జపాన్ లో 'దేవర'.. భార్యతో కలిసి వెళ్లిన తారక్ | Devara Movie Japan Release, Jr NTR And His Wife Lakshmi Pranathi Spotted At Hyderabad Airport, Video Goes Viral | Sakshi
Sakshi News home page

Devara Japan Release: సతీసమేతంగా జపాన్ వెళ్లిన ఎన్టీఆర్.. వీడియో వైరల్

Published Sun, Mar 23 2025 12:57 PM | Last Updated on Sun, Mar 23 2025 1:37 PM

Devara Movie Japan Release Ntr With Wife At Hyd Airport

ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు కొన్ని జపాన్ లోనూ రిలీజ్ అవుతున్నాయి. కాకపోతే కొన్ని నెలల తర్వాత అక్కడి థియేటర్లలోకి వస్తున్నాయి. అలా ఈ ఏడాది జనవరిలో 'కల్కి' రిలీజైంది. ఇప్పుడు 'దేవర'.. మార్చి 28న జపాన్ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రమోషన్స్ జరుగుతున్నాయి.

(ఇదీ చదవండి: 'రాను.. బొంబాయి'కి అంటూనే లక్షల్లో కొల్లగొట్టేశారు)

తాజాగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అక్కడి ప్రేక్షకులతో కలిసి 'దేవర' చూసేందుకు స్వయంగా ఎన్టీఆర్ జపాన్ వెళ్లాడు. భార్య ప్రణతీతో కలిసి ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తారక్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ మూవీ కోసం పనిచేస్తున్నాడు. మరోవైపు బాలీవుడ్ లో 'వార్ 2' కూడా చేస్తున్నాడు. ఇది ఈ ఏడాది ఆగస్టు 14న థియేటర్లలోకి రానుండగా.. ప్రశాంత్ నీల్ సినిమా వచ్చే జనవరి టార్గెట్ గా ప్లాన్ చేస్తున్నారు. కానీ అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా అనేది చూడాలి?

(ఇదీ చదవండి: ఓటీటీలో 25 ఏళ్ల తర్వాత స్ట్రీమింగ్‌ అవుతున్న సినిమా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement