69th National Film Awards
-
అల్లు అర్జున్ 'పుష్ప'గాడికి రెండేళ్లు.. ఆశ్చర్యం కలిగించే రికార్డ్స్
సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'పుష్ప' 2021 డిసెంబర్ 17న పాన్ ఇండియా రేంజ్లో విడుదలైంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా కోసం సుమారు రూ. 170 కోట్లు ఖర్చు చేసినట్లు నివేదికలు ఉన్నాయి. బన్నీ- రష్మిక మందన్నల యాక్టింగ్ ఈ సినిమా విజయానికి బలమైన కారణమైతే.. సినిమా చివరి భాగంలో ఫహద్ ఫాజిల్ పాత్ర హైలెట్‌గా నిలిచింది. ప్రముఖ హీరోయిన్ సమంత ఈ సినిమా కోసం 'ఉ అంటావా... ఊ ఊ అంటావా..' పాటలో ప్రత్యేకంగా కనిపించింది. ఇలా పుష్ప సినిమాకు ఎన్నో అదనపు ఆకర్షణలతో విడుదలై.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారుగా రూ. 373 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. నేటికి (డిసెంబర్ 17) ఈ సినిమా విడదులై రెండు ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డులతో పాటు పలు ఆసక్తకరమైన విషయాలు మరోసారి గుర్తుచేసుకుందాం. ► అల్లు అర్జున్‌కు పుష్ప తొలి పాన్ ఇండియా సినిమా.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల చేశారు. ► ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగిన ఈ సినిమా నిడివి 2: 59 గంటలు. 'పుష్ప' అత్యధిక భాగం అడవుల్లోనే షూట్ చేశారు. అందుకోసం మారేడుమిల్లి అడవులను ఎంపిక చేసుకున్నారు. ► అల్లు అర్జున్ 'పుష్ప' గెటప్‌లో రెడీ అయ్యేందుకు మేకప్ కోసం దాదాపు రెండు గంటల సమయం పట్టేదని బన్నీ చెప్పాడు. తెల్లవారుజామున 4.30 నిద్రలేచి సెట్‌కు వెళ్లితే.. ఉదయం 5 నుంచి 7 వరకూ మేకప్ కోసమే సమయం పట్టేదట. షూటింగ్ పనులు పూర్తయ్యాక మేకప్ తీయడానికి 30 నిమిషాల సమయం పట్టేదని బన్నీ గతంలో చెప్పాడు. ► ఈ సినిమాలోని పాటలు అన్నీ కలిపి యూట్యూబ్‌లో 7బిలియన్ వ్యూస్ సాధించాయి. అంటే 700కోట్ల మంది వీక్షించారు. ఇండియాలో ఈ రికార్డు సాధించిన తొలి చిత్రంగా పుష్ప రికార్డుకెక్కింది. ► యూట్యూబ్ 'టాప్ 100 గ్లోబల్ సాంగ్స్' జాబితాలో 'ఊ అంటావా మావ.. ఊఊ అంటావా!' పాట మొదటి స్థానంలో నిలవగా.. 'సామీ సామీ' పాట రెండో స్థానం దక్కించుకుంది. దాక్కో దాక్కో మేక 24వ స్థానంలో ఉంటే శ్రీవల్లి సాంగ్ 74వ ప్లేసులో నిలిచింది. ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా అనే పాట మాత్రం 97వ స్థానంలో నిలిచింది. ► 'ఆర్య'తో బన్నీకి సూపర్ హిట్ ఇచ్చిన సుకుమార్.. దాదాపు పదేళ్ల తర్వాత 'పుష్ప' కోసం మళ్లీ వాళ్లిద్దరూ ఈ ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపారు. ► ప్రపంచవ్యాప్తంగా పుష్ప రూ.373కోట్లు (గ్రాస్) వసూలు చేసింది. ఒక్క హిందీలోనే రూ.108 కోట్లు (నెట్) కలెక్షన్లు రాబట్టడం విశేషం. 2021లో విడుదలైన చిత్రాల్లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప రికార్డు క్రియేట్ చేసింది. ►ఓటీటీలోనూ 'పుష్ప' గాడు దుమ్ములేపాడు. 2022లో అమెజాన్ప్రైమ్ వీడియోలో అత్యధికమంది వీక్షించిన మూవీగా నిలిచింది. టెలివిజన్‌లోనూ పుష్పరాజ్ ఏమాత్రం తగ్గలేదు. 2022లో అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధించిన చిత్రంగా పుష్ప నిలిచింది. అప్పట్లో 10మిలియన్+ ఇన్‌స్టా రీల్స్ క్రియేట్ చేసి ఇండియాలో పుష్పతో ఇన్‌స్టాగ్రామ్‌నే షేక్ చేశాడు. ► అవార్డుల విషయంలోనూ 'తగ్గేదేలే' అంటూ దూసుకుపోయాడు. ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు ఏడు సైమా అవార్డులు ఈ చిత్రానికి దక్కాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ గీత రచయిత, ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డులు వచ్చాయి. ► ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్- 2022 పుష్పకు దక్కింది ► పుష్ప సినిమాకు రెండు జాతీయ అవార్డులు దక్కాయి. ఉత్తమ హీరోగా అల్లు అర్జున్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్‌కు దక్కాయి. ► 7 ‘సాక్షి ఎక్సలెన్స్’ అవార్డ్స్‌ను దక్కించుకున్న పుష్ప. -
69th National Film Awards: జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో అలియా,రణబీర్ సందడి (ఫొటోలు)
-
ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్న అల్లు అర్జున్
-
మంచు విష్ణుకు నా కృతజ్ఞతలు: అల్లు అర్జున్
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ నటుడిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉత్తమ నటుడి అవార్డును అందుకున్న మొదటి నటుడిగా బన్నీ చరిత్ర సృష్టించారు. దీంతో ఇప్పటికే చాలామంది ప్రముఖులు బన్నీకి శుభాకాంక్షలు తెలిపారు. ‘పుష్ప’ సినిమాలో నటనకిగానూ బన్నీ ఈ అవార్డును గెలుచుకున్నారు. ఈ సందర్భంగా తాజాగా అల్లు అర్జున్ను అభినందిస్తూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఒక లేఖ విడుదల చేశారు. (ఇదీ చదవండి: 20 ఏళ్ల క్రితం జరిగిన యదార్థ ఘటన ఆధారంగా త్రిష సినిమా) బన్నీ గురించి విష్ణు రాసిన లేఖ 'డియర్ అల్లు అర్జున్, మీరు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. ‘పుష్ప’ చిత్రంలో మీరు అద్భుతంగా నటించారు. అందుకు గాను దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డు మిమ్మల్ని వరించింది. ఈ సంతోష సమయంలో మీకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ అవార్డు వెనుక మీ కృషి ఎంతో ఉంది. అంకితభావంతో పనిచేశారు. ఈ గుర్తింపునకు మీరు ఎంతో అర్హుడు. మీరు సాధించిన విజయం మీ అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఎనలేని గౌరవాన్ని తీసుకురావడమే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా గొప్ప పేరును తీసుకొచ్చారు. మీరు సాధించిన విజయం మన తెలుగు పరిశ్రమలో సమర్థతకు కొత్త నిదర్శనం. ఈ విజయంతో ఇతర తెలుగు నటీనటులు జాతీయ వేదికపై అలాంటి గుర్తింపు కోసం ఆకాంక్షించేలా మీరు నిరూపించారు.ప్రస్తుతం నేను విదేశాల్లో ఉన్నాను. ఇలాంటి ఆనంద సమయంలో నేను హైదరాబాద్‌లో లేనందున మీకు వ్యక్తిగతంగా అభినందనలు తెలియజేయలేకపోతున్నాను. కానీ సెప్టెంబర్ 17వ తేదీన తిరిగి హైదరాబాద్‌కు వస్తున్నాను. మిమ్మల్ని వ్యక్తిగతంగా కలుసుకుని నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.' అని మంచు విష్ణు పేర్కొన్నారు. ఈ లేఖకు అల్లు అర్జున్ కూడా స్పందించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, మంచు విష్ణుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. మంచు విష్ణు తెలిపిన ప్రశంసలు తన మనసును హత్తుకున్నాయన్నాయని బన్నీ తెలిపారు. త్వరలోనే వ్యక్తిగతంగా కలుసుకుందామని అల్లు అర్జున్ పేర్కొన్నారు. I thank the Movie Artist Association & the President @iVishnuManchu garu for this beautiful letter . Touched by the warm compliment. Looking fwd to share the rest in person . Warm Regards . pic.twitter.com/xYkS9gCvoG — Allu Arjun (@alluarjun) September 9, 2023 -
అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన అల్లు అర్జున్
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో జాతీయ అవార్డును గెలుచుకోవడమే కాకుండా టాలీవుడ్లో ఈ ఘనత సాధించిన మొదటి హీరోగా గుర్తింపు పొందాడు. అలా తన అభిమానులను గర్వించేలా చేశాడు. దీంతో దేశవ్యాప్తంగా ఆయన హెడ్‌లైన్స్‌లో నిలిచాడు. అయితే, పుష్ప 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆ ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఆయన తాజాగా ఓ వీడియోతో అభిమానులను సర్ప్రైజ్ చేశారు. (ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాజమౌళి) అభిమానుల కోసం సర్ప్రైజ్ ఇస్తున్నామని ముందే చెప్పి అనుకున్నట్లుగానే అంతకు మించిన స్పెషల్ వీడియోను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసి సర్ప్రైజ్ చేశాడు. అల్లు అర్జున్ రోజువారి దినచర్య ఎలా ఉంటుందో వాయిస్ రూపంలో చెబుతూ ఒక వీడియోను రూపొందించారు. బన్నీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 22 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆయనకు జాతీయ అవార్డు రావడంతో ఇప్పటికే ఆనందంలో ఉన్నారు ఫ్యాన్స్.. (ఇదీ చదవండి: అల్లు అర్జున్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా.. టాలీవుడ్లో టాప్ బన్నీనే) పార్టీ లేదా పుష్ప..? అనేవారికి ఈ వీడియోతో ఫిదా చేశాడు బన్నీ. అది కూడా అభిమానులకు కిక్కిచ్చేలా ఉంది. అంతలా దీనిని డిజైన్ చేశారు. ఇక ఈ వీడియో విషయంలోకి వెళ్తే.. అల్లు అర్జున్ ముందుగా తన ఇంటిని చూపిస్తూ.. ఉదయం నిద్రలేచిన తర్వాత నుంచి దినచర్య అంతా చెప్పుకొచ్చారు. ఆపై పుష్ప 2 సెట్లో ఏం జరుగుతుందో సుకుమార్‌తో పంచుకున్నాడు. చాలా స్పెషల్‌గా ఉన్న ఈ వీడియో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఇక పుష్ప 2 విషయానికి వస్తే.. వచ్చే ఏడాది మార్చి 22న సినిమా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. -
నిన్ను చూసి దేశం గర్విస్తుంది: అల్లు అర్జున్
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లొ 88.17 మీటర్లు ఈటెను విసిరి పురుషుల జావెలిన్ త్రో విజేతగా నిలిచాడు. స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు. మరోసారి తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు . ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో పాకిస్థాన్‌కు చెందిన త్రోయర్ అర్షద్ నదీమ్ (87.82 మీటర్లు) రజతం నెగ్గగా. ఈ పోటీలో నీరజ్ చోప్రాకు గట్టిపోటీ ఇచ్చాడని చెప్పవచ్చు. (ఇదీ చదవండి: ఈ ఆనంద సమయంలో మీరు లేరు.. తారకరత్నను గుర్తుచేసుకున్న ఆలేఖ్య) ఆ తర్వాత చెక్కు చెందిన వద్లెచ్ (86.67 మీటర్లు) కాంస్యం దక్కించుకున్నాడు. ఇప్పటికే చంద్రయాన్-3 సూపర్ విజయంతో ప్రపంచానికి తన సత్తా చాటిన భారత్ తాజాగ నీరజ్ చోప్రా ఈ విజయంతో మన జాతీయ జెండాను విశ్వవేదికపై మరోసారి ఎగురవేశాడు. ఈ ఆనంద సమయంలో టాలీవుడు నుంచి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. నీరజ్ చోప్రాకు శుభాకాంక్షలు అందించాడు. ఈ రేస్‌లో మొదటిసారి భారత్‌కు స్వర్ణం అందించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ విజయం దేశం గర్వించతగినదని బన్నీ అన్నారు. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) Fenkon toh aise fenko ki chaar log bole Kya fekta hai yaar. 88.17 mtr door Bhaala phenka and a World Athletics Championship Gold for our Champion #NeerajChopra . The mega run continues .pic.twitter.com/9TOFl4P6uM — Virender Sehwag (@virendersehwag) August 28, 2023 Neeraj Chopra is the GOAT 🇮🇳 First Indian to win a Gold Medal in the World Athletics Championships....!!!!!!pic.twitter.com/SyE0TtzDsX — Johns. (@CricCrazyJohns) August 27, 2023 -
అల్లు అర్జున్‌కే అవార్డు అని ముందే హింట్ ఇచ్చిన రష్మిక.. వీడియో వైరల్
టాలీవుడ్ సినీ చరిత్రలో ఎవరికీ సాధ్యపడని రికార్డును పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రియేట్ చేశాడు. 69 ఏళ్ల జాతీయ పురస్కారాల చరిత్రలో ఎవరికీ దక్కని గౌరవం బన్నీకి దక్కింది. ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్న తొలి నటుడు ఆయనే అని ప్రకటన వచ్చాక. ఆయన షాక్‌కు గురయ్యాను అని కామెంట్ చేశారు. అంతలా ఈ అవార్డుకు ప్రాధాన్యత ఉంది. అల్లు అర్జున్‌కు అవార్డు దక్కడంతో డైరెక్టర్ సుకుమార్,మైత్రి మూవీ మేకర్స్ వారు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. (ఇదీ చదవండి: చిరంజీవి 'చూడాలని ఉంది' సినిమాకు 25 ఏళ్లు.. ఈ విషయాలు తెలుసా?) పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఐకాన్ స్టార్‌గా ఎదిగాడు... ఇందులో నటించిన రష్మిక నేషనల్ క్రష్‌గా గుర్తింపు దక్కించుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో శ్రీవల్లీగా ఆమె నటన బాగా మెప్పిస్తుంది. పార్ట్-2లో శ్రీవల్లీ విశ్వరూపం మరో రేంజ్లో ఉంటుందని ఇప్పటికే సుకుమార్ కూడా తెలిపారు. తాజాగ అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కడంతో గతంలో పుష్ప సక్సెస్ మీట్లో రష్మిక మాటలు మళ్లీ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: బాయ్ ఫ్రెండ్ వల్ల నరకం అనుభవించాను: రోహిణి) పుష్ప సినిమా కోసం బన్నీ చాలా కష్టపడ్డాడని అప్పట్లో సక్సెస్ మీట్లో నేషనల్ అవార్డు గురించి రష్మిక ఇలా చెప్పింది. 'నేనైతే చెప్తున్నానండి.. పుష్పగారికి ఈసారి నేషనల్ అవార్డే కాదు.. ప్రతీ అవార్డు తప్పకుండా వస్తుంది. రాకపోతే మొదట హర్ట్ అయ్యేది నేనే అండి. ఆ స్క్రీన్ మీద ఆయన చేసిన ఫర్ఫార్మెన్స్ వల్ల సినిమాను మరో స్థాయికి తీసుకుపోయింది. కేవలం మేకప్ కోసమే ఆయనకు ప్రతిరోజు సుమారు 3గంటల సమయం పడుతుండేది. ఆ కష్టానికి ప్రతిఫలం ఉంటుంది.' అని రష్మిక పేర్కొంది. తాజాగ ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డు వస్తుందని రష్మిక అందరి కంటే ముందుగా ఎప్పుడో చెప్పిందని ఆయన ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Filmy Grammm (@filmygrammm) -
బన్నీకి ఉపాసన,చరణ్ స్పెషల్ గిఫ్ట్.. టచ్ చేశారంటూ అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు వరించిన వెంటనే టాలీవుడ్ స్టార్స్ అందరూ శుభాకాంక్షలు చెప్పారు. వారిలో ప్రథమంగా జూనియర్ ఎన్టీఆర్ అయితే 'నీకు ఈ అవార్డులు, విజయం వచ్చి తీరాల్సిందే బావా' అని ట్వీట్ చేశాడు. దీంతో బన్నీ కూడా 'హృదయపూర్వకంగా(జెన్యూన్‌గా) శుభాకాంక్షలు చెప్పినందుకు థ్యాంక్స్ బావా' అంటూ రిప్లై ఇచ్చాడు. ఆపై ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ రాజమౌళి 'పుష్ప.. తగ్గేదేలే' అంటూ సినిమా స్టైల్లో కంగ్రాట్స్ చెప్పాడు. (ఇదీ చదవండి: జాతీయ అవార్డ్ విజేతలకు దక్కే ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?) ఇలా చాలామంది సినీ సెలబ్రిటీలు చెబుతుండగా రామ్ చరణ్ మాత్రం ఒకరోజు ఆలస్యంగా విషెస్ చెప్పాడు. అందుకు బన్నీ కూడా ఒక్క ముక్కలో థ్యాంక్స్ అని రిప్లై ఇచ్చాడు. దీంతో వీరిద్దర మధ్య ఏమైంది అంటూ పలువురు ఫ్యాన్స్ కూడా నెట్టింట కామెంట్లు కూడా చేశారు. తాజాగా అల్లు అర్జున్‌కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు స్పెషల్‌గా ఒక గిఫ్ట్‌గా ఒక పూల బొకేను పంపారు. దానితో పాటు ఓ స్పెషల్ నోట్‌ను కూడా బన్నీ గురించి ఇలా రాసుకొచ్చారు. 'డియర్ బన్నీ.. కంగ్రాట్స్.. నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది.. ఇలాంటివి ఇంకా ఎన్నో నిన్ను వరిస్తాయి. అందుకు నీవు అర్హునివి కూడా..' అని ఉపాసన రాసుకొచ్చారు. దీంతో అల్లు అర్జున్ కూడా కొంతమేరకు ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది. థాంక్యూ సో మచ్ అంటూనే.. టచ్ చేశారని బన్నీ కూడా తెలిపాడు. ఇదంతా తన ఇన్ స్టా స్టోరీలో అల్లు అర్జున్ షేర్ చేశాడు. ఈ ఘటనతో అయినా రామ్ చరణ్,బన్నీ మధ్య ఎలాంటి గ్యాప్ లేదని, ఈ విషయాన్ని గ్రహించాలని వారి ఫ్యాన్స్ కోరుతున్నారు. దీంతో ఇకనైనా ఈ రూమర్స్‌కు పుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
జాతీయ అవార్డ్ విజేతలకు దక్కే ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?
'పుష్ప' ఇప్పుడు దేశంలో ట్రెండింగ్‌లో ఉన్న పేరు ఇదే. ఈ సినిమాతో అల్లు అర్జున్ నటనకుగాను తాజాగా జాతీయ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ అవార్డు అందుకుంటున్న టాలీవుడ్ తొలి హీరో కూడా ఆయనే.. ఈ అవార్డుతో పాటు విజేతలకు కేంద్ర ప్రభుత్వం ఏమేం ఇస్తుందని సోషల్‌మీడియాలో నెటిజన్లతో పాటు ఆయన అభిమానులు వెతుకుతున్నారు. జాతీయ చలనచిత్ర అవార్డలను అందుకున్న విజేతలకు స్వర్ణ కమలం, రజత కమలంతో పాటు నగదు బహుమతిని అందిస్తారు. అంతేకాకుండా గుర్తింపుగా ప్రశంసా పత్రాలను కూడా అందిస్తారు. కానీ జ్యూరీ నుంచి అభినందనలు అందుకున్న సినిమాల విషయంలో కేవలం సర్టిఫికేట్ మాత్రమే అందిస్తారు. జ్యూరీ స్పెషల్ విజేతలకు మాత్రం ప్రశంసా పత్రంతో పాటు నగదు బహుమతి కూడా అందిస్తారు. (ఇదీ చదవండి: డిసెంబర్ 12న విడుదల కానున్న రజనీకాంత్ మరో సినిమా) 2021 ఏడాదికి గాను 69వ జాతీయ అవార్డు అందుకోబోతున్న వారి జాబితా ఇప్పటికే విడుదలైంది. ఇందులో భాగంగా ఉత్తమ నటుడిగా అవార్డుకు ఎంపికైన అల్లు అర్జున్, ఉత్తమ నటీమణులుగా ఎంపికైన అలియా భట్, కృతి సనన్‌లకు ఒక్కోక్కరికి రూ.50 వేల నగదుతో పాటు రజత కమలాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ► ఉత్తమ చిత్రం అవార్డుల కోసం 28 భాషల నుంచి 280 సినిమాలు పోటీ పడితే.. బెస్ట్ మూవీగా ఎంపికైన రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్‌కు రూ.2.50 లక్షల నగదుతో పాటు స్వర్ణ కమలాన్ని అందజేయనున్నారు. ► ఉత్తమ వినోద చిత్రం అవార్డు కోసం 23 భాషల నుంచి 158 చిత్రాలు పోటీపడగా ఈ అవార్డుకు ఎంపికైన RRR సినిమాకు రూ. 2 లక్షల నగదుతో పాటు స్వర్ణ కమలం దక్కించుకోనుంది. ► గోదావరి అనే మరాఠ సినిమాకు బెస్ట్ డైరెక్టర్‌గా జాతీయ అవార్డు గెలుచుకున్న నిఖిల్ మహాజన్‌కు రూ.2.50 లక్షల నగదు బహుమతి, రజత కమలం అందుకుంటారు ► ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రంగా ఎంపికైన ది కశ్మీర్ ఫైల్స్‌కు రూ. 1.50 లక్షల నగదుతో పాటు రజత కమలం అందుకుంటారు. ఈ సినిమాకు రెండు అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే ► జ్యూరీ స్పెషల్ అవార్డుకు ఎంపికైన షేర్షా సినిమాకు రూ.2 లక్షల నగదుతో పాటు రజత కమలాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. -
కశ్మీర్ ఫైల్స్‌కు జాతీయ సమైక్యత అవార్డా?.. తప్పు పట్టిన సీఎం
కేంద్ర ప్రభుత్వం గురువారం 69వ సినీ జాతీయ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసారి తెలుగు చిత్ర పరిశ్రమ అత్యధిక అవార్డులను కై వసం చేసుకుంది. అదేవిధంగా తమిళ చిత్ర పరిశ్రమ ఆశాజనకమైన అవార్డులను గెలుచుకుంది. నటుడు కమల్ హాసన్ వంటి పలువురు సినీ ప్రముఖులు దక్షిణాది చిత్ర పరిశ్రమ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి ఈ అవార్డులు చిహ్నంగా పేర్కొన్నారు. అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ జాతీయ ఉత్తమ అవార్డులకు ఎంపికైన చిత్రాలకు, దర్శక నిర్మాతలకు ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. అందులో కశ్మీర్ ఫైల్స్ చిత్రానికి నర్గీస్‌దత్ పేరుతో జాతీయ సమైక్యత అవార్డును ప్రకటించడాన్ని తప్పుపట్టారు. పలు విధాలుగా వివాదాలను ఎదుర్కొన్న కశ్మీర్ ఫైల్స్ లాంటి చిత్రాలకు ఇలాంటి అవార్డులకు ప్రకటించడం దేశ సమైక్యతను దెబ్బ తీస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇకపోతే ఉత్తమ చిత్రంగా రాకెట్రీ:ది నంబి ఎఫెక్ట్‌ను ప్రకటించగా.. ప్రాంతీయ భాషలో ఉత్తమ చిత్రంగా ఉప్పెనకు జాతీయ అవార్డు అనౌన్స్ చేశారు. ఉత్తమ నటుడిగా పుష్ప:పార్ట్ 1 సినిమాకు అల్లు అర్జున్, ఉత్తమ నటిగా గంగూబాయి కతియావాడి సినిమాకుగానూ ఆలియా భట్, మిమీ చిత్రానికిగానూ కృతి సనన్ ఎంపికయ్యారు. #69thNationalFilmAwards -இல் தமிழில் சிறந்த படமாகத் தேர்வாகியிருக்கும் #கடைசிவிவசாயி படக்குழுவினருக்கு என் பாராட்டுகள்! @VijaySethuOffl #Manikandan #நல்லாண்டி மேலும், #இரவின்நிழல் படத்தில் ‘மாயவா சாயவா’ பாடலுக்காகச் சிறந்த பின்னணிப் பாடகி விருதை வென்றுள்ள @shreyaghoshal,… pic.twitter.com/Bc2veRY5gs — M.K.Stalin (@mkstalin) August 24, 2023 జాతీయ అవార్డుల పూర్తి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి చదవండి: అమ్మా, నాన్న పెళ్లి చేసుకోమంటున్నారు.. కానీ: విజయ్ దేవరకొండ -
నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీస్.. ఏయే ఓటీటీల్లో?
జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. అలానే మిగతా దక్షిణాది భాషల్లోని చిత్రాలు సైతం అవార్డులు గెలుచుకున్నాయి. 'పుష్ప' మూవీకిగానూ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డు గెలుచుకోవడం మాత్రం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. అలానే 'ఆర్ఆర్ఆర్'కి ఏకంగా ఆరు పురస్కారాలు దక్కడం కూడా టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. (ఇదీ చదవండి: మహేశ్‌బాబు.. జాతీయ అవార్డు మిస్ చేసుకున్నాడా?) అయితే చాలామంది ఎవరెవరికి ఎన్ని అవార్డులు వచ్చాయనేది చూస్తుంటే.. సినీ ప్రేమికులు మాత్రం ఏ సినిమా ఏ ఓటీటీలో ఉందా అని తెగ వెతికేస్తున్నారు. అయితే అలాంటి వాళ్ల కోసం మేం ఆ లిస్టుతో వచ్చేశాం. అవార్డులు గెలుచుకున్న చిత్రాలు ప్రస్తుతం ఏ ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయనేది తెలియాలంటే దిగువన లిస్ట్‌పై అలా ఓ లుక్కేసేయండి. నేషనల్ అవార్డ్ మూవీస్- ఓటీటీ ఆర్ఆర్ఆర్ - జీ5, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (తెలుగు) పుష్ప - అమెజాన్ ప్రైమ్ (తెలుగు) రాకెట్రీ: ద నంబి ఎఫెక్ట్ - జియో సినిమా (తెలుగు-హిందీ) ఉప్పెన - నెట్‌ఫ్లిక్స్ (తెలుగు) కొండపొలం - నెట్‌ఫ్లిక్స్ (తెలుగు) ద కశ్మీర్ ఫైల్స్ - జీ5 (తెలుగు డబ్బింగ్) చార్లి 777 - అమెజాన్ ప్రైమ్ (తెలుగు డబ్బింగ్) గంగూబాయి కతియావాడి - నెట్‌ఫ్లిక్స్ (తెలుగు డబ్బింగ్) మిమీ - నెట్‌ఫ్లిక్స్ (హిందీ) #Home - అమెజాన్ ప్రైమ్ (తెలుగు డబ్బింగ్) షేర్షా - అమెజాన్ ప్రైమ్ (హిందీ) సర్దార్ ఉద్దామ్ సింగ్ - అమెజాన్ ప్రైమ్ (హిందీ) కడైసి వివసయ్ - సోనీ లివ్ (తెలుగు డబ్బింగ్) నాయట్టు - నెట్‌ఫ్లిక్స్ (తెలుగు డబ్బింగ్) (ఇదీ చదవండి: బ్రహ్మానందం ఇంటికెళ్లిన బన్నీ.. కారణం అదేనా?) -
'జై భీమ్'కి జాతీయ అవార్డ్ అందుకే మిస్ అయిందా?
69వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. తమిళ, మలయాళ, కన్నడ సినిమాలు కూడా మెరిశాయి. అయితే సూర్య 'జై భీమ్' చిత్రానికి అవార్డ్ రాకపోవడం మాత్రం చాలామందిని ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచింది. కనీసం ఒక్కటైనా వచ్చుంటే బాగుండేదని వాళ్లు అభిప్రాయపడ్డారు. మరి 'జై భీమ్'కి అవార్డ్ ఎందుకు మిస్ అయింది? కారణాలు ఏంటి? (ఇదీ చదవండి: జాతీయ అవార్డుల్లో 'ఆర్ఆర్ఆర్' హవా.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్) సామాజిక రుగ్మతలు, అణగారిన వర్గాలపై జరుగుతున్న అన్యాయాన్ని.. నిజ జీవితంలో జరిగిన ఓ సంఘటనని స్పూర్తిగా తీసిన సినిమా 'జై భీమ్'. టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజైనప్పటికీ ప్రతి ఒక్కరి నుంచి ప్రశంసలు అందుకుంది. ఓ సాధారణ లాయర్ పాత్రలో సూర్య అదరగొట్టేశాడు. కానీ ఈ సినిమాకి ఇప్పుడు ఏ విభాగంలోనూ అవార్డ్ రాలేదు. జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డు గెలవడం ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. దానికి అతడి పూర్తి అర్హుడు. దీనికి సూర్య కూడా పోటీదారుడే కానీ కొద్దిలో మిస్ అయింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.. 2020లో సూరరై పోట్రు (ఆకాశమే హద్దురా) సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా సూర్య.. జాతీయ అవార్డు అందుకున్నాడు. (ఇదీ చదవండి: 'పుష్ప'కి జాతీయ అవార్డులు.. ఆ అంశాలే కలిసొచ్చాయా?) 'జై భీమ్' కూడా అదే సంస్థ నుంచి వచ్చింది. ఇన్నేళ్ల జాతీయ అవార్డుల చరిత్రలో.. ఏ హీరోకి వరసగా రెండుసార్లు పురస్కారం వరించలేదు. అలానే 'పుష్ప' మూవీకి దేశవ్యాప్తంగా వచ్చినంత పాపులారిటీ 'జై భీమ్'కి రాలేదనేది మీకు తెలుసు! ఇలా అనుకుంటేపోతే.. గతంలోనూ చాలావరకు మంచి మంచి సినిమాలకు కొద్దిలో జాతీయ అవార్డులు మిస్ అయ్యాయి. అంతమాత్రన వాటిని తక్కువ చేసినట్లు కాదు. అవార్డుల వచ్చింది లేనిది కొన్నిరోజుల్లో మర్చిపోతారేమో గానీ ఓ మంచి సినిమాని ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటారు. 'జై భీమ్' ఈ లిస్టులో కచ్చితంగా ఉంటుంది. ఎంటర్టైన్ చేసే విషయంలో 'పుష్ప', మెసేజ్ ఇవ్వడంతోపాటు ఎమోషనల్ చేసే విషయంలో 'జై భీమ్'.. ఎప్పటికీ అలా నిలిచిపోతాయి అంతే! (ఇదీ చదవండి: ప్రేమ పేరుతో మోసం.. జబర్దస్త్ కమెడియన్ అరెస్ట్) -
జాతీయ అవార్డ్స్ కోసం లాబీయింగ్.. స్పందించిన నిర్మాత
69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ‘ది కశ్మీర్ ఫైల్స్’కు రెండు అవార్డులు దక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన అభిషేక్ అగర్వాల్ కూడా తెలుగు చిత్రసీమకు చెందినవారే కావడం విశేషం. ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రంగా గుర్తించి అందుకు గాను జాతీయ అవార్డును ప్రకటించారు. అంతేకాకుండా ఇందులో తన నటనతో మెప్పించిన పల్లవి జోషికి ఉత్తమ సహాయనటి విభాగంలో అవార్డు దక్కింది. ఈ అంశంపై తాజాగ నిర్మాత అభిషేక్ అగర్వాల్ స్పందించారు. 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాకు రెండు జాతీయ అవార్డ్స్ రావడం చాలా సంతోషంగా ఉందని అభిషేక్ తెలిపారు. ఈ సినిమా ప్రారంభం నుంచి తమకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని ఆయన తెలిపారు. సినిమాను చూసిన కొందరు యాంటీ ముస్లిం అంటూ కామెంట్లు చేశారు.. ఈ విధంగా ఎలా కామెంట్ చేశారో ఇప్పటికీ అర్థం కాలేదని ఆయన అన్నారు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ అనే సినిమా యాంటీ టెర్రరిస్ట్ కథాంశంతో తెరకెక్కిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమా డైరెక్టర్ వివేక్ అమెరికాలో ఉన్నారని, ఈ అవార్డుతో ఆయన మరింత సంతోషంగా ఉన్నారని తెలిపారు. (ఇదీ చదవండి: అవమానాలు భరించి వెండితెరపై సత్తా చాటిన అల్లు అర్జున్) ప్రస్తుతం తెలుగు సినిమా అనేది రాష్ట్రాన్ని దాటి ప్రపంచంలో నంబర్ వన్ స్థానానికి చేరుకుంటుందని చెప్పారు. కొందరు రాజకీయాల్లో వస్తున్నానంటూ తన గురించి ప్రచారం చేస్తున్నారని, అందులో నిజం లేదని తను ఎప్పటికీ రాజకీయాలకు దూరం అని చెప్పాడు. అంతేకాకుండా అవార్డ్స్ కోసం లాబీయంగ్ చేశారంటూ కొందరు చెబుతున్నారని ఈ అవార్డ్స్ కోసం ఎలాంటి లాబీయింగ్ చెయ్యలేదని అసలు అలాంటి విషయాలు తనకు తెలీయదని అభిషేక్ అగర్వాల్ పేర్కొన్నారు. అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. '69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో మా ‘ది కశ్మీర్ ఫైల్స్’కు రెండు అవార్డులు దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. ది కశ్మీర్ ఫైల్స్ ఇది ప్రజల సినిమా. ప్రజలు ఎంతో గొప్పగా ఆదరించారు. ఈరోజున దేశ ప్రజలే ఈ అవార్డు గెలుచుకున్నారు. దేశ ప్రజలకు, కశ్మీర్ పండిట్లందరికీ ఈ పురస్కారాల్ని అంకితమిస్తున్నాం. అలాగే జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డ్ పొందడం చాలా అనందంగా ఉంది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆరు జాతీయ అవార్డులు రావడం, ఉప్పెన, కొండపొలం పాటకి చంద్రబోస్‌కు అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే కార్తికేయ 2 తర్వాత ప్రస్తుతం నిర్మిస్తున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నాం. పాన్ ఇండియా ఆడియన్స్ అలరించే కంటెంట్ టైగర్ నాగేశ్వరరావులో ఉంది. అక్టోబర్ 20న విడుదల చేస్తున్నాం. దానికి కూడా జాతీయ అవార్డ్ రావాలని కోరుకుంటున్నాను. మీ అందరి సహకారం కావాలి.'' అని అన్నారు. వాస్తవిక అంశాల చుట్టూ ది కాశ్మీర్ ఫైల్స్ ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం 2022లో విడుదలై భారీ కలెక్షన్స్‌తో పాటు పలు వివాదాలను కూడా క్రియేట్ చేసింది. దీనిని వివేక్ అగ్నిహోత్రి రచించి, అతనే దర్శకత్వం వహించాడు.ఈ చిత్రం కాశ్మీర్ తిరుగుబాటు సమయంలో కాశ్మీరీ హిందువుల వలసలను వర్ణిస్తుంది. వాస్తవిక అంశాలనే కథాంశంగా దీనిని నిర్మించారు. కశ్మీర్ ఫైల్స్ కోసం మొత్తం షూటింగ్ జరిగిపింది నెలరోజులే. కానీ కథ కోసం రెండేళ్లపాటు దర్శకుడు పరిశోధన చేశాడు. ఈ సినిమా కోసం కశ్మీర్ రాష్ట్రం దాటి వెళ్లిపోయిన ఏడువందల మంది కశ్మీరీ పండిట్లను ఇంటర్వ్యూ చేశాడు. ఇందులో అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి నటించారు. అగ్నిహోత్రి రూపొందించిన ఫైల్స్ త్రయంలో ఇది రెండవ చిత్రం, దీనికి ముందు ది తాష్కెంట్ ఫైల్స్, తరువాత ది ఢిల్లీ ఫైల్స్ ఉన్నాయి. -
అవమానాలు భరించి వెండితెరపై సత్తా చాటిన అల్లు అర్జున్
తాత స్టార్ కమెడియన్ (రామలింగయ్య), మామయ్య స్టార్ హీరో (చిరంజీవి), నాన్న స్టార్ ప్రొడ్యూసర్ (అల్లు అరవింద్).. ఈ నేపథ్యంతో అల్లు అర్జున్ తెరంగేట్రం చేశారు. అది ఎంట్రీ వరకు మాత్రమే ఉపయోగపడిందేమోగానీ స్టార్.. స్టైలిష్‌స్టార్‌ని చేసేందుకు మాత్రం కాదు. హీరో అంటే ప్రధానంగా ఉండాల్సింది ఏంటి..? మంచి లుక్స్..పర్సనాలటీ,కిల్లింగ్ స్మైల్ ఇలా కొన్ని తప్పక ఉండాల్సిందే. కానీ ఇవేమీ లేకుండా తన బ్యాంక్‌గ్రౌండ్‌తో ఎంట్రీ ఇస్తే ఏం చేస్తాం కొద్దిరోజులకు పక్కన పెట్టేస్తాం. కానీ ప్రేక్షకులకు అల్లు అర్జున్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. గంగోత్రి సినిమా సమయంలో వీడు హీరో ఏంటిరా అనే స్టేజీ నుంచి ఆర్య సినిమాతో వీడురా హీరో అని స్థాయికి చేరాడు. వీడికి స్టైల్ అంటే తెలుసా..? అని హేళన చేసిన వారికి స్టైలిష్ స్టార్ అనే గుర్తింపుతో సమాధానం ఇచ్చాడు. నటన రాదు అనేవారికి జాతీయ అవార్డు అందుకున్న ఏకైక హీరోగా తెలుగు సినిమా చరిత్రలో నిలిచాడు. గంగోత్రితో అవమానం ఎదుర్కొన్న బన్నీ 2003లో వచ్చిన తన తొలి చిత్రం 'గంగోత్రి'ని చూసిన వారందరూ ఆ వెంటనే వచ్చిన 'ఆర్య'ను చూసి ఆశ్చర్యపోయారు. తొలి చిత్రంలో సింహాద్రిగా కనిపించిన ఆ కుర్రాడేనా..? ఈ ఆర్య అంటూ తెలుగు సినీ ప్రేక్షకులంతా ఆశ్చర్యపోయారు. అంతలా బన్నీ కష్టపడ్డాడు. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరో అనే గుర్తింపు నుంచి అల్లు హీరో అనే ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇదంతా రాత్రికి రాత్రే జరిగిపోలేదు.. దీని వెనుక అతని 20 ఏళ్ల కష్టం ఉంది. తన 20 ఏళ్ల సినీ జీవితంలో వేదం,రుద్రమదేవి, వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించాడు. ఆర్య సినిమా విడుదల తర్వాత బన్నీని అభిమానించే వారి సంఖ్య ఇతర రాష్ట్రాలకు కూడా పాకింది. మలయాళంలో ఆయనకు ఉన్నంత ఫ్యాన్స్ అక్కడి హీరోలకు కూడా ఉండరనే చెప్పవచ్చు. అందుకే అతన్ని మల్లు అర్జున్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ప్రాంతం,భాష ఎలాంటి సంబంధం లేని తనకోసం వాళ్లందరూ చూపించే ప్రేమకు ఆయన మురిసిపోయాడు. అందుకే ఆయన ఒకసారి ఫ్యాన్స్‌ను ఉద్దేశించి కన్నవాళ్ల ప్రేమ ఎలాంటిదో అభిమానుల ప్రేమ కూడా అలాంటిదేనని చెప్పి దానిని పాటిస్తున్నాడు. అభిమానులనూ తన కుటుంబ సభ్యుల్లాగే భావిస్తారాయన. ఇప్పటికీ ఫ్యాన్స్ అని ఆయన ఇంటికి వెళ్తే అక్కడున్నవారు భోజనం పెట్టి పంపుతారు. 'ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు. నాకు మాత్రం ఆర్మీ ఉంటుంది. నేను సంపాదించుకున్న అతిపెద్ద ఆస్తి నా అభిమానులే’ అని ఆయన చాలాసార్లు చెప్పాడు. అల్లు అర్జున్‌లో ఇవన్నీ ప్రత్యేకం ► సౌత్ ఇండియాలో సిక్స్‌ప్యాక్ ట్రెండ్‌ను దేశముదురు సినిమాతో ట్రెండ్ సెట్ చేసింది అల్లు అర్జునే ► ఇన్‌స్టాగ్రామ్‌లో 20 మిలియన్లకుపైగా ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్న సౌత్ ఇండియా స్టార్‌గా అర్జున్ గుర్తింపు పొందాడు. ► 'రుద్రమదేవి' సినిమాకు కొన్ని ఇబ్బందులు ఎదురు అయ్యాయని తెలుసుకున్న అర్జున్ దానికి తనలాంటి స్టార్ అవసరమనుకున్నాడు. ఆ సినిమా కోసం ఎలాంటి పారితోషికం తీసుకోకుండా గోనగన్నారెడ్డి పాత్రతో మెప్పించాడు. ► పాలకొల్లులోని 'పంచారామ' క్షేత్రంలో గోశాల ఏర్పాటుకు ఎవరూ అడగకుండానే రూ.18 లక్షలు విరాళం ఇచ్చాడు. గోశాలలోని ఆవులకు నిరంతరం అవసరమయ్యే ఖర్చును ఆయనే చెల్లిస్తానన్నాడు. ► వేదం సినిమాలో మంచు మనోజ్‌తో కలిసి నటించి నవతరం నాయకులలో మల్టీస్టారర్ చిత్రాల సంస్కృతిని మళ్లీ తెరపైకి తీసుకొచ్చాడు. ► ఎవరో బాలీవుడ్ జనాలు తన బాడీ,లుక్ మీద చేసిన కామెంట్‌ను సీరియస్ తీసుకొని ప్రత్యేకంగా జిమ్నాస్టిక్స్ శిక్షణ తీసుకొని సరికొత్త లుక్‌లో ఆర్యలో కనిపించి ఆ సినిమాకు నంది అవార్డు అందుకున్నాడు. ► కేరళలో మమ్ముట్టి, మోహన్ లాల్ తర్వాత అర్జున్‌కే ఎక్కువ అభిమానులు. పరాయి రాష్ట్రంలో ఏ హీరోకు ఇలాంటి ఆదరణ లేదు. ► పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ ఎంటర్టైన్ కేటగిరిలో ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ అవార్డు గెలిచిన మొదటి సౌత్ హీరోగా రికార్డు సృష్టించాడు. ► ఫ్యాన్స్ కోసం ఒకరోజును ఆయన కేటాయిస్తారు. ప్రతి గురువారం తన ఫ్యాన్స్ డైరెక్ట్‌గా ఆయన ఇంటి వద్దకు వెళ్లి బన్నీతో ఫోటోలు దిగుతుంటారు. ఒక్కోసారి షూటింగ్ పనుల మీద ఇతర ప్రాంతాలకు ఆయన వెళ్లినప్పుడు ఆ అవకాశం ఉండదు. ► పుష్ప సినిమా కోసం భుజం ఒకవైపు ఉంచి నటిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని తెలిసి కూడా కథ నచ్చడంతో రెడీ అనేశాడు. సినిమా పూర్తి అయిన తర్వాత ఆయన భుజానికి స్వల్ప శస్త్రచికిత్స జరిగింది. ► 2021లో విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'పుష్ప' రూ. 365 కోట్లతో రికార్డు సృష్టించింది. -
జాతీయ అవార్డుల విషయంలో టాలీవుడ్ గళాన్ని వినిపించిన శ్రీలేఖ
69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు చిత్రసీమ సత్తా చాటింది. ఈ అవార్డుల విషయంలో సౌత్ ఇండియాకు ఎక్కువగా అన్యాయం జరుగుతుంటుందనే విమర్శ గతంలో ఎక్కువగా వినిపించేది. అందులో టాలీవుడ్‌కు మరింత అన్యాయం జరుగుతుందని బహిరంగంగానే పలువురు జాతీయ అవార్డుల జ్యూరీ సభ్యులపైనే కామెంట్లు చేశారు. 1967లో 15వ జాతీయ అవార్డుల నుంచి కేంద్ర ప్రభుత్వం ఉత్తమ నటుడి అవార్డు ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి నేటి వరకు టాలీవుడ్ నుంచి ఏ ఒక్క హీరోకి ఉత్తమ నటుడి అవార్డు దక్కలేదు. (ఇదీ చదవండి: 2022లో విడుదలైన సినిమాలకు 2021 అవార్డులా.. అదెలా?) తాజాగ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకుని తొలి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించారు. టాలీవుడ్లో ఎన్టీఆర్,నాగేశ్వరావు,కృష్ణ,చిరంజీవి ఇలా ఎందరో సినీ చరిత్రలో గొప్ప నటులున్నా ఇప్పటివరకూ ఎవ్వరికీ ఈ అవకాశం దక్కలేదు. దీంతో ఒక్కోసారి జ్యూరీ సభ్యులపై కూడా విమర్శలు వచ్చేవి. ఈ విభాగంలో తొలి అవార్డును బెంగాలీ నటుడు ఉత్తమ్‌కుమార్ సొంతం చేసుకున్నారు. అప్పటి నుంచి ఎక్కువగా నార్త్ నుంచే ఆధిపత్యం ఉందని చెప్పవచ్చు. నార్త్ హీరోలకే ఎక్కువ అవార్డులు ఇప్పటి వరకు ఈ అవార్డు అందుకున్న వారిలో బాలీవుడ్ నటులు 27, మలయాళం 13, తమిళ్ 9, బెంగాలీ నుంచి ఐదుగురు ఉన్నారు. కన్నడ, మరాఠీ నటులకు మూడేసి చొప్పున అవార్డులను దక్కించుకున్నారు. అత్యధికంగా అమితాబ్ బచ్చన్ నాలుగుసార్లు, కమల్‌హాసన్,అజయ్‌దేవగణ్, మమ్ముట్టి మూడుసార్లు అవార్డు దక్కించుకున్నారు. మోహన్‌లాల్, ధనుష్,మిథున్చక్రవర్తి, సంజీవ్‌కుమార్, నసీరుద్దీన్‌షా, ఓంపురి కూడా రెండేసిసార్లు అవార్డు గెలుచుకున్నారు. విక్రమ్,సూర్య, ప్రకాశ్‌రాజ్,సురేష్‌గోపి,ఎంజీ రామచంద్రన్ వంటివారు కూడా ఈ పురస్కారాన్ని ఒకసారి అందుకున్నారు. శంకరాభరణం చిత్రానికి 4 అవార్డులు టాలీవుడ్ ఎవర్గ్రీన్ సినిమా అయిన శంకరాభరణం చిత్రానికి అప్పట్లో అత్యధికంగా 4 జాతీయ అవార్డులు దక్కగా మేఘ సందేశం సినిమాకు కూడా 4 పురస్కారాలు దక్కాయి. ఆప్పటి నుంచి టాలీవుడ్‌కు అంతగా జాతీయ అవార్డులు వరించలేదనే చెప్పవచ్చు. తాజాగ RRR మూవీకి 6 అవార్డులతో పాటు మొత్తంగా టాలీవుడ్‌కు 11 అవార్డులు దక్కాయి. జాతీయ చలన చిత్ర పురస్కారాల కమిటీ సభ్యుల ముందు తెలుగు చిత్రాల గళాన్ని గట్టిగా వినిపించే వారు ఉంటే తప్పక టాలీవుడ్‌కు న్యాయం జరుగుతుందని ఎంఎం శ్రీలేఖ నిరూపించారనే చెప్పవచ్చు. జ్యూరీ సభ్యురాలిగా ఎంఎం శ్రీలేఖ 69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో జ్యూరీ సభ్యురాలిగా సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ ఉన్నారు. ఈసారి టాలీవుడ్ సినిమాల ప్రత్యేకత గురించి కమిటీ సభ్యుల ముందు ఆమె గట్టిగానే గళం వినిపించారు. అవార్డుల అనౌన్స్మెంట్ తర్వాత ఎంఎం శ్రీలేఖ తన అభిప్రాయాన్ని ఇలా తెలిపారు. 'ప్రతి ఏడాది తెలుగు సినిమాలంటే కొంచెం నిర్లక్ష్యం. కంటి తుడుపుగా ఒకటో రెండో అవార్డులు ఇస్తున్నారు. దీనిపై జ్యూరీలో గట్టిగా మాట్లాడేవారు కావాలి. తెలుగుకు ఎందుకు ఇవ్వరు? అని మాట్లాడ గలగాలి. అయితే ఆ సినిమాలో విషయం ఉండాలి.. లేకుంటే మాట్లాడలేం' అన్నారు సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ. 69వ జాతీయ అవార్డుల్లో దక్షిణాది తరఫున జ్యూరీలో శ్రీలేఖతో పాటు రచయిత్రి బలభద్రపాత్రుని రమణి ఉన్నారు. మామూలుగా ఫైనల్ ప్యానల్లో భోజ్‌పురి వాళ్లు ఉంటారని శ్రీలేఖ తెలిపారు. వాళ్లకు తెలుగు రాదు అలాంటప్పుడు మహానటి సావిత్రి గురించి ఏం తెలుస్తుందని ఆమె గుర్తుచేశారు. అందుకే జ్యూరీలో ఉన్న తెలుగువారు తెలుగు సినిమాల గురించి గట్టిగా చెప్పాలని పేర్కొన్నారు. 'ఓ జ్యూరీ సభ్యురాలిగా నా అభిప్రాయాన్ని నేను బలంగా చెప్పాను. ఈసారి నేను ఏవైతే రావాలనుకున్నానో దాదాపు వాటికే వచ్చాయి. తొలిసారి తండ్రీ కొడుకులు కీరవాణి అన్నయ్య– కాలభైరవ ఒకే వేదికపై అవార్డులు తీసుకోనుండటం నాకో గొప్ప అనుభూతి.' అని ఎంఎం శ్రీలేఖ తెలిపారు. -
2022లో విడుదలైన సినిమాలకు 2021 అవార్డులా.. అదెలా?
2021 సంవత్సరానికిగాను జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తొలిసారి తెలుగు సినిమాలు దుమ్ము రేపాయి. తెలుగు సినిమా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా ఏంటో మరోసారి చూపించింది. గురువారం ప్రకటించిన 69వ జాతీయ పురస్కారాల్లో ఉత్తమ సినీ విమర్శకుడు విభాగంతో కలుపుకొని మొత్తంగా 11 పురస్కారాల్ని టాలీవుడ్ దక్కించుకుంది. 69 ఏళ్ల జాతీయ అవార్డుల చరిత్రలో తెలుగు నుంచి జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ రికార్డ్ సాధించారు. మరోవైపు ఆస్కార్ అవార్డుతో చరిత్ర సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’కు ఏకంగా ఆరు అవార్డులతో పతాకస్థాయిలో నిలిచింది. కానీ చాలామంది నెటిజన్లు 2022లో విడుదలైన సినిమాలకు 2021 అవార్డులా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు 2021 సంవత్సరంలో విడుదలైన సినిమాలకు సంబంధించినవి కానీ ఇందులో RRR (2022 మార్చి) , రాకెట్రీ సినిమా (2022 జులై), గంగూబాయ్ కాఠియావాడి సినిమా (2022 ఫిబ్రవరి) నెలలో విడుదలయ్యాయి. ఇందులో ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను 6 అవార్డులు, గంగూబాయ్ కాఠియావాడి సినిమాకు గాను ఉత్తమ నటిగా అలియా భట్‌కు అవార్డు దక్కింది. జాతీయ ఉత్తమ చిత్రం విభాగంలో రాకెట్రీ సినిమాకు దక్కింది. (ఇదీ చదవండి: ‘బెదురులంక 2012’మూవీ రివ్యూ) దీనిపై సమాచార, ప్రసార శాఖ అదనపు కార్యదర్శి నీర్జా శేఖర్‌ను పలువురు ప్రశ్నించారు. జాతీయ చలన చిత్ర అవార్డు నిబంధనల ప్రకారం 2021 జనవరి 1 నుంచి 2021 డిసెంబరు 31 నడుమ ఈ సినిమాలన్నీ ప్రభుత్వ అనుమతి రూల్స్ ప్రకారం సెన్సార్ సర్టిఫికెట్ పొందాయి.. కాబట్టి ఈ విధంగా విడుదలైన సినిమాలను 2021 సంవత్సరానికి సంబంధించిన చిత్రాలుగా పరిగణిస్తామని చెప్పారు. ఆర్ఆర్ఆర్ 2021 డిసెంబరులోనే సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చిందని, కాబట్టి ఆ చిత్రానికి 2021 సంవత్సరానికిగాను జాతీయ పురస్కారం దక్కినట్లు వచ్చినట్టు భావించవచ్చన్నారు. ఈ విధంగా విడుదలైన మిగిలిన చిత్రాలకూ కూడా ఇదే విధానం వర్తిస్తుందని నీర్జా శేఖర్ తెలిపారు. -
జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్.. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆరు అవార్డులు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
తమిళ సినిమాకు వచ్చిన జాతీయ అవార్డులు ఇవే
69వ సినీ జాతీయ అవార్డుల వివరాలను కేంద్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం ప్రకటించింది. ఇందులో తమిళ చిత్ర పరిశ్రమ నాలుగు అవార్డులను గెలుచుకోవడం, అవన్నీ చిన్న చిత్రాలు కావడం మరింత విశేషం. మణికంఠన్ దర్శకత్వం వహించిన కడైసి వ్యవసాయి చిత్రం ప్రాంతీయ ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకుంది. అదే విధంగా ఆ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన (లేట్) నల్లుండికి ప్రత్యేక అవార్డును ప్రకటించింది. పార్తీపన్ కథానాయకుడిగా నటించి దర్శకత్వం వహించిన ఇరైవిన్ నిళల్ చిత్రంలోని మాయవా ఛాయవా అనే పాటను పాడిన శ్రేయ ఘోషల్‌ను ఉత్తమగాయని అవార్డు వరించింది. కాగా ఈవీ గణేష్ బాబు దర్శకత్వం వహించిన కరువరై చిత్రానికి గాను సంగీత దర్శకుడు శ్రీకాంత్ దేవాకు ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు వరించింది. (ఇదీ చదవండి: 2023 :అల్లు అర్జున్... ఉత్తమ నటుడు) ఈ సందర్భంగా తన చిత్రంలోని పాటకు గాను ఉత్తమ గాయని అవార్డును ప్రకటించిన అవార్డుల కమిటీకి నటుడు పార్తీపన్ ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. కాగా తెలుగు తేజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆస్కార్ అవార్డు కొల్లగొట్టిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఈసారి ఏకంగా 6 ప్రధాన అవార్డులను దక్కించుకోవడం విశేషం. ఉత్తమగాయనిగా శ్రేయ ఘోషల్‌కు జాతీయ అవార్డు తెచ్చిన పాట ఇదే... -
National film awards 2023 :అల్లు అర్జున్... ఉత్తమ నటుడు
జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తొలిసారి తెలుగు సినిమాలు దుమ్ము రేపాయి. మొత్తం పది అవార్డులతో ‘ఎత్తర జెండా’ అంటూ తెలుగు సినిమా సత్తా చాటింది. 69 ఏళ్ల జాతీయ అవార్డుల చరిత్రలో తెలుగు నుంచి జాతీయ ఉత్తమ నటుడిగా ‘పుష్ప... ఫైర్’ అంటూ అల్లు అర్జున్ రికార్డ్ సాధించారు. ఆస్కార్ అవార్డుతో చరిత్ర సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’ ఆరు అవార్డులతో సిక్సర్ కొట్టింది. వీటిలో ‘హోల్సమ్ ఎంటర్టైనర్’ అవార్డు ‘ఆర్ఆర్ఆర్’ సొంతం అయింది. 2021 జనవరి 1 నుంచి 2021 డిసెంబరు 31 లోపు సెన్సార్ అయి, అవార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న సినిమాలను పరిగణనలోకి తీసుకుని జ్యూరీ సభ్యులు అవార్డులను ప్రకటించడం జరిగింది. జాతీయ ఉత్తమ నటీమణులుగా ‘గంగూబాయి కతియావాడి’లో వేశ్య పాత్ర చేసిన ఆలియా భట్, ‘మిమి’ చిత్రంలో గర్భవతిగా నటించిన కృతీ సనన్ నిలిచారు. ఖగోళ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ఆర్. మాధవన్ టైటిల్ రోల్ చేసి, స్వీయదర్శకత్వంలో రూపొందించిన ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ ఉత్తమ చిత్రంగా, ఉత్తమ దర్శకుడిగా మరాఠీ ఫిల్మ్ ‘గోదావరి’కి గాను నిఖిల్ మహాజన్ అవార్డు సాధించారు. ఇంకా పలు విభాగాల్లో కేంద్ర ప్రభుత్వం గురువారం జాతీయ అవార్డులను ప్రకటించింది. ఆ విశేషాలు ఈ విధంగా... 69వ జాతీయ అవార్డులకు గాను 28 భాషలకు చెందిన 280 చలన చిత్రాలు పోటీపడ్డాయి. మొత్తం 31 విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. సుకుమార్ దర్శకత్వంలోని ‘పుష్ప: ది రైజ్’ సినిమాలోని నటనకుగాను అల్లు అర్జున్‌కు ఉత్తమ జాతీయ నటుడిగా తొలి అవార్డు లభించింది. ఇదే చిత్రానికి సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ జాతీయ అవార్డు సాధించారు. ఇక ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రౌద్రం..రణం..రుధిరం’ (ఆర్ఆర్ఆర్) సినిమాకు ఆరు విభాగాల్లో అవార్డులు దక్కాయి. జాతీయ హోల్సమ్ ఎంటర్టైనర్గా ‘ఆర్ఆర్ఆర్’ నిలిచింది. ఇదే చిత్రానికి ఉత్తమ నేపథ్య సంగీతానికి గాను ఎంఎం కీరవాణి, ఇదే చిత్రానికి స్పెషల్ ఎఫెక్ట్స్‌కి వి. శ్రీనివాస్ మోహనన్, ‘నాటు నాటు..’ పాట కొరియోగ్రఫీకి ప్రేమ్ రక్షిత్, ‘ఆర్ఆర్ఆర్’లోని ‘కొమురం భీముడో..’ పాటకు మేల్ ప్లే బ్యాక్ సింగర్‌గా కాలభైరవ, ఇదే చిత్రానికి స్టంట్ కొరియోగ్రాఫర్‌గా కింగ్ సాల్మన్లకు జాతీయ అవార్డులు దక్కాయి. ఇక ‘నాటు.. నాటు’కి రచయితగా తొలి ఆస్కార్ అవార్డు అందుకున్న చంద్రబోస్ ‘కొండపొలం’లోని ‘ధంధం ధం.. తిరిగేద్దాం...’ పాటకు జాతీయ అవార్డు అందుకోనున్నారు. దర్శకుడిగా తన తొలి చిత్రానికి జాతీయ అవార్డు దక్కిన ఆనందంలో ఉన్నారు ‘ఉప్పెన’ను తెరకెక్కించిన బుచ్చిబాబు సన. మైత్రీ మూవీ మేకర్స్‌పై వై. రవిశంకర్, నవీన్ ఎర్నేని నిర్మించిన ‘ఉప్పెన’ ప్రాంతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది. ఉత్తమ సినీ విమర్శకుడిగా నల్గొండ జిల్లాకి చెందిన ఎం. పురుషోత్తమాచార్యులకు అవార్డు దక్కింది. రెండేళ్లుగా ‘మిసిమి’ మాస పత్రికలో సినిమా పాటల్లో శాస్త్రీయ సంగీతంపై పరిశోధనలు చేస్తూ, పలు వ్యాసాలు రాశారు పురుషోత్తమాచార్యులు. ఇక ఆలియా భట్‌కి ‘గంగూబాయి కతియావాడి’ జాతీయ ఉత్తమ నటిగా అవార్డు దక్కేలా చేయడంతో పాటు మరో నాలుగు విభాగాల్లో (బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్, మేకప్, ఎడిటింగ్) అవార్డులు వచ్చేలా చేసింది. అలాగే విక్కీ కౌశల్ హీరోగా నటించిన బయోగ్రఫికల్ డ్రామా ‘సర్దార్ ఉద్దమ్’కు ప్రాంతీయ ఉత్తమ హిందీ చిత్రంతో పాటు మొత్తం నాలుగు విభాగాల్లో (సినిమాటోగ్రఫీ, ఆడియోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్ డిజైన్) అవార్డులు దక్కాయి. ఈ చిత్రానికి సూజిత్ సర్కార్ దర్శకుడు. తమిళ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కడైసీ వివసాయి’, మలయాళంలో ‘హోమ్’, కన్నడంలో ‘777 చార్లీ’ అవార్డులు గెలుచుకున్నాయి. ఇంకా పలు భాషల్లో పలు చిత్రాలకు అవార్డులు దక్కాయి. ఇదొక చరిత్ర – నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ అల్లు అర్జున్‌గారికి జాతీయ అవార్డు రావడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది. ఇదొక చరిత్ర ‘పుష్ప’ షూటింగ్ సమయంలోనే అల్లు అర్జున్ తప్పకుండా నేషనల్ అవార్డ్ కొడతారని సుకుమార్‌గారు అనేవారు.. అది ఈ రోజు నిజమైంది. మాకు ఇంత మంచి సినిమా ఇచ్చిన అల్లు అర్జున్, సుకుమార్ గార్లకు థ్యాంక్స్. దేవిశ్రీ ప్రసాద్‌కి జాతీయ అవార్డ్ రావడం హ్యాపీ. అలాగే మా ‘ఉప్పెన’కి ఉత్తమ తెలుగు సినిమాగా జాతీయ అవార్డు రావడం గర్వంగా ఉంది. దర్శకుడు బుచ్చిబాబు, టీమ్‌కి అభినందనలు. అలాగే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి ఆరు అవార్డులు రావడం సంతోషంగా ఉంది. – నవీన్ యెర్నేని, నిర్మాత మా మైత్రీ మూవీస్ బ్యానర్లో ‘ఉప్పెన, పుష్ప’ చాలా ప్రతిష్టాత్మక చిత్రాలు. జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడిగా అల్లు అర్జున్‌గారు చరిత్ర సృష్టించారు. తెలుగు సినిమా చరిత్రలో ఇది చిరకాలం గుర్తుండిపోతుంది. దేవిశ్రీ ప్రసాద్‌కి అవార్డు రావడం ఆనందంగా ఉంది. ‘ఉప్పెన, పుష్ప’ రెండు విజయాల్లో సింహ భాగం సుకుమార్గారిదే. ‘ఆర్ఆర్ఆర్, కొండపొలం’ చిత్రాలకు జాతీయ అవార్డులు రావడం ఆనందాన్నిచ్చింది. – వై. రవిశంకర్, నిర్మాత ‘‘నా తొలి సినిమాకే జాతీయ అవార్డు రావడం హ్యాపీగా ఉంది. నిర్మాతలు నవీన్‌గారికి, రవిగారికి, మా గురువుగారు సుకుమార్ గారికి కృతజ్ఞతలు. సినిమా చూడ్డానికి మా ఇంట్లో నన్ను పంపించేవాళ్లు కాదు. అలాంటిది నేను ఒక సినిమాకి డైరెక్ట్ చేయడం, నా ఫస్ట్ సినిమాకే నేషనల్ అవార్డు రావడం అంటే ఏం మాట్లాడాలో అర్థం కావడంలేదు. మా అమ్మగారికి నేషనల్ అవార్డు అంటే ఏంటో కూడా తెలియదు. ఈ అవార్డు గురించి ఆమెకి చెప్పాలంటే. ‘ఇండియాలోనే పెద్ద అవార్డు వచ్చింది’ అని చెప్పాలి’’ అంటున్న బుచ్చిబాబు సనని తదుపరి చిత్రం గురించి అడగ్గా.. ‘‘రామ్‌చరణ్‌గారి కోసం మంచి రా అండ్ రస్టిక్ స్టోరీ రాశాను. నా మనసుకి బాగా నచ్చి, రాసుకున్న కథ ఇది. జనవరిలో షూటింగ్ ఆరంభిస్తాం’’ అన్నారు. – బుచ్చిబాబు సన, దర్శకుడు పది అవార్డులతో తొలి రికార్డ్ ఈసారి తెలుగు పరిశ్రమ ఎక్కువ జాతీయ అవార్డులు సొంతం చేసుకోవడంతో పాటు మరో విశేషమైన రికార్డ్ సాధించింది. అదేంటంటే.. 27వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్‌లో ‘శంకరాభరణం’ (1980) సినిమాకు నాలుగు జాతీయ అవార్డులు లభించాయి. 30వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్‌లో ‘మేఘ సందేశం’ (1982)కి నాలుగు అవార్డులు వచ్చాయి. అలాగే ‘దాసి’ (1988) చిత్రం 36వ జాతీయ అవార్డ్స్‌లో ఐదు విభాగాల్లో అవార్డులను దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగు సినిమాలకు ఐదుకు మించి అవార్డులు రాలేదు. 35 ఏళ్లకు రెండు ఐదులు.. అంటే పది అవార్డులు దక్కించుకుని తెలుగు చిత్రసీమ తొలి రికార్డ్‌ని సాధించింది. 69వ చలనచిత్ర జాతీయ అవార్డు విజేతలు ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప) ఉత్తమ నటి: ఆలియా భట్ (గంగూబాయి..) – కృతీసనన్ (మిమీ) ఉత్తమ చిత్రం: రాకెట్రీ: ద నంబీ ఎఫెక్ట్ (హిందీ) ఉత్తమ దర్శకుడు: నిఖిల్ మహాజన్ (గోదావరి– మరాఠీ సినిమా) ఉత్తమ పిల్లల చిత్రం: గాంధీ అండ్ కో (గుజరాతీ) ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ (నేపథ్య సంగీతం): ఆర్ఆర్ఆర్æ– ఎమ్ఎమ్ కీరవాణి ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు): పుష్ప– దేవిశ్రీ ప్రసాద్ ఉత్తమ కొరియోగ్రఫీ: ఆర్ఆర్ఆర్ –ప్రేమ్ రక్షిత్ ఉత్తమ మేల్ ప్లేబ్యాక్ సింగర్: కాలభైరవ (ఆర్ఆర్ఆర్ – కొమురం భీముడో..) ఉత్తమ లిరిక్స్: చంద్రబోస్– కొండపొలం ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ అవార్డ్ (స్టంట్ కొరియోగ్రఫీ): ఆర్ఆర్ఆర్– కింగ్ సాల్మన్ ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: ఆర్ఆర్ఆర్– శ్రీనివాస్ మోహనన్ ఉత్తమ సహాయ నటి: పల్లవీ జోషి (ద కశ్మీరీ ఫైల్స్– హిందీ) ఉత్తమ సహాయ నటుడు: పంకజ్ త్రిపాఠీ (మిమీ– హిందీ) ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: ప్రీతిశీల్ సింగ్ డిసౌజా (గంగూబాయి కతియావాడి–హిందీ) ఉత్తమ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్: శ్రేయా ఘోషల్ (ఇరవిన్ నిళల్– తమిళ్) ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: వీరా కపూర్ ఏ (సర్దార్ ఉద్ధమ్–హిందీ) ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ : ది మిత్రీ మాలిక్ – మాన్సి ధ్రువ్ మెహతా (సర్దార్ ఉద్ధమ్) (హిందీ) ఉత్తమ ఎడిటింగ్: సంజయ్ లీలా భన్సాలీ (గంగూబాయి కతియావాడి–హిందీ) ఉత్తమ ఆడియోగ్రఫీ (లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్): అరుణ్ అశోక్ – సోనూ కేపీ (చవిట్టు మూవీ–మలయాళం) ఉత్తమ స్క్రీన్‌ప్లే(అడాప్టెడ్): సంజయ్‌లీలా భన్సాలీ, ఉత్కర్షిణి వశిష్ట (గంగూబాయి కతియావాడి– హిందీ) ఉత్తమ స్క్రీన్ ప్లే (ఒరిజినల్): షాహీ కబీర్ (నాయట్టు సినిమా–మలయాళం) ఉత్తమ స్క్రీన్ ప్లే (డైలాగ్ రైటర్): ప్రకాశ్ కపాడియా – ఉత్కర్షిణి వశిష్ట (గంగూబాయి కతియావాడి– హిందీ) ఉత్తమ సినిమాటోగ్రఫీ: అవిక్ ముఖోపాధ్యాయ్ (సర్దార్ ఉద్ధమ్ మూవీ–హిందీ) ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: భవిన్ రబరీ (ఛెల్లో షో – గుజరాతీ) ఉత్తమ ఫిలిం ఆన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ : అవషావ్యూహం (మలయాళం) ఉత్తమ ఫిలిం ఆన్ సోషల్ ఇష్యూస్: అనునాద్–ద రెజోనెన్ ్స (అస్సామీ) ఉత్తమ పాపులర్ ఫిలిం ఆన్ ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్ మెంట్: ఆర్ఆర్ఆర్ ఉత్తమ ఆడియోగ్రఫీ (సౌండ్ డిజైనర్): అనీష్ బసు (జీలీ మూవీ– బెంగాలీ) ఉత్తమ ఆడియోగ్రఫీ (రీ రికార్డిస్ట్ ఆఫ్ ద ఫైనల్ మిక్స్డ్ ట్రాక్): సినోయ్ జోసెఫ్ (సర్దార్ ఉద్ధమ్–హిందీ) ఇందిరాగాంధీ అవార్డ్ ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిలిం ఆఫ్ ఎ డైరెక్టర్: మెప్పాడియన్ (మలయాళం) స్పెషల్ జ్యూరీ అవార్డ్: షేర్ షా (హిందీ) (డైరెక్టర్ విష్ణువర్థన్) నర్గీస్ దత్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్: ద కశ్మీరీ ఫైల్స్ (హిందీ) ఉత్తమ ప్రాంతీయ చిత్రాలు ఉత్తమ తెలుగు చిత్రం : ఉప్పెన ఉత్తమ తమిళ్ చిత్రం : కడైసి వివసాయి (ద లాస్ట్ ఫార్మర్) ఉత్తమ కన్నడ చిత్రం : 777 చార్లి ఉత్తమ మలయాళ చిత్రం : హోమ్ ఉత్తమ హిందీ చిత్రం : సర్దార్ ఉద్దామ్ ఉత్తమ గుజరాతీ చిత్రం : లాస్ట్ ఫిల్మ్ షో (ఛెల్లో షో) ఉత్తమ మరాఠీ చిత్రం : ఏక్డా కే జాలా ఉత్తమ మీషింగ్ చిత్రం : బూంబా రైడ్ ఉత్తమ అస్సామీస్ చిత్రం : అనూర్ (ఐస్ ఆన్ ది సన్ షైన్) ఉత్తమ బెంగాలీ చిత్రం : కల్కొకో–హౌస్ ఆఫ్ టైమ్ ఉత్తమ మైథిలీ చిత్రం : సమాంతర్ ఉత్తమ ఒడియా చిత్రం : ప్రతీక్ష్య (ద వెయిట్) ఉత్తమ మెయిటిలాన్ చిత్రం : ఈఖోయిగీ యమ్ (అవర్ హోమ్) ‘పుష్ప’ చిత్రంలో నటనకుగాను అల్లు అర్జున్‌కి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కడం సంతోషం. తొలిసారి ఈ అవార్డు అందుకోనున్న అల్లు అర్జున్‌కి అభినందనలు. 69వ జాతీయ అవార్డులు తెలుగు చిత్ర పరిశ్రమకు బొనాంజాగా నిలిచాయి. అదే విధంగా పాన్ ఇండియా కాన్వాస్‌లో దూసుకుపోతున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి ఆరు విభాగాల్లో ఈ అవార్డులు దక్కటం ప్రశంసనీయం. డైరెక్టర్ రాజమౌళితో పాటు చిత్ర యూనిట్‌కి అభినందనలు. ఉత్తమ సంగీత దర్శకునిగా దేవీశ్రీ ప్రసాద్ (పుష్ప), ఉత్తమ సాహిత్యానికి చంద్రబోస్ (కొండపొలం) జాతీయ అవార్డుకు ఎంపికవడం అభినందనీయం. – వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. తెలుగు సినిమా గర్వపడే క్షణాలివి. జాతీయ ఉత్తమ నటుడిగా నిలిచిన బన్నీ (అల్లు అర్జున్)కి శుభాకాంక్షలు. చాలా గర్వంగా ఉంది. రాజమౌళి విజన్‌లో ఆరు అవార్డులు సాధించిన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌కు, రెండు అవార్డులు సాధించిన ‘పుష్ప’కు, ‘ఉప్పెన’ టీమ్‌కు, సినీ విమర్శకులు పురుషోత్తమచార్యులకు శుభాకాంక్షలు. – చిరంజీవి ఇట్స్ సిక్సర్.. జాతీయ అవార్డులు సాధించినందుకు ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ అందరికీ శుభాకాంక్షలు. ఎంపిక చేసిన జ్యూరీకి ధన్యవాదాలు. ‘పుష్ప’.. తగ్గేదేలే... బన్నీకి, దేవిశ్రీ ప్రసాద్‌లతో పాటు ‘పుష్ప’ టీమ్‌కి శుభాకాంక్షలు. బోస్ (చంద్రబోస్)గారికి మళ్లీ శుభాకాంక్షలు. ‘గంగూబాయి కతియావాడి’తో అవార్డు గెల్చుకున్న మా ‘సీత’ (‘ఆర్ఆర్ఆర్’లో ఆలియా భట్ సీత పాత్రలో నటించారు)కు కంగ్రాట్స్. ‘ఉప్పెన’ టీమ్‌తో పాటు జాతీయ స్థాయిలో అవార్డులు గెల్చుకున్నవారికీ శుభాకాంక్షలు. – రాజమౌళి నా నేపథ్య సంగీతాన్ని గుర్తించి, నాకు జ్యూరీ సభ్యులు అవార్డును ప్రకటించడాన్ని గౌరవంగా భావిస్తున్నాను . చంద్రబోస్‌గారికి, దేవిశ్రీ ప్రసాద్, కాలభైరవ.. మా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌కు శుభాకాంక్షలు. – కీరవాణి ఈ జాతీయ అవార్డు మీదే (సంజయ్ సార్, గంగూబాయి.. టీమ్.. ముఖ్యంగా ప్రేక్షకులు). ఎందుకంటే... మీరు లేకుంటే నాకు ఈ అవార్డు దక్కేదే కాదు. చాలా సంతోషంగా ఉంది. ఈ క్షణాలను గుర్తుపెట్టుకుంటాను. మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు ఇంకా కష్టపడతాను. ‘మిమి’ సినిమాలో నీ ( కృతీ సనన్ని ఉద్దేశించి) నటన నిజాయితీగా, పవర్‌ఫుల్‌గా ఉంది. ఆ సినిమా చూసి నేను ఏడ్చాను. ఉత్తమ నటి అవార్డుకు నువ్వు అర్హురాలివి. – ఆలియా భట్. ఏఏఏ 69 సంవత్సరాలుగా తెలుగు ఇండస్ట్రీకి రాని ఆ అద్భుతాన్ని తీసుకొచ్చిన ప్రేక్షకులకు, నిర్మాతలకు, దర్శకుడికి, ముఖ్యంగా మా ఫ్యామిలీని పతాకస్థాయికి తీసుకుని వెళ్లిన మా అబ్బాయికి (అల్లు అర్జున్ ) కృతజ్ఞతలు. – అల్లు అరవింద్ ఇంకా వెంకటేశ్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్ తదితరులు తమ ఆనందం వ్యక్తం చేశారు. పది అవార్డులతో తొలి రికార్డ్ ఈసారి తెలుగు పరిశ్రమ ఎక్కువ జాతీయ అవార్డులు సొంతం చేసుకోవడంతో పాటు మరో విశేషమైన రికార్డ్ సాధించింది. అదేంటంటే.. 27వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్‌లో ‘శంకరాభరణం’ (1980) సినిమాకు నాలుగు జాతీయ అవార్డులు లభించాయి. 30వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్‌లో ‘మేఘ సందేశం’ (1982)కి నాలుగు అవార్డులు వచ్చాయి. అలాగే ‘దాసి’ (1988) చిత్రం 36వ జాతీయ అవార్డ్స్‌లో ఐదు విభాగాల్లో అవార్డులను దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగు సినిమాలకు ఐదుకు మించి అవార్డులు రాలేదు. 35 ఏళ్లకు రెండు ఐదులు.. అంటే పది అవార్డులు దక్కించుకుని తెలుగు చిత్రసీమ తొలి రికార్డ్‌ని సాధించింది. ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ భారతదేశ ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త నంబియార్ నారాయణన్ జీవిత చరిత్ర ఆధారంగా ‘రాకెట్రీ: ‘ది నంబి ఎఫెక్ట్’ సినిమా రూపొందింది. ఇస్రోలో చేరిన నారాయణన్ స్వదేశీ రాకెట్లను అభివృద్ధి చేసే ప్రాజెక్ట్‌లో భాగంగా రష్యా డెవలప్ చేసిన క్రయోజెనిక్ ఇంజ¯Œ ్సని భారత్‌కి తీసుకురావాలనుకుంటారు. ఇదే సమయంలో పాకిస్తా¯Œ కు భారత రాకెట్ సాంకేతిక విషయాలను చేరవేశారనే నెపంతో అరెస్ట్ అవుతారు నారాయణన్. అరెస్ట్ తర్వాత కేరళ పోలీసుల విచారణలో ఆయన ఎలాంటి చిత్రహింసలు అనుభవించారు? ఆ తర్వాత ఆయన జీవితం ఎలా మలుపు తిరిగింది? తనపై వచ్చిన తప్పుడు ఆరోపణల నుంచి నారాయణన్ ఎలా విముక్తి పొందారు? అనే నేపథ్యంలో ‘రాకెట్రీ: ‘ది నంబి ఎఫెక్ట్’ సినిమా రూపొందింది. నంబియార్ నారాయణన్ పాత్ర చేయడంతో పాటు మాధవన్ దర్శకత్వం వహించారు. నారాయణన్ సతీమణి మీన క్యారెక్టర్లో హీరోయిన్ సిమ్రాన్ చక్కగా నటించారు. ప్రత్యేకించి ఆమె పండించిన భావోద్వేగాలు సినిమాకి హైలైట్. హీరో సూర్య అతిథి పాత్రలో మెరవడం కూడా ఈ సినిమాకి ప్లస్ అయ్యింది. ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. నా అభిప్రాయాన్ని బలంగా చెప్పాను – ఎంఎం శ్రీలేఖ ‘‘ప్రతి ఏడాది తెలుగు సినిమాలంటే కొంచెం నిర్లక్ష్యం. కంటి తుడుపుగా ఒకటో రెండో అవార్డులు ఇస్తున్నారు. దీనిపై జ్యూరీలో గట్టిగా మాట్లాడేవారు కావాలి. తెలుగుకు ఎందుకు ఇవ్వరు? అని మాట్లాడ గలగాలి. అయితే ఆ సినిమాలో విషయం ఉండాలి.. లేకుంటే మాట్లాడలేం’’ అన్నారు సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ. 69వ జాతీయ అవార్డుల్లో దక్షిణాది తరఫున జ్యూరీలో శ్రీలేఖతో పాటు రచయిత్రి బలభద్రపాత్రుని రమణి ఉన్నారు. అవార్డులు ప్రకటించిన అనంతరం ఎంఎం శ్రీలేఖ ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘‘మామూలుగా ఫైనల్ ప్యానల్లో భోజ్‌పురి వాళ్లు ఉంటారు. వారికి మహానటి సావిత్రి గురించి ఏం తెలుస్తుంది? అందుకే జ్యూరీలో ఉన్న తెలుగువారు తెలుగు సినిమాల గురించి గట్టిగా చెప్పాలి. ఓ జ్యూరీ సభ్యురాలిగా నా అభిప్రాయాన్ని నేను బలంగా చెప్పాను. ఈసారి నేను ఏవైతే రావాలనుకున్నానో దాదాపు వాటికే వచ్చాయి. తొలిసారి తండ్రీ కొడుకులు కీరవాణి అన్నయ్య– కాలభైరవ ఒకే వేదికపై అవార్డులు తీసుకోనుండటం నాకో గొప్ప అనుభూతి. ఇక జ్యూరీ సభ్యులకు ఒత్తిడి ఉంటుందనుకుంటారు.. అలాంటిదేమీ లేదు. నిజాయతీగా నాకు ఏది అనిపిస్తే అది చెప్పాను’’ అన్నారు. ఉప్పెన మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన హీరోల్లో వైష్ణవ్ తేజ ఒకరు. ఆయన నటించిన తొలి చిత్రం ‘ఉప్పెన’. ఈ సినిమా ద్వారా బుచ్చిబాబు సన డైరెక్టర్‌గా, కృతీశెట్టి హీరోయిన్గా పరిచయమయ్యారు. ఈ ముగ్గురూ తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నారు. సముద్ర తీరాన ఉప్పాడ అనే పల్లెటూరు. స్కూల్ డేస్ నుంచే బేబమ్మ (కృతీశెట్టి) మీద ఇష్టం పెంచుకున్న మత్స్యకార కుటుంబానికి చెందిన ఆశీర్వాదం (వైష్ణవ్ తేజ్) నిత్యం తననే ఆరాధిస్తూ ప్రేమిస్తుంటాడు. ప్రాణం కంటే పరువు ముఖ్యం అనుకునే పెద్ద మనిషి శేషారాయనం (విజయ్ సేతుపతి). ఆయన కూతురు బేబమ్మ కాలేజీలో చదువుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో తన మనసులోని ప్రేమను బేబమ్మకి చెబుతాడు ఆశీర్వాదం. తన స్వచ్ఛమైన ప్రేమను అర్థం చేసుకున్న బేబమ్మ కూడా ఆశీర్వాదాన్ని ప్రేమిస్తుంది. ఇద్దరూ ప్రేమలో ఉన్న విషయం శేషారాయనంకి తెలుస్తుంది. దీంతో ఆశీర్వాదం–బేబమ్మ కలిసి ఊరి నుంచి వెళ్లిపోతారు. ఈ విషయం బయటకి తెలిస్తే తన పరువు పోతుందని ఆర్నెళ్ల పాటు తన కూతుర ు ఇంట్లోనే ఉందని ఊరి జనాలను నమ్మిస్తాడు రాయనం. ఆరు నెలల తర్వాత అయినా బేబమ్మ ఇంటికి తిరిగొచ్చిందా? తన కులం కానివాడు తన కూతురిని ప్రేమించాడన్న కోపంతో ఆశీర్వాదంని శేషారాయనం ఏం చేశాడు? ఆశీర్వాదం–బేబమ్మ ప్రేమకథ ఎలాంటి మలుపు తీసుకుంటుంది? చివరికి వారిద్దరూ ఒక్కటయ్యరా ? లేదా అనేది ‘ఉప్పెన’ కథ. 2021 ఫిబ్రవరి 12న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. -
పనైపోయిందన్నారు.. కానీ వీళ్లిద్దరూ మాత్రం వేరే లెవల్!
ఏ సినిమా తీసుకున్నా.. హీరో, హీరోయిన్, డైరెక్టర్ ఇలా అందరూ కీలకమే. కానీ యాక్టర్స్ ఎంత ఫెర్ఫార్మ్ చేసినా సరే దానికి సరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ లేకపోతే అసలు ఆ సినిమాలో జీవమే ఉండదు. అలా గత కొన్ని దశాబ్దాల నుంచి ఎన్నో తెలుగు సినిమాలకు ప్రాణం పోసిన వాళ్ల లిస్ట్ తీస్తే అందులో కీరవాణి, దేవిశ్రీ ప్రసాద్ కచ్చితంగా ఉంటారు. ఇప్పుడు వాళ్లకు జాతీయ అవార్డులు రావడం మరింత ప్రత్యేకంగా నిలిచింది. (ఇదీ చదవండి: 'పుష్ప'కి జాతీయ అవార్డులు.. ఆ అంశాలే కలిసొచ్చాయా?) ఆస్కార్ ప్లస్ ఈ అవార్డ్ కీరవాణి పేరు చెప్పగానే అద్భుతమైన పాటలు, గూస్బంప్స్ తెప్పించే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గుర్తొస్తుంది. అప్పట్లో అందరూ హీరోల సినిమాలకు పనిచేసిన ఈయన.. కొన్నాళ్ల నుంచి మాత్రం ఎందుకో బయట సినిమాలు బాగా తగ్గించేశారు. ఒకవేళ చేసినా పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. కానీ బాహుబలి రెండు పార్ట్స్ తో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ఈయన.. 'ఆర్ఆర్ఆర్'లోని నాటు నాటు పాటతో ఆస్కార్ గెలిచారు. ఇప్పుడు అదే సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో జాతీయ అవార్డు సాధించారు. (ఇదీ చదవండి: 69వ జాతీయ సినిమా అవార్డులు ఫుల్ లిస్ట్) మాస్ కమ్‌బ్యాక్ మాస్, క్లాస్, రొమాంటిక్.. ఇలా ఏ పాటలకు ట్యూన్స్ కట్టాలన్నా అప్పట్లో దేవిశ్రీ ప్రసాద్ పేరు వినిపించేది. కానీ తమన్‌తోపాటు మిగతా సంగీత దర్శకుల హవా ఎక్కువ కావడంతో దేవిశ్రీ ప్రసాద్ క్రేజ్ పడిపోయింది. దీంతో చాలామంది డీఎస్పీ పనైపోయిందనుకున్నారు. కానీ 'పుష్ప' పాటలతో వరల్డ్ వైడ్ సెన్సేషన్ సృష్టించాడు. ఆ సాంగ్స్ వల్లే ఇప్పుడు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. సీనియర్ల అనుభవం అయితే పైన ఇద్దరికీ జాతీయ అవార్డులు రావడం విశేషమే. కానీ వీళ్ల గురించి జనాలు మెల్లమెల్లగా మరిచిపోతున్న టైంలో అవార్డులు గెలిచి చూపించారు. సీనియర్ల అనుభవం.. ఇలాంటప్పుడు ఎలా పనికొస్తుందనేది ప్రాక్టికల్ గా ప్రూవ్ చేసి చూపించారు. ఇప్పటి జనరేషన్ మాటల్లో చెప్పాలంటే.. ఇది కదా అసలైన కమ్‌బ్యాక్ అంటే అని అనొచ్చు. ఇక ఈ అవార్డులు ఇచ్చిన ఊపుతో రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలు చేస్తూ మంచి మ్యూజిక్ ఇవ్వాలని.. తెలుగు సంగీత ప్రియులు కోరుకుంటున్నారు. (ఇదీ చదవండి: సిక్స్ కొట్టిన ఆర్ఆర్ఆర్.. ప్చ్.. ఆ ముగ్గురికి రాలేదే!) -
సిక్స్ కొట్టిన ఆర్ఆర్ఆర్.. ప్చ్.. ఆ ముగ్గురికి రాలేదే!
ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజైనప్పటి నుంచి ఒకటే రికార్డుల మోత.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ.. అంతర్జాతీయ స్థాయిలో అవార్డుల పరంపర.. అబ్బో.. ఇలా చాలానే ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీ అత్యున్నత పురస్కారంగా భావించే ఆస్కార్ సైతం ఆర్ఆర్ఆర్ వశమైంది. జక్కన్న చెక్కిన ఈ కళాఖండానికి ప్రపంచవ్యాప్తంగా రీసౌండ్ వచ్చింది. ఇండియన్ సినిమాను చూసి హాలీవుడ్ సైతం నోరెళ్లబెట్టింది. అంతటి కీర్తిప్రతిష్టలు సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ తాజాగా 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లోనూ సత్తా చాటింది. అత్యధికంగా ఆర్ఆర్ఆర్కు 6 అవార్డులు రాగా పుష్ప సినిమాకు 2 అవార్డులు వచ్చాయి. ఆర్ఆర్ఆర్కు 6 అవార్డులు బెస్ట్ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ వోల్సమ్ ఎంటర్టైన్మెంట్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సినిమాకు జాతీయ అవార్డు దక్కింది. ఉత్తమ కొరియోగ్రఫీ విభాగంలో ప్రేమ్ రక్షిత్‌కు, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో వి.శ్రీనివాస్ మోహన్, ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్‌గా కీరవాణి, బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్‌గా కాలభైరవ, బెస్ట్ యాక్షన్ స్టంట్ కొరియోగ్రాఫర్‌గా కింగ్ సోలోమన్‌కు జాతీయ అవార్డులు ప్రకటించారు. ఉత్తమ నటుడిగా రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్లలో ఎవరో ఒకరికి పురస్కారం ప్రకటించడం ఖాయం అనుకున్నారు ఫ్యాన్స్. ఈ ముగ్గురిలో ఒక్కరికీ రాలే కానీ వారి అంచనాలను తారుమారు చేస్తూ పుష్పరాజ్ బన్నీకి కట్టబెట్టారు. అటు రాజమౌళి పరిస్థితి కూడా అంతే.. ఉత్తమ డైరెక్టర్‌గా ఈయన పేరు ప్రకటించడం ఖాయం అనుకుంటే మరాఠీ డైరెక్టర్ నిఖిల్ మహాజన్(గోదావరి సినిమా)కు పురస్కారం వరించింది. దీంతో అభిమానులు నిరాశ చెందారు. ముగ్గురు ఆర్లలో ఏ ఒక్కరికీ అవార్డు కైవసం కాలేదని ఫీలవుతున్నారు. వీళ్లు ఏళ్ల తరబడి పడిన కష్టం అవార్డు కమిటీకి కనిపించలేదా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జక్కన్నకు వచ్చినా బాగుండేది! ఆర్ఆర్ఆర్కు బోలెడన్ని అవార్డులు వచ్చాయి. సినిమాకు పనిచేసిన అందరినీ దాదాపు ఏదో ఒక అవార్డు వరించింది కానీ ఈ ముగ్గురికి మాత్రం ఒక్క పురస్కారం రాలేదు. వీళ్లకు ప్రపంచవ్యాప్తంగా పేరు, గుర్తింపు వచ్చిందే తప్ప అవార్డులు రావడం లేదెందుకని అభిమానులు తల పట్టుకుంటున్నారు. జక్కన్నకు వచ్చినా మనసు తృప్తి చేసుకునేవాళ్లమని అభిప్రాయపడుతున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా విషయానికి వస్తే.. రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్‌గా యాక్ట్ చేశారు. విజయేంద్రప్రసాద్ కథ అందించగా రాజమౌళి దర్శకత్వం వహించాడు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య దాదాపు రూ.500 కోట్ల పైచిలుకు భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. THE PROUD TEAM FLOURISHED AGAIN… 💥💥💥💥💥💥 It’s a SIXERRR at the National Awards 🔥🌊 #RRRMovie pic.twitter.com/GOjsY4IHRl — RRR Movie (@RRRMovie) August 24, 2023 చదవండి: జాతీయ అవార్డు.. బన్నీని పట్టుకుని కంటతడి పెట్టిన సుకుమార్ -
జాతీయ అవార్డుల్లో 'తెలుగు' హవా.. స్టార్స్ రియాక్షన్ ఇదే
69వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. 'ఆర్ఆర్ఆర్' సినిమా టీమ్ సిక్స్ కొట్టగా, 'పుష్ప' సినిమాకు రెండు అవార్డులు దక్కాయి. అలానే ఉత్తమ తెలుగు చిత్రంగా 'ఉప్పెన' నిలిచింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ నిలవడం 69 ఏళ్ల సినీ చరిత్రలో సరికొత్త రికార్డు అనే చెప్పొచ్చు. అలానే ఆస్కార్ కొట్టిన 'ఆర్ఆర్ఆర్' కూడా జాతీయ అవార్డుల్లో హవా చూపించింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్స్ అందరూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. వాటిపై మీరు ఓ లుక్ వేయండి. (ఇదీ చదవండి: జాతీయ సినిమా అవార్డులు పూర్తి జాబితా) Heartiest Congratulations to All The Award Winners of 69 th National Film Awards 2021 !!!! 👏👏👏 Also Proud Moment for Telugu Cinema 👏👏👏 Heartiest Congratulations to especially my dearest Bunny @AlluArjun for the coveted National Best Actor Award !!!!! Absolutely Proud of… — Chiranjeevi Konidela (@KChiruTweets) August 24, 2023 ప్రతిష్ఠాత్మక 69వ జాతీయ చలనచిత్ర అవార్డులను పొందిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ పేరుపేరునా నా హృదయపూర్వక అభినందనలు. -నందమూరి బాలకృష్ణ Warmest congratulations to all the recipients of the 69th National Film Awards in 2021! It's a big day for Telugu Cinema 🔥 Congratulations to Bunny on the much deserved win. Best Actor! So proud @alluarjun ❤️ Congrats to the "National Award winning composer" @ThisIsDSP 🎸🙌 — Venkatesh Daggubati (@VenkyMama) August 24, 2023 It’s a SIXERRR… Congratulations to the entire team of RRR on winning national awards. Thanks to the jury for the recognition..:) Bhairi, Prem Master, Peddanna, Srinivas Mohan garu, Solomon Master 🥰🥰 — rajamouli ss (@ssrajamouli) August 24, 2023 PUSHPAAAA… THAGGEDE LE. Congratulations Bunny…🥰🤗 — rajamouli ss (@ssrajamouli) August 24, 2023 Congratulations to my colleagues of #RRRMovie. @kaalabhairava7 you brought Komuram Bheemudo song to life with your voice. @mmkeeravaani garu, your background score for our film is the best and this award is another recognition for the same. Prem Master, every aching bone and… — Jr NTR (@tarak9999) August 24, 2023 Congratulations @aliaa08 and all the other winners of the national awards. You have made yourselves and your well wishers immensely proud. — Jr NTR (@tarak9999) August 24, 2023 So happy to see @alluarjun anna on winning the best actor national award! Such a proud moment! You truly deserve this!♥️#NationalAwards — Varun Tej Konidela (@IAmVarunTej) August 24, 2023 Congratulations to all the winners of the 69th national awards! Special mention to team RRR and Pushpa.@ssrajamouli sir you continue to make us proud.🙌🏽 And to buchi babu on winning the best regional film for uppena!👏🏽 Congrats to @ThisIsDSP , keeravani garu and @boselyricist . — Varun Tej Konidela (@IAmVarunTej) August 24, 2023 Many congratulations to the maverick @ssrajamouli garu and the team of #RRRMovie for winning big at the 69th National Awards! Your achievements are an inspiration to us all. My heartfelt best wishes and loads of love on this remarkable feat 👏🏼@AlwaysRamcharan @tarak9999… — Anil Ravipudi (@AnilRavipudi) August 24, 2023 THE PROUD TEAM FLOURISHED AGAIN… 💥💥💥💥💥💥 It’s a SIXERRR at the National Awards 🔥🌊 #RRRMovie pic.twitter.com/GOjsY4IHRl — RRR Movie (@RRRMovie) August 24, 2023 After ruling the box office, it is PUSHPA RAJ'S RULE at the #NationalAwards 🔥🔥 Icon Star @alluarjun BECOMES THE FIRST ACTOR FROM TFI to win the BEST ACTOR at the National Awards ❤️#AlluArjun Wins the Best Actor at the 69th National Awards for #Pushpa ❤️🔥#ThaggedheLe… pic.twitter.com/LqWnTcwpAe — Pushpa (@PushpaMovie) August 24, 2023 After ruling the box office, it is PUSHPA RAJ'S RULE at the #NationalAwards 🔥🔥 Icon Star @alluarjun BECOMES THE FIRST ACTOR FROM TFI to win the BEST ACTOR at the National Awards ❤️#AlluArjun Wins the Best Actor at the 69th National Awards for #Pushpa ❤️🔥#ThaggedheLe… pic.twitter.com/s3Wz2ObPKq — Mythri Movie Makers (@MythriOfficial) August 24, 2023 -
'పుష్ప'కి జాతీయ అవార్డులు.. ఆ అంశాలే కలిసొచ్చాయా?
69వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. మొత్తం 11 కేటగిరీల్లో పురస్కారాలు సొంతం చేసుకుంది. మిగతా విభాగాల సంగతేమో గానీ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ నిలవడం సరికొత్త ఘనత అని చెప్పొచ్చు. ఎందుకంటే 69 ఏళ్ల సినీ చరిత్రలో ఓ తెలుగు నటుడికి జాతీయ అవార్డ్ రావడం ఇదే ఫస్ట్ టైమ్. అలానే డీఎస్పీ కూడా 'పుష్ప' సాంగ్స్‌కి గానూ అవార్డు అందుకున్నాడు. అసలు వీళ్లిద్దరికీ కలిసొచ్చిన అంశాలేంటి? పాటలు వైరల్ సినిమాలో కథ ఎలాంటిదైనా సరే జనాల్లో అంచనాలు పెరగాలంటే ప్రమోషనల్ కంటెంట్ ముఖ్యం. ఆ విషయంలో 'పుష్ప' ఫుల్ మార్క్స్ కొట్టేసింది. ఎందుకంటే రిలీజ్ చేసిన ప్రతి పాట కూడా జనాలకు తెగ నచ్చేసింది. పిచ్చిపిచ్చిగా ఎక్కేసింది. శ్రీవల్లి, సామీ సామీ, ఏయ్ బిడ్డా, ఊ అంటావా మావ, దాక్కో దాక్కో.. ఇలా ప్రతి సాంగ్ కూడా చార్ట్ బస్టర్‌గా నిలిచింది. (ఇదీ చదవండి: 69వ జాతీయ సినిమా అవార్డులు ఫుల్ లిస్ట్) విదేశాల్లోనూ హవా అయితే 'పుష్ప' పాటలు తెలుగు వరకే పరిమితం కాలేదు. విదేశాల్లోనూ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. 'పుష్ప' రిలీజ్‌కి కొన్నిరోజుల ముందు, ఆ తర్వాత కూడా ఎక్కడా చూసిన పుష్ప పాటలకు డ్యాన్స్, రీల్స్ తెగ కనిపించాయి, వినిపించేవి. అలా పాటలన్నీ మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. సినిమా కూడా 'పుష్ప' సినిమా రిలీజైన తొలిరోజు చాలామంది బాగోలేదని అన్నారు. కానీ వీకెండ్ పూర్తయ్యేసరికి టాక్ మొత్తం మారిపోయింది. బ్లాక్‌బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు సౌత్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక నార్త్‌లో అయితే చెప్పాల్సిన పనిలేదు. 'పుష్ప' దెబ్బకు బన్నీ.. పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. (ఇదీ చదవండి: కంగ్రాట్స్ బావా.. ఈ అవార్డు నీకు రావాల్సిందే: తారక్) బన్నీ ఊరమాస్ అల్లు అర్జున్ డిఫరెంట్ పాత్రలు చేయడంలో ఎక్స్పర్ట్. అయితే 'పుష్ప' కోసం మరింత కష్టపడ్డాడు. చిత్తూరు యాసతో పాటు డీగ్లామర్ లుక్‌తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. కామెడీ, ఎమోషన్, ఫైట్స్.. ఇలా అన్ని అంశాల్లోనూ ఊరమాస్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దీంతో ఆలోవర్ ఇండియా అల్లు అర్జున్‌కి ఫిదా అయింది. ఇప్పుడు ఏకంగా జాతీయ అవార్డు వరించింది. 'పుష్ప' సీక్వెల్లో.. 'ఇది 'పుష్ప'గాడి రూలు' ఓ డైలాగ్ ఉంది. ఆ మూవీ రిలీజ్‌కి ముందే జాతీయ అవార్డుల్లో ఆ మాట నిజమైంది. ఎందుకంటే 'పుష్ప' రూల్ చేసి పడేశాడుగా. ఇలా పైన చెప్పిన అంశాలతోపాటు సుకుమార్ డైరెక్షన్, రష్మిక యాక్టింగ్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు ఇలా చాలా అంశాలు కలిసొచ్చాయి. దీంతో జాతీయ సినిమా అవార్డుల్లో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ నిలిచారు. తెలుగు సినిమా స్థాయిని అందనంత ఎత్తుకి పెంచేశారు. (ఇదీ చదవండి: ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు.. అల్లు అర్జున్ ఫస్ట్ రియాక్షన్ ఇదే!) -
ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు.. అల్లు అర్జున్ ఫస్ట్ రియాక్షన్ ఇదే!
జాతీయ అవార్డును ముద్దాడాలన్నది ఎందరో కల.. కానీ కొందరే దాన్ని నెరవేర్చుకోగలరు. 68 ఏళ్లుగా జాతీయ సినీ అవార్డుల పురస్కారం జరుగుతోంది. కానీ ఇంతవరకు ఉత్తమ నటుడి కేటగిరీలో ఒక్కటంటే ఒక్కటి కూడా తెలుగు హీరోకు దక్కలేదు. అది అందని ద్రాక్షగానే మిగిలిపోతుందా? అన్న భయాలను అల్లు అర్జున్ పటాపంచలు చేశాడు. ఎవ్వరైనా రానీ.. ఎవ్వరైనా ఉండనీ.. నీయవ్వ.. తగ్గేదేలే అంటూ బన్నీ.. ఎందరో స్టార్స్‌ను వెనక్కు నెట్టి ఉత్తమ నటుడి అవార్డు కైవసం చేసుకున్నాడు. దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అటు బన్నీ కూడా అవార్డు తనకు ప్రకటించగానే షాక్‌లో ఉండిపోయాడట! ఎవరైనా ప్రశంసించేందుకు ప్రయత్నిస్తున్నా.. నేనింకా షాక్‌లో ఉన్నా.. నమ్మలేకపోతున్నాను అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడట! మా ఐకాన్ స్టార్ తలుచుకుంటే అసాధ్యం కూడా సుసాధ్యమవుతుందంటున్నారు అభిమానులు. ఇకపోతే ఉత్తమ నటిగా అలియా భట్ (గంగూబాయి కతియావాడి), కృతి సనన్(మిమీ), ఉత్తమ సహాయ నటుడిగా పంకజ్ త్రిపాఠి(మిమీ), ఉత్తమ సహాయ నటిగా పల్లవి జోషి(ది కశ్మీర్ ఫైల్స్), ఉత్తమ దర్శకుడిగా నిఖిల్ మహాజన్ (గోదావరి) అవార్డులు అందుకున్నారు. చదవండి: తెలుగు సినిమా రచ్చ.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ -
కంగ్రాట్స్ బావా.. ఈ అవార్డు నీకు రావాల్సిందే: తారక్
ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు మన తెలుగు హీరోకు వరిస్తుందా? లేదా? అన్న ఉత్కంఠకు తెరపడింది. ఎందరో స్టార్ హీరోలను వెనక్కి నెడుతూ అల్లు అర్జున్‌కు బెస్ట్ యాక్టర్ అవార్డు వరించింది. 68 ఏళ్లుగా ఏ హీరోకూ దక్కని అరుదైన గౌరవం బన్నీకి దక్కింది. దీంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బన్నీని అభినందిస్తూ ట్వీట్ చేశాడు. కంగ్రాచ్యులేషన్స్ బావా.. పుష్ప సినిమాకుగానూ ఈ విజయం, అవార్డులు నీకు దక్కి తీరాల్సిందే అని రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. పార్టీ లేదా పుష్ప డైలాగ్ మిస్ చేశారు సర్.. అని కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు 2021లో వచ్చిన సినిమాలకుగానూ ప్రకటించారు. ఉత్తమ చిత్రంగా ఉప్పెన, బెస్ట్ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ వోల్సమ్ ఎంటర్టైన్మెంట్గా ఆర్ఆర్ఆర్ అవార్డులు ఎగరేసుకుపోయాయి. ఇంకా ఏయే సినిమాకు ఏయే అవార్డులు వచ్చాయంటే.. ♦ ఉత్తమ యాక్షన్ డైరెక్షన్(స్టంట్ కొరియోగ్రఫీ) - కింగ్ సాల్మన్ (ఆర్ఆర్ఆర్) ♦ ఉత్తమ కొరియోగ్రఫీ - ప్రేమ్ రక్షిత్ (ఆర్ఆర్ఆర్) ♦ ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ - వి.శ్రీనివాస్ మోహన్ (ఆర్ఆర్ఆర్) ♦ ఉత్తమ లిరిక్స్- చంద్రబోస్ (ధమ్ ధమా ధమ్- కొండపొలం) ♦ ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్(సాంగ్స్) - దేవి శ్రీప్రసాద్ (పుష్ప 1) ♦ ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ (బ్యాగ్రౌండ్ స్కోర్) - ఎమ్ఎమ్ కీరవాణి (ఆర్ఆర్ఆర్) ♦ ఉత్తమ మేల్ ప్లేబ్యాక్ సింగర్ - కాల భైరవ (కొమురం భీముడో.. - ఆర్ఆర్ఆర్) ♦ బెస్ట్ తెలుగు ఫిలిం క్రిటిక్- పురుషోత్తమాచార్యులు Congratulations @alluarjun bava. You deserve all the success and awards you get for #Pushpa. — Jr NTR (@tarak9999) August 24, 2023 చదవండి: చరణ్, తారక్‌ను వెనక్కు నెట్టి అవార్డు కొట్టేసిన బన్నీ.. టాలీవుడ్‌కు మొత్తంగా ఎన్ని అవార్డులు వచ్చాయంటే?