Dec 11th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌ | Chandrababu Case Petitions And Political Updates 11th December | Sakshi
Sakshi News home page

Dec 11th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

Published Mon, Dec 11 2023 6:34 AM | Last Updated on Mon, Dec 11 2023 6:25 PM

Chandrababu Case Petitions And Political Updates 11th December - Sakshi

Chandrababu Cases, Political Updates..

06:15 PM, Dec 11, 2023
తెలంగాణ ఎన్నికలను  చూసి తెలుగుదేశం పగటి కలలు : పోసాని

  • విజయవాడలో మాట్లాడిన APFDC ఛైర్మన్ పోసాని కృష్ణమురళి
  • చంద్రబాబు చేసేది తప్పుడు రాజకీయం
  • పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు సర్వనాశనం చేస్తారు
  • తెలంగాణలో పవన్ కళ్యాణ్ కి టీడీపీ ఓట్లేయలేదు
  • పవన్ కళ్యాణ్ అభ్యర్థులకు కమ్మ వాళ్లు ఓట్లు వేయలేదు
  • చంద్రబాబే కమ్మ వాళ్లను ఓటెయ్యొద్దని చెప్పాడు
  • పవన్ కి ఎక్కువ ఓట్లొస్తే ఏపీలో ఎక్కువ సీట్లు అడుగుతాడు
  • అందుకే పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు దెబ్బకొట్టాడు
  • కాపుల ఓట్లు చంద్రబాబుకి వేయిస్తానని పవన్ చెప్పడం సిగ్గుచేటు
  • కాపులను దెబ్బతీసిన చంద్రబాబుకి పవన్ మద్దతిస్తాడా..?
  • మోడీ మూడు రాష్ట్రాల్లో గెలవగానే చంద్రబాబు వణికిపోతున్నాడు
  • కాంగ్రెస్ కి తెలంగాణలో మద్దతిచ్చి BRSని ఓడించాలనుకున్నాడు
  • హైదరాబాద్ లో చంద్రబాబు వల్లే కాంగ్రెస్ కి ఒక్క సీటు రాలేదు
  • చంద్రబాబుని హైదరాబాద్ లోని సెటిలర్లంతా చీ కొట్టారు
  • చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మళ్లీ మోసం చేయడానికి ప్రజలు అమాయకులు కాదు

05:55 PM, Dec 11, 2023
ఈ నెల 20న యువగళానికి మంగళం

  • ఈనెల 20న లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభ
  • విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్టు సమీపంలోని సభ
  • పోలేపల్లి వేదికగా 20వ తేదీన లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు ఏర్పాట్లు
  • ముగింపు సభకు చంద్రబాబు, పవన్ కల్యాణ్, బాలకృష్ణ
  • ఎలాగైనా భారీగా జన సమీకరణ చేసి పాదయాత్రకు ముగింపు పలకాలని టిడిపి ప్రయత్నాలు
  • సభ విజయవంతం కోసం సీనియర్ నేతలతో 14 కమిటీల ఏర్పాటు
  • చివరి 200 కిలోమీటర్ల దాటవేతపై కిక్కురమనని టిడిపి నేతలు
  • నేను నడవలేను, నాపై ఒత్తిడి తేవొద్దని ఇప్పటికే లోకేష్‌ సంకేతాలు
  • ఏదో ఒకటి, ఇక్కడితో సమాప్తం చేద్దామన్న యోచనలో పార్టీ

05:05 PM, Dec 11, 2023
యశోద ఆస్పత్రికి చంద్రబాబు

  • మాజీ సీఎం కేసీఆర్ కు చంద్రబాబు పరామర్శ
  • కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న చంద్రబాబు
  • మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించా: చంద్రబాబు
  • కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా
  • మళ్లీ కేసీఆర్ ప్రజా సేవ చేయాలి
  • ఎలాంటి ఇబ్బంది లేకుండా కేసీఆర్ త్వరగా కోలుకుంటారు
  • కేసీఆర్ తో మాట్లాడాలి అనిపించి వచ్చా
  • కేసీఆర్ కు ఆరు వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారు
  • అప్పుడప్పుడు కొన్ని దురదృష్టకర ఘటనలు జరుగుతుంటాయి: చంద్రబాబు

04:00 PM, Dec 11, 2023
బండారు అరెస్ట్‌ పిటిషన్‌ @ హైకోర్టు

  • బండారు సత్యనారాయణ అరెస్టుపై హైకోర్టులో విచారణ
  • మంత్రి రోజాపై నీచమైన వ్యాఖ్యలు చేసిన టిడిపి నేత బండారు
  • మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి స్థాయి మరిచి దిగజారి వ్యాఖ్యలు
  • సభ్య సమాజం సిగ్గుపడేలా వ్యాఖ్యలు చేయడంతో అన్ని వర్గాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు
  • కేసు పెట్టి బండారు సత్యనారాయణను అరెస్ట్ చేసిన పోలీసులు
  • తన అరెస్ట్‌ అక్రమని బండారు పిటిషన్
  • CC ఫుటేజ్ సమర్పించిన బండారు తరపు న్యాయవాదులు
  • ఫోటోలను కోర్టుకు అందజేసిన పోలీసులు
  • 4 వారాల తర్వాత తుది విచారణ చేపడతామన్న హైకోర్టు

03:05 PM, Dec 11, 2023
విశాఖలో ఏం జరుగుతోంది?

  • విశాఖ : ఎంపీ ఎంవివిపై జనసేన తప్పుడు ప్రచారం
  • టైకున్ హోటల్ వద్ద వాస్తు పేరుతో ఎంవివి కోసం రహదారి ముసేసారు అంటూ అసత్య ప్రచారం
  • ధర్నాల పేరుతో జనసేన నేతల డ్రామా..
  • ప్రచారం కోసం చీప్ పాలిటిక్స్ కు పాల్పడుతున్న జనసేన
  • గతంలోనే రహదారిని తెరిపించాలంటూ అధికారులకు విజ్ఞప్తి చేసిన ఎంవీవీ
  • జీవీఎంసీ అధికారులకు సీపీకి గతంలోనే లేఖ రాసిన ఎంవివి
  • ప్రచారం కోసం ధర్నాలు చేయడమేంటీ?
  • పైగా నేను వచ్చి పోరాడుతానని చెప్పుకోవడమేంటీ?

02:55 PM, Dec 11, 2023
అధిష్టానానికి తమ్ముళ్ల అల్టిమేటం

పశ్చిమ నియోజకవర్గం టీడీపీలో ముదురుతున్న టిక్కెట్ పంచాయతీ

  • విజయవాడ పశ్చిమ టిక్కెట్ తమలో ఒకరికి ఇవ్వాలంటున్న బుద్దా వెంకన్న ,నాగుల్ మీరా
  • జలీల్ ఖాన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన బుద్ధావెంకన్న , నాగుల్ మీరా

బుద్ధా వెంకన్న

  • విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీని నడిపించింది, నడిపించేది నేను, నాగుల్ మీరా మాత్రమే
  • ఇప్పుడు ఎవరెవరో వచ్చి మాకు ఎమ్మెల్యే సీటు అని ప్రచారం చేసుకుంటున్నారు
  • ఎవరికి వారు చెప్పుకుంటే కాదు.. చంద్రబాబే ఎమ్మెల్యే అభ్యర్ధులను ఖరారు చేస్తారు
  • మా అభిప్రాయాలను చంద్రబాబు ముందు పెడతాం
  • అధినేతగా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా.. మేము గౌరవిస్తాం.. కానీ మాకే అవకాశం ఇస్తారని నమ్ముతున్నాం
  • నాయకులు కూడా ఎవరైతే పార్టీ కోసం పని చేస్తారో, విధేయులుగా ఉండారో ఆలోచన చేసి టిక్కెట్లు ఇస్తారు
  • బీసీ అయితే నాకు, ముస్లీం అయితే నాగుల్ మీరాకు మాత్రమే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఇవ్వాలి

నాగుల్ మీరా

  • విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ సీటును కొందరు ఆశిస్తున్నారు
  • పార్టీలోకి కొన్ని నెలల ముందు వచ్చి హడావుడి చేస్తే.. సీటు ఇచ్చేస్తారని భావిస్తున్నారు
  • ఈ నియోజకవర్గంలో 25 ఏళ్లుగా బుద్దా వెంకన్న, నేను టీడీపీ కోసం పని చేస్తున్నాం
  •  బీసీ అయితే బుద్దా వెంకన్న, మైనారిటీ కోటా అయితే నాకు సీటు ఇస్తారు
  • బుద్దా వెంకన్న సీటు అడగటంలో చాలా న్యాయం ఉంది
  • ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తించి చంద్రబాబు సీటు ఇస్తారని భావిస్తున్నా
  • వెంకన్నకు ఇవ్వలేని పక్షంలో మైనారిటీ కోటాలో సీటు ఇవ్వాలనే హక్కు నాకు మాత్రమే ఉంది
  • పార్టీ మీద ఉన్న కమిట్ మెంట్ తోనే మేము సీటు అడుగుతున్నాం
  • ఇప్పుడు ఎవరెవరో వచ్చి సీటు అడిగితే ... మేము చూస్తూ ఉండం
  • మాకు అవకాశం ఇస్తే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పసుపు జెండా ఎగుర వేస్తాం..

02:40 PM, Dec 11, 2023
కెసిఆర్‌కు చంద్రబాబు పరామర్శ

  • హైదరాబాద్: కేసీఆర్‌ను పరామర్శించనున్న చంద్రబాబు
  • మధ్యాహ్నం 3.20 గం.కు కేసీఆర్ ను పరామర్శించనున్న చంద్రబాబు
  • ఇటీవల KCRకు తుంటిమార్పిడి శస్త్రచికిత్స చేసిన వైద్యులు
  • సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్

02:20 PM, Dec 11, 2023
ఉరవకొండ టీచర్‌కు CPSకు భలే లింకు పెట్టారే.!

  • అనంతపురం జిల్లా ఉరవ కొండలో ఓ టీచర్‌ ఆత్మహత్యయత్నం
  • వ్యక్తిగత కారణాలతో జరిగిన ఘటనకు వెంటనే సీపీఎస్ అంశాన్ని ముడిపెట్టేసిన తెలుగుదేశం, ఎల్లో మీడియా
  • బురదజల్లడమే మా లక్ష్యం అంటూ ఆత్మహత్యాయత్నం ఘటనకు విస్తృత ప్రచారం
  • సోషల్‌ మీడియాలో హోరెత్తించిన చంద్రబాబు, తెలుగుదేశం టీం

అసలు సీపీఎస్‌ పాలసీని ఎవరు తీసుకువచ్చారు?

  • 2003లో దీన్ని అడాప్ట్‌ చేసుకున్నది చంద్రబాబు ప్రభుత్వమే కదా?
  • మరి ఆ విధానాన్ని నాడు చంద్రబాబు ఎందుకు వ్యతిరేకించలేదు?
  • 1996 నుంచి 2004 వరకూ సీఎంగా ఉన్న చంద్రబాబు అప్పటి ఎన్డీయేలోతానే చక్రం తిప్పానని చంద్రబాబు పదేపదే గొప్పలు చెప్పుకుంటారు.
  • మరి CPS ప్రాసస్‌ను ఎందుకు వ్యతిరేకించలేదు? అదిరాకుండా ఎందుకు అడ్డుకోలేదు.?
  • ఉద్యోగులకు మేలు చేసేలా మంచి ప్రత్యామ్నాయాన్ని ఎందుకు తీసుకురాలేదు?
  • వైఎస్సార్‌సిపి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేసింది
  • GPS రూపంలో మంచి ప్రయత్నామ్యాన్ని తీసుకు వచ్చింది కదా
  • ఎంతో అధ్యయనం చేశాక, ఉద్యోగుల ప్రయోజాలను కాపాడేలా ఈ నిర్ణయం తీసుకుంది.
  • GPSను ఉద్యోగ సంఘాలు స్వాగతించాయి కూడా. ఇంతకంటే గొప్ప ప్రత్యామ్నాయం లేదని ఉద్యోగులంతా హర్షం వ్యక్తంచేశారు కూడా
  • చివరకు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన GPSను పరిగణనలోకి తీసుకుంది.
  • ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ బాటలోనే నడిచేందుకు సిద్ధం అయ్యాయి.
  • ఇలాంటి పరిస్థితుల్లో ఎల్లోమీడియా, ప్రతిపక్షాలు ఇప్పుడు విషం చిమ్ముతున్నాయి

అసలు కుటుంబ సభ్యులు ఏమన్నారో మీరే చూడండి.

  • అనంతపురం: టీచర్ మల్లేష్ ఆత్మహత్యాయత్నంపై స్పందించిన ఆయన భార్య శివలక్ష్మి, బావ ఆదినారాయణ
  • ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై మాకు ఎలాంటి అసంతృప్తి లేదు
  • ముఖ్యమంత్రి జగన్ పాలనలోనే నాకు ఉద్యోగం వచ్చింది
  • డిప్రెషన్ తో బాధపడుతూ నా భర్త మల్లేష్ ఆత్మహత్యాయత్నం చేశారు
  • మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే
  • ఈ ఘటనపై ఎలాంటి రాజకీయాలు చేయవద్దు
  • టీచర్ మల్లేష్ భార్య శివలక్ష్మి , బావ ఆదినారాయణ

02:10 PM, Dec 11, 2023
అసైన్డ్‌ భూముల కేసు వాయిదా

  • అసైన్డ్ భూముల కేసులో మాజీ మంత్రి నారాయణ పిటిషన్లపై హైకోర్టు విచారణ
  • ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లు దాఖలు చేసిన నారాయణ
  • సీఐడీ అభ్యర్థన మేరకు తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా

01:22 PM, Dec 11, 2023
అమరావతి.. అసలు నిజాలు..

తెలుగుదేశం పార్టీ ఏం ప్రచారం చేస్తోందంటే..?

  • అమరావతి ఉద్యమానికి ఈ నెల 17వ తేదీకి నాలుగేళ్లు
  • ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న బైబిల్‌ మిషన్‌ గ్రౌండ్స్‌లో సభ
  • అమరావతి పరిరక్షణ సమితి, అమరావతి రాజధాని ఐకాస ఆధ్వర్యంలో ఏర్పాటు
  • సభకు ప్రత్యేక అతిథులుగా చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌

అయ్యా.. అమరావతి పెద్దలు.. కొంచెం మీ అస్థాన విద్వాంసుడు జడ శ్రవణ్‌ చెప్పిన మాటలు జాగ్రత్తగా అలకించండి

అమరావతి గురించి జడ శ్రవణ్‌ స్వయంగా చెప్పిన మాటలు ఇవి

  • తెలుగుదేశం పార్టీని నమ్మి ఎవరూ మోసపోవద్దు.: శ్రవణ్‌
  • అసలు అమరావతి పేరిట రైతులను నట్టేట ముంచింది తెలుగుదేశం పార్టీనే
  • భూములిచ్చిన రైతులను ఘోరంగా మోసం చేసింది తెలుగుదేశం పార్టీనే
  • 28వేల మంది రైతుల నుంచి 33 వేల ఎకరాలు లాగేసుకున్నారు..
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుపేద వర్గాల రైతుల కన్నీళ్లకు కారణమైన దానికి మొదటి ముద్దాయి చంద్రబాబే
  • ఏ మేధావి వచ్చినా నేను  చర్చకు సిద్ధం : జడ శ్రవణ్‌
  • అమరావతిని నాశనం చేసింది తెలుగుదేశమే : జడ శ్రవణ్‌
  • రాజధాని పేరిట అన్ని అరిష్టాలకు, దరిద్రాలకు కారణం చంద్రబాబు, తెలుగుదేశమే
  • లోకేష్‌.. నీకు బుద్దుందా? : జడ శ్రవణ్‌
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు ఓటేసిందని శ్రీదేవిని స్టేజీ ఎక్కించి పక్కన కూర్చోబెట్టుకుంటారా?
  • మిమ్మల్ని నమ్ముకున్న పార్టీ ఇన్‌ఛార్జీని బకరా చేస్తారా?
  • ఇదా తెలుగుదేశం నైజం.?
  • సిగ్గుండాలి.. మీకు.. పైకి మీరు చెప్పేది నిష్పక్షపాత రాజకీయమా?
  • రాజకీయాలు, రాజకీయ ప్రయోజనాల కోసం ఎలాంటి వ్యభిచారమైనా చేస్తారా?
  • తండ్రీ కొడుకులు రాజకీయ వ్యభిచారంలో గిన్నీస్‌ బుక్‌ ఎక్కుతారు..!
  • వ్యభిచార రాజకీయాలు ఎంత దుర్మార్గంగా జరుగుతాయో అన్నదానికి తెలుగుదేశం ప్రత్యక్ష ఉదాహరణ
  • డబ్బుతోనే మీ రాజకీయం నడుపుదామనుకుంటే.. మీరసలు నాయకులే కాదు
  • రాజకీయం అంటే విలువలు, విశ్వసనీయత ఉండాలి
  • మీకు అసలు మీ పార్టీ క్యాడర్‌ ఎవరో తెలుసా? కార్యకర్తలెవరో తెలుసా?


(ఫైల్‌ఫోటో : లోకేష్‌తో జడ శ్రవణ్‌)

12:42 PM, Dec 11, 2023
చంద్రబాబు ఆధ్యాత్మిక యాత్రలు

  • రేపు తమిళనాడు వెళ్లనున్న చంద్రబాబు
  • శ్రీరామానుజర్ ఆలయాన్ని సందర్శించనున్న చంద్రబాబు
  • మళ్లీ రేపు రాత్రికి తిరిగి విజయవాడకు చంద్రబాబు

12:02 PM, Dec 11, 2023
బెజవాడ తమ్ముళ్ల టికెట్‌ పంచాయతీ

  • విజయవాడ వెస్ట్‌లో టీడీపీ నేతల సీటు పంచాయితీ
  • బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా హాట్ కామెంట్స్
  • కేశినేని నానిపై బుద్ధా వెంకన్న పరోక్ష విమర్శలు
  • పశ్చిమ స్థానంలో నేను పోటీ చేస్తా.. లేదా నాగుల్ మీరా పోటీ చేస్తారు
  • ఎవరు పడితే వాళ్లు మాకే టికెట్ అంటే కుదరదు : బుద్ధా వెంకన్న
  • నిబద్ధత గల మమ్మల్ని కాకుండా వేరొకరికి టికెట్ ఇస్తే చూస్తూ ఊరుకోం : నాగుల్ మీరా


(ఫైల్‌ ఫోటో : సమన్వయ కమిటీ సమావేశంలో బుద్ధా వెంకన్న)

11:15 AM, Dec 11, 2023
భువనేశ్వరీ యాత్రకు మంగళమేనా?

  • హంగు, ఆర్భాటాలతో మూడు పర్యటనలు చేసిన భువనేశ్వరీ
  • ‘నిజం గెలవాలి’ పేరుతో భువనేశ్వరీ యాత్రలు
  • అక్టోబర్‌ 25న పర్యటనలు ప్రారంభించిన భువనేశ్వరీ
  • నారావారిపల్లె నుంచి బస్సు యాత్ర
  • చంద్రబాబు అరెస్ట్‌ తట్టుకోలేక 150 మంది చనిపోయారని తెలుగుదేశం, ఎల్లో మీడియా ప్రచారం
  • వారానికి మూడు రోజుల పాటు ఒక్కో ఇంటింటికి వెళ్లి పరామర్శిస్తానన్న భువనేశ్వరీ
  • మూడు కుటుంబాలను కలిసిన నారా భువనేశ్వరీ
  • ఒక్కో కుటుంబానికి పాత డేట్‌తో ఉన్న రూ.3 లక్షల చెక్కు పంపిణీ
  • ఈ లోగా చంద్రబాబుకు ఆరోగ్య కారణాలతో బెయిల్‌ మంజూరు
  • ఎందుకు ఖర్చు అనుకున్నారో.. లేక అనవసర శ్రమ అనుకున్నారో?. మొత్తానికి అటకెక్కిన పరామర్శ యాత్ర
  • అసలు కారణం నిజం చెప్పాల్సి వస్తుందంటున్న విశ్లేషకులు

అసలు భువనేశ్వరీ ఈ నిజాలు చెప్పగలరా?

  • నా ఆస్థి లక్ష కోట్లు అని బాబు చెప్పిన వీడియోలు ఉన్నాయి, ఆ ఆస్తిని పాలు,  పెరుగు అమ్మి సంపాదించాడా?
  • బాబు అవినీతికి నేను అడ్డు అని నాకు వెన్నుపోటు పొడిచాడు బాబు అని ఎన్టీఆర్ చెప్పింది నిజమా? కాదా?
  • మహానాడు హుండీ డబ్బులు కాజేసేవాడు బాబు అని  దగ్గుపాటి  పుస్తకం రాసింది నిజమా? కాదా?
  • గొర్రెలు తినే కాంగ్రెస్ పోయి బర్రెలు తినే బాబు వచ్చాడు అని హరికృష్ణ అన్నది  నిజమా? కాదా?
  • బాబు జమానా అవినీతి ఖజానా అని కమ్యూనిస్టులు పుస్తకం రాసింది నిజమా? కాదా?
  • బాబు పాలనలో అంతా అవినీతి అని , బీహార్ నయం అని జపాన్ మాకీ సంస్థ యజమాని పూమిహికో లేఖ రాసి వెళ్ళిపోయింది నిజమా? కాదా?
  • అమరావతి కాంట్రాక్టర్ ల నుంచి 600 కోట్ల సచివాలయం బిల్డింగ్ లో 119 కోట్లు (20 శాతం ) ముడుపులు  బాబు  పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరి కి ఇచ్చానని  అమరావతి కాంట్రాక్టర్ అయిన  షాపుర్జీ పల్లంజి ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ చెప్పాడు. అవును నిజమే ఆ డబ్బు బాబుకు ఇచ్చాను అని  బాబు పర్సనల్ సెక్రటరీ ఒప్పుకున్నాడు అని ఆగష్టు 4 న  కేంద్ర సంస్థ  ఇన్‌కమ్ టాక్స్ బాబుకు నోటీస్ ఇచ్చింది. నిజమా? కాదా?
  • 371 కోట్ల స్కిల్ కుంభకోణంలో  మాకు ఎటువంటి సంబంధం లేదు అని సీమెన్స్  చెప్పింది అంటే టెండర్ లేకుండా సిమ్సన్  పేరుతో రూ.371 కోట్లు పక్కదారి పట్టించారు. ఈ స్కిల్ కుంభకోణం లో కేంద్ర సంస్థ ED నలుగురిని అరెస్ట్ చేసింది. ఇది నిజమా? కాదా?
  • ఓటుకు కోట్లు అంటూ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బ్రోకర్లతో మనవాళ్లు బ్రీఫ్‌డ్‌మీ అన్నది చంద్రబాబు.. నిజమా? కాదా?
  • బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాసచౌదరి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరిపినపుడు(ఫిబ్రవరి 13 ,2020) 2 వేల కోట్ల అక్రమలావాదేవీలకు సంబందించి నల్లధన వివరాలు లభ్యమయ్యాయని ఫిబ్రవరి 17,2020 న ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ప్రెస్ నోట్ విడుదల చేశారు. నిజమా? కాదా?


(ఫైల్‌ ఫోటో : నిజం గెలవాలి యాత్రలో భాగంగా భువనేశ్వరీ పరామర్శ)

10:22 AM, Dec 11, 2023
జనసేన అభ్యర్థులు కూడా సైకిల్‌ గుర్తుపై పోటీ చేస్తారా?

  • ఒకే గుర్తుపై పోటీ చేద్దామన్న ప్రతిపాదన యోచనలో తెలుగుదేశం
  • మీ గుర్తు అంతగా ప్రజల్లోకెళ్లలేదు కాబట్టి సైకిల్‌ గుర్తుపైనే పోటీ చేద్దామని జనసేనకు ప్రతిపాదన
  • పొత్తు ఉంటుంది, మీ అభ్యర్థులు మీకుంటారు, మా అభ్యర్థులు మాకుంటారు, అందరం సైకిల్‌ గుర్తుపైనే పోటీ చేద్దామన్న ప్రతిపాదన
  • 1983లో సంజయ్ విచార్ మంచ్ అనే పార్టీ పక్షాన నలుగురు ఉమ్మడి ఏపీలో పోటీచేశారు. వారంతా సైకిల్ సింబల్ పైనే పోటీచేశారంటున్న టిడిపి వర్గాలు
  • తెలుగుదేశం ఆలోచనపై జనసేనలో గందరగోళం
  • ఒకే గుర్తుపై పోటీ చేస్తే.. పార్టీని విలీనం చేసినట్టవుతుందన్న ఆందోళన
  • ఒకే గుర్తుమీద అంతా పోటీచేస్తే సాంకేతికంగా ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఎన్నికైనవారంతా ఒకే పార్టీవారు అవుతారు కదా?
  • చంద్రబాబును నమ్మి పూర్తిగా సరెండర్‌ అవుతే వెన్నుపోటు తప్పదని చరిత్ర చెబుతోంది కదా.!
  • ముఖ్యమంత్రి పదవి పవన్‌ కళ్యాణ్‌కు రెండో ఏడాది ఇస్తారని ఇప్పుడే ఎలా నమ్ముతామంటున్న జనసేన వర్గీయులు

10:09 AM, Dec 11, 2023
పాదయాత్రకు విశేష స్పందన : నారా లోకేష్‌

అయ్యా.. లోకేషం.. కళ్లు తెరువు నాయనా : YSRCP

  • మీ పాదయాత్రకు అద్భుత స్పందన వస్తే ముందే ఎందుకు ముగిస్తున్నారు?
  • 200 కిలోమీటర్ల నడకను ఎందుకు తగ్గించుకున్నారు?
  • విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను ఎందుకు చిన్నచూపు చూస్తారు?
  • మీ టాలెంట్‌పై మీ నాన్నకే నమ్మకం లేదని ఇంకెప్పుడు మీకు అర్థమవుతుంది?
  • కొడుకు లోకేష్‌కు అంత సత్తా లేదని చంద్రబాబుకు అర్థమయ్యాకే దత్త పుత్రుడు పవన్‌కళ్యాణ్‌ను పట్టుకున్నారు
  • పవన్‌కళ్యాణ్‌ సపోర్ట్‌ లేకుండా ఎన్నికల్లో పోటీ చేసే సీన్‌ లేదని తెలిసే పొత్తు నాటకం ఆడుతున్నారు
  • నిజంగా తెలుగుదేశం పార్టీకి ప్రజలు పట్టం కడతారని మీరు భావిస్తే.. సింగిల్‌గా ఎందుకు పోటీ చేయరు?
  • మీకు పవన్‌ కళ్యాణ్‌, జనసేన సపోర్ట్‌ ఎందుకు?
  • నిటారుగా నిలబడే శక్తి లేక.. సపోర్ట్‌ స్టిక్‌గా పవన్‌ కళ్యాణ్‌ను పట్టుకున్నారా?
  • పైగా మీకు మరో సపోర్ట్‌ బీజేపీ కావాలా?
  • పోటీ చేయాలంటే మీకు ఇన్ని సాయాలు కావాలా?
  • ఇంకొకరిమీద నిందలేసేకంటే మీ ఇల్లు చక్కదిద్దుకోండి
  • మీ పార్టీ మీద ఇప్పటికైనా మనసు పెట్టండి
  • భవిష్యత్తులోనైనా ఒంటరిగా పోటీ చేయాలన్న ఆలోచన తెచ్చుకోండి
  • లోకేష్‌.. మీరు కళ్లు తెరవకపోతే తెలుగుదేశం పార్టీని శాశ్వతంగా పవన్‌ కళ్యాణ్‌కు కట్టబెట్టేస్తారు మీ నాన్న చంద్రబాబు
  • నాయకుడిగా ఎదగకపోతే మీకెప్పటికీ విశ్వసనీయత ఉండదు

9:29 AM, Dec 11, 2023
ఏపీ : సర్వేలను బట్టే టీడీపీ టిక్కెట్లు ఇస్తాం : చంద్రబాబు 

  • చంద్రబాబు ప్రకటనపై సొంత పార్టీలో చర్చ
  • చంద్రబాబుకు సొంత పార్టీ నేతలపై నమ్మకం లేదా? 
  • ఇన్నాళ్లు బరిలో ఉన్న నాయకులను సర్వేల పేరుతో పక్కన పెడతారా?
  • ఓటు కోట్లు కుమ్మరించే వాళ్లే పార్టీకి అభ్యర్థులా?
  • అసలు తెలుగుదేశం పార్టీ ఎవరితో సర్వేలు చేయిస్తుంది?
  • చంద్రబాబు చేసే సర్వేలో శాస్త్రీయత ఎంత? 
  • పార్టీని నమ్ముకున్న వాళ్లకు వెన్నుపోటు పొడవడానికి సర్వేలను తీసుకొస్తున్నారా?

9:17 AM, Dec 11, 2023
అసైన్డ్‌ భూముల స్కాం.. ముందస్తు బెయిల్‌పై నేడు హైకోర్టులో విచారణ

  • అసైన్డ్ భూముల కుంభకోణంలో మాజీ మంత్రి నారాయణ, ఆయన బినామీలపై సీఐడీ కేసు నమోదు
  • ముందస్తు బెయిల్‌ మంజూరు, కేసులను క్వాష్  చేయాలంటూ నారాయణ, ఆయన బినామీల పిటిషన్లు

8:21 AM, Dec 11, 2023
కిషన్.. పవన్.. ఓ ప్రచారం

  • నేను పవన్ పై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 
  • నాపై సోషల్‌మీడియాలో వస్తు్న్న ప్రచారం అవాస్తవం
  • కొందరు కావాలని నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు
  • వారిపై పోలీసులకు ఫిర్యాుదు చేస్తా
  • ఎన్డీయేలో భాగస్వామ్యం ఉండడంతోనే జనసేనతో కలిసి బరిలో దిగాం:

అసలేం జరిగిందంటే..?

  • సోషల్ మీడియాలో నిన్న జరిగిన ప్రచారం ఏంటంటే...
  • పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కిషన్ రెడ్డి 
  • పవన్ కళ్యాణ్ నీ నమ్ముకొని గ్రేటర్ లో నష్టపోయాం
  • పవన్ తో స్టేజ్ మీద కూర్చున్నప్పుడు రాష్ట్ర ప్రజలు మా విలువ తగ్గించారు
  • ఆ సంగతి గ్రహించే పొత్తుని ఉప సంహరించుకోవాలని అధిష్టానం సూచించింది
  • కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగి పొయింది. 
  • సొంతంగా పోటీ చేసి ఉంటే కనీసం గ్రేటర్‌ పరిధిలో 4-5 సీట్లు గెలిచే అవకాశం ఉండేది
  • కనీసం మా కార్పొరేటర్ల మాట విన్నా బాగుండేదని అనిపించింది. 
  • హైదరాబాద్‌ వెలుపల సీట్లు, ఓట్లు సాధించినా, సిటీలో పోటీ ఇవ్వలేకపోయాం
  • గట్టి పోటీ ఇచ్చి గెలుస్తామని భావించిన లింగంపల్లి, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, కుత్భూలాపూర్‌, యాకుత్‌పురా, ఉప్పల్‌, రాజేంద్రనగర్‌ సీట్లు కేవలం పవన్ కళ్యాణ్ తో పొత్తు కారణంగానే ఘోరంగా ఓడిపోయం
  • సెటిలర్స్ లో ఉన్న కాపు, కమ్మ సామాజిక వర్గం నాతోనే ఉంటుందని పవన్ కళ్యాణ్ గట్టిగా నమ్మించాడు. 

ఈ ప్రచారం వెనక ఎవరి హస్తం ?

  • తెలంగాణలో ముగిసిన ఎన్నికలు
  • ఏపీలో తెలుగుదేశం జనసేన పొత్తుతో పోటీకి నిర్ణయం
  • ఈ రెండు పార్టీల మధ్య సీట్ల చర్చలు 
  • తనకు కనీసం 50 ఎమ్మెల్యే టికెట్లు అలాగే ఐదు ఎంపీ టికెట్లు కావాలని అడుగుతున్న పవన్ కళ్యాణ్ 
  • అయితే 20 ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని అలాగే 3 ఎంపీ టికెట్లు ఇస్తామని చెబుతున్న టీడీపీ
  • తెలంగాణలో బీజేపీతో 8 సీట్లకే ఒప్పుకున్నందుకు ఏపీలో 20 సీట్లు సరిపోతాయన్నది చంద్రబాబు లెక్క.
  • ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ విలువను తగ్గించేందుకు సోషల్ మీడియాను టీడీపీ అస్త్రంగా చేసుకుంటుందన్న ఆరోపణలు
  • గతంలోనూ సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం పలుకుట్రలు అమలు చేసిందన్నది జనసేన సైనికుల ఆరోపణ 
  • పవన్ కళ్యాణ్ కూడా గతంలో పలుమార్లు చంద్రబాబు లోకేష్‌లను నేరుగా విమర్శించాడు.
  • 2018-2019 మధ్య కాలంలో తన వ్యక్తిత్వాన్ని, కుటుంబాన్ని దెబ్బతీసేలా టీడీపీ నాయకులు సోషల్ మీడియా వేదికగా  ఆరోపణలు చేస్తున్నారని విమర్శ
  • తాజాగా పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకొని కిషన్ రెడ్డి మాట్లాడినట్టుగా చేస్తున్న సోషల్ మీడియా సర్కులేషన్ వెనుక టీడిపి నేతల హస్తం ఉందని అనుమానిస్తున్నారు
  • తద్వారా పవన్, జనసేన విలువను తగ్గించి ఆ పార్టీకి వీలైనన్ని తక్కువ సీట్లు ఇచ్చేలా ఒప్పించవచ్చన్నది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది.

6:39 AM, Dec 11, 2023
స్కిల్‌ కేసు ఎక్కడికి దారి తీస్తుంది?

  • స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణ జనవరి19కి వాయిదా
  • 17ఏ వ్యవహారంపై తీర్పు ఇచ్చే పక్షంలో ఈ పిటిషన్‌ వాయిదా వేయాలని కోరిన హరీష్ సాల్వే
  • ఈ కేసు 17ఏ తీర్పుతో ముడిపడి ఉందన్న హరీష్ సాల్వే
  • అసలు 17ఏ చుట్టే మొత్తం వ్యవహారం ఎందుకు తిరుగుతోంది?
  • నేను తప్పు చేయలేదు అని చెప్పకుండా.. 17ఏ ప్రకారం గవర్నర్‌ అనుమతి తీసుకోలేదని ఎందుకు వాదిస్తున్నారు?
  • అంటే తప్పు చేశాం కానీ.. ముందస్తు అనుమతి లేకుండా అరెస్ట్‌ చేయొద్దన్న మీ వాదనను కోర్టు ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలి?

సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే.?

  • అవినీతి నిరోధక చట్టానికి చేసిన 17ఏ సవరణను ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారో చూడాలి. దీని ప్రకారం పబ్లిక్‌ సర్వెంట్లు అక్రమాలకు పాల్పడకూ­డదు. చట్టంలోని ప్రధాన ఉద్దేశాన్ని పక్కనపెట్టి ఓ వ్యక్తికి మేలు జరిగేలా ఈ చట్టాన్ని అన్వయించుకోకూడదు. అది చట్టం లక్ష్యాన్నే దెబ్బతీస్తుంది – సుప్రీంకోర్టు

సెక్షన్‌ 17 ఏ విషయమేంటీ?

  • అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్‌)లోని ఉన్నదే సెక్షన్‌ 17ఏ
  • 2018 జులై 26న ఈ చట్టానికి సవరణ
  • సవరణ ప్రకారం ప్రజా ప్రతినిధులను అరెస్ట్‌ చేయాలంటే సంబంధిత ఆథారిటీ అనుమతి అవసరం
     

చంద్రబాబు కేసుకు 17aకు లింకేంటీ?

  • చంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న కేసు స్కిల్‌ కుంభకోణం
  • 2015-16లో స్కిల్‌ కుంభకోణం జరిగింది
  • జూన్‌ 2015లో చంద్రబాబు ఒత్తిడి, సంతకాలతో అధికారులు GO నెంబర్‌ 4 ద్వారా, 30.06.2015న రూ.371 కోట్లు విడుదల చేశారు
  • డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్), ఆదాయపు పన్ను శాఖ వెంటనే ఈ లావాదేవీలను గుర్తించాయి
  • సెక్షన్‌ 17ఏ అమలులోకి రావడానికి (2018 జులై 26కి) ముందే 2017 మే నెలలోనే స్కిల్‌ స్కామ్‌లో కేంద్ర జీఎస్టీ విభాగం కేసు నమోదు చేసింది
  • ఆంధ్రప్రదేశ్‌ ACBకి 2018 ఫిబ్రవరిలోనే ఆ విషయాన్ని తెలిపింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించాయి
  • అప్పటి చంద్రబాబు ప్రభు­­త్వం కేంద్ర ప్రభుత్వ నిఘా సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా కేసును తొక్కిపెట్టింది.
  • 2018 జులైలో 17ఏ చట్టం అమలులోకి వచ్చింది, 17ఏ చట్టం రావడానికి ముందే నేరం జరిగింది

గతంలో ఈ వ్యవహరంపై న్యాయస్థానాలేమన్నాయి?

అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 17ఏ అంటే అవినీతి నుంచి కాపాడే రక్షణ కవచం కాదు. అవినీతి కేసుల్లో నిందితులు తప్పించుకునేందుకు సాధనం కాదు. అవినీతికి పాల్పడినవారు ఆ కేసుల నుంచి తప్పించుకొనేందుకు అపాయింటింగ్‌ అథారిటీ ముందస్తు అనుమతి తప్పనిసరి కాదు’
– పట్నా హైకోర్టు 

‘సెక్షన్‌ 17 ఏ అమలులోకి రావడానికి ముందు అంటే 2018 జులై 26కి ముందు వ్యవహారాలకు ఈ చట్టం కింద రక్షణ లభించదు. అంతేకాదు అవినీతికి పాల్పడడం, ఉద్దేశపూర్వకంగా అవినీతి చేయటం అన్నవి ప్రభుత్వ విధుల నిర్వహణ కిందకు రావు’ 
– డీకే శివకుమార్‌ కేసులో కర్ణాటక హైకోర్టులో సీబీఐ వాదనలు. ఈ వాదనలతో కర్ణాటక హైకోర్టు ఏకీభవించింది

  • కళ్ల ముందు అవినీతి కనిపిస్తున్నప్పుడు సెక్షన్‌ 17ఏ వర్తించదు : పట్నా హైకోర్టు
  • ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు గానీ ప్రభుత్వ అధికారులుగానీ ఉద్దేశపూర్వకంగా ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడితే వారికి కేసుల నుంచి సెక్షన్‌ 17ఏ రక్షణ కల్పించదు
  • ఉద్దేశపూర్వకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినా సెక్షన్‌ 17ఏ కింద రక్షణ లభించదు
  • సెక్షన్‌ 17ఏ ముసుగులో అవినీతి కేసుల నుంచి తప్పించుకోలేరు
  • ప్రస్తుతం చంద్రబాబు ఈ స్కామ్‌ నుంచి బయ­ట­పడటానికి ఆ కోణంలోనే ప్రయత్నిస్తున్నారు.
  • తన అవినీతి గురించి కాకుండా.. తనను అరెస్ట్‌ చేసిన విధానంలో సాంకేతిక కోణంలో లోపాలు వెతికేందుకు ప్రయత్నిస్తున్నారు
  • ఇప్పుడు ఎన్నికలొచ్చాయి.. ప్రజా కోర్టులో చంద్రబాబు చేసే సాంకేతిక వాదనలు ప్రజలు నమ్ముతారా?
  • తప్పు చేయలేదని న్యాయస్థానం ముందు చెప్పకుండా.. నాపై అన్యాయంగా కేసులు పెట్టారని ప్రజాకోర్టులో చెబితే నమ్ముతారా?
  • తాను అవినీతికి పాల్పడలేదని ఎక్కడా చెప్పడం లేదు
  • స్కిల్‌ డెవలప్‌­మెంట్‌ ప్రాజెక్టులో అవినీతి జరగలేదని కూడా చెప్పడం లేదు

6:33 AM, Dec 11, 2023
ముందు నుయ్యి వెనక గొయ్యి

  • తెలియని రాజకీయాలతో ఇరకాటంలో పడ్డ పవన్ కళ్యాణ్
  • తెలంగాణ ఎన్నికల కోసం బీజేపీతో చెట్టాపట్టాల్
  • ఏపీ కోసం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో పవన్ కళ్యాణ్
  • కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చే బీజేపీని ఇప్పుడు ఎలా వదులుకోవాలంటున్న పవన్ కళ్యాణ్
  • చంద్రబాబును ఇప్పుడు నమ్మి తర్వాత తానెందుకు ఇబ్బందులు పడాలన్న యోచనలో పవన్ కళ్యాణ్
  • తెలుగుదేశం ఇచ్చే పాతిక సీట్లతో జనసేన ను ఎలా సంతృప్తి పరచాలన్న ఆందోళనలో పవన్ కళ్యాణ్

6:31 AM, Dec 11, 2023
పవన్‌కు వెన్నుపోటుకు బాబు రెడీ

  • సీట్ల పంపకంపై ఇటీవల పవన్ కళ్యాణ్ తో చర్చించిన చంద్రబాబు
  • బీజేపీతో ఇక పెంచుకోవడమే మేలని పవన్ కళ్యాణ్ కు సూచించిన చంద్రబాబు
  • బీజేపీని వదులుకొని ముందుకొస్తే పవన్ కళ్యాణ్ కి పాతిక సీట్లు ఇస్తానన్న చంద్రబాబు
  • తన అరెస్టుకు ముందు ఇప్పటికీ పరిస్థితి మారిందంటున్న చంద్రబాబు
  • బీజేపీ బదులు కాంగ్రెస్ కమ్యూనిస్టులను కలుపుకుందామని పవన్ కి చెబుతున్న బాబు
  • జనసేన తరపున పోటీ చేసే నాయకులు ఎవరో తనకు ముందే చెప్పాలని సూచన
  • తన సర్వే ప్రకారమే జనసేన లో ఎవరిని నిలబెట్టాలో చెప్తా అంటున్న చంద్రబాబు
  • అభ్యర్థుల ఖరారు విషయంలో తనదే తుది నిర్ణయం అని చెబుతున్న చంద్రబాబు
  • తాను చెప్పినట్టు వింటేనే పొత్తు, లేదంటే మరో దారి చూసుకుంటానంటున్న చంద్రబాబు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement