'పుష్ప 2' నిడివి లాక్.. ఏకంగా అన్ని గంటలా?! | Pushpa 2 Movie Runtime Details Latest | Sakshi
Sakshi News home page

Pushpa 2: 'పుష్ప 2' రన్ టైమ్ ఫిక్స్.. పెద్ద ప్లానింగే!

Published Tue, Nov 26 2024 4:33 PM | Last Updated on Tue, Nov 26 2024 4:44 PM

Pushpa 2 Movie Runtime Details Latest

'పుష్ప 2' మరో పదిరోజుల్లో థియేటర్లలోకి రానుంది. చివరివరకు షూటింగ్ బిజీ నడుస్తూనే ఉంది. ఇది ఇప్పుడు పూర్తయిందని తెలుస్తోంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రన్ టైమ్ (నిడివి) లాక్ చేసినట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: విషాదం.. టాలీవుడ్‌ గీత రచయిత కన్నుమూత)

'పుష్ప' తొలి భాగం 2 గంటల 59 నిమిషాల నిడివి. ఇప్పుడు రెండో భాగాన్ని అంతకు మించి నిడివితో రిలీజ్ చేయబోతున్నారు. ఏకంగా 3 గంటల 21 నిమిషాల నిడివి ఉండబోతుందని తెలుస్తోంది. కంటెంట్ ఉంటే ఈ రన్ టైమ్ పెద్ద సమస్య ఏం కాదు. ఎందుకంటే ఇంతే నిడివితో తీసిన 'యానిమల్'.. ఏ రేంజ్ బీభత్సం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇప్పుడు 'పుష్ప 2' కూడా భారీ నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతుందనమాట. ఇప్పటికే సెన్సార్ పూర్తవ్వాలి. బహుశా ఒకటి రెండు రోజుల్లో దాన్ని కూడా అయిపోగొట్టేస్తారేమో చూడాలి. ఇదిలా ఉండగా డిసెంబరు 5న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. దక్షిణాదిలో పక్కనబెడితే ఉత్తరాదిలో మాత్రం భారీ అంచనాలే ఉన్నాయి. రూ.1000  కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగిందని టాక్.

(ఇదీ చదవండి: శివంగి మళ్లీ గెలుపు.. బిగ్‌బాస్ 8 తొలి ఫైనలిస్ట్ ఎవరంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement