కేంద్ర ప్రభుత్వం గురువారం 69వ సినీ జాతీయ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసారి తెలుగు చిత్ర పరిశ్రమ అత్యధిక అవార్డులను కై వసం చేసుకుంది. అదేవిధంగా తమిళ చిత్ర పరిశ్రమ ఆశాజనకమైన అవార్డులను గెలుచుకుంది. నటుడు కమల్ హాసన్ వంటి పలువురు సినీ ప్రముఖులు దక్షిణాది చిత్ర పరిశ్రమ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి ఈ అవార్డులు చిహ్నంగా పేర్కొన్నారు.
అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ జాతీయ ఉత్తమ అవార్డులకు ఎంపికైన చిత్రాలకు, దర్శక నిర్మాతలకు ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. అందులో కశ్మీర్ ఫైల్స్ చిత్రానికి నర్గీస్‌దత్ పేరుతో జాతీయ సమైక్యత అవార్డును ప్రకటించడాన్ని తప్పుపట్టారు. పలు విధాలుగా వివాదాలను ఎదుర్కొన్న కశ్మీర్ ఫైల్స్ లాంటి చిత్రాలకు ఇలాంటి అవార్డులకు ప్రకటించడం దేశ సమైక్యతను దెబ్బ తీస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇకపోతే ఉత్తమ చిత్రంగా రాకెట్రీ:ది నంబి ఎఫెక్ట్‌ను ప్రకటించగా.. ప్రాంతీయ భాషలో ఉత్తమ చిత్రంగా ఉప్పెనకు జాతీయ అవార్డు అనౌన్స్ చేశారు. ఉత్తమ నటుడిగా పుష్ప:పార్ట్ 1 సినిమాకు అల్లు అర్జున్, ఉత్తమ నటిగా గంగూబాయి కతియావాడి సినిమాకుగానూ ఆలియా భట్, మిమీ చిత్రానికిగానూ కృతి సనన్ ఎంపికయ్యారు.
#69thNationalFilmAwards -இல் தமிழில் சிறந்த படமாகத் தேர்வாகியிருக்கும் #கடைசிவிவசாயி படக்குழுவினருக்கு என் பாராட்டுகள்! @VijaySethuOffl #Manikandan #நல்லாண்டி
— M.K.Stalin (@mkstalin) August 24, 2023
மேலும், #இரவின்நிழல் படத்தில் ‘மாயவா சாயவா’ பாடலுக்காகச் சிறந்த பின்னணிப் பாடகி விருதை வென்றுள்ள @shreyaghoshal,… pic.twitter.com/Bc2veRY5gs
జాతీయ అవార్డుల పూర్తి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి
చదవండి: అమ్మా, నాన్న పెళ్లి చేసుకోమంటున్నారు.. కానీ: విజయ్ దేవరకొండ
Comments
Please login to add a commentAdd a comment