కన్నడ హీరో దర్శన్‌కి ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. కాకపోతే ఇది మధ్యంతర బెయిల్. అనారోగ్య సమస్యలు ఉన్నందున ఆరు వారాలు మాత్రమే బెయిల్ గ్రాంట్ చేస్తూ కర్ణాటక హైకోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు ముందు దిగువ కోర్టులో దర్శన్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోగా.. కోర్ట్ తిరస్కరించింది. తాజాగా దర్శన్ తరఫు న్యాయవాది హైకోర్టులో అభ్యర్థించడంతో బెయిల్ మంజూరైంది.
దర్శన్‌కి తీవ్రమైన వెన్నునొప్పి ఉందని, దీనికి శస్త్ర చికిత్స అవసరమని. చికిత్స ఆలస్యమైన పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్‌ని దర్శన్ తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు.
(ఇదీ చదవండి: అనుమానాస్పద రీతిలో 'కంగువ' ఎడిటర్ మృతి)
డాక్టర్ రిపోర్టులో దర్శన్‌కు చేయాల్సిన సర్జరీ, కోలుకోవడానికి పట్టే సమయం సరిగ్గా లేదని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసన్నకుమార్ వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ విశ్వేశ్వర్ భట్.. 'విచారణలో ఉన్న ఖైదీకి వైద్యం చేయించుకునే హక్కు ఉందని' అని పేర్కొంటూ షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు.
తన ప్రియురాలిని వేధిస్తున్నాడనే నెపంతో రేణుకాస్వామి అనే తన అభిమానిని.. దర్శన్, తన మనుషులతో కలిసి హత్య చేయించాడు. దీనికి పక్కా ఆధారాలు ఉండటంతో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పుడు దర్శన్‌కి మాత్రమే బెయిల్ లభించింది. తమ అభిమాన హీరోకి వచ్చింది మధ్యంతర బెయిల్ అయినప్పటికీ ఇతడి అభిమానులు మాత్రం తెగ ఆనందపడిపోతున్నారు. ఆ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.
(ఇదీ చదవండి: ఆ సినిమాలో నా మీద ట్రోలింగ్ చేశారు: కిరణ్ అబ్బవరం)
Comments
Please login to add a commentAdd a comment