
సమంత, నాగచైతన్య తొలిసారి నటించిన సినిమా ఏమాయ చేశావే. 2010లో వచ్చిన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. గౌతమ్‌మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇక ఆన్ స్క్రీన్‌పై చై-సామ్‌ల కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాతో మొదలైన వీరి స్నేహం ఆ తర్వాత ప్రేమ, పెళ్లి దాకా వెళ్లింది. కానీ వీళ్ళ వివాహబంధం ఎక్కువ కాలం నిలవలేకపోయింది.
పెళ్లి చేసుకున్న నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఏమాయ చేశావే సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతుండగా, త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సీక్వెల్‌లో నాగచైతన్యనే హీరోగా నటించనుండగా, సమంత స్థానంలో రష్మిక నటించనున్నట్లు సమాచారం.
అంతేకాకుండా విడాకులు తీసుకున్నాక చై-సామ్ ఎదుర్కొన్న సమస్యలను కూడా సినిమాలో చూపించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందన్నది త్వరలోనే తెలియనుంది.
Comments
Please login to add a commentAdd a comment