2021 సంవత్సరానికిగాను జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తొలిసారి తెలుగు సినిమాలు దుమ్ము రేపాయి. తెలుగు సినిమా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా ఏంటో మరోసారి చూపించింది. గురువారం ప్రకటించిన 69వ జాతీయ పురస్కారాల్లో ఉత్తమ సినీ విమర్శకుడు విభాగంతో కలుపుకొని మొత్తంగా 11 పురస్కారాల్ని టాలీవుడ్ దక్కించుకుంది. 69 ఏళ్ల జాతీయ అవార్డుల చరిత్రలో తెలుగు నుంచి జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ రికార్డ్ సాధించారు. మరోవైపు ఆస్కార్ అవార్డుతో చరిత్ర సృష్టించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’కు ఏకంగా ఆరు అవార్డులతో పతాకస్థాయిలో నిలిచింది.
కానీ చాలామంది నెటిజన్లు 2022లో విడుదలైన సినిమాలకు 2021 అవార్డులా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు 2021 సంవత్సరంలో విడుదలైన సినిమాలకు సంబంధించినవి కానీ ఇందులో RRR (2022 మార్చి) , రాకెట్రీ సినిమా (2022 జులై), గంగూబాయ్ కాఠియావాడి సినిమా (2022 ఫిబ్రవరి) నెలలో విడుదలయ్యాయి. ఇందులో ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు గాను 6 అవార్డులు, గంగూబాయ్ కాఠియావాడి సినిమాకు గాను ఉత్తమ నటిగా అలియా భట్‌కు అవార్డు దక్కింది. జాతీయ ఉత్తమ చిత్రం విభాగంలో రాకెట్రీ సినిమాకు దక్కింది.
(ఇదీ చదవండి: ‘బెదురులంక 2012’మూవీ రివ్యూ)
దీనిపై సమాచార, ప్రసార శాఖ అదనపు కార్యదర్శి నీర్జా శేఖర్‌ను పలువురు ప్రశ్నించారు. జాతీయ చలన చిత్ర అవార్డు నిబంధనల ప్రకారం 2021 జనవరి 1 నుంచి 2021 డిసెంబరు 31 నడుమ ఈ సినిమాలన్నీ ప్రభుత్వ అనుమతి రూల్స్ ప్రకారం సెన్సార్ సర్టిఫికెట్ పొందాయి.. కాబట్టి ఈ విధంగా విడుదలైన సినిమాలను 2021 సంవత్సరానికి సంబంధించిన చిత్రాలుగా పరిగణిస్తామని చెప్పారు. ఆర్‌ఆర్‌ఆర్ 2021 డిసెంబరులోనే సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చిందని, కాబట్టి ఆ చిత్రానికి 2021 సంవత్సరానికిగాను జాతీయ పురస్కారం దక్కినట్లు వచ్చినట్టు భావించవచ్చన్నారు. ఈ విధంగా విడుదలైన మిగిలిన చిత్రాలకూ కూడా ఇదే విధానం వర్తిస్తుందని నీర్జా శేఖర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment