ప్రపంచవ్యాప్తంగా- రూ. 18.39 కోట్లు (రూ. 32.60 కోట్లు గ్రాస్) చదవండి: సైలెంట్‌గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్.. కాలేజ్‌లో డ్యాన్స్ చేసిన సాయి పల్లవి.. వీడియో వైరల్.. ఓటీటీలోకి 'విరాట పర్వం'.. ఎప్పుడంటే ? -
ఇప్పుడు నా అప్పులన్నీ తీర్చేస్తా: కమల్ హాసన్
Kamal Haasan Says He Will Repay All Loans Vikram Earns 300 Cr Worldwide: సుమారు నాలుగేళ్ల తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేశాడు ఉలగ నాయగన్ (లోక నాయకుడు) కమల్ హాసన్. ఆయన తాజాగా నటించి బ్లాక్‌బ్లస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం 'విక్రమ్'. కమల్‌తోపాటు విజయ్‌సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య విభిన్న పాత్రల్లో అలరించిన ఈ సినిమాకు లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించారు. నాలుగేళ్ల తర్వాత ఈ సినిమాతో పవర్ఫుల్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు కమల్ హాసన్. ఈ మూవీ విడుదలైన రెండు వారాల్లో రూ. 300 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ విషయంపై తాజాగా కమల్ హాసన్ స్పందించారు. చెన్నైలో రక్తదాన ప్రచార కార్యక్రమంలో జరిగిన ప్రెస్మీట్లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలంటే డబ్బు గురించి చింతించని నాయకుడు మనకు కావాలి. గతంలో ఒకసారి నేను రూ. 300 కోట్లు సంపాదించగలను అని చెబితే ఎవరూ నా మాట నమ్మలేదు. అసలు వాళ్లు అర్థం చేసుకోలేదు కూడా. ఇప్పుడు విక్రమ్ బాక్సాఫీస్ వసూళ్లతో నా మాట నిజమైంది. ఇక ఇప్పుడు నా అప్పులన్నీ తీర్చేస్తా. నాకిష్టమైన ఆహారాన్ని తింటాను. నా కుటుంబం, సన్నిహితులకు చేతనైన సాయం చేస్తాను. ఒకవేళ నా దగ్గర డబ్బు అయిపోతే ఇవ్వడానికి ఏం లేదని చెప్పేస్తా. వేరే వాళ్ల దగ్గర డబ్బు తీసుకుని పక్కన వాళ్ల సాయం చేయాలని నాకు ఉండదు. నాకు గొప్ప పేరు వద్దు. ఒక మంచి మనిషిగా ఉండాలనుకుంటున్నాను.' అని కమల్ హాసన్ పేర్కొన్నాడు. చదవండి:👇 ఏమాత్రం తగ్గని 'విక్రమ్'.. 10 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే.. ఆ పాత్ర కోసం 15 రోజులు ఇంట్లో వాళ్లతో మాట్లాడలేదు: నటుడు హైదరాబాద్ ఆస్పత్రిలో చేరిన దీపికా పదుకొణె.. -
ఏమాత్రం తగ్గని 'విక్రమ్'.. 10 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే..
Vikram Movie Collections Worldwide: ఉలగ నాయగన్ (లోక నాయకుడు) కమల్ హాసన్ సుమారు నాలుగేళ్ల తర్వాత విక్రమ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య విభిన్న పాత్రల్లో అలరించారు. ముఖ్యంగా కమల్ హాసన్ చేసిన యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇక 'విక్రమ్' బాక్సాఫీస్ కలెక్షన్లలో ఏమాత్రం తగ్గట్లేదు. కమల్ హాసన్ కెరీర్లోనే సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. 2022లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ సినిమాల్లో ఒకటిగా 'విక్రమ్' నిలిచింది. ఈ సినిమా విడుదలైన తొలి రోజు రూ. 45 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. తాజాగా ప్రపంచవ్యాప్తంగా 10 రోజుల్లో సుమారు రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు సమాచారం. ఒక్క తమిళనాడులోనే పది రోజుల్లో రూ. 100 కోట్లను కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. ఒక్క ఆదివారం రోజే రూ. 11 కోట్ల కలెక్షన్లతో 'విక్రమ్' దుమ్ములేపాడు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాడు విక్రమ్. గత 10 రోజుల్లో రూ. 25 కోట్లకుపైగా వసూలు చేసినట్లు పలు నివేదికలు తెలుపుతున్నాయి. ఇక కేరళలో ఇప్పటివరకు రూ. 30 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టగా, కర్ణాటకలో సుమారు 15 కోట్లు సాధించినట్లు సమాచారం. అయితే ఈ వీకెండ్ పూర్తయ్యేవరకూ మరిన్ని కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. చదవండి: సూర్య ‘రోలెక్స్ సర్’ అంత బాగా ఎలా పేలాడు? At the end of 2nd weekend, #Vikram has crossed the ₹ 300 Cr gross mark at the WW Box office.. 🔥 A first for #Ulaganayagan @ikamalhaasan and rest of the cast and crew! @VijaySethuOffl #FahadhFaasil @Suriya_offl @Dir_Lokesh @anirudhofficial @RKFI @turmericmediaTM — Ramesh Bala (@rameshlaus) June 13, 2022 Looks like #Vikram is gonna break more box office records this weekend ! Unbelievable collections ! Ulaganayakan @ikamalhaasan sir @Dir_Lokesh @anirudhofficial @VijaySethuOffl @turmericmediaTM #Fahad @RedGiantMovies_ — Udhay (@Udhaystalin) June 10, 2022 -
మేజర్.. వారం రోజుల్లో ఎంత రాబట్టిందంటే?
ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణాన్ని అడ్డేసిన హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన ఈ రియల్ హీరో జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మేజర్. యువ కథానాయకుడు అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు శశికిరణ్ తిక్క దర్శకుడు. సయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ హీరోయిన్స్‌గా నటించగా, ప్రకాశ్ రాజ్, రేవతి కీలక పాత్రలు పోషించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. అనురాగ్, శరత్ నిర్మించిన ఈ మూవీ జూన్ 3న విడుదలవగా సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. తొలి రోజే రూ.13.10 కోట్ల గ్రాస్ సాధించిన ఈ చిత్రం వారం రోజుల్లోనే రూ.50.7 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసిన అడివి శేష్.. ఇది తన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అని రాసుకొచ్చాడు. తన గత సినిమాల కంటే మేజర్ మూడు రెట్లు ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిందని సంతోషం వ్యక్తం చేశాడు. Our film inspired by #MajorSandeepUnnikrishnan has touched so many hearts. #Major has become the biggest blockbuster of my career x 3. And the journey to touch more hearts has just begun ❤️🇮🇳#IndiaLovesMAJOR My gratitude to god, the audience, the team and my producers. pic.twitter.com/blsYrmBBvx — Adivi Sesh (@AdiviSesh) June 10, 2022 A heartfelt note penned by the colleague of the great man 'Major Sandeep Unnikrishnan' after watching #MajorTheFilm 🇮🇳#IndiaLovesMAJOR 🇮🇳❤️@AdiviSesh @SashiTikka @urstrulyMahesh @sonypicsfilmsin @AplusSMovies @ZeeMusicCompany pic.twitter.com/ljWmoKd5nu — GMB Entertainment - MajorTheFilm In CINEMAS NOW (@GMBents) June 10, 2022 చదవండి: కిన్నెరసాని రివ్యూ సీక్రెట్‌గా సింగర్ పెళ్లి, ఆపేందుకు ప్రయత్నించిన భర్త -
మూడు రోజుల్లోనే రూ.150 కోట్లు సాధించిన విక్రమ్
లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం విక్రమ్. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఈ సినిమాతో వచ్చిన కమల్ కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు. తొలి రోజే రూ.45 కోట్లకు పైగా రాబట్టిన విక్రమ్ తాజాగా రూ.150 కోట్ల మార్క్‌ను దాటేసింది. వీకెండ్‌ను బాగా క్యాష్ చేసుకున్న ఈ మూవీ కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు అందుకుంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ విక్రమ్ దుమ్ము దులుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ వీకెండ్ (జూన్ 3 నుంచి 5 వరకు) అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో విక్రమ్ మూడో స్థానంలో ఉంది. 167 మిలియన్ డాలర్లతో టాప్ గన్ మావెరిక్ మొదటి స్థానంలో, 55 మిలియన్ డార్లతో జురాసిక్ వరల్డ్ డొమీనియన్రెండో స్థానంలో నిలవగా 21 మిలియన్ డాలర్లతో విక్రమ్ మూడో స్థానంతో పాగా వేసింది. కాగా జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విక్రమ్‌లో కమల్ యాక్షన్ సీన్స్‌తో అదరగొట్టాడు. #Vikram has crossed ₹ 150 Crs at the WW Box office in 3 days.. 🔥 — Ramesh Bala (@rameshlaus) June 6, 2022 67 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా ఫైట్స్ సీన్స్ చేయడం గమనార్హం. విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని’రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్ తో కలిసి కమల్ హాసన్ నిర్మించారు. ఈ సినిమాను తెలుగులో 'విక్రమ్: హిట్ లిస్ట్' పేరుతో సుధాకర్ రెడ్డి, హీరో నితిన్ విడుదల చేశారు. ‘VIKRAM’ SCORES BIG NUMBERS IN INTERNATIONAL MARKETS… #Vikram is having a DREAM RUN #Overseas… Total till Saturday… ⭐️ USA: $ 1,372,386 [₹ 10.65 cr] ⭐️ #UK: £ 2,86,589 [₹ 2.78 cr] ⭐️ #Australia: A$ 463,506 [₹ 2.60 cr] ⭐️ #NZ: NZ$ 47,285 [₹ 24.01 lacs] contd… pic.twitter.com/zIC195hwib — taran adarsh (@taran_adarsh) June 5, 2022 #Vikram - #Overseas - Total till Saturday… ⭐️ #Canada: C$ 28,299 [₹ 17.43 lacs] ⭐️ #Ireland: £ 17,117 [₹ 16.60 lacs]@comScore — taran adarsh (@taran_adarsh) June 5, 2022 #Vikram / #VikramHitlist will become 2022 's Highest Grossing Kollywood movie, both in India 🇮🇳 and Overseas 🌎 — Ramesh Bala (@rameshlaus) June 6, 2022 #Vikram has debuted at No.3 at the WW Box office for the June 3rd to 5th weekend Box office.. 1. #TopGunMaverick - $167 Million 2. #JurassicWorldDominion - $55 Million 3. #Vikram - $21 Million 4. #DoctorStrange - $20.65 Million 5. #TheBadGuys - $12 Million — Ramesh Bala (@rameshlaus) June 6, 2022 చదవండి: కోలీవుడ్‌కి కియారా.. ఆ హీరోతో ఫస్ట్ మూవీ! షారుక్‌కి కరోనా -
‘మేజర్’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే..
అడివి శేష్ హీరోగా,సయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ హీరోయిన్స్‌గా శశి కిరణ్ తిక్క తెరకెక్కించిన చిత్రం ‘మేజర్’. 26\ 11ముంబై దాడుదల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణణ్ జీవిత ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. మహేశ్‌బాబు జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఏస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన ఈ చిత్రం జూన్ 3న విడుదలైంది. (చదవండి: మేజర్ మూవీ రివ్యూ) ఈ మూవీకి తొలి షో నుంచే పాజిటివ్ టాక్ లభించింది. అడివి శేష్ నటన, శశికిరణ్ టేకింగ్‌పై విమర్శకులు సైతం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. దీంతో ఈ చిత్రం తొలిరోజు బాక్సాపీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 7.12 కోట్ల షేర్, 13.10 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణాలో మొత్తంగా రూ.4 కోట్లను వసూలు చేసింది. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.14.93 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే..రూ.15 కోట్ల షేర్ రాబట్టాలి. ‘మేజర్’ తొలిరోజు కలెక్షన్స్ ► నైజాం - రూ.1.75 కోట్లు ► సీడెడ్ - రూ.46 లక్షలు ► ఈస్ట్ - 24 లక్షలు ► వెస్ట్ - రూ.24 లక్షలు ► ఉత్తరాంధ్ర - రూ.51 లక్షలు ► గుంటూరు- 30 లక్షలు ► కృష్ణా - రూ.28లక్షలు ► నెల్లూరు - రూ.19లక్షలు ► కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా- 0.35కోట్లు ►ఓవర్సీస్-2.35 కోట్లు ►మొత్తం- రూ.7.12 కోట్లు(రూ.13.10కోట్ల గ్రాస్) -
హిందీలో అత్యధిక వసూళ్లు చేసిన 2వ సినిమా కేజీయఫ్ 2, తొలి సినిమా ఏదో తెలుసా?
KGF 2 Becomes All Time Second Highest Hindi Grosser: ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కేజీయఫ్ 2 కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ మూవీ విడుదలై మూడు వారాలకు పైగా గడుస్తున్న ఇప్పటికీ థియేటర్లో ఈ మూవీ హావా కొనసాగుతూనే ఉంది. యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజే విడుదలైన అన్ని భాషల్లో (కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ) భారీ వసూళ్లను రాబట్టింది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ బాలీవుడ్లో అరుదైన ఘనతను సాధించింది. చదవండి: విరాట పర్యం రిలీజ్ డేట్ వచ్చేసింది, ఆ రోజే బిగ్స్క్రీన్పై సందడి విడుదలైన 22 రోజుల్లోనే ఈ మూవీ దంగల్ లైఫ్‌టైం కలెక్షన్స్‌ను దాటేసి అప్పటికి వరకు ఉన్న ఆ మూవీ రికార్డును చెరిపేసింది. ‘దంగల్’ చిత్రం లైఫ్‌టైం రన్లో రూ. 387.40 కోట్లు వసూలు చేయగా... కేవలం 22 రోజుల్లోనే ఆ రికార్డును 'కేజీఎఫ్2' అధిగమించింది. ఇక నిన్నటి(మే 5) వరకు కేజీయఫ్ 2 బి-టౌన్ బాక్సాఫీసు వద్ద రూ. 391.65 కోట్లు వసూలు చేసింది. ఈ రోజు(మే 6) కలెక్షన్స్‌తో రూ. 400 కోట్ల పైగా వసూలు చేసే అవకాశం ఉందని గురువారం ప్రముఖ ట్రెడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ వెల్లడించగా.. రమేశ్ బాలా అనే మరో ట్రెడ్ అనలిస్ట్ నేటితో కేజీయఫ్ 2 రూ. 400 కోట్ల క్లబ్‌లోకి చేరిందని తెలిపాడు. చదవండి: ఉపాసన.. నా మైండ్లోనూ అదే ఉంది, కానీ మనం కొద్ది రోజులు ఆగాల్సిందే! దీంతో హిందీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో సౌత్ సినిమాగా కేజీయఫ్ 2 నిలిచింది. ఇప్పటి వరకు హిందీలో అత్యధిక వసూళు చేసిన దక్షిణాది సినిమాల్లో బాహుబలి 2 మొదటి స్థానంలో ఉంది. బాహుబలి 2 హిందీ వెర్షన్ అక్కడ రూ. 511.30 కోట్లు వసూలు చేసింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే హిందీలో ఇప్పటి వరకు కేవలం రెండు చిత్రాలు మాత్రమే రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. ఆ రెండూ దక్షిణాది చిత్రాలే (బాహుబలి2, కేజీఎఫ్2) కావడం విశేషం. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆగని 'ఆర్ఆర్ఆర్' కలెక్షన్లు.. ఎంత వసూలు చేసిందంటే ?
RRR Movie Fourth Week Box Office Collections: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్లుగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్ర.. రణం.. రుధిరం). దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 24న విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టింది. వెయ్యి కోట్లకుపైగా వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా సత్తా చాటింది. ఈ చిత్రం ఓవర్సీస్లోనే రూ. 300 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టగా.. బాలీవుడ్లో కూడా రూ. 300 కోట్లను వసూలు చేసింది. తాజాగా ఈ చిత్రం నాలుగు వారాల కలెక్షన్లను వెల్లడించింది మూవీ యూనిట్. ఆర్ఆర్ఆర్ మూవీ వరల్డ్ వైడ్‌గా రూ. 1100 కోట్ల కలెక్షన్లను రాబట్టినట్లు తెలిపింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ. 350 కోట్లకుపైగా వసూలు చేయగా.. కన్నడ, తమిళం, మలయాళంలో సుమారు మరో వంద కోట్లకుపైగా కలెక్షన్లు వచ్చాయి. కేవలం ఇండియాలో మాత్రమే 7 వందలకోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది ఈ మూవీ. దీంతో బాహుబలి తర్వాత రెండోస్థానంలో ఆర్ఆర్ఆర్ నిలిచింది. అయితే ఈ చిత్రం 1100 కోట్లు గ్రాస్ కలెక్షన్ సాధించినా షేర్ మాత్రం రూ. 600 కోట్లకే పరిమితమైంది. చదవండి: ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్, ఆ తేదీ నుంచే స్ట్రీమింగ్? ప్రస్తుతం ఐదో వారంలోకి ఎంటర్ అవుతున్న ఆర్ఆర్ఆర్కి 'కేజీఎఫ్ 2' ఎఫెక్ట్ ఉంది. కేజీఎఫ్ 2కు ముందు వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ తర్వాత వంద కోట్లు రాబట్టేందుకు వారం రోజులు పట్టింది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ వసూళ్లు క్లోజింగ్‌కు చేరుకున్నాయి. మహా అయితే మొత్తంగా మరో 50 నుంచి 100 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' తర్వాత తెలుగు రాష్ట్రాల్లో 'ఆర్ఆర్ఆర్' కలెక్షన్లు పూర్తిగా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. 'RRR' GROSSES ₹ 1100 CR+ WORLDWIDE... OFFICIAL POSTER ANNOUNCEMENT...#SSRajamouli #JrNTR #RamCharan #AjayDevgn #AliaBhatt #DVVDanayya #GBOC pic.twitter.com/QGRIulLI2Z — taran adarsh (@taran_adarsh) April 22, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్ ఎలివేషన్ సీన్‌ను డిలీట్ చేశారు: బయటపెట్టిన నటుడు -
రికార్డులు తొక్కుకుంటూ పోతున్న కేజీఎఫ్ 2, తాజాగా వరల్డ్ రికార్డ్!
సౌత్ నుంచి నార్త్ దాకా అంతా తన అడ్డా అంటున్నాడు రాఖీభాయ్. ఎక్కడైనా తగ్గేదేలే అంటూ బాక్సాఫీస్‌పై కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. కన్నడ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2. కేజీఎఫ్ చాప్టర్‌కు 1కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు. ఏప్రిల్ 14న రిలీజైన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కోట్ల రూపాయలు కొల్లగొడుతోందీ చిత్రం. వీకెండ్లో భారీ మొత్తంలో వసూళ్లు రాబట్టిన తొలి చిత్రంగా నిలిచింది కేజీఎఫ్ చాప్టర్ 2. కామ్‌స్కోర్ నివేదిక ప్రకారం గ్లోబల్ బాక్సాఫీస్‌లో ఏప్రిల్ 15 నుంచి 17 మధ్య అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల్లో ప్రపంచంలోనే కేజీఎఫ్ రెండవ స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే మూడు రోజుల్లోనే రూ.400 కోట్ల మార్క్‌ను దాటేసిన ఈ మూవీ తాజాగా రూ.500 కోట్ల క్లబ్బులో చేరింది. ఇప్పటివరకు ఈ సినిమాకు రూ.552 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి. మరి రానున్న రోజుల్లో ఈ చిత్రం ఇంకెన్ని రికార్డులు బద్ధలు కొడుతుందో చూడాలి! #KGFChapter2 Debuts at #2 globally for the opening weekend. First movie from Sandalwood to get into Global Top 10 opening weekend. Only Indian movie to get into Global top 10 for the weekend April 15-17.#KGF2 — Manobala Vijayabalan (@ManobalaV) April 18, 2022 #KGFChapter2 WW Box Office CROSSES ₹500 cr milestone mark in just 4 days. Day 1 - ₹ 165.37 cr Day 2 - ₹ 139.25 cr Day 3 - ₹ 115.08 cr Day 4 - ₹ 132.13 cr Total - ₹ 551.83 cr #2 at the global box office after fantastic beasts. #Yash #KGF2 — Manobala Vijayabalan (@ManobalaV) April 18, 2022 According to @Comscore , #KGFChapter2 debuts at No.2 in the Global Box office for the Apr 15th to 17th weekend.. It's 1st weekend gross is a Whopping $72.38 Million [₹ 552 Crs] 🔥 pic.twitter.com/GeuMG70ANC — Ramesh Bala (@rameshlaus) April 18, 2022 R#KGF2 CREATES HISTORY AGAIN... FASTEST TO ENTER ₹ 200 CR CLUB... ⭐ #KGFChapter2: Will cross ₹ 200 cr today [Mon, Day 5] ⭐ #Baahubali2: Day 6#KGF2 is REWRITING RECORD BOOKS... Thu 53.95 cr, Fri 46.79 cr, Sat 42.90 cr, Sun 50.35 cr. Total: ₹ 193.99 cr. #India biz. #Hindi. pic.twitter.com/ysKnW2zIuV — taran adarsh (@taran_adarsh) April 18, 2022 చదవండి: రామ్ సినిమాలో బుల్లెట్ సాంగ్ పాడిన శింబు ఈ నెల 14న ఇంటి నుంచి బయటకు.. రెండు రోజుల తర్వాత నిర్జీవంగా అసిస్టెంట్ డైరెక్టర్ -
సలాం కేజీఎఫ్ 2, మూడో రోజు కలెక్షన్స్ ఎంతంటే?
'ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను..' టాలీవుడ్ ఎంతో ఫేమస్ అయిన ఈ డైలాగ్ కేజీఎఫ్ 2కు కరెక్ట్‌గా సూటవుతుంది. బాక్సాఫీస్ మీద దండయాత్ర మొదలుపెట్టిన కేజీఎఫ్ చాప్టర్ 2 కలెక్షన్ల సునామీని ఇప్పట్లో ఆపేదేలే అన్నట్లుగా దూసుకుపోతోంది. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాకు సౌత్ నుంచి నార్త్ దాకా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఏప్రిల్ 14న రిలీజైన ఈ చిత్రం అటు ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు మంచి వసూళ్లను కూడా రాబడుతోంది. కేవలం రెండు రోజుల్లోనే రూ.250 కోట్ల మేర రాబట్టిన ఈ మూవీ కేవలం మూడో రోజే మరో రూ.150 కోట్లు అలవోకగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. సినిమా రిలీజైన మూడు రోజుల్లోనే కేజీఎఫ్ 2 ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టి రికార్డు సృష్టించింది. చదవండి: పదిహేను రోజుల్లోనే ఓటీటీలోకి గని, స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే? టాలీవుడ్లో తొలిరోజు రూ.19 కోట్లకు పైగా షేర్ సాధించిన ఈ మూవీ వరుసగా రెండు, మూడు రోజుల్లో రూ.13 కోట్లు, రూ.10 కోట్లు రాబట్టింది. అటు బాలీవుడ్‌లోనూ రాఖీభాయ్ హవా కొనసాగుతోంది. హిందీలో రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరిన ఈ చిత్రానికి మూడో రోజు రూ.43 కోట్ల మేర కలెక్షన్లు వచ్చాయి. వీకెండ్లో ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. #KGFChapter2 [#Hindi] India Nett: A new 1st weekend record is on the way.. 🔥 Thu 53.95 cr Fri 46.79 cr Sat 42.90 cr. Total: ₹ 143.64 cr. — Ramesh Bala (@rameshlaus) April 17, 2022 #KGFChapter2 WW Box Office ENTERS the ELITE ₹400 cr club. Day 1 - ₹ 165.37 cr Day 2 - ₹ 139.25 cr Day 3 - ₹ 115.08 cr Total - ₹ 419.70 cr Record breaking HAT-TRICK ₹100 cr+ days. #Yash #KGF2 — Manobala Vijayabalan (@ManobalaV) April 17, 2022 చదవండి: చిరంజీవి-చరణ్ వీడియోపై వర్మ సంచలన కామెంట్స్ -
కేజీయఫ్2 సెకండ్ డే కలెక్షన్స్: రికార్డ్స్..రికార్డ్స్..రికార్డ్స్
ఇండియన్ బాక్సాఫీస్‌పై కేజీయఫ్-2 హవా కొనసాగుతోంది. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం గురువారం(ఏప్రిల్ 14)విడుదలై, తొలిరోజు నుంచే హిట్ టాక్ని సంపాదించుకుంది. విమర్శకుల ప్రశంసలతో పాటు భారీ వసూళ్లను రాబడుతోంది. ఫస్ట్‌డే ఓవరాల్‌గా 134.5 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టి రికార్డు సృష్టించిన ఈ చిత్రం.. రెండో రోజు కూడా అదేస్థాయిలో వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. రెండు రోజులకు గాను ఈ చిత్రం దాదాపు 240 కోట్ల రూపాయలను వసూలు చేసి రికార్డు సృష్టించింది. టాలీవుడ్లో తొలిరోజు రూ.19.5 కోట్ల షేర్ సాధించిన ఈ చిత్రం రెండో రోజు రూ.12.95 కోట్లను రాబట్టింది. రెండో రోజుల్లోనే ఓ డబ్బింగ్ మూవీ టాలీవుడ్లో రూ.33 కోట్ల షేర్ రాబట్టడం ఇదే తొలిసారి. గతంలో ఈ రికార్డు రజనీకాంత్ ‘రోబో’పేరిట ఉండేది. టాలీవుడ్లో ఈ మూవీకి రూ. 74 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 75 కోట్ల వరకు షేర్‌ను రాబట్టాల్సి ఉంది. Thu kya main kya Hatja Hatja 🔥 𝐓𝐨𝐨𝐟𝐚𝐧 𝐓𝐨𝐨𝐟𝐚𝐧 ⚡#KGFChapter2 @Thenameisyash @prashanth_neel @VKiragandur @hombalefilms @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7 @excelmovies @AAFilmsIndia @VaaraahiCC @DreamWarriorpic @PrithvirajProd #KGF2BoxOfficeMonster pic.twitter.com/aiiuD8qttp — #KGFChapter2 - Box Office Monster 🔥 (@KGFTheFilm) April 16, 2022 ఇక బాలీవుడ్‌లోనూ కేజీయఫ్ హవా మాములుగా లేదు. అక్కడ తొలి రోజే రూ.50 కోట్లు వసూళ్లు చేసింది. రెండో రోజు దాదాపు 45 కోట్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. కేవలం రెండు రోజుల్లోనే హిందీలో ఈ చిత్రం 100 కోట్ల క్లబ్లో చేరడం విశేషం. ఇక వీకెండ్ కావడంతో శని,ఆదివారాల్లో ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని సీనీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫస్ట్ వీక్ ముగిసేసరికి ఈ మూవీ ఎన్ని వందల కోట్లను కలెక్ట్ చేస్తుందో చూడాలి. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా సంజయ్ దత్, హీరోయిన్గా శ్రీనిధి నటించారు. రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ కీలక పాత్రలు పోషించారు. -
KGF2: బాక్సాఫీస్‌పై రాకీ భాయ్ దాడి.. ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే..
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిచ చిత్రం ‘కేజీయఫ్ చాప్టర్ 2’. భారీ అంచనాల మధ్య గురువారం(ఏప్రిల్ 14) విడుదలైన ఈ చిత్రం.. పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. కథలో పెద్దగా ట్విస్టులు లేకపోయినా.. ప్రశాంత్ నీల్ టేకింగ్‌కు, విజన్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. గతంలో విడుదలైన కేజీయఫ్‌కి తొలుత మిశ్రమ స్పందన రావడంతో కలెక్షన్ల పరంగా కాస్త వెనకపడింది. తర్వాత పబ్లిక్ మౌత్‌తో జనాల్లోకి వెళ్లి భారీ కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. అయితే కేజీయఫ్‌కి ఆ గండం లేకుండా పోయింది. పార్ట్ 1 సూపర్,డూపర్ హిట్ కావడంతో...పార్ట్ 2 అంతకు మించేలా ఉంటుందని అంతా భావించారు. అందుకే విడుదల ముందే ప్రీ బుకింగ్స్‌లో రికార్డ్స్ క్రియేట్ చేసింది. విడుదల తర్వాత సూపర్ హిట్ టాక్ రావడంతో తొలి రోజు భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ఫస్ట్‌డే ఓవరాల్‌గా 134.5 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టి..మరోసారి సౌత్ సినిమాల సత్తా ఏంటో యావత్ భారత్‌కు తెలియజేసింది. బాలీవుడ్లోనే దాదాపు రూ.50 కోట్లను వసూళ్లు చేసినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం తొలిరోజు రూ.19.5 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఓ డబ్బింగ్ మూవీ టాలీవుడ్లో ఇంత కలెక్ట్ చేయడం ఇదే తొలిసారి. గతంలో ఈ రికార్డు రజనీకాంత్ ‘రోబో 2.O’(రూ.12.45 కోట్లు) ఉండేది. కర్ణాటక, తమిళనాడు, కేరళలో కలిసి మరో రూ.50 కోట్లు వసూలు చేసిందట. మొత్తంగా తొలిరోజు రాకీభాయ్ విధ్వంసమే సృష్టించాడు. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా సంజయ్ దత్, హీరోయిన్గా శ్రీనిధి నటించారు. రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ కీలక పాత్రలు పోషించారు. (చదవండి: ‘కేజీయఫ్ 2’ మూవీ రివ్యూ) -
'కేజీఎఫ్ 2' Vs 'బీస్ట్'.. సినీ విశ్లేషకులు ఏమన్నారంటే ?
Yash KGF 2 Vijay Beast Trade Experts About Collections: ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన భారీ బడ్జెట్, బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. మార్చి 25న విడుదలైన ఈ మూవీ సూపర్ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. తాజాగా ఈ ఏప్రిల్‌లో సినిమా ఆడియెన్స్‌ను మరో రెండు భారీ సినిమాలు కనువిందు చేయనున్నాయి. ఒకటి సెన్సేషనల్ హిట్ సాధించిన 'కేజీఎఫ్' సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న చిత్రం 'కేజీఎఫ్: చాప్టర్ 2'. ఇక మరొ మూవీ తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం 'బీస్ట్'. సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి బాలీవుడ్ స్టార్స్ ఉన్న 'కేజీఎఫ్ 2' ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్గా నటించిన 'బీస్ట్' ఒకరోజు ముందుగా ఏప్రిల్ 13న విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే తొలుత ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావాల్సింది. కానీ విజయ్ తన 'బీస్ట్' సినిమాను ఒక రోజు ముందు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు. అయితే ఈ రెండు భారీ సినిమాలు ఒక రోజు తేడాతో విడుదల కావడంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్లు ఎలా ఉండనున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తమిళనాడు థియేటర్, మల్టీఫ్లెక్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తిరుపూర్ ఎం సుబ్రమణ్యం మాట్లాడుతూ 'ఏప్రిల్ మధ్యలో రెండు భారీ బడ్జెట్ చిత్రాల విడుదల కారణంగా థియేటర్ యజమానులు రెండు సినిమాలకు స్క్రీన్ల సంఖ్యను తగ్గించవలసి వస్తుంది. కనీసం ఒక వారం గ్యాప్‌తో విడుదల చేసుంటే అటు నిర్మాతలకు, ఇటు థియేటర్ యజమానులకు మరింత లాభదాయకంగా ఉండేది.' అని తెలిపారు. 'ఎప్పుడైనా సరే ఒక పెద్ద సినిమా విడుదలనే అనువైనది. అయితే వివిధ భాషల్లో రిలీజవుతున్న కేజీఎఫ్ 2 మాతృక భాష కన్నడ, బీస్ట్ మాతృక భాష తమిళం కాబట్టి పెద్ద సమస్య ఏం ఉండకపోవచ్చు.' అని ట్రేడ్ నిపుణుడు రమేష్ బాలా పేర్కొన్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీఎఫ్ 2 పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. అయితే కేజీఎఫ్ 2, బీస్ట్ రిలీజ్ అంచనాలు పూర్తిగా భిన్నమైనవి. బీస్ట్ అనేది ప్రాథమికంగా ఒక తమిళ చిత్రం. ఇది ఇతర భాషల్లోకి డబ్ చేయబడింది. కానీ ఉత్తరాదిన విజయ్‌కు మంచి స్టార్డమ్ ఉంది. 'తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో విజయ్‌కు ఉన్న ప్రజాదరణ కారణంగా బీస్ట్దే పైచేయి అవుతుందని భావిస్తున్నారు. అలాగే కన్నడ సినిమా అయినా కేజీఎఫ్ 1కు నార్త్తోలోనూ ఘన విజయం సాధించిన చరిత్ర ఉన్నందున కేజీఎఫ్ 2 కూడా మంచి పోటీ ఇవ్వనుందనే చెప్పవచ్చు.' అని బాలా తెలిపారు. 'గతంలో ఆర్ఆర్ఆర్ విడుదల సమయంలో తన పోటీదారులతో ఎలా పోరాడిందో పక్కనపెడితే కేజీఎఫ్ 2, బీస్ట్ ఒకేసారి విడుదల కానున్నాయి. వారాంతంలో ఈ సినిమాలకు మంచి బిజినెస్ ఉండనుంది. 2022 సంవత్సరంలో ఇప్పటివరకు ఇదే అత్యుత్తమ వీకెండ్. ఎందుకంటే తమిళ నూతన సంవత్సరం, విషు పండుగతో సహా 5 రోజులు సెలవులు ఉన్నాయి. అలాగే ఇది వేసవి ప్రారంభం. మాకు తెలిసి వేసవిలో 5-10% ప్రేక్షకులు అదనంగా థియేటర్లకు వస్తారు. పండుగ రోజులు ఉండటం వల్ల రెండు చిత్రాలు మంచి కలెక్షన్లు సాధించే అవాకశం ఉంది. ఓపెనింగ్ డే కలెక్షన్ చాలా ముఖ్యమైనదని, ఈ కరోనా పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉన్నందున సినిమా మరింత వాయిదా వేసి ఇతర తేదిల్లో విడుదల చేయడం ఉత్తమం.' అని పరిశ్రమ, ట్రేడ్ నిపుణుడు శ్రీధర్ పిళ్లై తెలిపారు. చదవండి: 'బీస్ట్' నుంచి మరో సాంగ్.. 'జాలీ ఓ జింఖానా' అంటూ విజయ్ సింగింగ్ -
ఆర్ఆర్ఆర్ హవా.. వారం రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే?
పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) ఏ రేంజ్లో హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కరోనా కారణంగా ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన విషయం తెలిసిందే. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే చరిత్ర సృష్టించిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ మీద వసూళ్ల దండయాత్ర చేస్తోంది. ఎక్కడా తగ్గేదేలే అన్న రీతిలో కలెక్షన్లు రాబడుతోంది. కేవలం ఏడు రోజుల్లోనే ఏడు వందల కోట్లకు పైగా సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. బ్రేకుల్లేకుండా దూసుకుపోతున్న ఆర్ఆర్ఆర్ మున్ముందు ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి! చదవండి: అందుకే ఆర్ఆర్ఆర్ పోస్టులు డిలీట్ చేశా: ఆలియా క్లారిటీ ఇక ఆర్ఆర్ఆర్ మూవీ విషయానికి వస్తే.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా, రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించారు. తారక్‌కు జోడీగా ఒలివియా మోరిస్, చెర్రీకి జోడీగా ఆలియా భట్ నటించారు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించాడు. సుమారు రూ.450 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించాడు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించాడు. #RRRMovie WW Box Office ENTERS ₹700 cr club in just 7 days. Day 1 - ₹ 257.15 cr Day 2 - ₹ 114.38 cr Day 3 - ₹ 118.63 cr Day 4 - ₹ 72.80 cr Day 5 - ₹ 58.46 cr Day 6 - ₹ 50.74 cr Day 7 - ₹ 37.20 cr Total - ₹ 709.36 cr — Manobala Vijayabalan (@ManobalaV) April 1, 2022 చదవండి: పరుచూరి వెంకటేశ్వరరావు షాకింగ్ లుక్‌పై స్పందించిన గోపాల కృష్ణ -
సూపర్ డూపర్ హిట్, రూ. 300 కోట్ల క్లబ్బులోకి కశ్మీర్ ఫైల్స్!
సినిమాలో కంటెంట్ లేకపోతే ఉట్టి ప్రచారాలతో ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించడం చాలా కష్టం. కానీ మూవీలో కనెక్ట్ అయ్యే పాయింట్, కట్టిపడేసే కథనం ఉంటే మాత్రం ఏ ప్రచారం చేయకపోయినా జనాలు వాళ్లంతట వాళ్లే థియేటర్‌వైపు వడివడిగా అడుగులు వేస్తారు. అందుకు కశ్మీర్ ఫైల్స్ మూవీయే అతి పెద్ద నిదర్శనం. సైలెంట్‌గా థియేటర్లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత్‌లో మూడు వారాల్లోనే రూ.234.03 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. ఓవర్సీస్ కలెక్షన్లను కూడా కలుపుకుంటే ప్రపంచ్యాప్తంగా రూ.301 కోట్ల గ్రాస్ అందుకుంది. ఈ లెక్కన కశ్మీర్ ఫైల్స్.. సల్మాన్ ఖాన్ 'రేస్ 3'(రూ.294.98 కోట్లు), అక్షయ్ కుమార్ 'సూర్యవంశీ' (రూ.294.17 కోట్లు) చిత్రాలను సైతం వెనక్కినెట్టి రికార్డులు తిరగరాస్తోంది. ఈ దూకుడు చూస్తుంటే త్వరలోనే అక్షయ్ కుమార్ 'టాయ్‌లెట్: ఏక్ ప్రేమ కథ' (రూ.308 కోట్లు) వసూళ్లను కూడా అధిగమించనున్నట్లు కనిపిస్తోంది. #TheKashmirFiles [Week 3] Fri 4.50 cr, Sat 7.60 cr, Sun 8.75 cr, Mon 3.10 cr, Tue 2.75 cr. Total: ₹ 234.03 cr. #India biz. ALL TIME BLOCKBUSTER. pic.twitter.com/KCgOAZd0R9 — taran adarsh (@taran_adarsh) March 30, 2022 చదవండి: రాజకీయాల్లోకి వెళ్లి ఆమెతో నటించే చాన్స్ మిస్సయ్యాను: చిరంజీవి -
RRR: రికార్డు బ్రేకింగ్ వసూళ్లు, మూడో రోజు ఎంత వచ్చిందంటే?
RRR Movie Day 3 Collection: ఆర్ఆర్ఆర్.. ఆల్రెడీ ఈసినిమా చూసినవారు వన్స్‌మోర్ అంటూ థియేటర్ల ముందు క్యూ కడుతుంటే, ఇంకా చూడనివాళ్లు ఎలాగోలా వీలు చేసుకుని మరీ వీక్షించేస్తున్నారు. రాజమౌళి, తారక్, రామ్‌చరణ్‌ల కష్టం వృధా కాదని, ఈ సినిమా రికార్డులు తిరగరాయడం గ్యారెంటీ అని కామెంట్లు చేస్తున్నారు ట్రేడ్ పండితులు. అన్నట్లుగానే మార్చి 25న పాన్ ఇండియా మూవీగా రిలీజైన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్‌పై కనక వర్షం కురిపిస్తోంది. మొదటి రోజు రూ.223 కోట్లకు పైగా రాబట్టిన ఈ చిత్రం తాజాగా రూ.500 కోట్ల మైలురాయిని అధిగమించింది. మరోపక్క హిందీలో తొలిరోజు పెద్ద దూకుడు చూపించని ఈ చిత్రం వీకెండ్లో మాత్రం బాగా పుంజుకుంది. శుక్రవారం రూ.19 కోట్లు, శనివారం రూ.24 కోట్లు రాబట్టగా ఒక్క ఆదివారం నాడే రూ.31.50 కోట్ల మేర వసూలు చేసింది. అంటే ఒక్క హిందీలోనే ఇప్పటివరకు రూ.74.50 కోట్లు సాధించింది. ఇక సినిమా విషయానికి వస్తే ఆర్ఆర్ఆర్ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య రూ.400- 450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. #RRR is setting new BENCHMARKS... ₹ 500 cr [and counting]... WORLDWIDE GBOC *opening weekend* biz... EXTRAORDINARY Monday on the cards... #SSRajamouli brings back glory of INDIAN CINEMA. Note: Non-holiday release. Pandemic era. pic.twitter.com/ztuu4r9eam — taran adarsh (@taran_adarsh) March 28, 2022 #RRRMovie - $65 Million.. At the WW Box office for the opening weekend.. https://t.co/tDUq9VF6w0 — Ramesh Bala (@rameshlaus) March 28, 2022 #BREAKING :#RRR is the No.1 movie in the world for the March 25th to 27th weekend.. 1. #RRRMovie - $60 Million 2. #TheBatman - $45.5 Million 3. #TheLostCity - $35 Million @ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @DVVMovies @RRRMovie @PenMovies @LycaProductions — Ramesh Bala (@rameshlaus) March 28, 2022 #RRR #Hindi is SENSATIONAL, biz jumps on Day 3... FIRST *HINDI* FILM TO CROSS ₹ 30 CR IN A SINGLE DAY [pandemic era]... Mass centres EXCEPTIONAL... SupeRRRb trending gives hope for a STRONG Day 4 [Mon]... Fri 19 cr, Sat 24 cr, Sun 31.50 cr. Total: ₹ 74.50 cr. #India biz. pic.twitter.com/zuYKz90RF6 — taran adarsh (@taran_adarsh) March 28, 2022 #RRR *HINDI* RRRoars on Day 2... Glowing word of mouth has come into play... Multiplexes witness BIG GAINS on Day 2... Single screens ROCKING... Expect BIGGERRR GROWTH on Day 3, should hit ₹ 70+ cr weekend... Fri 20.07 cr, Sat 23.75 cr. Total: ₹ 43.82 cr. #India biz. pic.twitter.com/y6BFnDKwtm — taran adarsh (@taran_adarsh) March 27, 2022 చదవండి: RRR Movie: విమర్శించిన వారితోనే శభాష్ అనిపించుకున్నాడు..! -
RRR: కలెక్షన్ల ప్రవాహం, రెండో రోజు ఎంత వసూలు చేసిందంటే?
ప్రస్తుతం దేశమంతటా ఆర్ఆర్ఆర్ మేనియా నడుస్తోంది. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని చూసేందుకు జనాలు థియేటర్లకు ఎగబడుతున్నారు. రామ్‌చరణ్, తారక్‌ల నటనకు ఫిదా అవుతున్నారు. సౌత్ నుంచి నార్త్ దాకా అంతటా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మరోవైపు అడ్వాన్స్ బుకింగ్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆర్ఆర్ఆర్ తొలిరోజు కలెక్షన్ల సునామీ సృష్టించిన విషయం తెలిసిందే! తొలి రోజు ప్రపంచవ్యాప్తంగారూ.223 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. నిన్న శనివారం కావడంతో ఈ కలెక్షన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నాయి ట్రేడ్ వర్గాలు. హిందీలో తొలిరోజు రూ.18 కోట్లు రాబట్టి సాహో రికార్డును దాటలేకపోయిన ఈ సినిమా రెండో రోజు మాత్రం ఏకంగా రూ.24 కోట్ల మేర వసూలు చేసినట్లు తెలుస్తోంది. వీకెండ్లో ఈ వసూళ్లు మరింత పుంజుకునే ఛాన్స్ ఉంది. రెండో రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.107 -137 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సమాచారం. రెండురోజుల్లోనే ఆర్ఆర్ఆర్ చిత్రం రూ.350 కోట్ల మార్క్‌ను అధిగమించినట్లు తెలుస్తోంది. #RRR has crossed ₹ 350 crs gross at the WW Box office.. — Ramesh Bala (@rameshlaus) March 27, 2022 ఎన్టీఆర్, రామ్‌చరణ్ మల్టీస్టారర్లుగా తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, అజయ్ దేవగణ్‌లతో పాటు హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్, అలిసన్ డూడి, రే స్టీవెన్ సన్ తదితరులు నటించారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. #RRR crosses $7 Million in USA 🇺🇸 — Ramesh Bala (@rameshlaus) March 27, 2022 #RRR Day 2 Share in #Nizam - ₹ 15.10 Crs.. 🔥 pic.twitter.com/XlD6jlZ0n8 — Ramesh Bala (@rameshlaus) March 27, 2022 #RRR improves Hindi collections on Day 2.. All-India Early Estimates ₹ 24 crs Nett.. — Ramesh Bala (@rameshlaus) March 27, 2022 #USA BO - March 25th : 1. #TheLostCity - $11,550,000 (Incl Premieres) 2. #TheBatman - $5,500,000 3. #RRRMovie - $5,400,000 (Incl Premieres) — Ramesh Bala (@rameshlaus) March 27, 2022 చదవండి: కలెక్షన్స్ సునామీ సృష్టించిన ఆర్ఆర్ఆర్... తొలిరోజే రికార్డు బద్దలు -
'ఆర్ఆర్ఆర్' ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్
RRR Movie First Day Collections World Wide: ఆర్ఆర్ఆర్.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత శుక్రవారం(మార్చి25)న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం. ఎన్టీఆర్, రామ్‌చరణ్ మల్టీస్టారర్లుగా తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, అజయ్ దేవగణ్‌లతో పాటు హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్, అలిసన్ డూడి, రే స్టీవెన్ సన్ తదితరులు నటించారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా, రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించారు. భారీ తారాగణం, టెక్నికల్ వాల్యూస్‌తో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. రిలీజ్‌కి ముందే రికార్డులు బద్దలు కొట్టిన ఈ చిత్రం తొలిరోజు కలెక్షన్లలో సునామి సృష్టించింది. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు ఒక్క నైజాం ఏరియాలోనే కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. నైజాం ఏరియాలో తొలి రోజున రూ.23.35 కోట్లు వసూలు చేసింది. తొలిరోజున తెలుగు రాష్ట్రాల్లో సుమారు 120.19కోట్ల వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. అలాగేఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో కూడా ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తోంది. ఓవర్సీస్ కలుపుకొని ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు రూ. 257.15 కోట్లు వసూలు చేసి తెలుగు సినిమా పవర్ మరోసారి చూపించింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #RRRMovie creates HISTORY at the WW Box Office. AP/TS - ₹ 120.19 cr KA - ₹ 16.48 cr TN - ₹ 12.73 cr KL - ₹ 4.36 cr ROI - ₹ 25.14 cr OS - ₹ 78.25 cr [Reported Locs] Total - ₹ 257.15 cr FIRST ever Indian movie to achieve this HUMONGOUS figure on the opening day. — Manobala Vijayabalan (@ManobalaV) March 26, 2022 All-time Record Alert!#RRR 's Day 1 Share in Nizam is a new all-time record of ₹ 23.3 Crs.. Day 1 Telugu States gross must be more than ₹ 100 Crs.. — Ramesh Bala (@rameshlaus) March 26, 2022 -
ఆల్‌టైం బ్లాక్‌బస్టర్: వంద కోట్ల క్లబ్బులో 'కశ్మీర్ ఫైల్స్'
ది కశ్మీర్ ఫైల్స్.. ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. ఇదివరకే చూసినవాళ్లు వన్స్‌మోర్ అంటూ మరోసారి థియేటర్ వైపు అడుగులేస్తుంటే చూడనివాళ్లమే వీలు చేసుకుని మరీ కశ్మీర్ ఫైల్స్ చూసేయాలని తహతహలాడుతున్నారు. అసలు ప్రచారమే చేయకపోయినా కేవలం మౌత్ టాక్‌తోనే జనాలను థియేటర్‌కు రప్పిస్తోందీ మూవీ. ఈ సినిమా చూసిన కశ్మీర్ పండిట్లు గతాన్ని తలుచుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. అలా ఎంతోమందిని కదిలిస్తోందీ చిన్న చిత్రం. మార్చి 11న విడుదలైన ఈ సినిమా నిన్నటితో వందకోట్ల మైలు రాయిని దాటేసింది. వారంరోజుల తర్వాత కూడా (ఎనిమిదో రోజు) 19 కోట్లకు పైగా రాబట్టి బాహుబలి 2 రికార్డుతో సరిసమానంగా తులతూగింది. ఈ విషయాన్ని ట్రేడ్ నిపుణుడు తరణ్ ఆదర్శ్ ట్విటర్ వేదికగా వెల్లడించాడు. 'ది కశ్మీర్ ఫైల్స్ చరిత్ర సృష్టించింది. ఎనిమిదో రోజు అత్యధికంగా రూ.19.15 కోట్లు రాబట్టి దంగల్(రూ.18.59) రికార్డును బద్ధలు కొట్టడమే కాకుండా బాహుబలి 2(రూ.19.75) సరసన నిలిచింది. మొత్తంగా రూ.116.45 కోట్లు రాబట్టి ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది' అని ట్వీట్ చేశాడు. చదవండి: బిగ్‌బీ ట్వీట్‌పై నెటిజన్ల ట్రోలింగ్, కశ్మీర్ ఫైల్స్ గురించేనా? #TheKashmirFiles creates HISTORY… *Day 8* of #TKF [₹ 19.15 cr] is AT PAR with #Baahubali2 [₹ 19.75 cr] and HIGHER THAN #Dangal [₹ 18.59 cr], the two ICONIC HITS… #TKF is now in august company of ALL TIME BLOCKBUSTERS… [Week 2] Fri 19.15 cr. Total: ₹ 116.45 cr. #India biz. pic.twitter.com/sjLWXV78J9 — taran adarsh (@taran_adarsh) March 19, 2022 అంతేకాదు, రెండో వారంలో రూ. 150 కోట్ల మార్క్‌ను కూడా అవలీలగా అందుకుంటుందని జోస్యం పలికాడు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలోనూ ఈ సినిమా డబ్ అవుతోందని చెప్పాడు. కాగా కశ్మీర్ ఫైల్స్‌లో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి, దర్శన్ కుమార్, చిన్మయి, భాషా సుంబ్లి తదితులు నటించారు. ఈ సినిమాకు ఉత్తరప్రదేశ్, గోవా, త్రిపుర, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వినోద పన్ను మినహాయించారు. చదవండి: #TheKashmirFiles highlights... ⭐ Records its HIGHEST *single day total* on [second] Fri [₹ 19.15 cr] ⭐ Will comfortably cross ₹ 150 cr in Weekend 2 ⭐ Advance bookings for [second] Sat and Sun are PHENOMENAL ⭐ Being dubbed in #Tamil, #Telugu, #Kannada and #Malayalam pic.twitter.com/QIfBj7kmcB — taran adarsh (@taran_adarsh) March 19, 2022 -
'ది కశ్మీర్ ఫైల్స్' ప్రభంజనం, ఎన్ని కోట్లు సాధించిందంటే?
ది కశ్మీర్ ఫైల్స్.. చిన్న సినిమా కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. పెద్దగా ప్రమోషన్లు చేయకపోయినా బాక్సాఫీస్‌పై వసూళ్లతో విరుచుకుపడుతోంది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటివరకు అక్షరాలా రూ.60 కోట్లు రాబట్టింది. ఈ విషయాన్ని ట్రేడ్ గురు తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. 'ది కశ్మీర్ ఫైల్స్ బాక్సాఫీస్ సునామీగా, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రోజురోజుకీ వసూళ్లు పెరుగుతున్నాయి. సినిమా రిలీజైన తొలి(మార్చి 11) రోజు మూడున్నర కోట్లు వచ్చాయి. రెండో రోజు రూ.8.50 కోట్లు, మూడో రోజు రూ.15.10 కోట్లు, నాలుగో రోజు రూ.15.05 కోట్లు వచ్చాయి. ఇక ఐదో రోజు(మంగళవారం నాడు) ఏకంగా రూ.18 కోట్లు రాబట్టింది. మొత్తంగా రూ.60.20 కోట్ల కలెక్షన్లు వచ్చాయి' అని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. కలెక్షన్ల స్పీడ్ చూస్తుంటే త్వరలోనే వందకోట్లు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. 1990లో కశ్మీర్ పండిట్లపై సాగిన సాముహిక హత్యాకాండను కళ్లకు కట్టినట్లు చూపించిన సినిమా 'ది కశ్మీర్ ఫైల్స్'. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో నటించడగా దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి కీలక పాత్రల్లో నటించారు. #TheKashmirFiles is a TSUNAMI at the #BO… FANTASTIC TRENDING, as footfalls, occupancy, numbers continue to soar… Day 5 higher than *all* previous days… BLOCKBUSTER... Fri 3.55 cr, Sat 8.50 cr, Sun 15.10 cr, Mon 15.05 cr, Tue 18 cr. Total: ₹ 60.20 cr. #India biz. pic.twitter.com/uaDH3ooVsO — taran adarsh (@taran_adarsh) March 16, 2022 చదవండి: ఓటీటీలోకి ‘ది కశ్మీర్ ఫైల్స్’, స్ట్రీమింగ్ ఎప్పుడంటే? -
రాధేశ్యామ్‌కు పోటీ ఇవ్వనున్న చిత్రం ఇదేనా !
Radhe Shyam Vs The Kashmir Files Box Office Collection: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించిన రొమాంటిక్ ప్రేమకథా చిత్రం 'రాధేశ్యామ్'. రోమన్ కాలం నాటి రొమాంటిక్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ మూవీలో ప్రేమించిన అమ్మాయి జాతకమేమిటో తెలిసిన హీరో.. ఆమెను దక్కించుకోవడం కోసం చేసే సాహసమే రాధేశ్యామ్ కథ. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఇప్పటివరకూ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లే రాబట్టింది. 'రాధేశ్యామ్' ఇండియాలో మొదటి వారంలో సుమారు రూ. 94.50 కోట్లు కొల్లగొట్టింది. అందులో ఒక్క తెలుగు రాష్టాల (తెలంగాణ/ఏపీ) నుంచి రూ. 78.64 కోట్లు సాధించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా రూ. 151 కోట్ల గ్రాస్ వసూలు చేసింది 'రాధేశ్యామ్'. చదవండి: అప్పుడే ఓటీటీకి రాధేశ్యామ్, స్ట్రీమింగ్ ఎక్కడంటే.. కాకపోతే ప్రభాస్ పాపులారిటీ, సినిమా ప్రమోషన్స్‌తో విడుదలైన తొలిరోజు రూ. 46 కోట్లు కొల్లగొట్టింది 'రాధేశ్యామ్'. తర్వాత మిక్స్డ్ పబ్లిక్ టాక్‌తో రోజురోజూకీ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు తగ్గుతున్నాయి. శనివారం (మార్చి 12) రూ. 24. 50 కోట్లు వసూలు చేయగా ఆదివారం (మార్చి 13) రూ. 24 కోట్లు రాబట్టింది. ఈ కలెక్షన్లలో ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ. 37.85 కోట్లతో విడుదలైన రోజు ప్రారంభం కాగా శనివారం రూ. 21.48 కోట్లు, ఆదివారం 19.31 కోట్లు వసూళ్లు సాధించింది. నిజానికి పెద్ద హీరోలంటే విడుదలైన రోజు కంటే తర్వాత రోజుల్లో కలెక్షన్లు ఎక్కువగా ఉంటాయి. కానీ రాధేశ్యామ్ మాత్రం మిక్స్డ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. #RadheShyam AP/TS Box Office Biz stays STRONG despite mixed response. Day 1 - ₹ 37.85 cr Day 2 - ₹ 21.48 cr Day 3 - ₹ 19.31 cr Total - ₹ 78.64 cr#Prabhas — Manobala Vijayabalan (@ManobalaV) March 14, 2022 చదవండి: ప్రధాని మోదీ మెచ్చిన చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'.. సినిమాలో ఏముంది ? ఇక అనేక వివాదాలు, బెదిరింపులు ఎదుర్కొని విడుదలైన హిందీ చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'. ఈ చిత్రానికి సామాజిక అంశాలను ఉన్నది ఉన్నట్లుగా తెరకెక్కించే డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించారు. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి వంటి పాపులర్ యాక్టర్స్ నటించిన ఈ చిత్రం 1990లో కశ్మీర్ పండిట్లపై జరిగిన మారణకాండకు అద్దం పడుతుంది. అదే మార్చి 11న విడుదలైన ఈ మూవీ సాధారణ కలెక్షన్లతో ప్రారంభమైంది. తర్వాత ప్రేక్షకులు, విమర్శకులు, ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రశంసలు కురుపించడంతో మంచి మౌత్ టాక్ సంపాదించుకుంది. దీంతో రోజు రోజుకీ ఈ సినిమా వసూళ్లు పెరిగిపోతున్నాయి. శుక్రవారం విడుదలైన 'ది కశ్మీర్ ఫైల్స్' మొదటి రోజు రూ. 3.55 కోట్లు రాబట్టగా, శనివారం రూ. 8.50 కోట్లు కలెక్ట్ చేసింది. తర్వాత ఆదివారం ఒకేసారి భారీగా రూ. 15.10 కోట్లు వసూళ్లు చేసింది. మొత్తంగా మొదటి వారంలో ఈ మూవీ వసూళ్లు రూ. 27.15 కోట్లకు చేరుకున్నాయి. #TheKashmirFiles shows PHENOMENAL GROWTH… Grows 325.35% on Day 3 [vis-à-vis Day 1], NEW RECORD… Metros + mass belt, multiplexes + single screens, the *opening weekend biz* is TERRIFIC across the board... Fri 3.55 cr, Sat 8.50 cr, Sun 15.10 cr. Total: ₹ 27.15 cr. #India biz. pic.twitter.com/FsKN36sDCp — taran adarsh (@taran_adarsh) March 14, 2022 కలెక్షన్లతో పోల్చుకుంటే 'రాధేశ్యామ్'కు చాలా వెనకంజలో 'ది కశ్మీర్ ఫైల్స్' ఉంది. కానీ రెండు సినిమాలపై ఆడియెన్స్ రెస్పాన్స్ చూస్తుంటే మాత్రం 'రాధేశ్యామ్'ను 'ది కశ్మీర్ ఫైల్స్' కొద్దివరకైనా చేరుకునే అవకాశాలు లేకపోలేదని మూవీ క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా రెండు సినిమా కథలను మాత్రం పోల్చి చూడలేం. ఒకటి రొమాంటిక్ లవ్‌స్టోరీ అయితే మరొకటి నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. అయితే ప్రభాస్ స్టార్డమ్, వరల్డ్‌వైడ్‌గా డార్లింగ్ ఉన్న పాపులారిటీని 'ది కశ్మీర్ ఫైల్స్' రీచ్ అవుతుందా ?.. లేదా బీట్ చేస్తుందా ? చూడాలి. చదవండి: డైరెక్టర్ కాళ్లు పట్టుకుని ఏడ్చేసిన మహిళ.. కంటతడి పెట్టిస్తున్న వీడియో -
‘రాధేశ్యామ్’ తొలి రోజు వసూళ్లు ఎంతంటే..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా, రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ప్రేమకథ చిత్రం ‘రాధేశ్యామ్’. భారీ అంచనాల మధ్య విడుదలైన మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి.. తొలిరోజు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ..కలెక్షన్స్ పరంగా మాత్రం దుమ్ముదులిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రూ.50 కోట్ల షేర్ని సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్లో అయితే రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్‌ని రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రీమియర్ తోనే 904 K డాలర్లు వసూలు చేసిందట. (చదవండి: ‘రాధేశ్యామ్’మూవీ రివ్యూ) ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా అక్కడ విడుదలకు ముందే ఎక్కువ టికెట్స్ అమ్ముడయ్యాయి. హాలీవుడ్ సినిమాలతో పోటీపడి మరీ అద్భుతమైన వసూళ్లు సాధించింది రాధే శ్యామ్. నార్త్ అమెరికాలో మరికొన్ని స్క్రీన్స్ యాడ్ చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 30 కోట్లు వసూళ్ల రాబట్టింది. ఒక్క నైజాంలోనే తొలిరోజు రూ.11.87 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు సమాచారం. ఆంధ్రాలో మొత్తంగా రూ.8.5 కోట్లను రాబట్టినట్లు సమాచారం. బాలీవుడ్‌లోనూ భారీగానే వసూళ్లను రాబట్టిందట. అయితే ఎన్ని కోట్లు అదేదానిపై క్లారిటీ లేదు. ఈ సినిమాలో హస్తసాముద్రికా నిపుణుడు విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ నటించాడు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని నిర్మించింది. సౌత్ లాంగ్వేజెస్‌కి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చగా, తమన్ నేపథ్య సంగీతం అందించాడు. -
థియేటర్స్‌లో డీజే టిల్లు రీసౌండ్.. నైజాంలో రికార్డు వసూళ్లు
DJ Tillu First Day Collection:: చిన్న సినిమాగా విడుదలైన 'డీజే టిల్లు' చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం నిన్న(ఫిబ్రవరి12)న రిలీజ్ అయి హిట్‌టాక్‌తో దూసుకుపోతుంది. ఇప్పటికే రిలీజైన పాటలు అందరినీ ఆకట్టుకోగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పుట్టుమచ్చల వ్యవహారం సినిమాపై మరింత హైప్‌ను తీసుకొచ్చింది. విడుదలైన తొలిరోజు నుంచే అదిరిపోయే వసూళ్లతో డీజే టిల్లు రీసౌండ్ వినిపిస్తుంది. ఇండియా సహా ఓవర్సీస్లోనూ మంచి షేర్స్ రాబడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజే సుమారు రూ.3కోట్ల షేర్ వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం గ్రాస్ రూ. 8.10కోట్ల షేర్ సాధించింది. ఒక్క రోజులోనే నైజాంలో బ్రేక్ఈవెన్ సాధించినట్లు టాక్ వినిపిస్తుంది. ఇదే కంటిన్యూ అయితే ఫుల్‌రన్‌లో కశ్చితంగా ఈ సినిమా గట్టి లాభాలను తీసుకొస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. -
50 రోజులు.. 365 కోట్లు.. పార్టీ లేదా పుష్పా..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’ థియేటర్స్‌లో 50 రోజులు పూర్తి చేసుకుంది. భారీ అంచనాల మధ్య గతేడాది డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం.. అదే రేంజ్లో కలెక్షన్లను రాబడుతూ..2021లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అంతేకాదు బన్ని కెరీర్ లో తొలిసారి 300 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మూవీగా రికార్డుల్లోకి ఎక్కింది పుష్ప. తాజాగా ఈ సినిమా విడుదలై 50 రోజులు పూర్తి అయిన సందర్భంగా మరోసారి ఇప్పటివరకు ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్‌ని ప్రకటించింది చిత్ర బృందం. ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.365 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించారు. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్త సమర్పణలో రూపొందిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటించింది. సునీల్, అనసూయ, జగదీష్ ప్రతాప్ భండారీ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. త్వరలోనే ఈ మూవీ పార్ట్ 2 షూటింగ్ ప్రారంభం కానుంది. 50 Days for the AAll India MASSive Blockbuster #PushpaTheRise 💥#50DaysForBlockbusterPushpa 🔥 Icon Star @alluarjun National Crush @iamRashmika Creative @aryasukku Rockstar @ThisIsDSP Explosive Combo on the way to Create Magic for Part 02 💖 pic.twitter.com/PkqmyPqHKh — Mythri Movie Makers (@MythriOfficial) February 4, 2022 -
బాక్సాఫీస్‌పై ‘బంగార్రాజు’ దండయాత్ర.. రెండు రోజుల్లోనే అన్ని కోట్లా?
అక్కినేని నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటించిన తాజా చిత్రం బంగార్రాజు. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలి రోజు రికార్డు వసూళ్లు సాధించిన బంగార్రాజు.. రెండో రోజు కూడా అదే దూకుడు చూపించింది. కోవిడ్ నిబంధనలు అదిగమించి.. రెండు రోజుల్లో రూ.36 కోట్లు వసూళ్లు చేసి మరోసారి బాక్సాఫీస్‌పై అక్కినేని ఫ్యామిలీ సత్తా చూపించారు. రూ.40 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగార్రాజు.. రెండో రోజు నైజాంలో రూ.4.47 కోట్లు, సీడెడ్ రూ. 3.46 కోట్లు, ఉత్తరాంద్రలో రూ.2.20 కోట్లు, ఈస్ట్: 1.75 కోట్లు, గుంటూరు: 1.78 కోట్లు, కృష్ణా: 0.96 కోట్లు, నెల్లూరు: 0.85 కోట్లు రాబట్టింది. మొత్తంగా రెండు రోజుల్లో రూ. 36 కోట్లు వసూళ్లు చేసినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. దీనికి సంబంధించిన స్పెషల్ పోస్టర్ని కూడా విడుదల చేసింది. సంక్రాంతికి విడుదలైన ఏకైక పెద్ద సినిమా, అలాగే గ్రామీణ నేపథ్యానికి సంబంధించిన స్టోరీ కావడం ‘బంగర్రాజు’కు బాగా కలిసొచ్చింది. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించగా నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. నాగార్జున సరసన రమ్యకృష్ణ, నాగచైతన్య సరసన కృతిశెట్టి నటించారు. (చదవండి: బంగార్రాజు మూవీ రివ్యూ) -
అక్షయ్ పక్కా ప్లాన్.. 2000 కోట్ల టార్గెట్.. ఏ హీరోకి సాధ్యపడని రికార్డు
2021లో బాలీవుడ్ బాక్సాఫీస్ స్టార్ ఎవరూ అంటే అక్షయ్ కుమార్ పేరు మాత్రమే చెప్పాలి. ఈ ఏడాది రిలీజ్ చేసిన ‘బెల్ బాటమ్’ తో బాలీవుడ్ లో మళ్లీ స్టార్ హీరోలు తమ చిత్రాలను థియేటర్స్ లో రిలీజ్ చేయడం ప్రారంభించారు. సూర్యవంశీ ఇయర్స్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించి ....అదే బాక్సాఫీస్ ను పరుగులు పెట్టించాడు. ఇలా ఈ ఏడాది అక్షయ్ నటించిన రెండు చిత్రాలు థియేటర్స్ లో రిలీజ్ భారీ వసూళ్లను రాబట్టగా.. మరో సినిమా అతరంగీరే ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. వచ్చే ఏడాది కూడా ఇదే స్పీడ్ చూపించనున్నాడు అక్షయ్. జనవరిలో పృథ్వీరాజ్ మూవీ రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత లిస్ట్ లో బచ్చన్ పాండే, రక్షాబంధన్, రామ్ సేతు, మిషన్ సిండ్రెల్ల, ఓమైగాడ్ 2, చిత్రాలు ఉన్నాయి.వీటన్నిటితో పాటు అమెజాన్ ప్రైమ్ కోసం ది ఎండ్ అనే యాక్షన్ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఈ సినిమాలు, వెబ్ సిరీస్ అన్ని కూడా 2022లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. థ్రియేట్రికల్ రైట్స్, శాటీలైట్, డిజిటల్ రైట్స్ రూపంలో దాదాపు 2000 వేల కోట్లకు పైగా బిజినెస్ జరగనుంది. ఇంత మొత్తంలో ఒక హీరో వల్ల వ్యాపారం జరగడం ఈ మధ్య కాలంలో బాలీవుడ్ ఎన్నడూ చూడలేదు.మొత్తంగా బాలీవుడ్ కు అక్షయ్ మనీ మెషి న్ గా మారాడు. -
Pushpa Collections: తగ్గేదేలే.. 100 కోట్ల క్లబ్లో చేరిన 'పుష్ప'
Pushpa 6 Days Total Box Office Collections: అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన 'పుష్ప' సినిమా బాక్సాఫీస్ వద్ద తగ్గేదేలే అంటూ దుమ్మురేపుతుంది. డిసెంబర్17న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబడుతుంది. మొదటి రోజు నుంచి కలక్షన్ల సునామీ కురిపిస్తున్న పుష్ప ఆరో రోజు కూడా అదే జోరు కొనసాగించింది. ఆరవ రోజు రూ.3.36కోట్ల షేర్‌ను రాబట్టింది. తొలిరోజే 71 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. ఇప్పటివరకు అన్ని వెర్షన్లు కలుపుకొని రూ.145.5 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసినట్లు సమాచారం. క్రిస్మస్ పండగను కూడా పురస్కరించుకొని మరిన్ని లాభాలు తెచ్చిపెడుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పుష్పరాజ్‌గా బన్నీ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తెలుగు, తమిళం సహా హిందీలోనూ మంచి కలెక్షన్లను వసూలు చేస్తుంది ఈ చిత్రం. కాగా ఫిబ్రవరిలో ఈ సినిమా సెకండ్ పార్ట్ షూటింగ్ ప్రారంభం కానుంది. #Pushpa has emerged as a dark horse at the #BO… Audience-favourite, exhibitors-favourite [mass pockets esp] and #BO-favourite… Solid hold on weekdays… Fri 3.31 cr, Sat 3.77 cr, Sun 5.54 cr, Mon 3.68 cr, Tue 3.57 cr, Wed 3.36 cr. Total: ₹ 23.23 cr. #India biz. #PushpaHindi pic.twitter.com/1P6yftdRlr — taran adarsh (@taran_adarsh) December 23, 2021 #Xclusiv… ‘PUSHPA’ *HINDI* TOP CONTRIBUTORS *CIRCUIT-WISE* DATA… [From Fri to Wed]… ⭐️ #Mumbai: ₹ 8.83 cr ⭐️ #Delhi - #UP: ₹ 3.37 cr ⭐️ #CP: ₹ 3.09 cr ⭐️ #Bihar: ₹ 1.31 cr ⭐️ #Marathwada: ₹ 1.19 cr ⭐️ #WestBengal: ₹ 1.18 cr ⭐️ #Rajasthan: ₹ 1.06 cr#Pushpa #PushpaHindi pic.twitter.com/enoEOrlLsp — taran adarsh (@taran_adarsh) December 23, 2021 -
'పుష్ప' కలెక్షన్స్ సునామీ..రెండు రోజుల్లోరూ.116 కోట్ల గ్రాస్..
Pushpa Movie Two Days Box Office Collections: అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన 'పుష్ప' సినిమా బాక్సాఫీస్ వద్ద దమ్మురేపుతుంది. డిసెంబర్17న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఈ ఏడాది విడుదలైన చిత్రాలన్నింటిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. తొలిరోజే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన పుష్ప.. రెండో రోజు కూడా అదే జోరు చూపించింది. ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు 71 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు మరో 45 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తుంది. చదవండి: స్పెషల్ సాంగ్ చేయడానికి సమంత ఎందుకు ఒప్పుకుందో తెలుసా? అలా రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 116 కోట్ల గ్రాస్ సాధించినట్లు సమాచారం. కరోనా సెకండ్ వేవ్ ముగిసిన తర్వాత అత్యధిక ఓపెనింగ్స్ తీసుకొచ్చిన ఇండియన్ సినిమాగా నిలిచింది 'పుష్ప'.అంతేకాకుండా మూడో రోజు కూడా అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా పుష్పరాజ్‌గా బన్నీ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తెలుగు, తమిళం సహా హిందీలోనూ మంచి కలెక్షన్లను వసూలు చేస్తుంది ఈ చిత్రం. కాగా ఫిబ్రవరిలో ఈ సినిమా సెకండ్ పార్ట్ షూటింగ్ ప్రారంభం కానుంది. చదవండి:Pushpa Move : బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన 'పుష్ప'.. బాక్సాఫీస్ ప్రభంజనం Bigg boss 5 Telugu: బిగ్‌బాస్ స్టేజ్‌పై బాలయ్య డైలాగ్ చెప్పిన ఆలియాభట్ -
మల్టీప్లెక్సు థియేటర్లను సేవ్ చేసిన స్పైడర్‌మ్యాన్
ఫ్రెండ్లీ నైబర్‌హుడ్.. స్పైడర్‌మ్యాన్‌కు ఉన్న ట్యాగ్ లైన్ ఇదే. తన, పర బేధం లేకుండా ఆపదలో ఎవరైనా ఉన్నారని గ్రహిస్తే.. ఆలస్యం చేయకుండా వాలిపోయి రక్షిస్తుంటాడు. అలాంటి సూపర్ హీరో(ముగ్గురు) ఇప్పుడు ఇండియన్ మల్టీప్లెక్స్ బాక్సాఫీస్‌ను కాపాడేశాడు. కరోనా టైం నుంచి పాతాళానికి పడిపోతున్న టికెట్ సేల్‌ను తన సాలెగూడుతో అమాంతం ఆకాశానికి చేర్చేశాడు. భవిష్యత్తు మల్టీప్లెక్స్ బిజినెస్‌కు భరోసా ఇస్తూ.. భవిష్యత్తులో మరికొన్ని సినిమాలు రిలీజ్ అయ్యే ధైర్యం 2021 ఇయర్ ఎండ్‌లో అందించి బాక్సాఫీస్‌కు జోష్ నింపాడు. ఓ హాలీవుడ్ మూవీ, మరో టాలీవుడ్ మూవీ మల్టీప్లెక్సు థియేటర్లకు ఊపు తెచ్చాయి. కరోనా సంక్షోభం తర్వాత మిణుకుమిణుకుమంటున్న మల్టీప్లెక్సు వ్యాపారానికి ‘సినిమా’ ఉందనే నమ్మకాన్ని తిరిగి తీసుకొచ్చాయి. రిలీజ్‌కి ముందే వంద శాతం టిక్కెట్ల బుకింగ్ సాధించి భవిష్యత్తుకు భరోసా ఇచ్చాయి. విశేషం ఏంటంటే.. బుకింగ్ దెబ్బకి సైట్లు సైతం క్రాష్ అయ్యే పరిస్థితి ఎదురైందంటే ఆ క్రేజ్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. సినిమా థియేటర్లు, మల్టీ ప్లెక్సుల భవితవ్యంపై సందేహాలు కమ్ముకుంటున్న వేళ వాటిని ఒక్క దెబ్బతో పటాపంచాలు చేశాయి ఈ రెండు సినిమాలు. దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్‌ల భవిష్యత్తుకు ఊపిరి పోసిన సినిమాలుగా స్పైడర్‌మ్యాన్, పుష్పలను పేర్కొనవచ్చు. హాలీవుడ్ మూవీ ఐనప్పటికీ స్థానికంగా స్పైడన్ మ్యాన్ మూవీకి మల్టీప్లెక్స్‌లలో మంచి ఓపెనింగ్స్ దక్కాయి. ఇక తెలుగు, తమిళ, కన్నడ, మళయాల, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజైన పుష్ప అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలో రిలీజ్‌కి ఒక రోజు ముందే వంద శాతం టిక్కెట్లు అమ్ముడై సంచలనం సృష్టించింది. అంతకు ముందు అఖండ సినిమా ఇటు సింగిల్ స్క్రీన్ల స్థాయిలో మల్టీప్లెక్స్‌లలో కూడా హవా కనబరిచింది. ఆదాయం ఇక్కడి నుంచే సాధారణంగా మల్టీప్లెక్స్‌లకు ఆదాయం మూడు రకాలుగా అందుతుంది. టిక్కెట్ల అమ్మకం (యావరేజ్ టిక్కెట్ ప్రైజ్, ఏటీపీ), సినిమా చూసేందుకు థియేటర్‌కి వచ్చిన వారు పెట్టే తలసరి ఖర్చు (స్పెండ్ పర్ హెడ్, ఎస్‌పీహెచ్), యాడ్ రెవిన్యూ. కరోనా కారణంగా పెట్టిన ఆంక్షలతో గత ఏడాదిన్నరగా థియేటర్లకు ఈ మూడు రకాలుగా వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోయింది. కొన్ని సందర్భాల్లో సున్నాకు చేరుకుంది. సూర్యవంశీ ఇచ్చిన ధైర్యం కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత సెప్టెంబరులో థియేటర్లు ప్రారంభమయ్యాయి. అయితే జనాలు మల్టీప్లెక్స్‌లకు వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో ఆ నెలలో సినిమాలు విడుదలైనప్పుడు తక్కువ ఆక్యుపెన్షీ నమోదు అయ్యింది. అక్టోబరులో కొద్దిగా మెరుగుపడి అది 18 శాతానికి చేరుకుంది. నవంబరులో సూర్యవంశీ సినిమా రాకతో 27 శాతంగా నమోదు అయ్యింది. ఆక్యుపెన్సీ తగ్గిపోవడంతో దానిపై ఆధారపడిన స్పెండ్ పర్ హెడ్ ఆదాయం కూడా పడిపోయింది. పైగా ముంబై లాంటి రాష్ట్రాల్లో థియేటర్లలో ఫుడ్ అండ్ బేవరేజెస్‌కి అనుమతి ఇవ్వలేదు. దీంతో సెకండ్ వేవ్ తర్వాత మల్టీప్లెక్స్‌ల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎంతో ఖర్చుతో నిర్మించిన మల్టీప్లెక్సులు కథ కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్ల మాదిరిగానే అవుతుందా అనే కామెంట్లు వినిపించాయి. 83, ట్రిపుల్ ఆర్... స్పైడర్‌మ్యాన్, పుష్ప సినిమాలు ఇచ్చిన ఊపుతో గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అయ్యాయి మిగిలిన సినిమాలు. పుష్ప సినిమా నుంచి గట్టి పోటీ ఎదురైనా నాన్ ఇండియన్ మూవీ స్పైడర్ మ్యాన్ నిలదొక్కుకుంది. వారంతానికి వంద కోట్ల రూపాయల క్లబ్లో ఈ సినిమా చేరింది. మరోవైపు టాక్ తో సంబంధం లేకుండా రిలీజ్‌డే నుంచి సండే వరకు మల్టీప్లెక్సుల్లో టిక్కెట్లన్నీ బుక్ అవడం పుష్పకి అడ్వాంటేజ్‌గా మారింది. దీంతో ఒక్కసారిగా మల్టీప్లెక్సుల గల్లాపెట్టే గలగలమంటోంది. ఇందులో ముందుగా వస్తోన్న సినిమా క్రికెట్ బేస్డ్ మూవీ 83. ఈ సినిమా తర్వాత వరుసగా మ్యాట్రిక్స్ రీసర్సెక్షన్, జెర్సీ, కింగ్స్‌మ్యాన్ సినిమాలు డిసెంబరులో ఉండగా జనవరిలో ఇండియా మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోన్న రాజమౌళి ఆర్ఆర్ఆర్తో పాటు అక్షయ్ కుమార్ పృధ్విరాజ్ సినిమాలు ఉన్నాయి. ఒమిక్రాన్ లేకుంటే ఒమిక్రాన్ ముప్పు. థర్డ్ వేవ్ భయాలను జయిస్తే 2022లో మల్టీప్లెక్సులు పూర్తిగా కోవిడ్ పూర్వ స్థితికి చేరుకుంటాయని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఏఐ) అంచనా వేస్తోంది. అందుకే రాబోయే ఆరు నుంచి తొమ్మిది నెలల కాలం ఎంతో కీలకమని ఎంఐఏ అంటోంది. యాడ్ రెవెన్యూ కూడా పీవీఆర్, ఐనాక్స్ వంటి దేశవ్యాప్తంగా మల్టీప్లెక్సు చైన్లు కలిగిన సంస్థలకు యాడ్ రెవెన్యూ దాదాపు 10 శాతంగా ఉండేంది. సినిమాలు రిలీజ్ కాకపోవడం, మల్టీప్లెక్సులు మూత పడటంతో దాదాపు ఏడాదిన్నరగా ఈ ఆదాయానికి దాదాపు కోత పడింది. డిసెంబరులో వచ్చిన సినిమాలు బాక్సాఫీసుకు ఊపు ఇవ్వడంతో. ప్రస్తుతం ప్రొడక్షన్లో ఉన్న సినిమాలకు ప్రచారం సైతం ఊపందుకోనుంది. ఫలితంగా యాడ్ రెవెన్యూ సైతం సాధారణ స్థితికి చేరుకుంటుందనే నమ్మకం ఉందని ఎంఏఐ అధ్యక్షుడు కమల్ జైన్చందానీ జాతీయ మీడియాతో తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓటీటీ టైం పెంచుతాం కరోనా రావడానికి ముందు సినిమా రిలీజ్ అయిన తర్వాత 8 వారాల అనంతరం ఓటీటీకి ఇవ్వాలనే ఒప్పందం ఉండేది. కానీ కరోనా వచ్చి థియేటర్లు క్లోజ్ అయిన తర్వాత చాలా సినిమాలు నేరుగా ఓటీటీలో వచ్చాయి. థియేటర్లో రిలీజరైనా నాలుగు వారాలే రన్ టైం ముగిసిన తర్వాత ఓటీటీకి ఇవ్వాల్సి వచ్చేది. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడుతున్నందున త్వరలోనే ఓటీటీ టైంని నాలుగు నుంచి ఎనిమిది వారాలకు పెంచాలని డిమాండ్ చేయాలని ఎంఏఐ నిర్ణయించింది. ప్రస్తుత పరిస్థితులను మరికొంత కాలం అంచనా వేసి ఏప్రిల్ 1 నుంచి ఎనిమిది వారాల గడువు మళ్లీ వస్తుందంటున్నారు. -సాక్షి, వెబ్ స్పెషల్ -
‘పుష్ప’ రాజ్ తొలి రోజు వసూళ్లు ఎంతంటే..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’. ఆర్య, ఆర్య 2 లాంటి హిట్ మూవీల తర్వాత వచ్చిన చిత్రం కావడంతో ‘పుష్ప’పై తొలి నుంచే హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం.. ఓపెన్సింగ్స్ని కూడా అదే రేంజ్లో రాబట్టినట్లు తెలుస్తోంది. (చదవండి: ‘పుష్ప’మూవీ రివ్యూ) ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3000 పైగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది పుష్ప. నైజాం, ఆంధ్రాలో కలిపి 1150 థియేటర్లలో విడుదలైంది. అలాగే కర్ణాటక, తమిళనాడు, కేరళ, హిందీలో కలిపి సుమారు 1200 థియేటర్లలో, ఓవర్సీస్లో 600 థియేటర్లలో రిలీజైంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత బన్నీ, సుక్క జతకట్టడం.. అల్లు అర్జున్‌కు తొలి పాన్ ఇండియా చిత్రం కావడంతో ‘పుష్ప’తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.49 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. నైజాం : 11.44 కోట్లు, సీడెడ్: 4.20 కోట్లు, ఉత్తరాంధ్ర: 1.8 కోట్లు, ఈస్ట్ : 1.43 కోట్లు, వెస్ట్: 1.5 కోట్లు, గుంటూరు: 2.28 కోట్లు, కృష్ణా 1.15 కోట్లు, నెల్లూరు: 1.10 కోట్లు, ఓవర్సీస్లో 4.25 కోట్ల కలెక్షన్స్ రాబట్టాయి. అయితే హిందీలో ప్రమోషన్స్ ఆశించినంత లేకపోవడమే పుష్ప కలెక్షన్స్ కొంతమేర తగ్గాయని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పుష్ప మూవీకి దాదాపు రూ.150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తొలి రోజు భారీగానే కలెక్షన్స్ వచ్చాయి. తర్వాత కూడా ఇదే జోరు సాగిస్తే తప్ప.. పుష్ప టీమ్ సేఫ్ జోన్లోకి రాదు. -
తమిళనాడులో ఒకవైపు వర్షాలు.. మరోవైపు వసూళ్లు
-
కలెక్షన్లలో దూసుకెళ్తున్న ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’, ఎంతంటే..
SR Kalyana Mandapam Collections: కిరణ్ అబ్బవరం, ప్రియాంకా జవాల్కర్ జంటగా శ్రీధర్ గాదె దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’. ప్రమోద్, రాజు నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 6న విడుదలై మిక్స్డ్ టాక్‌తో దూసుకెళ్తుంది. ముఖ్యంగా ఇందులోని పాటలు యూత్‌ని బాగా అట్రాక్ట్ చేశాయి. దీంతో సినిమాపై హైప్ క్రియేట్ అయింది. ఫలితంగా ఈ మూవీ అన్ని ఏరియాల్లోనూ భారీ ధరకు అమ్ముడు పోయింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా రూ.4.55 కోట్లు కాగా, బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.4.80కోట్లుగా ఫిక్సైంది. అంచనాలకు తగ్గట్టే.. సినిమా విడుదలైన తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.41 కోట్లు, రెండో రోజు రూ. 1.25 కోట్లు, మూడో రోజు రూ. 1.40 కోట్లు, నాలుగో రోజు రూ. 74 లక్షలు వసూలు చేసింది. ఫలితంగా మొదటి నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుని హిట్ స్టేటస్‌ను అందుకుని రికార్డు సృష్టించింది. ఇక ఐదో రోజు దాదాపు రూ.60లక్షలు వసూలు చేసింది. మొత్తంగా ఎస్ ఆర్ కల్యాణ మండపం ఐదు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి రూ.5.40 కోట్లు షేర్‌తో పాటు 8.74కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. -
జాతిరత్నాలు కలెక్షన్లు: నిర్మాతలకు అంత లాభమా!
ఈ మధ్యకాలంలో యూత్‌ను బాగా ఆకట్టుకున్న చిత్రాల్లో జాతిరత్నాలు సినిమా ముందు వరుసలో ఉంటుంది. కరోనా భయంతో బిక్కుబిక్కుమంటున్న ప్రజలకు కామెడీ టీకా ఇచ్చిందీ చిత్రం. దీంతో థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకుడు మనసారా నవ్వుకుంటూ బయటకు వచ్చాడు. మొత్తానికి ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిన్న సినిమా భారీ హిట్ కొట్టి నిర్మాతలకు డబ్బులు తెచ్చిపెట్టింది. మరి ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్లు ఎంత? నిర్మాతలకు ఏమేరకు లాభాలు వచ్చాయో చదివేయండి.. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలుగా నటించిన చిత్రం 'జాతిరత్నాలు'. అనుదీప్ కేవీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించాడు. టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో అప్పటికే ప్రేక్షకులకు దగ్గరైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కలుపుకుని రూ.10 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది. ఇక రిలీజైన తొలి రోజు నుంచే మంచి టాక్ రావడంతో కొద్ది రోజులపాటు బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపింది. ఫలితంగా నైజాంలో రూ.16.18 కోట్లు, సీడెడ్‌లో రూ.4.10 కోట్లు, ఈస్ట్‌లో రూ.1.92 కోట్లు, వెస్ట్‌లో రూ.1.58 కోట్లు, కృష్ణాలో 1.81కోట్లు, గుంటూరులో రూ.2.08 కోట్లు, నెల్లూరులో 92 లక్షలు వసూలు చేసింది. రెండు రాష్ట్రాల్లో కలిపి సుమారు రూ. 32.59 కోట్లు షేర్, రూ.52 కోట్ల పైచిలుకు గ్రాస్ రాబట్టింది. ఈ క్రమంలో ఎన్నో సినిమాల బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూ ప్రపంచవ్యాప్తంగా రూ.39.04 కోట్ల షేర్, రూ.70 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. థియేట్రికల్ బిజినెస్ రూ.10 కోట్ల పైమాటే ఉండటంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ పదకొండున్నర కోట్లుగా నమోదైంది. కానీ జాతిరత్నాలు ఏకంగా రూ.39 కోట్లకు పైమాటే వసూలు చేసింది. దీంతో ఈ సినిమా ఇరవై ఏడున్నర కోట్ల లాభాలను అందుకుంది. దీంతో జాతిరత్నాలు రూ.27 కోట్లకు పైగా లాభాల మార్కును చేరుకున్న చిన్నచిత్రంగా ఘనత సాధించింది. ఇదిలా వుంటే ఈ సినిమా నేటి(ఆదివారం) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానుంది. #JathiRatnaluOnPrime, watch now: https://t.co/yJRGqrNZLh@NaveenPolishety @fariaabdullah2 @priyadarshi_i @eyrahul @anudeepfilm @vennelakishore @actorbrahmaji @ItsActorNaresh @murlisharma72 @radhanmusic #PriyankaDutt @nagashwin7 @SwapnaCinema pic.twitter.com/rP2SnWTsQj — BARaju (@baraju_SuperHit) April 11, 2021 చదవండి: 'ఆస్కార్' బరిలో జాతిరత్నాలు! -
శర్వానంద్‌కే ఎందుకిలా జరుగుతోంది!
టాలీవుడ్లో విభిన్న కథలు ఎంచుకోవడంలో యువ కథానాయకుడు శర్వానంద్ ఎప్పుడూ ముందుంటాడు. తన సినిమాలకు మంచి టాక్ వస్తున్నప్పటికీ కలెక్షన్ల విషయంలో మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు రావడం లేదు. ఇటీవల తను నటించిన ‘శ్రీకారం’ చిత్రం విడుదలవగా, మొదటి ఆటతోనే మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. విమర్శకులు సైతం యువతకు ప్రేరణ అని, వారు తప్పక చూడాలని మెచ్చుకున్నారు. ఇంకేముంది హిట్ ఖాయమని చిత్ర యూనిట్ సభ్యులంతా సంబరపడిపోయారు. కానీ అనుకొన్నది ఒక్కటి అయినది ఒక్కటి అన్న చందంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయింది. వస్తే వరుస హిట్లు, లేదా వరుస ఫ్లాపులు శర్వానంద్ కెరీర్‌ను చూస్తే 'రన్ రాజా రన్', 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', 'ఎక్స్‌ప్రెస్ రాజా', 'శతమానం భవతి' సినిమాల వరుస హిట్లతో అతడి మార్కెట్ బాగానే పెరిగింది. మధ్యలో ‘రాధ’ నిరాశ పరిచినా.. ‘మహానుభావుడు’తో మళ్లీ హిట్ ట్రాక్‌లో పడ్డాడని అనుకున్నారంతా! ఇంకేముంది సినిమాలు తీయడానికి నిర్మాతలు క్యూ కట్టారు. కానీ మహానుభావుడు తర్వాత ఆ హవాను కొనసాగించలేకపోయాడు. ప్రేమ కథా చిత్రంగా విడుదలైన ‘పడి పడి లేచే మనసు’ శర్వా కెరీర్లోనే అత్యధిక నష్టాలు తెచ్చిపెట్టిన సినిమా అయింది. తర్వాత ‘రణరంగం’ కూడా అంతగా ఆడలేదు. తమిళ రీమేక్ ‘జాను’ పర్వాలేదనిపించింది. తర్వాత వచ్చిన ‘శ్రీకారం’ అయినా అతడిని పరాజయాల బాట నుంచి బయట పడేస్తుందని అంతా అనుకున్నారు. ఈ సినిమా మంచి టాకే తెచ్చుకునప్పటికీ బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. దీనికి ప్రధాన కారణం చిన్న సినిమా అనుకున్న ‘జాతిరత్నాలు’ పెద్ద దెబ్బే కొట్టిందని చెప్పాలి. ప్రస్తుతం శ్రీకారం కలెక్షన్లను చూస్తే బయ్యర్లకు నష్టాలు తప్పేలా లేవని సినీ పండితులు అంటున్నారు. ఏదేమైనా శర్వా కెరీర్లో మరో డిజాస్టర్‌గా ‘శ్రీకారం’ మిగలనుంది. శర్వా చేసిన చివరి నాలుగు చిత్రాలను పరిశీలిస్తే అవేవీ కూడా చెత్త సినిమాలు అనడానికి వీల్లేదు. మంచి కథనే ఎంచుకొని అభిరుచి ఉన్న దర్శకులతోనే సినిమాలు చేశాడు. ఆయా సినిమాల ప్రోమోలు కూడా ఆసక్తి రేకెత్తించడంతో శర్వాకు ఈసారి హిట్టు ఖాయం అన్న ఫీలింగే కలిగించింది ప్రతి సినిమా కూడా. కానీ ఏదీ కూడా అంచనాలను అందుకోలేకపోయింది. మరి తన తదుపరి సినిమాతోనైనా శర్వా బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి. ( చదవండి: విజయంతో పాటు గౌరవం తెచ్చింది: శ్రీకారం డైరెక్టర్ ) -
ఆయుష్మాన్ ఖురానా సినిమాకు తాప్సీ బ్రేక్
ఆయుష్మాన్ ఖురానా, జితేంద్ర కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘శుభ్ మంగళ్ జ్యాద సావధాన్’. ఇద్దరబ్బాయిల మధ్య ప్రేమ.. అంటూ కొత్త కాన్సెప్ట్‌తో తరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదలైంది. దీని ట్రైలర్ విషయానికొస్తే.. హీరోలిద్దరూ ఓ పార్టీలో బహిరంగంగా ముద్దు పెట్టుకోవడం అందరినీ షాక్‌కు గురి చేస్తుంది. అయితే, అందులో తప్పేముంది అన్నట్లుగా వాళ్లు ప్రవర్తించే తీరు మాత్రం ప్రేక్షకులకు తప్పకుండా నవ్వు తెప్పిస్తుంది. ఇక ట్రైలర్లోనే నవ్వులు పూయించిన దర్శకుడు హితేశ్ కేవాల్యా సినిమా ఆద్యంతం ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్వించడంలో సఫలీకృతమయ్యాడు. (రాహు మూవీ రివ్యూ చదివేయండి) ఈ సినిమాలో నీనా గుప్తా, గజరాజ్ రావు, సునీతా రాజ్వార్, మను రిషి చద్దా, మాన్వీ గగ్రూ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రం విడుదలైన తొలినాడే రూ.9.55 కోట్ల కలెక్షన్లతో గ్రాండ్ ఓపెనింగ్స్ సాధించింది. థియేటర్లలో దూకుడు ప్రదర్శించిన ఈ సినిమా ఆదివారం మూడున్నర కోట్లు రాబట్టింది. ఇప్పటి వరకు వచ్చిన వసూళ్లతో కలుపుకుని పదిరోజుల్లోనే రూ.50 కోట్ల మైలురాయిని అవలీలగా దాటేసింది. కాగా దీని వసూళ్ల పర్వానికి ఫిబ్రవరి 28న విడుదలైన తాప్సీ ‘థప్పడ్’ చిత్రం అడ్డుకట్ట వేసింది. అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఓ వర్గం ప్రశంసలు కురిపిస్తుంటే మరో వర్గం మాత్రం విమర్శలు గుప్పిస్తోంది.(థప్పడ్ మూవీ రివ్యూ) ఆయుష్మాన్ ఖురానా సినిమాపై ట్రంప్ ట్వీట్ -
లాభాల్లోకి ఎంటరైన సరిలేరు..
సాక్షి, హైదరాబాద్ : సంక్రాంతికి విడుదలైన మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు బ్లాక్‌బస్టర్ కా బాప్ రేంజ్‌లోనే వసూళ్లనూ రాబడుతోంది. ఆరు రోజులకే ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ఈవెన్ సాధించడంతో పాటు పలు ప్రాంతాల్లో డిస్ర్టిబ్యూటర్లకు లాభాలను పంచుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు పండుగ సినిమాల నుంచి పోటీని తట్టుకుంటూ కేవలం ఆరురోజుల్లోనే ఏపీ, తెలంగాణల్లో రూ 112.60 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. మహేష్ బాబు సినిమాల్లో తొలివారం అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. అన్ని ఏరియాల్లోనూ ప్రిన్స్ మూవీ నాన్ బాహుబలి 2 రికార్డులను కైవసం చేసుకుని సంక్రాంతి ఛాంపియన్‌గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో రూ 75.70 కోట్లకు థియేట్రికల్ హక్కులను విక్రయించగా ఆరు రోజుల్లోనే మూవీ రూ 77.94 కోట్ల షేర్‌ను రాబట్టి బయ్యర్లకు లాభాలను పంచింది. చదవండి : రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో మహేశ్ బృందం.. -
వసూళ్ల వరద
అగ్ర రాజ్యం అమెరికాలో తెలుగు సినిమాలు సందడి చేస్తున్నాయి. సంక్రాంతికి విడుదలైన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో సినిమాలు అమెరికా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నాయి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ‘దర్బార్’ కూడా అంచనాలకు తగ్గినట్టు వసూళ్లు రాబడుతోంది. ఈ మూడు సినిమాలు కలిసి ఇప్పటికే 31 కోట్ల రూపాయలు వసూలు చేసి సత్తా చాటాయి. దర్బార్ ఐదో రోజుల్లో రూ.10.11 కోట్లు సాధించగా, ‘సరిలేరు నీకెవ్వరు’ మూడు రోజుల్లోనే రూ.11.51 కోట్లు రాబట్టింది. ‘అల.. వైకుంఠపురంలో’ రెండు రోజుల్లేనే రూ.9.92 కోట్లు సాధించి దూసుకెళుతోంది. ఈ దక్షిణాది సినిమాలు కలిపి అమెరికా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయని ప్రముఖ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. ఇక అమెరికా వీకెండ్ బాక్సాఫీస్ చార్ట్‌లో మన దేశానికి చెందిన ఐదు సినిమాలు చోటు దక్కించుకోగా, ‘అల.. వైకుంఠపురంలో’ సినిమా టాప్‌లో నిలవడం విశేషం. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అల.. వైకుంఠపురంలో’ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 45 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్టు తెలుస్తోంది. ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ తొలిరోజు రూ.46.77 కోట్ల షేర్ సాధించినట్టు సమాచారం. ‘అల.. వైకుంఠపురములో’ మూవీ రివ్యూ సరిలేరు నీకెవ్వరు : మూవీ రివ్యూ దర్బార్ : మూవీ రివ్యూ ఛపాక్ : మూవీ రివ్యూ -
సల్మాన్ ఓడించి.. పెద్ద సూపర్‌స్టార్ అయ్యాడు!
ముంబై: బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ తాజా సినిమా ‘గుడ్‌న్యూస్’ భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఆరు రోజుల్లోనే వందకోట్ల క్లబ్బులో ఈ సినిమా చేరింది. కొత్త సంవత్సరం సందర్భంగా బుధవారం ఈ సినిమా ఏకంగా రూ. 22.50 కోట్లు సాధించింది. దీంతో ఆరురోజుల్లోనే రూ. 117.10 కోట్లు సాధించి ‘గుడ్‌న్యూస్’ సూపర్‌హిట్‌గా నిలిచింది. సినిమాకు మంచి టాక్ ఉండటం, విమర్శల ప్రశంసలు లభిస్తుండటం.. ప్రేక్షకులు పెద్దసంఖ్యలో థియేటర్లకు వస్తుండటంతో మున్ముందు కూడా ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక, గుడ్‌న్యూస్ సినిమా వందకోట్ల క్లబ్బులో చేరి బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా ఉండటంతో నటుడు, సినీ విమర్శకుడు కమాల్ ఆర్ ఖాన్ (కేఆర్కే) ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ‘గుడ్‌న్యూస్ సూపర్ హిట్ అయింది. దబంగ్3 సూపర్ప్లాప్ అఅయింది. అంటే అక్షయ్‌కుమార్ అధికారికంగా సల్మాన్ ఖాన్‌ను ఓడించి.. అతని కంటే పెద్ద సూపర్‌స్టార్‌గా అవతరించినట్టే. ఇది అక్షయ్ జీవితకాల కోరిక. అది నెరవేరింది. ఇక రానున్న ఈద్ 2020కి నేరుగా బాక్సాఫీస్ వద్ద తలపడి సల్మాన్‌ను అక్షయ్ ఓడించబోతున్నాడు’ అని కేఆర్కే ట్వీట్ చేశాడు. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా కళ్లుచెదిరేరీతిలో వసూళ్లు రాబడుతున్న సంగతి తెలిసిందే. ఒకవైపు పౌరసత్వ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నప్పటికీ.. ఆ ప్రభావం అంతగా ‘గుడ్‌న్యూస్’పై లేదని బాక్సాఫీస్ లెక్కలు చాటుతున్నాయి. వీక్ డేస్‌లోనూ నిలకడగా వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమా గత శుక్రవారం రూ. 17.56 కోట్లు, శనివారం రూ. 21.78 కోట్లు, ఆదివారం రూ. 25.65 కోట్లు, సోమవారం రూ. 13,41 కోట్లు, మంగళవారం రూ. 16.20 కోట్లు, బుధవారం రూ. 22.50 కోట్లు మొత్తంగా రూ. 117.10 కోట్లను కలెక్ట్ చేసిందని బాలీవుడ్ ట్రెడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. అక్షయ్-కరీనా కపూర్, దిల్జిత్ దోసాన్జ్-కియారా అద్వానీ జోడీలుగా నటించిన ఈ సినిమాలో కృత్రిమ గర్బధారణ సమయంలో జరిగిన ఓ తప్పిదం వల్ల రెండు జంటలకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయన్నదే కథ. ఇదొక సున్నిత అంశమైనప్పటికీ దర్శకుడు రాజ్ మెహతా దాన్ని ఎక్కడా అపహాస్యం చేయకుండా జాగ్రత్తపడుతూ ప్రేక్షకులకు చక్కని వినోదాన్ని పంచాడు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు కురిపిస్తోంది. ఈ చిత్రం స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ ‘దబాంగ్ 3’ను పక్కకునెట్టి మరీ భారీ వసూళ్లు రాబట్టడం.. ట్రెడ్ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది. -
దుమ్మురేపుతున్న ‘ఖిలాడీ’ వసూళ్లు
ముంబై: బాలీవుడ్ సూపర్‌స్టార్, బాక్సాఫీస్ ఖిలాడీ అక్షయ్ కుమార్ తాజా సినిమా ‘గుడ్‌న్యూస్’ బాలీవుడ్‌కు నిజంగానే గుడ్న్యూస్గా మారింది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఇటు విమర్శకులు, అటు ప్రేక్షకుల ప్రశంసలు పొందుతూ కళ్లుచెదిరేరీతిలో వసూళ్లు రాబడుతోంది. ఒకవైపు పౌరసత్వ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నప్పటికీ.. ఆ ప్రభావం అంతగా ‘గుడ్‌న్యూస్’పై లేదని బాక్సాఫీస్ లెక్కలు చాటుతున్నాయి. వీక్ డేస్‌లో నిలకడగా వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమా మంగళవారం ఏకంగా 16 కోట్లు వసూలు చేసింది. దీంతో ఐదురోజుల్లో ఈ సినిమా వసూళ్లు రూ. 94 కోట్లకు చేరుకున్నాయి. ఈ రోజు కొత్త సంవత్సరం కావడంతో బుధవారం భారీగా ఈ సినిమా వసూళ్లు సాధించే అవకాశముంది. దీంతో ఆరు రోజుల్లోనే ఈ సినిమా వందకోట్ల క్లబ్బులోకి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. మంచి కంటెంట్, వినూత్నమైన కథనంతో వచ్చిన ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. గత శుక్రవారం రూ. 17.56 కోట్లు, శనివారం రూ. 21.78 కోట్లు, ఆదివారం రూ. 25.65 కోట్లు, సోమవారం రూ. 13,41 కోట్లు, మంగళవారం రూ. 16.20 కోట్లు మొత్తంగా రూ. 94.60 కోట్లను ఈ సినిమా కలెక్ట్ చేసిందని బాలీవుడ్ ట్రెడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. అక్షయ్-కరీనా కపూర్, దిల్జిత్ దోసాన్జ్-కియారా అద్వానీ జోడీలుగా నటించిన ఈ సినిమాలో కృత్రిమ గర్బధారణ సమయంలో జరిగిన ఓ తప్పిదం వల్ల రెండు జంటలకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయన్నదే కథ. ఇదొక సున్నిత అంశమైనప్పటికీ దర్శకుడు రాజ్ మెహతా దాన్ని ఎక్కడా అపహాస్యం చేయకుండా జాగ్రత్తపడుతూ ప్రేక్షకులకు చక్కని వినోదాన్ని పంచాడు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు కురిపిస్తోంది. ఈ చిత్రం స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ ‘దబాంగ్ 3’ను పక్కకునెట్టి మరీ గూడ్‌న్యూస్ వసూళ్లు రాబట్టడం.. ట్రెడ్ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది. -
కొత్త సంవత్సరానికల్లా ‘గుడ్ న్యూస్’?
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తాజాగా నటించిన చిత్రం ‘గుడ్ న్యూస్’. ఇందులో అక్షయ్‌కు జోడీగా కరీనా కపూర్ నటించారు. కృత్రిమ గర్బధారణ సమయంలో జరిగిన ఓ తప్పిదం వల్ల రెండు జంటల మధ్య ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయన్నదే కథ. ఇదొక సున్నిత అంశమైనప్పటికీ దర్శకుడు రాజ్ మెహతా దాన్ని ఎక్కడా అపహాస్యం చేయకుండా జాగ్రత్తపడుతూ ప్రేక్షకులకు చక్కని వినోదాన్ని పంచాడు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు కురిపిస్తోంది. ఈ చిత్రం స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ ‘దబాంగ్ 3’కు గట్టి పోటీనిస్తోంది. కాగా కేసరి, మిషన్ మంగళ్, హౌస్ ఫుల్ 4 చిత్రాల సక్సెస్‌తో జోష్ మీదున్న అక్షయ్ కుమార్ గుడ్ న్యూస్‌తో ఈయేడు నాలుగోసారి పలకరించారు. దేశంలో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ‘గుడ్ న్యూస్’ బాక్సాఫీస్ దగ్గర పడుతూ లేస్తూ ఉన్నప్పటికీ రూ. 100 కోట్ల మార్క్‌ను చేరడం ఖాయంగా కనిపిస్తోంది. శుక్రవారం రిలీజైన ఈ సినిమా తొలినాడే రూ.17 కోట్ల పైచిలుకు వసూలు చేయగా, నాలుగు రోజుల్లో రూ.88 కోట్లను రాబట్టింది. నేడు రానున్న కలెక్షన్లతో కలిపి ఈ సినిమా కొత్త సంవత్సరానికల్లా సెంచరీ దాటుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో అక్షయ్ కుమార్ వరుస సెంచరీలతో ఈ ఏడాదికి ‘గుడ్’బై చెప్పనున్నారు. -
వసూళ్ల పండగే.. ఓపెనింగ్స్ అదుర్స్
సాక్షి, హైదరాబాద్: సాయిధరమ్ తేజ్ తాజా చిత్రం ‘ప్రతిరోజూ పండగే’ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. మంచి వసూళ్లు రాబడుతూ దూసుకుపోతోంది. హిట్ టాక్ రావడంతో కలెక్షన్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. డిసెంబర్ 20న విడుదలైన ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో రూ.23.25 కోట్లు గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్టు యూవీ క్రియేషన్స్ వెల్లడించింది. సినిమా ఆద్యంతం ఎంటర్టైనింగ్గా ఉండటంతో ప్రేక్షాదరణ క్రమంగా పెరుగుతోందని నిర్మాతలు పేర్కొన్నారు. తమ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. సాయిధరమ్ తేజ్ కెరీర్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలుస్తుందని నమ్మకంగా ఉన్నారు. తాతమనవళ్లుగా సత్యరాజ్-సాయితేజ్ ఆకట్టుకున్నారు. సాయితేజ్‌కు జంటగా రాశిఖన్నా నటించింది. మారుతి తెరకెక్కించిన ఈ సినిమాలో సత్యరాజ్, రావు రమేశ్, విజయ్‌కుమార్, నరేశ్, ప్రభ తదితరులు కీలకపాత్రలు పోషించారు. యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించాడు. ప్రతిరోజూ పండుగే : మూవీ రివ్యూ -
దబాంగ్ 3: రెండో రోజు సేమ్ కలెక్షన్లు..
చుల్బుల్ పాండేగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ దబాంగ్ 3తో ముచ్చటగా మూడోసారి వచ్చాడు. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సల్మాన్ సరసన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హ నటించారు. భారీ అంచనాలతో వచ్చిన చుల్‌బుల్‌పాండే మరోసారి మురిపిస్తాడనుకుంటే ఈసారి తడబడినట్లు తెలుస్తోంది. అయితే, సినీ విశ్లేషకుల విమర్శలు, తక్కువ రేటింగ్‌లు, దేశంలో కొనసాగుతున్న నిరసనలు ఇవేవీ దబాంగ్ 3 కలెక్షన్లకు అడ్డుగా నిలవకపోవడం గమనార్హం. దబాంగ్ 3 విడుదలైన శుక్రవారం నాడు రూ.24 కోట్లు రాబట్టగా రెండో రోజు కూడా స్థిరంగా నిలబడి రూ.24 కోట్లు వసూలు చేయడం విశేషం. వీకెండ్ కాబట్టి కలెక్షన్లకు ఎలాంటి ఢోకా ఉండదని పలువురు అభిప్రాయపడుతున్నారు. దబాంగ్ 3 క్రేజ్ వీక్‌డేస్‌లో కొనసాగుతుందా? సోమవారం నుంచి ఈ సినిమా ఏమేరకు వసూళ్లు రాబడుతుందనేది ఆసక్తికరంగా మారింది. -
లెక్కకు మించి వసూళ్లు చేస్తున్న చిత్రం
నిజ జీవితంలో జరిగిన కిరాతకమైన అత్యాచారాల సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమే ‘మర్దానీ 2’. బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం తొలిరోజు అంతంతమాత్రంగానే వసూలు చేసింది. ఇది చిత్రబృందాన్నిఅయోమయానికి గురిచేసినప్పటికీ అనూహ్యంగా రెండోరోజు విపరీత వసూళ్లను సాధించింది. సాధారణంగా ఏ సినిమానైనా విడుదలైన తర్వాతి రోజుల్లో 50 నుంచి 60 శాతం వసూళ్లు పుంజుకుంటాయి. కానీ మర్దానీ 2 అందుకు భిన్నంగా రాకెట్ స్పీడులో రెండోరోజే 75 శాతం వసూళ్లు పుంజుకున్నాయి. ఈ సినిమా శుక్రవారం సుమారు రూ.4 కోట్లు అందుకోగా శనివారం ఏకంగా రూ. 6 కోట్ల పైచిలుకు సాధించింది. దీంతో ఇప్పటివరకు ఈ చిత్రం మొత్తంగా రూ.10 కోట్ల పైచిలుకు వసూళ్లు రాబట్టింది. ఇక బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ నటించిన ‘దబాంగ్ 3’ శుక్రవారం రిలీజ్ అవుతుండటంతో మర్దానీ 2 చిత్రానికి వసూళ్లు తగ్గే అవకాశం లేకపోలేదు. -
మర్దానీ-2: తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే!
బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ తాజాగా నటించిన చిత్రం మర్దానీ-2. డిసెంబర్ 13న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2014లో వచ్చిన ‘మర్దానీ’కి సీక్వెల్‌గా మార్దానీ-2 తెరకెక్కిన విషయం తెలిసిందే. గోపి పుత్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యష్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మించింది. ఇక ఈ సినిమా బాక్సాఫీసు వద్ద నెమ్మదిగా వసూళ్లు రాబడుతోంది. తొలిరోజు సుమారు రూ. 5 నుంచి 6 కోట్లు రాబట్టిందని సినీ ట్రేడ్ వర్గాల అంచనా. అదేవిధంగా ఈ చిత్రంపై ప్రేక్షకుల స్పందన, విమర్శకుల సమీక్షలు పరిశీలిస్తే.. ఇక మీదట బాక్సాఫీసు వద్ద సందడి చేయనుందని చిత్రం బృందం భావిస్తోంది. యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో పవర్ఫుల్ పోలీస్ అధికారిణి శివానీ శివాజీరాయ్‌గా రాణి ముఖర్జీ నటించారు. రాణిముఖర్జీ 2018లో నటించిన హిచ్కి కూడా విడుదలైన మొదటి రోజు సుమారు రూ. 3.30 కోట్లు రాబట్టింది. రెండో రోజు నుంచి ఈ చిత్రం కలెక్షన్లు పెరుగుతూ బాక్సాఫీసు వద్ద దూసుకుపోయింది. అదేవిధంగా మంచి స్పందన లభిస్తున్న మార్దానీ-2 కూడా కలెక్షన్లు వేగం పెరిగి బాక్సాఫీసు వద్ద సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ‘మర్దానీ 2’ లో విక్రమ్ సింగ్ చౌహాన్, శ్రుతి బాప్నా ప్రధాన పాత్రలు పోషించారు. -
మరో మైల్స్టోన్ దాటిన ‘సాహో’
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా యువ దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన భారీ యాక్షన్ అడ్వంచరస్ థ్రిల్లర్ సాహో. ఆగస్టు 30 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా మాత్రం సరికొత్త రికార్డ్లను సృష్టిస్తోంది. తొలి రోజే 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన సాహో పది రోజుల్లో 400 కోట్ల మార్క్‌ను అందుకుంది. ఇప్పటికీ సాహో కలెక్షన్లు స్టడీగా ఉండటంతో ముందు ముందుకు మరిన్ని రికార్డ్‌లు సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. చిత్రయూనిట్ కూడా సినిమాను వార్తల్లో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా సాహో మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. అంతేకాదు ప్రభాస్ అభిమానులతో కలిసి సాహో సినిమా చూడటం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు నిర్మించారు. హాలీవుడ్ స్థాయి యాక్షన్ సీక్వెన్స్‌లతో తెరకెక్కించిన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేశారు. Boom💣 & BAM💥 All that ACTION behind the reality of #Saaho #SaahoMaking #WorldofSaaho ➡➡ https://t.co/FXN5LjWFX2 — UV Creations (@UV_Creations) September 9, 2019 -
‘సాహో’ వరల్డ్ రికార్డ్!
ప్రభాస్, శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లుగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ సాహో. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా మాత్రం సంచలనాలు నమోదు చేస్తోంది. ఇప్పటికే భారత్‌లో మరో నటుడికి సాధ్యం కానీ స్థాయిలో వసూళ్ల సునామీ సృష్టిస్తున్న ప్రభాస్, సాహోతో వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు. తొలి వారాంతంలో అంతర్జాతీయ స్థాయి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల లిస్ట్‌లో సాహో రెండో స్థానంలో నిలిచింది. హాలీవుడ్ మూవీ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ : హాబ్స్ అండ్ షా’ ఒక్కటే సాహో కన్నా ముందు ఉంది. ది లయన్ కింగ్, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్, ఏంజల్ హ్యాస్ ఫాలెన్ లాంటి సూపర్ హిట్ హాలీవుడ్ సినిమాలు కూడా సాహో తరువాతి స్థానాలతో సరిపెట్టుకోవటం విశేషం. సెలవులు ముగియటంతో సాహో కలెక్షన్లు కాస్త స్లో అయినా ఇప్పటికీ సినిమా మంచి వసూళ్లనే సాధిస్తోంది. ఇప్పటికే 350 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సాహో ముందు ముందు మరిన్ని రికార్డ్ల దిశగా దూసుకుపోతోంది. -
సాహోకు తిప్పలు తప్పవా..?
బాహుబలి ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ హీరోహీరోయిన్లుగా భారీబడ్జెట్తో తెరకెక్కిన ‘సాహో’ హిందీలో రూ.100 కోట్ల మైలురాయికి చేరువలో ఉంది. సాహో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీ వెర్షన్లలో ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. యూవీ క్రియేషన్స్‌లో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లో కలుపుకుని మూడు రోజుల్లో దాదాపు 300 కోట్ల కలెక్షన్లు సాధించింది. సినిమాపై డివైడ్ టాక్ వచ్చినా, సినీ విశ్లేషకులు నెగెటివ్‌గా రివ్యూలిచ్చినా బాక్సాఫీస్ వసూళ్లు వాటికి గట్టి సమాధానం చెప్పాయి. ఇకపోతే మూడు రోజలుగా కలెక్షన్లు కురిపిస్తున్న సాహో కాస్త నెమ్మదించినట్టు తెలుస్తోంది. సోమవారం వినాయక చవితి ఉండటంతో వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా దీని ప్రభావం హిందీ వెర్షన్‌పై పడింది. హిందీలో వసూళ్లు 50 శాతానికి పైగా పడిపోయి రూ.14 కోట్లు మాత్రమే రాబట్టింది. గత నాలుగు రోజులుగా బాలీవుడ్లో పలు రికార్డులను మట్టి కరిపిస్తూ రూ.93 కోట్లు వసూళ్లు సాధించిన సాహో సెంచరీకి చేరువలో ఉంది. ఎలాగోలా సాహో హిందీలో సెంచరీ కొట్టడం ఖాయం. అయితే సాహోకు అసలు పరీక్ష ఇప్పుడు మొదలవుతుంది. సెలవులు పూర్తయ్యాయి. మరి ఇప్పుడు నిజంగా సగటు ప్రేక్షకుడు థియేటర్‌కు వెళ్లి చూస్తాడా లేదా అనేది తేలనుంది. ఇక అనవసర సీన్లు ఉన్నాయని, స్క్రీన్‌ప్లే సాగదీసినట్టుగా ఉందంటూ పలువురు సినిమాపై విమర్శలు ఎక్కుపెట్టారు. మూడు సంవత్సరాల తర్వాత ప్రభాస్ సాహో చిత్రంతో ప్రేక్షకులను పలకరించనుండటంతో భారీ అంచనాలతో హైప్ క్రియేట్ అయినా చివరకు ఉసూరుమనిపించిందని పెదవి విరిచారు. హాలీవుడ్ డైరెక్టర్ జేరోమ్ సల్లే తన ‘లార్గో వించ్’ సినిమాను కాపీ కొట్టి సాహోను చిత్రీకరించారని సాహో యూనిట్‌పై మండిపడ్డారు. గతంలోనూ లార్గో వించ్ చిత్ర కథా కథనాలను కాపీ చేసి అజ్ఞాతవాసి తీశారని, దీనిపై పోరాడుతానని చెప్పినా అది బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో గమ్మునుండిపోయాడు. ఇప్పుడు సాహో కూడా కాపీ సినిమా అంటూ కామెంట్ చేస్తూ.. ‘తీస్తే తీశారు. కనీసం కాపీ కొట్టడమైనా కరెక్ట్‌గా చేయండి’ అంటూ తెలుగు దర్శకులకు సూచించారు. సాహోపై విమర్శలు రావటం ఇది మొదటిసారేం కాదు.. గతంలోనూ బెంగళూరుకు చెందిన ఆర్టిస్ట్ అనుమతి తీసుకోకుండా తన ఆర్ట్‌ను సినిమాలో సెట్ డిజైన్ వాడుకున్నారని ఆరోపించారు. పలు పోస్టర్లు కూడా హాలీవుడ్ చిత్రాల్లో నుంచి మక్కీకి మక్కీ దించారని సాహో టీం ఆరోపణలు ఎదుర్కొంది. -
తొలి రోజే వంద కోట్లు.. ‘సాహో’ ప్రభాస్!
డివైడ్ టాక్‌తో మొదలైనా.. సాహో తన సత్తా చూపిస్తోంది. బాహుబలి తరువాత ప్రభాస్ చేస్తున్న సినిమా కావటంతో పాటు, ఇండియాస్ బిగెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ అన్న ప్రచారం జరగటంతో సాహోపై భారీఅంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే తొలి రోజు ఈ సినిమా సత్తా చాటింది. తెలుగుతో పాటు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్టుగా తెలుస్తోంది. టాక్ తో సంబంధం లేకుండా సాహో సినిమా భారీ వసూళ్లు సాదిస్తుండటంతో డార్లింగ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ ఘనత సాధించిన రెండో భారతీయ చిత్రంగా రికార్డ్ సృష్టించింది సాహో. మొదటి స్థానంలోనూ ప్రభాస్ సినిమాయే ఉండటం విశేషం. బాహుబలి 2తో తొలి రోజే 100 కోట్లకు పైగా కొల్లగొట్టిన రికార్డ్ నెలకొల్పిన ప్రభాస్, సాహోతో మరోసారి అదే ఫీట్‌ను రిపీట్ చేశాడు. కేవలం హిందీలోనే 24 కోట్లకు పైగా షేర్ సాధించి ఈ ఏడాది హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల సరసన నిలిచింది సాహో. మరో మూడు రోజుల పాటు సెలవులు కావటంతో వసూళ్లు భారీగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. భారత్‌లో సాహో మంచి వసూళ్లు సాధిస్తున్నా.. ఓవర్ సీస్లో మాత్రం ఈ సినిమా కలెక్షన్లు అంత ఆశాజనకంగా లేవు. -
ఇక ‘నాన్ బాహుబలి రికార్డ్’ అన్న పదం వినిపించదా!
రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా భారతీయ సినిమా ముఖచిత్రాన్నే మార్చేసింది. వందకోట్ల వసూళ్లు సాధించటమే టార్గెట్ అనుకున్న ఇండియన్ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో వసూళ్లకు గేట్లు తెరిచింది. బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా బాహుబలి విజయం ముందు దాసోహం అన్నాయి. బాహుబలి రిలీజ్ తరువాత ఆ రికార్డ్లను చెరిపేసేందుకు బాలీవుడ్ చేసిన ప్రయత్నాలన్ని విఫలమయ్యాయి. కానీ ఇప్పుడు సాహో సినిమా రిలీజ్‌కు దగ్గర పడుతుండటంతో మరోసారి బాహుబలి రికార్డ్‌లపై చర్చ మొదలైంది. ఇన్నాళ్లు భారీ విజయం సాధించిన సినిమాలను నాన్ బాహుబలి రికార్డ్ సాధించిందంటూ చెపుతూ వస్తున్నారు. కానీ సాహో రిలీజ్ తరువాత రికార్డ్‌లకు సరికొత్త స్టాండర్ట్స్ సెట్ అవుతాయంటున్నారు ఫ్యాన్స్. సాహో.. బాహుబలి రికార్డులన్నింటినీ చెరిపేయటం ఖాయం అని భావిస్తున్నారు. అయితే విశ్లేషకుల మాట మాత్రం మరోలా ఉంది. సాహో మీద భారీ అంచనాలు ఉన్నా బాహుబలి మార్క్‌ను అందుకోవటం కష్టమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాహో బ్రేక్ఈవెన్ సాధించాలంటే దాదాపు 400 వందల కోట్ల వసూళ్లు సాధించాలి. కేవలం బాలీవుడ్లోనే 125 కోట్ల వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. ఆ స్థాయి వసూళ్లు సాహోకు సాధ్యమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. బాహుబలి కాస్ట్యూమ్ డ్రామా కావటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సాహో రెగ్యులర్ సోషల్ యాక్షన్ కథ కావటంతో ఆ స్థాయిలో అంచనాలు కష్టమే అంటున్నారు. హిందీలో ఇప్పటికే ధూమ్ లాంటి యాక్షన్ సినిమాల చాలా వచ్చాయి. మరి సాహో వాటిని మించి బాలీవుడ్ జనాలు సాహో అలరిస్తుందా లేదా చూడాలి. -
పైసా వసూల్ మూవీగా సూపర్ 30
ముంబై : బాలీవుడ్ గ్రీక్‌గాడ్ హృతిక్ రోషన్ టైటిల్ పాత్రలో గణిత శాస్త్రవేత్త ఆనంద్ కుమార్ బయోపిక్‌గా తెరకెక్కిన సూపర్ 30 బాక్సాఫీస్ వద్ద డ్రీమ్‌రన్ కొనసాగిస్తోంది. నాలుగో వారంలోనూ నిలకడగా వసూళ్లు సాధిస్తూ బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకుపోతోంది. నాలుగోవారంతో కలుపుకొని సూపర్ 30 భారత్‌లో రూ 134.71 కోట్లు కలెక్ట్ చేసిందని ట్రేడ్ అనలిస్ట్, సినీ విమర్శకులు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. కొత్త సినిమాలు థియేటర్లకు క్యూ కట్టినా సూపర్ 30 స్ర్టాంగ్ రన్ కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. మరోవైపు ఓవర్సీస్లోనూ సూపర్ కలెక్షన్స్ రాబడుతోంది. ఓవర్సీస్లో ఆగస్ట్ 1 వరకూ ఈ మూవీ ఏకంగా రూ 35.05 కోట్లు కొల్లగొట్టింది. హృతిక్‌తో పాటు ఈ సూపర్ 30లో టీవీ నటి మృణాల్ ఠాకూర్, వీరేంద్ర సక్సెనా, జానీ లీవర్, పంకజ్ త్రిపాఠి తదితరులు నటించారు. -
బాక్సాఫీస్ వద్ద ‘కబీర్ సింగ్’కు భారీ వసూళ్లు
సాక్షి, ముంబై: షాహిద్ కపూర్ తాజా సినిమా ‘కబీర్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. షాహిద్ కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఈ సినిమాపై అటు విమర్శల నుంచి ప్రశంసల వర్షం కురస్తుండగా.. ఇటు ప్రేక్షకులు సైతం బ్రహ్మరథం పడుతున్నారు. తొలిరోజు 20.21 కోట్లు రాబట్టిన ఈ సినిమా రెండోరోజు ఏకంగా రూ. 22.71 కోట్ల వసూళ్లు సాధించింది. మొత్తానికి రెండు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద 42.92 కోట్లు సొంతం చేసుకుంది. షాహిద్ కెరీర్లో సోలో హీరోగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం ‘ఆర్.. రాజ్‌కుమార్’.. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మొత్తంగా రూ. 66.10 కోట్లు సాధించింది. ఆ రికార్డులను సైతం అధిగమించి తొలి వీకెండ్లోనే ‘కబీర్ సింగ్’ సినిమా రూ. 70 కోట్ల మార్క్‌ను దాటే అవకాశముందని సినీ పరిశీలకులు భావిస్తున్నారు. షాహిద్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లక్‌బస్టర్‌గా ఈ సినిమా నిలిచే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఇంతకుముందు షాహిద్ నటించిన ‘పద్మావతి’ చిత్రం భారీ కలెక్షన్లు సాధించినప్పటికీ.. అది మల్టీస్టారర్ మూవీ కావడం.. ఆ సినిమాలో ప్రధాన పాత్ర అయిన రణ్‌బీర్ సింగ్‌కు ఎక్కువ క్రెడిట్ దక్కడం తెల్సిందే. కబీర్ సింగ్ తెలుగులో సూపర్ హిట్టయిన సినిమా 'అర్జున్ రెడ్డి'కి రీమేక్. తన ప్రేమికురాలు మరోవ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో ఓ వైద్య విద్యార్థి స్వీయ విధ్వంసానికి పాల్పడతూ.. ఎలా మారిపోయాడు? అతని ప్రేమకథ ఎలా కొలిక్కి వచ్చిందనేది? ఈ మూవీ సారాంశం. అడ్వాన్స్ బుకింగ్‌లో సల్మాన్ ఖాన్ నటించిన భారత్, ఎవెంజర్స్ తర్వాత కబీర్ సింగ్ 3వ స్థానంలో నిలిచింది. యువత, మాస్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండడంతో ఈ మూవీ భారీ వసూళ్ల దిశగా సాగుతోంది. -
నెగిటివ్ టాక్‌తో వందకోట్లు.. వాడే సూపర్‌స్టార్!
సూపర్‌స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం మహర్షి.. వందకోట్లను కలెక్ట్ చేసినట్టు ప్రకటించారు. సినిమా ఫస్ట్ షో నుంచి మిక్స్డ్ టాక్ రాగ.. చిత్రయూనిట్ మాత్రం ఆహాఓహో అంటూ గోబెల్స్ ప్రచారం చేస్తూ వస్తున్నారు. సినిమాకు మాత్రం కలెక్షన్లు భారీ స్థాయిలో వస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. అయితే ఈ చిత్రం వందకోట్ల షేర్‌ను కలెక్ట్ చేసినట్లు ప్రకటించిన తరువాత.. సూపర్‌స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. నెగెటివ్ టాక్, యావరేజ్ టాక్‌తో సైతం వందకోట్లను కలెక్ట్ చేయగల ఒకే ఒక్క హీరో మహేష్.. అందుకే మహేష్ బాబును సూపర్‌స్టార్ అంటారని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. అయితే ఓవర్సీస్లో ఇప్పటివరకు మహర్షి రెండు మిలియన్ల డాలర్లను అందుకోలేకపోవడం ఫ్యాన్స్‌కు మింగుడుపడటం లేదు. ఓవర్సీస్ కలెక్షన్లతోనే సినిమా హిట్టా ఫట్టా అనే విషయాన్ని ఫిక్స్ అవుతుండగా.. ‘మహర్షి’ మాత్రం ఇప్పటికీ 1.8మిలియన్ డాలర్లను మాత్రమే వసూళ్లు చేసింది. Only Hero to Mark this #100CrShareForMaharshi with - ve talk. Superstar for a Reason.#Maharshi#MaharshiMania#100CrShareForMaharshi pic.twitter.com/yOP06trK1X — Prince Dinesh (@DINESH_SAMSANI) May 27, 2019 Hit talk tho yevadaina 100cr easy ga mark chestadu. But - ve talk tho mark chesey vade SUPERSTAR Avutadhu @urstrulyMahesh#100CrShareForMaharshi#Maharshi pic.twitter.com/a256Ipp5cd — Prince Dinesh (@DINESH_SAMSANI) May 27, 2019 -
మొదటి వారంలో రూ. 50 కోట్ల కలెక్షన్లు
ముంబై : టైగర్ ష్రాఫ్ తాజా సినిమా స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ టూ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైనప్పటికీ కలెక్షన్లు మాత్రంగా స్థిరంగా ఉన్నాయి. ఈ నెల 10న విడుదలైన ఈ సినిమా ఇండియాలో మొదటి వారంలో రూ. 57.90 కోట్ల కలెక్షన్లు సాధించిందని ప్రముఖ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. రెండో వారం వసూళ్లు ఈ సినిమాకు కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. గతేడాది విడుదలైన ‘బాగీ2’ సినిమా మొదటి వారంలోనే వంద కోట్లు పైగా (రూ. 112.85 కోట్లు) సాధించి టైగర్ ష్రాఫ్ కెరీర్లో బెస్ట్‌గా నిలిచింది. 2016లో వచ్చిన ‘బాగీ’ సినిమా తొలి వారంలొ రూ. 59.72 కోట్లు రాబట్టింది. కరణ్ జోహార్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ టూలో టైగర్ ష్రాఫ్ సరసన చుంకీ పాండే కుమార్తె అనన్య పాండే, తార నటించారు. పునీత్ మల్హోత్రా దర్శకత్వం వహించారు. -
వారం రోజుల్లో 300కోట్లు కొల్లగొట్టింది
‘అవెంజర్స్’ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిన సంగతే. మార్వెల్ సంస్థ తెరకెక్కించిన సూపర్ హిట్ సిరీస్‌లో చివరి చిత్రమైన ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’ గత శుక్రవారం విడుదలైంది. ఇండియా వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసిన ఈ చిత్రం వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. చైనాలో అయితే ఇప్పటికే 700కోట్లను కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక మొదటి వారం ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8వేల కోట్లను కొల్లగొట్టినట్లు సమాచారం. ఈ చిత్రం ఇండియాలో వారం రోజుల్లోనే 300కోట్లను కలెక్ట్ చేసినట్లు ట్రేడ్‌వర్గాలు తెలిపాయి. ‘ఇన్ఫినిటీవార్’ లైఫ్‌టైమ్ కలెక్షన్స్‌ను 2 రోజుల్లో ‘ఎండ్‌గేమ్’ దాటేసింది. సూపర్ హీరో క్యారక్టర్స్ అయిన ఐరన్‌మేన్, కెప్టెన్ అమెరికా, హల్క్, థోర్, స్పెడర్ మేన్, బ్లాక్ ప్యాంథర్‌లను ఓ చోట చేర్చి మార్వెల్ సంస్థ తొలుత ‘ది అవెంజర్స్’ను రిలీజ్ చేసింది. ఆ తర్వాత ‘అవెంజర్స్ : ఏజ్ ఆఫ్ అల్ట్రాన్’, ‘ఇన్ఫినిటీ వార్’ చిత్రాలు వచ్చాయి. ఆ చిత్రాల ముగింపే ‘ఎండ్‌గేమ్’. ఈ చిత్రం తర్వాత మళ్లీ సూపర్ హీరోల పాత్రలు కనిపించకపోవచ్చు. అందుకే ఎన్నిసార్లు చూసినా చివరిసారి చూడటం ప్రత్యేకమన్నట్టు మార్వెల్ అభిమానులు మళ్లీ మళ్లీ ‘ఎండ్ గేమ్’చిత్రాన్ని వీక్షిస్తున్నారు. -
బాహుబలిని దాటలేకపోయిన ‘అవెంజర్స్’
ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన భారీ చిత్రం అవెంజర్స్ ఎండ్ గేమ్. మార్వెల్ సంస్థ తెరకెక్కించిన సూపర్ హిట్ సిరీస్‌లో చివరి చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇండియాలోనూ భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరగటం, సింగిల్ స్క్రిన్స్లోనూ పెద్ద సంఖ్యలో సినిమా రిలీజ్ కావటంతో రికార్డ్లను తిరగరాయటం ఖాయం అని భావించారు. ఒక దశలో భారత్‌లో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన బాహుబలి 2 రికార్డును అవెంజర్స్ తుడిచేస్తుందన్న టాక్ వినిపించింది. అయితే బాహుబలి 2 రికార్డ్‌ను అవెంజర్స్ అందుకోలేకపోయింది. బాహుబలి 2 తొలి రోజు 63 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా అవెంజర్స్ మాత్రం 53 కోట్లతో సరిపెట్టుకుంది. శంకర్ తెరకెక్కించిన విజువల్ వంబర్ 2.ఓ 59 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. బాలీవుడ్ మూవీ థగ్స్ ఆఫ్ హిందూస్థాన్, కబాలి చిత్రాలు నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. -
అవెంజర్స్ సునామీ.. తొలి వారం 6 వేల కోట్లు!
శుక్రవారం అవెంజర్స్ ఎండ్ గేమ్ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో అదే స్థాయిలో అడ్వాన్స్ బుక్సింగ్స్ అయ్యాయి. టాక్ కూడా పాజిటివ్‌గా ఉండటంతో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. చైనాతో పాటు పలు ఆసియా దేశాల్లో రెండు రోజుల ముందే రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ కూడా ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్లు సాదిస్తోంది. (చదవండి : ‘అవెంజర్స్ : ఎండ్ గేమ్’ ఎలా ఉందంటే!) ప్రస్తుతం ఉన్న ఊపు చూస్తుంటే తొలి వారాంతానికి ఈ సినిమా 6000 కోట్లకు పైగా వసూళ్లు సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. అదే జోరు మరో వారం కొనసాగితే గత చిత్రాల రికార్డులన్ని చేరిపేసి 20 వేల కోట్ల వసూళ్లతో ఆల్‌టైం రికార్డ్ సెట్ చేయటం ఖాయం అంటున్నారు. ఇండియాలోనూ ఈసినిమా తొలి రోజు 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించటం విశేషం. ఎండ్ గేమ్, మార్వెల్ సంస్థ నిర్మిస్తున్న సూపర్ హీరో చిత్రాల సిరీస్‌లో చివరిది కావటంతో ప్రతీ ఒక్కరు తమ అభిమాన సూపర్ హీరోకు సెండాఫ్ ఇచ్చేందుకు థియేటర్లకు వస్తున్నారు. -
తొలి రోజే 750 కోట్లా!
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అవెంజర్స్ ఎండ్ గేమ్ ఫీవర్ కనిపిస్తోంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న ఈ సినిమా అన్ని రికార్డ్లను చెరిపేయటం ఖాయంగా కనిపిస్తోంది. దాదాపు 20 వేల కోట్ల వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇండియాలో కూడా ఈ సినిమాకు అడ్వన్స్ బుకింగ్స్ అదే స్థాయిలో కనిపిస్తున్నాయి. మల్టీప్లెక్స్ ఆడియన్స్ టికెట్ల కోసం థియేరట్ల ముందు క్యూ కడుతున్నారు. ఇప్పటికే 10 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్టుగా తెలుస్తోంది. అయితే చైనాతో పాటు పలు ఆసియా దేశాల్లో ఈ సినిమా విడుదలైంది. ముఖ్యంగా చైనాలో ఈ సినిమా తొలి రోజు సంచనాలు నమోదు చేసింది. ఒక్క రోజులోనే దాదాపు 750 కోట్ల వసూళ్లు సాధించినట్టుగా చెప్పుతున్నారు. దీంతో తొలి రోజు ఆసియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అవెంజర్స్ ఎండ్ గేమ్ చరిత్ర సృష్టించింది. ఈ ఊపు చూస్తుంటే అవతార్ సినిమా రికార్డ్‌లు కూడా బద్ధలవ్వటం ఖాయంగా కనిపిస్తోంది. -
హారోయిన్స్
కథానాయికలు లేటెస్ట్ ట్రెండ్‌కి మారిపోయారు. ఓన్లీ గ్లామర్, సాంగ్స్‌కే కాదు. యాక్షన్ సినిమాలు చేయడానికైనా, బయోపిక్స్‌లో ఒదిగిపోవడానికైనా, థియేటర్స్‌లో ఆడియన్స్‌ను భయపెట్టడానికైనా సై అంటున్నారు. వారి ఉత్సాహాన్ని బాక్సాఫీస్ కలెక్షన్స్ కూడా ప్రోత్సహిస్తున్నాయి. ఆడియన్స్‌ను భయపెట్టి మంచి కలెక్షన్స్ రాబట్టుకోవడానికి భయమే అభయంగా బాక్సాఫీస్ వద్ద వెండితెర ఆత్మలుగా హారర్ సినిమాల కోసం ప్రిపేర్ అవుతున్న కొందరి హారోయిన్స్ గురించి తెలుసుకుందాం. ఐరాగా.. అందాల తార రెండేళ్ల క్రితం ‘డోరా’ సినిమాతో భయపెట్టడానికి ఆడియన్స్‌ను థియేటర్స్‌లోకి పిలిచారు నయనతార. కానీ ప్రేక్షకులు అంతగా భయపడలేదు. ఇప్పుడు ‘ఐరా’ సినిమాతో మరో సారి భయపెట్టేందుకు రెడీ అవుతున్నారు నయన్. ఇటీవల విడుదలైన ట్రైలర్ చూస్తే ఈ సినిమాలో హారర్ అంశాలు పుష్కలంగానే ఉన్నట్లు అర్థం అవుతోంది. ఇందులో నయనతార డబుల్ రోల్ చేయగా ఒకటి డీ–గ్లామర్ రోల్ కావడం విశేషం. కేఎమ్. సర్జున్ దర్శకత్వం వహించిన ‘ఐరా’ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. నయనతార ట్రిపుల్ టెర్రర్ కథానాయిక అంజలి చేతిలో ప్రస్తుతం ఉన్న సినిమా లిస్ట్‌ను చెక్ చేస్తే అందులో మూడు హారర్ సినిమాలు (గీతాంజలి 2, ఓ, లీసా)ఉన్నాయి. 2004 లో వచ్చిన ‘గీతాంజలి’ సక్సెస్ సాధించింది. ఇప్పుడు సీక్వెల్‌కు ప్రిపేర్ అవుతున్నారు. మరో హారర్ మూవీ ‘లీసా’ సినిమా షూటింగ్ పూర్తి కావొచ్చింది. ఈ సినిమాకు త్రీడీ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. తెలుగు, తమిళంలో రూపొందుతున్న ఈ సినిమాని హిందీలో కూడా డబ్ చేయాలనుకుంటున్నారు. రాజు విశ్వనాథ్ దర్శకుడు. ఇక ‘ఓ’ సినిమా దగ్గరకు వస్తే... తన చుట్టూ ఏం లేకపోయినా ఏదో ఉందని ఊహించుకుని భయపడే క్యారెక్టర్లో అంజలి నటిస్తున్నారు. ఈ సినిమాకు ప్రవీణ్ దర్శకుడు. ఇలా.. ఈ ఏడాది ట్రిపుల్ హారర్ థమాకా ఇవ్వనున్నారు అంజలి. అంజలి మహా భయం తన సినీ కెరీర్లో 50వ చిత్రాన్ని కాస్త డిఫరెంట్‌గా ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యారు హన్సిక. ఆ ఆలోచనలోనే ‘మహా’ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. హారర్ అండ్ సస్పెన్స్‌తో కూడిన చిత్రమిది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్స్ పోస్టర్స్ వివాదం అయ్యాయి. కానీ, టీమ్ మాత్రం ఎప్పటికప్పుడు డిఫరెంట్ పోస్టర్స్‌ను రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు. తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకు యుఆర్ జమీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది. హన్సిక ఫాంటసీ హారర్ ప్రస్తుతం సౌత్‌లో మంచి బిజీగా ఉన్నారు రాయ్‌లక్ష్మీ. కన్నడలో ‘ఝాన్సీ’, తెలుగులో ‘వేర్ ఈజ్ వెంకటలక్ష్మీ’ సినిమాల షూటింగ్స్‌ను కంప్లీట్ చేసిన ఆమె ‘సిండ్రెల్లా’ అనే ఫ్యాంటసీ కమ్ హారర్ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇటీవలే సినిమా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. వినోద్ వెంకటేశ్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా ఈ ఏడాదే విడుదలవుతోంది. రాయ్‌లక్ష్మీ థ్రిల్లింగ్ హారర్ థియేటర్లో ‘అరుంధతి’ సినిమా చూసిన ప్రేక్షకులు తర్వాత ఇంటికి ఒంటరిగా వెళ్లడానికి జంకేలా ఉన్నాయి ఆ సినిమాలో హారర్ సీన్స్. ఆ తర్వాత అనుష్క ‘పంచాక్షరి, భాగమతి’ వంటి సినిమాలను చేసినప్పటికీ ఆ రేంజ్ హిట్‌ను సాధించలేకపోయారనే చెప్పొచ్చు. మళ్లీ ఇప్పుడు ‘అరుంధతి’ రేంజ్లో ఆడియన్స్‌ను హడలెత్తించడానికి రెడీ అవుతున్నారట అనుష్క. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారామె. ఇది కేవలం హారర్ సినిమానే కాదు సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా బాగానే ఉంటాయట. ఇందులో మాధవన్, అంజలి, షాలినీ పాండే కూడా నటిస్తారు. కొంతమంది హాలీవుడ్ నటులు కూడా కనిపిస్తారట. మార్చిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. ∙‘భాగమతి’లో అనుష్క ఎక్స్ట్రా ఫియర్ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాలో ఆడియన్స్‌ను బాగానే కంగారు పెట్టారు నందితా శ్వేతా. ఇప్పుడామె ‘ప్రేమకథా చిత్రమ్ 2’ సినిమాలో నటిస్తున్నారు. 2013లో వచ్చిన ‘ప్రేమకథా చిత్రమ్’ చిత్రానికి ఇది సీక్వెల్. ‘బ్యాక్ టు ఫియర్’ అనేది ఉపశీర్షిక. హరి కిషన్ దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్ అశ్విన్, సిద్ధి ఇద్నానీ ముఖ్య తారలుగా నటించారు. ఆల్రెడీ రిలీజ్ చేసిన నందిత లుక్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో ‘దేవి 2’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 2016లో వచ్చిన దేవి (తెలుగులో ‘అభినేత్రి’) సినిమాకు ఇది సీక్వెల్. హారర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నందితా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ప్రభుదేవా, తమన్నా ముఖ్య తారలు. తమిళంలో ‘నర్మద’ అనే సినిమాకు కమిట్ అయ్యారు నందిత. ఈ సినిమాలో కూడా హారర్ అంశాలు ఉంటాయని టాక్. మరి.. ఈ మూడు సినిమాలతో నందితా ఆడియన్స్‌కు ఎక్స్ట్రా ఫియర్ ఇస్తారా? వెయిట్ అండ్ సీ. నందితా శ్వేతా హీరోలు కూడా హారర్ జానర్‌పై దృష్టిపెట్టారు. 2017లో ‘గృహం’ సినిమాతో బంపర్‌హిట్ అందుకున్న సిద్ధార్థ్ ఇప్పుడు ‘అరువమ్’ అనే హారర్ మూవీలో నటిస్తున్నారు. ‘ముని’ సిరీస్ మూవీస్‌తో రాఘవ లారెన్స్ ప్రేక్షకులను బాగా భయపెట్టారు. ఆయన తాజా హారర్ మూవీ ‘కాంచన 3’ (ముని 4) ఏప్రిల్‌లో విడుదల కానుంది. ‘నిను విడని నీడను నేనే’ చిత్రంతో తొలిసారి హారర్ జానర్లో నటిస్తున్నారు సందీప్ కిషన్. ‘చీకట్లో చితక్కొట్టుడు’ వంటి చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరిక్షీంచుకోవడానికి రెడీ అవుతున్నాయి. సిద్ధార్థ్, రాఘవ లారెన్స్ – ముసిమి -
ఆమిర్ సినిమాకు పెట్టుబడి కూడా రాదా..?
మిస్టర్ పర్ఫెక్షనిస్టు ఆమిర్ ఖాన్, బిగ్ బీ అమితాబ్ కలిసి మొట్టమొదటిసారిగా నటించిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ సినిమా ఫేల్యూర్ బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బాహుబలి రికార్డులను బ్రేక్ చేయొచ్చని ఆశపడ్డ ఆమిర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ప్రపంచవ్యాప్తంగా 5000 స్క్రీన్లలో.. భారీ స్థాయిలో రిలీజ్ అయిన ఈ సినిమాకు దారుణమైన టాక్ వచ్చింది. సినిమా విడుదలైన ఫస్ట్‌షో నుంచే నెగెటివ్ టాక్ మొదలై.. కలెక్షన్లకు గండిపడింది. బాహబలి రికార్డులను తిరగరాయడం మాట అటుంచితే కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేట్టు లేదు. ఈ మూవీ ఇప్పటి వరకు 100 కోట్ల మార్కును మాత్రమే దాటిందని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. గత నాలుగు రోజులుగా ఈ సినిమా కలెక్షన్లు ఎంత దారుణంగా పడిపోయాయో వెల్లడించారు. (‘థగ్స్’కు అంత సీన్ లేదు..!) హిందీ పరిశ్రమ వసూళ్లు (కోట్లలో) : గురువారం- 50.75; శుక్రవారం- 28.25; శనివారం- 22.75; ఆదివారం- 17.25; సోమవారం- 5.50 మొత్తం : 124.50 కోట్లు తెలుగు+తమిళం వసూళ్లు (కోట్లలో) : గురువారం- 1.50 కోట్లు; శుక్రవారం- 1 కోటి; శనివారం-75 లక్షలు; ఆదివారం- 75 లక్షలు; సోమవారం- 50 లక్షలు మొత్తం : 4.5 కోట్లు ఇక థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ కథ, కథనం సీరియల్ తరహాలో సాగడంతో ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించలేకపోయారని సినీ విమర్శకులు రివ్యూలు రాశారు. విమర్శకుల రివ్యూలు పక్కనబెడితే.. సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాపై అభిమానులు చేస్తున్న కామెంట్లు ప్రస్తుతం ట్విటర్లో ట్రెండింగ్ అవుతుండటం విశేషం. ట్విటరటీలు చేసిన కొన్ని ఆసక్తికర కామెంట్లు మీకోసం.. ఈ సినిమా మొదలైన 20 నిముషాల తర్వాత.. ఓ యువతి ‘నన్ను వెళ్లనీయండి ప్లీజ్.. నేను వెళ్లాలి’ అంటూ దీనంగా అర్థించే వీడియో ఒకరు పోస్టు చేయగా.. టికెట్ డబ్బులు తిరిగి చెల్లించాలని మరొకరు ట్వీట్ చేశారు. సినిమా చూసొచ్చిన అభిమానులంతా కట్టగట్టుకుని బావిలో దూకే వీడియో పెట్టి మరొకరు తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. ఈ సినిమాకు షారుఖ్‌ఖాన్ తాజా మూవీ... ‘జీరో’ రేటింగ్ ఇస్తున్నామని ఇంకొకరు వ్యంగ్యాస్త్రం వేశారు. ఇంకోవైపు.. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ అద్భుతంగా ఉందనీ, ఆమిర్, అమితాబ్ నటనకు జేజేలు పలుకుతున్నారు కొందరు అభిమానులు. కాగా, విజయ్ కృష్ణ ఆచార్య తెరకెక్కించిన ఈ సినిమాలో కత్రినా కైఫ్, దంగల్ ఫేం.. ఫాతిమా సనా షేక్ నటించారు. -
వంద కోట్లు కొల్లగొట్టిన ‘సర్కార్’!
ఇళయ దళపతి విజయ్ సినిమా అంటేనే బాక్సాఫీస్‌లు బయపడుతుంటాయి. సినిమా టాక్‌తో సంబంధం లేకుండా రికార్డులను వేటాడేస్తుంది. ఇంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ ఈ మంగళవారం ‘సర్కార్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో ఇప్పటికే రెండు బ్లాక్‌బస్టర్ హిట్లను తన అభిమానులకు అందించిన విజయ్.. ఈ సారి సర్కార్‌తో మరోసారి ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా మొదటిరోజే కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఒక్క మొదటిరోజే తమిళనాడులో దాదాపు ముప్పై కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 2.32కోట్లు, కేరళలో దాదాపు 6కోట్లను కలెక్ట్ చేసి.. సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇక ఓవర్సీస్లో ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. యూకే, సింగపూర్, ఆస్ట్రేలియా, అమెరికాల్లో ఈ సినిమా దూసుకెళ్తోంది. ఈ మూవీ రెండు రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమాను దాదాపు 3400 స్ర్కీన్స్‌పై విడుదల చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం మెర్సెల్ రికార్డులను అధిగమించేట్టుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ మూవీలో కీర్తి సురేష్, వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. #Sarkar100CrIn2Days According to Team #Sarkar , the movie has crossed 100 Crs gross WW in 2 Days.. pic.twitter.com/HlrRPftudJ — Ramesh Bala (@rameshlaus) November 8, 2018 -
భారీ వసూళ్లు సాధిస్తోన్న ‘విశ్వరూపం 2’
లోక నాయకుడు కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన యాక్షన్ స్పై థ్రిల్లర్ విశ్వరూపం 2. 2013లో రిలీజ్ అయిన విశ్వరూపం సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే డివైడ్ టాక్‌తో మొదలైన విశ్వరూపం 2 కలెక్షన్ల పరంగా మాత్రం సత్తా చాటుతోంది. తొలి రోజు అన్ని భాషల్లో కలిపి 9 కోట్ల వసూళ్లు సాధించినట్టుగా ప్రముఖ ట్రేడ్ ఎనలిస్ట్ గిరీష్ జోహర్ వెల్లడించారు. చాలా రోజులు తరువాత కమల్ లీడ్ రోల్ లో సినిమా రిలీజ్ కావటంతో చెన్నై అభిమానులతో థియేటర్లకు క్యూ కడుతున్నారు. దీంతో టాక్‌తో సంబంధం లేకుండా విశ్వరూపం 2 వసూళ్లు సాధిస్తోంది. రెండు రోజుల్లో 19 కోట్లకు పైగా కలెక్షన్లు సాదించి కోలీవుడ్ లో తొలి రెండు రోజేల్లో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా రికార్డ్ సృష్టించింది ఈ సినిమా. కమల్ రా ఏంజెంట్ గా నటించిన ఈ సినిమాలో పూజా కుమార్, ఆండ్రియా, శేఖర్ కపూర్, రాహుల్ బోస్‌లు ఇతర కీలక పాత్రలో నటించారు. కమల్ ఆస్థాన సంగీత దర్శకుడు గిబ్రాన్ సంగీతమందించారు. -
కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న ‘సంజు’
ముంబై: సంజయ్ దత్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన సంజు చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న ఈ సినిమా ఇప్పటికే రూ.250 కోట్లకు పైగా వసూలు చేసింది. అంతే కాకుండా అత్యంత తక్కువ సమయంలో రూ.200 కోట్లు సాధించిన మూడో భారతీయ చిత్రంగా నిలిచింది. పదో రోజు (ఆదివారం) రూ. 28.05 కోట్లు వసూలు చేసింది. దీంతో సంజు సినిమా ఇప్పటి వరుకూ రూ.265.48 కోట్ల కలెక్షన్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ఈ సినిమా రూ.300 కోట్ల క్లబ్లో చేరడానికి రెడీ అవుతోంది. విడుదలైన తొలి మూడు రోజులకే రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ సినిమా రణ్‌బీర్‌కపూర్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలవడం విశేషం. రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, పరేష్ రావెల్, మనీషా కోయిరాల, అనుష్క శర్మ, దియా మీర్జా, విక్కీ కౌశల్ తదితరులు నటించారు. సంజయ్ దత్ పాత్రలో రణ్‌బీర్ కపూర్ జీవించేశాడని ప్రశంసలు కురుస్తున్నాయి. -
ఆ సినిమాకు కలెక్షన్ల సునామీ
సాక్షి, ముంబై : ‘ఇస్ రేస్ కా సికిందర్ మై హూ’ (ఈ రేసులో విజేతను నేనే)’ అంటూ రేస్ 3 సినిమాలో సల్మాన్ ఖాన్ చెప్పినట్లుగానే బాక్సాఫీస్ వద్ద తానే విజేతనని మరోసారి రుజువు చేసుకుంటున్నారు. సల్మాన్ ‘ఈద్’ సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ... శుక్రవారం విడుదలైన రేస్ 3 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన మొదటి రోజే 29.17 కోట్ల రూపాయలు వసూలు చేసి 2018 బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. అంతేకాకుండా సల్మాన్ కెరీర్లో.. మొదటి రోజే అత్యధిక వసూళ్లు సాధించిన మూడో సినిమాగా(సుల్తాన్ 36.54 కోట్లు, ఏక్ థా టైగర్ 32.93 కోట్లు) గుర్తింపు దక్కించుకుంది. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన ఎదుర్కొన్నప్పటికీ ఆదివారం నాటికి 67.31 కోట్ల రూపాయలు వసూలు చేసిన రేస్ 3 సల్మాన్ సత్తా ఏమిటో నిరూపించింది. విడుదలైన రెండు రోజుల్లోనే 50 కోట్ల క్లబ్లో చేరిన సినిమాగా కూడా రికార్డు సృష్టించింది. మరో వారం రోజుల పాటు పెద్ద సినిమాలేవీ రిలీజ్ అయ్యే అవకాశం లేకపోవడంతో రేస్ 3 భారీ వసూళ్లు సాధించే దిశగా దూసుకుపోతుందని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు. రేస్ సిరీస్‌లో మూడో భాగంగా రెమో డిసౌజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్, రమేష్ తౌరాని సంయుక్తంగా నిర్మించారు. సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, జాక్వలిన్ ఫెర్నాండెజ్, బాబీడియోల్, సాకిబ్ సలీమ్, డైసీషా ప్రధాన పాత్రల్లో నటించారు. -
దుమ్మురేపిన టాప్-5 సినిమాలు ఇవే!
సాక్షి, సినిమా : పద్మావత్ సినిమాతో బాలీవుడ్లో ఈ ఏడాది శుభారంభం మొదలైంది. దీపావళికే విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదాపడుతూ జనవరిలో విడుదలైంది. ఎన్నో అడ్డంకుల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను బద్దలుకొట్టింది. మొదటి వారాంతంలోనే 114 కోట్లు కలెక్ట్ చేసి ఈ ఏడాది బాలీవుడ్లో ఇప్పటివరకు విడుదలైన చిత్రాలన్నంటిలో పద్మావత్ సినిమానే వీకెండ్ కలెక్షన్స్‌లో టాప్‌లో కొనసాగుతోంది. ఆ తరువాతి స్థానంలో భాగీ-2 నిల్చింది. తెలుగు సినిమా క్షణం రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీలో టైగర్ ష్రాఫ్, దిశా పఠానీ నటించారు. ఈ యాక్షన్, సస్పెన్స్ మూవీ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్లో దాదాపు 70 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. అజయ్ దేవగణ్, ఇలియానా జంటగా నటించిన ‘రెయిడ్’ 41కోట్ల రూపాయలతో మూడోస్థానంలో, అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘ప్యాడ్మాన్’ 40 కోట్ల రూపాయలతో నాలుగోస్థానంలో, కరీనా కపూర్, సోనమ్ కపూర్ ముఖ్య పాత్రల్లో నటించిన ‘వీరే ది వెడ్డింగ్’ 36 కోట్ల రూపాయలతో ఐదో స్థానంలో ఉంది. -
అలియాకు ప్రేమతో...
ముంబై: అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘రాజీ’ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబడుతుంది. ప్రస్తుతం ‘రాజీ’ విజయాన్నిఎంజాయ్ చేస్తున్న అలియాకు మరో కానుక అందింది. ‘రాజీ’ విజయవంతమైన సందర్భంగా అలియ తండ్రి మహేష్ భట్ కూతురును పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా అలియాను ఉద్దేశిస్తూ ట్విటర్లో ‘నా ప్రియమైన అలియా నిన్ను చూసి నేను చాలా సంతోష పడుతున్నాను, నువ్వు ఇంకా చాలా ఎత్తుకు ఎదగాలి. నిన్ను నువ్వు మెరుగుపర్చుకోవడాన్ని ఒక వ్యసనంగా మార్చుకో.. ప్రేమతో మీ నాన్న’ అంటూ మేసేజ్ చేశారు. శుక్రవారం విడుదలైన ‘రాజీ’ సినిమా తొలిరోజు 7.53 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. అయితే వారాంతంలో(శని, ఆదివారాల్లో) 50 శాతం అధికంగా వసూళ్లు రాబట్టింది. మొదటి మూడు రోజుల్లో ఇండియాలో రూ. 32.94 కోట్ల కలెక్షన్లు తెచ్చుకుంది. అలియా నటన, బలమైన కథ ‘రాజీ’ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ‘రాజీ’ చిత్రాన్ని హరిందర్ సిక్క రాసిన పుస్తకం ‘కాలింగ్ సేహమత్’ ఆధారంగా తెరకెక్కించారు. గూఢచర్యం నేపధ్యంలో సాగే ఈ చిత్రంలో అలియా పాక్ సైనిక రహస్యాలను భారతీయ ఆర్మీకి చేరవేసే ‘స్పై’గా అద్భుతంగా నటించి విమర్శకులను సైతం మెప్పించింది. -
బాహుబలి లైఫ్ టైం వసూళ్లు ఒక్క రోజులోనే..!
తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన బాహుబలి 2 ఈ శుక్రవారం చైనాలో భారీగా రిలీజ్ అయ్యింది. బాహుబలి తొలి భాగం చైనాలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవటంతో రెండో భాగం విషయంలో చిత్రయూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో చైనా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాను మరోసారి ఎడిటింగ్ చేయించారు. అంతేకాదు ఏకంగా 7వేలకు పైగా స్క్రీన్లలో సినిమాను రిలీజ్ చేశారు. బాహుబలి నిర్మాతలు తీసుకున్న జాగ్రత్తలు బాగానే ఫలించినట్టున్నాయి. బాహుబలి 2 తొలి రోజు 2.85 మిలియన్ డాలర్లు (19 కోట్లు) కలెక్ట్ చేసింది. కేవలం తొలి షోతోనే మిలియన్ మార్క్‌ను అందుకొని సత్తా చాటింది. బాహుబలి తొలి భాగం చైనాలో ఫుల్ రన్లో సాధించిన 1.18 మిలియన్ డాలర్ల కలెక్షన్లను.. బాహుబలి 2 తొలి రోజే సాధించటం విశేషం. అంతేకాదు చైనాలో ఘనవిజయం సాధించిన దంగల్, భజరంగీ బాయ్‌జాన్ సినిమాల తొలి రోజు కలెక్షన్ రికార్డ్లను సైతం చెరిపేసిన బాహుబలి 2, అక్కడ తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. తొలి రెండు స్థానాల్లో వరుసగా ఆమిర్ ఖాన్ సీక్రెట్ సూపర్ స్టార్, ఇర్ఫాన్ ఖాన్ హిందీ మీడియం సినిమాలు ఉన్నాయి. -
‘భరత్’కు భారీ కలెక్షన్లు
సాక్షి, హైదరాబాద్: ప్రిన్స్ మహేష్‌బాబు తాజా సినిమా ‘భరత్ అనే నేను’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. హిట్ టాక్ రావడంలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విదేశాల్లోనూ ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతోంది. అమెరికాలో మొదటి వారంలో(ప్రివ్యూస్‌తో కలుపుకుని) ఈ సినిమా మూడు మిలియన్ డాలర్ల మార్కును దాటింది. అటు ఆస్ట్రేలియాలోనూ ‘భరత్..’ సందడి చేస్తున్నాడు. మొత్తంగా ఓవర్సిస్లో ఇప్పటికి 4 మిలియన్ డాలర్లను క్రాస్ చేసి ఐదు మిలియన్ డాలర్లకు పరుగులు పెడుతోందని ప్రముఖ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేశారు. కేరళలోనూ ఈ సినిమాకు ఆదరణ బాగుంది. మొదటి 5 రోజుల్లో రూ. 7.63 లక్షలు తెచ్చుకుంది. ఈ సినిమా ఇప్పటికే రూ. 125 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్టు చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించింది. మహేష్‌బాబుకు జోడిగా కియారా అద్వాని నటించిన ఈ సినిమాను కొరటాల శివ తెరకెక్కించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. It's MAHESH MANIA Overseas... Telugu film #BharatAneNenu takes international markets by storm... Week 1: N America $ 3.015 million [incl non-reported] Au NZ $ 535k Europe & UK $ 350k Africa, Malaysia, Singapore [2 days] & Rest $ 150k GCC $ 600k Total: $ 4.65 mn [₹ 31.04 cr]. — taran adarsh (@taran_adarsh) 27 April 2018 -
‘బాగీ-2’: బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల తుఫాన్!
సాక్షి, ముంబయి : టైగర్ ష్రాఫ్, దిశా పటానీ జంటగా అహ్మద్‌ఖాన్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన బాగీ 2 బాక్సాఫీస్ వద్ద మోతమోగిస్తోంది. అంచనాలకు మించి కలెక్షన్లు రాబడుతూ 2018లో రెండో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. తొలిరోజు రూ 25.10 కోట్లు, రెండో రోజు రూ 20.40 కోట్లు వసూలు చేసిన బాగీ 2.. వీకెండ్ చివరి రోజైన ఆదివారం ఏకంగా రూ. 27.60 కోట్లు రాబట్టింది. మొత్తానికి మొదటి వారాంతంలో ఈ సినిమా రూ. 73.13 కోట్లు వసూలు చేసింది. ‘ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్..ప్రతిచోటా ఈ సినిమా బ్లాక్‌బస్టర్ వసూళ్లతో దూసుకెళుతోంది. అసాధారణమైన ఓపెనింగ్ వసూళ్లు సాధించింది... మొత్తం రూ. 73.10 కోట్లు రాబట్టింది’ అని ట్రేడ్ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. 2018లో బాలీవుడ్లో అత్యధిక ఓపెనింగ్ వసూళ్లు రాబట్టిన సినిమాల్లో ‘బాగీ-2’ రెండోస్థానంలో నిలిచిందని, భన్సాలీ ‘పద్మావత్’ సినిమా రూ. 114 కోట్లతో మొదటిస్థానంలో ఉందని ఆయన తెలిపారు. అయితే, ‘పద్మావత్’ సినిమా హిందీతోపాటు తమిళం, తెలుగు భాషలను కలుపుకొని ఈ మొత్తం కలెక్షన్లు రాబట్టిందని పేర్కొన్నారు. 2018 టాప్-5 ఓపెనింగ్ వసూళ్ల జాబితాలో రైడ్ (రూ. 41.01 కోట్లతో) మూడోస్థానంలో, పాడ్‌మ్యాన్ (రూ. 40.05 కోట్లతో) నాలుగో స్థానంలో, సోను కే టిటు కి స్వీటీ (రూ. 26.57 కోట్లతో) ఐదోస్థానంలో ఉందని తెలిపారు. తెలుగులో వచ్చిన ‘క్షణం’సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ‘బాగీ-2’లో టైగర్ ష్రాఫ్ చేసిన రిస్కీ ఫైట్లు, అవుట్ అండ్ అవుట్ యాక్షన్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. టైగర్‌ను ప్రశంసిస్తూ.. ఇప్పటికే బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్లు ట్వీట్ చేశారు. -
మూడురోజుల్లో ‘రంగస్థలం’ భారీ వసూళ్లు!
హైదరాబాద్: మెగాపవర్ స్టార్ రాంచరణ్ తాజా సినిమా ‘రంగస్థలం’ బాక్సాఫీస్ సత్తా చాటుతోంది. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు, మౌత్‌టాక్ రావడంతో మంచి వసూళ్లు రాబడుతోంది. చిత్రవర్గాల సమాచారం ప్రకారం మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 88 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇందులో డిస్టిబ్యూటర్స్ వాటా రూ. 55 కోట్లు అని చిత్రవర్గాలు తెలిపాయి. మొదటి వీకెండ్లో తెలుగురాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 37.40 కోట్లు వసూలు చేసింది. కర్ణాటకలో రూ. 4.8 కోట్లు, దేశంలోని ఇతర ప్రాంతాల్లో రూ. 1.3 కోట్లు రాబట్టింది. ఇక, అమెరికాలోనూ ‘రంగస్థలం’ దుమ్మురేపుతోంది. మొదటి మూడురోజుల్లో ఈ సినిమా రూ. 9 కోట్లు వసూలుచేసింది. మిగతా దేశాల్లో రూ. 2.7 కోట్లు రాబట్టింది. 1980 నాటి గ్రామీణ రాజకీయ నేపథ్యంతో తెరకెక్కిన ‘రంగస్థలం’ సినిమాలో రాంచరణ్.. వినికిడిలోపం ఉన్న చిట్టిబాబు పాత్రలో అద్భుతంగా నటించాడు. చెర్రీ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్‌గా ఈ సినిమా నిలిచిపోతుందని ప్రశంసల జల్లు కురుస్తోంది. చెర్రీ సరసన నటించిన సమంత కూడా రామలక్ష్మి పాత్రలో మంచి అభినయం కనబర్చింది. రేవంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో అనసూయ, ఆది పిన్నిశెట్టి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
దుమ్మురేపుతున్న ‘రంగస్థలం’ వసూళ్లు!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పీరియాడిక్ డ్రామా రంగస్థలం. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పల్లెటూరి నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా బాగుందని టాక్ రావడం, రాంచరణ్, సమంతతోపాటు ప్రధాన తారాగణం యాక్టింగ్ బాగుండటం ఈ సినిమాకు కలిసివచ్చినట్టు కనిపిస్తోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘రంగస్థలం’ అటు ఓవర్సీస్ మార్కెట్లోనూ దుమ్మురేపుతోంది. అమెరికా బాక్సాఫీస్ వద్ద ‘రంగస్థలం’ అప్పుడే మన మిలియన్ మార్క్‌ను అధిగమించింది. ప్రీమియర్ షోలు, మొదటి రోజు వసూళ్లు బాగుండటంతో ఈ సినిమా ఈ మార్క్‌ను అధిగమించింది. సినిమా టాక్ బాగుండటంతో వసూళ్ల విషయంలోనూ ఈ సినిమా దూసుకుపోవచ్చునని భావిస్తున్నారు. -
చైనాలో సల్మాన్ సినిమా ప్రభంజనం!
న్యూఢిల్లీ: సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ జంటగా నటించిన 'బజరంగీ భాయ్‌జాన్' సినిమా చైనాలో దుమ్మురేపుతోంది. ఈ సినిమా చైనాలో విడుదలై నాలుగు వారాలు గడిచినా.. బాక్సాఫీసు వద్ద ఇప్పటికీ భారీగా వసూళ్లు రాబడుతోంది. చైనాలో 'లిటిల్ లోలిటా.. మంకీ గాడ్ అంకుల్' శీర్షికతో విడుదలై ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. చైనీయుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుండటంతో ఇప్పటివరకు ఈ సినిమా.. ఆ దేశ బాక్సాఫీస్ వద్ద రూ. 281 కోట్లు కొల్లగొట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 'బజరంగీ భాయ్‌జాన్' వసూలు చేసిన కలెక్షన్ల మొత్తం రూ. 907 కోట్లకు చేరింది. ఆమిర్ ఖాన్ 'దంగల్', 'సీక్రెట్ సూపర్ స్టార్' సినిమాలు చైనాలో భారీ వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ఆమిర్ స్థాయిలోనే సల్మాన్ సినిమాలపై కూడా చైనా ప్రేక్షకులు అభిమానాన్ని చూపిస్తున్నారు. 'దంగల్', 'బాహుబలి 2', 'సీక్రెట్ సూపర్ స్టార్' సినిమాల తర్వాత చైనాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన నాలుగో సినిమాగా బజరంగీ భాయ్‌జాన్ నిలిచింది. తల్లిదండ్రుల నుంచి వేరయి భారత్‌లో చిక్కుకున్న ఆరేళ్ల పాకిస్థానీ అమ్మాయిని, బంజరంగీ అనే ఒక దేశభక్తుడు ఎలా దాయాది దేశానికి చేర్చాడన్నేది ఈ చిత్ర కథ. 2015లో భారత్‌లో విడుదలైన ఈ సినిమా ఇక్కడ కూడా సూపర్‌హిట్ అయిన సంగతి తెలిసిందే.