Sukumar
-
మరోసారి షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న సుకుమార్
-
సుకుమార్ ప్రాజెక్ట్‌లో సరికొత్తగా కనిపించనున్న రామ్‌చరణ్
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను అలరించారు హీరో రామ్‌చరణ్(Ram Charan). ‘పుష్ప 1: ది రైజ్’, ‘పుష్ప 2: ది రూల్’ చిత్రాలతో డైరెక్టర్ సుకుమార్(Sukumar) కూడా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో రెండో సినిమా తెరకెక్కనుందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రామ్‌చరణ్ కెరీర్లో ఇది 17వ చిత్రంగా రూపొందనుంది.ఈ మూవీలో రామ్‌చరణ్ సరికొత్త మేకోవర్‌లో కనిపించనున్నారని టాక్. రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘రంగస్థలం’ (2022) బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ తర్వాత వారి కాంబినేషన్లో మరో సినిమా రానుంది. రామ్‌చరణ్ ప్రస్తుతం ‘ఉప్పెన’ మూవీ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ‘ఆర్సీ 16’ (వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత రామ్‌చరణ్, సుకుమార్ మూవీ పట్టాలెక్కుతుందని టాక్. ‘రంగస్థలం’లో చిట్టిబాబుగా పక్కా పల్లెటూరు, ఫుల్ మాస్ పాత్రలో రామ్‌చరణ్‌ని చూపించారు సుకుమార్. తాజా చిత్రంలో అందుకు పూర్తి భిన్నమైన పాత్రలో చరణ్‌ని చూపించనున్నారట.ఈ చిత్రంలో అల్ట్రా స్టైలిష్ అర్బన్ లుక్‌లో కనిపిస్తారట. ‘రంగస్థలం’లో చరణ్‌ని, ‘పుష్ప’ చిత్రాల్లో అల్లు అర్జున్‌ని పక్కా మాస్‌గా చూపించిన సుకుమార్... ఈసారి మాత్రం చరణ్ కోసం పూర్తి అర్బన్ బ్యాక్‌డ్రాప్ కథని సిద్ధం చేస్తున్నారని టాక్. ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మికా మందన్నాని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. -
'పుష్ప2' ఫైనల్ కలెక్షన్స్.. ప్రకటించిన మేకర్స్
పుష్ప2 ఫైనల్ కలెక్షన్స్‌ను మేకర్స్ ప్రకటించారు. గతేడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులను రప్పా.. రప్పా.. రప్పా అంటూ దాటుకుంటూ వచ్చేసింది. 75 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1871 కోట్ల (గ్రాస్) వసూలు చేసినట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. 2024లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా ‘పుష్ప 2’ నిలవడమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీగా నిలిచింది. సినిమా విడుదలైన ఆరు రోజుల్లోనే రూ. 1000 కోట్ల క్లబ్లో చేరిన తొలి భారతీయ మూవీగా పుష్ప2 రికార్డ్ క్రియేట్ చేసింది.ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యధిక వసూలు సాధించిన చిత్రాల జాబితాలో 'దంగల్' (రూ.2024 కోట్లు) టాప్‌లో కొనసాగుతుంది. రెండో స్థానంలో 'పుష్ప2' (రూ. 1871 కోట్లు), మూడో స్థానంలో బాహుబలి-2 (రూ.1810 కోట్లు) ఉంది. తర్వాతి స్థానాల్లో ఆర్ఆర్ఆర్ (రూ.1387 కోట్లు), కేజీయఫ్- 2 (రూ.1250 కోట్లు), కల్కి 2898 ఏడీ (రూ.1153 కోట్లు), జవాన్ (రూ.1148 కోట్లు), పఠాన్ (రూ.1050 కోట్లు) వరుసగా ఉన్నాయి.ముఖ్యంగా పుష్ప2 సినిమాకు బాలీవుడ్లోనే అత్యధికంగా కలెక్షన్స్ వచ్చాయి. 100 ఏళ్ల బాలీవుడ్ చరిత్రలో పుష్పగాడికి ప్రత్యేక స్థానం దక్కింది. కేవలం హిందీ బెల్ట్‌లోనే రూ. 850 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అక్కడ త్రీడీ వెర్షన్లోనూ ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద గుర్తుండిపోయే రికార్డ్లను నమోదు చేసింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో కూడా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో కొనసాగుతుంది. ఓటీటీ కోసం రీలోడెడ్ వర్షన్ పేరుతో అదనం మరో 24 నిమిషాల సీన్లను కలిపారు. దీంతో ఈ మూవీ నిడివి మొత్తం 3 గంటల 40 నిమిషాలుగా ఉంది. View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) -
ఇంట్లో వ్రతం చేసుకున్న సుకుమార్ దంపతులు (ఫోటోలు)
-
సుకుమార్ ఇంట వ్రతం.. ఫోటోలు షేర్ చేసిన తబిత
ఆర్య సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సుకుమార్ (Sukumar) రెండు దశాబ్దాల కాలంలో పట్టుమని పది సినిమాలు కూడా తీయలేదు. తక్కువ సినిమాలతోనే ఎక్కువ పేరు సంపాదించుకున్నాడు. ఆర్య 2, 100% లవ్, నాన్నకు ప్రేమతో, రంగస్థలం ఇలా దేనికవే భిన్నమైన కథలు రాసుకుంటూ ప్రేక్షకుల్ని అలరించాడు. బాక్సాఫీస్ హిట్లు అందుకున్నాడు. పుష్ప (Pushpa Movie) చిత్రంతో పాన్ ఇండియా ప్రజల్ని ఆకట్టుకున్నాడు. మూడేళ్ల తర్వాత దీనికి సీక్వెల్‌గా వచ్చిన పుష్ప 2: ద రూల్ అంతకుమించి ఘన విజయాన్ని సాధించింది.ఈ భారీ సక్సెస్ తర్వాత సుకుమార్ భార్య తబిత (Thabitha Bandreddi)తో కలిసి ఇంట్లో వ్రతం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తబిత సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో ఆమె పట్టు చీర కట్టి, నిండుగా ఆభరణాలు ధరించి, నుదుటన సింధూరం పెట్టి, ముక్కుకు ముక్కెర పెట్టి అందంగా ముస్తాబైంది. సుకుమార్ పంచెకట్టులో కనిపించాడు. ఈ జంటను చూసిన అభిమానులు వీరిని పుష్ప, శ్రీవల్లి అని అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం సుకుమార్.. రామ్‌చరణ్‌తో సినిమా(#RC17) చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Thabitha Bandreddi (@thabitha_sukumar) చదవండి: రెండుసార్లు ప్రేమ.. చుక్కలు చూశా.. నా ఎగ్స్ దాచిపెట్టా: ఐశ్వర్య రాజేశ్ -
రామ్ చరణ్ సుకుమార్ న్యూ మూవీ అప్డేట్
-
అతను లేకుండా ఇప్పటి వరకు ఒక్క సినిమా చేయలేదు: సుకుమార్
పుష్ప-2 ది రూల్ మూవీతో మరో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు డైరెక్టర్ సుకుమార్. టాలీవుడ్లో క్రియేటివ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2021లో పుష్ప పార్ట్-1కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ నేపథ్యంలో పుష్ప టీమ్ థ్యాంక్ యూ మీట్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించింది. హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్లో దర్శకుడు సుకుమార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ గురించి మాట్లాడారు. ఇంతకీ ఆయన ఏమన్నారో తెలుసుకుందాం.దేవీశ్రీ ప్రసాద్ లేకుండా తాను ఇప్పటి వరకు ఏ సినిమా చేయలేదని సుకుమార్ అన్నారు. భవిష్యత్తులో కూడా చేయనేమో అని వెల్లడించారు. దీంతో తన రాబోయే ప్రాజెక్ట్‌లో కూడా దేవీశ్రీ ప్రసాదే సంగీత దర్శకుడని పరోక్షంగా హింట్ ఇచ్చేశారు. దీంతో రామ్ చరణ్- సుకుమార్ కాంబోలో రాబోయే చిత్రానికి డీఎస్పీనే మ్యూజిక్ డైరెక్టర్‌గా చేయనున్నట్లు తెలుస్తోంది.సుకుమార్ మాట్లాడుతూ.. 'నా పేరుతో పాటు ఉండే మరొక పేరు దేవీశ్రీ ప్రసాద్. నాపేరు సుకుమార్ కాదు.. దేవీశ్రీ ప్రసాద్ సుకుమార్. తను లేకుండా ఎప్పుడు సినిమా చేయలేదు. భవిష్యత్తులో కూడా తీయనేమో. అందుకే ముఖ్యంగా తను నా ఫస్ట్ ఆడియన్. పుష్ప 2 కూడా ఫస్ట్ హాఫ్ గురించి చెప్పగానే దేవీశ్రీ కథ అయిపోయింది అన్నాడు. సినిమా ఇంతే అనేశాడు. అలా పుష్ప-2 కూడా ఫస్ట్ హాఫ్ మాత్రమే రిలీజ్ చేశాను.. అది దేవీశ్రీకి మాత్రమే తెలుసు' అని అన్నారు. దీంతో తన రాబోయే ప్రాజెక్ట్‌లో కూడా డీఎస్పీనే మ్యూజిక్ డైరెక్టర్ అని హింట్ ఇచ్చేశారు. కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇటీవలే చెర్రీ సైతం సెట్లో తన కూతురితో ఉన్న ఫోటోలను పంచుకున్నారు. ఆ తర్వాత రామ్ చరణ్.. సుకుమార్‌తో జతకట్టనున్నారు. తాజాగా పుష్ప డైరెక్టర్ చేసిన కామెంట్స్‌తో ఈ ప్రాజెక్ట్‌లో దేవీశ్రీ ప్రసాద్ బీజీఎం కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.ఇటీవల దర్శకధీరుడు రాజమౌళి రామ్ చరణ్- సుకుమార్ సినిమాలో ఓపెనింగ్ సీక్వెన్స్ హైలైట్‌గా ఉంటుందని అన్నారు. అంతేకాకుండా రాజమౌళి తనయుడు కార్తికేయ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ షూటింగ్ సమయంలోనే సుకుమార్‌తో సినిమా చేయబోతున్నట్లు రామ్ చరణ్ చెప్పారని వెల్లడించారు. ఓపెనింగ్ సీన్ దాదాపు ఐదు నిమిషాల పాటు ఉంటుందని తెలిపారు. కాగా..రంగస్థలం తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో ఆర్సీ17పై భారీ అంచనాలు నెలకొన్నాయి. -
పుష్ప-2 పావని.. ఆ విషయం గుర్తు చేసుకుని స్టేజీపైనే కన్నీళ్లు!
సుకుమార్- బన్నీ కాంబోలో వచ్చిన పుష్ప-2 ది రూల్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. 2021లో వచ్చిన పుష్ప పార్ట్-1కు కొనసాగింపుగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. గతేడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసింది. తొలిరోజు బాక్సాఫీస్ వద్ద ఎప్పుడు లేని విధంగా రికార్డులను తిరగరాసింది. ఈ మూవీ ఏకంగా ఆర్ఆర్ఆర్, బాహుబలి-1, బాహుబలి-1, కేజీఎఫ్ చిత్రాల రికార్డులను అధిగమించింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. వరల్డ్ వైడ్‌గా పలు దేశాల్లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.పుష్ప-2లో ఆకట్టుకున్న పావని..పుష్ప-2లో అజయ్ కూతురిగా నటించిన పావని కరణం అందరి దృష్టిని ఆకట్టుకుంది. పుష్పరాజ్‌ను చిన్నాయన అంటూ కావేరి పాత్రలో అభిమానులను మెప్పించింది పావని. అయితే పుష్ప-2 చిత్రంలోని క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ హైలెట్‌గా నిలిచింది. బన్నీ గాల్లోకి ఎగురుతూ చేసిన ఫైట్ వరల్డ్ వైడ్ ఫ్యాన్స్‌ను కట్టిపడేసింది. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో చిత్రబృందం థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన పావని ఎమోషనలైంంది. తనను గుర్తించి అవకాశమిచ్చిన డైరెక్టర్ సుకుమార్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది.ఈవెంట్లో పావని మాట్లాడుతూ..' ఈవెంట్‌కు పెద్దలందరికీ నమస్కారం. సినిమా రిలీజ్ తర్వాత ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. నా క్యారెక్టర్‌తో పాటు టీమ్ మొత్తానికి ఊహించని దానికంటే ఎక్కువ ఆదరణ వచ్చింది. ఎప్పుడైనా నిద్రలోంచి లేస్తే ఏడ్చుకుంటూ లేచేదాన్ని. సుకుమార్ గారికి, బన్నీగారికి థ్యాంక్స్ చెప్పలేదనే బాధ ఉండేది. సినిమా రిలీజ్ అయ్యాక సుక్కు సార్, బన్నీ సార్‌ను కలవలేదంటూ ఎమోషనలైంది. అల్లు అర్జున్ సార్‌కు నేను వీరాభిమానిని. సెట్లో మీరు చెప్పిన ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకుంటా సార్. అంతేకాదు మీరు నాకు ఆదర్శం కూడా. భవిష్యత్తులోనూ ఇదే కొనసాగిస్తా. సుక్కు సార్ మీరు నన్ను గుర్తించి అవకాశమిచ్చారు. మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటా. సినిమా చూసిన తర్వాత నన్ను బాగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ సినిమాకు పనిచేసిన చిత్ర బృందానికి థ్యాంక్స్.' ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన సుకుమార్ సార్‌కు థ్యాంక్స్ అంటూ స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంది పావని కరణం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
'పుష్ప రెండో పార్ట్ రావడానికి ఆయనే కారణం'.. సుకుమార్ ఆసక్తికర కామెంట్స్
పుష్ప సినిమా గురించి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన థ్యాంక్స్ మీట్ ఈవెంట్‌కు హాజరైన ఆయన పలు విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా పుష్ప మూవీని అసలు రెండు పార్టులు కాదని అన్నారు. ఫస్ట్ హాఫ్ షూట్ పూర్తయ్యేసరికి 3 గంటలు రావడంతోనే రిలీజ్ చేసినట్లు తెలిపారు. పుష్ప సినిమాకు జరిగిన మిరాకిల్ ఇదే అని అన్నారు. మైత్రి మూవీ మేకర్స్‌కి రూ.1800 కోట్లు తీసుకు వచ్చింది చెర్రీగానే అని నవ్వుతూ మాట్లాడారు. ఇది నిజంగా సాహసమనే చెప్పాలి.. ఫస్ట్ హాఫ్‌ను పుష్పగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చామని సుకుమార్ వివరించారు. దీనికంతా చెర్రీనే కారణం.. ఒక్క సినిమాతో పోయేదానికి పుష్ప సిరీస్‌గా మార్చేశారు అని సరదాగా అన్నారు.సుకుమార్ మాట్లాడుతూ..' నా ఫస్ట్ ప్రేక్షకుడు చెర్రీగారే. ప్రతి సీన్‌ను గమనిస్తూ ఉంటారు. మైత్రి మూవీ మేకర్స్‌కి డబ్బులు వచ్చాయంటే కారణం ఆయనే. నిజానికి అందరూ అనుకున్నట్లు రెండు పార్టులు కాదు. మొదట పుష్ప అనుకున్నది ఒక్క సినిమానే. ఫస్ట్ హాఫ్ 3 గంటలు వచ్చిందని చెర్రీ అన్నారు. ముందు రిలీజ్ చేసేయండి చెప్పాడు. ఇదే పుష్ప సినిమాలో జరిగిన అద్భుతం. ఒక్క సినిమాతో పోయేదానికి మూడు పార్టులు చేయాల్సి వచ్చింది. భవిష్యత్తులో ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత చెర్రీ గారిదే' అని నవ్వుతూ అన్నారు. -
సుకుమార్ ఏది చెపితే అది 5 ఏళ్ల పాటు పిచ్చోళ్లా చేశాం : అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 1895 కోట్లు రాబట్టి అనేక రికార్డ్స్‌ను క్రియేట్ చేసింది. ఈ చిత్రం భారీ విజయం అందుకోవడంతో తాజాగా ‘థ్యాంక్స్ మీట్’ ఏర్పాటు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ మూవీలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించారు. సంధ్య థియేటర్ ఘటన తర్వాత జరిగిన ఈ కార్యక్రమంలో బన్నీ తొలిసారి ఈ సినిమా గురించి మాట్లాడారు. ఈ వేదికపై అల్లు అర్జున్ మాట్లాడుతూ.. 'పుష్ప 2’(Pushpa 2) సినిమా రిలీజ్ సమయానికి మరో హిందీ చిత్రం రిలీజ్ కావాల్సింది. కానీ వాళ్లు వాయిదా వేసుకున్నారు. ఇలా ప్రతి ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ లభించింది.పుష్ప సమయంలోనే కోవిడ్ ప్రారంభమైంది. ఈ సినిమా అసలు అవుద్దా అనిపించింది. కోవిడ్ టైమ్‌లో కూడా చాలా కష్టపడ్డాం. ముఖ్యంగా జాతర షూటింగ్ లాస్ట్ వరకు చూస్తానా అనిపించేది . మైత్రి మూవీస్ లాంటి ప్రొడ్యూసర్స్ లేకపోతే పుష్ప లాంటి సినిమా రాదు. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ, చేయలేకపోయాం. డిసెంబరు 5న రిలీజ్ చేశాం. ‘పుష్ప’ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఐదేళ్ల ప్రయాణంలోని ప్రతి క్షణం నాకు ముఖ్యమే. 5 సంవత్సరాలు సుకుమార్ ఏది చెపితే అది పిచ్చొల్లులాగా వింటూనే పనిచేశాం. సినిమాలో ఏది బాగుందని ప్రశంసలు దక్కినా అది డైరెక్టర్ గొప్పతనమే. విజయంలోని క్రెడిట్‌ను తాను తీసుకోకుండా సుకుమార్ అందరికీ పంచిచ్చేస్తుంటాడు. కానీ, ఈ విజయంలోని పూర్తి క్రెడిట్ తనకే సొంతం దేవిశ్రీ లేకుండా ‘పుష్ప’ను ఊహించడం చాలా కష్టం. తను ఈ సినిమాకు ఓ గొప్ప శక్తిని అందించాడు. ఈ సినిమాగానీ హిట్టైతే ఈ కష్టం అంతా నా ఫ్యాన్స్ కు అంకితం చేయాలనుకున్నాను... అంకితం చేస్తున్నాను. ‘పుష్ప 3’ గురించి నాకు, సుకుమార్‌గారికి తెలియదు. కానీ, అదొక అద్భుతంలా అయితే ఉంటుంది (నవ్వుతూ)’’ అని అల్లు అర్జున్ అన్నారు. -
పుష్ప ఐదేళ్ల జర్నీలో ప్రతి క్షణం నాకు ముఖ్యమే: హీరో అల్లు అర్జున్
‘‘చాలాసార్లు ‘పుష్ప’ సినిమా అసలు అవుద్దా అనిపించింది. కోవిడ్ టైమ్‌లో ఎంతో కష్టపడ్డాం. జాతర ఎపిసోడ్ టైమ్‌లో... ఈ ఎపిసోడ్ ఎండ్‌ని చూడగలనా అనిపించింది. ‘పుష్ప 2’(Pushpa 2)ని 2024 ఆగస్టు 15న రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ చేయలేకపోయాం. డిసెంబరు 5న రిలీజ్ చేశాం. అయితే చివరి నిమిషం వరకూ కష్టపడ్డాం. ‘పుష్ప’ సినిమాకు చెందిన ఐదేళ్ల ప్రయాణంలోని ప్రతి క్షణం నాకు ముఖ్యమే. ఈ సినిమాగానీ హిట్టైతే ఈ కష్టం అంతా నా ఫ్యాన్స్ కు అంకితం చేయాలనుకున్నాను... అంకితం చేస్తున్నాను. ‘పుష్ప 3’ గురించి నాకు, సుకుమార్‌గారికి తెలియదు. కానీ అదొక అద్భుతంలా అయితే ఉంది (నవ్వుతూ)’’ అన్నారు అల్లు అర్జున్(Allu Arjun) .హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించిన నేపథ్యంలో ‘థ్యాంక్స్ మీట్’(Thank You Meet)ను శనివారం హైదరాబాద్‌లో నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేదికపై ఇంకా అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘పుష్ప 2’(Pushpa 2) సినిమా రిలీజ్ సమయానికి మరో హిందీ చిత్రం రిలీజ్ కావాల్సింది. కానీ వాళ్లు వాయిదా వేసుకున్నారు. ఇలా ప్రతి ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ లభించింది.ఇండియన్ సినిమాలోని అన్ని ఇండస్ట్రీలకు, ఆడియన్స్ కు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ‘పుష్ప’ ఫ్యాన్స్ కు థ్యాంక్స్. ఒక్కరికి మాత్రం థ్యాంక్స్ చెప్పాలనుకోవడం లేదు. ఎందుకంటే... థ్యాంక్స్ అనే పదం సరిపోదు. ఒక యాక్టర్ ఎంత బాగా అయినా చేయవచ్చు. నిర్మాతలు ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు... కానీ అందరికీ హిట్ ఇచ్చేది డైరెక్టర్ మాత్రమే. ఒకరు ఎంత పెద్ద యాక్టర్ అయినా సరే... సరైన మార్గ దర్శకులు లేకపోతే ఏ యాక్టర్ అయినా బ్యాడ్ యాక్టరే.నన్ను, మమ్మల్ని అందరినీ గైడ్ చేసినందుకు థ్యాంక్స్ (సుకుమార్‌ను ఉద్దేశించి). తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వపడేలా చేసినందుకు థ్యాంక్స్. డార్లింగ్... నిన్ను అందరూ నమ్ముతారు. నువ్వు ఒక్కడివే నిన్ను నువ్వు నమ్మవు. మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ , వై. రవిశంకర్గార్ల వల్లే ‘పుష్ప’ సాధ్యమైంది. అలాగే ప్రతి రోజూ కష్టపడే చెర్రీగారికి థ్యాంక్స్. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ, నా వ్యక్తిగత ఏఏ టీమ్ అందరికీ ధన్యవాదాలు. సాంగ్స్ మిలియన్స్ ఎలా అవుతాయి అనుకున్న నాకు బిలియన్స్ లో చూపించాడు దేవిశ్రీ ప్రసాద్. శ్రీవల్లి (రష్మిక), కెమేరామేన్ క్యూబా, డ్యాన్స్మాస్టర్స్ గణేశ్, విజయ్, ప్రేమ్ రక్షిత్, శేఖర్... ఇలా అందరికీ థ్యాంక్స్’’ అన్నారు.సుకుమార్ మాట్లాడుతూ– ‘‘నేషనల్ అవార్డు విన్నర్ పెర్ఫార్మ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందీ సినిమా అని ప్రతి సీన్ ముందు అల్లు అర్జున్‌కి చెప్పేవాడిని. ఈ మాటను మరోలా తీసుకోవద్దు... ట్రోల్స్ చేయవద్దు. మా కాలనీలో ఓ పెద్దాయన నాతో ‘ఎస్వీ రంగారావుగారిలా నటించాడు’ అన్నారు. ఆ పక్కనే ఉన్న మరో పెద్దాయన ‘ఎస్వీఆర్ డ్యాన్సులు, ఫైట్లు చేయడు కదా’ అన్నారు. అల్లు అర్జున్ పరిపూర్ణమైన హీరో. డ్యాన్స్ చేయగలడు... ఫైట్స్ చేయగలడు... ఏడవగలడు... నవ్వగలడు... ‘రంగస్థలం’ నుంచి నాకు సూపర్‌డూపర్ హిట్స్ వచ్చాయంటే కారణం మైత్రీ మూవీ మేకర్సే. మంచి సీన్స్ కోసం రీ షూట్స్ చేసేంత ఫ్రీడమ్ ఇచ్చారు.‘పుష్ప’ సక్సెస్ మైత్రీ మూవీ మేకర్స్‌కే చెందుతుంది. దేవీశ్రీ ప్రసాద్ లేకుండా నేను సినిమా తీయలేనేమో! మొదట్లో ‘పుష్ప’ రెండు పార్ట్స్ కాదు. తొలి భాగానికే మూడు గంటల ఫుటేజ్ వచ్చిందని ‘పుష్ప 1’గా రిలీజ్ చేశాం. ఇది ‘పుష్ప’కు జరిగిన అద్భుతం. ఇది చెర్రీగారి వల్ల జరిగింది. ‘పుష్ప 2’నూ ఇలానే రిలీజ్ చేశాం. ఇలా మా లైఫ్‌లో ఆయన ‘పుష్ప 1, పుష్ప 2, పుష్ప 3’ పెట్టారు. ఈ సిరీస్ ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియదు. ‘పుష్ప 2’తో అసోసియేట్ అయిన అందరికీ థ్యాంక్స్’’ అని తెలిపారు.‘‘పుష్ప 1, పుష్ప 2’ అనే మ్యాజిక్‌ను క్రియేట్ చేసిన అందరికీ... ముఖ్యంగా అల్లు అర్జున్, సుకుమార్, మైత్రీ మూవీస్‌కు థ్యాంక్స్’’ అన్నారు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. ‘‘పుష్ప 3’ కోసం ఎదురు చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు ‘పుష్ప 2’ను హిందీలో పంపిణీ చేసిన హిందీ నిర్మాత అనిల్ తడానీ. ‘‘సుకుమార్‌గారి విజన్‌ని అల్లు అర్జున్‌గారు సరిగ్గా తీసుకెళ్లగలిగారు. ‘పుష్ప’ కోసం చాలా కాల్షీట్స్ ఇచ్చారు రష్మిక. మా సినిమాకు దేవీగారు బ్యాక్‌బోన్. ‘పుష్ప’ టీమ్ అందరికీ థ్యాంక్స్’’ అన్నారు వై. రవిశంకర్. ‘‘పుష్ప 2’ అంచనాలను మించి కలెక్ట్ చేస్తుందని ఊహించాం. కానీ ఇంత పెద్ద స్థాయిలో ఉంటుందని మాత్రం ఊహించలేదు’’ అన్నారు నవీన్ ఎర్నేని. ‘‘స్పెయిన్‌లో షూటింగ్ చేస్తూ, అర్ధరాత్రి వేళ అక్కడ ఓ రెస్టారెంట్‌కి వెళితే, ఆ రెస్టారెంట్ నడిపే పాకిస్తాన్ వ్యక్తి నన్ను ‘పుష్ప’ సినిమాలోని మంగళం శీనుగా గుర్తుపట్టి, మాట్లాడితే చాలా హ్యాపీ ఫీలయ్యాను. తమిళ, కన్నడ, మలయాళం... ఇలా ఇతర ఇండస్ట్రీ వాళ్ళు నాకు గౌరవంతో పాటు, అవకాశాలు ఇస్తున్నారు. ఇది ‘పుష్ప’తోనే సాధ్యమైంది’’ అన్నారు సునీల్. ‘‘పుష్ప’ సినిమా అయ్యేలోపే రెండు ఇన్‌కమ్‌టాక్స్ రైడ్స్ జరిగాయి. ఈ రైడ్స్‌ను తట్టుకుని, అందరికీ కరెక్ట్‌గా పేమెంట్ చేసిన మా అకౌంట్స్ టీమ్‌కు థ్యాంక్స్’’ అన్నారు మైత్రీ సీఈవో చెర్రీ. ‘నైజాంలో వన్నాఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్‌లో ‘పుష్ప 2’ కూడా ఉంది’’ అన్నారు మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశి. సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ నాగార్జున మాట్లాడారు. అజయ్, ఆదిత్యా మీనన్, జగదీశ్, గణేశ్ ఆచార్య మాస్టర్, డ్యాన్స్ మాస్టర్ విజయ్ పోలంకి, ఎడిటర్ నవీన్ నూలి, బన్నీ వాసు తదితరులు పాల్గొన్నారు. ఈ వేదికపై అల్లు అర్జున్, సుకుమార్, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ కలిసి ‘పుష్ప’ టీమ్‌కు, డిస్ట్రిబ్యూటర్స్‌కు షీల్డ్స్ అందించారు. ఈ కార్యక్రమంలో సుకుమార్‌కి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. -
టైట్ సెక్యూరిటీ మధ్య స్టార్ హోటల్లో 'పుష్ప' ఫైనల్ టచ్
అల్లు అర్జున్ - సుకుమార్‌ల యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘పుష్ప2: ది రూల్’. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 4న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో ఎన్నో రికార్డులు నెలకొల్పి చరిత్ర సృష్టించింది. అయితే, సినిమా ప్రీమియర్ సమయంలో జరిగిన తొక్కిసలాటతో సక్సెస్ మీట్ వంటి కార్యక్రమాలు జరపలేదు. అయితే, పుష్ప2 థియేటర్ రన్ కూడా పూర్తి అయింది. జనవరి 30న నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి కూడా వచ్చేసింది. దీంతో సినిమా చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా విజయంలో కీలకంగా పనిచేసిన పుష్ప2 నటీనటులతో పాటు టెక్నీషయన్లతో ఫైనల్ టచ్‌గా ఒక థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేశారు.హైదరాబాద్‌లోని ఒక స్టార్ హోటెల్లో ఈ రోజు (ఫిబ్రవరి 8) సాయింత్రం పుష్ప2 థ్యాంక్స్ మీట్ జరగనుంది. టైట్ సెక్యూరిటీ మధ్య చాలా లిమిటెడ్‌గా ఆహ్వానాలు పంపారు. సినిమా కోసం పనిచేసిన అందరికీ షీల్డ్‌లు అందించి వారిని సత్కరించనున్నారు. పుష్ప2తో భారీ విజయాన్ని అందుకున్న బన్నీ ఈ కార్యక్రమంలో ఏం మాట్లాడనున్నాడోనని తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే, సంధ్య థియేటర్ ఘటన గురించి ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవచ్చని తెలుస్తోంది. కేవలం తన తర్వాతి సినిమాల గురించి మాత్రమే ఆయన మాట్లాడతారని సమాచారం ఉంది.పుష్ప 2 విషయానికి వస్తే ఇది 2021లో వచ్చిన పుష్ప మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కింది. అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించారు. సుకుమార్ దర్శకత్వం వహించగా దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఫహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, సునీల్, అనసూయ, జగదీశ్ కీలకపాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించారు. -
పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా?.. ఇంటర్నేషనల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం పుష్ప-2 ది రూల్. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా వరల్డ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 2021లో వచ్చిన పుష్ప మూవీకి సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.ఇటీవల పుష్ప-2 ది రూల్ ఓటీటీకి కూడా వచ్చేసింది. జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అదనంగా యాడ్ చేసిన సీన్స్‌తో పాటు ఓటీటీలో సందడి చేస్తోంది. అయితే ఈ చిత్రంలోని క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ మాత్రం అడియన్స్‌కు గూస్బంప్స్ తెప్పిస్తోంది. అల్లు అర్జున్ గాల్లోకి ఎగిరే ఫైట్ సన్నివేశాలు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. దీంతో పలువురు నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా ఆ ఫైట్ సీక్వెన్స్ వీడియోలను షేర్ చేస్తున్నారు.బన్నీ ఫైట్ సీక్వెన్స్ వీడియోను ఓ నెటిజన్ పోస్ట్ చేయగా.. ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ సైతం స్పందించారు. అమెరికా చిత్రాల కంటే బాగానే ఉందని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. మార్వెల్‌లో కూడా ఈ క్రియేటివీటీ సాధ్యం కాలేదు.. కానీ వాళ్లు చేసి చూపించారు అని మరో నెటిజన్ రిప్లై ఇచ్చాడు. మరికొందరైతే పుష్ప-2 గ్లోబల్, ఇంటర్నేషనల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనా పుష్పరాజ్ మూవీలోని డైలాగ్‌ను నిజం చేశారు. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్ అంటూ బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. Action scene from an Indian movie pic.twitter.com/k9lhfXDIdp— non aesthetic things (@PicturesFoIder) February 3, 2025 -
సబ్యసాచి ఫ్యాషన్ షోలో మెరిసిన సుకుమార్ భార్య తబిత (పోటోలు)
-
పుష్ప 2 సెలబ్రేషన్స్ కు దూరంగా పుష్ప టీమ్
-
'పుష్ప 3' ఐటెమ్ సాంగ్.. ఆ హీరోయిన్ అయితే సూపర్ హిట్టే: దేవిశ్రీ ప్రసాద్
పుష్ప సిరీస్ గురించి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) కీలక వ్యాఖ్యలు చేశారు. పుష్ప2 భారీ కలెక్షన్స్ సాధించి ఎన్నో రికార్డ్స్‌ను దాటేసింది. పుష్ప రెండు భాగాలకు దేవిశ్రీ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ క్రమంలో ఆయన తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో 'పుష్ప 3' (Pushpa 3) ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. పుష్ప చిత్రాలకు ఐటెమ్ సాంగ్స్ మంచి గుర్తింపును ఇచ్చాయి. ఇప్పుడు పుష్ప3లో ఐటెమ్ సాంగ్‌లో ఎవరు కనిపిస్తే బాగుంటుందో దేవిశ్రీ ప్రసాద్ తాజాగా చెప్పారు. (ఇదీ చదవండి: విజయ్‌తో చేయి కలిపేందుకు అడుగులేస్తున్న త్రిష)పుష్పలో సమంత 'ఊ అంటావా మామ.. ఉఊ అంటావా మామా' అంటూ తన గ్లామర్‌తో దుమ్మురేపింది. పుష్ప2లో శ్రీలీల కిస్సిక్ సాంగ్‌లో నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అయితే, ఈ ప్రత్యేకమైన సాంగ్స్ గురించి దేవిశ్రీ ప్రసాద్ ఇలా పంచుకున్నారు. పుష్ప 2 కిస్సిక్ పాటలో ఎవరు నటించినా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటారని తాము ముందే ఊహించామని అయన అన్నారు. అయితే, ఈ సాంగ్‌కు శ్రీలీల మంచి ఆప్షన్ అని తాను మేకర్స్‌కు ముందే చెప్పానని ఆయన అన్నారు. దానికి ప్రధాన కారణం ఆమె చాలా బెటర్‌గా డ్యాన్స్ చేయడమేనని దేవిశ్రీ అన్నారు. ఇప్పటికే చాలామంది టాప్ హీరోయిన్లు తన మ్యూజిక్‌లో వచ్చిన ఐటెమ్ సాంగ్స్‌లో మెప్పించిన విషయాన్ని గుర్తుచేశారు. అందులో కాజల్ అగర్వాల్ (జనతా గ్యారేజ్), పూజా హెగ్డే( రంగస్థలం), సమంత (పుష్ప), శ్రీలీల (పుష్ప2)ఉన్నారన్నారు. వారందరూ కూడా కెరీర్లో మంచి పీక్‌లో ఉన్నప్పుడే ఐటెమ్ సాంగ్స్‌లలో కనిపించారన్నారు.'పుష్ప 3' ఐటెమ్ సాంగ్‌లో జాన్వీ ఎంపిక ఎందుకంటే..?పుష్ప 3 సినిమాలో ఐటెమ్ సాంగ్‌లో కనిపించేది ఎవరని ఇప్పటి నుంచే ఊహాగానాలు మొదలయ్యాయని ఆయన అన్నారు. ఈ అంశంపై దీనిపై దర్శక నిర్మాతలు తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. పాట ఆధారంగా హీరోయిన్ను ఎంపిక చేస్తారని దేవి తెలిపారు. ఇండస్ట్రీలో సాయి పల్లవి డ్యాన్స్‌కు తాను అభిమానినని చెప్పిన ఆయన.. జాన్వీ కపూర్(Janhvi Kapoor) కూడా మంచి డ్యాన్సర్ అని ఆయన తెలిపారు. ఇప్పటికే బాలీవుడ్లో నటించిన ఆమె పాటలు చూశానని అన్నారు. ఆమె అమ్మగారు అయిన శ్రీదేవిలో ఉన్న గ్రేస్ జాన్వీలో కూడా ఉందని అభిప్రాయపడ్డారు. అయితే, పుష్ప-3 ఐటెమ్ సాంగ్‌కు జాన్వీ అయితే సరైన ఎంపిక అని తాను అనుకుంటున్నట్లు దేవిశ్రీ ప్రసాద్ అన్నారు.‘పుష్ప 2’ ఘన విజయం అందుకున్న తర్వాత దర్శకుడు సుకుమార్ ‘పుష్ప’ పార్ట్ 3కి సంబంధించి నిరంతరం పని చేస్తున్నారని దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే చెప్పారు. ఆ స్టోరీపై రీవర్క్ కూడా చేస్తున్నారని ఆయన తెలిపారు. సుకుమార్ ఇచ్చిన మంచి స్క్రిప్టుకు అల్లు అర్జున్ అద్భుతంగా నటించడం వల్లే సినిమా భారీ హిట్ అయిందని ఆయన అన్నారు. పుష్ప 1, పుష్ప 2కి ఎలా పనిచేశామో ‘పుష్ప 3’కి అదే స్థాయిలో కష్టపడతామని తెలిపారు. -
టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లలో మూడోరోజు ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: సినీప్రముఖుల ఇళ్లలో వరుసగా మూడోరోజు ఐటీ సోదాలు (Income Tax department Raids) కొనసాగుతున్నాయి. నిర్మాతలతో పాటు నిర్మాణ సంస్థలకు ఫైనాన్స్ చేసిన వారి నివాసాలు, ఆఫీసుల్లోనూ అధికారులు తనిఖీ చేస్తున్నారు. దర్శకుడు సుకుమార్, నిర్మాత నెక్కింటి శ్రీదర్, దిల్ రాజు (Dil Raju) ఇళ్లు, కార్యాలయల్లో సోదాలు కొనసాగుతున్నాయి. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నివాసాల్లో, మైత్రీ మూవీస్ సంస్థ కార్యాలయాల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి.టాలీవుడ్‌పై టార్గెట్తెలుగు సినీ నిర్మాతల నివాసాలు, కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ మంగళవారం సోదాలు మొదలుపెట్టింది. దాదాపు 55 బృందాలతో ఈ తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఇల్లు, కార్యాలయాలతోపాటు.. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నివాసాల్లో, మైత్రీ మూవీస్ సంస్థ కార్యాలయాల్లో, ప్రముఖ గాయని సునీత భర్త రామ్‌కు చెందిన మ్యాంగో మీడియా ఆఫీస్‌లోనూ సోదాలు చేశారు. పుష్ప 2 సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టిన నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యాంకు లావాదేవీలను పరిశీలించారు. వసూళ్లకు తగ్గట్లుగా ఆదాయపన్ను చెల్లించలేదని గుర్తించారు.బుధవారం నాడు సుకుమార్ ఇంటికీ ఐటీ అధికారులు వెళ్లారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన సుకుమార్‌ను నేరుగా ఇంటికి తీసుకెళ్లిన అధికారులు ఆయన బ్యాంకు లావాదేవీలు, లాకర్ల గురించి ఆరా తీశారు. గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్ ఇంట్లోనూ సోదాలు చేశారు. దిల్ రాజు కూతురు హన్సిత, సోదరుడు నర్సింహ ఇంట్లోనూ తనిఖీలు చేశారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ వారం రోజుల్లో రూ. 203 కోట్లు వసూళ్లు చేసిందని, కానీ లాభాలకు తగ్గట్లు పన్నులు చెల్లించలేదని ఐటీ శాఖ గుర్తించింది.మరోవైపు ఈ వ్యవహారంపై దిల్‌రాజు బుధవారం స్పందిస్తూ.. ఐటీ రైడ్స్ తన ఒక్కడిపైనే0 జరగట్లేదని.. ఇండస్ట్రీ మొత్తం మీద ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నట్లు తెలిపారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులు అధికారులకు సహకరిస్తున్నారని చెప్పారు. -
డైరెక్టర్ సుకుమార్ ఇంట ఐటీ రైడ్స్
చిత్ర పరిశ్రమపై ఆదాయ పన్నుశాఖ అధికారులు గురి పెట్టారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో విడుదలైన చిత్రాలకు సంబంధించిన నిర్మాతలు, దర్శకుల ఇళ్లు, ఆఫీసులలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పుష్ప2 డైరెక్టర్ సుకుమార్ నివాసంలో కూడా నేడు ఐటి సోదాలు జరుగుతున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సుకుమార్‌ను ఐటీ అధికారులు నేరుగా ఇంటికి తీసుకెళ్లారు. ఆయనకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, లాకర్లు వంటి వివరాల గురించి ఆరా తీస్తున్నారు.ఇప్పటికే ప్రముఖ గాయని సునీత భర్త రామ్‌కు చెందిన మ్యాంగో మీడియా సంస్థలోనూ ఐటీ సోదాలు కొనసాగినట్టు తెలిసింది. అంతేకాదు భారీ బడ్జెట్ సినిమాలకు ఫైనాన్స్ చేసే సత్య రంగయ్య, అభిషేక్ అగర్వాల్‌ల ఇళ్లలోనూ సోదాలు చేశారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే మొదలైన ఈ ప్రక్రియే రెండో రోజు కూడా కొనసాగుతుంది. గత రెండు నెలల్లో విడుదలైన చిత్రాలకు సంబంధించిన వారినే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి సహా నగరంలోని ఎనిమిది చోట్ల 55 బృందాలతో తనిఖీలు నిర్వహించినట్టు సమాచారం.దిల్ రాజ్ కూతురు ఇంట్లో సోదాలుదిల్ రాజ్ కూతురు హన్సితారెడ్డి ఇంట్లో కూడా రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆమె సమక్షంలో డిజిటల్ లాకర్లను ఐటి అధికారులు ఓపెన్ చేశారు. మరికొద్ది సేపట్లో ఆమెకు సంబంధించిన బ్యాంకు లాకర్లను అధికారులు ఓపెన్ చేయనున్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ లోని ఆమె నివాసానికి హన్సితా రెడ్డి కుటుంబ సభ్యులు చేరుకున్నారు. -
కూతురి ఫస్ట్ మూవీ.. ఏడ్చేసిన సుకుమార్ భార్య (ఫోటోలు)
-
ఏ అమ్మాయి ఆ పని చేయదంటూ ఏడ్చేసిన తబిత.. ఓదార్చిన సుకుమార్
ప్రముఖ దర్శకుడు సుకుమార్ (Sukumar) కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి (Sukriti Veni Bandreddi) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం గాంధీ తాత చెట్టు. ఇప్పటికే ఈ సినిమా పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమై ఎన్నో అవార్డులను అందుకుంది. గురువారం నాడు ఈ సినిమా రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఎన్నోసార్లు ఏడ్చానంటూ మళ్లీ ఎమోషనల్సందర్భంగా తబిత మాట్లాడుతూ ఎమోషనలైంది. 'సుకృతి పాటలు పాడగలదు. కానీ తనకు యాక్టింగ్ రాదని చాలా భయపడ్డాను. డైరెక్టర్ మాత్రం సుకృతిని నమ్మి సినిమాలోకి తీసుకొచ్చింది. తనలోని టాలెంట్‌ను నేనెప్పుడూ గమనించలేదు. ఈ సినిమా పూర్తయ్యాక ఎన్నిసార్లు చూశానో.. అన్నిసార్లు ఏడుస్తూనే ఉన్నాను. ఇక్కడ నా కూతురు గురించి చెప్పాలి.. ఈ సినిమా చేసేటప్పుడు తను 13వ వయసులోకి అడుగుపెట్టింది. గర్వంగా ఉంది: తబితఈ ఏజ్‌లో ఏ అమ్మాయి గుండు చేయించుకోవడానికి ఇష్టపడదు.. కానీ గాంధీ తాత చెట్టు సినిమా (Gandhi Tatha Chettu) కోసం తను గుండు గీయించుకుంది. ఆ విషయంలో తనను చూసి గర్విస్తున్నాను' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో సుకుమార్ స్టేజీపైకి వెళ్లి తనను ఓదార్చాడు. అనంతరం సుకృతి ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. నా చుట్టూ ఉన్నవాళ్లు పుష్ప మూవీలో నటిస్తున్నావా? అని అడుగుతూ ఉండేవారు. పుష్ప మూవీలో యాక్ట్ చేస్తానన్నాసుకుమార్ కూతుర్ని కాబట్టే నన్ను సినిమాలో తీసుకున్నాడు అన్న పేరు నాకిష్టం లేక నేను చేయలేదని చెప్పాను. కానీ అసలు నిజమేంటో తెలుసా? పుష్ప 1, పుష్ప 2 సినిమాల్లో నేను యాక్ట్ చేస్తానని నాన్నను అడిగాను. ముందు ఆడిషన్ చేయు.. తర్వాత చూద్దామన్నాడు. అందుకే చేయలేదు. అని చెప్పుకొచ్చింది.గాంధీ తాత చెట్టుగాంధీ తాత చెట్టు సినిమా విషయానికి వస్తే.. పద్మావతి మల్లాది దర్శకత్వం వహించారు. సుకుమార్ సతీమణి తబిత సమర్పకురాలిగా వ్యవహరిస్తుండగా సుకుమార్ రైటింగ్స్, గోపీటాకీస్ సంస్థలతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మించారు. ఈ మూవీ జనవరి 24న థియేటర్లలో విడుదల కానుంది.చదవండి: సైఫ్ అలీ ఖాన్‌పై దాడికి పాల్పడిన నిందితుడు అరెస్ట్ -
ప్రభాస్ తో సుకుమార్ క్రేజీ ప్రాజెక్ట్
-
పుష్ప-2 రీ లోడ్ వర్షన్.. మేకర్స్ బిగ్ అప్డేట్
నెల రోజులు దాటినా బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ హవా ఏమాత్రం తగ్గట్లేదు. ఇప్పటికే రూ.1831 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. బాహుబలి-2 రికార్డ్‌ను అధిగమించిన పుష్ప-2 మరో రెండు వేల కోట్ల దిశగా దూసుకెళ్తోంది. ఇదే క్రమంలో అమిర్ ఖాన్ సూపర్ హిట్ మూవీ దంగల్ వసూళ్లపై కన్నేసింది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే దంగల్ రికార్డ్‌ను క్రాస్ చేయనుంది.మేకర్స్ బిగ్ ప్లాన్..పుష్ప-2 ఫ్యాన్స్‌కు ఇటీవలే గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. త్వరలోనే రీ లోడెడ్ వర్షన్ థియేటర్లలో విడుదల ప్రకటించారు. ఈనెల 17 నుంచి పుష్ప రీ లోడెడ్ థియేటర్లలో అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. తాజాగా దీనికి సంబంధించిన గ్లింప్స్ ప్రోమో మేకర్స్ విడుదల చేశారు. దాదాపు 25 సెకన్ల పాటు ఉండే రీ లోడ్ వర్షన్ గ్లింప్స్ ప్రోమో రిలీజ్ చేశారు. అదేంటో మీరు కూడా చూసేయండి. దంగల్‌పైనే గురి..'పుష్ప 2' (Pushpa 2 The Rule) ఇప్పటికే రూ.1000 కోట్లకుపైగా సాధించిన భారతీయ చిత్రాల లిస్ట్‌లో రెండో స్థానంలో ఉంది. అదే టాలీవుడ్ సినిమా లిస్ట్‌లో అయితే ప్రథమ స్థానం. ఇండియన్ బాక్సాఫీస్ టాప్ కలెక్షన్ల పరంగా ఇప్పటి వరకు 'దంగల్' (రూ. 2,070 కోట్లు), 'బాహుబలి 2' (రూ.1810 కోట్లు) సాధించి వరుస స్థానాల్లో ఉన్నాయి.అయితే ఇప్పటికే పుష్ప2 (Pushpa 2: The Rule) ప్రపంచవ్యాప్తంగా రూ.1831 కోట్లు (గ్రాస్) రాబట్టి కలెక్షన్స్ పరంగా రెండో స్థానంలో చేరిపోయింది. మరో రూ. 200 కోట్ల కలెక్షన్స్ వస్తే దంగల్ (Dangal) రికార్డ్ బద్దలవుతుంది. ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం పుష్ప2 నిలుస్తుంది. ఇప్పటి వరకు దంగల్ రికార్డ్‌ను ఏ మూవీ అధిగమించలేకపోయింది. ఇప్పుడు ఆ రికార్డ్‌ను బద్దలు కొట్టే ఛాన్స్ పుష్ప-2 మాత్రమే ఉంది.హిందీలో భారీ రికార్డులు..అల్లు అర్జున్ పుష్ప-2 ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించింది. కేృవలం 32 రోజుల్లోనే భారతీయసినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికే 'బాహుబలి-2' వసూళ్లను పుష్ప-2 అధిగమించింది. జనవరి 17 నుంచి పుష్ప-2 రీ లోడెడ్ వెర్షన్ వస్తుందని చెప్పడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హిందీలో అయితే గతంలో ఎప్పుడు లేని రికార్డులు నెలకొల్పింది. ఏకంగా రూ.800 కోట్లకు పైగా నెట్ వసూళ్లతో పాన్ ఇండియాలో ఆల్ టైమ్ రికార్డ్స్ సృష్టించింది.ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనూ రికార్డ్..పుష్ప-2 విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు నుంచే వసూళ్ల సునామీ సృష్టించింది. పుష్పరాజ్ కలెక్షన్స్ చూసి ప్రపంచ సినీ ప్రేమికులు ఫిదా అయిపోయారు. తొలి రోజు నుంచే ఇండియాలో ఆల్‌టైమ్ రికార్డులు సృష్టించింది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా నటించంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతమందించారు. మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ మరోసారి అభిమానులను మెప్పించారు. #Pushpa2Reloaded storms into theatres on JAN 17th! 🔥Here’s the GLIMPSE to ignite your excitement! ❤️🔥Telugu - https://t.co/5N7M2xgZTU#Pushpa2 #WildFirePushpa #Pushpa2TheRule pic.twitter.com/4M4KcZYmL2— Mythri Movie Makers (@MythriOfficial) January 12, 2025 -
చిరంజీవితో తొలి సినిమా.. సుకుమార్ బర్త్‌డే విశేషాలు (ఫోటోలు)
-
సుకుమార్ కూతురి చిత్రం.. ట్రైలర్ రిలీజ్ చేసిన మహేశ్ బాబు
పుష్ప సినిమా దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి(Sukriti Veni Bandreddi) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'గాంధీ తాత చెట్టు'(Gandhi Tatha Chettu) ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై అవార్డ్స్‌ను అందుకుంది. పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, గోపీటాకీస్ సంస్థలతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మించారు. ఈ చిత్రానికి డైరెక్టర్ సుకుమార్ భార్య తబితా సుకుమార్ సమర్పకురాలుగా వ్యవహరించారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను(Gandhi Tatha Chettu Trailer) విడుదల చేశారు మేకర్స్. ప్రిన్స్ మహేశ్ బాబు చేతుల మీదుగా గాంధీతాత చెట్టు ట్రైలర్ రిలీజ్ చేశారు. గాంధీ తాత చెట్టు ట్రైలర్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. అందరి మనసులను హత్తుకునే సినిమాలా అనిపిస్తోంది. సుకృతికి, అలాగే ఈ సినిమా టీమ్ అందరికి నా అభినందనలు అంటూ ప్రిన్స్ మహేష్‌బాబు తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.తాజాగా రిలీజైన గాంధీ తాత చెట్టు ట్రైలర్ చూస్తే ఓ బాలిక ఇచ్చిన మాట కోసం గాంధీ మార్గాన్ని ఎంచుకున్న కథగా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. గాంధీ పేరు పెట్టుకున్న ఓ అమ్మాయి.. ఆయన బాటను, సిద్దాంతాలను అనుసరిస్తూ, తన తాతకు ఇష్టమైన చెట్టును, తన ఊరును ఎలా రక్షించుకుంది అనే కథాంశంతో సినిమా తెరకెక్కినట్లుగా తెలుస్తోంది. గాంధీగా సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ఈ సినిమాలో నటించారు. ట్రైలర్ అందరి హృదయాలకు హత్తుకునే విధంగా ఉంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా సుకుమార్ కూతురి నటన అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ట్రైలర్ విడుదల చేసిన సూపర్‌స్టార్ మహేష్‌బాబుకు నిర్మాతలు, దర్శకురాలు, చిత్ర సమర్పకురాలు తబితా సుకుమార్ తమ కృతజ్ఞతలు తెలియజేశారు.కాగా.. ఇప్పటికే ఈ 'గాంధీ తాత చెట్టు' సినిమా పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించడమే కాకుండా ఎన్నో అవార్డులను కైవసం చేసుకుంది. ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి పురస్కారం పొందారు. దీంతో పుష్ప అభిమానులు సుకుమార్ కూతురు అనిపించుకున్నావ్ అంటూ ఆమెను ప్రశంసిస్తున్నారు. తండ్రి నేషనల్ అయితే, కూతురు ఇంటర్నేషనల్ అంటూ వరుసగా ట్వీట్లు చేస్తున్నారు.ఈ సందర్భంగా దర్శకురాలు పద్మావతి మల్లాది మాట్లాడుతూ 'ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడా చూసిన ద్వేషాలు, అసూయ..ఇలా ఓ నెగెటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం.. గొడవలు ఇలా ఎన్నో ఘర్షణలు కనిపిస్తున్నాయి.ఇక సాధారణంగా మనకు అహింస అనగానే మనకు మన జాతిపిత మహాత్మగాంధీ గుర్తొస్తారు. ఇలాంటి తరుణంలో గాంధీ గారి సిద్ధాంతాలు అభిమానిస్తూ, ఆయన బాటను అనుసరించే ఓ పదమూడేళ్ల అమ్మాయి తను పుట్టిన ఊరిని కాపాడుకోవడం కోసం ఏం చేసింది? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు చూపించాల్సిన సినిమా. అందరి హృదయాలను హత్తుకునే భావోద్వేగాలు ఈ చిత్రంలో ఉంటాయి. చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ ఓ అనీర్వచనీయమైన అనుభూతికి లోనవుతారు. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకముంది. ఈ నెల 24న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో ఆనంద్ చక్రపాణి, రఘురామ్, భాను ప్రకాశ్, నేహాల్ ఆనంద్ కుంకుమ, రాగ్ మయూర్ ముఖ్య పాత్రలు పోషించారు. -
పుష్ప 'జాతర'తో పూనకాలు.. ఈ వీడియోలో చూసేయండి
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అల్లు అర్జున్ తన బ్రాండ్ ఏంటో చూపిస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప2 నాలుగు వారాల్లో రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది. ఇప్పటివరకూ రూ.1799 కోట్లకు (గ్రాస్) పైగా ఈ చిత్రం రాబట్టిందని అధికారికంగా ప్రకటించారు. అయితే, తాజాగా ఈ చిత్రానికి ఎంతో బలాన్ని చేకూర్చిన 'గంగమ్మతల్లి జాతర' సాంగ్ వీడియోను మేకర్స్ యూబ్యూబ్‌లో విడుదల చేశారు.పుష్ప2 చిత్రంలో గంగమ్మ జాతర ఎపిసోడ్ ప్రధాన హైలైట్‌గా నిలిచింది. ఈ సీన్ ప్రారంభంలో అల్లు అర్జున్ చీర కట్టుకున్నప్పుడు థియేటర్ దద్దరిల్లిపోయింది. జాతర ఎపిసోడ్లో వచ్చే సాంగ్‌లో ఆయన హీరోయిజం, భావోద్వేగాలు పతాక స్థాయికి చేరుతాయి. దీంతో అందరూ ఆ పాటకు అభిమానులు అయిపోయారు. ఈ పాటకు చంద్రబోస్ అద్భుతమైన లిరిక్స్ అందించగా మహాలింగం ఆలపించారు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అదరిపోయే రేంజ్లో ఉంటుంది. ఇలా అన్ని అంశాల్లో మెప్పించిన ఈ సాంగ్ వీడియో వర్షన్‌ను తాజాగా విడుదల చేశారు. -
సుకుమార్ నేషనల్ అయితే.. కూతురు ఇంటర్నేషనల్
పుష్ప సినిమాతో దర్శకుడు సుకుమార్ పేరు దేశవ్యాప్తంగా వైరల్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఆయన కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి కూడా ఇంటర్నేషనల్ వేదికలపై సత్తా చాటుతుంది. ఆమె ప్రధాన పాత్రధారిగా నటించిన 'గాంధీ తాత చెట్టు' ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై అవార్డ్స్‌ను అందుకుంది. ఇప్పుడు తెలుగులో జనవరి 24న విడుదల కానుంది.పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, గోపీటాకీస్ సంస్థలతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మించారు. ఈ చిత్రానికి డైరెక్టర్ సుకుమార్ భార్య, శ్రీమతి తబితా సుకుమార్ సమర్పకురాలుగా వ్యవహరించారు. ఇప్పటికే ఈ 'గాంధీ తాత చెట్టు' సినిమా పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించడమే కాకుండా ఎన్నో అవార్డులను కైవసం చేసుకుంది. ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి పురస్కారం కూడా పొందారు. దీంతో పుష్ప అభిమానులు సుకుమార్ కూతురు అనిపించుకున్నావ్ అంటూ ఆమెను ప్రశంసిస్తున్నారు. తండ్రి నేషనల్ అయితే, కూతురు ఇంటర్నేషనల్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.ఈ సినిమా గురించి దర్శకురాలు మాట్లాడుతూ.. 'గాంధీజీ సిద్ధాంతాల్ని పాటిస్తూ.. ఓ పదమూడేళ్ల అమ్మాయి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తన గ్రామాన్ని కాపాడుకునేందుకు ఆ అమ్మాయి ఏం చేసిందనేది ఈ చిత్రంలో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నేటి తరం తల్లిదండ్రులు అందరూ తమ పిల్లలకి ఈ చిత్రాన్ని తప్పనిసరిగా చూపించాలని దర్శకురాలు కోరారు. సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో ఆఆనంద్ చక్రపాణి, రఘురామ్, భాను ప్రకాశ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. -
సినిమాల్ని వదిలేద్దాం అనుకుంటున్నా: డైరెక్టర్ సుకుమార్
'పుష్ప 2' (Pushpa 2) బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగి మహిళ మృతి చెందడం, పిల్లాడు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చేరడం హీరో అల్లు అర్జున్‌ని(Allu Arjun) ఎలాంటి ఇబ్బందుల్లో పడేసిందో చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అసెంబ్లీలో మాట్లాడుతూ అల్లు అర్జున్‌పై పరోక్షంగా విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. తాజాగా పోలీసులు.. మరోసారి బన్నీని విచారణకు కూడా పిలవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రశ్న.. జానీ మాస్టర్ రియాక్షన్?)ఈ వివాదం అల్లు అర్జున్‌పై ఎంత ప్రభావం చూపిందో తెలీదు గానీ డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar) మాత్రం మానసికంగా చాలా కుంగిపోయినట్లు అనిపిస్తున్నాడు. ఎందుకంటే కొన్నిరోజుల క్రితం జరిగిన సక్సెస్ మీట్లో మహిళ మృతి విషయాన్ని గుర్తుతెచ్చుకుని బాధపడ్డాడు. ఇప్పుడు ఏకంగా సినిమానే వదిలేస్తానని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. యూఎస్‌లో 'గేమ్ ఛేంజర్' (Game Changer) ఈవెంట్ సందర్భంగా సుక్కు ఈ కామెంట్స్ చేశాడు.యూఎస్ ఈవెంట్లో 'గేమ్ ఛేంజర్' నుంచి 'ధోప్' లిరిక్స్‌తో సాగే పాట రిలీజ్ చేశారు. దీని గురించి మాట్లాడుతూ.. సుకుమార్ గారు ఒకవేళ మీరు 'ధోప్' అని వదిలేయాలి అంటే ఈరోజుతో ఏం వదిలేస్తారు? అని యాంకర్ సుమ అడగ్గా, సినిమాని వదిలేద్దాం అనుకుంటున్నా అని చెప్పాడు. దీంతో పక్కనే కూర్చున్న రామ్ చరణ్ షాకయ్యాడు. అలా చేయరులే అని సైగ చేసి చూపించాడు. బహుశా ప్రస్తుత పరిస్థితుల వల్ల సుకుమార్ బాగా డిస్ట్రబ్ అయినట్లు ఉంది. బహుశా అందుకే అలా అన్నాడేమో?(ఇదీ చదవండి: ఎన్టీఆర్.. ఇంత సన్నబడ్డాడేంటి?)Papam ra SUKKU 😢Waiting for your huge comeback with RC17 ♥️🔥#RamCharan𓃵 #Pushpa2TheRule#Sukumar #RC17pic.twitter.com/LyeJMBPCDK— Negan (@Negan_000) December 23, 2024 -
డల్లాస్‌లో ఘనంగా ‘గేమ్ ఛేంజర్’ మూవీ ప్రీరిలీజ్ వేడుక (ఫొటోలు)
-
'గేమ్ ఛేంజర్' చూసేసిన సుకుమార్.. ఫస్ట్ రివ్యూ
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీ మరికొన్ని రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఇదివరకే రిలీజైన పాటలు ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అమెరికాలోని డల్లాస్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో రామ్ చరణ్, దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజుతో పాటు దర్శకుడు సుకుమార్ కూడా వెళ్లాడు. ఈ మూవీ ఇప్పటికే చూసేశానని చెప్పి.. ఎలా ఉందో బయటపెట్టాడు.(ఇదీ చదవండి: గేమ్ ఛేంజర్ నుంచి 'దోప్' సాంగ్ రిలీజ్)'నేను, చిరంజీవి గారు ఆల్రెడీ మూవీ చూశాం. ఫస్టాప్ అద్భుతంగా ఉంది. ఇంటర్వెల్ అయితే బ్లాక్ బస్టర్. ఫ్లాష్ బ్యాక్ చూస్తున్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. క్లైమాక్స్‌లో చరణ్, అవార్డ్ విన్నింగ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు' అని సుకుమార్ చెప్పుకొచ్చాడు.సుకుమార్ చెప్పిన దానిబట్టి చూస్తే సినిమా అదిరిపోయిందని తెలుస్తోంది. మరి ప్రేక్షకులు తీర్పు ఏంటనేది తెలియాలంటే జనవరి 10 వరకు ఆగాల్సిందే. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ మూవీలో చరణ్ ద్విపాత్రాభినయం చేశాడు. కియారా అడ్వాణీ హీరోయిన్. సునీల్, శ్రీకాంత్, అంజలి, ఎస్జే సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు.(ఇదీ చదవండి: భార్యని పరిచయం చేసిన హీరో శ్రీసింహా) -
బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ ప్రభంజనం.. వందేళ్ల చరిత్రను తిరగరాశాడు!
బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ హవా ఓ రేంజ్లో కొనసాగుతోంది. ఇప్పటికే ఆల్ టైమ్ రికార్డ్స్ సృష్టించిన పుష్ప-2 మరో ఘనతను సొంతం చేసుకుంది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ మూవీ విడుదలైన 15 రోజుల్లోనే రూ.632 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. దీంతో హిందీ సినిమా చరిత్రలోనే అత్యంత వేగంగా అత్యధిక నెట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది.అంతేకాకుండా వసూళ్ల పరంగా గత వందేళ్ల బాలీవుడ్ చరిత్రలోనే నంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని పుష్ప టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన పుష్ప-2 తొలి రోజు నుంచే రికార్డుల వేట మొదలుపెట్టింది. రూ.294 కోట్లతో మొదలైన పుష్ప రాజ్ ప్రభంజనం ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది.కాగా.. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియాలోనూ అత్యధిక వసూళ్లు తొలి ఇండియన్ మూవీగా ఘనత సాధించింది. అటు యూఎస్‌లోనూ తిరుగులేని కలెక్షన్లతో దూసుకెళ్తోంది. పుష్పకు సీక్వెల్‌గా ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషించారు. #Pushpa2 creates a new RECORD in 100 Years of BOLLYWOOD HISTORY 🔥🔥🔥#Pushpa2TheRule becomes the BIGGEST HINDI NETT of ALL TIME in just 15 days 💥💥💥 #HargizJhukegaNahin pic.twitter.com/uLmeZ0yoYJ— Pushpa (@PushpaMovie) December 20, 2024 The NUMBER ONE BLOCKBUSTER in the HISTORY OF HINDI CINEMA 🔥🔥#Pushpa2TheRule collects 632.50 CRORES NETT in Hindi - THE HIGHEST EVER FOR ANY HINDI FILM ❤🔥Book your tickets now!🎟️ https://t.co/eJusnmNS6Y#Pushpa2#WildFirePushpa pic.twitter.com/LWJa7W2JxT— Pushpa (@PushpaMovie) December 20, 2024 -
పుష్ప రాజ్ వసూళ్ల సునామీ.. రెండు వారాల్లోనే ఆ మార్క్ దాటేశాడు!
అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం పుష్ప-2 ది రూల్. ఈ నెల 5న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్ల మార్క్ చేరుకున్న పుష్ప-2 కలెక్షన్ల మాస్ జాతర ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే నార్త్‌లో ఏకంగా రూ.600 కోట్లకు పైగా నెట్ వసూళ్లతో సరికొత్త రికార్డ్ సృష్టించాడు పుష్పరాజ్.ఇప్పటికీ పుష్ప-2 రిలీజై రెండు వారాలు పూర్తి చేసుకుంది. దీంతో మేకర్స్ అధికారికంగా పుష్ప-2 వసూళ్లను రివీల్ చేశారు. ఈ మూవీ విడుదలైన 14 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్ల మార్క్‌ను దాటేసింది. దీంతో ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యంత వేగంగా 1500 కోట్ల వసూళ్ల సాధించిన చిత్రంగా ఘనతను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ ఎక్స్ (ట్విటర్) ద్వారా వెల్లడించింది. COMMERCIAL CINEMA REDEFINED 🔥HISTORY MADE AT THE BOX OFFICE 💥💥#Pushpa2TheRule collects 1508 CRORES GROSS WORLDWIDE - the fastest Indian Film to reach the mark ❤🔥#Pushpa2HitsFastest1500crBook your tickets now!🎟️ https://t.co/eJusnmNS6Y#Pushpa2#WildFirePushpa… pic.twitter.com/vk0qnXLOt0— Pushpa (@PushpaMovie) December 19, 2024 The HISTORIC RULE at the box office continues 💥💥#Pushpa2TheRule becomes the FASTEST INDIAN FILM to Gross 1500+ CRORES WORLDWIDE in 14 Days ❤🔥1508CR & counting 🔥#Pushpa2HitsFastest1500crBook your tickets now!🎟️ https://t.co/tHogUVEOs1#Pushpa2#WildFirePushpaIcon… pic.twitter.com/AQueWAv9Gp— Mythri Movie Makers (@MythriOfficial) December 19, 2024 -
శ్రీతేజ్‌ను పరామర్శించిన పుష్ప-2 డైరెక్టర్ సుకుమార్
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడిని డైరెక్టర్ సుకుమార్ పరామర్శించారు. హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన సుకుమార్.. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మా తరఫున బాలుడి కుటుంబానికి అవసరమైన సాయాన్ని అందిస్తామని సుకుమార్ హామీ ఇచ్చారు. అయితే అంతకుముందే సుకుమార్ భార్య తబిత బాలుడికి కుటుంబానికి ఆర్థికసాయం అందించారు. డిసెంబర్ 9వ తేదీన శ్రీతేజ్ తండ్రికి రూ.5 లక్షల సాయం చేశారు.అసలేం జరిగిందంటే..ఈనెల 5న అల్లు అర్జున్ మూవీ పుష్ప-2 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. అయితే ముందురోజే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలు ప్రదర్శించారు మేకర్స్. డిసెంబర్ 4న సినిమా వీక్షించేందుకు అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కు వెళ్లారు. అదే సమయంలో అభిమాన హీరోను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్‌పై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆ బాలుడు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.అల్లు అర్జున్‌పై కేసు..సంధ్య థియేటర్ ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో హీరో అల్లు అర్జున్ను నిందితుడిగా చేర్చారు. అంతేకాకుండా బన్నీని అరెస్ట్ చేసి రిమాండ్‌కు కూడా తరలించారు. అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో మరుసటి రోజు ఉదయమే జైలు నుంచి విడుదలయ్యారు. -
సెట్స్ పైకి రంగస్థలం సీక్వెల్
-
'పుష్ప' రాజ్ యూనిక్ సాంగ్ విడుదల
అల్లు అర్జున్- సుకుమార్ కాంబో హిట్ సినిమా ‘పుష్ప 2 ది రూల్’. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. అయితే, తాజాగా ఈ చిత్రం నుంచి బన్నీ యూనిక్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫీలింగ్స్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో వీడియో సాంగ్‌ను విడుదల చేయడంతో ఆయన అభిమానులు వైరల్ చేస్తున్నారు.'పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్' అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్ పలు భాషల్లో 250+ మిలియన్ వ్యూస్ సాధించింది. ఇప్పుడు ఇదే సాంగ్ వీడియో రూపంలో తాజాగా విడుదలైంది. తెలుగులో నకాశ్ అజీజ్, దీపక్ బ్లూ ఆలపించగా దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్‌ను అందించారు. -
ఇంటికొచ్చేసిన అల్లు అర్జున్.. టాలీవుడ్ ప్రముఖుల సంఘీభావం (ఫొటోలు)
-
అల్లు అర్జున్‌ని హత్తుకుని సుకుమార్ ఎమోషనల్
జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన అల్లు అర్జున్.. ఇంటికొచ్చేశాడు. మీడియాతో మాట్లాడుతూ తనకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు చెప్పాడు. ఈ క్రమంలోనే బన్నీని కలిసేందుకు సినీ ప్రముఖులు అతడి ఇంటికి వస్తున్నారు. మిగతా వాళ్ల సంగతేమో గానీ దర్శకుడు సుకుమార్ మాత్రం బన్నీని హత్తుకుని ఎమోషనల్ అయిపోయాడు.(ఇదీ చదవండి: కావాలనే జైల్లో ఉంచారు.. పోలీసులపై కేసు పెడతాం: బన్నీ లాయర్)ఇంటికొచ్చి బన్నీని కలిసిన వాళ్లలో చిరంజీవి భార్య సురేఖతో పాటు నిర్మాతలు నవీన్ యెర్నేని, దిల్ రాజు ఉన్నారు. అలానే హీరో విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, రానా, నాగచైతన్య, శ్రీకాంత్, సీనియర్ దర్శకుడు రాఘవేంద్ర రావు, యంగ్ డైరెక్టర్స్ హరీశ్ శంకర్, వశిష్ఠ తదితరులు ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.రీసెంట్గా 'పుష్ప 2'తో బ్లాక్ బస్టర్ అందుకున్న సుకుమార్ మాత్రం బన్నీని ఇంట్లో కలిసిన తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న ఫుల్ ఎమోషనల్ అయ్యాడు. కూర్చుని వీళ్లిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. ఇకపోతే సంధ్య థియేటర్ దగ్గర మహిళా మృతి చెందిన కేసులో తొలుత బన్నీని అరెస్ట్ చేశారు. తర్వాత కోర్టు.. 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. (ఇదీ చదవండి: ఇంటికొచ్చేసిన అల్లు అర్జున్.. మీడియాతో ఏమన్నాడంటే?)#Sukumar sir " We Love You " ♥️🥺@alluarjun #WeStandWithAlluArjun pic.twitter.com/aq4S8cvitj— Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) December 14, 2024 -
సుకుమార్ పూర్తి పేరు చెప్పి అందరినీ కన్ఫ్యూజ్ చేసిన అల్లు అర్జున్
అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'పుష్ప 2'. ఈ మూవీ విడుదలైన ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్లో చేరడంతో చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంది. ఈ మూవీ ఇంతటి విజయానికి కారణమైన అందరికీ ధన్యవాదాలు చెబుతూ థాంక్యూ ఇండియా పేరుతో ఢిల్లీలో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు, ఎగ్జిబిటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేదికపై అల్లు అర్జున్ మాట్లాడుతూ మొదటిసారి దర్శకుడు సుకుమార్ పూర్తి పేరును రివీల్ చేశారు.'పుష్పపై ఇది లవ్ కాదు.. వైల్డ్ లవ్. పుష్ప2 విజయం క్రెడిట్ అంతా ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌ను రూల్ చేస్తోన్న మా దర్శకుడు 'బండిరెడ్డి సుకుమార్ రెడ్డి'కి చెందుతుంది. ఆయన విజన్ నుంచే ఈ సినిమా పుట్టింది. ఈ చిత్రం కోసం ఆయన హార్డ్ వర్క్ చాలా ఎక్కువ ఉంది. ఈ విజయం క్రెడిట్ మొత్తం నీ సొంతమే డార్లింగ్' అంటూ సుకుమార్‌పై బన్నీ ప్రశంసలు కురిపించారు.సుకుమార్ పేరుతో నెటిజన్లకు పరీక్ష పెట్టిన బన్నీటాలీవుడ్లో ఇప్పటి వరకు సుకుమార్గా అందరికి ఆయన పరిచయమే.. అయితే, మొదటిసారి ఆయన్ను 'బండిరెడ్డి సుకుమార్ రెడ్డి' అని అల్లు అర్జున్ కామెంట్ చేయడంతో నెటిజన్లు అందరూ కాస్త తికమక అయ్యారు. వాస్తవంగా ఆయన పేరు సుకుమార్ బండిరెడ్డి అని నెట్టింట కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఆయన తండ్రి పేరు తిరుపతి రావు నాయుడు అని ఆయన వికిపీడియాలో కూడా ఉంది. బన్నీ చేసిన కామెంట్‌తో ఆయన ఏ సామాజిక వర్గానికి చెందుతారోనని గూగుల్‌లో నెటజన్లు తెగ వెతుకుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా, రాజోలు సమీపంలోని మట్టపర్రు గ్రామంలో సుకుమార్ జన్మించారు. దర్శకుడు కాక ముందు గణితం అధ్యాపకుడిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. 2004లో ఆయన మొదటి చిత్రం 'ఆర్య' సంచలన విజయం సాధించి అల్లు అర్జున్ను స్టార్‌గా నిలబెట్టింది. -
'పుష్ప2' రికార్డ్స్‌పై అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు
ప్రపంచవ్యాప్తంగా 'పుష్ప' ట్రెండ్ కొనసాగుతుంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎక్కడ చూసిన భారీ వసూళ్లతో అనేక రికార్డ్స్ దాటుకుని దూసుకెళ్తున్న ఈ సినిమా విడుదలైన 6 రోజుల్లోనే రూ.1002 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. విడుదలైన ఆరు రోజుల్లోనే అత్యంత వేగంగా వెయ్యి కోట్ల మైలురాయిని అందుకున్న చిత్రంగా పుష్ప2 రికార్డ్ క్రియేట్ చేసింది. బాలీవుడ్లో కూడా ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 375 కోట్లు వసూలు చేసింది. అక్కడ ఇంత వేగంగా ఈస్థాయి వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. తాజాగా థ్యాంక్యూ ఇండియా పేరుతో ఢిల్లీలో ఒక మీడియా సమావేశాన్ని పుష్ప టీమ్ ఏర్పాటు చేసింది. అందులో చిత్ర నిర్మాతలతో పాటు అల్లు అర్జున్, సుకుమార్ పాల్గొన్నారు. భారీ కలెక్షన్స్, పుష్ప క్రియేట్ చేసిన రికార్డ్స్‌పై అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశారు.'రికార్డ్స్ అనేవి శాశ్వితంగా ఉండిపోవు. బహుశా వచ్చే సమ్మర్లోనే పుష్ప క్రియేట్ చేసిన రికార్డ్స్ శ్మాస్ కావచ్చు కూడా.. నంబర్స్ అనేవి ఎప్పటికీ శాశ్వంతగా ఉండిపోవని నేను నమ్ముతాను. రూ. 1000 కోట్లు అనేది అభిమానుల ప్రేమకు ప్రతిబింబం. ఈ నంబర్స్ తాత్కాలికంగా ఉంటాయి. కానీ, వాళ్ల ప్రేమ మాత్రమే శాశ్వతంగా ఉంటుంది. రికార్డులు అనేవి ప్రతిసారీ బద్దలవుతూనే ఉండాలి. కొత్త రికార్డులు క్రియేట్ అవుతూనే ఉండాలని నేను ఎక్కువగా నమ్ముతా. మరో మూడు నెలలపాటు ఈ సంతోషాన్ని ఎంజాయ్ చేస్తాను. వచ్చే వేసవిలోపు ఈ రికార్డులన్నీ బద్దలు కావాలని కోరుకుంటున్నా. తెలుగు, తమిళ్, కన్నడ,హిందీ పరిశ్రమ ఏదైనా కావచ్చు వచ్చే పుష్ప రికార్డ్స్‌ను మరో సినిమా దాటాలని నేను కోరుకుంటున్నాను. ఇండస్ట్రీలో పురోగతి అనేది ఉండాలని ఆశిస్తున్నాను.'బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కల్కి 2898 ఏడీ తర్వాత ఇంతటి భారీ వసూళ్లు రాబట్టిన తెలుగు చిత్రంగా పుష్ప రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఫుల్ రన్లో కొనసాగుతున్న ఈ చిత్రం సుమారు రూ. 1500 కోట్ల కలెక్షన్స్ అందుకోవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.#AlluArjun about 1000cr in todays #Pushpa2TheRule event:"The 1000cr number is just reflection of Love. Number is temporary & but love is forever. I want these numbers to be broken at least by next summer irrespective of any Industry. That is progression" pic.twitter.com/NjUnwlciBA— AmuthaBharathi (@CinemaWithAB) December 12, 2024 -
ఆస్కార్ కు ట్రై చేద్దాం అంటున్న అల్లు అర్జున్
-
బాక్సాఫీస్ బాద్షాగా పుష్పరాజ్.. ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్లు దాటేశాడు!
బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ సునామీ కొనసాగుతోంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం వెయ్యి కోట్ల మార్కును దాటేసింది. కేవలం ఆరు రోజుల్లోనే ఈ రికార్డ్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఆరు రోజుల్లోనే రూ.1002 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత వేగవంతగా రూ. 1000 కోట్లు కలెక్ట్ చేసిన తొలి చిత్రంగా సరికొత్త రికార్డును నెలకొల్పింది.(ఇది చదవండి: 'పుష్ప 2' ఐదు రోజుల కలెక్షన్స్.. రూ.1000 కోట్లకు చేరువ)తొలిరోజు రూ.294 కోట్లతో మొదలైన పుష్ప ప్రభంజనం ఇప్పటికీ కొనసాగుతోంది. హిందీలో ఏ బాలీవుడ్ చిత్రం సాధించిన రికార్డులు సృష్టిస్తోంది. భారత సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. నార్త్‌లో ఇప్పటికే అత్యధిక వసూళ్లు సాధించిన నాన్ హిందీ చిత్రంగా పుష్ప -2 రికార్డులకెక్కింది. కేవలం ఆరు రోజుల్లోనే రూ.375 కోట్లు కలెక్ట్ చేసిన తొలి నాన్ హిందీ చిత్రంగా నిలిచింది. THE BIGGEST INDIAN FILM rewrites history at the box office 💥💥💥#Pushpa2TheRule becomes the FASTEST INDIAN FILM to cross 1000 CRORES GROSS WORLDWIDE in 6 days ❤🔥#PUSHPA2HitsFastest1000CrSukumar redefines commercial cinema 🔥Book your tickets now!🎟️… pic.twitter.com/c3Z6P5IiYY— Pushpa (@PushpaMovie) December 11, 2024 -
'పుష్ప 2' ఐదు రోజుల కలెక్షన్స్.. రూ.1000 కోట్లకు చేరువ
'పుష్ప 2' మూవీకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. రోజురోజుకీ వందల కోట్ల కలెక్షన్స్ సాధిస్తున్న ఈ చిత్రం.. ఐదో రోజు పూర్తయ్యేసరికి రూ.1000 కోట్ల మార్క్ దాటేస్తుందని అనుకున్నారు. కానీ కాస్త దగ్గరకు వచ్చి ఆగిపోయింది. సోమవారం.. వర్కింగ్ డే కావడంతో ఓ మేరకు వసూళ్లు తగ్గాయి. ఇంతకీ ఇప్పటివరకు వచ్చిన మొత్తం కలెక్షన్ ఎంత?(ఇదీ చదవండి: 'పుష్ప 2' కాదు.. అసలు కథ ముందుంది!)తొలి వీకెండ్‌ని అద్భుతంగా ముగించిన 'పుష్ప 2'కి ఆదివారం ముగిసేసరికి రూ.829 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. వీకెండ్ కావడంతో దేశవ్యాప్తంగా థియేటర్లన్నీ కళకళాలాడిపోయాయి. అయితే సోమవారం వర్కింగ్ డే కావడంతో ఉదయం షోలతో పోలిస్తే ఈవినింగ్ షోలు ఫూల్ అయ్యాయి. దీంతో ఐదోరోజు కేవలం రూ.97 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. ఈ మేరకు అధికారికంగా నిర్మాణ సంస్థ పోస్టర్ రిలీజ్ చేసింది.ఓవరాల్‌గా చూసుకుంటే ఐదు రోజుల్లో 'పుష్ప 2' సినిమాకు రూ.922 కోట్ల గ్రాస్ వచ్చింది. అయితే మంగళవారం వసూళ్లతో రూ.1000 కోట్ల రౌండ్ ఫిగర్ అవుతుందా లేదంటే బుధవారం వరకు ఎదురుచూడాలా అనేది మరో రోజు గడిస్తే తేలుతుంది. నాలుగంకెల నంబర్ మరో ఒకటి రెండు రోజుల్లో దాటేస్తుంది గానీ లాంగ్ రన్లో ఎన్ని వందల కోట్లు వస్తాయనేది ఇప్పుడు అందరికి వస్తున్న సందేహంగా మారింది.(ఇదీ చదవండి: ఓటీటీలో హారర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్)922 CRORES GROSS for #Pushpa2TheRule in 5 days 💥💥 A record breaking film in Indian Cinema - the fastest to cross the 900 CRORES milestone ❤🔥RULING IN CINEMAS.Book your tickets now!🎟️ https://t.co/tHogUVEgCt#Pushpa2#WildFirePushpaIcon Star @alluarjun @iamRashmika… pic.twitter.com/wXO9GmcTt9— Mythri Movie Makers (@MythriOfficial) December 10, 2024 -
పార్టీ చేసుకున్న 'పుష్ప'.. శ్రీవల్లి మిస్!
'పుష్ప 2'.. పాన్ ఇండియా హిట్ కొట్టేసింది. బాక్సాఫీస్ దగ్గర నమోదవుతున్న నంబర్స్ దీనికి నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల్లో రూ.829 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. అయితే మూవీలో 'పార్టీ లేదా పుష్ప' అని డైలాగ్ ఉంటుంది కదా. మరి సినిమా ఇంత సక్సెస్ అయింది. దీంతో టీమ్ అంతా ఇప్పుడు పార్టీ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: సడెన్‌గా ఓటీటీలో 'తంగలాన్' సినిమా)తాజాగా జరిగిన ఈ పార్టీలో హీరో అల్లు అర్జున్‌తో పాటు డైరెక్టర్ సుకుమార్, నిర్మాతలు, 'కిస్సిక్' బ్యూటీ శ్రీలీల, దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ కూబా.. ఇలా అందరూ కనిపించారు. హీరోయిన్ శ్రీవల్లి మాత్రం కనిపించలేదు. ఆమె కూడా వచ్చుంటే ఫొటో నిండుగా ఉండేది. దాదాపు ఐదేళ్ల పాటు సినిమా కోసం కష్టపడ్డారు. ఇప్పుడు పార్టీ చేసుకుని ఫుల్ చిల్ అయినట్లున్నారు.'పుష్ప 2' సినిమాకు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలో బాగానే వసూళ్లు వస్తున్నాయి. ఉత్తరాదిలో మాత్రం ఎగబడి మరీ చూస్తున్నారు. ఎందుకంటే నాలుగు రోజుల్లో హిందీ వెర్షన్ నెట్ వసూళ్లే రూ.339 కోట్లు రావడం విశేషం. ప్రస్తుతం ఊపు చూస్తుంటే నేడో రేపో రూ.1000 కోట్ల మార్క్ దాటేస్తుంది. మరి మొత్తంగా 'బాహుబలి 2' రికార్డులని దాటేస్తుందా? దగ్గరకెళ్లి ఆగిపోతుందా అనేది చూడాలి?(ఇదీ చదవండి: 'పుష్ప2'పై సిద్ధార్థ్ వ్యాఖ్యలు.. అల్లు అర్జున్స్ ఫ్యాన్స్ ఆగ్రహం) -
డైలాగ్స్ లేవ్ కానీ 'పుష్ప 2' దెబ్బకు ఫేమస్.. ఎవరీ నటి? (ఫొటోలు)
-
'పుష్ప2' ఫస్ట్ వీకెండ్ పూర్తి.. ఎన్ని కోట్లు వచ్చాయంటే..?
పుష్ప2 రికార్డుల మోత కొనసాగుతూనే ఉంది. ఫస్ట్ వీకెండ్లో ఇంత వరకు ఎవరూ సాధించలేని కలెక్షన్లను పుష్ప2 నమోదు చేసింది. విడుదల రోజు నుంచి మొదలైన ఈ జాతర ఎక్కడ వరకు కొనసాగుతుందో ఊహించడం కాస్త కష్టమేనని చెప్పవచ్చు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు 'పుష్ప'గాడి రూల్ ఏలా ఉంటుందో బాక్సాఫీస్ లెక్కలతో చూపిస్తున్నాడు. ఒక రికార్డు పోస్టర్ వేసేలోగా ఇంకో రికార్డు క్రియేట్ చేస్తూ.. అల్లు అర్జున్ సత్తా చాటుతున్నాడు.అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప2 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మొదటి వీకెండ్‌లోని కేవలం నాలుగురోజుల్లో రూ. 829 కోట్లు రాబట్టి భారీ రికార్డ్‌ను సెట్ చేసింది. ఇప్పటి వరకు ఫస్ట్ వీకెండ్లో కేజీఎఫ్2 రూ.442 కోట్ల గ్రాస్ రాబట్టి టాప్ ప్లేస్‌లో ఉండేది. ఇప్పుడు ఆ రికార్డ్‌ను పుష్ప అందుకున్నాడు. ఇలా రికార్డ్ ఏదైనా సరే అంటూ బాక్సాఫీస్ వద్ద ఊచకోత మొదలెట్టాడు. ఇప్పటి వరకు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఉన్న రికార్డ్స్ అన్నీ పుష్ప దెబ్బకు తుడిచిపెట్టుకుపోయాయి.అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో సూపర్ హిట్ సినిమాగా పుష్ప2 ఉండనుంది. తొలిరోజు రూ.294 కోట్లు వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం డిసెంబర్ 8 ఆదివారంతో మొదటి వీకెండ్ పూర్తి చేసుకుంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 829 కోట్లు రాబట్టి పలు రాష్ట్రాల్లోనూ అనేక రికార్డులను నెలకొల్పింది. మొదటి వారం పూర్తి అయ్యే సరికి కేవలం బాలీవుడ్లోనే రూ. 291 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించి ఎవరూ అందుకోలేనంత రేంజ్లో రికార్డ్‌ను సెట్ చేశాడు. -
అల్లు అర్జున్ కు ఎలాన్ మస్క్ స్పెషల్ గిఫ్ట్..
-
ఇక్కత్ పట్టు.. పుష్ప హిట్టు
భూదాన్‌పోచంపల్లి: ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదలై రికార్డులు సృష్టిస్తున్న సుకుమార్ ‘పుష్ప 2’సినిమాలో పోచంపల్లి ఇక్కత్ వస్త్రా లు వెండి తెరపై తళుక్కుమన్నాయి. పోలీస్ ఆఫీసర్ బన్వర్సింగ్ షెకావత్‌తో.. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకొన్నావా, పుష్ప అంటే వైల్డ్ ఫైర్’అనే డైలాగ్ చెప్పినప్పుడు.. హీరో అల్లు అర్జున్ బీరపువ్వు రంగు పోచంపల్లి ఇక్కత్ సీకో పట్టు షర్ట్ ధరించాడు. కాగా పుష్ప 2 సిని మా షూటింగ్‌ను పోచంపల్లిలో మూడు రోజు ల పాటు నిర్వహించారు. ఆ సందర్భంగా పోచంపల్లికి వచి్చన చిత్రం యూనిట్ ఇక్కత్ వ ్రస్తాలు కొనుగోలు చేసి ఉంటారని వస్త్ర వ్యాపారులు తెలిపారు. కాగా పోచంపల్లి మార్కెట్లో అల్లు అర్జున్ ధరించిన ఇక్కత్ డిజైన్ చేనేత వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. -
తెర వెనక శ్రీవల్లి.. 'పుష్ప 2'ని మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)
-
ఊహించని కలెక్షన్స్‌తో భారతీయ సినిమాని ఏలుతున్న అల్లు అర్జున్
-
సుకుమార్ సంస్కారానికి ఫిదా అవ్వాల్సిందే!
సొమ్ము ఒకడిది సోకు మరొకనిది అనే సామెత తెలుసు కదా.. ఇది చిత్ర పరిశ్రమకు బాగా సూట్ అవుతుంది. కష్టపడి పని చేసేది ఒకరు అయితే క్రెడిట్ కొట్టేసిది మరొకరు. కనీసం స్క్రీన్‌పై వాళ్ల పేర్లను కూడా వేయడానికి ఇష్టపడని వాళ్లు చాలా మందే ఉన్నారు. కానీ డైరెక్టర్ సుకుమార్ ఇందుకు విరుద్దం. తనతో పని చేసిన టీమ్ మొత్తానికి క్రెడిట్ ఇస్తాడు. అది కూడా ఏదో ఇవ్వాలి కదా అన్నట్లు కాకుండా మనస్ఫూర్తిగా ఇచ్చేస్తుంటాడు. తనదగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్‌గా పని చేసిన వారి టాలెంట్‌ని ప్రపంచానికి తెలియజేయడానికి ఆరాటపడతుంటాడు. సమయం దొరికినప్పుడల్లా వారి ప్రతిభ గురించి మాట్లాడుతుంటాడు. తాజాగా పుష్ప 2 సక్సెస్ మీట్లో కూడా సుకుమార్ తన టీమ్ గురించి గొప్పగా మాట్లాడాడు.పుష్ప 2 విజయం వెనుక తన టీమ్ కష్టం చాలా ఉందని గర్వంగా చెప్పాడు. టీమ్ మొత్తాన్ని స్టేజ్‌పైకి పిలిచి ఒక్కొక్కరు చేసిన వర్క్, వారి ప్రతిభ గురించి చెబుతూ.. పుష్ప 2 సక్సెస్ క్రెడిట్ వారికే ఇచ్చాడు. అంతేకాదు ‘పుష్ప 2 సినిమాకు నేను దర్శకుడిని కాదు.. వీళ్లంతా దర్శకులే. పొరపాటున నా పేరు వేసుకున్నా..’అని సుకుమార్ చెప్పడం నిజంగా ఆయనకు ఉన్న సంస్కారానికి నిదర్శనం.‘మూడు గంటల పాటు ప్రేక్షకులు మా సినిమాను చూడాలని నేను, నా చిత్ర బృందం చాలా కష్టపడి చేశాం. 10 నిమిషాల్లో ఓ సన్నివేశం రాసే వాళ్లు నా దర్శకత్వ టీమ్‌లో ఉన్నారు. నా టీమ్‌లోని వారంతా సుకుమార్‌లే.. అందరూ నాలాంటి దర్శకులే. ఈ విజయానికి కారణం చిత్రబృందం అందరిదీ’అని సుకుమార్ చెబుతుంటే.. వెనుక ఉన్న టీమ్‌తో పాటు ముందున్న బన్నీ కళ్లు కూడా చెమ్మగిల్లాయి.ఓ సినిమా మాములుగా హిట్ అయితేనే ఆ క్రెడిట్ అంతా తనదే అని చెప్పుకుంటారు కొంతమంది దర్శకులు. కథ, స్క్రీన్‌ప్లే విషయంలో సహాయం చేసిన వారి పేర్లను కూడా స్క్రీన్‌పై పడకుండా జాగ్రత్తపడతారు. మరికొంతమంది బడా దర్శకులు అయితే.. తన అసిస్టెంట్స్ దర్శకత్వం వహించిన సినిమాలకు కూడా తన పేరే వేయించుకుంటారు. ఇలాంటి ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ అందించి, ఆ క్రెడిట్ తన టీమ్‌కి ఇవ్వడం సుకుమార్ మంచితనం. మాటల వరకు మాత్రమే పరిమితం కాకుండా.. వాళ్ల కెరీర్ గ్రోత్‌కి సహాయం అందిస్తుంటాడు. తన నిర్మాణ సంస్థలో సినిమాలు చేసే అవకాశం కల్పిస్తాడు. ఇప్పటికే సుకుమార్ దగ్గర పని చేసిన బుచ్చిబాబు, శ్రీకాంత్ ఓదెల స్టార్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరారు. త్వరలోనే మరికొంత మంది కూడా మెగా ఫోన్ పట్టడానికి రెడీగా ఉన్నారు. -
సుకుమార్‌కి రుణపడి ఉంటాను: అల్లు అర్జున్
‘‘దేశం నలుమూలల నుంచి మా ‘పుష్ప 2’ యూనిట్‌కి స΄ోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. ప్రపంచంలో ఉన్న తెలుగువారికి, భారతీయులకు థ్యాంక్స్. ఒక సినిమా ఇంత పెద్ద విజయం సాధించడానికి కారణం డైరెక్టర్ కాబట్టి సుకుమార్‌గారికి «థ్యాంక్స్. నన్ను ఎక్కడో ఒక స్థాయిలో నిలబెట్టినందుకు ఆయనకు రుణపడి ఉంటాను’’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మికా మందన్నా జంటగా నటించిన చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌పై యలమంచిలి రవిశంకర్, నవీన్ ఎర్నేని నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 6 భాషల్లో ఈ నెల 5న విడుదలైంది.శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘పుష్ప 2’ వైల్డ్ ఫైర్ సక్సెస్‌మీట్‌లో అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘పుష్ప 2’ వసూళ్లు చూస్తుంటే సినిమాను ఎంత మంది ప్రేక్షకులు చూశారో అర్థం అవుతోంది. చిత్రబృందం తరఫున, తెలుగువారందరి తరఫున ప్రపంచ సినీ ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. మా సినిమాకి ఎంతో సహకారం అందించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిగారికి, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌గారికి థ్యాంక్స్. దేశంలో మా సినిమాకు స΄ోర్ట్ ఇచ్చిన అన్ని సినిమా ఇండస్ట్రీలకు ధన్యవాదాలు’’ అన్నారు. ఆ సంఘటన చాలా బాధ కలిగించింది ‘‘నేను ‘పుష్ప 2’ చేయడానికి ముఖ్య కారణం ఈ సినిమా తెలుగువారందరూ గర్వంగా చెప్పుకునేలా చేస్తుందనే నమ్మకంతోనే. అనుకోకుండా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటనలో రేవతిగారి మృతి మమ్మల్ని ఎంతగానో కదిలించింది. గత ఇరవయ్యేళ్లుగా అభిమానులతో కలిసి సినిమా చూస్తున్నాను. అయితే ఎప్పుడూ ఇలా జరగలేదు. డిసెంబరు 4న వేసిన ప్రీమియర్ షోకి ఎక్కువ జనం ఉండటంతో ఇబ్బంది అవుతుందని థియేటర్ యాజమాన్యం చెప్పగానే నేను వెళ్లి΄ోయాను. ఇంటికి వచ్చిన తర్వాత రేవతిగారి సంఘటన తెలిసి చాలా బాధ కలిగింది. ఆ కుటుంబం కోసం 25 లక్షలు కేవలం ఒక సాయంగా ఇస్తున్నాను. అయినా ఒక మనిషి లేని లోటు ఎవరూ తీర్చలేం. ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా. అంతా కుదుటపడిన తర్వాత వ్యక్తిగతంగా వెళ్లి ఆ కుటుంబాన్ని కలుస్తాను’’ అని పేర్కొన్నారు అల్లు అర్జున్. సుకుమార్ మాట్లాడుతూ– ‘‘ముందుగా రాజమౌళిగారికి థ్యాంక్స్ చె΄్పాలి. ఈ సినిమాను ఇంతగా ్ర΄ోత్సహించింది, పాన్ ఇండియా రిలీజ్ చేయాలని చెప్పింది ఆయనే. 3 గంటల పాటు ప్రేక్షకులు మా సినిమాను చూడాలని నేను, నా చిత్ర బృందం చాలా కష్టపడి చేశాం. 10 నిమిషాల్లో ఓ సన్నివేశం రాసే వాళ్లు నా దర్శకత్వ టీమ్‌లో ఉన్నారు. నా టీమ్‌లోని వారంతా సుకుమార్‌లే.. అందరూ నాలాంటి దర్శకులే. ఈ విజయానికి కారణం చిత్రబృందం అందరిదీ. మూడు రోజులుగా నేను ఆనందంగా లేను. ఎందుకంటే జరిగిన ఘటన (రేవతి మృతి) అలాంటిది. వారి కుటుంబానికి మేము ఎప్పుడూ అండగా ఉంటాం’’ అని తెలిపారు. ‘‘మా సినిమాని ఇంతగా ఆదరించిన తెలుగు ప్రజలందరికీ థ్యాంక్స్. వేగంగా రూ. 500 కోట్లు వసూలు చేసిన సినిమాగా ‘పుష్ప 2’ రికార్డు సృష్టించింది. ఈ సినిమా ఇంతటి విజయం సాధించడం భారతీయులందరికీ గర్వకారణం’’ అన్నారు నవీన్ ఎర్నేని. ‘‘పుష్ప 2’ రెండు రోజులకు రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసినందుకు ఆనందంగా ఉంది. టికెట్ ధర 800 ప్రీమియర్ షోకి మాత్రమే.. ఆ తర్వాత సాధారణ ధరలతోనే అందుబాటులో ఉన్నాయి. అందరూ కచ్చితంగా సినిమాని చూడాలి’’ అని యలమంచిలి రవిశంకర్ కోరారు. -
Pushpa 2 : ‘పుష్ప’ పాత్రపై ఆర్జీవీ రివ్యూ
అంతా అనుకున్నట్లే పుష్ప 2 మూవీ రికార్డులను బద్దలు కొడుతోంది. దేశం మొత్తం ఇప్పుడు ఎక్కడ చూసినా .. పుష్ప 2 మూవీ గురించే చర్చిస్తున్నారు. అల్లు అర్జున్ నటన, సుకుమార్ టేకింగ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తొలి రోజు ఏకంగా రూ.294 కోట్ల కలెక్షన్స్ రాబట్టి.. అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అంతటా.. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. సినీ ప్రముఖులంతా ఈ సినిమాను పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక ముందు నుంచి కూడా పుష్ప 2 చిత్రానికి తన మద్దతు ప్రకటిస్తున్న ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తాజాగా ఈ మూవీపై తనదైన శైలీలో రివ్యూ ఇచ్చాడు. ‘పుష్ప 2 చిత్రంలోని పుష్ప పాత్రపై నా రివ్యూ’ అంటూ ఓ సుదీర్ఘమైన పోస్ట్‌ని ఎక్స్(ట్విటర్) షేర్ చేస్తూ.. భారతీయ సినీ చరిత్రలోనే పుష్ప లాంటి పదునైన పాత్రను చూడడం చాలా అరుదని అన్నారు. ఓ స్టార్ హీరో ఇమేజ్‌ని పక్కనపెట్టి పాత్ర కోసం సినిమా చూడడం పుష్ప 2 చిత్రానికి సాధ్యమైందని ప్రశంసించాడు.‘పుష్ప వంటి పాత్రను చూడటం చాలా అరుదు. ఒక వీక్షకుడిగా నేను సినిమా చూసినప్పుడు నిజంగా పుష్ప లాంటి పాత్ర బయట ఉందని నమ్మాను. ఇలా ఓ కమర్షియల్ ఫార్మాట్లో క్రియేట్ చేసిన పాత్రను వాస్తవికతకు దగ్గరగా ఉన్నట్లు చూపించడం అంత సులభతరమైన పని కాదు.పుష్పరాజు పాత్రలో గమనిస్తే..అమాయకత్వం, చాకచక్యంతో మిళితమై ఉంటాయి. అలాగే దుర్బలత్వంతో కూడిన సూపర్ అహం వంటి అత్యంత విరుద్ధమైన లక్షణాలన్నీ ఈ పాత్రలో కనిపిస్తాయి. వైకల్యంతో ఉన్న వ్యక్తి సూపర్ యాక్షన్ హీరో అవుతాడని నేను ఎప్పుడూ నమ్మలేదు. ఎందుకంటే సూపర్ హీరో అనేవాడు ఫర్ఫెక్ట్గా ఉంటాడని మాత్రమే మనం చూశాం. కానీ పుష్ప పాత్రలో అల్లు అర్జున్ ఆ వైకల్యాన్ని శక్తిగా మార్చారు. మునుపెన్నడూ చూడని బాడీ లాంగ్వేజ్,హావభావాలు ఆ పాత్రకు మరింత బలమైన బలాన్ని అందించాయి. ఈ పాత్రని దశాబ్దాల కాలం పాటు ప్రేక్షకుల గుర్తు పెట్టుకుంటారు. అంతేకాదు చాలా మందికి రిఫరెన్స్ పాయింట్‌గా పుష్ప పాత్ర ఉంటుంది. ఏ నటుడైనా తనకు సంబంధించిన సన్నివేశాల్లో బెస్ట్ ఫెర్మార్మెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఈ పాత్ర కోసం ప్రాణం పెట్టేశాడు. కొన్ని అవాస్తవిక దృశ్యాలు కూడా నిజమైనవిగా అనిపించేంత పరిపూర్ణతను ప్రదర్శించారు. కేవడం బాడీ లాంగ్వేజ్‌తో మాత్రమే కాకుండా ఎమోషన్స్ సీన్లని కూడా ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా నటించాడు. సీఎం సెల్ఫీకి నిరాకరించినప్పుడుకానీ, బాగా తాగి తన అహంకారాని పక్కన పెట్టి సారీ చెప్పే సీన్ కానీ.. అన్నింట్లిలోనూ అద్భుతంగా నటించాడు.ఇది చెప్పడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా.. పుష్పరాజ్ జర్నీని చూస్తూ ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాకా.. ఆ పాత్ర ముందు అల్లు అర్జున్ కూడా చిన్నగా కనిపిస్తాడు’ అని ఆర్జీవీ రాసుకొచ్చాడు. My REVIEW of the CHARACTER of PUSHPA in #pushpa2—Ram Gopal Varma It is extremely rare that Indian films have sharply etched characters and it is even more rare that a star himself will ignore his own image and literally become the character Seeing…— Ram Gopal Varma (@RGVzoomin) December 7, 2024 -
ఇండియన్ బాక్సాఫీస్ రూలర్‌గా 'పుష్ప'రాజ్.. తొలిరోజు ఎన్ని కోట్లంటే?
అల్లు అర్జున్- సుకుమార్ పుష్ప2 చిత్రంతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. భారత సినీ చరిత్రలోనే భారీ రికార్డ్‌ను బన్నీ క్రియేట్ చేశాడు. ఇండియాలో ఇప్పటి వరకు మొదటిరోజు కలెక్షన్స్ సాధించిన చిత్రాలలో ఆర్ఆర్ఆర్ రూ. 223 కోట్లతో ప్రథమ స్థానంలో ఉంది. ఈ రికార్డ్‌ను ఇప్పుడు పుష్ప కొట్టేశాడు. బాక్సాఫీస్ వద్ద తన బ్రాండ్ సత్తా ఏంటో ఈ చిత్రం ద్వారా బన్నీ చూపించాడు.డిసెంబర్ 4 రాత్రి నుంచి థియేటర్లలో పుష్ప రూల్ ప్రారంభమైంది. కలెక్షన్ల పరంగా టాలీవుడ్, బాలీవుడ్, ఓవర్సీస్లలో టాప్‌లో కొనసాగుతోంది. ప్రీ సేల్ బుకింగ్స్‌లో కూడా తగ్గేదేలే అంటూ దూకుడు ప్రదర్శించింది. ఇలా తొలిరోజు పుష్ప2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 294 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ వాటా ఉంటే ఆ తర్వాత బాలీవుడ్ ఉంది. అమెరికాలోనే సుమారు రూ. 35 కోట్ల వరకు రాబట్టినట్లు నిర్మాణసంస్థ ప్రకటించింది.భారతీయ సినీ చరిత్రలో పుష్ప రికార్డ్భారతీయ సినీ చరిత్రలో అతి పెద్ద ఓపెనర్‌గా పుష్ప2 రికార్డ్ క్రియేట్ చేసింది. బన్నీ దెబ్బకు టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు వరకు ఉన్న టాప్ రికార్డ్స్ అన్నీ చెల్లా చెదురయ్యాయి. ఇప్పటి వరకు ఫస్ట్ డే నాడు అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఇండియన్ చిత్రాల జాబితాలో ఆర్ఆర్ఆర్ ఉండేది.. ఇప్పుడు ఆ రికార్డ్‌ను బీట్ చేస్తూ పుష్ప2 రూ. 294 కోట్ల కలెక్షన్లతో ప్రథమ స్థానంలో ఉంది. రెండో స్థానంలో ఆర్ఆర్ఆర్ ( రూ. 223 కోట్లు), మూడో స్థానంలో 'బాహుబలి2' (రూ.214 కోట్లు) ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా కల్కి 2898AD (రూ. 191 కోట్లు),సలార్ (రూ. 178 కోట్లు), దేవర (రూ. 172 కోట్లు), కేజీఎఫ్2 (రూ. 160 కోట్లు),లియో (రూ. 148 కోట్లు), ఆదిపురుష్ (రూ. 140 కోట్లు), సాహో (రూ. 130 కోట్లు), జవాన్ (రూ. 129.5 కోట్లు) ఉన్నాయి.బాలీవుడ్ కింగ్ షారుఖ్‌ను దాటేసిన అల్లు అర్జున్బాలీవుడ్లో ఇప్పటి వరకు మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా షారుఖ్‌ఖాన్ 'జవాన్' రూ. 65.5 కోట్లతో మొదటి స్థానంలో ఇప్పటి వరకు ఉంది. అయితే, తాజాగా 'పుష్ప2' ఆ రికార్డ్‌ను దాటేసింది. హిందీలో ఫస్ట్ డే రూ.72 కోట్ల నెట్ రాబట్టి ఫస్ట్ ప్లేస్‌లోకి పుష్ప2 చేరిపోయింది. బన్నీ స్టార్‌డమ్‌తోనే హిందీ 'పుష్ప'కి భారీ ఓపెనింగ్స్ వచ్చాయని అక్కడి ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. బాలీవుడ్ ఫస్ట్ డే కలెక్షన్స్ టాప్ టెన్ లిస్ట్‌లో టాలీవుడ్ నుంచి పుష్ప2 చిత్రం మాత్రమే ఉండటం విశేషం. పుష్ప తర్వాతే బాహుబలి2 ( 41 కోట్లు), ఆదిపురుష్ ( రూ 37.25 కోట్లు), సాహో ( రూ.24.4 కోట్లు), కల్కి (రూ. 22.5 కోట్లు) వంటి చిత్రాలు ఉన్నాయి.(ఇది చదవండి: Pushpa 2 Review: ‘పుష్ప 2’ మూవీ రివ్యూ)బుక్‌మైషోలో 'పుష్ప'గాడి రికార్డ్'పుష్ప 2'ని డాల్బీ, ఐమ్యాక్స్, డిబాక్స్, 4డీఎక్స్, ఐస్, 2డీ, 3డీ వెర్షన్స్‌లో ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్‌లో విడుదల చేశారు. బన్నీ (అల్లు అర్జున్) దెబ్బకు ఇప్పటి వరకు ఉన్న పాత రికార్డ్స్ అన్ని బద్దలైపోతున్నాయి. బుక్ మై షోలో ఒక గంటలో అత్యధికంగా లక్షకు పైగానే టికెట్లు విక్రయించి రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటిదాకా ప్రభాస్ 'కల్కి' పేరుతో ఉన్న రికార్డ్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ అధిగమించింది. 'పుష్ప 2' భారతదేశంలో 2,51,9266 టికెట్లను అడ్వాన్స్ బుకింగ్‌లో విక్రయించడం ద్వారా రూ. 73 కోట్లు వసూలు చేసి ‘బాహుబలి 2, జవాన్, ఆర్ఆర్ఆర్’ వంటి బ్లాక్బస్టర్ల అడ్వాన్స్ బుకింగ్‌ను అధిగమించింది. ఫైనల్‌గా ఈ సినిమా ఇంకెన్ని రికార్డ్స్ కొల్లగొడుతుందో చూడాలి.THE BIGGEST INDIAN FILM creates HISTORY at the box office ❤️🔥#Pushpa2TheRule grosses 294 CRORES worldwide on Day 1 making it THE HIGHEST OPENING DAY in Indian Cinema 💥💥💥#Pushpa2BiggestIndianOpenerRULING IN CINEMAS Book your tickets now!🎟️ https://t.co/tHogUVEOs1… pic.twitter.com/uDhv2jq8dc— Mythri Movie Makers (@MythriOfficial) December 6, 2024 -
Pushpa 2: సుకుమార్ అందరికి ఇచ్చిపడేసాడు..
-
Pushpa 2 రియల్ వ్యూ
-
పుష్ప రాజ్ రూలింగ్ స్టార్..
-
పుష్ప-2 మూవీ స్టిల్స్.. ఫోటోలు షేర్ చేసిన రష్మిక
-
‘పుష్ప 2’ మాస్ జాతర.. అల్లు అర్జున్ (ఫొటోలు)
-
Pushpa 2 Review: ‘పుష్ప 2’ మూవీ రివ్యూ
టైటిల్: పుష్ప 2: ది రూల్నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక మందన్నా, ఫహద్ పాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ, రావు రమేశ్, ధనంజయ, తారక్ పొన్నప్ప, అజయ్ ఘోష్ తదితరులునిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్నిర్మాతలు: నవీన్ కుమార్, రవిశంకర్రచన-దర్శకత్వం: సుకుమార్సంగీతం: దేవీశ్రీ ప్రసాద్సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్ఎడిటింగ్: నవీన్ నూలివిడుదల తేది: డిసెంబర్ 5, 2024అల్లు అర్జున్ అభిమానుల మూడేళ్ల నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేల పుష్ప 2 మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాల తర్వాత ఆ స్థాయిలో యావత్ సినీలోకం ఎదురు చూస్తున్న తెలుగు సినిమా పుష్ప 2. అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప: ది రైజ్’కి సీక్వెల్ ఇది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా చాలా గ్రాండ్‌గా నిర్వహించడంతో దేశం మొత్తం ‘పుష్ప 2’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? బన్నీ ఖాతాలో మరో పాన్ ఇండియా హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.‘పుష్ప 2’ కథేంటంటే..?ఒక సాధారణ కూలీగా జీవీతం మొదలు పెట్టిన పుష్పరాజ్(అల్లు అర్జున్) ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియాను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడనేది ‘పుష్ప పార్ట్-1’లో చూపించారు. పుష్పరాజ్ సిండికేట్ లీడర్ కావడంతో ‘పుష్ప : ది రైజ్’ కథ ముగుస్తుంది. పుష్ప 2: ది రూల్ (Pushpa 2 The Rule Movie Telugu Review) సినిమా కథ అక్కడ నుంచే ప్రారంభం అవుతుంది. శ్రీవల్లి(రష్మిక)ని పెళ్లి చేసుకొని అటు వ్యక్తిగతం జీవితాన్ని హాయిగా గడుపుతూనే.. మరోవైపు ఎర్ర చందనం స్మగ్లింగ్‌ని దేశం మొత్తం విస్తరిస్తాడు పుష్పరాజ్. ఎంపీ సిద్దప్ప(రావు రమేశ్) అండతో తన వ్యాపారానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకుంటాడు. ఓ సారి చిత్తూరుకి వచ్చిన ముఖ్యమంత్రి నరసింహరెడ్డిని కలిసేందుకు పుష్పరాజ్ వెళ్తాడు. భార్య శ్రీవల్లి కోరిక మేరకు అతనితో ఫోటో దిగేందుకు ప్రయత్నించగా..‘స్మగ్లర్‌తో ఫోటో దిగలేను’ అంటూ సీఎం నిరాకరిస్తాడు. అంతేకాదు శ్రీవల్లిని అవమానించేలా మాట్లాడతాడు. దీంతో ఆ సీఎంనే మార్చాలని పుష్పరాజ్ డిసైడ్ అవుతాడు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్దప్పను చేయాలనుకుంటాడు. దాని కోసం పుష్పరాజ్ ఏం చేశాడు? తనను అవమానించిన పుష్పరాజ్‌ని ఎలాగైన పట్టుకోవాలని చూస్తున్న ఎస్పీ షెకావత్(ఫాహద్ ఫాజిల్) ప్రయత్నం ఫలించిందా? షెకావత్‌కి పుష్పరాజ్ విసిరిన సవాల్ ఏంటి? కేంద్రమంత్రి ప్రతాప్‌రెడ్డి(జగపతి బాబు), పుష్పరాజ్ మధ్య ఎందుకు గొడవ వచ్చింది? ప్రతాప్‌రెడ్డి తమ్ముడు కొడుకు (తారక్ పొన్నప్ప) పుష్పరాజ్‌పై పగ పెంచుకోవడానికి గల కారణం ఏంటి? తనను తప్పించి సిండికేట్ లీడర్‌గా ఎదిగిన పుష్పరాజ్‌ను అణచివేసేందుకు మంగళం శ్రీను(సునీల్), దాక్షాయణి(అనసూయ)వేసిన ఎత్తుగడలు ఏంటి? చివరకు పుష్పరాజ్ అనుకున్నట్లుగా సిద్దప్పను సీఎం చేశాడా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..కొన్ని సినిమాలకు కథ అవసరం లేదు. స్టార్ హీరో.. ఆయన స్థాయికి తగ్గట్లు ఎలివేషన్స్..భారీ యాక్షన్ సీన్స్.. మాంచి పాటలు ..ఇవి ఉంటే చాలు బొమ్మ హిట్టైపోతుంది. పుష్ప 2లో డైరెక్టర్ సుకుమార్ కూడా ఇదే ఫార్ములాను అప్లై చేశాడు. పుష్ప : ది రైజ్ సినిమాతో పుష్పరాజ్ పాత్రను డ్రగ్‌లా ఎక్కించిన సుక్కు.. పార్ట్ 2లో ఆ మత్తును అలానే కంటిన్యూ చేసేశాడు. కథపై కాకుండా ఎలివేషన్స్.. యాక్షన్ సీన్స్‌పై ఎక్కువ ఫోకస్ చేశాడు. పార్ట్ 1లో ఉన్నంత కథ కూడా ఈ సీక్వెల్లో లేదు. హై ఇవ్వడమే లక్ష్యంగా కొన్ని సీన్లను అల్లుకుంటూ పోయాడు అంతే. ప్రతి పది నిమిషాలకొకసారి హై ఇచ్చే సీన్ ఉండేలా స్క్రీన్‌ప్లే రాసుకున్నాడు. కథనం నీరసంగా సాగుతుందన్న ఫీలింగ్ ఆడియన్స్‌కి వచ్చేలోగా.. ఓ భారీ యాక్షన్ సీన్ పడుతుంది. అందులో బన్నీ నటవిశ్వరూపం చూసి గూస్బంప్స్ తెచ్చుకోవడమే తప్ప.. మరో ఆలోచన రాదు. భార్య మాట భర్త వింటే ఎలా ఉంటుందనే పాయింట్‌ని ఈ స్మగ్లింగ్ కథతో ముడిపెట్టి చూపించిన విధానం ఆకట్టుకుంటుంది.ఓ భారీ యాక్షన్ సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. పుష్పరాజ్ క్యారెక్టర్, అతని ప్రపంచం గురించి అల్రేడీ తెలుసు కనుక.. స్టార్టింగ్ నుంచే హీరోకి ఎలివేషన్స్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఫహాద్ పాత్ర ఎంట్రీ సీన్ అదిరిపోతుంది. ఫస్టాఫ్ అంతా షెకావత్-పుష్పరాజ్ మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్‌లా కథనం సాగుతుంది. ఎర్రచందనం పట్టుకునేందుకు షెకావత్ ప్రయత్నించడం.. పుష్పరాజ్ అతన్ని బురిడీ కొట్టించి దాన్ని తరలించడం .. ఫస్టాఫ్ మొత్తం ఇదే తంతు నడుస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే స్విమింగ్ఫూల్ సీన్ అదిరిపోతుంది. ఇద్దరి జరిగే సవాల్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అలాగే శ్రీవల్లీ, పుష్పరాజ్‌ల మధ్య వచ్చే ‘ఫీలింగ్స్’ సీన్లు నవ్వులు పూయిస్తాయి. ఇక ద్వితియార్థంలో ఎమోషన్స్‌పై ఎక్కువ దృష్టి పెట్టారు. జాతర ఎపిసోడ్ అదిరిపోతుంది. ఆ తర్వాత కథనం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్‌కి ముందు వచ్చే యాక్షన్ సీన్ అయితే పూనకాలు తెప్పిస్తుంది. ఆ సీన్లో బన్నీ మాస్ తాండవం చేశాడు. క్లైమాక్స్ అంతగా ఆకట్టుకోదు. పార్ట్ 3కి ఇచ్చిన లీడ్ అంతగా కిక్ ఇవ్వలేదు. సినిమా నిడివి (దాదాపు 3 గంటల 20 నిమిషాలు) ఎక్కువగా ఉండడం సినిమాకు కాస్త మైనస్ అనే చెప్పాలి. లాజిక్స్ గురించి ఎంత తక్కువ మాట్లాకుంటే అంత మంచిది. అయితే మాస్ ఆడియన్స్‌కి ఇవేవి అవసరం లేదు. వారిని ఎంటర్టైన్ చేస్తే చాలు. అలాంటి వారికి పుష్ప 2 విపరీతంగా నచ్చుతుంది. ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి అయితే సుకుమార్ ఫుల్ మీల్స్ పెట్టారనే చెప్పాలి. ఎవరెలా చేశారంటే..పుష్ప: ది రూల్’ అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు కథనంతా తన భుజాన వేసుకొని నడిపించాడు. మాస్ లుక్‌లోనే కాదు నటనలోనూ బన్నీ అదరగొట్టేశాడు. యాక్షన్ సీన్స్‌లో అయితే ‘తగ్గేదేలే’ అన్నట్లుగా తన నట విశ్వరూపం చూపించాడు. జాతర ఎపిసోడ్, క్లైమాక్స్‌కి ముందు వచ్చే యాక్షన్ సీన్లో బన్నీ ఫెర్మార్మెన్స్ నెక్ట్స్ లెవన్‌లో ఉంది. చిత్తూర యాసలో ఆయన పలికిన సంభాషణలు అలరిస్తాయి.ఇక శ్రీవల్లీగా డీగ్లామర్ పాత్రలో రష్మిక జీవించేసింది. పార్ట్ 1తో పోలిస్తే ఈ చిత్రంలో ఆమె పాత్ర నిడివి చాలా ఎక్కువగా ఉంటుంది. జాతర ఎపిసోడ్లో ఆమె చెప్పే సంభాషణలు ఆకట్టుకుంటాయి. డీఎస్పీ షెకావత్‌గా ఫహద్ పాజిల్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఎంపీ సిద్దప్పగా రావు రమేశ్ మరోసారి తెరపై తమ అనుభవాన్ని చూపించారు. తారక్ పొన్నప్పకు మంచి పాత్ర లభించింది. బన్నీకి ఆయన మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. స్పెషల్ సాంగ్‌లో శ్రీలీల అదరగొట్టేసింది. బన్నీతో పోటీ పడి మరి డ్యాన్స్ చేసింది. మంగళం శ్రీను పాత్రలో నటించిన సునీల్‌కి పెద్దగా గుర్తుంచుకునే సీన్లేవి పడలేదు. దాక్షయణిగా నటించిన అనసూయ పరిస్థితి కూడా అంతే. ఒకటి రెండు చోట్ల ఆమె చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఇక కేంద్రమంత్రి ప్రతాప్ రెడ్డిగా జగపతి బాబు ఉన్నంత చక్కగా నటించాడు. పార్ట్ 3లో ఆయన నిడివి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. జగదీశ్, ధనుంజయ, అజయ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. దేవీశ్రీ ప్రసాద్, శ్యామ్ సీఎస్ల నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. ‘సూసేకీ..’, కిస్సిక్’, ‘ఫీలింగ్స్’ పాటలు తెరపై అలరించాయి. సినిమాటోగ్రాఫర్ మిరోస్లా కుబా బ్రోజెక్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ప్రతి సీన్ చాలా రిచ్‌గా, వాస్తవాన్ని ప్రతిబింబించేలా చూపించాడు. ఆర్ట్ డిపార్ట్మెంట్ పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తోంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెపాల్సింది. నిడివిని కొంచెం తగ్గిస్తే బాగుండేవి. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా ‘తగ్గేదేలే’ అన్నట్లుగా ఈ సినిమా కోసం ఖర్చు పెట్టారు.- అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
Pushpa 2 X Review: ‘పుష్ప 2’మూవీ ట్విటర్ రివ్యూ
అల్లు అర్జున్ ఫ్యాన్‌తో పాటు యావత్ సినీలోకం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప 2 మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న నాలుగో చిత్రం.. బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప- ది రైజ్’ కి సీక్వెల్ కావడంతో ‘పుష్ప 2: ది రూల్’పై ముందు నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేశాయి. దానికి తోడు పాట్నా మొదలుకొని చెన్నై, ముంబై, కొచ్చి లాంటి నగరాలతో పాటు దేశమంతా తిరిగి ప్రచారం చేయడంతో ‘పుష్ప 2’పై భారీ బజ్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 5) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో గురువారం రాత్రి 9.30 గంటల నుంచే స్పెషల్ షోస్ పడిపోయాయి. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.పుష్ప 2 కథేంటి? ఎలా ఉంది? బన్నీ ఖాతాలో మరో భారీ హిట్ పడిందా లేదా? తదితర విషయాలు ఎక్స్(ట్విటర్ ) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’తో బాధ్యత వహించదు.ఎక్స్‌లో పుష్ప 2 చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. సినిమా బ్లాక్ బస్టర్ అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. బన్నీ మాస్ యాక్టింగ్ అదిరిపోయిందని అంటున్నారు. సుకుమార్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. భారీ బ్లాక్ బస్టర్‌తో ఈ ఏడాది ముగించారని కామెంట్ చేస్తున్నారు. మరికొంత మంది అయితే ఇది యావరేజ్ మూవీ అంటున్నారు. #Pushpa2 definately cross 250 cr on 1st day 🔥 What a film https://t.co/zSTuWaSX93— Sameer Chauhan 🥷 (@srk_MrX) December 5, 2024 First Day First Show #Pushpa2TheRulereviewReally A Great Movie - Full Paisa Wasool. #RashmikaMandana And #AlluArjun𓃵 Killer🔥 #Pushpa2 #AlluArjun #Pushpa2ThaRule #Pushpa2Review #WildfirePushpa pic.twitter.com/ii4jx7vbWs— Lokesh 🕉️ (@LokeshKhatri__) December 5, 2024 #Pushpa2 is a Decently Packaged Commercial Entertainer with a Good 1st Half and a 2nd Half that started well but drops pace significantly in the last hour. The first half starts right where Part 1 ends. This half runs purely on drama which feels slightly slow at times but…— Venky Reviews (@venkyreviews) December 4, 2024 పుష్ప 2 డీసెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్.ఫస్టాఫ్ బాగుంది. సెకండాఫ్ స్టార్టింగ్ బాగుంది కానీ చివరి గంట డ్రాప్ అయినట్లుగా అనిపించిదంటూ ఓ నెటిజన్ 3 రేటింగ్ ఇచ్చాను.#Pushpa2TheRule Review 1st Half = Excellent 🥵2nd Half = Justified 🙂Rating = 3.25/5🥵❤️🔥— Rama (@RameshKemb25619) December 4, 2024 ఫస్టాప్ అద్భుతంగా ఉంది. సెకండాఫ్ కథకి న్యాయం జరిగింది అంటూ మరో నెటిజన్ 3.25 రేటింగ్ ఇచ్చారు.Icon star #ALLUARJUNNata viswaroopam 🔥🔥brilliant Director Sukumar Ramapage 🔥🔥🔥India’s Biggest Blockbuster #Pushpa2 #pushpatherule— Maduri Mattaiah Naidu (@madurimadhu1) December 4, 2024 ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ నటవిశ్వరూపం, సుకుమార్ డైరెక్షన్ అదిరిపోయింది. ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప 2 అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.Kuthaa Ramp undhi Movie🔥🔥🔥@alluarjun acting ayithe vere level especially aa Jathara scene ayithe punakale🔥🔥🔥🔥🔥🔥🔥🔥#Sukumar writing excellent @ThisIsDSP bgm 🔥🔥Pushpa gadi Rulu India shake avuthadi🔥🔥🔥❤️🔥❤️🔥❤️🔥#Pushpa2TheRule #Pushpa2 #Pushpa2TheRuleReview #Pushpa2— Hanish (@HarishKoyalkar) December 4, 2024Good 1st half Below average 2nd half Bad climax#Pushpa2 #Pushpa2TheRule Bhaai one man show ! #Pushpa2Review #Pushpa2Celebrations— CeaseFire 🦖 (@Rebelwood_45) December 4, 2024#Pushpa2 #1stHalfReviewSuperb and very entertaining. Just a mass 🔥🔥 Comedy, dialogue delivery @alluarjun just nailed it. The real Rule of #Pushpa #FahadFaasil craziness is just getting started. Waiting for 2nd half 🔥#SamCS BGM 🔥🔥🔥— Tamil TV Channel Express (@TamilTvChanExp) December 4, 2024#Pushpa2 #AlluArjun𓃵 Power packed first half followed by a good second halfSukkumark in writing and screenplay 3hr 20 mins lo oka scene kuda bore kottadu 💥Rashmika acting 👌Songs bgm💥Cinematography too good vundi asalu @alluarjun nee acting ki 🙏Peak commercial cinema.— Hussain Sha kiran (@GiddaSha) December 4, 2024 -
Pushpa 2: పుష్ప 2 కథేంటి? సుకుమార్ ఏం చెప్పబోతున్నాడు?
మరికొద్ది గంటల్లో పుష్ప 2 థియేటర్స్‌లో సందడి చేయబోతుంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప : ది రైజ్’కు కొనసాగింపుగా ఈ చిత్రం రాబోతుంది. ఈ రోజు(డిసెంబర్ 4) రాత్రి 9.30 గంటల నుంచి తెలంగాణలో స్పెషల్ షోస్ పడబోతున్నాయి. అర్థరాత్రి తర్వాత పుష్ప 2 టాక్ ఏంటనేది బయటకు వచ్చేస్తుంది. పుష్ప 2 కథ పార్ట్ 1 కంటే గొప్పగా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. అసలు పార్ట్ 2లో సుకుమార్ ఏం చూపించబోతున్నాడనే ఆసక్తి బన్నీ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేమికులందరిలో మొదలైంది. పార్ట్ 1లో వదిలేసిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెబుతాడనేది ఆసక్తికరంగా మారింది. అసలు పార్ట్ 1 వదిలేసిన ప్రశ్నలు ఏంటి? పార్ట్ 2లో ఏం చూపించబోతున్నారు? అనేది ఒక్కసారి చూద్దాం.👉 ఒక సాధారణ కూలీగా జీవితం మొదలుపెట్టిన పుష్పరాజ్ ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియాను శాసించే స్థాయికి ఎలా ఎదగాడన్నది ‘పుష్ప : ది రైజ్’లో చూపించారు. ఇక పుష్ప 2లో ఎర్ర చందనం సిండికేట్‌ను లీడ్ చేసే వ్యక్తిగా మారిన తర్వాత పుష్పరాజ్ తన వ్యాపారాన్ని ఎలా విస్తరించాడన్నది చూపించబోతున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ని దేశంలోనే కాకుండా.. విదేశాలకు విస్తరించే అవకాశం ఉంది. ‘పుష్పా.. అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్’ అనే డైలాగ్‌తో ఈ విషయం చెప్పకనే చెప్పేశారు.👉 సాధారణంగా సీక్వెల్ కోసం ఓ బలమైన పాయింట్‌ని ముగింపులో చూపిస్తారు. బాహుబలి పార్ట్ 1లో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనేది చెప్పకుండా పార్ట్ 2 కోసం ఎదురు చూసేలా చేశారు రాజమౌళి. కానీ పుష్పలో సుకుమార్ అలాంటి ఉత్కంఠత కలిగించే పాయింటేది దాచలేదు. ప్రేక్షకుడు ఎలాంటి అంచనాలు లేకుండా సినిమాకు రావాలనే ఉద్దేశంతో అలా చేయ్యొచ్చు. సుకుమార్ సినిమాల్లో స్క్రీన్‌ప్లే చాలా బలంగా ఉంటుంది. తనదైన ట్విస్టులతో అలరిస్తాడు. ఆ నమ్మకంతోనే సుకుమార్ ఉత్కంఠతో ఎదురుచూసేలా బలైమన పాయింట్‌తో ముగింపు ఇవ్వలేదేమో.👉 పుష్ప 2లో సునీల్ పోషించిన మంగళం శ్రీను పాత్ర మరింత బలంగా చూపించే అవకాశం ఉంది. పార్ట్ 1లో మంగళం శ్రీను బామ్మర్థిని పుష్ప చంపేస్తాడు. అంతేకాకుండా సిండికేట్ లీడర్‌గా ఉన్న మంగళం శ్రీనుని పక్కకు జరిపి.. మాఫియా మొత్తాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు పుష్ప. ముష్పరాజ్‌ని ఎదుర్కొనే దీటైన వ్యక్తిగా మంగళం శ్రీనుని చూపించే అవకాశం ఉంది.👉 ఇక పార్ట్ 1లో ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్‌గా ఫహద్ ఫాజిల్ సినిమా చివర్లో ఎంట్రీ ఇస్తాడు. పుష్పరాజ్ అతన్ని ఘోరంగా అవమానిస్తాడు. భన్వర్ సింగ్ తన ప్రతీకారాన్ని ఎలా తీర్చుకున్నాడనేది పార్ట్ 2లో చూపించనున్నారు. ‘పార్టీ ఉంది పుష్పా.. పార్టీ ఉంది’ అంటూ ట్రైలర్లో షేకావత్ పాత్రను బలంగా చూపించారు.👉 కన్నడ నటుడు ధనుంజయ పోషించిన జాలిరెడ్డి పాత్రకు పార్ట్ 2లో మరింత ప్రాధాన్యం ఉండే అవకాశం ఉంది. శ్రీవల్లీని బలవంతం చేయడానికి ప్రయత్నించడంతో పుష్పరాజ్..జాలిరెడ్డిని చితక్కొడుతాడు. ఓ కూలోడు తనను కొట్టడాన్ని జాలిరెడ్డి అవమానంగా భావిస్తాడు. ఎలాగైన పుష్పరాజ్‌ని చంపేయాలని డిసైడ్ అవుతాడు. మరి జాలిరెడ్డి తన పగను ఎలా తీర్చుకున్నాడనేది పుష్ప 2లో చూపించే అవకాశం ఉంది.👉 పుష్పలో దాక్షాయణిగా కనిపించిన అనసూయ.. తనదైన నటనతో ఆకట్టుకుంది. అయితే ఆమె పాత్రకు పార్ట్ 1లో పెద్దగా ప్రాధాన్యత లేదు. కానీ పుష్ప 2లో మాత్రం ఈ పాత్రను ఎలివేట్ చేసే చాన్స్ ఉంది. అనసూయ కూడా పలు ఇంటర్వ్యూలో పార్ట్ 2లో తన పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందని చెప్పింది.👉 ఇక పుష్ప 1లో మొదటి నుంచి పుష్ప రాజ్‌కు ఇంటిపేరు లేదంటూ అవమానిస్తూ వస్తారు. సొంత అన్న(అజయ్) మొదలుకొని షేకావత్ వరకు పుష్పరాజ్‌కు ఇంటిపేరు లేదంటూ హేళన చేస్తుంటారు. పార్ట్ 2లో పుష్పరాజ్ ఇంటిపేరు సంపాదించే అవకాశం ఉంది. తనను అవమానించిన అన్నే అతనికి ఇంటిపేరు ఇచ్చే సీన్ ఈ చిత్రంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆ ఎపిసోడ్ చాలా ఎమోషనల్‌గా ఉటుందని టాక్. 👉 పుష్పరాజ్‌ను పట్టుకునేందుకు పలుమార్లు ప్రయత్నించినా.. డీఎస్పీ గోవిందప్ప(శత్రు)కి పరాభావమే ఎదురవుతుంది. ఆ అవమానం తట్టుకోలేక వేరే చోటుకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. తిరిగి పార్ట్ 2లో ఈ పాత్ర ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.👉 పార్ట్-1లో మురుగన్ ఓ వ్యక్తి అనుమతి కోసం వెయిట్ చేసినట్లు చూపిస్తారు. ఆ పాత్రను సుకుమార్ పూర్తిగా రివీల్ చేయలేదు. మరి ఆ కీలకపాత్రలో కనిపించేది ఎవరు? జగపతి బాబు పాత్ర ఏంటి? అనేది పార్ట్ 2లోనే తెలుస్తుంది. 👉 పార్ట్ 1లో శ్రీవల్లీ(రష్మిక) పాత్ర నిడివి కూడా అంతగా ఉండదు. కానీ సినిమా ముగింపులో పుష్ప శ్రీవల్లీని పెళ్లి చేసుకున్నట్లు చూపించారు. పార్ట్ 2లో ఆమె పాత్ర మరింత బలంగా ఉన్నట్లు తెలుస్తుంది. ‘శ్రీవల్లి నా పెళ్లాం. పెళ్లాం మాట మొగుడు వింటే ఎట్టా ఉంటుందో పెపంచకానికి చూపిస్తా’ అని ట్రైలర్లో పుష్పరాజ్ చెప్పే డైలాగ్‌తో ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది. రష్మిక కూడా పార్ట్ 2లోనే తన పాత్ర నిడివి ఎక్కువ అని పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది. 👉 జాతర ఎపిసోడ్ సినిమాకే హైలెట్ అని చిత్రవర్గాలు చెబుతున్నాయి. మరి ఆ జాతరతో పుష్పరాజ్‌కు ఉన్న సంబంధం ఏంటనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది. -
'పుష్ప 2' రెమ్యునరేషన్.. ఎవరికెంత ఇచ్చారు?
మరికొన్ని గంటల్లో 'పుష్ప 2' సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. హైప్ అయితే గట్టిగానే ఉంది. మరోవైపు టికెట్ రేట్ల గురించి కాస్తంత విమర్శలు వచ్చాయి గానీ ఆ ప్రభావం, బుకింగ్స్‌పై మాత్రం కనిపించట్లేదు. తొలి భాగం తీసేటప్పుడు ఓ తెలుగు సినిమాగానే రిలీజ్ చేశారు. కానీ తర్వాత తర్వాత నార్త్‌లోనూ దుమ్మురేపింది. దీంతో అంచనాలు, బడ్జెట్, మూవీ స్కేల్ అమాంతం పెరిగిపోయాయి. దీనికి తోడు నటీనటులు పారితోషికాలు కూడా గట్టిగానే ఉన్నాయండోయ్. ఇంతకీ ఎవరెవరు ఎంత తీసుకున్నారు?'పుష్ప' తొలి పార్ట్ రిలీజ్ ముందు వరకు బన్నీ అంటే తెలుగు రాష్ట్రాలు, మహా అయితే కేరళ వరకు తెలుసేమో! కానీ ఇది సృష్టించిన ప్రభంజనం దెబ్బకు ఉత్తరాదిలోనూ బన్నీ పేరు గట్టిగానే వినిపించింది. ఆ తర్వాత 'పుష్ప' మూవీకిగానూ జాతీయ అవార్డ్.. ఇలా రేంజ్ పెరుగుతూనే పోయింది. దీంతో సీక్వెల్ విషయంలో రెమ్యునరేషన్ బదులు లాభాల్లో షేర్ తీసుకోవాలని బన్నీ నిర్ణయం తీసుకున్నాడు. కట్ చేస్తే ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.1000 కోట్లు దాటేసింది. అలా రూ.270-80 కోట్ల మొత్తం బన్నీ పారితోషికంగా అందుకున్నాడట.(ఇదీ చదవండి: అల్లు అర్జున్ 'ప్లానెట్ స్టార్'.. ఆర్జీవీ ట్వీట్ వైరల్)బన్నీ తర్వాత డైరెక్టర్ సుకుమార్‌ది హయ్యస్ట్. తొలి పార్ట్ కోసం కేవలం దర్శకుడిగా పనిచేసిన ఇతడు.. సీక్వెల్‌కి వచ్చేసరికి తన సుకుమార్ రైటింగ్స్ సంస్థతో నిర్మాణంలోనూ భాగమయ్యాడు. అలా డైరెక్టర్ కమ్ నిర్మాతగా రూ.100 కోట్ల పైనే రెమ్యునరేషన్ అందుకున్నాడని తెలుస్తోంది. మిగిలిన నటీనటుల విషయానికొస్తే హీరోయిన్ రష్మికకు రూ.10 కోట్లు, ఫహాద్ ఫాజిల్‌కి రూ.8 కోట్లు, ఐటమ్ సాంగ్ చేసిన శ్రీలీలకు రూ.2 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇచ్చారట. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌కి రూ.5 కోట్లు పైనే పారితోషికం ఇచ్చారట.వీళ్లు కాకుండా సినిమాలోని ఇతర కీలక పాత్రలు చేసిన జగపతిబాబు, రావు రమేశ్, సునీల్, అనసూయ, అజయ్ తదితరులకు భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ ఇచ్చారట. ఈ లెక్కన చూసుకుంటే రూ.600 కోట్ల మేర మూవీకి బడ్జెట్ అయిందని అంటున్నారు. కానీ ఇందులో సగం బడ్జెట్, పారితోషికాలకే సరిపోయాయేమో అనిపిస్తోంది. ఎందుకంటే అంతమంది స్టార్స్ పనిచేశారు మరి!(ఇదీ చదవండి: 'పుష్ప 2'పై బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్) -
'పుష్ప 2' మూవీ ఆల్ పోస్టర్స్.. ఫుల్ HD (ఫొటోలు)
-
'పుష్ప 2'పై బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్
అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది. హైప్ విషయంలో తిరుగులేదు కానీ టికెట్ రేట్ల దగ్గరే పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సరే ఇదంతా పక్కనబెడితే ఆర్మూర్ భాజపా ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ఇప్పుడు ఈ చిత్రంపై షాకింగ్ కామెంట్స్ చేశారు.(ఇదీ చదవండి: కవలలకి జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్)'పుష్ప సినిమాలో చూపించిందంతా అబద్ధం. ఎర్రచందనం లక్ష రూపాయలు ఉంటే కోటి రూపాయలు లాగా చూపించారు. దీంతో యూత్ చాలా చెట్లు నరికేశారు. ఇప్పుడు 'పుష్ప 2'కి ఇంకెన్ని నరికేస్తారో? సినిమా వల్ల యువత చెడిపోతోంది. అల్లు అర్జున్, సుకుమార్‌ని అరెస్ట్ చేసి జైల్లో వేయాలి' అని ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయాయి.ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్సే ఎక్కువగా వస్తున్నాయి. మరీ ముఖ్యంగా బన్నీ ఫ్యాన్స్ అయితే రెచ్చిపోతున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్య కథాంశంతో 'పుష్ప' సినిమాల్ని తీశారు. తొలి భాగం రిలీజైనప్పుడు పలు విమర్శలు వచ్చినప్పటికీ.. ఈ తరహాలో అదీ కూడా ఓ ఎమ్మెల్యే మాట్లాడటం ఇప్పుడు షాకింగ్‌గా ఉంది.(ఇదీ చదవండి: నిఖిల్‌ని ఓడించిన ప్రేరణ.. సారీ చెప్పిన గౌతమ్) -
పుష్ప-2 మూవీ.. విడుదలకు ముందు బిగ్ షాక్!
ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న తరుణం రానే వచ్చింది. మరికొద్ది గంటల్లోనే పుష్ప-2 ప్రభంజనం థియేటర్లలో మొదలు కానుంది. డిసెంబర్ 4న రాత్రి 9:30 గంటలకే బెనిఫిట్ షోలు వేయనున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పుష్ప ఫీవర్ కొనసాగుతోంది. ఇప్పటికే టికెట్ బుకింగ్ ప్రారంభం కాగా.. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. భాషతో సంబంధం లేకుండా టికెట్స్ బుకింగ్స్ పుష్ప సరికొత్త రికార్డులు తిరగరాస్తోంది.అయితే పుష్ప-2 రిలీజ్‌కు ముందు అభిమానులకు ఓ షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ మూవీని 3డీ వర్షన్లో అందుబాటులోకి రాలేదనే టాక్ వినిపిస్తోంది. రిలీజ్ రోజున అన్ని థియేటర్స్‌లోనూ కేవలం 2డీ వెర్షన్‌ను మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తున్నారని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇప్పటికే 3డీ వర్షన్ టికెట్స్ బుక్ చేసుకుంటే.. ఆ షోలు కూడా 2డీ వర్షన్‌లోనే ప్రదర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 3డీ వెర్షన్ రావడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశముంది. దీనిపై చిత్రయూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.(ఇది చదవండి: 'పుష్ప 2'.. తమన్‌ని సైడ్ చేసేశారా?)కాగా.. సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను ఐమ్యాక్స్, డాల్బీ, డిబాక్స్, 4డీఎక్స్, ఐస్, 2డీ, 3డీ విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లోనూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇప్పటికే 2డీ వెర్షన్‌కు సంబంధించిన ప్రింట్‌ను రెడీ చేశారు మేకర్స్. -
'పుష్ప 2'.. తమన్‌ని సైడ్ చేసేశారా?
మరో ఒకటి రెండు రోజుల్లో 'పుష్ప 2' థియేటర్లలోకి రాబోతుంది. రిలీజయ్యేంత వరకు అంతా టెన్షన్ టెన్షనే. ఫైనల్ మిక్స్ ఇప్పుడు పూర్తయినట్లు చెప్పారు. కొన్నిరోజుల క్రితం 'పుష్ప 2' బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో ఎంతలా రూమర్స్ వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఆ విషయమై షాకింగ్ విషయం ఒకటి వైరల్ అవుతోంది.'పుష్ప' సినిమాలకు మ్యూజిక్ అంతా దేవిశ్రీ ప్రసాదే. అయితే పార్ట్-2 విషయంలో టైమ్ దగ్గర పడుతుండేసరికి తమన్, అజనీష్ లోక్‌నాథ్, శామ్ సీఎస్ తదితరులు కూడా పనిచేస్తున్నారని రూమర్స్ వచ్చాయి. కొన్నిరోజుల క్రితం బాలకృష్ణ 'డాకు మహరాజ్' టీజర్ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన తమన్.. తాను కూడా 'పుష్ప 2' కోసం పనిచేస్తున్నట్లు చెప్పాడు.(ఇదీ చదవండి: 'పుష్ప 3'.. అసలు ఉన్నట్టా? లేనట్టా?)కానీ ఇప్పుడు 'పుష్ప 2' ఫైనల్ మిక్సింగ్ అంతా పూర్తయిన తర్వతా ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. సినిమా కోసం కేవలం దేవి, శామ్ సీఎస్ మాత్రమే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారని, మిగిలిన వాళ్లిచ్చిన ఔట్పుట్ ఉపయోగించుకోలేదని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. ఎందుకంటే సినిమా టైటిల్ కార్డ్స్‌లో పేర్లు పడతాయిగా!హైదరాబాద్‌లో మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. దాదాపు అందరూ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించే ప్రస్తావించారు తప్పితే మరో మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడలేదు. ఇప్పుడొస్తున్న రూమర్స్ చూస్తే బహుశా నిజమే అనిపిస్తోంది.(ఇదీ చదవండి: 'బ్లాక్' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
మీ సపోర్ట్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు.. అల్లు అర్జున్ ట్వీట్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. సినిమాకు మీరు ఇస్తున్న సపోర్ట్‌కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా అంటూ ట్వీట్ చేశారు. పుష్ప-2 టికెట్స్ పెంచుకునేందుకు జీవో ఇవ్వడం లాంటి మీ ఆలోచనాత్మక నిర్ణయం తెలుగు సినిమా ఎదుగుదలను ప్రోత్సహిస్తుందని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎంవో, సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డిని ట్యాగ్ చేస్తూ ధన్యవాదాలు తెలిపారు.(ఇది చదవండి: తెలంగాణలో పుష్ప-2 రిలీజ్‌కు తొలగిన అడ్డంకులు)కాగా.. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వస్తోన్న పుష్ప-2 సినిమాకు బెనిఫిట్ షోలతో పాటు టికెట్స్ పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులిచ్చింది. డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటలకే పడనున్న బెనిఫిట్ షోలకు గరిష్ఠంగా రూ.800 పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ ఏదైనా సరే ప్రస్తుతం ఉన్న టికెట్ ధరకు అదనంగా రూ.800 చెల్లించాల్సిందే. అలాగే అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు అదనపు షోలకు కూడా అనుమతించింది. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200 పెంపుకోవచ్చని జీవోలో తెలిపింది. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.105, మల్టీఫ్లెక్స్‌లో రూ.150, డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.20, మల్టీఫ్లెక్స్‌లో రూ.50 పెంచుకునేలా జీవో జారీ చేసింది.A heartfelt thank you to the Government of Telangana for their support through the approval of ticket hikes and the new GO. Your thoughtful decision fosters the growth of Telugu cinema. A special thank you to Hon’ble @TelanganaCMO Sri @revanth_anumula garu for his unwavering…— Allu Arjun (@alluarjun) December 3, 2024 -
Pushpa 2: 80 దేశాలు.. 6 భాషలు.. 12500 థియేటర్స్.. నీయవ్వ తగ్గేదేలే
మరో రెండు రోజుల్లో ‘పుష్ప’రాజ్ థియేటర్స్‌లో అడుగుపెట్టబోతున్నాడు. ఇప్పటికే పుష్ప 2పై భారీ అంచనాలు ఏర్పడాయి. అల్లు అర్జున్ ఒక్కడే ఈ మూవీ ప్రచారాన్ని తన భుజనా వేసుకున్నాడు. కొచ్చి, చెన్నై, ముంబైతో పాటు దేశం అంతా తిరిగి ప్రచారం చేశాడు. నిన్న హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌తో పుష్ప 2 ప్రమోషన్స్‌కి ముగింపు కార్డు పడినట్లే. పక్కా ప్లాన్‌తో చేసిన ఈ ప్రమోషన్ ఈవెంట్స్ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. రిలీజ్‌కి ముందే సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయింది. ఈ మధ్యకాలంలో ఏపాన్ ఇండియా సినిమాకు రానంత హైప్ పుష్ప 2కి వచ్చింది. (చదవండి: ‘పుష్ప-2 బెనిఫిట్ షో కలెక్షన్లు ఏం చేస్తారు?’.. తెలంగాణ హైకోర్టులో విచారణ)ప్రిరిలీజ్ బిజినెస్‌లో కూడా పుష్ప 2 రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాకు 670 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ అయింది. ఇక ఆడియో రైట్స్, డిజిటల్ రైట్స్, ఓటిటి రూపంలో 400 కోట్లు వచ్చినట్టు ఇండస్ట్రీ టాక్. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా ఈ రేంజ్ లో బిజినెస్ చేయలేదు . దాదాపు 1060 కోట్ల బిజినెస్ తో ట్రేడ్ వర్గాల లో దడ పుట్టిస్తుంది.(చదవండి: 'పుష్ప 3' టైటిల్ ఫిక్స్.. కానీ సందేహమే!)టికెట్ ల విషయానికొస్తే నెల రోజుల ముందే ఓవర్సీస్ లో టికెట్ బుకింగ్ఫ్ స్టార్ట్ అయ్యాయి. కొన్ని గంటల వ్యవధిలో హాట్ కేక్ లా అమ్ముడుపోవడం ఒక రికార్డ్. బాక్సాఫీస్ వద్ద అత్యంత వేగంగా ఒక మిలియన్ టికెట్స్ అమ్ముడైన చిత్రంగా ‘పుష్ప2’ నిలిచింది. ఇది కేవలం బుక్ మై షోలోనే ఇన్ని టికెట్లు అమ్ముడు పోవడం విశేషం. ఇక నార్త్ ఇండియాలో పుష్ప కి ప్రేక్షకులు బ్రహ్మ రథం పడుతున్నారు. హిందీ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్‌లో 24 గంటల్లోనే లక్ష టికెట్స్ అమ్ముడు పోయాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే టికెట్ బుకింగ్ ఓపెన్ అయినా గంటలోనే ఫస్ట్‌డే టికెట్స్ మొత్తం అయిపోయయని ఎగ్జిబిటర్స్ లు చెబుతున్నారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో నే కాదు సౌత్ నార్త్ ఓవర్సీస్ లో ఏ సెంటర్ చూసిన పుష్ప 2 రికార్డులే ఇపుడు హాట్ టాపిక్ అయింది. మైత్రీ మూవీ మేకర్స్ మూడేళ్లు శ్రమించి పుష్ప2 చిత్రాన్ని నిర్మించింది. ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో ఈ చిత్రం సుమారు 12 వేల 500పైగా థియేటర్లలో విడుదలకాబోతంది. ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజే దాదాపు 55000 వేల షోస్ పడుతున్న మొట్టమొదటి తెలుగు సినిమా పుష్ప 2 కావడం విశేషం. 80 దేశాల్లో ఆరు భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. సెన్సార్ టాక్ కూడా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే టాక్ రావడం తో బన్నీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. డిసెంబర్ 5 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న పుష్ప 2 సినిమా ప్రౌడ్ ఇండియన్ ఫిల్మ్ గా సినీలవర్స్ అభివర్ణిస్తున్నారు . రిలీజ్ కు ముందే ఇన్ని రికార్డు లను నెలకొల్పిన పుష్ప 2 సినిమా రిలీజ్ తరువాత మరేన్ని రికార్డు ను క్రియేట్ చేస్తుందో చూడాల్సిందే. -
'పుష్ప 3'.. అసలు ఉన్నట్టా? లేనట్టా?
'పుష్ప 2' సినిమా ఒకటి రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్లే టికెట్ సేల్స్, ఫ్యాన్స్ హడావుడి గట్టిగానే ఉంది. మరోవైపు 'పుష్ప 3' ఉంటుందా లేదా అనే విషయమై చాలా సందేహాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న ఓ ఫొటో అభిమానుల్ని ఇంకాస్త కన్ఫ్యూజన్ చేస్తోంది.(ఇదీ చదవండి: కవలలకి జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్)కొన్నిరోజుల క్రితం 'పుష్ప 3' ఉండొచ్చనే రూమర్స్ వచ్చాయి. తాజాగా హైదరాబాద్‌లో సోమవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ మీ హీరో మరో మూడేళ్లు ఇస్తే పార్ట్-3 చేస్తానని బన్నీ ఫ్యాన్స్‌తో అన్నాడు. అంటే చూచాయిగా లేదని చెప్పాడు. ఒకవేళ చేయాలన్నా సరే ఇప్పట్లో అయితే కష్టం. ఎందుకంటే సుకుమార్.. నెక్స్ట్ రామ్ చరణ్‌తో పనిచేస్తాడు. బన్నీ కోసం త్రివిక్రమ్ వెయిటింగ్.ఇలా మూడో పార్ట్‌పై ఎవరి సందేహాలు వాళ్లకు ఉన్నాయి. ఇంతలో మూవీకి సౌండ్ ఇంజినీర్‌గా చేసిన రసూల్ పొకుట్టి తాజాగా ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయిన విషయాన్ని చెప్పుకొచ్చాడు. కాకపోతే వెనక స్క్రీన్‌పై మాత్రం 'పుష్ప 3: ద ర్యాంపేజ్' అని ఉంది. ప్రస్తుతానికి మూడో భాగం గురించి కార్డ్ అయితే వేసేస్తారు కానీ ఇప్పట్లో అయితే చేయకపోవచ్చు అని తెలుస్తోంది. ఒకవేళ చేసినా సరే మరో మూడేళ్లు అంటే కష్టమేగా!(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' హౌస్‌లో ఉండలేను.. శోభా శెట్టి కన్నీళ్లు) -
పుష్ప కోసం జీవితం పెట్టేశాం: అల్లు అర్జున్
‘‘పుష్ప 1, పుష్ప 2’ సినిమాల కోసం మేమంతా కష్టపడ్డామని చెబితే చిన్న మాట అవుతుంది. సుకుమార్‌గారు, నేను, మా యూనిట్ అంతా ఐదేళ్ల జీవితాలు పెట్టేశాం. మా నిర్మాతలు నవీన్, రవిగార్లకు కృతజ్ఞతలు. వాళ్లు కాకుండా ఏ ప్రోడ్యూసర్ అయినా ‘పుష్ప’ అయ్యేది కాదు. మమ్మల్ని నమ్మి కోట్లు ఖర్చు పెట్టినందుకు వాళ్లకు ధన్యవాదాలు’’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ , రష్మికా మందన్నా జోడీగా నటించిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. శ్రీలీల ప్రత్యేక పాటలో నటించారు.సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘పుష్ప వైల్డ్ ఫైర్ జాతర’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘పుష్ప 2: ది రూల్’ కోసం నాతో పనిచేసిన వారందరికీ థ్యాంక్స్. నాది, దేవి శ్రీది 20 ఏళ్ల ప్రయాణం. తన పాటల్లో నా కోసం ఎక్స్ట్రా లవ్ ఉంటుంది. ఈ తరం తెలుగమ్మాయిలకు శ్రీలీల స్ఫూర్తి. నేను ఐదేళ్లుగా పనిచేస్తున్న ఓకే ఒక హీరోయిన్ రష్మిక. తన అంకితభావానికి హ్యాట్సాఫ్. సుకుమార్‌గారి గురించి ఎంత చెప్పినా తక్కువే.‘పుష్ప 1, పుష్ప 2’ ఆయన సినిమాలే. ఇంత మంచి డైరెక్టర్ మన తెలుగులో ఉన్నారా? అనే భావనని ఆయన కలిగిస్తారు. సుకుమార్‌గారు లేకపోతే నేను లేను. ఆయన నాతో ‘ఆర్య’ తీయకపోయి ఉంటే నేను, ఈ వేదిక, ఈ జనాలు ఏవీ ఉండేవి కాదు. ‘పుష్ప’ నా కోసం ఆడాలని నేనెప్పుడూ అనుకోలేదు. సుకుమార్‌గారి కష్టం కోసమైనా ఆడాలనుకున్నాను. అలాగే ఈ సినిమా కోసం మూడేళ్లు త్యాగం చేసి, కష్టపడిన చిత్రబృందం కోసం ఆడాలని రెండోసారి అనుకున్నాను. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’ సినిమాలు వచ్చినప్పుడు తెలుగువారు ఎంతో గర్వించారు. ఆ తర్వాత ‘పుష్ప’ సినిమాకీ ఆ స్థాయిలో అంచనాలు ఉండటంతో తెలుగువారి కోసం ఈ సినిమా ఆడాలి అనుకున్నాను’’ అని తెలిపారు.దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ– ‘‘సుమారు రెండు మూడు నెలల క్రితం ‘పుష్ప 2’ షూటింగ్‌కి వెళ్లాను. పుష్పరాజ్ ఇంట్రడక్షన్ సీన్‌ని సుకుమార్‌గారు చూపించారు. ఆ ఒక్క సన్నివేశం చూడగానే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది నాకు అర్థం అయిపోయింది’’ అన్నారు. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘నేను వారం క్రితం ‘పుష్ప 2’ సినిమా చూసి ఇంటికెళ్లాను. ‘మగధీర’ సినిమాకి ముందు మీ మొహం ఎంతో వెలిగిపోవడం చూశాను.. మళ్లీ ఇప్పుడు చూస్తున్నాను’ అని నా భార్య నిర్మల అన్నారు. ‘పుష్ప’ యూనిట్‌కి ఆల్ ది బెస్ట్’’ అని తెలిపారు. సుకుమార్ మాట్లాడుతూ– ‘‘పుష్ప’ ఇలా వచ్చిందంటే కారణం కేవలం నాకు, బన్నీకి మధ్య ఉన్న బంధమే. తన మీద ప్రేమతోనే ఈ సినిమా తీశాను. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. ‘‘పుష్ప 2’ని ప్రేక్షకులు హిట్ చేస్తారనుకుంటున్నాం’’ అన్నారు నవీన్ ఎర్నేని. ‘‘ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్స్‌లో మా సినిమాని విడుదల చేస్తున్నాం’’ అని రవిశంకర్ చెప్పారు.‘‘ఇంత పెద్ద మూవీ చేసే అవకాశం రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు మైత్రీ మూవీస్ సీఈవో చెర్రీ. ‘‘పుష్ప’ చిత్రంలో పనిచేసినందుకు ఎంతో గర్వంగా ఉంది’’ అని పేర్కొన్నారు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్. ‘‘ఈరోజు నేను ఇలా నటిస్తున్నానంటే అది కేవలం సుకుమార్, అల్లు అర్జున్గార్ల వల్లే’’ అని తెలిపారు రష్మిక మందన్నా. ‘‘పుష్ప’ లో నాకు అవకాశం ఇచ్చినందుకు చిత్ర బృందానికి థ్యాంక్స్’’ అని శ్రీలీల చెప్పారు. ఈ వేడుకలో నిర్మాతలు నాగవంశీ, సతీశ్ కిలారు, దర్శకులు గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు, వివేక్ ఆత్రేయ, శివ నిర్వాణ, నటి అనసూయ, కెమెరామేన్ మిరోస్లో కుబా బ్రోజెక్ తదితరులు మాట్లాడారు. -
పుష్ప, శ్రీవల్లీల డ్యాన్స్.. ఫ్యాన్స్‌లో 'పీలింగ్స్' జోష్
అల్లు అర్జున్- సుకుమార్ హిట్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'పుష్ప2'. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, కిస్సిక్ సాంగ్ ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. అయితే, తాజాగా పీలింగ్స్ అనే పాటతో అభిమానులను మరోసారి ఫిదా చేశారు. అన్ని భాషల్లో రానున్న ఈ సాంగ్‌లో వచ్చే పల్లవి లిరిక్స్ మలయాళంలోనే ఉండనున్నాయి. ఈ సాంగ్‌లో కూడా దేవీశ్రీ ప్రసాద్ తనదైన మార్క్‌ను చూపించారని చెప్పవచ్చు.పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీగానే ప్లాన్ చేసింది. పాన్ ఇండియా రేంజ్లో ఇప్పటికే పట్నా,చెన్నై,కేరళ, కర్ణాటకలో పుష్ప ఈవెంట్స్ జరిగాయి. ఫైనల్‌గా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి డిసెంబర్ 2వ తేదీన హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో బన్నీ అభిమానులు భారీగానే పాల్గొననున్నారు. -
'పుష్ప' టికెట్ ధర రూ. 3 వేలు.. ఎక్కడో తెలుసా..?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'పుష్ప ది రూల్'.. బాలీవుడ్లో కూడా పుష్ప చిత్రానికి భారీగా అభిమానులు ఉండటంతో అక్కడ భారీ ఎత్తున సినిమాను విడుదల చేస్తున్నారు. ‘పుష్ప 2’ సూపర్ డూపర్ హిట్ అవుతుందని అక్కడి సినీ ప్రముఖులు ఇప్పటికే తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఢిల్లీ, ముంబైలలోని కొన్ని థియేటర్లలో హిందీ వెర్షన్ టిక్కెట్ల ధర రూ. 3000 వరకు ఉంది. బుక్‌మైషోలోనే ఈ ధరకు టికెట్లు అమ్ముడుపోతున్నాయి.పుష్ప సినిమా టికెట్ ధరలు టాలీవుడ్ మాదిరే బాలీవుడ్లో కూడా కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ముంబైలోని మైసన్ PVR: Jio వరల్డ్ డ్రైవ్ థియేటర్లో ఒక టికెట్ ధర రూ. 3000 ఉంది. బుక్‌మైషోలోనే ఈ టికెట్లను పొందే అవకాశం ఉంది. ముంబైలోని పీవీఆర్, ఐనాక్స్ చైన్ లింక్‌లో ఉన్న కొన్ని స్క్రీన్స్‌లలో ఒక టికెట్ ధర రూ. 1500 నుంచి రూ. 2400 వరకు ఉంది. ఢిల్లీలోని PVR డైరెక్టర్స్ కట్ స్క్రీన్స్‌లో హిందీ 2D వెర్షన్ టిక్కెట్ ధర రూ. 2400 వరకు ఉంది. ఢిల్లీలో కూడా పీవీఆర్, ఐనాక్స్కు సంబంధించిన కొన్ని థియేటర్స్‌లలో రూ. 1500 పైగానే ఒక టికెట్ ధర ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించే అంశమని చెప్పవచ్చు. ఈ ధరలతో చూస్తే మన తెలుగు రాష్ట్రాల్లోనే కాస్త బెటర్ అనేలా పరిస్థితి ఉంది.తెలంగాణలో టికెట్ల ధరలు ఇలాపుష్ప-2 సినిమా టికెట్ల ధరల పెంపు, అదనపు షోలకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, సినిమా విడుదల ముందురోజు అంటే డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల నుంచి ప్రదర్శించే బెన్ఫిట్ షోకు అన్ని రకాల స్క్రీన్లలో రూ.800 పెంచుకోవచ్చని అనుమతి ఇచ్చింది. అర్ధరాత్రి 1 గంట, తెల్లవారుజామున 4 గంటల అదనపు షోలకు కూడా అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 5వ తేదీ నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరలు రూ.150, మల్టీఫ్లెక్స్‌లలో రూ. 200 పెంచుకోవచ్చని తెలిపింది. అయితే, డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్స్‌లలో రూ.105, మల్టీఫ్లెక్స్‌లో రూ.150 పెంపునకు అనుమతి ఉంది. డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.20, మల్టీఫ్లెక్స్‌లో రూ.50 పెంపునకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఏపీ ప్రభుత్వం నుంచి ప్రస్థుతానికి టికెట్ల ధరల విషయంలో ఎలాంటి ప్రకటన రాలేదు.అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. ఆరు భాషలల్లో సుమారు 12 వేలకు పైగానే థియేటర్స్‌లలో విడుదల కానుంది. ఈ సినిమా రన్ టైమ్ విషయానికొస్తే 3 గంటలా 20 నిమిషాల 38 సెకన్ల నిడివితో రాబోతోంది.#Pushpa2 one ticket price ₹3️⃣0️⃣0️⃣0️⃣ pic.twitter.com/bCo8JSZWTV— Manobala Vijayabalan (@ManobalaV) December 1, 2024 -
హైదరాబాద్‌లో ‘పుష్ప 2’ ఈవెంట్.. చివరి నిమిషంలో ప్లాన్ ఛేంజ్!
హైదరాబాద్‌లో పుష్ప 2 ఈవెంట్ పక్కా.. కానీ ఎక్కడ? ఎప్పుడు? అనేది నిన్నటి వరకు క్లారిటీ రాలేదు. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది చిత్రబృందం. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్లో సోమవారం(డిసెంబర్ 2) ఈ ఈవెంట్ జరగనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్.చివరి నిమిషంలో ప్లాన్ ఛేంజ్ఇప్పటికే పాట్నా, ముంబై, చెన్నై, కొచ్చిలో భారీ ఈవెంట్స్ నిర్వహించిన పుష్ప 2 టీమ్.. అంతకు మించిన ఈవెంట్‌ని హైదరాబాద్‌లో జరపాలని ముందు నుంచే ప్లాన్ వేసుకున్నారు. డిసెంబర్ 1న ఈ ఈవెంట్‌ని నిర్వహించాలనుకున్నారు. తొలుత ఎల్బీ స్టేడియంలో ప్లాన్ చేశారు. కానీ అక్కడ పర్మిషన్ లభించలేదు. దీంతో మల్లారెడ్డి కాలేజీ గ్రౌండ్‌కి మార్చారు. అయితే అక్కడ కూడా అనుమతి లభించకపోవడంతో చివరి నిమిషంలో ఈ ఈవెంట్‌ని యూసఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్‌కి మార్చారు. ఈ రోజు కాకుండా రేపు (డిసెంబర్ 2) ఈ భారీ ఈవెంట్‌ని నిర్వహించనున్నారు. బన్నీతో పాటు చిత్రబృందం అంతా ఈ కార్యక్రమానికి హాజరుకానుంది. ‘అలా.. ’తర్వాత మళ్లీ ఇలా..యూసఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్లో బన్నీ సినిమా ఈవెంట్ జరగడం ఇది రెండోసారి. తొలిసారి 2020లో బన్నీ నటించిన ‘అల..వైకుంఠపురములో’ మూవీ మ్యూజికల్ ఈవెంట్ ఇక్కడే జరిగింది. దాదాపు ఆరు వేల మంది అంచనాతో ఈవెంట్ నిర్వహించగా.. 15 వేల మందికి పైగా హాజరయ్యారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. అంతేకాదు ఆరు వేల మందికి పర్మిషన్ తీసుకొని..15 వేల మందిని ఆహ్వానించారంటూ ఈవెంట్ ఆర్గనైజేషన్ శ్రేయాస్ మీడియా పై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.టికెట్ రేట్లు భారీగా పెంపుసుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రంపై ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ అయింది. బన్నీ మాస్ ఫెర్ఫార్మెన్స్ని చూసేందుకు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వారి కోసమే బెనిఫిట్ షోలు కూడా వేయబోతున్నారు. తెలంగాణలో నవంబర్ 4 రాత్రి 9.30 గంటల నుంచే ఈ బెన్ఫిట్ షోలు పడబోతున్నాయి. దీని కోసం తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. అంతేకాదు టికెట్ ధరలు కూడా పెంచేశారు. బెనిఫిట్ షోల టికెట్ ధరలు రూ.800 ఖరారు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ లో బెనిఫిట్ షో లకు ఈ ధరలు వర్తిస్తాయి. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.150, మల్టీఫ్లెక్స్ లో రూ.200లకు టికెట్ ధరను పెంచారు. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.105, మల్టీఫ్లెక్స్ లో రూ.150 పెంపునకు అనుమతి తీసుకున్నారు. -
తెలంగాణలో ‘పుష్ప 2’ టికెట్ ధరల పెంపు.. ఒక్కో టికెట్ ధర ఎంతంటే..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 మూవీ టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బెనిఫిట్ షోలతో పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల నుంచి బెనిఫిట్ షోలతో పాటు అర్ధరాత్రి 1 షోలకు అనుమతి ఇచ్చినట్లు ఉత్తర్వులో పేర్కొంది. పుష్ప 2 బెనిఫిట్ షోల టికెట్ ధరలు రూ.800 ఖరారు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ లో బెనిఫిట్ షో లకు ఈ ధరలు వర్తిస్తాయి. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.150, మల్టీఫ్లెక్స్ లో రూ.200లకు టికెట్ ధరను పెంచారు. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.105, మల్టీఫ్లెక్స్ లో రూ.150 పెంపునకు అనుమతి ఇచ్చారు. ఇక డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగల్ స్క్రీన్ లో రూ.20, మల్టీఫ్లెక్స్ లో రూ.50 చొప్పున పెంచుకునేందుకు మేకర్స్‌కి వెసులుబాటు కల్పించింది. (చదవండి: మెగా హీరో కొత్త సినిమా.. ఓటీటీలోకి ఇంత త్వరగానా?)ఇక పుష్ప 2 విషయానికొస్తే.. సుకుమార్ -బన్నీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న నాలుగో సినిమా. మూడేళ్ల క్రింద విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన పుష్ప చిత్రానికి సీక్వెల్ ఇది. రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా.. ఫాహద్ ఫాజిల్ మరో కీలక పాత్ర పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. -
నన్ను స్టార్‌ని చేసింది సుకుమార్: అల్లు అర్జున్
‘‘సుకుమార్‌గారితో నా ప్రయాణం 20 ఏళ్ల కిందట మొదలైంది (2004లో వచ్చిన ‘ఆర్య’ సినిమాని ఉద్దేశించి). ఈ రోజు నేను హీరోగా ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం ఆయనే. నన్ను స్టార్‌ను చేసింది సుకుమారే. నా జీవితంలో అత్యధిక భాగం, హీరోగా నా ఎదుగుదల ఆయనకే చెందుతుంది’’ అన్నారు హీరో అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మికా మందన్నా జంటగా నటించిన చిత్రం ‘పుష్ప: ది రూల్’. శ్రీలీల ప్రత్యేక పాటలో నటించారు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 5న రిలీజవుతోంది.శుక్రవారం ముంబైలో నిర్వహించిన ప్రెస్మీట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ–‘‘పుష్ప: ది రూల్’ విషయంలో నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది నిర్మాతలకు. వాళ్ల సపోర్ట్ లేక΄ోతే ఈ సినిమా సాధ్యపడేది కాదు. మా చిత్రాన్ని బాలీవుడ్లో విడుదల చేస్తున్న అనిల్ తడాని, భరత్ భూషణ్‌లకు థ్యాంక్స్. నా కెరీర్లో ఎన్నో సూపర్‌హిట్ సాంగ్స్ ఇచ్చిన దేవిశ్రీకి ధన్యవాదాలు. ఫాహద్ ఫాజిల్‌తో పని చేయడం గొప్పగా ఉంది. రష్మిక, శ్రీలీలతో పని చేయడం సంతోషంగా ఉంది. ప్రపంచంలో ప్రతి ఇండియన్ మా సినిమా విడుదలను సెలబ్రేట్ చేయడం ఎంతో హ్యాపీగా ఉంది’’ అని చెప్పారు.‘‘ఐదేళ్ల ‘పుష్ప’ ప్రయాణంలో ఎన్నో భావోద్వేగాలున్నాయి. అల్లు అర్జున్‌గారితో తొలి అవకాశం రాగానే చాలా నెర్వస్ అయ్యాను. కానీ, ఈ రోజు ఆయన ఫ్యామిలీ మెంబర్లా ఉన్నాను. సుకుమార్‌లాంటి జీనియస్ దర్శకుడితో పని చేయడం గర్వంగా ఉంది’’ అన్నారు రష్మిక. ‘‘పుష్ప: ది రూల్’ని 12 వేలకు పైగా స్క్రీన్స్‌లో రిలీజ్ చేస్తున్నాం’ అని నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ పేర్కొన్నారు. -
'పుష్ప2' నుంచి మరో సాంగ్ ప్రోమో.. అంతా మలయాళంలోనే
అల్లు అర్జున్- సుకుమార్ హిట్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'పుష్ప2'. పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ నెట్టింట ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా పీలింగ్స్ అనే పాట ప్రోమోను మూవీ టీమ్ విడుదల చేసింది. ఫుల్ సాంగ్‌ను డిసెంబర్ 1న రిలీజ్ చేస్తామని కూడా ప్రకటన చేసింది. అయితే, అన్ని భాషల్లో రానున్న ఈ సాంగ్‌లో వచ్చే పల్లవి లిరిక్స్ మలయాళంలోనే ఉండనున్నాయి. ఈ సాంగ్‌లో కూడా దేవీశ్రీ ప్రసాద్ తనదైన మార్క్‌ను చూపించారని చెప్పవచ్చు. 'పుష్ప2: ది రూల్' ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుంది. సుమారు 5 కట్స్ చెప్పి యూ/ఏ సర్టిఫికెట్‌ను సెన్సార్ బోర్డ్ ఇచ్చింది. సినిమా రన్ టైమ్ 3 గంటలా 20 నిమిషాల 38 సెకన్ల నిడివితో ఉండనుంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. డిసెంబర్ 5న పుష్ప2 విడుదల కానుంది. -
హైదరాబాద్‌లోనే 'పుష్ప 2' ఈవెంట్.. కానీ ప్లాన్ ఛేంజ్!
పాట్నా, చెన్నై, కొచ్చి, ముంబయి.. ఇలా పాన్ ఇండియా సినిమాకు తగ్గట్లే దేశమంతా 'పుష్ప 2' టీమ్ తెగ తిరిగేస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్ ఎక్కడ నిర్వహిస్తారా అనేది కాస్త సందేహంగా అనిపించింది. అయితే ఇప్పుడు వాటికి ఎండ్ కార్డ్ పడిందని తెలుస్తోంది. హైదరాబాద్‌లోనే ఈవెంట్ నిర్వహిస్తున్నప్పటికీ ప్లాన్‌లో చిన్న మార్పు జరిగినట్లు సమాచారం.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 28 సినిమాలు)డిసెంబరు 5న థియేటర్లలో రిలీజయ్యే 'పుష్ప 2'కి కావాల్సినంత బజ్ ఏర్పడింది. అయినా సరే టీమ్‌తో కలిసి దేశమంతా చుట్టేస్తున్న అల్లు అర్జున్.. హైప్‌ని ఇంకా పెంచేస్తున్నాడు. గతంలో 'దేవర' విషయంలో గందరగోళం జరిగిన దృష్ట్యా.. 'పుష్ప 2' హైదరాబాద్ ఈవెంట్‌కి అనుమతిస్తారా అనేది డౌట్‌గానే ఉండేది. యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఉండొచ్చు అన్నారు. కానీ ఇది ఇప్పుడు మల్లారెడ్డి కాలేజీ గ్రౌండ్‌కి మారిందట.టీమ్ అధికారికంగా ప్రకటించినప్పటికీ.. ఇదే వేదిక ఫైనల్ అయిందని తెలుస్తోంది. ఇప్పటికే సెన్సార్ కూడా అయిపోయింది కాబట్టి డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ వేడుకలో పాల్గొంటారని సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో? (ఇదీ చదవండి: చైతూ-శోభిత పెళ్లి సందడి.. హల్దీ ఫొటోలు వైరల్) -
కొచ్చిలో అల్లు అర్జున్ ‘పుష్ప-2 ది రూల్’ ప్రమోషన్ (ఫొటోలు)
-
కొచ్చిలో పుష్ప-2 ఫీవర్.. అల్లు అర్జున్ కొత్త పేరేంటో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. మరో వారం రోజుల్లో థియేటర్లను షేక్ చేయనున్నాడు పుష్పరాజ్. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీ అయిపోయారు. ఇటీవల చెన్నైలో కిస్సిక్ సాంగ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.ఇక ఐకాన్ స్టార్‌కు తెలుగులో మాత్రమే కాదు.. మలయాళంలో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి మలయాళంలో భారీ కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. పుష్ప-2 ప్రమోషన్లలో భాగంగా ఇవాళ కేరళలోని కొచ్చిలో భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. లివా మాల్లోని గ్రాండ్ హయత్‌లో ఈవెంట్ జరగనుంది.ఈ భారీ ఈవెంట్‌కు హాజరయ్యేందుకు ఐకాన్ స్టార్ కేరళకు వస్తున్న సందర్భంగా కొచ్చి అంతటా భారీ హోర్డింగ్స్ మెరిశాయి. పుష్ప-2 పోస్టర్లతో నగరమంతా నింపేశారు. అంతేకాదు ఎయిర్పోర్ట్ వద్ద ఐకాన్ స్టార్ కోసం ఫ్యాన్స్ ఎంతోమంది పోస్టర్లతో దర్శనమిచ్చారు. అయితే పచ్చని పొలాల్లో ఏర్పాటు చేసిన పుష్ప-2 వెల్కమ్ పోస్టర్ మాత్రం బన్నీ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. అల్లు అర్జున్ పేరును ముద్దుగా మల్లు అర్జున్ అంటూ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.కాగా.. సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న పుష్ప-2 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. పుష్పలో మెప్పించిన శ్రీవల్లిగా మరోసారి రష్మిక ఫ్యాన్స్‌ను అలరించనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, కిస్సిక్ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నారు. ఓవర్సీస్లో టికెట్ బుకింగ్ ఓపెన్ కాగా.. రికార్డ్ స్థాయిలో టికెట్స్ అమ్ముడయ్యాయి. Kerala Allu Arjun fans waiting at kochi airport since afternoon 💥Expecting @alluarjun arrival in 15mins #PushpaRulesKeralam KOCHI WELCOMES ALLUARJUN pic.twitter.com/eNwfBwQ3k5— Allu Arjun Devotees 🐉 (@SSAADevotees) November 27, 2024 KERALA WELCOMES MALLU ARJUN 🔥🔥#PushpaRulesKeralam ❤️🔥❤️🔥#Pushpa2TheRule #Pushpa2TheRuleOnDec5th pic.twitter.com/NPj9CqPQBz— Pushpa (@PushpaMovie) November 27, 2024 -
'పుష్ప 2' కంప్లీట్.. చాలాసేపు ఏడ్చిన రష్మిక
'పుష్ప 2' షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని అల్లు అర్జున్ చెప్పాడు. దీంతో ఫ్యాన్స్.. హమ్మయ్యా అనుకున్నారు. మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. టీమ్ అంతా ఎవరి హడావుడిలో వాళ్లు ఉన్నారు. హీరోయిన్ రష్మిక మాత్రం చిత్రీకరణ పూర్తవడంతో తెగ బాధపడిపోతోంది. చాన్నాళ్ల తర్వాత చాలాసేపు కన్నీళ్లు పెట్టుకున్నట్లు చెప్పింది. ఇన్ స్టాలో తన ఎమోషన్ అంతా బయటపెట్టింది.(ఇదీ చదవండి: 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న నటుడు సుబ్బరాజ్)'నవంబర్ 25.. ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. ఎలా స్పందించాలో అర్థం కావట్లేదు. కానీ వివరించి చెబుతా. 24న షూటింగ్ పూర్తి చేసుకుని, ఫ్లైట్‌లో చెన్నై వెళ్లాం. రాత్రికి తిరిగి హైదరాబాద్ వచ్చేశాం. 4-5 గంటలు నిద్రపోయి.. 'పుష్ప' చివరి రోజు షూటింగ్‌కి బయలుదేరా. క్రేజీ పాటని చిత్రీకరించారు(త్వరలో దీని డీటైల్స్ మీకు తెలుస్తాయి). రోజంతా ఆ పాటతోనే గడిచిపోయింది. ఇది నాకు చివరిరోజు షూటింగ్ అని తెలుసు. కానీ ఎందుకో నాకు అలా అనిపించలేదు''నా ఏడెనిమిదేళ్ల కెరీర్లో ఐదేళ్లు ఈ సెట్లోనే ఉన్నాయి. ఇది నాకు రెండో ఇల్లు అయిపోయింది. ఇంకా బోలెడు పని ఉంది. బహుశా పార్ట్-3 కూడా ఉండొచ్చు. ఈ ఫీలింగ్ చాలా వితంగా ఉంది. ఇక్కడితో ఇది ముగిసిపోయిందని బాధగా ఉంది. అన్ని రకాల ఎమోషన్స్ వచ్చేశాయి. బాగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. కానీ నేనెంతో గ్రేట్ అనిపిస్తోంది. నేను అందరికీ చాలా మిస్ అవుతా. చాలారోజుల తర్వాత చాలాసేపు ఏడ్చాను కూడా. అసలు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నానా అని నాకు అర్థం కావట్లేదు. కానీ ఎంతోమంది అద్భుతమైన వ్యక్తులతో పనిచేయడం మాత్రం మర్చిపోలేను'(ఇదీ చదవండి: చైతూ-శోభిత పెళ్లి.. అవన్నీ రూమర్స్ మాత్రమే)'మిగతా వాళ్ల కంటే అల్లు అర్జున్ సర్, సుకుమార్ సర్ నన్ను ఎక్కువగా చూశారు. 'పుష్ప' సెట్ నాకు మరో ఇల్లు అయిపోయింది. కానీ బాధతో దాన్ని విడిచిపెట్టాల్సి వస్తోంది. నవంబర్ 25 అనేది నాకు చాలా కష్టమైన రోజు. కానీ దీనికి ప్రతిఫలం ఓ రోజు దొరుకుతుంది' అని రష్మిక తన భావోద్వేగాలన్నీ బయటపెట్టింది.డిసెంబరు 5న 'పుష్ప 2' వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే బోలెడంత బజ్ వచ్చింది. పాజిటివ్ టాక్ వస్తే చాలు రూ.1000 కోట్ల వసూళ్లు పక్కా అని అంటున్నారు. ఈ మూవీ వల్ల అల్లు అర్జున్‌కి ఎంత కలిసొచ్చిందో రష్మికకు కూడా అంతకుమించి కలిసొచ్చిందని చెప్పొచ్చు. 'పుష్ప' ముందు వరకు రష్మిక ఓ సాధారణ హీరోయిన్. ఈ సినిమా దెబ్బకు పాన్ ఇండియా ఫేమ్, ఆఫర్లు బోలెడన్ని వచ్చాయి. ఇప్పుడు రష్మిక దరిదాపుల్లో వేరే హీరోయిన్ లేదని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
హమ్మయ్యా.. 'పుష్ప 2' షూటింగ్ ఇన్నాళ్లకు పూర్తి
డిసెంబరు 5న 'పుష్ప 2' సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. లెక్క ప్రకారం ఈ పాటికే పనులన్నీ పూర్తయిపోవాలి. కానీ ఇప్పటివరకు షూటింగ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా అల్లు అర్జున్.. అంతా పూర్తయిందని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టడంతో అందరికీ క్లారిటీ వచ్చింది.'లాస్ట్ డే లాస్ట్ షాట్ ఆఫ్ పుష్ప. ఐదేళ్ల ఈ ప్రయాణం పూర్తయింది. వాట్ ఏ జర్నీ' అని అల్లు అర్జున్ రాసుకొచ్చాడు. ఓ ఫొటో పోస్ట్ చేయగా అది ఏదో పెళ్లి జరుగుతున్నట్లు ఉంది. ఇదివరకే ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ సహా అన్ని పూర్తయ్యాయని చెప్పారు. మరో ఒకటి రెండు రోజుల్లో సెకండాఫ్ కూడా పూర్తిచేసి సెన్సార్‌కి పంపించాల్సి ఉంటుంది.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకుని షాకిచ్చిన అక్కినేని అఖిల్)ఇదిలా ఉండగా 'పుష్ప 2' మూవీ నిడివి లాక్ అయిందని.. ఏకంగా 3 గంటల 21 నిమిషాల రన్ టైమ్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా నవంబర్ 30న టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ రెండు విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.'పుష్ప' సినిమా 2021 డిసెంబరు 17న రిలీజ్ కాగా.. దాదాపు మూడేళ్ల తర్వాత 'పుష్ప 2' థియేటర్లలో రాబోతుంది. తొలి పార్ట్ వచ్చినప్పుడు ఎవరికీ పెద్ద అంచనాల్లేవ్. కానీ అనుహ్యంగా పాన్ ఇండియా లెవల్లో సూపర్ అయింది. దీంతో సీక్వెల్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రూ.1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగినట్లు టాక్.(ఇదీ చదవండి: 'పుష్ప' నటుడు శ్రీ తేజ్‌పై పోలీసు కేసు) View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline)