Pelli Choopulu
-
పెళ్లిచూపులు హీరోయిన్ బర్త్‌డే స్పెషల్ ఫోటోలు..
-
పెళ్లిచూపులు: అవే ప్రశ్నలు, వంకలు,.. అబ్బాయిని ఎందుకు అడగరో?
ఇంటికొచ్చిన అపరిచిత పురుషులు, స్త్రీలు. వారితో పాటు పెళ్లికొడుకు. వారి ముందుకు టీ కప్పుల ట్రేతో పెళ్లికూతురు రావాలి. తర్వాత ప్రశ్నలు ఉంటాయి. ‘ఇంటికెళ్లి ఏ సంగతీ చెప్తాం’ అని వాళ్లు వెళ్లిపోతారు. సంబంధం ఖాయమా కదా అనే టెన్షన్. చెడితే మళ్లీ మొత్తం సీన్ రిపీట్ చేయాలి.ఆడపిల్లలను ప్రదర్శనకు పెట్టి బాధ పెట్టే ఈ పెళ్లిచూపుల తంతును మార్చలేమా అని ప్రశ్నిస్తూ తీసిన మరాఠీ సినిమా ‘స్థల్’టొరెంటో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైంది.సెప్టెంబర్ 7–18 తేదీల్లో ‘స్థల్’ అక్కడ ప్రదర్శితం కానుంది. 1970లలో 80 లలో సినిమాల్లో పెళ్లిచూపులు ఎలా ఉండేవో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. నగరాల్లో అయితే ఒకలాగా... పల్లెల్లో అయితే ఒకలాగా.. కొద్ది మార్పులతో. అప్పుడైనా ఇప్పుడైనా ‘ఎంచేవాడు’ అబ్బాయే అవుతున్నాడు. ‘అబ్బాయి వాళ్లు ఓకే అంటే చాలు’ అనుకునే ఆడపిల్లల తల్లిదండ్రులు ఎక్కువమంది ఉన్నారు. అసలు అమ్మాయిని చూడటానికి రావడంలోనే మగపెళ్లివారి పైచేయి ఉంది. ఇన్నేళ్లు గడిచినా అబ్బాయిని చూసుకోవడానికి అమ్మాయి వాళ్లు తరలి రావడం వినడం లేదు. పెళ్లి అంటే అబ్బాయి, అమ్మాయి ఒకరికొకరు నచ్చాలి. కాని అమ్మాయి ఔను/కాదులకు ప్రాధాన్యం లేదు. ఈ పద్ధతి ఇంకా ఎంతకాలం అని ప్రశ్నిస్తోంది మరాఠి సినిమా ‘స్థల్’. ఆ మాటకు ‘పెళ్లి సంబంధం’ అని అర్థం. పత్తి రైతు ఇంట్లో అమ్మాయి ‘స్థల్’ సినిమా కథ మహరాష్ట్రలోని విదర్భ జిల్లాలో దోంగర్గావ్ అనే ఊళ్లో జరుగుతుంది. ఈ ప్రాంతమంతా పత్తి రైతులు. వయసొచ్చిన ఆడపిల్లకు తొందరగా పెళ్లి చేయాలని భావిస్తారు. అయితే ఆడపిల్లవాళ్లు అనుకున్నంత మాత్రాన ఆడపిల్లల పెళ్లిళ్లు జరిగిపోవు. దానికి సవాలక్ష కుదరాలి. ముందు పెళ్లిచూపుల తంతు జరగాలి. ఈ సినిమాలో బి.ఏ చదివిన సవిత అనే అమ్మాయి ‘పి.జి చదువుతాను మొర్రో’ అని మొత్తుకుంటున్నా వినకుండా తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడటం మొదలెడతారు. అక్కడి నుంచి రకరకాల అనుభవాలు ఆమెకు ఎదురవుతుంటాయి. విదర్భ ప్రాంతంలో పెళ్లి చూపులకు వచ్చిన వారికి పెళ్లికూతురు ‘పోహా’ తీసుకెళ్లి ఇవ్వడం ఆనవాయితీ. దీని ‘పోహా కార్యక్రమం’ అంటారు. ఆ పోహాతో మొదలెట్టి పెళ్లి చూపుల తంతు అయ్యేంత వరకూ ముళ్ల పీఠంపై కూర్చున్నట్టు పెళ్లి కూతురు ఎదుర్కొనే శల్య పరీక్షలను ప్రశ్నిస్తుంది ఈ సినిమా. ఎన్నో లోపాలు, వంకలు పెళ్లిసంబంధాల్లో పెళ్లికూతురిలో వంకలు, లోపాలు వెతకడం కొనసాగుతూనే ఉంది. దీని గురించి జయంత్ సోమల్కర్ మాట్లాడుతూ ‘చదువు, ఉద్యోగం, రంగు, ఎత్తు... వీటన్నింటి మీద అబ్బాయి తరపు వాళ్లకు ఒక అభిప్రాయం ఉంటుంది. పెళ్లికూతురిలో ఆ మేరకు లోపం వెతకడానికి చూస్తారు. వంకలు పెడతారు. ప్రతి పెళ్లిచూపుల్లో అవే ప్రశ్నలు. పెళ్లికూతురు జవాబు చెప్పి చెప్పి విసిగిపోవాలి. అసలు అంతమంది వచ్చి కూచుని ఒకమ్మాయిని గుచ్చి గుచ్చి చూస్తూ ప్రశ్నలు సంధిస్తూ ఉంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించామా? నా చిన్నప్పుడు మా అక్కలకు ఇలాగే పెళ్లిచూపులు జరుగుతుంటే చూసేవాణ్ణి. ఇటీవల మా కజిన్‌ను చూడటానికి అబ్బాయి వస్తే అదే తంతు. సినిమా తీయాలనిపించింది’ అన్నాడు. ఊరివాళ్లే నటులు జయంత్ సోమల్కర్ విదర్భ ప్రాంతం వాడే. తన సొంత ఊళ్లో షూటింగ్ మొత్తం చేశాడు. ఊరి వాళ్లనే నటీనటులుగా ఎంపిక చేసుకున్నాడు. రియలిస్టిక్‌గా అనిపించేందుకే అలా చేశాడు. ‘షూటింగ్ మధ్యలో పొలానికి నీళ్లు పెట్టి వస్తానని, బర్రెకు గడ్డి వేసి వస్తానని నటీనటులు వెళ్లిపోకుండా చూడటం నాకు పెద్ద సమస్య అయ్యింది’ అంటాడు జయంత్ నవ్వుతూ. ముఖ్య పాత్రను ఊరి అమ్మాయి నందిని చిట్కె అద్భుతంగా చేయడం కూడా యూనిట్‌కు ఆశ్చర్యమే. ‘పెళ్లి చూపుల తంతును సహజమైన హాస్యంతో నేను చూపించినా సంబంధాలు వద్దనేకొద్దీ పెళ్లికూతురిలో వచ్చే తిరుగుబాటును, ఆమెలో వచ్చే ఆగ్రహాన్ని చూపించాను. నన్ను తిట్టుకున్నా సరే... పదిమందైనా మారితే అదే పదివేలు’ అంటాడు జయంత్. ప్రతిష్టాత్మక 48వ టొరెంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘డిస్కవరీ సెక్షన్’లో భారతదేశం నుంచి ‘స్థల్’ ఒక్కటే ఎంపికైంది. ఇక్కడ ప్రదర్శితమయ్యాక ఇండియాలో రిలీజ్ చేయడానికి దర్శకుడు సిద్ధమవుతున్నాడు. -
రూ.25 లక్షల ప్యాకేజీ.. సాఫ్ట్వేర్ ఉద్యోగం.. అయినా పెళ్లికి ఇది సరిపోదు..
పెళ్లి సంబంధం కుదరడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అమ్మాయికి అబ్బాయి నచ్చాలి. సంపాదన ఏడాది ప్యాకేజీ ఎంత అన్నదీ కీలకంగా చూస్తున్నారు. ‘ప్యాకేజీ’ నచ్చితేనే అమ్మాయితో పాటు కుటుంబ సభ్యులు ఓకే చేస్తున్నారు. లేకుంటే మరో ఆప్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. అంతేకాదు పెళ్లి చూపులు కూడా సరికొత్త రూపు దాలుస్తున్నాయి. వధువు ఇంట జరగాల్సిన పెళ్లి చూపులకు హోటళ్లు.. ఇతర ప్రదేశాలు వేదికగా సాగుతున్నాయి. సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం నగరానికి చెందిన దీప్తి డల్లాస్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. ఇదే జిల్లాకు చెందిన అబ్బాయి రాకేష్ కాలిఫోర్నియాలో ఉంటున్నాడు. అక్కడే వీరిద్దరి పెళ్లిచూపులు అయ్యాయి. వచ్చే నెల ఇండియాలో పెళ్లి జరగబోతోంది. ►గుంతకల్లుకుచెందిన సురేష్‌కు నాలుగైదు సంబంధాలు వచ్చినా.. కుదరలేదు. కారణమేంటంటే.. అతనికి ముగ్గురు అక్కచెల్లెళ్లు, ఒక తమ్ముడు ఉన్నారు. ఆడపిల్లలకు పెళ్లిళ్లయినా పెద్ద కుటుంబం కదా ఇంతమందికి పెట్టుపోతలు కష్టమని అమ్మాయి తరఫు వారు వెనక్కు తగ్గుతున్నారు. ►ఆస్తులు, అంతస్తులు.. ముందు పది తరాలు, వెనుక పది తరాలు.. బలమూ బలగమూ ఇవి ఉంటే చాలు గతంలో అమ్మాయికి ఎలాంటి ఢోకా లేదని పెళ్లి కుదుర్చుకునే వారు. రానురాను కాలం మారింది. ఆస్తులేమోగానీ బలమూ బలగానికి చోటు లేదు. ఇప్పుడంతా ‘ప్యాకేజీ’లే. నెలజీతం ఎవరూ అడగడం లేదు. వార్షిక ప్యాకేజీ (యాన్యువల్ ప్యాకేజీ)ని బట్టి పెళ్లిళ్లు కుదిరిపోతున్నాయి. ప్యాకేజీ లేకపోతే వందెకరాల భూస్వామి కొడుక్కు కూడా పిల్లనిస్తామని వచ్చేవారు లేరు. అదే హైదరాబాద్.. బెంగళూరుల్లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ అబ్బాయిలు, అమ్మాయిలకు అయితే డిమాండ్ బాగుంది. అమ్మాయిల ప్యాకేజీల పైనా ఆరా.. అబ్బాయికి ఏడాదికి రూ.25 లక్షలు ప్యాకేజీ అయినంత మాత్రాన పదో తరగతి చదివిన అమ్మాయిని ఒప్పుకునే పరిస్థితి లేదు. ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలకు, అదీ మంచి ప్యాకేజీతో వేతనం ఉన్న వారికి త్వరగా పెళ్లిళ్లు కుదురుతున్నాయి. ఉద్యోగం చేస్తున్న అమ్మాయిల విషయంలో కట్న కానుకలు రెండో ప్రాధాన్యత అంశంగా మారింది. కానుకల విషయంలో వెసులుబాటూ కలుగుతోంది. డాక్యుమెంట్లు చూపించండి ఆస్తులు, డబ్బే ఇప్పుడు పెళ్లిళ్లను కుదురుస్తున్నట్టుంది. ఆస్తులున్నట్టు చెబితే డాక్యుమెంట్లు అడుగుతున్న వారూ లేకపోలేదు. ఉమ్మడి ఆస్తులకు లెక్కచెప్పండి.. నీ వాటా ఎంత వస్తుంది, ఎప్పుడు పంచుకుంటున్నారు..మార్కెట్ వ్యాల్యూ ఎంత ఉంటుంది. ఇలాంటివన్నీ అడుగుతున్న పరిస్థితి. కొన్నిసార్లు ఇలాంటి ప్రశ్నలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. విదేశాల్లోనే వివాహ బంధాలు అమెరికా, కెనడాల్లో స్థిరపడిన అబ్బాయిలు, అమ్మాయిలు.. సమీప బంధువులు, మిత్రుల సహకారంతో అక్కడే పెళ్లిచూపులు పూర్తి చేస్తున్నారు. ఇక్కడి తల్లిదండ్రులు ఆస్తులు, ఇళ్లు, డబ్బు వగైరాలు ఆరా తీసి ఓకే చేస్తున్నారు. ఇలా అయితే ప్రత్యేకంగా హెచ్1 వీసాలు, డిపెండెంట్ వీసాలు అక్కర్లేదని అక్కడికక్కడే సంబంధం వెతుక్కుంటున్నారు. ఆడపడుచులు..అన్నదమ్ములు ఉంటే.. ఉమ్మడి కుటుంబమంటే పెళ్లి చూపులకు కూడా మొగ్గుచూపని పరిస్థితి నెలకొంది. చివరకు అబ్బాయి తరఫున ఆడపడుచులు ఎక్కువ మంది ఉన్నా ఇలాంటి వాటికి అమ్మాయి తరఫు వాళ్లు మక్కువ చూపడం లేదు. ‘ఇంతమందికి మా అమ్మాయి సేవలు చేయలేదు’ అని ముఖాన్నే చెప్పేస్తున్నారు. పెళ్లవగానే అబ్బాయి వేరు కాపురం పెడితేనే వస్తామనే అమ్మాయిలూ లేకపోలేదు. హోటళ్లలోనే పెళ్లిచూపులు కొన్ని సామాజిక వర్గాల్లో పెళ్లి చూపులు ఇంటివద్ద చేయడం లేదు. ఎక్కువ సంబంధాలు వచ్చి వెనక్కు వెళుతున్నాయన్న వంక చూపిస్తారని..హోటళ్లలోనే పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇరువురూ మాట అనుకోవడం.. హోటల్‌కు రావడం కాఫీ తాగుతూ అబ్బాయి.. అమ్మాయి మాట్లాడుకోవడం. ఇదీ పెళ్లిచూపుల తంతు. ఎలాంటి హంగూ ఆర్భాటాలూ లేకుండా కాఫీతోనే పెళ్లిచూపులు ముగుస్తున్నాయి. ‘ప్యాకేజీ’కే ప్రాధాన్యం రెండు దశాబ్దాల కిందటితో పోలిస్తే ఇప్పుడు వధూవరులంతా ఏడాది వేతనాని (యాన్యువల్ సాలరీ ప్యాకేజీ)కే ప్రాధాన్యమిస్తున్నారు. ఈడు జోడు, జాతకాలు, ఇతరత్రాలు అన్నీ గొప్ప సంపాదన ముందు తక్కువే అని వధూవరులు భావిస్తున్నారు. కొంతమంది పిల్లలు మంచి కెరియర్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు – బత్తలపల్లి సత్య రంగారావు, వధూవరుల పరిచయ వేదిక పిల్లల అభిప్రాయాలదే చెల్లుబాటు మేము పాతికేళ్లుగా వివాహాలు చేయిస్తున్నాం. ముందు రోజుల్లో తల్లిదండ్రులు తెచ్చిన సంబంధాన్ని ఆలోచించకుండా ఒప్పుకునేవారు. ఇప్పుడు పిల్లల అభిప్రాయానికే తల్లిదండ్రులు ప్రాముఖ్యతను ఇస్తున్నారు. వివాహాది సంప్రదాయాలు కూడా పూర్తిగా మారిపోయాయి. అతి స్వేచ్ఛ వల్ల కూడా చాలా వివాహ బాంధవ్యాలలో ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. –గరుడాద్రి సురేష్ శర్మ, పురోహితులు -
పెళ్లి పీటలెక్కనున్న సీరియల్ నటి, పెళ్లిచూపులు వీడియో..
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు శోభాశెట్టి. కార్తీకదీపం సీరియల్లో డాక్టర్‌బాబు, వంటలక్కను ముప్పుతిప్పలు పెట్టిన మోనితగా అందరికీ సుపరిచితురాలే! తన పాత్రతో అల్లాడించిన శోభా తాజాగా పెళ్లిపీటలెక్కబోతోంది. ఈ విషయాన్నే తనే స్వయంగా యూట్యూబ్ వీడియో ద్వారా వెల్లడించింది. 'నాకు తెలియకుండానే అమ్మ పెళ్లిచూపులు ఏర్పాటు చేసింది. ఆ అబ్బాయెవరో కూడా తెలియదు. పెళ్లి చూపులు అనే పదం చెప్పడానికే సిగ్గుగా ఉంది. ఫస్ట్ టైం సిగ్గుపడుతున్నానంటే నాకు పెళ్లికళ వచ్చేసింది. ఈరోజు నా బర్త్‌డే. ప్రతి ఏడాది ఈరోజు మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుపుకుంటాం. కానీ ఈసారి మా అమ్మ నాకు తెలియకుండా ఓ అబ్బాయిని చూసింది. అతడు నన్ను చూడటానికి ఈ రోజు మా ఇంటికొస్తున్నాడు. అందుకోసమే రెడీ అవుతున్నా' అంటూ సిగ్గుల మొగ్గయింది నటి. పక్కా ట్రెడిషనల్‌గా పెళ్లికూతురిలా అందంగా ముస్తాబైందీ శోభా. ఆరెంజ్ పట్టుచీరలో ధగధగ మెరిసిపోయింది. ఇంటిని సైతం డెకరేట్ చేయడమే కాకుండా గేటు ముందు టెంట్ వేసి పెళ్లిచూపులకు వచ్చినవారికి విందు ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తానికి శోభాతో ఏడడుగులు నడిచే ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనుందంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. చదవండి: నాది లవ్ మ్యారేజ్.. భర్త బతికున్నాడో, లేదో కూడా తెలీదు: నటి -
అప్పట్లో జేబులో పది రూపాయలు కూడా ఉండేవి కాదు: స్టార్ డైరెక్టర్
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు తరుణ్ భాస్కర్. అయితే డైరెక్టర్‌గానే కాకుండా నటుడిగా, సింగర్‌గానూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో తరుణ్ భాస్కర్‌కి ఇటీవల ఓ టీవీ షోకు ఇచ్చిన ఇంటర్య్వూలో వ్యక్తిగత విషయాలతో పాటు పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నాడు. పరిశ్రమకు వచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ తనకు ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చానన్నాడు. చదవండి: సింగర్ కేకే మృతికి చిరంజీవి, మహేశ్ బాబు నివాళి ‘మా ఫ్యామిలీ నుంచి ఎవరూ సినిమాల్లో లేరు. నేను షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఉండేవాడిని. ఏవో కథలు రాసుకుంటూ అవకాశాల కోసం తిరుగుతూ ఉండేవాడిని. ఆ సమయంలో జేబులో పది రూపాయలు ఉండేవి కాదు. అయినా బుర్రలో 100 కోట్ల ఆలోచనలు ఉన్నాయి కదా అనుకుంటూ ముందుకు వెళ్లే వాడిని. అలాంటి సమయంలోనే విజయ్ దేవరకొండ పరిచయమయ్యాడు. అంతా కలిసి ఒక బ్యాచ్‌గా ఉంటూ సినిమాల గురించిన ఆలోచనలు చేస్తుండేవాళ్లం. అలా చివరికి ‘పెళ్లి చూపులు’ సెట్స్ పైకి వెళ్లింది. ఆ సినిమా యూత్‌కి బాగా కనెక్ట్ అయింది. ఇటు నాకు .. అటు విజయ్‌కి ఇద్దరి కెరియర్‌కు ఆ సినిమా చాలా హెల్ప్ అయింది’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: కాఫీ, టీ మోశాను.. కన్నీళ్లు పెట్టుకున్న నటి ప్రగతి -
ట్రక్కు బ్రేకులు ఫెయిల్, అందరం చచ్చిపోతామన్న విజయ్ దేవరకొండ
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు తరుణ్ భాస్కర్. అయితే డైరెక్టర్‌గానే కాకుండా నటుడిగా, సింగర్‌గానూ మంచి పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తనకు నాన్‌వెజ్ వండటం బాగా వచ్చని చెప్పాడు. తనకు ఇండస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ లేదన్నాడు. విజయ్‌తో మళ్లీ సినిమా చేసే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు రౌడీ హీరో తనకు వైల్డ్ కార్డ్ లాంటివాడని చెప్పుకొచ్చాడు. తనకు వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ వచ్చాక విజయ్ దేవరకొండ వైల్డ్ కార్డ్‌లాగా వాడతానన్నాడు. చదువులో తాను బ్యాక్ బెంచర్ అని, తాను కట్టిన సప్లిమెంటరీ ఫీజులతో ఒక బిల్డింగ్‌నే కట్టొచ్చని తెలిపాడు. సుమారు 23 సప్లీలు ఉండొచ్చన్నాడు. విజయ్ మాల్యా కూతురు పెళ్లికి వెళ్లానని, కాకపోతే ఓ కెమెరా పట్టుకుని దీపికా పదుకోణ్ను ఫాలో అవమని చెప్పారని, తానదే చేశానని పేర్కొన్నాడు. పెళ్లి చూపులు సినిమా సమయంలో ట్రక్కు బ్రేకులు ఫెయిల్ అయిన సంఘటనను పంచుకున్నాడు. 'ట్రక్కు బ్రేకులు ఫెయిలవగానే అప్పటిదాకా భయపడ్డ విజయ్ దేవరకొండ సడన్‌గా రిలాక్స్ అయిపోయాడు. దర్శి హ్యాండ్ బ్రేక్ తీయగానే అది చేతులోకి వచ్చేసింది. తర్వాత ట్రక్కు వెళ్లి చెట్టును ఢీ కొట్టడంతో అందరం బతికిపోయాం. అయితే నేను బతికి ఉన్నానన్నదానికంటే విజయ్ ఎందుకలా కూల్‌గా ఉన్నాడో తెలుసుకోవాలన్న ఆతృత ఎక్కువగా ఉందప్పుడు. వెంటనే విజయ్ దగ్గరకు వెళ్లి ఎందుకంత రిలాక్స్ ఉన్నవని అడిగితే.. ఫస్ట్ స్టార్టింగ్ల భయం వేశింద్రా, దాని తర్వాత అందరం కలిసి చచ్చిపోతాం కదా, ఏముంది.. అని ఆన్సరివ్వడంతో ఒక్కసారిగా షాకయ్యా' అన్నాడు తరుణ్ భాస్కర్. చదవండి 👇 భర్తకు విడాకులు, ప్రియుడితో నటి ఎంగేజ్మెంట్.. మాజీ ప్రేయసి వార్నింగ్ నా సినిమాను చంపేశారు: శేఖర్ నిర్మాత ఆవేదన -
‘త్వరలో.. కొత్త సినిమా ప్రకటన’
పెళ్లి చూపులు సినిమాతో సెన్సేషన్ సృష్టించిన యువ దర్శకుడు తరుణ్ భాస్కర్. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన తరుణ్ తరువాత ఈ నగరానికి ఏమైంది? సినిమాతో ఆకట్టుకున్నాడు. గత ఏడాది జూన్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా తరువాత తరుణ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టలేదు. ఈ గ్యాప్‌లో విజయ్ దేవరకొండ నిర్మాణంలో హీరోగా నటించేందుకు రెడీ అయ్యాడు. తాను హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్ పనులు జరుగుతుండగానే దర్శకుడిగా తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు తరుణ్. త్వరలోనే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎనౌన్స్మెంట్ అంటూ సోషల్ మీడియా ద్వారా హింట్ ఇచ్చాడు. ‘తదుపరి ప్రకటన త్వరలో.. నెర్వస్‌గా ఉంది అలాగే ఎగ్జైటింగ్‌గానూ ఉంది’ అంటూ ట్వీట్ చేశాడు. View this post on Instagram Next announcement, coming soon ! Super nervous and excited. 🤞 A post shared by Tharun Bhascker (@tharunbhascker) on Aug 21, 2019 at 12:57pm PDT -
‘పెళ్లి చూపులు’ రోజులు గుర్తుకొస్తున్నాయి
‘హుషారు’ చిత్ర పోస్టర్, ట్రైలర్‌ను చూస్తుంటే తనకు ‘పెళ్లి చూపులు’ రోజులు గుర్తుకొస్తున్నాయంటూ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. లక్కీ మీడియా బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్, రియాజ్ నిర్మించిన చిత్రం హుషారు. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 7న రిలీజ్ కానుంది . యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన హుషారు సినిమా పాటలు, ట్రైలర్లకు మంచి క్రేజ్ వచ్చింది . ఈ సినిమాలో మూడో పాటను '' డియర్ కామ్రేడ్'' షూటింగ్లో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ఇటీవల రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..'నిర్మాత బెక్కెం వేణుగోపాల్, దర్శకుడు హర్ష నా సెట్‌కు వచ్చి హుషారు సినిమా పాటను రిలీజ్ చేయమని అడిగారు. ఇప్పటికే సిద్ శ్రీరాం పాడిన పాటను విన్నాను. ఫ్రెండ్ షిప్ ఆధారంగా రూపొందించిన మూడో పాటను రిలీజ్ చేయమన్నారు. వాస్తవానికి పెళ్లిచూపులకు ముందే హర్ష నాకు ఈ సినిమా స్క్రిప్టు పంపించారు. స్క్రిప్టు చదువుతున్నప్పుడే నాకు విపరీతంగా నవ్వు వచ్చింది. నాకు నచ్చే అర్బన్ టైప్ కామెడీ ఉంటుంది. ట్రైలర్ చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్ కలిగింది. మొదటి సినిమా అప్పుడు ఉండే ఉత్సాహం హర్షలో కనిపిస్తుంది’అని అన్నారు. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ''విజయ్ దేవరకొండతో మంచి రిలేషన్ ఉంది. అందుకే కాకినాడలో జరిగే షూటింగ్‌కు వచ్చి విజయ్ దేవరకొండను కలిశాం. మా హుషారు చిత్రంలోని ఫ్రెండిషిప్ పాటను రిలీజ్ చేయమని అడగ్గానే సంతోషంగా ఒప్పుకొన్నారు. విజయ్ దేవరకొండ చేతులు మీదుగా ఈ పాటను రిలీజ్ చేయించడం ఆనందంగా ఉంది'' అని అన్నారు. దర్శకుడు హర్ష మాట్లాడుతూ..'' పెళ్లిచూపులకు ముందు నుంచి నాకు విజయ్ దేవరకొండతో పరిచయం ఉంది. అప్పట్లో ఈ స్క్రిప్టును ఆయనకు పంపాను. చాలా బాగుందని అప్పట్లో రెస్పాన్ష్ ఇచ్చారు. ప్రస్తుతం అదే సినిమాకు సంబంధించిన పాటను విజయ్ దేవరకొండతో రిలీజ్ చేయించడం ఆనందంగా ఉంది'' అని అన్నారు. -
సంగీత్ సాగర్
-
తరుణ్ కొత్త సినిమా ‘ఈ నగరానికి ఏమయింది..?’
తొలి చిత్రంగా తెరకెక్కిన పెళ్లి చూపులు సినిమాతో సంచలన విజయం సాధించిన దర్శకుడు తరుణ్ భాస్కర్. లఘు చిత్ర నేపథ్యం తో వెండితెర అరంగేట్రం చేసిన ఈ యువ దర్శకుడు తొలి సినిమాతోనే మంచి టాలెంట్ ఉన్న దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. తొలి చిత్రం ఘనవిజయం సాధించినా.. రెండో సినిమాను ప్రారంభించేందుకు చాలా సమయం తీసుకున్నాడు తరుణ్. తన రెండో సినిమా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఉంటుందని తెలిపినా. అది ఎప్పుడు మొదలవుతుందో ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా తరుణ్ భాస్కర్ రెండో సినిమాపై ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. తన రెండో సినిమాకు తరణ్ ఓ ఆసక్తికరమైన టైటిల్‌ను నిర్ణయించాడట. ప్రతీ సినిమా ప్రారంభంలో వచ్చే ‘ ఈ నగరానికి ఏమయింది..?’అనే మాటలనే తన టైటిల్ గా ఎంచుకున్నాడట తరుణ్ భాస్కర్. త్వరలోనే ఈ చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెలువడనున్నాయి. -
కోలీవుడ్‌కు విజయ్ దేవరకొండ
పెళ్లి చూపులు సినిమాతో మంచి హిట్ అందుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ, అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషనల్ స్టార్ గా మారిపోయాడు. ఈ సినిమాతో ఒక్కసారిగా భారీ హైప్ తో పాటు ఇతర భాషల్లోనూ విజయ్ కి మంచి గుర్తింపు వచ్చింది. దీంతో పరభాషా దర్శకులు కూడా విజయ్ దేవరకొండ హీరోగా సినిమాలు తెరకెక్కించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘గీతాగోవిందం’ సినిమాతో పాటు షికారు, మహానటి సినిమాలతో విజయ్ బిజీగా ఉన్నాడు. ఇవేకాకుండా మరో మూడు నాలుగు సినిమాలు ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. తాజాగా ఓ తమిళ దర్శకుడు విజయ్ హీరోగా సినిమా తెరకెక్కించేందుకు చర్చలు జరుపుతున్నాడట. విక్రమ్ హీరోగా ఇరుముగన్ (ఇంకొకడు) సినిమాను తెరకెక్కించిన ఆనంద్ శంకర్, విజయ్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో సినిమాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే విజయ్ కు కథ కూడా వినిపించాడట. అయితే ఇప్పటికే కమిట్ అయిన సినిమాలన్నీ పూర్తయితే గాని విజయ్ తమిళ సినిమా పట్టాలెక్కే అవకాశం లేదు. -
పెళ్లిచూపులు దర్శకుడి కొత్త సినిమా..!
2016లో రిలీజ్ అయిన పెళ్లిచూపులు సినిమాతో సంచలన విజయం సాదించిన దర్శకుడు తరుణ్ భాస్కర్. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ దర్శకుడు రెండో సినిమా కోసం లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ఫైనల్ తన రెండు సినిమాను ప్రారంభించాడు తరుణ్. పెళ్లిచూపులు సినిమా ప్రమోషన్ లో రిలీజ్ విషయంలో ఎంతో తోడ్పాటు అందించిన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లోనే రెండో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే కథా కథనాలు ఫైనల్ అయిన ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం సినిమా కోసం నటీనటుల ఎంపిక జరుగుతోంది. కొత్త నటీనటులతో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విశేషాలు త్వరలోనే వెల్లడించనున్నారు. -
పెళ్లి చూపులు టీమ్‌కు ఎంపీ కవిత అభినందనలు
హైదరాబాద్: జాతీయ అవార్డులను అందుకున్న ‘పెళ్లిచూపులు’ సినిమా యూనిట్‌ను నిజామాబాద్ ఎంపీ కవిత అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ కుటుంబ కథా చిత్రాలకు ఎప్పుడు ఆదరణ ఉంటుందన్నారు. మంచి సినిమాలు తీసేవారికి తెలంగాణ ప్రభుత్వం సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆమె తెలిపారు. కాగా ఎంపీని కలిసినవారిలో చిత్ర నిర్మాతలు యాష్ రంగినేని, రాజ్ కందుకూరిలతో పాటు దర్శకుడు దాస్యం తరుణ్ భాస్కర్ , హీరో విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు మాధవి, వర్ధన్ దేవరకొండ, మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్, అభయ్ బేచిగంటిలు తదితరులు ఉన్నారు. 64వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో పెళ్లిచూపులు సినిమాకు ఉత్తమ తెలుగు చిత్రంతో పాటు, ఉత్తమ సంభాషణల కేటిగిరి అవార్డు వరించింది. నిన్న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదగా చిత్ర యూనిట్ ఆ అవార్డులను అందుకున్నారు. -
పురస్కార ప్రదానం
-
‘పెళ్లిచూపులు’కు మరో పురస్కారం
రాజమహేంద్రవరం: విజయ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో సినీ నిర్మాత బి.నాగిరెడ్డి పేరిట ఏర్పాటైన బి.నాగిరెడ్డి స్మారక పురస్కారానికి (2016) ‘పెళ్లిచూపులు’ సమగ్ర వినోద ప్రధాన చిత్రంగా ఎంపికైంది. అవార్డు కమిటీలో దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, నటుడు, దర్శకుడు గొల్లపూడి మారుతీరావు ఇతర ప్రముఖులు ఉన్నారు. పెళ్లిచూపులు చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి ఈ పురస్కారాన్ని ఏప్రిల్ 16వ తేదీన రాజమహేంద్రవరంలోని శ్రీవేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో అందుకోనున్నారు. నిర్మాత దివంగత నాగిరెడ్డి కుమార్తె జయలక్ష్మీ రెడ్డి, అల్లుడు ప్రేమ్‌కుమార్ రెడ్డిలతో పాటు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా, సినీ నటుడు జగపతిబాబు, సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేశ్ ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. -
‘పెళ్లిచూపులు’ టీమ్‌కు కేసీఆర్ అభినందన
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ’పెళ్లిచూపులు’ టీమ్‌ను అభినందించారు. పెళ్లి చూపులు సినిమా జాతీయ ఉత్తమ భాషాచిత్రంగా ఎంపిక కావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. చిత్ర దర్శక, నిర్మాతలను, నటీనటులను, సాంకేతిక సిబ్బందికి కేసీఆర్ అభినందనలు తెలిపారు. అలాగే ఉత్తమ మాటల రచయితగా ఎంపికైన తరుణ్ భాస్కర్‌కు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. చిత్ర పరిశ్రమకు చెందిన తెలంగాణ పౌరులు అత్యంత ప్రతిభ ప్రదర్శిస్తూ జాతీయ స్థాయి గుర్తింపు పొందడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమన్నారు. అలాగే సమగ్ర వినోదాత్మక చిత్రంగా ‘శతమానం భవతి’ ఎంపికతో పాటు, ‘జనతా గ్యారేజ్’ సినిమాలో నృత్యాలకు గాను ఉత్తమ నృత్య దర్శకుడుగా రాజు సుందరం ఎంపిక కావడం పట్ల సీఎం హర్షం తెలిపారు. ఇదే స్పూర్తితో తెలుగు చిత్ర పరిశ్రమ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కాగా శుక్రవారం ప్రకటించిన 64వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘పెళ్లిచూపులు’ ఉత్తమ తెలుగు చిత్రం కేటగిరి కింద ఎంపిక అయింది. ఉత్తమ సంభాషణల కేటిగిరి అవార్డు తరుణ్ భాస్కర్ (పెళ్లిచూపులు)ను వరించింది. దాస్యం తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రాజ్ కందుకూరి, యాశ్ రంగినేని నిర్మించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రీతూ వర్మ నటించారు.ఇక ఉత్తమ నృత్య దర్శకుడిగా రాజుసుందరం (జనతా గ్యారేజ్)ను, ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా శతమానం భవతి ఎంపిక అయిన విషయం తెలిసిందే. -
'పెళ్లిచూపులు'కు జాతీయ అవార్డులు
-
'పెళ్లిచూపులు'కు జాతీయ అవార్డులు
న్యూఢిల్లీ: తెలుగు సినిమా 'పెళ్లి చూపులు'కు జాతీయ అవార్డు దక్కింది. శుక్రవారం ప్రకటించిన 64వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఈ సినిమాను ఉత్తమ తెలుగు చిత్రం కేటగిరి కింద ఎంపిక చేశారు. ఉత్తమ సంభాషణల కేటిగిరి అవార్డు తరుణ్ భాస్కర్ (పెళ్లిచూపులు)ను వరించింది. దాస్యం తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రాజ్ కందుకూరి, యాశ్ రంగినేని నిర్మించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రీతూ వర్మ నటించారు. ఈ లోబడ్జెట్ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించింది. ఇక ఉత్తమ నృత్య దర్శకుడిగా రాజుసుందరం (జనతా గ్యారేజ్)ను, ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా శతమానం భవతిని ఎంపిక చేశారు. ఉత్తమ నటుడిగా అక్షయ్ కుమార్ (రుస్తుం), ఉత్తమ హిందీ చిత్రంగా నీర్జాను ప్రకటించారు. అవార్డుల వివరాలు: ఉత్తమ నటుడు - అక్షయ్‌కుమార్ (రుస్తుం) ఉత్తమ తెలుగు చిత్రం- పెళ్లిచూపులు ఉత్తమ హిందీ చిత్రం - నీర్జా ఉత్తమ సామాజిక చిత్రం - పింక్ ఉత్తమ కన్నడ చిత్రం - రిజర్వేషన్ ఉత్తమ తమిళ చిత్రం - జోకర్ ఉత్తమ ప్రజాదరణ చిత్రం - శతమానం భవతి ఉత్తమ బాలల చిత్రం - ధనక్ ఉత్తమ ఫైట్ మాస్టర్ - పీటర్ హెయిన్స్ (పులిమురుగన్) ఉత్తమ నృత్యదర్శకుడు - రాజు సుందరం (జనతా గ్యారేజ్) ఉత్తమ సంగీత దర్శకుడు - బాపు పద్మనాభ (అల్లమ-కన్నడ) ఉత్తమ సంభాషణలు: తరుణ్ భాస్కర్ (పెళ్లిచూపులు) ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ - శివాయ్ సినిమాలకు స్నేహపూర్వక రాష్ట్రంగా యూపీ ఎంపిక -
రీమేక్ సినిమాకు ఇంట్రస్టింగ్ ఫస్ట్ లుక్
గత ఏడాది టాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన చిన్న సినిమా పెళ్లిచూపులు. రాజ్ కందుకూరి నిర్మాణంలో తరుణ్ భాస్కర్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రీతూవర్మలు హీరో హీరోయిన్లుగా నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెళ్లిచూపులు ఘనవిజయం సాధించటంతో ఇతర ఇండస్ట్రీల నుంచి రీమేక్ హక్కుల కోసం భారీ ఆఫర్లు వచ్చాయి. ఫైనల్ గా తమిళ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్న స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఇప్పటినుంచే ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టాడు. విష్ణు విశాల్, తమన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కార్టూన్ లా డిజైన్ చేశారు. సినిమా థీమ్ కు తగ్గట్టుగా మొబైల్ క్యాంటీన్ ముందు హీరో హీరోయిన్ల కార్టూన్ బొమ్మలతో రిలీజ్ చేసిన ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తమిళలో 'పొన్ ఒరు కండేన్' ( ఒక అమ్మాయిని చూశా) పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సెంథిల్ వీరాస్వామి దర్శకుడు. -
పెళ్లిచూపులు తరువాత మెంటల్ మదిలో
పెళ్లిచూపులు సినిమాతో బిగ్ హిట్ అందుకున్న నిర్మాత రాజ్ కందుకూరి మరో ఇంట్రస్టింగ్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పెళ్లిచూపులు తరహాలోనే 'మెంటల్ మదిలో' పేరుతో మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ ను సిద్ధం చేస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాతో వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో నటుడిగా మంచి మార్కులు సాధించిన శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్నాడు. నివేథ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పోస్టర్ ను ఉగాది సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో శ్రీవిష్ణు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేన్ లా కనిపిస్తున్నాడు. కథ ఎపింకలో కొత్తదనం చూపిస్తూ దూసుకుపోతున్న శ్రీవిష్ణు ఈ సినిమాతో మరో విజయం అందుకుంటానన్న నమ్మకంతో ఉన్నాడు. పెళ్లిచూపులు నిర్మాత రాజ్ కందుకూరి ఈ సినిమాను నిర్మిస్తుండటం సినిమా మీద అంచనాలను మరింత పెంచేస్తోంది. -
విష్ణువిశాల్‌తో పెళ్లిచూపులు
నటి తమన్నా యువ నటుడు విష్ణువిశాల్‌తో పెళ్లిచూపులకు సిద్ధం అవుతోంది. ఏమిటీ నమ్మబుద్ధి కావడం లేదా? నిజమేనండీ బాబు.అయితే రియల్‌గా కాదులెండి. రీల్లో ఆ తంతంగానికి మిల్కీబ్యూటీ రెడీ అవుతోంది. టాలీవుడ్లో చిన్న చిత్రంగా విడుదలై చాలా పెద్ద విజయాన్ని సాధించిన చిత్రం పెళ్లిచూపులు. విజయ్‌దేవరకొండ, రీతువర్మ జంటగా నటించిన ఈ చిత్రాన్ని తరుణ్‌భాస్కర్ తెరకెక్కించారు. రెండు కోట్ల రూపాయల లోపు బడ్జెట్‌తో రూపొందిన ఈ పెళ్లిచూపులు రూ.30 కోట్లకు పైగా వసూళ్లు సాధించి టాలీవుడ్ సినీపండితుల్ని ఆశ్చర్యానికిలోను చేసింది. దీన్ని సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ ఆంధ్రరాష్ట్రం అంతటా విడుదల చేసింది. అలాంటి పెళ్లిచూపులు చిత్ర తమిళ రీమేక్ హక్కులను దర్శకుడు గౌతమ్‌మీనన్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో కథానాయకిగా ఇప్పటికే నటి తమన్నాను ఎంపిక చేశారు. కథానాయకుడి కోసం చర్చలు జరపగా యువనటుడు ఉదయనిధి స్టాలిన్, విష్ణువిశాల్ పేర్లు పరిశీలనకు రాగా చివరికి విష్ణువిశాల్నే అవకాశం వరించింది. దీనికి గౌతమ్‌మీనన్ తన శిష్యుడు సెంథిల్ వీరాస్వామిని దర్శకుడిగా పరిచయం చేస్తూ సొంత సంస్థలో నిర్మించనున్నారు. పొణ్ ఒండ్రు కండేన్ అనే టైటిల్‌ను నిర్ణయించిన ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. అలా తమన్నా.. విష్ణువిశాల్‌తో పెళ్లిచూపులకు సిద్ధం అవుతోందన్నమాట. ఇప్పటికే ఈ భామ శింబుతో అన్బానవన్ అసరాధవన్ అడంగాధవన్ చిత్రంలో రొమాన్స్ చేస్తోంది. ప్రపంచ సినిమానే ఎదురుచూస్తున్న మోస్ట్ వాంటెడ్ చిత్రం బాహుబలి–2 చిత్రం ఏప్రిల్ 28న వెండితెరపైకి రానుంది. -
ప్చ్... సంతోషమే కానీ!
అభిమాన దర్శకుడితో పనిచేసే ఛాన్స్ వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. తమన్నా మాత్రం ఓ పక్క సంతోషపడుతూ... మరోపక్క కొంచెం బాధ పడుతున్నారు. ఎందుకంటే... ఆమెకు అభిమాన దర్శకుడితో పనిచేసే ఛాన్స్ మాత్రమే వచ్చింది. ఆయన దర్శకత్వంలో నటించే ఛాన్స్ ఇంకా రాలేదు. అసలు విషయం ఏంటంటే... ‘పెళ్లి చూపులు’ తమిళ రీమేక్‌లో తమన్నా నటించనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ ఈ రీమేక్‌కి నిర్మాత. ఆయనతో కలసి పనిచేయాలనేది తమన్నా కల అట! అది తమిళ ‘పెళ్లి చూపులు’ రీమేక్‌తో తీరనుంది. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ –‘‘నేను గౌతమ్ మీనన్‌కి పెద్ద అభిమానిని. ముఖ్యంగా ఆయన సినిమాల్లో మహిళలను చూపించే విధానం నాకు చాలా ఇష్టం. రొమాన్స్‌ని ఆయన అర్థం చేసుకున్నట్టు... ఇంకెవరూ అర్థం చేసుకోలేరు. ఎప్పట్నుంచో ఆయనతో కలసి పని చేయాలనుకుంటున్నాను. ‘పెళ్లి చూపులు’ రీమేక్‌తో ఆయన నిర్మాణంలో నటించే ఛాన్స్ వచ్చింది. సో, ఐయామ్ హ్యాపీ. త్వరలో ఆయన దర్శకత్వంలో నటించే ఛాన్స్ వస్తుందని ఆశిస్తున్నా. అప్పటివరకూ కొంచెం బాధ ఉంటుంది’’ అన్నారు. గౌతమ్ మీనన్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన సెంథిల్ వీరస్వామి ‘పెళ్లి చూపులు’ రీమేక్‌కి దర్శకుడు. ఈ సినిమాతో పాటు హిందీ హిట్ ‘క్వీన్’ తమిళ రీమేక్‌లో కూడా తమన్నా నాయికగా నటించనున్న సంగతి తెలిసిందే. -
ఏకంగా ఆరు సినిమాలు లైన్లో పెట్టాడు..!
యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఫుల్ ఫాంలో ఉన్నాడు. పెళ్లిచూపులు సక్సెస్ ఇచ్చిన జోష్ ఏకంగా ఆరు సినిమాలను లైన్లో పెట్టాడు. ఇప్పటికే ద్వారక సినిమాను దాదాపుగా పూర్తి చేసిన విజయ్, అర్జున్ రెడ్డి సినిమా కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ రెండు సినిమాల తరువాత తాను చేయబోయే సినిమాల విషయంలో కూడా క్లారిటీ ఇచ్చేశాడు విజయ్. రాహుల్ సంకీర్త్యన్ దర్శకత్వంలో సూపర్ నాచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న సినిమాకు ఓకె చెప్పాడు విజయ్. ఈ సినిమాలతో పాటు నందినీ రెడ్డి దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీని ఫిబ్రవరిలో సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్లాన్ లో ఉన్నాడు. పెళ్లిచూపులు సినిమాను నిర్మించిన రాజ్ కందుకూరి నిర్మాణంలో వివేక్ ఆత్రేయ అనే కొత్త దర్శకుడితో సినిమా చేయనున్నాడు. వీటితో పాటు భరత్ అనే కొత్త దర్శకుడితోనూ సినిమాకు ఓకె చెప్పాడు. వరుసగా ఆరు సినిమాలను లైన్ లో పెట్టిన విజయ్, రెమ్యూనరేష్ విషయంలోనూ కాస్త బెట్టు చేస్తున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. -
ప్రేమమ్ హీరోతో 'పెళ్లిచూపులు'
ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై ఘనవిజయం నమోదు చేసిన చిత్రం పెళ్లిచూపులు. తరుణ్ భాసర్క్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రీతూవర్మ జంటగా తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాదించటంతో ఇతర భాషల నుంచి భారీగా రీమేక్ ఆఫర్స్ వచ్చాయి. ఇప్పటికే హిందీతో పాటు దక్షిణాది భాషలన్నింటిలో పెళ్లి చూపులు రీమేక్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. అన్ని భాషల్లో స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ సినిమా రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నారు. దక్షిణాదిలో ఈ సినిమా రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్, ప్రేమమ్ ఫేం నివీన్ పౌలీ హీరోగా రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు. నివీన్ మలయాళ స్టార్ కావటంతో తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించనున్నాడు. ప్రేమమ్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న నివీన్, పెళ్లి చూపులు రీమేక్‌తో మరోసారి మ్యాజిక్ రిపీట్ చేస్తాడని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. -
కన్నడలో రీమేక్ కానున్న పెళ్లిచూపులు
సాక్షి, బెంగళూరు: తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి భారీ లాభాలతో తెలుగులో బ్లాక్‌బస్టర్ చిత్రంగా ఘనవిజయం సాధించిన పెళ్లిచూపులు చిత్రాన్ని కన్నడలోకి రీమేక్ కానుందని సమాచారం. తెలుగులో విజయ్ దేవరకొండ, రీతూవర్మ జంటగా నటించగా కన్నడలో ఫస్ట్ ర్యాంక్ రాజులో హీరోగా నటించిన గురునందన్, యూటర్న్ చిత్రంలో తన నటనతో శాండల్ఉడ్ను తన వైపు తిప్పుకున్న శ్రద్ధా శ్రీనాథ్‌లు హీరో హీరోరుున్లు నటించనున్నారని సమాచారం. తెలుగులో తరుణ భాస్కర్ దాస్యమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కన్నడలో డ్యాన్స మాస్టర్, డెరైక్టర్ మురళి మాస్టర్ దర్శకత్వం వహించనున్నారని శాండల్ఉడ్ వర్గాల వినికిడి. ఓవర్సీస్లో మిలియన్ డాలర్ క్లబ్లో అడుగుపెట్టిన ఈ చిత్రం తమిళ రీమేక్ రైట్స్‌ను గౌతమ్ వాసుదేవ్ సొంతం చేసుకోగా హిందీలో ప్రముఖ బాలీవుడ్ డెరైక్టర్ కరణ్ జోహార్, హీరో సల్మాన్‌ఖాన్‌లు ఈ చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. కాగా కన్నడ రీమేక్‌పై దర్శకుడు, హీరో హీరోరుున్ల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. మరోవైపు కన్నడతో పాటు తమిళంలో కూడా ఆఫర్స్‌ను దక్కించుకుంటూ శ్రద్ధా శ్రీనాథ్ బిజీగా ఉండగా హీరో రఘునందన్ తన తదుపరి చిత్రాలు షూటింగ్లలో నిమగ్నమై ఉన్నారు. -
స్టార్ డైరెక్టర్ చేతికి పెళ్లిచూపులు రీమేక్ రైట్స్
చిన్న సినిమాగా విడుదలై ఘనవిజయం సాధించిన సినిమా పెళ్లి చూపులు. కేవలం కోటిన్నర బడ్జెట్లో రాజ్ కందుకూరి నిర్మాతగా, తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రీతూ వర్మలు హీరో హీరోయిన్లుగా నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెళ్లిచూపులు 20 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచే రీమేక్ రైట్స్‌కు భారీ క్రేజ్ ఏర్పడింది. పలువురు టాప్ సెలబ్రిటీలు రైట్స్ కోసం ప్రయత్నించగా హిందీ రీమేక్ రైట్స్‌ను వశు భగ్నానీ సొంతం చేసుకున్నారు. తాజాగా తమిళ రీమేక్ రైట్స్‌ను కూడా స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దక్కించుకున్నారు. దర్శకుడిగానే కాక నిర్మాతగాను పలు విజయవంతమైన చిత్రాలను అందించిన గౌతమ్ మీనన్, ఈ సినిమాను తన నిర్మాణంలో మరో దర్శకుడితో రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నారు. -
టపాసు చిన్నదే... సౌండ్ పెద్దది
‘క్షణం’ సినిమా చిన్న టపాసులాంటిది. కానీ, బాక్సాఫీస్ దగ్గర పెద్ద సౌండే చేసింది. దాదాపు రెండు కోట్ల రూపాయలతో తీసిన ఈ సినిమా సుమారు రూ.15 కోట్లు (అన్నీ కలుపుకొని) వసూలు చేసింది. ఆ తర్వాత వచ్చిన చిన్న టపాసు ‘పెళ్లి చూపులు’. దాదాపు రూ.1.60 కోట్లతో తీసిన ఈ సినిమా సుమారు రూ.20 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా తర్వాత బోల్డన్ని చిన్న సినిమాలు మొదలయ్యాయి. -
తెలుగు సినీ చరిత్రలో తొలిసారిగా..!
ప్రస్తుతం పరిస్థితుల్లో స్టార్ హీరోల సినిమాలు కూడా మూడు నాలుగు వారాలకు మించి నడిచే పరిస్థితిలేదు. చాలా రోజులుగా సినిమా సక్సెస్ ను ఎన్ని రోజులు ఆడింది అన్న లెక్కలతో కాకుండా, ఎంత కలెక్ట్ చేసింది అన్న లెక్కలతో చెపుతున్నారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఓ తెలుగు సినిమా చరిత్ర సృష్టించింది. చిన్న సినిమాగా విడుదలైన పెళ్లి చూపులు అమెరికాలో పది సెంటర్లలో 50 రోజుల పాటు ప్రదర్శితమై చరిత్ర సృష్టించింది. ఎలాంటి స్టార్ ఎట్రాక్షన్ లేకపోయినా.. కేవలం కథా కథనాలను నమ్ముకొని తెరకెక్కించిన పెళ్లి చూపులు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్ సీస్ లోనూ చరిత్ర సృష్టించింది. గతంలో మరే తెలుగు సినిమాకు సాధ్యం కాని విధంగా అమెరికాలో 50 రోజులుగా ఈ సినిమా ప్రదర్శితమౌతూనే ఉంది. అది కూడా పది సెంటర్లలో కావటం మరో విశేషం. టాప్ స్టార్లకు కూడా సాధ్యం కానీ ఈ అరుదైన రికార్డ్ సృష్టించిన పెళ్లి చూపులు టీంకు సినీ ప్రముఖుల నుంచి అభినందనలు అందుతున్నాయి. కొత్త దర్శకుడు తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ, రీతూవర్మ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈసినిమాను ధర్మపత్ క్రియేషన్స్ బ్యానర్ పై రాజ్ కందుకూరి నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి భారీ నిర్మాణ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేయటం కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. -
'23 ఏళ్ల తరువాత పెళ్లి చూపులు'
చిన్న సినిమాగా విడుదలై ఘనవిజయం సాధించిన పెళ్లి చూపులు సినిమాకు ఇంకా ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రాజ్ కందుకూరి నిర్మించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్లోనూ భారీ వసూళ్లను సాధించింది. తాజాగా భారత మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఈ సినిమాను చూసి చిత్రయూనిట్‌ను అభినందించారు. నిర్మాత రాజ్ కందుకూరితో కలిసి సినిమా చూసిన అజారుద్ధీన్ 'చాలా కాలం నుండి మా అబ్బాయి అబ్బాస్ తెలుగులో వచ్చిన పెళ్లి చూపులు చూడమని చెపుతున్నాడు. నేను కూడా చాలా రోజులుగా చూద్దామని అనుకున్నా.. కానీ ఇప్పటికి కుదిరింది. పెళ్లిచూపులు సినిమా చాలా బాగుంది. దాదాపు 23 ఏళ్ల తరువాత తెలుగు సినిమా చూశా. చాలా ఏళ్ల క్రితం ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన జంబలకిడి పంబ సినిమాను వైజాగ్‌లో చూశా.. తరువాత ఇన్నేళ్లకు పెళ్లి చూపులు చూశాను. నాకు బాగా నచ్చింది' అన్నారు. -
విజయ్ మరో ఛాన్స్ కొట్టేశాడు
లైఫ్ ఈజ్ బ్యూటి ఫుల్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ, తరువాత ఎవడే సుబ్రమణ్యం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పెళ్లిచూపులు సినిమాతో విశ్లేషకుల ప్రశంసలు అందుకుంటున్న విజయ్, వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. అర్జున్ రెడ్డి పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్న విజయ్, పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో క్రేజీ ఆఫర్ విజయ్‌ని వెతుక్కుంటూ వచ్చింది. అలా మొదలైంది సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన నందినీ రెడ్డి, తరువాత కాస్త తడబడినా ఇటీవల కళ్యాణ వైభోగమే సినిమాతో మరోసారి ఆకట్టుకుంది. అదే జోరులో ఇప్పుడు విజయ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కించేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాలో కూడా కళ్యాణ్ వైభోగమే ఫేం మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించనుంది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాలు పూర్తవ్వగానే నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాను మొదలు పెడతాడు విజయ్. -
'పెళ్లిచూపులు' తప్పక చూడాలి: కేటీఆర్
చిన్నగా థియేటర్లకు వచ్చి పెద్ద హిట్ అయిన 'పెళ్లిచూపులు' తప్పక చూడాల్సిన సినిమా అంటూ ఐటీ మంత్రి కేటీఆర్ కితాబునిచ్చారు. డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌ను, చిత్ర యూనిట్‌ను అభినందిస్తూ ఆయన ట్వీట్ చేశారు. 'పెళ్లిచూపులు' టీంతో కలిసి సినిమాను చూసిన ఆయన ఇది సందేశాత్మక చిత్రమంటూ ప్రశంసల జల్లు కురిపించారు. మహిళా సాధికారత, యువత అభిరుచులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం వంటి అంశాలతో సందేశాత్మకంగా ఉందని కేటీఆర్ తెలిపారు. యువతకు ఉపయోగపడే చాలా విషయాలను సున్నితంగా చూపించారన్నారు. నిర్మాత సురేష్ బాబు ఇలాంటి సినిమాలను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. కాగా మంత్రి అభినందనల పట్ల చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేసింది. మంచి కంటెంట్‌కు ప్రేక్షకాదరణ తప్పక ఉంటుందని 'పెళ్లిచూపులు' మరోసారి నిరూపించింది. ఇప్పటికే భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ సినిమా త్వరలో మిలియన్ మార్క్ చేరనుంది. ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా నటించిన విజయ్ దేవరకొండ, రీతూ వర్మలు చేతి నిండా ఆఫర్లతో బిజీగా ఉన్నారు. Watched an exceptionally well made movie 'Pellichoopulu' which breaks new ground on many counts. Kudos to Tarun & entire team. Must watch — KTR (@KTRTRS) 16 August 2016 'Pellichoopulu' breaks new ground without being preachy; unconventional professions, women empowerment, entrepreneurial spirit & much more — KTR (@KTRTRS) 16 August 2016 -
మిలియన్ మార్క్ చేరువలో..!
ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాలు కూడా కలెక్షన్ల విషయంలో తడబడుతుంటే.. మంచి కంటెంట్‌తో తెరకెక్కుతున్న చిన్న సినిమాలు కూడా భారీ వసూళ్లతో సత్తా చాటుతున్నాయి. ముఖ్యంగా రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌కు భిన్నంగా తెరకెక్కుతున్న సినిమాలు సక్సెస్‌తో పాటు మంచి లాభాలను కూడా సాధించి పెడుతున్నాయి. చిన్న సినిమాగా విడుదలైన పెళ్లి చూపులు కూడా అదే బాటలో సరికొత్త రికార్డ్‌లు సృష్టిస్తోంది. రెండు వారాల క్రితం రిలీజ్ అయిన పెళ్లిచూపులు ఇప్పటికే పది కోట్లకు పైగా వసూళు చేసింది. పుల్ రన్లో 20 కోట్ల మార్క్‌ను కూడా రీచ్ అయ్యే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఓవర్ సీస్ లోనూ ఈ సినిమా సత్తా చాటుతోంది. ఇప్పటికే 8 లక్షల డాలర్లు వసూళు చేసిన పెళ్లిచూపులు మరో వారంలో మిలియన్ మార్క్‌ను రీచ్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. -
ఆఫర్ల మీద ఆఫర్లు
'పెళ్లిచూపులు' సినిమాతో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిన యువ హీరో విజయ్ దేవరకొండకి వరుస ఆఫర్లు తలుపు తడుతున్నాయి. సహజమైన నటనతో మెప్పించిన ఈ కుర్రాడికి మంచి భవిష్యత్ ఉందని అంటున్నారు. ఇప్పటికే 'అర్జున్ రెడ్డి' అనే టైటిల్‌తో వస్తున్న సినిమాలో హీరోగా నటిస్తుండగా ఆ తర్వాత లైన్లో 'ద్వారక' పేరుతో మరో సినిమా ఉంది. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన 'వైజయంతీ మూవీస్' బ్యానర్లో మరో సినిమాకు విజయ్ సైన్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమా అక్టోబర్‌లో సెట్స్ పైకి వెళ్లనుంది. నాని హీరోగా గత ఏడాది రిలీజైన 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాలో కీలక పాత్ర ద్వారా టాలీవుడ్‌కి పరిచయమయ్యాడు విజయ్. ఆ సినిమా కూడా వైజయంతీ మూవీస్ బ్యానర్లోనే నిర్మించడం విశేషం. -
'పెళ్లిచూపులు'పై మనసుపడ్డ సల్మాన్?
ఇటీవల చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజయాన్ని అందుకున్న చిత్రం 'పెళ్లిచూపులు'. లో బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం భారీగానే కలెక్ట్ చేస్తుంది. రొటీన్ రొడ్డకొట్టుడుకి బ్రేక్ వేస్తూ క్లీన్ ఎంటర్టెయినర్గా ఉందనే మౌత్ టాక్‌తో రోజు రోజుకీ ప్రేక్షకాదరణ పొందుతోంది. పెళ్లిచూపులు సినిమాపై బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఆసక్తి చూపుతున్నారట. స్టోరీ లైన్, రివ్యూలు విన్న తరువాత సల్మాన్ సినిమా చూడాలని నిశ్చయించుకున్నారట. నచ్చితే రీమేక్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని టాక్. పెళ్లిచూపులు నిర్మాత సురేష్ బాబు త్వరలోనే సల్మాన్‌కు సినిమా చూపించేందుకు ప్లాన్ చేస్తున్నారట. సల్మాన్‌కు దగ్గుపాటి ఫ్యామిలీతో ఇప్పటికే మంచి అనుబంధం ఉంది. హిందీ రీమేక్ కు కూడా సురేష్ బాబే నిర్మాతగా వ్యవహరిస్తారని సమాచారం. సల్మాన్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టు కథకు కాస్త మార్పులు చేర్పులు చేసి చిత్రీకరిస్తే బాలీవుడ్లో బంపర్ హిట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇవేం జరగాలన్నా ముందుగా సల్మాన్‌కు 'పెళ్లిచూపులు' చూసే సమయం దొరకాలి. -
ఆరంభం అదిరింది కానీ..!
2016 సంవత్సరానికి సూపర్ సక్సెస్‌లతో గ్రాండ్‌గా వెల్ కం చెప్పింది టాలీవుడ్. ఏడాది తొలి రోజునే నేను శైలజ సినిమాతో సూపర్ హిట్ కొట్టి సినీ అభిమానులకు మంచి సంకేతాలను ఇచ్చింది. ఈ జోరు కంటిన్యూ చేస్తూ సంక్రాంతి బరిలో దిగిన నాలుగు చిత్రాలు విజయాలు సాధించటంతో ఇక 2016 టాలీవుడ్ గోల్డెన్ ఇయర్ అని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. అయితే అదే జోరు ను కొనసాగించటంతో టాలీవుడ్ పెద్దలు తడబడ్డారు. సంక్రాంతి రిలీజ్‌ల తరువాత సూపర్ హిట్ అనిపించుకునే స్థాయి సినిమా ఒక్కటి కూడా రాలేదు. కృష్ణగాడి వీర ప్రేమగాథ, క్షణం లాంటి చిన్న సినిమాలు మ్యాజిక్ చేసినా.. కోట్లల్లో కాసులు కురిపించే సినిమాలు మాత్రం రాలేదు. ఊపిరి సినిమా ఒక్కటి టాలీవుడ్‌కు బాక్సాఫీస్‌కు కాస్త ఊపు తీసుకొచ్చింది. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో కాసుల పంట పడించింది. సమ్మర్ బరిలో దిగిన సరైనోడు వంద కోట్ల కలెక్షన్లతో సత్తా చాటగా.. అదే సీజన్లో వచ్చిన సర్థార్ గబ్బర్‌సింగ్, బ్రహ్మోత్సవం సినిమాలు పూర్తిగా నిరాశపరిచాయి. ఆ తరువాత విడుదలైన సుప్రీం, అ.. ఆ.., జెంటిల్మన్ సినిమాలు టాలీవుడ్‌ను సక్సెస్ ట్రాక్ ఎక్కించే ప్రయత్నం చేశాయి. ఈ సినిమాలు మంచి వసూళ్లను సాధించి సెకండాఫ్ మీద ఆశలు కల్పించాయి. అయితే ద్వితీయార్థంలో కూడా ఇంత వరకు బాక్సాఫీస్ దుమ్ముదులుపే సినిమా ఒక్కటి కూడా రాలేదు. రోజులు మారాయి, సెల్పీరాజా, నాయకీ లాంటి సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోకపోవటంతో సెకండ్ హాఫ్ డల్‌గా మొదలైంది. ఇటీవల విడుదలైన జక్కన్న వసూళ్ల పరంగా పరవాలేదనిపించినా.. హిట్ టాక్ మాత్రం రాలేదు. అయితే అందమైన ప్రేమకథగా తెరకెక్కిన పెళ్లిచూపులు మాత్రం మరోసారి కొత్త కథలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించింది. ప్రస్తుతం సాధారణ సినీ అభిమానులతో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా రాబోయే సినిమా మీదే ఆశలు పెట్టుకున్నారు. వరుసగా స్టార్ హీరోలు బరిలో దిగుతుండటంతో మరోసారి వరుస హిట్స్ అలరిస్తాయన్న ఆశతో ఉన్నారు. ఈ వారం శ్రీరస్తు, శుభమస్తు, మనమంతా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. జనతా గ్యారేజ్‌తో కలెక్షన్ల వేట మొదలయ్యే అవకాశం ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఈ సినిమాలతో అయినా ఏడాది మొదట్లో చూపించిన జోరు.. టాలీవుడ్ మరోసారి చూపిస్తుందేమో చూడాలి. -
పెళ్లిచూపులు దర్శకుడితో వెంకీ
రిలీజ్‌కు ముందే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న పెళ్లిచూపులు సినిమా, రిలీజ్ తరువాత కూడా అదే హవాను కంటిన్యూ చేస్తోంది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిన్న సినిమా పెద్ద విజయాన్నే సాధించింది. షార్ట్ ఫిలింస్‌తో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్, ఈ సినిమాతో వెండితెర మీద కూడా సత్తా చాటాడు. దీంతో క్రేజీ ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నాయి. తరుణ్ భాస్కర్ పెళ్లిచూపులు కథను ముందుగా సురేష్ బాబుకు చెప్పాడు. సురేష్ స్వయంగా సినిమాను నిర్మించకుండా రాజ్ కందుకూరి నిర్మాణంలో తన సమర్పణలో సినిమాను రూపొందించారు. అయితే పెళ్లిచూపులు ఫస్ట కాపీ చూసిన సురేష్ బాబు వెంటనే తరుణ్ భాస్కర్‌కు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో సినిమా అవకాశం ఇచ్చాడు. తాజాగా సురేష్ ప్రొడక్షన్స్‌లో తరుణ్ చేయబోయే సినిమా విషయంలో క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం బాబు బంగారం రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న వెంకటేష్, తరువాత సాలాఖద్దూస్ రీమేక్‌లో నటించనున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. -
'పెళ్లిచూపులు' మూవీ రివ్యూ
టైటిల్ : పెళ్లిచూపులు జానర్ : రొమాంటిక్ ఎంటర్టైనర్ తారాగణం : విజయ్ దేవరకొండ, రీతూ వర్మ సంగీతం : వివేక్ సాగర్ దర్శకత్వం : తరుణ్ భాస్కర్ నిర్మాత : రాజ్ కందుకూరి, యాష్ రంగినేని మాస్ కమర్షియల్ మూస సినిమాల నుంచి బయటికి వస్తున్న సగటు ప్రేక్షకులు ఇప్పుడు కొత్తదనానికి మంచి విజయాలను అందిస్తున్నారు. కమర్షియల్ సినిమాలతో పాటు కొత్త తరహా టేకింగ్‌తో తెరకెక్కుతున్న సినిమాలు కూడా మంచి విజయాలు సాధిస్తున్నాయి. అదే బాటలో ఆడియన్స్ ముందుకు వచ్చిన అందమైన ప్రేమ కథ 'పెళ్లిచూపులు'. మరి ఈ పెళ్లి చూపులు తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకున్నాయి. కథ : జీవితం మీద పెద్దగా క్లారిటీ లేనట్టుగా కనిపించే, ఈ తరం యువకుడు ప్రశాంత్ (విజయ్ దేవరకొండ). ఓ మంచి చెఫ్‌గా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఆ ప్రయత్నాల్లో ఉంటాడు. దీంతో ప్రశాంత్‌కు భవిష్యత్తు మీద ఆలోచన లేదన్న భావనతో పెళ్లి చేస్తే కుదురుకుంటాడని చిత్ర( రీతూ వర్మ) అనే అమ్మాయితో పెళ్లి నిశ్చయిస్తారు పెద్దలు. కానీ చిత్రకు కూడా పెళ్లి చేసుకోవటం ఇష్టం ఉండదు. ఎలాగైన ఫుడ్ ట్రక్ బిజినెస్ పెట్టాలన్నది చిత్ర కల. చిత్ర పెళ్లికి నో చెప్పటంతో ప్రశాంత్‌కు వేరే అమ్మాయిని చూస్తారు. కానీ ఆ సంబంధం విషయంలో కూడా ఇబ్బందులు ఎదురవ్వటంతో ముందు జీవితంలో సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్న ప్రశాంత్, చిత్రతో కలిసి ఫుడ్ ట్రక్ బిజినెస్ మొదలు పెడతాడు. ఏ మాత్రం పొంతన లేని వేరు వేరు ఆలోచనలున్న ఈ ఇద్దరి ప్రయాణం ఎలా సాగింది..? చివరకు ప్రశాంత్, చిత్రలు ఎలా ఒక్కటయ్యారు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : ఎవడే సుబ్రమణ్యంతో సినిమాతో ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ మరోసారి తన ఎనర్జిటిక్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా విజయ్ మ్యాన్లీ లుక్ సినిమాకు ప్లస్ అయ్యింది. స్వతంత్ర భావాలున్న అమ్మాయిగా రీతూ నటన బాగుంది. అన్ని రకాల ఎమోషన్స్‌ను అద్భుతంగా పలికించింది. సినిమా అంతా హీరో హీరోయిన్లు చుట్టూ నడిచే కథ కావటంతో ఇతర పాత్ర దారుల గురించి పెద్దగా చెప్పుకోవడానికి లేదు. అయితే ఎవరి పాత్రలకు వారు పూర్తిగా న్యాయం చేశారు. సాంకేతిక నిపుణులు : తొలి సినిమాతోనే దర్శకుడు తరుణ్ భాస్కర్ తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. రచయితగా, దర్శకుడిగా రెండు విభాగాలలో సక్సెస్ అయ్యాడు. తొలి భాగాన్ని ఎంతో పక్కాగా నడిపించిన తరుణ్ ద్వితీయార్థంలో మాత్రం కాస్త స్లో అయ్యాడు. రొమాంటిక్ కామెడీకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్‌ను అందిస్తూనే ఎక్కడగా గీత దాటకుండా జాగ్రత్త పడ్డాడు. సినిమాకు మరో మేజర్ హైలెట్ సినిమాటోగ్రఫి, నగేష్ బెగెల్లా అందించిన సినిమాటోగ్రఫి.. ఎక్కడా ఇది చిన్న సినిమా అన్న ఆలోచన రాకుండా చేసింది. పరిమిత బడ్జెట్లో కూడా అద్భుతమైన క్వాలిటీ అందించాడు నగేష్. వివేక్ సాగర్ సంగీతం పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : తరుణ్ భాస్కర్ దర్శకత్వం విజయ్, రీతూల నటన మైనస్ పాయింట్స్ : ప్రిడిక్టబుల్ స్టోరి సెకండ్ హాఫ్ స్లో నారేషన్ ఓవరాల్‌గా పెళ్లిచూపులు, ఈ తరం యువత మనోభావాలను తెలిపే సరికొత్త ప్రేమకథ -
అతని కమిట్మెంట్ నచ్చింది : నిర్మాత సురేశ్‌బాబు
‘‘దర్శకుడు తరుణ్ భాస్కర్ అండ్ టీం పక్కాగా కథ తయారు చేసుకుని ప్లానింగ్‌గా వెళ్లడంతో ‘పెళ్లి చూపులు’ వంటి మంచి అవుట్‌పుట్ వచ్చింది. ఈ చిత్రం నాకు నచ్చడంతో రిలీజ్లో నేను కూడా భాగస్వామినయ్యా. తరుణ్ గతంలో నన్ను కలిసినప్పుడు నేనో చిత్రం చేయమంటే తను మాత్రం ఈ చిత్రానికే ఫిక్స్ అయిపోయి నా సినిమా చేయనన్నాడు. తన కమిట్మెంట్ నచ్చింది. త్వరలో తనతో మా బ్యానర్లో ఓ సినిమా చేస్తా’’ అని నిర్మాత డి.సురేశ్‌బాబు అన్నారు. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రాజ్ కందుకూరి, యష్ రాగినేని నిర్మించిన ‘పెళ్లి చూపులు’ ఈ నెల 29న విడుదలకానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ‘‘లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. ఈ చిత్రాన్ని అనుకున్న బడ్జెట్లో తెరకెక్కించేందుకు ప్లానింగ్‌తో ముందుకెళ్లాం. ప్రొడక్షన్ మైండ్ అనే సాఫ్ట్వేర్ ఉపయోగించడంతో ఎక్కడా ఇబ్బందులు రాలేదు. ఈ చిత్రాన్ని నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఇచ్చే బహుమతిగా భావిస్తున్నా’’ అని తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘ఆరు నుంచి అరవై ఏళ్ల వ యసు వారందరూ చూడదగ్గ చిత్రమిది. గతంలో షార్ట్ ఫిల్మ్స్ చేసిన తరుణ్ భాస్కర్ ఈ చిత్రాన్ని చక్కగా తీశాడు. వివేక్ స్వరపరచిన పాటలు ఈ చిత్రానికి హైలెట్’’ అని పేర్కొన్నారు. విజయ్, రీతూవర్మ, దర్శకుడు ‘మధుర’ శ్రీధర్, నటుడు నందు తదితరులు పాల్గొన్నారు.