సాక్షి, అమరావతి: మూడు కేసుల్లో హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందిన టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం ఆ కేసుల దర్యాప్తు అధికారుల వద్దకు వచ్చి పూచీకత్తులు సమర్పించనున్నారు. బాబు హాయాంలో జరిగిన ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్‌ఆర్), ఇసుక, మద్యం అక్రమాలపై కేసులు నమోదు చేయగా.. ఈ కేసుల్లో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఇందుకు సంబంధించిన పూచీకత్తులను దర్యాప్తు అధికారులకు ఆయన సమర్పించాల్సి ఉంది. ఉ. 11 గంటల తర్వాత మద్యం కేసులో గుంటూరు సీఐడీ కార్యాలయానికి, ఇసుక కేసులో విజయవాడ సీఐడీ కార్యాలయానికి మధ్యాహ్నం 3.30 గంటలకు, ఐఆర్‌ఆర్ కేసులో సాయంత్రం 4.20 గంటలకు తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి వెళ్లి పూచీకత్తులు సమర్పించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment