Samantha Visits Palani Murugan Temple Amid Myositis Recovery - Sakshi
Sakshi News home page

Samantha : 600మెట్లు ఎక్కిన సమంత.. ప్రత్యేక పూజలు ఎందుకో తెలుసా?

Published Tue, Feb 14 2023 12:53 PM | Last Updated on Tue, Feb 14 2023 2:17 PM

Samantha Visits Palani Murugan Temple Amid Myositis Recovery - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ సమంత ఈమధ్య కాలంలో నిత్యం ఏదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తోంది. నాగచైతన్యతో విడిపోయినప్పటి నుంచి సామ్‌ పేరు నెట్టింట ఎక్కువగా వినిపిస్తుంది. ఇక ఇటీవలె మయోసైటిస్‌ బారిన పడిన సమంత ప్రస్తుతం ఆ వ్యాధి నుంచి కోలుకుంటుంది. దీంతో తిరిగి సినిమాలు, యాడ్స్‌ షూటింగుల్లో పాల్గొంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఆమె తమిళనాడులోని పళని మురుగన్ ఆలయాన్ని దర్శించుకుంది. ఈ సందర్భంగా కొండ కింది నుంచి సుమారు 600 మెట్ల వరకు హారతి వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించింది.

ఇటీవలె అనోరోగ్యం నుంచి కోలుకోవడంతో సామ్‌ ఇలా మొక్కులు చెల్లించుకుందని సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కాగా చైతో డివోర్స్‌ అయిన సమయంలోనూ సామ్‌ ఎక్కువగా ఆధ్యాత్మికం వైపు అడుగేసి పలు ఆలయాలను సందర్శించిన సంగతి తెలిసిందే. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement