NTR
-
టెన్నీస్ ఆడి పాతాళభైరవి సినిమాకు సెలక్టైన ఎన్టీఆర్..!
పాతాళ భైరవి.. 1951లో రిలీజై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన తొలి తెలుగు సినిమా. అప్పట్లో 28 కేంద్రాలలో హండ్రెడ్ డేస్ పూర్తి చేసుకొన్న మూవీ. కేవీ రెడ్డి డైరక్షన్లో ఎన్టీ రామారావు, ఎస్వీ రంగారావులు పోటీ పడి మరీ నటించారు. ఉజ్జయిని రాజకుమారిని ప్రేమించిన తోటరాముడు సర్వ సంపన్నుడు కావడానికి నేపాల మాంత్రికుణ్ణి ఆశ్రయిస్తాడు. ఐతే తోటరాముణ్ణి బలిచ్చి పాతాళభైరవి అనుగ్రహాన్ని పొందాలన్నది మాంత్రికుడి ఆలోచన. చివరకు మాంత్రికుడ్ని తోటరాముడు ఎలా మట్టుబెట్టాడన్నదే కథ. (చదవండి: తెలుగింటి హీరో... పక్కింటి దర్శకుడు)మధిర సుబ్బన్న దీక్షితులు రాసిన కాశీ మజిలీ కథల్లోని ఓ కథ ఇది. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోనే ఎలాంటి టెక్నాలజీ అందుబాటులో లేనప్పుడే ఇలాంటి పాంటసీ ఫిలిం చేయాలనే ఆలోచన రావడం.. అనుకున్నదాన్ని అత్యద్భుతంగా తీసి.. చరిత్రలో నిలిచిపోయేలా చేయడం నిజంగా సాహసమనే చెప్పాలి.పాతాళభైరవిలో తోటరాముడి రోల్‌కు తొలుత అక్కినేని నాగేశ్వరరావుని, మాంత్రికుడి పాత్రకు గోవిందరాజుల సుబ్బారావు లేదా ముక్కామలను అనుకున్నారట డైరక్టర్. ఓ రోజు వాహినీ స్టూడియో ప్రెమిసెస్‌లో ఎన్టీఆర్, ఏయన్నార్‌లు టెన్నిస్ ఆడుతుంటే కేవీరెడ్డి అక్కడికొచ్చారు. ఇద్దరు హీరోలూ ఆటలో లీనమైపోయారు. రెండు మూడు సార్లు బాల్ రాకెట్‌కు తగలకపోవడంతో ఎన్టీఆర్‌కు కోపమొచ్చి నెక్ట్స్ బాల్‌ను బలంగా బాదారట. దాంతో అది అడ్రస్ లేకుండా పోయింది. అప్పుడు ఎన్టీఆర్ రాకెట్‌ను పట్టుకున్న విధానం డైరక్టర్ కేవీ రెడ్డికి బాగా నచ్చేయడంతో తోటరాముడి రోల్‌కు ఆయన్ను సెలక్ట్ చేసుకున్నారట. హీరోగా పెద్దగా ఇమేజీ లేని యాక్టర్‌ను తీసుకోవడంతో విలన్‌ను కూడా ముక్కామల కాకుండా కొత్తవాడై ఉండాలని ఎస్వీఆర్ను తీసుకున్నారట. అంటే అప్పటికి ఎన్టీఆర్, ఎస్వీఆర్‌లు ఇద్దరూ కూడా పెద్దగా పేరున్న నటులు కాదన్నమాట.(చదవండి: టీమిండియా జట్టు వరకు పాకిన 'పుష్ప' క్రేజ్)అప్పట్లో సినిమాలకు డూప్‌లుండేవారు కారు. పాతాళభైరవిలోనూ ఎక్కడా డూప్‌లను పెట్టలేదు. ప్రతిదీ నేర్చుకోవాలన్న ఉత్సాహం అప్పటి నటుల్లో ఉండేది. తెల్లవారుజామున 4.30గంలకే ఎస్వీఆర్, ఎన్టీఆర్‌లు వాహిని స్టూడియోకు వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన సాండ్ కోర్టులో ఫైట్స్ రిహార్సిల్స్ చేసేవారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తీసుకున్న రెమ్యునరేషన్ 250 రూపాయలట. అంతేకాదు విజయా సంస్థ కోసం రెండేళ్లలో నాలుగు సినిమాలు చేయాలని ఒప్పందం కూడా జరిగిపోయింది. ఘంటసాల పాటలు ఎవర్ గ్రీన్, మార్కస్ బార్ట్లే కెమెరా మాయాజాలం సినిమాకు ప్రాణం పోశాయి.1952 జనవరిలో గోవాలో జరిగిన తొలి భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో దక్షిణ భారత్ నుంచి ప్రాతినిధ్యం పొందిన ఏకైక సినిమా పాతాళ భైరవే. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఒకే హీరోతో నిర్మాణం జరుపుకొన్న తొలి ద్విభాషా సినిమా కూడా ఇదే. తెలుగులో 1951 మార్చి 15న రిలీజైతే, తమిళంలో అదే ఏడాది మే 17న విడుదలైంది. 1980లో జితేంద్ర హీరోగా ఇదే సినిమాను సూపర్‌స్టార్ కృష్ణ హిందీలో కలర్లో తీశారు. ఈ సినిమాలోని సాహసం సేయరా డింభకా.. రాకుమారి దక్కునురా.. అనే డైలాగ్ ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది. - అలిపిరి సురేష్ -
ఐ యామ్ లెజెండ్
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రస్తుతం ‘వార్ 2’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ మరో లీడ్ రోల్లో నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వార్ 2’ చిత్రం 2025 ఆగస్టు 15న విడుదల కానుంది. కాగా ‘వార్ 2’ చిత్రం తర్వాత హృతిక్ రోషన్ ‘క్రిష్ 4’ సినిమా చేస్తారనే మాట కొన్నిరోజులుగా బాలీవుడ్లో వినిపిస్తోంది. అయితే హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘ఐ యామ్ లెజెండ్’ (2007) రీమేక్ హక్కులను హృతిక్ రోషన్ దక్కించుకున్నారని బీటౌన్ సమాచారం. దీంతో ఈ సినిమా హిందీ రీమేక్‌లో హృతిక్ తొలుత నటిస్తారని, ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని టాక్. -
ఓటీటీలో 'దేవర' ఎంట్రీ సమయం వచ్చేసిందా..?
ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ సినిమా దేవర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయినట్లు సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది. దసరా సందర్భంగా సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 500 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాతో డిస్ట్రిబ్యూటర్స్ కూడా భారీగా లాభ పడ్డారని నాగవంశీ తెలిపారు.దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన దేవర బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఓటీటీలో కూడా నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు డీల్ కుదుర్చుకుంది. థియేటర్లలో రిలీజైన ఆరు వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలనే ఓప్పందం దేవర మేకర్స్‌తో ఉన్నట్లు సమాచారం. దీంతో నవంబర్ 8న తెలుగుతో పాటు హిందీ,తమిళ్,కన్నడ,మలయాళం భాషలలో స్ట్రీమింగ్కు తీసుకురావాలని నిర్ణయించారట. ఈమేరకు బలంగా వార్తలు వస్తున్నాయి.కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్, ప్రకాష్‌రాజ్ వంటి స్టార్స్ నటించారు. -
Missamma Movie: ఆ హీరోయిన్‌పై నిర్మాత ఆగ్రహం.. సావిత్రికి అవకాశం
1955 జనవరి 12న విడుదలైన ‘మిస్సమ్మ’ టాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్. చక్రపాణి నిర్మాతగా ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కింది. ‘మిస్సమ్మ’ మంచి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగారావు, సావిత్రి వంటి దిగ్గజ నటులు ప్రధాన పాత్రలు పోషించారు. హీరోయిన్ సావిత్రికి జమున చెల్లిగా నటించారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘మిస్సమ్మ’. అప్పటికే ఎన్టీఆర్, ఏఎన్నార్ హీరోలుగా నిలదొక్కుకున్నారు. అయినప్పటికీ ఈ సినిమాలో ఎలాంటి కమర్షియల్ హంగులూ ఉండవు. చక్కని హాస్యం, భావోద్వేగాలు, గిల్లికజ్జాలతో సాగుతుంది. సాలూరి రాజేశ్వరరావు అందించిన మ్యూజిక్ ఓ మ్యాజిక్.భానుమతి ప్లేస్‌లో సావిత్రి ‘మిస్సమ్మ’లో ఎస్వీ రంగారావు, సావిత్రి నటన... ఎన్టీఆర్, ఏఎన్నార్లను డామినేట్ చేసేలా ఉంటుంది. సావిత్రి హీరోయిన్గా ఎదుగుతున్న రోజుల్లో వచ్చిన ఈ సినిమా ఆమె కెరీర్‌కి చాలా ప్లస్ అయ్యింది. తన ఇమేజ్ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇందులో ఆత్మవిశ్వాసం కలిగిన స్ట్రాంగ్ లేడీ రోల్ సావిత్రిది. అలాగే ముక్కోపి. ఈ పాత్రకు భానుమతి కరెక్ట్ అని తొలుత దర్శక–నిర్మాతలు భావించారు. అప్పటికే ఆమె పరిశ్రమకు వచ్చి చాలా ఏళ్లయింది. ‘మల్లీశ్వరి’ వంటి బ్లాక్ బస్టర్లో నటించారు. నిజ జీవితంలో భానుమతి వ్యక్తిత్వం... ‘మిస్సమ్మ’లో మేరీ పాత్రలా ఉంటుంది. భానుమతితో ‘మిస్సమ్మ’ షూటింగ్ కొంత మేర జరిగింది కూడా. అయితే ఓ రోజు ఆమె షూటింగ్‌కి ఆలస్యంగా వచ్చారట. దీంతో నిర్మాత చక్రపాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం షూటింగ్ అయితే మధ్యాహ్నం రావడమేంటి క్షమాపణలు చెప్పాలన్నారట. అయితే... ఆలస్యమవుతుందని మేనేజర్‌తో కబురు పంపానని... కాబట్టి క్షమాపణలు చెప్పేది లేదన్నారట భానుమతి. దీంతో చక్రపాణి ఆమెను సినిమా నుంచి తొలిగించి అప్పటివరకు షూట్ చేసిన రీల్స్‌ను తగలబెట్టేశారట. అలా ‘మిస్సమ్మ’లో మెయిన్ హీరోయిన్గా చేస్తున్న భానుమతి స్థానంలోకి సావిత్రి వచ్చారు. లేదంటే హీరోయిన్ చెల్లెలుగా చేసిన జమున పాత్ర చేయాల్సి వచ్చేది. బెంగాలీ నవల మన్మొయీ గర్ల్స్ స్కూల్ అనే హాస్య రచన ఆధారంగా నిర్మాత చక్రపాణి ‘మిస్సమ్మ’ తెలుగు కథను సమకూర్చారు. సినిమా చిత్రీకరణంతా మద్రాసు చుట్టు పక్కలే జరిగింది. ‘మిస్సమ్మ’ను తమిళంలో మిస్సియమ్మగా ఏక కాలంలో చిత్రీకరించారు. ఇందులో జెమినీ గణేశన్, సావిత్రి నటించారు. తెలుగు, తమిళ వెర్షన్లు రెండూ కూడా కమర్షియల్‌గా బంపర్ హిట్టయ్యాయి. 1957లో ఏవీఎం ప్రొడక్షన్స్ ఈ సినిమాను హిందీలోనూ తీసింది. హిందీలో మేరి పాత్రను మీనాకుమారి పోషించగా ‘మిస్ మేరి’గా నిర్మించారు. ఇది ఎల్వీ ప్రసాద్‌కి బాలీవుడ్లో దర్శకుడిగా తొలి చిత్రం.– ఇంటూరు హరికృష్ణ -
ఎన్టీఆర్ టాలీవుడ్ ఎంట్రీ.. యంగ్ టైగర్ ట్వీట్ వైరల్!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకున్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, బాలయ్య, హరికృష్ణ ఇలా ఎందరో సూపర్ స్టార్స్ ఉన్నారు. తాజాగా ఈ కుటుంబం నుంచి మరో యంగ్ హీరో ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు.. తారక రామారావు హీరోగా అరంగేట్రం చేస్తున్నారు.ఈ సినిమాను వైవీఎస్ చౌదరి తెరకెక్కించనున్నారు. న్యూ టాలెంట్ రోర్స్ పతాకంపై ఆయన సతీమణి గీత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా వైవీఎస్ చౌదరి ప్రకటించారు. కొత్త హీరో యంగ్ ఎన్టీఆర్‌ను ఆయన పరిచయం చేశారు. ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఆల్ ది బెస్ట్ చెబుతూ పోస్ట్ చేశారు.ఎన్టీఆర్ తన ట్వీట్లో రాస్తూ..'రామ్ మొదటి అడుగుకు ఆల్ ది బెస్ట్. ఈ సినిమా ప్రపంచం నిన్ను ఆదరించడానికి లెక్కలేనన్ని క్షణాలను అందజేస్తుంది. నీకు విజయం తప్పకుండా వస్తుంది. మీ ముత్తాత ఎన్టీఆర్ , తాత హరికృష్ణ , నాన్న జానకిరామ్ అన్నల ప్రేమ, ఆశీస్సులతో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్న నమ్మకం నాకుంది' అంటూ పోస్ట్ చేశారు. All the best on the first of many steps Ram. The world of cinema will offer you countless moments to cherish… Wishing you nothing but success! With the Love and blessings of your great grandfather NTR garu, grandfather Harikrishna garu and father Janakiram anna, I’m sure you’ll… pic.twitter.com/Op1jRr6KQ7— Jr NTR (@tarak9999) October 30, 2024 -
దేవర హిట్ తో సలార్ ని పక్కన పెట్టిన నీల్..
-
తెలుగు నిర్మాత.. హైదరాబాద్‌లోని చెరువులో దూకేశాడు: శ్రియ
తెలుగులో ఫ్యాన్ వార్స్ మరీ ఎక్కువైపోతున్నాయి. ఓ హీరోని టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్న కొందరు.. కావాలని మరో హీరోలని ట్రోల్ చేస్తుంటారు. ఇప్పుడు అలానే ఎన్టీఆర్‌ని ట్రోల్ చేస్తున్నారు. ఎనిమిది నెలల క్రితం ఓ వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం హీరోయిన్ శ్రియ.. హిందీ ఇంటర్వ్యూలో పాల్గొంది. సినిమా పేరు చెప్పలేదు గానీ ఓ తెలుగు నిర్మాత.. షూటింగ్ చివరిరోజు డబ్బులివ్వలేక హుస్సేన్ సాగర్‌లో దూకేశాడన చెప్పింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: జూనియర్ ఎన్టీఆర్ 'దేవర'.. ఆ సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది!)శ్రియ ఏమందంటే?'నేను, జెనీలియా, ఎన్టీఆర్ కలిసి ఓ పెద్ద సినిమా చేశాం. దీనికి నిర్మాత చేసిన ఆయన చాలా ఫన్నీ. చాలా మంచివాడు. అయితే షూటింగ్ చివరిరోజు మిగిలిన రెమ్యునరేషన్ గురించి అడిగేందుకు వెళ్లాం. కానీ అప్పటికే ఆయన (నిర్మాత) హైదరాబాద్‌లోని చెరువులో(హుస్సేన్ సాగర్) దూకేశాడు. అదృష్టవశాత్తూ ఆయనకు ఏం కాలేదు. అక్కడే ఉన్న ఎవరో ఇద్దరు ముగ్గురు ఆయన్ని కాపాడారు. ఆ తర్వాత మరి నేను పేమెంట్స్ గురించి అడగలేదు' అని శ్రియ చెప్పింది.'నా అల్లుడు' సినిమా నిర్మాత గురించే శ్రియ చెప్పింది. చెరువులు దూకడం, ప్రాణాలతో బయటపడటం లాంటి విషయాల్ని ఈమె చెబుతూ నవ్వేసింది. సరే ఇదంతా పక్కనబెడితే ఇప్పుడెందుకు ఎన్టీఆర్ టార్గెట్ చేసేలా ఈ వీడియోని వైరల్ చేస్తున్నారనేది అర్థం కావట్లేదు. ఈ సందర్భంగా 'నరసింహుడు' మూవీ ప్రొడ్యూసర్ కూడా గతంలో చెరువులో దూకిన విషయమై తారక్‌ని పలువురు యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)🤣🤣🤣🤣pic.twitter.com/1vQOTJoVAB— OG (@Tejuholicc2) October 28, 2024 -
ప్రభాస్ బర్త్ డే రోజున ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
-
రూ.2 లక్షల బడ్జెట్‌తో పాన్ ఇండియా చిత్రం.. ‘మాయా బజార్’ రికార్డులెన్నో!
చరిత్ర గాని, పురాణాలు గాని... వీటిలో మనకు ఏమాత్రం నచ్చని విషయాల్ని మనకు నచ్చిన విధంగా ఓ కల్పిత కథను తయారు చేసుకుని ప్రేక్షకుడ్ని ఆనందింపజేయడాన్ని ఆల్టర్నేటివ్ హిస్టరీ అని అంటారు. ఉదాహరణకు హిట్లర్ని ఓ థియేటర్లో బంధించి కాల్చి హతమార్చడం, మహాభారతంలో కౌరవుల కుతంత్రాలను బట్టబయలు చేసి వాళ్లని నవ్వులపాలు చేయడం వంటివి. ఇలాంటి ప్రత్యామ్నాయ చరిత్ర కలిగిన కథలు మన అహాన్ని సంతృప్తిపరుస్తాయి కాబట్టి స్వతహాగానే వాటివైపు ఆకర్షితులవుతాం. సరిగ్గా అలాంటి కోవకు చెందినదే ‘మాయాబజార్’ సినిమా. ఈ చిత్రం లక్ష్యం కూడా అదే.మాయాబజార్ అను శశిరేఖా పరిణయంగా...వ్యాస భారతం ప్రకారం బలరాముడుకి శశిరేఖ అని పిలువబడే కూతురే లేదు. మాయాబజార్ నిజానికి శశిరేఖా పరిణయం అనే పేరుతో మన దగ్గర ప్రసిద్ధిగాంచిన ఓ కల్పిత జానపద కథ. దీని ఆధారంగా ‘మాయాబజార్’కి ముందు, తరువాత అనేక చిత్రాలు రూపొందినా కేవీ రెడ్డి రూపొందించిన ఈ ఒక్క సినిమా మాత్రమే అత్యంత ప్రజాదరణకు నోచుకుంది.‘మాయాబజార్’కు తొలుత చాలా పేర్లనే అనుకున్నారు. సినిమాలో ఘటోత్కచుడు పాత్రను ఎస్వీ రంగారావు చేశారు కాబట్టి ముందుగా ఈ సినిమా పేరును ఘటోత్కచుడు అని పెట్టాలని అనుకున్నారట. తర్వాత శశిరేఖా పరిణయం అని పేరు పెట్టారు. ఆ తర్వాత దానిని మాయాబజార్ అను శశిరేఖా పరిణయంగా మార్చారు. చివరికి విడుదలయ్యే సమయానికి అది ‘మాయాబజార్’గా మిగిలింది. ‘మాయాబజార్’ కథకు ఉన్న లక్ష్యం కేవలం శశిరేఖకు, అభిమన్యుడికి పెళ్లి చెయ్యటం కాదు... కొన్ని కారణాల వల్ల వంచించబడ్డ శశిరేఖ తల్లిదండ్రుల మనసు మార్చటం, కౌరవులను నవ్వులపాలు చేసి, వాళ్లని దండించబడటం ఈ కథలోని అంతిమ లక్ష్యం. కృష్ణుడు బలరాముడికి హితబోధ చేసినా, అభిమన్యుడు లక్ష్మణ కుమారుడితో యుద్ధానికి దిగినా శశిరేఖా పరిణయం సాధ్యమయ్యేది.. కానీ కథకున్న అంతిమ లక్ష్యం సాధ్యపడేది కాదు.చిన్న కథ... బలమైన స్క్రీన్ప్లేనిజానికి ‘మాయాబజార్’ కథ చాలా చిన్నది. అయితే బలమైన స్క్రీన్ ప్లేతో దీనిని రక్తి కట్టించారు దర్శకులు కేవీ రెడ్డి. ప్రథమార్ధం కేవలం నాటకీయత మాత్రమే ఉంటుంది. ఆ నాటకీయ పరిణామాలు ఇప్పటికీ సమకాలీన పరిస్థితుల్లానే అనిపిస్తాయి. అమ్మాయి–అబ్బాయి ప్రేమలో పడటం, ఆ ప్రేమకి తల్లిదండ్రులు అడ్డు చెప్పటం, తల్లి కూతుర్ని కొట్టడం, డబ్బు పోగానే ముఖం చాటేసే చుట్టాలు, తండ్రిని ప్రశ్నించే ధైర్యం లేని కూతురు... వంటివి ఇప్పటికీ ప్రతీ ఇంట్లో కనిపించేవే. ప్రేక్షకుడిని ఈ వాస్తవిక పరిస్థితులు ముందుగా కథతో కనెక్ట్ చేస్తాయి. ప్రథమార్ధమంతా లక్ష్యానికి పూర్తిగా దూరం చేసి, ఇక ఏ రకమైన ఆశ మిగలని స్థితికి తీసుకెళ్లి, ఘటోత్కచుడు ప్రవేశించడంతో వడివడిగా లక్ష్యాన్ని చేరుకునేలా చేస్తారు. పూర్తి విషాదం తర్వాత వచ్చే ఆనందానికి విలువ ఎక్కువ ఉంటుంది. కౌరవుల్ని ఏమీ చెయ్యలేం అనుకునే మాన సిక స్థితికి ప్రేక్షకుడ్ని తీసుకొచ్చి, తర్వాత వాళ్లని వెర్రివాళ్లని చేసి ఆడుకోవటం వల్ల వచ్చే కిక్కు మామూలుగా ఉండదు.ఎస్వీఆర్ మీదే ప్రమోషన్!66 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాలోని సాంకేతికత గురించి ఇప్పటికీ చర్చించుకోవడానికి కారణం కెమెరామేన్ మార్కస్ బార్ట్ లీ. గ్రాఫిక్స్ లేని కాలంలో కెమెరా టెక్నిక్స్‌తో సృష్టించిన మాయాజాలానికి అప్పట్లో ప్రేక్షకులు నిశ్చేష్ఠు లయ్యారు. నిజంగా మాయ జరుగుతున్నట్టుగానే భావించారట. ముఖ్యంగా వివాహ భోజనంబు పాటలో లడ్డూలన్నీ నోట్లోకి సరాసరి వెళ్ళిపోవడం, ఆహార పాత్రలన్నీ వాటికవే కదలడం.. వంటి సీన్లకు మంత్రముగ్ధులయ్యారు. ఈ సినిమాలోనే ఎన్టీఆర్ మొదటిసారిగా శ్రీకృష్ణుడిగా కనిపించారు. అంతకు ముందు 1954లో వచ్చిన ‘ఇద్దరు పెళ్ళాలు’, 1956లో వచ్చిన ‘సొంతవూరు’ సినిమాల్లో కృష్ణుడిగా కనిపించినప్పటికీ, అవి పూర్తి స్థాయి కృష్ణుడి పాత్రలు కావు. ‘మాయాబజార్’ టైమ్‌లో ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల మార్కెట్ కన్నా ఎస్వీఆర్ మార్కెట్ ఎక్కువ. జనాల్లో పాపులారిటీ కూడా ఎక్కువే. అందుకే రిలీజ్‌కు ముందు ఈ సినిమా ప్రమోషన్లను ఎస్వీఆర్ పేరు మీదే చేశారట.రెండు లక్షల బడ్జెట్‌తో...‘మాయాబజార్’ను సుమారు రెండు లక్షల బడ్జెట్‌తో నిర్మించారు. అప్పట్లో తెలుగులో వచ్చిన భారీ బడ్జెట్ సినిమా ఇదే. సాధారణంగా 30 వేల బడ్జెట్‌ను మించి సినిమాలు తీయడానికి అప్పట్లో నిర్మాతలు సాహసించేవారు కాదు. కానీ ‘మాయాబజార్’ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విజయా ప్రొడక్షన్స్ ఖర్చుకు వెనకాడలేదు. తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కిన తొలి సినిమా కూడా ఇదే. ఆ తరువాత ఈ సినిమాను హిందీ, బెంగాలీ, కన్నడ భాషల్లో డబ్ చేశారు. విడుదలైన అన్నిచోట్లా విజయాన్ని అందుకుంది. అంటే ఒక విధంగా ‘మాయాబజార్’ని తొలి పాన్ ఇండియా మూవీ అనొచ్చేమో. అందుకే నాటికైనా నేటికైనా మరెప్పటికైనా ‘మాయాబజార్’ అనేది ఓ గోల్డ్ మెమరీ. – ఇంటూరు హరికృష్ణ -
ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు: ఎన్టీఆర్
‘దేవర: పార్ట్ 1’ బ్లాక్‌బస్టర్ కావడంతో హీరో ఎన్టీఆర్ చాలా హ్యాపీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన చిత్రం ‘దేవర: పార్ట్ 1’. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మించిన ఈ సినిమా గత నెల 27న విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటివరకు రూ. 500 కోట్లు వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ పోస్టర్స్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఓ థ్యాంక్స్ నోట్ షేర్ చేశారు. ఆ నోట్ సారాంశం ఏంటంటే.... ‘‘దేవర పార్ట్ 1’కి అందుతున్న అద్భుతమైన స్పందనకు హృదయపూర్వక కృతజ్ఞతలు. నా దర్శకుడు కొరటాల శివగారికి ధన్యవాదాలు. ఈ కథను సృష్టించిన ఆయన దిశా నిర్దేశంతోనే ఈప్రాజెక్ట్ విజయవంతమైంది. తమ పాత్రలకు జీవం పోసిన నా సహ నటీ నటులు జాన్వీ, సైఫ్ అలీఖాన్ సార్, ప్రకాశ్‌రాజ్‌గారు, శ్రీకాంత్‌గార్లకు, ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచినందుకు సంగీతదర్శకుడు అనిరుధ్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సార్,ప్రోడక్షన్ డిజైనర్ సాబు సార్, వీఎఫ్ఎక్స్ యుగంధర్గారు, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్‌గార్లకు ధన్యవాదాలు.మా సినిమాను విజయవంతంగా ప్రదర్శించిన పంపిణీదారులు, థియేటర్ ప్రదర్శకులకు ధన్యవాదాలు. నా సినీ పరిశ్రమ మిత్రులకు, వారు అందించిన ప్రేమకు ధన్యవాదాలు. ఈ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా రూపొందించినందుకు మా నిర్మాతలకు ధన్యవాదాలు. ప్రపంచవ్యాప్తంగా ఇంతటి ఆదరణ చూపిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు, నా కుటుంబ సభ్యులైన నా అభిమానులందరికీ, గత నెల రోజులుగా ‘దేవర పార్ట్ 1’ చిత్రాన్ని ఒక పండగలా జరుపుకుంటున్నందుకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు ఎల్లప్పుడూ గర్వపడే చిత్రాలు చేస్తూనే ఉండడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను’’ అని ఆ నోట్లో ఎన్టీఆర్ పేర్కొన్నారు. -
ఓటీటీలో 'దేవర'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయిందా?
దసరాకు దాదాపు అరడజను సినిమాలు రిలీజయ్యాయి. కానీ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాయి. దీంతో అప్పటికే థియేటర్లలో ఉన్న 'దేవర' హవా కాస్త కొనసాగింది. ఈ క్రమంలోనే రూ.500 కోట్ల కలెక్షన్ మార్క్ దాటేసినట్లు నిర్మాతలు కూడా అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు 'దేవర' ఓటీటీ రిలీజ్ ఇదేనంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు)ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో తీసిన సినిమా 'దేవర'. యాక్షన్ ఎంటర్టైనర్ కథతో తెరకెక్కించారు. సెప్టెంబరు 27న థియేటర్లలో రిలీజైంది. తొలిరోజు మిక్స్డ్ టాక్ వచ్చింది. మెల్లమెల్లగా పాజిటివ్ టాక్ వచ్చి, పికప్ అయింది. అలా 16 రోజుల్లో రూ.500 కోట్ల మార్క్ అందుకుంది. ఇప్పుడు ఓటీటీ డేట్ ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.'దేవర' మూవీ డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. అయితే థియేటర్లలో రిలీజ్ కావడానికి ముందే ఆరు వారాల ఒప్పందం కుదిరిందట. ఈ లెక్కన నవంబరు 8 నుంచి ఓటీటీలో 'దేవర' స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. మరి ఇందులో నిజమేంటనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఆస్పత్రిలో ఉంటే ఎవరు సాయం చేయలేదు: చలాకీ చంటి) -
రూ.500 కోట్లు దాటేసిన 'దేవర' కలెక్షన్
ఎన్టీఆర్ 'దేవర' రూ.500 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకుంది. సెప్టెంబరు 27న పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ చిత్రానికి తొలుత మిక్స్డ్ టాక్ వచ్చింది. తెలుగు ప్రేక్షకులే చాలామంది మూవీ నచ్చలేదని అన్నారు. కానీ రోజురోజుకు కుదురుకుని.. 16 రోజుల్లో ఇప్పుడు రూ.500 కోట్ల వసూళ్లు మార్క్ దాటేసింది. ఈ మేరకు నిర్మాతలు అధికారిక ప్రకటన చేశారు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ నూతన్ నాయుడు ఇంట్లో విషాదం)'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ చేసిన సినిమా ఇది. 'ఆచార్య' లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల చేసిన సినిమా కావడంతో తొలుత చాలామంది 'దేవర'పై సందేహపడ్డారు. కానీ ఎన్టీఆర్ యాక్టింగ్, అనిరుధ్ పాటలు, బీజీఎం మూవీకి వెన్నముకగా నిలిచాయి. హిట్టా ఫ్లాప్ అనే సంగతి పక్కనబెడితే రూ.500 కోట్ల వసూళ్లు వచ్చాయంటే విశేషమనే చెప్పాలి.'దేవర' రెండో భాగానికి సంబంధించిన వర్క్ త్వరలో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఎన్టీఆర్.. 'వార్ 2' అనే హిందీ సినిమా చేస్తున్నాడు. మరో రెండు నెలలో ప్రశాంత్ నీల్ తీయబోయే మూవీ షూటింగ్‌కి హాజరవుతాడు. ఈ రెండు పూర్తయిన తర్వాతే 'దేవర 2' ఉండే అవకాశముంది. (ఇదీ చదవండి: హీరోగా 'బిగ్‌బాస్' అమరదీప్.. కొత్త సినిమా మొదలు)A Sea of Bloodand a Shoreline of Destruction 🔥Man of Masses @Tarak9999’s Massacre made #Devara cross 𝟓𝟎𝟎 𝐂𝐫𝐨𝐫𝐞𝐬+ 𝐆𝐁𝐎𝐂 😎&Sending a Notice of being a truly Unstoppable hunt ❤️🔥#BlockbusterDevara pic.twitter.com/p613NQO86j— Devara (@DevaraMovie) October 13, 2024 -
రామ్ చరణ్ కు గిఫ్ట్
-
ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ మూవీ క్రేజీ అప్డేట్..
-
ఇకపై తెరపై దావూదీ...
దేవర... వర... ‘దేవర’ చిత్రంలో ఈ రెండుపాత్రల్లో అభిమానులకు రెండింతల ఆనందాన్నిచ్చారు ఎన్టీఆర్. అభిమానులు విజిల్స్ వేయకుండా ఉండలేని విధంగా డైలాగ్స్ పలికారు. ఫైట్స్‌లో విజృంభించారు... సాంగ్స్‌లో స్టెప్స్ అదరగొట్టారు... ఎమోషనల్ సీన్స్‌లో మనసును తాకారు. ఇలా మొత్తం మీద ఎన్టీఆర్ మరోసారి నటుడిగా విజృంభించిన చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృçష్ణ .కె నిర్మించిన ‘దేవర’ మంచి వసూళ్లు సాధిస్తూ, దూసుకెళుతోంది. దాంతో చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది. ఆ విశేషాల్లోకి...‘దేవర’ చిత్రం విడుదలకు రెండు రోజుల ముందు ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. బుధవారం ఆయన హైదరాబాద్‌కు చేరుకున్నారు. అయితే గురువారం ఈ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ జరగాల్సి ఉండగా దేవీ నవరాత్రుల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్మీట్కు అనుమతి లభించలేకపోవడంతో కుదరలేదు. ఇక హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్లో చిత్రబృందం సక్సెస్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసింది. ఈ సెలబ్రేషన్స్‌లో రాజమౌళి, ప్రశాంత్ నీల్, ‘దిల్’ రాజు, డీవీవీ దానయ్య, నాగవంశీ వంటివారితోపాటు పలువురు పంపిణీదారులుపాల్గొన్నారు. ఆరేళ్లకు సోలోగా... ఎన్టీఆర్ అభిమానులు తమ హీరోని సిల్వర్ స్క్రీన్‌పై సోలో హీరోగా చూసింది ‘అరవింద సమేత వీర రాఘవ’ (2018) తర్వాత ‘దేవర’లోనే. ఈ గ్యాప్‌లో ‘ఆర్ఆర్ఆర్’తో తెరపై కనిపించారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్ మరో హీరో అని తెలిసిందే. ఇక ఆరేళ్లకు ఎన్టీఆర్ సోలోగా నటించిన చిత్రం కావడం, దేవర–వరగా రెండుపాత్రల్లో ఎన్టీఆర్ కనిపించడం ఫ్యాన్స్‌కి ఐ ఫీస్ట్ అయింది. 7 రోజులకు రూ. 400 కోట్లు ‘జనతా గ్యారేజ్’ వంటి సూపర్ హిట్ తర్వాత హీరో ఎన్టీఆర్–దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన చిత్రం కావడంతో ‘దేవర’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ‘మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు.. కాదు కూడదు అని మీరు మళ్లీ ఆ ధైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా...’, ‘దేవర అడిగినాడంటే... సెప్పినాడని అదే సెప్పినాడంటే...’ అంటూ విడుదలైన డైలాగ్స్, ‘చుట్టమల్లె...’పాట, దివంగత ప్రముఖ నటి శ్రీదేవి కుమార్తె జాన్వీకి తెలుగులో తొలి చిత్రం వంటివన్నీ ‘దేవర’ సినిమాపై అంచనాలు పెంచాయి. ఆ అంచనాలను ‘దేవర’ చేరుకున్నాడని చెప్పడానికి వసూళ్లు నిదర్శనం. విడుదలైన ఏడు రోజులకు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు రూ. 400 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇక పండగ సెలవులు మొదలయ్యాయి కాబట్టి వసూళ్ల దూకుడు ఆగదని ఊహించవచ్చు. దసరా సెలవులు... ‘దేవర’ దూకుడు దసరా పండగ సెలవులు మొదలయ్యాయి. సెలవులు,పోటీలో మరో భారీ చిత్రం లేకపోవడం ‘దేవర’కి కలిసొచ్చే విషయం. ఇంకో వారం దాకా వసూళ్ల దూకుడు ఆగదనే అంచనాలు ఉన్నాయి. పైగా అభిమానులను ఖుషీ చేసేలా శుక్రవారం నుంచి ‘దావూదీ...’పాటను కూడా జోడించారు. ‘దేవర’ విడుదలకు కొన్ని రోజులు ముందు విడుదలైన ఈపాటకు మంచి స్పందన లభించింది. కానీ సినిమాలో లేకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు. అయితే శుక్రవారం నుంచి అన్ని థియేటర్లలో ఈపాట కనిపిస్తోంది. ‘దేవర 2’ ఎప్పుడంటే... ‘దేవర 2’ షూట్‌ను వచ్చే ఏడాది చివర్లో ఆరంభించాలనుకుంటున్నారని సమాచారం. 2026లో ‘దేవర 2’ విడుదలయ్యే చాన్స్ ఉందట. ఈ గ్యాప్‌లో ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సినిమా చేస్తారు ఎన్టీఆర్. అలాగే హిందీలో ‘వార్ 2’ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదలవుతుంది. ప్రశాంత్ నీల్‌తో చేసే చిత్రం 2026 జనవరిలో విడుదల కానుంది. ఒకవేళ ‘దేవర 2’ కూడా 2026లోనే విడుదలైతే అప్పుడు ఒకే ఏడాదిలో ఎన్టీఆర్ రెండు సినిమాల్లో కనిపించినట్లు అవుతుంది. అదే జరిగితే 2016 (నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్) తర్వాత... పదేళ్లకు ఒకే ఏడాది ఎన్టీఆర్ రెండు సినిమాల్లో కనిపించేది 2026లోనే అవుతుంది. -
కథ విన్నారా?
హీరో ఎన్టీఆర్, తమిళ దర్శకుడు ‘జైలర్’ ఫేమ్ నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల ఎన్టీఆర్‌ను నెల్సన్ దిలీప్‌కుమార్ కలిసి ఓ కథ వినిపించారని, ఈ కథకు ఎన్టీఆర్ అంగీకారం తెలిపారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో తెరపైకి వచ్చింది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ హిందీ చిత్రం ‘వార్ 2’ (ఇందులో హృతిక్ రోషన్ మరో హీరో)తో బిజీగా ఉన్నారు. త్వరలోనే ప్రశాంత్ నీల్‌తో చేయనున్న ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా సెట్స్‌లో జాయిన్ అవుతారు. మరోవైపు ‘జైలర్ 2’ సినిమా స్క్రిప్ట్‌ను మరింత మెరుగుపరిచే పనుల్లో ఉన్నారు నెల్సన్. ‘జైలర్’లో హీరోగా నటించిన రజనీకాంత్ ‘జైలర్ 2’లోనూ నటిస్తారు. ఇలా... ‘వార్, డ్రాగన్’ సినిమాలను ఎన్టీఆర్ పూర్తి చేశాక, అటు ‘జైలర్ 2’ను నెల్సన్ కంప్లీట్ చేశాక... కానీ ఎన్టీఆర్–నెల్సన్ కాంబోలోని సినిమా సెట్స్‌పైకి వెళ్లే చాన్సెస్ కనిపించడం లేదు. దీంతో ఈ సినిమా పై అధికారిక ప్రకటన రావడానికి, ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లడానికి చాలా సమయం పడుతుందని ఊహించవచ్చు. -
ఎన్టీఆర్ కోసం 'సప్త సాగరాలు దాటి'వచ్చేస్తోన్న హీరోయిన్! (ఫొటోలు)
-
ఎన్టీఆర్-నీల్ మూవీ కోసం 'సాగరాలు' బ్యూటీ?
'దేవర' హిట్‌తో ఎన్టీఆర్ మంచి జోష్‌లో ఉన్నాడు. త్వరలోనే ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్లో పాల్గొంటాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి క్రేజీ అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరోయిన్గా కన్నడ బ్యూటీని పరిశీలిస్తున్నారని, స్టోరీ కూడా ఇదేనని తెగ మాట్లాడేసుకుంటున్నారు.(ఇదీ చదవండి: నాలుగో పెళ్లికి సిద్ధమైన ప్రముఖ నటి.. డేట్ ఫిక్స్)ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ సినిమాని చాలా రోజుల క్రితమే ప్రకటించారు. కానీ ఇద్దరూ ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా ఉండటం వల్ల ఇన్నాళ్లు పట్టింది. నవంబరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. డిసెంబరు నుంచి తారక్ సెట్స్‌లోకి వస్తాడని తెలుస్తోంది. ఇకపోతే 'సప్త సాగరాలు దాటి' ఫేమ్ రుక్మిణి వసంత్.. హీరోయిన్గా అనుకుంటున్నారని టాక్ నడుస్తోంది.2019 నుంచి ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది రుక్మిణి. ప్రస్తుతానికి తమిళంలో ఒకటి, కన్నడలో రెండు చిత్రాలు చేస్తోంది. ఇప్పుడు తారక్ సరసన అనేసరికి ఈమె ఫ్యాన్స్ ఎగ్జైట్ అయిపోతున్నారు. ఇకపోతే ఈ సినిమా స్టోరీ బంగ్లాదేశ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండనుందని తెలుస్తోంది. పూర్తిస్థాయి యాక్షన్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయట.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్) -
రైతుల్ని దూషించిన కొలికపూడి శ్రీనివాస్
ఎన్టీఆర్,సాక్షి: రైతులపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారు తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్. కుక్కలకైనా విశ్వాసముంటుంది కానీ రైతులకు లేదని వ్యాఖ్యానించారు. లక్షలు ఖర్చు పెట్టి పంట కాలువల్లో పూడికలు తీయించానని తెలిపారు. రైతులకు తన పట్ల విశ్వాసం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు ముందు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌పై కృష్ణా జిల్లా చిట్టేల గ్రామానికి చెందిన మహిళలు భగ్గుమన్నారు. ఈ ఎమ్మెల్యే మాకొద్దంటూ ఆందోళనకు దిగారు. కొలికపూడిపై సీఎం చంద్రబాబు తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.మహిళల పట్ల ఎమ్మెల్యే వ్యవరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా సిబ్బంది ఫోన్లకు అసభ్యకరంగా మెసేజ్‌లు పంపి వేధిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే నుంచి తన రక్షణ కావాలని వేడుకున్నారు. -
బాక్సాఫీస్ వసూళ్లు.. 'దేవర' సరికొత్త రికార్డులు
ఎన్టీఆర్ 'దేవర' సరికొత్త రికార్డులు సెట్ చేసేలా ఉంది. ఎందుకంటే రిలీజ్‌కి ముందు ఓ మాదిరి ట్రోలింగ్కి గురైన ఈ సినిమా ఇప్పుడు తొలిరోజు ఏకంగా రూ.172 గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇన్నాళ్లు పాన్ ఇండియా సినిమా అంటే ప్రభాస్ మాత్రమే అనే దగ్గర నుంచి లిస్టులో తారక్ కూడా చేరిపోయాడు అనేంత వరకు వెళ్లింది. అలానే 'దేవర' పలు రికార్డులు కూడా సెట్ చేసినట్లు తెలుస్తోంది.టాప్-5లోకి 'దేవర'పాన్ ఇండియా అంటే తెలుగు, దక్షిణాది సినిమాలు మాత్రమే అనేలా ఉన్నాయి. ఎందుకంటే తొలిరోజు వసూళ్లలో తొలి ఐదు స్థానాల్లో మనమే ఉన్నాం మరి. ఆర్ఆర్ఆర్ (రూ.223.5 కోట్లు), బాహుబలి 2 (రూ.214.5 కోట్లు), కల్కి 2898 ఏడీ (రూ.191.5 కోట్లు), సలార్ (రూ.178.8 కోట్లు) ఇప్పటివరకు టాప్-4లో కొనసాగుతున్నాయి. వీటి తర్వాతి స్థానంలో దేవర (రూ.172 కోట్లు) వచ్చి చేరింది. అనంతరం కేజీఎఫ్ 2 (రూ.164.2 కోట్లు), ఆదిపురుష్ (రూ.136.8 కోట్లు), సాహో (రూ.125.6 కోట్లు) ఉన్నాయి.(ఇదీ చదవండి: 'దేవర' పార్ట్ 2లో స్టోరీ ఏం ఉండొచ్చు?)తెలుగు రాష్ట్రాల్లోనూఇక తెలుగు రాష్ట్రాల్లోనూ తొలిరోజు వసూళ్లలో 'దేవర' సరికొత్త రికార్డ్ సెట్ చేసిందనే చెప్పాలి. రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' రూ.74.11 కోట్లు సాధించగా.. ఇప్పుడు 'దేవర' రూ.54.21 కోట్ల షేర్‌తో రెండో స్థానంలోకి వచ్చింది. అంతకు ముందు ప్రభాస్ సలార్ రూ.50.49 కోట్లతో ఈ ప్లేసులో ఉండేది. ఈ లెక్కన చూసుకుంటే టాప్-2లోని రెండు మూవీస్ కూడా తారక్వే కావడం విశేషం.ప్రభాస్ తర్వాత ఎన్టీఆరే?ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే పాన్ ఇండియా రేంజులో ప్రభాస్ తర్వాత సిసలైన స్టార్ ఎన్టీఆరే అనిపిస్తున్నాడు. ఎందుకంటే సోలో హీరోగా తొలిరోజే రూ.172 కోట్ల కలెక్షన్ రాబట్టడం అంటే సాధారణమైన విషయం కాదు. ప్రస్తుతానికి తారక్ ఉన్నప్పటికీ 'పుష్ప 2', 'గేమ్ ఛేంజర్' తదితర చిత్రాలు రిలీజైతే లెక్కలు మారే ఛాన్సులు ఉంటాయి. (ఇదీ చదవండి: 'దేవర'తో రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయిందా?) -
అఫీషియల్.. 'దేవర' తొలిరోజు కలెక్షన్ ఎంతంటే?
ఎన్టీఆర్ 'దేవర' మూవీ బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తోంది. తొలిరోజు మిక్స్డ్ టాక్ వచ్చింది గానీ దాదాపు థియేటర్లన్నీ హౌస్‌ఫుల్స్ అయిపోయాయి. నార్త్ సౌత్ అనే తేడా లేకుండా ప్రతిచోట దేవరోడి బీభత్సం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తొలిరోజు భారీ కలెక్షన్స్ వచ్చాయి. సోలోగా వచ్చిన తారక్.. రూ.150 కోట్ల మార్క్ తొలిరోజే దాటేశాడు.(ఇదీ చదవండి: 'దేవర' పార్ట్ 2లో స్టోరీ ఏం ఉండొచ్చు?)ఓవర్సీస్లో రిలీజ్‌కి ముందే దాదాపు రెండున్నర మిలియన్ల వసూళ్లని అందుకున్న దేవర.. తొలిరోజు ముగిసేసరికి 3.8 మిలియన్ డాలర్లు సాధించింది. ఈ మేరకు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ రూ.60 కోట్ల నెట్ వసూళ్లు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.ఇక నైజాంలో 'దేవర'కు తొలిరోజు రూ.20 కోట్ల మేర కలెక్షన్ వచ్చినట్లు తెలుస్తోంది. ఓవరాల్‌గా అంటే ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు ఏకంగా రూ.172 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు నిర్మాతలు ఘనంగా ప్రకటించకున్నారు. ఈ లెక్కన చూసుకుంటే వీకెండ్ పూర్తయ్యేసరికి రూ.400 కోట్ల మార్క్ దాటేస్తుందేమో?(ఇదీ చదవండి: 'దేవర'తో రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయిందా?)No force can hold back the TSUNAMI OF #DEVARA 🔥#BlockbusterDEVARA pic.twitter.com/oGhYIZ0TuG— Devara (@DevaraMovie) September 28, 2024 -
జాన్వీకి రెండుసార్లు ఫుడ్ పంపించా.. కానీ: ఎన్టీఆర్
'దేవర' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. మొన్నటివరకు ప్రమోషన్స్ చేసి తెగ అలసిపోయారు. దాదాపు ఇంటర్వ్యూలన్నీ ఇప్పటికే ప్రసారం అయిపోగా.. 'ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో' మాత్రం పెండింగ్‌లో ఉండిపోయింది. తాజాగా శనివారం సాయంత్రం 8 గంటలకు స్ట్రీమింగ్ కానుంది. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: 'దేవర' పార్ట్ 2లో స్టోరీ ఏం ఉండొచ్చు?)ఈ షోలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ పాల్గొన్నారు. ప్రోమోనే ఫుల్ ఆన్ ఎంటర్టైనింగ్గా సాగింది. ఎపిసోడ్ వేరే రేంజులో ఉంటుందని చెప్పకనే చెప్పినట్లయింది. ఇకపోతే ప్రోమోలోనే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల్ని చూపించారు. 'దేవర' షూటింగ్ కోసం జాన్వీ హైదరాబాద్ వస్తే ఎన్టీఆర్ రెండుసార్లు ఫుడ్ పంపించాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా బయటపెట్టాడు.కానీ జాన్వీ కపూర్ మాత్రం తనకు తానుగా ఫుడ్ వండుకునేదని, నాకు మాత్రం కొంచెమైనా పెట్టేది కాదని ఎన్టీఆర్ చెప్పాడు. దీంతో జాన్వీ నవ్వేసింది. అలానే 'ఆర్ఆర్ఆర్' ఇంటర్వెల్ సీన్లో తాను నిజమైన జంతువులు ఉన్న ట్రక్‌లో చాలా సేపు ఉన్నానని జనాలు అనుకుంటున్నారని, అది గ్రాఫిక్స్ అని చెప్పినా సరే నమ్మట్లేదని తారక్ చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: ‘దేవర’ మూవీ రివ్యూ) -
'దేవర' పార్ట్ 2లో స్టోరీ ఏం ఉండొచ్చు?
'దేవర' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. బ్లాక్‌బస్టర్ అనడం లేదు. అలా అని తీసిపారేయదగ్గ మూవీ అయితే కాదు. ఎన్టీఆర్ యాక్టింగ్, అనిరుధ్ బీజీఎం టమెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. ఓవరాల్‌గా చూసుకుంటే సగటు ప్రేక్షకుడు ఎంటర్టైన్ అయితే అవుతాడు. అయితే చివర్లో వచ్చే ట్విస్ట్ 'బాహుబలి'ని గుర్తు చేస్తుందని చాలామంది అంటున్నారు. మూవీలోని సీన్లు కూడా గతంలో వచ్చిన పలు చిత్రాల్లోని సన్నివేశాలని పోలినట్లు ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: ‘దేవర’ మూవీ రివ్యూ)ఏదేమైనా 'దేవర' సినిమా చూడగానే స్టోరీ అంతా ఇప్పుడు చెప్పేశారు. ఇక సీక్వెల్ కోసం ఏం దాచి ఉంచారా అనే సందేహం వస్తుంది. సరిగా గమనిస్తే బోలెడన్ని ప్రశ్నలు వస్తాయి. ఒకటి రెండు కాదు దాదాపు అరడజను ప్రశ్నలు ఉండనే ఉంటాయి. ఇంతకీ అవేంటి? సీక్వెల్ స్టోరీ ఏమై ఉండొచ్చు. ఈ సినిమాని చూసి ఉంటేనే దిగువన పాయింట్స్ చదవండి. లేదంటే మళ్లీ ట్విస్టులన్నీ చెప్పేశామని అంటారు.'దేవర' చూసిన తర్వాత సందేహాలుసినిమా ప్రారంభంలో ప్రభుత్వ పెద్దలు చెప్పే యతి, దయ ఎవరు?ఎర్రసముద్రం వాళ్లతో స్మగ్లింగ్ చేయించుకున్న మురుగన్ ఎలా చనిపోయాడు?మురుగన్‌తో పాటు ఉండే డీఎస్పీ తులసికి ముఖం, ఒంటిపై దెబ్బలు ఎలా తగిలాయి?నీటి లోపలున్న అస్థి పంజరాలు ఎవరివి?అంత మత్తులో ఉన్నాసరే తనని చంపడానికి వచ్చిన వాళ్లని అందరినీ 'దేవర' మట్టుబెడతాడు. అలాంటి 'దేవర'ని చంపింది ఎవరు? ఎందుకు చంపాల్సి వచ్చింది? 'దేవర' ఊరు వదలి వెళ్లిపోయాడని ఇంటర్వెల్లో చెబుతారు. అప్పటికే చనిపోయి ఉంటాడు. ఇక సెకండాఫ్‌లో సముద్రంలోకి వెళ్లిన భైర మనుషులు చనిపోతారు. అప్పటికీ వర ఇంకా చిన్న పిల్లాడే. మరి ఇక్కడ భైర మనుషుల్ని చంపింది ఎవరు?'దేవర' స్టోరీ అంతా చెప్పిన ప్రకాశ్ రాజ్ ఎవరు? ఇంతకీ ప్రకాశ్ రాజ్ చెప్పిన స్టోరీ అంతా నిజమేనా?జాన్వీని వర పెళ్లి చేసుకుంటాడా? సీక్వెల్ లో ఆమె పాత్ర తీరు ఇంతేనా?పైన చెప్పిన ప్రశ్నలన్నింటికి సమాధానాలనే రెండో పార్ట్‌లో స్టోరీగా చూపిస్తారేమో అనిపిస్తుంది. ఇక ఎన్టీఆర్ లైనప్ చూస్తే ప్రస్తుతం 'వార్-2', ప్రశాంత్ నీల్‌తో సినిమాలు చేస్తున్నాడు. వీటి తర్వాత 'దేవర 2' ఉంటుందా? లేదంటే వీటితో సమాంతరంగా ఏమైనా చేస్తాడా అనేది చూడాలి?(ఇదీ చదవండి: 'దేవర' రెమ్యునరేషన్స్.. ఎవరికి ఎంత ఇచ్చారు?) -
'దేవర'తో రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయిందా?
టాలీవుడ్లో ఫేమస్ సెంటిమెంట్ ఒకటుంది. స్టార్ డైరెక్టర్ రాజమౌళితో పనిచేసిన తర్వాత ఎలాంటి హీరోకైనా సరే నెక్స్ట్ మూవీ డిజాస్టర్ అవుతుంది. రామ్ చరణ్, ప్రభాస్, రవితేజ.. ఇలా ఏ హీరో కూడా దీని బారి నుంచి తప్పించుకోలేకపోయారు. అలాంటిది 'దేవర' మూవీతో ఎన్టీఆర్ దీన్ని బ్రేక్ చేస్తాడా లేదా? అని గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ఒకటే చర్చ. మరి 'దేవర' రిలీజైపోయింది. ప్రేక్షకులు ఏమంటున్నారు? రాజమౌళి కొడుకు దీనిపై ఏం ట్వీట్ చేశాడు?(ఇదీ చదవండి: 'దేవర' చూస్తూ ఎన్టీఆర్ అభిమాని మృతి)'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ హీరోగా చేసిన సినిమా 'దేవర'. కొరటాల శివ దర్శకుడు. ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్టైనర్గా దీన్ని తెరకెక్కించారు. తాజాగా థియేటర్లలోకి వచ్చింది. అయితే రిలీజ్‌కి ముందు మరీ ఎక్కువ అంచనాలు ఏర్పడటం వల్లనో ఏమో గానీ మిశ్రమ స్పందన వస్తోంది. చాలా బాగుందని అనట్లేదు. అలా అని పూర్తిగా బాగోలేదని కూడా చెప్పట్లేదు. రెండు మూడు రోజులు ఆగితే ఫెర్ఫెక్ట్ టాక్ బయటపడుతుంది. ఒకవేళ యావరేజ్ వచ్చినా సరే వసూళ్లు రావడంతో పాటు సెంటిమెంట్ కూడా బ్రేక్ అయినట్లే.ఇక రాజమౌళి కొడుకు కార్తికేయ అయితే ఎన్టీఆర్ ఈ సెంటిమెంట్‌ని బ్రేక్ చేసేశాడని ట్వీట్ వేశాడు. '23 ఏళ్ల క్రితం ఎవరితోనైతే ఈ సెంటిమెంట్ మొదలైందో మళ్లీ అతడే దీన్ని బ్రేక్ చేశాడు. అతడిని చూస్తూ పెరిగాను. ఇప్పుడు తెలుగు సినిమాలో అతడు చేస్తున్న అద్భుతాల్ని కళ్లారా చూస్తున్నాను. అస్సలు మాటలు రావట్లేదు. అభిమానులకు ఒకటే చెబుతున్నా. 'దేవర' రూపంలో మనందరికీ సెలబ్రేట్ చేసుకునే అతిపెద్ద గిఫ్ట్ ఇచ్చాడు. ఇక నుంచి సినిమానే మాట్లాడుతుంది. ఆల్ హైల్ ద టైగర్' అని రాసుకొచ్చాడు.(ఇదీ చదవండి: ‘దేవర’ మూవీ రివ్యూ) -
'దేవర' చూస్తూ ఎన్టీఆర్ అభిమాని మృతి
ఎన్టీఆర్ 'దేవర' సినిమా చేస్తూ అభిమాని మృతి చెందాడు. కడపలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మృతుడు సీకే దీన్నె మండలం జమాల్‌పల్లికి చెందిన మస్తాన్ వలిగా గుర్తించారు. 'దేవర' రిలీజ్ సందర్భంగా కడపలోని అప్సర థియేటర్లో అభిమానుల కోసం స్పెషల్ షో వేశారు. దీనికి వచ్చిన మస్తాన్.. మూవీ చూస్తూ కేకలు వేస్తూ ఎంజాయ్ చేశాడు. ఊహించని విధంగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువకరించారు. దీంతో ఎన్టీఆర్ అభిమానుల మధ్య విషాదఛాయలు అలుముకున్నాయి.(ఇదీ చదవండి: ‘దేవర’ మూవీ రివ్యూ)ఇక కడపలోనే పాత బస్టాండ్ దగ్గరున్న రాజా థియేటర్లో అర్ధరాత్రి ఫ్యాన్స్-యాజమాన్యం మధ్య గొడవ జరిగింది. చాలామంది టిక్కెట్లు లేకుండా థియేటర్ లోపలికి ప్రవేశించడంతో పూర్తిగా హాలు పూర్తిగా నిండిపోయింది. ఈ క్రమంలో కొందరు ఫ్యాన్స్, సిబ్బందిని చితకబాదారు. అలానే తెర ముందు కూడా పలవురు యువకులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.పోలీసులు రంగ ప్రవేశం చేసి టికెట్ లేని వారిని బయటికి పంపించడంతో గొడవ సద్దుమణిగింది. ఈ క్రమంలోనే చాలామంది యువకులకు గాయాలయ్యాయి. వీళ్ల వల్ల సినిమా చూడటానికి వచ్చిన మిగిలిన ప్రేక్షకులు బెదిరిపోయారు. యువకుల తీరుతో షో ఆలస్యంగా నడవడమే కాకుండా అర్ధాంతరంగా మధ్యలోనే షోను కాసేపు నిలిపేశారు.(ఇదీ చదవండి: 'దేవర' రెమ్యునరేషన్స్.. ఎవరికి ఎంత ఇచ్చారు?) #NTR fans crushed the theater staffAfter an argument between NTR fans and #RajaTheater staff in #Kadapa during #Devara Movie Screening, some fans crushed the staff.An argument broke out as fans rushed into the theater without tickets, and the organizers stopped the show.… pic.twitter.com/XhqlGC36Qb— BNN Channel (@Bavazir_network) September 27, 2024