darshan
-
జైలు నుంచి రిలీజ్.. వెంటనే దర్శన్‌పై ప్రేమతో
కొన్ని నెలల క్రితం అభిమాని రేణుకాస్వామిని కన్నడ హీరో దర్శన్ హత్య చేయడం ఎంత కలకలం సృష్టించిందో తెలిసిందే. దీని తర్వాత పోలీసు కేసు నమోదు కావడం.. హీరో దర్శన్, అతడి ప్రియురాలు పవిత్ర గౌడ సహా పలువురి జైలుకెళ్లడం అప్పట్లో సెన్సేషన్ అయింది. కొన్నిరోజుల క్రితం అనారోగ్య సమస్యలతో దర్శన్‌కి బెయిల్ దక్కగా.. ఇప్పుడు పవిత్ర గౌడకు కూడా బెయిల్ లభించింది. వచ్చీ రావడంతోనే ప్రియుడిపై ప్రేమ బయటపెట్టింది.(ఇదీ చదవండి: 'కన్నప్ప' ఐదుసార్లు చూస్తా.. విష్ణుతో నెటిజన్ ట్వీట్ టాక్)దర్శన్‌కు ఇప్పటికే పెళ్లయినప్పటికీ.. పవిత్ర గౌడతో రిలేషన్ ఉందనే రూమర్స్ వచ్చాయి. కానీ పవిత్రని ఇబ్బంది పెట్టాడని దర్శన్.. రేణుకాస్వామిని హత్య చేయడం మాత్రం ప్రేమకు పరాకాష్టగా నిలిచింది. తొలుత ఆరోపణలు అనుకున్నారు గానీ బలమైన సాక్ష్యాధారాలు ఉండటంతో కొన్నినెలల పాటు వీళ్లిద్దరూ జైలు జీవితం గడపాల్సి వచ్చింది.తాజాగా పవిత్ర గౌడ బెయిల్‌పై రిలీజైంది. వచ్చీ రావడంతోనే వజ్రమునేశ్వర ఆలయానికి వెళ్లింది. అక్కడ దర్శన్ పేరుపై ప్రత్యేక పూజలు చేయించింది. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నట్లు తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ఈ కారణంతోనే బెయిల్‌పై బయటకొచ్చాడు. ఇప్పుడు దర్శన్ కోసం పబ్లిక్‌గానే పవిత్ర గౌడ ప్రేమ చూపించడం, ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అయిపోతోంది.(ఇదీ చదవండి: ఒక్క క్షణం కూడా వదలట్లేదు.. భర్త గురించి వరలక్ష్మి)ರೇಣುಕಾಸ್ವಾಮಿ ಕೇಸ್ನಲ್ಲಿ ಜೈಲು ಸೇರಿದ್ದ ನಟಿ ಪವಿತ್ರಗೌಡ ಬಿಡುಗಡೆಯಾಗಿದ್ದು, ವಜ್ರಮುನೇಶ್ವರ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ತೆರಳಿದ್ದಾರೆ. ಇದೇ ವೇಳೆ ನಟ ದರ್ಶನ್ ಹೆಸರಲ್ಲಿ ದೇವರಿಗೆ ವಿಶೇಷ ಪೂಜೆ ಸಲ್ಲಿಸಿದರು.@dasadarshan#PavithraGowda #DarshanThoogudeepa #MuneshwaraTemple #Bhagya #Darshan #RenukaswamyCase #Bengaluru pic.twitter.com/NUlC9XSRyP— NewsFirst Kannada (@NewsFirstKan) December 17, 2024 -
కన్నడ నటుడు దర్శన్‌కు బెయిల్
బొమ్మనహళ్లి: హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్‌కు భారీ ఊరట లభించింది. ఆయనతోపాటు ఏడుగురికి హైకోర్టు బెయిలిచ్చింది. వెన్నునొప్పితో బాధపడుతున్న దర్శన్ మధ్యంతర బెయిల్‌పై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టులో వేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. అనంతరం దర్శన్, అతడి సన్నిహితురాలు పవిత్రా గౌడ, ప్రదోశ్, అనుకుమార్, నాగరాజు, లక్ష్మణ్, జగదీష్‌కు బెయిల్ మంజూరు చేస్తు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురికి బెయిల్ లభించింది. పవిత్రా గౌడను దుర్భాషలాడాడనే కోపంతో రేణుక స్వామి అనే వ్యక్తిని చంపారనే ఆరోపణలపై దర్శన్‌ను జూలైలో పోలీసులు అరెస్ట్ చేశారు. -
దర్శన్ మానసిక స్థితి బాగాలేదు : లాయర్
కన్నడ నటుడు దర్శన్ అనారోగ్యంతో ఇబ్బుందులు పడుతున్న విషయం తెలిసిందే. రేణుకా స్వామి హత్య కేసులో ఈ కారణం వల్లే ఆయనకు ఆరు వారాల పాటు బెయిల్ లభించింది. వెన్నెముక శస్త్ర చికిత్స కోసం ఆయనకు కోర్టు తాత్కాలిక బెయిలు మంజూరు చేసింది. పాస్‌పోర్టును ట్రయల్ కోర్టుకు అప్పగించాలని, సాక్ష్యాలను తారుమారు చేయరాదని షరతు విధించింది.ఆపరేషన్ చేయడానికి దర్శన్ మానసికంగా సిద్ధంగా లేరని దర్శన్ తరపు లాయర్ హైకోర్టుకు తెలిపారు. ఆయన బెయిల్ మీద బయటకు వచ్చి ఇప్పటికే నాలుగు వారులు కావస్తుంది. అయితే, ఇన్ని రోజులైనా దర్శన్ ఆపరేషన్ చేయించుకోకపోవడంతో పోలీసులు సుప్రీంకోర్టుకు అప్పీలు వెళ్లారు. దర్శన్ బెయిలు రద్దు చేయాలని, లేదంటే ఆయన బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారని పోలీసులు అభిప్రాయపడ్డారు. దర్శన్‌కు ఆపరేషన్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారని, దర్శన్ కూడా మానసికంగా సిద్ధమవుతున్నారని, ముఖ్యంగా అధిక రక్తపోటు వల్ల ఆపరేషన్ వాయిదా పడుతోందని కోర్టుకు దర్శన్ తరుపు లాయర్ వివరించారు. అందుకు సంబంధించి వైద్యులు ఇచ్చిన రిపోర్టులను కూడా సమర్పించారు. ప్రస్తుతం కన్సర్వేటివ్ ఆపరేషన్ జరుగుతుందని తెలిపారు. ఫిజియోథెరపీ, మందులతో నొప్పిని అదుపులో ఉంచడం జరుగుతోందని వివరించారు. -
తిరుమలలో ‘టూరిజం’ దర్శనాలు రద్దు
తిరుమల: టూరిజం కార్పొరేషన్లకు కేటాయిస్తున్న శ్రీవారి దర్శన టికెట్లను రద్దు చేస్తూ టీటీడీ నూతన పాలక మండలి నిర్ణయం తీసుకుంది. తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తుంటారు. వీఐపీ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం తదితర విధానాల్లో భక్తులకు టీటీడీ స్వామివారి దర్శనం కల్పిస్తుంటుంది. వీటితో పాటు వివిధ రాష్ట్రాల టూరిజం కార్పొరేషన్లకు టీటీడీ నిత్యం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కేటాయిస్తుంటుంది.ఇందులో ఏపీ టూరిజం, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ, ఐఆర్టీసీల ద్వారా భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తుంటుంది. దీనివల్ల సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు తక్కువ సమయంలోనే స్వామివారిని దర్శనం చేసుకొని తిరిగి వెళ్లేవారు. కానీ టీటీడీ నూతన పాలకమండలి తొలి సమావేశంలోనే ఈ దర్శన టికెట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇతర రాష్ట్రాల టూరిజం కార్పొరేషన్లకు టీటీడీ రోజూ 4 వేల టికెట్లు కేటాయిస్తుండేది. ఇందులో ఏపీ టూరిజానికి 1,000, తెలంగాణకు 800 టికెట్లు, మిగతా వాటికి 500, 400 చొప్పున టికెట్లు కేటాయించేది వీరికి మధ్యాహ్నం 2 గంటల స్లాట్ ద్వారా దర్శనం కల్పించేది. అయితే ఈ టికెట్ల అవకతవకలపై ఫిర్యాదులు రావడంతో ఏడు టూరిజం కార్పొరేషన్లకు దర్శన టికెట్లను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. తప్పు చేసిన వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి గానీ.. ఇలా అందరికీ దర్శన టికెట్లు నిలిపివేయడం సరికాదని ఇతర రాష్ట్రాల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘శ్రీవాణి’లో మార్పులు!
తిరుమల: శ్రీవాణి ట్రస్టు పేరు మార్పుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి తదుపరి సమావేశం నాటికి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. సోమవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ నూతన ధర్మకర్తల మండలి తొలి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రైవేట్ బ్యాంకుల్లోని డిపాజిట్లను వెనక్కు తీసుకుని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు. శ్రీవారి నిత్య అన్న ప్రసాదం మెనూలో అదనంగా మరొక పదార్థాన్ని చేరుస్తామని చెప్పారు.తిరుమల గోగర్భం డ్యామ్ వద్ద విశాఖ శారద పీఠానికి చెందిన మఠం నిర్మాణంలో అవకతవకలు, ఆక్రమణలు జరిగినట్లు టీటీడీ అధికారుల కమిటీ ఇచి్చన నివేదిక ఆధారంగా భవనం లీజు రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. క్యూలలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి 2, 3 గంటల్లోనే దర్శనమయ్యేలా నిపుణుల కమిటీని నియమించామన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా భక్తులకు త్వరితగతిన దర్శనం చేయిస్తామన్నారు. తిరుమల డంపింగ్ యార్డులోని చెత్తను మూడు, నాలుగు నెలల్లో తొలగిస్తామని చెప్పారు.తిరుపతిలోని శ్రీనివాస సేతును గరుడ వారధిగా పేరు మార్చామన్నారు. అలిపిరిలో టూరిజం కార్పొరేషన్ ద్వారా దేవలోక్‌కు కేటాయించిన 20 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుని టీటీడీకి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడినా, ప్రచారం చేసినా కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తిరుపతి స్థానికులకు ప్రతి నెలా మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పిస్తామన్నారు. టూరిజం కార్పొరేషన్లు, ఆర్టీసీ ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300 ) టికెట్లలో అవకతవకలపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో సదరు సంస్థల ద్వారా కోటాను పూర్తిగా రద్దు చేస్తామని టీటీడీ చైర్మన్ ప్రకటించారు. బ్రహ్మోత్సవాల్లో విశేష సేవలు అందించిన ఉద్యోగులకు అందించే బహుమానాన్ని 10 శాతం పెంచుతున్నట్లు చెప్పారు. రెగ్యులర్ ఉద్యోగులకు రూ.15,400, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.7,535 చొప్పున బ్రహ్మోత్సవ బహుమానం అందిస్తామన్నారు.శ్రీవారి ఆలయంలో లీకేజీల నివారణ, అన్న ప్రసాద కేంద్రం ఆధునికీకరణకు టీవీఎస్ సంస్థతో ఎంఓయూ చేసుకున్నామని, వారు ఉచితంగానే చేస్తారని చెప్పారు. టీటీడీలో పని చేస్తున్న అన్యమత ఉద్యోగస్తులను తొలగిస్తామని, దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. కాగా శ్రీవాణి ట్రస్టు పేరును మార్చి ప్రధాన ఖాతాను మార్చడం వల్ల 80 సీ నిబంధన వర్తించక టీటీడీకి ట్యాక్స్ భారం పడే అవకాశం ఉందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
హీరో దర్శన్ నుంచి ప్రాణహాని.. బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఫిర్యాదు
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన కన్నడ హీరో దర్శన్ ఇటీవలే మధ్యంతర బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చాడు. కొంతకాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సర్జరీ చేయించుకోనున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా దర్శన్‌పై మరో కన్నడ నటుడు, బిగ్‌బాస్ ఫేమ్, లాయర్ జగదీష్ సంచలన ఆరోపణలు చేశాడు. దర్శన్, అతడి అభిమానుల నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.బెదిరింపు కాల్స్దర్శన్కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు అతడి అభిమానులు తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించాడు. దాదాపు వెయ్యి బెదిరింపు కాల్స్ వచ్చాయని పేర్కొన్నాడు. ఇదంతా చేస్తున్నది అభిమానులే అయినా.. దీని వెనక ఉన్నది మాత్రం కచ్చితంగా హీరో దర్శనే అని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం దర్శన్ బెయిల్‌పై బయట ఉన్న కారణంగా తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసులను కోరాడు.చదవండి: మమ్మల్ని చిత్రవధ చేసింది.. నటిపై సవతి కూతురి ఆరోపణలు -
అయోధ్య దీపోత్సవం.. కన్నడ స్టార్ కు బిగ్ రిలీఫ్
-
కన్నడ స్టార్ దర్శన్ కు మధ్యంతర బెయిల్
-
హత్య కేసులో స్టార్ హీరోకి మధ్యంతర బెయిల్
కన్నడ హీరో దర్శన్‌కి ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. కాకపోతే ఇది మధ్యంతర బెయిల్. అనారోగ్య సమస్యలు ఉన్నందున ఆరు వారాలు మాత్రమే బెయిల్ గ్రాంట్ చేస్తూ కర్ణాటక హైకోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు ముందు దిగువ కోర్టులో దర్శన్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోగా.. కోర్ట్ తిరస్కరించింది. తాజాగా దర్శన్ తరఫు న్యాయవాది హైకోర్టులో అభ్యర్థించడంతో బెయిల్ మంజూరైంది.దర్శన్‌కి తీవ్రమైన వెన్నునొప్పి ఉందని, దీనికి శస్త్ర చికిత్స అవసరమని. చికిత్స ఆలస్యమైన పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్‌ని దర్శన్ తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు.(ఇదీ చదవండి: అనుమానాస్పద రీతిలో 'కంగువ' ఎడిటర్ మృతి)డాక్టర్ రిపోర్టులో దర్శన్‌కు చేయాల్సిన సర్జరీ, కోలుకోవడానికి పట్టే సమయం సరిగ్గా లేదని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసన్నకుమార్ వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ విశ్వేశ్వర్ భట్.. 'విచారణలో ఉన్న ఖైదీకి వైద్యం చేయించుకునే హక్కు ఉందని' అని పేర్కొంటూ షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు.తన ప్రియురాలిని వేధిస్తున్నాడనే నెపంతో రేణుకాస్వామి అనే తన అభిమానిని.. దర్శన్, తన మనుషులతో కలిసి హత్య చేయించాడు. దీనికి పక్కా ఆధారాలు ఉండటంతో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పుడు దర్శన్‌కి మాత్రమే బెయిల్ లభించింది. తమ అభిమాన హీరోకి వచ్చింది మధ్యంతర బెయిల్ అయినప్పటికీ ఇతడి అభిమానులు మాత్రం తెగ ఆనందపడిపోతున్నారు. ఆ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.(ఇదీ చదవండి: ఆ సినిమాలో నా మీద ట్రోలింగ్ చేశారు: కిరణ్ అబ్బవరం) -
కన్నడ నటుడు దర్శన్‌కు సర్జరీ
రేణుకాస్వామి హత్య కేసులో రెండవ నిందితుడు, ప్రముఖ నటుడు దర్శన్ ఆరోగ్యం గురించి నివేదిక ఇవ్వాలని జైలు అధికారులకు హైకోర్టు ఆదేశించింది. బెయిల్ కోరుతూ దర్శన్ సమర్పించిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ విశ్వజిత్ శెట్టి విచారించారు. పిటిషన్ గురించి అభ్యంతరాలుంటే తెలపాలని ప్రభుత్వ ప్రాసిక్యూటర్ ప్రసన్నకుమార్‌కు సూచించారు. బళ్లారి జైలులో దర్శన్ వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ఆపరేషన్ అవసరముందని వైద్యులు తెలిపారు. అందుచేత బెయిల్ ఇవ్వాలని దర్శన్ వకీలు కోరారు. నేర విచారణలో అనేక లోపాలు ఉన్నాయని, అన్ని ఆధారాలను పోలీసులే సృష్టించారంటూ పలు ఆరోపణలు వినిపించారు. తదుపరి విచారణ అవసరం కూడా లేనట్లుందని పేర్కొన్నారు. దీంతో వైద్య నివేదిక ఇవ్వాలని జడ్జి ఆదేశించి కేసును వాయిదా వేశారు.100 రోజులు దాటిందిదర్శన్, పవిత్రలు జూన్ 10 నుంచి అరెస్టయి కారాగారంలో ఉన్నారు. వారిద్దరూ జైలుకు వెళ్లి 100 రోజులు దాటింది. ఇటీవల సిట్ చార్జిషీట్లు దాఖలు చేయడంతో బెయిలు వస్తుందని ఆశించారు. దర్శన్ భార్య విజయలక్ష్మి, సన్నిహితులు బెయిలు కోసం ప్రముఖ లాయర్లతో ముమ్మరంగా ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. దీంతో దర్శన్ బళ్లారి, పవిత్ర బెంగళూరు సెంట్రల్జైల్లో ఇంకొన్ని రోజులు ఉండక తప్పదు. ఈ క్రమంలో మరోసారి వారు బెయిల్ పిటీషన వేశారు. -
Tirumala: శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు కంపార్టుమెంట్ల నుంచి కాకుండా నేరుగా దర్శనానికి పంపిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 73,926 మంది స్వామివారిని దర్శించుకోగా 23,726 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.87 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టిక్కెట్లు లేని భక్తులకు 6 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టిక్కెట్లు కలిగిన భక్తులకు 1 గంటల్లో దర్శనమవుతోంది. నిర్దేశించిన సమయానికే భక్తులు క్యూలోకి వెళ్లాలని టీటీడీ కోరింది.22న ఆర్జిత సేవా టికెట్ల విడుదలకల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను అక్టోబరు 22న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.22న వర్చువల్ సేవల కోటా విడుదలవర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జనవరి నెల కోటాను అక్టోబరు 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.అక్టోబరు 23న అంగప్రదక్షిణం టోకెన్లుజనవరి నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను అక్టోబరు 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటాంశ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జనవరి నెల ఆన్ లైన్ కోటాను అక్టోబరు 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటాంవయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జనవరి నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను అక్టోబరు 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.అక్టోబరు 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదలజనవరి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను అక్టోబరు 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదలంతిరుమల, తిరుపతిలలో జనవరి నెల గదుల కోటాను అక్టోబరు 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు.https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది. -
జైలులో దర్శన్.. కలిసేందుకు వచ్చిన అభిమానికి షాక్!
కన్నడ హీరో దర్శన్ ప్రస్తుతం బళ్లారి జైలులో ఉన్నారు. ఓ అభిమాని హత్య కేసులో అరెస్టయ్యారు. అయితే కన్నడ ఇండస్ట్రీలో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఓ రేంజ్లో ఉంది. తాజాగా అతన్ని కలిసేందుకు ఓ అభిమాని వినూత్న రీతిలో ప్రయత్నించారు. టెడ్డీ బేర్ వేషంలో వచ్చి జైలు బయట కనిపించారు."మేము మీ కోసం ఎదురు చూస్తున్నాము" అని రాసి ఉన్న ప్లకార్డును జైలు బయట ప్రదర్శించాడు. అతన్ని శివమొగ్గలోని సాగర్‌కు చెందిన కార్తీక్‌గా గుర్తించారు. అయితే అభిమాన హీరోను కలిసేందుకు జైలు అధికారులు అనుమతి నిరాకరించారు. ఎందుకంటే కఠినమైన నిబంధనలే కారణంగా తెలుస్తోంది.కాగా.. రేణుకాస్వామి అనే అభిమాని హత్య కేసులో దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర గౌడ ప్రస్తుతం జైలులో ఉన్నారు. వీరి బెయిల్ పిటిషన్‌ను బెంగళూరు సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు (సిసిహెచ్) ఇవాళ మరోసారి తిరస్కరించిన సంగతి తెలిసిందే. అంతకుముందు పరప్పన అగ్రహార జైలులో ఉన్న దర్శన్‌ను భద్రతా కారణాల దృష్ట్యా బళ్లారికి తరలించారు. -
ఆ ఫోటోలన్నీ ఫేక్.. దర్శన్ కేసులో కీలక మలుపు
కర్ణాటకలో సంచలనాత్మకంగా మారిన రేణుకాస్వామి హత్య కేసులో పోలీసులు చార్జిషీటు దాఖలు చేయగా, కోర్టులో విచారణ ప్రారంభమైంది. రేణుకాస్వామి హత్య సమయంలో వచ్చిన ఫోటోలు నిజమా, అబద్ధమా అనే ప్రశ్న తలెత్తింది. ఈ కేసులో పోలీసులు చూపుతున్న సాక్ష్యాలన్నీ అబద్ధాలని నటుడు దర్శన్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కొన్నిసాక్ష్యాల ధృవీకరణ పత్రాలు ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ఇంకా పోలీసుల చేతికి అందలేదు. ఆర్ ఆర్ నగరలో బస్సు షెడ్డులో రేణుకాస్వామిని బంధించి దర్శన్, పవిత్రగౌడ, అనుచరులు తీవ్రంగా కొట్టి చంపారనేది ప్రధాన అభియోగం. ఆ సమయంలో కొన్ని ఫోటోలను వారి మొబైల్ ఫోన్ల నుంచి సేకరించినట్లు పోలీసులు తెలిపారు. రేణుకాస్వామి చేతులెత్తి సమస్కరిస్తూ కూర్చున్న ఫోటో, మృతదేహం ఫోటోలు ఇందులో ఉన్నాయి. కానీ ఈ ఫోటోలు ఏఐ టెక్నాలజీతో సృష్టించారని దర్శన్ న్యాయవాదులు ఆరోపించారు. ఈ ఫోటోలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి త్వరగా నివేదిక పంపాలని పోలీసులు కోరారు. దీంతో ఈ కేసులో మరో మలుపు తీసుకున్నట్లు అయింది. -
Darshan: బెంగళూరు జైలే బెటరు
సాక్షి బెంగళూరు: రేణుకాస్వామి హత్య కేసులో బళ్లారి సెంట్రల్ జైలులో ఉన్న కన్నడ స్టార్ నటుడు దర్శన్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ఇంకా కోర్టు విచారణలోనే ఉంది. అయితే అంతలోనే ఎలాగైనా బెంగళూరుకు తిరిగి వచ్చేయాలని దర్శన్ పట్టుబడుతున్నాడు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న దర్శన్.. ఆ కారణం చూపి బళ్లారి జైలు నుంచి బెంగళూరుకు రావాలనుకుంటున్నాడు. అక్కడ కటకట బెంగళూరు పరప్పన జైలు నుంచి దర్శన్‌ను బళ్లారి కేంద్ర కారాగారానికి తరలించిన విషయం తెలిసిందే. బళ్లారి జైలులో గడ్డు పరిస్థితి ఉన్నట్లు తెలిసింది. బెంగళూరు జైలులో ఇతర ఖైదీలతో మాట్లాడేవాడు.. కానీ బళ్లారి జైలులో మాట్లాడేందుకు కూడా ఎవరూ లేరు. సౌకర్యాల లేమి పీడిస్తోంది. ఇదే సమయంలో ఆయనకు ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువయ్యాయి. బళ్లారిలోని వైద్యులు స్కానింగ్ చేయించుకోవాలని సూచించారు. అయితే తాను బెంగళూరులోనే చేయించుకుంటానని పట్టుబట్టాడు. ఇప్పటికీ బెయిలు రాకపోతే బళ్లారి జైలులో ఉండలేనని, అందుకే బెంగళూరుకు తరలి వెళ్లాలని దర్శన్ మొండికేసినట్లు తెలిసింది. దర్శన్‌కు అదనపు వసతులపై సోమవారం ఆయన న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేసే అవకాశముంది. -
అయోధ్యలో నవరాత్రి వేడుకలు.. మారిన దర్శన, హారతి సమయాలు
అయోధ్య: దేశవ్యాప్తంగా దసరా నవరాత్రుల ఉత్సాహం నెలకొంది. యూపీలోని అయోధ్యలోనూ దసరా వేడుకలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ శరన్నవరాత్రులలో రామ్‌లల్లా దర్శన, మంగళ హారతుల సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ తెలిపింది. నవరాత్రుల మొదటి రోజు నుండి ఈ మార్పులు అమలులోకి వస్తాయని ట్రస్ట్ పేర్కొంది. తెల్లవారుజామున 4:30 నుంచి 4:40 గంటల వరకు మంగళ హారతి, 4:40 నుంచి 6:30 గంటల వరకు స్వామివారి అలంకారాలు జరగనున్నాయి. సాయంత్రం 6:30 గంటలకు శృంగార ఆరతి ఉంటుందని సమాచారం. ఇక రామ్‌లల్లా దర్శనం ఉదయం 7:00 గంటలకు ప్రారంభమవుతుంది. ఉదయం 9:00 గంటలకు బాలభోగం నిర్వహించనున్నారు. ఈ సమయంలో ఆలయ తలుపులు ఐదు నిమిషాల పాటు మూసివేయనున్నారు.నవరాత్రులలో లక్షలాది మంది భక్తులు అయోధ్యకు తరలివస్తారని ట్రస్ట్ భావిస్తోంది. ఈ నేపధ్యంలోనే భక్తులకు సులభ దర్శనం కల్పించేందుకు ట్రస్ట్ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. దర్శన వేళల్లో చేసిన నూతన మార్పుల విషయానికొస్తే.. బాలభోగం అనంతరం ఉదయం 9:05కు ఆలయ తలుపులు తెరుస్తారు. 11:45 వరకు దర్శనాలు ఉంటాయి. 11:45 నుండి 12:00 వరకు ప్రభువు ఏకాంతం ఉంటుంది. తిరిగి 12:00 గంటలకు భోగ్ హారతి ఉంటుంది. ఆలయంలో స్వామివారు మధ్యాహ్నం 12:15 గంటలకు నిద్రిస్తారు. ఈ సమయంలో ఆలయ తలుపులను 12:30 నుండి 1:30 వరకు మూసివేస్తారు. అదే సమయంలో భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తారు.మధ్యాహ్నం 1:30కి ఆలయంలోని తలుపులు తెరుస్తారు. దేవతా హారతి నిర్వహిస్తారు. దర్శనాలు మధ్యాహ్నం 1:35 నుండి ప్రారంభమై, సాయంత్రం 4:00 గంటల వరకు కొనసాగుతుంది. అనంతరం ఐదు నిమిషాల పాటు ఆలయ తలుపు మూసివేస్తారు. ఆ తర్వాత 4:05 నుంచి 6:45 వరకు నిరంతర దర్శనం ఉంటుంది. దీని తరువాత సాయంత్రం 6:45 నుండి 7:00 గంటల వరకు 15 నిమిషాల పాటు స్వామివారి ఆలయ తలుపులు మూసివేస్తారు. ఈ సమయంలో భోగ్ అందిస్తారు. సాయంత్రం 7:00 గంటలకు హారతి కార్యక్రమం జరుగుతుంది. రాత్రి 7:00 నుండి 8:30 గంటల వరకు దర్శనం కొనసాగుతుంది. రాత్రి 9:00 గంటలకు భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తారు. 9:30 గంటలకు స్వామివారికి ప్రసాదం సమర్పించి, శయన హారతి అందిస్తారు. అనంతరం 9:45 గంటలకు స్వామివారు నిద్రించేందుకు ఆలయ తలుపులు మూసి వేస్తారు.ఇది కూడా చదవండి: దుర్గా పూజల వేళ.. మెట్రో శుభవార్త -
ఐటీ దర్యాప్తునకు దర్శన్!
సాక్షి, బళ్లారి: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితుడైన ప్రముఖ సినీ నటుడు దర్శన్ బళ్లారి జైల్లో ఖైదులో ఉన్నారు. ఆయన మరో విచారణను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. హత్యను కప్పిపుచ్చేందుకు లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు ఆధారాలు బయటకు రావడంతో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు దర్శన్‌ను ప్రశ్నించవచ్చని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం బళ్లారి జైలులో దర్శన్‌ను కలిసిన ఆయన న్యాయవాది త్వరలో బెయిల్ లభిస్తుందని సూచనలిచ్చారు. ఇంతలో ఐటీ అధికారులకు పూర్తి సహకారం అందించాలని కోర్టు నుంచి సెంట్రల్ జైలు అధికారులకు ఈ–మెయిల్ వచ్చింది. ఐటీ అధికారులు అడిగే ప్రశ్నలకు దర్శన్ సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. రేణుకాచార్య హత్య తరువాత మృతదేహం తరలింపు, ఆ నేరాన్ని ఇతరులు వేసుకోవాలని రూ. 30 లక్షలకు పైగా నగదును దర్శన్ కొందరు నిందితులకు ఇచ్చినట్లు, ఆ నగదును ఓ నిందితుని ఇంట్లో స్వాధీనం చేసుకున్నట్లు చార్జిషీటులో పోలీసులు పేర్కొన్నారు. దీంతో నగదు గురించి ఐటీ అధికారులు పూర్తి వివరాలను సేకరించాలని సిద్ధమయ్యారు. -
Actor Darshan: కారాగారంలో 100 రోజులు
సాక్షి, బెంగళూరు: మెజిస్టిక్ సినిమా 100 రోజుల ప్రదర్శన తర్వాత ఆ చిత్ర హీరో దర్శన్ స్టార్ నటునిగా మారారు. అనేక హిట్ సినిమాలతో టాప్ హీరోలలో ఒకరిగా ఆయన వెలుగొందుతున్న సమయంలో సినిమాలో మాదిరిగానే కథ మలుపు తిరిగింది. రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్, ఆయన ప్రియురాలు పవిత్రగౌడ జైలు పాలై 100 రోజులు పూర్తయింది. సినీ పరిశ్రమలో 100 రోజులకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఒక నటునికి 100 రోజులు అనేది ఎంతో ముఖ్యమైన ఘట్టం.. 100 రోజులు సినిమా ఆడితే చాలు వెంటనే అదృష్టం తిరగబడి రాత్రికి రాత్రి స్టార్ అయిపోతారు. 2001లో దర్శన్ తాను నటించిన మొదటి సినిమా మెజిస్టిక్ గాంధీనగరలో రికార్డులు సృష్టించింది. ఆ తర్వాత ఎన్నో వంద రోజుల సినిమాల్లో నటించిన దర్శన్ జైలులోనూ వంద రోజుల జీవితాన్ని పూర్తి చేసుకోవడం అభిమానులను కలచివేస్తోంది. జైలు నుంచి తమ అభిమాన నటుడు ఎప్పుడు బయటకు విడుదల అవుతారని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.జూన్ 8న చెడు మలుపు...👉 జూన్ 8– దర్శన్ స్నేహితురాలు పవిత్ర గౌడకు చెడుగా మెసేజ్ చేశాడనే కారణంతో చిత్రదుర్గ నుంచి రేణుకాస్వామిని బెంగళూరుకు పిలిపించి దారుణంగా భౌతిక దాడి చేసి దర్శన్ గ్యాంగ్ హత్య చేసింది.అదే రోజు రేణుకస్వామి చనిపోయిన విషయాన్ని దర్శన్‌కు ఫోన్ ద్వారా తెలియజేశారు. రాత్రి వేళ రేణుకస్వామి మృతదేహాన్ని సుమనహళ్లి రాజకాలువలో విసిరేశారు.👉 జూన్ 9 – ఉదయం 8 గంటలకు రాజకాలువ వద్ద రేణుకాస్వామి మృతదేహం లభ్యమైంది. ఉదయం 8.30 గంటలకు కామాక్షిపాళ్య పోలీసులు వచ్చి పరిశీలించి కేసు నమోదు చేశారు.👉 జూన్ 10 – దర్శన్ సూచనల మేరకు ఆయన గ్యాంగ్‌లోని ముగ్గురు సహచరులు పోలీసు స్టేషన్లో లొంగిపోయారు. పోలీసుల విచారణలో అసలు నిజం బయటకు వచ్చింది. దర్శన్, పవిత్ర గౌడ పేర్లు విచారణలో బయటకు వచ్చాయి. ఆ రోజు రాత్రి మైసూరుకు బెంగళూరు పోలీసులు వెళ్లారు. దర్శన్ ఉండే ప్రాంతాన్ని గుర్తించారు. కేసులో ఇతర నిందితులను అరెస్టు చేశారు.👉 జూన్ 11 – ఉదయం 6.30 గంటలకు మైసూరు ర్యాడిసన్ హోటల్లో జిమ్ చేస్తున్న దర్శన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బెంగళూరుకు తరలించారు. దర్శన్ అరెస్టు శాండల్‌వుడ్ మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. -
సలార్‌తో పోటీ పడిన సినిమా.. ఉత్తమ చిత్రంగా అవార్డ్!
సైమా అవార్డ్స్-2024లో కన్నడ స్టార్ దర్శన్ నటించిన చిత్రం సత్తా చాటింది. శాండల్‌వుడ్‌లో ఉత్తమ చిత్రంగా అవార్డ్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీ కన్నడలో గతేడాది రిలీజై బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. దర్శన్ హీరోగా నటించిన యాక్షన్ సినిమా కాటేరా.. గతేడాది డిసెంబర్లో బాక్సాఫీస్ వద్ద ఏకంగా ప్రభాస్ సలార్‌తో పోటీ పడి రూ. 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాకుండా ఈ చిత్రానికి సంగీతమందించిన హరికృష్ణ ఉత్తమ సంగీత దర్శకుడిగా సైమా అవార్డ్‌ను సొంతం చేసుకున్నారు. కాగా.. యధార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని దర్శకుడు తరుణ్ సుధీర్ తెరకెక్కించారు. కాటేరా సినిమాలో దర్శన్ సరసన ఆరాధన రామ్ హీరోయిన్గా మెప్పించింది. సీనియర్ హీరోయిన్ మాలాశ్రీ కూతురు అయిన ఆరాధన రామ్ కాటేరా మూవీతోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. కాగా.. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు జగపతి బాబు కీలక పాత్ర పోషించారు. (ఇది చదవండి: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్‌బస్టర్ సినిమా తెలుగు వర్షన్)జైలులో దర్శన్అయితే ఈ మూవీ సూపర్ హిట్ తర్వాత ఊహించని విధంగా దర్శన్ ఓ హత్యకేసులో అరెస్టయ్యారు. ప్రియురాలిని వేధిస్తున్నాడంటూ ఓ అభిమాని హత్య చేయడం కన్నడ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ప్రస్తుతం దర్శన్, అతని ప్రియురాలు సైతం జైలులోనే ఉన్నారు. ఇటీవలే ఈ కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. Best Film #KAATERA #SIIMA #SIIMAAwards #SIIMAinDubai #Dboss #D56 pic.twitter.com/Pvx3ixJCDp— Filmy Corner ꭗ (@filmycorner9) September 14, 2024Congratulations Harikrishna for winning Best Music Director award in SIIMA for #Kaatera 🎊Thank you for giving this gem of a song to us, We will cherish forever❤️#DBoss @dasadarshanpic.twitter.com/fULQhP4tsK— King Kariya (@KingKariyaa) September 14, 2024𝗦𝗜𝗜𝗠𝗔 𝟮𝟬𝟮𝟰: Best Film (Kannada) award goes to #Kaatera #DBoss #RocklineEntertainment #SIIMA2024 #SIIMAAwards pic.twitter.com/jqitWHmMDu— Bhargavi (@IamHCB) September 14, 2024 -
దర్శన్,పవిత్రలకు నిరాశ.. కస్టడీ పొడిగింపు
రేణుకాస్వామి హత్య కేసులో బెయిల్ కోసం ఎదురుచూస్తున్న దర్శన్‌కు మరోసారి నిరాశే మిగిలింది. ఆయన రిమాండును కోర్టు పొడిగించింది. కొద్దిరోజుల క్రితం హత్యకు సంబంధించి పూర్తి ఆధారాలను సేకరించిన బెంగళూరు పోలీసులు 3,991 పేజీలతో చార్జిషీట్ రెడీ చేశారు. దానిని కోర్టులో కూడా దాఖలు చేశారు. రేణుకాస్వామి హత్య కుట్రలో దర్శన్, ఆయన ప్రియురాలు పవిత్రగౌడ ఉన్నారని పోలీసులు తెలుపుతున్నారు. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా కోర్టుకు అందించారు.ఇదీ చదవండి: డాక్టర్‌పై నటి రోహిణి ఫిర్యాదుఈ కేసులో హీరో దర్శన్, పవిత్రగౌడ, గ్యాంగ్‌కు బెయిలు భాగ్యం దక్కలేదు. కోర్టు వారి కస్టడీని పొడిగించింది. శుక్రవారంతో జ్యుడీషియల్ రిమాండు ముగియడంతో పోలీసులు 17మంది నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 24వ ఏసీఎంఎం కోర్టులో జడ్జి ముందు హాజరుపరిచారు. పూర్తి చార్జిషీట్ సమర్పించాలని, ఎల్రక్టానిక్స్ సాక్ష్యాలను ఒక వారంలోపు ప్రవేశ పెట్టాలని పోలీసులను ఆదేశించిన కోర్టు నిందితులకు సెప్టెంబర్ 17 వరకూ కస్టడీని పొడిగించింది. పవిత్ర బెయిలు అర్జీ వాపస్ ఈ హత్య కేసులో ఏ1 నిందితురాలిగా ఉన్న నటి పవిత్రగౌడ కోర్టులో పెట్టుకున్న బెయిలు పిటిషన్ వెనక్కు తీసుకుంది. అయితే చార్జ్‌షీట్ దాఖలైందని, పలు సాంకేతిక కారణాలు చూపుతూ ఆమె న్యాయవాదులు వాపస్ తీసుకున్నారు. త్వరలో కొత్త బెయిలు అర్జీ దాఖలు చేసే అవకాశముంది. -
ఫోటోలు, వీడియోలతో నా భర్తను లొంగదీసుకుంది
-
ఫోటోలు, వీడియోలతో నా భర్తను లొంగదీసుకుంది: దర్శన్ సతీమణి
కన్నడలో సంచలనం సృష్టించిన చిత్రదుర్గం వాసి రేణుకాస్వామి (29) హత్యకేసులో ప్రధాన నిందితులుగా నటుడు దర్శన్, పవిత్రగౌడ ఉన్నారు. వారిద్దరూ సుమారు నాలుగు నెలలుగా జైలులో ఉన్న విషయం తెలిసిందే. రేణుకాస్వామి హత్యకు సంబంధించి 3,991 పేజీలతో చార్జిషీట్‌ను పోలీసులు దాఖలు చేశారు. ఈ క్రమంలో దర్శన్ సతీమణి విజయలక్ష్మి ఇచ్చిన స్టేట్మెంట్ను కూడా చార్జిషీట్లో పొందుపరిచారు. దర్శన్, పవిత్రల గురించి ఆమె సంచలన విషయాలను బయటపెట్టింది.కన్నడలో స్టార్ హీరోగా ఉన్న దర్శన్ వైవాహిక జీవితంలో మాత్రం సక్సెస్ కాలేకపోయాడు. 2000 సంవత్సరంలో విజయలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. అయితే, పలు విభేదాలు రావడంతో వారిద్దిరూ చాలాకాలంగా వేరువేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ పవిత్ర గౌడ్ వారి జీవితంలో అడుగుపెట్టడంతో ఆ దూరం కాస్త మరింత పెరిగింది. అయితే, ఇప్పుడు రేణుకాస్వామి హత్యకేసులో చిక్కుకునన తన భర్త దర్శన్, పవిత్రల రిలేషన్ గురించి చార్జిషీట్లో విజయలక్ష్మి ఇలా తెలిపారు.దర్శన్‌ను పవిత్రగౌడ ఫోటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్ చేసిందని దర్శన్ భార్య విజయలక్ష్మి విచారణలో చెప్పినట్టు సమాచారం. ఇదే విషయాన్ని పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. 2014లో పవిత్రగౌడతో దర్శన్ ప్రేమ, సహ జీవనం గురించి తాను గొడవపడినట్టు విజయలక్ష్మి తెలిపారు. ఈ క్రమంలో పవిత్రగౌడ దర్శన్‌తో ఏకాంత సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు చూపించి ఆయనను బెదిరించిందని ఆరోపించారు. దర్శన్ నుంచి పవిత్రగౌడ ఇళ్లు, కార్లు, కోట్లాది రూపాయల నగదు తీసుకుందని చెప్పారు. పవిత్రగౌడ పరిచయం కానంత వరకు తమ కాపురం సజావుగా సాగిందని తెలిపారు. మరోవైపు అంతా మంచి జరగాలని విజయలక్ష్మి అసోంలో గువాహటిలోని ప్రసిద్ధ కామాఖ్య మాత దేవాలయాన్ని దర్శించుకున్నారు. పోలీసులు వేసిన చార్జిషీట్ గురించి కన్నడ టీవీ చానెళ్లలో విస్తృతంగా వార్తా కథనాలు ప్రసారమవుతున్నాయి. -
ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు దర్శన్ కేసు?
దొడ్డబళ్లాపురం: పరప్పన అగ్రహార జైలులో ఉన్నప్పుడు దర్శన్‌కు రాచ మర్యాదలు అందించిన సంఘటనపై త్వరలో నివేదిక ఇస్తామని బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసును శీఘ్రగతిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ చేయడానికి న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్లు చెప్పారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు వల్ల కేసు విచారణ త్వరగా పూర్తవుతుంది. ఇక దర్శన్‌కు రాచ మర్యాదలు చేయడంలో జైలు అధికారుల పాత్ర, వారి వైఫల్యం తదితర అంశాలపై డీసీపీ సారా ఫాతిమా, సీసీబీ అదనపు కమిషనర్ చంద్రగుప్త ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోందన్నారు. రేణుకాస్వామి హత్య కేసులో హైదరాబాద్ నుంచి కొన్ని ఫోరెన్సిక్ రిపోర్టులు రావాల్సి ఉందన్నారు.హత్య తరువాత పవిత్రగౌడ ఆరారేణుకాస్వామిని హత్య చేశాక పవిత్రగౌడ తనదైన రీతిలో ఫాలో అప్ చేసిందని తెలిసింది. శవాన్ని సుమనహళ్లి రాజకాలువలో పారవేశాక స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. ఆ ఆస్పత్రిలో పవిత్రగౌడ స్నేహితురాలి భర్త సీనియర్ వైద్యునిగా పని చేస్తున్నాడు. వెంటనే స్నేహితురాలిని, ఆమె భర్తను ఒక కాఫీ రెస్టారెంట్‌కి పవిత్ర పిలిపించింది. తనకు తెలిసిన వారి బంధువు చనిపోయాడని, కారణాలు ఏమిటని ఆరా తీసింది. ఈ వివరాలను పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.టీవీ చానెళ్లలో ప్రసారం చేయొద్దుచార్జ్షీట్లోని సమాచారాన్ని కన్నడ టీవీ చానల్స్‌లో ప్రసారం చేయరాదని హైకోర్టు ఆదేశించింది. పోలీసులు చార్జిషీట్ వేయగానే అందులోని అంశాలపై టీవీ చానెళ్లలో విస్తృతంగా వార్తా కథనాలు ప్రసారమవుతున్నాయి. దీంతో దర్శన్ ఇబ్బందిగా భావించి హైకోర్టులో అర్జీ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో నిందితుల గోప్యతను కాపాడాలంటూ కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.దర్శన్‌కు పవిత్ర బ్లాక్మెయిల్దర్శన్ను పవిత్రగౌడ ఫోటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్ చేసిందని దర్శన్ భార్య విజయలక్ష్మి విచారణలో చెప్పినట్టు సమాచారం. ఇదే విషయాన్ని పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. 2014లో పవిత్రగౌడతో దర్శన్ ప్రేమ, సహ జీవనం గురించి తాను గొడవపడినట్టు విజయలక్ష్మి తెలిపారు. ఈ క్రమంలో పవిత్రగౌడ దర్శన్‌తో ఏకాంత సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు చూపించి ఆయనను బెదిరించిందని ఆరోపించారు. దర్శన్ నుంచి పవిత్రగౌడ ఇళ్లు, కార్లు, కోట్లాది రూపాయల నగదు తీసుకుందని చెప్పారు. పవిత్రగౌడ పరిచయం కానంత వరకు తమ కాపురం సజావుగా సాగిందని తెలిపారు. మరోవైపు అంతా మంచి జరగాలని విజయలక్ష్మి అసోంలో గువాహటిలోని ప్రసిద్ధ కామాఖ్య మాత దేవాలయాన్ని దర్శించుకున్నారు.హీరోయిన్లకు అశ్లీల మెసేజ్‌లు చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో రోజూ కొత్త విషయాలు బయటపడుతూనే ఉన్నాయి. నటి పవిత్రగౌడకే కాకుండా ఇంకా ఇద్దరు హీరోయిన్లకు కూడా అతడు అశ్లీల మెసేజ్‌లు పంపించినట్టు తెలిసింది. రేణుకాస్వామి హత్య కేసులో 14వ నిందితునిగా ఉన్న ప్రదోశ్ ఇచ్చిన స్టేట్మెంట్లో ఈ విషయాలు చెప్పినట్లు పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. రేణుకాస్వామిని బెంగళూరులో షెడ్‌కు తీసుకువచ్చి కొట్టేటప్పడు అతని మొబైల్ఫోన్ని లాక్కుని పరిశీలించగా ఇన్‌స్టా గ్రామ్‌లో గౌతమ్ కేఎస్ పేరుతో చాలామంది మహిళలకు అశ్లీల మెసేజ్‌లు పంపించినట్లు ఉంది. ముఖ్యంగా హీరోయిన్లు రాగిణి ద్వివేది, శుభ పుంజాలకు కూడా అసభ్య మెసేజ్‌లు పంపాడు. -
నటుడు దర్శన్ కస్టడీ ముగింపు.. బెయిల్ కోసం దరఖాస్తు
కన్నడలో సంచలనం సృష్టించిన చిత్రదుర్గం వాసి రేణుకాస్వామి (29) హత్యకేసులో ప్రధాన నిందితులుగా నటుడు దర్శన్, పవిత్రగౌడ ఉన్నారు. వారిద్దరూ సుమారు నాలుగు నెలలుగా జైలులో ఉన్న విషయం తెలిసిందే. రేణుకాస్వామి హత్యకు సంబంధించి దర్శన్ ఏ2, నటి, ఆయన ప్రియురాలు పవిత్రగౌడను ఏ1 అని పోలీసులు పేర్కొన్నారు. వారిద్దరితో పాటు మరో 15 మంది పాత్ర కూడా ఉన్నట్లు 3,991 పేజీలతో చార్జిషీట్‌ను పోలీసులు దాఖలు చేశారు. పవిత్ర బెంగళూరు పరప్పన జైల్లో, దర్శన్‌బళ్లారి జైలులో రిమాండులో ఉన్నారు.రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన నిందితుల జ్యుడీషియల్ కస్టడీ గడువు సెప్టెంబర్ 9న సోమవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో నటుడు దర్శన్ సహా నిందితులంతా రేపు జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుకానున్నారు. ఇతర నిందితులను మైసూరు, తుమకూరు, షిమోగా, ధార్వాడ్, బెల్గాం, విజయపుర, కలబురగి జైలుకు తరలించారు. నిందితుల జ్యుడీషియల్ కస్టడీ సోమవారంతో ముగియనుండడంతో నిందితులను తమ జైళ్ల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బెంగళూరు 24వ ఏసీఎంఎం కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు.పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ మొత్తం 17 మంది నిందితులకు అందజేయనున్నారు. చార్జిషీటు అందిన తర్వాత చాలా మంది నిందితులు రేపు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించిన చార్జిషీటును సమర్పించినందున ప్రధాన నిందితులైన దర్శన్, పవిత్రగౌడ్ సహా సోమవారం బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. -
నెలకు రూ.10వేలు ఇస్తానంటూ హీరోయిన్‌కు మెసేజ్
కన్నడలో సంచలనం సృష్టించిన చిత్రదుర్గం వాసి రేణుకాస్వామి (29) హత్యకేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఈ కేసులో నటుడు దర్శన్, పవిత్రగౌడతో పాటు మరో 15 మంది పాత్ర ఉందని పోలీసులు 3,991 పేజీలతో చార్జిషీట్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. దర్శన్ ఏ2, నటి, ఆయన ప్రియురాలు పవిత్రగౌడను ఏ1 నిందితురాలిగా పేర్కొన్నారు. పవిత్ర బెంగళూరు పరప్పన జైల్లో, దర్శన్‌బళ్లారి జైలులో రిమాండులో ఉన్నారు.కన్నీరుపెట్టిన పవిత్రాగౌడ రేణుకాస్వామి హత్యకేసులో ఏ1 నిందితురాలిగా ఉన్న పవిత్రాగౌడ పోలీస్ కస్టడీలో కన్నీరుపెట్టిన ఫొటో వైరల్ అయింది. అన్నపూర్ణేశ్వరినగర పోలీస్‌స్టేషన్‌లో హాజరైన సమయంలో పవిత్రాగౌడను ఫొటో తీశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు వేసిన చార్జిషీట్లో ఒక్కొక్కటిగా పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గౌతమ్ పేరుతో రేణుకాస్వామి సందేశాలు రేణుకాస్వామి హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. రేణుకాస్వామి గౌతమ్ పేరుతో నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతా సృష్టించి పవిత్రాగౌడకు అశ్లీల మెసేజ్ పంపించేవాడని పోలీసులు కోర్టుకు సమరి్పంచిన చార్జిషీట్లో పేర్కొన్నారు. నెలకు రూ.10వేలు ఇస్తా, తనతో లివింగ్ రిలేషన్షిప్ కొనసాగించాలని మెసేజ్ పెట్టడంతో నటి పవిత్రాగౌడ కోపోద్రిక్తురాలైంది. తన స్నేహితుడు పవన్ పేరుతో రేణుకాస్వామితో చాటింగ్ చేసి అతను ఎక్కడ ఉన్నాడు, ఏ ఊరిలో ఉన్నాడనే విషయాలను ఆరా తీసినట్లు అందులో పేర్కొన్నారు. -
దర్శన్‌ని పెళ్లి చేసుకుంటా.. జైలు ముందు మహిళ హంగామా
చిత్రదుర్గం రేణుకాస్వామి హత్య కేసులో బళ్లారి సెంట్రల్ జైలులో ఉన్న నటుడు దర్శన్‌ని చూడాలని ఓ మహిళ అక్కడ హంగామా చేసింది. తాజాగా జైలు వద్దకు కలబుర్గికి చెందిన లక్ష్మీ అనే యువతి అక్కడకు వచ్చింది. తాను దర్శన్‌ను చూడాలని, జైల్లోకి వదలాలని సిబ్బందిని పట్టుబట్టింది. పోలీసులు అడ్డుచెప్పడంతో వారితో వాగ్వాదానికి దిగింది. దర్శన్ కుటుంబ సభ్యులు మాత్రమే కలవడానికి అనుమతి ఉందని ఆమెకు తెలిపారు. అయితే, తాను దర్శన్‌ని పెళ్లి చేసుకుంటానని, అప్పుడు కలవడానికి ఒప్పుకుంటారా..? అని ప్రశ్నించింది. దీంతో కంగుతిన్న పోలీసు అధికారులు ఆమెను జైలు నుంచి పంపించే ప్రయత్నం చేశారు. తాను బెంగళూరు పరప్పన అగ్రహార జైలు వద్దకు కూడా వెళ్లి వచ్చానని అక్కడ కూడా దర్శన్‌ను కలిసేందుకు అవకాశం దొరకలేదని రాద్దాంతం చేసింది. చివరికి పోలీసులు ఆమెకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు.కన్నడ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిత్రదుర్గ వాసి రేణుకాస్వామి (29) హత్యకేసులో నటుడు దర్శన్, పవిత్రగౌడ, మరో 15 మంది పాత్ర ఉందంటూ ధృవీకరిస్తూ పోలీసులు 3,991 పేజీలతో కూడిన చార్జిషీట్‌ను తయారు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులు దర్శన్ ఏ2, నటి, ఆయన ప్రియురాలు పవిత్రగౌడను ఏ1 నిందితురాలిగా పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పవిత్రగౌడను అసభ్యంగా కామెంట్లు చేస్తున్నాడని రేణుకాస్వామిని కిరాతకంగా దర్శన్ అనుచరులు హతమార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.