RRR Movie
-
'ఆర్ఆర్ఆర్'లో రామ్ చరణ్ ఎంట్రీ సీన్ ఎలా తీశారో తెలుసా..?
ఎన్టీఆర్(NTR), రామ్‌చరణ్(Ram charan) ఇద్దరు స్టార్ హీరోలతో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్.. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీని రాజమౌళి(Raja mouli) తెరకెక్కించారు. పాన్ ఇండియా రేంజ్లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయతే, ఇందులో రామ్‌చరణ్ ఎంట్రీ సీన్‌ను ఎలా క్రియేట్ చేశారో ఒక వీడియో ద్వారా మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ సన్నివేశం అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా మెప్పిస్తుంది. సుమారు 10 నిమిషాల పాటు ఎంతో ఉత్కంఠభరితంగా ఈ సీన్ కొనసాగుతుంది.తారక్ ఎంట్రీ సీన్‌కు ఎంత పాపులారిటీ వచ్చిందో రామ్ చరణ్ ఎంట్రీ కూడా అంతే బజ్‌ను క్రియేట్ చేస్తుంది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతీయులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతారు. సుమారు 900 మంది ఓ పోలీస్‌స్టేషన్ ఎదుట నినాదాలు చేస్తూ ఉంటారు. అయితే, వారిని కట్టడి చేసేందుకు ఎవరూ సాహసించరు. కానీ, పోలీస్ అధికారి అయిన రామ్‌చరణ్ రంగంలోకి దిగి అక్కడి పరిస్థితిని కంట్రోల్ చేస్తారు. రామరాజుగా చరణ్ చూపిన తెగువకు బ్రిటిష్ అధికారులే ఆశ్చర్యపోతారు. ఈ ఒక్క సీన్ క్రియేట్ చేసేందుకు 32 రోజులు పడినట్లు మేకర్స్ చెప్పారు. అలాంటి సీన్‌ను ఎలా క్రియేట్ చేశారో మీరు చూసేయండి. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ఎలా తెరకెక్కించారో పూర్తిగా తెలుసుకోవాలంటే.. 'ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్' అనే పేరుతో ఒక డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి. -
జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఫిఫా పోస్టర్.. స్పందించిన యంగ్ టైగర్!
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ ఆర్ఆర్ఆర్. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ చిత్రంలో హీరోలుగా నటించారు. ఈ ముగ్గురి కాంబోలో వచ్చిన ఈ చిత్రం ఏకంగా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ మూవీలోని నాటు నాటు అనే పాటకు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ దక్కింది. దీంతో ఆస్కార్ వేదికగా నాటు నాటు సాంగ్ పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది.అయితే ఈ సాంగ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ పాటకు ఫ్యాన్స్ ఉన్నారు. ఎక్కడ చూసినా నాటు నాటు స్టెప్పులకు కాలు కదపకుండా ఉండరేమో అనేలా ఆదరణ దక్కించుకుంది. తాజాగా ఈ పాటను ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ అసోసియేషన్(ఫిఫా) తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ముగ్గురు ఫుట్ బాల్ దిగ్గజాల పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.ఆ పోస్టర్లో ఫుట్‌బాల్ దిగ్గజాలు నేయ్మార్, టెవెజ్, రొనాల్డో ఫోటోలతో ఎన్టీఆర్ పేరు వచ్చేలా క్రియేట్ చేసింది. వీరి పేర్లలోని తొలి అక్షరాలతో ఎన్టీఆర్ పేరు వచ్చేలా పోస్టర్‌ను రూపొందించారు. ఇందులో ముగ్గురు ఫుట్ బాల్ ఆటగాళ్లు ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్ స్టెప్పులు వేస్తున్నట్లు కనిపించారు. ఇది చూసిన జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యారు. ముగ్గురికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు మన యంగ్ టైగర్. ఈ పోస్టర్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకుంటోంది.ఇది చూసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. రియల్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మాస్ టైగర్ ఎన్టీఆర్ అంటూ జూనియర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. జూనియర్ ఎన్టీఆర్ చివరిసారిగా దేవర పార్ట్ -1 చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం హృతిక్ రోషన్‌తో కలిసి వార్- 2 మూవీలో కనిపించనున్నారు. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. View this post on Instagram A post shared by FIFA World Cup (@fifaworldcup) View this post on Instagram A post shared by FIFA World Cup (@fifaworldcup) -
ఆర్ ఆర్ ఆర్ రికార్డు బ్రేక్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం ..!
-
సంక్రాంతికి వస్తున్నాం ఖాతాలో మరో రికార్డు.. 'డాకు..' కలెక్షన్స్ ఎంతంటే?
సంక్రాంతి బరిలో దిగిన గేమ్ ఛేంజర్ సినిమా సైలెంట్ అయిపోయింది. మొదట్లో డాకు మహారాజ్ (Daaku Maharaaj Movie) బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టగా దాన్ని సైతం వెనక్కు నెడుతూ టాప్ ప్లేస్‌లో నిలబడింది సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam Movie). జనవరి 14న విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వరద పారిస్తోంది. ఐదు రోజుల్లోనే ఈ చిత్రం రూ.165 కోట్లకు పైగా రాబట్టింది. ఆరో రోజు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా రికార్డుకెక్కిందని చిత్రయూనిట్ ప్రత్యేకంగా పోస్టర్ రిలీజ్ చేసింది. ఆరో రోజు ఎక్కువ షేర్ (రూ.9.54 కోట్ల షేర్) సాధించిన సినిమాగా ఆర్ఆర్ఆర్ పేరిట రికార్డు భద్రంగా ఉండేది. నిన్నటితో సంక్రాంతికి వస్తున్నాం ఆ రికార్డును బద్ధలు కొట్టింది. విక్టరీ వెంకటేశ్ (Venkatesh Daggubati) కెరీర్లోనే ఈ సినిమా ఆల్‌టైం హిట్‌గా నిలిచింది. ఇప్పటికే రూ.100 కోట్ల షేర్ కూడా వచ్చేసిందని తెలిపింది. అటు నార్త్ అమెరికాలోనూ సినిమా జోరు ఏమాత్రం తగ్గడం లేదు. అక్కడ ఇప్పటివరకు 2.1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూలు చేసింది. యూకెలో 1,95,628 పౌండ్లు వసూలు చేసింది. ఈ బ్లాక్‌బస్టర్ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని ప్రకటించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అది కూడా మళ్లీ సంక్రాంతికే రిలీజ్ చేస్తామని తెలిపాడు.డాకు మహారాజ్ కలెక్షన్స్ ఎంత?డాకు మహారాజ్ సినిమా విషయానికి వస్తే.. నందమూరి బాలకృష్ణ నటించిన ఈ చిత్రానికి ఎనిమిది రోజుల్లో రూ.156 కోట్లు వచ్చాయి. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఐటం సాంగ్‌లో మెరిసింది. తమన్ సంగీతం అందించగా నాగవంశీ నిర్మాతగా వ్యవహరించాడు. #SankranthikiVasthunam is redefining MASS with it’s CLASS FAMILY ENTERTAINMENT🔥🔥🔥#BlockbusterSankranthikiVasthunam joins the elite 100Crore+ share club in just 6 days 💥💥💥ALL TIME HIGHEST FOR VICTORY @Venkymama ❤️🔥ALL TIME #2 HIGHEST FOR Hit Machine @AnilRavipudi ❤️🔥… pic.twitter.com/zjjrKwNoJk— Sri Venkateswara Creations (@SVC_official) January 20, 2025Victory @venkymama is firing on all cylinders with #SankranthikiVasthunam at the box office🔥🔥🔥#BlockbusterSankranthikiVasthunam has now become the ALL-TIME HIGHEST COLLECTED FILM IN AP & TS on its 6th day💥💥💥💥#BlockbusterSankranthikiVasthunam IN CINEMAS NOW 🫶… pic.twitter.com/dv97e3aeVl— Sri Venkateswara Creations (@SVC_official) January 20, 2025The KING OF SANKRANTHI roars louder with every passing day 🪓🔥#DaakuMaharaaj storms past 𝟏𝟓𝟔+ 𝐂𝐫𝐨𝐫𝐞𝐬 Gross Worldwide in 8 DAYS 💥Celebrate the unstoppable reign of 𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺 #NandamuriBalakrishna in cinemas near you ❤️🔥… pic.twitter.com/hHvfs5Ac28— Sithara Entertainments (@SitharaEnts) January 20, 2025 చదవండి: వర్మ కళ్లు తెరిపించిన సత్య.. ఒట్టు, ఇకపై అలాంటి సినిమాలు చేయను! -
తను..టైగర్ అన్న హాలీవుడ్ డైరెక్టర్... ఎన్టీయార్‌తో సినిమా?
జానియర్ ఎన్టీయార్(JR NTR) టాలీవుడ్లో టాప్ హీరో. త్వరలోనే హాలీవుడ్ సినిమాల్లో(Hollywood Movie) అడుగుపెట్టనున్నాడా? ఈ ప్రశ్నకు సమాధానం అప్పుడే అవునని చెప్పలేకపోయినా... ఆ అవకాశాలు కనిపిస్తున్నాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓ ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడి మాటలే అందుకు నిదర్శనం. ఇలాంటి చర్చకు కారణం ఆర్ఆర్ఆర్ సినిమా అని చెప్పక తప్పదు. హాలీవుడ్ చిత్ర ప్రముఖులపై ’ఆర్ఆర్ఆర్’ ఎంత ప్రభావం చూపిందో దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమాలో ఎన్టీయార్‌లోని మహోన్నత నటరూపాన్ని ఆవిష్కరించాడు. నిజానికి ఎన్టీయార్‌తో ఎలాంటి సినిమా అయినా చేయవచ్చునని తెలిసిన దర్శకుడు రాజమౌళి. ’సింహాద్రి’ ’యమ దొంగ’ వంటి చిత్రాలు పెద్ద హిట్ కొట్టడానికి ఆర్ఆర్ఆర్ ప్రపంవచ్యాప్తంగా ఆదరణకు నోచుకోవడానికి అదే కారణం. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఆర్ఆర్ఆర్ జూనియర్, రాజమౌళిలకు హ్యాట్రిక్ హిట్‌తో పాటు ఇంటర్నేషనల్ పాప్యులారిటీని కూడా అందించింది. టాలీవుడ్ టూ బాలీవుడ్ టూ హాలీవుడ్...ఆర్ఆర్ఆర్ తో తెచ్చుకున్న క్రేజ్ జూనియర్ ఎన్టీఆర్‌ను బాలీవుడ్ కూడా కోరుకునేలా చేసింది. ప్రస్తుతం జా.ఎన్టీయార్ ’వార్ 2’ సినిమా ద్వారా బాలీవుడ్లో అరంగేట్రం చేస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హృతిక్‌తో కలిసి జూనియర్ నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టే సినిమాగా సినీ పండితులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్‌తో తన తదుపరి యాక్షన్ అడ్వెంచర్‌కు కూడా యంగ్ టైగర్ సిద్ధమవుతున్నాడు. ఈ నేపధ్యంలోనే హాలీవుడ్ చిత్రంలో ఎన్టీయార్ అనే వార్త రావడంతో అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.నేను రెడీ అంటున్న సూపర్ మ్యాన్ డైరెక్టర్...ప్రముఖ హాలీవుడ్ చిత్రనిర్మాత జేమ్స్ గన్ (James Gunn) ’సూపర్‌మ్యాన్,’ ’సూసైడ్ స్క్వాడ్,’ గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వంటి గొప్ప అంతర్జాతీయ చిత్రాలకు దర్శకత్వం వహించారు. సూపర్‌మ్యాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత పాప్యులర్ అనేది అందరికీ తెలిసిందే. అలాంటి సినిమాకి దర్శకత్వం వహించిన ఆయన ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆర్ ఆర్ ఆర్ చిత్రం గురించి ప్రస్తావించారు మరీ ముఖ్యంగా తెలుగు స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆయన నటన గురించి గొప్పగా మాట్లాడారు. ఆర్ఆర్ఆర్లోని కొన్ని సన్నివేశాలను ప్రస్తావించి మరీ ఆయన జూనియర్‌పై పొగడ్తల వర్షం కురిపించడం విశేషం. ముఖ్యంగా ‘బోనులలో నుంచి పులులతో పాటు బయటకు దూకిన ఆ నటుడు (ఎన్టీయార్)తో నేను పని చేయాలనుకుంటున్నాను. అతను అద్భుతమైన నటుడు. నేను అతనితో ఏదో ఒక రోజు పని చేయాలనుకుంటున్నాను‘ అని ఆయన చెప్పారు.ఎన్టీఆర్ ఎంతగానో ఆకట్టుకున్నాడని జేమ్స్ అన్నారు. ఇప్పటి దాకా టాప్ హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓ తెలుగు హీరోని ఉద్దేశించి మాట్లాడడం ఇదే ప్రధమం కావడం గమనార్హం. -
సీక్రెట్స్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ బై రాజమౌళి
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో ఆర్ఆర్ఆర్ – బిహైండ్ అండ్ బియాండ్ ఒకటి. ఈ డాక్యుమెంటరీ గురించి తెలుసుకుందాం.తన ఉనికిని తెలిపేందుకు ఓ గదిలో నలుగురు ముందు చప్పట్లు కొడితే ఆ నలుగురికి తన విషయం తెలియవచ్చు. కానీ అదే ఉనికి ప్రపంచానికి తెలియాలంటే సరిగ్గా రాజమౌళిలా ఆలోచించాలి. భారతదేశానికి ఒకప్పుడు సినిమా ప్రమోషన్‌ను ఓ వినూత్న పంథాలో పరిచయం చేసిన బాలీవుడ్ దిగ్గజం అమిర్ ఖాన్ కూడా తాను ఈ విషయంలో రాజమౌళినే ఫాలో అవుతాననడం దీనికి ఓ నిదర్శనం. చరిత్ర అనేది రాజమౌళి ముందు ఉన్నది తరువాత ఉంటుంది, కానీ ఆ చరిత్రలో రాజమౌళికి ఓ చెరగని పేజీ ఉంటుందనేది మాత్రం నిర్వివాదాంశం.తెలుగు సినిమా వైభవాన్ని ఎన్నో అంతర్జాతీయ వేదికలపైన నిలిపిన శిల్పి రాజమౌళి. మరీ ముఖ్యంగా తెలుగు సినిమాకి ఆస్కారమే లేదన్న ఆస్కార్ పురస్కారాన్ని అద్భుతంగా అందించిన అత్యున్నత దర్శకులు రాజమౌళి. తన సినిమా అంటేనే ఓ సంచలనం. మరి... ఆ సంచలనం వెనకున్న సీక్రెట్ తెలుసుకోవాలని ప్రతి దర్శకుడితో పాటు సామాన్య ప్రేక్షకుడికి కూడా ఆసక్తి ఉంటుంది. ఆ కోవలోనే రాజమౌళి తీసిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి సంబంధించిన తన కష్టాన్ని ఓ చక్కటి డాక్యుమెంటరీ రూపంలో ‘ఆర్ఆర్ఆర్ – బిహైండ్ అండ్ బియాండ్’ పేరిట నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంచారు.దాదాపు రెండున్నర గంటల పై నిడివి ఉన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను నాలుగేళ్ల పాటు తీశారు. ఈ డాక్యుమెంటరీలో ఆ సినిమా మొత్తాన్ని ఎలా తీశారో రాజమౌళి వ్యాఖ్యానంతో పాటు సినిమాలోని నటీనటులు టెక్నీషియన్్స కూడా వివరిస్తూ చూపించడం ఎంతో బాగుంది. తన ఈ ‘ఆర్ఆర్ఆర్’ ప్రయాణానికి సంబంధించి ఎన్నో తెలియని, చూడని అద్భుత విషయాలను ప్రేక్షకులకు అందంగా అందించారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి... ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన ఫుటేజ్ కొన్ని గంటల రూపంలో ఉంటే దానిని ఎడిట్ చేసి, గంటన్నర నిడివితో అందించారట. ఈ సమాజమనేది ఓ సృష్టి.ప్రతిరోజూ మన మనుగడ ఈ సృష్టికి అనుగుణంగానే ఉంటుంది. ఓ రకంగా సినిమా అన్నది కూడా ఓ సృష్టే. ఓ దర్శకుడి ఆలోచనకు ప్రతిరూపమే సినిమా అన్న ఓ అద్భుత సృష్టి, కానీ ఈ సినిమా సృష్టిలో ఎంతోమంది కష్టం ఉంటుంది. మరి... అటువంటి సినిమాను ఏ విధంగా రూపొందించారో ఆ రహస్యాలు మీరు కూడా తెలుసుకోవాలంటే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘ఆర్ఆర్ఆర్ – బిహైండ్ అండ్ బియాండ్’ని చూసేయండి. వర్త్ టు వాచ్ అండ్ ప్రిజర్వ్ ద డాక్యుమెంటరీ ఫర్ ది ఫ్యూచర్ కిడ్స్. – ఇంటూరు హరికృష్ణ -
ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. ఆడియన్స్‌ను కంటతడి పెట్టిస్తోన్న ఆ సీన్!
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీ తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటింది. ఏకంగా ఆస్కార్ అవార్డ్‌ను సొంతం చేసుకుని ప్రపంచమంతా తెలుగు సినిమావైపు చూసేలా చేసింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ నటనతో అభిమానులను కట్టిపడేశారు. 2022లో మార్చి 25 విడుదలైన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించారు. పీరియాడిక్ యాక్షన్ చిత్రంగా హిట్ కొట్టిన ఈ చిత్రంలో అలియాభట్, ఓలివియా మోరిస్, అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ, అలీసన్ డూడీ, దివంగత నటుడు రే స్టీవెన్ సన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ సృష్టించింది.అయితే ఈ మూవీ జర్నీపై ఆర్ఆర్ఆర్ మేకర్స్ డాక్యుమెంటరీని రూపొందించారు. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని 'ఆర్ఆర్ఆర్- బిహైండ్ అండ్ బియాండ్' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈనెలలోనే థియేటర్లలో విడుదల చేశారు. తాజాగా ఈ డాక్యుమెంటరీ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు నుంచే నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.అయితే ఈ డాక్యుమెంటరీలోని ఓ సన్నివేశం ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఎన్టీఆర్‌ను కొరడాతో కొట్టిన సీన్ నెట్టింట తెగ వైరలవుతోంది. ఇందులో ఎన్టీఆర్‌ను రామ్ చరణ్ కొరడాతో కొడతాడు. కానీ వెంటనే ఎక్కడ జూనియర్‌కు దెబ్బ తగిలిందేమోనని దగ్గరికి వచ్చిన గట్టిగా హత్తుకుంటాడు. దీనికి సంబంధించిన వీడియోను నెటిజన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ స్నేహంపై కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరూ ప్రాణ మిత్రులని పోస్టులు పెడుతున్నారు. I want to thank whoever decided to make this documentary about the making of the best movie ever. You must watch this! Every person in the entire world should watch this.#RRRBehindAndBeyond pic.twitter.com/W1zF7VZouu— Tarak Forever (@Charanlucky22) December 27, 2024 them pic.twitter.com/J6Gn3yu7OO— xy (@ssmbbakthudu) December 27, 2024 NTR ♥️ RC bonding 🥹🥹♥️#RRRBehindAndBeyond #RRRMovie#RRRBehindAndBeyondOnNetflix @AlwaysRamCharan @tarak9999 pic.twitter.com/PQKC0axFB7— Gopi tarak 9999 DevaraOnSep27th (@7799_gopi) December 27, 2024 -
ఓటీటీలోకి వచ్చేసిన 'ఆర్ఆర్ఆర్' డాక్యుమెంటరీ
ఆర్ఆర్ఆర్.. టాలీవుడ్ కీర్తిని ఆస్కార్ రేంజ్‌కు ఈ చిత్రం తీసుకెళ్లింది. ఈ సినిమాకు సంబంధించి తెరవెనుక జరిగిన ఆసక్తికర విషయాలను 'ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్' పేరుతో థియేటర్స్‌లో విడుదల చేశారు. ఇప్పుడు ఓటీటీలో కూడా రిలీజ్ చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని మూడు గంటల పాటు చూసి అందరూ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఆ సినిమా వెనక దాగి ఉన్న మూడేళ్ల కష్టాన్ని చూపించాలని మేకర్స్ అనుకున్నారు.ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించిన ఈ చిత్రానికి ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించారు. 2022లో విడుదలైన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించారు. పీరియాడిక్ యాక్షన్ చిత్రంగా హిట్ కొట్టిన ఈ చిత్రంలో అలియాభట్, ఓలివియా మోరిస్, అజయ్ దేవ్‌గణ్, శ్రియ, అలీసన్ డూడీ, దివంగత నటుడు రే స్టీవెన్ సన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. 'ఆర్ఆర్ఆర్- బిహైండ్ అండ్ బియాండ్' పేరుతో డాక్యుమెంటరీని సిద్ధం చేశారు రాజమౌళి. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలుపెట్టిన సమయం నుంచి 'ఆస్కార్' అందుకునే వరకూ జరిగిన ఆసక్తికర సంఘటనలను ప్రేక్షకులకు పరిచయం చేశారు. డిసెంబరు 20వ తేదీ నుంచి ఎంపిక చేసిన మల్టీప్లెక్స్ స్క్రీన్లలో మాత్రమే దీనిని విడుదల చేశారు. అయితే, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు. ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ జక్కన్నకు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు. డిసెంబర్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతన్న 'ఆర్ఆర్ఆర్- బిహైండ్ అండ్ బియాండ్' డాక్యుమెంటరీని మీరూ చూసేయండి. దీని రన్‌టైమ్ 1 గంట 38 నిమిషాలు ఉంది. ఇప్పటివరకూ బయటకు రాని ఆసక్తికర విషయాలను ఇందులో పంచుకున్నారు. -
వారం రోజుల్లోనే ఓటీటీకి ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ
దర్శకధీరుడు తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ 'ఆర్ఆర్ఆర్'. ఈ మూవీకి సంబంధించిన డాక్యుమెంటరీ చిత్రం ఈనెల 20న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్ అనే పేరుతో ఈ డాక్యుమెంటరీ చిత్రం తెరకెక్కించారు. ఆర్ఆర్ఆర్ మూవీ జర్నీ గురించి ఈ మూవీలో చూపించారు. తాజాగా ఈ డాక్యుమెంటరీ మూవీ ఓటీటీ రిలీజ్ తేదీని రివీల్ చేసింది చిత్రబృందం. ఈనెల 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు.కాగా.. 2022లో వచ్చిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా పలు రికార్డులు సృష్టించింది. ఈ సినిమాతో టాలీవుడ్ పేరు వరల్డ్ వైడ్‌గా మార్మోగింది. ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ దక్కించుకుంది. మరోవైపు రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుతో సినిమా చేయనున్నారు. ఆ మూవీ పనులతో ఆయన బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాదిలో సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.Behind the scenes, beyond the legacy. Watch RRR: Behind and Beyond, an exclusive peek into the making of SS Rajamouli’s magnum opus on Netflix, out 27 December!#RRRBehindAndBeyondOnNetflix pic.twitter.com/Py9pyL7Nws— Netflix India South (@Netflix_INSouth) December 23, 2024 -
ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ చిత్రం.. ట్రైలర్ వచ్చేసింది!
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్. ఈ మూవీ ఆస్కార్ అవార్డ్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్‌ను సాధించింది. ఇటీవల ఈ మూవీకి సంబంధించి డాక్యుమెంటరీని రూపొందిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్ అనే పేరుతో డాక్యుమెంటరీ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు.తాజాగా ఈ డాక్యుమెంటరీ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే ఆర్ఆర్ఆర్ షూటింగ్ సమయంలో జరిగిన సన్నివేశాలతో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ డాక్యుమెంటరీని డిసెంబర్ 20న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.కాగా.. 2022లో వచ్చిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా పలు రికార్డులు సృష్టించింది. ఈ సినిమాతో టాలీవుడ్ పేరు వరల్డ్ వైడ్‌గా మార్మోగింది. ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ దక్కించుకుంది. మరోవైపు రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుతో సినిమా చేయనున్నారు. ఆ మూవీ పనులతో ఆయన బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాదిలో సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.Hear and watch out… From the first clap on the sets to the standing ovation at the Oscars stage, #RRRBehindAndBeyond brings it all to you. 🔥🌊❤️#RRRMovie In select cinemas, 20th Dec. pic.twitter.com/EfJLwFixFx— RRR Movie (@RRRMovie) December 17, 2024 -
పుష్ప -2 క్రేజ్.. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 అల్‌టైమ్ రికార్డ్స్ బ్రేక్!
బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ హవా కొనసాగుతోంది. ఈనెల 5న థియేటర్లలోకి పుష్ప-2 సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల మార్కు దాటేసిన పుష్ప-2 తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది. విడుదలైన 11 రోజుల్లోనే రూ.1400 కోట్ల మార్క్‌ను అధిగమించింది.సుకుమార్- బన్నీ కాంబోలో వచ్చిన ఈ సినిమా నార్త్‌లోనూ తగ్గేదేలే అంటోంది. రిలీజైన మొదటి రోజు నుంచే రికార్డులు తిరగరాస్తోంది. ఇప్పటివరకు హిందీలో ఎప్పుడు లేని విధంగా రూ.561 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. దీంతో హిందీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి డబ్బింగ్ మూవీగా నిలిచింది. అంతే కాకుండా రెండోవారం వీకెండ్లో రూ.100 కోట్ల సాధించిన తొలి హిందీ చిత్రంగా ఘనతను సొంతం చేసుకుంది. (ఇది చదవండి: పుష్ప2 'పీలింగ్స్' సాంగ్ వీడియో విడుదల)కేజీఎఫ్-2, ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ బ్రేక్..ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్-2 సాధించిన రికార్డ్‌ను పుష్ప-2 దాటేసింది. కేజీఎఫ్-2 లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ను కేవలం పదిరోజుల్లోనే అధిగమించింది. అంతేకాకుండా రాజమౌళి బ్లాక్‌బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్ (రూ.1309) కోట్ల రికార్డ్‌ను సైతం తుడిచిపెట్టేసింది. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత మూవీ వసూళ్లు మరింత పెరిగినట్లు తెలుస్తోంది. The BIGGEST INDIAN FILM is on a rampage at the box office ❤🔥#Pushpa2TheRule grosses 1409 CRORES GROSS WORLDWIDE in 11 days 💥💥💥Book your tickets now!🎟️ https://t.co/eJusnmNS6Y#Pushpa2#WildFirePushpaIcon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil… pic.twitter.com/bWbwb50sj4— Pushpa (@PushpaMovie) December 16, 2024 -
రాజమౌళి మూవీపై డాక్యుమెంటరీ.. విడుదలపై అధికారిక ప్రకటన!
దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశారు. ఆర్ఆర్ఆర్ మూవీతో ఆస్కార్ వేదికపై సగర్వంగా తెలుగు సినిమాను నిలిపారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం ఆస్కార్ అవార్డ్‌ను సాధించింది. మన సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది.ఆర్ఆర్ఆర్ ఘనవిజయంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి డాక్యుమెంటరీని రూపొందిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్ అనే పేరుతో డాక్యుమెంటరీ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు దర్శకుడు రాజమౌళితో కూడిన పోస్టర్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. అయితే రిలీజ్ తేదీని మాత్రం వెల్లడించలేదు.కాగా.. 2022లో వచ్చిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా పలు రికార్డులు సృష్టించింది. ఈ సినిమాతో టాలీవుడ్ పేరు వరల్డ్ వైడ్‌గా మార్మోగింది. ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ దక్కించుకుంది. మరోవైపు రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుతో సినిమా చేయనున్నారు. ఆ మూవీ పనులతో ఆయన బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాదిలో సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. View this post on Instagram A post shared by RRR Movie (@rrrmovie) -
సత్యదేవ్‌కి అన్యాయం? 'ఆర్ఆర్ఆర్'లో 16 నిమిషాల సీన్స్ కట్
సత్యదేవ్.. నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, హీరోగా మాత్రం నిలదొక్కుకోలేకపోతున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన ఇతడు.. చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీలోనూ విలనిజం చేసి ఆకట్టుకున్నాడు. అయితే 'ఆర్ఆర్ఆర్' లాంటి క్రేజీ పాన్ ఇండియా మూవీలోనూ ఇతడు నటించాడు. కానీ ఆ సీన్లన్నీ లేపేశారు. ఆ విషయాన్ని మొహమాటపడుతూనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.'ఆర్ఆర్ఆర్' కోసం సత్యదేవ్.. దాదాపు 10 రోజుల పాట పనిచేశాడు. కానీ చివరకొచ్చేసరికి ఇతడికి సంబంధించి దాదాపు 16 నిమిషాలు సీన్లని ఎడిటింగ్‌లో తీసేశారు. ఆ టీమ్‌పై ఉన్న గౌరవంతోనే ఇప్పటివరకు బయటకు చెప్పలేదని.. కాకపోతే ఆ పదిరోజుల వర్క్ చేయడం మాత్రం మర్చిపోలేని అనుభూతి అని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: తల్లిని కావాలని ఇప్పటికీ ఉంది: సమంత)ఎడిటింగ్ చేస్తే చేశారు కానీ కనీసం 'ఆర్ఆర్ఆర్' టైటిల్ కార్డ్స్లోనైనా సత్యదేవ్ పేరు వేసి ఉండాల్సింది. కానీ ఈ సినిమాలో ఎక్కడా కూడా సత్యదేవ్ పేరు కనిపించదు. ఇతడు చెప్పుకోవడానికి పెద్దగా ఇష్టపడట్లేదు గానీ ఈ విషయంలో మాత్రం అన్యాయం జరిగిందనే చెప్పొచ్చు.సత్యదేవ్ లేటెస్ట్ మూవీ 'జీబ్రా'. నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది. 'పుష్ప'లో జాలిరెడ్డిగా కనిపించిన కన్నడ ధనంజయ.. ఇందులో కీలక పాత్ర పోషించాడు. చాన్నాళ్లుగా హీరోగా సరైన హిట్ కోసం చూస్తున్న సత్యదేవ్‌కి ఈ సినిమాతోనైనా అదృష్టం కలిసొస్తుందేమో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ థ్రిల్లర్.. తెలుగులోనూ) -
ఆర్ఆర్ఆర్కు అరుదైన గౌరవం
‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు అరుదైన గౌరవం లభించింది. దాదాపు 150 సంవత్సరాల చరిత్ర కలిగిన లండన్‌లోని ఐకానిక్ రాయల్ ఆల్బర్ట్ సినిమా హాల్లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ప్రదర్శితం కానుంది. వచ్చే ఏడాది మే 11న ఈ మూవీ స్క్రీనింగ్ ఉంటుందని ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ ప్రకటించింది. అలాగే ఈ కార్యక్రమంలో రాయల్ ఫిల్ హార్మోనిక్ ఆర్కెస్ట్రాతో ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి లైవ్ కన్సర్ట్ ఇవ్వనున్నారు.కాగా ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా 2022 మార్చి 25న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 95వ ఆస్కార్ అవార్డ్స్‌లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో (నాటు నాటు పాటకు గాను) ఎమ్ఎమ్ కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్ ఆస్కార్ అవార్డులు అందుకున్న సంగతి తెలిసిందే. పలు అంతర్జాతీయ, జాతీయ అవార్డులు కూడా లభించాయి. కాగా ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ సినిమా ఐకానిక్ రాయల్ ఆల్బర్ట్ హాల్లో 2019లో ప్రదర్శితమైన విషయం తెలిసిందే. -
RRRను దాటేసిన పుష్ప.. రిలీజ్‌కు ముందే ఆ రికార్డ్ క్లోజ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప2: ది రూల్' పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక థియేటర్స్‌లో రిలీజ్ కానున్న చిత్రంగా పుష్ప2 రికార్డులకెక్కింది. ఈ చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉండంతో ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు కూడా సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా ఈ చిత్రం విడుదల కానుంది. 'పుష్ప: ది రైజ్'కు కొనసాగింపుగా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.RRRను బీట్ చేసిన పుష్పఐకాన్ స్టార్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అల్లు అర్జున్ సినిమాలకు ఓవర్సీస్లో భారీ మార్కెట్ పెరిగింది. మాలీవుడ్‌లో అయితే ఏకంగా తమ హీరోగా వారు అభిమానిస్తారు. ఇప్పుడు బెంగాలీలు కూడా బన్నీకి ఫ్యాన్స్ అయిపోయారు. పుష్ప తర్వాత యూట్యూబ్‌లలో ఆయన నటించిన గత సినిమాలు చూసిన వారు ఫిదా అయిపోయారు. అలా మొదటిసారి బెంగాలీలో కూడా పుష్ప2 విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో 11,500 స్క్రీన్స్‌లలో పుష్ప2 చిత్రం విడుదల కానుంది. ఇండియాలో 6,500, ఓవర్సీస్లో 5000 స్క్రీన్స్‌లలో గ్రాండ్‌గా ఈ మూవీ విడుదల కానుంది. ఇంతటి భారీ సంఖ్యలో విడుదల అవుతున్న భారతీయ ఏకైక సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా కూడా ఇంతటి స్థాయిలో విడుదల కాలేదని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఆర్ఆర్ఆర్ పేరుతో ఇప్పటి వరకు ఉన్న 10,200 స్క్రీన్స్ల రికార్డు పుష్పతో తుడిచిపెట్టుకుపోయింది. బాహుబలి2 8500 స్క్రీన్స్‌లలో రిలీజ్ కాగా కల్కి 8400 స్క్రీన్స్‌లలో సందడి చేసింది. -
మూడు నెలలకోసారైనా ఆర్ఆర్ఆర్ చూస్తా: హాలీవుడ్ నటి
ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. హాలీవుడ్ దర్శకనటులు సైతం ఈ కళాఖండాన్ని చూసి అబ్బురపడిపోయారు. అయితే హాలీవుడ్ నటి మిన్నీ డ్రైవర్ ఇంకా ఆర్ఆర్ఆర్ మేనియా నుంచి బయటకు రాలేకపోతోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఇండియన్ సినిమా గురించి ఇలా మాట్లాడింది.మా ఆల్‌టైమ్ ఫేవరెట్ మూవీఆర్ఆర్ఆర్ నా ఫేవరెట్ సినిమా. నా కుమారుడితో కలిసి ఈ సినిమా చూడటమంటే నాకెంతో ఇష్టం. మాకు ఇది ఆల్‌టైమ్ ఫేవరెట్ మూవీ. అందుకే మూడు నెలలకోసారి కచ్చితంగా ఈ చిత్రాన్ని చూస్తుంటాం. ఎంతో అందమైన, అద్భుతమైన చిత్రాల్లో ఇదీ ఒకటి అని చెప్పుకొచ్చింది.భారత్‌కు రావాలనుంది..ఇండియన్ చెఫ్ రోమీ గిల్‌తో స్నేహం గురించి మాట్లాడుతూ.. రోమీ నాకు మంచి స్నేహితురాలు. తను చాలా బాగా వంట చేస్తుంది. భారత్‌కు వచ్చి, ఇక్కడ సంస్కృతి, సాంప్రదాయాలను చూడాలనుందని తనతో తరచూ అంటూ ఉంటాను అని తెలిపింది. కాగా మిన్నీ డ్రైవర్.. ఇటీవలే ద సెర్పంట్ క్వీన్ రెండో సీజన్లో నటించింది. ఇందులో క్వీన్ ఎలిజబెత్‌గా యాక్ట్ చేసింది. ఈ సిరీస్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ లయన్స్‌గేట్ ప్లేలో అందుబాటులో ఉంది.చదవండి: Bigg Boss 8 Telugu: వీటి గురించి ఎవరు మాట్లాడుకోరేం.. -
అమెరికా ఎన్నికల్లో వైరల్ అవుతున్న ఎన్టీఆర్ సాంగ్
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ దూసుకెళ్తున్నారు. భారత మూలాలున్న ఆమెకు భారీగానే మద్దతు లభిస్తోంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మధ్య పోటీ కూడా తీవ్రంగానే ఉంది. నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా డెమోక్రట్, రిపబ్లికన్ అభ్యర్థులు తమ ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఈ క్రమంలో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ సరికొత్తగా ఆర్ఆర్ఆర్ సాంగ్‌తో ప్రచారంలో దిగారు.దక్షిణాసియా దేశాలకు చెందిన ప్రజలను ఆకర్షించేందుకు కమలా హారీస్ అడుగులేస్తున్నారు. భారతీయ సంతతికి చెందిన ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆమె వినూత్న ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ 'నాటు నాటు' సాంగ్ హిందీ వర్షన్‌తో ఒక వీడియోను రూపొందించారు. ఈ పాటలో ఆమె విజువల్స్ వచ్చేలా ఎన్నికల ప్రచార గీతాన్ని క్రియేట్ చేశారు.ఆ వీడియోను ఇండియన్-అమెరికన్ వ్యవస్థాపకుడు అజయ్ భూటోరియా విడుదల చేశారు. ఆ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ప్రచారం గీతం వస్తున్న క్రమంలో భారతీయ మూలాలకు చెందిన పలువురు వ్యక్తుల కామెంట్లను కూడా వినిపించారు. కమలా హారిస్‌కు ఓట్ వేయాలని తెలుగు భాషలో కూడా డెమొక్రాటిక్ పార్టీ నేతలు అభ్యర్థించారు. దక్షిణాసియాకు చెందినవారు అమెరికాలో భారీగానే ఉన్నారు. సుమారు 60 లక్షల ఓట్లు దక్షిణాసియాకు చెందిన వారివి ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పడు వారు ఎటువైపు మద్ధతు ఇస్తే.. వారిదే గెలుపు అని అక్కడ ట్రెండ్ అవుతుంది. ఇదీ చదవండి: విడాకుల గురించి జయం రవిపై భార్య సంచలన ఆరోపణకమలాహారిస్ తల్లి శ్యామలా గోపాలన్ భారతీయురాలేనని తెలిసిందే. శ్యామల తండ్రే పీవీ గోపాలన్ తమిళనాడుకు చెందిన వ్యక్తి. అయితే, శ్యామల 1958లో ఉన్నత చదువుల కోసం కాలిఫోర్నియా వెళ్లి అక్కడే డాక్టరేట్ పూర్తి చేశారు. రొమ్ము క్యాన్సర్‌పై ఆమే అనేక పరిశోధనలు జరిపారు. అనంతరం జమైకాకు చెందిన డొనాల్డ్ హారిస్‌ను శ్యామలా పెళ్లి చేసుకున్నారు. అలా వారికి జన్మించిన మొదటి సంతానమే కమలా హారిస్. ఆమెకు చెల్లెలు మాయా కూడా ఉంది.Excited to share the release of our new music video, 'Nacho Nacho,' supporting @VP Kamala Harris for President! Let’s mobilize and turn out the South Asian vote in key battleground states @DNC @CNN @ABC @maddow @aajtak @ndtvindia @IndiaToday @republic pic.twitter.com/x92vns4gH8— Ajay Jain Bhutoria (@ajainb) September 8, 2024 -
మేరా భారత్ మహాన్
-
రామ్ చరణ్‌పై హాలీవుడ్ హీరో ప్రశంసలు.. ఎందుకంటే..?
ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యాడు. అందులో అల్లూరి సీతారామరాజు పాత్ర పోషించిన రామ్ చరణ్..తనదైన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. చరణ్ నటనకు ఇండియన్ సినీ ప్రేక్షకులే కాదు.. హలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు. ఇప్పటికే పలువురు హాలీవుడ్ ప్రముఖులు ఆర్ఆర్ఆర్ సినిమాను..అందులో చరణ్ నటనపై ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. తాజాగా హాలీవుడ్ స్టార్ లుకాస్ బ్రావో కూడా ఆర్ఆర్ఆర్లో రామ్‌చరణ్ నటనను ప్రశంసించారు. ఎమిలీ ఇన్ పారిస్‌కు సంబంధించిన ప్రమోషన్స్ సమయంలో ఇండియన్ సినిమాల్లో మీకు నచ్చిన నటుడు గురించి చెప్పమని అడిగినప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా చూశానని చెప్పిన లుకాస్ బ్రావో... రామ్ చరణ్ ఒక అద్భుతమైన నటుడని కొనియాడాడు. ‘ఎంట్రీ సీన్, ఎమోషనల్ సన్నివేశాల్లో బాగా నటించాడు. యాక్షన్ సీక్వెన్స్‌లలోనూ ఆకట్టుకున్నాడు’ అని ప్రశంసించారు. ప్రస్తుతం ఈ వీడియోను ఆయన అభిమానులు షేర్ చేస్తున్నారు. దీంతో ఎక్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’ పేరు దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లోకి వచ్చింది.రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్ చరణ్‌తో పాటు ఎన్టీఆర్ కూడా కీలక పాత్ర పోషించాడు. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 2022లో రిలీజై.. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 1300 కోట్లకు పైగా వసూళ్లను సాధించడమే కాకుండా..ఆస్కార్ అవార్డును సైతం గెలుచుకుంది. -
స్వాతంత్ర దినోత్సవం ప్రత్యేకం.. తెలుగులో చూడాల్సిన దేశభక్తి చిత్రాలివే!
యావత్ భారతదేశం గర్వంగా, దేశభక్తిని చాటి చెప్పేలాఅందరం ఆనందంగా జరుపుకునే పండుగ స్వాతంత్ర్య దినోత్సవం. ఈ పంద్రాగస్టుతో మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు పూర్తి అవుతోంది. గడిచిన ఏడు దశాబ్దాలుగా దేశ భక్తిని చాటి చెప్పే ఏన్నో చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ప్రత్యేకంగా దేశభక్తిని చాటి చెప్పే సినిమాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా చూడాల్సిన టాలీవుడ్ దేశభక్తి సినిమాలపై ఓ లుక్కేద్దాం పదండి.స్వాతంత్ర దినోత్సవం రోజు చూడాల్సిన తెలుగు సినిమాలివేఅల్లూరి సీతారామరాజుమన్యం వీరుడు అల్లూరి కథతో తెరకెక్కిన సినిమా ఇది. సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడంతోపాటు దేశభక్తి మరోసారి ఉప్పొంగేలా చేసింది.ఖడ్గంకృష్ణవంశీ దర్శకత్వంలో దేశభక్తి కథాంశంతో వచ్చిన సినిమా ఖడ్గం. 1990లో ముంబైలో జరిగిన దాడుల్లో చాలా మంది చనిపోయారు. దాని ఆధారంగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించాడు కృష్ణవంశీ. శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్, రవితేజ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలోని పాటలు కూడా హిట్ అయ్యాయి.సుభాష్ చంద్రబోస్విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన చిత్రం ఇది. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాం బాక్సాపీస్ వద్ద బోల్తా పడినప్పటీకీ.. వెంకటేశ్ నటన మాత్రం ప్రేక్షకులను కట్టిపడేసింది.భారతీయుడుశంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమా కూడా దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో దేశం మోసం పోరాడే యోధుడిగా.. అవినీతి పరులను అంతం చేసే భారతీయుడిగా కమల్ నటన ఆకట్టుకుంది.సైరా నరసింహారెడ్డిస్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా తెరకెక్కించిన చిత్రం ఇది. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర పోషించాడు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషించారు. కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ ప్రాంతంలో జన్మించిన నరసింహారెడ్డి దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి పడిన కష్టాన్ని ఈ సినిమాలో కళ్ల కట్టినట్లు చూపించారు.మహాత్మ2009 లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. ఇందులో శ్రీకాంత్, భావన ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాలోని ‘కొంతమంది ఇంటిపేరు కాదుర గాంధీ పాట’దేశభక్తి మరోసారి ఉప్పొంగేలా చేసింది.పరమ వీర చక్ర2011లో విడుదలైన తెలుగు చిత్రం ఇది. తేజ సినిమా బ్యానర్‌పై సి.కళ్యాణ్ నిర్మించాడు. దర్శకుడిగా దాసరి నారాయణరావుకు ఇది 150 వ చిత్రం. నందమూరి బాలకృష్ణ, అమీషా పటేల్, షీలా, నేహా ధూపియా, జయసుధ ప్రధాన పాత్రల్లో నటించారు.ఘాజీ1971లో జరిగిన యదార్ధ యుద్దగాద నేపధ్యంలో విశాఖ సబ్ మెరైన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన సినిమా ఘాజీ. సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో రానా, తాప్సీ, అతుల్ కులకర్ణి, రాహుల్ సింగ్ ముఖ్యపాత్రల్లో నటించారు.సర్దార్ పాపారాయుడు1980ల్లో వచ్చిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా కనిపించారు. సర్దార్ పాపారాయుడు అంటూ ఈ సినిమాలో ఎన్టీఆర్ పలికిన పలుకులను ఎవ్వరూ అంత సులభంగా మర్చిపోలేరు. శ్రీదేవీ, శారద తదితరులు నటించిన ఈ చిత్రానికి దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించారు.బొబ్బిలి పులి1982లో ఎన్టీఆర్ ప్రధానపాత్రలో వచ్చిన చిత్రం బొబ్బలి పులి. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీదేవీ, మురళీ మోహన్, జగ్గయ్య, కైకాల సత్యనారాయణ తదితరులు కీలక పాత్రలలో నటించారు. దేశ భక్తి ప్రధానంగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది.గౌతమిపుత్ర శాతకర్ణిబాలకృష్ణ ప్రధానపాత్రలో నటించిన సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ సినిమాను కృష్ణ జాగర్లమూడి డైరెక్షన్లో తెరకెక్కించారు.ఆర్ఆర్ఆర్రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో బ్రిటీష్ కాలంలో పోరాడిన యోధుల చరిత్ర ఆధారంగా రూపొందించారు. ఇందులో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో మెప్పించగా.. రామ్ చరణ్ బ్రిటీష్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు.రాజన్న(2011)నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం రాజన్న. 2011లో వచ్చిన ఈ సినిమాను విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో రూపొందించారు.మేజర్అడివిశేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మేజర్. ఈ సినిమాను ముంబై ఉగ్రవాద దాడి సమయంలో తన ప్రాణాలను త్యాగం చేసిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు.వీటితో పాటు పల్నాటి యుద్ధం, నేటిభారతం(1983), వందేమాతరం(1985), ఆంధ్రకేసరి-(1983), మరో ప్రపంచం, మనదేశం(1949) లాంటి దేశ స్వాతంత్ర్య పోరాటాల ఆధారంగా తెరకెక్కించిన చిత్రాలు కూడా ఉన్నాయి. ఇండిపెండెన్స్ సందర్భంగా స్వాతంత్ర్య పోరాటయోధుల చరిత్రను తెలుసుకునేందుకు ఈ సినిమాలు చూసేయండి. -
ఆగస్టు 15.. ఓటీటీలో ఈ మూవీస్ మిస్ అవ్వొద్దు!
స్వాతంత్ర్య దినోత్సవం వచ్చేసింది. చాలామందికి ఈ రోజు సెలవు. మరోవైపు థియేటర్లలో 'మిస్టర్ బచ్చన్', 'డబుల్ ఇస్మార్ట్', 'తంగలాన్', 'ఆయ్' తదితర మూవీస్ రిలీజ్. సరే ఇవేం చూస్తాంలే. ఇంట్లోనే ఎంటర్ టైన్మెంట్ కావాలా? అయితే ఈ సినిమాలు మీకోసమే. ఎందుకంటే రెగ్యులర్ రొటీన్ కాకుండా కాస్తంత దేశభక్తిని గుర్తొచేసే చిత్రాలివి. ఇంతకీ ఇవన్నీ ఏ ఓటీటీల్లో ఉన్నాయి? అనేది తెలియాలంటే దిగువన లిస్ట్ చూసేయండి.(ఇదీ చదవండి: 100 'కేజీఎఫ్'లు కలిపి తీస్తే ఈ సినిమా.. ఓటీటీలోనే బెస్ట్ యాక్షన్ మూవీ)ఓటీటీలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున చూడాల్సిన మూవీస్ఖడ్గం - సన్ నెక్స్ట్, యూట్యూబ్ (తెలుగు)మేజర్ - నెట్‌ఫ్లిక్స్ (తెలుగు)ఘాజీ - నెట్‌ఫ్లిక్స్ (తెలుగు)గగనం - హాట్ స్టార్, యూట్యూబ్ (తెలుగు)భారతీయుడు - నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ (తెలుగు డబ్బింగ్)మేజర్ చంద్రకాంత్ - యూట్యూబ్, సన్ నెక్స్ట్ (తెలుగు)అల్లూరి సీతారామరాజు - అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్ (తెలుగు)ఆర్ఆర్ఆర్ - జీ5, హాట్‌స్టార్ (తెలుగు)సర్దార్ పాపారాయుడు - అమెజాన్ ప్రైమ్ వీడియో (తెలుగు)రాజన్న - హాట్ స్టార్ (తెలుగు)ఉరి - అమెజాన్ ప్రైమ్ (తెలుగు డబ్బింగ్)షేర్షా - అమెజాన్ ప్రైమ్ (తెలుగు డబ్బింగ్)సామ్ బహదూర్ - జీ5 (హిందీ)రాజీ - అమెజాన్ ప్రైమ్ (హిందీ)బోస్: ద ఫర్గాటెన్ హీరో - యూట్యూబ్ (హిందీ)ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ - యూట్యూబ్ (హిందీ)బోర్డర్ - అమెజాన్ ప్రైమ్ (హిందీ)కేసరి - అమెజాన్ ప్రైమ్ (హిందీ)చక్ దే - అమెజాన్ ప్రైమ్ (హిందీ)(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ కొరియన్ మూవీస్.. ఏ సినిమా ఎక్కడ చూడొచ్చంటే?) -
రాజమౌళి డాక్యుమెంటరీ.. ఆర్ఆర్ఆర్ డిలీటెడ్ సీన్ చూశారా?
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించారు. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డ్ సైతం దక్కింది. అయితే తాజాగా రాజమౌళిపై మోడరన్ మాస్టర్స్ పేరుతో నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ రూపొందించింది. ఇందులో మొదటి నుంచి సినీ ఇండస్ట్రీలో ఆయన ప్రయాణాన్ని ఆవిష్కరించారు. అయితే ఈ నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన ఓ సీన్ తెగ వైరలవుతోంది. ఇందులో రామ్ చరణ్ ఎడ్లబండిపై నిలబడి ఉన్న సన్నివేశం చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ఈ సీన్ ఆర్ఆర్ఆర్ సినిమాలో లేదు.. షూటింగ్‌కు సంబంధించిన ఈ క్లిప్‌ను మోడరన్ మాస్టర్స్ డాకుమెంటరీలో చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.కాగా.. రాజమౌళి త్వరలోనే మహేష్ బాబుతో మూవీ చేయనున్నారు. ఇప్పటికే కథ సిద్ధం కాగా.. ఇంకా టైటిల్ ప్రకటించలేదు. ఈ మూవీని యాక్షన్-అడ్వెంచర్ చిత్రంగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం డిసెంబర్లో రిలీజ్ కానుంది. '@AlwaysRamCharan Deleted scene from @RRRMovie pic.twitter.com/Qj7ZQ4Wn3u— ChaRan (@SSCharan_always) August 2, 2024 -
ఇదీ ప్రభాస్ రేంజ్! ఆర్ఆర్ఆర్ రికార్డునూ బ్రేక్ చేసిన కల్కి
-
'ఆర్ఆర్ఆర్' రికార్డ్ కూడా బ్రేక్ చేసిన 'కల్కి'
ప్రభాస్ 'కల్కి' ప్రస్తుతం నాలుగో వారంలో ఉంది. అయితేనేం ఇప్పటికీ మోస్తరు వసూళ్లు సాధిస్తోంది. కొత్త సినిమాలు రిలీజైనప్పటికీ.. అవి హిట్ కాకపోవడం దీనికి ప్లస్ అయింది. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం 'ఆర్ఆర్ఆర్' సాధించిన ఓ రికార్డుని ఇప్పుడు 'కల్కి' బ్రేక్ చేసింది. ఇంతకీ ఆ ఘనత ఏంటి?(ఇదీ చదవండి: 41 ఏళ్ల డైరెక్టర్‌తో 28 ఏళ్ల హీరోయిన్ పెళ్లి.. వీళ్లు ఎవరంటే?)రిలీజ్ ముందు వరకు 'కల్కి'పై ఓ మాదిరి అంచనాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఒక్కసారి థియేటర్లలోకి వచ్చిన తర్వాత హిట్ టాక్ సొంతం చేసుకుంది. మరీ ముఖ్యంగా మహాభారతం ఎపిసోడ్స్ కోసం రిపీట్స్‌లో చూస్తున్నారు. తెలుగులో కలెక్షన్ కాస్త డౌన్ అయినప్పటికీ హిందీలో ఇంకా రన్ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో కేవలం హిందీలోనే నాలుగు వారాల్లో రూ.275.9 కోట్లు వచ్చాయి. దీంతో ఇప్పటివరకు 'ఆర్ఆర్ఆర్' హిందీలో సాధించిన రూ.272 కోట్ల రికార్డ్ బ్రేక్ అయింది.ఇకపోతే హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన డబ్బింగ్ సినిమాల జాబితాలో 'బాహుబలి 2', 'కేజీఎఫ్ 2' తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. వీటికి బాలీవుడ్లో వరసగా రూ.511, రూ.435 కోట్లు వచ్చాయి! ఇదిలా ఉండగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల క్రాస్ చేసిన 'కల్కి'.. మొత్తం పూర్తయ్యేసరికి ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందనేది చూడాలి.(ఇదీ చదవండి: విడాకులు తీసుకున్నా.. కానీ హ్యాపీగానే ఉన్నా: స్టార్ హీరో భార్య) -
ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో 'ఆర్ఆర్ఆర్' రికార్డ్.. మొత్తంగా ఎన్ని వచ్చాయంటే?
2023 సంవత్సరానికి గానూ ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డులని తాజాగా ప్రకటించారు. ఇందులో భాగంగా దక్షిణాదిలో నాలుగు భాషల్లో గతేడాదితో పాటు 2022లో థియేటర్లలో విడుదలైన చిత్రాల్ని లెక్కలోకి తీసుకుని ఓవరాల్‌గా అవార్డులని అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇందులో భాగంగా ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఏకంగా 7 అవార్డులు దక్కాయి. అలానే సీతారామం సినిమాకు 5, విరాటపర్వం 2, 'భీమ్లా నాయక్'కి ఓ అవార్డు సాధించాయి. గతంలో 'ఆర్ఆర్ఆర్'కి రిలీజ్ తర్వాత నుంచి ఇప్పటికీ ఏదో ఓ అవార్డ్ వస్తూనే ఉండటం విశేషం. ఇకపోతే ఎవరెవరికీ ఏ విభాగంలో అవార్డు దక్కిందో దిగువన లిస్ట్ ఉంది చూసేయండి.(ఇదీ చదవండి: సంప్రదాయబద్ధంగా నటి వరలక్ష్మి వివాహం)ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2023 (తెలుగు)ఉత్తమ సినిమా - ఆర్ఆర్ఆర్ఉత్తమ దర్శకుడు - ఎస్ఎస్ రాజమౌళిఉత్తమ మూవీ (క్రిటిక్స్) - సీతారామంఉత్తమ నటుడు - రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ (ఆర్ఆర్ఆర్)ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - దుల్కర్ సల్మాన్ (సీతారామం)ఉత్తమ నటి - మృణాల్ ఠాకుర్ (సీతారామం)ఉత్తమ నటి (క్రిటిక్స్) - సాయిపల్లవి (విరాటపర్వం)ఉత్తమ సహాయ నటుడు - రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్)ఉత్తమ నటి - నందితా దాస్ (విరాటపర్వం)ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ - కీరవాణి (ఆర్ఆర్ఆర్)ఉత్తమ లిరిక్స్ - సిరివెన్నెల సీతారామశాస్త్రి - కానున్న కల్యాణం (సీతారామం)ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ (పురుషుడు) - కాల భైరవ (ఆర్ఆర్ఆర్- కొమురం భీముడో)ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ (మహిళ) - చిన్మయి (సీతారామం- ఓ ప్రేమ)ఉత్తమ కొరియోగ్రఫీ - ప్రేమ్ రక్షిత్ (ఆర్ఆర్ఆర్ - నాటు నాటు)ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - సాబు సిరిల్ (ఆర్ఆర్ఆర్)(ఇదీ చదవండి: రామ్ చరణ్ కొత్త కారు.. దేశంలోనే రెండోది) -
Kalki 2898 AD: రీలీజ్‌కు ముందు ఇన్ని రికార్డులా?
-
విడుదలకు ముందే రికార్డులు.. రాజమౌళి సినిమాను దాటేసిన కల్కి!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వస్తోన్న సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. ఈ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్. టీజర్, బుజ్జి లుక్ అభిమానులను కట్టిపడేస్తున్నాయి. అయితే కల్కి రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టిస్తోంది.కల్కికి సంబంధించి ఓవర్సీస్లో భారీగా ప్రీ సేల్స్ జరిగినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్లో ఇప్పటికే వన్ మిలియన్ డాలర్ల మార్కును దాటేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో రిలీజ్‌కు రెండు వారాల ముందే నార్త్ అమెరికాలో కల్కి రికార్డులు సృష్టిస్తోందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంలో రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను అధిగమించినట్లు తెలుస్తోంది. అంతేకాదు అత్యంత వేగంగా వన్ మిలియన్ ప్రీ సేల్స్ జరుపుకున్న తొలి ఇండియన్ సినిమాగా నిలిచింది. ఇదే జోరు కొనసాగితే కల్కి మరిన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.కాగా.. ఈ చిత్రంలో కమల్ హాసన్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. ఇవాళ దిశా పటానీ బర్త్ డే కావడంతో కల్కి చిత్రంలో ఆమె లుక్‌తో ఉన్న పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
ఆర్ఆర్ఆర్ చాలా నచ్చింది.. ఆ హీరోతో పని చేయాలనుంది: హాలీవుడ్ డైరెక్టర్
హాలీవుడ్ దర్శకరచయిత ఫిలిప్ నోయిస్ డైరెక్ట్ చేసిన రీసెంట్ మూవీ ఫాస్ట్ చార్లీ. ఈ సినిమా గతేడాది థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడిది ఇండియాలోనూ రిలీజ్ కావడంతో ఇక్కడి మీడియాకు వరుస ఇంటర్వ్యూలిస్తున్నాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. 'ఇండియన్ సినిమాకు నేను పెద్ద అభిమానిని. ఆ మధ్య ఆర్ఆర్ఆర్ మూవీ చూశాను. అది ప్రపంచవ్యాప్తంగా ఎంతో గొప్ప విజయం సాధించింది. అలాగే దేవ్ పటేల్ దర్శకత్వం వహించడంతో పాటు యాక్ట్ చేసిన మంకీ మాన్ కూడా బాగా నచ్చింది.ఆల్‌టైం ఫేవరెట్..ఈ ఏడాది ఇదే బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. మంకీమాన్ చిత్రంలో కథ చెప్పే విధానం కాస్త ఆర్ఆర్ఆర్ మాదిరిగా ఉంటుంది. సత్యజిత్ రే తీసిన పాతర్ పాంచాలి నా ఆల్‌టైమ్ ఫేవరెట్ మూవీ. బాల్యంలో ఉన్నప్పుడు ఆ సినిమా నన్ను ఎంతగానో కదిలించింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో గొప్ప ఇండియన్ సినిమాలున్నాయి. ఓటీటీల పుణ్యమాని వాటిని ఎంచక్కా డిజిటల్ ప్లాట్ఫామ్లో చూడొచ్చు. నేను ఇండియాలో సినిమా తీయాల్సి వస్తే దాన్ని గౌరవంగా భావిస్తాను. హీరో షారుక్ ఖాన్‌తో పని చేయాలని ఉంది. వారి బ్లడ్‌లోనే ఉందిఇక్కడ తీసే అద్భుతమైన సినిమాలు కొన్ని బయట దేశాల్లో విడుదల కావడం లేదు. ప్రపంచ ప్రేక్షకుల్ని మీ వైపు తిప్పుకోవాలంటే ఇంకాస్త కష్టపడాల్సి ఉంది. ఇండియన్ ప్రేక్షకులు ఎమోషన్స్‌ను బయటకు చూపిస్తారు. సినిమాలో లీనమైపోతారు. వారి రక్తంలోనే సినిమా అనేది ప్రవహిస్తూ ఉంటుంది. ఇది ప్రపంచంలో ఇంకెక్కడా లేదు' అని చెప్పుకొచ్చాడు. కాగా ఫిలిప్ నోయిస్ .. న్యూస్ఫ్రంట్, హీట్‌వేవ్, డెడ్ కామ్, ద క్వైట్ అమెరికన్, రాబిట్ ప్రూఫ్ ఫెన్స్, ద గీవర్, ద డెస్పరేట్ అవర్ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు.చదవండి: నా బయోపిక్‌లో ఈ హీరోల్లో ఎవరు నటించినా ఓకే.. నేను కూడా.. -
చరణ్-తారక్‌పై మనసు పారేసుకున్న హాలీవుడ్ భామ.. ఏం చెప్పిందంటే?
'ఆర్ఆర్ఆర్' సినిమా వచ్చి రెండేళ్లు దాటిపోయింది. కానీ ఇప్పటికే ఎక్కడో ఓ చోట ఇంకా దీని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. మన సినిమా కాబట్టి మనం మాట్లాడుకోవడంలో వింతేం లేదు. కానీ హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా దీనికి ఫిదా అయిపోయి ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. తాజాగా హాలీవుడ్ బ్యూటీ ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' గురించి మాట్లాడుతూ తన కోరిక బయటపెట్టింది.(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' పునర్నవి ప్రేమలో పడిందా? మరి ఆ కుర్రాడెవరు?)'నేను అందరిలానే 'ఆర్ఆర్ఆర్' సినిమాని ఎంతో ఇష్టపడ్డాను. ఇది అద్భుతంగా ఉంది. ఇందులో నటించిన వాళ్లలో ఎవరితోనైనా కలిసి పనిచేయడం నిజంగానే ఓ డ్రీమ్' అని హాలీవుడ్ నటి ఆన్ హాథవే చెప్పుకొచ్చింది.హాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాలైన 'ఇంటర్ స్టెల్లార్', 'ద డార్క్ నైట్ రైజెస్' తదితర సినిమాల్లో నటించిన ఆన్ హాథవే ఇప్పుడు 'ద ఐడియా ఆఫ్ యూ' అనే మూవీతో ప్రేక్షకుల్ని పలకరించింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది స్ట్రీమ్ కానుంది. దీని ప్రీమియర్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 'ఆర్ఆర్ఆర్'పై తాను మనసు పారేసుకున్న విషయాన్ని బయటపెట్టింది. ఆన్ కామెంట్స్ బట్టి చూస్తే తారక్, చరణ్‌లతో నటించాలనుకుంటోంది. చూద్దాం మరి ఈ కాంబోని ఎవరైనా సెట్ చేస్తారేమో?(ఇదీ చదవండి: పిల్లలు వద్దని కండీషన్ పెట్టా.. ప్రెగ్నెన్సీ వస్తే రోజూ ఏడుస్తూ..: సీనియర్ నటి కవిత)Hollywood #Interstellar Movie Actress #AnneHathaway Loved #RRRMovie ❤️she would like to work With Cast Involved with RRR Movie 🔥@tarak9999 @RRRMovie pic.twitter.com/wXqiwEg5l9— Jr NTR Fan Club (@JrNTRFC) May 24, 2024 -
RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
పాన్ ఇండియా స్టార్స్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ పోటీపడి నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ కల్పిత కథతో రూపుదిద్దుకున్న 'ఆర్ఆర్ఆర్' 2022 మార్చి 25న విడుదలైంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమురం భీమ్‌గా తారక్ నటించి మెప్పించారు. హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్ కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. రూ. 550 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్.. ప్రపంచవ్యాప్తంగా రూ. 1200 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.తెలుగు, హిందీలో రీ-రిలీజ్ తారక్- చరణ్ ఫ్యాన్స్‌కు పండుగలాంటి సినిమా ఆర్ఆర్ఆర్. సినిమా విడుదల సమయంలో థియేటర్లు అన్నీ నిండిపోయాయి. విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ విజయకేతనం ఎగరేసి, రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది. సినిమా వచ్చి రెండేళ్లు దాటింది. అయినా కూడా ఈ సినిమాపై క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే ఇప్పుడు ఈ సినిమాను రీ-రిలీజ్ చేస్తున్నారు. మే 10న మరోసారి ఆర్ఆర్ఆర్ విడుదల కానుందని అధికారిక ప్రకటన వచ్చేసింది. అయితే, 2డీ, 3డీ ఫార్మాట్లతో పాటు 4K వర్షన్‌తో స్పెషల్‌గా వస్తుండటంతో అభిమానులు కాస్త ఆసక్తిగా ఉన్నారు. దీంతో ప్రేక్షకులు మరోసారి థియేటర్‌కు వచ్చి ఆ అనుభవాన్ని పంచుకోనున్నారు.ఆర్ఆర్ఆర్ ఖాతాలో లెక్కలేనన్ని ఆవార్డులు వచ్చి చేరాయి. అన్నింటికంటే ముఖ్యమైనది ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును కూడా ఆర్ఆర్ఆర్ సొంతం చేసుకుంది. ఇందులోని 'నాటునాటు' పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ దక్కింది. ఈ అవార్డు దక్కించుకున్న తొలి భారతీయ ఫీచర్ సినిమాగా ఆర్ఆర్ఆర్ రికార్డ్ క్రియేట్ చేసింది. RRR RE RELEASE on 10th May 🔥💥 @AlwaysRamCharan #RRRMoviepic.twitter.com/8eaIfLjw14— Navya (@HoneYNavya_) May 6, 2024 -
మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది: రాజమౌళి
దర్శకధీరుడు ప్రస్తుతం జపాన్‌లో బిజీగా ఉన్నారు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాను జపాన్‌లోనూ రిలీజ్ చేశారు. గతేడాది ఆస్కార్ అవార్డ్ దక్కించుకున్న ఈ చిత్రాన్ని జపాన్‌లో 100 ఏళ్లనాటి పురాతన మ్యూజికల్ థియేటర్లో ప్రదర్శించారు. ఈ విషయాన్ని రాజమౌళి ట్విటర్ ద్వారా పంచుకున్నారు. రాజమౌళి ట్విటర్లో రాస్తూ.. 'ఆర్ఆర్ఆర్ సినిమాను 110 ఏళ్ల నాటి తకరాజుకా సంస్థ నిర్వహించే మ్యూజికల్ థియేటర్లో ప్రదర్శించడం విశేషం. ఆర్ఆర్ఆర్ చిత్రంలాగే ఈ మ్యూజికల్ షోపై కూడా ప్రేమ చూపిన జపనీస్ ఆడియన్స్‌కు ధన్యవాదాలు. మీ రెస్పాన్స్ చూస్తే మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఈ షోలో మీ శక్తి, ప్రతిభ నన్ను ఆశ్చర్యపరిచాయి. ఈ ఈవెంట్లో భాగమైన అమ్మాయిలను అభినందించకుండా ఉండలేకపోతున్నా' అని రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్స్ దర్శకధీరుడి అభినందిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం రాజమౌళి.. మహేశ్‌బాబుతో సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే కథను అందించారు. యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో రానున్న ఈ సినిమాకు మహారాజ్ అనే టైటిల్ పెట్టాలనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ హీరోయిన్గా.. హాలీవుడ్ ప్రముఖ నటుడు క్రిస్ హెమ్స్‌వర్త్ కీలకపాత్ర పోషించనున్నారని కూడా టాక్ నడుస్తోంది. Its an honour that our RRR has been adapted as a musical by the 110 year old Takarazuka company. Thank you Japanese audience for embracing the Broadway play of RRR just like the film itself. Overwhelmed by your response... Can't appreciate all the girls enough for your energy,… pic.twitter.com/QbfLPmsJxC — rajamouli ss (@ssrajamouli) March 22, 2024 -
'రాజమౌళి ఆర్ఆర్ఆర్.. ఆమె చనిపోవాల్సింది.. కానీ'!
రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన పీరియాడిక్ చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. 2022లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అంతే కాకుండా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్‌కు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ దక్కింది. తాజాగా జపాన్‌లో ఈ మూవీని విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా బ్రిటిష్ యువతి జెన్నీ పాత్రలో ఓలివియా మోరిస్ నటించింది. ఈ సినిమాలో వీరిద్దరి కాంబినేషన్లో మరిన్నీ సీన్స్ ఉన్నాయని రాజమౌళి తెలిపారు. కానీ సినిమా నిడివి పెరగడంతో ఎడిటింగ్‌లో తీసేయాల్సి వచ్చిందని వెల్లడించారు. రాజమౌళి మాట్లాడుతూ..'ఎన్టీఆర్(భీమ్)ను జైలులో పెట్టిన తర్వాత జెన్నీ (ఓలివియా మోరిస్) అతడిని కలుస్తుంది. జైలు నుంచి తప్పించడానికి భీమ్‌కు సాయం చేయాలనుకుంటుంది. ఆమె అంకుల్ గవర్నర్ స్కాట్ గదిలోకి రహస్యంగా వెళ్లి.. అక్కడ ఉన్న ప్లాన్స్‌ను దొంగిలించి భీమ్‌కు అందజేస్తుంది. అక్కడి నుంచి వస్తుండగానే.. స్కాట్ భార్య ఆమెను చూస్తుంది. జెన్నీ బూట్లకు మట్టి ఉండటంతో అనుమానం వచ్చి.. విషయాన్ని స్కాట్‌కు చెబుతుంది. ఆ తర్వాత భీమ్ తప్పించుకుంటాడు.' అని తెలిపారు. ఆ తర్వాత రామ్‌ను జైల్లో పెడతాడు స్కాట్. ఈ విషయం తెలుసుకున్న భీమ్ తిరిగి వచ్చి రామ్‌ను కాపాడి జైలు నుంచి బయటకు తెస్తాడు. వాళ్లిద్దరూ బ్రిటిష్ సైన్యాన్ని చంపుకుంటూ పోయే క్రమంలో జెన్నీని పావుగా వాడుకుని వాళ్లను పట్టుకోవాలని స్కాట్ ప్లాన్. లొంగిపోకపోతే.. జెన్నీని చంపేస్తానని వాళ్లను స్కాట్ బెదిరిస్తాడు. దీంతో వారు లొంగిపోయే క్రమంలోనే జెన్నీ మోసం చేసిందన్న కోపంతో ఆమెను స్కాట్ చంపేస్తాడు. ఆర్ఆర్ఆర్ ఒరిజినల్ వర్షన్లో జెన్నీ చనిపోతుంది. కానీ ఈ విషాదంతో కూడిన కథను తీయాలని నాకు అనిపించలేదు. దీంతో మొత్తం మార్చేశాం. జెన్నీ బతికిపోయింది. మీరు హ్యాపీగా సినిమా చూశారంటూ' పేర్కొన్నారు. ప్రస్తుతం రాజమౌళి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీని ప్రకారం భీమ్, జెన్నీలకు అదనంగా ట్రాక్స్ రాసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమా నిడివి మూడు గంటలు దాటిపోవడంతో ఆ సీన్స్ తొలగించారు. కాగా. రాజమౌళి తన నెక్ట్స్ మూవీ ప్రిన్స్ మహేశ్ బాబుతో తెరకెక్కించనున్నారు. -
మహేశ్ బాబును ఇక్కడికి తీసుకొస్తాను: రాజమౌళి
మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో రానున్న బిగ్ ప్రాజెక్ట్ త్వరలో పట్టాలెక్కనుంది. తాజాగా ఇదే విషయాన్ని జక్కన్న తెలిపారు. దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం జపాన్‌లో ఉన్న రాజమౌళి SSMB29 సినిమాకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడమే కాకుండా ఆస్కార్ అవార్డుతో RRR గుర్తింపు తెచ్చుకుంది. తెలుగువారికి ఎంతో గర్వకారణంగా ఈ చిత్రం నిలిచింది. తాజాగా జపాన్‌లో ఈ మూవీ స్క్రీనింగ్‌కు రాజమౌళి హజరయ్యారు. అక్కడ మన జక్కన్న క్రేజ్ మామూలగా లేదు. ఆయనపై ఎనలేని అభిమానాన్ని అక్కడి ప్రజలు చూపించారు. ఈ క్రమంలో తన తర్వాతి ప్రాజెక్ట్ అయిన SSMB29 గురించి ఆయన మాట్లాడారు. 'మహేశ్ బాబుతో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి నటీనటుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. SSMB29 ప్రాజెక్ట్‌కు సంబంధించి కేవలం హీరోను మాత్రమే లాక్ చేశాం. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరో మహేశ్ బాబు.. ఆయన తెలుగు వారు.. చాలా అందంగా ఉంటారు. బహుషా మీలో చాలామందికి ఆయన గురించి తెలిసే ఉంటుంది. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి జపాన్‌లో కూడా రిలీజ్ చేస్తాం.. ఆ సమయంలో మహేశ్ బాబుని కూడా ఇక్కడికి తీసుకొని వస్తాను.' అని జపాన్‌లో జక్కన్న వ్యాఖ్యానించారు. దీంతో మహేశ్ ఫ్యాన్స్ ఆయన మాటలను సోషల్ మీడియా ద్వారా తెగ షేర్ చేస్తున్నారు. SSR about #SSMB29 We've finished writing and are now in pre-production. Only the, protagonist SuperStar @urstrulyMahesh , is confirmed and he's incredibly handsome. Hoping to expedite the filming process and have him join us for promotion during the release #MBSSR pic.twitter.com/JZAx3oP6cu — Mahesh Babu Trends ™ (@MaheshFanTrends) March 19, 2024 -
ఆ దేశంలో రాజమౌళి క్రేజే వేరు.. ఏకంగా 83 ఏళ్ల వృద్ధురాలు!
రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ చిత్రం ఆస్కార్ అవార్డ్ దక్కించుకుంది. నాటునాటు అనే సాంగ్‌కు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ దక్కింది. అంతే కాకుండా ఈ సినిమాను విదేశాల్లోనూ రిలీజ్ చేశారు. ముఖ్యంగా ఇండియన్ సినిమాలకు ఆదరణ ఉన్న దేశాల్లో జపాన్ ఒకటి. జపాన్ అభిమానుల కోసం ఆర్ఆర్ఆర్ సినిమాను ఏకంగా జపనీస్లోనూ రిలీజ్ చేశారు. అక్కడ రాజమౌళి సినిమాకు పెద్దఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఇటీవల జపాన్ వెళ్లిన రాజమౌళికి ఓ మహిళ అభిమాని అరుదైన కానుక అందజేశారు. దాదాపు 83 ఏళ్ల వద్ధురాలు దర్శకధీరుడు రాజమౌళికి బహుమతులను అందజేసింది. ఈ విషయాన్ని రాజమౌళి తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. రాజమౌళి ట్విటర్లో రాస్తూ..'జపాన్‌లో ఓరిగామి క్రేన్లను తయారు చేస్తారు. వారికిష్టమైన వారి ఆరోగ్యం కోసం బహుమతిగా ఇస్తారు. ఈ 83 ఏళ్ల వృద్ధురాలు మమ్మల్ని ఆశీర్వదించడానికి అలాంటివీ 1000 తయారు చేసింది. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ సినిమా ఆమెను సంతోషపెట్టింది. ఆమె ఇప్పుడే బహుమతి పంపింది. చలిలో బయట వేచి ఉంది. కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ తిరిగి ఇవ్వలేం. అది గ్రేట్ అంతే.' అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. రాజమౌళి తన తదుపరి చిత్రం మహేశ్ బాబుతో చేయనున్నారు. In Japan, they make origami cranes &gift them to their loved ones for good luck& health. This 83yr old woman made 1000 of them to bless us because RRR made her happy. She just sent the gift and was waiting outside in the cold.🥹 Some gestures can never be repaid. Just grateful🙏🏽 pic.twitter.com/UTGks2djDw — rajamouli ss (@ssrajamouli) March 18, 2024 -
రాజమౌళి సలహా.. పద్ధతి మార్చుకున్నా: స్టార్ హీరోయిన్
హీరోయిన్ అలియా భట్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పలు హిందీ మూవీస్ చేసిన ఈమె.. 'ఆర్ఆర్ఆర్'లోనూ ఓ పాత్ర చేసి ఆకట్టుకుంది. అయితే ఈ మూవీ చేస్తున్న టైంలోనే అలియా-రాజమౌళికి గొడవైందని ఏవేవో అన్నారు. అయితే వాటిలో నిజానిజాలు పక్కనబెడితే.. తనకు రాజమౌళి ఇచ్చిన సలహాని ఇప్పటికీ పాటిస్తున్నానని అలియా చెప్పుకొచ్చింది. అలా తన పద్ధతి పూర్తిగా మారిపోయిందని పేర్కొంది. (ఇదీ చదవండి: బాధతో ఆ విషయం ఒప్పుకొంటున్నా: డైరెక్టర్ రాజమౌళి) 'సినిమాలని ఎంచుకునే విషయంలో మొదటి నుంచి ఒత్తిడికి గురవుతూ ఉండేదాన్ని. అదే విషయం రాజమౌళికి చెప్పాను. 'ఏది చేసినా సరే ప్రేమతో చేయండి. అప్పుడు సినిమా ఫలితం ఎలా ఉన్నా సరే ప్రేక్షకులు మీ యాక్టింగ్‌ని మెచ్చుకుంటారు. మీకు కనెక్ట్ అవుతారు. ఈ ప్రపంచంలోనే ప్రేమతో చేసే పనికి మించిన గొప్పది ఏదీ లేదు' అని ఆయన చెప్పారు. అప్పటి నుంచి నేను అదే పాటిస్తున్నాను' 'ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నా దగ్గరకు వచ్చిన ప్రతి కథకు ఓకే చెప్పేసేదాన్ని. నిజం చెప్పాలంటే నాకు సహనం తక్కువ. ఇప్పుడు ఆ పద్ధతి మారింది. ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు ఎంత కష్టమైనా పాత్రనైనా సరే ఓకే చెప్పాలని డిసైడ్ అయ్యాను' అని అలియా భట్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె హిందీలో 'జిగ్రా' అనే సినిమా చేస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరు 27న ఇది థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: మహేశ్ -రాజమౌళి సినిమా కథేంటో చెప్పేసిన విజయేంద్ర ప్రసాద్) -
ఆస్కార్ వేదికపై అణు బాంబు మోత
అణు బాంబు సౌండ్ అదిరింది.. క్రిస్టోఫర్ కల నిజమైంది... ‘ఆర్ఆర్ఆర్’ నాటు నాటు ఆకర్షణగా నిలిచింది. ఫేక్ చప్పట్లతో మెస్సీ (శునకం), ఆమిర్ ఖాన్ ‘పీకే’ తరహాలో జాన్ ప్రత్యక్షం కావడం చర్చలకు దారి తీసింది.ఇలా ఆనందాలు, వింతలు, విడ్డూరాలతో ఆస్కార్ అవార్డు వేడుక జరిగింది. ఆ విశేషాలు తెలుసుకుందాం. విజేతల వివరాలు: • ఉత్తమ చిత్రం: (ఆపెన్ హైమర్) • దర్శకుడు : క్రిస్టోఫర్ నోలన్ (ఆపెన్ హైమర్) • నటుడు: సిలియన్ మర్ఫీ (ఆపెన్ హైమర్) • నటి: ఎమ్మాస్టోన్ (పూర్ థింగ్స్) • సహాయ నటుడు: రాబర్ట్ డౌనీ జూనియర్ (ఆపెన్ హైమర్) • సహాయ నటి: డేవైన్ జో రాండాల్ఫ్ (ది హోల్డోవర్స్) • సినిమాటోగ్రఫీ: ఆపెన్ హైమర్ • డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: 20 డేస్ ఇన్ మరియోపోల్ • హెయిర్ స్టయిల్ అండ్ మేకప్: నడియా స్టేసీ, మార్క్ కౌలియర్ (పూర్ థింగ్స్) • అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: కార్డ్ జెఫర్‌పన్ (అమెరికన్ ఫిక్షన్ ) • ఒరిజినల్ స్క్రీన్ ప్లే: జస్టిన్ ట్రైట్, అర్థర్ హరారీ (అనాటమీ ఆఫ్ ఎ ఫాల్) • యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: ది బాయ్ అండ్ ది హిరాన్ • కాస్ట్యూమ్ డిజైన్ : హోలి వెడ్డింగ్టన్ (పూర్ థింగ్స్) • ప్రోడక్షన్ డిజైన్ : జేమ్స్ ప్రైస్, షోనా హెత్ (పూర్ థింగ్స్) • ఇంటర్నేషనల్ ఫిల్మ్: ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ • ఎడిటింగ్: జెన్నిఫర్ లేమ్ (ఆపెన్ హైమర్) • విజువల్ ఎఫెక్ట్స్: గాడ్జిల్లా మైనస్ వన్ • డాక్యుమెంటరీ (షార్ట్ సబ్జెక్ట్): ది లాస్ట్ రిపేర్ షాప్ • ఒరిజినల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: ఆపెన్ హైమర్ • సౌండ్ : ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ • ఒరిజినల్ సాంగ్: వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ (బార్బీ) • లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ది వండర్ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్. రాబర్ట్ జూనియర్, డేవైన్ జో రాండాల్ఫ్, ఎమ్మా స్టోన్, సిలియన్ మర్ఫీ ప్రముఖ భౌతిక శాస్త్ర నిపుణుడు, అణుబాంబు సృష్టికర్తగా పేరుగాంచిన జె. రాబర్ట్ ఆపెన్‌హైమర్ జీవితంతో రూపొందిన బయోగ్రాఫికల్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘ఆపెన్‌హైమర్’ మోత ఆస్కార్ వేదికపై బాగా వినిపించింది. దర్శకుడిగా క్రిస్టోఫర్ నోలన్‌తో ఆస్కార్ అవార్డును ముద్దాడేలా చేసింది. మార్చి 10న లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో జరిగిన 96వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ‘ఆపెన్‌హైమర్’ చిత్రం ఏడు విభాగాల్లో అవార్డులు కొల్లగొట్టి విజయఢంకా మోగించింది. మొత్తం పదమూడు నామినేషన్లు దక్కించుకున్న ఈ చిత్రానికి ఉత్తమ చిత్రంతో పాటు దర్శకుడు, నటుడు, సహాయనటుడు, ఫిల్మ్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో అవార్డు దక్కింది. అలాగే పదకొండు నామినేషన్లు దక్కించుకున్న ‘పూర్ థింగ్స్’ సినిమాకు నాలుగు విభాగాల్లో, హిస్టారికల్ డ్రామా ‘జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ సినిమాకు రెండు విభాగాల్లో అవార్డులు దక్కాయి. ‘ఆపెన్‌హైమర్’కు పోటీగా నిలుస్తుందనుకున్న ‘బార్బీ’ సినిమాకు 8 నామినేషన్లు దక్కినా, ఒక్క అవార్డు (బెస్ట్ ఒరిజినల్ సాంగ్)తో సరిపెట్టుకుంది, పది నామినేషన్లు దక్కించుకున్న ‘కిల్లర్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్’ సినిమాకి ఒక్క అవార్డు కూడా దక్కకపోవడం చర్చనీయాంశమైంది. ఈ ఏడాది ఉత్తమ నటుడిగా నిలిచిన సిలియన్ మర్ఫీ, ఉత్తమ సహాయ నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్, ఉత్తమ సహాయ నటి రాండాల్ఫ్ తొలిసారి ఆస్కార్‌ని ముద్దాడారు. గతంలో ‘లా లా ల్యాండ్’కి ఉత్తమ నటిగా ఆస్కార్ అందు కున్న ఎమ్మా స్టోన్ ఇప్పుడు ఇదే విభాగానికి అవార్డుని అందుకున్నారు. భారత సంతతికి చెందిన నిషా తెరకెక్కించిన ‘టు కిల్ ఎ టైగర్’ డాక్యుమెంటరీ ఆస్కార్ సాధించలేకపోయింది. ఇక అవార్డు విజేతల జాబితా ఈ విధంగా... స్వీట్ సర్ప్రైజ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు 95వ ఆస్కార్ అవార్డ్స్‌లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో చిత్ర సంగీతదర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. 96వ అవార్డ్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’ విజువల్స్ కనిపించాయి. వరల్డ్ గ్రేటెస్ట్ స్టంట్ సీక్వెన్స్ అంటూ ఆస్కార్ వేదికపై ప్రదర్శించిన విజువల్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’లోని క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్‌లు రెండుసార్లు కనిపించాయి. ‘టైటానిక్’, ‘మిషన్ ఇంపాజిబుల్’, ‘చార్లీ చాప్లిన్’, ‘బస్టర్ కీటన్’ వంటి హాలీవుడ్ క్లాసిక్ చిత్రాల యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు ‘ఆర్ఆర్ఆర్’లోని యాక్షన్ విజువల్స్ ప్లే కావడం విశేషం. అలాగే ఈ ఏడాది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ‘వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్?’ను విజేతగా ప్రకటించే ముందు ప్లే చేసిన కొన్ని సాంగ్స్ విజువల్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాట కనిపించింది. ఈ సందర్భంగా.. ‘‘వరల్డ్ స్టంట్ సీక్వెన్స్‌లకు నివాళిగా ప్లే చేసిన కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లలో ‘ఆర్ఆర్ఆర్’ స్టంట్ సీక్వెన్స్‌లు ఉండటం స్వీట్ సర్ప్రైజ్లా ఉంది’’ అని ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ స్పందించింది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య ‘ఆర్ఆర్ఆర్’ను నిర్మించారు. నా కళ్లు చెబుతున్నాయి... – అల్ పచినో మామూలుగా విజేతలను ప్రకటించే ముందు పోటీలో ఉన్నవారి పేర్లు చెప్పి, చివరిగా విజేత పేరు చెప్పడం జరుగుతుంది. అయితే ప్రముఖ నటుడు 83 ఏళ్ల అల్ పచినో ఈ విధానాన్ని అనుసరించలేదు. ఈ ‘గాడ్ ఫాదర్’ మూవీ ఫేమ్ ఉత్తమ చిత్రాన్ని ప్రకటించడానికి వేదికపైకి వచ్చారు. ఈ విభాగంలో పది చిత్రాలు పోటీ పడ్డాయి. ఈ చిత్రాల పేర్లు చెప్పకుండా.. ‘ఇదిగో..’ అంటూ మెల్లిగా ఎన్వలప్ కవర్ని ఓపెన్ చేస్తూ.. నా కళ్లు చెబుతున్నాయి టైప్‌లో నా కళ్లకు ‘ఆపెన్‌హైమర్’ కనబడుతోంది అనగానే వీక్షకుల నుంచి కరతాళ ధ్వనులు వినిపించాయి. అయితే అల్ పచినో ఈ విధంగా ప్రకటించడంతో.. అవార్డు ఈ సినిమాకే వచ్చిందా? అనే సందేహంలో కొందరు ఉండిపోయారు. అంతలోనే ‘అవును.. అవును..’ అన్నారు. అయితే అల్ పచినో ఇలా ప్రకటించడం పట్ల పలువురు విమర్శించారు. ఆస్కార్ అవార్డుల జాబితాలో ప్రధానమైన విభాగంలో పోటీ పడిన చిత్రాల పేర్లు చెప్పకుండా, పైగా వేడుకలో చివరి అవార్డు కాబట్టి కాస్తయినా సస్పెన్స్ మెయిన్టైన్ చేయకుండా చెప్పడం బాగాలేదని అంటున్నారు. ఇలా సాదా సీదా ప్రకటనతో ఆస్కార్ అవార్డు వేడుక ముగిసింది. నోలన్ కల నెరవేరెగా... ఫిల్మ్ మేకర్ క్రిస్టోఫర్ నోలన్ ఆస్కార్ చరిత్ర కాస్త ఆశ్చర్యకరంగానే ఉంటుంది. ఎందుకంటే నోలన్ తీసిన సినిమాలు ఆస్కార్ అవార్డుల కోసం 49 నామినేషన్లు దక్కించుకుని, 18 అవార్డులను సాధించాయి. కానీ క్రిస్టోఫర్ నోలన్‌కు మాత్రం 95వ ఆస్కార్ అవార్డుల వరకూ ఒక్కటంటే ఒక్క అవార్డు కూడా రాలేదు. తొలిసారి 2002లో ‘మెమెంటో’ సినిమాకు గాను బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో 74వ ఆస్కార్ అవార్డ్స్‌లో నామినేషన్ దక్కించుకున్నారు నోలన్... నిరాశే ఎదురైంది. ఆ తర్వాత 83వ ఆస్కార్ అవార్డ్స్‌లో ‘ఇన్సెప్షన్’ సినిమాకు బెస్ట్ పిక్చర్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగాల్లో నామినేషన్లు దక్కినా అవార్డులు రాలేదు. 90వ ఆస్కార్ అవార్డ్స్‌లో బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ పిక్చర్ విభాగాల్లో నోలన్ ‘డంకిర్క్’ సినిమాకు నామినేషన్లు దక్కినా ఆస్కార్ అవార్డు దక్కలేదు. చివరికి నోలన్ కల ‘ఆపెన్‌హైమర్’తో నెరవేరింది. ఈ ప్రయాణంలో నేనూ భాగం అని... – క్రిస్టోఫర్ నోలన్ ఆస్కార్ వేదికపై క్రిస్టోఫర్ నోలన్ మాట్లాడుతూ – ‘‘మా సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన మర్ఫీ, ఎమిలీ బ్లంట్, మాట్లతో పాటు యూనిట్ అందరికీ ధన్యవాదాలు. ఇక మా కుటుంబాన్ని, ఈ సినిమాను నిర్మించిన మా నిర్మాత ఎమ్మా థామస్‌తో (భార్య ఎమ్మా పేరును ప్రస్తావించగానే ఒక్కసారిగా నవ్వులు) పాటు నా సోదరుడికి థ్యాంక్స్ చె΄్పాలి. మా సినిమాలో సత్తా ఉందని నమ్మి, డిస్ట్రిబ్యూట్ చేసిన యూనీవర్సల్ స్టూడియోస్‌కు ధన్యవాదాలు. సినిమా చరిత్ర వందేళ్లకు చేరువ అవుతోంది. ఈ అద్భుతమైన ప్రయాణం ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు. కానీ ఈ ప్రయాణం తాలూకు సినిమాల్లో నేను కూడా ఓ అర్థవంతమైన భాగం అని భావించి, నన్ను గుర్తించిన ఆస్కార్ కమిటీకి ధన్యవాదాలు’’ అన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.... భార్యాభర్త నోలన్, ఎమ్మా దర్శక–నిర్మాతలుగా ఒకేసారి ఆస్కార్ అవార్డులు సాధించారు. అణుబాంబు విస్ఫోటనం నేపథ్యంలోని ‘ఆపెన్‌హైమర్’లో నటించి, అవార్డు దక్కించుకున్న మర్ఫీ తన అవార్డును ప్రపంచ శాంతి ఆకాంక్షించేవారికి అంకితమిస్తున్నట్లుగా పేర్కొన్నారు. జీవితంలో తనకు ఎంతో అండగా నిలిచిన తన భార్య సుసాన్ డౌన్‌కి అవార్డుని అంకితం ఇస్తున్నట్లుగా ఉత్తమ సహాయ నటుడు రాబర్ట్ డౌనీ తెలిపారు. ‘‘నేను నా జీవితంలో మరోలా (స్లిమ్‌గా) ఉండాలనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే... నేను నాలానే ఉండాలి’’ అంటూ ఎమోషనల్ అయ్యారు రాండాల్ఫ్ నేనీ సినిమా చేసి ఉండాల్సింది కాదు – ఎమ్ చెర్నోవ్ ఉక్రెయిన్ వార్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ ‘20 డేస్ ఇన్ మరియోపోల్’ చిత్రం ఆస్కార్ అవార్డును సాధించింది. ఈ అవార్డు యాక్సెప్టెన్సీ స్పీచ్‌లో చిత్రదర్శకుడు ఎమ్ చెర్నోవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఉక్రెయిన్ చరిత్రలో ఇది తొలి ఆస్కార్ అవార్డు. ఇందుకు గౌరవంగా భావిస్తున్నాను. అయితే ఈ సినిమాను నేను చేసి ఉండకూడదని అనుకుంటున్నాను. బహుశా ఈ వేదికపై ఇలా మాట్లాడుతున్న తొలి దర్శకుడిని నేనేమో. మా ఉక్రెయిన్‌పై దాడులు చేయకుండా, మా నగరాలను ఆక్రమించకుండా ఉండేందుకు బదులుగా రష్యావారికి ఈ అవార్డు ఇస్తాను. నేను చరిత్రను, గతాన్ని మార్చలేను. కానీ కొందరు ప్రతిభావంతులతో కలిసి ఓ కొత్త రికార్డును సృష్టించగలం. అప్పుడు నిజం గెలుస్తుంది. జీవితాలను త్యాగం చేసిన మరియోపోల్ ప్రజలు గుర్తుండిపోతారు. సినిమా జ్ఞాపకాలను ఏర్పరుస్తుంది. జ్ఞాపకాలు చరిత్రను నెలకొల్పుతాయి’’ అంటూ భావోద్వేగంతో మాట్లాడారు చెర్నోవ్. ఆమిర్ ‘పీకే’ని తలపించేలా జాన్ సెనా ఆస్కార్ అవార్డు వేడుకలో జరిగిన ఓ ఘటన ఆమిర్ ఖాన్ నటించిన ‘పీకే’ సినిమాని గుర్తు చేసింది. ఈ చిత్రంలో ఆమిర్ ఓ సీన్లో తన శరీరానికి ముందు భాగంలో ఓ రేడియో అడ్డుపెట్టుకుని అర్ధనగ్నంగా నటించారు. ఆస్కార్ వేదికపై ఇలాంటి సీనే రిపీట్ అయింది. స్టార్ రెజ్లర్ (డబ్ల్యూడబ్ల్యూఈ) జాన్ సెనా అర్ధనగ్నంగా ప్రత్యక్షమై షాక్ ఇచ్చారు. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డును ప్రకటించేందుకు జాన్ సెనా ఇలా అర్ధనగ్నంగా రావడం చర్చనీయాంశంగా మారింది. తన శరీరానికి ముందు భాగంలో విజేత వివరాలు ఉండే ఎన్వలప్ కవర్‌ను మాత్రమే అడ్డుపెట్టుకొని వేదికపైకి రావడంతో సభికులందరూ తెగ నవ్వుకున్నారు. అయితే తాను ఇలా రావడానికి కారణం ఉందన్నారు జాన్ సెనా. ‘పురుషుడి శరీరం కూడా జోక్ కాదని, అలానే కాస్ట్యూమ్స్ అనేవి ముఖ్యం అని తెలియజెప్పేందుకే ఇలా వచ్చా’ అన్నారు సెనా. అనంతరం ‘పూర్ థింగ్స్’ సినిమాకి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ విభాగంలో అవార్డును ప్రకటించారు. 1974 సీన్ రిపీట్ దాదాపు 50 ఏళ్ల క్రితం (1974) జరిగిన ఆస్కార్ వేడుకల్లో నటి ఎలిజబెత్ టేలర్‌ను పరిచయం చేస్తుండగా ఓ వ్యక్తి నగ్నంగా వేదికపైకి దూసుకు రావడం అప్పట్లో సంచలనమైంది. తాజాగా జాన్ సెనా ప్రవర్తనతో నాటి ఘటనను కొందరు గుర్తుకు తెచ్చుకున్నారు. ఫేక్ క్లాప్‌తో శునకానందం ఆస్కార్ వేడుకలో ఈ ఏడాది ఓ శునకం అందరి దృష్టినీ ఆకర్షించింది. సభికులతో పాటు క్లాప్స్ కొట్టిన ఈ శునకం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఆస్కార్ కోసం పలు విభాగాల్లో పోటీ పడిన సినిమాల్లో ‘అనాటమీ ఆఫ్ ఎ ఫాల్’ ఒకటి. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో ఈ చిత్రం అవార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నటించిన మెస్సీ (శునకం)ని అవార్డు వేడుకకు తీసుకొచ్చింది యూనిట్. ‘ఆపెన్ హైమర్’కి రాబర్డ్ డౌనీ జూనియర్ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకుంటున్నప్పుడు అందరితో పాటు మెస్సీ చప్పట్లు కొట్టడం ఆకర్షణగా నిలిచింది. అయితే ఆ శునకం కూర్చున్న కుర్చీ కింద ఓ వ్యక్తి ఉండి, ఫేక్ చేతులతో క్లాప్ కొట్టాడు. అవి శునకం కాలిని పోలి ఉండటంతో మెస్సీయే చప్పట్లు కొట్టిందని భావించారంతా. -
ఆస్కార్ వేదికపై మరోసారి ఆర్ఆర్ఆర్.. అట్లుంది మరి మనతోని!
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమా ఆర్ఆర్ఆర్. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ గతేడాది ఎన్నో రికార్డులను తిరగరాసింది. కలెక్షన్సే కాదు అంతకుమించి అన్నట్లు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. నాటు నాటు పాట అయితే ఏకంగా హాలీవుడ్ గడ్డపై బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ను వశం చేసుకుంది. తాజాగా జరిగిన 96వ ఆస్కార్ వేడుకల్లోనూ మరోసారి ఆర్ఆర్ఆర్ పేరు మార్మోగిపోతోంది. నాటు నాటు విజువల్స్.. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో సోమవారం (మార్చి 11) నాడు అకాడమీ అవార్డులను ప్రకటించారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు ప్రకటించే సమయానికి నాటు నాటు పాట విజువల్స్‌ను బ్యాగ్రౌండ్లో ప్లే చేశారు. ఓపక్క ఆ పాట ప్లే అవుతుండగా అరియానా గ్రాండే, సింతియా ఎరివో స్టేజీపైకి వచ్చి విజేతలను ప్రకటించారు. బార్బీ సినిమాలోని వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్? అనే పాటకుగానూ బిల్లీ ఈలిష్, ఫిన్నియాస్ ఓకోనల్ పురస్కారం అందుకోవాలని పిలిచారు. యాక్షన్ సీన్ కూడా.. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్ఆర్ఆర్ టీమ్ ఎక్స్(ట్విటర్) వేదికగా షేర్ చేసింది. ఆస్కార్ గడ్డపై మరోసారి ఆర్ఆర్ఆర్ అంటూ క్యాప్షన్ జోడించింది. అక్కడ నాటు నాటు పాట మాత్రమే కాకుండా సదరు మూవీలోని ఓ యాక్షన్ సీన్ కూడా ప్లే చేశారు. జీవితాన్ని రిస్క్ చేసే స్టంట్స్ మాస్టర్లకు సలాం కొడుతూ గొప్ప స్టంట్స్ సన్నివేశాల వీడియోను ఆస్కార్ వేదికపై ప్రదర్శించారు. అందులో హాలీవుడ్ చిత్రాలతో పాటు నాటు నాటులోని క్లైమాక్స్ సీన్ కూడా చోటు దక్కించుకుంది. ఇది చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ హవా ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదని, జక్కన్న సినిమా అంటే అట్లుంటదని కామెంట్లు చేస్తున్నారు. On the #Oscars stage again!! ❤️🔥❤️🔥❤️🔥 #RRRMovie pic.twitter.com/cbNgFzMt72 — RRR Movie (@RRRMovie) March 11, 2024 And again, a sweet surprise for us… 🔥🌊 Glad that @TheAcademy included #RRRMovie action sequences as part of their tribute to the world’s greatest stunt sequences in cinema. pic.twitter.com/TGkycNtF2I — RRR Movie (@RRRMovie) March 11, 2024 చదవండి: ఈసారి ఆ మూవీకే ఎక్కువ అవార్డ్స్.. పూర్తి లిస్ట్ ఇదే! -
ఆస్కార్ ఒరిజినల్ సాంగ్.. గతేడాది 'ఆర్ఆర్ఆర్'కి.. మరి ఇప్పుడు?
ఆస్కార్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో జరుగుతున్న కార్యక్రమంపై భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా కాస్త ఆసక్తి చూపిస్తున్నాడు. ఎందుకంటే అనితర సాధ్యమైన ఈ పురస్కారాన్ని గతేడాది 'ఆర్ఆర్ఆర్' గెలుచుకుంది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ అందుకుంది. ఈసారి ఈ విభాగంలో గెలిచిందెవరు? ఏంటంత స్పెషల్? (ఇదీ చదవండి: ఆస్కార్-2024 అవార్డుల వేడుక.. విజేతలు వీళ్లే) 'ఆర్ఆర్ఆర్' సినిమా గతేడాది ఆస్కార్ బరిలో నిలిచినప్పుడు చాలామంది మనకు ఓ ఆస్కార్ వస్తే బాగుంటుందని ఆశపడ్డారు. కోట్లాది మంది భారతీయల కల నెరవేరింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో 'నాటు నాటు' పాటకు అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. దీంతో కోట్లాదిమంది మురిసిపోయారు. అయితే ఈసారి భారతీయ సినిమాలేం ఆస్కార్ బరిలో లేవు. కానీ గతేడాది 'ఆర్ఆర్ఆర్' గెలుచుకున్న విభాగంలో ఈసారి ఎవరికి అవార్డు వస్తుందా అని అందరూ ఎదురుచూశారు. 'ఓపెన్ హైమర్' సినిమాతో పోటీపడి బాక్సాఫీస్ దగ్గర వేలకోట్ల వసూళ్లు కొల్లగొట్టిన 'బార్బీ' సినిమాలోని 'వాట్ వజ్ ఐ మేడ్ ఫర్' పాటకు ఈసారి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డ్ వచ్చింది. బిల్లీ ఏలిష్ పాడిన పాట.. 'నాటు నాటు'తో పోలిస్తే చాలా డిఫరెంట్. మెలోడీగా సాగే ఈ గీతాన్ని మీరు ఓసారి వినేయండి. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మూడు క్రేజీ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
తెలుగు పాటకు 'త్రీ ఖాన్స్' డ్యాన్స్.. ఫిదా అవుతున్న బాలీవుడ్
జామ్‌నగర్‌లో భారత కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల ప్రీవెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎన్కోర్ హెల్త్‌కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్ కుమార్తె అయిన రాధికతో వివాహం జరగనుండగా ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు సినీ తారలు, పలువురు ప్రముఖులతో పాటు దేశ విదేశాల్లోని అతిరథ మహారథులు గుజరాత్‌లోని జామ్‌నగర్ చేరుకున్నారు. మార్చి 1 నుంచి ప్రారంభమైన ఈ వేడుకలు నేటితో ముగియనున్నాయి. ఈ వేడుకల్లో బాలీవుడ్ నటులు షారూక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, దీపికా పదుకొణే.. అంతర్జాతీయ ప్రముఖులు పాప్ సింగర్ రిహన్నా, అమెరికన్ గాయని, గేయ రచయిత జే బ్రౌన్, వాయిద్యాకారుడు బాసిస్ట్ ఆడమ్ బ్లాక్‌స్టోన్ సందడి చేశారు. బాలీవుడ్లో త్రీ ఖాన్స్గా గుర్తింపు ఉన్న షారూక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్లు ఒకే ఫ్రేమ్‌లో చాలా రోజుల తర్వాత కనిపించడంతో బాలీవుడ్ సినీ అభిమానులు సంతోషిస్తున్నారు. వారి ముగ్గురిని ఒకే స్టేజీపై కలపగల వ్యక్తి అంబానీ మాత్రమే అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ నటించిన RRR చిత్రంలోని 'నాటు నాటు' పాటకు త్రీ ఖాన్స్ వేసిన స్టెప్పులకు అతిథులు ఫిదా అయ్యారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. ఇకపోతే అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహం ఇదే ఏడాది జులైలో జరగనుంది. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
బాఫ్టాలో మెరిసిన దీపికా పదుకోన్
ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన బయోగ్రాఫికల్ థ్రిల్లర్ ‘ఒప్పెన్ హైమర్’ చిత్రానికి అవార్డుల పంట పండింది. లండన్‌లోని రాయల్ ఫెస్టివల్ హాల్లో 77వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డుల (బాఫ్టా) ప్రదానోత్సవం ఆదివారం రాత్రి జరిగింది. దేశం నుంచి దీపికా పదుకోన్ ఈ వేడుకల్లో పాల్గొని, ‘నాన్ ఇంగ్లిష్’ విభాగంలో ఉత్తమ చిత్రానికి (ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్) అవార్డు అందజేశారు. ఇక ‘భాఫ్టా’లో ‘ఒప్పెన్ హైమర్’ చిత్రం ఏడు విభాగాల్లో పురస్కారాలు అందుకుని సత్తా చాటింది. అవార్డులతో ‘ఒప్పెన్ హైమర్’ టీమ్ ఉత్తమ చిత్రం, దర్శకుడు, నటుడు, సహాయనటుడు, సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ విభాగాల్లో ‘ఒప్పెన్ హైమర్’కి అవార్డులు దక్కాయి. క్రిస్టోఫర్ నోలన్‌కు దర్శకుడిగా దక్కిన తొలి బాఫ్టా అవార్డు ఇది. ఇప్పటికే అత్యధిక గోల్డెన్ గ్లోబ్ అవార్డులు గెలుచుకున్న ‘ఒప్పెన్ హైమర్’ చిత్రం తాజాగా బాఫ్టాలో ఏడు పురస్కారాలు దక్కించుకుని, వచ్చే నెలలో జరిగే ఆస్కార్ రేసులో 13 విభాగాల్లో పోటీలో ఉంది. ఇక ‘బాఫ్టా’లో ‘ఒప్పెన్ హైమర్’ తర్వాత ‘పూర్ థింగ్స్’ మూవీ అధికంగా ఐదు (కాస్ట్యూమ్, మేకప్, హెయిర్–స్టైలింగ్,ప్రోడక్షన్, స్పెషల్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో) అవార్డులను పొందింది. ఆ తర్వాత ‘ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ సినిమాకి మూడు పురస్కారాలు దక్కాయి. భారతీయత ఉట్టిపడేలా... ‘భాఫ్టా’ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రజెంటర్‌గా వ్యవహరించిన దీపికా పదుకోన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తొలి భారతీయ నటి దీపికా కావడం విశేషం. ఈ వేదికపై భారతీయత ఉట్టిపడేలా చీరలో మెరిశారు దీపికా పదుకోన్. ‘చూపు తిప్పుకోలేనంత అందంగా ఉంది’ అనే ప్రశంసలు ఈ బ్యూటీ సొంతమయ్యాయి. ఈ వేడుకలో బ్యాక్ స్టేజీలో దీపికా దిగిన ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే అంతర్జాతీయ సినీ వేడుకల్లో దీపికా పదుకోన్ పాల్గొనడం ఇది రెండోసారి. గతేడాది జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో దీపిక ప్రజెంటర్‌గా వ్యవహరించారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు..’ పాటను ఆమె ఆస్కార్ వేదికపై పరిచయం చేశారు. -
టాలీవుడ్లో తీవ్ర విషాదం
టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ భార్య రుహీ మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వృత్తిరీత్యా ఆమె యోగా శిక్షకురాలుగా పని చేస్తున్నారు. ఆమె మరణ వార్త తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతి పట్ల సంతాపం ప్రకటించారు. మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగానే సికింద్రాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో ఆమె తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో శుక్రవారం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా.. ఆమె టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టితో కలిసి పని చేశారు. భరత్ ఠాకూర్ యోగా క్లాసుల హైదరాబాద్ విభాగానికి కూడా ఆమె సారథ్యం వహించారు. కాగా..సెంథిల్ కుమార్ జూన్ 2009లో రూహీని వివాహం చేసుకున్నారు. టాలీవుడ్లో సెంథిల్ కుమార్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమాలకే ఎక్కువగా పనిచేశారు. టాలీవుడ్లో సై, ఛత్రపతి, యమదొంగ, అరుంధతి, మగధీర, బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి 2: ది కన్‌క్లూజన్, ఆర్ఆర్ఆర్ లాంటి సూపర్ హిట్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. View this post on Instagram A post shared by Senthil Kumar (@dopkksenthilkumar) -
దర్శకధీరుడిపై మరోసారి ప్రశంసలు.. హాలీవుడ్ దిగ్గజం ఏమన్నారంటే?
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పారు. అంతే కాదు.. ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డ్‌ను గెలిచి మన గొప్పదనాన్ని మరింత పెంచారు. గతేడాది లాస్ ఎంజిల్స్ వేదికగా జరిగిన ఆస్కార్ వేడుకల్లో ఆర్ఆర్ఆర్ చిత్రానికి అవార్డ్ దక్కింది. ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాటకు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డ్ లభించింది. ఆస్కార్ అవార్డ్ రావడంతో తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. అదే సమయంలో హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ సైతం రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు. 2023లో జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల కార్యక్రమంలో కామెరూన్‌ను రాజమౌళి కలిశాడు. ఆ సమయంలో ఆర్ఆర్ఆర్ మూవీ గురించి అతడు ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. మూవీ అద్భుతంగా ఉందని కొనియాడారు. (ఇది చదవండి: 'మా నాన్నకు అలాంటి అవసరం లేదు'.. సూపర్ స్టార్ కూతురు ఆసక్తికర కామెంట్స్!) తాజాగా ఓ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న హాలీవుడ్ దిగ్గజం మరోసారి రాజమౌళిని పొగిడారు. ఈవెంట్లో ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఆర్ఆర్ఆర్ మూవీ అద్భుతంగా తెరకెక్కించారని.. ఇండియన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా తన ముద్ర వేయడం చాలా బాగుందన్నారు. కామెరూన్ మాట్లాడుతూ.. 'నిజంగా చాలా నిజాయతీగా అనిపించి ఈ విషయాన్ని చెప్పాను. అది చాలా అద్భుతమైన సినిమాగా అనిపించింది. ఇండియన్ సినిమా ప్రపంచ వేదిక స్థాయికి చేరడం చాలా గొప్పగా విషయం' అని అన్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను ఆర్ఆర్ఆర్ టీం తన ట్విటర్ ద్వారా పంచుకుంది. 'మీ అమూల్యమైన మాటలు ఎల్లప్పుడూ ఉత్తమంగా ఉండటానికి మాకు స్ఫూర్తినిస్తాయి. భారతీయ సినిమా అన్ని సరిహద్దులను బద్దలు కొట్టి మరింత ఎత్తుకు ఎదుగుతుందని మేము గట్టిగా నమ్ముతున్నాము.' అంటూ ట్వీట్ చేసింది. కాగా.. రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబుతో సినిమా తీసేందుకు రెడీ అవుతున్నారు. James Cameron.. 🤗 Your precious words always inspire us to strive better and be the best. We strongly believe Indian cinema is going to break all boundaries and grow to its fullest. ❤️ #RRRMovie pic.twitter.com/pzHjGQNZnC — RRR Movie (@RRRMovie) February 7, 2024 -
RRR తర్వాత డీవీవీ దానయ్య బిగ్ ప్లాన్.. ఆ హీరో కోసం భారీ ఆఫర్
విజయ్ ఈ పేరు ఇప్పుడు సినీ పరిశ్రమలోనే కాకుండా, రాజకీయ వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారింది. కోలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న అతి కొద్ది మంది నటుల్లో ఈయన ఒకరు. విజయ్ నటించిన చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, నిర్మాతలకు నష్టాలు రానంతగా స్థాయికి ఆయన చేరుకున్నారని చెప్పడం అతిశయోక్తి కాదు. ఉదాహరణకు ఇటీవల తెరపైకి వచ్చిన 'లియో' చిత్రాన్నే తీసుకోవచ్చు. ఈ చిత్రం విమర్శకుల దాడిని ఎదుర్కొంది. టాక్ వ్యతిరేకంగా వచ్చినా, వసూళ్లు మాత్రం రికార్డు స్థాయిలోనే ఉన్నాయి. ప్రస్తుతం విజయ్ తన 68వ చిత్రంలో నటిస్తున్నారు. ఈయన తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభియనం చేస్తున్న ఈ చిత్రాన్ని వెంకట్‌ప్రభు దర్వకత్వంలో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. దీనికి 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' అనే టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీంతో విజయ్ తర్వాత చిత్రం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. కారణం ఈయన రాజకీయ రంగప్రవేశం గురించి పెద్ద చర్చే జరుగుతుండడమే. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ 69వ చిత్రం ఓకే అయినట్లు తాజాగా సోషల్ మీడియాలో ప్రచారం వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్వకత్వంలో అత్యంత భారీ బడ్జెట్లో నిర్మించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఆస్కార్ బరిలో మూడు అవార్డులను గెలుచుకోవండంతో చిత్ర నిర్మాత 'డీవీవీ దానయ్య' పేరు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆ సినిమా తర్వాత కోలీవుడ్ టాప్ హీరో విజయ్‌తో ఒక భారీ చిత్రాన్ని నిర్మించడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. విజయ్‌కు సౌత్ ఇండియాలో బిగ్ మార్కెట్ ఉంది. దీంతో తెలుగు డైరెక్టర్‌తో పాన్ ఇండియా సినిమా నిర్మించేందుకు దానయ్య ఉన్నారని సమాచారం. ఇప్పటికే కథ కూడా విజయ్‌కు వినిపించారట. అది విజయ్‌కు కూడా నచ్చిందని, ఆయన ఇందులో నటించడానికి సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు టాక్. ఈ చిత్రానికి విజయ్ ఊహించని స్థాయిలో పారితోషికం డిమాండ్ చేసినట్లు వార్త హల్చల్ చేస్తోంది. ఇక దీనికి దర్శకుడు ఎవరన్నది త్వరలోనే నిర్ణయించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత విజయ్ తన 70వ చిత్ర షూటింగ్‌కు సిద్ధం అవుతారని సమాచారం. విజయ్ గతంలో దిల్ రాజు నిర్మాతగా వారసుడు చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఆయన త్వరలో రాజకీయ రంగప్రవేశానికి సిద్ధం అవుతున్నట్లు, అందుకు అన్ని విధాలుగా సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం జోరందుకుంది. త్వరలోనే పార్టీ పేరును వెల్లడించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు టాక్ వైరల్ అవుతోంది. దీంతో కొన్ని ఏళ్లు విజయ్ సినిమాలకు దూరంగా ఉండే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. -
ఆ ఇద్దరు హీరోలు ఎవరో నాకు తెలియదు.. RRR నటుడు వైరల్ కామెంట్
ఎడ్వర్డ్ సోన్నెన్‌బ్లిక్.. దక్షిణ కాలిఫోర్నియాలో జన్మించి నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ముంబై షిఫ్ట్ అయ్యాడు. ప్రస్తుతం ఆయనకు హీందీ కూడా వచ్చు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు రావడంతో ధనుష్ కెప్టెన్ మిల్లర్ చిత్రంలో ఆయనకు ఛాన్స్ దక్కింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన 'కెప్టెన్ మిల్లర్' సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా రేంజ్లో జనవరి 12న వడుదల కానుంది. కానీ తెలుగులో మాత్రం సంక్రాంతి తర్వాత విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాకు సంబంధించిన నటులు సినిమా ప్రమోషన్స్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అమెరికన్ నటుడు 'ఎడ్వర్డ్ సోన్నెన్ బ్లిక్' కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న కెప్టెన్ మిల్లర్‌లో ఆయన బ్రిటిష్ అధికారిగా నటించాడు. గతంలో కూడా RRR చిత్రంలో ఎడ్వర్డ్ పాత్రలో మెప్పించిన విషయం తెలిసిందే. రాజన్న, షిర్డీ సాయి, కేసరి, సామ్ బహదూర్, మణికర్ణిక వంటి పాపులర్ చిత్రాల్లో ఆయన నటించాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న 'ఎడ్వర్డ్ సోన్నెన్ బ్లిక్' కోలీవుడ్ హీరోల గురించి పలు విషయాలు షేర్ చేశాడు. ధనుష్ కాకుండా ఈ హీరోలు తెలుసా.. ? అని ఆయనకు ఒక ప్రశ్న ఎదురైంది. అజిత్, సూర్య, విజయ్ ఫోటోలను అతని ముందు ఉంచగా... విజయ్ను మాత్రమే సరిగ్గా ఆయన గుర్తించాడు. 2005లోనే విజయ్ నటించిన చిత్రాన్ని చూశానని ఎడ్వర్డ్ చెప్పాడు. అతనిలో మంచి టాలెంట్ ఉందని అప్పుడే అనుకున్నానని ఆయన పేర్కొన్నాడు. దీంతో కోలీవుడ్‌లో విజయ్ ఫ్యాన్స్ ఈ అంశాన్ని తెగ వైరల్ చేస్తున్నారు. తమ హీరో రేంజ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు తెలుసు అంటూ కామెంట్లు చేస్తున్నారు. I have seen #ThalapathyVijay film in 2005 and liked him. - RRR and Captain Miller fame Edward Sonnenblick#TheGreatestOfAllTime @actorvijaypic.twitter.com/Hy8TdBTSw9 — Actor Vijay FC (@ActorVijayFC) January 7, 2024 -
హీరోగా ఎంట్రీ ఇస్తున్న 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' ఫైట్ మాస్టర్
ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోలు చేస్తున్న నటులు పెరుగుతున్నారు. దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు.. ఇలా అందరూ హీరోలు అయిపోతున్నారు. తాజాగా ప్రముఖ ఫైట్‌మాస్టర్ పీటర్ హెయిన్ కూడా కథానాయకుడిగా ఎంట్రీకి రెడీ అయిపోయాడు. ఎం.వెట్రి దర్శకత్వం వహించనున్న ఈ భారీ యాక్షన్ ఓరియెంటెడ్ కథాచిత్రాన్ని ట్రెండ్స్ సినిమాస్ అధినేత జేఎం బషీర్, యంటీ సినిమాస్ అధినేత ఏఎం చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గురువారం సాయంత్రం చైన్నెలో పూజా కార్యక్రమంతో లాంఛనంగా ప్రాజెక్ట్ ప్రారంభమైంది. (ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా) నిర్మాతల్లో ఒకరైన బషీర్ మాట్లాడుతూ.. నేను, నా మిత్రుడు చౌదరి కలిసి ఫైట్‌మాస్టర్ పీటర్ హెయిన్ని హీరోగా పరిచయం చేస్తూ ఒక భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తీయాలని చాలాకాలంగా అనుకుంటున్నాం. అది ఇప్పటికి నెరవేరింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాల్లో పీటర్ హెయిన్ భాగమే. ఇప్పుడు ఆయన హీరోగా పాన్ ఇండియా సినిమా నిర్మిస్తున్నాం. ఇకపోతే పీటర్ హెయిన్ మాట్లాడుతూ.. ఈ చిత్రం కోసం తాను ఏమేం చేయగలనో అది చేస్తానని, ఇందులో అటవీ వాసీగా యాక్ట్ చేస్తున్నట్లు చెప్పాడు. సరికొత్త యాక్షన్ కథా చిత్రంగా ఉంటుందని అన్నాడు. ఇందులో నటించడానికి తాను ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. (ఇదీ చదవండి: థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో మాత్రం ఇదే టాప్ ట్రెండింగ్ సినిమా!) -
'సలార్' ఊరమాస్ కలెక్షన్స్.. కొద్దిలో మిస్ అయిన 'ఆర్ఆర్ఆర్' రికార్డ్!
డార్లింగ్ ప్రభాస్ అంటే ఏంటో మరోసారి ప్రూవ్ అయింది. 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్‌గా ఎక్కడికో వెళ్లిపోయాడు. ఆ తర్వాత వచ్చిన 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' చిత్రాలు ఇతడి రేంజుని మ్యాచ్ చేయలేకపోయాయి. అయితేనేం ఇప్పుడు వచ్చిన 'సలార్' వాటన్నింటి గురించి మర్చిపోయేలా చేస్తోంది. తొలిరోజే ఏకంగా రూ.178.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ ఏడాది హయస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. కానీ ఓ రికార్డ్ మాత్రం కొద్దిలో మిస్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ 'సలార్' కోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో చాలా అంటే చాలా వెయిట్ చేస్తూ వచ్చారు. హీరో ప్రభాస్, మాస్ కథ, డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. దీనికి కారణాలు అయ్యిండొచ్చు. విడుదలకు కొన్నిరోజుల ముందు సినిమాపై అందరూ డౌట్ పడ్డారు. కానీ తాజాగా థియేటర్లలోకి వచ్చి హిట్ టాక్ తెచ్చుకున్న తర్వాత ఇప్పట్లో తగ్గేదేలే అన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే సౌత్-నార్త్ అనే తేడా లేకుండా బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేస్తోంది. (ఇదీ చదవండి: 'సలార్' మూవీకి రివ్యూ ఇచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి) అయితే నైజాంలో ఇప్పటికే పలు సినిమాలతో కింగ్ అనిపించుకున్న ప్రభాస్.. 'సలార్'తో మరోసారి దాన్ని నిరూపించుకున్నాడు. అయితే టాలీవుడ్ ట్రేడ్ సమాచారం ప్రకారం.. 'ఆర్ఆర్ఆర్' తొలిరోజు నైజాంలో రూ.23 కోట్ల 35 లక్షల కలెక్షన్ నమోదు చేయగా.. 'సలార్' రూ.22 కోట్ల 55 లక్షల దగ్గర వచ్చి ఆగిందట. అంటే కేవలం రూ.80 లక్షలు మాత్రమే తేడా. ఒకవేళ 'డంకీ', 'ఆక్వామెన్' లాంటి మూవీస్ ఏం లేకుండా 'సలార్' సోలోగా రిలీజై ఉంటే మాత్రం 'ఆర్ఆర్ఆర్'ని ప్రభాస్ ఈజీగా దాటేసేవాడు! ఇక 'సలార్'కి ఆల్రెడీ పాజిటివ్ టాక్ వచ్చేసింది. దీంతో శని-ఆదివారాలు కూడా చాలాచోట్ల షోలు హౌస్‌ఫుల్ అయిపోయాయి. అలానే పలుచోట్ల షోలు కూడా పెంచుతుండటం విశేషం. క్రిస్మస్ సెలవులు కూడా ఉండటం 'సలార్'కి చాలా ప్లస్ కానుంది. అదే టైంలో రూ.1000 కోట్ల మార్క్ కూడా కొన్నిరోజులు క్రాస్ చేసేయడం గ్యారంటీ. (ఇదీ చదవండి: సలార్ హిట్.. పవన్ కల్యాణ్‌ను ఆడుకుంటున్న నెటిజన్లు) The most violent man announced his arrival ⚠️#SalaarCeaseFire hits 𝟏𝟕𝟖.𝟕 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 𝐆𝐁𝐎𝐂 (worldwide) on the opening day! 𝐓𝐡𝐞 𝐛𝐢𝐠𝐠𝐞𝐬𝐭 𝐨𝐩𝐞𝐧𝐢𝐧𝐠 𝐟𝐨𝐫 𝐚𝐧𝐲 𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐅𝐢𝐥𝐦 𝐢𝐧 𝟐𝟎𝟐𝟑 💥#BlockbusterSalaar #RecordBreakingSalaar… pic.twitter.com/8FPzU8RB0I — Mythri Movie Makers (@MythriOfficial) December 23, 2023 -
సలార్ ఫస్ట్ డే కలెక్షన్స్.. ప్రభాస్ బంపర్ రికార్డ్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం ‘సలార్’. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 22న ఈ సినిమా విడుదలైంది. ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా సలార్ సందడే కనిపిస్తుంది. చాలా ఎళ్ల తర్వాత ప్రభాస్ భారీ హిట్ కొట్టాడు. దీంతో ఆయన ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో సలార్ రికార్డ్ క్రియేట్ చేస్తున్నాడు. తాజాగా సలార్ ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు కలెక్షన్స్ రూ. 178 కోట్లు రాబట్టినట్లు చిత్రయూనిట్ అధికారిక పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ. 90 కోట్లకు పైగా వసూలు చేసిందని తెలుస్తోంది. ఈ ఏడాదిలో మొదటిరోజు బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చిన చిత్రంగా సలార్ రికార్డ్ క్రియేట్ చేసింది. తర్వాతి స్థానంలో దళపతి విజయ్ నటించిన 'లియో', ప్రభాస్ 'ఆదిపురుష్' చిత్రాలు ఈ ఏడాదిలో రూ.140 కోట్ల గ్రాస్‌తో అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న చిత్రాలుగా ఉన్నాయి. ఇప్పటి వరకు భారత్‌లో మొదటిరోజు అత్యధిక ఓపెనింగ్స్ కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా RRR మాత్రమే ఉంది. ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ రూ. 223 కోట్ల రికార్డ్ పదిలంగా ఉంది. ఆ తర్వాత కేజీఎఫ్-2 రూ. 165 కోట్ల రికార్డ్‌ను సలార్ దాటేశాడు. దీంతో మొదటిరోజు బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రాల జాబితాలో సలార్ రెండో స్థానానికి చేరుకుంది. ఈ రెండు చిత్రాలు సౌత్ ఇండియా నుంచే ఉండటం విశేషం. కానీ ఈ ఏడాది రెండు వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన షారుక్ ఖాన్ మాత్రం డంకీ చిత్రంతో కలెక్షన్స్ పరంగా వెనుకపడ్డాడు. డంకీ చిత్రానికి మొదటిరోజు కేవలం ప్రపంచవ్యాప్తంగా రూ. 95 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్షన్స్ వచ్చాయి. సలార్ దెబ్బతో డంకీ కలెక్షన్స్ రెండోరోజు మరింత క్షీణించాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. The most violent man announced his arrival ⚠️#SalaarCeaseFire hits 𝟏𝟕𝟖.𝟕 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 𝐆𝐁𝐎𝐂 (worldwide) on the opening day!𝐓𝐡𝐞 𝐛𝐢𝐠𝐠𝐞𝐬𝐭 𝐨𝐩𝐞𝐧𝐢𝐧𝐠 𝐟𝐨𝐫 𝐚𝐧𝐲 𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐅𝐢𝐥𝐦 𝐢𝐧 𝟐𝟎𝟐𝟑 💥#BlockbusterSalaar #RecordBreakingSalaar… pic.twitter.com/8FPzU8RB0I— Mythri Movie Makers (@MythriOfficial) December 23, 2023 -
సలార్ ముందు ఎన్నో భారీ రికార్డ్స్.. ఢీ కొట్టగలడా..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం ‘సలార్’. నేడు (డిసెంబర్ 22) ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు. సలార్ అర్ధరాత్రి నుంచే థియేటర్లోకి వచ్చేశాడు. దీంతో అన్ని ఏరియాల్లో హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో రికార్డ్ క్రియేట్ చేశాడు ప్రభాస్. బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్టుకోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సలార్‌కు వస్తున్న టాక్ చూస్తుంటే ప్రభాస్ భారీ హిట్ట్ కొట్టాడని తెలుస్తోంది. విడుదలైన అన్ని ఏరియాల్లో సలార్‌కు పాజిటివ్ టాక్ వస్తుంది. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. సలార్ ఈ రికార్డ్స్ కొట్టగలడా..? ఈ ఏడాదిలో విజయ్,షారుక్ ఖాన్,రణబీర్ కపూర్ చిత్రాలు భారీ కలెక్షన్స్ రాబట్టాయి. ఈ స్టార్ హీరోల చిత్రాలు విడుదలైన మొదటిరోజే భారీ కలెక్షన్స్‌తో రికార్డు క్రియేట్ చేశారు. నేడు విడుదలైన సలార్ ఆ రికార్డ్స్‌ను దాటగలుగుతాడా అని చర్చ జరుగుతుంది. దళపతి విజయ్ నటించిన 'లియో', ప్రభాస్ 'ఆదిపురుష్' చిత్రాలు ఈ ఏడాదిలో రూ.140 కోట్ల గ్రాస్‌తో అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న చిత్రాలుగా ఉన్నాయి. ఆ తర్వాత షారుఖ్ "జవాన్" మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 129.6 కోట్లు వసూలు చేసింది. కొద్దిరోజుల క్రితం విడుదలైన 'యానిమల్' చిత్రం కూడా మొదటిరోజు రూ. 116 కోట్లు రాబట్టింది. ఇప్పటి వరకు భారత్‌లో మొదటిరోజు అత్యధిక ఓపెనింగ్స్ కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా RRR మాత్రమే ఉంది. ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ రూ. 223 కోట్ల గ్రాస్‌గా ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. తాజాగా విడుదలైన సలార్ మొదటిరోజు కలెక్షన్స్ పరంగా ఏ రికార్డ్ కొట్టగలుగుతుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి ఉండాల్సిందే. కానీ సలార్ మొదటిరోజు కలెక్షన్స్ రూ. 150 కోట్లు దాటుతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రూ. 600 కోట్లు సేఫ్ మార్క్ మరోవైపు ప్రపంచవ్యాప్తంగా సలార్ బిజినెస్ కూడా ఒక రేంజ్లో జరిగింది. 'బాహుబలి'ని మించి కొన్ని ఏరియాల్లో టికెట్ రేట్లు ఉండటం విశేషం. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాకు రూ. 350 కోట్ల మేర బిజినెస్ జరిగిందట. అంటే టార్గెట్‌ను అందుకోవాలంటే సలార్ ఫుల్ రన్లో రూ. 600 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్లను వసూలు చేయాల్సి ఉందని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో సలార్‌కు రూ.150 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని టాక్ ఉంది. (ఇదీ చదవండి: Salaar X Review: ‘సలార్’మూవీ ట్విటర్ రివ్యూ) ఇదే నిజమైతే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాకు రూ.250 కోట్లు మేర గ్రాస్ కలెక్షన్స్ రావాల్సి ఉంది. ఇక సౌత్ ఇండియాలో మిగిలిన రాష్ట్రాల్లో రూ.50 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. హిందీ వర్షన్ హక్కులు మాత్రం రూ.75 కోట్లకు అమ్ముడుపోయినట్లు టాక్. ఏదేమైనా సలార్ ఫుల్ రన్లో టార్గెట్ రూ. 600 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం సలార్‌కు వస్తున్న టాక్ చూస్తుంటే చాలా రికార్డ్స్ బద్దలు కావడం ఖాయం అని తెలుస్తోంది. -
మెగాహీరో రామ్ చరణ్‌కు మరో గ్లోబల్ అవార్డ్
మెగాహీరో రామ్ చరణ్ మరో ఇంటర్నేషనల్ అవార్డు అందుకున్నాడు. ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా చాలా గుర్తింపు తెచ్చుకున్న చరణ్.. ఆ తర్వాత కూడా పలు పురస్కారాలు దక్కించుకున్నాడు. ఇప్పటికీ ఎక్కడో ఓ చోట చరణ్ ని అవార్డులు వరిస్తూనే ఉన్నాయి. తాజాగా అలా అమెరికాలో నిర్వహించే ఓ క్రేజీ అవార్డు ఇప్పుడీ మెగాహీరోకి దక్కింది. (ఇదీ చదవండి: Bigg Boss 7: తెగించేసిన శోభాశెట్టి.. ఆ నిజాలన్నీ ఒప్పేసుకుంది కానీ!) అంతర్జాతీయ స్థాయిలో రామ్ చరణ్‌కి మరో గుర్తింపు దక్కింది. అమెరికాలో నిర్వహించే పాప్ గోల్డెన్ అవార్డుల్లో భాగంగా ఈసారి రామ్ చరణ్.. గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ అవార్డు దక్కించుకున్నాడు. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చరణ్.. 'గేమ్ ఛేంజర్' మూవీ చేస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది రిలీజ్ కానుందని తెలుస్తోంది. మరి ఈ సినిమా వచ్చేలోపు చరణ్‌ని ఇంకెన్ని అవార్డులు వరిస్తాయనేది చూడాలి. (ఇదీ చదవండి: సెన్సార్ పూర్తి చేసుకున్న సలార్.. పిల్లలకు థియేటర్లలోకి నో ఎంట్రీ!) #POPGOLDENAWARDS2023 GOLDEN BOLLYWOOD ACTOR OF THE YEAR AWARD WINNER REVEALED!! CONGRATULATIONS TO #RAMCHARAN For the well deserved honor!! pic.twitter.com/nzfZG1BxDS — POP GOLDEN AWARDS (@popgoldenawards) December 8, 2023 -
KGF 3, RRR 2 షాకింగ్ అప్ డేట్స్.. పరేషాన్ అవుతున్న ఫ్యాన్స్
-
ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్‌లో...
రామ్ చరణ్‌కి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. ‘ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ (ఆస్కార్ కమిటీ) తాజాగా వెల్లడించిన ‘మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్’ జాబితాలో రామ్‌చరణ్‌కి సభ్యత్వం దక్కింది. ‘ఆర్ఆర్ఆర్’లో రామరాజు పాత్రలో అద్భుతంగా నటించినందుకుగాను చరణ్‌కి ఈ స్థానం లభించింది. కాగా ‘ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ ఆ మధ్య విడుదల చేసిన యాక్టర్స్ బ్రాంచ్‌లో తెలుగు నుంచి ఎన్టీఆర్‌కి చోటు దక్కిన విషయం తెలిసిందే. తాజాగా రామ్‌చరణ్‌తో పాటు మరికొందరు హాలీవుడ్ నటీనటులకు ఈ కమిటీలో చోటు దక్కింది. ‘‘ఈ నటులు వెండితెరపై తమ ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించారు. వాస్తవానికి, కల్పితానికి మధ్య వారధులుగా నిలిచారు. ఎన్నో సినిమాల్లో వారి నటనతో పాత్రలకు ప్రాణం పోశారు. వారి కళతో సాధారణ సినిమాతో ప్రేక్షకులకు అసాధారణ అనుభవాలను అందిస్తున్నారు. అలాంటి వారిని ‘యాక్టర్స్ బ్రాంచ్’లోకి ఆహ్వానిస్తున్నాం’’ అని సోషల్ మీడియా వేదికగా ఆస్కార్ అకాడమీ ప్రతినిధులు షేర్ చేశారు. కాగా 96వ ఆస్కార్ అవార్డుల వేడుక వచ్చే ఏడాది మార్చిలో జరగనుంది. -
రామ్ చరణ్‌కు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు దక్కింది. ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (ఆస్కార్ కమిటీ) తాజాగా వెల్లడించిన మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్ జాబితాలో రామ్ చరణ్‌కు చోటు దక్కింది. 'వెండితెరపై తమ ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకర్షించారు. అంకితభావంతో బాగా హావభావాలను ప్రదర్శించారు. వాస్తవానికి, కల్పితానికి మధ్య వారధులుగా నిలిచారు. ఎన్నో సినిమాల్లో వారి నటనతో పాత్రలకు ప్రాణంపోశారు. వారి కళతో సాధారణ సినిమాతో కూడా ప్రేక్షకులకు అసాధారణ అనుభవాలను అందిస్తున్నారు. అలాంటి వారిని ‘యాక్టర్స్ బ్రాంచ్’లోకి ఆహ్వానిస్తున్నాం’’ అంటూ సోషల్ మీడియా వేదికగా అకాడమీ ప్రతినిధులు పేర్కొన్నారు. (ఇదీ చదవండి: వరుణ్ తేజ్ పెళ్లి.. మెగా ఫోటో షేర్ చేసిన చిరు.. ఎవరెవరు ఉన్నారంటే) ఇక 96వ ఆస్కార్ అవార్డుల వేడుక వచ్చే ఏడాది మార్చిలో జరుగనున్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన ఈ లిస్ట్‌లో రామ్ చరణ్‌తో పాటు మరికొందరు హాలీవుడ్ నటులు కూడా ఉన్నారు. ఇప్పటికే జూ. ఎన్టీఆర్‌కు అందులో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు రామ్‌చరణ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. టాలీవుడ్లో ఆర్ఆర్ఆర్ సినిమాతో హీరో రామ్ చరణ్, ఎన్టీఆర్‌కు ఈ అరుదైన గౌరవం దక్కడంతో వారి అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్లో 'గేమ్ ఛేంజర్' తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీని షూటింగ్ హైదరాబాద్ ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. దీపావళి కానుకగా ఈ చిత్రంలోని తొలిపాటను విడుదల చేయనున్నన్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇందులో హీరోయిన్గా కియారా అడ్వాణీ నటిస్తుండగా అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్.జె.సూర్య, సముద్రఖని, నవీన్ చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా 2024లో విడుదల కానుంది. -
వాళ్లకు క్షమాపణలు చెప్పిన మెగాహీరో రామ్‌చరణ్
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం విహార యాత్రలో ఉన్నాడు. భార్య, కూతురితో కలిసి ఇటలీ వెళ్లాడు. అలాంటిది ఇప్పుడు వీడియో కాల్లో కొందరికీ క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది. అసలేం జరిగింది? చరణ్ ఎందుకు సారీ చెప్పాడనేది ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న 28 సినిమాలు) ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కింది. దీనితో పాటు ఎన్నో అవార్డులు కూడా సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే చిత్రబృందం ఎప్పటికప్పుడు ఏదో కార్యక్రమానికి హాజరవుతూనే ఉంది. తాజాగా మన దేశంలో జర్మనీ యూనిటీ డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరిగాయి. 'ఆర్ఆర్ఆర్' టీమ్ తరఫున కీరవాణి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి.. నాటు నాటు పాటని జర్మనీలో పాడారు. దీనికి వేడుకలో ఉన్న జర్మనీ ఎంబసీ అధికారులందరూ డ్యాన్స్ కూడా చేశారు. అయితే తాను వ్యక్తిగత పనుల మీద ఇటలీ వెళ్లానని, తను రాలేకపోయినందుకు క్షమాపణలు చెబుతున్నానని వీడియో కాల్లో రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. ఇక సినిమాల విషయానికొస్తే.. చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఇది విడుదల కానుంది. (ఇదీ చదవండి: చిన్నప్పటి ఫ్రెండ్ కోసం కదిలొచ్చిన చిరంజీవి.. స్వయంగా ఆస్పత్రికి వెళ్లి!) View this post on Instagram A post shared by German Embassy New Delhi (@germanyinindia) -
రాజమౌళి బర్త్‌డే స్పెషల్.. ఈ డైరెక్టర్ ఆస్తి ఎంతో తెలుసా?
ఎస్ఎస్ రాజమౌళి.. ఇది పేరు మాత్రమే అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే కేవలం రెండు రాష్ట్రాలకే పరిమితమైన తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేశాడు. వేలకోట్ల వసూళ్లని రుచి చూపించాడు. ఫ్లాప్ అనే పదాన్ని తన డిక్షనరీలో లేకుండా చేశాడు. టాలీవుడ్ స్టార్స్ కలలో కూడా ఊహించని ఆస్కార్ అవార్డుని తన మూవీతో సాధించాడు. అలాంటి రాజమౌళి పుట్టినరోజు నేడు (అక్టోబరు 10). ఈ సందర్భంగా ఆయన జీవిత విశేషాలతో పాటు ఆస్తులు ఎంత సంపాదించాడనేది చూద్దాం. సీరియల్ దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన రాజమౌళి.. 'స్టూడెంట్ నం.1'తో సినిమా డైరెక్టర్ అయ్యాడు. ఆ తర్వాత ప్రతి సినిమాతో తన స్థాయిని పెంచుకుంటూ, తెలుగు సినిమాకి సరికొత్త నిర్వచనాన్ని తీసుకొచ్చాడు. ఇక 'బాహుబలి'తో పాన్ ఇండియా లెవల్లో విధ్వంసం సృష్టించి, 'ఆర్ఆర్ఆర్'తో ఆస్కార్ రేంజుకి వెళ్లిపోయాడు. ఇప్పటివరకు 12 సినిమాలు తీసిన రాజమౌళి.. దేశవ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అలానే ఆస్తులు కూడా బాగానే కూడబెట్టుకున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న రూ.100 కోట్ల మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడే!) సినిమా ప్రమోషన్స్ తప్ప బయట పెద్దగా కనిపించని రాజమౌళికి హైదరాబాద్ మణికొండలోని ఓ విలాసవంతమైన బంగ్లా ఉంది. అలానే సిటీ చివర్లో ఫామ్ హౌస్ తో పాటు స్థలాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అలానే పలు నగరాల్లో ఫ్లాట్స్ కూడా ఉన్నట్లు సమాచారం. అలానే సినిమా ప్రొడక్షన్ కూడా చేస్తున్నారట. ఇవన్నీ పక్కనబెడితే రాజమౌళి దగ్గర బీఎండబ్ల్యూ 7 సిరీస్, రేంజ్ రోవర్, వోల్వ్ తదితర ఖరీదైన కార్లు ఉన్నాయట. అలా ఓవరాల్ గా రూ.158 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో అందనంత రేంజ్‌కి వెళ్లిపోయిన రాజమౌళి షారితోషికం మిగతా డైరెక్టర్స్‌తో పోలిస్తే చాలా ఎక్కువ. ఇదిలా ఉండగా సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో రాజమౌళి.. తర్వాతి సినిమా చేయబోతున్నాడు. చాన్నాళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటికీ.. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సెట్స్‌పైకి వెళ్తుందని అంటున్నారు. ఇదో జంగిల్ యాక్షన్ అడ్వెంచర్ స్టోరీ అని టాక్. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7: సడన్‌గా హౌస్‌లో నుంచి వెళ్లిపోయిన కంటెస్టెంట్!) -
SS Rajamouli: వెండితెర మాంత్రికుడు..ఓటమి ఎరుగని దర్శకుడు
దర్శకత్వ ప్రతిభతో ఎంతో మంది హీరోలకు స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన టాలీవుడ్ నెంబర్ 1 డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి. ఆయన తెలుగు సినిమా రేంజ్ ను ప్రపంచవ్యాప్తం చేసిన బాహుబలి. కథ ఏదైనా.. హీరో ఎవ్వరైనా సరే బాక్సాఫిస్ బద్దలు కావల్సిందే. 24 ఫ్రేమ్స్ ఉన్న సినిమా విభాగాల్లో తన మార్క్ ను చూపించే ఛత్రపతి. సినిమా అంటే కేవలం హీరో, కథ మాత్రమే కాదు.. క్రియేటివిటీ అని చాటి చెప్పిన దర్శక ధీరుడు రాజమౌళి. ఇండస్ట్రీలో ఉండే 24కాప్ట్ర్ మీద పట్టున్న విక్రమార్కుడు రాజమౌళి. ఈగ ని హీరోని చేసిన ఘనత ఆయనదే. చేసింది కొన్ని సినిమాలే అయినా.. వందల సినిమాలు చేసినంత పేరు వచ్చింది. నేడు(అక్టొబర్ 10) రాజమౌళి బర్త్‌డే. ఈ సందర్భంగా ఆయన సినీ కెరీర్‌పై స్పెషల్ స్టోరీ మీకోసం.. -
RRR సీక్వెల్ పై క్లారిటీ..!
-
RRR సీక్వెల్ ఉందా లేదా..?
-
బాహుబలి సినిమాలో బాణాలు ఎందుకు ఎక్కువగా వాడారు: బిత్తిరి సత్తి
-
RRR టీమ్‌తో బిత్తిరి సత్తి కామెడీ ఇంటర్వ్యూ
-
RRR, పుష్ప చిత్రాలను చూడకుండానే తప్పుబట్టిన సీనియర్ నటుడు
ఇండియాలో తెలుగు సినిమాల హవా కొనసాగుతుంది. దానికి నిదర్శనమే ఆర్ఆర్ఆర్, పుష్ప ది రైజ్ వంటి చిత్రాలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పలు అవార్డులు అందుకున్నాయి. ఈ రెండు బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌గా గుర్తింపు తెచ్చుకున్నాయి. ఈ రెండు సినిమాల గురించి బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా పలు వ్యాఖ్యలు చేశాడు. ఈ చిత్రాలను తాను ఇప్పటి వరకు చూడలేదని చెప్పాడు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలపై వరుస కథనాలు ప్రచురితమవుతున్నాయి. అంతేకాకుండా ఆయనపై పలు విమర్శలు కూడా వస్తున్నాయి. (ఇదీ చదవండి: రూ. 29 లక్షల కేసు విషయంలో ఏఆర్ రెహ్మాన్‌పై ఫిర్యాదు) ఈ మధ్య వస్తున్న సినిమాల్లో హీరోయిజాన్ని ఎక్కువగా చూపించడం కనిపిస్తోందని ఆయన తెలిపాడు. అమెరికాలోని మార్వెల్ చిత్రాలు కూడా ఇదే తరహాలోనే ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. అలాంటి పరిస్థితే భారత్‌లో కూడా ఇప్పుడు కనిపిస్తుందని చెప్పాడు. ఆర్ఆర్ఆర్, పుష్ప ది రైజ్ చిత్రాలను ఇప్పటివరకూ చూడలేదంటూ ఈ చిత్రాల్లో హీరోయిజం ఎక్కువగా ఉందని ఆయన తెలిపాడు. ఇలాంటి చిత్రాలు చూసిన ప్రేక్షకులు కూడా థ్రిల్ అవుతున్నారని చెప్పుకొచ్చాడు. మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్’ చూశానని, ఆయన గొప్ప దర్శకుడని కొనియాడాడు. ఆయన ఎలాంటి అజెండాలు లేకుండా సినిమాలు చేస్తారని అందుకే ఆ సినిమా కూడా బాగా వచ్చిందని నసీరుద్దీన్ షా తెలిపాడు. ఇక్కడ ఆయన మిస్ అవుతున్న లాజిక్ ఏంటంటే ఆర్ఆర్ఆర్, పుష్ప ది రైజ్ సినిమాలు చూడకుండానే సుకుమార్, రాజమౌళిని సర్టిఫై చేసిన నసీరుద్దీన్ షాను పలువురు విమర్శిస్తున్నారు. పొన్నియిన్ సెల్వన్ తమిళనాడులో తప్ప ఇతర రాష్ట్రాల్లో పెద్దగా ఆడలేదనే పాయింట్‌ను ఆయనకు గుర్తుచేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా మన దేశానికి ఆస్కార్ అవార్డును తెచ్చిపెట్టింది మర్చిపోయారా అని చెబుతూనే పుష్ప సినిమాతో అల్లు అర్జున్ జాతీయ అవార్డును దక్కించుకున్నాడని నెటిజన్లు ఆయనకు గుర్తు చేస్తున్నారు. -
జూ. ఎన్టీఆర్‌కు ఆ పేరు ఎలా వచ్చింది.. ఆయనకున్న బలం ఎవరు?
సైమా అవార్డ్స్- 2023 ఉత్తమ హీరోగా జూనియర్ ఎన్టీఆర్ అవార్డు అందుకున్నారు. RRR సినిమాలో తన అద్భుత నటనకు గాను ఈ అవార్డును ఆయన సొంతం చేసుకున్నారు. నామినేషన్ లిస్ట్‌లో రామ్ చరణ్ ఉన్నా అవార్డు మాత్రం కొమురం భీం పాత్రలో మెప్పించిన ఎన్టీఆర్కే దక్కింది. 2016లో జనతా గ్యారేజ్ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఆయన మొదటిసారి ఈ అవార్డును అందకున్నారు. 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో అద్భుతమైన నటన కనబరిచారు. 'కొమురం భీముడో... కొమురం భీముడో' పాటలో ఆయన అభినయం ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించింది. (ఇదీ చదవండి: సైమా అవార్డ్స్- 2023 విజేతలు వీరే.. ఎన్టీఆర్, శ్రీలీల, మృణాల్ హవా!) ఇక, ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్సులో ఎన్టీఆర్ ఎంట్రీ అయితే గూస్ బంప్స్ తెప్పించింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటనకు మెచ్చకోని ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ ఇలా అన్ని భాషాల్లో కూడా ఆడియన్స్ ఎన్టీఆర్ నటనపై ప్రశంసలు కురిపించారు. బీభత్సం, రౌద్రం, ప్రేమ, కరుణ ఒకే పాత్రలో చూపించి దేశం మొత్తం తనవైపు తిప్పుకున్నాడు. సినిమాల్లో ఎన్టీఆర్ ఎంట్రీ ఎలా జరిగింది 1983 మే 20న జన్మించిన తారక్ ఓ రోజు మేజర్ చంద్రకాంత్ షూటింగ్ జరుగుతుండగా తన తాత గారు అయిన సీనియర్ ఎన్టీఆర్‌ను చూసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో సీనియర్ ఎన్టీఆర్ ఒక మేకప్‌మ్యాన్‌ను పిలిచి తారక్‌కు మేకప్ వేయమని చెప్పారు. మేకప్ పూర్తి అయిన తర్వాత తారక్‌ను చూసిన ఎన్టీఆర్ ఎంతో సంబరపడిపోయారు. రాబోయే రోజుల్లో తెలుగు సినిమా పరిశ్రమను దున్నేస్తావ్ అని కితాబు ఇచ్చారు. మొదట బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో భరతుడి పాత్ర పోషించాలని ఆయన తారక్‌కు తెలిపారు. అలా తాత దగ్గర నటనలో ఓనమాలు నేర్చుకున్నారు ఎన్టీఆర్. ఆ తర్వాత రామాయణం చిత్రంలో తారక్ నటించారు. అప్పటికి ఆయన హైదరాబాద్‌లోని విద్యారణ్య స్కూల్లో చదువుతుండేవారు. సినిమాల వల్ల చదువుని అశ్రద్ధ చేస్తాడేమోనని కొద్దిరోజుల పాటు కుటుంబ సభ్యులు సినిమాల జోలికి వెళ్లనివ్వలేదు. ఎన్టీఆర్‌కు ఆ పేరు ఎలా వచ్చింది ఎన్టీఆర్‌కు మొదట పెట్టిన పేరు 'తారక్ రామ్'. కానీ తన తాత సూచనతో నందమూరి తారక రామారావుగా మారాడు. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తారక్ ఇలా చెప్పారు. 'ఓ రోజు తాత గారి నుంచి నుంచి కబురు వచ్చింది. అప్పట్లో ఆయన అబిడ్స్‌లో ఉండే వారు. ఆయన్ను కలిసేందుకు వెళ్లగానే.. 'లోపలికి రండి' అంటూ తాత నుంచి గంభీరమైన స్వరంతో ఆహ్వానం. నేను ఆయన ముందుకు వెళ్లగానే.. పేరేంటి..? అని ఆయన అడగ్గా.. తారక్ అని చెప్పాను. దీంతో వెంటనే, హరికృష్ణ గారిని పిలిచి 'నందమూరి తారక రామారావు' అని పేరు మార్చమని చెప్పారు. ఆ క్షణం నుంచి నేను తాత చేయి వదల్లేదు. ఆయనా నన్ను వదిలి ఉండేవారు కాదు.' అని ఓ సందర్భంలో తాతతో తనకు ఉన్న అనుబంధాన్ని ఎన్టీఆర్ గుర్తుచేసుకున్నాడు. ఎన్టీఆర్‌కు 'అమ్మ' బలమైతే.. 'నాన్న' ప్రాణం హరికృష్ణ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఆయనకు శాలిని గారితోనే (జూ. ఎన్టీఆర్ అమ్మ) ఎక్కువ అనుబంధం ఉంది. హైదరాబాద్‌లోనే తన బాల్యం అంతా గడిచింది. బాల్యంలో బాగా అల్లరితో పాటు స్నేహితులతో క్రికెట్, సినిమాలు, షికార్లు, గొడవలు ఇలా ఇష్టం వచ్చినట్టు చేస్తుండటంతో ఒకసారి బాగా విసిగిపోయిన వారి తల్లిగారు శాలిని హ్యాంగర్‌తో కొట్టారని ఓ ఇంటర్వ్యూలో తారక్ చెప్పుకొచ్చారు. 'నేనంటే అమ్మకు ఎంతో ప్రాణం.. ఆమెకు సర్వసం నేనే.. అలాగని ఎప్పుడూ గారాబం చేసేది కాదు. జీవితంలో వాస్తవంలో మాత్రమే బతకాలని నాకు అమ్మే నేర్పింది. నేను ఎప్పుడైనా నిరుత్సాహ పడితే నాలో ఆత్మవిశ్వాసం నింపేది ఆమ్మే. నా జీవితంలో ఆమె నా బలం, బలగం.' అని ఎన్టీఆర్ తెలిపారు. ప్రాణంగా భావించే తన నాన్న హరికృష్ణను రోడ్డు ప్రమాదంలో కోల్పోయినప్పుడు ఆయన ఎంతలా కన్నీరు పెట్టుకున్నాడో అందరం చూశాం. హరికృష్ణ చనిపోయేవరకు ఆయన ఒకే దృక్పథంతో బతికారని గతంలో జూ. ఎన్టీఆర్ చెప్పారు. అంతేకాకుండా ఆయనలా బతకడం చాలా కష్టం అని కూడా తెలిపారు. రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోవడంతో ... ప్రయాణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, తమ కోసం కుటుంబం వేచి చూస్తుందని తన ప్రతి సినిమా వేడుకకు హాజరయ్యే అభిమానులకు తారక్ విజ్ఞప్తి చేస్తుంటారు. అభిమానులే తన కుటుంబ సభ్యులని, వారే తన బలగం అని ఆయన పలుమార్లు బహిరంగంగానే చెప్పారు. తారక్ జీవితంలో ఇవన్నీ ఎవర్గ్రీన్ ♦ తారక్ 1983 మే 20న జన్మించారు. హైదరాబాద్‌లోని విద్యారణ్య స్కూల్లో చదివిన ఆయన సెయింట్ మేరీ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ♦ పదేళ్ల వయసులోనే బ్రహ్మర్షి విశ్వామిత్రతో బాల నటుడిగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా నుంచే జూనియర్ ఎన్టీఆర్ అని పిలిచేవారు. ♦ ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి చిత్రం 'నిన్ను చూడాలని'. ఈ సినిమాకు ఆయన రూ.3.5 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నారని టాక్. ఆ మొత్తాన్ని తీసుకెళ్లి తన తల్లికి ఇచ్చారట. ♦ యమదొంగ, కంత్రి, అదుర్స్, రభస, నాన్నకు ప్రేమతో సినిమాలతో గాయకుడిగానూ తారక్ మెప్పించారు. ♦ తారక్ బాల్యంలోనే ప్రఖ్యాత కళాకారుల దగ్గర కూచిపూడి నేర్చుకుని పలు వేదికలపై ప్రదర్శనలూ ఇచ్చారు. ♦ 'ఆది' సినిమాలో భారీ డైలాగులు చెప్పగలడా? అని కొందరు పరుచూరి బ్రదర్స్ దగ్గర సందేహించారట. కానీ, ఎన్టీఆర్ వాటంన్నిటినీ సింగిల్ టేక్‌లో చెప్పడంతో తన స్టామినా ఏంటో నిరూపించారు. ఈ సినిమాకు తారక్ నంది అవార్డు సొంతం చేసుకున్నారు. ♦ ఆంధ్రావాలా, అదుర్స్, శక్తి చిత్రాల్లో ద్విపాత్రాభినయంలో నటించగా.. జై లవ కుశలో త్రిపాత్రాభినయం చేశారు. ♦ పూరీ జగన్నాథ్- ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన 'ఆంధ్రావాలా' సినిమా ఆడియో విడుదల వేడుక తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పటికీ చెరగని రికార్డు నెలకొల్పింది. ఈ వేడుకలో దాదాపు 10లక్షల మంది తారక్ అభిమానులు పాల్గొన్నారు. నిమ్మకూరులో జరిగిన ఈ కార్యక్రమం కోసం రైల్వే అధికారులు కూడా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ♦ జపాన్‌లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక తెలుగు హీరో తారక్. బాద్షా సినిమా జపాన్ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికైంది. ♦ నంబర్ 9 అంటే తారక్‌కు సెంటిమెంట్. ఆయన వాహనాల నంబర్లన్నీ 9తోనే ప్రారంభమవుతాయి. ఓ కారు కోసం 9999 అనే ఫ్యాన్సీ నంబర్‌ను రూ. 10లక్షలతో కొనుగోలు చేసి 9 అంటే ఎంత ఇష్టమో తెలిపారు. ♦ మాతృదేవోభవ చిత్రంలోని ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ పాట అంటే ఎన్టీఆర్‌కు చాలా ఇష్టం. ♦ 'ఫోర్బ్స్ ఇండియా' సెలబ్రిటీ లిస్ట్‌లో రెండు సార్లు నిలిచాడు. ♦ సుమారుగా 8 భాషల్లో ఎన్టీఆర్ అనర్గళంగా మాట్లాడగలడు. తన వాగ్ధాటితో ఇప్పటికే అన్ని చిత్ర పరిశ్రమల వారిని ఆకర్షించాడు. ♦ తారక్‌కు ఫేవరెట్ సినిమా 'దాన వీర శూర కర్ణ'. ఇప్పటికి ఈ సినిమాను వందసార్లకు పైగా చూశారట ♦ తన సోదరుడు, హీరో కల్యాణ్ రామ్ అంటే ఎన్టీఆర్‌కు ఎంతో ప్రేమ. ♦ తారక్- ప్రణతిలకు ఇద్దరు అబ్బాయిలు (అభయ్, భార్గవ్). కాగా, కూతురు లేదనే లోటు ఎప్పటికీ ఉంటుందని ఎన్టీఆర్ ఓ సందర్భంలో చెప్పారు. -
ఫ్యాన్స్ గురించి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కళ్ల వెంట కన్నీళ్లు
సైమా అవార్డ్స్- 2023 ఉత్తమ హీరోగా జూనియర్ ఎన్టీఆర్ అవార్డు అందుకున్నారు. RRR చిత్రంలో ఆయన కొమురం భీం పాత్రలో తన ఫ్యాన్స్‌ను ఫిదా చేశారు. అవార్డును అందుకున్న ఎన్టీఆర్ స్టేజ్‌పైన ఎమోషనల్ అయ్యారు.. మరోసారి అభిమానులపై తనకున్న ప్రేమను తారక్ తెలియజేశారు. (ఇదీ చదవండి: సైమా అవార్డ్స్- 2023 విజేతలు వీరే.. ఎన్టీఆర్, శ్రీలీల, మృణాల్ హవా!) అవార్డు అందుకున్న తర్వాత ఎన్టీఆర్ ఇలా మాట్లాడారు. 'కొమరం భీమ్ పాత్ర కోసం నేను న్యాయం చేస్తానని నన్ను మళ్ళీ మళ్ళీ మళ్లీ నమ్మినందుకు నా జక్కన్నకు థాంక్స్. నా కో స్టార్, మై బ్రదర్, మై ఫ్రెండ్ రామ్ చరణ్‌కు నా ప్రత్యేక ధన్యవాదాలు. నా అభిమానులందరికీ ఎంతో రుణపడి ఉన్నాను.. వారందరికీ నా కృతజ్ఞతలు. నా ఒడిదుడుకుల్లో నేను కింద పడ్డప్పుడల్లా నన్ను పట్టుకుని పైకి లేపినందుకు... నా కళ్ల వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకు వాళ్ళు కూడా బాధ పడినందుకు... నేను నవ్వినప్పుడల్లా నాతో పాటు నవ్వినందుకు... నా అభిమాన సోదరులు అందరికీ తలవంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను.' అని తారక్ ఎంతో భావోద్వేగంగా మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 👉: సైమా అవార్డ్స్- 2023లో హాట్‌గా తారల సందడి (ఫోటోలు) 'జనతా గ్యారేజ్' లాంటి సూపర్‌హిట్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో తెరకెక్కుతున్న దేవర చిత్రంపై భారీ అంచనాలను ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ వేగంగా జరుపుకుంటోంది. ఇందులో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇది ఆమెకు తొలి తెలుగు సినిమా. దేవర సినిమా 2024 సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సినిమా తో ఎన్టీఆర్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి. Man Of Masses @tarak9999 won the SIIMA Best Actor Award For RRR MOVIE 💥💥💥#SIIMAinDubai #SIIMAAwards2023 pic.twitter.com/8BRtoBAUiO — Jr NTR Fan Club (@JrNTRFC) September 15, 2023 -
సైమా అవార్డ్స్- 2023 విజేతలు వీరే.. ఎన్టీఆర్, శ్రీలీల, మృణాల్ హవా!
ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2023 వేడుక దుబాయ్‌లో ప్రారంభం అయింది. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన చిత్రాలు, నటులు సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించే ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డు ‘సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా). గత పదేళ్లుగా కొనసాగుతున్న ఈ అవార్డుల వేడుకగా తాజాగా 11వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్స్ హీరో రానా, మంచు లక్ష్మీ ప్రధాన వ్యాఖ్యతలుగా వ్యవహరించారు. సెప్టెంబర్ 15న మొదటిరోజున తెలుగు, కన్నడ సినిమాలకు సంబంధించిన అవార్డుల వేడుక పూర్తి అయింది. నేడు సెప్టెంబర్ 16న తమిళ్,మలయాళం ఇండస్ట్రీకి చెందిన కార్యక్రమాలు జరుగుతాయి. సైమాలో దుమ్ములేపిన RRR, సీతా రామం ఆర్ఆర్ఆర్ సినిమాకు వచ్చిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా బాక్సాఫీస్‌నే కాదు, రికార్డులను కూడా కొల్లగొట్టింది. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్టేజిల మీద ఆస్కార్‌తో సహా ఎన్నో అవార్డులను అందుకున్న ఈ సినిమా సైమాలో కూడా రికార్డులను బ్రేక్ చేసింది. ఏకంగా సైమా అవార్డుల రేసులో 11 నామినేషన్స్‌లలో చోటు దక్కించుకొని 5 కీలకమైన అవార్డులను దక్కించుకుంది. సీతా రామం చిత్రానికి గాను మూడు అవార్డులను దక్కించుకుంది. ఉత్తమ చిత్రంగా సీతా రామం నిలిచింది. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) సైమా విజేతలు.. వారి వివరాలు * ఉత్తమ చిత్రం: సీతా రామం * ఉత్తమ దర్శకుడు: SS రాజమౌళి (RRR) * ఉత్తమ నటుడు: జూనియర్ ఎన్టీఆర్ (RRR) * ఉత్తమ నటి : శ్రీలీల (ధమాకా) * ఉత్తమ నటుడు (క్రిటిక్స్): అడివి శేష్ (మేజర్) * ఉత్తమ నటి (క్రిటిక్స్): మృణాల్ ఠాకూర్ (సీతా రామం) * ఉత్తమ సహాయ నటుడు: రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్) * ఉత్తమ సహాయ నటి: సంగీత(మసూద) * ఉత్తమ నూతన నటి : మృణాల్ ఠాకూర్ (సీతా రామం) * ఉత్తమ సంగీత దర్శకుడు: MM కీరవాణి(RRR) * ఉత్తమ గేయ రచయిత 'నాటు నాటు' పాట కోసం: చంద్రబోస్ (RRR) * ఉత్తమ గాయకుడు : మిర్యాల రామ్ (DJ టిల్లు) టైటిల్ సాంగ్ కోసం * ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్: సింగర్ మంగ్లీ (ధమాకా) 'జింతక్' పాట కోసం * ఉత్తమ విలన్ : సుహాస్ (హిట్ - 2) * ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సెంథిల్ కుమార్ (RRR) * ఉత్తమ నూతన దర్శకుడు: మల్లిడి వశిష్ట (బింబిసార) * సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్: నిఖిల్ సిద్ధార్థ (కార్తికేయ 2) * ఉత్తమ హాస్యనటుడు: శ్రీనివాస రెడ్డి (కార్తికేయ 2) * ఉత్తమ నూతన నిర్మాతలు : శరత్, అనురాగ్ (మేజర్) * ఫ్లిప్‌కార్ట్ ఫ్యాషన్ యూత్ ఐకాన్: శ్రుతి హాసన్ * ప్రామిసింగ్ న్యూకమ్: వినోద ప్రపంచంలో భవిష్యత్‌లో మంచి స్టార్‌గా గుర్తింపు పొందిన గణేష్ బెల్లంకొండ -
నేడు సైమా అవార్డ్స్ ప్రకటన.. పోటీ పడుతున్న తెలుగు స్టార్స్ వీళ్లే
సినిమా ఇండస్ట్రీలో సైమా పండుగ మొదలైపోయింది. ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2023 పండుగకు సర్వం సిద్ధమైంది. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన చిత్రాలు, నటులు సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించి ఇచ్చే ప్రతిష్ఠాత్మక అవార్డుగా సైమాకు గుర్తింపు ఉంది. సెప్టెంబరు 15, 16 తేదీల్లో జరగనున్న ఈ వేడుక మరికొన్న గంటల్లో దుబాయ్‌లో జరగనుంది. ఇప్పటికే అక్కడకు జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరుకున్నారు. గతేడాది రిలీజ్ అయ్యి హిట్ అందుకున్న సినిమాలను.. అందులో మంచి నటనను కనపరిచిన నటీనటులకు, ప్రేక్షకులు మెచ్చిన సినిమాలను వెలికి తీసి వారిని అవార్డులతో గౌరవించడం అనేది పరిపాటి అని తెలిసిందే. ఈ పోటీలో ఎవరెవరున్నారో ఆ లిస్ట్‌ను సైమా ఇప్పటికే విడుదల చేసింది. ఉత్తమ నటుడు, చిత్రం – తెలుగు (2023) ♦ అడవి శేష్ (మేజర్) ♦ జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ (RRR) ♦ దుల్కర్ సల్మాన్ (సీతారామం) ♦ నిఖిల్ సిద్దార్ద్ (కార్తికేయ) ♦ సిద్దు జొన్నలగడ్డ (DJ టిల్లు) ఉత్తమ దర్శకుడు – తెలుగు (2023) ♦ రాజమౌళి (ఆర్ఆర్ఆర్) ♦ హను రాఘవపూడి (సీతారామం) ♦ చందూ మొండేటి (కార్తికేయ 2) ♦ శశికిరణ్ తిక్కా (మేజర్) ♦ విమల్ కృష్ణ (డీజే టిల్లు) ఉత్తమ గేయ రచయిత ♦ RRR సినిమా నుంచి నాటు నాటు (చంద్రబోస్) ♦ సీతారామం నుంచి 'ఇంతందం' సాంగ్ (కృష్ణకాంత్) ♦ ఆచార్య సినిమా నుంచి 'లాహె.. లాహె' సాంగ్ (రామజోగయ్య) ♦ RRR నుంచి 'కొమురం భీముడో' సాంగ్ (సుద్దాల అశోక్ తేజ) ఉత్తమ సహాయ నటి ♦ అక్కినేని అమల (ఒకే ఒక జీవితం) ♦ ప్రియమణి (విరాట పర్వం) ♦ సంయుక్త మీనన్ (భీమ్లా నాయక్) ♦ సంగీత (మాసూద) ♦ శోభిత ధూళిపాళ (మేజర్) ఉత్తమ విలన్ ♦ సత్యదేవ్ (గాడ్ ఫాదర్) ♦ జయరామ్ (ధమాకా) ♦ సముద్రఖని (సర్కారు వారి పాట) ♦ సుహాస్ (హిట్-2) ► పుష్ప సినిమాతో నేషనల్ అవార్డు గెలుచున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..సైమా 2023లో కనీసం నామినేషన్ కాకపోవడంతో ఆయన ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. A glimpse of the star-studded moments. SIIMA 2023 pre-event press meet highlights!#NEXASIIMA #DanubeProperties #A23Rummy #HonerSignatis #Flipkart #ParleHideAndSeek #LotMobiles #SouthIndiaShoppingMall #TruckersUAE #SIIMA2023 #A23SIIMAWeekend #SouthIndianAwards #Docile… pic.twitter.com/hlVL9fI050 — SIIMA (@siima) September 14, 2023 (ఇదీ చదవండి: లావణ్య త్రిపాఠి రూట్లో 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి.. పెళ్లిపై నిజమెంత?) -
ఇష్టమైన ఆహారాన్ని ఇష్టమైన వాళ్లతో తింటున్నా రాజమౌళి
-
సినిమా విడుదలకు ముందు నేను భయపడ్డాను : ఎస్ ఎస్ రాజమౌళి
-
G20 Summit: ఆర్ఆర్ఆర్ అద్భుతం: బ్రెజిల్ అధ్యక్షుడు
న్యూఢిల్లీ: గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఘన విజయం సాధించిన తెలుగు సినిమా ‘ఆర్ఆర్ఆర్’పై బ్రెజిల్ అధ్యక్షుడు లూలా మనసు పారేసుకున్నారు. తనకెంతో నచ్చిన సినిమా అని మెచ్చుకున్నారు. జీ20 సదస్సు కోసం ఢిల్లీకి వచ్చిన లూయిజ్ ఒక ఆన్లైన్ పోర్టల్‌కు ఇచి్చన ఇంటర్వ్యూ వివరాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఆ ఇంటర్వ్యూలో ‘ మీకు నచి్చన భారతీయ సినిమా పేరు చెప్పండి’ అన్న ప్రశ్నకు ఆయన ఠక్కున ఆర్ఆర్ఆర్ అని చెప్పారు. ‘ఇది చక్కని ఫీచర్ ఫిల్మ్. సరదా సన్నివేశాలు, అలరించే డ్యాన్స్‌లతో కట్టిపడేస్తుంది. బ్రిటిషర్లు భారతీయులను ఎంతగా అణచివేశారనేది కళ్లకు కట్టింది’అని అన్నారు. -
ఆర్ఆర్ఆర్పై బ్రెజిల్ ప్రెసిడెంట్ ప్రశంసలు.. రాజమౌళి ఏమన్నారంటే?
ఆర్ఆర్ఆర్ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ చిత్రంతో టాలీవుడ్ స్థాయి ఏకంగా గ్లోబల్‌వైడ్‌గా మార్మోగిపోయింది. హాలీవుడ్ దర్శక దిగ్గజం కామెరూన్ సైతం ప్రశంసల వర్షం కురిపించారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. అయితే తాజాగా ఈ చిత్రంపై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా ప్రశంసలతో ముంచెత్తారు. ఢిల్లీలో జరుగుతున్న జీ20 సమావేశానికి హాజరైన ఆయన.. రాజమౌళిని సైతం కొనియాడారు. లులా మాట్లాడుతూ..'ఆర్ఆర్ఆర్ సినిమా బాగా నచ్చంది. ఈ చిత్రంలోని అద్భుతమైన సన్నివేశాలు, అందమైన డ్యాన్సులు ఆకట్టుకున్నాయి. భారత్‌పై బ్రిటిష్ పాలనను చూపించినప్పటికీ.. చాలా అర్థవంతంగా ఉంది. ఆ సినిమా చూసి తెలిసిన వాళ్లందరిని ఆర్ఆర్ఆర్ అని మొదట అడిగేవాన్ని. దర్శకుడు రాజమౌళి, నటీనటులకు నా అభినందనలు' అని అన్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ తాజాగా ట్విటర్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. రాజమౌళి ట్వీట్ అయితే లులా ప్రశంసలపై రాజమౌళి స్పందించారు. ఈ మేరకు ఆయనకు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు. ట్వీట్లో రాస్తూ.. 'ఆర్ఆర్ఆర్ పట్ల మీ మాటలకు చాలా ధన్యవాదాలు. మీరు భారతీయ సినిమా గురించి ప్రస్తావించడం చాలా ఆనందంగా ఉంది. ఆర్ఆర్ఆర్ను ఆస్వాదించారని చెప్పడం చాలా గర్వకారణం. మీ ప్రశంసలతో మాచిత్రబృందం సంతోషంగా ఉంది. మీరు మా దేశంలో విలువైన సమయాన్ని ఆనందంగా గడుపుతున్నారని ఆశిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. కాగా.. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఆలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలోని నాటునాటు సాంగ్‌ను ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. Sir… @LulaOficial 🙏🏻🙏🏻🙏🏻 Thank you so much for your kind words. It’s heartwarming to learn that you mentioned Indian Cinema and enjoyed RRR!! Our team is ecstatic. Hope you are having a great time in our country. https://t.co/ihvMjiMpXo — rajamouli ss (@ssrajamouli) September 10, 2023 -
సూపర్ స్టార్స్ తో ప్రత్యేక ఇంటర్వ్యూ
-
అల్లు అర్జున్‌కు కంగ్రాట్స్: సీఎం కేసీఆర్
హైదరాబాద్: 69వ జాతీయ సినీ అవార్డుల్లో తెలుగు చిత్రాలు సత్తా చాటడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు సాధించిన నటుడు అల్లు అర్జున్ను సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. తొలిసారిగా తెలుగు నటుడికి బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. అలాగే.. అవార్డులు సాధించిన ఆర్ఆర్ఆర్, పుష్ప చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. అలాగే.. నల్లగొండకు చెందిన ముడుంబై పురుషోత్తమాచార్యులుకి జాతీయ ఉత్తమ సినీ విమర్శకుడిగా అవార్డు దక్కడంపైనా సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. తాజాగా.. రెండు రోజుల కిందట 69వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు సుకుమార్డైరెక్షన్లో వచ్చిన ‘పుష్ప ది రైజ్’ పార్ట్ 1 చిత్రానికిగానూ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కింది. దీంతో తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్ దక్కించుకున్న తొలి యాక్టర్‌గా బన్నీ చరిత్ర సృష్టించాడు. ఇక ఆరు అవార్డులతో రాజమౌళి మల్లీస్టారర్ ఆర్ఆర్ఆర్ సత్తా చాటింది. ఉప్పెన ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నెగ్గింది. మొత్తంగా తెలుగు సినిమాకు పదకొండు అవార్డులు దక్కాయి. జాతీయ అవార్డ్ విజేతలకు దక్కే ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా? -
జాతీయ అవార్డ్ విజేతలకు దక్కే ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?
'పుష్ప' ఇప్పుడు దేశంలో ట్రెండింగ్‌లో ఉన్న పేరు ఇదే. ఈ సినిమాతో అల్లు అర్జున్ నటనకుగాను తాజాగా జాతీయ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ అవార్డు అందుకుంటున్న టాలీవుడ్ తొలి హీరో కూడా ఆయనే.. ఈ అవార్డుతో పాటు విజేతలకు కేంద్ర ప్రభుత్వం ఏమేం ఇస్తుందని సోషల్‌మీడియాలో నెటిజన్లతో పాటు ఆయన అభిమానులు వెతుకుతున్నారు. జాతీయ చలనచిత్ర అవార్డలను అందుకున్న విజేతలకు స్వర్ణ కమలం, రజత కమలంతో పాటు నగదు బహుమతిని అందిస్తారు. అంతేకాకుండా గుర్తింపుగా ప్రశంసా పత్రాలను కూడా అందిస్తారు. కానీ జ్యూరీ నుంచి అభినందనలు అందుకున్న సినిమాల విషయంలో కేవలం సర్టిఫికేట్ మాత్రమే అందిస్తారు. జ్యూరీ స్పెషల్ విజేతలకు మాత్రం ప్రశంసా పత్రంతో పాటు నగదు బహుమతి కూడా అందిస్తారు. (ఇదీ చదవండి: డిసెంబర్ 12న విడుదల కానున్న రజనీకాంత్ మరో సినిమా) 2021 ఏడాదికి గాను 69వ జాతీయ అవార్డు అందుకోబోతున్న వారి జాబితా ఇప్పటికే విడుదలైంది. ఇందులో భాగంగా ఉత్తమ నటుడిగా అవార్డుకు ఎంపికైన అల్లు అర్జున్, ఉత్తమ నటీమణులుగా ఎంపికైన అలియా భట్, కృతి సనన్‌లకు ఒక్కోక్కరికి రూ.50 వేల నగదుతో పాటు రజత కమలాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ► ఉత్తమ చిత్రం అవార్డుల కోసం 28 భాషల నుంచి 280 సినిమాలు పోటీ పడితే.. బెస్ట్ మూవీగా ఎంపికైన రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్‌కు రూ.2.50 లక్షల నగదుతో పాటు స్వర్ణ కమలాన్ని అందజేయనున్నారు. ► ఉత్తమ వినోద చిత్రం అవార్డు కోసం 23 భాషల నుంచి 158 చిత్రాలు పోటీపడగా ఈ అవార్డుకు ఎంపికైన RRR సినిమాకు రూ. 2 లక్షల నగదుతో పాటు స్వర్ణ కమలం దక్కించుకోనుంది. ► గోదావరి అనే మరాఠ సినిమాకు బెస్ట్ డైరెక్టర్‌గా జాతీయ అవార్డు గెలుచుకున్న నిఖిల్ మహాజన్‌కు రూ.2.50 లక్షల నగదు బహుమతి, రజత కమలం అందుకుంటారు ► ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రంగా ఎంపికైన ది కశ్మీర్ ఫైల్స్‌కు రూ. 1.50 లక్షల నగదుతో పాటు రజత కమలం అందుకుంటారు. ఈ సినిమాకు రెండు అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే ► జ్యూరీ స్పెషల్ అవార్డుకు ఎంపికైన షేర్షా సినిమాకు రూ.2 లక్షల నగదుతో పాటు రజత కమలాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. -
నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీస్.. ఏయే ఓటీటీల్లో?
జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. అలానే మిగతా దక్షిణాది భాషల్లోని చిత్రాలు సైతం అవార్డులు గెలుచుకున్నాయి. 'పుష్ప' మూవీకిగానూ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డు గెలుచుకోవడం మాత్రం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. అలానే 'ఆర్ఆర్ఆర్'కి ఏకంగా ఆరు పురస్కారాలు దక్కడం కూడా టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. (ఇదీ చదవండి: మహేశ్‌బాబు.. జాతీయ అవార్డు మిస్ చేసుకున్నాడా?) అయితే చాలామంది ఎవరెవరికి ఎన్ని అవార్డులు వచ్చాయనేది చూస్తుంటే.. సినీ ప్రేమికులు మాత్రం ఏ సినిమా ఏ ఓటీటీలో ఉందా అని తెగ వెతికేస్తున్నారు. అయితే అలాంటి వాళ్ల కోసం మేం ఆ లిస్టుతో వచ్చేశాం. అవార్డులు గెలుచుకున్న చిత్రాలు ప్రస్తుతం ఏ ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయనేది తెలియాలంటే దిగువన లిస్ట్‌పై అలా ఓ లుక్కేసేయండి. నేషనల్ అవార్డ్ మూవీస్- ఓటీటీ ఆర్ఆర్ఆర్ - జీ5, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (తెలుగు) పుష్ప - అమెజాన్ ప్రైమ్ (తెలుగు) రాకెట్రీ: ద నంబి ఎఫెక్ట్ - జియో సినిమా (తెలుగు-హిందీ) ఉప్పెన - నెట్‌ఫ్లిక్స్ (తెలుగు) కొండపొలం - నెట్‌ఫ్లిక్స్ (తెలుగు) ద కశ్మీర్ ఫైల్స్ - జీ5 (తెలుగు డబ్బింగ్) చార్లి 777 - అమెజాన్ ప్రైమ్ (తెలుగు డబ్బింగ్) గంగూబాయి కతియావాడి - నెట్‌ఫ్లిక్స్ (తెలుగు డబ్బింగ్) మిమీ - నెట్‌ఫ్లిక్స్ (హిందీ) #Home - అమెజాన్ ప్రైమ్ (తెలుగు డబ్బింగ్) షేర్షా - అమెజాన్ ప్రైమ్ (హిందీ) సర్దార్ ఉద్దామ్ సింగ్ - అమెజాన్ ప్రైమ్ (హిందీ) కడైసి వివసయ్ - సోనీ లివ్ (తెలుగు డబ్బింగ్) నాయట్టు - నెట్‌ఫ్లిక్స్ (తెలుగు డబ్బింగ్) (ఇదీ చదవండి: బ్రహ్మానందం ఇంటికెళ్లిన బన్నీ.. కారణం అదేనా?) -
జాతీయ అవార్డుల విషయంలో టాలీవుడ్ గళాన్ని వినిపించిన శ్రీలేఖ
69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు చిత్రసీమ సత్తా చాటింది. ఈ అవార్డుల విషయంలో సౌత్ ఇండియాకు ఎక్కువగా అన్యాయం జరుగుతుంటుందనే విమర్శ గతంలో ఎక్కువగా వినిపించేది. అందులో టాలీవుడ్‌కు మరింత అన్యాయం జరుగుతుందని బహిరంగంగానే పలువురు జాతీయ అవార్డుల జ్యూరీ సభ్యులపైనే కామెంట్లు చేశారు. 1967లో 15వ జాతీయ అవార్డుల నుంచి కేంద్ర ప్రభుత్వం ఉత్తమ నటుడి అవార్డు ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి నేటి వరకు టాలీవుడ్ నుంచి ఏ ఒక్క హీరోకి ఉత్తమ నటుడి అవార్డు దక్కలేదు. (ఇదీ చదవండి: 2022లో విడుదలైన సినిమాలకు 2021 అవార్డులా.. అదెలా?) తాజాగ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకుని తొలి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించారు. టాలీవుడ్లో ఎన్టీఆర్,నాగేశ్వరావు,కృష్ణ,చిరంజీవి ఇలా ఎందరో సినీ చరిత్రలో గొప్ప నటులున్నా ఇప్పటివరకూ ఎవ్వరికీ ఈ అవకాశం దక్కలేదు. దీంతో ఒక్కోసారి జ్యూరీ సభ్యులపై కూడా విమర్శలు వచ్చేవి. ఈ విభాగంలో తొలి అవార్డును బెంగాలీ నటుడు ఉత్తమ్‌కుమార్ సొంతం చేసుకున్నారు. అప్పటి నుంచి ఎక్కువగా నార్త్ నుంచే ఆధిపత్యం ఉందని చెప్పవచ్చు. నార్త్ హీరోలకే ఎక్కువ అవార్డులు ఇప్పటి వరకు ఈ అవార్డు అందుకున్న వారిలో బాలీవుడ్ నటులు 27, మలయాళం 13, తమిళ్ 9, బెంగాలీ నుంచి ఐదుగురు ఉన్నారు. కన్నడ, మరాఠీ నటులకు మూడేసి చొప్పున అవార్డులను దక్కించుకున్నారు. అత్యధికంగా అమితాబ్ బచ్చన్ నాలుగుసార్లు, కమల్‌హాసన్,అజయ్‌దేవగణ్, మమ్ముట్టి మూడుసార్లు అవార్డు దక్కించుకున్నారు. మోహన్‌లాల్, ధనుష్,మిథున్చక్రవర్తి, సంజీవ్‌కుమార్, నసీరుద్దీన్‌షా, ఓంపురి కూడా రెండేసిసార్లు అవార్డు గెలుచుకున్నారు. విక్రమ్,సూర్య, ప్రకాశ్‌రాజ్,సురేష్‌గోపి,ఎంజీ రామచంద్రన్ వంటివారు కూడా ఈ పురస్కారాన్ని ఒకసారి అందుకున్నారు. శంకరాభరణం చిత్రానికి 4 అవార్డులు టాలీవుడ్ ఎవర్గ్రీన్ సినిమా అయిన శంకరాభరణం చిత్రానికి అప్పట్లో అత్యధికంగా 4 జాతీయ అవార్డులు దక్కగా మేఘ సందేశం సినిమాకు కూడా 4 పురస్కారాలు దక్కాయి. ఆప్పటి నుంచి టాలీవుడ్‌కు అంతగా జాతీయ అవార్డులు వరించలేదనే చెప్పవచ్చు. తాజాగ RRR మూవీకి 6 అవార్డులతో పాటు మొత్తంగా టాలీవుడ్‌కు 11 అవార్డులు దక్కాయి. జాతీయ చలన చిత్ర పురస్కారాల కమిటీ సభ్యుల ముందు తెలుగు చిత్రాల గళాన్ని గట్టిగా వినిపించే వారు ఉంటే తప్పక టాలీవుడ్‌కు న్యాయం జరుగుతుందని ఎంఎం శ్రీలేఖ నిరూపించారనే చెప్పవచ్చు. జ్యూరీ సభ్యురాలిగా ఎంఎం శ్రీలేఖ 69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో జ్యూరీ సభ్యురాలిగా సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ ఉన్నారు. ఈసారి టాలీవుడ్ సినిమాల ప్రత్యేకత గురించి కమిటీ సభ్యుల ముందు ఆమె గట్టిగానే గళం వినిపించారు. అవార్డుల అనౌన్స్మెంట్ తర్వాత ఎంఎం శ్రీలేఖ తన అభిప్రాయాన్ని ఇలా తెలిపారు. 'ప్రతి ఏడాది తెలుగు సినిమాలంటే కొంచెం నిర్లక్ష్యం. కంటి తుడుపుగా ఒకటో రెండో అవార్డులు ఇస్తున్నారు. దీనిపై జ్యూరీలో గట్టిగా మాట్లాడేవారు కావాలి. తెలుగుకు ఎందుకు ఇవ్వరు? అని మాట్లాడ గలగాలి. అయితే ఆ సినిమాలో విషయం ఉండాలి.. లేకుంటే మాట్లాడలేం' అన్నారు సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ. 69వ జాతీయ అవార్డుల్లో దక్షిణాది తరఫున జ్యూరీలో శ్రీలేఖతో పాటు రచయిత్రి బలభద్రపాత్రుని రమణి ఉన్నారు. మామూలుగా ఫైనల్ ప్యానల్లో భోజ్‌పురి వాళ్లు ఉంటారని శ్రీలేఖ తెలిపారు. వాళ్లకు తెలుగు రాదు అలాంటప్పుడు మహానటి సావిత్రి గురించి ఏం తెలుస్తుందని ఆమె గుర్తుచేశారు. అందుకే జ్యూరీలో ఉన్న తెలుగువారు తెలుగు సినిమాల గురించి గట్టిగా చెప్పాలని పేర్కొన్నారు. 'ఓ జ్యూరీ సభ్యురాలిగా నా అభిప్రాయాన్ని నేను బలంగా చెప్పాను. ఈసారి నేను ఏవైతే రావాలనుకున్నానో దాదాపు వాటికే వచ్చాయి. తొలిసారి తండ్రీ కొడుకులు కీరవాణి అన్నయ్య– కాలభైరవ ఒకే వేదికపై అవార్డులు తీసుకోనుండటం నాకో గొప్ప అనుభూతి.' అని ఎంఎం శ్రీలేఖ తెలిపారు. -
2022లో విడుదలైన సినిమాలకు 2021 అవార్డులా.. అదెలా?
2021 సంవత్సరానికిగాను జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తొలిసారి తెలుగు సినిమాలు దుమ్ము రేపాయి. తెలుగు సినిమా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా ఏంటో మరోసారి చూపించింది. గురువారం ప్రకటించిన 69వ జాతీయ పురస్కారాల్లో ఉత్తమ సినీ విమర్శకుడు విభాగంతో కలుపుకొని మొత్తంగా 11 పురస్కారాల్ని టాలీవుడ్ దక్కించుకుంది. 69 ఏళ్ల జాతీయ అవార్డుల చరిత్రలో తెలుగు నుంచి జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ రికార్డ్ సాధించారు. మరోవైపు ఆస్కార్ అవార్డుతో చరిత్ర సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’కు ఏకంగా ఆరు అవార్డులతో పతాకస్థాయిలో నిలిచింది. కానీ చాలామంది నెటిజన్లు 2022లో విడుదలైన సినిమాలకు 2021 అవార్డులా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు 2021 సంవత్సరంలో విడుదలైన సినిమాలకు సంబంధించినవి కానీ ఇందులో RRR (2022 మార్చి) , రాకెట్రీ సినిమా (2022 జులై), గంగూబాయ్ కాఠియావాడి సినిమా (2022 ఫిబ్రవరి) నెలలో విడుదలయ్యాయి. ఇందులో ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను 6 అవార్డులు, గంగూబాయ్ కాఠియావాడి సినిమాకు గాను ఉత్తమ నటిగా అలియా భట్‌కు అవార్డు దక్కింది. జాతీయ ఉత్తమ చిత్రం విభాగంలో రాకెట్రీ సినిమాకు దక్కింది. (ఇదీ చదవండి: ‘బెదురులంక 2012’మూవీ రివ్యూ) దీనిపై సమాచార, ప్రసార శాఖ అదనపు కార్యదర్శి నీర్జా శేఖర్‌ను పలువురు ప్రశ్నించారు. జాతీయ చలన చిత్ర అవార్డు నిబంధనల ప్రకారం 2021 జనవరి 1 నుంచి 2021 డిసెంబరు 31 నడుమ ఈ సినిమాలన్నీ ప్రభుత్వ అనుమతి రూల్స్ ప్రకారం సెన్సార్ సర్టిఫికెట్ పొందాయి.. కాబట్టి ఈ విధంగా విడుదలైన సినిమాలను 2021 సంవత్సరానికి సంబంధించిన చిత్రాలుగా పరిగణిస్తామని చెప్పారు. ఆర్ఆర్ఆర్ 2021 డిసెంబరులోనే సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చిందని, కాబట్టి ఆ చిత్రానికి 2021 సంవత్సరానికిగాను జాతీయ పురస్కారం దక్కినట్లు వచ్చినట్టు భావించవచ్చన్నారు. ఈ విధంగా విడుదలైన మిగిలిన చిత్రాలకూ కూడా ఇదే విధానం వర్తిస్తుందని నీర్జా శేఖర్ తెలిపారు. -
National film awards 2023 :అల్లు అర్జున్... ఉత్తమ నటుడు
జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తొలిసారి తెలుగు సినిమాలు దుమ్ము రేపాయి. మొత్తం పది అవార్డులతో ‘ఎత్తర జెండా’ అంటూ తెలుగు సినిమా సత్తా చాటింది. 69 ఏళ్ల జాతీయ అవార్డుల చరిత్రలో తెలుగు నుంచి జాతీయ ఉత్తమ నటుడిగా ‘పుష్ప... ఫైర్’ అంటూ అల్లు అర్జున్ రికార్డ్ సాధించారు. ఆస్కార్ అవార్డుతో చరిత్ర సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’ ఆరు అవార్డులతో సిక్సర్ కొట్టింది. వీటిలో ‘హోల్సమ్ ఎంటర్టైనర్’ అవార్డు ‘ఆర్ఆర్ఆర్’ సొంతం అయింది. 2021 జనవరి 1 నుంచి 2021 డిసెంబరు 31 లోపు సెన్సార్ అయి, అవార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న సినిమాలను పరిగణనలోకి తీసుకుని జ్యూరీ సభ్యులు అవార్డులను ప్రకటించడం జరిగింది. జాతీయ ఉత్తమ నటీమణులుగా ‘గంగూబాయి కతియావాడి’లో వేశ్య పాత్ర చేసిన ఆలియా భట్, ‘మిమి’ చిత్రంలో గర్భవతిగా నటించిన కృతీ సనన్ నిలిచారు. ఖగోళ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ఆర్. మాధవన్ టైటిల్ రోల్ చేసి, స్వీయదర్శకత్వంలో రూపొందించిన ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ ఉత్తమ చిత్రంగా, ఉత్తమ దర్శకుడిగా మరాఠీ ఫిల్మ్ ‘గోదావరి’కి గాను నిఖిల్ మహాజన్ అవార్డు సాధించారు. ఇంకా పలు విభాగాల్లో కేంద్ర ప్రభుత్వం గురువారం జాతీయ అవార్డులను ప్రకటించింది. ఆ విశేషాలు ఈ విధంగా... 69వ జాతీయ అవార్డులకు గాను 28 భాషలకు చెందిన 280 చలన చిత్రాలు పోటీపడ్డాయి. మొత్తం 31 విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. సుకుమార్ దర్శకత్వంలోని ‘పుష్ప: ది రైజ్’ సినిమాలోని నటనకుగాను అల్లు అర్జున్‌కు ఉత్తమ జాతీయ నటుడిగా తొలి అవార్డు లభించింది. ఇదే చిత్రానికి సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ జాతీయ అవార్డు సాధించారు. ఇక ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రౌద్రం..రణం..రుధిరం’ (ఆర్ఆర్ఆర్) సినిమాకు ఆరు విభాగాల్లో అవార్డులు దక్కాయి. జాతీయ హోల్సమ్ ఎంటర్టైనర్గా ‘ఆర్ఆర్ఆర్’ నిలిచింది. ఇదే చిత్రానికి ఉత్తమ నేపథ్య సంగీతానికి గాను ఎంఎం కీరవాణి, ఇదే చిత్రానికి స్పెషల్ ఎఫెక్ట్స్‌కి వి. శ్రీనివాస్ మోహనన్, ‘నాటు నాటు..’ పాట కొరియోగ్రఫీకి ప్రేమ్ రక్షిత్, ‘ఆర్ఆర్ఆర్’లోని ‘కొమురం భీముడో..’ పాటకు మేల్ ప్లే బ్యాక్ సింగర్‌గా కాలభైరవ, ఇదే చిత్రానికి స్టంట్ కొరియోగ్రాఫర్‌గా కింగ్ సాల్మన్లకు జాతీయ అవార్డులు దక్కాయి. ఇక ‘నాటు.. నాటు’కి రచయితగా తొలి ఆస్కార్ అవార్డు అందుకున్న చంద్రబోస్ ‘కొండపొలం’లోని ‘ధంధం ధం.. తిరిగేద్దాం...’ పాటకు జాతీయ అవార్డు అందుకోనున్నారు. దర్శకుడిగా తన తొలి చిత్రానికి జాతీయ అవార్డు దక్కిన ఆనందంలో ఉన్నారు ‘ఉప్పెన’ను తెరకెక్కించిన బుచ్చిబాబు సన. మైత్రీ మూవీ మేకర్స్‌పై వై. రవిశంకర్, నవీన్ ఎర్నేని నిర్మించిన ‘ఉప్పెన’ ప్రాంతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది. ఉత్తమ సినీ విమర్శకుడిగా నల్గొండ జిల్లాకి చెందిన ఎం. పురుషోత్తమాచార్యులకు అవార్డు దక్కింది. రెండేళ్లుగా ‘మిసిమి’ మాస పత్రికలో సినిమా పాటల్లో శాస్త్రీయ సంగీతంపై పరిశోధనలు చేస్తూ, పలు వ్యాసాలు రాశారు పురుషోత్తమాచార్యులు. ఇక ఆలియా భట్‌కి ‘గంగూబాయి కతియావాడి’ జాతీయ ఉత్తమ నటిగా అవార్డు దక్కేలా చేయడంతో పాటు మరో నాలుగు విభాగాల్లో (బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్, మేకప్, ఎడిటింగ్) అవార్డులు వచ్చేలా చేసింది. అలాగే విక్కీ కౌశల్ హీరోగా నటించిన బయోగ్రఫికల్ డ్రామా ‘సర్దార్ ఉద్దమ్’కు ప్రాంతీయ ఉత్తమ హిందీ చిత్రంతో పాటు మొత్తం నాలుగు విభాగాల్లో (సినిమాటోగ్రఫీ, ఆడియోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్ డిజైన్) అవార్డులు దక్కాయి. ఈ చిత్రానికి సూజిత్ సర్కార్ దర్శకుడు. తమిళ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కడైసీ వివసాయి’, మలయాళంలో ‘హోమ్’, కన్నడంలో ‘777 చార్లీ’ అవార్డులు గెలుచుకున్నాయి. ఇంకా పలు భాషల్లో పలు చిత్రాలకు అవార్డులు దక్కాయి. ఇదొక చరిత్ర – నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ అల్లు అర్జున్‌గారికి జాతీయ అవార్డు రావడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది. ఇదొక చరిత్ర ‘పుష్ప’ షూటింగ్ సమయంలోనే అల్లు అర్జున్ తప్పకుండా నేషనల్ అవార్డ్ కొడతారని సుకుమార్‌గారు అనేవారు.. అది ఈ రోజు నిజమైంది. మాకు ఇంత మంచి సినిమా ఇచ్చిన అల్లు అర్జున్, సుకుమార్ గార్లకు థ్యాంక్స్. దేవిశ్రీ ప్రసాద్‌కి జాతీయ అవార్డ్ రావడం హ్యాపీ. అలాగే మా ‘ఉప్పెన’కి ఉత్తమ తెలుగు సినిమాగా జాతీయ అవార్డు రావడం గర్వంగా ఉంది. దర్శకుడు బుచ్చిబాబు, టీమ్‌కి అభినందనలు. అలాగే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి ఆరు అవార్డులు రావడం సంతోషంగా ఉంది. – నవీన్ యెర్నేని, నిర్మాత మా మైత్రీ మూవీస్ బ్యానర్లో ‘ఉప్పెన, పుష్ప’ చాలా ప్రతిష్టాత్మక చిత్రాలు. జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడిగా అల్లు అర్జున్‌గారు చరిత్ర సృష్టించారు. తెలుగు సినిమా చరిత్రలో ఇది చిరకాలం గుర్తుండిపోతుంది. దేవిశ్రీ ప్రసాద్‌కి అవార్డు రావడం ఆనందంగా ఉంది. ‘ఉప్పెన, పుష్ప’ రెండు విజయాల్లో సింహ భాగం సుకుమార్గారిదే. ‘ఆర్ఆర్ఆర్, కొండపొలం’ చిత్రాలకు జాతీయ అవార్డులు రావడం ఆనందాన్నిచ్చింది. – వై. రవిశంకర్, నిర్మాత ‘‘నా తొలి సినిమాకే జాతీయ అవార్డు రావడం హ్యాపీగా ఉంది. నిర్మాతలు నవీన్‌గారికి, రవిగారికి, మా గురువుగారు సుకుమార్ గారికి కృతజ్ఞతలు. సినిమా చూడ్డానికి మా ఇంట్లో నన్ను పంపించేవాళ్లు కాదు. అలాంటిది నేను ఒక సినిమాకి డైరెక్ట్ చేయడం, నా ఫస్ట్ సినిమాకే నేషనల్ అవార్డు రావడం అంటే ఏం మాట్లాడాలో అర్థం కావడంలేదు. మా అమ్మగారికి నేషనల్ అవార్డు అంటే ఏంటో కూడా తెలియదు. ఈ అవార్డు గురించి ఆమెకి చెప్పాలంటే. ‘ఇండియాలోనే పెద్ద అవార్డు వచ్చింది’ అని చెప్పాలి’’ అంటున్న బుచ్చిబాబు సనని తదుపరి చిత్రం గురించి అడగ్గా.. ‘‘రామ్‌చరణ్‌గారి కోసం మంచి రా అండ్ రస్టిక్ స్టోరీ రాశాను. నా మనసుకి బాగా నచ్చి, రాసుకున్న కథ ఇది. జనవరిలో షూటింగ్ ఆరంభిస్తాం’’ అన్నారు. – బుచ్చిబాబు సన, దర్శకుడు పది అవార్డులతో తొలి రికార్డ్ ఈసారి తెలుగు పరిశ్రమ ఎక్కువ జాతీయ అవార్డులు సొంతం చేసుకోవడంతో పాటు మరో విశేషమైన రికార్డ్ సాధించింది. అదేంటంటే.. 27వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్‌లో ‘శంకరాభరణం’ (1980) సినిమాకు నాలుగు జాతీయ అవార్డులు లభించాయి. 30వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్‌లో ‘మేఘ సందేశం’ (1982)కి నాలుగు అవార్డులు వచ్చాయి. అలాగే ‘దాసి’ (1988) చిత్రం 36వ జాతీయ అవార్డ్స్‌లో ఐదు విభాగాల్లో అవార్డులను దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగు సినిమాలకు ఐదుకు మించి అవార్డులు రాలేదు. 35 ఏళ్లకు రెండు ఐదులు.. అంటే పది అవార్డులు దక్కించుకుని తెలుగు చిత్రసీమ తొలి రికార్డ్‌ని సాధించింది. 69వ చలనచిత్ర జాతీయ అవార్డు విజేతలు ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప) ఉత్తమ నటి: ఆలియా భట్ (గంగూబాయి..) – కృతీసనన్ (మిమీ) ఉత్తమ చిత్రం: రాకెట్రీ: ద నంబీ ఎఫెక్ట్ (హిందీ) ఉత్తమ దర్శకుడు: నిఖిల్ మహాజన్ (గోదావరి– మరాఠీ సినిమా) ఉత్తమ పిల్లల చిత్రం: గాంధీ అండ్ కో (గుజరాతీ) ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ (నేపథ్య సంగీతం): ఆర్ఆర్ఆర్æ– ఎమ్ఎమ్ కీరవాణి ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు): పుష్ప– దేవిశ్రీ ప్రసాద్ ఉత్తమ కొరియోగ్రఫీ: ఆర్ఆర్ఆర్ –ప్రేమ్ రక్షిత్ ఉత్తమ మేల్ ప్లేబ్యాక్ సింగర్: కాలభైరవ (ఆర్ఆర్ఆర్ – కొమురం భీముడో..) ఉత్తమ లిరిక్స్: చంద్రబోస్– కొండపొలం ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ అవార్డ్ (స్టంట్ కొరియోగ్రఫీ): ఆర్ఆర్ఆర్– కింగ్ సాల్మన్ ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: ఆర్ఆర్ఆర్– శ్రీనివాస్ మోహనన్ ఉత్తమ సహాయ నటి: పల్లవీ జోషి (ద కశ్మీరీ ఫైల్స్– హిందీ) ఉత్తమ సహాయ నటుడు: పంకజ్ త్రిపాఠీ (మిమీ– హిందీ) ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: ప్రీతిశీల్ సింగ్ డిసౌజా (గంగూబాయి కతియావాడి–హిందీ) ఉత్తమ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్: శ్రేయా ఘోషల్ (ఇరవిన్ నిళల్– తమిళ్) ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: వీరా కపూర్ ఏ (సర్దార్ ఉద్ధమ్–హిందీ) ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ : ది మిత్రీ మాలిక్ – మాన్సి ధ్రువ్ మెహతా (సర్దార్ ఉద్ధమ్) (హిందీ) ఉత్తమ ఎడిటింగ్: సంజయ్ లీలా భన్సాలీ (గంగూబాయి కతియావాడి–హిందీ) ఉత్తమ ఆడియోగ్రఫీ (లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్): అరుణ్ అశోక్ – సోనూ కేపీ (చవిట్టు మూవీ–మలయాళం) ఉత్తమ స్క్రీన్‌ప్లే(అడాప్టెడ్): సంజయ్‌లీలా భన్సాలీ, ఉత్కర్షిణి వశిష్ట (గంగూబాయి కతియావాడి– హిందీ) ఉత్తమ స్క్రీన్ ప్లే (ఒరిజినల్): షాహీ కబీర్ (నాయట్టు సినిమా–మలయాళం) ఉత్తమ స్క్రీన్ ప్లే (డైలాగ్ రైటర్): ప్రకాశ్ కపాడియా – ఉత్కర్షిణి వశిష్ట (గంగూబాయి కతియావాడి– హిందీ) ఉత్తమ సినిమాటోగ్రఫీ: అవిక్ ముఖోపాధ్యాయ్ (సర్దార్ ఉద్ధమ్ మూవీ–హిందీ) ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: భవిన్ రబరీ (ఛెల్లో షో – గుజరాతీ) ఉత్తమ ఫిలిం ఆన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ : అవషావ్యూహం (మలయాళం) ఉత్తమ ఫిలిం ఆన్ సోషల్ ఇష్యూస్: అనునాద్–ద రెజోనెన్ ్స (అస్సామీ) ఉత్తమ పాపులర్ ఫిలిం ఆన్ ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్ మెంట్: ఆర్ఆర్ఆర్ ఉత్తమ ఆడియోగ్రఫీ (సౌండ్ డిజైనర్): అనీష్ బసు (జీలీ మూవీ– బెంగాలీ) ఉత్తమ ఆడియోగ్రఫీ (రీ రికార్డిస్ట్ ఆఫ్ ద ఫైనల్ మిక్స్డ్ ట్రాక్): సినోయ్ జోసెఫ్ (సర్దార్ ఉద్ధమ్–హిందీ) ఇందిరాగాంధీ అవార్డ్ ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిలిం ఆఫ్ ఎ డైరెక్టర్: మెప్పాడియన్ (మలయాళం) స్పెషల్ జ్యూరీ అవార్డ్: షేర్ షా (హిందీ) (డైరెక్టర్ విష్ణువర్థన్) నర్గీస్ దత్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్: ద కశ్మీరీ ఫైల్స్ (హిందీ) ఉత్తమ ప్రాంతీయ చిత్రాలు ఉత్తమ తెలుగు చిత్రం : ఉప్పెన ఉత్తమ తమిళ్ చిత్రం : కడైసి వివసాయి (ద లాస్ట్ ఫార్మర్) ఉత్తమ కన్నడ చిత్రం : 777 చార్లి ఉత్తమ మలయాళ చిత్రం : హోమ్ ఉత్తమ హిందీ చిత్రం : సర్దార్ ఉద్దామ్ ఉత్తమ గుజరాతీ చిత్రం : లాస్ట్ ఫిల్మ్ షో (ఛెల్లో షో) ఉత్తమ మరాఠీ చిత్రం : ఏక్డా కే జాలా ఉత్తమ మీషింగ్ చిత్రం : బూంబా రైడ్ ఉత్తమ అస్సామీస్ చిత్రం : అనూర్ (ఐస్ ఆన్ ది సన్ షైన్) ఉత్తమ బెంగాలీ చిత్రం : కల్కొకో–హౌస్ ఆఫ్ టైమ్ ఉత్తమ మైథిలీ చిత్రం : సమాంతర్ ఉత్తమ ఒడియా చిత్రం : ప్రతీక్ష్య (ద వెయిట్) ఉత్తమ మెయిటిలాన్ చిత్రం : ఈఖోయిగీ యమ్ (అవర్ హోమ్) ‘పుష్ప’ చిత్రంలో నటనకుగాను అల్లు అర్జున్‌కి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కడం సంతోషం. తొలిసారి ఈ అవార్డు అందుకోనున్న అల్లు అర్జున్‌కి అభినందనలు. 69వ జాతీయ అవార్డులు తెలుగు చిత్ర పరిశ్రమకు బొనాంజాగా నిలిచాయి. అదే విధంగా పాన్ ఇండియా కాన్వాస్‌లో దూసుకుపోతున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి ఆరు విభాగాల్లో ఈ అవార్డులు దక్కటం ప్రశంసనీయం. డైరెక్టర్ రాజమౌళితో పాటు చిత్ర యూనిట్‌కి అభినందనలు. ఉత్తమ సంగీత దర్శకునిగా దేవీశ్రీ ప్రసాద్ (పుష్ప), ఉత్తమ సాహిత్యానికి చంద్రబోస్ (కొండపొలం) జాతీయ అవార్డుకు ఎంపికవడం అభినందనీయం. – వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. తెలుగు సినిమా గర్వపడే క్షణాలివి. జాతీయ ఉత్తమ నటుడిగా నిలిచిన బన్నీ (అల్లు అర్జున్)కి శుభాకాంక్షలు. చాలా గర్వంగా ఉంది. రాజమౌళి విజన్‌లో ఆరు అవార్డులు సాధించిన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌కు, రెండు అవార్డులు సాధించిన ‘పుష్ప’కు, ‘ఉప్పెన’ టీమ్‌కు, సినీ విమర్శకులు పురుషోత్తమచార్యులకు శుభాకాంక్షలు. – చిరంజీవి ఇట్స్ సిక్సర్.. జాతీయ అవార్డులు సాధించినందుకు ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ అందరికీ శుభాకాంక్షలు. ఎంపిక చేసిన జ్యూరీకి ధన్యవాదాలు. ‘పుష్ప’.. తగ్గేదేలే... బన్నీకి, దేవిశ్రీ ప్రసాద్‌లతో పాటు ‘పుష్ప’ టీమ్‌కి శుభాకాంక్షలు. బోస్ (చంద్రబోస్)గారికి మళ్లీ శుభాకాంక్షలు. ‘గంగూబాయి కతియావాడి’తో అవార్డు గెల్చుకున్న మా ‘సీత’ (‘ఆర్ఆర్ఆర్’లో ఆలియా భట్ సీత పాత్రలో నటించారు)కు కంగ్రాట్స్. ‘ఉప్పెన’ టీమ్‌తో పాటు జాతీయ స్థాయిలో అవార్డులు గెల్చుకున్నవారికీ శుభాకాంక్షలు. – రాజమౌళి నా నేపథ్య సంగీతాన్ని గుర్తించి, నాకు జ్యూరీ సభ్యులు అవార్డును ప్రకటించడాన్ని గౌరవంగా భావిస్తున్నాను . చంద్రబోస్‌గారికి, దేవిశ్రీ ప్రసాద్, కాలభైరవ.. మా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌కు శుభాకాంక్షలు. – కీరవాణి ఈ జాతీయ అవార్డు మీదే (సంజయ్ సార్, గంగూబాయి.. టీమ్.. ముఖ్యంగా ప్రేక్షకులు). ఎందుకంటే... మీరు లేకుంటే నాకు ఈ అవార్డు దక్కేదే కాదు. చాలా సంతోషంగా ఉంది. ఈ క్షణాలను గుర్తుపెట్టుకుంటాను. మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు ఇంకా కష్టపడతాను. ‘మిమి’ సినిమాలో నీ ( కృతీ సనన్ని ఉద్దేశించి) నటన నిజాయితీగా, పవర్‌ఫుల్‌గా ఉంది. ఆ సినిమా చూసి నేను ఏడ్చాను. ఉత్తమ నటి అవార్డుకు నువ్వు అర్హురాలివి. – ఆలియా భట్. ఏఏఏ 69 సంవత్సరాలుగా తెలుగు ఇండస్ట్రీకి రాని ఆ అద్భుతాన్ని తీసుకొచ్చిన ప్రేక్షకులకు, నిర్మాతలకు, దర్శకుడికి, ముఖ్యంగా మా ఫ్యామిలీని పతాకస్థాయికి తీసుకుని వెళ్లిన మా అబ్బాయికి (అల్లు అర్జున్ ) కృతజ్ఞతలు. – అల్లు అరవింద్ ఇంకా వెంకటేశ్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్ తదితరులు తమ ఆనందం వ్యక్తం చేశారు. పది అవార్డులతో తొలి రికార్డ్ ఈసారి తెలుగు పరిశ్రమ ఎక్కువ జాతీయ అవార్డులు సొంతం చేసుకోవడంతో పాటు మరో విశేషమైన రికార్డ్ సాధించింది. అదేంటంటే.. 27వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్‌లో ‘శంకరాభరణం’ (1980) సినిమాకు నాలుగు జాతీయ అవార్డులు లభించాయి. 30వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్‌లో ‘మేఘ సందేశం’ (1982)కి నాలుగు అవార్డులు వచ్చాయి. అలాగే ‘దాసి’ (1988) చిత్రం 36వ జాతీయ అవార్డ్స్‌లో ఐదు విభాగాల్లో అవార్డులను దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగు సినిమాలకు ఐదుకు మించి అవార్డులు రాలేదు. 35 ఏళ్లకు రెండు ఐదులు.. అంటే పది అవార్డులు దక్కించుకుని తెలుగు చిత్రసీమ తొలి రికార్డ్‌ని సాధించింది. ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ భారతదేశ ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త నంబియార్ నారాయణన్ జీవిత చరిత్ర ఆధారంగా ‘రాకెట్రీ: ‘ది నంబి ఎఫెక్ట్’ సినిమా రూపొందింది. ఇస్రోలో చేరిన నారాయణన్ స్వదేశీ రాకెట్లను అభివృద్ధి చేసే ప్రాజెక్ట్‌లో భాగంగా రష్యా డెవలప్ చేసిన క్రయోజెనిక్ ఇంజ¯Œ ్సని భారత్‌కి తీసుకురావాలనుకుంటారు. ఇదే సమయంలో పాకిస్తా¯Œ కు భారత రాకెట్ సాంకేతిక విషయాలను చేరవేశారనే నెపంతో అరెస్ట్ అవుతారు నారాయణన్. అరెస్ట్ తర్వాత కేరళ పోలీసుల విచారణలో ఆయన ఎలాంటి చిత్రహింసలు అనుభవించారు? ఆ తర్వాత ఆయన జీవితం ఎలా మలుపు తిరిగింది? తనపై వచ్చిన తప్పుడు ఆరోపణల నుంచి నారాయణన్ ఎలా విముక్తి పొందారు? అనే నేపథ్యంలో ‘రాకెట్రీ: ‘ది నంబి ఎఫెక్ట్’ సినిమా రూపొందింది. నంబియార్ నారాయణన్ పాత్ర చేయడంతో పాటు మాధవన్ దర్శకత్వం వహించారు. నారాయణన్ సతీమణి మీన క్యారెక్టర్లో హీరోయిన్ సిమ్రాన్ చక్కగా నటించారు. ప్రత్యేకించి ఆమె పండించిన భావోద్వేగాలు సినిమాకి హైలైట్. హీరో సూర్య అతిథి పాత్రలో మెరవడం కూడా ఈ సినిమాకి ప్లస్ అయ్యింది. ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. నా అభిప్రాయాన్ని బలంగా చెప్పాను – ఎంఎం శ్రీలేఖ ‘‘ప్రతి ఏడాది తెలుగు సినిమాలంటే కొంచెం నిర్లక్ష్యం. కంటి తుడుపుగా ఒకటో రెండో అవార్డులు ఇస్తున్నారు. దీనిపై జ్యూరీలో గట్టిగా మాట్లాడేవారు కావాలి. తెలుగుకు ఎందుకు ఇవ్వరు? అని మాట్లాడ గలగాలి. అయితే ఆ సినిమాలో విషయం ఉండాలి.. లేకుంటే మాట్లాడలేం’’ అన్నారు సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ. 69వ జాతీయ అవార్డుల్లో దక్షిణాది తరఫున జ్యూరీలో శ్రీలేఖతో పాటు రచయిత్రి బలభద్రపాత్రుని రమణి ఉన్నారు. అవార్డులు ప్రకటించిన అనంతరం ఎంఎం శ్రీలేఖ ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘‘మామూలుగా ఫైనల్ ప్యానల్లో భోజ్‌పురి వాళ్లు ఉంటారు. వారికి మహానటి సావిత్రి గురించి ఏం తెలుస్తుంది? అందుకే జ్యూరీలో ఉన్న తెలుగువారు తెలుగు సినిమాల గురించి గట్టిగా చెప్పాలి. ఓ జ్యూరీ సభ్యురాలిగా నా అభిప్రాయాన్ని నేను బలంగా చెప్పాను. ఈసారి నేను ఏవైతే రావాలనుకున్నానో దాదాపు వాటికే వచ్చాయి. తొలిసారి తండ్రీ కొడుకులు కీరవాణి అన్నయ్య– కాలభైరవ ఒకే వేదికపై అవార్డులు తీసుకోనుండటం నాకో గొప్ప అనుభూతి. ఇక జ్యూరీ సభ్యులకు ఒత్తిడి ఉంటుందనుకుంటారు.. అలాంటిదేమీ లేదు. నిజాయతీగా నాకు ఏది అనిపిస్తే అది చెప్పాను’’ అన్నారు. ఉప్పెన మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన హీరోల్లో వైష్ణవ్ తేజ ఒకరు. ఆయన నటించిన తొలి చిత్రం ‘ఉప్పెన’. ఈ సినిమా ద్వారా బుచ్చిబాబు సన డైరెక్టర్‌గా, కృతీశెట్టి హీరోయిన్గా పరిచయమయ్యారు. ఈ ముగ్గురూ తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నారు. సముద్ర తీరాన ఉప్పాడ అనే పల్లెటూరు. స్కూల్ డేస్ నుంచే బేబమ్మ (కృతీశెట్టి) మీద ఇష్టం పెంచుకున్న మత్స్యకార కుటుంబానికి చెందిన ఆశీర్వాదం (వైష్ణవ్ తేజ్) నిత్యం తననే ఆరాధిస్తూ ప్రేమిస్తుంటాడు. ప్రాణం కంటే పరువు ముఖ్యం అనుకునే పెద్ద మనిషి శేషారాయనం (విజయ్ సేతుపతి). ఆయన కూతురు బేబమ్మ కాలేజీలో చదువుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో తన మనసులోని ప్రేమను బేబమ్మకి చెబుతాడు ఆశీర్వాదం. తన స్వచ్ఛమైన ప్రేమను అర్థం చేసుకున్న బేబమ్మ కూడా ఆశీర్వాదాన్ని ప్రేమిస్తుంది. ఇద్దరూ ప్రేమలో ఉన్న విషయం శేషారాయనంకి తెలుస్తుంది. దీంతో ఆశీర్వాదం–బేబమ్మ కలిసి ఊరి నుంచి వెళ్లిపోతారు. ఈ విషయం బయటకి తెలిస్తే తన పరువు పోతుందని ఆర్నెళ్ల పాటు తన కూతుర ు ఇంట్లోనే ఉందని ఊరి జనాలను నమ్మిస్తాడు రాయనం. ఆరు నెలల తర్వాత అయినా బేబమ్మ ఇంటికి తిరిగొచ్చిందా? తన కులం కానివాడు తన కూతురిని ప్రేమించాడన్న కోపంతో ఆశీర్వాదంని శేషారాయనం ఏం చేశాడు? ఆశీర్వాదం–బేబమ్మ ప్రేమకథ ఎలాంటి మలుపు తీసుకుంటుంది? చివరికి వారిద్దరూ ఒక్కటయ్యరా ? లేదా అనేది ‘ఉప్పెన’ కథ. 2021 ఫిబ్రవరి 12న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. -
పనైపోయిందన్నారు.. కానీ వీళ్లిద్దరూ మాత్రం వేరే లెవల్!
ఏ సినిమా తీసుకున్నా.. హీరో, హీరోయిన్, డైరెక్టర్ ఇలా అందరూ కీలకమే. కానీ యాక్టర్స్ ఎంత ఫెర్ఫార్మ్ చేసినా సరే దానికి సరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ లేకపోతే అసలు ఆ సినిమాలో జీవమే ఉండదు. అలా గత కొన్ని దశాబ్దాల నుంచి ఎన్నో తెలుగు సినిమాలకు ప్రాణం పోసిన వాళ్ల లిస్ట్ తీస్తే అందులో కీరవాణి, దేవిశ్రీ ప్రసాద్ కచ్చితంగా ఉంటారు. ఇప్పుడు వాళ్లకు జాతీయ అవార్డులు రావడం మరింత ప్రత్యేకంగా నిలిచింది. (ఇదీ చదవండి: 'పుష్ప'కి జాతీయ అవార్డులు.. ఆ అంశాలే కలిసొచ్చాయా?) ఆస్కార్ ప్లస్ ఈ అవార్డ్ కీరవాణి పేరు చెప్పగానే అద్భుతమైన పాటలు, గూస్బంప్స్ తెప్పించే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గుర్తొస్తుంది. అప్పట్లో అందరూ హీరోల సినిమాలకు పనిచేసిన ఈయన.. కొన్నాళ్ల నుంచి మాత్రం ఎందుకో బయట సినిమాలు బాగా తగ్గించేశారు. ఒకవేళ చేసినా పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. కానీ బాహుబలి రెండు పార్ట్స్ తో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ఈయన.. 'ఆర్ఆర్ఆర్'లోని నాటు నాటు పాటతో ఆస్కార్ గెలిచారు. ఇప్పుడు అదే సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో జాతీయ అవార్డు సాధించారు. (ఇదీ చదవండి: 69వ జాతీయ సినిమా అవార్డులు ఫుల్ లిస్ట్) మాస్ కమ్‌బ్యాక్ మాస్, క్లాస్, రొమాంటిక్.. ఇలా ఏ పాటలకు ట్యూన్స్ కట్టాలన్నా అప్పట్లో దేవిశ్రీ ప్రసాద్ పేరు వినిపించేది. కానీ తమన్‌తోపాటు మిగతా సంగీత దర్శకుల హవా ఎక్కువ కావడంతో దేవిశ్రీ ప్రసాద్ క్రేజ్ పడిపోయింది. దీంతో చాలామంది డీఎస్పీ పనైపోయిందనుకున్నారు. కానీ 'పుష్ప' పాటలతో వరల్డ్ వైడ్ సెన్సేషన్ సృష్టించాడు. ఆ సాంగ్స్ వల్లే ఇప్పుడు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. సీనియర్ల అనుభవం అయితే పైన ఇద్దరికీ జాతీయ అవార్డులు రావడం విశేషమే. కానీ వీళ్ల గురించి జనాలు మెల్లమెల్లగా మరిచిపోతున్న టైంలో అవార్డులు గెలిచి చూపించారు. సీనియర్ల అనుభవం.. ఇలాంటప్పుడు ఎలా పనికొస్తుందనేది ప్రాక్టికల్ గా ప్రూవ్ చేసి చూపించారు. ఇప్పటి జనరేషన్ మాటల్లో చెప్పాలంటే.. ఇది కదా అసలైన కమ్‌బ్యాక్ అంటే అని అనొచ్చు. ఇక ఈ అవార్డులు ఇచ్చిన ఊపుతో రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలు చేస్తూ మంచి మ్యూజిక్ ఇవ్వాలని.. తెలుగు సంగీత ప్రియులు కోరుకుంటున్నారు. (ఇదీ చదవండి: సిక్స్ కొట్టిన ఆర్ఆర్ఆర్.. ప్చ్.. ఆ ముగ్గురికి రాలేదే!) -
సిక్స్ కొట్టిన ఆర్ఆర్ఆర్.. ప్చ్.. ఆ ముగ్గురికి రాలేదే!
ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజైనప్పటి నుంచి ఒకటే రికార్డుల మోత.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ.. అంతర్జాతీయ స్థాయిలో అవార్డుల పరంపర.. అబ్బో.. ఇలా చాలానే ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీ అత్యున్నత పురస్కారంగా భావించే ఆస్కార్ సైతం ఆర్ఆర్ఆర్ వశమైంది. జక్కన్న చెక్కిన ఈ కళాఖండానికి ప్రపంచవ్యాప్తంగా రీసౌండ్ వచ్చింది. ఇండియన్ సినిమాను చూసి హాలీవుడ్ సైతం నోరెళ్లబెట్టింది. అంతటి కీర్తిప్రతిష్టలు సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ తాజాగా 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లోనూ సత్తా చాటింది. అత్యధికంగా ఆర్ఆర్ఆర్కు 6 అవార్డులు రాగా పుష్ప సినిమాకు 2 అవార్డులు వచ్చాయి. ఆర్ఆర్ఆర్కు 6 అవార్డులు బెస్ట్ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ వోల్సమ్ ఎంటర్టైన్మెంట్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సినిమాకు జాతీయ అవార్డు దక్కింది. ఉత్తమ కొరియోగ్రఫీ విభాగంలో ప్రేమ్ రక్షిత్‌కు, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో వి.శ్రీనివాస్ మోహన్, ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్‌గా కీరవాణి, బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్‌గా కాలభైరవ, బెస్ట్ యాక్షన్ స్టంట్ కొరియోగ్రాఫర్‌గా కింగ్ సోలోమన్‌కు జాతీయ అవార్డులు ప్రకటించారు. ఉత్తమ నటుడిగా రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్లలో ఎవరో ఒకరికి పురస్కారం ప్రకటించడం ఖాయం అనుకున్నారు ఫ్యాన్స్. ఈ ముగ్గురిలో ఒక్కరికీ రాలే కానీ వారి అంచనాలను తారుమారు చేస్తూ పుష్పరాజ్ బన్నీకి కట్టబెట్టారు. అటు రాజమౌళి పరిస్థితి కూడా అంతే.. ఉత్తమ డైరెక్టర్‌గా ఈయన పేరు ప్రకటించడం ఖాయం అనుకుంటే మరాఠీ డైరెక్టర్ నిఖిల్ మహాజన్(గోదావరి సినిమా)కు పురస్కారం వరించింది. దీంతో అభిమానులు నిరాశ చెందారు. ముగ్గురు ఆర్లలో ఏ ఒక్కరికీ అవార్డు కైవసం కాలేదని ఫీలవుతున్నారు. వీళ్లు ఏళ్ల తరబడి పడిన కష్టం అవార్డు కమిటీకి కనిపించలేదా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జక్కన్నకు వచ్చినా బాగుండేది! ఆర్ఆర్ఆర్కు బోలెడన్ని అవార్డులు వచ్చాయి. సినిమాకు పనిచేసిన అందరినీ దాదాపు ఏదో ఒక అవార్డు వరించింది కానీ ఈ ముగ్గురికి మాత్రం ఒక్క పురస్కారం రాలేదు. వీళ్లకు ప్రపంచవ్యాప్తంగా పేరు, గుర్తింపు వచ్చిందే తప్ప అవార్డులు రావడం లేదెందుకని అభిమానులు తల పట్టుకుంటున్నారు. జక్కన్నకు వచ్చినా మనసు తృప్తి చేసుకునేవాళ్లమని అభిప్రాయపడుతున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా విషయానికి వస్తే.. రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్‌గా యాక్ట్ చేశారు. విజయేంద్రప్రసాద్ కథ అందించగా రాజమౌళి దర్శకత్వం వహించాడు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య దాదాపు రూ.500 కోట్ల పైచిలుకు భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. THE PROUD TEAM FLOURISHED AGAIN… 💥💥💥💥💥💥 It’s a SIXERRR at the National Awards 🔥🌊 #RRRMovie pic.twitter.com/GOjsY4IHRl — RRR Movie (@RRRMovie) August 24, 2023 చదవండి: జాతీయ అవార్డు.. బన్నీని పట్టుకుని కంటతడి పెట్టిన సుకుమార్ -
జాతీయ అవార్డుల్లో 'తెలుగు' హవా.. స్టార్స్ రియాక్షన్ ఇదే
69వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. 'ఆర్ఆర్ఆర్' సినిమా టీమ్ సిక్స్ కొట్టగా, 'పుష్ప' సినిమాకు రెండు అవార్డులు దక్కాయి. అలానే ఉత్తమ తెలుగు చిత్రంగా 'ఉప్పెన' నిలిచింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ నిలవడం 69 ఏళ్ల సినీ చరిత్రలో సరికొత్త రికార్డు అనే చెప్పొచ్చు. అలానే ఆస్కార్ కొట్టిన 'ఆర్ఆర్ఆర్' కూడా జాతీయ అవార్డుల్లో హవా చూపించింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్స్ అందరూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. వాటిపై మీరు ఓ లుక్ వేయండి. (ఇదీ చదవండి: జాతీయ సినిమా అవార్డులు పూర్తి జాబితా) Heartiest Congratulations to All The Award Winners of 69 th National Film Awards 2021 !!!! 👏👏👏 Also Proud Moment for Telugu Cinema 👏👏👏 Heartiest Congratulations to especially my dearest Bunny @AlluArjun for the coveted National Best Actor Award !!!!! Absolutely Proud of… — Chiranjeevi Konidela (@KChiruTweets) August 24, 2023 ప్రతిష్ఠాత్మక 69వ జాతీయ చలనచిత్ర అవార్డులను పొందిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ పేరుపేరునా నా హృదయపూర్వక అభినందనలు. -నందమూరి బాలకృష్ణ Warmest congratulations to all the recipients of the 69th National Film Awards in 2021! It's a big day for Telugu Cinema 🔥 Congratulations to Bunny on the much deserved win. Best Actor! So proud @alluarjun ❤️ Congrats to the "National Award winning composer" @ThisIsDSP 🎸🙌 — Venkatesh Daggubati (@VenkyMama) August 24, 2023 It’s a SIXERRR… Congratulations to the entire team of RRR on winning national awards. Thanks to the jury for the recognition..:) Bhairi, Prem Master, Peddanna, Srinivas Mohan garu, Solomon Master 🥰🥰 — rajamouli ss (@ssrajamouli) August 24, 2023 PUSHPAAAA… THAGGEDE LE. Congratulations Bunny…🥰🤗 — rajamouli ss (@ssrajamouli) August 24, 2023 Congratulations to my colleagues of #RRRMovie. @kaalabhairava7 you brought Komuram Bheemudo song to life with your voice. @mmkeeravaani garu, your background score for our film is the best and this award is another recognition for the same. Prem Master, every aching bone and… — Jr NTR (@tarak9999) August 24, 2023 Congratulations @aliaa08 and all the other winners of the national awards. You have made yourselves and your well wishers immensely proud. — Jr NTR (@tarak9999) August 24, 2023 So happy to see @alluarjun anna on winning the best actor national award! Such a proud moment! You truly deserve this!♥️#NationalAwards — Varun Tej Konidela (@IAmVarunTej) August 24, 2023 Congratulations to all the winners of the 69th national awards! Special mention to team RRR and Pushpa.@ssrajamouli sir you continue to make us proud.🙌🏽 And to buchi babu on winning the best regional film for uppena!👏🏽 Congrats to @ThisIsDSP , keeravani garu and @boselyricist . — Varun Tej Konidela (@IAmVarunTej) August 24, 2023 Many congratulations to the maverick @ssrajamouli garu and the team of #RRRMovie for winning big at the 69th National Awards! Your achievements are an inspiration to us all. My heartfelt best wishes and loads of love on this remarkable feat 👏🏼@AlwaysRamcharan @tarak9999… — Anil Ravipudi (@AnilRavipudi) August 24, 2023 THE PROUD TEAM FLOURISHED AGAIN… 💥💥💥💥💥💥 It’s a SIXERRR at the National Awards 🔥🌊 #RRRMovie pic.twitter.com/GOjsY4IHRl — RRR Movie (@RRRMovie) August 24, 2023 After ruling the box office, it is PUSHPA RAJ'S RULE at the #NationalAwards 🔥🔥 Icon Star @alluarjun BECOMES THE FIRST ACTOR FROM TFI to win the BEST ACTOR at the National Awards ❤️#AlluArjun Wins the Best Actor at the 69th National Awards for #Pushpa ❤️🔥#ThaggedheLe… pic.twitter.com/LqWnTcwpAe — Pushpa (@PushpaMovie) August 24, 2023 After ruling the box office, it is PUSHPA RAJ'S RULE at the #NationalAwards 🔥🔥 Icon Star @alluarjun BECOMES THE FIRST ACTOR FROM TFI to win the BEST ACTOR at the National Awards ❤️#AlluArjun Wins the Best Actor at the 69th National Awards for #Pushpa ❤️🔥#ThaggedheLe… pic.twitter.com/s3Wz2ObPKq — Mythri Movie Makers (@MythriOfficial) August 24, 2023 -
69 ఏళ్ల ఎదురుచూపులు.. ఎట్టకేలకు అవార్డు సాధించిన ఐకాన్ స్టార్
తెలుగు సినీ చరిత్రలో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. 69 ఏళ్లుగా మనకు కాకుండా పోయిన ఉత్తమ నటుడు అవార్డు తొలిసారి తెలుగు హీరోను వరించింది. 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడి కేటగిరీలో అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, సూర్య, ధనుష్, శింబు, ఆర్య, జోజు జార్జ్ పోటీపడ్డారు. వీరందరినీ వెనక్కు నెడుతూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తగ్గేదే లే అంటూ ఈ అవార్డు ఎగరేసుకుపోయాడు. పుష్ప 1 సినిమాకు గానూ ఆయనకు బెస్ట్ యాక్టర్‌గా జాతీయ అవార్డు వరించింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. దశాబ్ధాల తరబడి మనకు కాకుండా పోయిన పురస్కారాన్ని ఎట్టకేలకు బన్నీ సాధించాడని సంబరపడుతున్నారు. తెలుగు సినిమాలకు వచ్చిన మరిన్ని అవార్డులు ► ఉత్తమ చిత్రం - ఉప్పెన ► ఉత్తమ నటుడు - అల్లు అర్జున్ (పుష్ప 1) ► బెస్ట్ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ వోల్సమ్ ఎంటర్టైన్మెంట్ - ఆర్ఆర్ఆర్ ► ఉత్తమ యాక్షన్ డైరెక్షన్(స్టంట్ కొరియోగ్రఫీ) - కింగ్ సోలోమన్ (ఆర్ఆర్ఆర్) ► ఉత్తమ కొరియోగ్రఫీ - ప్రేమ్ రక్షిత్ (ఆర్ఆర్ఆర్) ► ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ - వి.శ్రీనివాస్ మోహన్ (ఆర్ఆర్ఆర్) ► ఉత్తమ లిరిక్స్- చంద్రబోస్ (ధమ్ ధమా ధమ్- కొండపొలం) ► ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్(సాంగ్స్) - దేవి శ్రీప్రసాద్ (పుష్ప 1) ► ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ (బ్యాగ్రౌండ్ స్కోర్) - ఎమ్ఎమ్ కీరవాణి (ఆర్ఆర్ఆర్) ► ఉత్తమ మేల్ ప్లేబ్యాక్ సింగర్ - కాల భైరవ (కొమురం భీముడో.. - ఆర్ఆర్ఆర్) ► బెస్ట్ తెలుగు ఫిలిం క్రిటిక్- పురుషోత్తమాచార్యులు చదవండి: 'ఆర్ఆర్ఆర్'కి జాతీయ అవార్డుల పంట.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ -
జాతీయ అవార్డుల్లో 'ఆర్ఆర్ఆర్' హవా.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్
69వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. చాలామంది ఊహించినట్లే.. ఉత్తమ నటుడు కేటగిరీలో అల్లు అర్జున్ అవార్డు గెలుచుకున్నాడు. తద్వారా 69 ఏళ్ల సినీ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా రికార్డ్ సృష్టించాడు. అలానే బోలెడెన్ని విభాగాల్లో మనవాళ్లు అవార్డులు గెలుచుకున్నారు. మరి ఇంతకీ ఏయే విభాగాల్లో ఎవరెవరికీ అవార్డులు గెలుచుకున్నారనేది ఫుల్ లిస్ట్ చూసేద్దాం. విభాగాల వారీగా అవార్డు గ్రహీతలు ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప) ఉత్తమ నటి: ఆలియా భట్ (గంగూబాయి) & కృతిసనన్ (మిమీ) ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి (ద కశ్మీరీ ఫైల్స్ - హిందీ) ఉత్తమ సహాయ నటుడు: పంకజ్ త్రిపాఠీ (మిమీ- హిందీ) ఉత్తమ దర్శకుడు: నిఖిల్ మహాజన్ (గోదావరి - మరాఠీ సినిమా) ఉత్తమ సంగీత దర్శకుడు (సాంగ్స్): పుష్ప- దేవిశ్రీ ప్రసాద్ ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ (బీజీఎమ్) : ఆర్ఆర్ఆర్- ఎమ్.ఎమ్ కీరవాణి బెస్ట్ ఫీచర్ ఫిలిం: రాకెట్రీ: ద నంబీ ఎఫెక్ట్ (హిందీ) ఉత్తమ పిల్లల చిత్రం: గాంధీ & కో (గుజరాతీ) ఉత్తమ కొరియోగ్రఫీ: ఆర్ఆర్ఆర్-ప్రేమ్ రక్షిత్ ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: ప్రీతిశీల్ సింగ్ డిసౌజా (గంగూబాయి కతియావాడి) ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: ఆర్ఆర్ఆర్-శ్రీనివాస్ మోహన్ బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్: శ్రేయా ఘోషల్ (ఇరవిన్ నిహాల్ - తమిళ మూవీ) బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్: కాలభైరవ (ఆర్ఆర్ఆర్ - కొమురం భీముడో) ఉత్తమ లిరిక్స్: చంద్రబోస్-కొండపొలం మూవీ (తెలుగు) ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ అవార్డ్(స్టంట్ కొరియోగ్రఫీ): ఆర్ఆర్ఆర్- కింగ్ సోలమన్ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: వీరా కపూర్ ఏ (సర్దార్ ఉద్దామ్-హిందీ) ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: దిమిత్రీ మాలిక్ & మాన్సి ధ్రువ్ మెహతా (సర్దార్ ఉద్దామ్) ఉత్తమ ఎడిటింగ్: సంజయ్ లీలా భన్సాలీ (గంగూబాయి కతియావాడి మూవీ) బెస్ట్ ఆడియోగ్రఫీ (లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్): అరుణ్ అశోక్ & సోనూ కేపీ (చవిట్టు మూవీ-మలయాళం) బెస్ట్ ఆడియోగ్రఫీ (సౌండ్ డిజైనర్) : అనీష్ బసు (జీలీ మూవీ- బెంగాలీ) బెస్ట్ ఆడియోగ్రఫీ (రీరికార్డిస్ట్ ఆఫ్ ద ఫైనల్ మిక్స్డ్ ట్రాక్): సినోయ్ జోసెఫ్ (సర్దార్ ఉద్దామ్-హిందీ) బెస్ట్ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్): షాహీ కబీర్ (నాయట్టు సినిమా-మలయాళం) బెస్ట్ స్క్రీన్‌ప్లే (డైలాగ్ రైటర్) : ప్రకాశ్ కపాడియా & ఉత్కర్షిణి వశిష్ట (గంగూబాయి కతియావాడి) బెస్ట్ సినిమాటోగ్రఫీ: అవిక్ ముఖోపాధ్యాయ్ (సర్దార్ ఉద్దామ్ మూవీ-హిందీ) ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: భవిన్ రబరీ (ఛెల్లో షో - గుజరాతీ సినిమా) బెస్ట్ ఫిలిం ఆన్ ఎన్వైర్మెంట్ కంజర్వేషన్: అవషావ్యూహం (మలయాళం) బెస్ట్ ఫిలిం ఆన్ సోషల్ ఇష్యూస్: అనునాద్-ద రెజోనెన్స్ (అస్సామీస్) బెస్ట్ పాపులర్ ఫిలిం ఆన్ ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్: ఆర్ఆర్ఆర్ ఇందిరాగాంధీ అవార్డ్ ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిలిం ఆఫ్ ఎ డైరెక్టర్: మెప్పాడియన్ (మలయాళం) స్పెషల్ జ్యూరీ అవార్డ్: షేర్ షా (హిందీ సినిమా) నర్గీస్ దత్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్: ద కశ్మీరీ ఫైల్స్ (హిందీ) భాషల వారీగా ఉత్తమ చిత్రాలు బెస్ట్ మీషింగ్ ఫిల్మ్: బూంబా రైడ్ బెస్ట్ అస్సామీస్ ఫిల్మ్: అనుర్ బెస్ట్ బెంగాలీ ఫిల్మ్: కల్కొకో-హౌస్ ఆఫ్ టైమ్ బెస్ట్ హిందీ ఫిల్మ్: సర్దార్ ఉద్దామ్ బెస్ట్ గుజరాతీ ఫిల్మ్: లాస్ట్ ఫిల్మ్ షో బెస్ట్ కన్నడ ఫిల్మ్: చార్లి 777 బెస్ట్ మైథిలీ ఫిల్మ్: సమాంతర్ బెస్ట్ మరాఠీ ఫిల్మ్: ఏక్ దా కై ఝాలా బెస్ట్ మలయాళ ఫిల్మ్: హోమ్ బెస్ట్ మెయిటెయిలోన్ ఫిల్మ్: ఏక్ హోయిగీ యమ్ (అవర్ హౌమ్) బెస్ట్ ఒడియా ఫిల్మ్: ప్రతిక్ష్య (ద వెయిట్) బెస్ట్ తమిళ్ ఫిల్మ్: కడైసి వివసై (ద లాస్ట్ ఫార్మర్) బెస్ట్ తెలుగు ఫిల్మ్: ఉప్పెన నాన్ ఫీచర్ ఫిలింస్ బెస్ట్ నాన్ ఫీచర్ ఫిల్మ్: ఏక్ థా గావ్ (గర్హివాలీ - హిందీ) బెస్ట్ వాయిస్ ఓవర్: కులదా కుమార్ భట్టాచారి (హాథీ బందూ) బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్: ఇషాన్ దీవేచా (సక్కలెంట్) బెస్ట్ ఎడిటింగ్: అబ్రో బెనర్జీ (ఇఫ్ మెమొరీ సెర్వ్స్ మీ రైట్) బెస్ట్ ఆన్‌లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్: సురుచి శర్మ (మీన్ రాగా) బెస్ట్ ఆడియోగ్రఫీ(ఫైనల్ మిక్స్డ్ ట్రాక్): ఉన్ని కృష్ణన్ (ఏక్ థా గావ్) బెస్ట్ సినిమాటోగ్రఫీ: బిట్టూ రావత్ (పాతాళ్ తీ) ఉత్తమ డైరెక్షన్: బకుల్ మతియానీ (స్మైల్ ప్లీజ్) ఉత్తమ కుటుంబ కథా చిత్రం: చాంద్ సాన్సీ (హిందీ) ఉత్తమ షార్ట్ ఫిక్షన్ ఫిలిం: దాల్ బాత్ (గుజరాతీ) స్పెషల్ జ్యూరీ అవార్డ్: రేఖా మూవీ (మరాఠీ) బెస్ట్ ఏనిమేషన్ ఫిల్మ్: కండిట్టుండూ (మలయాళం) బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ ఫిలిం: లుకింగ్ ఫర్ చలాన్ (ఇంగ్లీష్) బెస్ట్ ఎక్స్‌ప్లోరేషన్ ఫిలిం: ఆయుష్మాన్ (ఇంగ్లీష్-కన్నడ) బెస్ట్ ఎడ్యుకేషనల్ ఫిలిం: సిర్పంగిలన్ సిర్పంగల్ (తమిళం) బెస్ట్ ఫిలిం ఆన్ సోషల్ ఇష్యూస్(షేర్డ్): మీతూ దీ (ఇంగ్లీష్) & త్రీ టూ వన్ (మరాఠీ-హిందీ) బెస్ట్ ఎన్వైర్మెంట్ ఫిలిం: మున్నం వలవు (మలయాళం) బెస్ట్ ప్రమోషనల్ ఫిలిం: వర్లీ ఆర్ట్ (ఇంగ్లీష్) బెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫిలిం: ఇథోస్ ఆఫ్ డార్క్నెస్ (హిందీ-బెంగాలీ) బెస్ట్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఫిలింస్: టీఎన్ కృష్ణన్ బౌ స్ట్రింగ్స్ టూ డివైన్ బెస్ట్ బయోగ్రాఫికల్ ఫిలిం(షేర్డ్): రుఖు మతిర్ దుఖు మహీ (బెంగాలీ) & బియాండ్ బ్లాస్ట్ (మణిపురి) బెస్ట్ ఎత్నోగ్రాఫిక్ ఫిలిం: ఫైర్ ఆన్ ఎడ్జ్ (టివా) బెస్ట్ డెబ్యూ నాన్ ఫియేచర్ ఫిలిం ఆఫ్ ఎ డైరెక్టర్: పాంచిక (గుజరాతీ- డైరెక్టర్ అంకిత్ కొఠారీ)