రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్లుగా నటించిన చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను ఎంతలా షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విడుదలైన అన్ని భాషల్లో కాసుల వర్షం కురిపించి రూ. 1200కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ సినిమాను డబ్ చేసి జపాన్‌లో విడుదల చేశారు.
ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆర్‌ఆర్‌ఆర్ టీం జపాన్‌కి వెళ్లారు. అక్కడ చరణ్, తారక్‌లకు ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఈ క్రమంలో జపాన్ వీధుల్లో రామ్‌చరణ్, ఎన్టీఆర్, కార్తికేయలు సతీసమేతంగా సందడి చేశారు.
రద్దీగా ఉండే ప్రాంతంలో నడుస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. గులాబీ పువ్వులను పట్టుకుని, ఒకరి చేతిలో మరొకరు చెయ్యు వేసుకుని ముందుకు సాగారు. దీనికి సంబంధించిన వీడియోను రామ్‌చరణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా, ఇప్పుడా వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment