Ye Maaya Chesave
-
గతంలో చాలా విషయాలు నన్ను బాధపెట్టాయి : సమంత
ఏమాయ చేశావే సినిమాతో వెండితెరకు పరిచమయైన హీరోయిన్ సమంత. తొలి సినిమాతోనే నటనతో ఆకట్టుకున్న సమంత జెస్సీ పాత్రలో యూత్‌ను మెస్మరైజ్ చేసింది. ఒక్క సినిమాతోనే బోలెడంత క్రేజ్ సంపాదించుకున్న సమంత ఆ తర్వాత పలు హిట్ సినిమాల్లో నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. తాజాగా ఏమాయ చేశావే సినిమా విడుదలై 13ఏళ్లు పూర్తయిన సందర్భంగా తన సినీ జర్నీపై సామ్ ఎమోషనల్ అయ్యింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేస్తూ.. మీరంతా నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలను ఎప్పటికీ మర్చిపోలేను. అందుకు ధన్యవాదాలు. గతంలో ఎన్నో విషయాలు నన్ను బాధపెట్టాయి. కానీ ఇప్పుడలా జరగదు. కేవలం ప్రేమ, కృతజ్ఞతతో మాత్రమే ముందుకు సాగుతున్నా అంటూ సామ్ పేర్కొంది. సినీ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌గా 13ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు సమంతకు పలువురు ప్రముఖులు, నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ప్రస్తుతం సమంత రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సిటీడెల్ అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: విడాకుల తర్వాత తొలిసారి సమంతతో ఉన్న ఫోటో షేర్ చేసిన చై -
విడాకుల తర్వాత తొలిసారి సమంతతో ఉన్న ఫోటో షేర్ చేసిన చై
సమంత-నాగచైతన్య తొలిసారి నటించిన సినిమా ఏమాయ చేశావే. గౌతమ్‌మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతోనే సమంత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే జెస్సీగా అలరించి కుర్రాళ్ల మనసు దోచుకుంది. అంతేకాదు ఇండస్ట్రీలోనూ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గానూ క్రేజ్ సంపాదించుకుంది. నాగ చైతన్య అంతకుముందే జోష్ అనే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైనా ఏమాయ చేశావే సినిమాతోనే తొలి హిట్ అందుకున్నాడు. తెరపైనే కాదు ఆఫ్ స్క్రీన్‌లోనూ చై-సామ్‌ల జోడికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా సెట్స్‌లోనే వీరిద్దరి మధ్య స్నేహం చిగురించింది. అలా మొదలైన వారి పరిచయం ప్రేమగా మారి 2017లో పెళ్లి చేసుకున్నారు. కానీ వ్యక్తిగత కారణాలతో 2021, అక్టోబర్ 2న విడిపోతున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు. టాలీవుడ్ క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారన్నది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. నాగచైతన్యతో విడాకుల తర్వాత అతనితో దిగిన ఫోటోలన్నింటిని సామ్ తన సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి డిలీట్ చేసిన సంగతి తెలిసిందే. అటు చై కూడా విడాకుల తర్వాత సామ్‌కు సంబంధించి ఎలాంటి పోస్టులు చేయలేదు. అయితే తాజాగా ఏమాయ చేశావే సినిమా వచ్చి నేటితో 13ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ఆ మూవీలో సమంతతో దిగిన ఓ ఫోటోను నాగచైతన్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. సెలబ్రేటింగ్ 13ఇయర్స్ అంటూ పోస్ట్ చేశాడు. సమంత కూడా ఏమాయ చేశావేకు పదమూడేళ్లు అంటూ పలు ఫోటోలను షేర్ చేసినా అందులో కేవలం తన ఫోటోలు మాత్రమే నెట్టింట పోస్ట్ చేసింది. దీంతో ఇద్దరి ఇన్‌స్టా పోస్టులు ఇప్పుడు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి. ❤️🫠#Yemaayachesave pic.twitter.com/9UL9j1528c — Movie Muthyam (@MovieMuthyam) July 22, 2022 -
ప్రేమికుల రోజు చూడాల్సిన స్పెషల్ మూవీస్ ఇవే..
వాలెంటైన్స్ డే.. ప్రేమికులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న రోజిది. ఎప్పటినుంచో ప్రేమలో మునిగి తేలుతున్నా ఎందుకో ప్రేమికులకు ఈరోజు మాత్రం కాస్త స్పెషల్ అని చెప్పొచ్చు. లవ్‌ను ఎక్స్‌ప్రెస్ చేయడానికి వాలెంటైన్స్ డేకి మించిన రోజు ఉండదని భావిస్తారు. అందుకే ప్రేమికుల రోజును మరింత స్పెషల్‌గా డిజైన్ చేసుకుంటారు. రెండు మనసుల్ని దగ్గర చేసే ప్రేమ మత్తు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి దేవదాసు దగ్గర్నుంచి లేటెస్ట్ సీతారామం వరకు ఎన్నో ప్రేమకథా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తనదైన మ్యాజిక్ చేశాయి. ప్రేమికుల రోజు సందర్భంగా ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీస్‌గా నిలిచిన సినిమాలేంటో చూసేద్దాం. ప్రేమికుల రోజు సోనాలి బింద్రే, కునాల్ జంటగా నటించిన ప్రేమికుల రోజు సినిమా వాలైంటైన్స్ డే స్పెషల్ మూవీస్‌లో టాప్ ప్లేస్‌లో ఉంటుందనడంలో సందేహం లేదు. కాథిర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఫేస్బుక్ ద్వారా ప్రేమలో పడటం, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోవడం, క్లైమాక్స్‌లో మళ్లీ కలవడం ఇలా ప్రతీ సీన్ ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. కథకు తోడు ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాను మరో స్థాయిలో నిలబెట్టింది. జయం దేశ డైరెక్షన్లో వచ్చిన జయం సినిమా అప్పట్లో ఓ సెన్సేషన్. నితిన్, సదా జంటగా నటించిన ఈ సినిమా హీరో,హీరోయిన్లకు స్టార్ ఇమేజ్ను తెచ్చిపెట్టింది. లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలోని పాటలు కూడా సూపర్ హిట్‌గా నిలిచాయి. తెలుగులో విజయం సాధించడంతో తమిళంలోనూ రీమేక్ చేయగా అక్కడ కూడా సూపర్ సక్సెస్ అయ్యిందీ చిత్రం. గీతాంజలి నాగార్జున, గిరిజ జంటగా నటించిన ఎవర్గ్రీన్ సినిమా గీతాంజలి. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పటికీ ఇప్పటికీ సూపర్ హిట్టే. ఇళయరాజ సంగీతం సినిమాకు మరో ఆణిముత్యంలా నిలిచింది. ఇప్పటికీ ఇందులోని సాంగ్స్, సన్నివేశాలు ఎవర్గ్రీన్. ఏ మాయ చేసావే నాగార్జున, సమంత జంటగా నటించిన సినిమా ఏ మాయ చేసావే. గౌతమ్ మీనన్ డైరక్షన్లో వచ్చిన ఈ సినిమా క్లాసిక్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా సమంతకు ఓవర్‌నైట్ స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ సినిమాను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది. ఈ మూవీ షూటింగ్ టైంలోనే సమంత, నాగ చైతన్య మధ్య స్నేహం కుదిరింది. పెళ్లికి దారితీసింది. కానీ ఏమైందో ఏమో మనస్పర్థల కారణంగా వాళ్లు విడాకులు తీసుకున్నారు. ఆర్య సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన అందమైన ప్రేమ కథ ఆర్య. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా బన్నీకి స్టార్డమ్కు తెచ్చిపెట్టింది. అప్పటికి వరకు వచ్చిన ప్రేమకథలకు బిన్నంగా తెరకెక్కిన ఆర్య సినిమా యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. ‘ఫీల్ మై లవ్’ అంటూ దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో ఆకట్టుకున్నారు. ఇప్పటికీ ఈ పాట ప్రపోజ్ డేకు బెస్ట్ సాంగ్ అని చెప్పొచ్చు. లవ్ ఎట్ సైట్, ట్రయాంగిల్ లవ్‌స్టోరీని ఆసక్తికరంగా తెరకెక్కించడంలో డైరెక్టర్ సూపర్ సక్సెస్ అయ్యారు. లవ్‌స్టోరీ నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం లవ్‌స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కేవలం లవ్ యాంగిల్లోనే కాకుండా కుల వివక్ష, చిన్నతనంలోనే లైంగిక వేధింపులు వంటి సెన్సిటివ్ అంశాలను టచ్ చేశారు. నిజానికి శేఖర్ కమ్ముల గత సినిమాల కంటే ఇది కాస్త భిన్నమైనదనే చెప్పాలి. కథలో ఇంటెన్స్ స్టోరీతో పాటు టైటిల్‌కు తగ్గట్లుగా మంచి ఫీల్‌గుడ్ పాటలతో సాగిన ఈ చిత్రం వాలైంటైన్స్ డే స్పెషల్ మూవీస్‌లో ఒకటి. వీటితో పాటు సఖి, దేవదాసు, ప్రేమనగర్, ప్రేమదేశం, వర్షం, సీతారామం సహా ఎన్నో ప్రేమకథలు వెండితెరపై మరుపురాని చిత్రాలుగా నిలిచాయి. -
చైతూతో ‘ఏ మాయ చేశావే- 2’.. హీరోయిన్ సమంత కాదట!
సమంత, నాగచైతన్య తొలిసారి నటించిన సినిమా ఏమాయ చేశావే. 2010లో వచ్చిన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. గౌతమ్‌మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇక ఆన్ స్క్రీన్‌పై చై-సామ్‌ల కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాతో మొదలైన వీరి స్నేహం ఆ తర్వాత ప్రేమ, పెళ్లి దాకా వెళ్లింది. కానీ వీళ్ళ వివాహబంధం ఎక్కువ కాలం నిలవలేకపోయింది. పెళ్లి చేసుకున్న నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఏమాయ చేశావే సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతుండగా, త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సీక్వెల్లో నాగచైతన్యనే హీరోగా నటించనుండగా, సమంత స్థానంలో రష్మిక నటించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా విడాకులు తీసుకున్నాక చై-సామ్ ఎదుర్కొన్న సమస్యలను కూడా సినిమాలో చూపించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందన్నది త్వరలోనే తెలియనుంది. -
‘ఏ మాయ చేసావె 2’ చేయాలనుంది: గౌతమ్ మీనన్
‘‘ఓటీటీలు వచ్చిన తర్వాత ప్రపంచం, సినిమా పరిశ్రమ చిన్నవి అయిపోయాయి. ఇతర భాషల సినిమాలను కూడా ప్రేక్షకులు చూస్తున్నారు. నిజాయితీగా చెప్పాలంటే సినిమాకు భాష లేదు. ‘లైఫ్ ఆఫ్ ముత్తు’ చిత్రంలో కొన్ని పాత్రలు హిందీ మాట్లాడతాయి. ఈ డైలాగ్స్ ప్రేక్షకులకు అర్థం కాకపోయినా భావం అర్థం అవుతుంది’’ అని దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ అన్నారు. శింబు కథానాయకుడిగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ ‘వెందు తనిందదు కాడు’. సిద్ధీ ఇద్నాని కథానాయిక. ఇషారి.కె. గణేష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమాను ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ టైటిల్‌తో శ్రీ స్రవంతి మూవీస్ సంస్థ ఈ నెల 17న తెలుగులో విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా గౌతమ్ మీనన్ మాట్లాడుతూ–‘‘పల్లెటూరులో జీవించే ముత్తు ముంబై వెళ్లి, అనుకోకుండా చీకటి ప్రపంచంలోకి వెళ్తాడు. ఆ తర్వాత ఎలా బయట పడ్డాడు? అన్నదే కథ. రెహమాన్‌గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. కథ డిమాండ్ చేయడంతోనే ఈ సినిమాను రెండు పార్టులుగా రిలీజ్ చేస్తున్నాం. ‘లైఫ్ ఆఫ్ ముత్తు’ను తెలుగులో ‘స్రవంతి’ రవికిశోర్‌గారు విడుదల చేయడం హ్యాపీ. నేను, రామ్ చేయాలనుకుంటున్న మూవీ వేసవి తర్వాత ఉండొచ్చు. కమల్‌హాసన్‌గారితో ‘రాఘవన్ 2’ చేయాలనే ప్లాన్ ఉంది. వెంకటేష్‌గారితో ‘ఘర్షణ 2’, నాగచైతన్యతే ‘ఏ మాయ చేసావె 2’ చేయాలనుంది. విక్రమ్‌తో నేను తీసిన ‘ధృవనక్షత్రం’ ఈ డిసెంబరులో రిలీజ్ అవుతుంది’’ అన్నారు. -
'నా ప్రేమకథ ఎప్పటికీ ముగియదు,సమంత ఎమోషనల్ పోస్ట్
Samantha Emotional Post On Her 12 Years Career: 'ఏమాయ చేశావే’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన సమంత చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి నేటికి 12 ఏళ్లు పూర్తి కావొస్తుంది. గౌతమ్‌మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతోనే సమంత తెరంగేట్రం చేసింది. ఈ చిత్రం విడుదలైన నేటికి 12ఏళ్లు. ఈ సందర్భంగా తన సినీ జర్నీని తెలియజేస్తూ సామ్ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేసుకుంది. 'చిత్ర పరిశ్రమలో నటిగా నా ప్రయాణం మొదలై నేటికి 12 సంవత్సరాలు. చదవండి: 'ప్రాణహాని ఉంది.. నా ప్రైవసీని అతిక్రమించారు' సమంత పోస్ట్ వైరల్ లైట్స్, కెమెరా, యాక్షన్.. వీటి చుట్టూ నాకున్న మధుర ఙ్ఞాపకాలు, అద్భుతమైన అనుభూతులకు 12 ఏళ్లు. ఇన్నేళ్ల ప్రయాణంలో ప్రపంచ వ్యాప్తంగా నిస్వార్థమైన అభిమానులను పొందినందుకు ఆనందంగా ఉంది. సినిమాపై నాకున్న ప్రేమ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా' అంటూ సమంత పేర్కొంది. కాగా ఈ సినిమాతోనే సమంత-నాగ చైతన్య తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అలా మొదలైన వారి పరిచయం ప్రేమగా మారి 2017లో పెళ్లి చేసుకున్నారు. కానీ వ్యక్తిగత కారణాలతో 2021, అక్టోబర్ 2న విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తన తొలి సినిమా గురించి సమంత పోస్ట్ చేయడం ఆసక్తిగా మారింది. చదవండి: బిగ్‌బాస్ నాన్‌స్టాప్: 24 గంటలు, 84 రోజులు, 17మంది కంటెస్టెంట్లు View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
లేటెస్ట్ ఏమాయచేశావే పాట విన్నారా?
సముద్రాల సినీ క్రియేషన్స్ పతాకంపై బేబీ అన్య ఆనంద్ సమర్పణలో సముద్రాల మంత్రయ్య బాబు నిర్మిస్తున్న చిత్రం "లవ్ యు రా".. ప్రసాద్ ఏలూరి దర్శకుడు. చిను క్రిష్ హీరోగా గీతా రతన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇంట్రెస్టింగ్ పాయింట్ తో లవర్ స్టోరీ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాలో శేఖర్, సాయినాధ్, మధు ప్రియ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా ఈశ్వర్ పెరవళి సంగీతం, రవి బైపల్లి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. వైవిధ్యమైన ప్రేమ కథాంశంతో యూత్ ఆడియన్స్ కి నచ్చేలా తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అతి త్వరలో రిలీజ్ కాబోతుంది. కాగా ఈ చిత్రంలోని "ఏమాయచేశావే" పాటను తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు కోటి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ.. లవ్ యూ రా సినిమా పాటను రిలీజ్ చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. పాట చాల బాగుంది. మంచి కంపోజ్ చేశాడు సంగీత దర్శకుడు ఈశ్వర్.. వినగానే క్యాచీ గా అనిపించింది. హరిచరణ్ గారు పాడిన ఈ పాటను మీ అందరికి నచ్చుతుంది. విజువల్స్ బాగున్నాయి.. కొరియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉన్నాయి. సాంగ్ వింటుంటే ఫ్రెష్ అనిపించింది.. టీం అందరికి అల్ ది బెస్ట్ అన్నారు.. చిను క్రిష్, గీతికా రతన్, శేఖర్, సాయినాధ్, మధు ప్రియ, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్; ఈశ్వర్ పెరవళి, కెమెరా; రవి బైపల్లి, సుధాకర్ నాయుడు, పాటలు; రాజరత్నం బట్లూరి, కొరియోగ్రఫీ; బ్రదర్ ఆనంద్, పోస్ట్ ప్రొడక్షన్ సి2సి స్టూడియో, ప్రొడక్షన్ మేనేజర్; వి.సుధాకర్, పీఆర్ఓ; సాయి సతీష్, నిర్మాత; సముద్రాల మంత్రయ్య బాబు, దర్శకత్వం; ప్రసాద్ ఏలూరి. -
స్పెషల్ డే ఫర్ సమంత; జీవితాన్నే మార్చేసింది!
టాలీవుడ్ హీరోయిన్ సమంతకు ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. తన జీవితంలో ఓ సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టింది ఈరోజే. ఆమె నటించిన తొలి సినిమా విడుదలై నేటికి 11 ఏళ్లు పూర్తయ్యాయి. ఏమాయా చేసావే సినిమాతో ఇండస్ట్రీలో కాలుమోపి విజయవంతంగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ కుందనపు బొమ్మ కుర్రకారుని తన మాయలో పడేసింది. ఈ సినిమా సమంత జీవితాన్నే మలుపుతిప్పిందని చెప్పవచ్చు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను మంజుల ఘట్టమనేని నిర్మించారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. ఇందులో నాగచైతన్య సరసన నటించిన సమంత తరువాత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైంది. ఇండస్ట్రీలోకి వచ్చి పదకొండేళ్లు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా సమంత స్పందించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్టు చేశారు. ‘సినిమా.. ఫస్ట్ లవ్ కదా. అంత ఈజీగా తగ్గదు. హ్యపీ యానివర్సరీ టూ మీ. 11 ఏళ్లు పూర్తయ్యాయి. అండ్ హ్యపీ యానివర్సరీ టూ యూ. నా జర్నీలో భాగమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మీరు లేకుండా ఇదంతా సాధించలేను. ఎన్నో జ్ఞపకాలు ఉన్నాయి. ఇది చాలా చాలా ప్రత్యేకం’ అని భావోద్వేగానికి లోనయ్యారు. అదే విధంగా తన మీద నమ్మకంతో సినిమా అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు గౌతమ్ మీనన్, నాగచైతన్యకు ధన్యవాదాలు తెలిపారు. చదవండి: శాకుంతల సిద్ధమవుతున్నారు ఇక ఈ పదకొండేళ్ల ప్రయాణంలో సమంత ఎన్నో ఒడిదుడుకులు, సవాళ్లను ఎదుర్కొని సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతున్నారు. అట్టర్ ఫ్లాప్‌ల నుంచి అద్భుత విజయాల వరకు అన్నీ ఆమె ఖాతాలో భాగమే. కేవలం నటిగానే కాకుండా ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా సేవ చేస్తూ మంచి వ్యక్తిగా కూడా పేరొందారు. కాగా ఏమాయ చేసావేతో ప్రేమలో పడిన చైతూ, సమంత కొన్నేళ్లు ప్రేమించుకొని 17 ఆక్టోబర్ 2017లో పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలెక్కారు. పెళ్లి అనంతరం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్‌లు, పలు బిజినెస్‌లతో తమిళ పొన్ను బిజీగా గడుపుతున్నారు. చదవండి: ఆస్కార్ బరిలో సూర్య సినిమా.. భారత్ నుంచి ఆ ఒక్కటే ఇక అది అలా ఉంటే ఆమె ఇటీవల గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమాకు ఓకే చెప్పిన విషయం తెలిసింది. ఈ సినిమా షూటింగ్ మార్చి 20 నుండి మొదలుకానుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంతో పాటు హిందీ భాషలలోను విడుదల చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో దుష్యంతుడి పాత్రలో ఓ మలయాళ నటుడు కనిపిస్తారని టాక్. ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడు. View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) -
జెస్సీకి కార్తీక్ ఫోన్.. ఆ తర్వాత ఏమైంది?
అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా కనిపించిన తొలి చిత్రం ‘ఏ మాయ చేసావే’. దాదాపు పదేళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి వచ్చిన ఈ చిత్రానికి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించారు. ‘విన్నైతాండి వరువాయ’ పేరిట తమిళంలో విడుదలైన ఈ చిత్రంలో త్రిష, శింబులు కార్తీక్, జెస్సీలుగా నటించారు. తాజాగా శింబు- త్రిషలపై ఓ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించాడు గౌతమ్. ఈ షార్ట్ ఫిల్మ్‌లో శింబు, త్రిషకి కాల్ చేయడమే కథాంశం. వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారన్నది సన్నివేశాలుగా చూపించారు. ప్రభుత్వ లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ ఎవరి ఇంట్లో వారుంటూ తీసిన షార్ట్ ఫిల్మ్ ఇది. ఇక ఏఆర్ రెహ్మాన్ నేపథ్య సంగీతాన్ని అందించడం మరో విశేషం. ‘కార్తీక్ డయల్ సేతాయన్’ పేరుతో విడుదలైన ఈ షార్ట్‌ఫిలిం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. అయితే తెలుగులో చైతూ, సామ్‌లతో ఈ విధంగానే ఓ షార్ట్ ఫిలిం చేస్తే బాగుంటుందని టాలీవుడ్ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. చదవండి: రానా నిశ్చితార్థం జరిగిపోయిందా? సినిమాలకు సడలింపులు ఇవ్వాలి -
నన్ను మార్చివేసిన పాత్ర అది: సమంత
సాక్షి, తమిళసినిమా: జెస్సీని జీవితంలో మరవలేను అంటున్నారు సమంత అక్కినేని.. పుట్టినిల్లు చెన్నైను వదిలి మెట్టినిల్లు హైదరాబాద్‌లో మకాం పెట్టిన ఈ అమ్మడు.. వివాహానంతరం సక్సెస్ఫుల్ హీరోయిన్‌గానే కాదు అగ్ర కథానాయికగా కూడా రాణిస్తున్నారు. తమిళం, తెలుగు భాషల్లో క్రేజీ హీరోయిన్గా వెలుగొందుతున్న సమంత ఇటీవల తన సినీ అనుభవాలను పంచుకున్నారు. నటీనటులకు ఏ పాత్ర ఎంతగా నచ్చుతుందో చెప్పలేమని, అయితే, పాత్రలను సులభంగా చేయగలమని ఎప్పుడూ నటులు భావించరాదని సమంత చెప్పారు. సుదీర్ఘ తన సినీప్రయాణంలో తాను నటించిన ప్రతి పాత్ర తనకు ముఖ్యమైనదేనని తెలిపారు. చేసే పాత్రను అర్థం చేసుకుని.. ఆ పాత్రగా మారడానికి ప్రయత్నిస్తానని, అలా సినిమాల్లోని పాత్రల ద్వారా జీవితంలోని మంచిచెడులను దగ్గరగా చూశానని, చాలా విషయాలు తెలుసుకున్నానని తెలిపారు. తాను నటించిన ‘ఏ మాయ చేశావే’ చిత్రంలోని జెస్సీ పాత్రను జీవితంలో మరవలేనని, తననే మార్చిన పాత్ర అది అని సమంత పేర్కొన్నారు. నటిగా తాను నిలదొక్కుకోవడానికి జెస్సీ పాత్రనే కారణమని చెప్పారు. ఈ సినిమా తర్వాతనే సమంతకు ఎలాంటి పాత్రలను ఇవ్వాలన్నది దర్శకులు ఆలోచించడం మొదలెట్టారని, మంచి పాత్రలు రావడానికి ఆ చిత్రమే కారణమని తెలిపారు. అప్పటినుంచి పాత్రల ఎంపికలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించినట్లు చెప్పారు. ఆ ప్రయాణమే నటిగా తననీ స్థాయిలో నిలబెట్టిందని తెలిపారు. యూటర్న్ చిత్రం తరువాత ఒక ప్రయోగాత్మక చిత్రంలో నటించడానికి సమంత సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆ చిత్రం కోసం 70 ఏళ్ల బామ్మగా మారడానికి ఆమె సిద్ధమవుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. -
మరోసారి మాయ చేస్తారా..?
నాగచైతన్య కెరీర్‌ను మలుపు తిప్పిన సూపర్ హిట్ సినిమా ఏ మాయ చేసావే. తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు తమిళ భాషలో ఘనవిజయం సాధించింది. తెలుగులో నాగచైతన్య, సమంతలు హీరో హీరోయిన్లుగా నటించగా.. కోలీవుడ్‌లో శింబు, త్రిషలు జంటగా నటించారు. రెండు భాషల్లోనూ సూపర్ హిట్ అయిన ఈ సినిమాకు సీక్వెల్‌ను రూపొదించేందుకు దర్శకుడు గౌతమ్ మీనన్ చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా శింబు విన్నైతాండీ వరువైన్ (ఏ మాయ చేసావే తమిళ టైటిల్)కు సీక్వెల్‌ను త్వరలో ప్రారంభించనున్నట్టుగా ప్రకటించారు. మరోసారి శింబు, గౌతమ్ మీనన్, ఏఆర్ రెహమాన్ లు ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వాములౌతున్నట్టుగా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చారు. దీంతో ఏ మాయ చేసావే సీక్వెల్ మరోసారి తెర మీదకు వచ్చింది. తొలి భాగం తెరకెక్కించినట్టుగా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిస్తారా..? మరోసారి కార్తీక్ పాత్రలో నటించేందుకు చైతూ అంగీకరిస్తాడా..? తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో ప్రేమికులుగా నటించిన చైతూ, సమంతలు తరువాత నిజజీవితంలోనూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరు మరోసారి మాయ చేసేందుకు రెడీ అవుతారా.. లేదా? తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
ఎనిమిదేళ్ల క్రితం ఎక్కడ మొదలైందో..!
