
ఈ ఏడాది సంక్రాంతికి రిలీజై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. అనిల్ రావిపూడి- వెంకటేశ్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. పొంగల్ కానుకగా జనవరి 14న థియేటర్లలో విడుదలైంది.
సంక్రాంతికి వస్తున్నాం మూవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావడంతో ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు అభిమానుల నిరీక్షణకు తెరపడింది. ఈ రోజు సాయంత్రం ఆరు గంటల నుంచే టీవీలతో పాటు జీ5లోనూ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అయితే ఓటీటీ వర్షన్‌లో సినీ ప్రియులకు షాకిచ్చారు సంక్రాంతికి వస్తున్నాం మేకర్స్. ఈ సినిమా నిడివిని తగ్గించి విడుదల చేశారు. థియేటర్లలో 2 గంటల 24 నిమిషాలు ఉన్న ఈ చిత్రం.. ఓటీటీలో మాత్రం 2 గంటల 16 నిమిషాల రన్‌టైమ్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు ఎనిమిది నిమిషాల సీన్స్ తొలగించడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే దీనిపై చిత్రబృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
అయితే థియేటర్ వర్షన్ నిడివి కారణంగా కొన్ని కామెడీ సన్నివేశాలను దర్శకుడు అనిల్ రావిపూడి తొలగించారని ఇటీవల వార్తలొచ్చాయి. అవి ఓటీటీలో యాడ్ చేస్తారంటూ భావించారు. ముఖ్యంగా సినిమా ఫ్లాష్‌బ్యాక్‌లో మీనాక్షి చౌదరి, వెంకటేశ్‌ల మధ్య కొన్ని కామెడీ సీన్స్‌ను యాడ్ చేయనున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ అలా జరగపోగా.. ఉన్న నిడివి కాస్తా తగ్గడంతో టాలీవుడ్ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment