Nov 11th : చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌ | TDP Chandrababu Cases Petitions Nov 11 Updates | Sakshi
Sakshi News home page

Nov 11th : చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

Published Sat, Nov 11 2023 7:10 AM | Last Updated on Sat, Nov 11 2023 8:37 PM

TDP Chandrababu Cases Petitions Nov 11 Updates - Sakshi

TDP Chandrababu Cases Petitions..

8:04 PM, Nov11, 2023
మాట్లాడితే వ్యవస్థలంటారు.. మరి మీరు చేసిందేంటీ?

►కేసులు పెట్టించుకుంటే 48 గంటలలో  హైకోర్టు నుంచి బెయిల్ ఇప్పిస్తానని చెప్పింది లోకేష్ కాదా?
►ఆలయాలపై దాడులు చేసి, తిరిగి ప్రభుత్వంపైనే ఆరోపణలు చేసి అశాంతి సృష్టించడానికి యత్నించింది టీడీపీ, జనసేన కాదా?
►అంగళ్లులో రెచ్చిపోయి కార్యకర్తలతో పోలీసులపై దాడులు చేయించింది చంద్రబాబు కాదా?
►పవన్ కళ్యాణ్ కాని, చంద్రబాబు నాయుడు కాని, లోకేష్ కాని తమ సభలలో ఎలా ప్రజలను రెచ్చగొట్టలేదా?
►ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి మీటింగ్‌లు పెట్టింది చంద్రబాబు కాదా!
►కందుకూరులో జరిగిన తొక్కిసలాటకు కాని, గుంటూరు తొక్కిసలాటకు కాని, తద్వారా పదకుండు మంది మరణానికి గాని కారణం టీడీపీ కాదా?
►వాటినన్నిటిని సమర్ధించే దుస్థితికి పవన్ కళ్యాణ్ చేరుకోవడం కనిపించడం లేదా
►వలంటీర్ల మొదలు ఎవరిని పడితే వారిని పవన్‌ నోటికి వచ్చినట్లు దూషించడం సరైన చర్యా! పైగా ప్రభుత్వంపై ఆరోపణా?

6:52 PM, Nov 11, 2023
బాలకృష్ణకు అర్థం కావడానికి ఆలస్యమవుతోందా?
► కుటుంబసభ్యులపైనే చాణక్య నీతిని ప్రదర్శిస్తోన్న చంద్రబాబు
► అరెస్టయినపుడు రెండు రోజులు బాలకృష్ణ హడావిడి చూసి అర్జంటుగా ప్లాన్‌ మార్చిన బాబు
► ఇప్పటికిప్పుడు తెలంగాణకు వెళ్లి పార్టీని గెలిపించాలని బాలకృష్ణకు అసైన్‌మెంట్‌
► బావ ఆదేశాలు అర్థం కాక.. తలపట్టుకుని హైదరాబాద్‌ వచ్చిన బాలకృష్ణ
► ఆ వెంటనే భీకర ప్రెస్‌ మీట్‌ పెట్టి తెలంగాణలో అధికారంలోకి వస్తున్నామని ప్రకటించిన బాలకృష్ణ
► నెల గడవకముందే బాలకృష్ణ స్టేట్‌మెంట్‌ను చెత్తబుట్టలో వేసేసిన బాబు
► అసలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీనే చేయబోవడం లేదని పార్టీ ప్రకటన
► బాబుకు ముందే ఇవన్నీ తెలిసి మరీ బాలకృష్ణను తెలంగాణకు పంపారని పార్టీలో చర్చ
► లోకేష్‌కు ఎలాంటి కష్టం రాకుండా అన్ని అడ్డంకులు తొలగించే పనుల్లో చంద్రబాబు

5:32 PM, Nov 11, 2023
బాబుపై ఎన్ని కేసులు? ఎన్ని స్టేలు?

►దేశ రాజకీయాల్లో స్టేBNగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు
►1997లో రెడ్యానాయక్‌ మీ అక్రమాస్తులపై కేసు వేస్తే స్టే 
►1998లో వైఎస్సార్‌ గారు హైకోర్టులో దావా వేస్తే స్టే
►1999లో షబ్బీర్‌ అలీ, 1999లో డీఎల్‌ రవీంద్రారెడ్డి వేసిన దావాల్లో స్టే. 
►1999, 2000, 2001 వైఎస్సార్‌ గారు తిరిగి దావా వేస్తే స్టే. 
►2003లో కృష్ణకుమార్‌ గౌడ్‌ కేసు వేస్తే స్టే 
►2003లో కన్నా లక్ష్మీనారాయణ వేసిన కేసు ఏంటంటే పాపపు సొమ్ముతో చంద్రబాబు హెరిటేజ్‌ పెట్టాడని దావా వేస్తే స్టే
►2004లో కన్నా మళ్లీ కేసు వేస్తే స్టే.
►2004లో పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చంద్రబాబుపై రెండు కేసులు 
►ఒకటి అక్రమాస్తులు, రెండు భూదోపిడీ.. దాంట్లోనూ స్టే
►2005లో బాబు అక్రమాస్తులపై  లక్ష్మీపార్వతి హైకోర్టులో  కేసు వేస్తే స్టే 
►2005 శ్రీహరి, అశోక్‌ అనే ఏపీ పౌరులు కేసు వేస్తే స్టే
►2011లో బి.ఎల్లారెడ్డి అనే వ్యక్తి చంద్రబాబుపై కేసు వేస్తే స్టే
 

4:03 PM, Nov 11, 2023
దొంగ ఓట్లపై దొంగాట ఆడుతుందెవరు?

►పక్కా ప్లాన్‌ ప్రకారం దొంగ ఓట్లంటూ తెలుగుదేశం, పచ్చమీడియా ప్రచారం
►ఇటీవల దొంగ ఓట్లు, బోగస్‌ ఓట్లు అంటూ CECకి ఫిర్యాదు చేసిన టిడిపి నేతలు
►పలు చోట్ల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని, ఒక  అడ్రస్  లేదా ఒకే పేరు, ఒకే ఓటర్ ఐడితో చాలా ఓట్లు ఉన్నాయంటూ ఫిర్యాదు
►ఇదే విషయంపై దర్యాప్తులో బయటపడుతున్న అసలు నిజాలు
►టిడిపి నేతలు బలంగా ఉన్న చోట బోలెడు బోగస్‌ ఓట్లు
►ఇలాంటి ఓట్లను తొలగిస్తుంటే, అక్రమంగా టీడీపీ ఓట్లు తీసేస్తున్నారంటూ పచ్చమీడియా గగ్గోలు
►నిజమైన వ్యక్తుల ఓట్లు ఒక వేళ పోతే, ఆన్‌లైన్‌లో ధృవపత్రాలు పెట్టి మళ్లీ ఓటు పొందే అవకాశం
►అయినా బోగస్‌ ఓట్లు ఉండాలంటూ పచ్చమీడియా గగ్గోలు
►దొంగాట ఆడేది, గగ్గోలు పెట్టేది రెండూ టిడిపికి సంబంధించిన వాళ్లే

03:33 PM, Nov 11, 2023
టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు
►ఏపీలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు
►ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించాలని ఇరు పార్టీల నిర్ణయం
►కమిటీలో టీడీపీ సభ్యులుగా యనమల, పట్టాభి, అశోక్ బాబు
►జనసేన తరఫున వరప్రసాద్, శశిధర్, శరత్ లకు కమిటీలో చోటు
►ఈ నెల 13న సమావేశం కానున్న ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ

01:33 PM, Nov 11, 2023
తెలుగుదేశం విష ప్రచారమేంటీ? అసలు నిజాలేంటీ?
►తెలుగుదేశం, ఎల్లోమీడియాలో జరుగుతున్న ప్రచారమేంటీ?
►చంద్రబాబు విజనరీ, ఆయనే హైటెక్‌ సిటీ కట్టాడు
►మళ్లీ చంద్రబాబు నెగ్గితే ఏపీ అభివృద్ధి చేస్తాడు
►ప్రస్తుతమున్న ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదు
కింది ఫోటో చూడండి. హైటెక్‌ సిటీకి శంకుస్థాపన చేస్తోంది నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం, ఆ ఆలోచన చంద్రబాబుది కాదు, టీడీపీది కాదు

10:36 AM, Nov 11, 2023
2019 ఎన్నికల్లో కుప్పకూలిన టీడీపీ కంచుకోటలు
► అనేక దశాబ్దాలుగా గెలుస్తూ కంచుకోటలుగా భావించిన నియోజకవర్గాల్లో ఘోరంగా ఓడిన తెలుగు దేశం
► కేవలం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కేబినెట్‌లోని ముగ్గురు మంత్రులు మినహా మిగతావారంతా పరాజయం
► పార్టీ ఆవిర్భావం తర్వాత గత 36 ఏళ్లలో జరిగిన 8 ఎన్నికల్లో టీడీపీ ఏడు నుంచి ఆరుసార్లు గెలుపు
► ఇప్పటివరకు టీడీపీ ఏడుసార్లు గెలిచిన నియోజకవర్గాలు 16, ఆరుసార్లు గెలిచినవి 29 చోట్ల ఓటమి
►  శ్రీకాకుళం జిల్లా పలాసలో (గతంలో సోంపేట) 2009లో తప్ప అన్ని ఎన్నికల్లోనూ టీడీపీ విజయం, 2019లో గౌతు శిరీష ఓటమి
►  2004లో తప్ప అన్నిసార్లూ గెలుస్తూ వచ్చిన విజయనగరంలో సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతి రాజు కుమార్తె అదితి గజపతి రాజు ఓటమి
►  పాయకరావుపేటలో టీడీపీ 8 ఎన్నికల్లో ఒకేసారి ఓడింది. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ నెగ్గింది.  
►  ఏడుసార్లు గెలిచిన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో వంగలపూడి అనిత ఓటమి
►  ఏడుసార్లు గెలిచిన కృష్ణా జిల్లా నందిగామలో సైకిల్‌ గల్లంతు
►  1989లో తప్ప అన్ని ఎన్నికల్లోనూ గుంటూరు జిల్లా పొన్నూరులో టీడీపీ విజయం సాధించగా... 2019లో ఓటమి
►  అనంతపురం జిల్లా పెనుగొండ, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, కర్నూలు జిల్లా పత్తికొండలో ఇలాంటి దీన పరిస్థితి సైకిల్‌కు

మేం కలిసి పోటీ చేసి ఉంటే.. 2019లో మరోలా ఉండేది : టీడీపీ, జనసేన సమన్వయం
► 2019లో పవన్‌కళ్యాణ్‌ ఎందుకు ఒంటరిగా పోటీ చేశాడో చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారు
► చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్నది పవన్‌ ఎజెండా
► అయినా పారని ఎత్తుగడ, ఛీ కొట్టి ఇంటికి పరిమితం చేసిన ఓటర్లు
► ఒకసారి కింద ఇచ్చిన ఎన్నికల సంఘం నివేదికను జాగ్రత్తగా పరిశీలించండి

అసలు జనసేన కేవలం 137 సీట్లకే ఎందుకు పరిమితమయింది?
► తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం వల్ల మిగతా చోట్ల పోటీ చేయలేదు
► ఎక్కడెక్కడ YSRCP అభ్యర్థి బలంగా ఉన్నాడో.. అక్కడ మాత్రమే జనసేన బరిలోకి దిగింది
► జనసేన ఉద్దేశ్యం ఒకటే.. YSRCP ఓట్లను పరిమితం చేయడం

08:37 AM, Nov 11, 2023
నోటీసులు పంపడంలో జాప్యం ఎందుకైంది? 
►స్కిల్‌ కేసులో ఉండవల్లి పిల్‌పై హైకోర్టు విచారణ 
►చంద్రబాబు, తదితరులకు నోటీసుల జారీలో జాప్యంపై ధర్మాసనం విస్మయం 
►బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రార్‌కు ఆదేశం  
►తదుపరి విచారణ 29కి వాయిదా

08:00 AM, Nov 11, 2023
యథేచ్ఛగా ఇసుక లూటీ సాగించిన చంద్రబాబు
►కేబినెట్‌ కళ్లుగప్పి ఖజానాకు కన్నం 
►మెమో, జీవోలు మంత్రివర్గం ఆమోదం లేకుండానే జారీ
►ఒకపక్క ఉచితమంటూనే మరోపక్క జరిమానాలు.. కావాల్సిన వారికి సంతర్పణకే
►ఇప్పుడు పారదర్శకంగా తవ్వకాలతో ఖజానాకు రూ.770 కోట్ల ఆదాయం
►నాడు రూ.వేల కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టిన బాబు.. అడ్డుకున్న అధికారులపై దాడులకు తెగబడ్డ పచ్చ ముఠాలు
►కరకట్ట నివాసం పక్కనే కొల్లగొడుతున్నా మొద్దునిద్రను ఆక్షేపించిన ఎన్జీటీ

07:19 AM, Nov 11, 2023
బాబు గజగజ
►స్కిల్‌ స్కాం కేసులో మధ్యంతర బెయిల్‌ మీద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
►52రోజులపాటు జైలు జీవితం.. బయటకు వచ్చాక ఆస్పత్రుల చుట్టూ బాబు 
► దిక్కుతోచని స్థితిలో టీడీపీ శ్రేణులు
►పరామర్శయాత్రని పక్కన పారేసిన సతీమణి నారా భువనేశ్వరి
►యువగళాన్ని అటకెక్కించి ఢిల్లీ పరారైన తనయుడు నారా లోకేష్‌ బాబు
►టెన్షన్‌లో నారావారు.. గందరగోళంలో పార్టీ క్యాడర్‌
►స్కిల్‌ కేసులో సుప్రీం తీర్పుపైనే ఆశలు పెట్టుకున్న బాబు అండ్‌ కో

07:10 AM, Nov 11, 2023
తెలంగాణలో ముసుగు తొలగించిన టీడీపీ
►కాంగ్రెస్‌కు మద్దతుగా ప్రచారంలోకి దిగిన టీడీపీ 
►చంద్రబాబు ప్రియ శిష్యుడు రేవంత్‌రెడ్డి కోసం రంగంలోకి టీడీపీ నేతలు
►నామినేషన్ల పర్వం ముగియగానే.. కాంగ్రెస్‌ ప్రచారానికి బహిరంగ మద్దతు ఇచ్చిన టీడీపీ
► కోదాడలో కాంగ్రెస్‌ అభ్యర్థి పద్మావతికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న టీడీపీ శ్రేణులు
►కాంగ్రెస్‌ ర్యాలీలో కాంగ్రెస్‌ జెండాలతో కలగలిసిన టీడీపీ జెండాలు

07:08 AM, Nov 11, 2023
అసైన్డ్‌ భూముల స్కాంలో క్వాష్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా
►ఈనెల 22వ తేదీకి విచారణ వాయిదా వేసిన హైకోర్టు
►స్కిల్‌ స్కాంలో బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా 
►చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఈనెల 15కి వాయిదా 
►ఉండవల్లి పిటిషన్‌పై విచారణ వాయిదా
►తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసిన కోర్టు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement