కొడుకు అడ్మిషన్‌పై చర్చ?
దొడ్డబళ్లాపురం: సినీ హీరో దర్శన్ కేసు విషయంలో తాను ఎలాంటి జోక్యం చేసుకోనని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. రేణుకాస్వామి హత్య కేసు విచారణలో పోలీసులకు పూర్తి స్వాతంత్య్రం ఇచ్చామన్నారు. రామనగరలో ఒక కార్యక్రమంలో మాట్లాడిన డీకే.. దర్శన్‌కు అన్యాయం జరగి ఉంటే న్యాయం చేస్తానని చెప్పారు. దీనిపై బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ తాను కెంపేగౌడ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో దర్శన్ భార్య విజయలక్ష్మి వచ్చి కలిశారన్నారు. ఇక్కడకు కాదు, ఇంటికి వచ్చి కలవాలని ఆమెకు చెప్పానన్నారు. దర్శన్ కేసు గురించి మాట్లాడతారని అనుకున్నా, అయితే వారు వారి కుమారుని స్కూలు అడ్మిషన్ గురించి వచ్చారని డీకే చెప్పడం విశేషం.
నివాసంలో సమావేశం
దర్శన్ భార్య విజయలక్షి్మ, తమ్ముడు దినకర్, ప్రముఖ డైరెక్టర్ ప్రేమ్‌లు డీసీఎం డీకేశిని నివాసంలో కలివారు. తరువాత ప్రేమ్ విలేకరులతో మాట్లాడుతూ దర్శన్ గురించి చర్చించలేదని, తనయుడు స్కూలు అడ్మిషన్ గురించి ప్రస్తావించానమన్నారు. ఇక విజయలక్షి్మ, దినకర్ ఏం మాట్లాడారో తనకు తెలీదన్నారు. జూన్ 10 నుంచి దర్శన్ హత్య కేసులో అరెస్టయి జైలు పాలయ్యాడు. అసలు ఆ విషయం గురించే మాట్లాడలేదని వారు చెప్పడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment