రీమేక్ సినిమాకు ఇంట్రస్టింగ్ ఫస్ట్ లుక్
గత ఏడాది టాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన చిన్న సినిమా పెళ్లిచూపులు. రాజ్ కందుకూరి నిర్మాణంలో తరుణ్ భాస్కర్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రీతూవర్మలు హీరో హీరోయిన్లుగా నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెళ్లిచూపులు ఘనవిజయం సాధించటంతో ఇతర ఇండస్ట్రీల నుంచి రీమేక్ హక్కుల కోసం భారీ ఆఫర్లు వచ్చాయి.
ఫైనల్ గా తమిళ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్న స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఇప్పటినుంచే ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టాడు. విష్ణు విశాల్, తమన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కార్టూన్ లా డిజైన్ చేశారు. సినిమా థీమ్ కు తగ్గట్టుగా మొబైల్ క్యాంటీన్ ముందు హీరో హీరోయిన్ల కార్టూన్ బొమ్మలతో రిలీజ్ చేసిన ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తమిళలో 'పొన్ ఒరు కండేన్' ( ఒక అమ్మాయిని చూశా) పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సెంథిల్ వీరాస్వామి దర్శకుడు.