Skill Development Scam
-
చంద్రబాబుకు వ్యతిరేకంగా నోరు మెదపని సీఐడీ
సాక్షి, న్యూఢిల్లీ: చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసును అటకెక్కించేసిన సీఐడీ ఇప్పుడు సుప్రీంకోర్టులోనూ అదే రీతిన వ్యవహరించింది. స్కిల్ కుంభకోణంలో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును గట్టిగా వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ దాఖలు చేసిన సీఐడీ ఇప్పుడు మాత్రం ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా మిన్నకుండిపోయింది. స్కిల్ కుంభకోణం కేసులో చార్జిషీట్లు దాఖలు చేసేశామన్న సీఐడీ.. ఇక చేసేదేమీ లేదన్నట్టు సుప్రీంకోర్టు ముందు వ్యవహరించింది. దీంతో దర్యాప్తు సంస్థ అయిన సీఐడీనే చంద్రబాబు బెయిల్ రద్దు విషయంలో అసహాయత వ్యక్తం చేయడంతో సుప్రీంకోర్టు ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంది. చంద్రబాబు బెయిల్ రద్దు కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిష్కరించింది. స్కిల్ కుంభకోణం కేసు విచారణకు అవసరమైన సమయంలో సహకరించాలని సీఎం చంద్రబాబును ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ ప్రసన్న బి.వరాలే ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.చంద్రబాబే సీఎం కావడంతో మారిన సీన్చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ద్వారా రూ.వందల కోట్లు దారి మళ్లాయి. షెల్ కంపెనీల ద్వారా విదేశీ ఖాతాలకు వెళ్లి అక్కడి నుంచి తిరిగి టీడీపీ అధికారిక ఖాతాల్లోకి ఆ నిధులు వచ్చాయి. దీనిపై గత ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. సీఐడీ ప్రాథమిక విచారణ జరిపి నిధుల మళ్లింపు వాస్తవమేనని తేల్చింది. ఇందుకు గాను చంద్రబాబును అరెస్ట్ చేసింది. ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు 2023 నవంబర్‌లో తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సీఐడీ అదే నెలలో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని కోరింది. తమ తరఫున వాదనలు వినిపించేందుకు ప్రముఖ సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని నియమించుకుంది. దీనిపై అప్పటినుంచి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ వస్తోంది. ఈ మధ్యలో ప్రభుత్వం మారడం.. స్కిల్ కేసులో నిందితునిగా ఉన్న చంద్రబాబే ముఖ్యమంత్రి కావడంతో సీఐడీ తన దర్యాప్తును అటకెక్కించేసింది. చార్జిషీట్ల దాఖలులో అసాధారణ జాప్యం చేసింది. స్కిల్ కుంభకోణం కేసును ఎన్ని రకాలుగా నీరుగార్చాలో అన్ని రకాలుగా నీరుగార్చేందుకు చర్యలు తీసుకుంది.జోక్యం అవసరం లేదన్న సీఐడీతాజాగా బుధవారం సీఐడీ దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ సుప్రీంకోర్టు ముందు విచారణకు వచ్చింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా సీఐడీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. హైకోర్టు కేసు పూర్వాపరాల్లోకి వెళ్లి మరీ తీర్పునిచ్చిన విషయాన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురాలేదు. ఈ కేసులో ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేశామని, అందువల్ల బెయిల్ రద్దు పిటిషన్‌పై జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని మాత్రమే సీఐడీ తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ, చార్జిషీట్ దాఖలు చేసినందున చంద్రబాబు బెయిల్ విషయంలో ఇప్పుడు తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. సీఐడీ పిటిషన్‌ను పరిష్కరిస్తున్నట్టు పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉంటే చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ బాలగంగాధర్ తిలక్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. -
వాంగ్మూలాలు మార్చేసి.. ‘సుప్రీం’ను ఏమార్చాలి
సాక్షి, అమరావతి : సీఆర్పీసీ 164 వాంగ్మూలాలు మార్చాలి.. సుప్రీంకోర్టును ఏమార్చాలి.. ఏం చేసినా ఈ నెల 21లోగా చేసేయాలి.. అందుకు ఎంతకైనా బరితెగించాలన్నది టీడీపీ కూటమి ప్రభుత్వ కుట్రగా స్పష్టమవుతోంది. సీఐడీని అడ్డుపెట్టుకుని ఈ కుతంత్రానికి పాల్పడుతోంది. చంద్రబాబుపై అవీనీతి కేసులను నీరుగార్చడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. న్యాయస్థానంలో సీఆర్పీసీ 164 కింద వాంగ్మూలాలు ఇచ్చిన అధికారుల సంగతి తేలుస్తామని ఎన్నికల ముందు లోకేశ్ హెచ్చరించినట్టుగానే.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం న్యాయస్థానాల్లో ఉన్న కేసులను ప్రభావితం చేసేలా అక్రమాలకు పాల్పడుతోంది. అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించి ఏకంగా సుప్రీంకోర్టునే ఏమార్చేందుకు బరితెగిస్తోంది. చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై ప్రస్తుతం సీఐడీ వరుసగా వాయిదాలు కోరుతుండటంపై సుప్రీంకోర్టు ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేయడంతో టీడీపీ కూటమి ప్రభుత్వం హడలిపోతోంది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టు అయిన చంద్రబాబు.. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న విషయం తెలిసిందే. ఆయనకు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని గతంలోనే సీఐడీ దాఖలు చేసిన పిటిషన్, సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పిటిషన్ అంశంలో సీఐడీ ప్లేటు ఫిరాయించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణకు ప్రభుత్వ న్యాయవాది ముకుల్ రోహత్గీ వరుసగా వాయిదాలు కోరుతుండటం గమనార్హం. గత విచారణకు కూడా ఆయన నేరుగా హాజరు కాకుండా వర్చువల్‌గా పాల్గొని వాదనలు వినిపించకుండా మరోసారి వాయిదా కోరారు. వరుస వాయిదాలు కోరడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి వాయిదా ఇవ్వమని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. దాంతో ఈ నెల 21న సుప్రీంకోర్టు విచారణకు హాజరై చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై సీఐడీ తరఫు న్యాయవాది తప్పనిసరిగా తన వాదనలు వినిపించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఆ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన కేసునే ఆయన వాదిస్తున్నారు. అంటే నిబంధనల ప్రకారం చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఆయన వాదనలు వినిపించాలి. కానీ ఈ పిటిషన్ వీగిపోయేలా చేసేందుకే ప్రస్తుత సీఐడీ ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు కుట్రలకు పదును పెడుతున్నారు. ఈ నెల 21లోగా తిమ్మిని బమ్మి చేసేందుకు బరితెగిస్తున్నారు. అబద్ధపు వాంగ్మూలాలతో ‘సుప్రీం’ను ఏమార్చే కుట్ర 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో కుంభకోణాలకు చంద్రబాబే ప్రధాన కుట్రదారు అని ఐఏఎస్ అధికారులు చెరుకూరి శ్రీధర్, అజయ్ జైన్, కాంతిలాల్ దండే స్పష్టం చేశారు. ఆమేరకు 164 సీఆర్పీసీ కింద న్యాయస్థానంలో వాంగ్మూలాలు నమోదు చేశారు. ఈ కేసులో ఆ వాంగ్మూలాలు కీలక సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అందుకే వారిపై టీడీపీ కూటమి ప్రభుత్వం గురి పెట్టింది. గతంలో ఇచ్చిన వాంగ్మూలాలకు పూర్తి విరుద్ధంగా అబద్ధపు వాంగ్మూలాలను సీఆర్పీసీ 164 కింద మరోసారి నమోదు చేయించేందుకు కుతంత్రం పన్నుతోంది.సీఆర్పీసీ 164 కింద ఓసారి ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరో వాంగ్మూలం ఇవ్వడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయినా సరే ఈ నెల 8న ఆ అధికారులతో అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించాలని సీఐడీ పట్టుబడుతోంది. ఈ నెల 21లోగా అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించి, ఆ విషయాన్ని ప్రస్తావించడం ద్వారా సుప్రీంకోర్టును ఏమార్చేందుకు పన్నాగం పన్నింది. అప్పుడే హెచ్చరించిన లోకేశ్సీఆర్పీసీ 164 కింద న్యాయస్థానంలో వాంగ్మూలం ఇవ్వడమన్నది రాజ్యాంగం కల్పించిన అవకాశం. ప్రమాణ పూర్తిగా ఇచ్చే ఆ వాంగ్మూలాలకు న్యాయస్థానం రక్షణ కల్పిస్తోంది. కానీ అంతటి కీలకమైన 164 వాంగ్మూలాలను కూడా నారా లోకేశ్ ప్రశ్నించడం విభ్రాంతికరం. ఎన్నికల ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అవినీతిని బట్టబయలు చేస్తూ ఐఏఎస్ అధికారులు 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలాలు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. అందుకే రెడ్‌బుక్ రాస్తున్నామని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అధికారుల సంగతి తేలుస్తామని హెచ్చరించారు.అప్పటికే న్యాయస్థానంలో విచారణలో ఉన్న అంశంపై ఆయన మాట్లాడటం, సాక్షులను బెదిరించడం న్యాయ ధిక్కారమేనని పరిశీలకులు స్పష్టం చేశారు. లోకేశ్ ముందుగా చెప్పినట్టుగానే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. గతంలో 164 సీఆర్పీసీ వాంగ్మూలాలు ఇచ్చిన అధికారులను ప్రభుత్వం వేధిస్తోంది. వారితో అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించేందుకు సీఐడీ ద్వారా బరితెగిస్తోంది. ఇది కచ్చితంగా చంద్రబాబుపై అవినీతి కేసుల విచారణను ప్రభావితం చేయడమేనని పరిశీలకులు తేల్చి చెబుతున్నారు. దీన్ని న్యాయస్థానాలు తీవ్రంగా పరిగణించాలని కోరుతున్నారు. -
మూడు నెలల్లో బాబు అవినీతి కేసులు ముగించేలా కుట్రలు
-
కేసులపై కుతంత్రం!
చంద్రబాబుపై కొనసాగుతున్న కేసులను ఎత్తేద్దాం..! విపక్ష ప్రజా ప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టేద్దాం!! ఇదీ కూటమి సర్కారు కుట్రల కుతంత్రం! ఒకపక్క ఎలాంటి ఆధారాలు లేకపోయినా వైఎస్సార్సీపీ నేతలపై కేసులు బనాయిస్తూ మరోవైపు స్పష్టమైన ఆధారాలతో బాబుపై కోర్టుల్లో కొనసాగుతున్న కేసుల విచారణను నీరుగార్చి అటకెక్కించేందుకు కూటమి సర్కార్ సిద్ధమైంది. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ నుంచి వచ్చిన ఓ ప్రముఖ సీనియర్ న్యాయవాది ఏకంగా పోలీసు, సీఐడీ ఉన్నతాధికారులతో సమావేశమై స్కిల్‌స్కామ్, అసైన్డ్ భూముల దోపిడీ, ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్ అక్రమాలు, ఫైబర్ నెట్ కుంభకోణం కేసుల నుంచి చంద్రబాబు పేరును తప్పించడంపై మార్గనిర్దేశం చేయడం సంచలనం రేకెత్తిస్తోంది. ఆ కేసుల్లో సాక్షులను ఎలా వేధించాలి..? ఎలా తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేయాలి..? న్యాయపరంగా ఇబ్బందులు రాకుండా ఎలాంటి అడ్డదారులు తొక్కాలి? అనే విషయాలను ఆ సీనియర్ న్యాయవాది కూలంకషంగా ఉద్బోధించినట్లు తెలుస్తోంది.చంద్రబాబుపై ఉన్న అవినీతి కేసులను మూసివేయడమే ఏకైక అజెండాగా ఓ ప్రైవేట్ న్యాయవాది ఈ సమావేశాన్ని నిర్వహించడం.. రానున్న రెండు నెలల్లోనే ఆ కేసులను క్లోజ్ చేసేలా పోలీసు, సీఐడీ వ్యవస్థలను సిద్ధం చేయడంపై పోలీస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. నేడు కూడా ఈ సమావేశాన్ని కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఇలా ఒకవైపు తమపై ఉన్న కేసులను నీరుగారుస్తున్న ప్రభుత్వ పెద్దలు మరో వైపు విపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించే వ్యూహాన్ని రచించారు. వైఎస్సార్సీపీ ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, పీవీ మిథున్‌రెడ్డిపై మద్యం అక్రమ కేసులను బనాయించేందుకు కుతంత్రం పన్నారు. ‘ముఖ్య’ నేత ఆదేశాలతో రంగంలోకి దిగిన సీఐడీ ఉన్నతాధికారి ఒకరు బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఆ ఇద్దరినీ అక్రమ కేసులతో వేధిస్తే డీజీపీ పోస్టు ఇస్తానని సీఐడీ ఉన్నతాధికారికి ‘ముఖ్య’ నేత ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది!! – సాక్షి, అమరావతి -
బాబు అవినీతి బాగోతాన్ని మడతెట్టేద్దాం..
సాక్షి, అమరావతి: నారా చంద్రబాబు నాయుడు కుట్రదారు, లబ్ధిదారుగా సాగించిన కుంభకోణాల కేసులను పూర్తిగా నీరుగార్చే కుతంత్రానికి టీడీపీ కూటమి ప్రభుత్వం పదును పెడుతోంది! అందుకోసం ఇప్పటికే డీజీపీ, సీఐడీ కార్యాలయాలను పూర్తిగా ఆ పనిలో నిమగ్నం చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. తాజాగా ఢిల్లీ నుంచి ఓ ప్రముఖ సీనియర్ న్యాయవాదిని రప్పించి కేసుల కొట్టివేత కుట్రలను వేగవంతం చేయడం గమనార్హం. 2014–19 మధ్య టీడీపీ హయాంలో చంద్రబాబు సూత్రధారిగా పాల్పడిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం, అసైన్డ్ భూముల దోపిడీ, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం, ఫైబర్ నెట్ కుంభకోణం ఆధారాలతో సహా బట్టబయలయ్యాయి. వాటిని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పూర్తి ఆధారాలతో నిగ్గు తేల్చింది. అందులో స్కిల్ స్కామ్ కేసులో గతంలో చంద్రబాబును అరెస్ట్ చేయగా... ఏసీబీ న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించింది. 52 రోజులపాటు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ నాలుగు కేసులూ సీఐడీ విచారణలోనే ఉన్నాయి. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఆ కేసుల దర్యాప్తును నీరుగార్చి ఏకంగా కేసులను కొట్టి వేసేందుకు కార్యాచరణ చేపట్టారు. అన్ని కేసుల నుంచి చంద్రబాబు పేరును తొలగించాలని సీఐడీ, పోలీసు ఉన్నతాధికారులకు ప్రభుత్వ పెద్దలు హుకుం జారీ చేసినట్లు సమాచారం. ఆ కేసులను ఎప్పటిలోగా నీరుగార్చాలో కూడా దర్యాప్తు అధికారులకు గడువు కూడా విధించినట్లు తెలిసింది.నేను చెప్పినట్టు చేయండి.. ఆ కేసులను మూసేద్దాంస్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు తరపున వాదించిన ఢిల్లీకి చెందిన సీనియర్ న్యాయవాది అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమయ్యారు. ఏకంగా రోజుకు రూ.కోటికి పైగా ఫీజు చెల్లించి మరీ ఆయన్ను ప్రత్యేకంగా రప్పించారు. కానీ ఆయన వాదనను ఏసీబీ న్యాయస్థానం సమ్మతించలేదు. చంద్రబాబుకు రిమాండ్ విధించింది. అయినా సరే అదే న్యాయవాది చంద్రబాబు కేసుల విచారణను ఇటు విజయవాడలో అటు ఢిల్లీలో స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆ సీనియర్ న్యాయవాది సోమవారం హఠాత్తుగా విజయవాడలో వాలారు. జీ హుజూర్ అంటూ రాష్ట్ర పోలీసు, సీఐడీ ఉన్నతాధికారులు ఆయనతో ప్రత్యేకంగా భేటీ కావడం గమనార్హం. అసలు ఓ ప్రైవేట్ న్యాయవాదితో పోలీసు, సీఐడీ ఉన్నతాధికారులు సమావేశం కావడం ఏమిటని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. చంద్రబాబు అవినీతి కేసులను మూసివేయడమే ఏకైక అజెండాగా ఆ సమావేశం సాగింది.స్కిల్‌స్కామ్, అసైన్డ్ భూముల దోపిడీ, ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్ అక్రమాలు, ఫైబర్ నెట్ కుంభకోణం కేసుల నుంచి చంద్రబాబు పేరును తప్పించడం... అనంతరం ఆ కేసులను మూసివేయడం... అందుకు ఆ కేసుల్లో సాక్షులను ఎలా వేధించాలి.... ఎలా తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేయాలి...? న్యాయపరంగా ఇబ్బందులు రాకుండా ఎలాంటి అడ్డదారులు తొక్కాలి? అనే విషయాలను ఆ సీనియర్ న్యాయవాది అంశాలవారీగా వివరించారని తెలుస్తోంది. రానున్న రెండు నెలల్లోనే ఆ కేసులను క్లోజ్ చేసేలా పోలీసు, సీఐడీ వ్యవస్థలు పూర్తిగా సహకరించాలని ఆయన తేల్చిచెప్పారు. అందుకు పోలీసు, సీఐడీ ఉన్నతాధికారులు తలూపినట్లు తెలుస్తోంది. ఆ సీనియర్ న్యాయవాది పోలీసు, సీఐడీ ఉన్నతాధికారులతో మంగళవారం కూడా సమావేశం నిర్వహించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.ఇప్పటికే దర్యాప్తును అటకెక్కించిన ప్రభుత్వంచంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న స్కిల్ స్కామ్ కేసు దర్యాప్తును టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటికే అటకెక్కించేసింది. స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం, ఫైబర్‌నెట్ కుంభకోణం, అసైన్డ్ భూముల కుంభకోణం కేసుల చార్జిషీట్లను సీఐడీ గతంలో న్యాయస్థానానికి సమర్పించింది. దీనిపై కొన్ని వివరణలు కోరుతూ న్యాయస్థానం వాటిని ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ మధ్య సీఐడీకి పంపింది.అప్పటి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వాటిని కేస్ స్టడీలతో సీఐడీ అధికారులకు అందచేశారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ కేసులను నీరుగార్చేలా కూటమి పెద్దలు సీఐడీపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో సీఐడీ ఆ చార్జిషీట్లను న్యాయస్థానానికి సమర్పించలేదు. కేసుల దర్యాప్తును పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయడం లేదు.‘సుప్రీం’లో విచారణకు సహాయ నిరాకరణస్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తోంది. 2023లో బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు, హైకోర్టు విధించిన షరతులను చంద్రబాబు నిర్భీతిగా ఉల్లంఘించారు. కేసుల గురించి బహిరంగంగా, మీడియాతో మాట్లాడవద్దని న్యాయస్థానాలు స్పష్టమైన షరతులు విధించాయి. అయితే చంద్రబాబు దర్యాప్తు అధికారులను బెదిరిస్తూ.. రెడ్‌బుక్ పేరిట హెచ్చరిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.షరతులు ఉల్లంఘించినందున చంద్రబాబు బెయిల్‌ను రద్దు చేయాలని సీఐడీ 2023 డిసెంబర్లోనే సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానిపై విచారణ కొనసాగుతోంది. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఐడీ హఠాత్తుగా రూటు మార్చేసింది. సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణకు సహకరించడం లేదు. సుప్రీం కోర్టులో సీఐడీ వాదనను వినిపించాల్సిన ఏపీ ప్రభుత్వ న్యాయవాది వాయిదాల మీద వాయిదాలు కోరుతున్నారు.అది సరైన పద్ధతి కాదని సుప్రీం కోర్టు చెప్పినా తీరు మారడం లేదు. కొద్దిరోజుల క్రితం చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణకు ఆయన నేరుగా హాజరు కాకుండా వర్చువల్‌గా పాల్గొన్నారు. వాదనలు వినిపించకుండా.. తాను ఢిల్లీలో లేనందున వాయిదా వేయాలని కోరారు. దీనిపై సుప్రీంకోర్టు మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రతిసారీ వాయిదాలు కోరడం సరైన చర్య కాదని వ్యాఖ్యానిస్తూ కేసు విచారణను జనవరి రెండో వారానికి వాయిదా వేసింది.సీబీఐకి అప్పగించాలి.. న్యాయస్థానం పర్యవేక్షణలోనే దర్యాప్తు జరగాలిన్యాయ నిపుణుల సూచనస్కిల్ స్కామ్, ఇతర కేసుల దర్యాప్తు, తాజా పరిణామాలను గమనిస్తున్న న్యాయ నిపుణులు చంద్రబాబుపై ఉన్న కేసుల విచారణను సీబీఐకి అప్పగించాలని సూచిస్తున్నారు. సీబీఐకి అప్పగించాలని కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు టీడీపీ కూటమి ప్రభుత్వం గడువు కోరిన విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. చంద్రబాబుపై కేసుల దర్యాప్తును న్యాయస్థానం పర్యవేక్షించాలని స్పష్టం చేస్తున్నారు. గతంలో ఉమ్మడి ఏపీలో మద్యం సిండికేట్ కేసు దర్యాప్తును హైకోర్టు పర్యవేక్షించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.షరతులు ఉల్లంఘిస్తున్న బాబు⇒ స్కిల్ స్కామ్ కేసులో న్యాయస్థానం విధించిన బెయిల్ షరతులను ఎన్నికల ముందు, ఆ తర్వాత చంద్రబాబు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిగా బేఖాతర్ చేస్తున్నారు. తన బావమరిది, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓ ఓటీటీ చానల్ కోసం నిర్వహిస్తున్న టాక్ షోలో పాల్గొన్న చంద్రబాబు న్యాయస్థానాల షరతులంటే ఏమాత్రం లెక్కలేదనే రీతిలో షరతులను ఉల్లంఘిస్తూ మాట్లాడారు. ఏ ఒక్క అధికారినీ విడిచిపెట్టబోనని బెదిరింపులకు దిగడం గమనార్హం.⇒ హిందుస్థాన్ టైమ్స్ సంస్థ ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన సదస్సులోనూ చంద్రబాబు బెయిల్ షరతులను ఉల్లంఘించి స్కిల్ స్కామ్ కేసు గురించి మాట్లాడారు. అధికారులను బెదిరించే రీతిలో వ్యాఖ్యలు చేస్తూ కేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు యత్నించారు. -
చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా
న్యూఢిల్లీ: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. స్కిల్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా.. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సీఐడీ సవాల్ చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు బెయిల్‌ను రద్దు చేయాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది.విచారణ సందర్భంగా అప్పటి ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వర్చువల్‌గా వాదనలు వినిపించారు. చంద్రబాబు బెయిల్ రద్దును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.ప్రస్తుతం తాను ఢిల్లీలో లేనని, విచారణకు నేరుగా కోర్టుకు హాజరై వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలని ముకుల్ రోహత్గి కోరారు. దీంతో జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీశ్ చంద్రశర్మలతో కూడిన ధర్మాసనం విచారణను జనవరి రెండో వారానికి వాయిదా వేసింది. -
చంద్రబాబు అరెస్టుపై వాస్తవాలు
-
చంద్రబాబు సహా వాళ్లంతా కుంభకోణాల్లో నిందితులు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 2014–19 మధ్య జరిగిన పలు భారీ కుంభకోణాలకు సంబంధించి నమోదైన కేసుల్లో కింది కోర్టుకు సమర్పించిన చార్జిషిట్లను, ఆ కేసుల డైరీలను కోర్టు ముందుంచేలా సీఐడీ అదనపు డీజీని ఆదేశించాలని కోరుతూ స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ కొట్టి బాలగంగాధర్ తిలక్ హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఆ కుంభకోణాల్లో నిందితులుగా ఉన్న ప్రస్తుత సీఎం చంద్రబాబు, మంత్రులు పొంగూరు నారాయణ, నారా లోకేశ్, కింజరపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర తదితరులు దర్యాప్తు అధికారులను ప్రభావితం చేసేంత శక్తిమంతమైన స్థానాల్లో ఉన్నారని, అందువల్ల కేసు డైరీల్లోని కీలక ఆధారాలను, సాక్ష్యాలను చెరిపేసే ప్రమాదం ఉందని తిలక్ తన పిటిషన్లో పేర్కొన్నారు.2014–19 మధ్య జరిగిన పలు కుంభకోణాలపై సీఐడీ నమోదు చేసిన కేసుల్లో పోలీసులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేసే పరిస్థితులు ప్రస్తుతం లేవని, నిష్పాక్షిక, పారదర్శక, వేగవంత దర్యాప్తు నిమిత్తం ఈ కేసుల తదుపరి దర్యాప్తు బాధ్యతలను సీబీఐ, ఈడీలకు అప్పగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తిలక్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే తిలక్ పలు అంశాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ తాజాగా ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ యంత్రాంగం, దర్యాప్తు సంస్థలన్నీ చంద్రబాబు తదితరులకు క్లీన్‌చీట్ ఇచ్చి వారిపై నమోదైన కేసులన్నింటినీ మూసివేసేందుకు చర్యలు చేపడుతున్నాయని అనుబంధ పిటిషన్లో పేర్కొన్నారు. రూ.కోట్ల కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు కొనసాగిస్తోందని, అందులో భాగంగా పలువురు నిందితుల ఆస్తులను కూడా జప్తు చేసిందని తెలిపారు. అధికారుల్ని చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు ‘ఆ కుంభకోణాల్లో నిందితులుగా ఉన్న చంద్రబాబు తదితరులను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) ఐజీ, సీఐడీ అదనపు డీజీ, డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శులు గవర్నర్‌ను కోరగలరు. అయితే వీరంతా చంద్రబాబు నియంత్రణలో పనిచేస్తున్నారు. ఐపీఎస్ అధికారుల పనితీరు మదింపు నివేదికలు (ఏపీఏఆర్) ఆమోదించే అధికారం కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు వద్దే ఉంది. అధికారులను బదిలీ చేసే సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ), శాంతి భద్రతల విభాగం కూడా ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయి. అందువల్ల ముఖ్యమంత్రిగా ఆ కుంభకోణాలపై దర్యాప్తు చేసిన అధికారుల వృత్తిపరమైన జీవితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.ఇది నిష్పాక్షిక, పారదర్శక దర్యాప్తును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. తమపై నమోదైన కేసుల్లో ఫిర్యాదుదారులుగా ఉన్న అధికారులను చంద్రబాబు తదితరులు లక్ష్యంగా చేసుకున్నారు. ఏపీ ఫైబర్‌నెట్ కుంభకోణంపై ఫిర్యాదు చేసిన మధుసూదన్‌రెడ్డి అనే అధికారిని అకారణంగా సస్పెండ్ చేశారు. దీనిపై మధుసూదన్‌రెడ్డి న్యాయపోరాటం చేసి తిరిగి ఉద్యోగం పొందారు. తనపై ఫిర్యాదు చేసిన అధికారులపై చంద్రబాబు కక్ష తీర్చుకుంటున్నారనేందుకు ఇదో ఉదాహరణ. అంతేకాక ఆ కుంభకోణాలపై నిష్పాక్షికంగా, వృత్తిపరంగా దర్యాప్తు చేసిన, దర్యాప్తులో పాలుపంచుకున్న పలువురు అధికారులకు ఎలాంటి పోస్టింగ్‌లు ఇవ్వకుండా పక్కనపెట్టారు’ అని తిలక్ వివరించారు.ముఖ్యమంత్రి సహా ఇప్పుడున్న 25 మంది మంత్రుల్లో ఐదుగురు ఆ కుంభకోణాల్లో నిందితులుగా ఉన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులంతా కూడా ఈ నిందితుల నియంత్రణలో పనిచేస్తున్నారు. సీఐడీ దర్యాప్తు కొనసాగించినా కూడా నిందితులుగా ఉన్న వీరిని ప్రాసిక్యూట్ చేయాలని గవర్నర్‌ను కోరే ఆస్కారమే లేదు. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) చైర్మన్‌గా ముఖ్యమంత్రిగా ఉంటారు. సీఆర్డీఏ పురపాలక శాఖ పరిధిలో పనిచేస్తుంది. దానికి నారాయణ మంత్రిగా ఉన్నారు. సీఆర్డీఏకు నారాయణ వైస్ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.వీరిద్దరూ ఆ కుంభకోణాల్లో నిందితులు. సీఆర్డీఏ, పురపాలక శాఖ అధికారులందరూ వీరి నియంత్రణలో పనిచేస్తున్నారు. ఇప్పటికే కొందరి సాక్ష్యాలను కింది కోర్టు నమోదు చేసింది. మరికొందరి సాక్ష్యాలు నమోదు చేయాల్సి ఉంది. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కింద కోర్టుకు సమర్పించిన అన్నీ రికార్డులను చంద్రబాబు, నారాయణ పరిశీలించే అవకాశం ఉంది అని తిలక్ తన పిటిషన్లో ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేశ్ బెదిరించేలా మాట్లాడుతున్నారు‘బెయిల్ మంజూరు సందర్భంగా సుప్రీంకోర్టు, హైకోర్టు విధించిన షరతులను చంద్రబాబు, నారా లోకేశ్ ఉల్లంఘించారు. వారిపై నమోదైన కేసుల గురించి మీడియా ముందు మాట్లాడారు. దర్యాప్తు అధికారులు, కీలక సాక్షులు చంద్రబాబు నియంత్రణలో పనిచేస్తున్నారు. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వారు మాట్లాడిన మాటలన్నీ కూడా దర్యాప్తును ప్రభావితం చేసేలా, అడ్డుకునేలా ఉన్నాయి. దర్యాప్తు అధికారులను భయపెట్టేలా, బెదిరించేలా మాట్లాడుతున్నారు. కోర్టు ముందు సాక్ష్యం ఇచి్చన పలువురు అధికారులు తమ తప్పును అంగీకరించారు.క్షమాభిక్ష కోరుతూ పిటిషన్లు కూడా దాఖలు చేశారు. కుంభకోణాల్లో పొందిన నగదు టీడీపీ ఖాతాలకు చేరింది. ఈ విషయంపై దర్యాప్తు అధికారులు దర్యాప్తు చేశారా? చేస్తున్నారా? అన్న విషయాలు కేసు డైరీల్లో ఉంటాయి. ఏ కోణంలో చూసినా కూడా చంద్రబాబు తదితరులు అధికారులను, దర్యాప్తును శాసించే స్థానాల్లో ఉన్నారు. కాబట్టి వారిపై నమోదయిన కేసులకు సంబంధించిన కేసు డైరీలను, చార్జిషిట్లను కోర్టు ముందుంచేలా ఆదేశాలు ఇవ్వండి’ అని తిలక్ తన పిటిషన్లో కోర్టును కోరారు. -
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో వెలుగులోకి సరికొత్త విషయాలు
-
ఆంధ్రప్రదేశ్‌లో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో నిధుల మళ్లింపు నిజమే... నిర్ధారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
-
నిధుల మళ్లింపు నిజమే
ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం ఎలా మొదలైంది.. నిధులు ఎలా మళ్లించారు.. ఎంత మొత్తంలో మళ్లించారు.. అందులో ఎవరెవరు ఉన్నారు.. ఎన్ని సూట్‌కేస్ కంపెనీలు ఏర్పాటు చేశారు.. ఏ ఏ దేశాల్లో ఆ కంపెనీలున్నాయి.. ఆ కంపెనీల ప్రతినిధులు ఎవరు.. వారికి, స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టును నడిపిన వ్యక్తులకు మధ్య సంబంధం ఏమిటి.. మళ్లించిన నిధులను తిరిగి ఎలా నగదు రూపంలో తీసుకున్నారు.. ఇలా పలు కీలక విషయాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ద్వారా పూసగుచ్చినట్లు బట్టబయలు అయ్యాయి. ఇకపై సాగనున్న దర్యాప్తులో ఈ స్కామ్‌లో గత ప్రభుత్వ పెద్దల పాత్ర నిగ్గు తేలనుంది.సాక్షి, అమరావతి: నారా చంద్రబాబునాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కనుసన్నల్లో సాగిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తులో సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు ఈడీ సాగించిన దర్యాప్తులో మొత్తం రూ.151 కోట్ల మేర నిధులను పలు కంపెనీలకు మళ్లించినట్లు తేలింది. ఇందులో విదేశీ కంపెనీల ప్రమేయం కూడా ఉన్నట్లు ఈడీ బయటపెట్టింది. ఈ కుంభకోణంలో పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగిందనేందుకు స్పష్టమైన ఆధారాలను సేకరించింంది. ఈ వివరాలన్నింటినీ ఇటీవల ఓ కేసులో హైకోర్టు ముందు ఉంచింది. ప్రజాధనాన్ని షెల్ కంపెనీల ద్వారా మళ్లించి, ఆ నిధులను తిరిగి డబ్బు రూపంలో ఎలా పొందారో ఈడీ తన కౌంటర్లోసు స్పష్టంగా వివరించింది. ఇప్పటి వరకు ఈడీ తన దర్యాప్తును ప్రైవేటు వ్యక్తులు, కంపెనీలకు పరిమితం చేసింది. దర్యాప్తు ఓ కొలిక్కి రావడంతో ఇకపై స్కిల్ కుంభకోణంలో అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్రపై దృష్టి సారించనుంది. అసలు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఎలా మొదలైంది.. ఏకపక్ష నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు.. ఇందులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్ర, ఆయన జోక్యం, ఇతర అధికారుల పాత్రపై ఈడీ పూర్తి స్థాయి దర్యాప్తు మొదలుపెట్టనుంది. మళ్లించిన ప్రజాధనం చివరకు షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకే చేరినట్లు సీఐడీ ఇప్పటికే ప్రాథమికంగా తేల్చిన నేపథ్యంలో ఈడీ ఈ అంశంపై కూడా లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు తెలిసింది.ఇదీ కుంభకోణం..నిరుద్యోగ యువతకు అత్యాధునిక సాంకేతికపరమైన శిక్షణ ఇచ్చేందుకు 2015లో చంద్రబాబు ప్రభుత్వం సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. సీమెన్స్ ఎండీ సుమన్ బోస్, డిజైన్ టెక్ ఎండీ వికాస్ వినయ్ ఖన్వీల్కర్ ఇందులో కీలక పాత్ర పోషించారు. ఈ ఒప్పందం ప్రకారం శిక్షణకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను డిజైన్ టెక్ అందించాలి. ⇒ ఈ ప్రాజెక్టులో మొత్తం ఆరు క్లస్టర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కో క్లస్టర్‌ను రూ.546.84 కోట్లతో ఏర్పాటు చేయాలి. దీని ప్రకారం మొత్తం వ్యయం రూ.3,281.40 కోట్లు. ఇందులో 90 శాతం నిధులు.. అంటే రూ.2,951 కోట్లను సీమెన్స్, డిజైన్ టెక్ భరిస్తాయి. మిగిలిన 10 శాతం అంటే రూ.330 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. ⇒ అయితే సీమెన్స్, డిజైన్ టెక్‌లు తమ వాటా నిధులను ఇవ్వక ముందే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద ఇవ్వాల్సిన రూ.330 కోట్లను ఆ కంపెనీలకు ఇచ్చేసింది. ఇదంతా కూడా అప్పటి మంత్రి మండలి ఆమోదం లేకుండానే జరిగిపోయింది. చంద్రబాబు ఆదేశాలతో అధికారులు కిక్కురు మనకుండా ఆయన చెప్పినట్లు చేసేశారు.⇒ ఇదిలా ఉండగా 2018లో షెల్ కంపెనీ అయిన ఏసీఐ.. (అల్లాయిడ్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్ (ఏసియా) లిమిటెడ్) నకిలీ బిల్లులు, ఇన్వాయిస్లు తయారు చేసి పలువురికి లబ్ధి చేకూరుస్తున్నట్లు జీఎస్టీ అధికారులు గుర్తించారు. సుమన్ బోస్ తదితరులు తమ అక్రమ కార్యకలాపాలకు ఈ ఏసీఐ కంపెనీని వాడుకున్నారు. 2019లో ఈ మొత్తం కుంభకోణం గురించి పుణేకు చెందిన ఓ సామాజిక కార్యకర్త అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది.⇒ ప్రాథమిక విచారణలో ఈ కుంభకోణం మొత్తం చంద్రబాబు కనుసన్నల్లో జరిగినట్లు తేలింది. దీంతో ఆయన్ను ఏ1గా పేర్కొంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఈ కుంభకోణంపై ఈడీ కూడా దర్యాప్తు మొదలు పెట్టింది. 2024లో రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో స్కిల్ కుంభకోణంలో సీఐడీ తన దర్యాప్తును పక్కన పెట్టేసింది. అయితే ఈడీ తన దర్యాప్తును కొనసాగిస్తూనే ఉంది.స్కిల్ కుంభకోణానికి సంబంధించి హైకోర్టులో ఈడీ దాఖలు చేసిన కౌంటర్ , సింగపూర్ కంపెనీలకు, యూకే బేస్డ్ కంపెనీలకు నిధుల మళ్లింపు ఇలా డిజైన్ టెక్ నుంచే నిధుల మళ్లింపు మొదలు.. ⇒ దర్యాప్తులో భాగంగా ఆయా కంపెనీల బ్యాంకు ఖాతాలను ఈడీ విశ్లేషించింది. డిజైన్ టెక్ నుంచి పొందిన నిధుల్లో దాదాపు రూ.58 కోట్లను స్కిల్లర్ ఎంటర్‌ప్రైజస్, ఆ తర్వాత ఏసీఐకి బదలాయించినట్లు ఈడీ గుర్తించింది. అక్రమ పద్ధతిలో వచ్చిన డబ్బును పలు షెల్ కంపెనీల ద్వారా మళ్లించినట్లు స్కిల్లర్ కంపెనీ వ్యవహారాలు చూసే వ్యక్తి శిరీష్ షా ఈడీ విచారణంలో అంగీకరించారు.⇒ స్కిల్లర్ నుంచి వచ్చిన సొమ్ముతో స్కిల్ డెవలప్మెంట్ సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి వస్తువులను గానీ, సేవలను గానీ అందించలేదు. వ్యక్తిగతంగా లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వ నిధులను డిజైన్ టెక్ కంపెనీ స్కిల్లర్ ఎంటర్‌ప్రైజెస్‌కు, స్కిల్లర్ తిరిగి ఆ నిధులను ఏసీఐకి బదలాయించినట్లు ఈడీ తేల్చి చెప్పింది. నిధుల మళ్లింపుకు సహాయ పడిన వారి వాంగ్మూలాలను ఈడీ రికార్డ్ చేసింది. సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, వస్తువులు, సేవలు.. ఏవీ అందించలేదని వారు అంగీకరించారు. నకిలీ, కల్పిత పర్చేజ్ ఆర్డర్లు, ఇన్వాయిస్లు, తప్పుడు బిల్లులు సృష్టించినట్లు కూడా వారు ఈడీ ఎదుట ఒప్పుకున్నారు.⇒ ఏసీఐ నుంచి వచ్చిన నిధులను నగదు రూపంలో మార్చినట్లు కూడా వారు అంగీకరించారు. ఈ విషయాలన్నింటినీ ఎంట్రీ ప్రొవైడర్లయిన యోగేశ్ గుప్తా, మనోష్ కుమార్ జైన్ ఈడీ వద్ద నిర్ధారించారు. ఈ షెల్ కంపెనీలేవీ సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్‌తో సంబంధం ఉన్న కంపెనీలు కాదని కూడా ఈడీ తన దర్యాప్తులో గుర్తించింది.⇒ ఈ గొలుసు లావాదేవీల ద్వారా వచ్చిన నగదు మొత్తాన్ని యోగేశ్ గుప్తా, ముకుల్ అగర్వాల్‌కు అందచేసినట్లు సావన్ జాజూ ఈడీకి తెలిపారు. నగదు విషయంలో ముకుల్ చంద్ర అగర్వాల్.. యోగేశ్ గుప్తా వద్దకు వెళ్లినట్లు కూడా ఈడీ దర్యాప్తులో తేలింది. బ్యాంకు ఖాతాల ద్వారా వచ్చిన నిధులను నగదు రూపంలో వీరు అందుకున్నట్లు కూడా స్పష్టమైంది. ⇒ ఏసీఐ మాత్రమే కాకుండా ఇన్‌వెబ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, పాట్రిక్ ఇన్ఫో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఐటీ స్మిత్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రో వెస్ట్‌మెంట్ సర్వీసెస్ లిమిటెడ్, భారతీయ గ్లోబల్ ఇన్ఫో మీడియా లిమిటెడ్‌లను నిధుల మళ్లింపు కోసం వాడుకున్నారు. ఇందుకు బోగస్ బిల్లులను చూపారు. తద్వారా స్కిల్లర్ నుంచి నేరుగా ని«ధులు పొందారు. ఇలా ఇప్పటి వరకు రూ.151 కోట్ల మేర నిధులను మళ్లించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది.ప్రజా ధనాన్ని మళ్లించేందుకే స్కిల్లర్ ఏర్పాటు స్కిల్లర్ తనకొచ్చిన నిధుల్లో నుంచి కొంత భాగం ముకుల్ అగర్వాల్‌కి చెందిన నాలెడ్జ్ పోడియం సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు బదలాయించింది. అక్కడి నుంచి ఆ నిధులు ముకుల్ చంద్ర, ఆయన కుటుంబ సభ్యుల వ్యక్తిగత ఖాతాల్లోకి, అతని నియంత్రణలో పని చేసే కంపెనీల ఖాతాల్లోకి చేరాయి. ముకుల్ చంద్ర అగర్వాల్ పలు కంపెనీలు ఏర్పాటు చేశారు. వాటన్నింటిపై తనకు నియంత్రణ ఉండేలా చూసుకున్నారు.ప్రభుత్వానికి చెందిన అత్యధిక భాగం నిధులు ఈ కంపెనీల మధ్యే సర్కులేట్ అయ్యాయి. సుమన్ బోస్ అవసరాల కోసమే ఇన్ని కంపెనీలను ఏర్పాటు చేసినట్లు ముకుల్ చంద్ర అగర్వాల్ ఈడీ ముందు అంగీకరించి, ఆ మేరకు వాంగ్మూలం కూడా ఇచ్చారు. కాగా, గత ప్రభుత్వ హయాంలో సీఐడీ దర్యాప్తు మొదలు కాగానే సుమన్ బోస్ తన విదేశీ బ్యాంకు ఖాతాలను మూసేశారు. దీనిపై కూడా ఈడీ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతోంది. పలు విదేశీ కంపెనీలతో బోస్‌కు సంబంధాలున్నాయన్న విషయం కూడా ఈడీ దర్యాప్తులో తేలింది. నేరపూరిత చర్యల ద్వారా బదలాయించిన మొత్తాలను ఆ షెల్ కంపెనీల ద్వారా తిరిగి నగదు రూపంలో పొందిన విషయాన్ని కూడా ఈడీ గుర్తించింది. ప్రజాధనం దోచేసేందుకే సుమన్ బోస్ మిలాఖత్⇒ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసేందుకు నాలెడ్జ్ పోడియం సిస్టమ్స్, టాలెంట్ ఎడ్జ్, ఏసీఐ, స్కిల్లర్ ఎంటర్ప్రైజెస్, డిజైన్ టెక్ కంపెనీలు, వారి యజమానులతో కలిసి సుమన్‌బోస్ పని చేశారని సీమన్స్ నివేదిక స్పష్టం చేసింది. సీమెన్స్ ప్రస్తుత ఎండీ కూడా ఇందుకు సంబంధించిన సంభాషణలు, వాట్సాప్ చాట్లు, ఇతరత్రా పలు వివరాలను ఈడీకి అందజేశారు. డిజైన్ టెక్ వికాస్ ఖాన్వీల్కర్, సుమన్ బోస్‌ల మధ్య డబ్బు తరలింపును కూడా ఈడీ గుర్తించింది.⇒ ముకుల్ అగర్వాల్, సురేష్ గోయల్ తనకు సన్నిహిత మిత్రులన్న విషయాన్ని సుమన్ బోస్ ఈడీ ముందు అంగీకరించారు. డీసాల్ట్ ప్రస్తుత చిరునామా, ఎస్‌ఎస్‌ఆర్‌ఏ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చిరునామా ఒకే విధంగా ఉంది. ఈ ఎస్‌ఎస్‌ఆర్‌ఏ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో సురేశ్ గోయల్ సతీమణి ప్రస్తుతం డైరెక్టర్‌గా ఉన్నారు. పలు ఇతర కంపెనీలు కూడా ఇదే చిరునామాపై రిజిస్టర్ అయి ఉన్నాయి. నిధుల మళ్లింపు వ్యవహారంలో సుమన్ బోసే మాస్టర్ మైండ్, ఇందుకు ఖాన్వీల్కర్, సురేశ్ అగర్వాల్‌ల సాయం తీసుకున్నారు.⇒ సింగపూర్ కేంద్రంగా పని చేస్తున్న బెన్ రీసెర్చ్ పీటీఈ లిమిటెడ్ కంపెనీ తులసీదాస్ శివ కుమార్‌కు చెందింది. ఇతను సీమెన్స్ సుమన్ బోస్‌కు అత్యంత సన్నిహితుడు. గతంలో సీమెన్స్లో పని చేశాడు. ఈ కంపెనీకి రూ.3,48,95,191 మళ్లించారు. మరో సింగపూర్ కంపెనీ అయిన ఇంక్ఫిష్ హాస్పిటాలిటీ పీటీఈ లిమిటెడ్‌కు రూ.74.51 లక్షలు, యూకేకు చెందిన ఎస్జీకే వరల్డ్ ఫోరెక్స్ లిమిటెడ్‌కు రూ.73.67 లక్షలు జమ చేశారు. ఈ మొత్తాలన్నీ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీ) నుంచి డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పొందిన నిధులు. నిధుల మళ్లింపులో కీలక వ్యక్తులు - సుమన్ బోస్ (స్కిల్ ప్రాజెక్ట్ రూపకర్త)- వికాస్ వినయ్ ఖాన్వీల్కర్ (డిజైన్ టెక్ సిస్టమ్స్ ఎండీ)- ముకుల్ చంద్ర అగర్వాల్ (స్కిల్లర్ ఎంటర్‌ప్రైజస్ సిగ్నేటరీ, సుమన్ బోస్ సన్నిహితుడు, నాలెడ్జ్ పోడియం సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కీలక వ్యక్తి )- సురేష్ గోయల్ (సుమన్ బోస్ స్నేహితుడు, చార్టెడ్ అకౌంటెంట్, ముకుల్ అగర్వాల్ కోసం డబ్బు నిర్వహించిన వ్యక్తి)- శిరీష్ షా (ఏసీఐ వ్యవహారాలు చూసే వ్యక్తి, ఎంట్రీ ఆపరేటర్)- సావన్ కుమార్ జాజు (ఎంట్రీ ఆపరేటర్)- యోగేష్ గుప్తా (ఎంట్రీ ఆపరేటర్)- మనోజ్ కుమార్ జైన్ (ఎంట్రీ ఆపరేటర్)- తులసీదాస్ శివకుమార్ అలియాస్ టి.శివకుమార్ (సింగపూర్ – బెన్ రీసెర్చ్ పీటీఈ లిమిటెడ్, సుమన్ బోస్ సన్నిహితుడు)ఈడీ బయటపెట్టిన షెల్ కంపెనీలు...⇒ మెసర్స్ సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌ఐఎస్‌డబ్ల్యూ)⇒ మెసర్స్ డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (డీటీఎస్పీఎల్)⇒ స్కిల్లర్ ఎంటర్ప్రైజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఈపీఎల్)⇒ అల్లాయిడ్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్ ఏసియా లిమిటెడ్ (ఏసీఐ) (షెల్ కంపెనీ)⇒ కాడెన్స్ పార్ట్నర్స్ ఎల్ఎల్పీ (షెల్ కంపెనీ)⇒ ఈటీఏ గ్రీన్ బిల్డ్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ (షెల్ కంపెనీ)⇒ నాలెడ్జ్ పోడియం సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (కేపీఎస్పీఎల్) (షెల్ కంపెనీ)⇒ ఎస్ఎం ప్రొఫెషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (షెల్ కంపెనీ)⇒ ఇన్‌వెబ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (షెల్ కంపెనీ)⇒ పాట్రిక్ ఇన్ఫో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (షెల్ కంపెనీ)⇒ ఐటీ స్మిత్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (షెల్ కంపెనీ)⇒ ప్రో వెస్ట్‌మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ (షెల్ కంపెనీ)⇒ భారతీయ గ్లోబల్ ఇన్ఫో మీడియా లిమిటెడ్ (షెల్ కంపెనీ)⇒ మెసర్స్ టాలెంట్ ఎడ్జ్ (షెల్ కంపెనీ)⇒ డిఅసాల్ట్ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (డీఎస్ఐపీఎల్) (గతంలో బోస్, ముకుల్ అగర్వాల్, నరేష్ గోయల్ పని చేసిన కంపెనీ)⇒ ఎస్‌ఎస్‌ఆర్‌ఏ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఈ కంపెనీలో సురేష్ గోయల్ భార్య డైరెక్టర్. డిఅసాల్ట్ సిస్టమ్స్ కంపెనీదీ ఇదే చిరునామా)⇒ బెన్ రీసర్చ్ పీటీఈ లిమిటెడ్ (సింగపూర్ కంపెనీ)⇒ ఇంక్ఫిష్ హాస్పిటాలిటీ పీటీఈ లిమిటెడ్ (సింగపూర్ కంపెనీ, ఈ కంపెనీకి నిధులు మళ్లించారు)⇒ ఎస్జీకే వరల్డ్ ఫోరెక్స్ లిమిటెడ్ (యూకే కంపెనీ, ఈ కంపెనీకి నిధులు మళ్లించారు) -
మూడేళ్లయినా చార్జిషీట్ ఎందుకు వేయలేదు?
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపై దర్యాప్తును అటకెక్కించిన సీఐడీని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టంది. 2021లో కేసు నమోదు చేసినప్పటికీ, ఇప్పటికీ దర్యాప్తు పూర్తి చేయలేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. మూడేళ్లు దాటినా ఎందుకు చార్జిషీట్ దాఖలు చేయలేదని అసహనం వ్యక్తం చేసింది. సీఎం చంద్రబాబు ప్రధాన నిందితునిగా ఉన్న స్కిల్ డెలప్మెంట్ కుంభకోణం కేసు దర్యాప్తును సీఐడీ ఉద్దేశపూర్వకంగానే మూలన పడేసిందని సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో హైకోర్టు సైతం ఆక్షేపించడం చర్చనీయాంశంగా మారింది. కోట్లాది రూపాయల ప్రజాధనం లూటీ అయిన ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేయకుండా సీఐడీ చేస్తున్న ఉద్దేశపూర్వక జాప్యం నిందితులకు వరంగా మారింది. ఈ కుంభకోణం మాస్టర్ మైండ్ సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు బెయిల్ ఇచ్చిన సందర్భంగా విధించిన షరతుల్లో కొన్నింటిని హైకోర్టు సడలించింది. విదేశాలకు వెళ్లేందుకు ఆయనకు అనుమతినిచ్చింది. బోస్ సరెండర్ చేసిన పాస్‌పోర్ట్‌ను వెనక్కి ఇచ్చేయాలని విశాఖపట్నం మొదటి అదనపు సెషన్స్ జడ్జిని ఆదేశించింది. రూ.25 వేలతో వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని బోస్‌ను ఆదేశించింది. విశాఖపట్నం కోర్టు ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు పాస్‌పోర్ట్‌ని సరెండర్ చేస్తానని హామీ ఇవ్వాలని బోస్‌ని ఆదేశించింది. ప్రయాణ వివరాలన్నింటినీ ముందస్తుగానే కింది కోర్టుకు తెలియజేయాలని కూడా చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.ప్రజాధనం కొల్లగొట్టి విదేశాల్లో దాచారని ఈడీ వెల్లడిసుమన్ బోస్‌ను విదేశాలకు వెళ్లేందుకు అనుమతినివ్వడాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. బోస్ పలు షెల్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని కొల్లగొట్టి, ఆ డబ్బును విదేశాలకు తరలించారని, అందువల్ల విదేశాలకు వెళ్లేందుకు అనుమతినివ్వొదని ఈడీ తరఫు న్యాయవాది జోస్యుల భాస్కరరావు హైకోర్టును కోరారు. దీని ప్రభావం దర్యాప్తుపై పడుతుందని వివరించారు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా బెయిల్ షరతులను సడలించడం సరికాదని గట్టిగా వాదించారు. -
బాబుపై కేసుల సంగతి ఇక అంతేనా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మీడియాలో ఒక కథనం ప్రచురితమైంది. ‘‘కేసులను నీరుగార్చే కుట్ర’’ శీర్షికతో వచ్చిన ఈ వార్త ఆసక్తికరంగా ఉంది కానీ.. ఆశ్చర్యకరంగా ఏమీ లేదు. ఎందుకంటే వ్యవస్థలను మేనేజ్ చేయడంలో తనకు తానే సాటి అని బాబు ఇప్పటికే చాలాసార్లు రుజువు చేసుకున్నారు మరి! ఈ తాజా కథనంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే...గతంలో సీఐడీ అధికారులు ఎవరినైతే అవినీతి కేసుల్లో నిందితులుగా పేర్కొన్నారో.. వారికే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నదట! ఇది అత్యంత అరుదైన ఘటనే. అప్పట్లో స్కామ్‌లకు పాల్పడిన వారు ఇప్పుడు అధికారంలో ఉండటం దీనికి కారణమవుతోంది. అయితే నైతిక విలువలు పాటించేవారైతే.. తప్పు చేయలేదని నమ్మేవారైతే తామే నిందితులుగా ఉన్న కేసుల జోలికి అధికారంలోకి వచ్చినా అస్సలు పోరు. నిజం కోర్టులు నిగ్గుతేలుస్తాయని వదిలేస్తారు. ఈ కాలంలో ఇంతటి ఉదాత్త స్వభావాన్ని ఆశించలేము కానీ నిందితులే కేసు సమీక్షకు దిగడం దేశ చరిత్రలో సరికొత సంప్రదాయానికి తెరతీస్తుందన్నది మాత్రం సత్యం. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమాలు, స్కామ్ లపై, 2019-24 వరకు ప్రభుత్వాన్ని నడిపించిన వైసీపీ విచారించింది. సీఐడీ, సిట్ వంటి సంస్థలు వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి నిర్దిష్ట అభియోగాలతో చంద్రబాబు, తదితరులపై కేసులు పెట్టింది. ఆ కేసులలో ఛార్జ్షీట్లు వేసేందుకు సమయం బాగా అవసరమైంది. అయితే ఈలోగా ప్రభుత్వం మారి టీడీసీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. దీంతో చాలా చిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహాత్మకంగా ఈ కేసులను నీరుకార్చడానికి, వీలైతే వాటి నుంచి తప్పించుకోవడానికి సన్నద్దం అవుతున్నారని వార్తలు సూచిస్తున్నాయి బాబు ఇలా చేయకపోతేనే ఆశ్చర్యపోవాలి. కాకపోతే ఇక్కడ విశేషం ఏమిటంటే తనపై కేసులు పెట్టిన సీఐడీ, సిట్లే ఇప్పుడు బాబుకు ప్రెజెంటేషన్ ఇస్తూండటం మాత్రం హైలైట్. ఇంకో విషయం ఈ కేసుల్లో విచారణ చేసిన అధికారులతో కాకుండా.. చంద్రబాబు నియమించుకున్న అధికారులు ఈ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. అంటే అవన్నీ తప్పుడు కేసులని, వాస్తవాలు లేవని, గత ప్రభుత్వంలోని అధికారులు కక్షకట్టి కేసులు పెట్టారని ఇప్పటి అధికారులతో చెప్పించుకునే ప్రయత్నం అన్నమాట! ఒక కేసు నిందితుడే అధికారం అడ్డుపెట్టుకుని తీర్పునిచ్చే విధంగా తన అభిప్రాయాలను ఈ ప్రెజెంటేషన్ సాకుతో వెల్లడించబోతున్నారన్నమాట. చంద్రబాబు హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఆయన అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ కేసు విషయంలో కొన్ని చర్యలు తీసుకుంది. సుమారు 54 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ఈ ఆస్తులు చంద్రబాబు లేదా, ఇతర ముఖ్యులవి కావు. నిధులను మళ్లించిన డిజిటెక్ సంస్థవి. ఈడీ ఈ సంస్థ అధికారులతోపాటు కొందరు ప్రభుత్వ అధికారులను కూడా గతంలోనే అరెస్ట్ చేసిన విషయం ఇక్కడ ఒకసారి చెప్పుకోవాలి. ప్రధాన నిందితుల్లో ఒకరైన చంద్రబాబును అప్పట్లో ఏపీ సీఐడి అరెస్ట్ చేసినా ఆయనపై ఈడీ ఇప్పటివరకూ ఎలాంటి చర్య తీసుకోలేదు. కారణం ఊహించదగినదే. ప్రస్తుతం ఆయన పార్టీ కేంద్రంలోను, రాష్ట్రంలోను అధికారంలో ఉంది. తదుపరి చర్య తీసుకోవడానికి కేంద్రంలోని సంబంధిత మంత్రులు ఆమోదం ఇస్తారని ఎవరూ అనుకోవడం లేదు. పైడి ఎప్పుడు అవకాశం ఉన్నా దేశ ప్రధాని మోడీతో భేటీ అయిన ఫోటోలు కనిపిస్తుంటాయి. అలాంటి వ్యక్తిపై ఈడి చర్య తీసుకోవడం కష్టమే.గతంలో నలుగురు టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరిన వెంటనే వారిలో ఇద్దరిపై ఉన్న కేసుల విచారణ వేగం మందగించింది. ఆ నలుగురు ప్రధానితో కలిసి కూర్చున్న ఫోటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. వారికే అంతటి సదుపాయం కలిగినప్పుడు ఇప్పడు చంద్రబాబు మరింత పవర్ ఫుల్ గా ఉన్నందున కేసు నీరుకారిపోకుండా ఉంటుందా అన్నది చర్చనీయాంశం. స్కిల్ స్కామ్‌లో సుమారు రూ.300 కోట్ల అవ్యవహారాలు జరిగాయన్నది అభియోగం. డొల్ల కంపెనీలకు భారీ ఎత్తున డబ్బు చేరితే అందులో కొంత మనీ లాండరింగ్ మార్గాల్లో నేరుగా టీడీపీ ఆఫీసు ఖాతాల్లోకి వచ్చిందని సీఐడీ అభియోగాలు మోపింది. కానీ అప్పట్లో కేసు విచారించిన అధికారులు ఇప్పుడు టీడీపీ కారణంగా శంకరగిరి మాన్యాలు పట్టారు. పోస్టింగ్‌లు కూడా ఇవ్వకుండా ప్రభుత్వం వారిని వేధిస్తోంది. ఏదో కేసులో ఇరికించి సస్పెన్షన్ వేటు వేసేందుకూ వ్యూహాలు పన్నుతున్నట్లు సమాచారం. వలపు వల విసిరి మోసగించే నటి ఒకరిని రంగంలోకి దింపి ఇప్పటికే ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బాబు ప్రభుత్వం సస్పెండ్ కూడా చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు, ప్రస్తుతం మంత్రులుగా ఉన్న నలుగురు ఏడు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వీరిపై తదుపరి చర్యల కోసం అవినీతి నిరోధక చట్టం కింద గవర్నర్ అనుమతి కోరాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అనుమతి రావడం కల్లే. ఇక్కడ ఒక మాట చెప్పాలి. గతంలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఓటుకు నోటు కేసులో ఆడియో వాయిస్ తో సహా దొరికిపోయారు. దానిని ఆయన ఎంత సమర్థంగా మేనేజ్ చేసుకున్నారో తెలిసిందే. ఛార్జ్‌షీట్‌లో సుమారు 30 సార్లు చంద్రబాబు పేరు ఉన్నా, ఎఫ్ఐఆర్ లో మాత్రం ఆయన పేరు చేర్చకుండా అప్పటి కేసీఆర్ ప్రభుత్వంపై కొందరు ప్రముఖుల ద్వారా ప్రభావితం చేయగలిగారని అంటారు. అంతేకాదు. 2019 ఎన్నికల తర్వాత ఆయన కార్యదర్శి ఇంటిపై సీబీటీడీ అధికారులు దాడి చేసి, సుమారు రూ. రెండు వేల కోట్ల విలెవూర అక్రమాలకు సంబంధించి ఆధారాలు గుర్తించినట్లు ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగిన ఆ కేసునే ఆయన ముందుకు సాగకుండా కేంద్రంలోని బీజేపీ పెద్దలను సమర్థంగా మేనేజ్ చేసుకోగలిగారు. ఇప్పుడు వారితో మళ్లీ స్నేహం పెట్టుకున్నాక ఎవరు ఆ కేసు జోలికి వెళతారు?.ఈడీ అధికారులు నిజంగానే ఈ కేసు లోతుపాతులను విచారించాలని అనుకుంటే ముందుగా షెల్ కంపెనీలకు వచ్చిన డబ్బు, టీడీపీ ఆఫీస్ ఖాతాకు చేరిన డబ్బు గురించి ఆరా తీయాలి. ఆ విషయాన్ని వెల్లడి చేయాలి. కేసు అక్కడదాకా వెళితే అది గొప్ప విషయమే అవుతుంది. కేంద్రంలోని బీజేపీతో ఏదైనా గొడవ వస్తే జరుగుతుందేమో కానీ, అంతవరకు కదలకపోవచ్చు. స్కిల్ స్కామ్‌ను నీరుగార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ఆంధ్రప్రదేశ్ మాజీ అదనపు ఆడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి డిజిపికి లేఖ రాశారు. కాని ఆయన మాత్రం ఏమి చేస్తారు? ఆయన కూడా టీడీపీ ప్రభుత్వం నియమించిన వారే కదా! చంద్రబాబు ఏమి చెబితే అది చేయవలసిందే కదా? చంద్రబాబు, తదితర టీడీపీ నేతలపై వచ్చిన స్కామ్ కేసులను సీబీఐకి అప్పగించాలని ఒక పాత్రికేయుడు, సామాజిక వేత్త కెబిజి తిలక్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అది ఎప్పటికి తేలుతుందో చెప్పలేం. గతంలో చంద్రబాబు తనపై కేసు పెట్టడానికి ముందు వైఎస్సార్సీపీ ప్రభుత్వం గవర్నర్ అనుమతి తీసుకోలేదంటూ సుప్రీం కోర్టులో వాదించారు. సెక్షన్ 17 వర్తిస్తుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. కానీ సుప్రీం కోర్టు ఆ కేసులో ఇప్పటికీ తీర్పు ఇవ్వకుండా ఉండిపోయింది. అంతేకాదు. చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్టు అయి జైలులో ఉన్నప్పుడు కింది కోర్టు బెయిల్ ఇవ్వలేదు. కాని గౌరవ హైకోర్టు మాత్రం బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇవ్వడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ ఒక ప్రైవేటు ఆస్పత్రి ఇచ్చిన ఆరోగ్య నివేదిక ఆధారంగా బెయిల్ ఇవ్వడం ఏమిటా అని పలువురు విస్తుపోయారు. తనకు రకరకాల వ్యాధులు ఉన్నాయని చెప్పిన ఆయన, విడుదల తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా టూర్లు చేశారు.కేసు గురించి బహిరంగంగా మాట్లాడకూడదని కోర్టు ఆంక్షలు పెట్టింది. అయినా తన బావమరిది బాలకృష్ణ నిర్వహించే అన్ స్టాపబుల్ ప్రోగ్రాంలో పాల్గొని కేసు గురించి ప్రస్తావించి, తాను ఏ తప్పు చేయలేదని పేర్కొన్నారట. ఈ పరిస్థితిలో ఏ అధికారి ఈ కేసులను ముందుకు తీసుకువెళతారు? ఏ విధంగా చంద్రబాబు, ఇతర ముఖ్య నిందితులు కోర్టుకు వరకు వెళ్లకుండా చూడవచ్చో అన్నదానిపైనే అధికారులు గురిపెడతారు. ఈ కేసుల రికార్డులను తారుమారు చేయవచ్చని పొన్నవోలు అన్నారు. ఆయన ఎంత వాపోయినా అది వృథా ప్రయాసగానే మిగిలిపోవచ్చు. దేశ వ్యాప్తంగా ఇలాంటి కేసుల విషయంలో ఒక నిర్దిష్ట విధానం రూపొందించుకోకపోతే , అసలు స్కాములు జరిగినట్లా? కాదా? అన్నదానిపై ప్రజలకు స్పష్టత రాకుండా పోతుంది. అధికారంలో ఉంటే ఎలాంటి కేసు నుంచైనా తప్పించుకోవచ్చన్న భావన మరింతగా ప్రబలుతుంది.ఇది ప్రజాస్వామ్యానికి మంచిదా? కాదా? అన్నది ఎవరికి వారు ఆలోచించుకోవాలి.-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కేసులు నీరుగార్చే కుట్ర
ఈ కేసులకు సంబంధించి సీఎం చంద్రబాబు ఎదుట ప్రదర్శించేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎలా రూపొందించాలో దర్యాప్తు అధికారులకు కొందరు సీనియర్ ఉన్నతాధికారులు నిర్దేశించారు. ప్రధాన నిందితుడికి తనపై ఉన్న కేసులకు సంబంధించిన దర్యాప్తు వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడం దేశంలో ఇదే తొలిసారి. ఆ కేసులను ఎప్పటిలోగా నీరుగార్చాలో దర్యాప్తు అధికారులకు గడువు కూడా విధించారు.ఇప్పటికే స్కిల్ స్కామ్‌లో దర్యాప్తును ముమ్మరం చేసిన ఈడీ.. చంద్రబాబుతోపాటు ఆయన మంత్రివర్గ సహచరుల పాత్రపై దర్యాప్తు మొదలు పెట్టాల్సి ఉంది. ఈ కీలక తరుణంలో ఈ కేసులకు సంబంధించిన కీలక రికార్డులు చంద్రబాబుతోపాటు ఇతర నిందితులకు అందుబాటులో ఉన్నాయి. దాంతో రికార్డులను తారుమారు చేసే అవకాశం ఉంది. – ఆధారాలు, న్యాయపరమైన అంశాలతో డీజీపీకి పొన్నవోలు లేఖ ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు ప్రస్తుత ప్రభుత్వంలో నలుగురు మంత్రులు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వారిపై అవినీతి నిరోధక చట్టం కింద దర్యాప్తునకు అనుమతించాలని గవర్నర్‌ను కోరే ప్రతిపాదన పెండింగ్‌లో ఉంది. ఆ ప్రతిపాదనను మంత్రివర్గం అజెండాలో చేర్చే సాహసం అధికారులు చేయగలరా? అలాంటప్పుడు వారి అవినీతిపై దర్యాప్తు ఎలా ముందుకు సాగుతుంది?– ఆధారాలు, న్యాయపరమైన అంశాలతో డీజీపీకి పొన్నవోలు లేఖసాక్షి, అమరావతి: ‘ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న అవినీతి కేసులను నీరుగార్చేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. 2014–19 మధ్య టీడీపీ హయాంలో యథేచ్ఛగా సాగించిన కుంభకోణాలపై నమోదైన ఏడు కేసుల నుంచి ఆయన పేరు తొలగించేందుకు ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారు..’ అని మాజీ అదనపు అడ్వకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి... డీజీపీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు దృష్టికి తెచ్చారు. ‘ప్రభుత్వ ఒత్తిడితో ప్రస్తుత పోలీస్, సీఐడీ ఉన్నతాధికారులు ఆ కేసుల విచారణలో న్యాయస్థానానికి సహాయ నిరాకరణ చేస్తున్నారు. చార్జ్షీట్లను న్యాయస్థానానికి పునఃసమర్పించకుండా ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతున్నారు. తద్వారా కేసుల దర్యాప్తు సాగకుండా అడ్డుకుంటున్నారు’ అని వెల్లడించారు. ‘చంద్రబాబుపై అవినీతి కేసులకు సంబంధించి దర్యాప్తు అధికారులను వేధిస్తున్నారు. అప్పటి సీఐడీ అదనపు డీజీ సంజయ్, సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇన్చార్జ్ కె.రఘురామ్‌రెడ్డిని హఠాత్తుగా బదిలీ చేసి ఎక్కడా పోస్టింగులు ఇవ్వకుండా జీతాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు నిందితులుగా ఉన్న ఈ కేసుల విచారణను సీబీఐకి అప్పగించాలని అభ్యర్థిస్తూ ఓ సామాజిక కార్యకర్త హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని కూడా పొన్నవోలు తన లేఖలో ప్రస్తావించారు. ఈ మేరకు డీజీపీకి ఆయన లేఖ రాశారు. కేసుల దర్యాప్తులో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ న్యాయస్థానానికి పూర్తిగా సహకరించాలని... దర్యాప్తు అధికారులకు రక్షణగా నిలవాలని అందులో డీజీపీని కోరారు. పూర్తి ఆధారాలతో, న్యాయపరమైన అంశాలను ఉటంకిస్తూ డీజీపీకి రాసిన లేఖలో ప్రధానాంశాలు ఇవీ..చంద్రబాబు పేరు తొలగించే కుట్ర.. ఉన్నతాధికారులకు బెదిరింపులురాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కేసు సహా దర్యాప్తులో ఉన్న ఏడు కేసుల్లో నిందితుల జాబితా నుంచి ప్రధాన నిందితుడు చంద్రబాబు పేరు తొలగించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్ర పన్నింది. అందుకోసం సీఐడీ, పోలీసు ఉన్నతాధికారులను తీవ్రంగా ఒత్తిడి చేస్తోంది. ఆ కేసుల తుది దర్యాప్తు నివేదికను న్యాయస్థానానికి సమర్పించే ముందు నిందితుల జాబితా నుంచి చంద్రబాబు పేరు తొలగించాల్సిందేనని దర్యాప్తు అధికారులను ఒత్తిడి చేస్తూ బెదిరిస్తోంది. దర్యాప్తు నివేదికలను తారుమారు చేయాల్సిందేనని అధికారులను వేధిస్తున్నారు. తద్వారా ప్రధాన నిందితుడైన చంద్రబాబును ఈ కేసుల నుంచి సులువుగా బయటపడేయవచ్చన్నది అసలు ఉద్దేశం. సాక్షులుగా న్యాయస్థానం ఎదుట 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఇచ్చిన అధికారులపై ఈ కేసులను నెట్టేయాలని కుట్ర పన్నింది.చార్జిషీట్లను తొక్కిపెట్టారుచంద్రబాబుపై ఉన్న కేసులను నీరుగార్చేందుకు ప్రభుత్వం మరో కుట్రకు పాల్పడింది. స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్‌రోడ్ అలైన్మెంట్, ఫైబర్ నెట్, అసైన్డ్ భూముల కుంభకోణం కేసులకు సంబంధించిన చార్జిషీట్లను సీఐడీ గతంలోనే న్యాయస్థానానికి సమర్పించింది. దీనిపై కొంత వివరణ కోరుతూ న్యాయస్థానం వాటిని ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య సీఐడీకి పంపింది. అప్పటి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఆ అంశాలకు సంబంధించి కేస్ స్టడీలతో వివరాలను సీఐడీ అధికారులకు నివేదించారు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత ఆ కేసులను నీరుగార్చేలా సీఐడీపై ఒత్తిడి చేస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే. ఆ చార్జ్షీట్లను ఈ రోజు వరకూ న్యాయస్థానానికి సమర్పించలేదు. ఆ కేసుల దర్యాప్తును పూర్తి చేసేందుకు ఎలాంటి ప్రయత్నం కూడా చేయడం లేదు. టీడీపీ ప్రధాన కార్యాలయానికి నిధులుఏడు కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన నిధులు అక్రమ మార్గంలో టీడీపీ ప్రధాన కార్యాలయానికి చెందిన బ్యాంకు ఖాతాలకు చేరాయని సీఐడీ అధికారులు ఇప్పటికే ఆధారాలతో సహా గుర్తించారు. కానీ ఆ కేసుల దర్యాప్తునకు టీడీపీ ప్రధాన కార్యాలయం సహకరించడం లేదని సీఐడీ న్యాయస్థానం దృష్టికి తెచ్చింది. అంటే ఈ కేసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోందన్నది సుస్పష్టం. ప్రస్తుతం చంద్రబాబు సీఎంగా ఉండటంతో ఆ కేసుల దర్యాప్తు ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నారు. దర్యాప్తు అధికారులను వేధిస్తున్నారుఆ ఏడు కేసుల దర్యాప్తు వేర్వేరు దశల్లో ఉంది. ఆ కేసులను దర్యాప్తు చేస్తున్న సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కార్యాలయాన్ని 2024 జూన్ నుంచి ఆగస్టు 14 వరకు మూసివేశారు. డీజీపీ ఆదేశాలతో సిట్ అధికారులు ఆ కార్యాలయానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆ కేసులను దర్యాప్తు చేస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారులు అదనపు డీజీ (సీఐడీ) ఎన్.సంజయ్, సిట్ ఇన్చార్జ్గా ఉన్న ఐజీ కె.రఘురామ్‌రెడ్డిని హఠాత్తుగా బదిలీ చేశారు. వారికి ఎక్కడా పోస్టింగులు ఇవ్వకుండా, జీతాలు చెల్లించకుండా ప్రభుత్వం వేధిస్తోంది. నిందితులుగా చంద్రబాబు, మంత్రులు.. అందుకే కేసులు నీరుగార్చే కుట్రఈ ఏడు కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు. సాధారణ పరిపాలన శాఖ, శాంతి–భద్రతల శాఖలను స్వయంగా నిర్వహిస్తున్న ఆయన ఈ కేసుల దర్యాప్తును నియంత్రిస్తున్నారు. ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల పనితీరుపై వార్షిక నివేదికలను ఆమోదించే స్థానంలో ఆయనే ఉన్నారు. దాంతో నాలుగు చార్జ్షీట్లపై న్యాయస్థానం కోరిన వివరణలను ఐపీఎస్ అధికారులు సమర్పించలేకపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబే కాకుండా ఇతర నిందితులు కూడా ఈ కేసుల సాక్షులను ప్రభావితం చేసే కీలక స్థానాల్లో ఉన్నారు. ఈ కేసుల్లో ఫిర్యాదుదారులు, సాక్షులపై వేధింపులు కొనసాగుతున్నాయి. చంద్రబాబు, మరో నలుగురు మంత్రులు ఈ ఏడు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. అందుకే అవినీతి నిరోధక చట్టం కింద దర్యాప్తునకు గవర్నర్ అనుమతి కోరడం లేదు. కక్ష సాధింపు చర్యలకు తార్కాణం.. ఫిర్యాదు చేశారనే మధుసూదన్‌రెడ్డిపై వేధింపులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంత కక్షపూరితంగా అధికారులను వేధిస్తున్నారో చెప్పేందుకు ఐఆర్ఏఎస్ అధికారి ఎం. మధుసూదన్‌రెడ్డి ఉదంతమే తార్కాణం. టీడీపీ హయాంలో చోటు చేసుకున్న ఫైబర్‌నెట్ కుంభకోణంపై సంస్థ ఎండీ హోదాలో ఆయన సీఐడీకి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ప్రధాన నిందితుడిగా సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ పిటిషన్ పెండింగ్‌లో ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు దీన్ని దృష్టిలో పెట్టుకుని కక్షపూరితంగా ఎం.మధుసూదన్‌రెడ్డిని సస్పెండ్ చేయించారు. డిప్యుటేషన్ పూర్తయి ఆయన తన మాతృశాఖకు వెళ్లడానికి మూడు రోజుల ముందు సస్పెండ్ చేయడం గమనార్హం. దీనిపై ఆయన పరిపాలన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా సస్పెన్షన్‌పై స్టే విధించింది. ఈ కేసుల దర్యాప్తు అధికారులకు ప్రస్తుత ప్రభుత్వం పోస్టింగులు ఇవ్వకుండా, జీతాలు చెల్లించకుండా వేధిస్తోంది. గవర్నర్ అనుమతి ప్రక్రియకు మోకాలడ్డుఈ కేసులో నిందితులపై అవినీతి నిరోధక చట్టం కింద విచారణకు గవర్నర్ అనుమతి కోరే ప్రక్రియను గతంలో డీజీపీ, సీఐడీ అదనపు డీజీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి చేపట్టారు. కానీ ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉండగా మరో నలుగురు మంత్రులుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్ అనుమతి కోరే ప్రక్రియను ప్రస్తుత సీఐడీ అదనపు డీజీ, డీజీపీ కొనసాగిస్తారనే నమ్మకం లేదు. గవర్నర్ అనుమతి కోరే ప్రతిపాదనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంత్రివర్గం ముందు ఉంచాలి. కానీ ముఖ్యమంత్రి నియంత్రణలో విధులు నిర్వర్తించే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆ ప్రతిపాదనను మంత్రివర్గం పరిశీలనకు తెస్తారనే నమ్మకం లేదు. మళ్లీ అదే పదవుల్లో నిందితులు.. కీలక రికార్డుల తారుమారుకు అవకాశంగతంలో టీడీపీ ప్రభుత్వంలో సీఆర్డీఏ చైర్మన్‌గా ఉన్న చంద్రబాబు, వైస్ చైర్మన్ పి.నారాయణ అసైన్డ్ భూములు, ఇన్నర్‌రింగ్ రోడ్డు కుంభకోణాలకు పాల్పడ్డారు. ప్రస్తుతం వారిద్దరూ మళ్లీ అదే పదవుల్లో ఉన్నారు. ఆ కేసుల్లో న్యాయస్థానం ఎదుట సీఆర్పీసీ 164 కింద సాక్ష్యం ఇచ్చిన అధికారులు ప్రస్తుతం చంద్రబాబు, నారాయణ నియంత్రణలో ఉన్నారు. ఈ కేసుల్లో మరికొందరు సాక్షులను విచారించాల్సి ఉంది. మరోవైపు ఈ కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్, చార్జ్షీట్లు, రిమాండ్ రిపోర్టులు, కొల్లగొట్టిన భూములకు సంబంధించిన కీలక రికార్డులన్నీ చంద్రబాబు, నారాయణకు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఈ కేసుల్లో సాక్షులను బెదిరించేందుకు, రికార్డులను తారుమారు చేసేందుకు వారిద్దరికీ పూర్తి అవకాశం ఉంది. ఈడీ దర్యాప్తు భయంతో..మనీ లాండరింగ్‌కు కూడా పాల్పడిన ఈ కేసుల వివరాలను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి గతంలోనే సీఐడీ నివేదించింది. స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ ఇప్పటివరకు పరిమిత స్థాయిలో దర్యాప్తు నిర్వహించింది. స్కిల్ స్కామ్ కేసులో షెల్ కంపెనీ డిజైన్‌టెక్‌కు చెందిన ఆస్తులను జప్తు చేయడంతోపాటు నలుగురు నిందితులను అరెస్ట్ కూడా చేసింది. స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను ఈడీకి సమర్పించింది. ఆ కేసులో ప్రధాన నిందితుడు చంద్రబాబు బ్యాంకు ఖాతాల్లో భారీగా నిధులు డిపాజిట్ అయినట్లు సీఐడీ గుర్తించింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో కొందరు బ్యాంకు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా కేవైసీ వివరాలు తీసుకోకుండానే నోట్ల మార్పిడి చేసినట్లు కూడా ఆధారాలు సేకరించింది. ఆ వివరాలతో పాటు స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం, ఫైబర్ నెట్ కుంభకోణం, అసైన్డ్ భూముల కుంభకోణం కేసులకు సంబంధించి న్యాయస్థానంలో సమర్పించిన చార్జ్షీట్లను ఈడీకి ఇప్పటికే సీఐడీ సమర్పించింది. వాటి ఆధారంగా చంద్రబాబుతోపాటు ఇతర ప్రధాన నిందితులపై ఈడీ ఇంకా దర్యాప్తు మొదలు పెట్టాల్సి ఉంది. దీంతో ఈ కేసులను నీరుగార్చేందుకు ప్రభుత్వం సీఐడీపై ఒత్తిడి తెస్తోంది. దర్యాప్తు అధికారులకు రక్షణగా ఉండండి.. నిష్పక్షపాత విచారణకు సహకరించండిఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సీఎం చంద్రబాబుతోపాటు మరో నలుగురు మంత్రులు నిందితులుగా ఉన్న ఆ ఏడు కేసుల దర్యాప్తు సమగ్రంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత డీజీపీపై ఉంది. ఆ కేసుల్లో దర్యాప్తు అధికారులపై ఎలాంటి వేధింపులకు పాల్పడకుండా, బలవంతపు చర్యలు తీసుకోకుండా వారికి డీజీపీ రక్షణ కవచంలా నిలవాలి. తమ అధికారిక హోదాను దుర్వినియోగం చేస్తూ నిందితులకు కొమ్ముకాయడం అంటే నేరానికి పాల్పడినట్టేనని వేరే గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో ఈ కేసులకు సంబంధించి వాస్తవాలను న్యాయస్థానానికి సమర్పించాల్సిన బాధ్యత డీజీపీపై ఉంది. కేసుల విచారణలో న్యాయస్థానానికి డీజీపీ పూర్తిగా సహకరించాలి.బాబు బరితెగింపు బెయిల్ నిబంధనల ఉల్లంఘన స్కిల్ స్కామ్‌తోసహా తనపై ఉన్న అవినీతి కేసుల దర్యాప్తును ప్రభావితం చేస్తున్న సీఎం చంద్రబాబు న్యాయస్థానం ఆదేశాలను నిర్భీతిగా ఉల్లంఘిస్తున్నారు. స్కిల్‌స్కామ్ కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టమైన షరతులు విధించింది. ఈ కేసుకు సంబంధించిన అంశాలను మీడియా ఎదుటగానీ మరెక్కడాగానీ మాట్లాడకూడదని స్పష్టం చేసింది. అనంతరం పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు కూడా షరతులు విధించింది. అయితే చంద్రబాబు తాను న్యాయస్థానాలకు అతీతమన్నట్టు వ్యవహరిస్తూ కేసు దర్యాప్తును ప్రభావితం చేసే రీతిలో వ్యవహరిస్తుండటం విస్మయపరుస్తోంది. తాజాగా ‘ఆహా’లో నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్న ‘అన్ స్టాపబుల్’ షోలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రోమోను మంగళవారం విడుదల చేశారు. అందులో స్కిల్ స్కామ్ కేసు గురించి చంద్రబాబు పలు అంశాలను ప్రస్తావించడం గమనార్హం. తనను అకారణంగా అరెస్ట్ చేశారని.. తాను ఏ తప్పూ చేయలేదని వ్యాఖ్యలు చేశారు. కేసు ఇంకా విచారణలో ఉండగానే తనకు తానే తీర్పు ఇచ్చేశారు! తద్వారా స్కిల్ స్కామ్ కేసు గురించి మాట్లాడవద్దన్న న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించారు. అంతేకాదు.. తాను ఎవరినీ విడిచిపెట్టబోనంటూ దర్యాప్తు అధికారులను బెదిరించే రీతిలో చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.కేసుల్లో నిందితుల వివరాలు⇒ నారా చంద్రబాబు (ముఖ్యమంత్రి): ఏడు కేసుల్లో నిందితుడు⇒ పొంగూరు నారాయణ (మున్సిపల్ శాఖ మంత్రి): ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం, అసైన్డ్ భూముల కుంభకోణం కేసుల్లో నిందితుడు⇒ నారా లోకేశ్ (విద్యా శాఖ మంత్రి): ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం కేసులో నిందితుడు⇒ కె.అచ్చెన్నాయుడు (వ్యవసాయ శాఖ మంత్రి): స్కిల్ స్కామ్ కేసులో నిందితుడు⇒ కొల్లు రవీంద్ర (ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి): మద్యం కుంభకోణం కేసులో నిందితుడు -
ఈడీ నీకెక్కడ క్లీన్చిట్ ఇచ్చింది?
ఈ నెల 15వ తేదీన ఈడీ విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో ఎక్కడా చంద్రబాబుకు క్లీన్చిట్ ప్రస్తావన లేదు. ఈ కేసులో నిందితులకు చెందిన రూ.23.54 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశామని ఈడీ స్పష్టంగా పేర్కొంది. కానీ, చంద్రబాబు మాత్రం తన అధికారిక టీడీపీ వెబ్సైట్లో ‘న్యాయం గెలిచింది. స్కిల్ డెవలప్మెంట్లో చంద్రబాబు గారికి ఎటువంటి సంబంధం లేదని ఈడీ క్లీన్ చిట్ ఇచ్చింది.’ అంటూ గోబెల్స్ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ మనిషి (చంద్రబాబు) అబద్ధానికి రెక్కలు కట్టడంలో స్పెషలిస్టు. అబద్ధానికి రెక్కలు కట్టడంలో పీహెచ్డీ తీసుకున్నాడు. – వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: ‘స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నీకు క్లీన్ చిట్ ఎక్కడ ఇచ్చిందో చూపాలి..’ అంటూ సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. టీడీపీ పాలనలో జరిగిన స్కిల్ స్కామ్‌పై వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ దర్యాప్తు చేసి.. అన్ని ఆధారాలతోనే ప్రభుత్వ ధనాన్ని దోపిడీ చేసిన చంద్రబాబును అరెస్ట్ చేసిందని చెప్పారు. ఆ కేసుపై ఈడీ కూడా దర్యాప్తు చేసిందని, స్కామ్ జరిగినట్లు నిర్ధారించిందని, దానికి తార్కాణమే ఆ కుంభకోణంలో పాత్రధారులైన డిజైన్ టెక్ ఎండీ, సీమెన్స్ ఇండియా మాజీ ఎండీ సహా నలుగురిని అరెస్ట్ చేసి రెండు విడతల్లో రూ.54.74 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిందని వివరించారు. ఈ కుంభకోణంపై దర్యాప్తు కొనుసాగుతోందని ఈడీ తేల్చిచెబుతూ మీడియాకు ప్రకటన విడుదల చేస్తే.. దాన్ని పట్టుకుని తనకు క్లీన్ చిట్ ఇచ్చినట్లుగా చంద్రబాబు ప్రచారం చేసుకున్నారని తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే... ఆస్తులు అటాచ్ చేస్తే.. క్లీన్చిట్ ఇచ్చినట్టా? సిల్క్ స్కామ్ కేసుకు సంబంధించి ఈడీ ఈ నెల 15వ తేదీన విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో ఎక్కడా చంద్రబాబుకు క్లీన్చిట్ ప్రస్తావన లేదు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో కుంభకోణానికి సంబంధించి ఏపీ సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. సీమెన్స్ ప్రాజెక్టులో భాగంగా డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇతరులు కలిసి ఏపీ ప్రభుత్వాన్ని మోసం చేశారని, నిధులు దుర్వినియోగం అయ్యాయని ఈడీ గుర్తించింది. డిజైన్ టెక్ సంస్థ ఎండీ వికాస్ వినాయక్ కన్వేల్కర్, సీమెన్స్ ఇండియా మాజీ ఎండీ సుమన్ బోస్, ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్‌లు కలిసి ఏపీ ప్రభుత్వ నిధులను కొల్లగొట్టారని, డొల్ల కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లు సృష్టించి ప్రజాధనాన్ని స్వాహా చేశారని నిర్ధారించింది. ఇందులో పెద్ద ఎత్తున కమీషన్లు చేతులు మారినట్టు కూడా తేల్చింది. అందుకే ఇంతకు ముందే డిజైన్ టెక్ సిస్టమ్స్ సంస్థకు సంబంధించిన రూ.31.20 కోట్ల ఆస్తులను అటాచ్ చేయడమే కాకుండా నిందితులు అయిన వికాస్ వినాయక్ కన్వేల్కర్, సుమన్ బోస్, ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్‌లను అరెస్టు చేసినట్టు వెల్లడించింది. తాజాగా మరో రూ.23.54 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశామని ఈడీ స్పష్టంగా ప్రెస్‌నోట్‌లో తెలియజేసింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నట్టు కూడా ప్రకటించింది. ఆ ప్రెస్‌నోట్ చదివితే ఈ విషయం ఎవరికైనా అర్థమవుతుంది. ఈ కేసులో చంద్రబాబుతోపాటు సుమన్ బోస్, వికాస్ వినాయక్ కన్వేల్కర్, ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్ నిందితులు. ఎందుకంటే చంద్రబాబే ముఖ్యమంత్రి హోదాలో 13 సార్లు.. 13 చోట్ల ఫైళ్లపై సంతకాలు పెట్టారు. వాళ్లకు రూ.371 కోట్లు ఇచ్చారు. ఆ డబ్బు మొత్తం మళ్లీ డొల్ల కంపెనీల ద్వారా దారి మళ్లించినట్టు ఈడీ గుర్తించింది. కాబట్టే నలుగురిని అరెస్టు చేసింది. ఆస్తులను అటాచ్ చేసింది. కానీ, చంద్రబాబు మాత్రం తన అధికారిక టీడీపీ వెబ్సైట్లో ‘నిజం నిలిచింది.. న్యాయం గెలిచింది. స్కిల్ డెవలప్మెంట్లో అక్రమ కేసు పెట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెంపపెట్టులా చంద్రబాబుకు ఎటువంటిసంబంధం లేదని క్లీన్ చిట్ ఇచ్చింది ఈడీ..’ అంటూ గోబెల్స్ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ మనిíÙ (చంద్రబాబు) అబద్ధానికి రెక్కలు కట్టడంలో పీహెచ్డీ తీసుకున్నాడు. దీనికి చంద్రబాబు తనకు క్లీన్ చిట్ ఇచ్చేసినట్టు మార్చేసుకున్నారు. అసలు ఇంకెవ్వరికీ చదువు రాదనుకుంటాడా... ఎవరికీ ఏమీ తెలియదనుకుంటాడా చంద్రబాబు? ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 వంటి మీడియా సామ్రాజ్యాన్ని పెట్టుకుని ఎంతకైనా గోబెల్స్ ప్రచారం చేయగలననే అతి విశ్వాసం ఉన్నా కూడా... ఈ మాదిరిగా వక్రీకరించడం ఎవరి వల్లా కాదు!. ఈడీ అటాచ్లపై బాబు మాట్లాడరేం! ఈ స్కామ్‌లో ఈడీ అరెస్టు చేసిన మనుషులకు, ఆస్తులు అటాచ్ చేసిన సంస్థలకు డబ్బులు ఎవరు ఇచ్చారు..? చంద్రబాబు 13 చోట్ల సంతకాలు పెట్టి రూ.371 కోట్లు విడుదల చేయడం వాస్తవం కాదా? జర్మనీకి చెందిన ఒరిజినల్ సీమెన్స్ కంపెనీ ఆ డబ్బులు తమకు ముట్టలేదని, ప్రాజెక్టుతో తమకు సంబంధం లేదని చెప్పడం వాస్తవం కాదా? సదరు కంపెనీ ప్రతినిధి నోయిడా మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలంగా ఇవ్వడం వాస్తవం కాదా? సీమెన్స్ సంస్థ ఈ డబ్బు పక్కదారి పట్టిందనే విషయాన్ని తమ అంతర్గత పరిశోధనలో కనుగొన్నామని.. అది తమ ఇండియా విభాగానికి చెందిన మాజీ ఎండీ సుమన్ బోస్ కంప్యూటర్లు, ఫోన్లను పరిశీలిస్తే బయటకు వచ్చిందని.. డబ్బు పుణే నుంచి హైదరాబాద్‌కు వెళ్లిందని.. సాక్షాత్తు సీమెన్స్ తమ అంతర్గత పరిశోధనలో వెల్లడైందని రిపోర్టు ఇచ్చిందా..? లేదా?. ఈ కేసులో నిందితుల ఆస్తుల ఆటాచ్మెంట్పై మాత్రం చంద్రబాబు మాట్లాడరు. కానీ, తనకు తానే క్లీన్ చిట్ ఇచ్చేసుకుంటాడు. చంద్రబాబును ఈడీ అరెస్టు చేయదా?సిల్క్ స్కామ్‌లో కీలకంగా వ్యవహరించిన చంద్రబాబును, ఆయన పీఏ శ్రీనివాస్‌ను భవిష్యత్తులో ఈడీ అరెస్టు చేయదా? ప్రజాధనాన్ని డొల్ల కంపెనీలు సృష్టించి బయటకు పంపడం.. అలా వెళ్లిన డబ్బులు మళ్లీ తిరిగి హవాలా మార్గంలో చంద్రబాబు జేబులోకి చేరడం వాస్తవం కాదా? దొంగలు దొంగలు కలిసి ఊళ్లను పంచుకోవడం అంటే ఇది కాదా? ఇద్దరు ఐఏఎస్ అధికారులు మేజిస్ట్రేట్ ముందు సెక్షన్–164 కింద వాంగ్మూలం ఇచ్చారు. తాము చంద్రబాబు ఆదేశాల మేరకే డబ్బు విడుదల చేశామని చెప్పారు. ఇది వాస్తవం కాదా? ఇవన్నీ కళ్ల ఎదుట కనిపిస్తుంటే.. చంద్రబాబు మాత్రం ‘న్యాయం గెలిచింది.. నిజం నిలిచింది..’ అని ఎలా అంటారు? కంటికి కనిపించే ఆధారాలు ఉన్నాయి. స్కామ్ నిజమే అని ఈడీ కూడా ధ్రువీకరించుకుని అరెస్టులు చేసింది... ఆస్తులు అటాచ్మెంట్ చేసింది. అయినా చంద్రబాబు లడ్డూలు విషయం మాదిరిగా.. ఇసుక, మద్యం స్కామ్‌ల తరహా అబద్ధాలకు రెక్కలు కడుతున్నారు. ఇలాంటి వాళ్లు నిజంగా మనుషులేనా.. అందరూ ఆలోచన చేయాలి. -
చంద్రబాబు స్కిల్ స్కామ్ పై ED లెటర్.. వైఎస్ జగన్ రియాక్షన్
-
స్కిల్ స్కాం నిర్ధారించిన ఈడీ.. వణికిపోతున్న చంద్రబాబు..!
-
బాబుకు మళ్లీ జైలు తప్పదా?
-
బెడిసికొట్టిన టీడీపీ ఫేక్ ట్రిక్
దీని అర్థమేంటి చంద్రబాబూ..ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్టు కేసులో మనీలాండరింగ్‌కు పాల్పడిన నిందితులకు చెందిన రూ.23.54 కోట్ల స్థిర, చర ఆస్తులను అటాచ్ చేశాం. డిజైన్ టెక్ కంపెనీ ఎండీ వికాస్ వినాయక్ ఖన్విల్కర్, భారత్‌లో సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్, ముకుల్‌చంద్ అగర్వాల్, సురేశ్ గోయల్ బోగస్ ఇన్వాయిస్లతో నిధులను షెల్ కంపెనీల ద్వారా అక్రమంగా మళ్లించినట్లు మా దర్యాప్తులో వెల్లడైంది. వారి బ్యాంకు ఖాతాలు, షేర్లు, స్థిరాస్తు లను జప్తు చేశాం. గతంలోనే డిజైన్‌టెక్‌కు చెందిన రూ.31.20 కోట్లను జప్తు చేశాం. వికాస్, సుమన్, ముకుల్, సురేశ్‌లను అరెస్టు చేశాం. తదుపరి విచారణ కొనసాగుతోంది. – ఈడీసాక్షి, అమరావతి: అడ్డంగా దొరికిన ప్రతిసారి తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మభ్యపెట్టడం చంద్రబాబు మార్కు రాజకీయ ఎత్తుగడ అని మరోసారి రుజువైంది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) ప్రాజెక్టు పేరుతో ప్రజాధనాన్ని కొల్లగొట్టారని కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిగ్గు తేల్చడంతో మరోసారి ఫేక్ ప్రచారం చీప్ ట్రిక్‌ను టీడీపీ తెరపైకి తెచ్చింది. ఈడీ జారీ చేసిన అధికారిక ప్రకటననే ట్యాంపర్ చేస్తూ మరీ చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చినట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతోపాటు కొన్ని ఇంగ్లీష్ పత్రికల్లో కూడా తప్పుడు సమాచారం ప్రచురితమయ్యేలా చేశారు. తద్వారా అబద్ధపు ప్రచారానికి రెక్కలు తొడిగుతూ తిమ్మినిబమ్మి చేసేందుకు యత్నించారు. అయితే ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్టులో ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్టు ఈడీ స్పష్టం చేయడంతోపాటు, చంద్రబాబుతోపాటు తాము ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని ఈడీ తేల్చి చెప్పడంతో టీడీపీ ఎత్తుగడ బెడిసికొట్టింది. బోగస్ ఇన్వాయిస్లతో ప్రజాధనం కొల్లగొట్టారు 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ పేరిట భారీ అవినీతికి పాల్పడినట్టు తమ దర్యాప్తులో తేలిందని ఈడీ ఓ ప్రకటనలో స్పష్టంగా వెల్లడించింది. అంతేకాదు అసలు ఆ ప్రాజెక్ట్‌నే చేపట్టలేదని, పరికరాలు సరఫరా చేయకుండానే చేసినట్టు బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి నిధులు విడుదల చేసినట్టు గుర్తించామని తెలిపింది. ఆ నిధులను సీమెన్స్ కంపెనీకి అప్పటి ఎండీ సుమన్ బోస్, డిజైన్‌టెక్ కంపెనీ ఎండీ వికాస్ వినాయక్ ఖన్విల్కర్.. తమ సన్నిహితులు ముకుల్‌చంద్ర అగర్వాల్ (స్కిల్లర్ కంపెనీ ప్రతినిధి), సురేశ్ గోయల్ (చార్టెడ్ అకౌంటెంట్) ద్వారా అక్రమంగా దారి మళ్లించినట్టు వెల్లడించింది. ఆ నిధులను షెల్ కంపెనీల ద్వారా సింగపూర్‌కు తరలించి.. అక్కడి నుంచి తిరిగి దేశంలోని ఏ ఖాతాలకు తిరిగి వచ్చాయన్న విషయాన్ని గుర్తించామని తెలిపింది. ఇప్పటికే రూ.70 కోట్లు హవాలా మార్గంలో తరలించినట్టు నిర్ధారించింది. చంద్రబాబుకు సన్నిహితులు, ఆ కుంభకోణంతో ప్రమేయమున్న షెల్ కంపెనీల ప్రతినిధులు మొత్తం 26 మందికి నోటీసులు జారీ చేసి పలువురిని విచారించింది. ఈ కేసులో నిందితులు సుమన్ బోస్, వికాస్ ఖన్విల్కర్, ముకుల్‌చంద్ర అగర్వాల్, సురేశ్ గోయల్‌లను అరెస్టు చేయడంతోపాటు విశాఖపట్నంలోని పీఎంఎల్ఏ న్యాయస్థానంలో చార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. డిజైన్ టెక్కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ గతంలోనే అటాచ్ చేసింది. తాజాగా రెండో విడతగా మరో రూ.23.54 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను మంగళవారం అటాచ్ చేసింది. దాంతో ఈ కేసులో ఈడీ ఇప్పటివరకు రూ.54.74 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్టైంది.టీడీపీ ఫేక్ ట్రిక్ ఇదీ..⇒ స్కిల్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచేసరికి చంద్రబాబు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే ఆయన అవినీతిని సిట్ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. దాంతోనే చంద్రబాబును గతేడాది సెపె్టంబర్ 9న అరెస్ట్ చేసింది. సిట్ నివేదికతో సంతృప్తి చెందిన న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 52 రోజులు రిమాండ్ ఖైదీగా ఉండాల్సి వచ్చింది. ⇒ ప్రస్తుతం ఈడీ కూడా దర్యాప్తు వేగవంతం చేసి స్కిల్ స్కామ్‌లో నిధులు కొల్లగొట్టిన తీరును నిరూపిస్తోంది. తాను నిధులు కొల్లగొట్టడంలో పాత్రధారులుగా చేసుకున్న షెల్ కంపెనీల ప్రతినిధులు వికాస్ ఖన్విల్కర్, సుమన్‌బోస్, ముకుల్ చంద్ర అగర్వాల్, సురేశ్ గోయల్‌లను ఇప్పటికే అరెస్ట్ చేసింది. ఇక రెండో విడతలో వికాస్ ఖన్విల్కర్, సుమన్ బోస్ ఆస్తులను అటాచ్ చేసింది. అదీ టీడీపీ భాగస్వామిగా ఉన్న ఎన్డీయే ప్రభుత్వం ఉన్నప్పటికీ.. ఆ కుట్రలో తన భాగస్వాముల ఆస్తులను అటాచ్ చేయడం చంద్రబాబును బేంబేలెత్తిస్తోంది. ⇒ ఇక ఈడీ తదుపరి చర్యలు తనపైనే అని ఆందోళన చెందుతున్నారు. అందుకే ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు టీడీపీ తనకు అలవాటైన రీతిలో తప్పుడు ప్రచారం తెరపైకి తెచ్చింది. ఈ కేసులో చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చినట్టు ఓ ఫేక్ ప్రకటనను సోషల్ మీడియాలో మంగళవారం రాత్రి నుంచి వైరల్ చేసింది. ఏకంగా ఈడీ అధికారికంగా ఇచ్చిన ప్రకటనలకు ముందు వెనుకా రెండు వాక్యాలు జోడించడం ద్వారా ట్యాంపర్ చేసి ఈ ప్రచారం చేయడం గమనార్హం. ⇒ ఈడీ పేరుతో రూపొందించిన ఆ ఫేక్ ప్రకటనను టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారంలోకి తెచ్చి ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. ఏకంగా కొన్ని ఇంగ్లిష్ పత్రికల్లోనూ ఆ తప్పుడు సమాచారం ప్రచురితమయ్యేట్టు చేయడం చంద్రబాబు మార్కు మీడియా మేనేజ్మెంట్కు నిదర్శనం.ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదన్న ఈడీ చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చినట్టు టీడీపీ చేసిన ఎత్తుగడ బెడిసికొట్టింది. తాము చంద్రబాబుతోపాటు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని ఈడీ హైదరాబాద్ విభాగం అధికారులు మీడియాకు తేల్చి చెప్పారు. షెల్ కంపెనీల ఆస్తులను అటాచ్ చేశామన్నారు. ఈ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోందని, ఇంకా పూర్తి కాలేదని కూడా ఈడీ తన అధికారిక ప్రకటనలో స్పష్టంగా పేర్కొంది. దీంతో ఫేక్ ట్రిక్‌తో తాము చేసిన తప్పుడు ప్రచార ఎత్తుగడ బెడిసి కొట్టడంతో బుధవారం ఉదయం నుంచి టీడీపీ మౌన ముద్ర దాల్చింది. ఇక అసలు విషయం ఏమిటంటే.. గతంలో సీఐడీ సిట్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను ప్రాతిపదికగా చేసుకునే ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ ఎఫ్ఐఆర్లో చంద్రబాబును ఏ–1గా సీఐడీ పేర్కొంది. షెల్ కంపెనీల ద్వారా నిధులు అక్రమంగా తరలించారని ఇప్పటికే నిగ్గు తేల్చింది. స్కిల్ స్కామ్ కేసులో సిట్ న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను ఈ ఏడాది మార్చిలోనే ఈడీకి పంపించింది. అంటే చంద్రబాబు.. ఏ–1గా ఉన్న ఎఫ్ఐఆర్, చార్జిషీట్ ఆధారంగానే ఈడీ ఈ కేసును దర్యాప్తు చేస్తోందని స్పష్టమవుతోంది. మరో వైపు ఈ కుంభకోణంలో సూత్రధారులు, పాత్రధారులు అందరి ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోందని కూడా ఈడీ మంగళవారం అధికారికంగా వెల్లడించింది. అటువంటిది ఈడీ చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చిందని, టీడీపీ తప్పుడు ప్రచారం చేయడం విడ్డూరం. స్కిల్ కేసులో ఇప్పటికే పాత్రధారులైన షెల్ కంపెనీల ప్రతినిధుల బండారాన్ని బయటపెట్టిన ఈడీ.. ఇక అసలు సూత్రధారి చంద్రబాబు పాత్రను నిగ్గు తేల్చేందుకు ఉద్యుక్తమవుతున్నట్టేనని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. -
అది ‘క్లీన్ చిట్’ కాదు బాబు మెడకు బిగుస్తున్న ఉచ్చు
సాక్షి, అమరావతి: స్కిల్ స్కామ్‌లో చంద్రబాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) క్లీన్ చిట్ ఇవ్వలేదని, ఈడీ దర్యాప్తుతో ఆయన మెడ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్‌రెడ్డి చెప్పారు. అయినా క్లీన్చిట్ ఇచ్చి పూలదండలు వేసినట్లు చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రూ.371 కోట్ల ప్రభుత్వ సొమ్మును చంద్రబాబు డొల్ల కంపెనీల ద్వారా దారి మళ్లించి తిరిగి తన ఖజానాకు మళ్లించుకున్నారని, ఈడీ దర్యాప్తులో ఇదే కచ్చితంగా తేలుతుందని స్పష్టం చేశారు.సతీష్ కుమార్ రెడ్డి బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్ స్కామ్‌లో ఈడీ తాజాగా రూ.23.54 కోట్ల ఆస్తులను అటాచ్ చేస్తే.. దాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఈడీ చంద్రబాబుకు క్లీన్చిట్ ఇచ్చిందని టీడీపీ, ఎల్లో మీడియా ప్రచారం చేయడం హాస్యాస్పదమని అన్నారు. కేసులో చంద్రబాబును ముద్దాయిగా ఈడీ గుర్తించిందని, అందుకే అటాచ్మెంట్ రాగానే వణికిపోతున్నారని, అబద్ధాలకు రెక్కలు కడుతున్నారని అన్నారు. ఈడీ ప్రెస్‌నోట్‌లో క్లీన్చిట్ విషయం లేకపోయినా, ప్రచారం మాత్రం చేసుకుంటున్నారని చెప్పారు. క్లీన్చిట్ ఇవ్వాల్సింది కోర్టులని, విచారణ పూర్తి కాకుండానే క్లీన్ చిట్ వచ్చిందని ఎలా చెప్పుకుంటారని ప్రశి్నంచారు. నిందితులకు ఆ ఆస్తులు ఎలా వచ్చాయని, వాటికి డబ్బులు ఇచ్చింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబే 13 చోట్ల సంతకం పెట్టి రూ.371 కోట్లు విడుదల చేయడం నిజం కాదా అని నిలదీశారు. బాబు సంతకం లేకుండా ప్రభుత్వ సొమ్ము ఎలా బయటకెళ్లిందన్నారు. ఆయన సంతకంతో ప్రభుత్వ సొమ్ము బయటకు పోయినప్పుడు చంద్రబాబు నేరస్తుడు కాకుండా పోతాడా? అని ప్రశ్నించారు. అలా బయటకు వెళ్లిన సొమ్మును దారి మళ్లించిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. ఇన్ని ఆధారాలు స్పష్టంగా ఉంటే, ఈడీ క్లీన్చిట్ ఇచి్చందని ఎలా చెప్పుకుంటారని అన్నారు. -
చంద్రబాబు మళ్ళీ జైలుకే...? రవీంద్రనాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
చంద్రబాబు మళ్లీ జైలుకు వెళ్లక తప్పదు: రవీంద్రనాథ్ రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు మళ్లీ జైలుకు వెళ్లక తప్పదని వైఎస్సార్సీపీ వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు పీ రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని, ఇసుక, మద్యంలో దోచేసుకుంటున్నారని మండిపడ్డారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఉన్న ఇసుక డంప్‌ను టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఖాళీ చేసిందని ఆరోపించారు. మద్యంలో టీడీపీ సిండికేట్ల వల్ల తెలంగాణా కంటే తక్కువ ఆదాయం వచ్చిందని, 90 శాతం టీడీపీఐ వారికే వచ్చాయని, మిగిలిన 10శాతం షాపులు వారిని బెదిరిస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ అక్రమాలను, అబద్ధపు హామీలను ప్రజలే ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. విజయవాడ వరదల్లో వచ్చిన విరాళాలు కూడా జేబులో వేసుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రం ఎటు వెళ్తుందో, ఏమైపోతుందోననే ఆందోళన కలుగుతోందన్నారు. ప్రభుత్వ దురాగతాలు మితిమీరి పోతున్నాయని విమర్శించారు. వీళ్ళ అకృత్యాలు ప్రజలకు తెలియకుండా మీడియా గొంతు నొక్కుతున్నారని, టీవీ9, సాక్షి, ఎన్టీవీలతో పాటు మరి కొన్ని ఛానళ్లను ప్రసారం కాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దుర్మార్గమని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.‘స్కిల్ కేసులో చంద్రబాబును ఆనాడు అరెస్టు చేస్తే పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టారు. అన్యాయంగా అరెస్టు చేశారంటూ బార్యా, పిల్లలు, దత్త పుత్రుడు అంతా గోల చేశారు. ఆనాడు ఈడీ ఇచ్చిన సమాచారం మేరకు అరెస్టు జరిగింది. ఇప్పుడు ఈడీ వారి ఆస్తులను కూడా అటాచ్ చేసింది. ఇప్పుడు స్కిల్ అక్రమాలు చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగిందని తేలింది. పెద్ద ఎత్తున నిధులు స్వాహా చేసేందుకు చంద్రబాబు పెద్ద స్కెచ్ వేశాడు. షెల్ కంపెనీలతో 370 కోట్లు కొట్టేసి నిరుద్యోగులకు అన్యాయం చేశారు. సీమెన్స్ సంస్థ పేరు చెప్పుకుని.. డిజైన్ టెక్ అనే షెల్ కంపెనీ ద్వారా నిధులు కొట్టేశారు. ఆ ఫైల్ డ్రాఫ్ట్ పై అన్నీ చోట్ల చంద్రబాబు సంతకం ఉంది. జరిగిన అక్రమాలన్నీ నిజమే కాబట్టే ఈడి ఆస్తులు అటాచ్ చేసింది.’ అని పేర్కొన్నారు. -
దోచుకోవడంలో చంద్రబాబు ‘స్కిల్’ నిజమే (ఫొటోలు)
-
స్కిల్ స్కామ్ అంటే ఏంటి? అందులో చంద్రబాబు అవినీతి ఎంత
-
దోచుకోవడంలో ‘స్కిల్’ నిజమే
సాక్షి, అమరావతి: ప్రజాధనాన్ని కొల్లగొట్టి అరెస్ట్ అయిన చంద్రబాబుకు సంబంధించిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా మరోసారి కొరఢా ఝుళిపించింది. ఈ కేసులో ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు చంద్రబాబు ముఠాకు సహకరించిన షెల్ కంపెనీ డిజైన్ టెక్ ఎండీ వికాస్ వినాయక్ కన్విల్కర్, సీమెన్స్ కంపెనీ అప్పటి ఎండీ సుమన్ బోస్‌కు చెందిన రూ.23.54 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేసింది. ఢిల్లీ, ముంబయి, పూణేల్లోని స్థిరాస్తులతోపాటు వారి పేరిట ఉన్న షేర్లు, బ్యాంకు ఖాతాల్లోని నిధులను అటాచ్ చేసినట్టు ఈడీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే కేసులో గతంలో డిజైన్ టెక్కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో మొత్తంగా రూ.54.74 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లయింది. తద్వారా 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం బరితెగించి సాగించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం మరోసారి చర్చనీయాంశంగా మారింది. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అవినీతికి పాల్పడినట్టు మరోసారి జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సిట్ చంద్రబాబును అరెస్ట్ చేయడం రాజకీయ కక్ష సాధింపు చర్య కాదన్నది స్పష్టమైంది. ఎందుకంటే కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగినట్టు.. షెల్ కంపెనీల ద్వారా నిధులు అక్రమంగా తరలించినట్టు ఆధారాలతో సహా నిర్ధారించి కఠిన చర్యలను వేగవంతం చేయడమే అందుకు నిదర్శమని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచడంతో ‘స్కిల్’ క్రిమినల్స్‌లో గుబులు మొదలైంది.గత ఏడాది డిజైన్ టెక్ సిస్టమ్స్ ఎండీ, సీమెన్స్ ఎండీలను అరెస్టు చేసినట్లు ఈడీ చేసిన ట్వీట్ ప్రజాధనం కొల్లగొట్టడమే లక్ష్యంగా అడుగులు⇒ 2014లో అధికారంలోకి రాగానే ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరిట ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్‌ను తెరపైకి తెచ్చారు. భారత్‌లో ఆ కంపెనీ ఎండీగా ఉన్న సుమన్ బోస్, డిజైన్ టెక్ ఎండీ వికాస్ వినాయక్ కన్విల్కర్ సహకారంతో చంద్రబాబు అక్రమాలకు తెర తీశారు. ఏపీఎస్ఎస్డీసీ ద్వారా డిజైన్ టెక్ కంపెనీకి డబ్బు ఇచ్చేందుకు 2016లో సీఎంగా చంద్రబాబు చేసిన డిజిటల్ సంతకం ⇒ కేబినెట్ ఆమోదం లేకుండానే చంద్రబాబు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్ఎస్డీసీ) ఏర్పాటు చేసి, అనంతరం ఏపీఎస్ఎస్డీసీతో సీమెన్స్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నట్టు మభ్యపుచ్చారు. సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, ఇతర అంశాలకు సంబంధించిన ఇన్వాయిస్లు, ప్రాథమిక నివేదిక ప్రకారం రూ.370 కోట్లు మాత్రమే ఉన్న ప్రాజెక్ట్ విలువను అమాంతం రూ.3,300 కోట్లకు పెంచేశారు. ⇒ ప్రభుత్వం పది శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్ టెక్ 90 శాతం నిధులు పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు 2015 జూన్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం సీమెన్స్–డిజైన్ టెక్ కంపెనీలు ప్రాజెక్ట్ వ్యయంలో 90 శాతాన్ని గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా సమకూరుస్తాయంటూ త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నారు. ⇒ ప్రాజెక్టు వ్యయంగా చెప్పుకున్న రూ.3,300 కోట్లలో 90 శాతం కాదు కదా కనీసం ఒక్క రూపాయి విలువైన ఆర్ధిక సహకారంగానీ, వస్తు సహాయాన్ని గానీ అందించ లేదు. కానీ ఏపీఎస్ఎస్డీసీ తన 10 శాతం వాటాను జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లు డిజైన్ టెక్ కంపెనీకి చెల్లించేసింది. దీనిపై అప్పటి ఆర్ధిక శాఖ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ మరీ నిధులు విడుదల చేయాలని సీఎం హోదాలో చంద్రబాబు ఆదేశించారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎస్ఎస్డీసీ ద్వారా డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు మంజూరు చేశారు. ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ నిధులు కొల్లగొట్టేందుకుగాను చంద్రబాబు ఏకంగా మొత్తం 13 నోట్ ఫైళ్లలో సంతకాలు చేశారు. ⇒ డిజైన్ టెక్కు చెల్లించిన రూ.371 కోట్లలో సాఫ్ట్వేర్ కొనుగోలు కోసం రూ.56 కోట్లు చెల్లించారు. మిగతా రూ.315 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి వివిధ దశల్లో అక్రమంగా తరలించారు. షెల్ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోనూ రూ.241 కోట్లు హవాలా మార్గంలో హైదరాబాద్‌లోని చంద్రబాబు బంగ్లాకు తరలించారు.కడిగిపారేసిన కాగ్రాజ్యాంగబద్ధ సంస్థ కాగ్ కూడా చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిర్ధారించింది. ఆ ప్రాజెక్టులో రూ.355 కోట్ల మేర ఖజానాకు గండి పడిందని నిగ్గు తేల్చింది. వాస్తవ లెక్కల ప్రకారం ప్రాజెక్ట్ విలువను రూ.370 కోట్లుగా చూపించి ఉంటే ప్రభుత్వం తన వాటాగా రూ.33 కోట్లు మాత్రమే విడుదల చేయాలి. అయితే అంచనాలను అమాంతం పెంచేసి రూ.3,300 కోట్లుగా చూపించి ప్రభుత్వ వాటా 10 శాతంతోపాటు జీఎస్టీ, ఇతర అంశాలను కలిపి ఏకంగా రూ.371 కోట్లు విడుదల చేశారు. రూ.333 కోట్లు కొల్లగొట్టారు. ప్రాజెక్టు మొదలు కాకుండానే నిధులు విడుదల చేయడంతో ప్రభుత్వం రూ.22 కోట్లు వడ్డీ రూపంలో రావాల్సిన ఆదాయాన్ని కోల్పోయింది. వెరసి ప్రభుత్వ ఖజానాకు రూ.355 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ తెలిపింది.ఏ–1గా తేలడంతో బాబు అరెస్ట్⇒ 2018లోనే కేంద్ర జీఎస్టీ అధికారులు షెల్ కంపెనీల్లో నిర్వహించిన తనిఖీల్లో ఈ వ్యవహారం బయట పడింది. దీనిపై అప్పట్లోనే జీఎస్టీ అధికారులు రాష్టఏసీబీకి సమాచారం ఇచ్చారు. కానీ చంద్రబాబు ఒత్తిడితో ఆ అంశాన్ని తొక్కిపెట్టారు. ఆ వెంటనే ఏపీఎస్ఎస్డీసీ ఆఫీసులో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫైళ్లను మాయం చేశారు. ⇒ 2019లో పూణెకు చెందిన ఓ సామాజిక కార్యకర్త ఈ కుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. దీంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్కిల్ స్కామ్‌పై విచారణకు సీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించింది. సిట్ దర్యాప్తులో చంద్రబాబు అవినీతి బాగోతం అంతా బట్టబయలైంది. ఈ కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అంతా చంద్రబాబే అన్నది నిర్ధారణ అయింది. ఈ కేసు విచారణ కోసం చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షెల్ కంపెనీల ప్రతినిధి మనోజ్ పార్థసానిలకు సిట్ నోటీసులు జారీ చేయగానే వారిద్దరూ విదేశాలకు పరారయ్యారు. దాంతో ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేస్తున్నారని భావించి ఆయన్ను గత ఏడాది సెపె్టంబర్ 9న అరెస్ట్ చేసింది. ఈ కేసులో చంద్రబాబును ఏ–1గా పేర్కొంటూ ఆయనతోపాటు 9 మంది నిందితులను అరెస్ట్ చేసినట్టైంది. ⇒ సిట్ రిమాండ్ రిపోర్ట్‌తో ఏకీభవించిన విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం చంద్రబాబుకు రిమాండ్ విధించింది. దాంతో చంద్రబాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతరం బెయిల్‌పై విడుదల అయ్యారు.పరికరాలు సరఫరా చేయకుండానే చేసినట్టుగా..యువతకు ఉపాధి నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తామనే ప్రాజెక్ట్ పేరిట నిధులు కొల్లగొట్టినట్టు తమ దర్యాప్తులో వెల్లడైందని ఈడీ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టంగా వెల్లడించింది. ఈడీ తెలిపిన వివరాల ప్రకారం.. సీమెన్స్ కంపెనీకి అప్పటి ఎండీ సుమన్ బోస్, డిజైన్ టెక్ కంపెనీ ఎండీ వికాస్ వినాయక్ కన్విల్కర్ తమ సన్నిహితులు ముకుల్ చంద్ర అగర్వాల్ (స్కిల్లర్ కంపెనీ ప్రతినిధి), సురేశ్ గోయల్ (చార్టెడ్ అకౌంటెంట్) ద్వారా ప్రజాధనాన్ని అక్రమంగా దారి మళ్లించారు. ఏపీ ప్రభుత్వానికి ఎటువంటి పరికరాలు సరఫరా చేయకుండానే చేసినట్టుగా బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి నిధులు విడుదల చేశారు. ఆ నిధులను షెల్ కంపెనీల బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించి, ఏయే బ్యాంకు ఖాతాల నుంచి సింగపూర్‌కు తరలించారు.. తిరిగి ఆ నిధులు దేశంలోని ఏయే ఖాతాలకు వచ్చాయన్న విషయాన్ని ఈడీ గుర్తించింది. ఇప్పటికే రూ.70 కోట్లు హవాలా మార్గంలో తరలించినట్టు నిర్ధారించింది. చంద్రబాబుకు సన్నిహితులు, ఆ కుంభకోణంతో ప్రమేయమున్న షెల్ కంపెనీల ప్రతినిధులు మొత్తం 26 మందికి నోటీసులు జారీ చేసి పలువురిని విచారించింది. ఈ కేసులో నిందితులు సుమన్ బోస్, వికాస్ ఖన్విల్కర్, ముకుల్‌చంద్ర అగర్వాల్, సురేశ్ గోయల్‌లను అరెస్టు చేయడంతోపాటు విశాఖపట్నంలోని పీఎంఎల్ఏ న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేసింది.ఇక టీడీపీ ప్రభుత్వ పెద్దల పాత్రపై ఈడీ కన్నుస్కిల్ స్కాం కేసులో ప్రధాన నిందితుడి (ఏ1)గా చంద్రబాబును పేర్కొంటూ న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జ్‌షీట్ కాపీని సిట్ ఈ ఏడాది మార్చిలోనే ఈడీకి పంపింది. ఇప్పటికే షెల్ కంపెనీ అక్రమాలను వెలికి తీసి, కఠిన చర్యలు చేపట్టిన ఈడీ.. ఈ కుంభకోణం సూత్రధారులు, అంతిమ లబ్ధిదారులు అయిన టీడీపీ ప్రభుత్వ పెద్దల పాత్రపై దర్యాఫ్తు వేగవంతం చేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. దాంతో ఫేక్ న్యూస్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈడీ మంగళవారం జారీ చేసిన అధికారిక ప్రకటనలో చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చినట్టు ప్రకటించ లేదు. షెల్ కంపెనీల ప్రతినిధులపై తీసుకున్న చర్యలను తెలిపింది. సీబీఐకి అప్పగించాలి రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో గతంలో చంద్రబాబుపై సిట్ నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న కేసులను సీబీఐకి అప్పగించాలని కోరుతూ సామాజిక కార్యకర్త తిలక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుల్లో ప్రధాన నిందితుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉండటంతో సిట్ దర్యాప్తు పారదర్శకంగా సాగదని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. కాబట్టి సీబీఐకి అప్పగించాలని కోరారు. ఈ పిటిషన్ న్యాయస్థానంలో విచారణలో ఉంది.