సాక్షి, గుంటూరు: స్కిల్ డెవెలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడికి వచ్చిన బెయిల్ మానవతా దృక్పథంతో ఇచ్చింది మాత్రమేనని అంబటి రాంబాబు పేర్కొన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో బాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చారని, దీనిపై టీడీపీ చాలా హంగామా చేస్తుందని మండిపడ్డారు. చంద్రబాబుకు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ ఇచ్చారని తెలిపారు.
బాబుకు కళ్లు కనిపించకే మధ్యంతర బెయిల్ ఇచ్చారన్న అంబటి.. కంటి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత జైల్లో హాజరుకావాల్సి ఉంటుందని చెప్పారు. నిజం ఇంకా గెలవలేదని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. న్యాయం, ధర్మం గెలిచిందని మాట్లాడటం సమంజసం కాదని అన్నారు. రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు.
తెలంగాణలో టీడీపీ జెండా పీకేశారని, అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేయడం లేదని అన్నారు అంబటి రాంబాబు. కాసాని జ్ఞానేశ్వర్‌కు జ్ఞానోదయం అయిందన్నారు. ఇతర పార్టీల గెలుపుకోసం పార్టీని తాకట్టు పెట్టడం అనైతికమని తెలిపారు. వచ్చే ఎన్నికల ముందో, తర్వాతో ఏపీలో కూడా జెండా పీకేస్తారని విమర్శించారు.
చదవండి: AP: రైలు ప్రమాద బాధితులకు చెక్కుల అందజేత
Comments
Please login to add a commentAdd a comment