న్యూయార్క్ : మధుర క్షణాలు అందించిన ప్రాంతాలకు మరల వెళ్లి ఆ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటే ఆ ఆనందమే వేరు. ప్రస్తుతం నాగ చైతన్య, సమంత చేస్తున్నది అదే. పెళ్లి చేసుకున్న తర్వాత షూటింగులతో బిజీగా ఉండటంతో చేతూసామ్లు కలిసి ఎక్కడికీ వెళ్లలేకపోయారు. ప్రస్తుతం షూటింగ్‌లకు కాస్త విరామమిచ్చి ఎంజాయ్ చేయడానికై వారి ప్రేమ ఎక్కడ మొదలైందో అక్కడికే వెళ్లారు. ‘ఏ మాయ చేసావే’ సినిమా షూటింగ్ సమయంలో న్యూయర్క్ లోని సెంట్రల్ పార్క్‌లో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కట్ చేస్తే ఎనిమిది సంత్సరాల తర్వాత వీరు భార్యభర్తలుగా ఆ ప్రాంతాన్ని సందర్శించి తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. సెంట్రల్‌పార్క్ దగ్గర దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సమంత.. ‘‘సాధారణంగా సెల్ఫీలు దిగటం అంతగా ఇష్టం ఉండదు, కానీ ఇలాంటి మధుర క్షణాలు ఫోటోలో బంధిస్తేనే బాగుంటుంది. ఎనిమిదేళ్ల క్రితం మా ప్రేమ ఇక్కడే మొదలైంది.. థ్యాంక్యూ సెంట్రల్ పార్క్ అని’’ సమంత పోస్ట్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. రంగస్థలం భారీ హిట్ కావడం, తన నటనతో విమర్శకులతో సైతం మెప్పించుకోవడంతో సమంత ఫుల్ హ్యపీగా ఉంది. ఇక సవ్యసాచి సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న నాగచైతన్య కాస్త విరామం దొరకడంతో సమంతతో కలిసి న్యూయార్క్‌లో విహరిస్తున్నాడు. Usually hate selfies but this had to be done .. 💕 Central Park .. where it all began . 8 years ago.. Thankyou for the magic ..just had to come back and say Thankyouuu❤️ #whatsmeanttobewillbe #lovewillfindaway #NewyorkNewyork💕 #familyiseverything #chaylove #happilyeverafter #YMC A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on Mar 31, 2018 at 3:52pm PDT -
ఆనందపడాలా? బాధపడాలా?
‘ఏ మాయ చేసావె’ చిత్రంతో తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చారు హీరోయిన్ సమంత. ఆ చిత్రంలో చేసిన ‘జెస్సీ’ పాత్రతో చెరగని ముద్ర వేశారీ బ్యూటీ. ఆ తర్వాత ‘దూకుడు, ఈగ, మనం, అఆ, జనతా గ్యారేజ్, అదిరింది’ వంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించారామె. అందుకే తమిళ, తెలుగు ఇండస్ట్రీల్లో అగ్రకథానాయికల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. కానీ ఓ విషయంలో మాత్రం సమంతకు ఆనందపడాలో, బాధపడాలో అర్థం కాక అయోమయస్థితిలో ఉంటున్నారట. ఆ విషయం ఏంటంటే... ఇప్పటికీ సమంత దగ్గర ‘ఏ మాయ చేసావె’ సినిమా గురించే చాలామంది ప్రస్తావిస్తున్నారట. ‘‘ఎన్నో సినిమాలు చేశాను. ఎందుకు ఆ సినిమా గురించే పదే పదే మాట్లాడుతున్నారు. ఆ సినిమా నాకు వెరీ వెరీ స్పెషల్. కాదనను. కానీ ఆ తర్వాత నేను ఎన్నో సినిమాల్లో మంచి పాత్రలు చేశాను. వాటి గురించి ఎందుకు మాట్లాడరు? అంటే.. ‘ఏ మాయ చేసావె’ తర్వాత నేను అంత బాగా యాక్ట్ చేయలేదా? అని సమంత దిగాలు పడుతున్నారట. సోషల్ మీడియాలో రీసెంట్గా ఫ్యాన్స్‌తో జరిగిన ఓ ఇంట్రాక్షన్లో ఓ ఫ్యాన్ ‘ఏ మాయ చేసావె’ గురించి అడిగినప్పుడు.. తన ఆవేదనను వ్యక్తం చేశారు. అలాగే, ఏడేళ్ల క్రితం చేసిన సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడుతున్నారంటే ఓవైపు ఆనందంగానే ఉందని కూడా అంటున్నారామె. ఈ సంగతి ఇలా ఉంచితే... వచ్చే ఏడాది మొదటి మూడు నెలలు ముగిసేలోపు సమంత మూడు సార్లు థియేటర్స్‌లో సందడి చేయనున్నారు. ఆమె కథానాయికగా నటించిన తమిళ చిత్రం ‘ఇరుంబుదరై’ జనవరి 26న, కీలకపాత్ర చేసిన తెలుగు ‘మహానటి’ మార్చి 29న, హీరోయిన్గా చేసిన ‘రంగస్థలం’ మార్చి 30న విడుదల కానున్నాయి. మూడు నెలలు ముగిసేలోపు సమంతను మూడుసార్లు సిల్వర్‌స్క్రీన్‌పై చూడటం అభిమానులకు పండగలా ఉంటుంది. -
మేజిక్ అంతా ఒక్క సినిమాతోనే!
‘‘నేను, నాది అనే స్వార్థంలో ఆనందం లభించదు. ‘మనం’ అనే ఫీలింగ్‌లో ఎంతో హాయి ఉంటుంది’’ అంటున్నారు సమంత. అందం, అభినయం రెండూ సొంతం చేసుకున్నారు కాబట్టే.. తక్కువ సమయంలో ‘స్టార్ హీరోయిన్’ అయ్యారామె. అయితే, ఇదంతా పూర్తిగా తన క్రెడిట్ మాత్రమే కాదంటూ- ‘‘మామూలు ఆర్టిస్ట్‌ని ‘స్టార్’ని చేసేది వాళ్లు పోషించే పాత్రలు. నిరూపించుకోదగ్గ పాత్రలు చేసి, మంచి సక్సెస్‌లు చేజిక్కించుకుని ‘స్టార్’ అవుతాం. కానీ, ఆ స్టార్ హోదా అలా కొనసాగాలంటే ప్రేక్షకుల అభిమానం ఎంతో ముఖ్యం. వాళ్లు అభిమానించకపోతే ‘స్టార్’ అనిపించుకోలేం. ఇక, సినిమా పరిశ్రమ గురించి చెప్పాలంటే, చాలా విచిత్రమైంది. ఇవాళ నువ్వు ఏమీ కావు.. కానీ ఒక్క సక్సెస్ వచ్చిందంటే చాలు, రేపటికల్లా సూపర్ స్టార్ అయిపోతావ్. మేజిక్ అంతా ఒక్క సినిమాతోనే జరిగిపోతుంది. ‘ఏ మాయ చేశావె’తో నా అందం, అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. ‘ఈగ’ తర్వాత పెద్ద సంస్థల్లో చేసే అవకాశం వస్తోంది. అందుకే చెబుతున్నా... ఒక్క సినిమా జీవితాన్ని మార్చేస్తుందని. ఒకవేళ టైమ్ బాగాలేదనుకోండి... ఆ ఒక్క సినిమానే జీవితాన్ని తారుమారు చేస్తుంది. అందుకే జయాపజయాలకు సమానంగా స్పందిస్తూ వెళ్లిపోవాలి. సక్సెస్‌ని నెత్తికెక్కించుకుంటే కష్టం. అలాగే ‘నా జీవితం.. నా ఆనందం’ అని కాకుండా ఇతరులకు కూడా సహాయపడితే అప్పుడు నిజమైన ఆనందాన్ని చవిచూడొచ్చు’’ అన్నారు సమంత.