interm bail
-
హత్య కేసులో స్టార్ హీరోకి మధ్యంతర బెయిల్
కన్నడ హీరో దర్శన్‌కి ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. కాకపోతే ఇది మధ్యంతర బెయిల్. అనారోగ్య సమస్యలు ఉన్నందున ఆరు వారాలు మాత్రమే బెయిల్ గ్రాంట్ చేస్తూ కర్ణాటక హైకోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు ముందు దిగువ కోర్టులో దర్శన్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోగా.. కోర్ట్ తిరస్కరించింది. తాజాగా దర్శన్ తరఫు న్యాయవాది హైకోర్టులో అభ్యర్థించడంతో బెయిల్ మంజూరైంది.దర్శన్‌కి తీవ్రమైన వెన్నునొప్పి ఉందని, దీనికి శస్త్ర చికిత్స అవసరమని. చికిత్స ఆలస్యమైన పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్‌ని దర్శన్ తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు.(ఇదీ చదవండి: అనుమానాస్పద రీతిలో 'కంగువ' ఎడిటర్ మృతి)డాక్టర్ రిపోర్టులో దర్శన్‌కు చేయాల్సిన సర్జరీ, కోలుకోవడానికి పట్టే సమయం సరిగ్గా లేదని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసన్నకుమార్ వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ విశ్వేశ్వర్ భట్.. 'విచారణలో ఉన్న ఖైదీకి వైద్యం చేయించుకునే హక్కు ఉందని' అని పేర్కొంటూ షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు.తన ప్రియురాలిని వేధిస్తున్నాడనే నెపంతో రేణుకాస్వామి అనే తన అభిమానిని.. దర్శన్, తన మనుషులతో కలిసి హత్య చేయించాడు. దీనికి పక్కా ఆధారాలు ఉండటంతో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పుడు దర్శన్‌కి మాత్రమే బెయిల్ లభించింది. తమ అభిమాన హీరోకి వచ్చింది మధ్యంతర బెయిల్ అయినప్పటికీ ఇతడి అభిమానులు మాత్రం తెగ ఆనందపడిపోతున్నారు. ఆ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.(ఇదీ చదవండి: ఆ సినిమాలో నా మీద ట్రోలింగ్ చేశారు: కిరణ్ అబ్బవరం) -
‘వారి కోసం జీవితాన్ని త్యాగం చేస్తా’.. జైలులో లొంగిపోయిన ఎంపీ రషీద్
కశ్మీర్: జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ‘ఇంజనీర్ రషీద్’ సోమవారం తీహార్ జైలు అధికారుల ఎదుట లొంగిపోయారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో మధ్యంతర బెయిల్ గడువు నేటితో ముగియడంతో జైలులో లొంగిపోయారు. ఈ సందర్భంగా రషీద్ మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్ ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని బారాముల్లా ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ తెలిపారు. సమస్యలపై ప్రజాస్వామ్యయుతంగా పోరాడతానని పేర్కొన్నారు. తాను కాశ్మీర్ సంక్షేమానికి కట్టుబడి ఉన్నానని, శాంతి, అభివృద్ధి, ప్రజల హక్కుల పునరుద్ధరణ కోసం కృషిచేస్తానని చెప్పారు.‘మా ప్రజల కోసం ప్రాణాలైనా అర్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. మేము ఏ తప్పు చేయలేదు. మాకు న్యాయం జరుగుతుంది. మేము జైల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా ప్రజల సంక్షేమం, కాశ్మీర్ సంక్షేమం, శాంతి గురించి , గౌరవంగా మాట్లాడుతాం. మేము లొంగిపోము. జైలు శిక్ష గురించి భయపడవద్దు. పోరాడి గెలుస్తాం. ‘మేం ఏ నేరం చేయలేదు. నేను జైలుకు వెళ్లడం గురించి చింతించను. నా ప్రజలకు దూరంగా ఉంటానన్న ఒకే ఒక భావన ఉంది’ అని అన్నారు.అయితే తీవ్రవాద నిధుల కేసులో అరెస్టయిన అవామీ ఇత్తెహాద్ పార్టీ వ్యవస్థాపకుడు రషీద్, జమ్మూ కాశ్మీర్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారం కోసం సెప్టెంబర్ 10న మధ్యంతర బెయిల్ పొందారు. అనంతరం రెండుసార్లు మధ్యంతర బెయిల్‌ను పొడిగించారు. ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆయన ఎంపీగా ఉన్నందున చట్టసభ సభ్యులను విచారించేందుకు ఉద్దేశించిన ప్రత్యేక కోర్టుకు అతని కేసు వెళ్లవచ్చని దనపు సెషన్స్ జడ్జి చందర్ జిత్ సింగ్ తెలిపారు. దీనిపై ఢిల్లీ కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. -
నిజం ఇంకా గెలవలేదు: మంత్రి అంబటి
సాక్షి, గుంటూరు: స్కిల్ డెవెలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడికి వచ్చిన బెయిల్ మానవతా దృక్పథంతో ఇచ్చింది మాత్రమేనని అంబటి రాంబాబు పేర్కొన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో బాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చారని, దీనిపై టీడీపీ చాలా హంగామా చేస్తుందని మండిపడ్డారు. చంద్రబాబుకు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ ఇచ్చారని తెలిపారు. బాబుకు కళ్లు కనిపించకే మధ్యంతర బెయిల్ ఇచ్చారన్న అంబటి.. కంటి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత జైల్లో హాజరుకావాల్సి ఉంటుందని చెప్పారు. నిజం ఇంకా గెలవలేదని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. న్యాయం, ధర్మం గెలిచిందని మాట్లాడటం సమంజసం కాదని అన్నారు. రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. తెలంగాణలో టీడీపీ జెండా పీకేశారని, అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేయడం లేదని అన్నారు అంబటి రాంబాబు. కాసాని జ్ఞానేశ్వర్‌కు జ్ఞానోదయం అయిందన్నారు. ఇతర పార్టీల గెలుపుకోసం పార్టీని తాకట్టు పెట్టడం అనైతికమని తెలిపారు. వచ్చే ఎన్నికల ముందో, తర్వాతో ఏపీలో కూడా జెండా పీకేస్తారని విమర్శించారు. చదవండి: AP: రైలు ప్రమాద బాధితులకు చెక్కుల అందజేత -
షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దవుతుంది: న్యాయవాదులు
-
గంటా అనుచరుడు దొరబాబు ఇంట్లో సీఐడీ సోదాలు
విశాఖపట్నం: అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణంలో అరెస్టయిన ఏయూ దూరవిద్య కేంద్రం అసిస్టెంట్ ప్రొఫెసర్ (కాంట్రాక్ట్) కె.దొరబాబు ఇంట్లో సీఐడీ పోలీసులు బుధవారం తనిఖీలు చేసినట్లు తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే సీఐడీ పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. టీడీపీ హయాంలో గంటాకు అనుచరునిగా ఉంటూ అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో దొరబాబు పాత్ర ఉండటంతో సీఐడీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఏయూ దూరవిద్య కేంద్రంలో ఆయన గదిని ఏయూ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఏయూ దూరవిద్య కేంద్రం అధికారులు సీజ్ చేశారు. నారాయణకు మధ్యంతర ముందస్తు బెయిల్ సాక్షి, అమరావతి: అమరావతి రాజధాని ముసుగులో దళిత, బలహీనవర్గాల రైతులకు చెందిన 1,100 ఎకరాల అసైన్డ్, లంక భూములను కాజేసిన వ్యవహారంపై సీఐడీ నమోదు చేసిన కేసులో టీడీపీ మాజీ మంత్రి పొంగూరు నారాయణకు హైకోర్టు బుధవారం మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 14 నుంచి డిసెంబర్ 14 వరకు మూడు నెలలు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మూడు నెలలూ నారాయణను అరెస్ట్ చేయవద్దని సీఐడీని ఆదేశించింది. తుది విచారణను డిసెంబర్ 15కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. సీఐడీ 2020లో నమోదు చేసిన ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ నారాయణ దాఖలు చేసిన వ్యాజ్యంపై కోర్టు బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. రాజధానికి సంబంధించిన మరో కేసులో హైకోర్టు పిటిషనర్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసి, చికిత్సకు అమెరికా వెళ్లేందుకు అనుమతి ఇచ్చిందన్నారు. ఈ వాదనను ఏఏజీ తోసిపుచ్చారు. పిటిషనర్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదై ఉన్నందున, ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదని చెప్పారు. ప్రయాణానికి ఒక్క రోజు ముందు పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. వాదనలు విన్న కోర్టు నారాయణకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. (క్లిక్ చేయండి: నారాయణ స్వాహా.. బంధుగణంతో ‘అసైన్డ్’ మేత) -
పోర్నోగ్రఫీ కేసు.. నటి ఆవేదన
Gehana Vasisth Cries: పోర్నోగ్రఫీ వ్యవహారానికి సంబంధించిన కేసులో నటి గెహనా వశిష్ట్‌కు భారీ ఊరట లభించింది. బాలీవుడ్ ఫైనాన్షియర్ రాజ్‌కుంద్రాతో సత్సంబంధాలు కలిగి ఉండడం, అశ్లీల చిత్రాల్లో నటిస్తూ పట్టుబడడం లాంటి ఆరోపణలున్న గెహానా.. గతంలో అరెస్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆమె 133 రోజులుగా కస్టడీలో ఉండగా.. ఎట్టకేలకు కోర్టు బెయిల్ జారీ చేసింది. అయితే ఈ వ్యవహారంలో దర్యాప్తునకు హాజరు కావాలనే షరతు విధిస్తూ.. జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ బీఆర్ గవాయ్‌ల ధర్మాసనం బుధవారం వెల్లడించింది. చదవండి: Shilpa Shetty: నేను షూటింగ్స్‌తో బిజీ..ఆ యాప్స్ గురించి నాకు తెలియదు సుప్రీం కోర్టు ఇచ్చిన బెయిల్‌పై నటి గెహనా ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. ‘సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ నాకు మంజూరు చేసింది. విచారణకు హాజరు కావాలని పేర్కొంది. సత్యమే జయిస్తుందని మొదటి నుంచి నేను చెప్తున్నా. నన్ను నమ్మండి.. నన్ను ఎవరూ తప్పదోవ పట్టించలేదు. డబ్బుల కోసం ఎవరినీ మోసం చేయలేదు. కావాలనే నన్ను కొందరు ఈ కేసులో ఇరికించారు’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: శృంగారానికి, అశ్లీలానికి తేడా తెలుసా?: నటి గతంలో ఆమె బాంబే హైకోర్టులో బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా, కోర్టు దాన్ని తిరస్కరించింది. దాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయగా, ఇప్పుడు ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది. పిటిషనర్‌ను అరెస్టు చేయరాదని, అయితే విచారణకు సహకరించాలని కోర్టు ఆమెను ఆదేశించింది. ఇక పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా కు మొన్న సోమవారం బెయిల్ లభించిన విషయం తెలిసిందే. -
ఎన్ కన్వెన్షన్ హాల్‌కు రేవంత్ రెడ్డి
-
ఎన్ కన్వెన్షన్ హాల్‌కు రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : తాత్కాలిక బెయిల్‌పై విడుదలైన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గురువారం ఉదయం చర్లపల్లి జైలు నుంచి జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. కుమార్తె నిశ్చితార్థం సందర్భంగా ఏసీబీ కోర్టు రేవంత్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన చర్లపల్లి జైలు నుంచి ఉదయం 6గంటలకు బయటకు వచ్చారు. మీడియా సహా రాజకీయ నేతలను కలవకూడదని షరతులు విధించడంతో ఆయన నేరుగా జూబ్లీహిల్స్‌లోని తన ఇంటికి చేరుకున్నారు. ఈ రోజు ఉదయం ఎన్ కన్వెన్షన్ హాల్లో ఆయన కుమార్తె నిశ్చితార్థం జరగనుంది. తన ఇంటి వద్ద నుంచి రేవంత్ రెడ్డి కుమార్తె నైమిషారెడ్డితో కలిసి నిశ్చితార్థ వేదికకు బయల్దేరారు. -
తాత్కాలిక బెయిల్ పై రేవంత్ విడుదల
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి.. గురువారం ఉదయం చర్లపల్లి జైలు నుంచి తాత్కాలిక బెయిల్ పై విడుదలయ్యారు. కుమార్తె నిశ్చితార్థంలో పాల్గొనేందుకు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్‌ను ఏసీబీ కోర్టు మంజూరు చేసింది. గురువారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిశ్చితార్థంలో రేవంత్ పాల్గొనవచ్చునని జడ్జి లక్ష్మీపతి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. జూబ్లీహిల్స్ లోని నివాసానికి చేరుకున్న ఆయనకు అభిమానులు పూలతో స్వాగతం పలికారు.