Gautham Menon
-
మజాకా హీరోయిన్ మూవీ.. ఏడేళ్ల తర్వాత థియేటర్లలో రిలీజ్!
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ హీరోగా నటించిన చిత్రం 'ధృవ నచ్చితిరమ్'(తెలుగులో ధృవ నక్షత్రం ). 2017లో ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పటివరకు థియేట్రికల్ రిలీజ్ కాలేదు. ఈ మూవీని గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్లో తెరకెక్కించారు. 2018లో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు అనివార్య కారణాలతో పాటు ఆర్థిక సమస్యల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. దాదాపు ఏడేళ్లుగా ఈ మూవీ విడుదలకు మోక్షం మాత్రం లభించడం లేదు. గతేడాది కూడా రిలీజ్ అవుతుందని వార్తలొచ్చినా అలా మాత్రం జరగలేదు. అయితే ఈ చిత్రంలో మజాకా మూవీ హీరోయిన్ రీతూ వర్మ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాపై మరోసారి టాక్ వినిపిస్తోంది. అన్ని సజావుగా సాగితే ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుందని తాజా సమాచారం. ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే విడుదల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అన్ని కుదిరితే మే 1న కార్మిక దినోత్సవం రోజున ధృవ నచ్చతిరమ్ థియేటర్లలో విడుదలయ్యే అవకాశముంది. అదే జరిగితే సూర్య, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కాంబోలో వస్తోన్న రెట్రోతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడడం ఖాయంగా కనిపిస్తోంది.కాగా.. గతంలో ధృవ నచ్చతిరమ్ మూవీని మొదట సూర్యతో ప్లాన్ చేశారు. కానీ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్‌తో విభేదాల కారణంగా సూర్య ఈ చిత్రం నుండి వైదొలిగాడు. ఆ తర్వాత చియాన్ విక్రమ్‌ని సినిమాను తెరకెక్కించాడు. కాగా.. 2017లో సెట్స్‌పైకి వెళ్లిన ధృవ నచ్చితిరమ్ ఆర్థికపరమైన సమస్యలతో 2023లో పూర్తయింది. అప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద మాత్రం విడుదల కాలేదు. కాగా.. ఈ చిత్రంలో నటుడు సిమ్రాన్, పార్థిబన్, రాధిక శరత్‌కుమార్, వినాయకన్, దివ్యదర్శిని, వంశీకృష్ణ ముఖ్యపాత్రలు పోషించారు. -
ఐదేళ్ల క్రితం ఆగిపోయిన విక్రమ్ సినిమాకు మోక్షం..
విక్రమ్ 'పొన్నియిన్ సెల్వన్' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ జోష్‌తో ఇప్పుడు వరుసగా చిత్రాలు చేస్తున్నారు. ఈయన తాజాగా పా.రంజిత్ దర్శకత్వంలో నటిస్తున్న తంగలాన్ చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. కాగా విక్రమ్ ఐదేళ్ల క్రితం నటించిన చిత్రం ధృవనక్షత్రం. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పలు సమస్యల కారణంగా ఆగిపోయింది. దాన్ని ఇప్పుడు పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం గౌతమ్‌మీనన్ ధృవనక్షత్రం చిత్రానికి సంబంధించిన ప్యాచ్‌వర్క్ షూటింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఇప్పుటికే కంప్లీట్ అయిన షూటింగ్‌కు నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి కావచ్చినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం చిత్రీకరిస్తున్న సన్నివేశాలకు నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసి త్వరలో చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతోందని సమాచారం. కాగా ఇందులో విక్రమ్‌తో పాటు నటి రీతూవర్మ, ఐశ్వర్యరాజేశ్, సిమ్రాన్, పార్తీపన్, వినాయగం, రాధికాశరత్‌కుమార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హారీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. చదవండి: ఆదిపురుష్ హీరోయిన్‌తో ప్రభాస్ పెళ్లి? వాస్తవమిదే! -
చైతూతో ‘ఏ మాయ చేశావే- 2’.. హీరోయిన్ సమంత కాదట!
సమంత, నాగచైతన్య తొలిసారి నటించిన సినిమా ఏమాయ చేశావే. 2010లో వచ్చిన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. గౌతమ్‌మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇక ఆన్ స్క్రీన్‌పై చై-సామ్‌ల కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాతో మొదలైన వీరి స్నేహం ఆ తర్వాత ప్రేమ, పెళ్లి దాకా వెళ్లింది. కానీ వీళ్ళ వివాహబంధం ఎక్కువ కాలం నిలవలేకపోయింది. పెళ్లి చేసుకున్న నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఏమాయ చేశావే సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతుండగా, త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సీక్వెల్లో నాగచైతన్యనే హీరోగా నటించనుండగా, సమంత స్థానంలో రష్మిక నటించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా విడాకులు తీసుకున్నాక చై-సామ్ ఎదుర్కొన్న సమస్యలను కూడా సినిమాలో చూపించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందన్నది త్వరలోనే తెలియనుంది. -
హీరో శింబుకు ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత
'మానాడు' విజయంతో సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చిన హీరో శింబు. తాజాగా ఆయన నటించిన ‘వెందు తానింధాతు కాడు’సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులోకి ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’పేరుతో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. రెహమాన్ సంగీతం, గౌతమ్ మీనన్ టేకింగ్ సినిమాకు మరింత ప్లస్ అయ్యింది. చిన్న ఊరు నుంచి వచ్చిన ముత్తు గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడు అన్న నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నిర్మాత ఇషారి.కే గణేష్.. హీరో శింబు, గౌతమ్ మీనన్‌లకు కాస్ట్లీ గిఫ్టులు ఇచ్చారు. హీరో శింబుకు టొయోటొ న్యూ వెల్‌వైర్ కారును గిఫ్టుగా ఇవ్వగా, డైరెక్టర్ గౌతమ్ మీనన్‌కు ఖరీదైన బైక్‌ను బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. #VTK Producer @IshariKGanesh gifted a brand new luxury car to Actor @SilambarasanTR_ and a Motor bike to Director @menongautham at #VTK success celebrations.. pic.twitter.com/M0YVVsplXF — Ramesh Bala (@rameshlaus) September 24, 2022 -
హీరోగా మ్యూజిక్ డైరెక్టర్.. మరో హర్రర్ చిత్రం '13'
చెన్నై సినిమా: ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ 'డార్లింగ్' (తమిళం) చిత్రంతో కథానాయకుడిగా పరిచయమయ్యాడు. జీవీ ప్రకాష్ కుమార్ తాజాగా నటిస్తోన్న చిత్రం '13'. ఇటీవల జీవీ ప్రకాష్ కుమార్, దర్శకుడు గౌతమ్ మీనన్ కలిసి నటించిన 'సెల్ఫీ' చిత్రం మంచి విజయాన్ని సాధించింది. మళ్లీ వీరిద్దరూ కలిసి '13' మూవీలో నటించడం విశేషం. దీన్ని ఎస్. నందగోపాల్ సమర్పణలో మద్రాస్ స్టూడియోస్, అన్షు ప్రభాకర్ ఫిలిమ్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. నటి ఆదిత్య, భవ్య, ఐశ్వర్య నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా వివేక్ అనే నవ దర్శకుడు పరిచయం అవుతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం గురించి జీవీ ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ నిర్మాత నందకుమార్ ఫోన్ చేసి మంచి హారర్ కథ ఉంది దర్శకుడు చెబుతారు వినమని చెప్పారన్నారు. తొలి చిత్రమే హర్రర్ నేపథ్యంలో డార్లింగ్ చేయడంతో కాస్త సందేహించానన్నారు. అయితే కథ విన్న తర్వాత వెంటనే నటించడానికి అంగీకరించానని, ఇది హర్రర్ నేపథ్యంలో సాగే విభిన్నమైన చిత్రమని చెప్పారు. చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రెండు రోజుల క్రితం ఆవిష్కరించినట్లు వెల్లడించారు. చదవండి:👇 రూ. 44 లక్షల మోసం.. యూట్యూబర్ అరెస్ట్.. ఎన్టీఆర్ చిత్రంలో సోనాలి బింద్రే.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ నాకు మూడు ఫ్యామిలీలు ఉన్నాయి: అనిల్ రావిపూడి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_71236443.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో కమల్?
చెన్నై : హీరో కమలహాసన్‌ను దర్శకుడు గౌతమ్‌మీనన్ మరోసారి డైరెక్ట్ చేయనున్నారా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే కోలీవుడ్‌లో వస్తోంది. గౌతమ్‌మీనన్ ఇంతకుముందు పలు సంచలన చిత్రాలను తెరకెక్కించారు. కాక్క కాక్క, విన్నైతాండి వరువాయా, మిన్నలే ఇలా విజయవంతమైన చిత్రాలు ఈయన దర్శకత్వంలో వచ్చినవే. అలాంటి వాటిలో కమలహాసన్ నటించిన వేట్టైయాడు విళైయాడు చిత్రం ఒకటి. కమలహాసన్ పోలీస్అధికారిగా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. కాగా తాజాగా వేట్టైయాడు విళైయాడు చిత్రానికి సీక్వెల్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. ఈ చిత్రం గురించి కమలహాసన్, దర్శకుడు గౌతమ్‌మీనన్ ఇటీవల చర్చలు జరిపినట్లు తెలిసింది. కాగా ప్రస్తుతం కమలహాసన్ ఇండియన్–2 చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల ఈ చిత్ర షూటింగ్లో జరిగిన ప్రమాదం కారణంగా ఇండియన్–2 చిత్రం షూటింగ్ నిలిపి వేశారు. మళ్లీ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రం తరువాత కమలహాసన్ రాజకీయపనుల్లో బిజీ అవుతారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో తన మక్కళ్ నీది మయ్యం పార్టీ పోటీ చేయనున్న విషయం తెలిసిందే. దీంతో ఎన్నికలు దగ్గర పడుతుండడంలో కమలహాసన్ ఆ పనుల్లోనే ఉంటారు. దీంతో ఒక వేళ గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నటించినా, ఆ చిత్రం ఈ ఏడాది ప్రారంభమయ్యే అవకాశం లేదు. బహూశా శాసనసభ ఎన్నికలు ముగిసిన తరువాత వైట్టైయాడు విళైయాడు–2 చిత్రం ఉండవచ్చు. అదే విధంగా కమలహాసన్ తలైవన్ ఇరుకిండ్రాన్ చిత్రం చేయనున్నట్లు ఇంతకుముందే ప్రకటించారు. అదేవిధంగా దేవర్‌మగన్–2 కూడా చేస్తానని చెప్పారు. ఇవన్నీ ఎప్పుడు సెట్‌పైకి వస్తాయన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. ఇక దర్శకుడు గౌతమ్‌మీనన్ ప్రస్తుతం నటనపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు.ఆయన విక్రమ్ హీరోగా చేసిన ధ్రువనక్షత్రం పూర్తి కాలేదు. అదేవిధంగా తెలుగు చిత్రం పెళ్లిచూపులును రీమేక్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇవన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. తాజాగా శింబు హీరోగా విన్నైతాండి వరువాయా–2 చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కమలహాసన్‌తో వేట్టైయాడు విళైయాడు 2 చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందో చూడాలి. -
అనుష్క.. శింబుతో సెట్ అవుతుందా?
కోలీవుడ్‌లో ఒక కొత్త క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. సంచలన నటుడిగా ముద్ర వేసుకున్న నటుడు శింబు. లిటిల్‌స్టార్ నుంచి క్రేజీ స్టార్ స్థాయికి ఎదిగిన ఈయన ఇటీవల నటనకు చిన్న గ్యాప్ తీసుకున్నారనే చెప్పాలి. ఈ గ్యాప్‌లో లండన్ వంటి విదేశాలు చుట్టొచ్చారు. అదేవిధంగా సమీప కాలంలో సరైన హిట్‌ను అందుకోలేదన్నది వాస్తవం. ఇక వివాదాలు ఈయనకు కొత్త కాదు. నయనతారతో ప్రేమ, నటి హన్సికతో పెళ్లి దాదాపు ఖయం అనుకున్న సమయంలో రివర్స్ అవడం శింబును సంచలన నటుడిగా మార్చాయని చెప్పవచ్చు. కాగా కోలీవుడ్‌లో మోస్ట్ బ్యాచిలర్ అనిపించుకుంటున్న శింబు ప్రస్తుతం తన మాజీ ప్రియురాలు హన్సిక 50వ చిత్రంలో అతిథి పాత్రలో నటించి పూర్తి చేశారు. ప్రస్తుతం మానాడు చిత్రంలో నటిస్తున్నారు. (రాజ రాజ చోర’ అంటే దొంగలందరికీ రాజు లాంటివాడు అని అర్థం) ఇక అందాలతార అనుష్క గురించి చెప్పాలంటే చాలానే ఉంది. అగ్రనటిగా రాణిస్తున్న ఈ స్వీటీ చిత్రాల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తోందనిపిస్తోంది. ఎక్కువగా హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలకే మొగ్గు చూపుతున్న అనుష్కను చివరిగా సైరా నరసింహారెడ్డి చిత్రంలో అతిథి పాత్రలో చూశాం. కాగా ఈ బ్యూటీ నటించిన సైలెన్స్ చిత్ర విడుదల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. మాధవన్, నటి అంజలి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 2న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా తరువాత చిత్రం ఏమిటన్న ప్రశ్న ఆసక్తిగా మారింది. ఎందుకంటే అనుష్క ప్రేమలో పడిందని, త్వరలో పెళ్లి పీటలెక్కే అవకాశం ఉందనే ప్రచారం జోరందుకుంది. కాగా ఈ అమ్మడు చాలా కాలం క్రితమే దర్శకుడు గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించినట్లు చెప్పింది. అయితే ఆ తరువాత ఆ చిత్రం గురించి ఎలాంటి సమాచారం లేదు. కాగా దర్శకుడు గౌతమ్‌మీనన్ ప్రస్తుతం నటుడిగా బిజీ అయ్యారు. అయితే దర్శకత్వానికి దూరం అవుతానని చెప్పలేదు. అంతేకాదు తదుపరి చిత్రానికి ప్రయత్నాలు మొదలెట్టారట. దీని గురించి ఆయన ఒక ఇంటర్వ్యూలో పే ర్కొంటూ విన్నైతాండి వరువాయా చిత్ర సీక్వెల్‌కు కథను రెడీ చేసినట్లు చెప్పారు. ఆయన దర్శకత్వంలో శింబు, త్రిష నటించిన విన్నైతాండి వరువాయా చిత్రం ఎంత సంచలన విజయాన్ని సాధించిందో తెలిసిందే. (శింబు సినిమాలో విలన్‌గా సుదీప్) అదే చిత్రం తెలుగులో నాగచెతన్య, సమంత నటించగా ఏం మాయ చేసావే పేరుతో విడుదలై అక్కడ అనూహ్య విజయాన్ని అందుకుని నటి సమంతకు కొత్త భవిష్యత్తును ఇచ్చింది. కాగా ఇప్పుడు విన్నైతాండి వరువాయా చిత్రానికి సీక్వెల్‌ను చేయడానికి గౌతమ్‌మీనన్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇందులో నటుడు శింబును రిపీట్ చేయాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. అదే విధంగా ఆయనకు జంటగా నటి అనుష్క అయితే బాగంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అవుతుందా అన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇకపోతే శింబు, అనుష్క ఇంతకు ముందు ‘వానం’ చిత్రంలో నటించారన్నది గమనార్హం. -
దీపకు ఆ హక్కు లేదు: గౌతమ్ మీనన్
పెరంబూరు: దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ను నిషేధించాలని కోరే హక్కు ఆమె సోదరుడి కూతురు దీపకు లేదని దర్శకుడు గౌతమ్ మీనన్ పేర్కొన్నారు. ‘క్వీన్’ పేరుతో గౌతమ్ మీనన్ జయలలిత బయోపిక్‌ను వెబ్ సిరీస్‌గా రూపొందించిన సంగతి తెలిసిందే. అదే విధంగా దర్శకుడు ఏఎల్ విజయ్ ‘తలైవి’ పేరుతో జయలలిత బయోపిక్‌ను ఐదు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. నటి కంగనారనౌత్ జయలలితగా నటిస్తున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉంది. కాగా జయలలిత బయోపిక్‌ను తన అనుమతి లేకుండా నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ జయలలిత సోదరుడి కూతురు జే.దీప మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జయలలిత బయోపిక్‌లపై నిషేధం విధించలేమని పేర్కొంటూ దీప పిటిషన్‌ను కొట్టి వేశారు.(క్వీన్ రివ్యూ: ‘అమ్మ’గా అదరగొట్టిన రమ్యకృష్ణ) ఈ క్రమంలో ఆమె మరో రిట్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి దర్శకుడు గౌతమ్‌మీనన్, దర్శకుడు విజయ్‌లకు బదులివ్వాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. కాగా జయలలిత బయోపిక్ కేసు శుక్రవారం మరోసారి విచారణకు వచ్చింది. దీంతో దర్శకుడు గౌతమ్ మీనన్ తరఫు న్యాయవాది కౌంటర్ పిటిషన్‌ను దాఖలు చేశారు. అందులో దీపకు జయలలిత బయోపిక్ చిత్రాలను నిషేధించాలనే అర్హతగానీ, హక్కుగానీ లేవన్నారు. జయలలిత సొంత బంధువునని చెప్పుకొనే దీప పలుమార్లు తాను జయలలితను కలుసుకునే ప్రయత్నం చేసి విఫలం అయ్యానని చెప్పారన్నారు. అయినా తాను రూపొందించిన ‘క్వీన్’ సిరిస్ యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించినదని, అనితా శివకుమార్ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించిన సిరీస్ అని చెప్పారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను మార్చి 8వ తేదీకి వాయిదా వేశారు. -
‘గంటలోపే మిలియన్ వ్యూస్’
ప్రేమ, పెళ్లి, విడాకులు అంశాలను చర్చించే విభిన్న కథా చిత్రంగా ఓ మై కడవులే చిత్రం ఉంటుందని ఆ చిత్ర నిర్మాత ఢిల్లీబాబు చెప్పారు. ఇంతకుముందు రాక్షసన్ వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఈయన తన యాక్సెస్ ఫిలిం ఫ్యాకర్టీ పతాకంపై తాజాగా నిర్మిస్తున్న చిత్రం ఓ మై కడవులే. అశోక్ సెల్వన్, అభినయ సెల్వన్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ద్వారా అశ్వత్ మారిముత్తు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈయన నాళైయ ఇయక్కునార్ సీజన్ 3 నుంచి వచ్చారన్నది గమనార్హం. ఇంతకు ముందు కొన్ని లఘు చిత్రాలను రూపొందించారు. ఓ మై కడవులే చిత్రంలో నటుడు విజయ్‌సేతుపతి ముఖ్యమైన పాత్రలో నటించగా, అశోక్‌సెల్వన్, రితికా సింగ్ హీరోహీరోయిన్లుగా నటించారు. మరో ప్రధాన పాత్రలో నటి వాణీబోజన్ నటించింది. ఈమె బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమవుతోంది. దర్శకుడు గౌతమ్‌మీనన్ కీలక పాత్రలో నటించడం మరో విశేషం. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఓ మై కడవులే చిత్రం ప్రేమికుల రోజు సందర్భంగా ఈ నెల 14వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. చిత్ర దర్శక, నిర్మాతలు శనివారం మీడియాతో మాట్లాడుతూ నిర్మాత ఢిల్లీబాబు మాట్లాడుతూ రాక్షసన్ వంటి సక్సెస్ఫుల్ చిత్రం తరువాత తమ సంస్థలో నిర్మిస్తున్న చిత్రం ఓ మై కడవులే అని తెలిపారు. దర్శకుడు అశ్వత్ మారిముత్తు చెప్పిన కథ నచ్చడంతో ఒకే ఒక్క గంటలోనే ఓకే చేశానని చెప్పారు. ప్రేమ, వినోదం వంటి యూనిక్ కథతో రూపొందించిన చిత్రం ఇదని తెలిపారు. ఇది అందరికీ కనెక్ట్ అయ్యే కథా చిత్రంగా ఉంటుందన్నారు. నటుడు విజయ్‌సేతుపతి ఇందులో చాలా ఇంపార్టెంట్ ఉన్న పాత్రలో నటించినట్లు చెప్పారు. తాను మంచి కంటెంట్ లేకపోతే చిత్రాలను చేయనన్నారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ఈ చిత్ర ట్రైలర్‌ను నటుడు సూర్య చేతుల మీదగా శుక్రవారం విడుదల చేశామని, ఒక్క గంటలోనే మిలియన్ ప్రేక్షకులు ట్రైలర్‌ను వీక్షించినట్లు తెలిపారు. ఈ చిత్ర కథపై 2013లోనే తనకు ఐడియా వచ్చిందన్నారు. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారని, అలాంటిది ఎన్నో పెళ్లిళ్లు విడాకులకు ఎందుకు దారి తీస్తున్నాయన్న ఇతివృత్తంతో తెరకెక్కించిన చిత్రం ఓ మై కడవులే అని చెప్పారు. ఇందులో ఒక ముఖ్య పాత్రలో నటించడానికి రియల్‌లైఫ్, రీల్ లైప్ హీరో అవసరం అయ్యారని, నటుడు విజయ్‌సేతుపతిని ఆ పాత్రకు సంప్రదించగా, కథ విన్న ఆయన ఈ పాత్రనే తానే చేయాలని అన్నారని చెప్పారు. ఇవాళ సినిమాల్లో ఎక్స్ట్రార్డనరీ ఎలిమెంట్స్ ఉంటేనే గానీ ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదన్నారు. ఈ చిత్రాన్ని అందరూ రిలేట్ చేసుకుంటారని చెప్పారు. ఈ చిత్రంలో దర్శకుడు గౌతమ్‌మీనన్ తన రియల్ పాత్రనే పోషిస్తున్నారని చెప్పారు. చిత్ర తమిళనాడు విడుదల హక్కులను శక్తిఫిలిం ఫ్యాక్టరీ శక్తివేల్ పొందారని, ఈ నెల 14న విడుదల చేయనున్నట్లు నిర్మాత ఢిల్లీబాబు తెలిపారు. -
ఆ కాంబినేషన్ ఇప్పుడు సెట్ కానుందా?
సినిమా: ఎప్పుడో అనుకున్న కాంబినేషన్ ఇప్పుడు సెట్ కానుందా? అందుకు అవకాశం ఉందంటున్నారు సీనీ వర్గాలు. ముందుగా అందాల నటి అనుష్క గురించి చెప్పాలి. ఈ స్వీటీ దాదాపు రెండేళ్లకు పైగా వెండి తెరపై కనిపించలేదు. అలాంటిది తెలుగు చిత్రం సైరా నరసింహారెడ్డిలో ఝాన్సీరాణిగా మెరిసి తన అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. తాజాగా నటిస్తున్న సైలెన్స్ (తెలుగులో నిశ్శబ్దం) చిత్రం చిత్ర ప్రచారం మొదలైంది. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. చిత్ర టీజర్ బుధవారం విడుదలైంది. చిత్రాన్ని త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీంతో అనుష్క నెక్ట్స్ చిత్రం ఏమిటన్న ప్రశ్న తలెత్తుంది. ఈ విషయాన్ని అటుంచితే మరో సంచలన దర్శకుడు గౌతమ్‌మీనన్. ఈయన ఈ మధ్య నటుడిగా కూడా మారారు. దర్శకుడిగా చేసిన చిత్రాలే తెరపైకి వచ్చి చాలా కాలమైంది, అయితే ధ్రువనక్షత్రం, ఎన్నై నోక్కి పాయుమ్ తూటా చిత్రాలు చాలా కాలంగా నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో ధనుష్ మేఘాఆకాశ్ జంటగా నటించిన ఎన్నై నోక్కి పాయుమ్ తూటా చిత్రం విడుదల తేదీలు రెండు మూడు సార్లు వాయిదా పడ్డా, ఈ సారి పక్కాగా రావడానికి రెడీ అవుతోంది. దీన్ని నిర్మాత ఐసరిగణేశ్ తన చేతుల్లోకి తీసుకుని ఈ నెల 29వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఇదే నిర్మాత దర్శకుడు గౌతమ్‌మీనన్‌తో వరుసగా రెండు చిత్రాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారన్నది తాజా సమాచారం. అందులో ఒకటి జోష్వా ఇమై పొయ్ ఖాఖా. ఇందులో వరుణ్‌రాహెల్ జంటగా నటించనున్నట్లు తెలిసింది. ఇక రెండవ చిత్రంలో నటి అనుష్క నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రంగా ఉంటుందట. కాగా నటి అనుష్క భాగమతి చిత్రం ప్రమోషన్లో భాగంగా చెన్నైకి వచ్చినప్పుడు తాను తదుపరి గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నటించడానికి కమిట్ అయినట్లు వెల్లడించింది. అయితే ఆ తరువాత ఆ చిత్రం ఊసే లేదు. సైలెన్స్ చిత్రాన్ని పూర్తి చేసిన అనుష్కకు ఇన్నాళ్లకు అప్పుడు కమిట్ అయిన గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నటించడానికి సెట్ అవుతుందా అన్న ఆసక్తి నెలకొంంది. ఈ çచిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
ఆ దర్శకుడిపై కేసు వేస్తా: జయలలిత మేనల్లుడు
సాక్షి, చెన్నై : దర్శకుడు గౌతమ్‌మీనన్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. ఈయనపై కోర్టులో కేసు వేస్తానని దివంగత ముఖ్యమంత్రి జయలలిత సోదరుడి కుమారుడు దీపక్ అంటున్నారు. జయలలిత జీవిత చరిత్రను తెరకెక్కించడానికి కోలీవుడ్‌లో పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే దర్శకుడు విజయ్ తలైవీ పేరుతో జయలలిత బయోపిక్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ సంచలన నటి కంగనారనౌత్ అమ్మగా నటించనుంది. అదే విధంగా నవ దర్శకురాలు ప్రియదర్శిని ‘ది ఐరన్ లేడీ’ పేరుతో జయలలిత జీవిత చరిత్రను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో జయలలితగా నటి నిత్యామీనన్ నటించనుంది. కాగా దర్శకుడు గౌతమ్‌మీనన్ జయలలిత జీవిత చరిత్రను వెబ్ సిరీస్‌గా రూపొందించేశారు. క్వీన్ పేరుతో రూపొందించిన ఇందులో జయలలితగా నటి రమ్యకృష్ణ నటించారు. ఈ వెట్ సిరీస్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవలే విడుదల చేశారు. ఈ వెబ్ సిరీస్‌కు జయలలిత సోదరుడి కొడుకు దీపక్ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ జయలలిత గురించి దర్శకుడు గౌతమ్‌మీనన్‌కు ఏం తెలుసని ప్రశ్నించారు. జయలలిత బయోపిక్‌ను గౌతమ్‌మీనన్ రూపొందిస్తే ఆయనకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేస్తానని హెచ్చరించారు. దీంతో రమ్యకృష్ణ నటించిన క్వీన్ వెబ్ సిరీస్ ప్రసారానికి చిక్కులు ఎదురవుతున్నాయి. దీనికి దర్శకుడు గౌతమ్‌మీనన్ ఎలా స్పందిస్తారో చూడాలి. -
జయలలిత బయోపిక్ టైటిల్ ఇదే!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత జీవిత కథను సినిమాగా తెరకెక్కించేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. జయ జీవితంలో ఓ కమర్షియల్ సినిమాలకు కావాల్సిన అన్ని ఎమోషన్స్ ఉండటంతో చాలా మంది దర్శకనిర్మాతలు ఆమె కథను వెండితెరకెక్కించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కేవలం సినిమాగానే కాకుండా డిజిటల్ ప్లాట్ ఫామ్స్‌లోనూ జయ కథ విడుదల కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఎమ్ఎక్స్ ప్లేయర్ జయ బయోగ్రఫిని వెబ్ సిరీస్ రూపంలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గౌతమ్ మీనన్, ప్రశాంత్ మురుగేశన్‌లు సంయుక్తంగా డైరెక్ట్ చేస్తున్న ఈ వెబ్ సిరీస్ టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. క్వీన్ పేరుతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్‌లో జయ పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారు. ప్రస్తుతానికి టైటిల్‌ను మాత్రమే రివీల్ చేసిన చిత్రయూనిట్, జయ వేలాది మంది అభిమానులను పార్టీ కార్యకర్తలను ఉద్దేశిస్తూ ప్రసంగిస్తున్నట్టుగా ఉన్న పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో రమ్యకృష్ణ ముఖం రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డారు. -
రిలీజ్ చేయలేకపోయాం.. కానీ!
ధనుష్, మేఘాఆకాశ్ జంటగా నటించిన చిత్రం ‘ఎౖనైనోకి పాయుం తూటా’. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్కేప్ ఆర్టిస్ట్ మోషన్ పిక్చర్స్ పతాకంపై మదన్ నిర్మించారు. చాలా కాలం కిందటే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనివార్యకారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు. అలాంటిది ఎట్టకేలకు చిత్రాన్ని ఈ నెల 6వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అయితే చెప్పినట్టుగా 6వ తేదీన కూడా విడుదల చేయలేకపోయారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత గురువారం ఒక ప్రకటనను విడుదల చేశారు. చిత్రాన్ని శుక్రవారం విడుదల చేయడానికి శాయశక్తులా ప్రయత్నించామన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్లీ వాయిదా వేస్తున్నామన్నారు. చిత్ర విడుదలలో జాప్యం వల్ల కలిగే నిరాశ, జరుగుతున్న ప్రచారం గురించి తమకు తెలుసన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అభిమానుల సహనం, ఆదరణ తమకు కావాలని కోరుకుంటున్నామన్నారు. అతి త్వరలోనే చిత్రాన్ని తెరపైకి తీసుకొస్తామన్నారు. చిత్రం చూసిన తర్వాత ఇంత కాలం వేచి చూసిన ప్రేక్షకులకు సంతృప్తి కలిగిస్తుందని నమ్మకంగా చెప్పగలమని నిర్మాతలు పేర్కొన్నారు. -
హ్యాట్రిక్ కాంబినేషన్
హీరో సూర్య, దర్శకుడు గౌతమ్ మీనన్ కాంబినేషన్ మంచి హిట్. గతంలో వీరి కాంబినేషన్లో ‘కాక్క కాక్క’ (తెలు గులో వెంకటేశ్ చేసిన ‘ఘ ర్షణ), ‘వారనమ్ ఆయిరమ్’ (‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’) సినిమాలు వచ్చాయి. సూర్యను స్టార్ లీగ్‌లో నిలబెట్టిన చిత్రాల్లో ఈ రెంటికి కూడా ప్రధాన స్థానం ఉంది. ఇప్పుడు మూడో సినిమా కోసం ఈ కాంబినేషన్ కలవబోతోందని చెన్నై టాక్. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ నిర్మించనుందట. ఈ నెల 20న విడుదల కానున్న సూర్య చేసిన ‘కాప్పాన్’ (‘బందోబస్త్’)ను లైకా సంస్థే నిర్మించింది. తాజా చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. -
డిజిటల్ ఎంట్రీ
నెట్‌ఫ్లిక్స్ తమిళంలో ఓ వెబ్ యాంథాలజీ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసింది. ఈ వెబ్ యాంథాలజీ (పలువురు దర్శకులు పలు కథలతో ఒక సినిమాగా రూపొందించడాన్ని యాంథాలజీ అంటారు) రూపొందించడం కోసం నలుగురు దర్శకులను కూడా సంప్రదించింది. గౌతమ్ మీనన్, సుధా కొంగర, వెట్రిమారన్, విఘ్నేష్ శివన్ ఒక్కో భాగాన్ని డైరెక్ట్ చేస్తారు. పరువు హత్యల నేపథ్యంలో ఈ యాంథాలజీ సాగు తుందని సమాచారం. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించే భాగం చిత్రీకరణ కూడా మొదలైందట. ఇందులో అంజలి, బాలీవుడ్ నటి కల్కీ కొచ్లిన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారని తెలిసింది. ఇదే అంజలి డిజిటల్ ఎంట్రీ కావడం విశేషం. మిగతా దర్శకుల భాగాల్లో నటించే వారి వివరాలు తెలియాలి. -
స్టార్ హీరో సినిమా మరోసారి వాయిదా!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌కు ఇబ్బందులు కొనసాగుతున్నాయి. ఇటీవల పారితోషికం విషయంలో నిర్మాతలపై ధనుష్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తాజాగా ఎన్నో వాయిదాల తరువాత ఈ శుక్రవారం రిలీజ్‌కు రెడీ అయిన ‘ఎనై నోకి పాయం తోట’ సినిమా మరోసారి వాయిదా పడింది. క్రియేటివ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్, ధనుష్ కాంబినేషన్లో రూపొందిన సినిమా ఎనై నోకి పాయం తోట. ఈ సినిమాను ఆ నెల 6న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే ఆర్థిక సమస్యల కారణంగా సినిమా విడుదల వాయిదా పడనుందని తెలుస్తోంది. ఒక రోజు ఆలస్యంగా అయిన సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన సినిమా కావటంతో ఈ మూవీపై ఆశించిన స్థాయిలో హైప్లేదు. ఇప్పుడు మరోసారి వాయిదా పడితే సినిమా ఫలితంపై ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చిత్రయూనిట్. ఈ సినిమా తెలుగులో తూటా పేరుతో రిలీజ్ కానుంది. -
‘అర్జున్ రెడ్డి’ రీమేక్‌లో స్టార్ డైరెక్టర్
టాలీవుడ్లో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమాను కోలీవుడ్‌లో ధృవ్ విక్రమ్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రీమేక్ నిర్మాతలకు నచ్చకపోవటంతో పూర్తి సినిమాను గిరీశయ్య దర్శకత్వంలో మరోసారి తెరకెక్కిస్తున్నారు. కొత్త తెరకెక్కిస్తున్న రీమేక్‌లో నటీనటులను కూడా మార్చేశారు చిత్రయూనిట్. తాజా సమాచారం ప్రకారం ఈ రీమేక్‌లో హీరోగా తండ్రి పాత్రలో సౌత్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ నటిస్తున్నారట. ఇటీవల ఆర్థిక సమస్యల కారణంగా తాను నిర్మించిన సినిమాలన్నీ ఆగిపోవటంతో గౌతమ్ మీనన్ పూర్తి నటన మీద దృష్టిపెట్టాడు. ఇప్పటి వరకు గెస్ట్ రోల్స్‌లో మాత్రమే కనిపించిన గౌతమ్, అర్జున్ రెడ్డి రీమేక్‌లో మాత్రం ఇంపార్టెంట్ రోల్లో కనిపించనున్నాడు. ఆదిత్య వర్మ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ధృవ్ సరసన బానిటా సంధు హీరోయిన్గా నటిస్తుండగా ప్రియా ఆనంద్, అన్బులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
‘అమ్మ’ పాత్రకు భారీ రెమ్యూనరేషన్
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత జయలలిత జీవిత కథను సినిమాగా తెరకెక్కించేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థలు జయ జీవిత కథకు వెండితెర రూపం ఇచ్చేందుకు ముందుకువస్తున్నారు. ఇప్పటికే నిత్య మీనన్ ప్రధాన పాత్రలో ఓ సినిమాను ప్రకటించారు. సినిమాగానే కాక వెబ్ సిరీస్‌గానూ అమ్మ బయోపిక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో రమ్యకృష్ణ జయలలిత పాత్రలో నటించనున్నారు. ఈ పాత్రలో నటించేందుకు రమ్యకృష్ణ భారీగా రెమ్యూనరేషన్ అందుకోనున్నారట. బాహుబలి తరువాత రమ్యకృష్ణ రేంజ్ తారా స్థాయికి చేరింది. ఈ బయోపిక్ వివాదాస్పదం అయ్యే అవకాశం కూడా ఉండటంతో రమ్యకృష్ణ భారీ పారితోషికం డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సిరీస్‌లో జయలలిత సినీ నటిగా ఉన్న సమయంలో వచ్చే సన్నివేశాల్లో యువ కథానాయిక ఆ పాత్రలో కనిపించనున్నారు. మూడు సీజన్లుగా తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్‌ను తమిళ్, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు. -
దీపావళి బరిలో ఇద్దరు టాప్ స్టార్లు
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, టాప్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం సర్కార్. గతంలో వీరి కాంబినేషన్లో తెరకెక్కిన తుపాకి, కత్తి చిత్రాలు ఘనవిజయం సాధించటంతో సర్కార్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమాతో పోటి పడేందుకు మరో స్టార్ హీరో రెడీ అవుతున్నాడు. సూర్య హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్జీకే కూడా దీపావళికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్ ఆలస్యం కావటంతో ఎన్జీకే వాయిదా పడింది. ఇప్పుడు అదే స్థానంలో ధనుష్ హీరోగా గౌతమ్ మీనన్ తెరకెక్కిస్తున్న ‘ఎన్నయ్ నొక్కి పాయుమ్ తోట్ట’ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. శశికుమార్ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ధనుష్ జోడిగా మేగా ఆకాష్ నటిస్తున్నారు. ధనుష్, విజయ్‌లు ఒకేసారి బాక్సాఫీస్ బరిలో దిగుతుండటంతో అభిమానులు దీపావళి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
ఇప్పుడు మేకప్ మచ్చీ
స్టార్ట్.. కెమెరా.. యాక్షన్ అంటూ ఆర్టిస్టులతో యాక్ట్ చేయించే గౌతమ్ మీనన్ ఫర్ ఎ చేంజ్ మేకప్ వేసుకుంటున్నారు. స్టార్ట్ కెమెరా అనగానే కెమెరా ముందు నిలబడి డైలాగ్స్ చెప్పడానికి రెడీ అయ్యారు. దర్శకుడిగా గౌతమ్ ఇచ్చిన ‘ఘర్షణ, ఏ మాయ చేశావె, సాహసం శ్వాసగా సాగిపో’ ఇలా.. యాక్షన్ కమ్ లవ్ స్టోరీస్‌ను అద్భుతంగా చూపించారు గౌతమ్. ముఖ్యంగా ప్రేమ కథలకు సున్నితమైన భావోద్వేగాలతో క్లాసిక్ టచ్ ఇస్తూ తెరకెక్కించగలరనే పేరు ఉంది. నటుడిగా మాత్రం యాక్షన్ మూవీలో కనిపించనున్నారు. తాను దర్శకత్వం వహించే చిత్రాల్లో జస్ట్ ఒక్క సీన్లో అయినా కనిపించడం గౌతమ్ అలవాటు. ఆ మధ్య ‘గోలీసోడా 2’ చిత్రంలో పోలీసాఫీసర్‌గా కీలక పాత్ర చేశారు. ఇప్పుడు ఏకంగా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారట. ‘జై’ అనే కొత్త దర్శకుడు ఇటీవల గౌతమ్ మీనన్‌ని కలిసి ఓ కథ వినిపించారట. ఆ కథ బాగా నచ్చడంతో హీరోగా నటించడానికి ఒప్పుకున్నారని కోలీవుడ్ టాక్. ‘నాచ్చియార్’ ఫేమ్ నాయిక ఇవానా ఈ చిత్రంలో ముఖ్యపాత్ర పోషించనున్నారట. ఈ నెల 15న ఈ సినిమాకి కొబ్బరికాయ కొట్టనున్నారని సమాచారం. ఈ వార్త వినగానే గౌతమ్ ఫ్యాన్స్ ‘ఇప్ప మేకప్ మచ్చీ’ అనుకుంటున్నారు. అంటే.. ఇప్పుడు మేకప్ బావా అని అర్థం. -
‘అందుకే రజనీ నా సినిమా చేయలేదు’
విభిన్న చిత్రాలతో క్రియేటివ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న దర్శకుడు గౌతమ్ మీనన్. చేసినవి తక్కువ సినిమాలే అయిన గౌతమ్ చిత్రాలంటే పడిచచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. ఇలాంటి స్టార్ డైరెక్టర్‌కు ఓ చేదు అనుభవం ఎదురైందట. ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ తన సినిమాలో నటిస్తానని ముందు మాట ఇచ్చి తరువాత వెనక్కి తగ్గారని గౌతమ్ వెల్లడించారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ధృవ నక్షత్రం. దేశ రక్షణ బాధ్యతలు నిర్వహించే ఇంటిలిజెన్స్ అధికారుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ముందుగా ఈ సినిమాను కథను గౌతమ్ రజనీకాంత్‌కు వినిపించారట. రజనీ కూడా చాలా ఆసక్తిగా.. సినిమా చేద్దామని డేట్స్, బడ్జెట్ లాంటి విషయాలను కూడా ఆరా తీశారట. అయితే తరువాత రజనీకి ఎవరో గౌతమ్ గురించి తప్పుగా చెప్పటంతో ఈ ప్రాజెక్ట్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపించలేదని గౌతమ్ వెల్లడించారు. ధృవ నక్షత్రం సినిమా ప్రారంభమైన దగ్గర నుంచి వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ సినిమాను ముందుగా సూర్య హీరోగా ప్రారంభించారు. సూర్యతో విభేదాలు రావటంతో విక్రమ్ చేతికి వెళ్లింది. షూటింగ్ కూడా చాలా ఆలస్యమైంది. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా గౌతమ్ మీనన్ ఈ విషయాలను వెల్లడించారు. -
నాకు రూ.1000 కోట్ల ఆస్తి ఉంది : హీరో
కోలీవుడ్ స్టార్ హీరో శింబు ఒకేసారి మూడు చిత్రాలను ప్రకటించాడు. విజయా ప్రొడక్షన్స్ బ్యానర్, గౌతమ్ మీనన్ సినిమాలతో పాటు తన డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు. ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సినిమాలు చేయటం కాదు ముందు షూటింగ్‌లకు సరైన సమయానికి రావటం నేర్చుకోమంటూ చాలా మంది కామెంట్ చేశారు. అయితే కామెంట్స్‌పై డైరెక్ట్‌గా స్పందించకపోయినా... విమర్శలకు బదులిస్తూ కోలీవుడ్ మీడియాకు శింబు ఓ ప్రెస్‌నోట్ రిలీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ‘నేను నా తొలి సినిమా చేసినప్పుడు కూడా మా నాన్నతో కలిసి 10 గంటలకు సెట్‌కు వెళ్లాను. అది నా నిర్లక్ష్యం కాదు. నేను ఎప్పుడూ ఇలాగే జీవిస్తున్నా. నేను చాలా కంఫర్టబుల్‌గా బతికాను. రోబోలా జీవించటం నా వల్ల కాదు. తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తులు కాకుండా వ్యక్తిగతంగా నేను జీవితంలో సెటిల్ అయ్యాను. నాకు రూ.1000 కోట్ల రూపాయల ఆస్తి ఉంది. నా జీవితాన్ని నేను ఆనందంగా జీవించగలను. నాకు సినిమా అంటే ఇష్టం అందుకే ఈ రంగంలో కొనసాగుతున్నాను. నాకు స్వార్థపరుడ్ని అనిపించుకోవాలనే ఉద్దేశం లేదు. అందుకే నా పనుల వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే నా ప్రవర్తన మార్చుకుంటా, ప్రస్తుతం అదే పనిలో ఉన్నా’ అంటూ క్లారిటీ ఇచ్చారు శింబు. -
ఏడాది తరువాత మరో టీజర్
చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న విక్రమ్, గౌతమ్ మీనన్‌ల ధృవ నక్షత్రం సినిమా కాస్త కదిలింది. ఏడాది క్రితం ఓ టీజర్‌తో సందడి చేసిన గౌతమ్ టీం.. తాజాగా మరో ఇంట్రస్టింగ్ టీజర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విక్రమ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 12 ప్రధాన పాత్రల చుట్టూ తిరిగే యాక్షన్ కథాంశంతో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించారు. గత ఏడాది ఆగస్టులోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా విక్రమ్‌తో గౌతమ్ మీనన్‌కు వచ్చిన విబేధాల కారణంగా వాయిదా పడింది. ఫైనల్ గా గౌతమ్ మీనన్ ధృవనక్షత్రం సినిమాను రిలీజ్‌కు సిద్ధం చేశారు. యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లింగ్ టీజర్‌తో అభిమానులకు సినిమాను గుర్తు చేశారు. పార్తీపన్, రాధికా శరత్ కుమార్, సిమ్రాన్, రీతూవర్మ, ఐశ్వర్యరాజేష్‌లు ఇతర ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతమందిస్తున్నారు. కొత్త టీజర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధృవ నక్షత్రం టీం కొత్త రిలీజ్ డేట్‌ను మాత్రం ప్రకటించలేదు. -
మార్చి 29న గోలీసోడా –2
తమిళసినిమా: గోలీసోడా–2 చిత్రం ఈ నెల 29న విడుదలకు ముస్తాబవుతోంది. ఎలాంటి కాస్టింగ్, అంచనాలు లేకుండా ఇంతకు ముందు విడుదలైన గోలీసోడా చిత్రం ఎంత సంచలన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఆ చిత్ర దర్శకుడు విజయ్‌మిల్టన్ తాజాగా తెరకెక్కించిన చిత్రం గోలీసోడా –2. దీంతో ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలాంటి నమ్మకంతోనే గోలీసోడా–2 చిత్ర విడుదల హక్కులను క్లాప్‌బోర్డు ప్రొడక్షన్స్ అధినేత వి.సత్యమూర్తి పొందారు. ఇంతకుముందు ‘తప్పుదండా’ చిత్రాన్ని నిర్మించి, కథానాయకుడిగా నటించిన సత్యమూర్తి దర్శకుడు సుశీంద్రన్ దర్శకత్వం వహించిన నెంజిల్ తుణివిరుందాళ్, విజయ్‌సేతుపతి, గౌతమ్ కార్తీక్ హీరోలుగా నటించిన ఒరు నల్లనాళ్ పాత్తు సోల్రేన్ చిత్రాలను తమిళనాడులో విడుదల చేశారు. ప్రస్తుతం తన క్లాప్‌బోర్డు ప్రొడక్షన్స్ పతాకంపై ఓడవుమ్ ముడియాదు ఒళియవుమ్ ముడియాదు అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సత్యమూర్తి గోలీసోడా–2 చిత్ర విడుదల హక్కులను పొందడం విశేషం. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ విజయ్‌మిల్టన్ చిత్రాలు సాంకేతిక విలువలతో, ఆసక్తికరమైన కథాంశాలతో కూడి ఉంటాయన్నారు. అందుకే ఆయన చిత్రాలంటే తనకు ప్రత్యేక ఆసక్తి అని పేర్కొన్నారు. తమిళ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న గోలీసోడా–2 చిత్ర విడుదల హక్కులను పొంది సమ్మర్ స్పెషల్‌గా ఈ నెల 29న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. దర్శకుడు గౌతమ్‌మీనన్ వాయిస్ఓవర్ ఇచ్చిన ఈ చిత్ర ట్రైలర్ ఇప్పటికే విశేష ఆదరణ పొందుతోందని, విజయ్విల్లన్ ఆయన యూనిట్‌పై నమ్మకంతోనూ గోలీసోడా–2 చిత్ర విడుదల హక్కులను కొనుగోలు చేసినట్లు వి.సత్యమూర్తి తెలిపారు. -
పదిహేడేళ్ల తరువాత అదే కాంబినేషన్లో..!
సౌత్ స్టార్ హీరో మాధవన్, క్రియేటివ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘చెలి’. తెలుగు, తమిళల భాషల్లో ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ముఖ్యంగా ఈ సినిమా ఆడియో ఇప్పటికీ ఎంతో మందికి ఫేవరెట్ ఆల్బమ్. ఇంతటి ఘనవిజయాన్ని అందించిన ఈ క్రేజీ కాంబినేషన్ తిరిగి రిపీట్ అవ్వటానికి పదిహేడేళ్ల సమయం పట్టింది. ఇన్నేళ్ల తరువాత మరోసారి గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మాధవన్ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. ఇప్పటికే మాధవన్ కు కథ వినిపించిన గౌతమ్, ప్రస్తుతం స్ర్కిప్ట్ డెవలప్ చేసే పనిలో ఉన్నాడు. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈసినిమాను తమిళ్ తో పాటు హిందీ, ఇంగ్లీష్లలోనూ తెరకెక్కించనున్నారట. ఈ ఏడాది ద్వితియార్థంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. -
గౌతమ్ మీనన్‌కు యాక్సిడెంట్
ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మహాబలిపురం నుంచి చెన్నైకి కారులో ప్రయాణిస్తుండగా శోలింగనల్లూరు సిగ్నల్ వద్ద ఆయన కారు, టిప్పర్ లారీని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో గౌతమ్ మీనన్‌కు పెను ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో ఆయన బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన ప్రయాణిస్తున్న కారు మాత్రం పూర్తిగా ధ్వంసమైంది. స్వల్పంగా గాయపడిన ఆయన ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రేమకథా చిత్రాలను తీయడంలో సిద్ధహస్తుడైన గౌతమ్ మీనన్ తమిళంతో పాటు తెలుగులో పలు సూపర్‌హిట్ చిత్రాలను తెరకెక్కించారు. -
మేఘాకు మరో ఛాన్స్
ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే మేఘా ఆకాష్‌కు కోలీవుడ్‌లో మరో అవకాశం తలుపు తట్టింది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో మూడు చిత్రాలున్నాయి. తాజాగా మరో అవకాశం వరించింది. ఈ చెన్నై చిన్నది తొలుత టాలీవుడ్ తెరపై మెరవడం మరో విశేషం. తెలుగులో నితిన్‌తో రొమాన్స్ చేసిన లై చిత్రం ఆ మధ్య విడుదలయింది. కోలీవుడ్‌లో గౌతమ్ మీనన్ దృష్టిలో పడి ధనుష్ సరసన 'ఎన్నైనోకి పాయుం తోటా' చిత్రంలో నటిస్తోంది. దాంతో పాటు ఒరుపక్క కథై, వర్మ చిత్రాలలో నటిస్తోంది. వీటిలో ఒరుపక్క కథై చిత్ర విడుదల హక్కులను నటుడు విజయ్‌సేతుపతి పొంది త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా తాజాగా నటుడు అధర్వతో డ్యూయెట్లు పాడటానికి రెడీ అవుతోంది. దర్శకుడు కన్నన్ తెరకెక్కించనున్న ఈ చిత్రం త్వరలో సెట్‌పైకి వెళ్లనుందట. దీని గురించి దర్శకుడు తెలుపుతూ ఇందులో నటి మేఘా ఆకాష్ విజువల్ కమ్యునికేషన్ చదివే విద్యార్ధినిగా నటించనుందనీ, ఈ పాత్రకు తనే కరెక్ట్‌గా ఉంటుందని ఎంపిక చేసినట్లు వివరించారు. మొత్తం మీద ఒక్క చిత్రం కూడా తెరపైకి రాకుండానే నాలుగు చిత్రాల అవకాశాలను అందుకుంది మేఘా ఆకాష్. -
1 కాదు... 3 నక్షత్రాలు
‘వన్, టు, త్రీ... రేస్ స్టార్ట్ అవ్వకముందు ఇలానే చెబుతారు. ఇప్పుడు చెబుతున్నది రేస్ గురించి కాదు.. గౌతమ్ మీనన్ తీస్తున్న ‘ధృవనక్షత్రం’ గురించి. ‘ఘర్షణ’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘ఏమాయ చేసావే, ‘సాహసం శ్వాసగా సాగిపో’ వంటి హిట్ చిత్రాలు తీసిన గౌతమ్ ప్రస్తుతం విక్రమ్ హీరోగా తీస్తున్న సినిమా ఇది. విశేషం ఏంటంటే... ఈ సినిమాను ఒకటి కాదు... మూడు భాగాలుగా తీయాలని ఫిక్సయ్యారు. కథ అంత పెద్దది. అందుకేగా ‘బాహుబలి’ని కూడా రెండు భాగాలుగా తీశారు. ఒకే సినిమాలో కథ మొత్తం చెప్పలేకపోతే... ఇలా పార్టులు ప్లాన్ చేస్తారు. ప్రస్తుతం ‘ధృవనక్షత్రం’ ఫస్ట్ పార్ట్ రూపొందుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో మొదటి భాగాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. సెకండ్, థర్డ్ పార్ట్‌లకు పెద్ద గ్యాప్ తీసుకోకుండానే తెరపైకి తెస్తారట. కథ విషయానికి వస్తే.. పదిమంది కలిసి మేము సైతం అంటూ ఒక టీమ్‌గా స్టార్ట్ అయ్యి దేశాన్ని ఓ పెద్ద ప్రమాదం నుంచి ఎలా కాపాడారు? అనే కథాంశంతో రూపొందుతోందని సమాచారం. సో.. దేశభక్తి సినిమా కావచ్చు. -
ఆయన నటిస్తే బాగుంటుందని భావించా!
కోలీవుడ్‌లో ప్రామిసింగ్ దర్శకుల్లో గౌతమ్ మీనన్ ఒకరు. తన చిత్రాల్లో ఏదో ఒక సన్నివేశంలో నటుడిగా మెరిసే ఈయనకు ఇటీవల ఇతర చిత్రాల్లోనూ నటించే అవకాశాలు తలుపుతడుతున్నాయి. ఒక పక్క విక్రమ్ కథానాయకుడిగా తెరకెక్కిస్తున్న ధ్రువనక్షత్రం చిత్రంతో బిజీగా ఉన్నా తన మనసును హత్తుకునే పాత్రల్లో నటించడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. అలా తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం గోలీ సోడా–2. ఇంతకు ముందు వచ్చిన గోలీసోడా చిన్న చిత్రంగా రూపొంది సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం గోలీ సోడా–2. గోలీసోడా చిత్రంతో మెగా ఫోన్ పట్టిన ప్రముఖ ఛాయాగ్రాహకుడు విజయ్‌మిల్టన్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ఇది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు ఓవర్ వాయిస్ ఇచ్చిన దర్శకుడు గౌతమ్ మీనన్ ఇప్పుడు ఇదే చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. చిత్ర దర్శకుడు విజయ్‌మిల్టన్ వివరిస్తూ నిజం చెప్పాలంటే ఈ చిత్రం కథ రాస్తున్నప్పుడే ఇందులోని ఒక పాత్రను దర్శకుడు గౌతమ్‌మీనన్ చేస్తే బాగుంటుందని భావించానన్నారు. కథను ఆయనకు వినిపించి అందులో పాత్రలో నటిం చమని కోరగా వెంటనే అంగీకరించారని అన్నారు. ఆయనది గౌరవ పాత్రే అయినా కథకు చాలా కీలకంగా ఉంటుందన్నారు. అదే విధంగా ఈ పాత్ర ఆయన యథార్థ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుందని అన్నారు. గోలీసోడా–2 చిత్రంలో దర్శకుడు గౌతమ్‌మీనన్ నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రాన్ని విజయ్‌మిల్టన్ సోదరుడు భరత్సినీ తన రఫ్‌నోట్ పతాకంపై నిర్మిస్తున్నారన్నది గమనార్హం. -
నక్షత్రం హీరోతో గౌతమ్ మీనన్..!
సౌత్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ నిర్మాతగానూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ కార్తీక్ నరేన్ (డి 16 ఫేం) దర్శకుడిగా నరగసూరన్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగులో నరకాసురుడు పేరుతో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో టాలీవుడ్ యువ నటుడు సందీప్ కిషన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మానగరం సినిమాతో కోలీవుడ్ సినీ జనాల దృష్టిని ఆకర్షించిన సందీప్ కిషన్ తమిళ నాట బిజీ అవుతున్నాడు. నరకాసురుడు తరువాత సందీప్ కిషన్ హీరోగా మరో సినిమాను నిర్మించే ఆలోచనలో ఉన్నాడు గౌతమ్ మీనన్. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమా తెలుగు, తమిళ తెరకెక్కనుంది. నటుడిగా మంచి మార్కులు సాధిస్తున్నా.. సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్న సందీప్.. గౌతమ్ మీనన్ సినిమాల మీదే ఆశలు పెట్టుకున్నాడు. -
సమయం దగ్గర పడుతోంది మిత్రమా..!
సమయం దగ్గర పడింది మిత్రమా ఇంకా 30 రోజులే అంటున్నారు దర్శకుడు గౌతమ్‌మీనన్. ఇంతకీ దేని గురించి ఆయన చెబుతున్నది. ఇంకా దేని గురించి ఆయన తాజా చిత్రం ధ్రువనక్షత్రం గురించే. విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా కోలివుడ్ నాయకి రీతువర్మ ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్ర షూటింగ్ మొదటి నుంచి పలు ఒడిదుడుకులను ఎదుర్కొని ఎట్టకేలకు గాడిన పడిందనే చెప్పాలి. ఇటీవలే బల్గేరియాలో చిత్రీకరణను పూర్తి చేసుకుని చిత్ర యూనిట్ చెన్నైకి తిరిగొచ్చింది. ధ్రువనక్షత్రం చిత్రం ఎంతవరకు పూర్తి అయ్యింది, ఇంకా ఎంత చిత్రీకరణ జరుపుకోవలిసి ఉంది అన్న ఆసక్తి చాలా మంది ప్రేక్షకుల్లో నెలకొంది. అలాంటి వారి సందేహాలను నివృత్తి చేయడానికేమో దర్శకుడు గౌతమ్‌మీనన్ చిత్రీకరణకు ఇంకా 30 రోజులే మిగిలి ఉంది. త్వరలోనే తదుపరి షెడ్యూల్‌కు సిద్ధం అవుతున్నాం అని తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అందులో భాగంగా రెండు చిత్ర పోటోలను కూడా విడుదల చేశారు. ధ్రువనక్షత్రం చిత్రానికి సంబంధించిన ఎడిటింగ్ తదితర పోస్ట్ పొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయట. -
స్టార్ హీరో సినిమా ఆగిపోయింది..!
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్, క్రియేటివ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ధృవ నక్షత్రం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా ఇటీవలే రిలీజ్ అయ్యింది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందన్న ప్రచారం జరుగుతోంది. షూటింగ్ సమయంలో గౌతమ్ మీనన్ కథలో మార్పులు చేయటం నచ్చని విక్రమ్.. షూటింగ్ ఆపేశాడన్న టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది జనవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించిన గౌతమ్ మీనన్... ఇప్పటికీ షూట్ చేస్తూనే ఉన్నాడు. అసలు ఈ ధృవనక్షత్రం కథను ముందుగా మహేష్ బాబుకు వినిపించాడు. తరువాత హీరో సూర్యతో చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించాడు. చివరి నిమిషంలో సూర్య తప్పుకోవటంతో విక్రమ్ హీరోగా సినిమా స్టార్ట్ చేశాడు. జేమ్స్ బాండ్ తరహా కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం విక్రమ్ డిఫరెంట్ లుక్‌లోకి మారిపోయాడు. అయితే గౌతమ్ మీనన్.. షూటింగ్ సగానికి పైగా పూర్తయిన తరువాత కథలో మార్పులు చేస్తుండటంతో అది నచ్చని విక్రమ్ ధృవనక్షత్రం సినిమాను పక్కన పెట్టేశాడట. ఈ సినిమా కోసం ఇచ్చిన డేట్స్‌ను స్కెచ్ షూటింగ్ పూర్తి చేసేందుకు కేటాయించాడు. గతంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కిన సాహసం శ్వాసగా సాగిపో సినిమా సమయంలో కూడా గౌతమ్ మీనన్ ఇలాగే చేశాడు. సినిమా షూటింగ్ సగం పూర్తయిన తరువాత క్లైమాక్స్‌ను కొత్తగా రాసి షూటింగ్ కంప్లీట్ చేశాడు. దీంతో సినిమా ఆలస్యమయ్యింది. -
క్యారెక్టర్స్ మార్చుకున్న సౌత్ స్టార్స్
ఇరుముగన్ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన చియాన్ విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ధృవ నక్షత్రం. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో విక్రమ్ డిఫరెంట్ లుక్ లో అలరించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు టీజర్స్ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నాయి. అయితే రెండు టీజర్స్ లోనూ విలన్ ఎవరన్నది రివీల్ చేయలేదు. విలన్ వాయిస్ ను మాత్రమే ప్రజెంట్ చేశారు. అయితే టీజర్ లో వినిపిస్తున్న విలన్ వాయిస్ మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ దే.. అన్న ప్రచారం జరుగుతోంది. గౌతమ్ మీనన్, విక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాలో పృథ్విరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడన్న వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అయితే అది విలన్ రోల్ అని మాత్రం రివీల్ చేయలదే. టీజర్ లో వాయిస్ ని బట్టి పృథ్వి చేస్తున్నది విలన్ రోల్ అని ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్. గతంలో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన విలన్ సినిమా కోసం పృథ్విరాజ్ హీరోగా నటించగా విక్రమ్ విలన్ గా అలరించాడు. ఇప్పుడు మరో ఆ ఇద్దరు నటులు తమ పాత్రలను మార్చుకొని విక్రమ్ హీరోగా పృథ్విరాజ్ విలన్ గా నటిస్తుండటంతో ధృవ నక్షత్రం సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
విక్రమ్‌తో మిల్కీబ్యూటీ రొమాన్స్
మిల్కీబ్యూటీ తమన్నా సియాన్ విక్రమ్‌తో పాండిచ్చేరిలో రొమాన్స్ చేస్తోంది. నటుడు విక్రమ్ ఏక కాలంలో రెండు చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న ధ్రువనక్షత్రం. ఆ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక రెండో చిత్రం స్కెచ్ (ఈ టైటిల్‌ను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు). వాలు చిత్రం ఫేమ్ విజయ్‌చందర్ దర్శకత్వం వహిస్తున్న ఇందులో విక్రమ్‌కు జంటగా నటి తమన్నా తొలిసారిగా జత కడుతున్నారు. ఈ చిత్ర షూటింగ్ స్థానిక పెరంబూర్ సమీపంలోని బిన్నివిుల్లులో ప్రత్యేకంగా వేసిన సెట్లో నెల రోజుల పాటు జరుపుకుంది. ఈ సెట్లో విక్రమ్‌కు సంబంధించిన ముఖ్య సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించారు. ఈ నెల ఒకటవ తేదీన చిత్ర యూనిట్ పాండిచ్చేరిలో మకాం పెట్టింది. అక్కడ విక్రమ్, తమన్నాలకు సంబంధించిన రొమాన్స్ సన్నివేశాలను సముద్రతీరంలో చిత్రీకరిస్తున్నారని తెలిసింది. పాండిచ్చేరిలో చిత్రీకరణ పూర్తి చేసుకున్న తరువాత విక్రమ్, తమన్నా ఆడి పాడే పాట చిత్రీకరణ కోసం బ్యాంకాంగ్ పయనానికి చిత్ర యూనిట్ సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. ఈ చిత్ర కథ ఉత్తర చెన్నై నేపథ్యంలో జరుగుతుందట. జెమిని చిత్రంలోని మాస్ పాట తరహాలో విక్రమ్ ఈ చిత్రంలోనూ దుమ్మురేపనున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. ఈ రెండు చిత్రాలను పూర్తి చేసి హరి దర్శకత్వంలో సామి–2కు విక్రమ్ రెడీ అవుతున్నారన్నది గమనార్హం. ఇందులో ఆయనతో మరో సారి చెన్నై చిన్నది త్రిష జత కట్టనున్నారు. -
పుల్లకూర ఆవకాయ ఢీ!
ఢీ... ఢీ... ఢీ... డిమాండ్. మన ఆవకాయలాగా ఇప్పుడు తెలుగు సినిమాను కూడా లొట్టలేసుకుని రీమేక్ చేస్తున్నారు. ఇంతకు ముందు పొరుగింటి పుల్లకూర తెచ్చుకుని మనం ఎన్నోసార్లు పప్పులో కాలేశాం. రీమేకులు అబౌట్ టర్న్ కొట్టాయి. వాళ్ల సినిమాలను మనం తీయడం కాదు... మన సినిమాలను ఇప్పుడు వాళ్లందరూ తీస్తున్నారు. నానా పటేకర్ బిర్యాని వడ్డిస్తారు నాటుకోడి పలావ్... ఎండుచేప వేపుడు.. పులస ఇగురు... హైదరాబాదీ దమ్ బిర్యాని... ఒక్కొక్కరికి ఒక్కో ఐటమ్ నచ్చుతుంది. ఎవరి టేస్ట్ వాళ్లది. దర్శకుడిగా నటుడు ప్రకాశ్‌రాజ్‌ది డిఫరెంట్ టేస్ట్. ‘ధోని’, ‘ఉలవచారు బిర్యాని’, ‘మన ఊరి రామాయణం’ సినిమాల్లో ప్రకాశ్‌రాజ్ టేస్ట్ తెలుస్తుంది. ఈ టేస్ట్ హిందీ నటుడు నానా పటేకర్‌కు నచ్చినట్టుంది. ఉత్తరాది ప్రేక్షకులకు రుచి చూపించాలని ‘ఉలవచారు బిర్యాని’ని హిందీలో ‘తడ్కా’గా రీమేక్ చేస్తున్నారు. నానా పటేకర్‌కు అంతగా నచ్చిన ఈ సినిమాలో ఏముందని అడిగితే 45 ఏళ్ల లేటు వయసులో ఓ వ్యక్తి ఫోనులో పరిచయమైన అమ్మాయితో ప్రేమలో పడతాడు. కానీ, వయసును సాకుగా చూపించి, ఆ అమ్మాయి ఎక్కడ వదిలేస్తుందోననే భయంతో నేరుగా కలవాల్సిన టైమ్ వచ్చినప్పుడు మేనల్లుణ్ణి పంపిస్తాడు. ఆ అమ్మాయికీ వయసు ఎక్కువే. దాంతో స్నేహితురాల్ని పంపిస్తుంది. వీళ్లిద్దరూ ప్రేమలో పడతారు. కానీ, నలుగురిలో తప్పు చేస్తున్నామనే ఫీలింగ్. దాంతో రెండు ప్రేమ జంటల మధ్య దూరం పెరుగుతుంది. తర్వాత వాళ్లు ఎలా కలిశారు? అనేది సినిమా. ప్రకాశ్‌రాజ్ ముఖ్య పాత్రలో నటించడంతో పాటు ప్రతి సన్నివేశాన్ని హృద్యంగా తెరకెక్కించారు. ఇప్పుడీ సినిమా హిందీ రీమేక్‌లో ప్రకాశ్‌రాజ్ పాత్రను నానా పటేకర్, స్నేహ పాత్రను శ్రియ, సంయుక్త పాత్రను తాప్సీ చేస్తున్నారు. ‘తడ్కా’కు ప్రకాశ్‌రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. నిజం చెప్పాలంటే మలయాళ హిట్ ‘సాల్ట్ అండ్ పెప్పర్’కు ‘ఉలవచారు బిర్యాని’ రీమేక్. కానీ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా చాలా మార్పులు చేశారు. సంజయ్ దత్ ‘ప్రస్థానం’ దేవా కట్టా తీసిన ‘ప్రస్థానం’లో కథతో పాటు నడిచే పాత్రలు తప్ప హీరోలు, విలన్లు ఉండదు. ఈ కథలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ రాజకీయ నాయకుడు ‘నేను చనిపోతే నా పిల్లలకు (కొడుకు, కుమార్తె) తండ్రిగా, నా తండ్రికి కొడుకుగా, ఊరి నాయకుడిగా నా స్థానంలో నిలబడతావా?’ అని అనుచరుణ్ణి అడుగుతాడు. నాయకుడు కావాలనే ఆశతో ఉన్న అనుచరుడు అలాగే అని అంగీకరించి ప్రాణాలు నిలబెట్టే అవకాశం ఉన్నా అతణ్ణి చంపేస్తాడు. నాయకుడి భార్యను పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తండ్రి అవుతాడు. నాయకుడిగా ఎదుగుతాడు. కొన్నేళ్ల తర్వాత సవతి కొడుకుల మధ్య నాయకత్వ పోరు మొదలవుతుంది. అప్పుడు తండ్రిగా అతను ఏం చేశాడు? కన్న కొడుకును ఎక్కువగా చూసుకున్నాడా? కన్న కొడుకులా పెంచిన నాయకుడి బిడ్డను ఎక్కువగా చూసుకున్నాడా? అనేది మహాభారతాన్ని తలపిస్తుంది. సాయికుమార్, శర్వానంద్‌ల నటన, వాళ్లిద్దరి మధ్య సీన్స్, కథ ప్రేక్షకులను కదిలించాయి. ఆ ప్రేక్షకుల్లో బాలీవుడ్ ‘ఖల్ నాయక్’ సంజయ్‌దత్ కూడా ఉన్నారు. అందుకే, ఈ సినిమా హిందీ రీమేక్‌లో నటించి, నిర్మించడానికి ముందుకొచ్చారు. హిందీ వెర్షన్‌కూ దేవా కట్టా దర్శకత్వం వహిస్తారు. అక్టోబర్‌లో చిత్రీకరణ ప్రారంభిస్తారట! సాయికుమార్ పాత్రను హిందీలో సంజయ్ చేయనున్నారు. తెలుగులో విడుదలైన ఐదేళ్ల తర్వాత హిందీలో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారంటే కథలో ఎంత దమ్ముందో అర్థం చేసుకోవచ్చు. ‘‘తెలుగులో మంచి కథలు వస్తున్నాయి. చిన్నోళ్ల దగ్గర్నుంచి పెద్దోళ్ల వరకూ హీరోలందరూ మారుతున్నారు. స్క్రీన్‌ప్లే బేస్డ్, క్యారెక్టర్ బేస్డ్, స్టోరీ బేస్డ్ సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ సినిమాలు టీవీ, ఇంటర్నెట్ వల్ల పల్లెటూరి వరకూ చేరుతున్నాయి. అవి చూసిన ప్రేక్షకుల అభిరుచి మారుతోంది. అందుకు తగ్గట్టు మన దర్శక–రచయితలు కొత్త కథలతో వస్తున్నారు’’ – దేవా కట్టా చెన్నైలో ‘పెళ్లి చూపులు’ తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ ప్రతి సినిమా తెలుగులో డబ్బింగ్ అవుతుంది. ఆయన సినిమాలకు తెలుగులో బోలెడంత మంది అభిమానులున్నారు. కానీ, ఓ చిన్న తెలుగు సినిమా చూసిన గౌతమ్ మీనన్ ఆ సినిమాకు అభిమాని అయ్యారు. ఆయన అభిమానం ఎంతంటే... తానే నిర్మాతగా తమిళంలో రీమేక్ చేసేంత. గౌతమ్ మనసు దోచుకున్న ఆ సినిమా ‘పెళ్లి చూపులు’. ఇందులో ఏముందని అడిగితే... ఏం లేదు. పెళ్లి చూపులకు ఓ ఇంటికి వెళ్లబోయిన ఓ యువకుడు, మరో అమ్మాయి ఇంటికి వెళతాడు. ఇది తెలిసి వచ్చేద్దామంటే.. రూమ్ లాక్ పడుతుంది. ఈలోపు ఒకరి ఇష్టాలు మరొకరు తెలుసుకుంటారు. బద్ధకస్తుడైన అబ్బాయి షెఫ్ కావాలనుకుంటాడు. అమ్మాయి ఫుడ్ ట్రక్ బిజినెస్ చేయాలనుకుంటుంది. ఇద్దరూ కలసి ఫుడ్ ట్రక్ స్టార్ట్ చేస్తారు. ప్రేమలో పడతారు. పెళ్లి చేసుకోవడమే తరువాయి అనుకున్నప్పుడు ఇద్దరి దారులు వేరవుతాయి. మళ్లీ ఎలా కలిశారు? అనేది కథ. చెప్పుకోవడానికి చాలా సింపుల్ కథే. కానీ, దర్శకుడు తరుణ్ భాస్కర్ సహజత్వానికి దగ్గరగా... యువతీయువకులు తమ కథే అనుకునేలా తీశారు. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ అద్భుతంగా నటించారు. ‘పెళ్లిచూపులు’ తమిళ రీమేక్ ‘పొన్ ఒండ్రు కండేన్’లో తమన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. రణవీర్‌తో దయాగాడి దండయాత్ర ‘ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం. అదే ఒకడు మీదడిపోతే దండయాత్ర. ఇది దయాగాడి దండయాత్ర’ – ‘టెంపర్’లో ఈ డైలాగూ, సినిమా... రెండూ సూపర్‌హిట్టే. ఈ సినిమా కథేంటంటే అవినీతికి కేరాఫ్ అడ్రస్ లాంటోడు ఇన్స్పెక్టర్ దయా. ఎదుటోడు ఎంత పెద్ద దారుణం చేసినా లంచం అందుకుని వదిలేస్తాడు. అలాంటోడు అనూహ్యంగా నిజాయితీపరుడిగా ఎలా మారిపోతాడనేది సినిమా. నిర్భయ ఘటన స్ఫూర్తితో ఈ సినిమా తీశారు. రేప్ చేసినోళ్లలో నేనూ ఒకణ్ణి అని క్లైమాక్స్‌లో హీరో ఉరిశిక్షకు సిద్ధపడే సీన్‌ను ఎన్టీఆర్ వంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో అంగీకరించడం ఓ సాహసమే. హీరోని నెగిటివ్ షేడ్స్‌లో చూపిస్తూ హీరోయిజమ్‌ను ముందుకు తీసుకువెళ్లిన దర్శకుడు పూరి జగన్నాథ్ గట్స్‌ను మెచ్చుకోకుండా ఉండలేం. నటనతో ఎన్టీఆర్... సూపర్ టేకింగ్, బుల్లెట్స్ లాంటి డైలాగులతో దర్శకుడు పూరి చేసిన ఈ దండయాత్రకు బాక్సాఫీస్ బద్దలయింది. కమర్షియల్ సినిమాకు కావల్సిన సరుకులన్నీ ఇందులో ఉన్నాయి. సౌత్ సినిమాలను బాగా ఇష్టపడే హిందీ దర్శకుడు రోహిత్ శెట్టి ఇప్పుడీ సరుకును ముంబై తీసుకువెళ్తున్నారు. రణవీర్ సింగ్ హీరోగా హిందీలో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో హీరోయిన్గా నటించిన కాజల్ అగర్వాల్‌నే హిందీ ‘టెంపర్’లో హీరోయిన్గా ఎంపిక చేశారట! రోహిత్‌శెట్టి తీసిన ‘బోల్ బచ్చన్’ తెలుగులో ‘మసాలా’గా రీమేక్ అయింది. ఇప్పుడాయన ఓ తెలుగు సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి రెడీ అయ్యారు. ఇది మనకు గర్వకారణమే. ‘అభిషేక్ బచ్చన్ హీరోగా ‘టెంపర్’ను హిందీలో రీమేక్ చేయాలనుకున్నా. ‘ఎన్టీఆర్‌లా నేను నటించలేను’ అన్నారు అభిషేక్. ఇప్పుడు రణవీర్ సింగ్ హీరోగా రోహిత్‌శెట్టి రీమేక్ చేస్తున్నారు. ముంబయ్ వెళ్లి హిందీ సినిమా తీయడం పెద్ద కష్టం కాదు. హిందీ హీరోలు మనతో సినిమాలు చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. సౌత్ కథలను ఇష్టపడుతున్నారు. కానీ ఓ సినిమా పట్టాలు ఎక్కడానికి మూణ్ణాలుగు నెలలు టైమ్ పడుతుంది. ఆల్రెడీ నాకు ఇక్కడ ఉన్న కమిట్మెంట్స్ వల్ల కుదరడం లేదు’ – పూరి జగన్నాథ్. లిస్టులో మరికొన్ని.... ►నాగార్జున హీరోగా కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ను తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితుడైన హీరో ఉపేంద్ర కన్నడంలో రీమేక్ చేయాలనుకుంటున్నారు. ‘మన్మథుడు’, ‘కృష్ణ’ వంటి పలు తెలుగు సినిమాలను ఆయన కన్నడంలో రీమేక్ చేశారు. ►ఎన్టీఆర్–పూరి జగన్నాథ్‌ల ‘టెంపర్’ తమిళంలో కూడా రీమేక్ అవుతోంది. ‘టెంపర్’ తమిళ రీమేక్‌లో విశాల్ హీరోగా నటించనున్నారు. ►నిఖిల్ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’. పెద్ద నోట్లు రద్దయిన టైమ్‌లో విడుదలై మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రాన్ని అర్జున్ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా హిందీలో రీమేక్ చేయడానికి వీఐ ఆనంద్ ప్రయత్నిస్తున్నారు. తమిళ, కన్నడ భాషల్లోనూ రీమేక్ కానుంది. ►నందమూరి కల్యాణ్‌రామ్ ‘పటాస్’ను తమిళంలో రాఘవా లారెన్స్ హీరోగా ‘మొట్ట శివ కెట్ట శివ’ పేరుతో సూపర్‌గుడ్ ఫిల్మ్స్ రీమేక్ చేసింది. ఈ నెల 9న ఈ సినిమా విడుదలైంది. ►ఇవే కాదు... మరికొన్ని సూపర్‌హిట్ తెలుగు సినిమాలను ఇతర భాషల హీరోలు, దర్శక–నిర్మాతలు రీమేక్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు! -
రీమేక్ సినిమాకు ఇంట్రస్టింగ్ ఫస్ట్ లుక్
గత ఏడాది టాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన చిన్న సినిమా పెళ్లిచూపులు. రాజ్ కందుకూరి నిర్మాణంలో తరుణ్ భాస్కర్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రీతూవర్మలు హీరో హీరోయిన్లుగా నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెళ్లిచూపులు ఘనవిజయం సాధించటంతో ఇతర ఇండస్ట్రీల నుంచి రీమేక్ హక్కుల కోసం భారీ ఆఫర్లు వచ్చాయి. ఫైనల్ గా తమిళ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్న స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఇప్పటినుంచే ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టాడు. విష్ణు విశాల్, తమన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కార్టూన్ లా డిజైన్ చేశారు. సినిమా థీమ్ కు తగ్గట్టుగా మొబైల్ క్యాంటీన్ ముందు హీరో హీరోయిన్ల కార్టూన్ బొమ్మలతో రిలీజ్ చేసిన ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తమిళలో 'పొన్ ఒరు కండేన్' ( ఒక అమ్మాయిని చూశా) పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సెంథిల్ వీరాస్వామి దర్శకుడు. -
మళ్లీ జోడీ కడతారా?
ఒక క్రేజీ జంటను సెట్ చేయడం అంత సులభం కాదు. నటుడు విక్రమ్, నటి నయనతార కలిసి నటించడానికి చాలా ఏళ్లే పట్టిందన్న సంగతి తెలిసిందే. చిన్న ఈగోనే ఇందుకు కారణం అనే ప్రచారం జోరుగా సాగింది. అలాంటిది ఎట్టకేలకు ఇరుముగన్ చిత్రంలో వీరి జత కుదిరింది.చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. మరోసారి ఈ హిట్ పెయిర్‌తో చిత్రం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. అందుకోసం దర్శకుడు గౌతమ్‌మీనన్ చాలా ప్రయత్నిస్తున్నారనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. శింబు హీరోగా అచ్చయం ఎన్భదు మడమైయడా చిత్రాన్ని తెరకెక్కించిన గౌతమ్‌మీనన్ తాజాగా ధనుష్‌తో ఇన్నై నోక్కి పాయుం తోటా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. విక్రమ్ హీరోగా ధ్రువనక్షత్రం అనే చిత్రాన్ని చేయనున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. నిజానికి ఈ చిత్రం ఈ నెల రెండవ తేదీనే సెట్‌పైకి రావలసింది. కానీ అలా జరగలేదు. తాజా సమాచారం ఏమిటంటే ఇందులో విక్రమ్‌కు జంటగా నటి నయనతారను నటింపజేయాలని దర్శకుడు భావించారట.ఆ విషయమై నయనతారను సంప్రదించగా తను డిమాండ్ చేసిన పారితోషికం దర్శకుడు గౌతమ్‌మీనన్ కు ముచ్చెమటలు పట్టించిందని టాక్. అయినా ధ్రువనక్షత్రంలో నాయకి పాత్రకు నయనతారనే కరెక్ట్ అని భావించిన దర్శకుడు ఆమెను పారితోషికాన్ని తగ్గించుకోమని రిక్వెస్ట్ చేసే పనిలో ఉన్నారట. అయితే ప్రస్తుతం లేడీఓరియెంటెడ్ చిత్రాలు, యువ హీరోలతో చిత్రాలు అంటూ యమ బిజీగా ఉన్న టాప్ నాయకి నయనతార గౌతమ్‌మీనన్ కోసం దిగి వచ్చి తన పారితోషికాన్ని తగ్గించుకుంటారా? మళ్లీ విక్రమ్‌తో జోడీ కుదురుతుందా? అన్నది వేచి చూడాల్సిందే. ధ్రువనక్షత్రం చిత్రం అనుకున్నట్లు ప్రారంభం కాకుండా జాప్యం జరగడంతో అసహనానికి గురైన విక్రమ్ దుబాయ్‌కి చెక్కేసారని కోలీవుడ్‌లో టాక్. త్వరలో చిత్రం ప్రారంభం అయ్యిందా సరే. లేకుంటే ఈ నెల 26వ తేదీ నుంచి వాలు చిత్రం ఫేమ్ విజయ్‌చందర్ దర్శకత్వంలో నటించనున్న చిత్రానికి రెడీ అవుతారని సమాచారం. -
ప్రేమమ్ హీరోతో 'పెళ్లిచూపులు'
ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై ఘనవిజయం నమోదు చేసిన చిత్రం పెళ్లిచూపులు. తరుణ్ భాసర్క్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రీతూవర్మ జంటగా తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాదించటంతో ఇతర భాషల నుంచి భారీగా రీమేక్ ఆఫర్స్ వచ్చాయి. ఇప్పటికే హిందీతో పాటు దక్షిణాది భాషలన్నింటిలో పెళ్లి చూపులు రీమేక్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. అన్ని భాషల్లో స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ సినిమా రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నారు. దక్షిణాదిలో ఈ సినిమా రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్, ప్రేమమ్ ఫేం నివీన్ పౌలీ హీరోగా రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు. నివీన్ మలయాళ స్టార్ కావటంతో తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించనున్నాడు. ప్రేమమ్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న నివీన్, పెళ్లి చూపులు రీమేక్‌తో మరోసారి మ్యాజిక్ రిపీట్ చేస్తాడని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. -
ఇప్పుడు టైమొచ్చింది!
ఏ కాంబినేషన్ ఎప్పుడు కుదురుతుందో ఎవరూ ఊహించలేం. ఫలానా హీరోతో సినిమా చేయాలని ఓ దర్శకుడూ... ఆ దర్శకుడితో సినిమా చేయాలనీ ఆ హీరో ఎంతగా ప్రయత్నించినా ఒక్కోసారి అంత త్వరగా సెట్ కాదు. హీరో విక్రమ్ - దర్శకుడు గౌతమ్ మీనన్‌లు ఈ కోవకే వస్తారు. వీళ్లిద్దరూ ఎప్పట్నుంచో కలసి సినిమా చేయాలనుకుంటున్నారు కానీ కుదరడం లేదు. ఈసారి అంతా సెట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల విక్రమ్‌కి గౌతమ్ మీనన్ ఓ కథ చెప్పారట. ఆ కథ ఈ విలక్షణ హీరోకి నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ విషయం గురించి గౌతమ్ మీనన్ మాట్లాడుతూ - ‘‘నా మొదటి సినిమా అప్పటి నుంచి విక్రమ్‌తో సినిమా చేయాలనుకుంటున్నా. మేం చాలాసార్లు కలిశాం. పలు కథల గురించి చర్చించుకున్నాం. మన ప్రయత్నాలు సఫలం కావాలంటే రైట్ టైమ్ రావాలనే ఫిలాసఫీని నమ్ముతాను. ఆ టైమ్ ఇప్పుడు వచ్చేసిందనిపిస్తోంది. విక్రమ్‌కి నేను చెప్పిన స్టోరీ ఐడియా నచ్చి, పది రోజుల్లో ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటిద్దామని అన్నాడు’’ అని పేర్కొన్నారు. ఇది ఇలా ఉంటే సూర్య హీరోగా గౌతమ్ ‘ధ్రువ నక్షత్రమ్’ పేరుతో ఓ సినిమా తీయాలనుకున్నారు. ముహూర్తం జరిగినా, ఆ స్క్రిప్ట్ సినిమాగా రాలేదు. ఇప్పుడు విక్రమ్‌తో గౌతమ్ చేయనున్నది ఆ స్క్రిప్టేనని ఓ టాక్. -
చైతూతో తమిళ సినిమా తీస్తా!
‘‘చైతూ (నాగచైతన్య)కి తమిళ్ బాగా వచ్చు. మంచి పర్సనాలిటీ ఉన్న హీరో. అతణ్ణి తమిళ సినీపరిశ్రమకి నేనే పరిచయం చేస్తా. చైతూ హీరోగా తమిళ సినిమా తీస్తా’’ అన్నారు గౌతమ్ మీనన్. నాగచైతన్య, మంజిమా మోహన్ జంటగా ఆయన దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ ఈ నెల 11న విడుదలైంది. గౌతమ్ మీనన్ మాట్లాడుతూ - ‘‘ఈ సినిమాతో చైతూ మాస్ హీరోగా కూడా ఎదిగాడు. ‘ఏ మాయ చేసావె’కీ, ఇప్పటికీ నటుడిగా ఎంతో పరిణతి చెందాడు. రవీందర్‌రెడ్డి చాలా తపన ఉన్న నిర్మాత. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనతో హ్యాపీగా ఉన్నా. ‘మంచి లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్’ అంటూ ఎంజాయ్ చేస్తున్నారు. నోట్ల మార్పిడి ప్రభావం కొంత ఉన్నప్పటికీ, వసూళ్లు బాగున్నాయి. ప్రస్తుతం ధనుష్ హీరోగా నేను చేస్తున్న సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇది కాకుండా.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నా. తెలుగు వెర్షన్‌కి హీరోగా చైతూని అనుకున్నా. దీంతో పాటు విక్రమ్‌తో మరో సినిమా కూడా చర్చల దశలో ఉంది’’ అన్నారు. -
'సాహసం శ్వాసగా సాగిపో' మూవీ రివ్యూ
టైటిల్ : సాహసం శ్వాసగా సాగిపో జానర్ : రొమాంటిక్ థ్రిల్లర్ తారాగణం : నాగచైతన్య, మంజిమా మోహన్, బాబాసెహగల్, సతీష్ కృష్ణన్ సంగీతం : ఏ ఆర్ రెహమాన్ దర్శకత్వం : గౌతమ్ మీనన్ నిర్మాత : మిర్యాల రవీందర్ రెడ్డి ప్రేమమ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నాగచైతన్య హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సాహసం శ్వాసగా సాగిపో. ఈ ప్రేమమ్ కన్నా ముందే రిలీజ్ కావాల్సి ఉన్నా తమిళ వర్షన్ షూటింగ్ ఆలస్యం కావటంతో వాయిదా పడుతూ వచ్చింది. అయితే గతంలో గౌతమ్ మీనన్, నాగచైతన్య కాంబినేషన్లో వచ్చిన ఏంమాయ చేసావే ఘనవిజయం సాధించటంతో సాహసం శ్వాసగా సాగిపో సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా.. కథ : రజనీకాంత్ మురళీధర్ (నాగచైతన్య).. ఇంజనీరింగ్ పూర్తి చేసి సరైన ఉద్యోగం రాకపోవటంతో ఎంబిఏ చేస్తూ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తుంటాడు. అదే సమయంలో తన చెల్లెలి కాలేజ్ ఫంక్షన్లో లీలా సత్యమూర్తి(మంజిమా మోహన్) అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. తరువాత అదే అమ్మాయి కోర్సు చేయటం కోసం తన చెల్లితో కలిసి తన ఇంట్లోనే ఉండటంతో మరింత ఆనందపడిపోతాడు. కొద్ది రోజుల్లోనే లీలాతో రజనీకాంత్‌కు మంచి పరిచయం ఏర్పడుతుంది. అదే సమయంలో తాను కన్యాకుమారిలో సూర్యోదయం చూడటానికి బైక్ మీద వెళుతున్న విషయం లీలాతో చెప్తాడు రజనీకాంత్. లీలా కూడా రజనీకాంత్‌తో కలిసి కన్యాకుమారి బయలుదేరుతుంది. ఈ జర్నీలో ఇద్దరూ మరింత దగ్గరవుతారు. కన్యాకుమారి నుంచి తిరిగి వచ్చే సమయంలో అనుకోకుండా వాళ్ల బైక్‌కు యాక్సిడెంట్ అవుతుంది. ఇక తను బతకనేమో అన్న భయంతో లీలాతో తాను ప్రేమిస్తున్న విషయం చెప్పేస్తాడు రజనీకాంత్. తరువాత కళ్లు తెరిచే చూసేసరికి ఆస్పిటల్లో ఉంటాడు లీల తనతో ఉండదు. మూడు రోజుల తరువాత హస్పిటల్‌కు ఫోన్ చేసిన లీలా, తమ కుటుంబం ప్రమాదంలో ఉందని, బైక్ యాక్సిడెంట్ కూడా తనను చంపాడానికి కావాలని చేయించిందే అని చెపుతుంది. దీంతో తన ప్రేమించిన అమ్మాయికి తోడుగా నిలబడాలన్న ఆలోచనతో లీలా కోసం బయలుదేరుతాడు రజనీకాంత్. అప్పటికే లీలా తల్లిదండ్రుల మీద హత్యా ప్రయత్నం జరగటంలో వాళ్లు హాస్పిటల్లో ఉంటారు. నాగచైతన్య అక్కడ చేరుకున్న తరువాత మరోసారి లీలా, ఆమె కుటుంబం మీద ఎటాక్ జరుగుతుంది. మొదటి అప్పుడు చైతూ కాపాడిన తరువాత జరిగిన ఎటాక్‌లో లీలా కుటుంబంతో పాటు రజనీకాంత్ ఫ్రెండ్ మహేష్ కూడా చనిపోతాడు. దీంతో ఇదంతా అసలు ఎందుకు జరుగుతుంది..? వాళ్లు లీలాను ఎందుకు చంపాలనుకుంటున్నారు..? దీనికి పోలీసులు కూడా ఎందుకు సహకరిస్తున్నారు..? లాంటి విషయాలన్ని తెలుసుకోవాలనుకుంటాడు రజనీకాంత్. అందుకోసం ఏం చేశాడు అన్నదే మిగతా కథ. నటీనటులు : ప్రేమమ్ సక్సెస్‌తో మంచి ఫాంలో ఉన్న నాగచైతన్య, మరోసారి యాక్షన్ హీరోగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అయితే అదే సమయంలో తనకు స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన లవర్ బాయ్ లుక్ లోనూ అలరించాడు. తనకు బాగా అలవాటైన రొమాంటిక్ క్యారెక్టర్లో మరోసారి సూపర్బ్ అనిపించిన చైతూ, ఈ సారి యాక్షన్ హీరోగా కూడా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ పాత్రలో మంజిమా మోహన్ మెప్పించింది. డీసెంట్ లుక్‌లో కనిపిస్తూనే సెకండ్ హాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్‌లో కూడా ఆకట్టుకుంది. నాగచైతన్య ఫ్రెండ్ మహేష్‌గా నటించిన సతీష్ కృష్ణన్, మంచి నటనతో పాటు డ్యాన్సర్ గానూ ప్రూవ్ చేసుకున్నాడు. విలన్‌గా బాబా సెహగల్ తన పరిధి మేరకు ఆకట్టుకున్నాడు. సాంకేతిక నిపుణులు : గతంలో రొమాంటిక్ ఎంటర్టైనర్లు, యాక్షన్ థ్రిల్లర్లు తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్ మీనన్ ఈ సారి రెండు ఒకే సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు. ముందు నుంచి చెపుతున్నట్టుగా ఫస్ట్ హాఫ్ అంతా హర్ట్ టచింగ్ లవ్ స్టోరీతో నడిపించిన గౌతమ్, సెకండ్ హాఫ్‌ను తన మార్క్ థ్రిల్లర్‌గా మలిచాడు. అయితే స్లో నేరేషన్, వెంట వెంటనే వచ్చే పాటలు ఫస్ట్ హాప్లో కాస్త బోర్ కొట్టిస్తాయి. యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారిని సెంకడ్ హాఫ్ కట్టిపడేస్తుంది. బలమైన ప్రతినాయక పాత్ర లేకపోయినా మంచి యాక్షన్ సీన్స్‌తో ఆ లోటును కవర్ చేశాడు దర్శకుడు. మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. సినిమా రిలీజ్‌కు ముందు చకోరి, వెళ్లిపోమాకే పాటలు సూపర్ హిట్ అయ్యాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో సినిమా స్థాయిని పెంచాడు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమాలు స్థాయికి తగట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : నాగచైతన్య ప్రీ క్లైమాక్స్ సంగీతం మైనస్ పాయింట్స్ : ఫస్ట్ హాఫ్ స్లో నేరేషన్ స్ట్రాంగ్ విలన్ లేకపోవటం ఓవరాల్‌గా సాహసం శ్వాసగా సాగిపో.. టిపికల్ గౌతమ్ మీనన్ సినిమాలు ఇష్టపడేవారికి మాత్రం బాగానే కనెక్ట్ అవుతుంది. - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
ఇంకొక్కడు సక్సెస్‌తో జోరు పెంచాడు
కొంతకాలంగా సరైన హిట్స్ లేక ఇబ్బందుల్లో ఉన్న చియాన్ విక్రమ్ ఇప్పుడు స్పీడు పెంచాడు. ఇటీవల ఇరుముగన్ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన చియాన్, అదే జోరును కంటిన్యూ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అందుకే వరుసగా సినిమాలు అంగకీరిస్తూ ఫాం కొనసాగించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం తన నెక్ట్స్ సినిమా కోసం రెడీ అవుతున్న విక్రమ్ మరో రెండు చిత్రాలను లైన్ లో పెట్టాడు. త్వరలో హరి దర్శకత్వంలో సామి సినిమాకు సీక్వల్ ను పట్టాలెక్కించనున్నాడు. ఈ సినిమా తరువాత తన స్వీయ దర్శకత్వంలో హాలీవుడ్ సూపర్ హిట్ సినిమా డోంట్ బ్రీత్ ను రీమేక్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు. ఈ రెండు సినిమాలు లైన్ లో ఉండగానే స్టైలిష్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మరో సినిమాను అంగీకరించాడు. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా 2017లోనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు విక్రమ్. -
యంగ్ హీరో కోసం మరో స్టార్ డైరెక్టర్
స్టార్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా అల్లుడు శీను సినిమాతో భారీగా తెరంగేట్రం చేశాడు శ్రీనివాస్. వివి వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్ తొలి సినిమాకు దర్శకత్వం వహించినా.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. తరువాత స్పీడున్నోడు సినిమాతో మరో ప్రయత్నం చేసినా అది కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. తాజాగా మరో స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు సాయి. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో భారీ ప్రాజెక్ట్‌కు ప్లాన్ చేస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ ఇమేజ్ ఉన్న దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని భావిస్తున్నాడు. ఇప్పటికే బెల్లంకొండ సురేష్, గౌతమ్ మీనన్‌లు కథా చర్చలు కూడా చేసారన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అఫీఫియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. -
మరోసారి తమిళ స్టార్ డైరెక్టర్‌తో నాని
ఘర్షణ, ఏం మాయ చేశావే, రాఘవన్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్. తన ప్రతీ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేసే గౌతమ్ మీనన్, నాగచైతన్య హీరోగా తెరకెక్కిన సాహసం శ్వాసగా సాగిపో సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజాగా మరో టాలీవుడ్ యంగ్ హీరోతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. గతంలో నాని హీరోగా ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాను తెరకెక్కించిన గౌతమ్ మీనన్ మరోసారి అదే హీరోతో సినిమాను ప్లాన్ చేస్తున్నాడట. సాహసం శ్వాసగా సాగిపో సినిమా తరువాత ధనుష్ హీరోగా ఓ సినిమాను రూపొందించిన గౌతమ్, ప్రస్తుతం నాని హీరోగా తెరకెక్కబోయే సినిమా స్క్రిప్ట్ ను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా తమిళ వర్షన్ లో హీరో ఎవరన్న విషయం తెలియాల్సి ఉంది. ఇప్పటికే నాని చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం నేను లోకల్ సినిమాలో నటిస్తున్న నాని ఆ సినిమా తరువాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాతే గౌతమ్ మీనన్ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. -
తమిళులకూ పెళ్లి చూపులు
ప్రముఖ తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ చూపులు మన తెలుగు సినిమా ‘పెళ్లి చూపులు’పై పడ్డాయి. కొత్త దర్శకుడు తరుణ్‌భాస్కర్ రాసిన కథ, తీసిన విధానం ఆయనకు బాగా నచ్చడంతో తమిళ ప్రేక్షకులకూ ‘పెళ్లి చూపులు’ చూపించాలని డిసైడ్ అయ్యారు. తమిళంలో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారాయన. ‘‘గౌతమ్ మీనన్ మా సినిమా చూసి ప్రశంసించడంతో పాటు తమిళంలో రీమేక్ చేస్తానని రైట్స్ తీసుకోవడం హ్యాపీగా ఉంది. తమిళ రీమేక్‌కు ఆయన దర్శకత్వం వహించడం లేదు. దర్శకత్వ బాధ్యతలు మరొకరికి అప్పగించి, నిర్మాతగా వ్యవహరించనున్నారు’’ అని ‘పెళ్లి చూపులు’ నిర్మాతల్లో ఒకరైన రాజ్ కందుకూరి ‘సాక్షి’తో చెప్పారు. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా నటించిన ఈ చిత్రం తెలుగులో చిన్న సినిమాగా విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
స్టార్ డైరెక్టర్ చేతికి పెళ్లిచూపులు రీమేక్ రైట్స్
చిన్న సినిమాగా విడుదలై ఘనవిజయం సాధించిన సినిమా పెళ్లి చూపులు. కేవలం కోటిన్నర బడ్జెట్లో రాజ్ కందుకూరి నిర్మాతగా, తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రీతూ వర్మలు హీరో హీరోయిన్లుగా నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెళ్లిచూపులు 20 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచే రీమేక్ రైట్స్‌కు భారీ క్రేజ్ ఏర్పడింది. పలువురు టాప్ సెలబ్రిటీలు రైట్స్ కోసం ప్రయత్నించగా హిందీ రీమేక్ రైట్స్‌ను వశు భగ్నానీ సొంతం చేసుకున్నారు. తాజాగా తమిళ రీమేక్ రైట్స్‌ను కూడా స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దక్కించుకున్నారు. దర్శకుడిగానే కాక నిర్మాతగాను పలు విజయవంతమైన చిత్రాలను అందించిన గౌతమ్ మీనన్, ఈ సినిమాను తన నిర్మాణంలో మరో దర్శకుడితో రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నారు. -
హమ్మయ్య.. రిలీజ్ డేట్ ఇచ్చేశారు
ప్రేమమ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నాగచైతన్య స్పీడు పెంచాడు. చాలా కాలంగా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న సాహసం శ్వాసగా సాగిపో సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్‌లో ఉన్నాడు. గతంలో రెండు మూడు సార్లు ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటనలు వచ్చినా.. రిలీజ్ చేయలేకపోయారు. దీంతో ఆ సినిమాను పక్కన పెట్టేసి ప్రేమమ్ పూర్తి చేసి సూపర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం ప్రేమమ్ సక్సెస్‌ను క్యాష్ చేసుకునే ఆలోచనలో ఉన్నారు సాహసం శ్వాసగా సాగిపో టీం. క్రియేటివ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను నవంబర్ 11న రిలీజ్ అంటూ అఫీషియల్‌గా ప్రకటించేశారు. మరి ఈ సారైన నాగచైతన్య తన సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకువస్తాడో లేదో చూడాలి. -
బట్ ఫర్ ఏ ఛేంజ్!
గౌతమ్ మీనన్, ఏఆర్ మురుగదాస్, ఎస్.జె.సూర్య.. వీళ్లంతా తమిళ దర్శకులే. అవకాశం వచ్చినప్పుడల్లా తెలుగులో అగ్ర హీరోల సినిమాలకు దర్శకత్వం వహిస్తుంటారు. తాజాగా అల్లు అర్జున్‌తో తీస్తున్న సినిమాతో ఈ జాబితాలోకి లింగుస్వామి చేరనున్నారు. ఇలా తమిళ దర్శకులు హైదరాబాద్ వచ్చి తెలుగు సినిమాలు తీయడమే తప్ప.. ఇటీవల మనోళ్లు చెన్నై వెళ్లి తమిళ సినిమాలు తీసింది తక్కువే. బట్ ఫర్ ఏ ఛేంజ్.. దర్శకుడు శ్రీవాస్ చెన్నై వెళ్తున్నారు. విశాల్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో సినిమా తీయడానికి ప్లాన్ చేస్తున్నారట. విశాల్ ప్రతి సినిమా తెలుగులో డబ్బింగ్ కావడమనేది కామన్. స్ట్రయిట్ తెలుగు సినిమాలో నటించాలనుందని చాలారోజుల నుంచి విశాల్ చెబుతున్నారు. ఆ కోరిక శ్రీవాస్ సినిమాతో తీరుతున్నట్టుంది. ఈ సంక్రాంతికి ‘డిక్టేటర్’తో హిట్ అందుకున్న శ్రీవాస్ స్క్రిప్ట్ వర్క్‌తో బిజీగా ఉన్నారట. ప్రీ-ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయట. జనవరిలో షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్. ప్రస్తుతం ‘టెంపర్’ తమిళ రీమేక్, ‘పందెం కోడి 2’, దర్శకుడు మిస్కిన్ సినిమాలతో విశాల్ బిజీగా ఉన్నారు. ఇక, విశాల్, తమన్నా జంటగా నటించిన ‘ఒక్కడొచ్చాడు’ ఈ అక్టోబర్‌లో విడుదల కానుంది. -
స్వీయ దర్శకత్వంలో అతిథిగా..
కథానాయకుడిగా ఏకకాలంలో రెండు చిత్రాలు, మరో పక్క చిత్ర నిర్మాణం, త్వరలో హాలీవుడ్ చిత్ర రంగప్రవేశం ఇలా నటుడిగా చాలా బిజీగా ఉన్నా మరో పక్క మెగాఫోన్ పట్టాలన్న తన చిరకాల ఆశను నెరవేర్చుకుంటున్నారు ధనుష్. ఈయన నటించిన తొడరి చిత్రం ఇటీవలే విడుదలైంది. మరో చిత్రం కొడి త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ప్రస్తుతం వెట్ట్రిమారన్ దర్శకత్వంలో వడచెన్నై, ఇంకో పక్క గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ఎన్నై నోక్కి పాయుమ్ తూటా చిత్రాల్లో నటిస్తున్నారు. ఇక రాజ్‌కిరణ్ ప్రధాన పాత్రలో పవర్ పాండి అనే చిత్రానికి ధనుష్ దర్శక, నిర్మాతగా రెండు బాధ్యతలతో పాటు, అతిథి పాత్రలో మెరిసే మరో బాధ్యతను తానే మోస్తున్నారన్నది తాజా సమాచారం. ప్రసన్న, శాయాసింగ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి షాన్ రోల్డన్ సంగీతాన్ని అందిస్తున్నారు. వేల్రాజ్ ఛాయాగ్రహణను అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చెన్నైలో శరవేగంగా జరుపుకుంటోంది. కాగా ఇది ఒక స్టంట్ మాస్టర్ ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న చిత్రం అని తెలిసింది. ఇందులో స్టంట్ మాస్టర్‌గా నటిస్తున్న రాజ్‌కిరణ్ బాల్య పాత్రలో ధనుష్ మెరవనున్నారట. అన్నట్టు ఈ చిత్రానికి కథ, కథనాలను ధనుష్‌నే తయారు చేసుకున్నారు. ఇన్ని బాధ్యతలను ఏకకాలంలో ఎలా నిర్వహించగలుగుతున్నారన్న ప్రశ్నకు తాను ప్రేమిస్తున్నది సినిమానేనని నిజాయితీగా బదులిచ్చారు ధనుష్. ఈయన నటుడిగా, నిర్మాతగా గీత రచయితగా, గాయకుడిగా సక్సెస్ అయ్యారన్నది తెలిసిందే. ఇక దర్శకుడిగా ఎలాంటి విజయాన్ని అందుకుంటారో అన్నది పవర్ పాండి నిర్ణయించాలి. -
నయనతారకు విలన్!
వెంకటేశ్‌తో ‘ఘర్షణ’, నాగచైతన్యతో ‘ఏ మాయ చేశావె’ వంటి స్ట్రైట్ చిత్రాలతో పాటు ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’, ‘ఎంతవాడు గాని’ వంటి డబ్బింగ్ చిత్రాల ద్వారా దర్శకుడిగా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు గౌతమ్ మీనన్. అడపా దడపా అతిథి పాత్రల్లో తెరపై కనిపిస్తుంటారాయన. ఇప్పుడు పూర్తి స్థాయి విలన్‌గా నటించనున్నారని చెన్నై టాక్. నయనతార కథానాయికగా తమిళంలో రూపొందనున్న లేడీ ఓరియంటెడ్ మూవీ ‘ఇమైక్క నొడిగళ్’. ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం కోసం గౌతమ్ మీనన్‌ను విలన్ పాత్రకు అడిగారట. కథ విని, ఈ పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం. -
విలన్‌గా స్టార్ డైరెక్టర్
రొమాంటిక్ యాక్షన్ డ్రామాలు తెరకెక్కించటంలో స్పెషలిస్ట్‌గా పేరున్న సౌత్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ మరో టాలెంట్ చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే దర్శకుడిగా, నిర్మాతగా ఆకట్టుకుంటున్న గౌతమ్, త్వరలో నటుడిగా పరిచయం అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే పలు చిత్రాల్లో అతిథి పాత్రలతో అలరించిన గౌతమ్ మీనన్, త్వరలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేసేందుకు అంగీకరించాడు. తమిళ దర్శకుడు జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం గౌతమ్ మీనన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అధర్వ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో గౌతమ్ మీనన్ మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇమైకా నోడిగల్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. -
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సూపర్ స్టార్
ఇటీవల కబాలి సినిమాతో అంతర్జాతీయ సినీ అభిమానులకు కూడా తన వైపు తిప్పుకున్న సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్, ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రోబో సీక్వల్లో నటిస్తున్నాడు. భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా 2017 ద్వితియార్థంలో రిలీజ్ కానుంది. మరి ఇంతటి భారీ చిత్రం తరువాత రజనీ చేయబోయే సినిమా ఏంటి..? తాజాగా ఈ విషయంపై తమిళ నాట ఆసక్తికరమైన వార్త ఒకటి వినిపిస్తోంది. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ లను తెరకెక్కించే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రజనీ తన నెక్ట్స్ సినిమా చేయనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ధనుష్ హీరోగా సినిమా చేస్తున్న గౌతమ్ షూటింగ్ సయమంలో ధనుష్‌కు రజనీ కోసం తయారు చేసిన కథ వినిపించాడట. ధనుష్‌కు కథ నచ్చటంతో రజనీని కూడా ఒప్పించే పనిలో ఉన్నారట. ప్రస్తుతానికి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ లేకపోయినా ఈ కాంబినేషన్‌పై మాత్రం మంచి అంచనాలే ఉన్నాయి. -
ధనుష్‌కు విలన్‌గా గౌతంమీనన్
సాధారణంగా కథానాయకుడికి దర్శకుడికి మధ్య మంచి ర్యాప్ ఉంటుంది. అప్పుడే సినిమా మంచి విలువలతో రూపొందుతుంది. అలా కాకుండా వారిద్దరి మధ్య అండర్స్డాండింగ్ కొరవడితే ఆ చిత్రానికి కష్టకాలమే అవుతుంది. అయితే అదే ఇద్దరు రియల్‌గా కాకుండా రీల్లో ఢీకొంటే చాలా రసవత్తరంగా ఉంటుంది. తాజాగా నటుడు ధనుష్, దర్శకుడు గౌతంమీనన్ల మధ్య అలాంటి పోరే జరుగుతోంది. దర్శకుడు గౌతంమీనన్ తన తొలి చిత్రం మిన్నలే నుంచే వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. తన చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్రలకు ప్రాధాన్యం ఉంటుంది. అందుకే హీరోలు కూడా ఆయన విలన్‌గా నటించడానికిసై అంటుంటారు. కాక్క కాక్క చిత్రంలో నటుడు జీవన్‌ను సూర్యకు విలన్‌ను చేశారు. ఆ చిత్రం తరువాత జీవన్ హీరో అయిపోయారు. అదే విధంగా అజిత్ ఎన్నై అరిందాల్ చిత్రంలో నటుడు అరుణ్విజయ్ను విలన్‌ను చేశారు. ఆ చిత్రం తరువాత ఆయన మార్కెట్ వేరే స్థాయికి చేరింది. ఇలా చాలా మందిని విలన్‌గా మార్చిన దర్శకుడు గౌతంమీనన్ తాజాగా ఆయనే ధనుష్‌కు విలన్‌గా మారారు. తన చిత్రాల్లో గెస్ట్‌గా తళుక్కుమనే గౌతమ్‌మీనన్ ఇప్పుడు ప్రధాన పాత్రలో నటించడం విశేషం. ప్రస్తుతం ఆయన ధనుష్ హీరోగా ఎన్నై నోక్కి పాయుమ్ తోటా అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఇందులో ఒక విలన్‌గా నటుడు రానా దగ్గుబాటి నటిస్తున్నారు. ఆయనకు దీటైన మరో విలన్‌గా ధనుష్‌తో ఢీకొంటున్నారు గౌతంమీనన్. పక్కా కమర్షియల్ అంశాలతో తెరకెక్కుతున్న చిత్రం ఎన్నై నోక్కి పాయుమ్ తోటా అని చిత్ర వర్గాలు తెలిపారు. -
గౌతమ్ కల నెరవేరనుందా?
‘‘రజనీకాంత్‌తో సినిమా చేయాలనే ఆకాంక్ష ఎప్పట్నుంచో ఉంది. డబ్బులు కోసమో, పేరు కోసమో కాదు.. దర్శకుడి మేకింగ్‌ని లక్షలాది మంది చూస్తారు. అది చాలు. సింగిల్ ట్రైలర్ కూడా విడుదల చేయకుండా సినిమాని విడుదల చేసినా జనాలు థియేటర్‌కి వస్తారు’’ అని ఓ సందర్భంలో దర్శకుడు గౌతమ్ మీనన్ అన్నారు. పలు అనువాద చిత్రాల ద్వారా సుపరిచితుడై, ‘ఘర్షణ’, ‘ఏ మాయ చేశావె’ వంటి స్ట్రైట్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన గౌతమ్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’ విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం ధనుష్ హీరోగా తమిళంలో ‘ఎన్నై నోక్కి పాయుమ్ తోట్టా’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారాయన. తదుపరి సినిమా అతని మామగారు రజనీతో చేయనున్నారని చెన్నై టాక్. రజనీ కోసం గౌతమ్ ఓ స్క్రిప్ట్ రెడీ చేసే పని మీద ఉన్నారట. ప్రస్తుతం రజనీ ‘2.0’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత గౌతమ్ దర్శకత్వంలోనే ఆయన సినిమా చేయనున్నారని సమాచారం. వచ్చే ఏడాది ఈ చిత్రం ఆరంభమవుతుందట! -
సింగిల్ డైరెక్టర్.. మెనీ స్టోరీస్...
షూటింగ్ పూర్తయ్యిందంటే గుమ్మడికాయ పగలాల్సిందే. షూటింగ్ స్టార్ట్ అయ్యిందంటే కొబ్బరికాయ కొట్టాల్సిందే. ఈ దర్శకులలో ఏ దర్శకుని శ్రీమతిని అడిగినా.. ‘ఏమో అండీ! గుమ్మడికాయ పులుసు ఆరగించి కాస్త విశ్రాంతి తీసుకుంటారనుకున్నా. పొద్దున్నే కొబ్బరి పచ్చడి కావాలని ఒక్కటే గొడవ. మా శ్రీవారి వాలకం ఇది’ అంటున్నారు. ఈ దర్శకులందరూ ఓ సినిమా పూర్తవగానే ఇంకో సినిమా గుర్రం ఎక్కుతున్నారు. ఓ గుర్రం దిగితే ఇంకో గుర్రం ఎక్కడం కామనే కదా అనే డౌట్ వస్తోందా! వీళ్లు గుమ్మడి పులుసులోనే కొబ్బరి పచ్చడి నంజుకుంటున్నారు. అదేనండీ.. ఓ సినిమా షూటింగ్ పూర్తికాక ముందే మరో సినిమా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. ఇలా రెండు మూడు గుర్రాల మీద స్వారీ చేస్తున్న ‘సింగిల్ డైరెక్టర్.. మెనీ స్టోరీస్’ కథ ఇది. డిక్షనరీలో ఆ మాట లేదు రామ్‌గోపాల్ వర్మ డిక్షనరీలో ఖాళీ అనే పదానికి చోటు లేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా వర్మ పర్సనల్ థియేటర్లో ఎప్పుడూ నాలుగైదు సినిమాలు ఆడుతుంటాయి. స్క్రిప్ట్ వర్క్‌లో ఒకటి, సెట్స్‌పై మరొకటి, రిలీజ్‌కి రెడీగా ఉన్నదొకటి, ప్రకటనలకు పరిమితమైన సినిమా ఇంకొకటి! వర్మ ఏం చేసినా సంచలనమే. ‘రక్త చరిత్ర’, ‘బెజవాడ’ సినిమాలతో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన వర్మ మరోసారి రాజకీయ నాయకులకు, మీడియాకు పని కల్పిస్తున్నారు. వంగవీటి రంగా జీవితం ఆధారంగా ‘వంగవీటి’ తీస్తున్నట్టు ప్రకటించారు. ఆయనకు బాగా ఇష్టమైన మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో వివేక్ ఒబెరాయ్ టైటిల్ రోల్లో తీసిన ‘రాయ్’ (కర్ణాటకకు చెందిన మాజీ గ్యాంగ్‌స్టర్ ముత్తప్పారాయ్ జీవితం ఆధారంగా) విడుదలకు సిద్ధమవుతోంది. ఇక, వర్మ దర్శకత్వంలో సచిన్ జోషీ, మీరా చోప్రా జంటగా నటించిన ‘మొగలిపువ్వు’ ఫస్ట్‌లుక్, ట్రైలర్లు విడుదలై చాలా రోజులైంది. అలాగే రాజశేఖర్‌తో ‘పట్ట పగలు’ అనే హారర్ సినిమా తీశారు. ఈ రెండు చిత్రాల విడుదల ఎప్పుడో ఇంకా ప్రకటించలేదు. సెట్స్ మీద ఇంకా రెండు మూడు సినిమాలు ఉన్నాయని టాక్. రివర్స్ గేర్.. సినిమా హిట్టయితే దర్శకుణ్ణి భేష్ అంటారు. ఫట్టయితే వేస్ట్ అంటారు. కానీ, కృష్ణవంశీ విషయంలో మాత్రం ఇది భిన్నంగా జరుగుతుంది. ఆయన సినిమా ఫట్టయినా.. అందులో మాట్లాడుకోవడానికి నాలుగు మంచి మాటలుంటాయ్. కృష్ణవంశీ క్రియేటివిటీ అలాంటిది. మాములుగా కృష్ణవంశీ సినిమా సినిమాకీ కొంచెం గ్యాప్ తీసుకుంటారు. కానీ, ఈసారి గేర్ రివర్స్‌లో ఉంది. ఆయన కూడా జోరు మీద ఉన్నట్లు అనిపిస్తోంది. ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా ‘నక్షత్రం’ తీస్తున్నారు. ఆ వెంటనే నందమూరి బాలకృష్ణ హీరోగా ‘రైతు’ సినిమా చేస్తారు. ఇది బాలకృష్ణకు 101వ సినిమా అవుతుంది. పూరి జ‘గన్’ లోడ్ చేసిన గన్, పూరి జగన్నాథ్ బ్రెయిన్ ఒక్కటే. గన్‌లో నుంచి బుల్లెట్స్ ఎంత స్పీడుగా వస్తాయో.. పూరి బ్రెయిన్లో ఆలోచనలు అంతకంటే స్పీడుగా వస్తాయి. సినిమాలో మాటల తూటాలు పేల్చడమే కాదు, ఏడాదికి రెండు మూడు సినిమాలు తీయగల సత్తా ఉన్న దర్శకుడు. ప్రస్తుతం ‘మహాత్మ’ చిత్ర నిర్మాత సీఆర్ మనోహర్ తనయుడు ఇషాన్‌ను హీరోగా పరిచయం చేస్తున్న ‘రోగ్’ చిత్రీకరణ పూర్తి చేశారు పూరి. వెంటనే నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా ‘ఇజం’ మొదలుపెట్టేశారు. ఇది పూర్తయిన వెంటనే ఎన్టీఆర్‌తో సినిమా ప్రారంభిస్తారు. ఇటీవలే కథ కూడా వినిపించారు. నందమూరి బ్రదర్స్ తర్వాత మహేష్‌బాబుతో ముచ్చటగా మూడో సినిమా చేయనున్నట్లు టాక్. దానికి ‘జన గణ మణ’ అనే టైటిల్ కూడా ప్రకటించారు. ఎప్పటిలానే పూరి జోరు మీద ఉన్నారు. ఒకటి లేట్ అయినా.. మరోటి! గౌతమ్ మీనన్‌ది కూడా వర్మ స్టైలే. ఓ సినిమా షూటింగ్‌కి ఎండ్ కార్డ్ వేయకముందే మరో సినిమాకి క్లాప్ బోర్డ్ రెడీ చేసేస్తారు. అజిత్‌తో తీసిన ‘ఎన్నై అరిందాల్’ (తెలుగులో ‘ఎంతవాడు గాని’) విడుదలకు సిద్ధమైన సమయంలోనే నాగ చైతన్యతో ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా ప్రారంభించారు. ఈ కథనే తమిళంలో శింబు హీరోగా తీశారు. త్వరలో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. మధ్యలో ఈ సినిమా షూటింగ్ లేట్ కావడంతో తమిళ చిత్రం ‘ఎన్నై నోక్కి పాయుమ్ తోట్టా’ కథ సిద్ధం చేశారు. ఇందులో ధనుష్ హీరో. రానా దగ్గుబాటి కీలక పాత్రధారి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా తర్వాత తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఓ భారీ సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు హీరో సాయిధరమ్ తేజ్, తమిళ హీరో ‘జయం’ రవి, కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్, మలయాళ హీరో పృథ్వీరాజ్‌లతో ఈ మల్టీస్టారర్ మూవీ తీయాలనుకుంటున్నారట. అనుష్క, తమన్నాలను కథానాయికలుగా అనుకుంటున్నారని టాక్. జోరుగా... కమర్షియల్ కథలకు సందేశాత్మక సొబగులు అద్ది సినిమా తీయడం దర్శకుడు కొరటాల శివ స్పెషాలిటీ. స్వతహాగా రచయిత కావడంతో ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ సినిమాల్లో హీరోయిజం, సందేశం, వినోదం, భావోద్వేగాలు అన్నిటినీ మేళవించి ప్రేక్షకులకు విందు భోజనం పెట్టారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’కి దర్శ కత్వం వహిస్తున్నారు. ఆ తర్వాత రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేస్తారు. ‘శ్రీమంతుడు’ కంటే ముందే చరణ్ హీరోగా బండ్ల గణేశ్ నిర్మాణంలో కొరటాల ఓ సినిమా చేయాల్సింది. ప్రారంభోత్సవం జరిగిన తర్వాత ఆ సినిమా ఆగింది. మళ్లీ ఈ కాంబినేషన్ కుదిరింది. మొత్తం మీద ఒక సినిమా తర్వాత మరొకటి చేస్తూ.. గ్యాప్ లేకుండా చూసుకుంటున్నారు కొరటాల శివ. అక్కడ పూర్తి.. ఇక్కడ మొదలు! విభిన్న కథాంశాలతో మంచి మాస్ మూవీస్ తీసే సత్తా ఉన్న దర్శకుడు మురుగదాస్. ఆయన తీసే అన్ని చిత్రాల కథలూ డిఫరెంట్‌గా ఊంటాయి. మరి.. ఎప్పుడు ఖాళీ దొరుకుతుందో కానీ, ఒక సినిమా చేసేటప్పుడే మరో డిఫరెంట్ స్టోరీ రెడీ చేసేస్తారు. హిందీలో సోనాక్షీ సిన్హా కథానాయికగా ‘అఖీరా’ సినిమా చేశారు మురుగదాస్. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో తదుపరి చిత్రంపై దృష్టి పెట్టారు. మహేశ్‌బాబు హీరోగా భారీ నిర్మాణ వ్యయంతో రూపొందే చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్‌తో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఈ నెలలోనే ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. - సత్య పులగం వీళ్లంతా ఏం చేస్తున్నారంటే.. ఆన్ సెట్స్‌లో ఓ సినిమా ఉన్నప్పుడే మరో సినిమా ప్లాన్ చేస్తున్న దర్శకుల గురించి పక్కన పెట్టి.. ప్రస్తుతం ఆన్ సెట్స్‌లో ఒక సినిమాతో బిజీగా ఉన్న దర్శకులు, ఆన్ సెట్స్‌కి తీసుకెళ్లడానికి సినిమా ప్లాన్ చేస్తున్న దర్శకుల విషయానికొస్తే.. ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’తో రాజమౌళి క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఈ చిత్రం తర్వాత మహేశ్‌బాబుతో సినిమా చేస్తారని టాక్. చిరంజీవి 150వ చిత్రంతో వీవీ వినాయక్ ఫుల్ బిజీ. ఈ చిత్రాన్ని రామ్‌చరణ్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా, తండ్రితో సినిమా పూర్తయ్యాక వినాయక్ దర్శకత్వంలో చరణ్ ఓ సినిమా చేయాలనుకుంటున్నారట. రామ్‌చరణ్ హీరోగా ‘ధ్రువ’ చిత్రం షూటింగ్లో సురేందర్‌రెడ్డి నిమగ్నమై ఉన్నారు. ఇటీవల నితిన్‌తో త్రివిక్రమ్ ‘అఆ’ వంటి సూపర్ హిట్ మూవీ ఇచ్చిన విషయం తెలిసిందే. తదుపరి సినిమా పవన్ కల్యాణ్‌తో చేస్తారని వినికిడి. ‘సరైనోడు’ వంటి భారీ కమర్షియల్ హిట్ ఇచ్చిన బోయపాటి శ్రీను ప్రస్తుతం బెల్లంకొండ సురేశ్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయనున్నారు. అలాగే, ఈ మధ్య బాలకృష్ణను బోయపాటి కలిశారట. మరి.. ఆయనతో సినిమా చేస్తారా? లేక బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ పరిచయ చిత్రానికి సంబంధించిన చర్చలేమైనా జరుపుతున్నారా? అనేది తెలియాల్సి ఉంది. బాలకృష్ణ నూరవ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’కి దర్శకత్వం వహిస్తున్న క్రిష్ ఈ చిత్రం తర్వాత వరుణ్ తేజ్‌తో ‘రాయబారి’ చేస్తారని టాక్. వాస్తవానికి ’కంచె’ తర్వాత ఈ సినిమానే చేయాలనుకున్నారు. ఈలోపు ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ మొదలుపెట్టారు. ‘రాయబారి’కి పడినది తాత్కాలిక బ్రేకేనా..? అనేది కాలమే చెప్పాలి. వెంకటేశ్ హీరోగా ‘బాబు బంగారం’ చేస్తున్నారు మారుతి. అల్లు అర్జున్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వం వహించనున్న చిత్రం త్వరలో సెట్స్‌కి వెళ్లనుంది. -
4 హీరోలు,3 హీరోయిన్లతో గౌతమ్‌మీనన్ చిత్రం
కోలీవుడ్ సంచలన దర్శకుల్లో గౌతమ్ మీనన్ ఒకరని చెప్పవచ్చు. ఇంతకు ముందు పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ఈయన ఇటీవల కాస్త వెనుకపడ్డారనే చెప్పాలి.అయితే చేతి నిండా చిత్రాలతో బిజీగానే ఉన్నారు. కానీ ఏదీ అనుకున్న తేదీకి షూటింగ్ పూర్తి కావడం లేదు, విడుదల కావడం లేదు.ప్రస్తుతం శింబు హీరోగా అచ్చంయంబదు మడమయడా(తెలుగులో నాగచైతన్య హీరోగా సాహసమే శ్వాసగా సాగిపో)చిత్రం నిర్మాణంలో ఉంది. అది విడుదల కాకుండానే ధనుష్ హీరోగా ఎన్నై నోకి పాయుమ్ తూటా చిత్రం మొదలెట్టారు. ఇక నిర్మాతగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఎస్జే.సూర్య హీరోగా నెంజమ్ మరుప్పదిల్లై చిత్రం చేస్తున్నారు. ఇవన్నీ నిర్మాణ దశలో ఉండగా తాజాగా మరో చిత్రానికి సిద్ధమవుతున్నారని సమాచారం.ఈ చిత్రాన్ని ఆయన నలుగురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లతో భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారట. ఇందులో మలయాళంకు చెందిన పృథ్వీరాజ్,తెలుగు నటుడు సాయి ధరణ్ తేజ్, కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ నటించనున్నారట. తమిళ భాషకు చెందిన నటుడెవరన్నది ఇంకా నిర్ణయం కాలేదు. ఇక హీరోయిన్లుగా అం దాల భామ అనుష్క, మిల్కీబ్యూటీ తమన్నా ఎంపికైనట్లు సమాచారం. మూడో హీరోయిన్ కోసం చెన్నై చిన్నది సమంతను నటింపచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట.అయితే త్వరలో వివాహానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్న సమంత తను గురువుగా భావించే దర్శకుడు గౌతమ్మీన న్ ఆఫర్‌ను అందుకుంటారా? లేక సారీ అంటారా అన్నది వేచి చూడాలి. ఈ చిత్రాన్ని గౌతమ్ మీనన్ వచ్చే ఏడాది ప్రారంభించనున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. -
క్రేజీ డైరెక్టర్‌తో సాయిధరమ్ తేజ్
మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. వరుస సక్సెస్‌లతో మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఎదుగుతున్నాడు. దీంతో ఓ సౌత్ స్టార్ డైరెక్టర్ దృష్టి ఈ యంగ్ హీరో మీద పడింది. డిఫరెంట్ సినిమాలతో ఆకట్టుకునే గౌతమ్ మీనన్ త్వరలో తెరకెక్కించనున్న ఓ భారీ చిత్రం కోసం సాయి ధరమ్ తేజ్ ను సంప్రదించాడట. ఒకేసారి నాలుగు భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమా తెలుగు వర్షన్లో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించనున్నాడు. తమిళ్లో శింబు, కన్నడలో పునీత్ రాజ్ కుమార్, మళయాలంలో పృథ్విరాజ్‌లు హీరోలుగా నటించనున్నారు. అనుష్క, తమన్నాలను హీరోయిన్లుగా ఫైనల్ చేశాడు. ప్రస్తుతం ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పనుల్లో బిజీగా ఉన్న గౌతమ్ మీనన్, ఆ సినిమా పూర్తి కాగానే ఈ భారీ మల్టీ లింగువల్ సినిమా పనులు మొదలెట్టే ఆలోచనలో ఉన్నాడు. -
కొత్త అవతారంలో సూర్య
రాక్ స్టార్లా కనిపిస్తున్న ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా..? ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ హీరో కం డైరెక్టర్ పేరు తెగ వినిపిస్తోంది. ఓ స్టార్ హీరో సినిమాను డైరెక్ట్ చేసే చాన్స్ వచ్చినట్టుగానే వచ్చి మిస్ అయ్యింది. అదే సమయంలో మరోస్టార్ హీరో సినిమాలో విలన్‌గా నటించనున్నాడు. ఇలా టాప్ స్టార్స్‌తో డీల్ చేస్తున్న ఈ ఆర్టిస్ట్ ఎవరో కాదు.. తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్య. ఎస్ జె సూర్య హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన నెంజం మరప్పదిల్లై సినిమా పోస్టర్ ఇది. వర్ణ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న సెల్వ, సౌత్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ జానర్ అనిపించుకున్న హర్రర్ థ్రిల్లర్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా కోసం ఎస్ జె సూర్యతో డిఫరెంట్ గెటప్ వేయించి సెల్వ ఆ లుక్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. మరో దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎస్ జె సూర్య సరసన రెజీనా హీరోయిన్గా నటిస్తోంది. -
ఈ పోస్టర్‌లోని నటుణ్ని గుర్తుపట్టగలరా..?
రాక్ స్టార్లా కనిపిస్తున్న ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా..? ప్రస్తుతం టాలీవుడ్ ఈ హీరో కం డైరెక్టర్ పేరు తెగ వినిపిస్తోంది. ఓ స్టార్ హీరో సినిమాను డైరెక్ట్ చేసే చాన్స్ వచ్చినట్టుగానే వచ్చి మిస్ అయ్యింది. అదే సమయంలో మరోస్టార్ హీరో సినిమాలో విలన్‌గా నటించనున్నాడు. ఇలా టాప్ స్టార్స్‌తో డీల్ చేస్తున్న ఈ ఆర్టిస్ట్ ఎవరో కాదండి తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్య. ఎస్ జె సూర్య హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన నెంజం మరప్పదిల్లై సినిమా పోస్టర్ ఇది. వర్ణ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న సెల్వ, సౌత్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ జానర్ అనిపించుకున్న హర్రర్ థ్రిల్లర్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా కోసం ఎస్ జె సూర్యతో డిఫరెంట్ గెటప్ వేయించి సెల్వ ఆ లుక్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. మరో దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎస్ జె సూర్య సరసన రెజీనా హీరోయిన్గా నటిస్తోంది. -
మేలో అచ్చంయంబదు మడమయడా
అచ్చంయంబదు మడమయడా చిత్రం విడుదల తేదీ ఖారారైందని సమాచారం. శింబు నటించిన చిత్రం అచ్చంయంబదు మడమయడా. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మలయాళం చిత్రం ప్రేమమ్ ఫేమ్ మంజిమామోహన్ కథానాయకిగా పరిచయం అవుతున్నారు. విన్నైతాండి వరువాయా వంటి విజయవంతమైన చిత్రం తరువాత శింబు, గౌతమ్ మీనన్‌ల కలయికలో తెరకెక్కుతున్న చిత్రం అచ్చంయంబదు మడమయడా. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. తళ్లీ పోగాదే అనే ఇందులోని సింగిల్ ట్రాక్ పాట జనవరి నెలలో యూట్యూబ్‌లో విడుదలై పెద్ద విశేష స్పందన పొందింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న అచ్చంయంబదు మడమయడా చిత్రం ఆడియో త్వరలో విడుదల సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది.చిత్రాన్ని మే 17న విడుదలకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.అయితే దీనికి ముందే శింబు నటించిన ఆయన సొంత నిర్మాణ సంస్థ నిర్మించిన ఇదునమ్మ ఆళు చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. నయనతార, ఆండ్రియా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ రెండవ వారంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా శింబు సోదరుడు కురలరసన్ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారన్నది తెలిసిన విషయమే. -
ధనుష్‌తో ఢీ అంటున్న రానా
స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. హీరో పాత్రలకే పరిమితం కాకుండా అన్ని రకాల క్యారెక్టర్స్ చేస్తున్నయంగ్ హీరో రానా. ఇప్పటికే తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో ప్రధాన పాత్రల్లో నటించిన రానా, మరోసారి తమిళ యంగ్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ప్రస్తుతం మూడు భాషల్లో భారీగా తెరకెక్కుతున్న ఘాజీ సినిమాతో పాటు బాహుబలి సీక్వల్లోనూ నటిస్తున్నాడు రానా. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత తమిళ స్టార్ హీరో ధనుష్ సినిమాలో కీ రోల్లో నటించడానికి అంగీకరించాడు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ సినిమాలో కూడా రానా, ప్రతినాయక పాత్రలోనే కనిపించనున్నాడన్న టాక్ వినిపిస్తుంది. ఇటీవల షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాలో ధనుష్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే సాహసం శ్వాసగా సాగిపో షూటింగ్ పూర్తిచేసిన దర్శకుడు గౌతమ్ మీనన్, ఆ సినిమా రిలీజ్ కాకముందే ధనుష్ సినిమాను ప్రారంభించాడు. -
మరో తమిళ దర్శకుడితో చైతూ
అక్కినేని నట వారసుడు నాగచైతన్య ఇప్పుడు యమా స్పీడు మీదున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలను సెట్స్ మీద ఉంచిన చైతూ, మరో రెండు సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సాహసం శ్వాసగా సాగిపో సినిమాలో నటిస్తున్న నాగచైతన్య, ఆ సినిమాతో పాటు మళయాల సూపర్ హిట్ ప్రేమమ్‌ను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్న ఈ సినిమాకు కార్తీకేయ ఫేం చందూ మొండేటి దర్శకుడు. ఈ రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగానే మరో రెండు సినిమాలను ఫైనల్ చేయడానికి రెడీ అవుతున్నాడు. నాగార్జున హీరోగా సోగ్గాడే చిన్ని నాయనా లాంటి భారీ బ్లాక్ బస్టర్ అందించిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాతో పాటు 7జి బృందావన్ కాలనీ, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే లాంటి సినిమాలతో టాలీవుడ్లో కూడా గుర్తింపు తెచ్చుకున్న తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ డైరెక్షన్లో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. -
మరో తమిళ దర్శకుడితో మహేష్
సూపర్ స్టార్ మహేష్ బాబు తమిళ మార్కెట్ మీద దృష్టి పెట్టాడు. ఇప్పటికే శ్రీమంతుడు సినిమాతో తమిళ్లో కూడా మంచి విజయం సాధించిన మహేష్ బాబు ఇప్పుడు వరుసగా తమిళ దర్శకులతో పనిచేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్న మహేష్, ఈ సినిమాను కూడా తెలుగుతో పాటు తమిళంలోనూ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత తమిళ దర్శకుడు మురుగదాస్ డైరెక్షన్లో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు మహేష్. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ సినిమాతో అక్కడ కూడా స్టార్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అంతేకాదు మురుగదాస్ సినిమా తరువాత కూడా మరోసారి తమిళ దర్శకుడితోనే సినిమాకు రెడీ అవుతున్నాడు రాజకుమారుడు. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో కూడా స్టైలిష్ డైరెక్టర్‌గా మంచి పేరున్న గౌతమ్ మీనన్, దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. ఈ సినిమాను భారీ చిత్రాల నిర్మాత అశ్వనిదత్ నిర్మించనున్నారు. ఈవిషయాన్ని స్వయంగా ప్రకటించిన అశ్వనీదత్, ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. -
గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ధనుష్
కోలీవుడ్‌లో ఒక కొత్త కాంబినేషన్‌కు శ్రీకారం జరగనుంది. కింది స్థాయి నుంచి కష్టపడి ఎదిగిన నటుడు ధనుష్ అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కోలీవుడ్,బాలీవుడ్‌లను దాటి హాలీవుడ్ వెళ్లనున్నారు. ఇక ప్రేమ కథా చిత్రాలనుంచి యాక్షన్ కథా చిత్రాల వరకూ తనదైన శైలిలో తెరకెక్కించి విజయాలను సొంతం చేసుకున్న దర్శకుడు గౌతమ్‌మీనన్. అలాంటి వీరిద్దరి కలయికలో ఇప్పటి వరకూ చిత్రం రాలేదు. వస్తే బాగుంటుందనే ఆసక్తి చాలా మందికి ఉంది. ఈ అరుదైన కాంబినేషన్లో ఇన్నాళ్లకు ఒక భారీ చిత్రం తెరకెక్కడానికి రంగం సిద్ధం అవుతోందన్నది తాజా సమాచారం. ధనుష్ ప్రస్తుతం ప్రభుసాలమన్ దర్శకత్వంలో రైలు చిత్రాన్ని పూర్తి చేసి కొడి చిత్రంలో నటిస్తున్నారు. ఇది రాజకీయ నేపథ్యంలో సాగే కమర్షియల్ కథా చిత్రం. ఇందులో నటి త్రిష రాజకీయనాయకురాలిగా ప్రతినాయకి పాత్రను పోషించడం విశేషం. మరో నాయకిగాఅనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. తదుపరి హాలీవుడ్ చిత్రంతో పాటు, వెట్రిమారన్ దర్శకత్వంలో వడచెన్నై చిత్రం చేయాల్సి ఉంది. అయితే వాటిని వెనక్కి నెట్టి గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ముందు నటించనున్నారు. ఈ విషయాన్ని ధనుష్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు.దీనికి ఎన్నై నోక్కి పాయుమ్ తోటా అనే టైటిల్‌ను నిర్ణయించారు. గౌతమ్‌మీనన్ శింబు హీరోగా అచ్చం యంబదు మడమయడా చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం తరువాత జయంరవి కథానాయకుడిగా ధ్రువనక్షత్రం చేయాల్సి ఉండగా దాన్ని వాయిదా వేసి ధనుష్‌తో చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. -
ఆ ముగ్గురి కలయికలో హార్రర్ చిత్రం
ఒక ఆసక్తికరమైన వార్త కోలీవుడ్‌లో తాజాగా హల్ చల్ చేస్తోంది. ముగ్గురు సంచలన దర్శకుల కలయికలో ఒక హార్రర్ చిత్రం తెరకెక్కనుందన్నదే వార్త. దర్శకుడు సెల్వరాఘవన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.పలు విజయవంతమైన చిత్రాల సృష్టికర్త ఈయన. అదే విధంగా దర్శకుడు గౌతమ్‌మీనన్, ఎస్జే.సూర్య పలు సంచలన విజయాలను నమోదు చేసుకున్నవారే. అలాంటి ఈ ముగ్గురి కలయికలో ఒక చిత్రం రూపొందితే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో శింబు హీరోగా రూపొందుతున్న ఖాన్ చిత్రం ఆర్థిక సమస్యల కారణంగా నిలిచిపోయింది. అదే విధంగా గౌతమ్‌మీనన్ దర్శక నిర్మాతగా శింబు కథానాయకుడు తెరకెక్కుతున్న అచ్చం ఎంబదు మడమయడా చిత్రం నిర్మాణం శింబు బీప్ సాంగ్ ఇతర సమస్యల కారణంగా నత్త నడకన నడుస్తోంది. ఇక ఎస్ఏ.సూర్య దర్శకత్వంలో విజయ్ హీరోగా చిత్రం తెరకెక్కనుందన్న ప్రచారం జరిగినా, అది తెర రూపం దాల్చలేదు. ఇక సెల్వరాఘవన్ తన సోదరుడు ధనుష్ హీరోగా ఒక హారర్ చిత్రం చేయనున్నారనే ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితిలో ఆ ముగ్గురు దర్శకులు కలిసి చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారన్నది విశేషమే. ఈ దర్శక త్రయంలో సెల్వరాఘవన్ దర్శకుడుగా గౌతమ్‌మీనన్ నిర్మాణంలో ఎస్జే.సూర్య కథానాయకుడిగా ఈ చిత్రం తయారు కానుందని సమాచారం. ఇది ధనుష్‌తో చేయాలనుకున్న హార్రర్ కథతో తెరకెక్కనున్న చిత్రం అని కోలీవుడ్ వర్గాల సమాచారం.ఈ చిత్రంలో నటించనున్న నాయకి, ఇతర నట వర్గం, సాంకేతిక బృందం వివరాలను త్వరలో దర్శకనిర్మాతలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
అతనితో ఏడేళ్ల స్నేహం: సమంత
అక్కినేని నటవారసుడు నాగచైతన్యకు తొలి సక్సెస్ ఇవ్వటంతో పాటు సమంత లాంటి సక్సెస్ ఫుల్ హీరోయిన్ ను టాలీవుడ్ కు పరిచయం చేసిన సూపర్ హిట్ సినిమా 'ఏం మాయ చేసావే..'. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా సంచలన విజయం నమోదు చేసిన ఈ సినిమాలొ నాగచైతన్య సమంతలు హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా షూటింగ్ కోసం చైతు, సమంతలు కలుసుకొని ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ' నాగ చైతన్య తో కలిసి ఎదిగిన ఫీలింగ్ కలుగుతోంది. ఏడేళ్లుగా మంచి మిత్రులుగా ఉన్నాం. చాలా ఆనందంగా ఉంది' అంటూ సమంత ట్విట్టర్ పేజ్ పై పోస్ట్ చేసింది. ఈ కామెంట్ పై స్పందించిన చైతన్య ' కాలం మారినా కొన్ని విషయాలు మాత్రం మారవు సమంత' అంటూ ట్వీట్ చేశాడు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏం మాయ చేసావే ఫిబ్రవరి 26, 2010లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయ్యింది. -
సూర్య పాత్రలో జయం రవి
తనీ ఒరువన్ చిత్రం విజయం తరువాత నటుడు జయంరవి రేంజ్ మారిపోయిందని చెప్పక తప్పదు. అలాగని అంతకు ముందు ఆయనకు విజయాలు లేవని కాదు. వాటిలో అధిక భాగం రీమేక్ చిత్రాలే. డెరైక్ట్ కథతో జయంరవి కెరీర్లో రూపొందిన తనీ ఒరువన్ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుందన్నది వాస్తవం. ఇక ప్రముఖ దర్శకులు కూడా జయంరవితో చిత్రాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. అలాంటి వారిలో దర్శకుడు గౌతమ్‌మీనన్ ఒకరు. అజిత్‌తో ఎన్నై అరిందాల్ వంటి సక్సెస్ఫుల్ చిత్రం తరువాత శింబు హీరోగా అచ్చం ఎంబదు మడమయడా చిత్రం చేస్తున్న గౌతమ్‌మీనన్ తదుపరి జయంరవి హీరోగా ఒక భారీ చిత్రం చేయనున్నారు. విశేషం ఏమిటంటే ఆయన ఇంతకుముందు విజయ్ హీరోగా యోహాన్ అధ్యాయం ఒండ్రు చిత్రం చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఆ చిత్ర కథ విజయ్‌కు సంతృప్తి కలిగించకపోవడంతో ఆ ప్రయత్నం ఆగిపోయింది. అలాగే సూర్యతో ధ్రువనక్షత్రం చిత్రం చేయాలని సంకల్పించారు. ఆ చిత్ర కథ నచ్చలేదని సూర్య బహిరంగంగానే వెల్లడించారు. దీంతో సూర్యకు, గౌతమ్‌మీనన్‌కు మధ్య మనస్పర్థలు ఏర్పడినట్లు ప్రచారం తమిళ పరిశ్రమలో జోరుగా సాగింది. అదే ధృవనక్షత్రం చిత్రాన్ని గౌతమ్‌మీనన్ జయంరవితో తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నారన్నది కోలీవుడ్ సమాచారం. ఇందులో ఇంతకుముందే ఎంపిక చేసిన నాయకిగా త్రిష, ముఖ్యపాత్రలో పార్తిబన్, అరుణ్ విజయ్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. -
మరో సినిమాకు కమిట్ అయ్యాడు
ఇప్పటికే పదికి పైగా సినిమాలతో యమా బిజీగా ఉన్న యంగ్ హీరో నారా రోహిత్ మరో సినిమాకు ఓకే చెప్పాడు. ప్రస్తుతం తుంటరి, రాజా చెయ్యివేస్తే, సావిత్రి సినిమాల షూటింగ్లలో పాల్గొంటున్న ఈ యంగ్ హీరో, త్వరలో గౌతమ్ మీనన్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన రమేష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడట. ప్రస్తుతం వెండితెర మీద కాసులు కురిపిస్తున్న క్రైమ్ కామెడీ జానర్లో ఈ సినిమా తెరకెక్కనుంది. 'ప్రతినిధి', 'రౌడీఫెలో', 'అసుర' సినిమాల సక్సెస్‌తో వరుస ఆఫర్లు నారా రోహిత్ తలుపు తట్టాయి. రెగ్యులర్ ఫార్మాట్‌కు భిన్నంగా కొత్త తరహా సినిమాలు చేయాలనుకుంటున్న దర్శక నిర్మాతలు రోహిత్‌తో సినిమాలు చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అందుకే 'శంకర', 'పండగలా వచ్చాడు', 'అప్పట్లో ఒకడుండేవాడు', 'వీరుడు', 'కోటలో రాజకుమారి', 'జో అచ్యుతానంద' లాంటి సినిమాలు రోహిత్ ఖాతాలో చేరాయి. రోహిత్ జోరు చూస్తుంటే వచ్చే ఏడాది అర డజనుకు పైగా సినిమాలు రిలీజ్ చేసేలా ఉన్నాడు. -
49-ఒ ఎవరి కోసం?
తెలుగు చిత్రపరిశ్రమకు సంబంధించిన ఏ వార్త అయినా ముందుగా ఫిలిం నగర్లో హల్చల్ చేస్తుంది. ఆ నోటా ఈ నోటా ఆ వార్త జోరుగా షికారు చేస్తూ, తమిళ, కన్నడ.. ఇలా ఇతర రంగాల వరకూ వెళ్లిపోతుంది. అదే తమిళ పరిశ్రమకు అయితే ‘కోడంబాక్కం’ ఏరియా మంచి అడ్డా. ఇప్పుడు అక్కడ రామ్ చరణ్ గురించి ఓ వార్త ప్రచారంలో ఉంది. ఆ వార్త అక్కణ్ణుంచి హైదరాబాద్ వరకూ షికారు చేసేసింది. ఓ తమిళ చిత్రం రీమేక్ హక్కులను రామ్‌చరణ్ దక్కించుకున్నారన్నది ఆ వార్త. ఆ చిత్రవిశేషాల్లోకి వస్తే... తమిళంలో స్టార్ కమెడియన్‌గా వెలిగినవాళ్లల్లో గౌండమణి ఒకరు. 1970లలో నటుడిగా రంగప్రవేశం చేసి, దాదాపు మూడు దశాబ్దాలు తన కామెడీతో ప్రేక్షకులను తెగ నవ్వించారాయన. ఆ తర్వాత జోరు తగ్గించారు. అడపా దడపా మాత్రమే సినిమాలు చేస్తున్నారు. విశేషం ఏంటంటే, ఆయన హీరోగా ఇటీవల ‘49-ఒ’ అనే చిత్రం రూపొందింది. దర్శకుడు గౌతమ్ మీనన్ దగ్గర దర్శకత్వ శాఖలో చేసిన పి. ఆరోగ్యదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. సినిమాకి ‘ఓహో’ అని రెస్పాన్స్ రాకపోయినా గౌండమణి కోసం, సినిమాలో ఉన్న కంటెంట్ కోసం చూడాల్సిందే అని తమిళ పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల ఈ చిత్రాన్ని రామ్‌చరణ్ చూశారని బోగట్టా. కంటెంట్ బాగా నచ్చడంతో రీమేక్ హక్కులు కూడా చేజిక్కించుకున్నారని చెన్నయ్ టాక్. రామ్‌చరణ్ ఈ చిత్రం రీమేక్ హక్కులు ఎందుకు దక్కించుకున్నారనే విషయం గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. సొంత సంస్థ ఆరంభించి, ఆయన చిన్న సినిమాలు నిర్మించాలనుకుంటున్న విషయం తెలిసిందే. దానికోసమే ఈ సినిమా కొన్నారా? లేక తన తండ్రి చిరంజీవి 150వ సినిమాకి ఆ కథ బాగుంటుందని కొన్నారా? లేక ఈ కథలో తానే హీరోగా నటించాలని రామ్‌చరణ్ అనుకుంటున్నారా? అసలు నిజంగానే ‘49-ఒ’ హక్కులను చరణ్ దక్కించుకున్నారా?.. ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. -
మూడోసారి మాయ చేస్తారట..!
ప్రస్తుతం గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాలో నటిస్తున్న నాగచైతన్య అదే డైరెక్టర్‌తో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'ఏం మాయచేసావే' సినిమాతో తొలి బ్లాక్ బస్టర్ అందుకున్న చైతూ ఆ కృతజ్ఞతతో గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా తరువాత 'ప్రేమమ్' రీమేక్‌లో నటించనున్న చైతన్య ఆ సినిమా తరువాత మరోసారి గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ సినిమాను తెలుగు, తమిళ్‌తో పాటు కన్నడ, మళయాల భాషల్లోనూ తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు గౌతమ్ మీనన్. తెలుగు తమిళ భాషల్లో తన గత చిత్రాల్లో నటించిన చైతూ, శింబులనే ఎంపిక చేయగా, కన్నడలో పునీత్ రాజ్‌కుమార్‌ను ఫైనల్ చేశాడు. త్వరలోనే మళయాల నటుడిని ఎంపిక చేసి సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. -
హీరోకు తప్పని 'సినిమా' కష్టాలు
కోలీవుడ్ యంగ్ హీరో శింబుకి బ్యాడ్ టైం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల తన సినిమా రిలీజ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న శింబుకు తాజాగా మరో షాక్ తగిలింది. శింబు హీరోగా తెరకెక్కుతున్న 'కాన్' సినిమా షూటింగ్ దశలో ఆగిపోయింది. ఆర్థిక కారణాలతో సినిమా ఆగిపోయినట్టుగా చెపుతున్నారు చిత్రయూనిట్. '7/జి బృందావన్ కాలనీ', 'ఆడవారిమాటలకు అర్థాలే వేరులే' సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరైన సెల్వరాఘవన్ డైరెక్షన్లో 'కాన్' సినిమాను ప్రారంభించాడు శింబు. చాలా కాలం కిందటే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసిన చిత్రయూనిట్ ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేశారు. తరువాత ఆర్థిక సమస్యలు ఎదురవ్వటంతో అనుకున్న సమయానికి రెండో షెడ్యూల్ ను ప్రారంభించలేదు. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తున్న శింబు 'కాన్' విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. సెల్వ భార్య గీతాంజలి నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పట్లో తిరిగి ప్రారంభమయ్యే అవకాశం కనిపించకపోవటంతో, వేరే సినిమాలు సైన్ చేయాలా లేక వెయిట్ చేయాల అర్థం కాక ఇబ్బంది పడుతున్నాడు. -
నాలుగు భాషల నటులతో..
సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ మరో భారీ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా 'సాహసం శ్వాసగా సాగిపో' అనే సినిమా చేస్తున్న గౌతమ్.. అదే సినిమాను శింబు హీరోగా తమిళంలో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తరువాత మరో భారీ బహుభాషా సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు గౌతమ్ మీనన్. తెలుగు, తమిళం, మళయాళ, కన్నడ భాషల హీరోలతో ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో తెలుగు నుంచి అల్లు అర్జున్, తమిళం నుంచి శింబు, కన్నడ నుంచి పునీత్ రాజ్ కుమార్, మళయాళం నుంచి ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. అయితే ఈసినిమాను ఏయే భాషల్లో తెరకెక్కిస్తున్న విషయం మాత్రం ఇంకా ప్రకటించలేదు. అయితే నాలుగు భాషలకు సంబంధించిన హీరోలు నటిస్తున్నారు కాబట్టి సినిమా కూడా నాలుగు భాషల్లో తెరకెక్కే ఛాన్స్ కనిపిస్తోంది. తమిళ, మళయాళ భాషల్లో ఈ సినిమాను గౌతమ్ మీనన్ స్వయంగా నిర్మిస్తుండగా కన్నడ లో పునీత్ రాజ్ కుమార్ ప్రొడ్యూస్ చేయనున్నాడు. తెలుగు వర్షన్ ఎవరు నిర్మిస్తారన్న విషయంలో ఇంక క్లారిటీ రాలేదు. నాలుగు భాషలకు సంబందించిన నటులు కలిసి నటిస్తుండటంతో డేట్స్ అడ్జస్ట్ అయి సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి మరింత సమయం పట్టనుంది. -
ఐ లవ్యూ జెస్సీ!
సినిమా వెనుక స్టోరీ - 19 మనం ఎవర్ని లవ్ చేయాలో ముందే డిసైడ్ చేసుకోగలమా? పోనీ, ప్రేమను వెతుక్కుంటూ వెళ్లగలమా? ప్రేమ... దానికదే జరగాలి. ఏదో మాయ చేసినట్టు ఉండాలి. తలకిందులు చేసెయ్యాలి. ఎప్పుడూ మనతో పాటే ఉండాలి. అదే నిజమైన ప్రేమ. ప్రపంచంలో ఎంతోమంది అమ్మాయిలున్నా... నేను జెస్సీనే ఎందుకు లవ్ చేశాను? జెస్సీ... చాలా అందంగా ఉంటుంది. క్లాసీ... బాగా చదువుకుంది... తనకొక స్టయిల్ ఉంది అండ్ సెక్సీ టూ. కార్తీక్ మనసు నిండా నిండిపోయింది జెస్సీ. కార్తీక్ తెలుగబ్బాయి. జెస్సీ మలయాళీ అమ్మాయి. ఈ ‘క్రాస్ బోర్డర్ లవ్ స్టోరీ’ని నేరేట్ చేస్తున్నాడు గౌతమ్ మీనన్. మహేశ్‌బాబు చాలా శ్రద్ధగా వింటున్నాడు. ఏదో ట్రాన్స్‌లోకి వెళ్లిపోయినట్టుగా సీన్స్, షాట్స్, ఆర్ఆర్ బిట్స్... అన్నీ చెప్పేసుకుంటూ పోతున్నాడు గౌతమ్. కథ ఇంత బాగా చెబుతున్నాడంటే, రేపు స్క్రీన్‌పై ఇంకెంత బాగా చూపిస్తాడో మహేశ్‌కి అర్థమవుతోంది. అక్క మంజుల తీసుకొచ్చిందీ ప్రపోజల్. కథ నచ్చింది. కానీ చేయలేడు. చేయకూడదు కూడా. మహేశ్‌కున్న ఇమేజ్‌కి ఇలాంటి సాఫ్ట్ లవ్‌స్టోరీ ఎలా సెట్ అవుతుంది? ‘‘గౌతమ్‌జీ... మనమో మంచి యాక్షన్ సినిమా చేద్దాం. మీరెప్పుడంటే అప్పుడు నేను రెడీ’’ చెప్పాడు మహేశ్ నవ్వుతూ. దట్స్ ఇట్. అక్కడితో ఆ కథ ఎండ్. గౌతమ్ మీనన్ ఇలా అనుకున్నాడంటే... అలా సినిమా మొదలెట్టేస్తాడు. మహేశ్ వద్దనుకున్న కథతో తమిళంలో శింబు, త్రిషతో ‘విన్నై తాండి వరువాయా’ మొదలెట్టేశాడు. ఇక్కడేమో మంజులను ఆ కథ హాంట్ చేస్తూ ఉంది. తెలుగులో ఇలాంటి ప్యూర్ అండ్ పొయిటిక్ లవ్స్టోరీలొచ్చి చాలా ఏళ్లయిపోయింది. ఇప్పుడు చేస్తే ఆడియన్స్ కచ్చితంగా కనెక్టవుతారు. మంజుల మళ్లీ కలిసింది గౌతమ్‌ని. ‘‘దీన్ని సైమల్టేనియస్‌గా తెలుగులో కూడా చేద్దాం’’ మంజుల ప్రపోజల్. ‘‘నాకేం ఇబ్బంది లేదు. మరి హీరో?’’ అడిగాడు గౌతమ్. మంజులకు నాగచైతన్య గుర్తొచ్చాడు. అప్పుడే ‘జోష్’తో లాంచ్ అయ్యాడు. క్యూట్ బాయ్. గౌతమ్‌ని తీసుకుని నాగార్జునను, నాగచైతన్యను కలిసింది. కథ వినగానే నాగ్, చైతన్య ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. ప్రాజెక్ట్ సెట్. ఇక మిగిలింది జెస్సీ కేరెక్టర్. తమిళంలో చేస్తున్న త్రిషను ఇక్కడ కంటిన్యూ చేయలేరు. ఎవరైనా బాలీవుడ్ హీరోయిన్ని పెడదామా? రకరకాల ట్రయల్స్. నాగచైతన్య కొత్తవాడు కాబట్టి కొత్తమ్మాయి అయితేనే బాగుంటుందని ఫైనల్ డెసిషన్. ఎక్కడున్నావమ్మా జెస్సీ? చెన్నై - స్టెల్లా మేరీస్ కాలేజ్‌లోకి ఓసారి కెమెరాను జూమ్ చేయండి. అదిగో వస్తోంది. క్లోజప్ వేయండి. ఎస్... తను సమంత... సమంత రూత్ ప్రభు. ఆమెతో పాటు కూర్చొని షుగర్‌లెస్ కాఫీ తాగినా తియ్యగానే ఉంటుంది. చుక్కల్లో జాబిలిలా మెరిసిపోతూ ఉంటుంది. ఆ మెరుపే ఆమెను మోడల్ని చేసింది. సమంతది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. బీకామ్ ఫినిష్ చేసి ఎంబీయే కోసం ఆస్ట్రేలియా వెళ్లే ప్రయత్నంలో ఉంది. ఫ్రెండ్స్‌తో కలిసి ఓ బర్త్‌డే పార్టీకెళ్లింది. అక్కడికొచ్చిన ఓ ప్రెస్ ఫొటోగ్రాఫర్ ఆమె ఫొటోలు తీసి పేపర్లో పబ్లిష్ చేశాడు. కట్ చేస్తే - ‘నాయుడు హాల్’ అనే ఫేమస్ క్లాత్స్టోర్ట్స్కి మోడలింగ్ చాన్స్. రూ.1500 రెమ్యునరేషన్. ఫస్ట్ మోడలింగ్ సూపర్‌హిట్. సమంతకు ఫుల్ క్రేజ్. చిక్ షాంపూ... ఇవా పౌడర్... ఇలా 100 వరకూ యాడ్ ఆఫర్స్. ఇదో సరదాలా ఉందామెకు. ఆ ఫ్రాగ్రెన్స్ అక్కడితో ఆగిపోదు కదా. రవివర్మన్ అనే కెమెరామ్యాన్‌కి సమంత ‘లైక్ ఎట్ ఫస్ట్ సైట్’. ఇక్కడ మళ్లీ కట్ చేయాలి. ఎందుకంటే - సమంత ఇప్పుడు సినిమా హీరోయిన్. ‘మాస్కోవిన్ కావేరీ’ అనే మూవీ. 2007 ఆగస్టులో షూటింగ్ స్టార్ట్. సమంతకు టైం బాలేదో, ప్రొడ్యూసర్‌కి పర్సు బాలేదో... సినిమా షూటింగ్ నత్తనడక నడుస్తోంది. కానీ సమంత ఫ్రాగ్రెన్స్ మళ్లీ పనిచేసింది. ఇంకో ఆఫర్. అధర్వ హీరోగా ‘బాణా కాత్తాడి’. ఈసారి కూడా సమంతకు టైమ్ బ్యాడేనా? ఇదీ నత్తనడకే. మళ్లీ కట్ చేస్తే... గౌతమ్ మీనన్ తెలుగు సినిమా కోసం హీరోయిన్ను వెతుకుతున్నాడని సమంతకు తెలిసి, ఫొటోలు పంపించింది. ఈ వంకతోనైనా తన ఫేవరేట్ డెరైక్టర్‌ను ఒక్కసారి కలిసేయొచ్చు. ఆడిషన్స్‌కి రమ్మని కాల్. భయపడింది. వెళ్లలేదు. సెకెండ్ టైమ్ కాల్. సిగ్గుపడింది. వెళ్లలేదు. థర్డ్ టైమ్ కాల్. ఇబ్బంది పడింది. వెళ్లక తప్పలేదు. ఎదురుగా గౌతమ్. మాట్లాడకుండా కూర్చుంది. ‘‘ఒక సీన్ చెబుతాను. యాక్ట్ చేసి చూపించు. కాఫీ షాపులో కార్తీక్ ఎదురుగా కూర్చుని నువ్వు మాట్లాడాలి’’ అంటూ తెలుగులో ఏవో డైలాగ్స్ చెప్పారు గౌతమ్. సమంతలో కంగారు. నాన్న తెలుగువాడే కానీ, పుట్టి పెరిగింది అంతా చెన్నైలో కావడంతో తమిళం, ఇంగ్లిషు తప్ప ఇంకేమీ రావు. బెరుకు బెరుగ్గానే సీన్ చేసి చూపించింది. గౌతమ్ ఫేస్‌లో ఎలాంటి రెస్పాన్సూ లేదు. తన పని అవుట్. అయినా హోప్ పెట్టుకుని రాలేదుగా. గౌతమ్‌ను చూడాలనుకుంది. చూసేసింది. ఇంటికి వెళ్తూ సమంత మైండ్ నిండా ఇవే ఆలోచనలు. అక్కడితో ఆ ఎపిసోడ్ మర్చిపోయింది. కానీ గౌతమ్ మర్చిపోలేదు. సమంతలో ఆయనకు జెస్సీనే కనిపిస్తోంది. ఆ బెరుకుతనం... ఆ ముగ్ధమోహనత్వం... ఆ మలయాళీ ఫేస్ కట్. మూడ్రోజుల తర్వాత సమంతకు ఫోన్. ‘యూ ఆర్ సెలెక్టెడ్’ అని. అప్పుడు చూడాలి సమంతను. చెన్నై సముద్రం కూడా ఆమె సంతోషం ముందు చిన్నబోయినట్టే అనిపించింది. కార్తీక్‌కి డెరైక్టర్ కావాలనేది డ్రీమ్. ఎవరైనా డెరైక్టర్ దగ్గర అసిస్టెంట్‌గా జాయిన్ కావాలి. తమిళంలో ఆ డెరైక్టర్ క్యారెక్టర్ కేయస్ రవికుమార్ చేస్తున్నాడు. తెలుగులో కూడా ఎవరైనా పాపులర్ డెరైక్టర్ కావాలి. పూరీ జగన్నాథ్‌ను మించిన బెస్ట్ ఆప్షన్ లేదనిపించింది మంజులకు. నిజానికి పూరి స్క్రీన్ మీద కనబడ్డానికి పెద్ద ఇంట్రస్ట్ చూపడు. అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేస్తున్నప్పుడు హిందీ ‘శివ’లో స్టూడెంట్ గ్యాంగ్‌లో చేశాడు. ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’లో ఓ సీన్లో కనిపించాడు. అంతకు మించి ఏ సినిమాలో కనబడలేదు. కానీ గౌతమ్ స్టోరీ చెప్పగానే ఇంప్రెస్ అయిపోయాడు. వెంటనే గ్రీన్ సిగ్నల్. షూటింగంటే... బోలెడంత హడావిడీ, హంగామా. అరుపులూ కేకలు. కానీ గౌతమ్ మాత్రం చాలా సెలైంట్‌గా షూట్ చేసేస్తున్నాడు. అన్నీ తక్కువ తక్కువ డైలాగులు. సమంతను చీరలు కట్టుకోమన్నారు. ఆమెకేమో చీర అలవాటు లేదు. ఇబ్బంది పడిపోయింది. నాగచైతన్యతో లిప్‌లాక్ సీన్. సమంత కంగారుపడిపోయింది. కానీ గౌతమ్ ఆ షాట్‌ని చాలా ఈస్తటిక్గా తీశాడు. అలెప్పీ, చెన్నై, మాల్టా, కేరళ, తిరుచ్చి, తంజావూర్, న్యూయార్క్, రోమ్... ఇలాంటి చోట్ల బ్యూటిఫుల్ లొకేషన్స్‌ని కెమెరాలో క్యాప్చర్ చేశారు. గౌతమ్‌కో అలవాటు ఉంది. క్లైమాక్స్ ముందు రాసుకోడు. ఎయిటీ పర్సంట్ వరకూ స్క్రిప్టు రెడీ చేసుకుని షూటింగ్‌కి వెళ్లిపోతాడు. షూటింగ్ మధ్యలో క్లైమాక్స్ రాసుకుంటాడు. దీనికేమో శాడ్ ఎండింగ్ అనుకున్నాడు. మంజుల మాత్రం హ్యాపీ ఎండింగ్ కావాలని పట్టుబట్టింది. ఓకే. తమిళ్‌కి శాడ్. తెలుగుకి హ్యాపీ. కార్తీక్ సినిమా డెరైక్ట్ చేస్తాడు. ఆ సినిమాకి హీరో హీరోయిన్లు కావాలి కదా. గౌతమ్ ఇక్కడో చిన్న తమాషా చేశాడు. తమిళ వెర్షన్లో నాగచైతన్య, సమంతలతో ఆ గెస్ట్ రోల్స్ చేయించాడు. తెలుగులో శింబు, త్రిషతో యాక్ట్ చేయించాడు. తెలుగులో ‘జెస్సీ’ అని టైటిల్ పెడితే బాగుంటుంది కానీ, లవ్‌స్టోరీ అనే ఫీల్ రాదు. ఏదైనా పొయిటిక్ టైటిల్ పెట్టాలి. ఏదైనా మంచి పాటలోని పల్లవి పెడితే? ‘ఒక్కడు’లో ‘నువ్వేం మాయ చేసావో కానీ..’ అంటూ ఓ పాట ఉంది. ‘ఏ మాయ చేసావె’ టైటిల్ డన్. టోటల్ బడ్జెట్... పన్నెండున్నర కోట్లు. గౌతమ్‌కి 3 కోట్లు... రెహమాన్‌కి 2 కోట్లు... రీ-రికార్డింగ్‌కి 50 లక్షలు. నాగచైతన్యకు శాటిలైట్ రైట్స్... ఇవీ రెమ్యునరేషన్స్. 2010 వేలెంటైన్స్ డే వెళ్లిపోయిన 12 రోజుల తర్వాత ‘ఏ మాయ చేసావె’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సిల్వర్‌స్క్రీన్‌పై ఓ రొమాంటిక్ పొయిట్రీ చదువుతున్న ఫీలింగ్. రీ-రికార్డింగ్, విజువల్స్ అయితే ఎక్స్ట్రార్డినరీ. నాగచైతన్య - సమంత పెయిర్‌కి డిస్టింక్షన్ మార్క్స. ఏఎన్నార్, నాగార్జునలాగా నాగచైతన్య రొమాంటిసిజమ్లో ట్రేడ్‌మార్క్ చూపించాడు. సమంత అయితే అప్పుడే వికసించిన రోజాపువ్వులా ఫ్రెష్‌గా అనిపించింది. ముఖ్యంగా ఆమె వాయిస్. డబ్బింగ్ చెప్పిన చిన్మయిదే ఆ క్రెడిట్. ఒక్క హిట్‌తో సమంత కెరీర్ రూపురేఖలే మారిపోయాయి. గౌతమ్ ఈ సినిమాతో ఒక స్టెప్ ఎదిగాడు. పెద్దపెద్దవాళ్లు కూడా అప్రిషియేట్ చేశారు. సత్యన్ అందిక్కాడ్ లాంటి టాప్ మలయాళీ డెరైక్టర్, ఇప్పటివరకూ కేరళను ఇంతందంగా ఎవరూ చూపించలేదని మెచ్చుకున్నాడు. ఈ విషయంలో కెమెరామన్ మనోజ్ పరమహంసదే క్రెడిట్. అతనికిదే ఫస్ట్ సినిమా. ఇంతకీ ఈ మనోజ్ పరమహంస ఎవరో తెలుసా? ఎస్వీ కృష్ణారెడ్డి హీరోగా ‘పగడాల పడవ’ అనే సినిమా డెరైక్ట్ చేసిన యు.వి.బాబు కొడుకు. గౌతమ్ మీనన్ జీవితానుభవాలు ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. ఓ రకంగా ఇది ఆయన సెమీ-బయోగ్రాఫికల్ ఫిల్మ్. అందుకే దీనికి సీక్వెల్ చేస్తానని ఎప్పటినుంచో చెబుతున్నాడు. మరి ఈసారి ఏ మాయ చేస్తాడో చూద్దాం!! వెరీ ఇంట్రస్టింగ్... * ఇందులో సమంత అన్నయ్యగా సుధీర్‌బాబు నటించారు. ఆ తర్వాత ఆయన ‘ఎస్ఎంఎస్’తో హీరోగా పరిచయమయ్యారు. * నాగచైతన్య తండ్రిగా కనబడింది ఈ చిత్ర నిర్మాత సంజయ్ స్వరూప్. మంజుల హజ్బెండ్. - పులగం చిన్నారాయణ -
విరహగీతాలు పాడబోతున్న నాగ చైతన్య
-
ఈసారి దర్శకుడిగా నితిన్‌తో సినిమా చేస్తా : గౌతమ్‌మీనన్
‘‘నితిన్‌తో ‘కొరియర్‌బాయ్ కళ్యాణ్’ నిర్మాతగా లాంగ్ జర్నీ చేశా. అతనితో పనిచేయడం మంచి ఎక్స్పీరియన్స్. లవ్‌స్టోరీతో పాటు థ్రిల్లర్ ఎలిమెంటున్న ఫ్యామిలీ ఎంటర్ై టైనర్ ఇది. త్రివిక్రమ్‌తో నితిన్ చేస్తున్న ‘అ..ఆ..’ తర్వాత, నా దర్శకత్వంలో నితిన్ హీరోగా మంచి యాక్షన్ లవ్‌స్టోరీ సినిమా చేస్తా’’ అని దర్శకుడు గౌతమ్‌మీనన్ చెప్పారు. ఆయన సమర్పణలో నితిన్, యామీగౌతమ్ జంటగా తయారైన చిత్రం ‘కొరి యర్ బాయ్ కళ్యాణ్’. ప్రేమ్‌సాయి దర్శకుడు. ఈ 17న ఈ చిత్రం విడుదల. శనివారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లా డుతూ, ‘‘తమిళంలో కన్నా తెలుగులో ఇది భారీ చిత్రం. థియేటర్స ఖాళీ లేకపోవడంతో తమిళ వెర్షన్ (జై హీరోగా తయారైన ‘తమిళ్ సెల్వనుమ్- తనియార్ అంజలుమ్’) రెండు వారాల తర్వాత రిలీజవుతోంది’’ అని చెప్పారు. ‘‘ఓ అభిమాని ‘సీబికె’ అంటే కంటెంట్ బేస్డ్ కథ అని ట్వీట్ చేశాడు. నిజంగానే ఇది కంటెంట్ బేస్డ్ మూవీ. ఇమేజ్ను పక్కనపెట్టి కంటెంట్‌ను నమ్మి ఈ సినిమా చేశా. సిస్టర్ సెంటిమెంట్‌తో లాస్ట్ఫ్రేమ్ దాకా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. ఇలాంటి సినిమాలు సక్సెసైతే మరిన్ని వైవిధ్యమైన కథలు వస్తా’’యని నితిన్ అన్నారు. -
కొరియర్ బాయ్ కళ్యాణ్
ప్రేయసిని ఇంప్రెస్ చేయడానికి పని లేని కల్యాణ్ ఉరఫ్ పీకె... కొరియర్ బాయ్ అవతారం ఎత్తాడు. లవ్‌స్టోరీ క్లయిమాక్స్‌కు వచ్చిందన్న అతని ఆనందాన్ని ఓ కొరియర్ కవర్ ఆవిరి చేసింది. మరి.. ఆ కవర్లో ఏముందో ఈ నెల 17న నితిన్ వెండితెర మీద చెబుతానంటున్నారు. ఆయన హీరోగా దర్శకుడు గౌతమ్ మీనన్ సమర్పణలో ప్రేమకథ నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేమ్‌సాయి తెరకెక్కించిన చిత్రం ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’. స్వతహాగా పవన్‌కల్యాణ్ అభిమాని అయిన నితిన్ ఈ చిత్రం టైటిల్‌ని ఎంతో ఇష్టంగా పెట్టుకు న్నారని, పవన్ అభిమా నులను అలరించే సన్నివేశాలు ఇందులో ఉన్నాయని గౌతమ్ మీనన్ చెప్పారు. -
కొరియర్ బోయ్ కళ్యాణ్ ట్రైలర్ విడుదల
ఒక వైపు నిర్మాతగా.. మరోవైపు హీరోగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు నితిన్. తాజా నితిన్ హీరోగా నటిస్తున్న 'కొరియర్ బోయ్ కళ్యాణ్' సినిమా ట్రైలర్ మంగళవారం సాయంత్రం విడుదలైంది. మహేశ్‌బాబు 'శ్రీమంతుడు' సినిమాతో స్ఫూర్తి పొందాడో ఏమో గానీ.. ఈ సినిమాలో నితిన్ కూడా సైకిల్ తొక్కాడు. హీరోయిన్ యామీ గౌతమ్ తన స్నేహితురాళ్లతో కలిసి ఆటోలో వెళ్తుండగా ఈ సైకిల్ తొక్కే సీన్ ఉంటుంది. ఎంట్రీలో నితిన్ చేతిలో ఓ కవర్ పట్టుకుని పరుగు పెడుతూ కనిపిస్తాడు. అతడిని ఓ నలుగురు వెంబడిస్తారు. తర్వాత విదేశాల్లో ఆస్పత్రి కేంద్రంగా జరిగే అక్రమం, ఆ తర్వాత అవినీతిపై పోరాడుతున్నట్లుగా కనిపించే నాజర్, ఇలాంటి సన్నివేశాలన్నీ ఉంటాయి. ఈ సినిమాకు కార్తీక్, అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. గౌతమ్ మీనన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రేమ్‌సాయి దర్శకత్వం వహిస్తున్నారు. -
మళ్ళీ మాయ చేయబోతున్న గౌతమ్...
-
రొమాంటిక్ హీరోగా చెర్రీ
మాస్ హీరోగా మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న రామ్‌చరణ్ రొమాంటిక్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. గతంలో ఇదే ప్రయత్నం చేసినా వర్క్ అవుట్ కాకపోవటంతో లాంగ్ గ్యాప్ తీసుకొని మరోసారి రొమాంటిక్ ఎంటర్ టైనర్ కు రెడీ అవుతున్నాడు. ఫీల్ గుడ్ సినిమాల స్పెషలిస్ట్ గా పేరున్న టాప్ డైరెక్టర్ తో సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడు. రామ్ చరణ్ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు. 'బ్రూస్లీ' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్టంట్ మాస్టర్ గా నటిస్తున్న చెర్రీ ఆ క్యారెక్టర్ కోసం రిస్కీ స్టంట్స్ కూడా చేస్తున్నాడు. చరణ్ కెరీర్లో ఒక్క 'ఆరెంజ్' తప్ప మిగతా సినిమాలన్నీ మాస్ యాక్షన్ జానర్ లో రూపొందినవే. కొత్తగా ప్రయత్నించిన ఆరెంజ్ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకోవటంతో, తరువాత అలాంటి ప్రయత్నం చేయటమే మానేశాడు. లాంగ్ గ్యాప్ తరువాత ఇప్పుడు మరోసారి రొమాంటిక్ ఎంటర్టైనర్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు. ఆ జానర్ సినిమాలు చేయటంలో స్పెషలిస్ట్ గా పేరున్న గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ సినిమాకు ప్లాన్ చేసుకుంటున్నాడు. గౌతమ్ ప్రస్తుతం నాగచైతన్య హీరోగా 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా పూర్తవ్వగానే చరణ్ తో చేయబోయే సినిమా స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టనున్నాడు. ఈ లోగా చరణ్ కూడా 'బ్రూస్లీ' షూటింగ్ పూర్తి చేసి నెక్ట్స్ సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఇప్పటికే సురేందర్ రెడ్డి తో సినిమా అంగీకరించిన చరణ్ ఏ సినిమాను స్టార్ట్ చేయనున్నాడో తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
కొరియర్ బాయ్ పీకె
అనగనగా ఓ కొరియర్ బాయ్. కరడు గట్టిన పవన్‌కల్యాణ్ వీరాభిమాని. తనను అందరూ పీకే అని పిలవాలని కోరుకుంటాడు. అందరూ అతన్ని పీకే అనే పిలుస్తుంటారు. కానీ వాళ్ల దృష్టిలో పీకే అంటే పని లేని కల్యాణ్ అని. ఫ్లాష్‌బ్యాక్‌లో అతనికున్న పేరు ప్రతిష్ఠలు అలాంటివి. కేవలం ఒక అమ్మాయి కోసం ఆ ఉద్యోగంలో చేరతాడు. ఇక అక్కడి నుంచే అతనికి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అతని జీవితాన్ని ఓ కొరియర్ కవర్ మలుపు తిప్పుతుంది. అక్కడి నుంచి అతను ఎలాంటి సాహసాలు చేశాడనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’. దర్శకుడు గౌతమ్‌మీనన్ సమర్పణలో నితిన్, యామీ గౌతమ్ జంటగా వెంకట్ సోమసుందరం, రేష్మా ఘటాల, సునీత తాటి నిర్మించిన ఈ చిత్రానికి ప్రేమ్‌సాయి దర్శకుడు. ఈ నెల 11న ఈ చిత్రం విడుదల కానుంది. గౌతమ్ మీనన్ మాట్లాడుతూ - ‘‘రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది. ప్రేమ్‌సాయి బాగా తీర్చిదిద్దారు. కొత్తదనాన్ని కోరుకునే ప్రతి ఒక్కరినీ మెప్పించే సినిమా ఇది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్, అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం: సత్య పొన్మార్, రచనా సహకారం: కోన వెంకట్, హర్షవర్ధన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: స్వాతి రఘురామన్, విజయ్ శంకర్.