Run Time
-
కార్తీ మూవీకి సూపర్ హిట్ టాక్.. మేకర్స్ షాకింగ్ నిర్ణయం!
కార్తీ, అరవింద స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం 'మెయిజగన్'. ఈ చిత్రాన్ని సత్యం సుందరం పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాకు సి.ప్రేమ్‌కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య, జ్యోతిక నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.(ఇది చదవండి: డియర్ కార్తీ.. మళ్లీ ఆ రోజుల్ని గుర్తుచేశావ్: నాగార్జున)ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రన్‌టైమ్ దాదాపు 2 గంటల 57 నిమిషాలుగా ఉంది. దీంతో నిడివి ఎక్కువ ఉండడంపై పలువురు విమర్శలు చేశారు. హిట్ టాక్ వచ్చినప్పటికీ రన్‌టైమ్‌పై విమర్శలొస్తున్నాయి. అందువల్లే కొన్ని సీన్స్ మేకర్స్ తొలగించినట్లు సమాచారం. దాదాపు 15 నుంచి 18 నిమిషాల వరకు సినిమాను కట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.తాజాగా ట్రిమ్ చేసిన వర్షన్ ఈ రోజు నుంచే థియేటర్లలో ప్రదర్శించబడుతోంది. ప్రస్తుతం ఈ మూవీ రన్ టైమ్ రెండు గంటల 40 నిమిషాలుగా ఉంది. కాగా.. ఈ చిత్రంలో శ్రీ దివ్య, రాజ్‌కిరణ్, స్వాతి కొండే, దేవదర్శిని, జయప్రకాష్, శ్రీరంజని, ఇళవరసు, కరుణాకరన్ కీలక పాత్రలు పోషించారు. -
తగ్గిన 'దేవర' రన్ టైమ్.. ఇప్పుడు ఎంతంటే?
ఎన్టీఆర్ 'దేవర' టీమ్ ముందు జాగ్రత్తలు గట్టిగానే తీసుకుంటున్నారు. ప్రమోషనల్ కంటెంట్ పరంగా పక్కాగా వెళ్తున్నారు. ఇప్పుడు నిడివి విషయంలో పక్కా ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి కాగా.. ఇప్పుడు మరోసారి పునరాలోచన చేశారు. అలా దాదాపు 7 నిమిషాల సీన్లు ట్రిమ్ చేశారు.ఇంతకు ముందు 2 గంటల 57 నిమిషాల 58 సెకన్ల నిడివితో సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇప్పుడు ఇందులో ఏడు నిమిషాల కట్ అంటే 2 గంటల 50 నిమిషాల రన్ టైమ్‌తో థియేటర్లలో ప్రదర్శితం కానుంది. వీటిలో యాడ్స్ అన్ని తీసేస్తే మూవీ నిడివి సరిగ్గా 2 గంటల 42 నిమిషాలు వస్తుంది.(ఇదీ చదవండి: యూట్యూబర్ హర్ష సాయిపై కేసు పెట్టిన యువతి)ఈ మధ్య కాలంలో సినిమాలు రిలీజైన తర్వాత నిడివిపై ప్రేక్షకుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ముందు అన్నీ పక్కాగా చూసుకుని 'దేవర' టీమ్ రన్ టైమ్ తగ్గించినట్లున్నారు. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి?ఎన్టీఆర్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా నటించిన 'దేవర'లో సైఫ్ అలీ ఖాన్ విలన్. అనిరుధ్ సంగీతమందించాడు. కొరటాల శివ దర్శకుడు. 'ఆర్ఆర్ఆర్' లాంటి సూపర్ హిట్ తర్వాత తారక్ నుంచి వస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగా, హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.(ఇదీ చదవండి: ఆలియా కూతురి విషయంలో నెరవేరిన ఎన్టీఆర్ కోరిక!) -
ది గోట్ మూవీ.. రన్‌టైమ్ ఎన్ని గంటలో తెలుసా?
కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ నటిస్తోన్న తాజా చిత్రం ది గోట్(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్). ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్గా కనిపించనుంది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని డైరెక్టర్ వెంకట్ ప్రభు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. గోట్ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్లు వెల్లడించారు.అయితే ఈ సందర్భంగా చిత్రబృందానికి కొన్ని మార్పులు చేయాలని సెన్సార్ బోర్డు సూచించింది. దీంతో గోట్ మూవీకి మరోసారి సెన్సార్ చేయాల్సి వచ్చింది. సెన్సార్ బోర్డు ఆదేశాలతో ఓ లేడీ క్యారెక్టర్‌కు సంబంధించిన రియాక్షన్ షాట్‌ను తొలగించిన చిత్రబృందం.. రెండు సెకన్ల నిడివి ఉన్న షాట్‌ను మరో షాట్‌తో భర్తీ చేసింది. యూ/ఏ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా ఫైనల్ రన్‌టైమ్ 3.03 నిమిషాలుగా ఉంది. ప్రస్తుం దీనికి సంబంధించిన సెన్సార్ రిపోర్ట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.కాగా.. ఇప్పటికే రిలీజైన ది గోట్ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో విజయ్‌ని పాతికేళ్ల కుర్రాడిగా చూపించనున్నారు. ఈ మూవీలో విజయ్ తండ్రీ, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారు. స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా కీలక పాత్రల్లో పోషించారు. తెలుగు, తమిళం, హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నారు.#TheGoat bookmyshow 136k interested 🎟️❤️🔥❤️🔥❤️🔥Duration: 3hrs 3mins 14secs.Certified: U/AIn theaters from September 5th!#TheGreatestOfAllTime @actorvijay @vp_offl @thisisysr @archanakalpathi @aishkalpathi @Ags_production pic.twitter.com/dQcNMGFp46— The GOAT Movie (@GoatMovie2024) August 27, 2024 -
ఇండియన్-2 పై నెగెటివ్ టాక్.. మేకర్స్ కీలక నిర్ణయం!
కమల్ హాసన్- శంకర్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం ఇండియన్-2. దాదాపు 18 ఏళ్ల తర్వాత భారతీయుడు మూవీకి సీక్వెల్‌గా అభిమానుల ముందుకు తీసుకొచ్చారు. జూలై 12న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు మొదటి రోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. అయితే ఇండియన్-2 నిడివి ఎక్కువగా ఉండడం.. శంకర్ మార్క్ కనిపించలేదంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోల్స్ వచ్చాయి.అయితే నిడివి ఎక్కువగా ఉండడం.. మూవీకి నెగెటివ్ టాక్ రావడంతో మేకర్స్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. 3.04 నిమిషాల రన్టైమ్తో థియేటర్లలోకి వచ్చిన ఇండియన్-2 నిడివి తగ్గించినట్లు లైకా ప్రొడక్షన్స్ తాజాగా ట్వీట్ చేసింది. దాదాపు 12 నిమిషాల సన్నివేశాలను తొలగించినట్లు వెల్లడించింది. మీకు దగ్గర్లోని థియేటర్‌కు రన్ టైన్ తగ్గించిన ఇండియన్-2 సినిమాను చూసి ఎంజాయ్ చేయండి అంటూ పోస్ట్ చేశారు. పడిపోయిన వసూళ్లుఇండియన్-2కు మొదటి రోజే నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. ఈ సినిమాకు ఐదు రోజుల్లో ఇండియావ్యాప్తంగా కేవలం రూ.65 కోట్లకు పైగా వసూళ్లు మాత్రమే రాబట్టింది. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో కమల్ అవినీతిపై పోరాడే సేనాపతి పాత్రలో కనిపించారు. ఇందులో సముద్రఖని, బాబీ సింహా, కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రలు పోషించారు. Witness the enhanced version of #Indian2 🇮🇳✂️ Now presenting a streamlined edition trimmed by 12 min. Catch it in cinemas near you for a crisper experience! 💥@IndianTheMovie 🇮🇳 Ulaganayagan @ikamalhaasan @shankarshanmugh #Siddharth @actorsimha @anirudhofficial @dop_ravivarman… pic.twitter.com/0reMKOvMIe— Lyca Productions (@LycaProductions) July 17, 2024 -
యానిమల్ అసలు రన్‌టైమ్ అది కాదు.. వామ్మో అంతకుమించి!
ప్రస్తుతం సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం యానిమల్. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటిస్తోన్న ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు అమాంతెం పెంచేసింది. తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న చిత్రబృందం చెన్నైలోనూ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ మీట్‌కు రణ్‌బీర్ కపూర్, రష్మిక, సందీప్ రెడ్డి వంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యానిమల్ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా మూవీ రన్‌టైమ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. (ఇది చదవండి: బిగ్‌బాస్ వార్నింగ్.. డబ్బులిచ్చి మరీ ఎలిమినేట్ అవుతానంటున్న కంటెస్టెంట్!) ప్రస్తుతం ఆడియన్స్ రెండున్నర గంటల సినిమా చూసేందుకే బోరింగ్‌గా ఫీలవుతున్నారు. అలాంటిది సందీప్ రెడ్డి ఏకంగా మూడు గంటల 21 నిమిషాల రన్టైమ్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. అయితే దీనిమీదే ప్రస్తుతం ఆడియన్స్‌లో తెగ చర్చ నడుస్తోంది. అయితే చెన్నైలో జరిగిన ఈవెంట్లో దీనిపై మేకర్స్ చేసిన కామెంట్స్ మరింత వైరలవుతున్నాయి. కాగా.. ఇప్పటికే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సందీప్ రెడ్డి వంగా చిత్రానికి అసలు రన్ టైమ్ సుమారు 3 గంటల 49 నిమిషాలుగా ఉందట. ఇంత లాంగ్ రన్‌టైమ్ మూవీని చూడాలంటే ఆడియన్స్‌కు కష్టమే. అందులోనూ రోజు నాలుగు షోలు వేయాలంటే కూడా వీలు కాదు. అందువల్లే 3 గంటలా 21 నిమిషాలకు తగ్గించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రణ్‌బీర్ కపూర్ ప్రమోషన్స్‌లో వెల్లడించారు. మరోవైపు ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ ఏకంగా 18 నిమిషాల పాటు సాగుతుందని సమాచారం. దీనిపై స్పష్టత రావాలంటే సినిమా వచ్చే దాకా వేచి చూడాల్సిందే. అయితే ఓటీటీలోనైనా ఫుల్ మూవీని రిలీజ్ చేస్తారేమో చూడాలి. (ఇది చదవండి: రణ్‌బీర్.. ఇక్కడికి షిఫ్ట్ అయిపో.. తెలుగువాళ్లు బాలీవుడ్‌ను..) -
వామ్మో.. అవతార్ 2 రన్‌టైమ్ అన్ని గంటలా.. అంతసేపు ప్రేక్షకులు కూర్చుంటారా?
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో 'అవతార్: ది వే ఆఫ్ వాటర్ (అవతార్-2)’ ఒకటి. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 16న ప్రేక్షకులు ముందుకు రానుంది. 13 ఏళ్ల తర్వాత ‘అవతార్’కి సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీ.. విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఈ మూవీ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ట్రైలరే ఇలా ఉంటే సినిమా ఎలా ఉండబోతుందోననే క్యూరియాసిటీ అందరిలోనూ పెరిగిపోయింది. అందుకే టికెట్లు అడ్వాన్స్‌గా బుక్ చేసుకుంటున్నారు. నెట్టింట అవతార్ 2పై ప్రతి రోజు ఏదో ఒక చర్చ మొదలవుతుంది. తాజాగా ఈ సినిమా రన్‌టైమ్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. అదేంటంటే ‘అవతార్ 2’ రన్ టైమ్ 192 నిమిషాల 10 సెక్లను. అంటే 3 గంటల 12 నిమిషాల 10 సెకన్లు.ఇటీవల కాలంలో అత్యధిక నిడివి గల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావడం తగ్గిపోయాయి. రెండున్నర గంటల నిడివి ఉన్న సినిమాలే ఎక్కువగా విడుదలవుతున్నాయి. ప్రేక్షకులు కూడా నిడివి తక్కువ ఉన్న సినిమాలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కంటెంట్‌లో దమ్ము ఉంటే తప్పా మూడు గంటల పాటు ప్రేక్షకుడు థియేటర్లో కూర్చొలేకపోతున్నాడు. కానీ జేమ్స్ కామెరున్ మాత్రం తన సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నాడు. థియేటర్స్‌కి వచ్చిన ప్రేక్షకుడు.. మూడు గంటల పాటు కొత్త ప్రపంచంలోకి వెళ్తాడని.. నిడివి తనకు సమస్యే కాదు అంటున్నాడట. 2009లో విడుదలైన అవతార్-1 రన్‌టైమ్ 162 నిమిషాలు. అంటే రెండు గంటల 42 నిమిషాలు. దాన్ని మించి అవతార్ 2 రన్ టైమ్ ఉండడం చర్చనీయాంశంగా మారింది. -
అత్యధిక నిడివి ఉన్న చిత్రం ఇదేనట !.. భారీగా అంచనాలు
Robert Pattinson Batman Movie Runs Nearly 3 Hours: ప్రపంచవ్యాప్తంగా బ్యాట్‌మ్యాన్ సినిమాలకు ఉన్న క్రేజ్ మాములుగా ఉండదు. ఈ సిరీస్‌లో వచ్చిన చిత్రాలు ఆడియెన్స్‌ను ఎంతగానో అలరించాయి. ఈ ఫ్రాంచైజీ నుంచి సినిమా వస్తుందంటే చాలు అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తారు. హాలీవుడ్లో సూపర్ హీరోస్ మూవీస్ సహజమే. మిగతా సూపర్ హీరోస్‌కు పవర్స్ అనుకోకుండా జరిగే పలు సంఘటనల ద్వారా వస్తాయి. కానీ బ్యాట్ మ్యాన్ మాత్రం తనకు తాను సొంతగా సూపర్ హీరోల మారతాడు. అది ఎలానో 2005లో వచ్చిన 'బ్యాట్‌మ్యాన్: బిగిన్స్' చిత్రం చూస్తే తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల బ్యాట్‌మ్యాన్ సిరీస్ కొత్త చిత్రం 'ది బ్యాట్‌మ్యాన్: ది బ్యాట్ అండ్ ది క్యాట్' ట్రైలర్ విడుదలైంది. (చదవండి: 'స్క్విడ్ గేమ్' మళ్లీ రానుంది.. ఈసారి ఎలాంటి గేమ్ ?) విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ ట్రైలర్ వైరల్‌గా మారింది. ఇందులో సూపర్ హీరోగా 'ట్విలైట్' మూవీ ఫేమ్ రాబర్ట్ ప్యాటిన్సన్ నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా గురించి ఒక కొత్త విషయం చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా నిడివి ఈ సిరీస్‌లోని మిగతా చిత్రాలకంటే ఎక్కువగా ఉండనుందట. ఈ సిరీస్‌లో వచ్చిన 'ది బ్యాట్‌మ్యాన్: బిగిన్స్' రన్‌టైం 2 గంటల 20 నిమిషాలు, 'ది డార్క్‌నైట్' నిడివి 2 గంటల 32 నిమిషాలు ఉంది. వీటి తర్వాత 2012లో వచ్చిన 'ది డార్క్‌నైట్ రైజెస్' మూవీ రన్‌టైం 2 గంటల 45 నిమిషాలు ఉంది. కాగా ప్రస్తుతం రానున్న 'ది బ్యాట్ అండ్ ది క్యాట్' చిత్ర నిడివి సుమారు 2 గంటల 55 నిమిషాలు ఉండనుందట. అంటే దాదాపు 3 గంటలు. (చదవండి: నా కొడుకు హృతిక్‌లా ఉండాలి.. కానీ: స్టార్ హీరోయిన్) హాలీవుడ్లో విడుదలైన సూపర్ హీరో చిత్రాలు 'జాక్ స్నైడర్ జస్టీస్ లీగ్' రన్‌టైం 4 గంటల 2 నిమిషాలు, 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' నిడివి 3 గంటల 1 నిమిషం తర్వాత అతి పెద్ద రన్‌టైం ఉన్న సినిమా ఇదేనని సమాచారం. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు విడుదలైన రెండు ట్రైలర్స్‌కు కూడా మంచి ఆదరణ లభించింది. -
‘సాహో’ రన్‌టైం ఎంతంటే!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంటగా తెరకెక్కిన భారీ యాక్షన్ అడ్వంచరస్ థ్రిల్లర్ సాహో. 350 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకు సుజిత్ దర్శకుడు. దేశవ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ అప్డేట్ వైరల్‌గా మారుతోంది. హాలీవుడ్ స్థాయి యాక్షన్ సీన్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా నిడివి 2 గంటల 46 నిమిషాలకు ఫిక్స్ చేశారట. స్మోకింగ్ యాడ్స్ కూడా కలుపుకుంటే దాదాపు 2 గంటల 50 నిమిషాల అని తెలుస్తోంది. ఈ రన్‌టైంతోనే సినిమాను సెన్సార్‌కు పంపేందుకు ఫిక్స్ అయ్యారు చిత్రయూనిట్. కాస్త లెంగ్తీగా అనిపించినా అనుకున్న కథను ఇంట్రస్టింగ్‌గా చెప్పేందుకు ఆ డ్యూరేషన్ తప్పదని ఫిక్స్ అయ్యారట సాహో టీం. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సాహో.. ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచిన చిత్రయూనిట్ ఆదివారం ప్రీ రిలీజ్ వేడుకను రామోజీ ఫిలిం సిటీలో నిర్వహిస్తున్నారు. -
బన్నీ సినిమా కూడా అంతే..!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ లగడపాటి శ్రీధర్, నాగబాబులు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మే 4న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమా కూడా రంగస్థలం, భరత్ అనే నేను తరహాలోనే రెండున్నర గంటలకు పైగా నిడివితో రిలీజ్ అవుతోంది. ఇటీవల విడుదలైన రంగస్థలం మూడు గంటల నిడివితో రిలీజ్ చేశారు. తరువాత భరత్ అనే నేను సినిమాను కూడా రెండు గంటల 53 నిమిషాల నిడివితో రిలీజ్ చేశారు. ఈ రెండు సినిమాల విషయంలోనూ డ్యూరేషన్‌పై విమర్శలు వినిపించాయి. అయితే అవేవి పట్టించుకోకుండా నా పేరు సూర్య సినిమాను కూడా రెండు గంటల 47 నిమిషాల నిడివితో రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యూల్ హీరోయిన్ గా నటిస్తుండగా అర్జున్, శరత్‌కుమార్, థాకూర్ అనూప్ సింగ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
రిస్క్ చేస్తున్న ‘రంగస్థలం’ టీం.!
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం రంగస్థలం. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సమంత హీరోయిన్గా నటిస్తోంది. రామ్ చరణ్ తొలిసారిగా పల్లెటూరి యువకుడి పాత్రలో నటిస్తున్న ఈ సినిమా 1985 నాటి కథతో పీరియాడిక్ జానర్లో తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమా నిడివి 2 గంటల 50 నిమిషాలుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇంత నిడివితో సినిమా అంటే రిస్క్ అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం ఆడియన్స్ లెంగ్తీ సినిమాలను చూసేందుకు పెద్దగా ఇంట్రస్ట్ చూపించటం లేదు. మరి రంగస్థలం టీం ఈ విషయంలో మరోసారి ఆలోచిస్తుందో లేక.. అంత డ్యూరేషన్తోనూ సక్సెస్ సాధిస్తుందో చూడాలి. -
2 నిమిషాల 20 సెకన్ల అద్భుతం
తెలుగు తెర మీద ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బాహుబలి 2కు కౌంట్ డౌన్ మొదలైంది. వరుస పోస్టర్లతో సందడి చేస్తున్న బాహుబలి టీం గురువారం ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్.. ట్రైలర్ మీద అంచనాలను తారా స్థాయికి తీసుకెళ్లింది. దీంతో ఫుల్ ట్రైలర్ కోసం అభిమానులు, సినీ వర్గాలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ ట్రైలర్ ను దాదాపు 300ల థియేటర్లలో ప్రదర్శించేందుకు చిత్రయూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. అభిమానుల అంచనాలను మరింత పెంచేస్తూ.. బాహుబలి 2కు సంబంధించి మరో అప్ డేట్ అభిమానులను ఖుషీ చేస్తోంది. సాధారణంగా తెలుగు సినిమాకు ఒక నిమిషం నుంచి ఒకటిన్నర నిమిషం లెంగ్త్ ఉండే ట్రైలర్లను రిలీజ్ చేస్తుంటారు. కానీ బాహుబలి 2 మాత్రం అభిమానులకు మరింత వినోదాన్ని పంచనుంది. అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ట్రైలర్‌ను కూడా అదే స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. హాలీవుడ్ సినిమాల తరహాలో 2 నిమిషాల 20 సెకన్లు ఉండేలా ట్రైలర్‌ను డిజైన్ చేశారు. ఇప్పటికే ట్రైలర్‌కు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. బోర్డ్ సభ్యులు ఈ ట్రైలర్ కు యుఎ సర్టిఫికేట్ జారీ చేశారు. సినిమా గ్రాండియర్‌తో పాటు క్యారెక్టర్స్, పోరాట సన్నివేశాలు ఇలా అన్ని అంశాలకు సంబంధించిన హింట్స్‌ను ట్రైలర్లో పొందుపరిచారన్న టాక్ వినిపిస్తోంది. ముంబైలో జరిగే భారీ ఈవెంట్లో హిందీ ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు. అలాగే గురువారం ఉదయం తెలుగు రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన థియేటర్లలో బాహుబలి 2 ట్రైలర్‌ను ప్రదర్శిస్తున్నారు. యూట్యూబ్‌లో బాహుబలి 2 ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు మాత్రం గురువారం సాయంత్రం వరకు ఎదురుచూడాల్సిందే.