సంక్రాంతి రేసులో భారీ విక్టరీ అందుకున్నారు వెంకటేశ్.. ఆయన నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunam) చిత్రం ఎవరూ ఊహించలేని కలెక్షన్లతో రికార్డులు క్రియేట్ చేస్తుంది. జనవరి 14న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వరద పారిస్తోంది. భారీగా లాభాలు రావడంతో డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్‌ను కూడా తాజాగా హైదరాబాద్‌లో జరిపారు. చాలా ఏళ్ల తర్వాత ఈ చిత్రంతో లాభాలు చూశామని మూవీ పంపిణీదారులు పేర్కొన్నారు. ఏకంగా 20 శాతం పైగా బెన్‌ఫిట్ పొందామని వారు చెప్పడం విశేషం.
తెలుగు చిత్ర పరిశ్రమలో 'సంక్రాంతికి వస్తున్నాం' అదిరిపోయే రికార్డ్ క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద కేవలం 17 రోజుల్లోనే రూ. 303 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. రీజనల్ సినిమాల పరంగా ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా ఈ చిత్రం నిలిచిందని మేకర్స్ ప్రకటించారు. తెలుగులో మాత్రమే విడుదలైన చిత్రాలలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా సంక్రాంతికి వస్తున్నాం రికార్డ్ క్రియేట్ చేసింది. ఓ రీజినల్ (ప్రాంతీయ భాషలో) ఫిల్మ్ అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా ఇప్పటి వరకు గుంటూరు కారం రూ. 212 కోట్ల కలెక్షన్స్‌తో ఉంది. అయితే, ఆ రికార్డ్‌ను వెంకటేశ్ సినిమా ఎప్పుడో దాటేసింది. అయితే, 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా క్రియేట్ చేసిన ఈ రికార్డ్‌ను బ్రేక్ చేయడం అంత సులభం కాదని చెప్పవచ్చు.
ఈ విజయం చాలా పాఠాలు నేర్పింది
ఊహించని విధంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా చాలా పాఠాలు నేర్పిందని దిల్ రాజ్ తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో ఇలా అన్నారు. ‘‘ఇండస్ట్రీలో బడ్జెట్ కాదు.. కథే ముఖ్యం. మేము కూడా కథలని నమ్ముకుని సినిమాలు నిర్మించాం. కొత్త దర్శకులతో తీసినప్పుడు ఎన్ని విజయాలు వచ్చాయో అందరికీ తెలిసిందే. అయితే కాంబినేషన్స్ అంటూ నాలుగైదేళ్లుగా మేం తడబడుతున్నాం. ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vastunam) హిట్‌తో అనిల్ మళ్లీ మాకు ఒక రహదారి వేసి ఇచ్చాడు. ఈ సక్సెస్ నాకు కూడా చాలా పాఠాలు నేర్పించింది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment