
పుష్ప 2తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు సుకుమార్(Sukumar).. ప్రస్తుతానికైతే ఖాళీగానే ఉన్నాడు. 'పెద్ది' (Peddi Movie) షూటింగ్ పూర్తయిన తర్వాత చరణ్ తో సినిమా చేయాల్సి ఉంది. అప్పటివరకు స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తి చేసుకోవచ్చు. మరోవైపు తారక్ కూడా వార్ 2 చేస్తున్నాడు. త్వరలో ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లో జాయిన్ అవుతాడు. అలాంటిది ఇప్పుడు వీళ్లిద్దరూ కలిశారు.
(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు ఆంథాలజీ సినిమా)
మరి సందర్భం ఏంటో తెలీదు గానీ సుకుమార్ ఇంటికి ఎన‍్టీఆర్ (Jr Ntr) వెళ్లాడు. ఈ విషయాన్ని సుక్కు భార్య తబిత ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. 'తారక్ కి ప్రేమతో' అని సుకుమార్ భుజంపై తారక్ వాలి ఉన్న ఫొటోని పోస్ట్ చేశారు. దీన్ని తారక్ రీ పోస్ట్ చేయగా.. మళ్లీ దీన్ని సుకుమార్ రీ పోస్ట్ చేసి.. 'మై అభిరామ్' అని రాసుకొచ్చాడు.
గతంలో సుకుమార్.. ఎన్టీఆర్ తో 'నాన్నకు ప్రేమతో' సినిమా తీశాడు. సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం హిట్ అయింది. మళ్లీ వీళ్లిద్దరూ ఎప్పుడు కలిసి పనిచేస్తారా అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇలాంటి టైంలో వీళ్లు కలవడం కొత్త ప్రాజెక్ట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అనే సందేహాలు రేకెత్తిస్తోంది.
(ఇదీ చదవండి: 'రామ్ చరణ్' రికార్డ్ దాటాలని ప్రాణాలమీదకు తెచ్చుకున్న ఫ్యాన్స్)
