National Film Awards
-
70వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన
-
జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుక.. వేదికపై మెరిసిన అల్లు అర్జున్ (ఫొటోలు)
-
జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్న అల్లు అర్జున్
-
అల్లు అర్జున్‌కు కంగ్రాట్స్: సీఎం కేసీఆర్
హైదరాబాద్: 69వ జాతీయ సినీ అవార్డుల్లో తెలుగు చిత్రాలు సత్తా చాటడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు సాధించిన నటుడు అల్లు అర్జున్ను సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. తొలిసారిగా తెలుగు నటుడికి బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. అలాగే.. అవార్డులు సాధించిన ఆర్ఆర్ఆర్, పుష్ప చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. అలాగే.. నల్లగొండకు చెందిన ముడుంబై పురుషోత్తమాచార్యులుకి జాతీయ ఉత్తమ సినీ విమర్శకుడిగా అవార్డు దక్కడంపైనా సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. తాజాగా.. రెండు రోజుల కిందట 69వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు సుకుమార్డైరెక్షన్లో వచ్చిన ‘పుష్ప ది రైజ్’ పార్ట్ 1 చిత్రానికిగానూ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కింది. దీంతో తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్ దక్కించుకున్న తొలి యాక్టర్‌గా బన్నీ చరిత్ర సృష్టించాడు. ఇక ఆరు అవార్డులతో రాజమౌళి మల్లీస్టారర్ ఆర్ఆర్ఆర్ సత్తా చాటింది. ఉప్పెన ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నెగ్గింది. మొత్తంగా తెలుగు సినిమాకు పదకొండు అవార్డులు దక్కాయి. జాతీయ అవార్డ్ విజేతలకు దక్కే ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా? -
కశ్మీర్ ఫైల్స్‌కు జాతీయ సమైక్యత అవార్డా?.. తప్పు పట్టిన సీఎం
కేంద్ర ప్రభుత్వం గురువారం 69వ సినీ జాతీయ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసారి తెలుగు చిత్ర పరిశ్రమ అత్యధిక అవార్డులను కై వసం చేసుకుంది. అదేవిధంగా తమిళ చిత్ర పరిశ్రమ ఆశాజనకమైన అవార్డులను గెలుచుకుంది. నటుడు కమల్ హాసన్ వంటి పలువురు సినీ ప్రముఖులు దక్షిణాది చిత్ర పరిశ్రమ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి ఈ అవార్డులు చిహ్నంగా పేర్కొన్నారు. అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ జాతీయ ఉత్తమ అవార్డులకు ఎంపికైన చిత్రాలకు, దర్శక నిర్మాతలకు ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. అందులో కశ్మీర్ ఫైల్స్ చిత్రానికి నర్గీస్‌దత్ పేరుతో జాతీయ సమైక్యత అవార్డును ప్రకటించడాన్ని తప్పుపట్టారు. పలు విధాలుగా వివాదాలను ఎదుర్కొన్న కశ్మీర్ ఫైల్స్ లాంటి చిత్రాలకు ఇలాంటి అవార్డులకు ప్రకటించడం దేశ సమైక్యతను దెబ్బ తీస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇకపోతే ఉత్తమ చిత్రంగా రాకెట్రీ:ది నంబి ఎఫెక్ట్‌ను ప్రకటించగా.. ప్రాంతీయ భాషలో ఉత్తమ చిత్రంగా ఉప్పెనకు జాతీయ అవార్డు అనౌన్స్ చేశారు. ఉత్తమ నటుడిగా పుష్ప:పార్ట్ 1 సినిమాకు అల్లు అర్జున్, ఉత్తమ నటిగా గంగూబాయి కతియావాడి సినిమాకుగానూ ఆలియా భట్, మిమీ చిత్రానికిగానూ కృతి సనన్ ఎంపికయ్యారు. #69thNationalFilmAwards -இல் தமிழில் சிறந்த படமாகத் தேர்வாகியிருக்கும் #கடைசிவிவசாயி படக்குழுவினருக்கு என் பாராட்டுகள்! @VijaySethuOffl #Manikandan #நல்லாண்டி மேலும், #இரவின்நிழல் படத்தில் ‘மாயவா சாயவா’ பாடலுக்காகச் சிறந்த பின்னணிப் பாடகி விருதை வென்றுள்ள @shreyaghoshal,… pic.twitter.com/Bc2veRY5gs — M.K.Stalin (@mkstalin) August 24, 2023 జాతీయ అవార్డుల పూర్తి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి చదవండి: అమ్మా, నాన్న పెళ్లి చేసుకోమంటున్నారు.. కానీ: విజయ్ దేవరకొండ -
National film awards 2023 :అల్లు అర్జున్... ఉత్తమ నటుడు
జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తొలిసారి తెలుగు సినిమాలు దుమ్ము రేపాయి. మొత్తం పది అవార్డులతో ‘ఎత్తర జెండా’ అంటూ తెలుగు సినిమా సత్తా చాటింది. 69 ఏళ్ల జాతీయ అవార్డుల చరిత్రలో తెలుగు నుంచి జాతీయ ఉత్తమ నటుడిగా ‘పుష్ప... ఫైర్’ అంటూ అల్లు అర్జున్ రికార్డ్ సాధించారు. ఆస్కార్ అవార్డుతో చరిత్ర సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’ ఆరు అవార్డులతో సిక్సర్ కొట్టింది. వీటిలో ‘హోల్సమ్ ఎంటర్టైనర్’ అవార్డు ‘ఆర్ఆర్ఆర్’ సొంతం అయింది. 2021 జనవరి 1 నుంచి 2021 డిసెంబరు 31 లోపు సెన్సార్ అయి, అవార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న సినిమాలను పరిగణనలోకి తీసుకుని జ్యూరీ సభ్యులు అవార్డులను ప్రకటించడం జరిగింది. జాతీయ ఉత్తమ నటీమణులుగా ‘గంగూబాయి కతియావాడి’లో వేశ్య పాత్ర చేసిన ఆలియా భట్, ‘మిమి’ చిత్రంలో గర్భవతిగా నటించిన కృతీ సనన్ నిలిచారు. ఖగోళ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ఆర్. మాధవన్ టైటిల్ రోల్ చేసి, స్వీయదర్శకత్వంలో రూపొందించిన ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ ఉత్తమ చిత్రంగా, ఉత్తమ దర్శకుడిగా మరాఠీ ఫిల్మ్ ‘గోదావరి’కి గాను నిఖిల్ మహాజన్ అవార్డు సాధించారు. ఇంకా పలు విభాగాల్లో కేంద్ర ప్రభుత్వం గురువారం జాతీయ అవార్డులను ప్రకటించింది. ఆ విశేషాలు ఈ విధంగా... 69వ జాతీయ అవార్డులకు గాను 28 భాషలకు చెందిన 280 చలన చిత్రాలు పోటీపడ్డాయి. మొత్తం 31 విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. సుకుమార్ దర్శకత్వంలోని ‘పుష్ప: ది రైజ్’ సినిమాలోని నటనకుగాను అల్లు అర్జున్‌కు ఉత్తమ జాతీయ నటుడిగా తొలి అవార్డు లభించింది. ఇదే చిత్రానికి సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ జాతీయ అవార్డు సాధించారు. ఇక ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రౌద్రం..రణం..రుధిరం’ (ఆర్ఆర్ఆర్) సినిమాకు ఆరు విభాగాల్లో అవార్డులు దక్కాయి. జాతీయ హోల్సమ్ ఎంటర్టైనర్గా ‘ఆర్ఆర్ఆర్’ నిలిచింది. ఇదే చిత్రానికి ఉత్తమ నేపథ్య సంగీతానికి గాను ఎంఎం కీరవాణి, ఇదే చిత్రానికి స్పెషల్ ఎఫెక్ట్స్‌కి వి. శ్రీనివాస్ మోహనన్, ‘నాటు నాటు..’ పాట కొరియోగ్రఫీకి ప్రేమ్ రక్షిత్, ‘ఆర్ఆర్ఆర్’లోని ‘కొమురం భీముడో..’ పాటకు మేల్ ప్లే బ్యాక్ సింగర్‌గా కాలభైరవ, ఇదే చిత్రానికి స్టంట్ కొరియోగ్రాఫర్‌గా కింగ్ సాల్మన్లకు జాతీయ అవార్డులు దక్కాయి. ఇక ‘నాటు.. నాటు’కి రచయితగా తొలి ఆస్కార్ అవార్డు అందుకున్న చంద్రబోస్ ‘కొండపొలం’లోని ‘ధంధం ధం.. తిరిగేద్దాం...’ పాటకు జాతీయ అవార్డు అందుకోనున్నారు. దర్శకుడిగా తన తొలి చిత్రానికి జాతీయ అవార్డు దక్కిన ఆనందంలో ఉన్నారు ‘ఉప్పెన’ను తెరకెక్కించిన బుచ్చిబాబు సన. మైత్రీ మూవీ మేకర్స్‌పై వై. రవిశంకర్, నవీన్ ఎర్నేని నిర్మించిన ‘ఉప్పెన’ ప్రాంతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది. ఉత్తమ సినీ విమర్శకుడిగా నల్గొండ జిల్లాకి చెందిన ఎం. పురుషోత్తమాచార్యులకు అవార్డు దక్కింది. రెండేళ్లుగా ‘మిసిమి’ మాస పత్రికలో సినిమా పాటల్లో శాస్త్రీయ సంగీతంపై పరిశోధనలు చేస్తూ, పలు వ్యాసాలు రాశారు పురుషోత్తమాచార్యులు. ఇక ఆలియా భట్‌కి ‘గంగూబాయి కతియావాడి’ జాతీయ ఉత్తమ నటిగా అవార్డు దక్కేలా చేయడంతో పాటు మరో నాలుగు విభాగాల్లో (బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్, మేకప్, ఎడిటింగ్) అవార్డులు వచ్చేలా చేసింది. అలాగే విక్కీ కౌశల్ హీరోగా నటించిన బయోగ్రఫికల్ డ్రామా ‘సర్దార్ ఉద్దమ్’కు ప్రాంతీయ ఉత్తమ హిందీ చిత్రంతో పాటు మొత్తం నాలుగు విభాగాల్లో (సినిమాటోగ్రఫీ, ఆడియోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్ డిజైన్) అవార్డులు దక్కాయి. ఈ చిత్రానికి సూజిత్ సర్కార్ దర్శకుడు. తమిళ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కడైసీ వివసాయి’, మలయాళంలో ‘హోమ్’, కన్నడంలో ‘777 చార్లీ’ అవార్డులు గెలుచుకున్నాయి. ఇంకా పలు భాషల్లో పలు చిత్రాలకు అవార్డులు దక్కాయి. ఇదొక చరిత్ర – నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ అల్లు అర్జున్‌గారికి జాతీయ అవార్డు రావడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది. ఇదొక చరిత్ర ‘పుష్ప’ షూటింగ్ సమయంలోనే అల్లు అర్జున్ తప్పకుండా నేషనల్ అవార్డ్ కొడతారని సుకుమార్‌గారు అనేవారు.. అది ఈ రోజు నిజమైంది. మాకు ఇంత మంచి సినిమా ఇచ్చిన అల్లు అర్జున్, సుకుమార్ గార్లకు థ్యాంక్స్. దేవిశ్రీ ప్రసాద్‌కి జాతీయ అవార్డ్ రావడం హ్యాపీ. అలాగే మా ‘ఉప్పెన’కి ఉత్తమ తెలుగు సినిమాగా జాతీయ అవార్డు రావడం గర్వంగా ఉంది. దర్శకుడు బుచ్చిబాబు, టీమ్‌కి అభినందనలు. అలాగే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి ఆరు అవార్డులు రావడం సంతోషంగా ఉంది. – నవీన్ యెర్నేని, నిర్మాత మా మైత్రీ మూవీస్ బ్యానర్లో ‘ఉప్పెన, పుష్ప’ చాలా ప్రతిష్టాత్మక చిత్రాలు. జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడిగా అల్లు అర్జున్‌గారు చరిత్ర సృష్టించారు. తెలుగు సినిమా చరిత్రలో ఇది చిరకాలం గుర్తుండిపోతుంది. దేవిశ్రీ ప్రసాద్‌కి అవార్డు రావడం ఆనందంగా ఉంది. ‘ఉప్పెన, పుష్ప’ రెండు విజయాల్లో సింహ భాగం సుకుమార్గారిదే. ‘ఆర్ఆర్ఆర్, కొండపొలం’ చిత్రాలకు జాతీయ అవార్డులు రావడం ఆనందాన్నిచ్చింది. – వై. రవిశంకర్, నిర్మాత ‘‘నా తొలి సినిమాకే జాతీయ అవార్డు రావడం హ్యాపీగా ఉంది. నిర్మాతలు నవీన్‌గారికి, రవిగారికి, మా గురువుగారు సుకుమార్ గారికి కృతజ్ఞతలు. సినిమా చూడ్డానికి మా ఇంట్లో నన్ను పంపించేవాళ్లు కాదు. అలాంటిది నేను ఒక సినిమాకి డైరెక్ట్ చేయడం, నా ఫస్ట్ సినిమాకే నేషనల్ అవార్డు రావడం అంటే ఏం మాట్లాడాలో అర్థం కావడంలేదు. మా అమ్మగారికి నేషనల్ అవార్డు అంటే ఏంటో కూడా తెలియదు. ఈ అవార్డు గురించి ఆమెకి చెప్పాలంటే. ‘ఇండియాలోనే పెద్ద అవార్డు వచ్చింది’ అని చెప్పాలి’’ అంటున్న బుచ్చిబాబు సనని తదుపరి చిత్రం గురించి అడగ్గా.. ‘‘రామ్‌చరణ్‌గారి కోసం మంచి రా అండ్ రస్టిక్ స్టోరీ రాశాను. నా మనసుకి బాగా నచ్చి, రాసుకున్న కథ ఇది. జనవరిలో షూటింగ్ ఆరంభిస్తాం’’ అన్నారు. – బుచ్చిబాబు సన, దర్శకుడు పది అవార్డులతో తొలి రికార్డ్ ఈసారి తెలుగు పరిశ్రమ ఎక్కువ జాతీయ అవార్డులు సొంతం చేసుకోవడంతో పాటు మరో విశేషమైన రికార్డ్ సాధించింది. అదేంటంటే.. 27వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్‌లో ‘శంకరాభరణం’ (1980) సినిమాకు నాలుగు జాతీయ అవార్డులు లభించాయి. 30వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్‌లో ‘మేఘ సందేశం’ (1982)కి నాలుగు అవార్డులు వచ్చాయి. అలాగే ‘దాసి’ (1988) చిత్రం 36వ జాతీయ అవార్డ్స్‌లో ఐదు విభాగాల్లో అవార్డులను దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగు సినిమాలకు ఐదుకు మించి అవార్డులు రాలేదు. 35 ఏళ్లకు రెండు ఐదులు.. అంటే పది అవార్డులు దక్కించుకుని తెలుగు చిత్రసీమ తొలి రికార్డ్‌ని సాధించింది. 69వ చలనచిత్ర జాతీయ అవార్డు విజేతలు ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప) ఉత్తమ నటి: ఆలియా భట్ (గంగూబాయి..) – కృతీసనన్ (మిమీ) ఉత్తమ చిత్రం: రాకెట్రీ: ద నంబీ ఎఫెక్ట్ (హిందీ) ఉత్తమ దర్శకుడు: నిఖిల్ మహాజన్ (గోదావరి– మరాఠీ సినిమా) ఉత్తమ పిల్లల చిత్రం: గాంధీ అండ్ కో (గుజరాతీ) ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ (నేపథ్య సంగీతం): ఆర్ఆర్ఆర్æ– ఎమ్ఎమ్ కీరవాణి ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు): పుష్ప– దేవిశ్రీ ప్రసాద్ ఉత్తమ కొరియోగ్రఫీ: ఆర్ఆర్ఆర్ –ప్రేమ్ రక్షిత్ ఉత్తమ మేల్ ప్లేబ్యాక్ సింగర్: కాలభైరవ (ఆర్ఆర్ఆర్ – కొమురం భీముడో..) ఉత్తమ లిరిక్స్: చంద్రబోస్– కొండపొలం ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ అవార్డ్ (స్టంట్ కొరియోగ్రఫీ): ఆర్ఆర్ఆర్– కింగ్ సాల్మన్ ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: ఆర్ఆర్ఆర్– శ్రీనివాస్ మోహనన్ ఉత్తమ సహాయ నటి: పల్లవీ జోషి (ద కశ్మీరీ ఫైల్స్– హిందీ) ఉత్తమ సహాయ నటుడు: పంకజ్ త్రిపాఠీ (మిమీ– హిందీ) ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: ప్రీతిశీల్ సింగ్ డిసౌజా (గంగూబాయి కతియావాడి–హిందీ) ఉత్తమ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్: శ్రేయా ఘోషల్ (ఇరవిన్ నిళల్– తమిళ్) ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: వీరా కపూర్ ఏ (సర్దార్ ఉద్ధమ్–హిందీ) ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ : ది మిత్రీ మాలిక్ – మాన్సి ధ్రువ్ మెహతా (సర్దార్ ఉద్ధమ్) (హిందీ) ఉత్తమ ఎడిటింగ్: సంజయ్ లీలా భన్సాలీ (గంగూబాయి కతియావాడి–హిందీ) ఉత్తమ ఆడియోగ్రఫీ (లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్): అరుణ్ అశోక్ – సోనూ కేపీ (చవిట్టు మూవీ–మలయాళం) ఉత్తమ స్క్రీన్‌ప్లే(అడాప్టెడ్): సంజయ్‌లీలా భన్సాలీ, ఉత్కర్షిణి వశిష్ట (గంగూబాయి కతియావాడి– హిందీ) ఉత్తమ స్క్రీన్ ప్లే (ఒరిజినల్): షాహీ కబీర్ (నాయట్టు సినిమా–మలయాళం) ఉత్తమ స్క్రీన్ ప్లే (డైలాగ్ రైటర్): ప్రకాశ్ కపాడియా – ఉత్కర్షిణి వశిష్ట (గంగూబాయి కతియావాడి– హిందీ) ఉత్తమ సినిమాటోగ్రఫీ: అవిక్ ముఖోపాధ్యాయ్ (సర్దార్ ఉద్ధమ్ మూవీ–హిందీ) ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: భవిన్ రబరీ (ఛెల్లో షో – గుజరాతీ) ఉత్తమ ఫిలిం ఆన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ : అవషావ్యూహం (మలయాళం) ఉత్తమ ఫిలిం ఆన్ సోషల్ ఇష్యూస్: అనునాద్–ద రెజోనెన్ ్స (అస్సామీ) ఉత్తమ పాపులర్ ఫిలిం ఆన్ ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్ మెంట్: ఆర్ఆర్ఆర్ ఉత్తమ ఆడియోగ్రఫీ (సౌండ్ డిజైనర్): అనీష్ బసు (జీలీ మూవీ– బెంగాలీ) ఉత్తమ ఆడియోగ్రఫీ (రీ రికార్డిస్ట్ ఆఫ్ ద ఫైనల్ మిక్స్డ్ ట్రాక్): సినోయ్ జోసెఫ్ (సర్దార్ ఉద్ధమ్–హిందీ) ఇందిరాగాంధీ అవార్డ్ ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిలిం ఆఫ్ ఎ డైరెక్టర్: మెప్పాడియన్ (మలయాళం) స్పెషల్ జ్యూరీ అవార్డ్: షేర్ షా (హిందీ) (డైరెక్టర్ విష్ణువర్థన్) నర్గీస్ దత్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్: ద కశ్మీరీ ఫైల్స్ (హిందీ) ఉత్తమ ప్రాంతీయ చిత్రాలు ఉత్తమ తెలుగు చిత్రం : ఉప్పెన ఉత్తమ తమిళ్ చిత్రం : కడైసి వివసాయి (ద లాస్ట్ ఫార్మర్) ఉత్తమ కన్నడ చిత్రం : 777 చార్లి ఉత్తమ మలయాళ చిత్రం : హోమ్ ఉత్తమ హిందీ చిత్రం : సర్దార్ ఉద్దామ్ ఉత్తమ గుజరాతీ చిత్రం : లాస్ట్ ఫిల్మ్ షో (ఛెల్లో షో) ఉత్తమ మరాఠీ చిత్రం : ఏక్డా కే జాలా ఉత్తమ మీషింగ్ చిత్రం : బూంబా రైడ్ ఉత్తమ అస్సామీస్ చిత్రం : అనూర్ (ఐస్ ఆన్ ది సన్ షైన్) ఉత్తమ బెంగాలీ చిత్రం : కల్కొకో–హౌస్ ఆఫ్ టైమ్ ఉత్తమ మైథిలీ చిత్రం : సమాంతర్ ఉత్తమ ఒడియా చిత్రం : ప్రతీక్ష్య (ద వెయిట్) ఉత్తమ మెయిటిలాన్ చిత్రం : ఈఖోయిగీ యమ్ (అవర్ హోమ్) ‘పుష్ప’ చిత్రంలో నటనకుగాను అల్లు అర్జున్‌కి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కడం సంతోషం. తొలిసారి ఈ అవార్డు అందుకోనున్న అల్లు అర్జున్‌కి అభినందనలు. 69వ జాతీయ అవార్డులు తెలుగు చిత్ర పరిశ్రమకు బొనాంజాగా నిలిచాయి. అదే విధంగా పాన్ ఇండియా కాన్వాస్‌లో దూసుకుపోతున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి ఆరు విభాగాల్లో ఈ అవార్డులు దక్కటం ప్రశంసనీయం. డైరెక్టర్ రాజమౌళితో పాటు చిత్ర యూనిట్‌కి అభినందనలు. ఉత్తమ సంగీత దర్శకునిగా దేవీశ్రీ ప్రసాద్ (పుష్ప), ఉత్తమ సాహిత్యానికి చంద్రబోస్ (కొండపొలం) జాతీయ అవార్డుకు ఎంపికవడం అభినందనీయం. – వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. తెలుగు సినిమా గర్వపడే క్షణాలివి. జాతీయ ఉత్తమ నటుడిగా నిలిచిన బన్నీ (అల్లు అర్జున్)కి శుభాకాంక్షలు. చాలా గర్వంగా ఉంది. రాజమౌళి విజన్‌లో ఆరు అవార్డులు సాధించిన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌కు, రెండు అవార్డులు సాధించిన ‘పుష్ప’కు, ‘ఉప్పెన’ టీమ్‌కు, సినీ విమర్శకులు పురుషోత్తమచార్యులకు శుభాకాంక్షలు. – చిరంజీవి ఇట్స్ సిక్సర్.. జాతీయ అవార్డులు సాధించినందుకు ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ అందరికీ శుభాకాంక్షలు. ఎంపిక చేసిన జ్యూరీకి ధన్యవాదాలు. ‘పుష్ప’.. తగ్గేదేలే... బన్నీకి, దేవిశ్రీ ప్రసాద్‌లతో పాటు ‘పుష్ప’ టీమ్‌కి శుభాకాంక్షలు. బోస్ (చంద్రబోస్)గారికి మళ్లీ శుభాకాంక్షలు. ‘గంగూబాయి కతియావాడి’తో అవార్డు గెల్చుకున్న మా ‘సీత’ (‘ఆర్ఆర్ఆర్’లో ఆలియా భట్ సీత పాత్రలో నటించారు)కు కంగ్రాట్స్. ‘ఉప్పెన’ టీమ్‌తో పాటు జాతీయ స్థాయిలో అవార్డులు గెల్చుకున్నవారికీ శుభాకాంక్షలు. – రాజమౌళి నా నేపథ్య సంగీతాన్ని గుర్తించి, నాకు జ్యూరీ సభ్యులు అవార్డును ప్రకటించడాన్ని గౌరవంగా భావిస్తున్నాను . చంద్రబోస్‌గారికి, దేవిశ్రీ ప్రసాద్, కాలభైరవ.. మా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌కు శుభాకాంక్షలు. – కీరవాణి ఈ జాతీయ అవార్డు మీదే (సంజయ్ సార్, గంగూబాయి.. టీమ్.. ముఖ్యంగా ప్రేక్షకులు). ఎందుకంటే... మీరు లేకుంటే నాకు ఈ అవార్డు దక్కేదే కాదు. చాలా సంతోషంగా ఉంది. ఈ క్షణాలను గుర్తుపెట్టుకుంటాను. మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు ఇంకా కష్టపడతాను. ‘మిమి’ సినిమాలో నీ ( కృతీ సనన్ని ఉద్దేశించి) నటన నిజాయితీగా, పవర్‌ఫుల్‌గా ఉంది. ఆ సినిమా చూసి నేను ఏడ్చాను. ఉత్తమ నటి అవార్డుకు నువ్వు అర్హురాలివి. – ఆలియా భట్. ఏఏఏ 69 సంవత్సరాలుగా తెలుగు ఇండస్ట్రీకి రాని ఆ అద్భుతాన్ని తీసుకొచ్చిన ప్రేక్షకులకు, నిర్మాతలకు, దర్శకుడికి, ముఖ్యంగా మా ఫ్యామిలీని పతాకస్థాయికి తీసుకుని వెళ్లిన మా అబ్బాయికి (అల్లు అర్జున్ ) కృతజ్ఞతలు. – అల్లు అరవింద్ ఇంకా వెంకటేశ్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్ తదితరులు తమ ఆనందం వ్యక్తం చేశారు. పది అవార్డులతో తొలి రికార్డ్ ఈసారి తెలుగు పరిశ్రమ ఎక్కువ జాతీయ అవార్డులు సొంతం చేసుకోవడంతో పాటు మరో విశేషమైన రికార్డ్ సాధించింది. అదేంటంటే.. 27వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్‌లో ‘శంకరాభరణం’ (1980) సినిమాకు నాలుగు జాతీయ అవార్డులు లభించాయి. 30వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్‌లో ‘మేఘ సందేశం’ (1982)కి నాలుగు అవార్డులు వచ్చాయి. అలాగే ‘దాసి’ (1988) చిత్రం 36వ జాతీయ అవార్డ్స్‌లో ఐదు విభాగాల్లో అవార్డులను దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగు సినిమాలకు ఐదుకు మించి అవార్డులు రాలేదు. 35 ఏళ్లకు రెండు ఐదులు.. అంటే పది అవార్డులు దక్కించుకుని తెలుగు చిత్రసీమ తొలి రికార్డ్‌ని సాధించింది. ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ భారతదేశ ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త నంబియార్ నారాయణన్ జీవిత చరిత్ర ఆధారంగా ‘రాకెట్రీ: ‘ది నంబి ఎఫెక్ట్’ సినిమా రూపొందింది. ఇస్రోలో చేరిన నారాయణన్ స్వదేశీ రాకెట్లను అభివృద్ధి చేసే ప్రాజెక్ట్‌లో భాగంగా రష్యా డెవలప్ చేసిన క్రయోజెనిక్ ఇంజ¯Œ ్సని భారత్‌కి తీసుకురావాలనుకుంటారు. ఇదే సమయంలో పాకిస్తా¯Œ కు భారత రాకెట్ సాంకేతిక విషయాలను చేరవేశారనే నెపంతో అరెస్ట్ అవుతారు నారాయణన్. అరెస్ట్ తర్వాత కేరళ పోలీసుల విచారణలో ఆయన ఎలాంటి చిత్రహింసలు అనుభవించారు? ఆ తర్వాత ఆయన జీవితం ఎలా మలుపు తిరిగింది? తనపై వచ్చిన తప్పుడు ఆరోపణల నుంచి నారాయణన్ ఎలా విముక్తి పొందారు? అనే నేపథ్యంలో ‘రాకెట్రీ: ‘ది నంబి ఎఫెక్ట్’ సినిమా రూపొందింది. నంబియార్ నారాయణన్ పాత్ర చేయడంతో పాటు మాధవన్ దర్శకత్వం వహించారు. నారాయణన్ సతీమణి మీన క్యారెక్టర్లో హీరోయిన్ సిమ్రాన్ చక్కగా నటించారు. ప్రత్యేకించి ఆమె పండించిన భావోద్వేగాలు సినిమాకి హైలైట్. హీరో సూర్య అతిథి పాత్రలో మెరవడం కూడా ఈ సినిమాకి ప్లస్ అయ్యింది. ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. నా అభిప్రాయాన్ని బలంగా చెప్పాను – ఎంఎం శ్రీలేఖ ‘‘ప్రతి ఏడాది తెలుగు సినిమాలంటే కొంచెం నిర్లక్ష్యం. కంటి తుడుపుగా ఒకటో రెండో అవార్డులు ఇస్తున్నారు. దీనిపై జ్యూరీలో గట్టిగా మాట్లాడేవారు కావాలి. తెలుగుకు ఎందుకు ఇవ్వరు? అని మాట్లాడ గలగాలి. అయితే ఆ సినిమాలో విషయం ఉండాలి.. లేకుంటే మాట్లాడలేం’’ అన్నారు సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ. 69వ జాతీయ అవార్డుల్లో దక్షిణాది తరఫున జ్యూరీలో శ్రీలేఖతో పాటు రచయిత్రి బలభద్రపాత్రుని రమణి ఉన్నారు. అవార్డులు ప్రకటించిన అనంతరం ఎంఎం శ్రీలేఖ ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘‘మామూలుగా ఫైనల్ ప్యానల్లో భోజ్‌పురి వాళ్లు ఉంటారు. వారికి మహానటి సావిత్రి గురించి ఏం తెలుస్తుంది? అందుకే జ్యూరీలో ఉన్న తెలుగువారు తెలుగు సినిమాల గురించి గట్టిగా చెప్పాలి. ఓ జ్యూరీ సభ్యురాలిగా నా అభిప్రాయాన్ని నేను బలంగా చెప్పాను. ఈసారి నేను ఏవైతే రావాలనుకున్నానో దాదాపు వాటికే వచ్చాయి. తొలిసారి తండ్రీ కొడుకులు కీరవాణి అన్నయ్య– కాలభైరవ ఒకే వేదికపై అవార్డులు తీసుకోనుండటం నాకో గొప్ప అనుభూతి. ఇక జ్యూరీ సభ్యులకు ఒత్తిడి ఉంటుందనుకుంటారు.. అలాంటిదేమీ లేదు. నిజాయతీగా నాకు ఏది అనిపిస్తే అది చెప్పాను’’ అన్నారు. ఉప్పెన మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన హీరోల్లో వైష్ణవ్ తేజ ఒకరు. ఆయన నటించిన తొలి చిత్రం ‘ఉప్పెన’. ఈ సినిమా ద్వారా బుచ్చిబాబు సన డైరెక్టర్‌గా, కృతీశెట్టి హీరోయిన్గా పరిచయమయ్యారు. ఈ ముగ్గురూ తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నారు. సముద్ర తీరాన ఉప్పాడ అనే పల్లెటూరు. స్కూల్ డేస్ నుంచే బేబమ్మ (కృతీశెట్టి) మీద ఇష్టం పెంచుకున్న మత్స్యకార కుటుంబానికి చెందిన ఆశీర్వాదం (వైష్ణవ్ తేజ్) నిత్యం తననే ఆరాధిస్తూ ప్రేమిస్తుంటాడు. ప్రాణం కంటే పరువు ముఖ్యం అనుకునే పెద్ద మనిషి శేషారాయనం (విజయ్ సేతుపతి). ఆయన కూతురు బేబమ్మ కాలేజీలో చదువుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో తన మనసులోని ప్రేమను బేబమ్మకి చెబుతాడు ఆశీర్వాదం. తన స్వచ్ఛమైన ప్రేమను అర్థం చేసుకున్న బేబమ్మ కూడా ఆశీర్వాదాన్ని ప్రేమిస్తుంది. ఇద్దరూ ప్రేమలో ఉన్న విషయం శేషారాయనంకి తెలుస్తుంది. దీంతో ఆశీర్వాదం–బేబమ్మ కలిసి ఊరి నుంచి వెళ్లిపోతారు. ఈ విషయం బయటకి తెలిస్తే తన పరువు పోతుందని ఆర్నెళ్ల పాటు తన కూతుర ు ఇంట్లోనే ఉందని ఊరి జనాలను నమ్మిస్తాడు రాయనం. ఆరు నెలల తర్వాత అయినా బేబమ్మ ఇంటికి తిరిగొచ్చిందా? తన కులం కానివాడు తన కూతురిని ప్రేమించాడన్న కోపంతో ఆశీర్వాదంని శేషారాయనం ఏం చేశాడు? ఆశీర్వాదం–బేబమ్మ ప్రేమకథ ఎలాంటి మలుపు తీసుకుంటుంది? చివరికి వారిద్దరూ ఒక్కటయ్యరా ? లేదా అనేది ‘ఉప్పెన’ కథ. 2021 ఫిబ్రవరి 12న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. -
మన సత్తా ఇప్పుడే తెలిసిందా?
తెలుగు సినిమాను చాలాకాలం పాటు కేంద్ర ప్రభుత్వ అవార్డుల కమిటీ సభ్యులు, క్రిటిక్స్ తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నించారు. కానీ, ఇప్పుడు తెలుగు సినిమా జూలు విదిలిస్తోంది. 2021కి గాను ప్రకటించిన 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు 11 అవార్డులు దక్కాయి. నేషనల్ ఫిల్మ్ అవార్డుల చరిత్రలో తొలిసారిగా ఒక తెలుగు నటుడికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ రావడం అభిమానులనే కాదు – పరిశ్రమనూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తెలుగు వాడికి టాలెంట్ ఎప్పుడూ ఉంది, కానీ ప్రపంచం ఇప్పుడే తెలుగు సినిమా ప్రతిభ తెలుసుకుంటోంది. ఆగస్ట్ 23న చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతం కావడంతో భారతదేశం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు అందరూ గర్వపడ్డారు. ఆ మరుసటి రోజునే తెలుగు సినిమా చంద్ర మండలం ఎక్కినంతగా సంబరం చేసుకుంటోంది. కారణం అందరికీ తెలిసిందే! 2021వ సంవత్సరానికి గాను ప్రకటించిన 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఏకంగా 11 అవార్డులు దక్కాయి. సంఖ్యా పరంగానే కాకుండా – 69 సంవత్సరాల నేషనల్ ఫిల్మ్ అవార్డుల చరిత్రలో తొలిసారిగా ఒక తెలుగు నటుడికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ రావడం తెలుగు సినిమా అభిమానులనే కాదు– తెలుగు సినిమా పరిశ్రమను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇక్కడ మౌలికంగా ఓ ప్రశ్న తలెత్తుతుంది. తెలుగు సినిమా రంగంలో ఎందరో మహా నటులున్నారు. వారెవరికీ దక్కని గౌరవం, గుర్తింపు– అభిమానుల చేత ‘ఐకాన్ స్టార్’ అని పిలిపించుకునే అల్లు అర్జున్‌కు రావడం సంతోషదాయకం. అలాగని ముందు తరాల నటుల గురించి, ఏ మాత్రం తక్కువగా ఆలోచించినా మహాపరాధం! ఒక నిజం ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా – తెలుగు సినిమాను చాలాకాలం పాటు కేంద్ర ప్రభుత్వ అవార్డుల కమిటీ సభ్యులు, మిగి లిన భాషా చిత్రాల మార్కెట్లు, క్రిటిక్స్ తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నించారు. ఎన్.టి. రామారావు గారి ‘పాతాళ భైరవి’, అక్కినేని నాగేశ్వరరావు గారి ‘సువర్ణ సుందరి’ – హిందీలోనూ ఏడాది పైన ఆడిన చరిత్ర ఈ జనరేషన్‌కి తెలియకపోవచ్చు. అలాగే జకార్తా ఇంటర్ నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్లో ‘నర్తన శాల’ సినిమాలో ఎస్.వి. రంగా రావు పోషించిన కీచక పాత్రకు ఉత్తమ నటుడిగా లభించిన గౌరవం కొందరికే గుర్తుండవచ్చు. పైగా పది, పదిహేనేళ్ళ క్రితం వరకూ అవార్డులను... నేచురల్‌గా ఉండే సినిమాలు అనండి, ఆర్ట్ ఫిలిమ్స్ అనండి... వాటికి మాత్రమే ఇవ్వాలనే ఒక ప్రత్యేక ధోరణి ఉండేది. బాక్సాఫీస్ దగ్గర డబ్బులు వసూలు చేసిన సినిమాలకూ, అందులో పని చేసినవాళ్ళకూ ఎక్కువ శాతం అవార్డులు వచ్చేవి కాదు. వచ్చేవి కాదు అనే కన్నా ఇచ్చేవాళ్ళు కాదనడం కరెక్ట్! పక్క భాషల నటులు ఒక్కొక్కరికి 2–3 అవార్డులు వచ్చిన సందర్భాలున్నాయి. అదే సమయంలో మన తెలుగు నటు లను గుర్తించడం లేదేంటని బాధ పడుతుండేవాళ్ళు. అందుకే 30 ఏళ్ళ నుంచి ఉత్తమ వినోదాత్మక చిత్రం అవార్డ్ ప్రవేశపెట్టి, కమర్షియల్ సినిమా కన్నీరు తుడిచే ప్రయత్నం చేశారు. అయిదారేళ్ళ క్రితం వరకూ భారతీయ వినోదాత్మక రంగం నుంచి వచ్చే ఆదాయంలో తెలుగు సినిమా వాటా 18–19 శాతం ఉండేది. బాలీవుడ్ రెవిన్యూ తర్వాత స్థానం తెలుగు సినిమాదే. ఇప్పుడు ఈ వాటా 30 శాతం వరకూ పెరిగిందని విన్నాను. కేవలం ప్రభుత్వానికి ఆదాయం రావడమే కాదు! అన్ని వందల, వేల కోట్ల ఆదాయం ఎన్ని వేల కుటుంబాలకు ఉపాధి కలిగిస్తోందో అన్న విషయం ప్రధానంగా గమనించాలి. ముఖ్యంగా ఇవాళ ఆర్ట్ ఫిలిమ్స్ తీసేవాళ్ళు, ఆదరించేవాళ్ళు తగ్గి పోయారు. అవతల ఆస్కార్ అవార్డుల్లో (మన వాళ్ళందరికీ అదే కొలమానం కాబట్టి) బాక్సాఫీస్ సక్సెస్ అయిన సినిమాలకూ, క్రైమ్ డ్రామాలకూ అవార్డులు ఇస్తున్నప్పుడు కమర్షియల్ సినిమాలు భారత దేశంలో ఏం పాపం చేసుకున్నాయి? జనం బాగా ఆదరించిన సిని మాల్లో కళాత్మక విలువలు ఉండవా? అత్యద్భుతమైన ప్రతిభా పాట వాలు ఉండవా? ఎన్ని పదుల, వందల కోట్ల పారితోషికాలు తీసు కున్నా, ప్రతి కళాకారుడూ కోరుకునేది తన పనిని ఎక్కువ మంది మెచ్చుకోవాలని! మేధావులు, అవార్డుల కమిటీల్లో గొప్పవాళ్ళ నుంచి ప్రశంసలు, సత్కారాలు అందుకోవాలని! ఇందులో తప్పేం ఉంది? అమితాబ్‌కి ఉత్తమ నటుడు అవార్డ్ వచ్చినప్పుడూ, రజనీ కాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం చేసినప్పుడు కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. వాళ్ళు దేశవ్యాప్తంగా పాపులర్ స్టార్స్ అయినంత మాత్రాన ప్రతిభావంతులు కారా? ఎవరు అవునన్నా, కాదన్నా – రాజమౌళి ‘బాహుబలి’తో ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ రీ–సౌండ్ తెలుగు సినిమా వినిపించింది. అప్పటి నుంచి తెలుగు సినిమా రంగం గురించి మన దేశంలోనే కాదు... ప్రపంచంలోని సినిమా అభిమానులందరికీ తెలిసింది. ఈ రోజు జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పనితనం, ప్రతిభ తెలిసిందంటే... తెలుగు సినిమా తనని తాను పెంచుకున్న స్థాయి. లాబీయింగ్ అంటే ఇదే! తెలుగు సినిమా తన టాలెంట్‌తో భారతదేశంలోని సినిమా అభిమానులు, కమిటీ సభ్యుల దగ్గర లాబీయింగ్ చేసింది! భారీ స్థాయిలో – ఊహకందని విజువల్స్‌తో, మార్కెట్ రిస్క్ చేసి సంపాదించుకున్న రెస్పెక్ట్ ఇది! రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్.’ ఆస్కార్ స్థాయిలో అందుకున్న అవార్డులకూ, గుర్తింపునకూ ఈ జాతీయ అవార్డులు ఓ కొనసాగింపు! అలాగే శ్రీశ్రీ, వేటూరి, సుద్దాల అశోక్ తేజ సరసన ఇప్పుడు చంద్ర బోస్ జాతీయ ఉత్తమ గీత రచయిత అవార్డును అందుకున్నారు. ప్రేమకథల్లో ఓ షాకింగ్ పాయింట్‌తో వచ్చిన ‘ఉప్పెన’ సినిమా తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డ్ గెలుచుకోవడం అభినందనీయం! ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్న తొలి తెలుగు నటుడిగా చరిత్రలో నిలిచిపోతున్న అల్లు అర్జున్ గురించి రెండు మాటలు చెప్పాలి. ప్రతి నటుడూ కష్టపడతారు. అల్లు అర్జున్ తనకు అసాధ్యం అనుకున్నది కూడా కసిగా సాధించి తీరుతారు. అల్లు అర్జున్‌తో మూడు సినిమాలకు ఓ రచయితగా పని చేసినప్పుడు ఆయ నలో గమనించిన కొన్ని లక్షణాల గురించి చెప్పుకోవాలి. క్యారెక్టర్ కోసం తన శరీరాన్ని మలుచుకోవడమే కాదు... డిక్షన్, బాడీ లాంగ్వేజ్ కోసం తనకు రానిది కూడా ఆయన కష్టపడి నేర్చుకుంటారు. ‘రుద్రమ దేవి’లో గోన గన్నా రెడ్డి పాత్ర చేసిన సాహసం, ‘దువ్వాడ జగన్నాథం (డి.జె.)’లో పురుష సూక్తం పలకడానికి చేసిన ప్రయత్నం, ఇప్పుడు ‘పుష్ప’లో ఓ పక్కకు భుజం వంచి (గూని లాంటిది) మరీ చేసిన అభినయం, చిత్తూరు జిల్లా యాస నేర్చుకోవడానికి చూపిన పట్టుదల – ఇవన్నీ అవార్డ్ అందుకోవడానికి కారణాలయ్యాయి. చివరగా ఓ మాట! తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి (92 సంవత్సరాల కాలం) తన ప్రతిభను చాటి చెబుతూనే ఉంది. అయితే ఆ వెలుగు, వినోదం తెలుగు నేలకే పరిమితమైంది. ఇప్పుడు మన సినిమా ఎల్లలు దాటింది, రిస్క్ గేమ్ ఆడుతోంది. దానికి తగ్గ ప్రతి ఫలాలూ అందుకుంటోంది. తెలుగు వాడికి టాలెంట్ ఎప్పుడూ ఉంది, కానీ ప్రపంచం ఇప్పుడే తెలుగు సినిమా ప్రతిభ తెలుసుకుంటోంది. అందుకే ఇన్ని వందల కోట్ల వసూళ్ళు, అవార్డులు, సత్కారాలు, మర్యాదలు! తెలుగు సినిమా ఏం చేస్తోందనేది మిగిలిన భాషా చిత్రాలు, మార్కెట్లు ఇప్పుడు గమనిస్తున్నాయి. కానీ, తెలుగు ప్రేక్ష కుల అభిరుచిని ఏనాడో కొందరు గొప్ప దర్శకులు గుర్తించారు. తెలుగు సినిమాకు దగ్గర కావాలని ప్రయత్నించారు. 1970ల చివరలో శ్యామ్ బెనెగల్ ‘అనుగ్రహం’, మృణాల్ సేన్ ‘ఒక ఊరి కథ’, గౌతమ్ ఘోష్ ‘మా భూమి’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ఇప్పుడు కమర్షియల్ ప్యాన్– ఇండియా సినిమా కోసం, క్వాలిటీ మేకింగ్ కోసం దేశం తెలుగు సినిమా వైపు తొంగిచూస్తోంది. పాపులర్ సినిమాలకు అన్ని విధాలా పట్టాభిషేకాలు ఇప్పుడిప్పుడే మొదల య్యాయి. తెలుగు సినిమా జైత్రయాత్రకు ఇది శుభారంభం! ప్రసాద్ నాయుడు వ్యాసకర్త ప్రముఖ సినిమా రచయిత, సినీ విశ్లేషకులు PrasaadNaidu5@gmail.com -
సిక్స్ కొట్టిన ఆర్ఆర్ఆర్.. ప్చ్.. ఆ ముగ్గురికి రాలేదే!
ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజైనప్పటి నుంచి ఒకటే రికార్డుల మోత.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ.. అంతర్జాతీయ స్థాయిలో అవార్డుల పరంపర.. అబ్బో.. ఇలా చాలానే ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీ అత్యున్నత పురస్కారంగా భావించే ఆస్కార్ సైతం ఆర్ఆర్ఆర్ వశమైంది. జక్కన్న చెక్కిన ఈ కళాఖండానికి ప్రపంచవ్యాప్తంగా రీసౌండ్ వచ్చింది. ఇండియన్ సినిమాను చూసి హాలీవుడ్ సైతం నోరెళ్లబెట్టింది. అంతటి కీర్తిప్రతిష్టలు సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ తాజాగా 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లోనూ సత్తా చాటింది. అత్యధికంగా ఆర్ఆర్ఆర్కు 6 అవార్డులు రాగా పుష్ప సినిమాకు 2 అవార్డులు వచ్చాయి. ఆర్ఆర్ఆర్కు 6 అవార్డులు బెస్ట్ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ వోల్సమ్ ఎంటర్టైన్మెంట్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సినిమాకు జాతీయ అవార్డు దక్కింది. ఉత్తమ కొరియోగ్రఫీ విభాగంలో ప్రేమ్ రక్షిత్‌కు, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో వి.శ్రీనివాస్ మోహన్, ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్‌గా కీరవాణి, బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్‌గా కాలభైరవ, బెస్ట్ యాక్షన్ స్టంట్ కొరియోగ్రాఫర్‌గా కింగ్ సోలోమన్‌కు జాతీయ అవార్డులు ప్రకటించారు. ఉత్తమ నటుడిగా రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్లలో ఎవరో ఒకరికి పురస్కారం ప్రకటించడం ఖాయం అనుకున్నారు ఫ్యాన్స్. ఈ ముగ్గురిలో ఒక్కరికీ రాలే కానీ వారి అంచనాలను తారుమారు చేస్తూ పుష్పరాజ్ బన్నీకి కట్టబెట్టారు. అటు రాజమౌళి పరిస్థితి కూడా అంతే.. ఉత్తమ డైరెక్టర్‌గా ఈయన పేరు ప్రకటించడం ఖాయం అనుకుంటే మరాఠీ డైరెక్టర్ నిఖిల్ మహాజన్(గోదావరి సినిమా)కు పురస్కారం వరించింది. దీంతో అభిమానులు నిరాశ చెందారు. ముగ్గురు ఆర్లలో ఏ ఒక్కరికీ అవార్డు కైవసం కాలేదని ఫీలవుతున్నారు. వీళ్లు ఏళ్ల తరబడి పడిన కష్టం అవార్డు కమిటీకి కనిపించలేదా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జక్కన్నకు వచ్చినా బాగుండేది! ఆర్ఆర్ఆర్కు బోలెడన్ని అవార్డులు వచ్చాయి. సినిమాకు పనిచేసిన అందరినీ దాదాపు ఏదో ఒక అవార్డు వరించింది కానీ ఈ ముగ్గురికి మాత్రం ఒక్క పురస్కారం రాలేదు. వీళ్లకు ప్రపంచవ్యాప్తంగా పేరు, గుర్తింపు వచ్చిందే తప్ప అవార్డులు రావడం లేదెందుకని అభిమానులు తల పట్టుకుంటున్నారు. జక్కన్నకు వచ్చినా మనసు తృప్తి చేసుకునేవాళ్లమని అభిప్రాయపడుతున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా విషయానికి వస్తే.. రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్‌గా యాక్ట్ చేశారు. విజయేంద్రప్రసాద్ కథ అందించగా రాజమౌళి దర్శకత్వం వహించాడు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య దాదాపు రూ.500 కోట్ల పైచిలుకు భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. THE PROUD TEAM FLOURISHED AGAIN… 💥💥💥💥💥💥 It’s a SIXERRR at the National Awards 🔥🌊 #RRRMovie pic.twitter.com/GOjsY4IHRl — RRR Movie (@RRRMovie) August 24, 2023 చదవండి: జాతీయ అవార్డు.. బన్నీని పట్టుకుని కంటతడి పెట్టిన సుకుమార్ -
కంగ్రాట్స్ బావా.. ఈ అవార్డు నీకు రావాల్సిందే: తారక్
ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు మన తెలుగు హీరోకు వరిస్తుందా? లేదా? అన్న ఉత్కంఠకు తెరపడింది. ఎందరో స్టార్ హీరోలను వెనక్కి నెడుతూ అల్లు అర్జున్‌కు బెస్ట్ యాక్టర్ అవార్డు వరించింది. 68 ఏళ్లుగా ఏ హీరోకూ దక్కని అరుదైన గౌరవం బన్నీకి దక్కింది. దీంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బన్నీని అభినందిస్తూ ట్వీట్ చేశాడు. కంగ్రాచ్యులేషన్స్ బావా.. పుష్ప సినిమాకుగానూ ఈ విజయం, అవార్డులు నీకు దక్కి తీరాల్సిందే అని రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. పార్టీ లేదా పుష్ప డైలాగ్ మిస్ చేశారు సర్.. అని కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు 2021లో వచ్చిన సినిమాలకుగానూ ప్రకటించారు. ఉత్తమ చిత్రంగా ఉప్పెన, బెస్ట్ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ వోల్సమ్ ఎంటర్టైన్మెంట్గా ఆర్ఆర్ఆర్ అవార్డులు ఎగరేసుకుపోయాయి. ఇంకా ఏయే సినిమాకు ఏయే అవార్డులు వచ్చాయంటే.. ♦ ఉత్తమ యాక్షన్ డైరెక్షన్(స్టంట్ కొరియోగ్రఫీ) - కింగ్ సాల్మన్ (ఆర్ఆర్ఆర్) ♦ ఉత్తమ కొరియోగ్రఫీ - ప్రేమ్ రక్షిత్ (ఆర్ఆర్ఆర్) ♦ ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ - వి.శ్రీనివాస్ మోహన్ (ఆర్ఆర్ఆర్) ♦ ఉత్తమ లిరిక్స్- చంద్రబోస్ (ధమ్ ధమా ధమ్- కొండపొలం) ♦ ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్(సాంగ్స్) - దేవి శ్రీప్రసాద్ (పుష్ప 1) ♦ ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ (బ్యాగ్రౌండ్ స్కోర్) - ఎమ్ఎమ్ కీరవాణి (ఆర్ఆర్ఆర్) ♦ ఉత్తమ మేల్ ప్లేబ్యాక్ సింగర్ - కాల భైరవ (కొమురం భీముడో.. - ఆర్ఆర్ఆర్) ♦ బెస్ట్ తెలుగు ఫిలిం క్రిటిక్- పురుషోత్తమాచార్యులు Congratulations @alluarjun bava. You deserve all the success and awards you get for #Pushpa. — Jr NTR (@tarak9999) August 24, 2023 చదవండి: చరణ్, తారక్‌ను వెనక్కు నెట్టి అవార్డు కొట్టేసిన బన్నీ.. టాలీవుడ్‌కు మొత్తంగా ఎన్ని అవార్డులు వచ్చాయంటే? -
జాతీయ అవార్డుల్లో 'ఆర్ఆర్ఆర్' హవా.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్
69వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. చాలామంది ఊహించినట్లే.. ఉత్తమ నటుడు కేటగిరీలో అల్లు అర్జున్ అవార్డు గెలుచుకున్నాడు. తద్వారా 69 ఏళ్ల సినీ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా రికార్డ్ సృష్టించాడు. అలానే బోలెడెన్ని విభాగాల్లో మనవాళ్లు అవార్డులు గెలుచుకున్నారు. మరి ఇంతకీ ఏయే విభాగాల్లో ఎవరెవరికీ అవార్డులు గెలుచుకున్నారనేది ఫుల్ లిస్ట్ చూసేద్దాం. విభాగాల వారీగా అవార్డు గ్రహీతలు ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప) ఉత్తమ నటి: ఆలియా భట్ (గంగూబాయి) & కృతిసనన్ (మిమీ) ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి (ద కశ్మీరీ ఫైల్స్ - హిందీ) ఉత్తమ సహాయ నటుడు: పంకజ్ త్రిపాఠీ (మిమీ- హిందీ) ఉత్తమ దర్శకుడు: నిఖిల్ మహాజన్ (గోదావరి - మరాఠీ సినిమా) ఉత్తమ సంగీత దర్శకుడు (సాంగ్స్): పుష్ప- దేవిశ్రీ ప్రసాద్ ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ (బీజీఎమ్) : ఆర్ఆర్ఆర్- ఎమ్.ఎమ్ కీరవాణి బెస్ట్ ఫీచర్ ఫిలిం: రాకెట్రీ: ద నంబీ ఎఫెక్ట్ (హిందీ) ఉత్తమ పిల్లల చిత్రం: గాంధీ & కో (గుజరాతీ) ఉత్తమ కొరియోగ్రఫీ: ఆర్ఆర్ఆర్-ప్రేమ్ రక్షిత్ ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: ప్రీతిశీల్ సింగ్ డిసౌజా (గంగూబాయి కతియావాడి) ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: ఆర్ఆర్ఆర్-శ్రీనివాస్ మోహన్ బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్: శ్రేయా ఘోషల్ (ఇరవిన్ నిహాల్ - తమిళ మూవీ) బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్: కాలభైరవ (ఆర్ఆర్ఆర్ - కొమురం భీముడో) ఉత్తమ లిరిక్స్: చంద్రబోస్-కొండపొలం మూవీ (తెలుగు) ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ అవార్డ్(స్టంట్ కొరియోగ్రఫీ): ఆర్ఆర్ఆర్- కింగ్ సోలమన్ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: వీరా కపూర్ ఏ (సర్దార్ ఉద్దామ్-హిందీ) ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: దిమిత్రీ మాలిక్ & మాన్సి ధ్రువ్ మెహతా (సర్దార్ ఉద్దామ్) ఉత్తమ ఎడిటింగ్: సంజయ్ లీలా భన్సాలీ (గంగూబాయి కతియావాడి మూవీ) బెస్ట్ ఆడియోగ్రఫీ (లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్): అరుణ్ అశోక్ & సోనూ కేపీ (చవిట్టు మూవీ-మలయాళం) బెస్ట్ ఆడియోగ్రఫీ (సౌండ్ డిజైనర్) : అనీష్ బసు (జీలీ మూవీ- బెంగాలీ) బెస్ట్ ఆడియోగ్రఫీ (రీరికార్డిస్ట్ ఆఫ్ ద ఫైనల్ మిక్స్డ్ ట్రాక్): సినోయ్ జోసెఫ్ (సర్దార్ ఉద్దామ్-హిందీ) బెస్ట్ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్): షాహీ కబీర్ (నాయట్టు సినిమా-మలయాళం) బెస్ట్ స్క్రీన్‌ప్లే (డైలాగ్ రైటర్) : ప్రకాశ్ కపాడియా & ఉత్కర్షిణి వశిష్ట (గంగూబాయి కతియావాడి) బెస్ట్ సినిమాటోగ్రఫీ: అవిక్ ముఖోపాధ్యాయ్ (సర్దార్ ఉద్దామ్ మూవీ-హిందీ) ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: భవిన్ రబరీ (ఛెల్లో షో - గుజరాతీ సినిమా) బెస్ట్ ఫిలిం ఆన్ ఎన్వైర్మెంట్ కంజర్వేషన్: అవషావ్యూహం (మలయాళం) బెస్ట్ ఫిలిం ఆన్ సోషల్ ఇష్యూస్: అనునాద్-ద రెజోనెన్స్ (అస్సామీస్) బెస్ట్ పాపులర్ ఫిలిం ఆన్ ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్: ఆర్ఆర్ఆర్ ఇందిరాగాంధీ అవార్డ్ ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిలిం ఆఫ్ ఎ డైరెక్టర్: మెప్పాడియన్ (మలయాళం) స్పెషల్ జ్యూరీ అవార్డ్: షేర్ షా (హిందీ సినిమా) నర్గీస్ దత్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్: ద కశ్మీరీ ఫైల్స్ (హిందీ) భాషల వారీగా ఉత్తమ చిత్రాలు బెస్ట్ మీషింగ్ ఫిల్మ్: బూంబా రైడ్ బెస్ట్ అస్సామీస్ ఫిల్మ్: అనుర్ బెస్ట్ బెంగాలీ ఫిల్మ్: కల్కొకో-హౌస్ ఆఫ్ టైమ్ బెస్ట్ హిందీ ఫిల్మ్: సర్దార్ ఉద్దామ్ బెస్ట్ గుజరాతీ ఫిల్మ్: లాస్ట్ ఫిల్మ్ షో బెస్ట్ కన్నడ ఫిల్మ్: చార్లి 777 బెస్ట్ మైథిలీ ఫిల్మ్: సమాంతర్ బెస్ట్ మరాఠీ ఫిల్మ్: ఏక్ దా కై ఝాలా బెస్ట్ మలయాళ ఫిల్మ్: హోమ్ బెస్ట్ మెయిటెయిలోన్ ఫిల్మ్: ఏక్ హోయిగీ యమ్ (అవర్ హౌమ్) బెస్ట్ ఒడియా ఫిల్మ్: ప్రతిక్ష్య (ద వెయిట్) బెస్ట్ తమిళ్ ఫిల్మ్: కడైసి వివసై (ద లాస్ట్ ఫార్మర్) బెస్ట్ తెలుగు ఫిల్మ్: ఉప్పెన నాన్ ఫీచర్ ఫిలింస్ బెస్ట్ నాన్ ఫీచర్ ఫిల్మ్: ఏక్ థా గావ్ (గర్హివాలీ - హిందీ) బెస్ట్ వాయిస్ ఓవర్: కులదా కుమార్ భట్టాచారి (హాథీ బందూ) బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్: ఇషాన్ దీవేచా (సక్కలెంట్) బెస్ట్ ఎడిటింగ్: అబ్రో బెనర్జీ (ఇఫ్ మెమొరీ సెర్వ్స్ మీ రైట్) బెస్ట్ ఆన్‌లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్: సురుచి శర్మ (మీన్ రాగా) బెస్ట్ ఆడియోగ్రఫీ(ఫైనల్ మిక్స్డ్ ట్రాక్): ఉన్ని కృష్ణన్ (ఏక్ థా గావ్) బెస్ట్ సినిమాటోగ్రఫీ: బిట్టూ రావత్ (పాతాళ్ తీ) ఉత్తమ డైరెక్షన్: బకుల్ మతియానీ (స్మైల్ ప్లీజ్) ఉత్తమ కుటుంబ కథా చిత్రం: చాంద్ సాన్సీ (హిందీ) ఉత్తమ షార్ట్ ఫిక్షన్ ఫిలిం: దాల్ బాత్ (గుజరాతీ) స్పెషల్ జ్యూరీ అవార్డ్: రేఖా మూవీ (మరాఠీ) బెస్ట్ ఏనిమేషన్ ఫిల్మ్: కండిట్టుండూ (మలయాళం) బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ ఫిలిం: లుకింగ్ ఫర్ చలాన్ (ఇంగ్లీష్) బెస్ట్ ఎక్స్‌ప్లోరేషన్ ఫిలిం: ఆయుష్మాన్ (ఇంగ్లీష్-కన్నడ) బెస్ట్ ఎడ్యుకేషనల్ ఫిలిం: సిర్పంగిలన్ సిర్పంగల్ (తమిళం) బెస్ట్ ఫిలిం ఆన్ సోషల్ ఇష్యూస్(షేర్డ్): మీతూ దీ (ఇంగ్లీష్) & త్రీ టూ వన్ (మరాఠీ-హిందీ) బెస్ట్ ఎన్వైర్మెంట్ ఫిలిం: మున్నం వలవు (మలయాళం) బెస్ట్ ప్రమోషనల్ ఫిలిం: వర్లీ ఆర్ట్ (ఇంగ్లీష్) బెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫిలిం: ఇథోస్ ఆఫ్ డార్క్నెస్ (హిందీ-బెంగాలీ) బెస్ట్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఫిలింస్: టీఎన్ కృష్ణన్ బౌ స్ట్రింగ్స్ టూ డివైన్ బెస్ట్ బయోగ్రాఫికల్ ఫిలిం(షేర్డ్): రుఖు మతిర్ దుఖు మహీ (బెంగాలీ) & బియాండ్ బ్లాస్ట్ (మణిపురి) బెస్ట్ ఎత్నోగ్రాఫిక్ ఫిలిం: ఫైర్ ఆన్ ఎడ్జ్ (టివా) బెస్ట్ డెబ్యూ నాన్ ఫియేచర్ ఫిలిం ఆఫ్ ఎ డైరెక్టర్: పాంచిక (గుజరాతీ- డైరెక్టర్ అంకిత్ కొఠారీ) -
జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రదానం.. ఉత్తమ చిత్రంగా 'సూరారై పోట్రు'
దేశ రాజధాని ఢిల్లీలో 68వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. దేశవ్యాప్తంగా చిత్ర పరిశ్రమలో సత్తా చాటిన నటీనటులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆవార్డులు ప్రదానం చేశారు. డిల్లీలోని విఘ్నయన్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ హాజరయ్యారు. 2020వ సంవత్సరానికి గాను 68వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను గతంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకులు జి.ఆర్.గోపినాథ్ జీవిత కథను స్ఫూర్తిగా తీసుకుని తెలుగు దర్శకురాలు సుధా కొంగర తమిళంలో తెరకెక్కించిన 'సూరరై పోట్రు' జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఇందులో ప్రధాన పాత్రల్లో నటించిన సూర్య ఉత్తమ నటుడిగా, అపర్ణా బాలమురళి ఉత్తమ నటిగా పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి తన భార్యతో జ్యోతిక కలిసి హాజరయ్యారు తమిళ హీరో సూర్య. సమాజంలోని కుల వివక్షను కళ్లకు కడుతూ తెరకెక్కిన 'కలర్ ఫొటో' తెలుగులో ఉత్తమ చిత్రంగా అవార్టు గెలుచుుకంది. సంప్రదాయ నృత్యానికి పట్టం కడుతూ.. రూపొందించిన తెలుగు చిత్రం 'నాట్యం' ఉత్తమ నృత్యాలు, మేకప్ విభాగాల్లో పురస్కారాలు అందుకుంది. పాటలతో అలరించిన 'అల వైకుంఠపురములో' చిత్రం సంగీత విభాగంలో అవార్డు కైవసం చేసుకుంది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ సైన్యాధిపతి తాన్హాజీ జీవిత గాథతో హిందీలో తెరకెక్కిన 'తాన్హాజీ: ది అన్ సంగ్ వారియర్' ఉత్తమ సమగ్ర వినోదాత్మక చిత్రంగా అవార్డు సొంతం చేసుకుంది. అందులో తానాజీ పాత్రలో నటించిన అజయ్ దేవగణ్, సూర్యతో కలసి ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నారు. -
అడగకపోతే... అవార్డులూ రావు!
2020వ సంవత్సరానికి గాను తాజా 68వ జాతీయ అవార్డుల ప్రకటన తెలుగు సినీ రంగానికి కొంత సంతోషమిచ్చినా, తమిళం (10 అవార్డులు), మలయాళం (9 అవార్డులు)తో పోలిస్తే, మన ఫీచర్ ఫిల్మ్‌లకు నాలుగే అవార్డులు దక్కాయన్న అసంతృప్తినీ మిగిల్చింది. సంఖ్యాపరంగా, బాక్సాఫీస్ లెక్కల పరంగా దేశాన్ని ఊపేస్తున్న తెలుగు సినిమాకు తగిన న్యాయం జరగలేదా? తాజా జాతీయ అవార్డుల తుది నిర్ణాయక సంఘంలో ఏకైక తెలుగు సభ్యుడు – ప్రముఖ దర్శకుడు వి.ఎన్. ఆదిత్యతో ‘సాక్షి’ ప్రత్యేక భేటీ... ► ఈ అవార్డుల ఎంపికలో మీ పాత్ర ఏమిటి? జాతీయ అవార్డ్స్‌లో రెండు విడతల వడపోతతో ఫీచర్ ఫిల్మ్‌ల అవార్డుల నిర్ణయం ఉంటుంది. ఈసారి తొలి వడపోతలో నార్త్, ఈస్ట్, వెస్ట్‌లకు ఒక్కొక్కటీ, సౌత్‌కు రెండు – మొత్తం 5 ప్రాంతీయ జ్యూరీలున్నాయి. ప్రతి జ్యూరీలో అయిదుగురు సభ్యులు. ఇలా 25 మంది వచ్చిన మొత్తం ఎంట్రీల నుంచి బాగున్న ఆయా భాషా చిత్రాలను ప్రాథమికంగా ఎంపిక చేశారు. అలా తొలి వడపోతలో మిగిలిన ఎంట్రీలను ఫైనల్ జ్యూరీ రెండో వడపోత చేసి, తుది అవార్డులు ప్రకటించింది. ఫీచర్ ఫిల్మ్స్ విభాగంలో 30 భాషల్లో కలిపి 305 దాకా ఎంట్రీలొచ్చాయి. ప్రాంతీయ జ్యూరీల దశ దాటి ఫైనల్స్‌కు వచ్చినవి 67 సినిమాలే. ఫైనల్ జ్యూరీలో ప్రాంతీయ జ్యూరీల ఛైర్మన్లు అయిదుగురు, మరో ఆరుగురు కొత్త సభ్యులుంటారు. వారిలో ఒకరు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఆ ఫైనల్ జ్యూరీ 11 మందిలో ఏకైక తెలుగువాడిగా బాధ్యత నిర్వహించా. ► మీ బాధ్యత, పాత్ర మీకు తృప్తినిచ్చాయా? చిన్నప్పుడు బెజవాడలో సినిమాపై పిచ్చిప్రేమతో టికెట్ల కోసం హాళ్ళ దగ్గర కొట్టుకొని చూసిన సామాన్య ప్రేక్షకుడి స్థాయి నుంచి ఇవాళ ప్రభుత్వ సౌకర్యాలతో రోజూ ఉదయం 8 నుంచి రాత్రి 10 దాకా దేశంలోని ఉత్తమ సినిమాలెన్నో చూసే స్థాయికి రావడం ఫిల్మ్ లవర్‌గా నాకు మరపురాని అనుభూతి, అనుభవం. ► తమిళ, మలయాళాలతో పోలిస్తే బాగా తక్కువగా తెలుగుకు నాలుగు అవార్డులే వచ్చాయేం? ప్రాంతీయ జ్యూరీకి మొత్తం ఎన్ని తెలుగు ఎంట్రీలు వచ్చాయో తెలీదు. ఫైనల్స్‌లో మా ముందుకొచ్చినవి ‘కలర్ ఫోటో’, ‘నాట్యం’, ‘ప్లేబ్యాక్’, ‘సీజన్ ఆఫ్ ఇన్నోసెన్స్’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’, నితిన్ ‘భీష్మ’, విష్వక్సేన్ ‘హిట్–1’, – ఇలా ఏడెనిమిది తెలుగు సినిమాలే. ఆ లెక్కన 4 అవార్డులు మరీ తక్కువేం కాదు. ఒకప్పుడు ఉత్తమ ప్రాంతీయ చిత్రం మినహా మరే అవార్డూ దక్కని తెలుగు సినిమాకు ఇప్పుడిన్ని రావడం గమనార్హం. ► తప్పు ఎక్కడ జరిగిందంటారు? అవార్డుల ఎంపికలో అయితే కానే కాదు. కరోనాతో 2020లో సినిమాలు, ఎంట్రీలూ తగ్గాయి. కాకపోతే, సౌత్ ప్రాంతీయ జ్యూరీలు రెండిట్లోనూ తెలుగువారెవరూ లేకపోవడంతో, ఫైనల్స్‌కు మనవి ఎక్కువ చేరలేదేమో! బయట నేను చూసిన కొన్ని బాగున్న సినిమాలు కూడా ఫైనల్స్ పోటీలో రాలేదు ఎందుకనో! రెండు తెలుగు రాష్ట్రాలున్నా, ఇన్ని సినిమాలు తీస్తున్నా... ఒకే సభ్యుణ్ణి తీసుకోవడం తప్పే! ఇద్దరేసి వంతున రెండు రాష్ట్రాలకూ కలిపి నలుగురుండాలని చెప్పాను. కొన్ని రాష్ట్రాల నుంచి అవగాహన ఉన్న మంచి జర్నలిస్టులూ సభ్యులుగా వచ్చారు. అలా మన నుంచి ఎందుకు పంపరు? ► మన భాషకు న్యాయం జరగలేదని ఒప్పుకుంటారా? నా వాదన ఎంట్రీలు చూసిన సభ్యుల సంఖ్య విషయంలోనే! అవార్డుల సంగతికొస్తే కాసేపు తెలుగును పక్కనపెట్టి చూడండి. ఈసారి ప్రమాణాలు లేవని ఉత్తమ క్రిటిక్, గుజరాతీ, ఒడియా భాషల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డులే ఇవ్వలేదు. బాగున్న కొన్ని మారుమూల భాషలకూ అవార్డులిచ్చారు. ప్రోత్సహించాలంటూ ప్రమాణాలు లేకున్నా ప్రతి కేటగిరీలో ఎవరో ఒకరికి అవార్డులు ఇవ్వడం సరికాదని ఛైర్మన్ మొదటి నుంచీ గట్టిగా నిలబడ్డారు. జ్యూరీ పారదర్శకంగా, నిజాయతీగా చర్చించి అర్హులైనవారికే అవార్డులిచ్చింది. ► ఇతర భాషలతో పోలిస్తే మనం ఎక్కడున్నాం? ఇతర భాషలకు ఎక్కువ అవార్డులొచ్చాయి గనక మనమేమీ చేయట్లేదనుకోవడం తప్పు. మనం ఎక్కువ వినోదం, వసూళ్ళ మోడల్లో వెళుతున్నాం. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే అంశంలో మనమే ముందున్నాం. సాంకేతికంగా, నిర్మాణపరంగా, ఈస్థటికల్గా, ప్రేక్షకుల కిచ్చే వినోదపరంగా మన తెలుగు సినిమా చాలా బాగుంది. మనకు ప్రతిభకు కొదవ లేదు కానీ, అవార్డుల మీద ఫోకస్సే లేదు. కొన్నిసార్లు హీరో ఇమేజ్ కోసం కథలో కాంప్రమైజ్ కావడం, పాటలు, ఫైట్లు పెట్టడం లాంటివి మనకు ఎక్కువ. అలా చేయని మల యాళ, తదితర భాషా చిత్రాలకు మనకన్నా అవార్డులు ఎక్కువ రావచ్చు. అయినా, అవార్డు అనేది ఆ ఒక్క సినిమాకే వర్తిస్తుంది. మొత్తం పరిశ్రమకు కాదు. సహజత్వానికి దగ్గరగా తీసే సినిమాలకు వసూళ్ళు వచ్చే మోడల్ తమిళ, మలయాళాల్లో లాగా మన దగ్గరుంటే, మనమూ అలాంటి సినిమాలు తీయగలం. ► అవార్డుల్లోనూ దేశం తెలుగు వైపు తలతిప్పేలా చేయాలంటే...? (నవ్వుతూ...) మరిన్ని మంచి సినిమాలు తీయాలి. వాటిని అవార్డ్స్‌కు ఎంట్రీలుగా పంపాలి. ‘జాతీయ అవార్డులు మనకు రావులే’ అని ముందుగానే మనకు మనమే అనేసుకుంటే ఎలా? అప్లయ్ చేస్తేనేగా అవార్డొచ్చేది! తమిళ, మలయాళ, కన్నడ, చివరకు అస్సామీకి వచ్చినన్ని ఎక్కువ ఎంట్రీలు మనకు రాలేదు. ప్రయత్నలోపం మనదే! మనకు నాలుగే అవార్డులు రావడానికి అదే కారణం. అలాగే, అవార్డులకు అప్లికేషన్ సరిగ్గా నింపకపోవడం, పూర్తి వివరాలు ఇవ్వకపోవడం, సరైన కేటగిరీకి ఎంట్రీగా పంపకపోవడం, పంపిన సినిమాల్లోనూ టెక్నికల్ సమస్యల వల్ల కూడా తెలుగు సినిమాలు ఛాన్స్ పోగొట్టుకుంటున్నాయి. దీనిపై మన ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ద్వారా విస్తృత ప్రచారం చేసి, అవగాహన పెంచాలని నా అభ్యర్థన. నా వంతుగా నేనూ పరిస్థితులు వివరించేందుకు కృషి చేస్తా! ► మీరు ఒంటరి కాబట్టి, నేషనల్ అవార్డులకై కొట్లాడాల్సి వచ్చిందా? జ్యూరీ అంతా సినీ అనుభవజ్ఞులే. ప్రతి ఒక్కరి అభిప్రాయం తీసుకుంటారు. ఓటింగ్ కూడా ఉంటుంది. స్నేహంగానే ఎవరి పాయింట్ వారు వినిపించాం. ప్రతి తెలుగు ఎంట్రీకీ దానికి తగ్గ కేటగిరీలో అవార్డు వచ్చేందుకు నా వాదన నేనూ వినిపించా. సహజత్వానికీ దగ్గరగా ఉన్నందుకు అత్యధిక ఓట్లతో ‘కలర్ ఫోటో’కూ, స్క్రీన్‌ప్లేలో భాగమయ్యేలా పాటలకు సంగీతాన్నిచ్చి కోట్లమందికి చేరిన ‘అల వైకుంఠపురములో...’కూ, పాశ్చాత్య – సంప్రదాయ రీతుల మేళవింపుగా పూర్తి డ్యాన్స్ ఫిల్మ్ తీసి, మేకప్‌లోనూ వైవిధ్యం చూపిన ‘నాట్యం’కి – ఇలా 4 అవార్డులొచ్చాయి. సహజంగానే అన్నిటికీ రావుగా! అయితే, మన గొంతు మనం బలంగా వినిపించకపోతే, మనకు రావాల్సినవి కూడా రావు. అవార్డుల్లోనే కాదు అన్నిటా అది చేదు నిజం! – రెంటాల జయదేవ -
ఈసారి నేషనల్ అవార్డ్స్‌లో టాలీవుడ్‌కు బిగ్ డిజప్పాయింట్మెంట్
-
జాతీయ సినిమా అవార్డులు: ఆకాశం మెరిసింది
‘‘ఆశలు నెరవేర్చుకోవడానికి ఆకాశమే హద్దు అవ్వాలి.. అప్పుడే ఆకాశం వరకూ ఎగిరే రెక్కలు దక్కుతాయి’’... ‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!) స్టోరీలైన్ ఇది. సూర్య, అపర్ణ బాలమురళి జంటగా సుధ కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జాతీయ ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు (సూర్య), నటి (అపర్ణ), స్క్రీన్ ప్లే (సుధ కొంగర), నేపథ్య సంగీతం (జీవీ ప్రకాశ్‌కుమార్).. ఇలా మొత్తం ఐదు అవార్డులు దక్కాయ అలా జాతీయ అవార్డుల్లో ‘ఆకాశం..’ మెరిసింది. కాగా ఉత్తమ నటుడి అవార్డుకి సూర్యతో పాటు అజయ్ దేవగన్ (‘తన్హాజీ’)ని ఎంపిక చేశారు. ఇక తెలుగుకి నాలుగు అవార్డులు దక్కాయి. జాతీయ ఉత్తమ సంగీతదర్శకుడిగా తమన్ (‘అల.. వైకుంఠపురములో’), ‘నాట్యం’ చిత్రకథానాయిక సంధ్యారాజుకి ఉత్తమ కొరియోగ్రఫీకి, ఇదే చిత్రానికిగాను టీవీ రాంబాబుకి ఉత్తమ మేకప్ అవార్డులు దక్కాయి. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కలర్ ఫొటో’ ఎంపికైంది. ఇంకా శుక్రవారం వెలువడిన 68వ జాతీయ అవార్డుల వివరాలు ఈ విధంగా... 68వ జాతీయ అవార్డులను ఐదు విభాగాలుగా విభజించడం విశేషం. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, ఫీచర్ ఫిల్మ్, నాన్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ రైటింగ్ సెక్షన్, మోస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్... ఇలా ఐదు భాగాలుగా అవార్డులను ప్రకటించారు. 30 భాషల్లో దాదాపు 305 చిత్రాలు ఫీచర్ ఫిల్మ్ స్క్రీనింగ్‌కు, నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో దాదాపు 148 చిత్రాలు అవార్డుల కోసం పోటీ పడ్డాయి. ఈ అవార్డుల్లో తమిళ చిత్రం ‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా..!) హవా కనిపించింది. ఈ చిత్రం ఐదు విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. తెలుగు చిత్రపరిశ్రమకు నాలుగు అవార్డులు దక్కాయి. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిం చిన ‘అల.. వైకుంఠపురుములో...’ చిత్రానికిగాను జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా నిలిచారు తమన్. సుహాస్, చాందినీ చౌదరి జంటగా సందీప్ రాజ్ దర్శకత్వంలో సాయి రాజేశ్ నిర్మించిన ‘కలర్ ఫోటో’ ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ఎంపికైంది. రేవంత్ దర్శకత్వంలో సంధ్యారాజు నటించిన ‘నాట్యం’ ఉత్తమ కొరియోగ్రఫీ, మేకప్ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకోగలిగింది. మరోవైపు మలయాళ హిట్ ఫిల్మ్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ నాలుగు విభాగాల్లో (ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయనటుడు, ఉత్తమ నేపథ్య గానం, స్టంట్ కొరియోగ్రఫీ)లను దక్కించు కుంది. అలాగే తమిళ చిత్రం ‘శివరంజనియుం ఇన్నుమ్ సిల పెన్‌గళుమ్’కు మూడు విభాగాల్లో (ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ఎడిటింగ్, ఉత్తమ సహాయ నటి), ‘హిందీ చిత్రం ‘తన్హాజీ: ది అన్సంగ్ వారియర్’కు మూడు (బెస్ట్ యాక్టర్, బెస్ట్ పాపులర్ ఫిల్మ్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్) జాతీయ అవార్డులు దక్కాయి. తమిళ పరిశ్రమకు మొత్తం 10 (సూరరైపోట్రుకి 5, ‘శివరంజనియుం ఇన్నుమ్ సిల పెన్‌గళుమ్’కి 3, మండేలాకి 2) అవార్డులు దక్కడం విశేషం. అలాగే మధ్యప్రదేశ్ మోస్ట్ ఫ్రెండ్లీ ఫిల్మ్ స్టేట్ అవార్డును దక్కించుకుంది. ‘ద లాంగెస్ట్ కిస్’కు ‘ది బెస్ట్ బుక్ ఆన్ సినిమా అవార్డు దక్కింది. ఇక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును మరో సందర్భంలో ప్రకటించనున్నట్లు జ్యూరీ మెంబర్స్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిల్మ్ క్రిటిక్ అవార్డు విభాగంలో ఎవర్నీ ఎంపిక చేయలేకపోయామని జ్యూరీ పేర్కొంది. సేమ్ సీన్! 67వ జాతీయ అవార్డుల్లోని సీన్ ఒకటి 68వ జాతీయ అవార్డుల్లోనూ రిపీట్ అయ్యింది. 67వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటుడు విభాగాన్ని తమిళ నటుడు ధనుష్ (‘అసురన్’ చిత్రానికి గాను..). హిందీ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ (భోన్స్లే)లు షేర్ చేసుకున్నారు. ఈసారి కూడా ఉత్తమ నటుడు విభాగాన్ని తమిళ నటుడు సూర్య (‘సూరరై పోట్రు’ చిత్రానికిగాను..), హిందీ నటుడు అజయ్ దేవగన్ (హిందీ చిత్రం ‘తన్హాజీ: ది అన్సంగ్ వారియర్’ చిత్రానికిగాను..) బెస్ట్ యాక్టర్ అవార్డును షేర్ చేసుకున్నారు. ఇక కెరీర్లో సూర్యకు తొలిసారి జాతీయ అవార్డు దక్కగా, అజయ్ దేవగన్‌కు మాత్రం ఇది మూడో అవార్డు. ఇంతకు ముందు ‘జఖ్మ్’ (1998), ‘ది లెజండ్ ఆఫ్ భగత్‌సింగ్’ (2002) చిత్రాలకుగాను ఉత్తమ నటుడు విభాగంలో అజయ్ దేవగన్ జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు. దివంగత దర్శకుడికి అవార్డు మలయాళ హిట్ ఫిల్మ్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ నాలుగు జాతీయ అవార్డులు దక్కించుకుంది. ఈ నాలుగు అవార్డుల్లో ఉత్తమ దర్శకుడు విభాగం కూడా ఉంది. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కిగాను దర్శకుడు కేఆర్ సచ్చిదానందన్ అవార్డుకి ఎంపికయ్యారు. అయితే 2020 జూన్‌లో ఆయన గుండెపోటుతో మరణించడం ఓ విషాదం. దీంతో ఈ సంతోషకర సమయంలో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రయూనిట్‌కు ఓ లోటు ఉండిపోయింది. ఇక ఈ నాలుగుతో పాటు ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ప్రొడక్షన్ డిజైన్, యాక్షన్, ఆడియోగ్రఫీ, ఉత్తమ పుస్తకం.. ఇలా మలయాళ పరిశ్రమకు తొమ్మిది అవార్డులు దక్కాయి. ఓటీటీ చిత్రాల హవా! 68వ జాతీయ అవార్డుల్లో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన చిత్రాల జోరు కనిపించింది. ఐదు అవార్డులను గెల్చుకున్న ‘సూరరైపోట్రు’, తెలుగు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచిన ‘కలర్ ఫోటో’ చిత్రాలు డైరెక్టర్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. అలాగే రెండు అవార్డులను గెల్చుకున్న తమిళ చిత్రం ‘మండేలా’ ముందుగా టీవీలో ప్రదర్శితమై, ఆ తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్కు వెళ్లింది. అవార్డులు సాధించిన వాటిలో మరికొన్ని ఓటీటీ చిత్రాలు ఉన్నాయి. తొమ్మిదో అవార్డు కెరీర్లో తొమ్మిదో జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు తెలుగు సీనియర్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్. 68వ జాతీయ అవార్డుల్లో తమిళ చిత్రం ‘శివరంజనియుం ఇన్నుమ్ సిల పెన్‌గళుమ్’కిగాను ఎడిటింగ్ విభాగంలో శ్రీకర్ ప్రసాద్‌కు అవార్డు దక్కింది. ఇది ఆయనకు 9వ అవార్డు. గతంలో ‘రాక్’ (1989), ‘రాగ్ బైరాగ్’ (1997), ‘నౌకా కరిత్రము’ (1997), ‘ది టెర్రరిస్ట్’ (1998), ‘వనప్రస్థం’ (2000), ‘కన్నత్తిల్ ముత్తమిట్టాల్’ (2002), ‘ఫిరాక్’ (2008), 2010లో ‘కుట్టి స్రాంక్’, ‘కమినీ’, ‘కేరళ వర్మ పళస్సి రాజా’లకు గాను స్పెషల్ జ్యూరీ అవార్డులను దక్కించుకున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఈ క్రెడిట్ నాది కాదు ► ‘నీ కాళ్లను చూడు’ అన్నారు.. ‘బుట్ట బొమ్మ’ అన్నారు.. ‘రాములో’ అన్నారు.. జాతీయ అవార్డుని బుట్టలో వేసుకున్నారు.. మీ ఆనందాన్ని షేర్ చేసుకుంటారా? నిజానికి ‘అల వైకుంఠపురము’లో విజయాన్ని నేను వ్యక్తిగతంగా తీసుకోలేదు. మొత్తం క్రెడిట్ అంతా త్రివిక్రమ్‌గారిదే. ఈ జాతీయ అవార్డు క్రెడిట్ కూడా ఆయనదే. ► ట్యూన్స్ ఇచ్చింది మీరు కదా.. (నవ్వుతూ). నేనే. కానీ నిర్ణయాలు తీసుకునే వ్యక్తి చేతుల్లోనే అంతా ఉంటుంది. కరెక్ట్‌గా పిక్ చేయగల డైరెక్టర్ కాబట్టే కరెక్ట్ ట్యూన్స్‌ని త్రివిక్రమ్‌గారు ఎంచుకున్నారు. అలాగే లిరిక్స్ విషయంలోనూ చాలా శ్రద్ధ తీసుకున్నారు. ‘సామజవరగమన.. నిను చూసి ఆగగలనా..’, ‘బుట్ట బొమ్మ’, ‘రాములో రాములా..’ ఇవన్నీ క్యాచీగా ఉన్నాయి కాబట్టే ట్యూన్ ఎలివేట్ అయిందంటాను. ► ఈ సినిమా విషయంలో మీరేమైనా ఒత్తిడికి గురయ్యేవారా? ఏమాత్రం టెన్షన్ పడలేదు. త్రివిక్రమ్‌గారు మమ్మల్నందర్నీ కూల్‌గా ముందుకు నడిపించారు. ఆయన ప్రపంచలోకి వెళ్లి మేం పని చేశాం. అందుకే క్రెడిట్ ఆయనకే ఇస్తున్నాను. ► మరి.. పూర్తి క్రెడిట్‌ని మీరెప్పుడు తీసుకుంటారు? ‘ఇండిపెండెంట్ మ్యూజిక్’కి అవార్డు దక్కినప్పుడు తీసుకుంటాను. విదేశాల్లో ‘గ్రామీ అవార్డ్స్’ ఉన్నాయి. మ్యూజికల్ అవార్డ్స్ అవి. ఇండిపెండెంట్ మ్యూజిక్‌కి అవార్డులు ఇస్తారు. ఇండియాలో నాకు తెలిసి అలాంటి అవార్డులు లేవు. అందుకే మావరకూ ‘సినిమా ఈజ్ బిగ్’. ఏడాదికి ఓ పది సినిమాలు చేస్తాం. అంటే దాదాపు అరవై పాటలు ఇస్తాం. వాటిలో ఒక పాటకు అవార్డు రావడం అంటే ఆనందించదగ్గ విషయమే. అయితే సినిమా అనేది కలెక్టివ్ ఎఫర్ట్. అందుకే అవార్డు క్రెడిట్‌ని ఒక్కడినే తీసుకోవడంలేదు. – తమన్ బాధ్యత పెరిగింది – సాయి రాజేష్ నిజంగా మా ప్రేమకథ (‘కలర్ ఫోటో’ను ఉద్దేశించి...) ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ స్థాయిలో అవార్డు సాధిస్తుందని నేను అస్సలు ఊహించలేదు. నాతో పాటు చిత్రయూనిట్ అంతా చాలా సంతోషంగా ఉన్నాం. నా జీవితంలోని కొన్ని ఘటనల ఆధారంగా ‘కలర్ ఫోటో’ కథను రాసుకున్నాను. నేను నల్లగా ఉంటానని నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది. ఈ అంశాన్ని కూడా సినిమాలో ప్రస్తావించాం. రైటింగ్, ప్రొడక్షన్, దర్శకత్వం విభాగాల్లో ఈ అవార్డు నా బాధ్యతను మరింత పెంచిందనే నమ్ముతున్నాను. అయితే ‘కలర్ ఫోటో’ సినిమా రిలీజ్‌కు ముందే మా నాన్నగారు మాకు దూరమయ్యారు. ఆయన ఇప్పుడు ఉండి ఉంటే ఇంకా హ్యాపీ ఫీలయ్యేవాడిని. అవార్డుల విజేతల వివరాలు ∙ఉత్తమ చిత్రం: సూరరై పోట్రు ∙ఉత్తమ నటుడు: సూర్య (సూరరై పోట్రు), అజయ్ దేవగన్ (తన్హాజీ: ది అన్సంగ్ వారియర్) ∙ఉత్తమ నటి: అపర్ణ బాలమురళి (సూరరై పోట్రు) ∙ఉత్తమ సహాయ నటుడు: బీజూ మీనన్ (అయ్యప్పనుమ్ కోషియుమ్) ∙ఉత్తమ సహాయ నటి: లక్ష్మీ ప్రియా చంద్రమౌళి (శివరంజనియుం ఇన్నుమ్ సిల పెన్‌గళుమ్) ∙ఉత్తమ దర్శకుడు: దివంగత కేఆర్ సచ్చిదానందన్ (అయ్యప్పనుమ్ కోషియుమ్) ∙ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ విభాగంలో అనిశ్ మంగేశ్ గోస్వామి (టక్టక్), ఆకాంక్షా పింగ్లే, దివ్వేష్ తెందుల్కర్ (సుమీ) ∙ఉత్తమ తెలుగు చిత్రం: కలర్ ఫోటో ∙ఉత్తమ తమిళ చిత్రం: శివరంజనియుం ఇన్నుమ్ సిల పెన్‌గళుమ్ ∙ఉత్తమ కన్నడ చిత్రం: డోలు ∙ఉత్తమ మలయాళం చిత్రం: తింకలచ్చ నిశ్చయమ్ ∙ఉత్తమ హిందీ చిత్రం: తులసీదాస్ జూనియర్ ∙ఉత్తమ బాలల చిత్రం: సుమి (మరాఠి) ∙ఇందిరాగాందీ అవార్డు ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిలిం డైరెక్టర్: మండోన్నా అశ్విన్ (మండేలా తమిళ ఫిల్మ్) ∙ఉత్తమ వినోదాత్మక చిత్రం: తన్హాజీ: ది అన్సంగ్ వారియర్ ∙పర్యావరణ పరిరక్షణపై చిత్రం: తలెండా (కన్నడ) ∙బెస్ట్ ఫిల్మ్ ఆన్ సోషల్ ఇష్యూ: ఫ్యూర్నల్ (మరాఠి) ∙ఉత్తమ స్క్రీన్ ప్లే: షాలిని ఉషా నయ్యర్, సుధా కొంగర (సూరరైపోట్రు – తమిళం) ∙ఉత్తమ కొరియోగ్రఫీ: సంధ్యారాజు (నాట్యం) ∙ఉత్తమ మేకప్: టీవీ రాంబాబు (నాట్యం) ∙ఉత్తమ కాస్ట్యూమ్స్: నచికేత్ బార్వే, మహేశ్ శర్లా (హిందీ చిత్రం తన్హాజీ: ది అన్సంగ్ వారియర్) ∙ఉత్తమ సంగీతం (పాటలు): ఎస్ఎస్ తమన్ (అల...వైకుంఠపురములో...) ∙ఉత్తమ సంగీతం (నేపథ్యం): జీవీ ప్రకాశ్‌కుమార్ (సూరరైపోట్రు – తమిళం) ∙ఉత్తమ గీత రచన : మనోజ్ ముంతిషిర్ (సైనా – హిందీ) ∙ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: అనీష్ నదోడి (కప్పెలా– మలయాళం ఫిల్మ్) ∙ఉత్తమ సౌండ్ డిజైనర్: అనుమోల్ భవే (ఎమ్ఐ వసంతరావు – మరాఠి) ∙ఉత్తమ ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్ (శివరంజనీయుం ఇన్నుమ్ సిల పెన్‌గళుమ్– తమిళం) ∙ఉత్తమ ఆడియోగ్రఫీ: జాబిన్ జయాన్ (డోలు– కన్నడ) ∙ఉత్తమ సౌండ్ డిజైనింగ్ (ఫైనల్ మిక్స్): విష్ణు గోవింద్, శ్రీశంకర్ (మాలిక్ –మలయాళం) ∙ఉత్తమ సంభాషణలు: మడొన్నే అశ్విన్ (మండేలా– తమిళం) ∙ఉత్తమ నేపథ్య గాయని: నంజియమ్మ (అయ్యప్పనుమ్ కోషియుమ్ –మలయాళం) ∙ఉత్తమ నేపథ్య గాయకుడు: రాహుల్ దేశ్ పాండే (మీ వసంతరావు– మరాఠి) ∙ఉత్తమ సినిమాటోగ్రఫీ: సుప్రతిమ్ భోల్ (అవిజాత్రిక్– బెంగాలీ). -
ఏం మాట్లాడాలో తెలియటం లేదు.. ఫస్ట్ రియాక్షన్ విత్ సాక్షి
-
తెలుగు సినిమాలకు అవార్డుల పంట
-
‘కలర్ ఫోటో’కు జాతీయ అవార్డు.. స్పందించిన హీరో సుహాస్
కేంద్ర ప్రభుత్వం 68వ జాతీయ చలన చిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించింది. జాతీయ అవార్డుల్లో తెలుగు చిత్రాలు సత్తా చాటాయి. మూడు సినిమాలకు నాలుగు జాతీయ అవార్డులు దక్కాయి. నాట్యం సినిమాకు రెండు, కలర్ ఫోటో, అల వైకుంఠపురం సినిమాకు ఒక్కో అవార్డు లభించింది. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కలర్ ఫోటో’ అవార్డు గెలుచుకుంది. ఒక చిన్న సినిమా జాతీయ అవార్డును అందుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది. కాగా 2020లో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు దక్కిన సందర్భంగా సినిమా హీరో సుహాస్ తన ఆనందాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. కలర్ ఫోటోకు జాతీయ స్థాయిలో అవార్డు లంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సినిమాకు అవార్డు వస్తుందని ఊహించలేదని, హీరోగా చేసిన మొదటి సినిమాకే అవార్డు దక్కడం మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉందన్నారు. ఈ అవార్డు సినిమాకే దక్కుతుందని, ఎప్పుడైనా సినిమానే గెలుస్తుందన్నారు. అవార్డు వచ్చిన విషయం తనకు తెలియదని, ముందుగా డైరెక్టర్ సందీప్‌యే కాల్ చేసి కంగ్రాట్స్ చెప్పారని అన్నారు. ప్రస్తుతం మిగతావారు కూడా కాల్ చేస్తున్నారని సుహాస్ తెలిపారు. సినిమా విడుదలైన సమయంలో దక్కిన ఆనందం.. ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత అంతే ఆనందంగా ఫీల్ అవుతున్నట్లు పేర్కొన్నారు. క్రెడిట్ అంతా డైరెక్టర్‌కే చెందుతున్నారన్నారు. సినిమాకు పనిచేసిన వాళ్లందరికి ఈ అవార్డు అంకితమని అన్నారు. చదవండి: కలర్ ఫోటో సినిమాకు జాతీయ అవార్డు -
కలర్ ఫోటో సినిమాకు జాతీయ అవార్డు
కేంద్ర ప్రభుత్వం 68వ జాతీయ సినిమా అవార్డులను ప్రకటించింది. 2020 సంవత్సరంలో వచ్చిన సినిమాలకు ఈ పురస్కారాలను ప్రకటించింది. ఈసారి 400 సినిమాలు అవార్డుల కోసం పోటీపడగా 15 ప్రాంతీయ భాషా చిత్రాలకు అవార్డులు వరించాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన కలర్ ఫొటో ఎంపికైంది. ఉత్తమ సంగీత దర్శకుడిగా అల వైకుంఠపురములో చిత్రానికి గానూ తమన్‌కు అవార్డు వరించింది. ఇక ముందుగా ఊహించినట్లుగానే సూర్య సూరరై పొట్రు(ఆకాశమే నీ హద్దురా) చిత్రానికి ఏకంగా ఐదు అవార్డులు వచ్చి పడ్డాయి. మోస్ట్ ఫిలిం ఫ్రెండ్లీ స్టేట్‌గా మధ్యప్రదేశ్ నిలిచింది. బెస్ట్ క్రిటిక్ అవార్డు ప్రకటనను మాత్రం కేంద్రం వాయిదా వేసింది. ► మోస్ట్ ఫిలిం ఫ్రెండ్లీ స్టేట్ - మధ్యప్రదేశ్ ► ఉత్తమ సంగీత దర్శకుడు (సాంగ్స్): - తమన్ (అల వైకుంఠపురములో) ► ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ (బీజీఎమ్) : జీవీ ప్రకాశ్ కుమార్ (సూరరై పోట్రు -తమిళ్) ► బెస్ట్ ఫీచర్ ఫిలిం: సూరరై పోట్రు ► బెస్ట్ స్టంట్స్ - అయ్యప్పనుమ్ కోషియమ్ ► ఉత్తమ కొరియోగ్రఫీ: సంధ్యారాజు (నాట్యం -తెలుగు) ► ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: టీవీ రాంబాబు - నాట్యం ► ఉత్తమ సహాయ నటి: లక్ష్మీ ప్రియ చంద్రమౌళి (శివరంజనీయం ఇన్నుమ్ శిల పెంగళమ్) ► ఉత్తమ సహాయ నటుడు: బిజు మీనన్ (అయ్యప్పనుమ్ కోషియుమ్- మలయాళం) ► ఉత్తమ నటి: అపర్ణ బాలమురళి (సూరరై పోట్రు- తమిళ్) ► ఉత్తమ నటుడు: సూర్య (సూరరై పోట్రు) ► ఉత్తమ నటుడు (షేర్డ్): అజయ్ దేవ్‌గణ్ (తానాజీ: ది అన్సంగ్ వారియర్- హిందీ) ► ఉత్తమ దర్శకుడు: సచ్చిదానందన్ కేఆర్ (అయ్యప్పనుమ్ కోషియుమ్) ► ఉత్తమ పిల్లల చిత్రం: సుమి(మరాఠి) ► బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్: నాంచమ్మ (అప్పయ్యప్పనుమ్ కోషియమ్- మలయాళం) ► బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్: రాహుల్ దేశ్‌పాండే (మీ వసంతరావు - మరాఠీ) ► ఉత్తమ తమిళ చిత్రం: శివరంజనీయం ఎన్నుమ్ శిల పెంగల్లమ్ (తమిళ్) ► ఉత్తమ మలయాళ చిత్రం: థింకలియా నిశ్చయమ్ ► ఉత్తమ కన్నడ చిత్రం: డొల్లు ► ఉత్తమ హిందీ చిత్రం: తులసీదాస్ జూనియర్ ► ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ అవార్డ్(స్టంట్ కొరియోగ్రఫీ): అయ్యప్పనుమ్ కోషియమ్ (మలయాళం) ► ఉత్తమ లిరిక్స్: సైనా(హిందీ) - మనోజ్ ముంతషిర్ ► ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: నచికెత్ బర్వె, మహేశ్ షెర్లా (తానాజీ: ది అన్సంగ్ వారియర్) ► ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: అనీస్ నాడోడి (కప్పేలా -మలయాళం) ► ఉత్తమ ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్ (శివరంజనీయం ఎన్నుమ్ శిల పెంగల్లమ్ -తమిళ్) ► బెస్ట్ ఆడియోగ్రఫీ (లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్): జాబిన్ జయన్ (డోలు- కన్నడ) ► బెస్ట్ ఆడియోగ్రఫీ (సౌండ్ డిజైనర్) : అన్మూల్ భావే (మీ వసంతరావు- మరాఠీ) ► బెస్ట్ ఆడియోగ్రఫీ (రీరికార్డిస్ట్ ఆఫ్ ద ఫైనల్ మిక్స్డ్ ట్రాక్: విష్ణు గోవింద్, శ్రీశంకర్ (మలిక్- మలయాళం) ► బెస్ట్ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్):షాలిని ఉషా నాయర్, సుధా కొంగర (సూరరై పోట్రు - తమిళ్) ► బెస్ట్ స్క్రీన్‌ప్లే (డైలాగ్ రైటర్) : మడోన్నా అశ్విన్ (మండేలా- తమిళ్) ► బెస్ట్ సినిమాటోగ్రఫీ: సుప్రతీమ్ భోల్ (అవిజాత్రిక్- బెంగాలీ) ► ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: అనీష్ మంగేశ్ గోసావి (టక్ టక్- మరాఠీ), ఆకాంక్ష పింగ్లే, దివఏశ్ ఇందుల్కర్ (సుమీ- మరాఠీ) ► బెస్ట్ ఫిలిం ఆన్ ఎన్వైర్మెంట్ కంజర్వేషన్: తాలెడండ(కన్నడ) ► బెస్ట్ ఫిలిం ఆన్ సోషల్ ఇష్యూస్: ఫ్యునెరల్ (మరాఠి) ► బెస్ట్ పాపులర్ ఫిలిం ఆన్ ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్: తానాజీ: ది అన్సంగ్ వారియర్ ► ఇందిరాగాంధీ అవార్డ్ ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిలిం ఆఫ్ ఎ డైరెక్టర్: మడోన్న అశ్విన్ (మండేలా- తమిళ్) నాన్ ఫీచర్ ఫిలింస్ ► బెస్ట్ వాయిస్ ఓవర్: శోభా రాప్సోడీ ఆఫ్ రెయిన్స్- మాన్సూన్స్ ఆఫ్ కేరళ (ఇంగ్లీష్) ► బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్: విశాల్ భరద్వాజ్ (1232 కి.మీ: మరేంగే తో వహీన్ జాకర్) (హిందీ) ► బెస్ట్ ఎడిటింగ్: అనాదీ అతలే (బార్డర్ ల్యాండ్స్) ► బెస్ట్ ఆన్‌లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్- సందీప్ భాటి, ప్రదీప్ లెహ్వార్ (జాదూయ్ జంగల్) (హిందీ) ► బెస్ట్ ఆడియోగ్రఫీ(ఫైనల్ మిక్స్డ్ ట్రాక్): అజిత్ సింగ్ రాథోడ్ (పర్ల్ ఆఫ్ ద డిసర్ట్ ) (రాజస్థానీ) ► బెస్ట్ సినిమాటోగ్రఫీ: నిఖిల్ ఎస్ ప్రవీణ్ (శబ్దికున్ కలప్ప) (మలయాళం) ► ఉత్తమ డైరెక్షన్: ఆర్వీ రమణి (ఓ దట్స్ భాను- ఇంగ్లీష్, తమిళ్, మలయాళం, హిందీ) ► ఉత్తమ కుటుంబ కథా చిత్రం: కుంకుమార్చన్ (మరాఠి) ► ఉత్తమ షార్ట్ ఫిక్షన్ ఫిలిం: కచీచినుతు (అస్సాం) ► స్పెషల్ జ్యూరీ అవార్డ్: అడ్మిటెడ్ (హిందీ, ఇంగ్లీష్) ► బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ ఫిలిం: ద సేవియర్: బ్రిగేడియర్ ప్రీతమ్ సింగ్ (పంజాబీ) ► బెస్ట్ ఎక్స్‌ప్లోరేషన్ ఫిలిం: వీలింగ్ ద బాల్ (ఇంగ్లీష్, హిందీ) ► బెస్ట్ ఎడ్యుకేషనల్ ఫిలిం: డ్రీమింగ్ ఆఫ్ వర్డ్స్ (మలయాళం ) ► బెస్ట్ ఫిలిం ఆన్ సోషల్ ఇష్యూస్: జస్టిస్ డిలేయ్డ్ బట్ డెలివర్డ్ (హిందీ), 3 సిస్టర్స్ (బెంగాలీ) ► బెస్ట్ ఎన్వైర్మెంట్ ఫిలిం: మాన అరు మానుహ్ (అస్సామీస్) ► బెస్ట్ ప్రమోషనల్ ఫిలిం: సర్‌మొంటింగ్ చాలెంజెస్ (ఇంగ్లీష్) ► బెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫిలిం: ఆన్ ద బ్రింక్ సీజన్ 2- బ్యాట్స్ (ఇంగ్లీష్) ► బెస్ట్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఫిలింస్: నాదదా నవనీతా ► బెస్ట్ బయోగ్రాఫికల్ ఫిలిం: పబుంగ్ శ్యామ్ ► బెస్ట్ ఎత్నోగ్రాఫిక్ ఫిలిం: మందల్ కె బోల్ (హిందీ) ► బెస్ట్ డెబ్యూ నాన్ ఫియేచర్ ఫిలిం ఆఫ్ ఎ డైరెక్టర్: విశేష్ అయ్యర్ (పరాయా- మారాఠీ, హిందీ) చదవండి: కిస్, అత్యాచార సీన్లు మాత్రమే చేయమంటున్నారు: నటి -
ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ ఈ స్టార్ హీరో
సాక్షి, హైదరాబాద్: ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ తమిళ స్టార్ హీరో ధనుష్. సమాజంలోని అమానవీయ కోణాన్నిప్రయోగాత్మకంగా ఆవిష్కరించి బాక్సాఫీసును షేక్ చేయడమే కాదు జాతీయ అవార్డును సైతం దక్కించుకున్న గొప్ప నటుడు ధనుష్. సినిమా చూసిన వెంటనే జాతీయ అవార్డు ఖాయమనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో కలిగించిన అసామాన్య హీరో. అంతేకాదు ఒకే వేదికపై పిల్లనిచ్చిన మామతో కలిసి అత్యుత్తమ పురస్కారాన్ని అందుకుని కొత్త చరితను లిఖించాడు ధనుష్. తమిళ మూవీ ‘అసురన్’ ద్వారా జాతీయ ఉత్తమనటుడు అవార్డు గెల్చుకున్న సందర్భంగా స్పెషల్ వీడియో. (National Film Awards: వాళ్లు..నావాళ్లు, ఇది చరిత్ర: ఐశ్వర్య) -
రజనీకాంత్‌ను అభినందించిన సీఎం, గవర్నర్
Rajinikanth: అత్యుత్తమ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్న నటుడు రజనీకాంత్‌కు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్, గవర్నర్ ఆర్.ఎన్.రవి అభినందనలు తెలియజేశారు. సోమవారం ఢిల్లీలో జరిగిన జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో నటు డు రజనీకాంత్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శాలువాతో సత్కరించి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందజేశారు. వెండితెర సూర్యుడు.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రజినీకాంత్‌ను ట్విట్టర్లో అభినందించారు. అందులో అత్యుత్తమ పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకుంటున్న ప్రియ మిత్రుడు, సూపర్ స్టార్ రజనీకాంత్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. వెండితెర సూర్యుడు రజినీకాంత్ తమిళ సినిమాను తదుపరి ఘట్టానికి తీసుకుపోయారని, ఆయన ప్రపంచ స్థాయిలో పలు అవార్డులను పొందాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఆనందకరమైన రోజు.. రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవి రజనీకాంత్‌కు శుభాకాంక్షలు అందించారు. ఆయన మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ‘‘ భారతీయ సినిమాకు మీరు అందించిన అసాధారణ సేవలకుగాను అత్యుత్తమ పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కేను కేంద్రం ప్రకటించింది. అవార్డు అందుకున్న మీకు.. దేశ ప్రజల తరఫున, నా తరఫున శుభాకాంక్షలు. సినిమాలను ప్రేమించే అందరికీ ఆనందకరమైన రోజు ఇది. భారతీయ సినిమాకు ఉన్నత సేవలతోనూ, వ్యక్తిగతంగా సంస్కారవంతమైన జీవితంతో మన దేశం ప్రజలను ఆకట్టుకున్నారు. అలాంటి మీరు పలు ఏళ్లపాటు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. -
యువకులకు రజనీకాంత్ జీవితం ఓ ప్రేరణ: ఉప రాష్ట్రపతి
‘సినిమాల్లో హింస, అశ్లీలతలవంటివి చూపించడాన్ని తగ్గించాలి. సినిమాల ప్రభావం సమాజంపై ఎక్కువగా ఉంటుంది. ప్రజల్లో బాధ్యత పెంపొందించే విధంగా సినిమాలు ఉండాలి. భారతదేశ సినీ పరిశ్రమలో ఉన్న అపారమైన నైపుణ్యానికి ఈ అవార్డులు ఓ మచ్చుతునక మాత్రమే. మరింతమంది ఔత్సాహిక యువ దర్శకులు, కళాకారులు, సాంకేతిక సిబ్బందిని చిత్రపరిశ్రమ పెద్దలు ప్రోత్సహించాలి. సినీరంగంలో అవకాశాలు వెతుక్కుంటున్న యువకులకు రజనీకాంత్ సినీ జీవితం ప్రేరణాత్మకంగా నిలుస్తుంది’ అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన 67వ జాతీయ సినిమా అవార్డుల కార్యక్రమంలో ప్రముఖ సినీనటుడు రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారంతో పాటు పలువురు కళాకారులకు వెంకయ్యనాయుడు అవార్డులను ప్రదానం చేశారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఉత్తమ వినోదాత్మక చిత్రంగా ‘మహర్షి’ ఎంపిక కాగా ఆ చిత్రదర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత ‘దిల్’ రాజు అవార్డులు స్వీకరించారు. తెలుగులో ఉత్తమ సినిమాగా ఎంపి కైన ‘జెర్సీ’ అవార్డును నిర్మాత సూర్యదేవర నాగవంశీ, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి, అదే సినిమాకుగాను ఎడిటర్ నవీన్ నూలి అవార్డు అందుకున్నారు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డును ‘భోంస్లే’కి మనోజ్ బాజ్‌పాయ్, ‘అసురన్ ’ చిత్రానికి ధనుష్ ఇద్దరూ అందుకున్నారు. ‘మణికర్ణిక’, ‘పంగా’ చిత్రాలకుగాను కంగనా రనౌత్ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. నన్ను నటుడిగా తీర్చిదిద్దిన నా గురువు బాలచందర్‌గారికి ధన్యవాదాలు. నా అన్నయ్య సత్యనారాయణరావు గైక్వాడ్ నా తండ్రిలాంటివారు. గొప్ప విలువలు నేర్పించిన ఆయనకు ధన్యవాదాలు. నా మిత్రుడు, డ్రైవర్, ట్రాన్స్పోర్ట్ సహోద్యోగి రాజ్ బహుదూర్ నాలో నటుడు ఉన్నాడని గుర్తించి, నన్ను ప్రోత్సహించారు. వీరితో పాటు నా సినిమా నిర్మాతలు, దర్శకులు, సహ నటీనటులు, సాంకేతిక నిపుణులు, పంపిణీదారులు, థియేటర్ల యజమానులు, మీడియా మిత్రులు, అభిమానులు, తమిళ ప్రజలకి ఈ పురస్కారాన్ని అంకితమిస్తున్నాను. – రజనీకాంత్ మంచి చిత్రాలు తీస్తూ ఉండాలని ఈ పురస్కారం గుర్తు చేస్తూ ఉంటుంది. వినోదంతో పాటు సందేశం ఇవ్వడం సినిమాతో సాధ్యమవుతుంది. మహేశ్‌బాబు లాంటి సూపర్ స్టార్‌తో సినిమా చేసినప్పుడు మరింతమంది చూస్తారు. – వంశీ పైడిపల్లి రైతులకు నగర ప్రజలు ఏ విధంగా సాయం చేయాలనే అంశంతో ‘మహర్షి’ సినిమా తీశాం. మహేశ్ బాబు కమర్షియల్ స్టార్. ఆయనకు తగ్గట్టు సినిమాలో పాటలు, ఫైట్లతో దర్శకుడు వంశీ పైడిపల్లి చక్కటి సినిమా తీశాడు. – ‘దిల్’ రాజు ‘జెర్సీ’కి పని చేసిన అందరికీ ధన్యవాదాలు. ఈ అవార్డు రావడానికి ముఖ్యకారణం హీరో నానీ. – గౌతమ్ తిన్ననూరి – నవీన్ నూలి – సూర్యదేవర నాగవంశీ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా బాబాయి(చినబాబు), డైరెక్టర్‌కు ధన్యవాదాలు. కథను నమ్మి నటించిన నానీకి ప్రత్యేక ధన్యవాదాలు. – సూర్యదేవర నాగవంశీ ఎడిటింగ్‌లో చాలా సంవత్సరాల తర్వాత తెలుగు సినిమాకు అవార్డు రావడం సంతోషంగా ఉంది. – నవీన్ నూలి అవార్డు విజేతల వివరాలు.. ఉత్తమ చిత్రం: ‘మరక్కర్: ది అరేబియన్ కడలింటె సింహం’ (మలయాళం) ఉత్తమ నటుడు: ధనుష్ (‘అసురన్’), మనోజ్ బాజ్‌పాయ్ (‘భోంస్లే’), ఉత్తమ నటి: కంగనా రనౌత్ (మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ, పంగా) ఉత్తమ సహాయ నటుడు: విజయ్ సేతుపతి (తమిళ ‘సూపర్ డీలక్స్’) ఉత్తమ సహాయ నటి: పల్లవీ జోషి (హిందీ ‘తాష్కెంట్ ఫైల్స్’) ఉత్తమ బాల నటుడు: నాగ విశాల్ (తమిళ చిత్రం – ‘కె.డి’) ఉత్తమ దర్శకుడు: సంజయ్ పూరణ్ సింగ్ చౌహాన్ (హిందీ ‘బహత్తర్ హూరేన్ ’) ఉత్తమ వినోదాత్మక చిత్రం: ‘మహర్షి’ ఉత్తమ తెలుగు చిత్రం: ‘జెర్సీ’ ఎడిటింగ్: నవీన్ నూలి (జెర్సీ) కొరియోగ్రాఫర్: రాజుసుందరం (మహర్షి) ఉత్తమ సంగీత దర్శకుడు: డి. ఇమాన్ (తమిళ చిత్రం ‘విశ్వాసం’) ఉత్తమ గాయకుడు: బి. ప్రాక్ (హిందీ ‘కేసరి’) ఉత్తమ గాయని: సావనీ రవీంద్ర (మరాఠీ ‘బర్దో’) ఉత్తమ సినిమాటోగ్రఫీ: గిరీశ్ గంగాధరన్ (మలయాళ చిత్రం – ‘జల్లికట్టు’) ఉత్తమ యాక్షన్ డైరెక్షన్: విక్రమ్ మోర్ (కన్నడ ‘అవనే శ్రీమన్నారాయణ’) ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: సిద్ధార్థ్ ప్రియదర్శన్ (మలయాళ ‘మరక్కర్: ది అరేబియన్ ’) ఉత్తమ కాస్ట్యూమ్స్: సుజిత్ సుధాకరన్, వి. సాయి (‘మరక్కర్...’) ఉత్తమ తమిళ చిత్రం: ‘అసురన్ ’ ఉత్తమ మలయాళ చిత్రం: ‘కల్ల నోట్టమ్’ ఉత్తమ కన్నడ చిత్రం: ‘అక్షి’ ఉత్తమ హిందీ చిత్రం: ‘ఛిఛోరే’ ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం: ‘తాజ్‌మహల్’ (మరాఠీ) స్పెషల్ జ్యూరీ అవార్డు: ‘ఒత్త సెరుప్పు సైజ్ 7’ (తమిళం) చదవండి: అరాచకంగా ‘అన్నాత్తే’ టీజర్.. వింటేజ్ రజనీ ఆన్ ది వే -
67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం
-
నేషనల్ అవార్డ్స్ అందుకున్న విజేతలు వీళ్లే..
అత్యంత ప్రతిష్ఠత్మకమైన 67వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఢిల్లీలో జరిగింది. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పలువురు అవార్డులు అందుకున్నారు. 67వ జాతీయ చలన చిత్ర అవార్డుల విజేతలు వీళ్లే.. ఉత్తమ తెలుగు చిత్రం- జెర్సీ ఉత్తమ పాపులర్ చిత్రం- మహర్షి ఉత్తమ నటి -కంగనా రనౌత్ (మణికర్ణిక) ఉత్తమ నటుడు- మనోజ్ బాజ్‌పాయీ (భోంస్లే), ధనుష్ (అసురన్) ఉత్తమ హిందీ చిత్రం- చిచ్చోరే ఉత్తమ తమిళ చిత్రం- అసురన్ ఉత్తమ మలయాళ చిత్రం- మరక్కర్ ఉత్తమ దర్శకుడు- సంజయ్ పూరన్ సింగ్ చౌహాన్ (బహత్తర్ హూరైన్) ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: మరక్కర్ (మలయాళం) ఉత్తమ సహాయ నటుడు: విజయ్ సేతుపతి(సూపర్ డీలక్స్) ఉత్తమ సహాయ నటి- పల్లవి జోషి(ది తాష్కెంట్ ఫైల్స్) ఉత్తమ కొరియోగ్రాఫర్: రాజు సుందరం (మహర్షి) ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ: అవనే శ్రీమన్నారాయణ(కన్నడ) ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు): డి.ఇమ్మాన్ (విశ్వాసం) ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడు: ప్రబుద్ధ బెనర్జీ (జ్యేష్టపుత్రో) ఉత్తమ గాయకుడు: బ్రి. ప్రాక్ (కేసరి చిత్రంలోని ‘తేరీ మిట్టీ...’) ఉత్తమ గాయని: శావని రవీంద్ర (బర్దో-మరాఠీ) ఉత్తమ మేకప్: రంజిత్ (హెలెన్) ఉత్తమ ఎడిటింగ్- నవీన్ నూలి (జెర్సీ) -
67th National Film Awards: ఉత్తమ పాపులర్ చిత్రంగా 'మహర్షి'..
-
67వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం..
67th National Film Awards: అత్యంత ప్రతిష్ఠత్మకమైన 67వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలో జరిగింది. సినీ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతో పాటు ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాలకు అవార్డులు అందజేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పలువురు అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ‘మణికర్ణిక’ చిత్రానికి గానూ కంగనా రనౌత్ జాతీయ ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకున్నారు. ఉత్తమ నటుడిగా ధనుష్(అసురన్), మనోజ్ బాజ్‌పాయ్(భోంస్లే) అవార్డులు అందుకున్నారు. ఉత్తమ సహాయ నటుడిగా విజయ్ సేతుపతి(సూపర్ డీలక్స్)కి అవార్డు దక్కింది. ఇక జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా 'జెర్సీ' నిలిచింది. ఎడిటింగ్ విభాగంలోనూ జెర్సీ సినిమాకు అవార్డు దక్కింది. బెస్ట్ తెలుగు పాపులర్ ఫిల్మ్‌గా 'మహర్షి' సినిమాకు నేషనల్ అవార్డు వరించింది. మొత్తంగా తెలుగులో జెర్సీ సినిమాకు రెండు అవార్డులు రాగా, మహర్షికి సినిమాకు మూడు అవార్డులు దక్కాయి. బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా రాజుసందరం మాస్టర్‌కు జాతీయ అవార్డు లభించింది.