బ్లాక్‌బస్టర్‌ పొంగల్‌.. కలెక్షన్స్‌ ఎంత వచ్చాయంటే? | Venkatesh Starrer Sankranthiki Vasthunam Movie Second Day Collections | Sakshi
Sakshi News home page

సెంచరీ క్లబ్‌లో బాలకృష్ణ.. చేరువలో వెంకీ మామ.. తమిళంలోనూ ఆ సినిమా రిలీజ్‌

Published Thu, Jan 16 2025 12:54 PM | Last Updated on Thu, Jan 16 2025 1:17 PM

Venkatesh Starrer Sankranthiki Vasthunam Movie Second Day Collections

ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అంటారు. గతేడాది సంక్రాంతికి సైంధవ్‌తో పలకరించాడు విక్టరీ వెంకటేశ్‌. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా చతికిలపడింది. ఈసారి తన ఎవర్‌గ్రీన్‌ జానర్‌ కామెడీనే నమ్ముకున్నాడు. అలా అనిల్‌ రావిపూడితో సంక్రాంతికి వస్తున్నాం సినిమా (Sankranthiki Vasthunam Movie) చేశాడు. ఈ మూవీ జనవరి 14న విడుదలైంది. అలా ఈసారి సంక్రాంతికి వస్తూనే పండగ కళను తీసుకొచ్చారు. పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవడానికి ఫ్యామిలీ ఆడియన్స్‌ థియేటర్‌ ఎదుట క్యూ కడుతున్నారు.

రెండు రోజుల్లోనే రూ.77 కోట్లు
మొత్తానికి సంక్రాంతికి వస్తున్నాం చిత్రయూనిట్‌ ఈసారి బ్లాక్‌బస్టర్‌ పొంగల్‌ సెలబ్రేట్‌ చేసుకుంటోంది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్లు రాబట్టిన ఈ సినిమా రెండో రోజు రూ.32 కోట్లు వసూలు చేసింది. అంటే రెండు రోజుల్లోనే రూ.77 కోట్ల కలెక్షన్స్‌ సాధించింది. బాక్సాఫీస్‌ ర్యాంపేజ్‌ ఆడిస్తున్న వెంకీ మామ రెండు రోజుల్లో రూ.100 కోట్ల మార్క్‌ దాటడం ఖాయంగా కనిపిస్తోంది.

తగ్గని డాకు మహారాజ్‌ జోరు
మరోవైపు నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్‌ సినిమా (Daaku Maharaaj Movie) కూడా బాక్సాఫీస్‌ దగ్గర అదరగొడుతోంది. తొలి రోజు రూ.56 కోట్లు రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. జనవరి 12న రిలీజైన ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే సెంచరీ క్లబ్‌లోకి చేరింది. డాకు మహారాజ్‌ రూ.105 కోట్లు రాబట్టిందంటూ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ స్పెషల్‌ పోస్టర్‌ ద్వారా వెల్లడించింది. అంతేకాదు, ఈ సినిమాను తమిళంలో రిలీజ్‌ చేసేందుకు రెడీ అయ్యారు. జనవరి 17 నుంచి తమిళనాడులోని థియేటర్లలో డాకు మహారాజ్‌ ప్రత్యక్షం కానుందని వెల్లడించారు.

 

 

 

చదవండి: సైఫ్‌ అలీఖాన్‌పై దాడి.. షాకయ్యా: జూనియర్‌ ఎన్టీఆర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement