RRR చూసి తెలుగు నేర్చుకున్న జపాన్‌ అభిమాని.. తారక్‌ ఎమోషనల్‌ | Jr NTR: Japanese Fan Learned Telugu After Watching RRR Truly Moved Me | Sakshi
Sakshi News home page

Jr NTR: 'అన్నా, RRR చూసి తెలుగు నేర్చుకున్నా..' ఉప్పొంగిపోయిన తారక్‌

Published Thu, Mar 27 2025 3:03 PM | Last Updated on Thu, Mar 27 2025 3:40 PM

Jr NTR: Japanese Fan Learned Telugu After Watching RRR Truly Moved Me

దేవర సినిమా ప్రమోషన్స్‌ కోసం హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) ప్రస్తుతం జపాన్‌లో పర్యటిస్తున్నాడు. అక్కడి అభిమానులను ఆప్యాయంగా పలకరిస్తూ వారికి ఆటోగ్రాఫ్స్‌ ఇస్తున్నాడు. ఈ క్రమంలో ఓ మహిళా అభిమాని ప్రేమను చూసి తారక్‌ పొంగిపోయాడు. 'జపాన్‌ పర్యటించినప్పుడల్లా ఎన్నో జ్ఞాపకాలు కూడగట్టుకుంటాను. కానీ ఈసారి అంతకుమించి సంతోషమేసింది. 

ఆర్‌ఆర్‌ఆర్‌ చూసి తెలుగు నేర్చుకున్న అభిమాని
జపనీస్‌ అభిమాని ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ (RRR Movie) చూశాక తెలుగు నేర్చుకుందని తెలిసి మనసు ఉప్పొంగిపోయింది. సినిమా చూసి ఒక అభిమాని భాష నేర్చుకోవడాన్ని సినీ, భాషా ప్రేమికుడిగా నేను ఎన్నటికీ మర్చిపోలేను. భారతీయ సినిమా ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టేస్తుండటం గర్వకారణం' అని ట్వీట్‌ చేశాడు. ఈ మేరకు ఓ వీడియో షేర్‌ చేశాడు.

అతిపెద్ద ఇన్‌స్పిరేషన్‌
అందులో ఓ అమ్మాయి.. అన్నా.. నేను ఆర్‌ఆర్‌ఆర్‌ చూసిన తర్వాత తెలుగు నేర్చుకున్నాను. రెండు సంవత్సరాల క్రితం తెలుగు రాత నేర్చుకునే పుస్తకాన్ని ప్రాక్టీస్‌ చేశాను. మీరు నాకు అతి పెద్ద ఇన్‌స్పిరేషన్‌ అని పేర్కొంది. ఆమె మాటలు విని ఆశ్చర్యపోయిన తారక్‌.. వావ్‌.. మీరే అందరికీ బిగ్‌ ఇన్‌స్పిరేషన్‌ అని పొగిడాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

దేవర సినిమా
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటించిన చిత్రం దేవర (Devara: Part 1). జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా నటించగా అనిరుద్‌ రవిచందర్‌ సంగీతం అందించాడు. గతేడాది సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ దాదాపు రూ.440 కోట్లు రాబట్టింది. మార్చి 28న జపాన్‌ బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసేందుకు రెడీ అవుతోంది.

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ
ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ విషయానికి వస్తే.. జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 మార్చి 24న విడుదలైంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ మూవీకి కీరవాణి సంగీతం అందించాడు. సుమారు రూ.1200 కోట్లు కొల్లగొట్టిన ఈ పాన్‌ ఇండియా మూవీ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకుంది.

 

 

చదవండి: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్‌ పెళ్లి.. ఏర్పాట్లలో శ్యామలా దేవి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement