
ఏమాయ చేశావే సినిమాతో వెండితెరకు పరిచమయైన హీరోయిన్ సమంత. తొలి సినిమాతోనే నటనతో ఆకట్టుకున్న సమంత జెస్సీ పాత్రలో యూత్‌ను మెస్మరైజ్ చేసింది. ఒక్క సినిమాతోనే బోలెడంత క్రేజ్ సంపాదించుకున్న సమంత ఆ తర్వాత పలు హిట్ సినిమాల్లో నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. తాజాగా ఏమాయ చేశావే సినిమా విడుదలై 13ఏళ్లు పూర్తయిన సందర్భంగా తన సినీ జర్నీపై సామ్ ఎమోషనల్ అయ్యింది.
ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేస్తూ.. మీరంతా నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలను ఎప్పటికీ మర్చిపోలేను. అందుకు ధన్యవాదాలు. గతంలో ఎన్నో విషయాలు నన్ను బాధపెట్టాయి. కానీ ఇప్పుడలా జరగదు. కేవలం ప్రేమ, కృతజ్ఞతతో మాత్రమే ముందుకు సాగుతున్నా అంటూ సామ్ పేర్కొంది.
సినీ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌గా 13ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు సమంతకు పలువురు ప్రముఖులు, నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ప్రస్తుతం సమంత రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సిటీడెల్ అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: విడాకుల తర్వాత తొలిసారి సమంతతో ఉన్న ఫోటో షేర్ చేసిన చై
Comments
Please login to add a commentAdd a comment