తెలుగు సినిమా 'పెళ్లి చూపులు'కు జాతీయ అవార్డు దక్కింది. శుక్రవారం ప్రకటించిన 64వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఈ సినిమాను ఉత్తమ తెలుగు చిత్రం కేటగిరి కింద ఎంపిక చేశారు. ఉత్తమ సంభాషణల కేటిగిరి అవార్డు తరుణ్ భాస్కర్ (పెళ్లిచూపులు)ను వరించింది. దాస్యం తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రాజ్ కందుకూరి, యాశ్ రంగినేని నిర్మించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రీతూ వర్మ నటించారు. ఈ లోబడ్జెట్ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించింది. ఇక ఉత్తమ నృత్య దర్శకుడిగా రాజుసుందరం (జనతా గ్యారేజ్)ను, ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా శతమానం భవతిని ఎంపిక చేశారు. ఉత్తమ నటుడిగా అక్షయ్ కుమార్ (రుస్తుం), ఉత్తమ హిందీ చిత్రంగా నీర్జాను ప్రకటించారు.
Published Fri, Apr 7 2017 2:45 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM
Advertisement
Advertisement
Advertisement