![Tollywood Actress Samantha Criptic Post After Naga Chaitanya Comments](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/sama.jpg.webp?itok=-OLk63ZH)
ఇటీవల టాలీవుడ్ హీరోయిన్ సమంత పేరు ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. నాగచైతన్య- శోభిత పెళ్లి తర్వాత సామ్ పేరు ఏదో ఒక సందర్భంలో బయటికి వినిపిస్తోంది. ఇటీవల బాలీవుడ్ డైరెక్టర్‌తో డేటింగ్‌లో ఉందంటూ మరోసారి రూమర్స్ వైరలైన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలోనే సమంత చేసిన తాజా పోస్ట్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇటీవల నాగచైతన్య సైతం తన పెళ్లి, విడాకుల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దీంతో సమంత చేసిన క్రిప్టిక్ పోస్ట్‌పై నెట్టంట చర్చ మొదలైంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం పదండి.
సమంతా తన పోస్ట్‌లో ఆధ్యాత్మిక గురువు సద్గురు చెప్పిన కోటేషన్‌ను షేర్ చేసింది. అందులో.. 'ఒక మనిషిగా ఈ ప్రపంచంలో మీరు శాశ్వతం కాదు. ఇది ఎప్పటికప్పుడు మారుతూ నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఇక్కడ ఏదీ స్థిరంగా ఉండదు. ఈ ప్రపంచంలో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండవచ్చు.' అని ఆ కోట్‌లో రాసి ఉంది. ఈ పోస్ట్‌ను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది ఈ ముద్దుగుమ్మ.
![sam](https://www.sakshi.com/s3fs-public/inline-images/sam_2.jpg)
విడాకులపై స్పందించిన నాగచైతన్య..
టాలీవుడ్ హీరో నాగచైతన్య తన మాజీ భాగస్వామి సమంత గురించి మొదటిసారి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. వారు వివాహబంధం నుంచి విడిపోయిన తర్వాత పలుమార్లు సమంత రియాక్ట్ అయిన విషయం తెలిసిందే. కానీ, నాగచైతన్య ఇప్పటి వరకు విడాకుల గురించి ఎక్కడా మాట్లాడలేదు. విడాకులు తీసుకున్న నాలుగేళ్ల తర్వాత ఆయన రియాక్ట్ అయ్యారు. సమంతతో విడిపోయిన తర్వాత చాలా నెగటివ్ కామెంట్లు వచ్చాయని ఆయన అన్నారు. తను, నేను ఇద్దరం ఆలోచించే విడిపోవాలని నిర్ణయం తీసుకున్నామని గుర్తుచేశారు. అయినప్పటికీ చాలామంది నెగటివ్ కామెంట్లు ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారని ఆయన అన్నారు.
నా లైఫ్‌లో రియల్ హీరో ఆమెనే..
నటి శోభితాతో పెళ్లి విషయం గురించి ప్రకటించిన తర్వాత కూడా నెగటివ్‌గానే కామెంట్లు చేశారని చైతన్య అన్నారు. 'ఆమె నా జీవితంలోకి చాలా ఆర్గానిక్‌గానే ప్రవేశించింది. మా ఇద్దరి మధ్య మొదట ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే పరిచయం అయింది. అక్కడి నుంచి మా ప్రయాణం మొదలైంది. కానీ, తన గురించి బ్యాడ్‌గా మాట్లాడటం చాలా తప్పు. నా పర్సనల్ లైఫ్ గురించి ఆమె చాలా మెచ్యూర్‌గా ఆలోచిస్తుంది. నా జీవితంలో నిజమైన హీరో శోభితానే..' అంటూ పేర్కొన్నారు.
కాగా.. సమంత, నాగ చైతన్య 2017లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత పరస్పర నిర్ణయంతో 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. వీరిద్దరు కలిసి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన 'ఏ మాయ చేసావే'లో స్క్రీన్‌ను పంచుకున్నారు. ఆ తర్వాత వివాహానికి ముందు పలు చిత్రాలలో నటించారు.
ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు. ఈ సినిమాకు మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment