TDP Chandrababu Cases, Political Updates..
7:00 PM, Dec 15, 2023
ఏమైనా చేయండి.. యువగళం ముగింపు సక్సెస్ చేయండి
- టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం
- యువగళం విజయోత్సవ సభ ఏర్పాట్లను సమీక్షించిన చంద్రబాబు
- విజయోత్సవ సభకు లోటు లేకుండా ఏర్పాట్లు చేయాలన్న చంద్రబాబు
- సభ సక్సెస్ కాకపోతే లోకేష్ ఊరుకోడని చెబుతోన్న చంద్రబాబు
- ఎంత ఖర్చయినా సరే.. నాది బాధ్యత, జనాలను తీసుకురావాలని పిలుపు
- ఇప్పటికే రంగంలోకి దిగిన లోకేష్ కోటరీ
- ప్రతీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌కు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి టార్గెట్‌లు
- జనం తగ్గితే ఎమ్మెల్యే టికెట్‌లు కష్టమని హెచ్చరిస్తోన్న లోకేష్ కోటరీ
- లోకేష్ సభ సక్సెసయితేనే పార్టీకి మనుగడ ఉంటుందని హెచ్చరికలు
6:55 PM, Dec 15, 2023
మరి.. మీరెందుకు కుప్పం వచ్చారు బాబు.? : పేర్ని నాని
- రాజకీయాల్లో ట్రాన్స్ ఫర్లు ఉంటాయా అని చంద్రబాబు అంటున్నారు
- చంద్రబాబు కూడా చంద్రగిరి నుంచి కుప్పంకి ట్రాన్స్ ఫర్ అయ్యారు
- మేం వద్దనుకున్న వారిని చంద్రబాబు చేర్చుకున్నారు
- వైనాట్ 175కి జగన్ అన్ని ఏర్పాట్లు, వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు
- జగన్ రాజకీయ ఎత్తుగడలతో చంద్రబాబుకు షాకులు తగులుతున్నాయి
- గోతికాడ నక్కలా వైసీపీ ఎమ్మెల్యేల కోసం చంద్రబాబు ఎదురు చూస్తున్నారు
- పవన్ కు రాష్ట్ర అభివృద్ధి, ప్రజల బాగోగులు పట్టవు
- జగన్ ను ఓడించాలి, చంద్రబాబును సీఎం చేయడమే పవన్ ధ్యేయం
- పవన్ తన టెంట్ హౌస్ పార్టీని చంద్రబాబుకు లీజుకు ఇచ్చారు : పేర్ని నాని
5:05 PM, Dec 15, 2023
జనసేనకు రాంరాం.. ఒంటరిగానే తెలంగాణలో పోటీ : బీజేపీ
- పొత్తులపై బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- మా టార్గెట్ లోకసభ ఎన్నికలు
- పార్లమెంట్ ఎన్నికలకు సిద్దం కావాలని బీజేపీ నేతలు, క్యాడర్ కు కిషన్ రెడ్డి పిలుపు
- డిసెంబర్ చివరి వారంలో తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
- పార‌్లమెంట్ ఎన్నికల్లో పొత్తులు ఉండవు : స్పష్టం చేసిన కిషన్ రెడ్డి
- బీఆర్ఎస్, బీజేపీ పొత్తు.. ప్రచారం మాత్రమే
- లోకసభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తోంది
- తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పై సమాన పోరాటాలుంటాయి
- లోకసభలో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం
- తెలంగాణలో రాజకీయంగా బీజేపీకి మంచి అవకాశముంది
- పార్లమెంట్ ఎన్నికలకు క్యాడర్ సిద్దం కావాలి
- సర్వే సంస్థలకు సైతం అందని విధంగా లోకసభ ఫలితాలుంటాయి
- కొత్తగా ఎన్నికైన 8మంది బీజేపీ ఎమ్మెల్యేలు అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తారు
- మూడోసారి కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడబోతోంది
5:02 PM, Dec 15, 2023
చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కోవర్ట్ : RGV
- జనసేన స్థాపనకు కారణమే చంద్రబాబు : రాంగోపాల్ వర్మ
- మరోమాటలో జనసేనలో పవన్, చంద్రబాబుకు కోవర్టు
- వారిద్దరి మధ్య పొత్తు అనే దానికి అర్థమే లేదు
- ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు పరిస్థితి ఏం బాగోలేదు
- తెలంగాణాలో కేసీఆర్ కు ఉన్నంత బలమైన అపొజిషన్ ఏపీలో లేదు
- రేవంత్ రెడ్డి ఓ స్ట్రాంగ్ అపొజిషన్ గా వచ్చి సీఎం అయ్యారు : ఆర్జీవీ
4:23 PM, Dec 15, 2023
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు వాయిదా
- ACB కోర్టులో IRR అలైన్మెంట్ కేసు విచారణ వాయిదా
- ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్ పైనా విచారణ వాయిదా
- తదుపరి విచారణలు జనవరి 30కి వాయిదా
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏం జరిగిందంటే?
- CID అభియోగాల్లో ముఖ్యమైన అంశాలు
- టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు
- కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే
- లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్‌లో భూములు
- స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మూడుసార్లు మార్పు
- అలైన్‌మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్‌ప్రోకో
- 2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్‌రింగ్ అలైన్‌మెంట్‌లో మార్పులు
- ఇన్నర్ రింగ్‌రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు
- అలైన్‌మెంట్‌ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం
- ఇన్నర్‌రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్‌మెంట్
- కరకట్ట కట్టడం.. క్విడ్‌ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించిన లింగమనేని
- కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం
- లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్‌దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసం
- సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు
ఫైబర్ నెట్ కేసులో ఏం జరిగిందంటే?
- ‘ఫైబర్‌గ్రిడ్’ కుంభకోణం దర్యాప్తులో CID కీలక అంశాలు
- టెరాసాఫ్ట్ పేరుతో రూ.284 కోట్లు కొట్టేసిన లోకేశ్ సన్నిహితులు
- కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏపీలో చేపట్టిన ఫైబర్‌నెట్ ప్రాజెక్టు
- రూ.333 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులను నిబంధనలకు విరుద్ధంగా లోకేశ్ సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్‌కు అప్పగింత
- కనుమూరి కోటేశ్వరరావు సహకారాన్ని తీసుకున్న వేమూరి వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో కనుమూరి కోటేశ్వరరావును భాగస్వామిగా చేరిక
- వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్‌కుమార్ రామ్మూర్తిలతో కలిసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ LLP అనే మ్యాన్‌పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీ సృష్టి
- ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీ, ఇతర కంపెనీలకు రూ.284 కోట్లు విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వం
- నెటాప్స్ పేరుతో డొల్ల కంపెనీ సృష్టించి నిధులు మళ్లించిన వేమూరి హరికృష్ణ
- నెటాప్స్ కంపెనీకి చెల్లించిన రూ.8.35 కోట్లను వేమూరి హరికృష్ణకు చెందిన ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు మళ్లించారు.
- నెటాప్స్ కంపెనీ నుంచి రూ.1.49 కోట్లను వేమూరి హరికృష్ణ కుమార్తె వేమూరి అభిజ్ఞ ఖాతాకు మళ్లించారు. విదేశాల్లో ఉన్న ఆమె ఇక్కడ తమ కంపెనీలో పనిచేస్తున్నట్లు చూపించి జీతం కింద నెలకు రూ.1.35 లక్షలు చెల్లింపు
- వేమూరి హరికృష్ణ భార్య వేమూరి నీలిమ ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్‌గా రూ.39.74 లక్షలు నెటాప్స్ కంపెనీ బదిలీ
- నెటాప్స్ కంపెనీ 2017 జూన్ నుంచి 2020 జూన్ మధ్య ఎలాంటి సేవలు, పరికరాల సరఫరా లేకుండానే వేమూరి హరికృష్ణకు రూ.95.90 లక్షలు బదిలీ
- నెటాప్స్ కంపెనీ 2017 జనవరి నుంచి 2019 మార్చి మధ్యలో సేవలు, పరికరాల సరఫరా లేకుండా స్ఫూర్తి ఇన్నోవేషన్స్‌కు రూ.76 లక్షలు బదిలీ
- టెరాసాఫ్ట్ లావాదేవీలను ఆడిటింగ్ చేసిన స్వతంత్ర సంస్థ ఐబీఐ గ్రూప్
- ఇప్పటికే ఈ కేసులో నలుగురు సూత్రధారుల అరెస్టు
3:31 PM, Dec 15, 2023
ఎన్నికల వేళ చంద్రబాబు డ్రామాలు : సజ్జల
- ఆస్తుల కోసమే చంద్రబాబు హైదరాబాద్‌లో ఉంటున్నాడు
- మా పార్టీ ఇంటర్నల్ వ్యవహారాలు చంద్రబాబుకు ఎందుకు..?
- చంద్రగిరి నుంచి కుప్పానికి చంద్రబాబు ఎందుకు వెళ్లాడు..?
- మంగళగిరికి లోకేష్‌కు సంబంధం ఏంటీ..?
- ఏపీకి చంద్రబాబు గెస్ట్‌లా మాత్రమే వస్తాడు
1:31 PM, Dec 15, 2023
ఎన్నికల వేళ చంద్రబాబు డ్రామాలు
- సచివాలయంలో మాట్లాడిన ప్రభుత్వ సలహాదారులు,సజ్జల రామకృష్ణారెడ్డి
- చంద్రబాబు ఎన్నికలకు ఎలా వెళ్తారో చెబుతారని అనుకున్నాం..!
- మా ప్రభుత్వంలో కోటీ 47 లక్షల కుటుంబాలకు నేరుగా సంక్షేమం అందుతుంది
- ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని ప్రజలు తమ హక్కుగా పొందుతున్నారు
- టీడీపీ ప్రభుత్వంలో ఏం చేశారో ఒక్కటైనా చెప్పగలరా?
- ఉద్ధానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు
- 2014-19 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు ఉద్ధానానికి ఏం చేశాడు
- ఉద్ధానం కోసం పవన్ కళ్యాణ్ ఏం చేశాడు?
- చంద్రబాబు ఎవరికి కథలు చెబుతాడు?
- తుఫాన్ల సమయంలో ఫలానా తక్షణ సాయం చేశానని చంద్రబాబు లెక్కలు చెప్పగలరా?
- తుఫాన్ విషయంలో 22 లక్షల్లో 10 వేల కోట్లు నష్టం వాటిల్లిందని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశాడు
- ఈ లేఖ రాయడానికి చంద్రబాబుకి తలకాయ ఉందా?
- ముఖ్యమంత్రి గా పనిచేసిన వ్యక్తి బాధ్యత లేకుండా మాట్లాడితే ఎలా?
- తుఫాన్ పరిహారం విషయంలో తప్పు పట్టడానికి అవకాశం లేకుండా చేశాం
- అసలు చంద్రబాబుకి ఈ రాష్ట్రంతో సంబంధం ఏంటి?
- హైదరాబాద్ లో కూర్చుని రాష్ట్రానికి గెస్ట్ లా వస్తాడు.!
- చంద్రబాబు కి ప్రజామోదం లేదు
- .2019లోనే చంద్రబాబును జనం రిజెక్ట్ చేశారు
- ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకున్నాడు కాబట్టో చంద్రబాబును జనం చెత్త బుట్టలో వేశారు
- హైదరాబాద్ లో ఉంటే ఆస్తులు కాపాడుకోవచ్చని ప్రయత్నం చేస్తున్నారు
- చంద్రబాబు, లోకేష్,ఆయన దత్తపుత్రుడు కూడా రాష్ట్రానికి రావడం లేదు
- చంద్రబాబును చూస్తుంటే సినిమాలో క్షుద్రపూజలు గుర్తొస్తున్నాయి
- గతంలో దుర్గ గుడిలో పూజలు చేసినట్లు ఇప్పుడు కూడా పూజలేమైనా చేస్తున్నాడు అనుకుంటా
- అభ్యర్థులు మార్పు విషయంలో అవాకులు చవాకులు పేలుతున్నారు
- బీసీ సీట్లలో నువ్వు,నీకొడుకు ఎందుకు పోటీ చేస్తున్నారు
- చంద్రగిరి వదిలేసి కుప్పంలో ఎందుకు పోటీచేస్తున్నారు
- 2024లో చంద్రబాబుకు కుప్పంతో సహా ఒక్క టిక్కెట్ కూడా రాదు
- అత్యంత పారదర్శకంగా జరుగుతున్న జగన్ మోహన్ రెడ్డి పాలన పై బురద జల్లుతున్నారు
- చంద్రబాబు తప్పిదాలను మాకు ఆపాదించి రోజూ పనికిమాలిన రాతలు రాస్తున్నారు
- కౌంటర్లు పెట్టి తెలంగాణలో వారిని తీసుకొచ్చి ఓట్లను రిజిస్టర్ చేయిస్తున్నారు
- సిటిజన్ ఫోరమ్ పేరుతో ఒక భోగస్ ఫోరమ్ ను పెట్టారు
- వాలంటీర్లకు ఎన్నికలకు సంబంధం లేదు
- చీఫ్ సెక్రటరీగా చేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యానికి తెలియదా?
- నిమ్మగడ్డ రమేష్ కు తెలియదా?
- సిటిజన్ ఫోరమ్ చంద్రబాబు చేత చంద్రబాబు కోసం ఏర్పాటు చేసింది
- ఎన్నికల్లో వైసీపీ ఫర్ ఫెక్ట్ టీమ్ ను దించుతుంది
- మేం చాలా ఆత్మ నిబ్బరంగా ఉన్నాం...బలంగా ఉన్నాం
- ఏబీఎన్ డిబేట్లలో అనలిస్ట్ లు తగ్గినట్లున్నారు
- చంద్రబాబు ఏబీఎన్ డిబేట్లలో ప్రయత్నిస్తే బాగుంటుంది
- సామాజికవర్గ సమీకరణాలతో, 175 చోట్ల పర్ ఫెక్ట్ టీమ్ ను దించుతున్నాం
- చంద్రబాబుకు చేతనైతే ఆ పని చేయమనండి
11:31 AM, Dec 15, 2023
నీతులు భలే చెబుతావు బాబు..!
- టికెట్ల కేటాయింపులో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు
- ప్రజాభిప్రాయంతోనే అభ్యర్ధుల ఎంపిక
- కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు విభిన్న కోణాల్లో ప్రజాభిప్రాయ సేకరణ
- ఆ తర్వాతే అభ్యర్ధుల ఎంపిక : చంద్రబాబు
నిజంగా ప్రజాభిప్రాయం మీద నిలబడతావా చంద్రబాబు.?
- ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినపుడు ఎవరి అభిప్రాయం తీసుకున్నావు?
- పార్టీని, ప్రభుత్వాన్ని లాగేసుకున్నప్పుడు ఎవరి అభిప్రాయం తీసుకున్నావు?
- మీ పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో చేతులు కలిపినప్పుడు ఎవరి అభిప్రాయం తీసుకున్నావు?
- అధికారాన్ని అడ్డు పెట్టుకుని అడ్డంగా ప్రభుత్వ ఖజానాను దోచుకున్నప్పుడు ఎవరికి చెప్పావు?
- ఓటుకు కోట్లు ఇవ్వడమే కాకుండా.. మనవాళ్లు బ్రీఫ్‌డ్ మీ అంటూ హామీలివ్వడానికి ఎవరి అభిప్రాయం సేకరించావు?
- దళితుల్లో ఎవరైనా పుడతారా? అంటూ ప్రశ్నలు సంధించడానికి ఎవరి అభిప్రాయాలను సేకరించారు?
- రాష్ట్రాన్ని విడగొడితే ఏపీకి పది లక్షల కోట్లిస్తే చాలని ప్రకటన చేయడానికి ఎవరి అనుమతి తీసుకున్నారు?
- ప్రత్యేక హోదా వద్దే వద్దు.. ప్యాకేజీ ముద్దు అని ఖరారు చేయడానికి ఎవరి అభిప్రాయం సేకరించారు?
- లోకేష్‌ను దొడ్డిదారిలో మంత్రి పీఠంపైకి ఎక్కించినప్పుడు అభిప్రాయ సేకరణ చేయలేదేందుకు?
- 23 మంది ఎమ్మెల్యేలను YSRCP నుంచి ఫిరాయింపజేయించి, వాళ్లలో ముగ్గురికి మంత్రి పదవులిచ్చినప్పుడు ఎవరి అభిప్రాయాలు సేకరించారు?
- అంతెందుకు.. జైల్లో కూర్చుని పొత్తు చర్చలు చేసినప్పుడు ఎవరి అభిప్రాయాలు సేకరించారో.?
- నిజంగా చంద్రబాబు వద్దని కుప్పం ప్రజలు చెబితే.. పోటీ నుంచి తప్పుకుంటారా?
- అసలు మీ పార్టీలో ప్రజాస్వామ్యానికి విలువుందా? లేక కులస్వామ్యం మాత్రమే నడుస్తుందా?
8:13 AM, Dec 15, 2023
బావను డీకోడ్ చేసే పనిలో బాలయ్య
- బావ చంద్రబాబు ఎప్పటికి అర్థమవుతాడు?
- మా నాన్నకెందుకు వెన్నుపోటు పొడిచాడు?
- నాకు రావాల్సిన పదవిని, పార్టీని తానెందుకు లాగేసుకున్నాడు?
- ఏపీలో నన్నెందుకు ఎమ్మెల్యే పదవికే పరిమితం చేశాడు?
- కనీసం జైలుకెళ్లినప్పుడయినా.. నాకు అధ్యక్ష పదవి ఇవ్వలేదెందుకు?
- నాకు పదవి ఏదంటే.. అల్లుడి సంగతి చూడమని ఎందుకంటాడు?
- అసలు పోటీ చేయని తెలంగాణకు వెళ్లి ప్రెస్‌మీట్ ఎందుకు పెట్టించాడు?
- తీరా తొడలు కొట్టి ప్రకటన చేశాక.. పోటీ లేదని ఎందుకు చెప్పాడు?
- ఇంతకీ మా బావ మనసులో ఏముంది?
- ఎప్పటికి నేను డీకోడ్ చేయగలను?
- అదొక అన్-స్టాపబుల్ అసైన్‌మెంట్..!
7:23 AM, Dec 15, 2023
చంద్రబాబు+దత్తపుత్రుడు = డిపాజిట్లు గల్లంతు
- ఉద్దానంలో మాట్లాడిన సీఎం జగన్
- పేదల బతుకులు ఎలా మార్చాలి అనే తపన మీ బిడ్డ జగన్‌కు మాత్రమే ఉంది
- పేదల ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్కే లేదు
- కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు నీరు కూడా అందించలేదు
- సొంత నియోజకవర్గాన్నే పట్టించుకోని చంద్రబాబుకు ఉత్తరాంధ్ర మీద ఏం ప్రేమ ఉంటుంది?
- ఎన్నికలు వచ్చే సరికి పొత్తులు, ఎత్తులు, చిత్తుల మీద బాబు ఆధారపడతారు
- దత్తపుత్రుడి మీద చంద్రబాబు ఆధారపడతారు
- తెలంగాణాలో తన దత్తపుత్రుడిని పోటీలో పెట్టారు
- ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తానని తెలంగాణాలో డైలాగులు కొడతాడు....ఈ ప్యాకేజీ స్టార్, మ్యారేజీ స్టార్ దత్తపుత్రుడు
- తెలంగాణాలో ఆంధ్రా ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడిన దత్తపుత్రుడికి డిపాజిట్లు కూడా రాలేదు
- ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా దత్తపుత్రుడికి రాలేదు
- ఉత్తరాంధ్రకు చంద్రబాబు, దత్తపుత్రుడు చేయని ద్రోహం లేదు
- విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామంటే అడ్డుకుంటున్నారు
- విశాఖకు సీఎం వచ్చి ఉంటానంటే ఏడుస్తున్నారు
- నాన్ లోకల్స్ పక్క రాష్ట్రంలో ఉండి మన రాష్ట్రంలో ఏం చేయాలో నిర్ణయిస్తామంటారు
- ఈ నాన్ లోకల్స్ అందరికీ ఆంధ్ర రాష్ట్రం పై ప్రేమ లేదు
- అక్కచెల్లెమ్మలకు పొదుపు సంఘాలను బాబు మోసం చేశారు
- పార్టీలు సైతం చూడకుండా ప్రతి అక్కచెల్లెమ్మలకు అండగా నిలబడ్డాం
- వారు 5 ఏళ్లు అధికారంలో ఉండి పేదవారికి సెంటు స్థలం ఇవ్వలేదు
- పేదలకు ఇంటి స్థలం ఇస్తామంటే వారికి ఏడుపు
- 2014-19 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు పది శాతం హామీలు కూడా అమలు చేయలేదు
- YSRCP ప్రభుత్వంలో మేనిఫెస్టో హామీలు 99 శాతం అమలు చేస్తున్నాం
- దోచుకోవడం, పంచుకోవడం మాత్రమే చంద్రబాబుకు తెలుసు
- మీ బిడ్డ జగన్ ప్రభుత్వంలో లంచాలు, వివక్ష, అవినీతి లేకుండా నేరుగా డబ్బులు జమ
- ప్రజలకు మంచి చేస్తుంటే చంద్రబాబుకు ఏడుపే ఏడుపు
- మరో 3 నెలలు ఆగి ఈ కేన్సర్ గడ్డలను తొలగిద్దాం
- రాబోయే రోజుల్లో వారి అబద్ధాలు ఇంకా ఎక్కువ అవుతాయి
- మీ ఇంటికి, కుటుంబానికి మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే అండ
- ప్రతి ఇంటికి కేజీ బంగారం, బెంచ్ కారు కొనిస్తామని హామీ ఇస్తారు
- మాటలు చెప్పి మోసం చేసే వారిని నమ్మకండి : సీఎం జగన్
7:10 AM, Dec 15, 2023
ఇన్నర్‌రింగ్ రోడ్డు కేసు @ హైకోర్టు
- రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై హైకోర్టులో విచారణ
- ముందస్తు బెయిల్ పిటిషన్ పై సిఐడీ తరపు వాదనలు పూర్తి
- ముందస్తు బెయిల్ పిటిషన్ పై సిఐడి తరపు వాదనలు పూర్తి
- సిఐడి తరపు వాదనలు వినిపించిన ఏజీ శ్రీరామ్
- చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు
- వాదనల కొనసాగింపునకు విచారణ సోమవారానికి వాయిదా
6:56 AM, Dec 15, 2023
చంద్రబాబు కేసుల స్టేటస్ ఏంటీ?
- కేసు : స్కిల్ కుంభకోణం
- స్టేటస్ : నవంబర్ 20న బెయిల్ ఇచ్చిన హైకోర్టు
- వివరణ : ఆరోగ్య కారణాలతో ఇచ్చిన బెయిల్‌ను సాధారణ బెయిల్‌గా మార్చిన హైకోర్టు
- కేసు గురించి బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దని సూచించిన హైకోర్టు
- కేసు : స్కిల్ స్కాం
- అంశం : క్వాష్ పిటిషన్
- స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్
- వివరణ : ఈ నెలలో తీర్పు వచ్చే అవకాశం
- కేసు : ఇసుక కుంభకోణం
- అంశం : చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్
- స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ
- కేసు : ఫైబర్ నెట్ పేరిట నిధుల దోపిడి
- అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్
- స్టేటస్ : సుప్రీంకోర్టులో పెండింగ్
- వివరణ : జనవరి 17కు తదుపరి విచారణ వాయిదా
- కేసు : అంగళ్లులో అల్లర్లు రెచ్చగొట్టిన కేసు
- అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్
- స్టేటస్ : మంజూరు చేసిన హైకోర్టు
- వివరణ : ఏ1గా ఉన్న చంద్రబాబు, మరో 170 మంది ఇతర నిందితులు
- కేసు : ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాల కేసు
- అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్
- స్టేటస్ : హైకోర్టులో జరుగుతున్న విచారణ
- కేసు : మద్యం విధానాల్లో అక్రమాలకు పాల్పడి నిధులు కొట్టేసిన కేసు
- అంశం : ముందస్తు బెయిల్ పిటిషన్
- స్టేటస్ : హైకోర్టులో జరిగిన విచారణ
- వివరణ : తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు, తీర్పు రిజర్వ్
Comments
Please login to add a commentAdd a comment