
ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. అనిల్ రావిపూడి-విక్టరీ వెంకటేశ్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో అదరగొట్టేసింది. పొంగల్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో సరికొత్త రికార్డు సృష్టించింది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం ఓ రేంజ్‌లో అభిమానులను అలరించింది. దీంతో ఈ సినిమా ఓటీటీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం మేకర్స్ ఆడియన్స్‌ను షాకిచ్చారు. ఓటీటీ కంటే ముందు టీవీల్లో ప్రసారం చేయనున్నట్లు వెల్లడించారు. అయితే తాజాగా ఓటీటీపై మరో క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. టీవీల్లో ప్రసారం చేయడంతో ఓకేసారి ఓటీటీలోనూ స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని జీ5లో విడుదల చేసిన ప్రోమోలో చూపించారు. మార్చి 1న సాయంత్రం 6 గంటల నుంచి జీ తెలుగుతో పాటు జీ5లోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. దీంతో సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓటీటీలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 'సంక్రాంతి వస్తున్నాం' స్ట్రీమింగ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment