Nara Lokesh Babu
-
పనులన్నీ టీడీపీ వారికే ఇవ్వండి!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘హలో కమిషనర్ గారూ.. కార్పొరేషన్లో పనులన్నీ మనవారికే ఇవ్వండి. నేను మనిషిని పంపుతున్నాను. పనులు అతనికి అప్పగిస్తే.. అతను పార్టీ కోసం పనిచేసిన వారికి ఇస్తారు.’ అని తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ని మంత్రి నారా లోకేశ్ ఆదేశించినట్లు తెలిసింది. తిరుపతి పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్ బుధవారం టీడీపీ కార్యాలయంలో పార్టీ సభ్యత్వం, ఓటరు వెరిఫికేషన్, టీడీపీ యాప్‌లో ఉత్తమ పనితీరు కనబరచిన కార్యకర్తలు, నాయకులకు ప్రశంసాపత్రాలు పంపిణీ చేసి అభినందించారు. ఈ సమయంలో తిరుపతి 31వ వార్డుకు చెందిన తలారి బాలయ్య... స్థానిక జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఆ పార్టీ నాయకుల తీరుపై ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టుల కోసం స్థానిక ఎమ్మెల్యే, జనసేన ముఖ్య నాయకుల వద్దకు వెళితే.. పార్టీలో చేరితే ఇస్తామని తేల్చి చెబుతున్నట్లు తెలిపారు. ఏ విషయం గురించైనా ఎమ్మెల్యే, ఆయన అనుచరుల వద్దకు వెళితే.. జనసేనలో చేరాలని టీడీపీ శ్రేణులపై ఒత్తిడి తెస్తున్నారని వివరించారు. మరో మహిళా నాయకురాలు కూడా జనసేన ఎమ్మెల్యే, నాయకులపైనా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత లోకేశ్ తిరుపతి కార్పొరేషన్ కమిషనర్‌కి ఫోన్ చేసి ‘తలారి బాలయ్య అనే నాయకుడిని పంపిస్తా. పనులు అతనికి అప్పగిస్తే.. అతను ఎవరెవరికి ఇవ్వాలో వారికి ఇస్తారు..’ అని చెప్పినట్లు తెలిసింది. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ సైతం జనసేన ఎమ్మెల్యే, ఆపార్టీ నేతల వ్యవహారాల గురించి వివరించినట్లు సమాచారం. అనంతరం లోకేశ్ మాట్లాడుతూ టీడీపీ కోసం పనిచేసిన నేతలు, కార్యకర్తలకు ఇబ్బందులు లేకుండా చూస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ‘జనసేన నేతలు కలిసి వస్తే కలిసి నడవండి. లేదంటే వదిలేయండి..’ అని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. అదే సమయంలో ఇంత జరుగుతుంటే.. మీరు ఏం చేస్తున్నారు? అని జిల్లా ఇన్చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను లోకేశ్ ప్రశ్నించినట్లు తెలిసింది. అందరూ కలిసికట్టుగా పని చేసి ఇటీవల డిప్యూటీ మేయర్ పదవిని సొంతం చేసుకున్నట్లుగానే మేయర్ పీఠం కూడా కైవసం చేసుకోవాలని ఆయన సూచించినట్లు తిరుపతిలో జోరుగా ప్రచారం సాగుతోంది. -
చిన్నారిపై లోకేష్ సైకో టీం విషప్రచారం
విజయవాడ, సాక్షి: పచ్చ బ్యాచ్ సైకోలు ఇంతకన్నా దిగజారరు అనుకున్న ప్రతీసారి ఆశ్చర్యపరస్తూ వస్తున్నారు. తాజాగా.. మరోసారి విష పడగ విప్పారు. జగన్‌పై అభిమానంతో ఓ చిన్నారి చేసిన పనిని విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే ఈసారి నెటిజన్ల నుంచి ఛీత్కారాలు వచ్చాయి. దీంతో ఐటీడీపీ జీతగాళ్లు మరింత దిగజారి ప్రవర్తించారు. ఆ చిన్నారి విషయంలో అసత్య ప్రచారం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు.రవీంద్రభారతిలో ఎనిమిదో తరగతి చదువుతున్న దేవికారెడ్డి(Devika Reddy) .. విజయవాడ పర్యటనలో వైఎస్ జగన్‌ను కలిసింది. ఆ సమయంలో ఆయన ఆ పాపను దగ్గరికి తీసుకున్నారు. అయితే ఆ తర్వాత భావోద్వేగంతో ఆ చిన్నారి మీడియా ముందు మాట్లాడింది. జగన్ అంటే ఎంతో ఇష్టమని చెప్పింది. కూటమి ప్రభుత్వంలో అమ్మ ఒడి రావట్లేదని ఉన్నమాటే చెప్పింది. అయితే పచ్చ బ్యాచ్‌కు ఇది ఏమాత్రం సహించనట్లుంది.అందుకే తమ అనుకూల సోషల్ మీడియా పేజీలు, వెబ్సైట్లలో చిన్నారి గురించి ఇష్టానుసారం పోస్టులు చేయించారు. దిగజారిపోయి మరీ పోల్ క్వశ్చన్స్ పెట్టించారు. ఈ క్రమంలో #Childabuser అంటూ ఆ వెబ్సైట్లను జనం తిట్టిపోశారు కూడా. గతంలో చిన్నపిల్లలతో రాజకీయం చేసింది ఎవరంటూ.. టీడీపీకి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేశారు.టీడీపీ సోషల్ మీడియా(TDP Social Media) ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో తెలియంది కాదు. గతంలో ప్రభుత్వ స్కూల్లో అనర్గళంగా ఆంగ్లం మాట్లాడిన మేఘన అనే ఓ విద్యార్థిని విపరీతంగా ట్రోల్ చేశారు. జగన్ సాయం చేశారని చెప్పిన గీతాంజలికి.. సొంతింటి కల నెరవేరిన సంతోషాన్ని లేకుండా చేశారు. ఏకంగా.. ఆమె బలవన్మరణానికి పాల్పడేంతగా సోషల్ మీడియాలో ఏడ్పించారు. జగన్ పాలనలో సాయం పొందిన వాళ్లను, ఆయనపై అభిమానం ప్రదర్శించిన వాళ్లనూ ఏ ఒక్కరినీ వదలకుండా విపరీతంగా ట్రోల్ చేయడం చూశాం. ఇప్పుడు ఓ చిన్నారి విషయంలోనూ అదే చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారం మరీ శ్రుతిమించడంతో బూమరాంగ్ అయ్యింది. దీంతో ఈసారి అసత్య ప్రచారాలకు దిగారు. చిన్నారి దేవిక డీపీహెచ్ స్కూల్లో చదువుతుందంటూ ప్రచారం చేశారు. పైగా ఆమె తల్లి వైఎస్సార్సీపీ నాయకురాలు అని, ఆర్థికంగా ఆ కుటుంబ పరిస్థితి ఎంతో బాగుందంటూ విషం చిమ్మారు. దేవిక తండ్రి అద్దె ఇంట్లో ఉంటూనే ఓ షాప్‌లో పని చేస్తూ పిల్లల్ని చదివించుకుంటున్నారు. కానీ, లోకేష్ సైకో టీం(Nara Lokesh Team) విషప్రచారం ఇంకా ఆ ప్రచారం ఆపట్లేదు.ఇంత జరుగుతున్నా.. టీడీపీ సోషల్ మీడియా విభాగాలపై పోలీసులు ఎలాంటి కేసులు పెట్టడం లేదు. వైఎస్సార్సీపీ నేతలు, హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నవాళ్లపై కూటమి పెద్దల ఆదేశాలతో తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తుండడంలో తలమునకలైపోయారు అంతే!. -
చంద్రబాబు, లోకేష్ ని ఏకిపారేసిన పోతిన మహేష్
-
ఇదీ బాబు, లోకేష్‌లు మనస్తతత్వం: వైఎస్ జగన్
ఎన్టీఆర్, సాక్షి: సొంత సామాజిక వర్గ నేతలనే చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తుండడంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమి అక్రమ కేసులతో అరెస్టైన వల్లభనేని వంశీని విజయవాడ సబ్ జైల్లో మంగళవారం పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi)ని చంద్రబాబు టార్గెట్ చేయడం వెనుక కారణం ఉంది. తన సామాజిక వర్గానికి చెందిన వంశీ ఎదుగుదలను చంద్రబాబు సహించలేకపోయారు. అందుకే తప్పుడు కేసులు పెట్టారు. ఆ సామాజిక వర్గంలో వాళ్లకు అనుకూలంగా ఉండాలి. లేకుంటే.. వెలివేస్తారు. కుదిరితే ఇలా కేసులతో ఇబ్బంది పెడతారు. అదీ చంద్రబాబు మనస్తతత్వం. తనకన్నా, లోకేష్ కన్నా గ్లామర్ ఉంటే చంద్రబాబు(Chandrababu) సహించలేరు. తమ సామాజిక వర్గంలో ఎవరైనా ఎదుగుతుంటే.. వాళ్లిద్దరూ తట్టుకోలేరు. అందుకే వంశీ అంటే చంద్రబాబుకి అంత మంట. అలాంటి వారిపై తప్పుడు ఫిర్యాదులు చేయించడం.. అక్రమ అరెస్టులు, ట్రోల్ చేయించడం వాళ్లిద్దరి నైజం. ఇందుకు చంద్రబాబు కోసమే పని చేసే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5.. బాబు మాఫియా రాజ్యం(Babu Mafia) నడుస్తోంది. రేపు దేవినేని అవినాష్ లాంటి వారిని కూడా ఇబ్బంది పెట్టొచ్చు’’ అని వైఎస్ జగన్ అన్నారు. -
రెడ్‌బుక్‌పై కన్నెర్ర.. కూటమికి ఇక బ్యాడ్ టైం!
ఆంధ్రప్రదేశ్‌లో భారత రాజ్యాంగం కాకుండా... తెలుగుదేశం నేతల రెడ్‌బుక్ రాజ్యాంగమే అమలవుతోందని హైకోర్టు సాక్షిగా మరోసారి స్పష్టమైంది. పోలీసుల శాఖ పనితీరును చూసి హైకోర్టే నిర్ఘాంతపోయిందంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి అధికారంలోకి వచ్చింది మొదలు.. ఆంధ్రప్రదేశ్‌లో హింస, విధ్వంసం, అక్రమ అరెస్ట్‌లు కొనసాగుతున్న తీరును.. రాష్ట్ర ప్రజలు కళ్లారా చూస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, సోషల్‌మీడియా కార్యకర్తలే లక్ష్యంగా కూటమి నేతలు చెలరేగిపోతున్నారు. వీరిపైకి పోలీసులను ఉసిగొల్పుతూ రాక్షసానందం పొందుతున్నట్లు విమర్శలున్నాయి. పోలీసులు కేసులు పెట్టకుండా ఇష్టారాజ్యం అరెస్టులు చేసి పౌర హక్కులు, మానవహక్కులను హరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి లోకేష్ గొప్పగా చెప్పుకుంటున్న రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని వైఎస్సార్సీపీ ‘పిచ్చికుక్క’తో పోలుస్తున్నది! ఈ తరహా పాలన వల్ల రాష్ట్రానికి జరిగే నష్టం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అర్థం చేసుకోవడం లేదు. పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకుంటున్న వారిపై కేసులు పెట్టడం లేదు. నిబంధనల ప్రకారం కోర్టుల్లోనూ ప్రవేశపెట్టడం లేదు. దీంతో బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ ఎనిమిది నెలల పాలనలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగినా, న్యాయ వ్యవస్థ సైతం ఆశించిన స్థాయిలో స్పందించినట్లు కనబడదు. సోషల్ మీడియా కార్యకర్తలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే వారిపై చర్య తీసుకున్నా ఫర్వాలేదు. కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై తప్పుడు కేసులు పెడుతున్న తీరును న్యాయ వ్యవస్థ గమనిస్తే బాగుంటుంది. కొంతమందిపై పది, ఇరవై కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న సంగతిని గౌరవ న్యాయమూర్తులు పరిగణనలోకి తీసుకోవల్సిన అవసరం ఉంది. న్యాయ వ్యవస్థ(Judicial System) దృఢంగా ఉండకపోతే పోలీసు శాఖ ఎలా ధమ్కీ ఇవ్వడానికి ప్రయత్నిస్తుందో హైకోర్టు వారికి స్వయంగా అనుభవం అవడం విశేషం. పల్నాడు జిల్లా మాచవరం పోలీసులు చేసిన అక్రమ అరెస్టులపై కొద్దిరోజుల క్రితం వచ్చిన పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు కీలకమైన వ్యాఖ్య చేసింది. పోలీసులకు తమ ఆదేశాలంటే గౌరవం లేదని, సీసీటీవీ ఫుటేజి సమర్పించాలని కోరినప్పుడే అది మాయమవడం ఏమిటి? అని గౌరవ న్యాయమూర్తి ప్రశ్నించారు. ఆ ఫుటేజీ ఎలా మిస్టీరియస్‌గా కనిపించకుండా పోతోందని హైకోర్టు సైతం విస్మయం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలు చేసిన గౌరవ న్యాయమూర్తులకు ప్రజలు ధన్యవాదాలు తెలపాలి. ఈ మాత్రం అన్నా స్పందించకపోతే ఏపీలో కూటమి ప్రభుత్వం మరింతగా పెట్రేగిపోతుంది. పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ ఫుటేజీ మిస్ అవుతుంటే ఉన్నతాధికారులు ఏమి చర్య తీసుకున్నారని కూడా హైకోర్టు అడిగింది. చిత్రమేమిటంటే కోతుల కారణంగా సీసీటీవీ సర్క్యూట్ కాలిపోయిందని పోలీసులు చెప్పడం.. ‘ఇది మేం నమ్మాలా?’ అని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. కాలిపోయిన సీసీటీవీ పరికరాలను తామే చూస్తామని న్యాయమూర్తులు ప్రకటించారు. విశేషం ఏమిటంటే ఈ కేసులో పిటిషనర్ తన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు లాయర్ చెప్పగా, పిటిషనర్‌కు ఏమైనా హాని ఉందా అని హైకోర్టు ప్రశ్నించింది. ఇందులో చాలా వాస్తవం ఉందని చెప్పాలి. అనేక చోట్ల బాధితులు కోర్టులకు వెళ్లకుండా పోలీసులు వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. పోలీస్ స్టేషన్లలో రోజుల తరబడి నిందితులను ఉంచి వేధిస్తున్నారు. ఈ కేసులో గత ఏడాది నవంబర్ 3వ తేదీన ఒక వ్యక్తిని మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నవంబర్ 7వ తేదీన కాని అతని అరెస్టు చూపలేదు. ఈ నాలుగు రోజులు అతని పట్ల ఎలా వ్యవహరించారో తెలుసుకోవడానికి సీసీటీవీ పుటేజీ కోరుతూ అతని సోదరులు కోర్టుకు ఎక్కారు. ఈ కేసులో సంబంధిత పోలీసు స్టేషన్ అధికారికి ఇంక్రిమెంట్లు కట్ చేశారని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. అంటే దాని అర్థం ఏమిటి? అతను తప్పు చేసినట్లు అంగీకరించినట్లే కదా! చేసే అరాచకం చేసి, సీసీటీవీ ఫుటేజి మిస్ చేస్తే ఎవరు ఏమి చేయలేరన్న ధైర్యం పోలీసు శాఖలో ఏర్పడిందని భావించాలి. దీనికి కారణం పోలీసు శాఖ నిబంధనలు కాకుండా ఎక్కడికక్కడ టీడీపీ నేతల రెడ్‌బుక్ ఫాలో అవడమే కారణం అని వేరే చెప్పనవసరం లేదు. కొందరు రిటైర్డ్ పోలీసు అధికారులను పెట్టుకుని టీడీపీ ముఖ్యనేతలు వైఎస్సార్సీపీ వారిని భయపెట్టి లొంగదీసుకోవడానికి యత్నిస్తున్నారని చెబుతున్నారు. 👉ఈ మధ్య సోషల్ మీడియాలో పనిచేసే మిత్రుడు ఒకరిపై తప్పుడు కేసు పెట్టారు. ఆయన ఎప్పుడూ అసభ్య పోస్టులు పెట్టలేదు. కోర్టును ఆశ్రయించగా, బెయిల్ వచ్చింది కాని, వారం, వారం సంబంధిత పోలీస్ స్టేషన్‌కు హాజరవ్యాలని షరతు పెట్టింది. దాంతో ఆ మిత్రుడు నిత్యం అక్కడికి వెళ్లవలసి వస్తోంది. తీరా అక్కడకు వెళ్లాక పోలీసు అధికారులు అందుబాటులో ఉండకుండా గంటల తరబడి వేచి ఉండేలా చేస్తున్నారట!. అదేమని అడిగితే పైనుంచి ఒత్తిడి ఉందని వారు చెబుతున్నారట. రెడ్ బుక్(Red Book) పేరుతో యాతనలకు గురి చేస్తున్నారన్నమాట. 👉కొద్ది రోజుల క్రితం ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma)ను ఒంగోలు పోలీసులు తొమ్మిది గంటలపాటు విచారణ చేశారని వార్తలు వచ్చాయి. ఆయన ఎప్పుడో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై ఏదో పోస్టు పెట్టారని చెప్పి, ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయని అంటూ ఎవరో టీడీపీ కార్యకర్త కేసు పెట్టగానే పోలీసులు వాయువేగంతో స్పందించి విచారణకు పిలిచారు. వర్మకు ముందస్తు బెయిల్ వచ్చింది కాబట్టి సరిపోయింది. లేకుంటే ఆయనను ఈపాటికి జైలులో ఉంచేవారేమో తెలియదు. 👉రఘురామ కృష్ణరాజు(Raghurama Krishna Raju) పెట్టిన మరో కేసులో గుంటూరు ప్రభుత్వ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతిని కూడా అలాగే తొమ్మిది గంటలు విచారించారు. రఘురామ కృష్ణంరాజు కులాలు, మతాల మధ్య ద్వేషం రెచ్చగొట్టేలా నిత్యం మాట్లాడారన్న కేసు ఎటు పోయిందో కాని, తనను హింసించారన్న ఆయన చేసిన ఆరోపణపైనే పోలీసులు ఇప్పుడు శ్రద్ధ పెట్టారని అనుకోవాలి. 👉ముంబైకి చెందిన జత్వాని అనే నటికి పట్టుకువచ్చి నలుగురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. జిందాల్ అనే పారిశ్రామిక వేత్తపై కూడా అక్రమ కేసు పెట్టడంతో ఏపీకి రావల్సిన పెట్టుబడులు, పరిశ్రమలు రాకుండా పోతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 👉మరో ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్ పై ఇరవైకి పైగా కేసులు పెట్టి తీవ్రంగా వేధించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు. 👉మరో వైపు తమ కుటుంబాలపై అసభ్య పోస్టింగ్‌లు పెట్టారని పలువురు YSRCP నేతలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినా అతిగతీ లేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంపై ఎంత నీచంగా పోస్టులు పెట్టారో తెలిసిందే!. మాజీ మంత్రి అంబటి రాంబాబు తన కుమార్తెలపై దారుణంగా పోస్టులు పెట్టారంటూ ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆయన హైకోర్టుకు వెళ్లి తన కేసును వాదించుకుంటున్నారు. 👉గన్నవరం లో జరిగిన ఒక ఘటనలో పోలీసులు తనతో బలవంతంగా వైఎస్సార్సీపీ వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారని టీడీసీ ఆఫీస్‌లో పనిచేసే సత్యవర్దన్ అనే వ్యక్తి కోర్టులో చెప్పి కేసును ఉపసంహరించుకున్నారు. దీనికి ప్రతిగా సత్యవర్ధన్ సోదరుడితో బలవంతంగా కేసు పెట్టించి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేసి జైలులో పెట్టి వేధిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు, నేతలు ఎంత విధ్వంసానికి పాల్పడుతున్నా పోలీసులు వారి జోలికే వెళ్లడం లేదు. కూటమికి చెందిన పార్టీల వారు ఎన్ని అరాచకాలకు పాల్పడినా, చివరికి మహిళలను వేధింపులకు గురి చేసినా, పోలీసులు వారిపై కేసులు పెట్టడానికి వెనుకాడుతున్నారు. ఉదాహరణకు.. తిరుపతిలో కిరణ్ రాయల్ అనే స్థానిక జనసేన నాయకుడుపై ఒక మహిళ కేసు పెడితే ఇంతవరకు ఆయనపై చర్యే తీసుకోలేదు. పైగా ఆ మహిళపైనే ఎదురు కేసు పెట్టి రెడ్ బుక్‌ను రాజస్థాన్‌కు కూడా పంపించి, హడావుడిగా ఆమెను అరెస్టు చేయించిన తీరు ఏపీలో మహిళలకు ఉన్న భద్రత ఏమిటో తెలియచేస్తుంది. అనేక చోట్ల మహిళలపై అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. సుగాలి ప్రీతి మృతి విషయమై సీబీఐ దర్యాప్తు చేయిస్తానని ఎన్నికల ముందు చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. అనంతపురం సెంట్రల్ యూనివర్శిటీలో మహిళలకు ఎదురవుతున్న దుర్భర పరిస్థితిపై వార్తలు వచ్చాయి. గతంలో ప్రసంగాలు చేస్తూ మహిళల జోలికి ఎవరైనా వెళితే తోలు తీస్తామని భారీ ప్రకటనలు చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఇప్పుడు నోరు విప్పడం లేదు. మరో వైపు మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోంది. ఈ నేపథ్యంలో గౌరవ న్యాయస్థానం ఈ మాత్రం గట్టిగా ఉండడం సమాజానికి ఉపయోగపడుతుందని చెప్పాలి. ఏది ఏమైనా ఏపీలో ప్రజల హక్కులకు ఏ స్థాయిలో విఘాతం కలుగుతున్నదో వివరించడానికి ఇవే పెద్ద నిదర్శనం. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వైఎస్సార్సీపీ రీట్వీట్‌తో నీళ్లు నమిలిన నారా లోకేష్
సాక్షి,అమరావతి : రాష్ట్ర అప్పులపై నారా లోకేష్ కాకిలెక్కలు చెప్పారు. కళ్లార్పకుండా అబద్దాలను చెప్పడంలో తండ్రి చంద్రబాబును మించిన తనయుడిగా చెలామణి అవుతున్నారు. నారా లోకేష్ తాజాగా ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఉమ్మడి రాష్ట్రంలో అప్పులను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే అని చూపుతూ ట్వీట్లో పేర్కొన్నారు. విభజన సమయానికి ఏపీ వాటా అప్పుల వడ్డీ రూ.7,488 కోట్లు ఉంది. చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్ర అప్పులు బాగా పెరిగాయి.ఇదే అంశాన్ని వైఎస్సార్సీపీ ఆధారాలతో సహా నిరూపించింది. వైఎస్సార్సీపీ రీట్వీట్‌తో లోకేష్ నీళ్లు నమిలారు. ఆర్థిక విధ్వంసుడు తన తండ్రేనని తేలడంతో కిక్కురుమనకుండా లోకేష్ సైలెంట్ అయ్యారు. ఈ తొమ్మిది నెలల్లోనే లక్షన్నర కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు.. ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయలేదు. మరి ఆ లక్షన్నర కోట్లకు లెక్కలు చెప్పమంటే చంద్రబాబు,లోకేష్ నోరెత్తకపోవడంపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. .@naralokesh.. నీ ట్వీట్ చూస్తుంటే పబ్లిక్ ఫైనాన్స్‌పై నీకు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదని అర్థమవుతోంది మార్కెట్ రుణాలపై వడ్డీ చెల్లింపునకే రాష్ట్ర ప్రభుత్వం పరిమితం అనుకోవడం నీ అవివేకంరాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పుల్లో 75% మార్కెట్ రుణాలే కాదు..ఇంకా మిగతా వాటిల్లో కూడా చాలా… https://t.co/ZTVFSAL3IP— YSR Congress Party (@YSRCParty) February 17, 2025 -
KSR Live Show: భవిష్యత్ సీఎంగా లోకేష్..!? పవన్ సంచలన కామెంట్స్
-
కాంట్రాక్టు లెక్చరర్లపై కక్ష!
‘కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధికరించి వారి సమస్యలన్నీ పరిష్కరించే బాధ్యత తీసుకుంటా..’ – 2024 ఏప్రిల్ 28న కోడుమూరు నియోజకవర్గం గూడూరు ప్రజాగళం సభలో బాబు హామీ! ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను వాడుకుంటూ తీవ్ర అన్యాయం చేస్తోంది. కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్ చేసేలా పోరాడతా’.. – 2017 డిసెంబర్లో కాంట్రాక్టు లెక్చరర్లతో ముఖాముఖీలో పవన్ కళ్యాణ్ హామీ! సాక్షి, అమరావతి: తమ జీవితాలను మార్చే హామీని అమలు చేయాలని వేడుకుంటే.. ‘కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధికరణ మేనిఫెస్టోలో లేదు కాబట్టి అమలు చేయలేం’ అని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కుండ బద్ధలు కొడుతున్నారని కాంట్రాక్టు లెక్చరర్లు వాపోతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు వీలుగా గత ప్రభుత్వం చేసిన చట్టాన్ని అయినా అమలు చేయాలని కోరితే.. ‘ఆ చట్టాన్ని తాము అమలు చేయాలన్న రూల్ లేదు’ అని లోకేశ్ తేల్చి చెబుతుండటంతో తీవ్ర మానసిక సంఘర్షణతో ఇటీవల నలుగురు కాంట్రాక్టు లెక్చరర్లు ప్రాణాలు విడిచారు.ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందక మృతుల కుటుంబాలు వీధిన పడ్డాయి. 2000లో ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 7 వేల మందిని డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్లుగా నియమించగా తెలంగాణలో 2021లో కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించారు. ఒకే జీవో ద్వారా కాంట్రాక్ట్ లెక్చరర్లుగా చేరిన వారు తెలంగాణలో రెండేళ్లుగా రెగ్యులర్ ఉద్యోగులుగా కొనసాగుతుండగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇంకా కాంట్రాక్ట్ సిబ్బందిగానే కొనసాగుతున్నారు. ఏపీలోనూ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు 2023 అక్టోబర్‌లో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసింది.దీని ప్రకారం 2014 జూన్‌కు ముందు విధుల్లో చేరిన 10,117 మంది అర్హులను గుర్తించి క్రమబద్ధీకరించాలని జీవో 114 ద్వారా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ క్రమంలో వైద్య, అటవీ, గిరిజన సంక్షేమ తదితర శాఖల్లో పని చేస్తున్న 3 వేల మంది రెగ్యులరైజ్ కావడంతోపాటు గతేడాది ఏప్రిల్ నుంచి రెగ్యులర్ ఉద్యోగులుగా కొనసాగుతున్నారు. మిగిలిన వారి క్రమబద్ధీకరణ మాత్రం ఎన్నికల కోడ్‌తో నిలిచిపోయింది. వీరిలో 20 ఏళ్లకు పైగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు ఉన్నారు. అర్హులైన అందరి వివరాలు ఆర్థికశాఖ ‘నిధి పోర్టల్’లో ఉన్నా కూటమి ప్రభుత్వం తొక్కిపెడుతోంది.కాంట్రాక్టు జేఎల్స్‌కు తీవ్ర అన్యాయంగత ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించటాన్ని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు ఎన్నికలకు ముందు ఈసీకి ఫిర్యాదు చేయడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. అధికారంలోకి వచ్చాక వారిని రెగ్యులరైజ్ చేస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం అటకెక్కించింది. కాంట్రాక్టు ఉద్యోగులపై గత ప్రభుత్వాలు వివిధ కమిటీలు, మంత్రివర్గ ఉపసంఘాలను నియమించినా వారి కల సాకారం కాలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో వారి సమస్యలపై చర్చించి 30/23 చట్టం తెచ్చింది. దీని ప్రకారం మిగతా శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేశారు.ప్రాణాలు పోతున్నా పట్టదా..!తెలంగాణలో ఎలాంటి చిక్కులు లేకుండా విద్యాశాఖలో కాంట్రాక్ట్ లెక్చరర్లు రెండేళ్ల క్రితమే రెగ్యులర్ అయ్యారు. 30/23 ద్వారా ఏపీలోనూ రెగ్యులర్ కావాల్సి ఉన్నా కూటమి ప్రభుత్వం మాత్రం వారి పట్ల కక్షగట్టినట్టు ప్రవర్తిస్తోంది. ప్రభుత్వం అర్హులుగా గుర్తించిన 10,117 మంది కాంట్రాక్టు ఉద్యోగుల్లో దాదాపు 5 వేల మందికి పైగా ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న వారే ఉన్నారు. ఇంటర్ విద్యలో 3,618 మంది, డిగ్రీ కాలేజీల్లో 695 మంది, పాలిటెక్నిక్ కళాశాలల్లో 309 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. మరణించిన కాంట్రాక్ట్ లెక్చరర్ల కుటుంబాలకు పరిహారం, మట్టి ఖర్చులు ఇవ్వాలని ఉత్తర్వుల్లో ఉన్నా అమలు కావడం లేదని బాధిత కుటుంబాలు కన్నీరు పెడుతున్నాయి. -
అంతా మా ఇష్టం.. ఆడిందే ఆట.. పాడిందే పాట
-
బాబు డేంజర్ గేమ్.. కంట్రోల్ తప్పిన లోకేష్!
ఎలాగైతేనేం.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు.. మంత్రి అయిన లోకేష్‌లు తమ కక్ష తీర్చుకున్నారు. కాకపోతే వారు ధైర్యంగా కాకుండా చాటుమాటు కేసులు పెట్టి ప్రత్యర్ధులను దెబ్బతీసే యత్నం చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేసి జైలుకు పంపించి వారు ఆనందపడుతుండొచ్చు. దావోస్‌లో తాను చెప్పినట్లు రెడ్ బుక్ చాప్టర్ మూడును ప్రయోగించానని లోకేష్ సంతోషపడుతుండొచ్చు. కానీ ఆయన ఒక ప్రమాదకరమైన ఆట ఆడుతున్నారు. రాజకీయాలలో ఇది ఏ మాత్రం పనికిరాదు. చంద్రబాబు ఇంతకాలం ఇలాంటి ఆటలు ఎన్ని ఆడినా.. తనకేమీ సంబంధం లేదన్నట్లు నటించేవారు. లోకేష్ అలాకాకుండా పచ్చిగా వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తోంది. దీనివల్ల ఆయన భవిష్యత్తులో ఏదైనా ఆపదలో చిక్కుకుంటే తనను తాను రక్షించుకోలేని పరిస్థితి రావచ్చు. ఆ సంగతిని గుర్తు పెట్టుకోవడం మంచిదని హితవు చెప్పినా.. అధికార కైపులో ఉన్న ఆయనకు వినిపించకపోవచ్చు. రెచ్చగొట్టే మీడియా, భజంత్రీగాళ్ల మాటలు సమ్మగా ఉంటాయి. కాని అవి ఎక్కువకాలం ఉపయోగపడవు. వల్లభనేని వంశీ తప్పు చేశాడా? లేదా? అనేది ఇక్కడ చర్చకాదు. తప్పు చేసి ఉంటే అరెస్టు చేయడం, జైలులో పెట్టడం సాధారణంగా జరిగేవి. కాని అసాధారణమైన రీతిలో ఏపీ పోలీసులు స్పందిస్తున్న తీరు, డీజీపీ స్థాయిలో ఉన్నవారు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్న వైనం మాత్రం ఏపీ సమాజానికి మంచిది కాదు. ఇలాంటి వాటివల్ల జనంలో ఫస్ట్రేషన్ పెరిగితే అనర్ధాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆ సంగతిని అంతా గుర్తుంచుకోవాలి. వంశీ గన్నవరం టీడీపీ ఆఫీస్(Gannavaram TDP Office)పై దాడి చేయించారన్నది అభియోగం కావొచ్చు. అంతవరకు కేసు పెడితే పెట్టవచ్చు. కాని అంతకుముందు.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి?. వంశీనికాని, గన్నవరం వైఎస్సార్సీపీ కార్యకర్తలను కాని టీడీపీ నేతలు రెచ్చగొట్టారా? లేదా?. వంశీని అనరాని మాటలు అన్నారా? లేదా?. అయినా టీడీపీ ఆఫీస్ పై దాడి చేయాలని ఎవరూ చెప్పరు. అప్పట్లో విజయవాడ నుంచి ఒక టీడీపీ నేత గన్నవరం దండెత్తివెళ్లారా? లేదా?. ఫలితంగా ఉద్రిక్తతలు ఏర్పడ్డాయా? లేదా?. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను అభ్యంతరకర భాషలో ఆ టీడీపీ నేత దూషించారా? లేదా?. చివరికి ఈ గొడవలు చిలికి, చిలికివానగా మారి వంశీ కుటుంబ సభ్యులను టీడీపీ సోషల్ మీడియాలో అనరాని మాటలతో వేధించారు. ఆ క్రమంలో చంద్రబాబు(Chandrababu) కుటుంబ సభ్యులపై వంశీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ తర్వాత ఆయన రియలైజ్ అయి క్షమాపణ కూడా చెప్పారు. అయినా టీడీపీ నేతలు ఆయనను వెంటాడుతూనే ఉన్నారు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే.. టీడీపీ ముఖ్యనేతల కుటుంబాలలోని వారిని ఎవరైనా ఏమైనా అంటే గోలగోలగా ప్రచారం చేసే ఆ పార్టీవారు.. ఎదుటివారి కుటుంబాలపై నీచంగా కామెంట్స్ పెడుతుంటారు. టీడీపీ చంద్రబాబు కబ్జాలోకి వచ్చిన తర్వాత ప్రత్యర్ధి రాజకీయ పార్టీలవారిని వ్యక్తిగత హననం చేయడం ఒక లక్షణంగా మార్చుకుంది. చంద్రబాబు తాను సత్యసంధుడనైనట్లు, ప్రత్యర్దులు విలువలు లేని వ్యక్తులన్నట్లు మాట్లాడుతూ మీడియాలో వార్తలు వచ్చేలా చేసుకోవడంలో నేర్పరి అని చెప్పాలి. తొలుత ఆయనే రెచ్చగొడతారు. లేదా ఆయన పార్టీవారితో రెచ్చగొట్టిస్తారు. దానికి ప్రతిస్పందనగా ప్రత్యర్ధి పార్టీవారు తీవ్ర స్థాయిలో స్పందిస్తే.. దానినే విస్తారంగా వ్యాప్తి చేసి.. ‘చూశారా!నన్ను అంత మాట అన్నారో?’ అంటూ సానుభూతి పొందే యత్నం చేస్తుంటారు. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా తాన అంటే తందానా అంటాయి. గత సీఎం జగన్‌ను చంద్రబాబు కాని, లోకేష్ కాని ఎన్నేసి మాటలు అన్నారు!. ‘సైకో’ అనే పదంతో మొదలు పెడితే.. అనేక అభ్యంతరకర పదాలు వాడడానికి ఎప్పుడూ వెనుకాడలేదు. అయినా అప్పటి ప్రభుత్వం వారి జోలికి వెళ్లలేదు. నిజానికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే.. ఆరోజుల్లో రెడ్ బుక్ పేరుతో అనేక చోట్ల పోలీసు అధికారులను, ఆయా నేతలను లోకేష్ బెదిరించిన వైనంపైనే ఎన్నో కేసులు పెట్టి ఉండవచ్చు. కాని అప్పుడు దానికి సంబంధించిన కేసులే పెట్టలేదు. పోలీసు అధికారులు కోర్టులో దీనిపై పిటిషన్ వేసినా అది విచారణకే వచ్చినట్లు లేదు. కానీ, చంద్రబాబు ప్రభుత్వంలో లోకేష్(Lokesh) పేరుతో సాగుతున్న ఈ అరాచకం ఒక కొత్త ట్రెండ్‌గా మారింది. వచ్చేసారి టీడీపీ ప్రభుత్వం ఓడిపోయి.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిందంటే ఇంతకన్నా ఎక్కువగా రెడ్ బుక్ టీడీపీవారికి చుట్టుకుంటుందన్న సంగతి మర్చిపోకూడదు. దీనిని వైఎస్సార్సీపీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతూ మాస్ వార్నింగ్ ఇస్తున్నారు. అన్యాయంగా ,అక్రమంగా తమ పార్టీవారిని వేధించేవారందరి సంగతి తేల్చుతామని జగన్ చెబుతున్నారు. చట్టబద్దంగానే చేస్తామని ఆయన కూడా అన్నారు. చంద్రబాబుకు ఈ విషయాలు తెలియనివి కావు. కాని ఆయన చేతిలో ఏమి ఉన్నట్లు లేదు. లోకేష్ బ్యాచ్ తమ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నా.. వారించలేకపోతున్నారు. ఫలితంగా ఆయన కూడా బాధ్యత వహించవలసి వస్తోంది. తద్వారా ఏపీ ఇమేజీనే చంద్రబాబు, లోకేష్‌లు నాశనం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారు. వీరి కక్షలకు తోడు ఎల్లో మీడియా పనిలో పనిగా తమ కక్షలు తీర్చుకుని టీడీపీని మరింత గబ్బు పట్టిస్తోంది. ఎల్లో మీడియా రాసే చెత్త వార్తలకు ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాల్సి వస్తోంది. అందులో వాస్తవం ఉంటే తప్పు లేదు. కాని వారు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలిసినా.. కూటమి ప్రభుత్వం నిస్సహాయంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి యాజమాన్యాలు లేదంటే ఆ ప్రతినిధులు ఆడించినట్లు ఆడక తప్పడం లేదు. వంశీ విషయానికి వస్తే ఆయనపై ఏ కేసు పెట్టాలి. చంద్రబాబు,లోకేష్ లు నిజంగానే తమ మనోభావాలు గాయపడ్డాయని అనుకుంటే తమ కుటుంబంలోని వారిపై చేసిన వ్యాఖ్యల మీద కేసు పెట్టాలి. ఎందుకంటే ఆ పాయింట్‌ను తమ రాజకీయ అవసరాల కోసం అదే పనిగా వాడుకున్నారు కనుక. ఆ క్రమంలో తమ కుటుంబానికి ఇబ్బంది అని తెలిసినా పదే,పదే ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక మాత్రం ఆ విషయం జోలికి వెళ్లలేదు. చంద్రబాబు, లోకేష్‌లను ఎవరో ఏదో అన్నారని, తమ మనోభావాలు దెబ్బతిన్నాయని కేసులు పెడుతున్న టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు కుటుంబానికి జరిగిన పరువు నష్టంపై మనోభావాలు దెబ్బతిన్నాయా, లేదా? దీనిపై పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు?. నిజంగానే ఆ పాయింట్‌ను పైకి తీసుకువస్తే.. వంశీ కుటుంబ సభ్యులపై టీడీపీవారు చేసిన అసభ్యకర, అసహ్యకర పోస్టింగ్‌లు, మాజీ సీఎం జగన్ కుటుంబంపై పెట్టిన నీచాతినీచ పోస్టింగులు అన్ని జనం దృష్టికి వస్తాయని సందేహించారా?. చంద్రబాబు,లోకేష్ లకు చిత్తశుద్ది ఉంటే తమ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై కేసు పెట్టి ఉండాలి. అలాగే వంశీ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసు కూడా తీసుకోవాలని చెప్పగలగాలి. ఆ పని చేయకుండా ఏదో ఒక పిచ్చి కేసులో వంశిని ఇరికించాలని చూడడం పిరికితనంగా కనిపిస్తుంది. టీడీపీ ఆఫీస్(TDP Office) పై దాడి కేసులో వంశీ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఆ మీదట కారణం ఏమైనా కాని దాడి కేసు ఫిర్యాదుదారు అసలు తనకు సంబంధం లేదని, తనను ఎవరూ దూషించలేదని కోర్టులో అఫిడవిట్ వేయడంతో ప్రభుత్వం పరువు పోయింది. నిజానికి చాలా కేసులలో రెడ్ బుక్ ఆదేశాల ప్రకారం ఎవరో ఒకరితో బలవంతంగా కేసులు పెట్టించి విపక్షంవారిని అరెస్టులు చేస్తుంటారు. ఈ కేసులో ఫిర్యాదుదారు ఎదురుతిరిగారు. దానిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు-లోకేష్ రెడ్‌బుక్ సర్కార్ హుటాహుటిన పోలీసులపై గుడ్లురిమి, ఫిర్యాదుదారు సోదరుడు ఒకరిని పట్టుకుని వంశీపై కిడ్నాప్ తదితర కేసులు పెట్టించి ఆగమేఘాలపై అరెస్టు చేసింది. తద్వారా తన అహాన్ని లోకేష్ తీర్చుకుని ఉండవచ్చు. కాని అది చట్టబద్దంగా చేయాలి తప్ప మొరటుగా ఇలా చేస్తే అది ఫ్యాక్షన్ రాజకీయంగా మారుతుంది. రాయలసీమలోనే ఈ తరహా ఫ్యాక్షన్ రాజకీయం ఉంటుందని అనుకుంటారు. కాని దానిని ప్రభుత్వమే కృష్ణా జిల్లాకు కూడా తీసుకు వచ్చినట్లు విమర్శలు వస్తున్నాయి. వంశీపై 16 క్రిమినల్ కేసులు ఉన్నాయని రిమాండ్ రిపోర్టులో రాశారట. 2019 ఎన్నికలలో టీడీపీ ప్రభుత్వ ఓటమి వరకు ఆయన ఆ పార్టీ తరపునే పని చేశారు కదా!. ఒకసారి ఎంపీగా పోటీచేసి ఓడిపోయినా.. తదుపరి రెండుసార్లు ఎమ్మెల్యేగా టీడీపీ పక్షాన గెలిచారు కదా?. మరి అన్ని కేసుల వ్యక్తిని ఎందుకు టీడీపీ ప్రోత్సహించింది?.. అంటే దానికి జవాబు ఉండదు. టీడీపీ నేతలు కొందరు ఆయనను పశువు అని, అదని తిడుతున్నారు. మరి అదే నిజమైతే ఆ పశువుతో పాటు సుమారు రెండు దశాబ్దాలు కలిసి నడిచినవారు ఏమవుతారు!. అసలు దాడి కేసు ఏమిటి?. ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం ఏమిటి?ఈ చట్టం కింద అయితే వెంటనే బెయిల్ రాకుండా చేయవచ్చన్నది వ్యూహం. ఇందుకోసం పనికట్టుకుని ఆ వర్గానికి చెందినవారిని తీసుకు వచ్చి కేసులు పెట్టిస్తున్నారన్న అభిప్రాయం ఉంది. ప్రస్తుతం అధికారం ఉంది కనుక టీడీపీ-జనసేన కూటమికి నేతలు ఎన్ని అరాచకాలు చేసినా పోలీసులు కేసులు పెట్టకపోవచ్చు. కానీ అది పోయిన రోజు వారిపై కూడా ఇలాంటి కేసులు వచ్చే అవకాశం ఉంటుంది కదా!. పోలీసులు తన పట్ల అనుచితంగా వ్యవహరించారని, వారి నుంచి తనకు ప్రాణ హాని ఉందని వంశీ మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. దానిపై కోర్టువారు ఎలా స్పందిస్తారో తెలియదు. ఏది ఏమైనా వంశీని ఇప్పుడు అరెస్టు చేసినా.. రేపు కొడాలి నాని ,పేర్ని నాని వంటివారిపై రెడ్ బుక్ ప్రయోగించినా అది తాత్కాలికమే అవుతుంది. మరి జగన్ ప్రభుత్వం(Jagan Government) కూడా టీడీపీ నేతలపై కేసులు పెట్టింది కదా? అని అనవచ్చు. వాటిలో మెజార్టీ కేసులు పూర్తి ఆధారాలతో పెట్టినవే. దర్యాప్తులో వాస్తవం అని తేలిన తర్వాతే ఆ కేసులు పెట్టారు. ఉదాహరణకు స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్టు చేశారు. ప్రభుత్వ నిధులు అక్రమ మార్గాల ద్వారా టిడిపి ఆఫీస్ అక్కౌంట్ కు చేరాయని సిఐడి విచారణలో తేలిందా?లేదా?. ఆ విషయంపై ఇంతవరకు టీడీపీ సమాధానం ఎందుకు ఇవ్వలేదు. ఆ మాటకు వస్తే 2019లో టీడీపీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత చంద్రబాబు పీఎస్ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడి చేసి.. రూ.2 వేల కోట్ల అక్రమాలు జరిగాయని ప్రకటించిందా? లేదా?. దానిపై ఇంతవరకు నోరు తెరిచారా?. అలాగే రాజధానికి సంబంధించిన అనేక కేసులలో సాక్ష్యాలు సేకరించడానికే కొన్ని సంవత్సరాలు తీసుకున్నారు. ఆ తర్వాతే చర్యలు చేపట్టారు. అంతే తప్ప ఫిర్యాదు వచ్చిన వెంటనే ఎవరినిపడితే వారిని అరెస్టు చేయలేదు. అయినా ఆ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారే. ఇప్పుడు అసలు వాస్తవాలు,విచారణలతో నిమిత్తం లేకుండా.. ఏదో రకంగా కేసులు పెట్టడం, విధ్వంసాలకు పాల్పడడం, వేధింపులకు గురి చేయడం నిత్యకృత్యంగా మార్చుకున్నారే. పైగా రెడ్ బుక్ చాప్టర్ 3 ప్రారంభించామని ఏ మాత్రం భీతి లేకుండా చెప్పుకున్నారే!. ఇదేనా ప్రజాస్వామ్యం. సూపర్ సిక్స్,ఇతర హామీలు నెరవేర్చలేక.. ఇలాంటి రాజకీయాలు చేయడం శోచనీయం. అసలు పని మానేసి ప్రభుత్వం ఈ విధంగా రాజకీయ రాక్షసపాలన సాగిస్తే ఏదో ఒక రోజు అదేవారి పతనానికి హేతువు అవుతుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాతఇదీ చదవండి: వంశీ అరెస్ట్‌పై వైఎస్ జగన్ ఫైర్ -
Jr NTRపై పగ.. వల్లభనేని వంశీ అరెస్ట్.. నెక్స్ట్
-
వంశీ పట్ల కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్ జగన్ ఫైర్
-
KSR Live Show: ఏపీలో వేగంగా విస్తరిస్తున్న రెడ్ బుక్ వైరస్
-
సైకో రాజ్యం.. సర్వం నాశనం
-
ఏపీలో లోకేష్ రెడ్ బుక్ వైరస్.. కరోనా కంటే డేంజర్
-
లోకేష్ ప్లాన్ పల్టీ కొట్టిందా?.. రెడ్ బుక్ రాజ్యాంగంలో రాక్షస పేజీ ఓపెన్..
-
రూల్స్ కూడా తెలియకుండా సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్దంగా అరెస్ట్
-
లోకేష్ ఆదేశాలతో వల్లభనేని వంశీపై అక్రమ కేసు నమోదు
-
HYD to Vjy: వల్లభనేని వంశీ అరెస్ట్.. అసలేం జరిగిందంటే?
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో కక్ష సాధింపు చర్యలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నారు. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారు. ఈ క్రమంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై అక్రమ పెట్టి ఆయనను హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బీఎన్ఎస్ సెక్షన్ 140(1), 308, 351(3) రెడ్‌విత్ 3(5) కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.అలాగే, వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు సైతం పోలీసులు నమోదు చేశారు. ఇదే సమయంలో కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో అరెస్ట్ చేస్తున్నట్టు వంశీ భార్యకు పోలీసులు నోటీసుల్లో తెలిపారు. అనంతరం, వంశీని అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు.వంశీ అరెస్ట్.. ఆపై ఇలా..5 AM: గచ్చిబౌలిలోని వంశీకి ఇంటికి చేరుకున్న పటమట పోలీసులు.5:15 AM: వంశీకి అరెస్ట్ నోటీసులు ఇచ్చిన పోలీసులు.6 AM: వంశీని అరెస్ట్ చేసి ఆయన భార్యకు నోటీసులు ఇచ్చిన పోలీసులు.7 AM: గచ్చిబౌలి నుంచి వల్లభనేని వంశీ విజయవాడకు తరలింపు. 10:45 AM: సూర్యాపేట వద్ద బ్రేక్‌ఫాస్ట్11:45 AM: నందిగామ దగ్గర వంశీ భార్య పంకజ శ్రీని అడ్డుకున్న పోలీసులు.12:30 PM: విజయవాడకు వంశీ తరలింపు. ఈ సందర్భంగా నగరంలో సెక్షన్ 144 విధింపు.12:45 PM: భవానీపురం పీఎస్‌లో వాహనం మార్పు.1:10 PM: కృష్ణలంక పీఎస్‌కు వంశీని తరలించిన పోలీసులు. పీఎస్‌లో వంశీని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. -
ఫుటేజీలు మాయమైపోతుంటే ఐజీ, ఎస్సీలు ఏం చేస్తున్నట్లు?
-
పవన్ కళ్యాణ్ స్థానంలో నారా లోకేష్‌కి కుర్చీ వేసిన అధికారులు
-
పిల్లలకు పురుగుల అన్నం పెడతారా?: కూటమి సర్కార్‌పై రవిచంద్ర ఫైర్
సాక్షి, తాడేపల్లి: స్కూళ్లలో మధ్యాహ్న భోజనం నాసిరకంగా మారింది.. ఆ భోజనం చేయలేక చిన్నపిల్లలు అల్లాడిపోతున్నారని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పిల్లలకు సరైన భోజనం కూడా పెట్టలేని మంత్రి లోకేష్ పదవికి రాజీనామా చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. లోకేష్ విద్యాశాఖని పూర్తిగా గాలికి వదిలేశారని.. మిగతా శాఖల్లో వేలు పెట్టి షాడో సీఎంగా లోకేష్ వ్యవహరిస్తున్నారంటూ దుయ్యబట్టారు.‘‘నిధులు ఇవ్వకుండా, మంచి భోజనం పెట్టకుండా విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు?. ప్రభుత్వ చర్యల కారణంగా సగం మంది పిల్లలు కూడా స్కూళ్లలో భోజనం చేయటం లేదు. చిన్న పిల్లలు పురుగుల అన్నం తినలేక బాధ పడుతున్నారు. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టినంత తేలిగ్గా మంచి భోజనం మాత్రం పెట్టటం లేదు...వైఎస్ జగన్ హయాంలో గోరుముద్ద పేరుతో నాణ్యమైన భోజనం పెట్టారు. ఏరోజు ఏం పెట్టాలో మెనూ ప్రకారం భోజనం పెట్టారు. అధికారుల పర్యవేక్షణలో మధ్యాహ్న భజన పథకాన్ని జగన్ అమలు చేశారు.. కానీ కూటమి ప్రభుత్వం పిల్లలకు పురుగుల ఆహారం పెడుతోంది. పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టకపోతే వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది’’ అని రవిచంద్ర హెచ్చరించారు. -
రెడ్ బుక్ కుట్రతో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం
-
పవన్ ఎందుకో వెనుకపడ్డాడు
-
బాబు, లోకేష్ పై అంబటి సెటైర్లు
-
పవన్ Vs లోకేష్.. బాబు ప్లాన్ ఫలించినట్టేనా?
చంద్రబాబు చేసేది చౌకబారు రాజకీయం.. చిల్లర వ్యవహారాలు కానీ బిల్డప్పులు మాత్రం అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయి. దేశంలో ఏ ముఖ్యమంత్రి.. ఇంతవరకు ఏ ప్రధానమంత్రి కూడా చేయని విధంగా పాలన సాగిస్తున్నట్లు ఆయన ప్రచారం చేసుకుంటారు. ఎప్పట్లానే చంద్రబాబు మంత్రులకు ర్యాంకింగ్స్ ఇచ్చారు. మంత్రుల పనితీరుకు ప్రాతిపదిక ఏమిటో.. వారి ర్యాంకింగ్స్ ఏ అంశాల మీదుగా నిర్ణయించి ఇచ్చారన్నది ఆయనకు తప్ప వేరే ఎవరికీ తెలియదు.మొత్తానికి క్యాబినెట్‌లోని పాతిక మంది మంత్రులకు చంద్రబాబు ర్యాంకింగ్ ఇచ్చేశారు. అందులో ఎన్ఎండీ ఫరూక్ మొదటి ర్యాంకులో ఉండగా జనసేనకు చెందిన కందుల దుర్గేష్ రెండో ర్యాంకులో ఉన్నారు.. చంద్రబాబు ఆరో స్థానంలో ఉండగా లోకేష్‌కు ఎనిమిది ర్యాంకు దక్కింది.. అన్నింటికీ మించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదో స్థానంలో నిలిచారు. అన్ని శాఖలను సమన్వయం చేస్తూ అందరి పనితీరును మదింపు చేసే చంద్రబాబు ఆరో ర్యాంకులో నిలవడం ఏమిటో మరి విచిత్రంగా ఉంది.మంత్రులు అందరికన్నా ఎక్కువ అని ఫీలయ్యే లోకేష్ అన్ని శాఖలను సమన్వయం పేరిట కెలికేస్తున్నారు. ఒక పవన్ కళ్యాణ్ చూస్తున్న పంచాయతీరాజ్ శాఖ మినహా ఇతర అన్ని శాఖల్లోనూ లోకేష్ పెత్తనం సాగుతోంది. ఆయన ఆఫీస్ నుంచి ఫోన్ వెళ్తే ఏ మంత్రి కూడా కిక్కురుమనే పరిస్థితి లేదు.. ఆయన అనధికారికంగా సీఎంగా కొనసాగుతున్నారు.. ఢిల్లీ వెళ్లి పెద్దలను కలవాలన్నా.. దావోస్ వంటి సదస్సుల్లో పెద్దపెద్ద సీఈఓలతో చర్చలు జరపాలన్న లోకేష్ మాత్రమే సీన్లో ఉంటారు. ప్రధాని మోదీతో వేదిక పంచుకోవాలన్నా లోకేష్‌కి అగ్ర తాంబూలం ఉంటుంది. మరి ఇంత గొప్పగా ప్రధాన పాత్ర పోషిస్తున్న లోకేష్‌కు ఆరో ర్యాంకు ఇవ్వడం ఏంటి?.పవన్‌ను వెనక్కి నెట్టేశారా!మిగతా మంత్రుల ర్యాంకింగ్స్ ఎలా ఉన్నా కూటమిలో ఉంటూ ఇండిపెండెంట్‌గా ఎదగాలని.. సొంత మార్క్ చూపాలని ఆరాటపడుతున్న పవన్ కళ్యాణ్‌ను మాత్రం ఏకంగా 10వ స్థానానికి నెట్టేశారు చంద్రబాబు. ఢిల్లీ పెద్దల కనుసన్నల్లో నడుస్తూ తన పాలిట కంట్లో నలుసుగా మారుతున్నారు అని పవన్‌పై ఇప్పటికే చంద్రబాబు నిఘా వేశారు అని అంటున్నారు. ఈ తరుణంలోనే పవన్ కళ్యాణ్ గత పది రోజులుగా జ్వరం పేరిట సెలవులో ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనకుండా దూరంగా ఉంటూ వస్తున్నారు. అంతేకాకుండా హోం మంత్రి అనిత.. టీటీడీ చైర్మన్ నాయుడు వంటి వారి విషయంలో పవన్ చేసిన కామెంట్లు కూటమి ప్రభుత్వాన్ని ఇరుక్కుని పెట్టాయి. పవన్‌ను అలాగే వదిలేస్తే శల్య సారథ్యం వహించి కూటమి రథాన్ని ఏదో రోజు బోల్తా కొట్టిస్తారు అనే భయం ఉన్న చంద్రబాబు ఇప్పుడు పవన్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా పథకాలు వేస్తున్నట్లు తెలుస్తోంది.అందుకే, పవన్.. మీ పనితీరు ఏం బాలేదు చూసావా.. ఏకంగా పదో ర్యాంకులో ఉన్నావు. నువ్వు డల్ స్టూడెంట్‌వి అని చెప్పే క్రమంలోనే ఏకంగా ఆయనను వెనక్కి నెట్టేసి డిఫెన్స్‌లో పడేశారని టీడీపీ అంతర్గత సమాచారం చెబుతోంది. నువ్వు బయట అరవడానికి తప్ప పరిపాలన.. రాజకీయాలు.. అడ్మినిస్ట్రేషన్ ఇవేం నీకు చేతకాదు అని పవన్‌కు చెప్పకనే చెప్పారు అని అంటున్నారు. తనను అన్ని రకాలుగా కార్నర్ చేస్తున్న చంద్రబాబును పవన్ ఏ విధంగా కంట్రోల్ చేస్తారు.. కూటమి ప్రభుత్వంపై ఏ విధంగా తన సొంత ముద్ర వేసుకుంటారన్నది చూడాల్సి ఉంది. -సిమ్మాదిరప్పన్న. -
ఎల్లో మీడియా కొంపముంచిన చంద్రబాబు!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదేమిటి ఇలా అన్నారు.. అని ఆశ్చర్యపోనవసరం లేదు. ఆయన అలా అనకపోతేనే వింత అవుతుంది. సంపద సృష్టించే మార్గం ఏదైనా ఉంటే ఒక ఐడియా ఇవ్వండి అని ప్రజలనే అడుగుతున్నారు. అది కూడా ఆయన చెవిలో చెప్పాలట. ఈ మాట వినగానే ఎల్లో మీడియా నిర్ఖాంతపోయినట్లు ఉంది. తామేదో బిల్డప్ ఇచ్చుకుంటూ వస్తుంటే చంద్రబాబు ఇలా వ్యాఖ్యానించి కొంప ముంచారే అనుకుంటోంది. అందుకే అంత కీలకమైన వ్యాఖ్యలను ఎల్లో మీడియా దాచేసే యత్నం చేసింది.అన్నమయ్య జిల్లా సంబేపల్లి గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఎదురైన ఒక చేదు అనుభవం రీత్యా చంద్రబాబు ఈ విషయం చెప్పేశారు. ఒక రైతు తమకు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారని అడిగారు. దానికి కాస్త చికాకుపడిన చంద్రబాబు డబ్బులు వస్తే ఇస్తామని, దీనికి వర్క్ అవుట్ చేస్తున్నామని, అయినా మీకు ఇవ్వాలంటే ముందుగా డబ్బు సంపాదించాలిగా అని అన్నారు. అక్కడితో ఆగలేదు. డబ్బు సంపాదించే మార్గం ఉంటే తనకు చెవిలో చెప్పాలని చంద్రబాబు అనడంతో అక్కడ ఉన్నవారికి మతిపోయినంత పని అయింది. నిజానికి చంద్రబాబు ఇలాంటి ప్రశ్నలను ఊహించి ఉండరు. తన కుమారుడు, మంత్రి లోకేష్ ఎన్నికలకు ముందు హామీలను నెరవేర్చకపోతే చొక్కా కాలర్ పట్టుకుని నిలదీయండని అన్నారు. అయినా తాము సూపర్ సిక్స్ హామీలను, ఎన్నికల ప్రణాళికలోని మరో 175 హామీలను ఎగవేస్తే మాత్రం ఎవరు అడుగుతారులే అన్న ధీమాతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు ఉంటారు.కానీ, లోకేష్ కాలర్ డైలాగ్ బాగా వైరల్ అవుతుండటంతో ధైర్యం వచ్చిందేమో తెలియదు.. ఒక రైతు తమకు రావాల్సిన భరోసా మొత్తం రూ.20వేల గురించి ప్రశ్నించారు. దానికి ఏం చెప్పాలో అర్ధం కాని చంద్రబాబు చివరికి డబ్బులు లేవు పొమ్మంటూ, మీరే ఐడియా ఇవ్వండి అని చెప్పి చేతులెత్తేశారు. కేంద్రం గత ఏడాదికి గాను రైతు భరోసా కింద ఆరువేల రూపాయల చొప్పున మంజూరు చేసి ఉండాలి. అది పోను మిగిలిన మొత్తాన్ని ఇవ్వడానికి అయినా చంద్రబాబు ప్రభుత్వం సిద్దపడి ఉండాల్సింది. ఎన్నికల ప్రణాళిక ప్రకారం ప్రతీ రైతుకు ఇరవై వేల రూపాయల పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవ పేరుతో అందిస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అధికారం వచ్చాక అసలుకే మోసం తెచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. కేంద్రం ఇచ్చిన ఆరువేల రూపాయలను కూడా ప్రభుత్వం ఎగవేయడం విశేషం. ఈ ఏడాది నుంచి కేంద్రం పదివేల చొప్పున ఇస్తుంది. దానినైనా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? లేదా? అన్నది చూడాలి. ప్రతీ ఒక్కరూ తెలివితేటలతో ఆర్ధికంగా ఎదగాలని కూడా సలహా ఇచ్చారు.ఇంతకాలం తన తెలివితేటలతో రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు అభివృద్ది చెందుతారని హోరెత్తించిన చంద్రబాబు ఇప్పుడు ఎవరి బతుకు వారే చూసుకోవాలని అంటున్నారు. ఆయన చెప్పేది వాస్తవమే. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని అనుకుని మోసపోకుమా అన్న శ్రీశ్రీ గేయాన్ని గుర్తు చేసుకోవాలి. ఈయనేమీ వైఎస్ జగన్ కాదు కదా!. చెప్పినవి చెప్పినట్లు చేయడానికి అని ఇప్పుడు జనం భావిస్తున్నారు. మరో ఘటన కూడా జరిగింది. కొందరు యువకులు మదనపల్లె వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేయరాదని కోరుతూ నినాదాలు చేశారు. వారికి సమాధానం ఇవ్వకపోగా, ఒకరిద్దరు వచ్చి ఇలా చేస్తారని, వారు అవుట్ డేటెడ్ అని కొట్టిపడేశారు. వామపక్షాలు చంద్రబాబుతో కలిసి ఉంటే కమ్యూనిజం గొప్పదని చెబుతారు. ఆయన బీజేపీతో కలిస్తే కమ్యూనిజం కాదు.. టూరిజం ముఖ్యమని అంటారు. వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వపరంగా చేపట్టిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం రెడీ అయినట్లే అని అర్ధం అవుతోంది. ఇప్పటికే 750 మెడికల్ సీట్లను ఈ ప్రభుత్వం వదులుకుని విద్యార్ధులకు తీవ్ర అన్యాయం చేసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి రాగానే మరో మాట చెప్పడం చంద్రబాబుకు అలవాటైన విద్యే. మదనపల్లె మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయవద్దని కోరిన విద్యార్ధులను పోలీసులతో బయటకు నెట్టేయించారు. నారా లోకేష్ ఎన్నికలకు ముందు చొక్కా కాలర్ పట్టుకోమన్నారు కదా అని ఎవరైనా ప్రయత్నిస్తే, పోలీసులతో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తారని తేలిపోయింది. తల్లికి వందనంతో సహా ఆయా పథకాలను జూన్‌లో ఇస్తామని టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం తర్వాత చెప్పారు. అప్పుడు ఏం ఇస్తారో తెలియదు కానీ, ఈ సభలో మాత్రం తల్లికి వందనం పథకం కింద డబ్బులు ఒకసారి ఇవ్వాలా?రెండు దఫాలుగా ఇవ్వాలా అన్నది నిర్ణయం తీసుకుని అందిస్తామని అన్నారట. ఈ పాయింట్ ఆధారంగా ఎల్లో మీడియా మళ్లీ వెంటనే ఆ స్కీమ్ అమలు అయిపోతుంది అన్నంతగా బిల్డప్ ఇచ్చి కథనాలు వండి వార్చాయి. తాము చెప్పినదానికన్నా ఎక్కువే చేసి చూపిస్తామని చంద్రబాబు అన్నారని కూడా రాసేశారు.హామీలు ఇచ్చినవాటికే దిక్కు లేదు కానీ.. ఎల్లో మీడియా బిల్డప్ ఏమిటా అని అంతా అనుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. తల్లికి వందనం పథకాన్ని ఒక ఏడాది ఎగవేసిన విషయాన్ని మాత్రం జనం మర్చిపోవాలన్నది చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, ఎల్లో మీడియా కోరికగా ఉంది. అధికారం రావడమే ఆలస్యం అన్నీ జరిగిపోతాయని ప్రచారం చేసిన కూటమి నేతలు ఇన్ని రకాలుగా పిల్లిమొగ్గలు వేస్తున్నారు. వలంటీర్లను కొనసాగిస్తామని గతంలో ఊదరగొట్టిన చంద్రబాబు ఇప్పుడు వాట్సాప్ పాలన లోకేష్ ఆలోచన అని కుమారుడిని ప్రమోట్ చేసేపనిలో ఉన్నారు. చంద్రబాబు తన ప్రచారం కోసం నిధులను దుర్వినియోగం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రతి నెల ఇచ్చే పెన్షన్ల పంపిణీకి స్వయంగా చంద్రబాబు వెళ్లవలసిన అవసరం ఏముందని అంటున్నారు. గతంలో వైఎస్సార్సీపీ హయాంలో వృద్దులకు పెన్షన్‌గా మూడువేల రూపాయలు ఇచ్చేవారు. దానికి మరో వెయ్యి అదనంగా ఇస్తున్నారు. అంతవరకు ఓకే. మరోవైపు పెన్షన్లను ప్రతీ నెలా కోత పెడుతున్నారని చెబుతున్నారు. ఈ పెన్షన్లను గతంలో వలంటీర్లు అందచేసేవారు. ఆ వలంటీర్లకు జీతాలు పెంచుతామని చెప్పి వారి ఉద్యోగాలకే మంగళం పలికారు.ఒక వలంటీర్ చేయగలిగిన పనిని ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రత్యేకంగా సభ పెట్టి పంపిణీ చేసి, ప్రసంగం చేసి ప్రచారం జరిగేలా చూసుకోవడం ఆశ్చర్యంగానే ఉంటుంది. కాకపోతే, ఆయన స్టైలే అది. పావలా కోడికి రూపాయి మసాలా అన్నట్లుగా ఆయన యావ ఎప్పుడూ ప్రచారంపైనే ఉంటుంది. చంద్రబాబు ఏపీలోనే కాదు.. ఢిల్లీ వెళ్లి సైతం అక్కడ జరుగుతున్న ఎన్నికలలో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తున్న సందర్భంగా కూడా పలు అసత్యాలు చెప్పి వచ్చారు. 2019లో చంద్రబాబుకు మద్దతుగా ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ విశాఖపట్నం వచ్చి ప్రచారం చేశారు. కానీ, ఇప్పుడు అదే కేజ్రీవాల్‌ను ఓడించాలని చంద్రబాబు ప్రచారానికి దిగారు. గతంలో మోదీని నానా రకాలుగా దూషించిన చంద్రబాబు ఇప్పుడు ఆయనను ఆకాశానికి ఎత్తుతూ పొగుడుతున్నారు. అలాగే 2019లో కేజ్రీవాల్ విద్యావంతుడు, నిజాయితీపరుడు, ఢిల్లీని బాగా అభివృద్ది చేశారని చంద్రబాబు ప్రశంసించారు. 2024 వచ్చేసరికి ఆయన దృష్టిలో కేజ్రీవాల్ అవినీతిపరుడయ్యారు. ఢిల్లీని నాశనం చేశారు అని చంద్రబాబు అనగలిగారంటే ఏమనుకోవాలి?. కేజ్రీవాల్‌పై వచ్చిన లిక్కర్ స్కామ్ గురించి కూడా చంద్రబాబు ప్రస్తావించారు. కానీ, అదే స్కాంలో భాగస్వామి అన్న ఆరోపణలు ఉన్న మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఎంపీ టిక్కెట్‌ను ఇదే చంద్రబాబు ఇచ్చారు.ఏపీకి ఏడు నెలల్లో ఏడు లక్షల పెట్టుబడులు వచ్చేసినట్లు కూడా చంద్రబాబు ఆ సభలలో చెప్పుకోవడం విశేషం. దావోస్ వెళ్లి ఒక్క ఎంవోయూ కుదుర్చుకోకుండా ఖాళీ చేతులతో తిరిగి వచ్చారన్న విమర్శలను ఎదుర్కోవడానికి కొత్త గాత్రం అందుకుని ఆల్రెడీ ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయని అబద్దపు ప్రచారం ఆరంభించారు. దానిని ఢిల్లీ వరకు తీసుకువెళ్లారు. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి బడ్జెట్లో ప్రత్యేకంగా ఏమీ రాకపోయినా కేంద్ర బడ్జెట్‌ను మెచ్చుకోవాల్సిన నిస్సహాయ స్థితిలో చంద్రబాబు ఉన్నారు. ఎల్లో మీడియా యథాప్రకారం విశాఖ స్టీల్, పోలవరం ప్యాకేజీలు కొత్తవి అయినట్లు, అమరావతి అప్పును కేంద్రం సాయం కింద అబద్దపు ప్రచారం చేశారు. కేంద్రం రాష్ట్రానికి దన్నుగా నిలబడిందని కూడా సర్టిఫికెట్ ఇచ్చేశారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు కూడా ఒకసారి ప్రభుత్వపరంగా ఒక ప్రకటన చేస్తూ ప్రజలు సలహాలు ఇవ్వాలని కోరారు. సరిగ్గా అదే పద్దతిలో ఇప్పుడు ఐడియాలను చెవిలో చెప్పాలని అంటున్నారు.ఇంతకాలం చంద్రబాబు తన ఐడియాలతో స్కీములు అమలు చేస్తారనుకుంటే, జనమే ఆ ఐడియాలు ఇవ్వాలని కోరుతున్నారు. అదేదో సినిమాలో చెప్పినట్లు కొండను తాను ఒక్కడినే మోస్తానని ప్రజలందరితో నమ్మబలికి.. తీరా కొండను మోసే సమయం వచ్చేసరికి, జనం అంతా వచ్చి కొండను తన భుజాలపై పెడితే మోసి చూపిస్తానన్నారట. ఆ సినిమా సన్నివేశం హాస్యం కోసం అయితే, చంద్రబాబు ప్రకటన జనాన్ని మోసం చేయడం కోసం కాదా!. - కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
చంద్రబాబు ర్యాంకింగ్స్: పవన్‌ను వెనక్కి నెట్టేసిన లోకేష్
విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏది చేసినా చిత్రంగానే ఉంటుంది. ఆయన మాటల దగ్గర్నుంచీ చేతల వరకూ అన్నీ వింతగానే ఉంటాయి. తాజాగా ఏపీ మంత్రులకు చంద్రబాబు ప్రకటించిన ర్యాంకులు కూడా అదే చందంగా ఉన్నాయి. మంత్రులకు ఇచ్చిన ర్యాంకుల్లొ తన తనయుడు లోకేష్‌కు 8 వర్యాంకు కట్టబెట్టిన చంద్రబాబు.. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కల్యాణ్‌కు మాత్రం 10వ ర్యాంకు ఇవ్వడం హాట్ పిక్ అయ్యింది. మంత్రుల ర్యాంకుల్లో పవన్‌ను లోకేష్కంటే వెనక్కి నెట్టేశారు చంద్రబాబు. అయితే ఇక్కడ పవన్ కంటే లోకేష్ బెటర్ అన్న సందేశం పంపారు చంద్రబాబు.ప్రస్తుతం లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేసే పనిలో ఉన్న చంద్రబాబు.. ఆ క్రమంలోనే తనకుమారుడి ఒక మంచి ర్యాంకు కట్టబెట్టారని, అది కూడా పవన్ కంటే మంచి ర్యాంకు ఇచ్చారనే వాదన తెరపైకి వచ్చింది. అసలు పవన్ కల్యాణ్ హాజరు కానీ క్యాబినెట్ర్యాంకులు ప్రకటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇక పవన్ ను లోకేష్ కంటే తక్కువ చేసి చూపడంపై జనసేన కార్యకర్తలు, నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా ర్యాంకులు ప్రకటించినా, ఫైళ్లు తక్కువగా ఉన్న మంత్రులకు మంచిర్యాంకులు ఇవ్వడం ఏంటనే ప్రశ్న వినిపిస్తోంది. చంద్రబాబు మాత్రం తన ర్యాంకును 6గా ప్రకటించుకున్నారు. తొలి స్థానంలో మంత్రి ఫరూక్ ఉండగా, ఆఖరి స్థానంలో వాసంశెట్టి సుభాష్ ఉన్నారు.మంత్రులకు చంద్రబాబు ఇచ్చిన ర్యాంకులు కింది ివిధంగా ఉన్నాయి..1.ఫరూఖ్2. కందుల దుర్గేష్3.కొండపల్లి శ్రీనివాస్4. నాదెండ్ల మనోహర్5. డోలా బాలవీరాంజనేయ స్వామి6. చంద్రబాబు7. సత్యకుమార్ యాదవ్8. నారా లోకేష్9. బీసీ జనార్థన్ రెడ్డి10. పవన్ కళ్యాణ్11. సవిత12. కొల్లు రవీంద్ర13. గొట్టిపాటి రవికుమార్14. నారాయణ15. టీజీ భరత్16. ఆనం రాం నారాయణరెడ్డి17. అచ్చెన్నాయుడు18. రాంప్రసాద్ రెడ్డి19. గుమ్మడి సంధ్యారాణి20. వంగలపూడి అనిత21. అనగాని సత్యప్రసాద్22. నిమ్మల రామానాయుడు23. కొలుసు పార్థసారధి24. పయ్యావుల కేశవ్25. వాసంశెట్టి సుభాష్ -
దేవాలయాలకు పాకుతున్న ‘రెడ్‌బుక్’ సంస్కృతి!
ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగ విష సంస్కృతి కోరలు చాస్తోంది. అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థలకూ పాకుతోంది. ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల, తిరుపతి దేవస్థానంలోనూ ఈ రకమైన నీచ రాజకీయాలు ప్రవేశించాయి. తమకు గిట్టనివారిపై మాత్రమే సాగుతున్న రెడ్‌బుక్ కుట్రలతో పోలీసు శాఖకు కూడా అప్రతిష్ట ఏర్పడుతోంది. సాటి అధికారులపైనే కుట్రలకు దిగుతుండటం బహుశా దేశ చరిత్రలోనే మొదటిసారి కావచ్చు.టీటీడీ ఇటీవల కొంతమంది యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులపై కేసులు పెట్టింది. ప్రభుత్వ సలహాదారు.. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు తిరుమల సందర్శించిన సందర్భంగా ఆయనకు తగిన గౌరవ మర్యాదలు ఇవ్వలేదని, అధికారులు ప్రోటోకాల్‌ను కూడా ఉల్లంఘించారని ఈ ఛానళ్లలో కొన్ని కథనాలు ప్రసారం కావడమే నిర్వాహకులు చేసిన ఘోర తప్పిదం. ఈ కథనాల కారణంగా టీటీడీ ప్రతిష్ట దెబ్బతిందని, వారి మనోభావాలు గాయపడ్డాయని ఆరోపణలు చేసి జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ నిర్వాహకుడు వైఎన్ఆర్తోపాటు ఇతరులపై కేసులు నమోదు చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కూడా ఓ శాటిలైట్ ఛానెల్ యజమానే. ఆ ఛానెల్లో ఎన్ని అసత్య కథనాలు ప్రసారమయ్యాయో ప్రజలకు, విమర్శకులు అనేకులకు తెలిసిన విషయమే.టీడీపీ భజంత్రీ ఛానెల్‌గా మాత్రమే ఉండాలని అనుకుంటున్న బీఆర్ నాయుడు వీటిని పట్టించుకోకపోవచ్చు. అది వారి ఇష్టం కానీ.. అందరూ తనలానే అధికార పార్టీకి అణిగిమణిగి ఉండాలని కోరుకోవడమే అభ్యంతరకరం. టీటీడీ ప్రతిష్ట దెబ్బతిందని అంటున్నారు. ఎవరివల్ల? దాని గురించి చెప్పగలిగే ధైర్యం టీటీడీకి ఉందా?. దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుని దిక్కుమాలిన రాజకీయం చేసిందెవరు?. భక్తులు పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో జంతువు కొవ్వు కలిసిందని అసత్య ఆరోపణలు చేయడం వల్ల కదా టీటీడీ ప్రతిష్ట మసకబారలేదా?. సీఎం వంటి బాధ్యతాయుతమైన హోదాలో ఉంటూ బాధ్యతారాహిత్యంగా ఆయన చేసిన ఆరోపణలతో టీటీడీ పరువు ఏపీలోనే కాదు.. ప్రపంచం అంతటా పోయింది వాస్తవం కాదా?కోట్లాది హిందువులు ఏ దేశంలో ఉన్నా అంతా బాధపడ్డారా? లేదా? తీరా చూస్తే ఆయనే మళ్లీ మాటమార్చారు. సిట్ అని, సీబీఐ అని రకరకాలుగా విచారణలు చేయించారు. వాటి సంగతి ఏమైందో తెలియదు.టీటీడీ ఈవో శ్యామలరావు లడ్డూలో కల్తీ జరగలేదని తొలుత చెప్పి, ఆ తర్వాత చంద్రబాబుకు వంత పాడేలా మాట్లాడినప్పుడు పరువు పోలేదా? వారిపై టీటీడీ కేసులు పెట్టిందా?. అధికారం అంతా వారి చేతిలోనే ఉంది కనుక ఎవరూ వారి జోలికి వెళ్లలేరు. ఎవరైనా తమ మనోభావాలు గాయపడ్డాయని కేసులు పెట్టే ప్రయత్నం చేసినా పోలీసులు పట్టించుకోరు. ఎప్పుడో మూడు, నాలుగేళ్ల క్రితం తమ నేత చంద్రబాబు, తదితరులను దూషించారని, దానివల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని టీడీపీ వారు ఎవరైనా కేసు పెడితే మాత్రం పోలీసులు ఆగమేఘాల మీద హైదరాబాద్ వెళ్లి మరి ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ వంటివారిని అరెస్టు చేసే ప్రయత్నం చేస్తారు. దీనినే రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. పలుకుబడి లేనివారినైతే అరెస్టు చేసి వేధిస్తుంటారు. ఇక పవన్ కళ్యాణ్ సంగతి చూద్దాం. చంద్రబాబు తిరుమల లడ్డూపై అసత్య ఆరోపణలు చేయడమే దారుణం అనుకుంటే పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకు వేసి సనాతని వేషం కట్టి అయోధ్యకు పంపిన లడ్డూలలో సైతం కల్తీ నెయ్యి కలిపారని టీటీడీ పరువు మంట కలిపారు. తీరా చూస్తే అయోధ్యకు పంపిన లడ్డూలను బోర్డు సభ్యులు ఇద్దరు స్వచ్ఛమైన నెయ్యితో వ్యక్తిగతంగా తయారు చేయించారని వెల్లడైంది. అంటే పవన్ తప్పుడు ఆరోపణ చేసినట్లే కదా!. మరి టీటీడీ ఆయనపై ఎందుకు కేసు పెట్టలేదు. బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేస్తే ఒకప్పుడు ఎంత హోదాలో ఉన్నా కేసులు నమోదు చేసేవారు. ఇప్పుడు ఏపీలో ఆ పరిస్థితి లేదు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం టిక్కెట్ల కోసం వెళ్లిన భక్తులు తొక్కిసలాటకు గురై ఆరుగురు మరణిస్తే టీటీడీకి మచ్చ రాలేదు. దీనికి సంబంధించిన అధికారులపై తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని ముఖ్యమైన అధికారుల జోలికి వెళ్లలేదు.ఇదే సమయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ చెప్పడానికి కూడా తొలుత మొరాయించారు. క్షమాపణతో సరి పెట్టుకున్నారే తప్ప.. తను చైర్మన్‌గా ఉన్నప్పుడు ఇది జరిగింది కనుక నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తానని మాత్రం ప్రకటించలేదు. నిజంగా టీటీడీ ప్రతిష్ట దారుణంగా దెబ్బతీసిన వారిపై ఎలాంటి చర్యలు లేవు కానీ, యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులపై మాత్రం కేసులు పెట్టేశారట. వారు నిజంగానే పొరపాటు మాట్లాడి ఉంటే ఖండన ఇచ్చి అదే రకంగా వార్తలు ప్రసారం చేయాలని కోరి ఉంటే సరిపోయేది. అలా కాకుండా కేసులు పెట్టారంటే అది కక్ష కాక మరేమిటి?. టీటీడీలో రెడ్‌బుక్ పాలన ఇంకేమిటి? అందుకే వైఎస్సార్సీపీ నేతలు ఈ రెడ్‌బుక్‌ను పిచ్చి కుక్కలతో పోల్చి అవి ఎవరి మీద ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితి ఏర్పడిందని విమర్శిస్తున్నారు.టీటీడీలోనే కాదు.. వైఎస్సార్సీపీ నేతలు అనేక మందిపై రెడ్‌బుక్ పేరుతో కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది సోషల్ మీడియా కార్యకర్తలపై దారుణమైన రీతిలో కేసులు పెట్టారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా చేయడమే వీరి లక్ష్యం. తాజాగా మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అటవీ భూముల ఆక్రమణ అంటూ ఓ కథ సృష్టించి ఏదోలా కేసు పెట్టాలని చూస్తున్నారు. రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డిలు ఇచ్చిన వివరణ చూస్తే అది ఎప్పుడో పాతికేళ్ల క్రితం కొన్న భూములు. వాస్తవం ఉన్నా, లేకపోయినా రెడ్‌బుక్ ప్రకారం కేసులు పెట్టడానికి ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి నిత్యం ప్రభుత్వాన్ని ఉసికొల్పుతున్నాయి. రెడ్‌బుక్ సృష్టికర్త లోకేష్ అయినా మర్చిపోతారేమో కానీ, ఈ ఎల్లో మీడియా మాత్రం తమ కక్షలు తీర్చుకోవాడానికి మాత్రం పూర్తిగా వాడుకునే పనిలో ఉంది. వీరి వ్యవహార శైలి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు వైఫల్యాల నుంచి డైవర్ట్ చేయడానికి చేసే ప్రయత్నంగా ఒక వైపు కనిపిస్తుంది.మరోవైపు ప్రభుత్వాన్ని వీరే నడుతున్నట్లుగా ఇష్టారాజ్యంగా వైఎస్సార్సీపీ వారిపై, తమకు గిట్టనివారిపై కథనాలు ఇస్తున్నారు. దీనివల్ల కూటమికి కూడా భవిష్యత్తులో నష్టమే తప్ప మరొకటికాదు. ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై రెడ్‌బుక్‌ను ప్రయోగించారు. పలువురికి పోస్టింగ్‌లు నెలల తరబడి ఇవ్వడం లేదు. కొందరిని అరెస్టు చేయడానికి యత్నిస్తున్నారు. తాజాగా కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా అభియోగంపై విచారణకు వేసిన సిట్ అధికారి వినీత్ బ్రిజ్ లాల్‌ను కూటమి పెద్దలు ఆదేశించినట్లుగా నివేదిక ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారట. ఆయన అలా కుదరదని, వాస్తవ పరిస్థితిని నివేదిస్తానని చెప్పారట. కాదు.. కూడదంటే ఉద్యోగానికి రాజీనామా చేస్తానని అన్నారట. దాంతో డీజీపీ, మరో ఉన్నతాధికారి ఆయనను బదిలీ చేయాలని నిర్ణయించారట. ఇదంతా మీడియాలో వచ్చిన సమాచారమే.ఇలా పోలీసు శాఖలోని వారు కూడా తమ పదవులు, పోస్టింగ్‌ల కోసం అధికారంలో ఉన్నవారికి వంతపాడే పనిలో ఉంటే అది వ్యవస్థకు ఎంతవరకు ప్రయోజనమో ఆలోచించాలి. ఇలా తప్పుడు కేసులు పెట్టించడం కొనసాగిస్తే, అదే రెడ్‌బుక్ కూటమి నేతల మెడలకు కూడా ఎప్పుడో ఒకప్పుడు చుట్టుకునే అవకాశం ఉంటుంది. పామును పెంచితే ఎంత ప్రమాదమో, రెడ్‌బుక్ అంటూ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తే కూడా అంతే ప్రమాదం అన్న సంగతిని నేతలు ఎప్పటికి గుర్తిస్తారో !.- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
నేలవిడిచిన సాము ఆపేది ఎప్పుడు?
చంద్రబాబు పాలనలో కాలేజీ స్థాయిలో సామా జిక శాస్త్రాల చదువులు అటక ఎక్కాయి. ఆ తర్వాత ఎవ్వరూ వాటి వైపు తిరిగి చూడలేదు. ఆ చదువుల పట్ల అశ్రద్ధ కారణంగానే ఇప్పటికీ రాష్ట్ర విభజన ఎందుకు జరిగింది అనేది ఏపీ ప్రజలకు సాకల్యంగా స్పష్టం కాలేదు. తెలంగాణ విషయం అలా కాదు, ఇక్కడి కొరతను అధిగమించి మరీ ఉద్యమానికి ముందు ఒక దశాబ్దం పాటు వారు తమ చరిత్ర–సంస్కృతిని పునర్నిర్మించారు. అయితే ఇక్కడ అది లేదు. యూపీఏ–2 పాలన చివరిలో (2009–14) ‘విభజన’ లక్ష్యంగా తెలంగాణ అప్రమత్తం అయినప్పుడు, అక్కడ జరి గిన ‘హోం వర్క్’ వంటిదే ఇక్కడ కూడా జరిగి ఉంటే, ప్రతి అంశంలోనూ మన ‘ప్లానింగ్’లో ఆ స్పష్టత మొదటి నుంచి కనిపించేది. అప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, ప్రభుత్వ విధానాల్లో మార్పు ఉండేది కాదు. కేంద్రం విభజన నిర్ణయం ఏ కారణంతో తీసుకున్నా విస్తృత ప్రయోజనాల దృష్టితో సూక్ష్మ ప్రణాళికల వైపు మన నడక సాగి ఉండేది. అదే కనుక జరిగిఉంటే, ఇప్పుడు కురచ దృష్టితో కొందరు మాట్లాడుతున్న–‘సంక్షేమం’ వేరు ‘అభివృద్ధి’ వేరు అనే విపరీత పరిస్థితి మనకు వచ్చేది కాదు. ప్రధానిగా డా‘‘ మన్మోహన్ సింగ్ కాలంలో పెద్ద ఎత్తున చలామణిలో ఉండిన –‘ఇంక్లూజివ్ గ్రోత్’ (సమష్టి వృద్ధి) పదం ఎన్డీఏ తొలినాళ్లలోనే నిశ్శబ్దంగా అదృశ్యం అయింది. ఇటీవల ‘జాతీయ ఉపాధి హామీ పథకం’లో పేదలు వేసవిలో చేసే పని దినాలు–వేతనాలు తరచూ జాతీయ స్థాయిలో చర్చకు గురికావడం, పార్లమెంట్లో ప్రతిపక్షాలు అందుకోసం ప్రభుత్వంపై పోరాటం చేయడం చూస్తున్నదే. అదే ఆంధ్ర ప్రదేశ్ విషయంలో అయితే, కనీసం రెండున్నర ఏళ్ళపాటు మన ప్రాధాన్యతలు మార్చిన ‘కోవిడ్’ సోయి కూడా మరిచి, ‘సంక్షేమం’ అవసరాన్ని ప్రశ్నించడం చూశాము. మనం ఏమిటో మన భాష చెబుతుంది అనడానికి ఇదో ఉదాహరణ. ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిందని, ‘ప్రాంతం’ – ‘ప్రజల’ స్వభావంలో మార్పు ఎందుకు వస్తుంది? కేవలం ఒక మంత్రికి పరిపాలనలో కొత్త ‘టెక్నాలజీ’ తేవాలని ఉంటే చాలదు కదా. ఆ స్థాయిలో ఇక్కడి పరిస్థితుల(ఎకో సిస్టం)లో కూడా మార్పు తీసుకు రావాలి కదా? కానీ ఆ విషయం దావోస్‌లో మరెవరో మనకు చెప్పాల్సి వచ్చింది. ‘గూగుల్’ కంపెనీ దావోస్‌లో ఏర్పాటు చేసిన– ‘ఏఐ ఫర్గుడ్ షేపింగ్, ఏ స్మార్టర్ సస్టెయినబుల్ టుమారో’ సెషన్లో మన కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ–‘మా రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల్ని ఎంపిక చేయడానికి, వైద్య– ఆరోగ్య రంగంలో ఆరోగ్య రక్షణను ప్రజాస్వామ్యయుతం చేయడం కోసంమేము కృత్రిమ మేధ (ఏఐ)ను వాడాలి అనుకుంటున్నాము’ అన్నారు. ఆ సెషన్ సమన్వయకర్తగా ఉన్న రాజేష్ నంబియార్ ఇండియాలోని ‘డిజిటల్ డివైడ్’ (సాంకేతికత... అందుబాటులో ఉన్నవారికీ– లేనివారికీ మధ్య ఉన్న దూరం) ను దృష్టిలో ఉంచుకుని, అక్కడి ప్రజలకు స్మార్ట్ ఫోన్లు ఉండాలి, అందులో మళ్ళీ ‘ఫైవ్–జి’, ‘సిక్స్–జి’ అందుబాటులో ఉండాలి అన్నారు. ‘అయినా మంత్రి ప్రతిపాదనపై మీరు ఏమంటారు?’ అని ఆయన ‘బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్’ ప్రతినిధి అర్చనా వ్యాస్‌ను అడిగారు. దానికి ఆమె– ‘ముందుగా ప్రజలకు ‘మిషన్‌లెర్నింగ్’ తెలియాలి. దాన్ని వాడాలి అనుకుంటున్న రంగాలకు తగిన ‘డిజిటల్ కెపాసిటీ’ ఏమిటి అనేది ముఖ్యం. అయినా అటువంటి సేవలు వినియోగించుకునే వాయిస్ ఆఫ్ కమ్యూ నిటీ (ప్రజల ఉద్దేశం) ఏమిటో తెలుసు కోవడం అవసరం. ఈ నేపథ్యంలో లాస్ట్ మైల్లో ఉన్న వారికి ఈ పద్ధతిలో వైద్యం అందుతుందా? అనేది కీలకం. అయినా మన కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్కు ఈసాంకేతికత తెలియాలి కదా?’ అన్నారు. ప్రభుత్వాలు ఇటువంటి నేల విడిచి సాము చేసే రీతిలో ఆరోగ్యం వంటి అత్యవసర సేవలు అందిస్తాము అంటే, ప్రజలు తమ వైఖరిని (ప్రజా) ప్రతినిధుల ద్వారా ప్రభుత్వానికి తెలపాలి. అసెంబ్లీ, సెక్రటేరియట్ వంటివి ‘ప్రభుత్వం’ అని, అవి ఎక్కడో హైదరాబాద్‌లో ఉంటాయి అనే పాత దృష్టి నుంచి ఇక బయటపడాలి. రాజకీయం అంతా మన చుట్టూనే జరుగుతున్నప్పుడు, గ్రామ సచివాలయ వ్యవస్థ ఉన్నప్పటికీ, ‘సర్పంచ్ – ఎంపీపీ – జడ్పీటీసీ’ స్థాయిలో అభివృద్ధి పనులు గుర్తించి, అవి శాసన సభ్యుల ద్వారా నేరుగా ‘అసెంబ్లీ’లోకి వెళ్ళినప్పుడు ఈ నేలవిడిచిన సాము తరహా ‘ప్రెజెంటేషన్లు’ ఉండవు. విభజన తర్వాత పునాది నుంచి ప్రతిదీ కొత్తగా కట్టుకుంటున్న దశలోనే ఈ స్పృహ రాష్ట్రంలో మొదలుఅయితే, కాలక్రమంలో అదొక ‘స్టేట్ సైక్’ (రాజ్య మనఃస్థితి)గా స్థిరపడుతుంది.-జాన్సన్ చోరగుడి, వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
లోకేశ్ పై పాల్ గరం
-
చంద్రబాబు, నారా లోకేష్ కు కేఏ పాల్ వార్నింగ్
-
‘ఛీ.. ఎన్టీఆర్ మాటకు తూట్లు పొడిచి మరీ!
1982లో తెలుగుదేశం పార్టీ స్థాపన సందర్భంగా ఎన్టీ రామారావు ఒక స్పష్టమైన షరతు పెట్టారు. టీడీపీలో చేరాలనుకుంటే ఇతర పార్టీల వారెవరైనా అక్కడి తమ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ షరతుతో కాంగ్రెస్ పార్టీ మాదిరిగా ఆయారాం, గయారాం పరిస్థితి టీడీపీలో ఉండదని ప్రజలూ హర్షించారు. మేధావులు కూడా ఎన్టీఆర్ నిర్ణయాన్ని స్వాగతించారు. టీడీపీలోకి చేరేందుకు నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధమైనా.. ముగ్గురు తమ పదవులు వదులుకోవడానికి సిద్ధపడలేదు. నాదెండ్ల భాస్కరరావు మాత్రమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి చేరారు. తరువాతి కాలంలోనూ ఎన్టీఆర్ ఇదే పంథాను కొనసాగించారు. 1991లో పీవీ నరసింహరావు కేంద్రంలో తన పదవిని కాపాడుకునేందుకు జేఎంఎంతోపాటు టీడీపీ ఎంపీలనూ చీల్చారు. ఆ సందర్భంలో ఎన్టీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఇది ఒకప్పటి చరిత్ర.. ఇప్పుడు ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ, అల్లుడు చంద్రబాబు నాయుడులు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న తీరు చూస్తే ‘‘ఛీ.. ఇది ఒకప్పటి టీడీపీనేనా?’’ అనిపిస్తుంది. చంద్రబాబు పెద్దగా విలువలు, ప్రజాస్వామ్య సూత్రాలు పట్టించుకోరు. పూర్తి అవకాశవాది. 2014 టర్మ్‌లో 23 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ముగ్గురు ఎంపీలను కొనుగోలు చేసి అప్రతిష్టపాలయ్యారు. విశేషం ఏమిటంటే ఈయన ప్రతిపక్షంలో ఉంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పశువులను కొన్నట్లు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని విమర్శిస్తారు. అధికారంలోకి రాగానే యథా ప్రకారం పార్టీ ఫిరాయింపులు, బేరసారాలు చేయిస్తుంటారు. ఆయన ఎన్టీఆర్ అల్లుడు, కాంగ్రెస్ నుంచి వచ్చి టీడీపీని కబ్జా చేసిన నేత కనుక అంతేలే అని అనుకుంటారు. కానీ.. స్వయాన ఎన్టీఆర్ వారసుడైన నందమూరి బాలకృష్ణ సైతం టీడీపీ మూల సిద్దాంతాలను గాలికి వదలివేసి తన తండ్రి ఆశయాలను మంటగలిపారు. ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న హిందుపూర్ మున్సిపాల్టీని టీడీపీ పరం చేయడానికి అనుసరించిన దిక్కుమాలిన రాజకీయాలు ఎన్టీఆర్ ఆత్మకు క్షోభను మిగుల్చుతాయని చెప్పాలి. బాలకృష్ణకు ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదును ప్రకటించింది. ఆడపిల్లలను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడి పలువురి విమర్శలకు గురైన బాలకృష్ణకు ఈ బిరుదు ఎలా ఇచ్చారో తెలియదు. అంతేకాక గతంలో ఆయన తన ఇంటిలో సినిమా రంగం వారు ఇద్దరిపై కాల్పులు జరిపిన ఘట్టం ఉండనే ఉంది. సినీ పరిశ్రమలో ఏభై ఏళ్ల చరిత్ర అని చెబుతారు కాని, ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బావమరిది కావడం ఒక ప్రధాన అర్హతగా తీసుకుని పద్మభూషణ్ బిరుదును కేంద్రం ప్రకటించిందన్న భావన ఏర్పడింది. ఎలాగోలా బిరుదు వచ్చింది.. దానికి తగ్గట్లు పద్దతిగా ఉంటారులే అనుకుంటే బాలకృష్ణ మళ్లీ వివాదాస్పదంగా వ్యవహరించి పరువు పోగొట్టుకున్నారు. గత ఎన్నికల్లో హిందుపూర్ మున్సిపాలిటీలోని 38 వార్డులలో 30 వార్డులు వైసీపీ గెలుచుకుంది. అనూహ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి శాసనసభ ఎన్నికలలో గెలిచి అధికారం సాధించడంతో ఆ పార్టీల దృష్టి స్థానిక సంస్థలపై పడింది. వీలైన చోట్ల ఇప్పటికే కొందరు మేయర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను చంద్రబాబు, లోకేష్‌లు ఎమ్మెల్యేల ద్వారా ప్రలోభపెట్టి ఆకర్షించారు. ఈ తరుణంలో ఖాళీగా ఉన్న మున్సిపల్ చైర్మన్, వైస్ ఛైర్మన్ ఉప ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని టీడీపీ తలపెట్టింది. దీనికి మంత్రి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ఉపయోగపడింది. చంద్రబాబు తీసుకు వచ్చిన రాజకీయ రాక్షస పాలన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైఎస్సార్సీపీకి పూర్తి మెజార్టీ ఉన్న చోట కూడా తాము గెలవడం కోసం రెడ్ బుక్ ను ప్రయోగించడం ఆరంభించారు. కార్పొరేటర్లను, కౌన్సిలర్లను భయపెట్టడం, కిడ్నాప్ లు చేయడం, పోలీసులే ఇందుకు నాయకత్వం వహించడం, దాడులు చేసి కౌన్సిలర్ల కుటుంబాలను భయభ్రాంతులకు లోను చేయడం వంటి నీచమైన చర్యల ద్వారా టీడీపీ, జనసేనలు స్థానిక ఎన్నికలలో గెలిచే యత్నం చేశాయి. హిందుపూర్లో స్వయాన బాలకృష్ణ ప్రలోభాలు, బెదిరింపులకు తెరదీసి అక్కడ మున్సిపల్ ఛైర్మన్ పదవిని కైవసం చేసుకున్నారని వార్తలు వచ్చాయి. తిరుపతిలో మరీ ఘోరం. టీడీపీకి ఒక్క కార్పొరేటరే ఉన్నప్పటికీ, ఉప మేయర్ పదవిని కైవసం చేసుకుంది. వైసీపీ పక్షాన పోటీ చేయడానికి సిద్దపడ్డ ఒక కార్పొరేటర్ ఇల్లును కూల్చడానికి టీడీపీ నేతల ఆదేశాల మేరకు అధికారులు తరలివెళ్లారు. అక్కడ మేయర్ అభ్యంతరం చెప్పినా వారు ఆమె మాట వినకపోవడం స్థానిక సంస్థల ఛైర్ పర్సన్ లకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న విలువ ఏమిటో అర్థమవుతుంది. బస్‌లో వెళుతున్న వైసీపీ కార్పొరేటర్లను కిడ్పాప్ చేయడం, బస్ పై దాడి చేసి అద్దాలు పగులకొట్టడం, తిరుపతి ప్రజలను భయభ్రాంతులను చేయడం వంటి ఘట్టాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయి. మరుసటి రోజు అధికారులు, పోలీసుల అండతో టీడీపీ అభ్యర్ది ఉప మేయర్ ఎన్నికలో విజయం సాధించిన తీరు స్థానిక ఎన్నికల అధ్వాన్న నిర్వహణకు అద్దం పడుతుంది. టీడీపీ భయపెట్టి ఓట్లు వేయించుకున్న కొందరు కార్పొరేటర్లు, ఆ వెంటనే తిరిగి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డిని కలిసి తమను టీడీపీ ఎలా వేధించింది వివరిస్తూ రోదించిన సన్నివేశం ఒక్కటి చాలు.. ఏపీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల సర్కార్ సిగ్గుపడడానికి. నూజివీడులో మంత్రి పార్థసారథి వైసీపీ కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి బెదిరించి మరీ టీడీపీని గెలిపించుకున్నారట. ఇక మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న పి.నారాయణ తన వంతు పాత్ర పోషించారనుకోవాలి. నెల్లూరు కార్పొరేషన్లో టీడీపీకి బలం లేకపోయినా, డిప్యూటి మేయర్ పదవిని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి ఫిరాయింపులను ప్రోత్సహించి గెలిపించుకున్నారు. స్థానిక సంస్థలలో ఫిరాయింపులను నిరోధించవలసిన మంత్రి నారాయణే ఇలా అరాచకంగా వ్యవహరించడం కూటమి ప్రభుత్వ నాసిరకం పాలనకు నిదర్శనంగా కనిపిస్తుంది. పిడుగురాళ్లలో సైతం ఇదే తరహా పరిస్థితి. తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నికే జరిగే హాలును టీడీపీ గూండాలు ఆక్రమించుకున్నారట. ఇంత అధ్వాన్నంగా పాలన సాగుతుంటే, ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ఈ ఘటలను రిపోర్టు చేయకుండా పురపాలికల్లో కూటమి జెండా అని నిస్సిగ్గుగా కథనాలు ఇచ్చాయి. ఈనాడు మీడియా అయితే టీడీపీ, జనసేన గూండాలు చేసిన విధ్వంసం గురించి విస్మరించడమే కాకుండా, గతంలో ప్రలోభాలు, బెదిరింపులతో వైసీపీ గెలిచిందని రాయడం ద్వారా తాను ఎలా దిగజారింది అడుగడుగునా రుజువు చేసుకుంటోంది. గత ఎన్నికలలో నిజంగానే ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగాయా అన్నది చూస్తే అలాంటిది పెద్దగా ఏమీ లేదు. టీడీపీ గెలిచిన తాడిపత్రి, దర్శి మున్సిపాల్టీలలో ఎక్కడా వైఎస్సార్సీపీ ఇబ్బంది పెట్టలేదు. ఆ విషయాన్ని కప్పిపుచ్చి ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తోంది. ఒకవేళ నిజంగానే అప్పుడు ఏవైనా కొన్ని ఘటనలు జరిగాయని అనుకున్నా, ఇప్పుడు కూడా అలా చేయడం తప్పు కాదన్నట్లు ఎల్లో మీడియా రాస్తే వీరిది జర్నలిజం అంటామా? ఆ పేరుతో చేస్తున్న ఇంకేదో వ్యాపారం అని అంటామా అన్నది ఆలోచించుకోవాలి. కేరళ హైకోర్టు కొద్ది రోజుల క్రితం పార్టీ మారే కౌన్సిలర్ లు అనర్హులు కావాల్సిందేనని తీర్పు ఇచ్చింది. ఏపీలో ఇలా ఫిరాయించిన వీరంతా అనర్హులు అవుతారు. కాని వ్యవస్థలు అన్నీ చోట్ల ఒకేరకంగా వ్యవహరించడం లేదు. చిత్రమేమిటంటే లేస్తే మనిషిని కాదు అంటే బెదిరించే జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాంటి అక్రమాలు ఎన్ని జరుగుతున్నా, తన పార్టీ వారి పాత్ర కూడా కనిపిస్తున్నా, నోరు మెదపడం లేదు. బీజేపీ ఎంపీ సి.ఎమ్.రమేష్ జమ్మలమడుగు క్లబ్లో అదే బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరుల ఆధ్వర్యంలో సాగుతున్న జూదం గురించి జిల్లా అధికారులకు లేఖ రాయడం ఏపీలో ఏ రకమైన పాలన జరుగుతోంది చెప్పకనే చెబుతోంది. రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రాంతాలలో ఈ విచ్చలవిడిగా జూద కార్యకలాపాలు సాగుతున్నాయన్నది వాస్తవం. అయినా బాగా పాలన చేస్తున్నామని చంద్రబాబు, పవన్‌లు వారి భుజాలు వారే చరచుకుంటారు. ఈ క్లబ్ లు, లిక్కర్ దందాలపై ఉపయోగించవలసిన రెడ్ బుక్ ను లోకేష్ ప్రత్యర్థి, వైఎస్సార్సీపీ నేతలపై ప్రయోగిస్తారు. మరో వైపు పవన్ సోదరుడు నాగబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని కుక్కలతో పోల్చుతున్నారు. అధికారం తలకు ఎక్కితే ఎలా మాట్లాడతారో చెప్పడానికి నాగబాబు వ్యాఖ్యలే నిదర్శనంగా ఉంటాయి. గతంలో తాను ప్రశ్నిస్తానంటూ పవన్ స్థాపించిన జనసేన అసలు స్వరూపం ఇది అన్నమాట. ఏది ఏమైనా ఏపీలో రోజు, రోజుకు పరిస్థితి ఎంతగా దిగజారుతోంది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. భవిష్యత్తులో కూటమి పాలకులకు ప్రజలు గుణపాఠం చెప్పకుండా ఉంటారా!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఈ అరాచకాలపై ఎవ్వరూ నోరు మెదపరేం?
గుంటూరు, సాక్షి: ఏపీలో కూటమి నేతల అరాచకాలు నానాటికీ శ్రుతి మించిపోతున్నాయి. పట్టపగలే.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కిడ్నాప్‌లు, దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీస్ వ్యవస్థ.. చోద్యం చూస్తూ ఉండిపోయింది. టీడీపీ గుండాల దాడులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు, రెండో బాస్ లోకేష్‌లు పట్టనట్లు ఉంటున్నారు. మరోవైపు.. ఆమధ్య ఏపీలో శాంతిభద్రల గురించి ఆందోళన వ్యక్తం చేసిన పవన్.. ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతున్నా మౌనంగా ఉండిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంత అన్యాయాలు జరిగాయో కళ్లారా చూసింది ఏపీ. అధికార పార్టీలు ఎన్నికల ప్రక్రియను అవహేళన చేసేశాయి. బలం లేనిచోట్ల కూడా బలవంతంగా కూటమి నేతలను గెలిపించుకుంది. ప్రలోభాలు, బెదిరింపులు, దాడులతో.. వైఎస్సార్సీపీ నుంచి సభ్యులను తమ దారికి తెచ్చుకున్నాయి. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక తర్వాత.. తాము బెదిరింపులతోనే ఓటేశామని భూమన వద్ద వైఎస్సార్సీపీ సభ్యులు మొరపెట్టుకున్న పరిస్థితి చూసిందే. హిందూపురం సహా మరికొన్ని చోట్లా అదే పరిస్థితి. పాలకొండ, పిడుగురాళ్ల, తునిలో అయితే కూటమి ఎఫెక్ట్‌తో రెండు సార్లు ఎన్నికలు వాయిదా పడ్డాయి.చివరికి ఎమ్మెల్సీలకూ రక్షణలేని దుస్థితితో పోలీసు బాసులు ఉన్నారు. నిర్మోహమాటంగా కూటమి తెచ్చిన రెడ్‌బుక్ రాజ్యాంగానికే సెల్యూట్ చేస్తున్నారు. ఏపీలో అఘాయిత్యాలపై ప్రశ్నించిన పవన్.. ఆ తర్వాత ఏమైందోగానీ చల్లబడ్డారు. బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల సంగతి సరేసరి. టీడీపీ దాడులపై ప్రశ్నించే దమ్ము వాటికి లేకుండా పోయింది. దీంతో వైఎస్సార్సీపీ ఒంటరి పోరు కొనసాగిస్తోంది. మరోవైపు.. ఈ అరాచకాలతో ప్రజాస్వామ్య వాదులు భయపడుతున్నారు. న్యాయస్థానాలు, మానవ హక్కుల సంఘాలు ఇప్పటికైనా ఏపీ పరిస్థితిని తీవ్రంగా పరిగణించాలని కోరుతున్నారు. -
కూటమి సర్కార్‌కు లోకేష్ రెడ్‌బుక్‌తో ముప్పు!
సూపర్ సిక్స్‌తోపాటు ఎన్నికల హామీలను అమలు చేసే ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్నట్ట? లేనట్టా?. హామీలైతే ఇచ్చాను కానీ.. అమలు చేయలేని పరిస్థితి ఉందని ఆయన పదే పదే చెబుతున్నా టీడీపీ జాకీ మీడియా మాత్రం ‘‘అబ్బెబ్బే.. బాబు అలా అనలేదు... ఇలా అనలేదు’’ అని గొంతు సవరించుకుంటోంది. ఎందుకు మరి? ఆ ఒక్కటీ అడక్కు అన్నట్టుగా.. ప్రజల దృష్టిని హామీల నుంచి మళ్లించేందుకు నానా తంటాలూ పడుతన్నాయెందుకు?. ఇటీవల చంద్రబాబు ఒక మీడియా సమావేశం పెట్టారు. నీతి ఆయోగ్ ఇచ్చిన లెక్కలు కొన్నింటిని వక్రీకరించి.. గత ప్రభుత్వాన్ని నిందించాలన్నది ఈ సమావేశం ఉద్దేశం. ఇందులోనే ఆయన ‘సూపర్ సిక్స్’పై ఆశలు పెట్టుకోవద్దని స్పష్టంగా చెప్పేశారు. డబ్బులున్నా ఇవ్వడం లేదని, నమ్మకం పెట్టుకున్నామని ఫీలింగ్స్‌తో ఉంటున్నారని అన్న బాబు.. కేంద్రం ఇతర ఖర్చుల కోసం ఇచ్చిన నిధులను సంక్షేమానికి పెట్టలేనని తేల్చేశారు. ఆర్థిక పరిస్థితి రీత్యా ప్రభుత్వమైనా అవస్థలు పడాలని లేదంటే రైతులైనా అవస్థలు పడాలని తన మనసులోని మాట చెప్పేశారు. అంటే.. రైతు భరోసా ఇవ్వలేనని అర్థమన్నమాట. తల్లికి వందనం ఈ ఏడాది కాదని ఇప్పటికే టీడీపీ నాయకత్వం తేల్చేసింది. మహిళలకు నెలకు రూ.1500, నిరుద్యోగ భృతి రూ.3000ల ఊసు అస్సలు ఎత్తడం లేదు. ఇవి కాకుండా.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాల్లోని వారికి యాభై ఏళ్లకే ఇస్తామన్న పింఛన్, ఇతర ఎన్నికల హామీల సంగతి సరేసరి. సుమారు లక్షన్నర కోట్ల రూపాయల వ్యయమయ్యే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి హామీల అమలు సాధ్యం కాదని ఎన్నికల సమయంలోనే వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి విస్పష్టంగా చెప్పినా.. తాము సంపద సృష్టిస్తామని టీడీపీ చెప్పుకొచ్చింది. జగన్ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తామని కూడా కూటమి నమ్మబలికింది. కానీ ఈ మాటలన్నీ ఎన్నికల్లో గెలిచి గద్దెనెక్క వరకే! ఆ తరువాత స్వరం మారింది. రోజుకో డైవర్షన్ రాజకీయాలతో అసలు సంగతిని నెమ్మదిగా ప్రజల మనసుల్లోంచి చెరిపేసేందుకు తలో సన్నాయి నొక్కు నొక్కడం మొదలుపెట్టారు. పైగా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అన్నింటికీ జగన్‌దే బాధ్యతన్నట్టుగా తలకూ.. మోకాలికి ముడివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈనాడు, ఆంధ్ర్రజ్యోతి వంటి వార్తా పత్రికలు ప్రజల పక్షాన నిలవాలన్న ప్రాథమిక జర్నలిజమ్ సూత్రాన్ని ఎప్పుడో గాలికి వదిలేసి.. చంద్రబాబుకు వత్తాసు పలికే పనిలో బిజీ అయిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేస్తాయని, సాక్షి మీడియాలో వచ్చిన వార్తల్లో తప్పులున్నాయని అనుకుందాం. అలాంటప్పుడు ఫలానా తేదీ నుంచి ఫలానా హామీ అమలవుతుందని గట్టిగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? కారణం ఒక్కటే. ఎల్లో మీడియా పైరవీలు, వ్యాపారాలు సాగాలంటే ఇలాగే పచ్చి అబద్దాలు ప్రచారం చేయాలి. వారికి గిట్టుబాటు అయితే ప్రజలందరికి స్కీములు వచ్చినట్లే అన్నమాట. చంద్రబాబు చెప్పిన విషయాలు కొన్నిటిని గమనించండి. కేంద్రం విశాఖ స్టీల్ కు రూ.11 వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.12 వేల కోట్లు, అమరావతికి రూ.15 వేల కోట్లు ఇచ్చింది. కానీ.. ఆ డబ్బును తాను సంక్షేమ పథకాలకు వాడలేనని బాబు అంటున్నారు. విశాఖ స్టీల్ ఇచ్చిన డబ్బుతో ఈయనకు ఏమి సంబంధం? పోలవరం ప్రాజెక్టు నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోకి ఎలా వస్తాయి? అమరావతికి ప్రపంచ బ్యాంక్ ఇచ్చింది అప్పు తప్ప గ్రాంట్ కాదు. అయినా బాబు ఈ మాటలన్నారంటే.. ఆయన అమరావతి రియల్ ఎస్టేట్ ప్రాధాన్యత ఏమిటన్నది అర్థమైపోతుంది. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, బడా ఆసాములకు ఉపయోగపడేలా నిధులు తీసుకు వచ్చి ఖర్చు చేస్తాం కాని, పేదలకు ఇస్తామన్న స్కీములకు మాత్రం డబ్బు తేలేమని చెప్పినట్లే కదా! దానికి తగినట్లే ఒక్క అమరావతి మినహా మిగిలిన చోట్ల మాత్రమే భూముల ధరలు పెంచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలా ఛార్జీల రూపంలో ప్రజలను మరోసారి బాదుతారన్నమాట. ఇదెంత వరకూ న్యాయం?. మరో వైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏపీకి ఏడు నెలల్లో మూడు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి వెళ్లారు. దానిని చంద్రబాబు కాదనలేదు. మరి ఆ డబ్బు అంతా ఏమైపోయింది? అయినా ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఎందుకు చెబుతున్నారు? ఏపీలో ఆర్దిక వ్యవస్థను పునరుద్దరించడానికి తొమ్మిది, పదేళ్లు పడుతుందట.. అంటే దాని అర్దం అప్పటివరకు ఈ స్కీములు అమలు చేయలేమని చెప్పడమే! పోలవరం, అమరావతి వంటి వాటిని అభివృద్ది చేసి అప్పుడు ఆదాయం సంపాదించి ఖర్చు చేస్తారట. అసలు సంపద సృష్టి అన్నది తన తర్వాతేనని, పీ-4 అంటే పేదలను భాగ్యవంతులను చేసే స్కీములన్నీ తన వద్ద ఉన్నాయని, తన మంత్రజాలంతో అన్నిటిని మార్చి వేస్తానని చంద్రబాబు చెబితే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాన, తందానా అన్నారా? లేదా? ఇక చంద్రబాబు కుమారుడు లోకేష్ ఏమి చెప్పారు. తన వద్ద అన్ని లెక్కలు ఉన్నాయని, అన్ని స్కీములు అధికారం వచ్చిన వెంటనే అమలు చేయడానికి సిద్దంగా ఉన్నామని, ఒకవేళ అమలు చేయలేకపోతే చొక్కా కాలర్ పట్టుకోండని ఓపెన్ గా చెప్పారా? లేదా? ఇప్పుడేమో ఎవరైనా హామీలను గుర్తు చేసినా, ప్రశ్నించినా, వారిపై రెడ్ బుక్ అంటూ కేసులతో వేధిస్తున్నారే! అందుకే వైఎస్సార్సీపీ నేతలు ఈ ‘రెడ్ బుక్’ను పిచ్చి కుక్కలతో పోల్చుతున్నారు. అవి ఎప్పుడు ఎవరిని కరుస్తాయో చెప్పలేం. లోకేష్ అర్థం చేసుకోవల్సింది ఏమిటంటే.. ఆ పిచ్చికుక్క ప్రమాదం టీడీపీకి కూడా పొంచి ఉంది. జీఎస్డీపీ 15 శాతం చొప్పున పెరిగితేనే స్కీములు అమలు చేస్తారట. ప్రజలు అర్థం చేసుకోవాలట. గత ప్రభుత్వం అప్పులు చేసిందని పదే, పదే గోబెల్స్ ప్రచారం కొనసాగించారు. ఎన్నికలకు ముందు రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందని, దానికి వైసీపీ కారణమని తప్పుడు ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ బడ్జెట్ లో రూ.ఏడు లక్షల కోట్లు అని వారే చెప్పారు. అందులో కూడా విభజన నాటి అప్పు, చంద్రబాబు 2014 టరమ్ లో చేసిన అప్పు కలిపి మూడున్నర లక్షల కోట్లు ఉన్న సంగతిని దాచేస్తారు. జగన్ టైమ్‌లో రెండేళ్లపాటు కరోనా సంక్షోభం ప్రభుత్వాన్ని అతలాకుతలం చేసింది. ప్రపంచం అంతటిని గడగడలాడించిన కరోనా విషయాన్ని ఏమార్చి అప్పులు అని ఊదరగొడతారు. ఏపీ శ్రీలంక మాదిరి మారిందని ఆరోజుల్లోనే ప్రచారం చేశారు. కానీ ఎన్నికల హామీలు ,సూపర్ సిక్స్ ప్రకటించడానికి మాత్రం చంద్రబాబుకు ఇవేవి అడ్డు కాలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిశీలించి హామీలు అమలు చేస్తామని మాటవరసకైనా అనలేదు. పైగా తమ అంత మొనగాళ్లే లేరని డబ్బా కొట్టుకున్నారు. 2014లో విభజిత ఏపీ అప్పులపై వడ్డీ కింద ఏడాదికి రూ.7488 కోట్లు వ్యయం చేస్తే, చంద్రబాబు టరమ్ పూర్తి అయ్యే 2018 నాటికి వడ్డీ చెల్లింపులు రూ.15342 కోట్లకు చేరింది. అంటే టీడీపీ హయాంలో ఎంత అప్పు తెచ్చింది తెలియడం లేదా? అయినా దాన్నంతటినీ వైసీపీ ఖాతాలో వేసి దుష్ప్రచారం చేస్తుంటారు. తాజాగా చంద్రబాబు సర్కార్ మరో రూ. 6,000 వేల కోట్ల అప్పు సేకరిస్తోంది. పోనీ ఆదాయపరంగా పరిశీలించినా జగన్ పాలనలోనే అధికంగా కనిపిస్తుంది. జగన్ పాలన కాలంలో జీఎస్డీపీ, జీఎస్టీ వంటి వాటిలో ఏపీ దేశంలోనే మొదటి ఐదు స్థానాలలో ఉంది. అప్పట్లో 12 శాతం వృద్ది కనిపిస్తే, చంద్రబాబు 2024లో అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిది నెలల్లో ఆదాయం - ఆరు శాతంగా ఉంది. ఇది చంద్రబాబు ప్రభుత్వం సాధించిన ప్రగతి అన్నమాట. కాగ్ గణాంకాల ప్రకారం 2024 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రాష్ట్ర ఆదాయంలో ఏకంగా 185 శాతం లోటు నమోదైందని మీడియాలో వార్తలు వచ్చాయి. టీడీపీ బడ్జెట్ లో రెండు లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తే, డిసెంబర్ వరకు 1.13 లక్షల కోట్లే వచ్చిందని లెక్కలు చెబుతున్నాయి. జీఎస్టీ, రిజిస్ట్రేషన్లు,అమ్మకం పన్ను ఇలా అన్ని అంశాలలో నెగిటివ్ గ్రోత్ నమోదు చేసుకుంది. సంపద సృష్టిస్తానని హోరెత్తించిన చంద్రబాబు ప్రభుత్వం సాధించింది ఏమిటంటే ఉన్న సంపదను కూడా కోల్పోవడం అన్నమాట. పోనీ అప్పులు ఏమైనా తగ్గాయా అంటే లేదు. డిసెంబర్ వరకు రూ.డెబ్బై వేల కోట్లకు పైగా తీసుకు వచ్చారు. అది కాకుండా ఇతరత్రా మరో రూ.ఏభై వేల కోట్లకు పైగా అప్పులు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్క అమరావతికే రూ.31వేల కోట్ల అప్పు సమకూర్చుకోవడానికి సన్నద్దం అవుతున్నారు. ఇదంతా ఏపీ ప్రజలు తీర్చవలసిన రుణాలే. పోనీ పరిశ్రమలు ఏమైనా కొత్తగా వస్తున్నాయా అంటే అదీ లేదు. గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు దావోస్ వెళ్లి రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకు వస్తే, చంద్రబాబు అండ్ కో భారీ బృందంతో వెళ్లి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు. దీనికి కారణం రెడ్ బుక్ పేరుతో పారిశ్రామికవేత్తలను వేధించడం, జిందాల్ వంటివారిని టీడీపీ ప్రభుత్వం తరిమేయడం కారణమన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఆసక్తికరమైన మరో విషయం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు స్కీములు అమలు చేయలేమని ఇంత ఓపెన్ గా చెబుతున్నా, జనసేన పక్షాన ఉప ముఖ్యమంత్రి పవన్ నోరు విప్పకపోవడం. సీజ్ ద షిప్ అని, తోలు తీస్తామని అంటూ డంబాలు పలుకుతూ ఇన్ని రోజులు తిరిగిన పవన్.. సూపర్ సిక్స్ , ఎన్నికల ప్రణాళిక హామీల గురించి చంద్రబాబు చేతులెత్తేసినట్లుగా మాట్లాడినా ప్రశ్నించలేకపోతున్నారు. రెడ్ బుక్ గురించి సదే,పదే మాట్లాడే లోకేష్ కూడా.. తండ్రి మాదిరే బుకాయించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. స్కీములు అమలు చేయకపోతే చొక్కా కాలర్ పట్టుకోవచ్చన్న ఆయన హామీ ప్రకారం.. మరి ఇప్పుడు చంద్రబాబు, పవన్, లోకేష్ లను నిలదీయవచ్చా!. ::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్ -
లోకేష్, అనగాని సత్యప్రసాద్ పై భూమన సంచలన వ్యాఖ్యలు
-
LIVE: పవన్ మౌనం బాబు, లోకేశ్ లో ఆందోళన పెంచుతోందా ?
-
8 నెలలకే ప్రజలకు 70MM సినిమా.. ప్రజలే మీ కాలర్ పట్టుకుని...!
-
Big Question: పవన్ సైలెన్స్.. టెన్షన్ లో లోకేష్
-
‘హామీలు అమలు చేయలేకపోతే కాలర్ పట్టుకోమన్నావ్ కదా లోకేష్’
సాక్షి, తిరుపతి : సూపర్ సిక్స్ అమలు చేయకపోతే నారా లోకేష్ కాలర్ పట్టుకోవాలన్నారు? ఏ కాలర్ పట్టుకోవాలో చెప్పాలని నారా లోకేష్‌ను మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేశారు. ఫీజ్ రియింబర్స్‌మెంట్‌తో పాటు అన్ని పథకాలు ఆపేశారు. ఆరోగ్యశ్రీని నిలిపివేశారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేశారు. ఎన్నికలకు ముందు.. బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ.. అధికారంలోకి వచ్చాక.. బాబు ష్యూరిటీ చీటింగ్ గ్యారెంటీ’ అని మండిపడ్డారు. శుక్రవారం ఆర్కే రోజా మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. విద్యార్థులకు చెల్లించాల్సిన 3900 కోట్లు చెల్లించలేదు, విద్యార్థుల భవిష్యత్తు రోడ్డున పడెస్తున్నారు చంద్రబాబు,ఆయన ప్రభుత్వం. విద్యా దీవెన 2800 కోట్లు, వసతి దివెన 1100 కోట్లు బకాయిలు చెల్లించలేదు. విద్య తోనే భవిష్యత్తు అభివృద్ధి. పేద విద్యార్థుల విద్యకు దూరం చేస్తున్నారు.దీనిపై మంత్రులు వితండంగా మాట్లాడుతారు.చంద్రబాబు దిగిపోయేనాటి రూ.2800 కోట్లు బకాయిలు వైఎస్ జగన్ చెల్లించుకుంటూ వచ్చారు. పెదవాళ్లంటే చంద్రబాబుకు చిరాకు. వైఎస్సార్ తెచ్చిన ఫీజు రియంబర్సమెంట్కు తూట్లు పొడుస్తున్నారు. ఏడు నెలల్లో చేయూత, అమ్మవడి, నాడు నేడు , ఆరోగ్యశ్రీ,, వాలంటీర్ వ్యవస్థలంటికి మంగళం పాడారు. జగన్‌పై విమర్శలు చెయ్యడానికే ప్రయత్నిస్తున్నారు. కానీ అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదు. సూపర్ సిక్స్ అమలు చెయ్యకుంటే కాలర్ పట్టుకోమన్నారు నారా లోకేష్. ఏ కాలర్ పట్టుకోవాలి ఇప్పుడు.చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు. ఎన్నికలకు ముందు తెలియదా ఇదంతా. బటన్ నొక్కడం పెద్ద విషయమా అన్న చంద్రబాబు ఇప్పుడు ఎందుకు హామీలు అమలు చెయ్యడం లేదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు హామీలకు గ్యారంటీ ఇచ్చారు. నేడు పవన్ కళ్యాణ్ ఏమైయ్యారు. ఎందుకు నిలదియడంలేదు. నేను, నా కుమారుడు అధికారంలోకి వచ్చామ్ చాలు అన్నట్లుగా ఉంది చంద్రబాబు ప్రవర్తన. బాబు స్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారు.. ఇప్పుడు దేనికి గ్యారంటీ లేదు. కూటమి ఓటు వేస్తే ప్రతి బిడ్డకు రూ.15 వేలు ఇస్తామని అన్నారు. ఈ రోజు ఇచ్చిన బాండ్ల కూడా పనికిరావు. రామానాయుడు సైకిల్ మీద ఇంటింటికి తిరిగి నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అన్నారు. నేడు ప్రజలను ఇబ్బందులలో నెట్టారు. చావు కబురు చల్లగా చెప్పినట్లు హామీలు అభివృద్ధి తర్వాతే అంటారు. జగన్ వల్లే హామీలు అమలు చెయ్యలేమని చేతకానీ మాటలు మాట్లాడుతున్నారు. మ్యానిఫెస్టో రూ.14 లక్షల కోట్లు అప్పు అన్నారు. రూ.6.5 లక్షల కోట్లు మాత్రమే అప్పుఅని అసెంబ్లీ సాక్షిగా మీరే చెప్పారు.. అబద్దాలతో అధికారంలోకి వచ్చింది కూటమీ ప్రభుత్వం.ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. విద్యార్థుల విద్యాదీవెన, వసతి దీవెన చెల్లించకుంటే వారి తల్లిదండ్రులతో మీ మెడలు వంచుతాము. అభివృద్ధి అంటే వల్గర్ పోస్టులు పెట్టడం కాదు. మీకు చేతకాకపోతే జగన్ దగ్గర కోర్సు తీసుకొండి . పవన్ కళ్యాణ్ మీకే చెప్తున్నా... హామీలు అమలు చెయ్యకపోతే ప్రశ్నించరా? మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే సహించేది లేదు. వడ్డీతో సహా తిరిగి ఇస్తాం..తప్పు చేస్తే ప్రశ్నిస్తాం. ట్రోల్స్ చేస్తే వెనక్కి తగ్గుతామనుకున్నారేమో.. తగ్గేదేలే. పవన్ కూడా విద్యార్థుల బకాయిలు చెల్లించాలని సీఎం చంద్రబాబును ప్రశ్నించాలని ఆర్కే రోజా డిమాండ్ చేశారు. -
నా కాలర్ పట్టి అడగండి..
-
ఏపీకి ఒక్క రూపాయి ఉపయోగం లేదు బాబు, లోకేష్‌పై గొల్లపల్లి ఫైర్..
-
చంద్రబాబు మోసంపై YSRCP, ప్రజా సంఘాల నాయకుల ఫైర్
-
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచినా నో జాబ్ కేలండర్
-
Big Question: కాలర్ పట్టుకుందాం రండి.. లోకేష్ కోసం వెయిటింగ్
-
చెప్పారంటే.. చేయరంతే!
సాక్షి, అమరావతి: ‘ప్రతి సంవత్సరం జాబ్ కేలండర్ విడుదల చేస్తాం. రికార్డు చేసుకో.. డేటు టైము రాసుకో.. పారిపోయే బ్యాచ్ కాదు నేను. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే జాబ్ కేలండర్ ప్రకటిస్తాం. ఎన్ని ఉద్యోగాలు.. ఎప్పుడు ఎగ్జామ్స్.. ఎప్పుడు ఇంటర్వ్యూలు.. ఎప్పుడు ఆఫర్ లెటర్లు (Offer Letters) ఇచ్చేది చాలా స్పష్టంగా 2025 జనవరి ఫస్ట్‌నే ప్రకటిస్తాం’ అని ఎన్నికలకు ముందు 2024 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు యువగళం సభల్లో నారా లోకేశ్ (Nara Lokesh) ఆర్భాటంగా సెలవిచ్చారు. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచాయి. జనవరి ఒకటో తేదీ వెళ్లిపోయింది. ఫిబ్రవరి వస్తోంది. జాబ్ కేలండర్ (Job Calendar) ప్రకటన మాత్రం లేదు. ఇప్పటిదాకా జాబ్ కేలండర్ ఏమైందో పట్టించుకున్నదే లేదు. లోకేశ్ మాత్రమే కాదు.. నారా చంద్రబాబు సైతం ఇదే హామీని పదేపదే ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు పూర్తవుతున్నా ఇంతవరకు ఏపీపీఎస్సీ నుంచి ఒక్క ప్రకటనా వెలువడలేదు. పైగా గత ప్రభుత్వంలో ఇచ్చిన గ్రూప్–1, 2 మెయిన్స్ పరీక్షలను పలుమార్లు వాయిదా వేశారు. సంస్కరణల పేరుతో గ్రూప్–2లో ఉన్న 10 రకాల ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్–1లో కలిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత పెరుగుతుండడంతో జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు కొత్త తేదీలను చేర్చి డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌గా లీకులిచ్చి నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. మరోపక్క రాష్ట్ర అటవీ శాఖలోని 689 ఖాళీల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతించి 10 నెలలు దాటినా, వాటికి నోటిఫికేషన్ ప్రకటించలేదు. గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షలు నిర్వహించకపోగా, కొత్తగా 150 గ్రూప్–1 పోస్టులు సృష్టిస్తున్నట్టు డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో పేర్కొనడం చూస్తుంటే కూటమి ప్రభుత్వ పెద్దలు అబద్ధాలతో నెట్టుకొస్తున్నారని స్పష్టమవుతోంది.10 లక్షల మందిలో తీవ్ర ఆందోళన కూటమి ప్రభుత్వంలో గ్రూప్–2, గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలను రెండుసార్లు వాయిదా వేశారు. నిరుద్యోగుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ఫిబ్రవరిలో గ్రూప్–2, మే నెలలో గ్రూప్–1 మెయిన్స్‌కు తేదీలు ప్రకటించారు. అయితే, గత సంఘటనలతో ఆయా తేదీల్లో పరీక్షలు జరుగుతాయో లేదో అనే అనుమానం నిరుద్యోగులను వెంటాడుతోంది. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలను చూస్తున్న అభ్యర్థులు గతంలో ప్రకటించిన మరో 21 నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షలపై ఆందోళన చెందుతున్నారు. ఈ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకుని దాదాపు 10 లక్షల మందికి పైగా అభ్యర్థులు పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు. ఎనిమిది నెలలుగా ఈ పరీక్షల నిర్వహణపై ఇటు ఏపీపీఎస్సీ, అటు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనా లేదు. దీంతో యువత భవిష్యత్ అగమ్య గోచరంగా మారింది. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్‌తో పాటు ఇచ్చే షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించి, పోస్టులు భర్తీ చేశారు. కానీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ఏపీపీఎస్సీని నీరుగార్చింది. దీంతో పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియక ఇంకా శిక్షణ కొనసాగించాలా.. లేక విరమించాలో తేల్చుకోలేక నిరుద్యోగ అభ్యర్థులు మదనపడుతున్నారు. ఈ 21 నోటిఫికేషన్లకు షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి డిసెంబర్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేయాలి. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లలో గ్రూప్–2, గ్రూప్–1, డీవైఈవో, డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ లెక్చరర్లు, పాఠశాల విద్యా శాఖలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వంటి కీలమైనవి 19 నోటిఫికేషన్లు ఉన్నాయి. వీటిలో గ్రూప్–2, గ్రూప్–1తో పాటు డీవైఈవో పోస్టులకు మాత్రమే ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తిచేసి ఫలితాలను విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం గ్రూప్–2 మెయిన్స్ జూలైలో జరగాల్సి ఉండగా ఫిబ్రవరికి వాయిదా వేశారు. సెప్టెంబర్‌లో జరగాల్సిన గ్రూప్–1 మెయిన్స్ మే నెలకు వెళ్లిపోయింది. డీవైఈవో మెయిన్స్ పరిస్థితీ అలాగే ఉంది. కేవలం ఈ మూడు పరీక్షలకు సంబంధించి మెయిన్స్‌కు అర్హత సాధించిన వారు దాదాపు 1.15 లక్షల మంది ఉన్నారు. వీరిలో చాలా మంది ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులు. వారంతా దీర్ఘకాలిక సెలవులు పెట్టి మెయిన్స్‌కు సిద్ధమవుతున్నారు. పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో వారంతా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని ‘యువగళం’లో యువతకు హామీ ఇచి్చన విషయాన్ని 2023 నవంబర్ 30న ‘ఎక్స్’లో పోస్టు చేసిన లోకేశ్ మభ్య పెట్టడమే సర్కారు విధానంరాష్ట్ర అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గతేడాది అనుమతిచ్చింది. ఇందులో ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ పోస్టులు 37, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు 70, బీట్ ఆఫీసర్ పోస్టులు 175, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 375, తానాదార్ 10, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు 12, జూనియర్ అసిస్టెంట్లు 10 పోస్టులు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు సర్వీస్ కమిషన్‌కు ప్రభుత్వం అనుమతించలేదు. కానీ కొత్తగా 150 గ్రూప్–1 పోస్టులు ఉన్నట్టు డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో పేర్కొనడం గమనార్హం. వాస్తవానికి ప్రభుత్వ శాఖల్లో పోస్టులు భర్తీకి ముందు ఖాళీలను గుర్తించాలి. నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వం ఇవేమీ చేయకుండానే 150 గ్రూప్–1 పోస్టులు ఉన్నట్టు పేర్కొని నిరుద్యోగులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. పైగా గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షల తేదీలను చేర్చి ‘డ్రాఫ్ట్ జాబ్ కేలండర్–2025’గా ప్రచారం చేయడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.యువత సంక్షేమం పేరుతో జ్యాబ్ క్యాలెండర్ ఇస్తామని టీడీపీ–జనసేన మేనిఫెస్టోలో పేర్కొన్న భాగం గత ప్రభుత్వంలో షెడ్యూల్ ప్రకారమే భర్తీవైఎస్ జగన్ ప్రభుత్వంలో సర్వీస్ కమిషన్ నుంచి వచ్చిన అన్ని నోటిఫికేషన్లకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి పక్కాగా పోస్టులు భర్తీ చేశారు. గత ఐదేళ్లలో కమిషన్ ద్వారా అన్ని శాఖల్లో 78 నోటిఫికేషన్లు ఇచ్చి అర్హత గల ఏ నిరుద్యోగికీ అన్యాయం జరగకుండా 6,296 ఉద్యోగాలను వివాద రహితంగా నియామకాలు పూర్తి చేశారు. రెండుసార్లు గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల పోస్టుల భర్తీ చేపట్టి, ఏకంగా 1.34 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. ఏ ఒక్క నోటిఫికేషన్ వాయిదా పడిన సందర్భంగానీ, రద్దు చేయడం గాని జరగలేదు. 2019కి ముందు టీడీపీ ప్రభుత్వం వివాదాస్పదంగా మార్చిన పరీక్షలను సైతం కోర్టు కేసులతో పాటు అన్ని వివాదాలను పరిష్కరించి పోస్టులు భర్తీ చేశారు. 2024లో కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల సర్వీస్ కమిషన్ల పని తీరుపై విడుదల చేసిన నివేదికలో దేశంలోని 15 రాష్ట్రాల సర్వీస్ కమిషన్లు వివాదాల్లో చిక్కుకుంటే, వివాద రహితంగా ఉద్యోగాలు భర్తీ చేసిన బోర్డుగా ఏపీపీఎస్సీ ప్రథమ స్థానంలో నిలిచింది. చదవండి: అప్పులు తీసుకునే శక్తి ఏపీకి లేదు2019కి ముందు ఇచ్చిన నోటిఫికేషన్లపై వివాదాలు చెలరేగి నిరుద్యోగ యువత నష్టపోయారు. ప్రస్తుతం ఉద్యోగ పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు చేస్తున్న ఉద్యోగాలకు సెలవు పెట్టి ప్రతినెలా సగటున రూ.15 వేల చొప్పున ఖర్చు చేస్తూ ఆర్థికంగా నలిగిపోతున్నారు. 2018 డిసెంబర్లో నాటి టీడీపీ ప్రభుత్వం 32 నోటిఫికేషన్లు ఇచ్చినా, ఒక్క నోటిఫికేషన్‌కు పరీక్షలు నిర్వహించ లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో 2019కి ముందున్న పరిస్థితే వచ్చిందని నిరుద్యోగ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వైఎస్ జగన్ పై చంద్రబాబు, లోకేశ్ దుష్ప్రచారం చేస్తున్నారు
-
లోకేష్ తప్పుడు ప్రచారం మానుకో: నాగార్జున యాదవ్
సాక్షి, తాడేపల్లి: అసర్ సర్వేని తప్పుడు తక్కెడగా చేశారని.. లోకేష్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారంటూ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు పాలనలో విద్యారంగం అద్బుతంగా ఉన్నట్ఠు, జగన్ పాలనలో నాశనం అయినట్టు లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.ఇంగ్లీషు మీడియం చదువులు, సీబీఎస్ఈ చదువులు, ఐబీ సిలబస్ తెచ్చిన ఘనత జగన్‌ది. అలాంటి జగన్ ప్రాభవాన్ని మసకబార్చాలని లోకేష్ ప్రయత్నిస్తున్నారు. రూ.3872 కోట్లతో నాడు-నేడు కింద ఫస్ట్ ఫేజ్‌లోనే స్కూళ్లని జగన్ అభివృద్ధి చేశారు. మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం వంటి మౌలిక సదుపాయాలను జగన్ కల్పించారు. ఇప్పటికీ వెబ్ సైట్ లో ఆ వివరాలను చూసుకోవచ్చు’’ అని నాగార్జున యాదవ్ వివరించారు.వైఎస్. జగన్ హయాంలో విద్యారంగంలో మంచి మార్పులు వచ్చాయని.. కేంద్ర ప్రభుత్వ నివేదికల్లోనే తేలింది. చంద్రబాబు, జగన్ హయాంలను బేరీజు వేస్తూ ఎవరిని అడిగినా సమాధానం చెప్తారు. జరిగిన అభివృద్ది కళ్లెదుటే కనిపిస్తుంది. జగన్ ఐదేళ్ల పాలనలో నాడు-నేడు జరగలేదని లోకేష్ చెప్పగలరా?...స్కూళ్ల అభివృద్ధి జరగలేదని చెప్పించగలరా?. దేశం మొత్తం జగన్ చేసిన అభివృద్ధిని కొనియాడుతోంది. ఇతర రాష్ట్రాలు సైతం జగన్ బాటలో నడవాలని నిర్ణయించుకున్నాయి. అలాంటి విప్లవాత్మక మార్పులు తెచ్చిన జగన్‌పై తప్పుడు నివేదికలతో లోకేష్ మాట్లాడకూడదు’’ అంటూ నాగార్జున యాదవ్ హితవు పలికారు. -
3లక్షల మెజారిటీ ఇస్తే.. 3వందల లారీలతో ...గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు
-
కూటమి నేతలకు ప్రజా సంక్షేమం పట్టడం లేదు: మాజీ మంత్రి అమర్నాథ్
-
బాలయ్య, జూనియర్, లోకేష్.. అంతా చంద్రబాబు మిథ్య!
‘‘అందరినీ అన్నిసార్లూ నమ్మించ లేం’’ అంటుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విషయంలో ఇప్పుడు అదే రుజువు అవుతోంది. దావోస్‌లో వారసత్వం గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. కుమారుడు, మంత్రి లోకేష్‌కు పార్టీ, ప్రభుత్వ పగ్గాలు అప్పగించే విషయంపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ ‘‘వారసత్వం అనేది ఒక మిథ్య’’ అని, ‘‘వారసత్వం ఒక్కటే అన్నీ ఇవ్వలేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. తాను సొంతంగా దావోస్ తీసుకెళ్లిన మీడియాతో ఆయన ఈ మాట అంటున్నారంటే.. ఆ వ్యాఖ్యల మర్మం ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ‘‘ఎవరికైనా మెరుగైన అవకాశాలు రావచ్చు. వారు వాటిని ఎలా అందిపుచ్చుకుంటారన్నది ముఖ్యం. వ్యాపారంలో ఉండి ఉంటే లోకేష్‌కు సులభంగా ఉండేది. ప్రజలకు సేవ చేయాలని రాజకీయాలలోకి వచ్చారు. ఇందులో వారసత్వం లేదు’’ అని ఆయన చెబుతున్నారు. బాగానే ఉంది కానీ దీన్ని నమ్మేదెవరు? రెండు దశాబ్దాలుగా కుమారుడిని వ్యూహాత్మకంగా ప్రోత్సహిస్తున్న వ్యక్తి ఈ చంద్రబాబేనాయె! ఏదో మాట వరసకు వారసత్వం అన్నీ ఇవ్వదని అంటున్నా... అనేక ఇతర నేతల మాదిరిగానే లోకేష్‌కూ అదే పునాది అన్నది అందరికీ తెలిసిన విషయమే. లోకేష్‌ను రాజకీయాల్లోకి తీసుకొస్తారా?.. అనే ప్రశ్నకు ఆయన గతంలో చాలా అసహనం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు లోకేష్‌కు ప్రజాసేవ చేయాలనుంది అని ఆయనే అంటున్నారు. 2009 ఎన్నికల సమయంలో టీడీపీ ప్రచారం కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను వాడుకుని ఆయన్ను పక్కకు తప్పించిన విషయం మరీ పాత విషయమైతే కాదు. ఆ తరువాతి ఏడాది జరిగిన మహానాడులో జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రాధాన్యం ఇవ్వకపోవడాన్ని బట్టే లోకేష్ ఆరంగేట్రానికి రంగం సిద్ధమైందని అందరూ ఊహించారు. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు.. నగదు బదిలీ పథకాలను తన కొడుకే ఆవిష్కరించినట్లు బిల్డప్‌లు ఇవ్వడమూ మొదలుపెట్టారు. 2014 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటికీ ఎందుకో మరి పోటీ మాత్రం చేయలేదు. అయితే టీడీపీ అనూహ్యంగా అధికారంలోకి రావడంతో లోకేష్‌కు ప్రాధాన్యత వచ్చింది. మంత్రిని చేయాలని కుటుంబం నుంచే ఒత్తిడి రావడం మొదలైంది. కాదనలేక చంద్రబాబు ఎమ్మెల్సీని చేసి ఆ తరువాత మంత్రిపదవి కట్టబెట్టారు. ఇదంతా వారసత్వ రాజకీయం కాదంటే ఎవరైనా నమ్ముతారా? ఎలాంటి కష్టం, ఎదురుచూపు, నిరాశల్లేకుండా అనాయసంగా ఎమ్మెల్సీ, మంత్రి పదవులు రావడం ఆషామాషీ ఏమీ కాదన్నది ఎవరిని అడిగినా చెబుతారు. లోకేష్‌కు ఈ పదవులు మాత్రమే కాదు... తండ్రి పేరుతో లేదంటే ఆయన తరఫున పెత్తనాలు చేసే స్థాయి కూడా వచ్చిందన్నది బహిరంగ రహస్యం. లోకేష్‌ను కలిసేందుకు టీడీపీ నేతలు క్యూ కడితే.. బాబును కలిసి వచ్చారా? అంటూ అప్పుడప్పుడూ చంద్రబాబు కూడా వాకబు చేసేవారని చెబుతారు. 2019 శాసనసభ ఎన్నికలలో లోకేష్ ఓడిపోయినప్పుడు కూడా చంద్రబాబు రాజకీయాలు సరిపడవని, వ్యాపారం చేసుకోవాలని లోకేష్‌కు సూచించలేదు. బదులుగా పార్టీలో ప్రాధాన్యం మరింత పెరిగింది. పాదయాత్ర చేసి రెడ్ బుక్ అంటూ ప్రచారం చేసి లోకేష్ సొంత గుర్తింపు కోసం ప్రయత్నించి ఉండవచ్చు. అది వేరే విషయం.2024 ఎన్నికలలో టిక్కెట్ల పంపిణీలో కీలకంగా ఉండడం, తండ్రికి సంబంధం లేకుండా పలు హామీలు ఇచ్చారు కూడా. వారసత్వ అధికారం లేకుండానే అవన్ని చేయగలుగుతారా? రెడ్ బుక్ అంటూ కొందరు రిటైర్డ్ పోలీసు అధికారులను పెట్టుకుని రాష్ట్రంలో వైసీపీ వారిపై అక్రమ కేసులు పెట్టిస్తున్నా, అన్ని శాఖలలో జోక్యం చేసుకుంటున్నా, చంద్రబాబు కన్నా లోకేషే పవర్ పుల్ అన్న భావన ఏర్పడినా అదంతా వారసత్వం ఇచ్చిన బలమే. దానిని అడ్డుకునే స్థితిలో కూడా చంద్రబాబు లేరు. నిజానికి చంద్రబాబు ధైర్యంగా లోకేష్ తన వారసుడని చెప్పి ఉండవచ్చు. కానీ అలా అంటే ప్రజలలో ఏమైనా నెగిటివ్ వస్తుందేమోనని అనుమానంతో ఇలా ఫీలర్లు వదులుతూంటారు. పార్టీ శ్రేణులు, ప్రజల్లో తదుపరి టీడీపీ అధినేత లోకేష్ అన్న భావన బలపడేలా చేస్తారన్నమాట. ఎల్లో మీడియా ఈ మాటలకు రకరకాల కలరింగ్ ఇస్తూంటుంది. పని తీరు, ప్రతిభ ఆధారంగానే లోకేష్ వారసుడిగా ఎదగాలి తప్ప తన కొడుకు అన్న ఒక్క కారణంతో వారసుడు కాలేడని చెప్పడం చంద్రబాబు అభిప్రాయమని జాకీ మీడియా విశ్లేషణ చేసింది. అలాగైతే ఎవరు కాదంటారు. ఇంకెవరైనా ఇలాగే రాజకీయాలలోకి వస్తే ఇదే జాకీ మీడియా అడ్డమైన నీచపు రాతలు రాస్తుంటుంది. లోకేష్ సొంత ప్రతిభతో రాజకీయాలలోకి వచ్చారా? లేక వారసత్వంతో వచ్చారా అన్నది అందరికి తెలిసిన సత్యం. దీనికి ఇంత నాటకీయత పులమడం అవసరమా? అన్నదే ప్రశ్న. ఒకప్పుడు ఎన్.టి.రామారావు తన కుమారుడు బాలకృష్ణను రాజకీయ వారసుడని ప్రకటించినప్పుడు.. దాని వల్ల నష్టం జరుగుతుందని చంద్రబాబు ప్రచారం చేయించారు. ఎన్టీఆర్ ఆ ప్రకటనను వెనక్కి తీసుకునేలా చేశారు. అప్పుడే ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఎవరూ వారసులు కాకుండా తానే చక్రం తిప్పేలా ఆయన వ్యూహ రచన చేసుకున్నారని చెబుతారు. చంద్రబాబు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరాక కొంతకాలానికి కర్షక్ పరిషత్ ఛైర్మన్‌గా ,ఇతరత్రా అధికారం చెలాయించడం ఆరంభించగలిగారు. దానికి కారణం మామ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడం వల్లే కదా! కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఆ నాయకుడిని, ఈ నాయకుడిని ప్రసన్నం చేసుకుని మంత్రి పొందిన చంద్రబాబుకు టీడీపీలో చేరాక ఆ ఇబ్బంది లేకుండా పోయింది. రాజ్యాంగేతర శక్తిగా ఉన్నారన్న విమర్శలు కూడా వచ్చేవి. 1994లో టీడీపీ మళ్లీ గెలిచిన తర్వాత రెండు కీలకమైన శాఖలు రెవెన్యూ, ఫైనాన్స్ పొందగలిగారంటే మామ అండ ఉండబట్టే కదా.. దీనిని వారసత్వం అని నేరుగా అనకపోవచ్చు. కానీ అల్లుడు గిల్లుడు అని చమత్కరిస్తుంటారు. ఎన్టీఆర్‌ను పదవిచ్యుతుడిని చేయడానికి కూడా బంధుత్వమే ఉపయోగపడింది కదా! అల్లుడు తన పదవి ఎందుకు లాక్కొంటారని ఎన్టీఆర్ అమాయకంగా ఉండిపోయారు. దానిని అడ్వాంటేజ్ చేసుకుని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను తనవైపు లాక్కొని సీఎం సీటు ఎక్కుతున్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలంతా అదంతా కుటుంబ వ్యవహారం అనుకున్నారు. ఇందులో చంద్రబాబు కుట్ర రాజకీయాలు కూడా ఉండవచ్చు. అది వేరే విషయం. ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు ఎవరూ తనకు పోటీకి రాకుండా జాగ్రత్తపడ్డారు. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఆశపెట్టి ఈనాడు రామోజీరావు సాయంతో బయటకు గెంటేశారు. ఇది వారసత్వ గొడవ కాదా? లక్ష్మీపార్వతిని సాకుగా చూపించడంలో ఉన్న మతలబు తెలియదా! హరికృష్ణ పరిస్థితి అంతే. టీడీపీ అధ్యక్షుడిని చేస్తానని వాగ్దానం చేసి, ఆ తర్వాత తాత్కాలికంగా మంత్రిని చేసి, ఆ పదవి కూడా పోయేలా చేశారు. దాంతో హరికృష్ణ పార్టీ వీడిపోయినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. బాలకృష్ణతో సత్సంధాలు ఉండేలా చేసుకుని వియ్యంకుడిగా మార్చుకుని ఆయనను పూర్తిగా వారసత్వ పోటీ నుంచి తప్పించగలిగారు. ఇవన్ని రాజకీయంగా చంద్రబాబు తెలివిగానే చేశారు. తద్వారా ఎన్టీఆర్ వారసులు కాకుండా, ఇప్పుడు తన వారసుడు లోకేష్ సీఎం అయ్యేందుకు బాట వేసుకున్నారు. అందులో బాగంగానే ప్రభుత్వ ప్రచారం ప్రకటనలలో పవన్ కళ్యాణ్ ఫోటోతో పాటు లోకేష్ ఫోటో కూడా ప్రచురించారు. లోకేష్ డిప్యూటి సీఎంగా ను చేయాలని తన సమక్షంలోనే టీడీపీ నేతలు డిమాండ్ చేసినా ఆయన ఏమీ మాట్లాడలేదు. మరెవరికైనా ఆ పదవి ఇవ్వాలని చంద్రబాబు ఎదుట అనగలరా? అంటే ఆయన ఊరుకుంటారా? ఇదంతా వారసత్వం కాకపోతే ఏమిటి? చేసేది చేస్తూనే ఏమి తెలియనట్లు నటించడమే చంద్రబాబు రాజకీయం. దానికి ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుంటారు. పవన్ కల్యాణ్ వైపు నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ పెద్ద వ్యతిరేకత వచ్చే పరిస్థితి లేదు. పవన్ ఒకరకంగా ఇప్పటికే మానసికంగా సిద్దపడ్డారని విశ్లేషణలు వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ముఖ్యమంత్రుల కుమారులు రాజకీయాలలోకి వచ్చారు. సీఎంలు అయ్యారు. అదేదో జరగకూడని సంగతేమీ కాదు.లోకేష్ ను సీఎం పదవి ఇవ్వాలని కుటుంబపరంగా డిమాండ్ వస్తున్నదంటే అది వారసత్వం వల్ల కాక మరేమిటి? ఆ ఒత్తిడి నుంచి బయటపడడానికి ప్రస్తుతానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి సరిపెట్టాలని చూస్తున్నది నిజం కాదా? అంతెందుకు! తన తర్వాత లోకేష్ ముఖ్యమంత్రి కాబోడని, పార్టీ అధినేత కాజాలరని ఇంటకానీ, బయటకానీ చెప్పగలరా? ఉప ముఖ్యమంత్రిని చేయబోవడం లేదని ఇంతవరకు చెప్పలేదు. పైగా కూటమిలో చర్చించుకుంటామని చెప్పి పరోక్షంగా ధృవీకరించారు. అవన్ని కప్పిపుచ్చి, వారసత్వం మిథ్య అని, మరొకటని కబుర్లు చెప్పి, ఆయనేదో వారసత్వానికి వ్యతిరేకమైనట్లు, లోకేష్ ప్రజాసేవకుడు అయిపోయినట్లు పిక్చర్ ఇచ్చుకునే ప్రయత్నమే బాగోలేదు. దానినే హిపోక్రసీ అని అంటారు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నారావారిని ఇరకాటంలో పడేసిన సొంత మీడియా!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు లోకేష్, టీజీ భరత్‌ల దావోస్ పర్యటన రాష్ట్రానికి పెట్టుబడులేవీ తేకపోయినప్పటికీ ఒక రకంగా ఉపయోగపడిందని చెప్పాలి. ఎందుకంటే అంతటి ముఖ్యమైన కార్యక్రమాలనూ రాజకీయాలకు వేదికగా చేసుకోవచ్చునని, తమకు కావాల్సిన విధంగా ఎలివేషన్లు ఇచ్చుకోవచ్చునని టీడీపీ ప్రభుత్వం నిరూపించింది. ఖాళీ చేతులతో తిరిగి వచ్చినా, ఏపీ బ్రాండ్ అంటూ కొత్త డైలాగుతో మీడియా మేనేజ్మెంట్లో తమకు తామే సాటి అని చెప్పుకోవడం హైలైట్!. దావోస్‌లో చంద్రబాబు, లోకేష్‌లు చాలా కష్టపడ్డారని మీడియాలో కథనాలు వచ్చాయి. పరిశ్రమల శాఖ మంత్రి భరత్ మాత్రం లోకేషే భావి ముఖ్యమంత్రి అని పొగడటంలో బిజీ అయిపోయారు. ఏపీలో లోకేష్‌లాగా చదువుకున్న ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారా అని అడగడం ఒక హైలైట్ అయితే.. ఆ మిషతో భావి ఉప ముఖ్యమంత్రి ఆయనే అని జనసేన అధినేత పవన్‌కు సిగ్నల్స్ ఇవ్వడం ఇంకో హైలైట్. అయితే దావోస్ పర్యటనకు ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి ఎల్లో మీడియా ఇచ్చిన కవరేజీ బహుశా బాబు, లోకేష్‌లను ఇరకాటంలో పెట్టేసి ఉంటాయి. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో రాష్ట్రానికి రావడమే తరువాయి అన్నట్టుగా సాగింది ఈ మీడియా బ్యాండ్ బాజా. తీరా పర్యటన ముగిసిన తరువాత చూస్తే.. సున్నకు సున్నా.. హళ్లికి హళ్లి!! ప్రతిపక్షంలో ఉండగా పవన్.. 'దావోస్ వెళ్లి సాధించే పెట్టుబడులు ఏముంటాయి? సూటు,బూటు వేసుకువెళ్లి హడావుడి చేయడం తప్ప.రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగుంటే పారిశ్రామికవేత్తలే ఏపీకి వస్తారు’ అని చెప్పినట్లే.. ఇప్పుడు రెడ్‌బుక్ రాజ్యాంగం పుణ్యమా అని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని అనుకోవాలి. మహారాష్ట్రకు రూ. 15 లక్షల కోట్లు, తెలంగాణకు రూ.1.70 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదరడమేమిటి.. ఏపీకి ఒక్కటంటే ఒక్క ఎంఓయూ కూడా కుదరక పోవడం ఏమిటి? కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి బాబు, లోకేష్‌లు సాధించింది ఏమిటీ అంటే.. ‘‘ఏపీ బ్రాండ్’’ను ప్రచారం చేసి వచ్చారట! మరి.. చంద్రబాబు గతంలోనూ చాలాసార్లు దావోస్ వెళ్లివచ్చారే? అప్పట్లో ఏపీకి బ్రాండ్ ఇమేజీ రానట్టేనా? పైగా అప్పట్లో దావోస్ వెళ్లిన ప్రతిసారి అదిగో పెట్టుబడులు.. ఇదిగో ఇన్వెస్ట్మెంట్లు అని ఎల్లోమీడియా భలే బాకాలూదేదే? బాబు స్వయంగా తనను చూసి బోలెడన్ని కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చాయని చెప్పుకుంటూ ఉంటారు కదా? ఈసారి ఏమైంది? విశాఖపట్నంలో భాగస్వామ్య సదస్సు నిర్వహించినప్పుడు రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని ప్రచారం జరిగింది. అయితే.. వీటిల్లో అధికమొత్తం బోగస్ ఒప్పందాలన్న విమర్శ వచ్చింది. దారిన పోయేవారిని కూడా కంపెనీ సీఈవోలుగా ముస్తాబు చేసి ఫొటోలు దిగారు అని ససాక్ష్యంగా నిరూపితమైంది. ఇప్పుడు ఆ డ్రామా కూడా ఆడలేకపోయారు. చంద్రబాబు, లోకేష్‌లు కంపెనీలతో చర్చలు జరిపారని వార్తలొచ్చాయి. మంచిదే. కానీ అక్కడ కూడా వైసీపీ ప్రభుత్వం గురించి, గత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ గురించి వ్యతిరేక వ్యాఖ్యలు చేసి కంపెనీల్లో అనుమానాలు రేకెత్తించారా? ఈ అనుమానం ఎందుకొస్తుందంటే.. జగన్ మళ్లీ వస్తాడేమో అని పెట్టుబడిదారులు భయపడుతున్నట్లు లోకేష్ చాలాసార్లు వ్యాఖ్యానించారు మరి!. అలాగే ‘జగన్ రాడు’ అని బాండ్ రాసి ఇమ్మంటున్నారని కూడా ఆయన అన్నారు. చంద్రబాబు కూడా అదే రీతిలో మాట్లాడుతుంటారు. పారిశ్రామికవేత్తలు ఆ బాండ్లను నమ్మలేదా? జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని వాళ్లు నమ్మారని అనుకోవాలా?.. ఇదీ చదవండి: దావోస్ వెళితే పెట్టుబడులు వస్తాయనేది ఒక మిథ్యమూడేళ్ల క్రితం జగన్ దావోస్ వెళ్లినప్పుడు రూ.1.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది ఈ పారిశ్రామికవేత్తలే. విశాఖలో సదస్సు పెడితే అంబానీ, అదాని వంటివారూ వచ్చి జగన్‌ను అభినందించి వెళ్లారే? ఆ తరువాత అదానీ పెద్ద ఎత్తున సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో విద్యుత్ ఉత్తత్తి ప్లాంట్ల ఏర్పాటుకు సిద్ధమయ్యారే? కూటమి అధికారంలోకి వచ్చాక అదానీ సిబ్బంది పై జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే మనుషులు కడప జిల్లాలో దాడులు చేశారే? ఆ విషయం ఏమైనా ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా తెలిసిపోయేందేమో!. ఇక లోకేష్ రెడ్ బుక్ ఉండనే ఉంది. ఏపీలో కూటమి అదికారంలోకి వచ్చింది మొదలు టీడీపీ వారు వైసీపీ వారిపై చేసిన దాడులు, హింసాకాండ, అరాచకాల సమాచారం కూడా వారికి అందిందేమో! ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ ఏపీలో వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి జగన్ టైమ్ లో ముందుకు వచ్చారు. కాని కూటమి అధికారంలోకి రావడంతోనే ఎవరో మోసకారి నటిని పట్టుకొచ్చి ఏపీలో పోలీసు అధికారులపైనే కాకుండా, జిందాల్ పై కూడా కేసుపెట్టి అరెస్టు చేసే ఆలోచనవరకు వెళ్లారే..సహజంగానే ఒక పారిశ్రామికవేత్తను ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంతగా హింసించే ప్రయత్నం చేస్తుంటే ఆ విషయం ఇతర పారిశ్రామికవేత్తలకు తెలియకుండా ఉంటుందా?. అందువల్లే పైకి కబుర్లు చెప్పినా, పెట్టుబడి కింద వందల, వేల కోట్లు వ్యయం చేయడానికి ఏపీకి రావడానికి భయపడ్డారేమో! దాని ఫలితంగానే ఏపీకి జిందాల్ గుడ్ బై చెప్పి మహారాష్ట్రలో మూడు లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుని ఉండవచ్చని చెబుతున్నారు. జిందాల్‌ను ఇబ్బందిపెట్టకపోయి ఉంటే ఆయన ఇక్కడ కొన్ని వేల కోట్లు అయినా పెట్టుబడి పెట్టడానికి సిద్దమై ఉండేవారేమో కదా? ఆ రకంగా ఏపీకి పెట్టుబడి రాకుండా ఒక పారిశ్రామికవేత్తను తరిమేశారన్న అపఖ్యాతిని చంద్రబాబు, లోకేష్‌లు మూటకట్టుకున్నట్లయింది కదా! ఎల్లో మీడియా ఇప్పటికి జగన్ పై తప్పుడు రాతలు రాస్తుంటుంది. ఆయన టైమ్‌లో పరిశ్రమలను తరిమేశారని పచ్చి అబద్దాలను ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ప్రచారం చేశాయి. కాని ఫలానా పరిశ్రమ వెళ్లిపోయిందని మాత్రం చెప్పలేదు. కేవలం వదంతులు సృష్టించి ప్రజలలో అనుమానాలు రేకిత్తించడంలో టీడీపీతో పాటు ఎల్లో మీడియా బాగా కృషి చేసింది. ఇదీ చదవండి: దావోస్‌లో ఒప్పందాలు చేసుకోరు.. చర్చిస్తారుదావోస్లో యూరప్ లోని టీడీపీ అభిమానులుగా ఉన్న ఏపీ ప్రవాసులతో సమావేశం అయి కూడా రెడ్ బుక్, అందులో రాసుకున్నవారిని వదలిపెట్టే ప్రసక్తి లేదని లోకేష్ స్వయంగా చెప్పినట్లు వీడియోలు వచ్చాయి కదా!. కక్ష సాధింపు లేదంటూనే ఈ మాట చెప్పాక, ఎవరైనా పరిశ్రమలవారు భయపడకుండా ముందుకు వస్తారా? పోనీ వచ్చిన తెలుగువారిలో ఎవరైనా పరిశ్రమలు పెడతామని ఎందుకు ఆసక్తి చూపలేదు? అమరావతి ప్రపంచం అంతా ఆకర్షితమవుతోందని చెబుతారు కదా. అక్కడ కూడా ఏమైనా పెట్టుబడులు పెడతామని ఎవరూ చెప్పలేదే?. ఇప్పుడేమో దావోస్ వెళితే పెట్టుబడులు వస్తాయని అనడం మిథ్య అని బాబు కొత్త సిద్ధాంతం చెబుతున్నారు. అంతకాడికి కోట్ల రూపాయలు ప్రజాధనం వెచ్చించి వెళ్లడం ఎందుకు! అక్కడేదో అద్భుతం జరగబోతోందని బిల్డప్ ఎందుకు ఇచ్చుకున్నట్లు? ఎవరూ ఎంవోయూలు కుదుర్చుకోవడానికి ముందుకు రాకపోవడంతో ఏపీ పరువును అంతర్జాతీయంగా నడిబజారులో తీసేసినట్లు కాలేదా! చంద్రబాబు మాటలు ఎప్పటికీ మిథ్య అన్నది మరోసారి తేలినట్లే కదా!!!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
నారా లోకేశ్ అలకకు కారణమేంటి?
-
అలిగిన లోకేష్..!సన్నిహితుల వద్ద తీవ్ర ఆవేదన
సాక్షి,విజయవాడ:డిప్యూటీ సీఎం పదవి రాకపోవడంతో మంత్రి నారా లోకేష్ అలకబూనినట్లు ప్రచారం జరుగుతోంది. లోకేష్ డిప్యూటీ సీఎం ఆశలపై బీజేపీ అగ్రనేత,కేంద్ర హెం మంత్రి అమిత్‌షా నీళ్లు చల్లినట్లు తెలుస్తోంది. తనను డిప్యూటీ సీఎం చేయడానికి అమిత్ షా ఒప్పుకోలేదని లోకేష్ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. లోకేష్,పవన్‌కల్యాణ్ మధ్య జరిగిన పోరులో లోకేష్ పరాజయం పాలయ్యారని కూటమి వర్గాలు అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి. ఇందుకే లోకేష్ అలిగి పార్టీ పదవి వదులుకున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబునే టార్గెట్ చేసి లోకేష్ పార్టీ పదవిని వదులుకున్నట్లు తెలుస్తోంది.లోకేష్ ప్రభుత్వంలో పార్టీలో సూపర్‌పవర్‌గా ఉండాలని చంద్రబాబు భావించారు. అయితే తమ ప్లాన్ పారకపోవడంతో వారు తీవ్ర ఆవేదన చెందుతున్నట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇటీవల దావోస్ పర్యటనలోనూ చంద్రబాబు లోకేష్‌ను ఆకాశానికెత్తిన విషయం తెలిసిందే.కాగా, ఇటీవల లోకేష్‌ను సీఎం చేయాలంటూ టీడీపీలో సీనియర్లతో పాటు ముఖ్యనేతలంతా ప్రెస్మీట్లు పెట్టి మరీ డిమాండ్ చేశారు. లోకేష్ యువగళం వల్లే పార్టీ అధికారంలోకి వచ్చిందని పొగడ్తలు కురిపించారు. వీటికి కౌంటర్‌గా అటు జనసేన నేతలు తమ నేత పవన్‌కల్యాణ్‌ను సీఎం చేయాలని మాట్లాడే దాకా వెళ్లారు.దీంతో కూటమిలో టీడీపీ, జనసేనల మధ్య లోకేష్ డిప్యూటీ సీఎం అంశం చిచ్చుపెట్టేదాకా వెళ్లింది. చివరికి అమిత్‌షా మోకలడ్డడంతో లోకేష్‌కు అసంతృప్తి మిగిలి పవన్‌దే పైచేయి అయిందన్న ప్రచారం జరుగుతోంది. -
దావోస్‌లో ఒప్పందాలు చేసుకోరు.. చర్చిస్తారు
మహారాణిపేట (విశాఖ): సీఎం చంద్రబాబు 1997 నుంచి దావోస్‌కు వెళ్తున్నారని, అక్కడ ఎప్పుడూ ఒప్పందాలు చేసుకోరని, చర్చించి వారి ఆసక్తిని బట్టి ఒప్పందాలు చేసుకుంటామని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ చెప్పారు. ఓ కోర్టు కేసు నిమిత్తం సోమవారం విశాఖపట్నం వచ్చిన ఆయన కోర్టు వెలుపల మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీలో ఒక్కొక్కరు రాజీనామా చేస్తున్నారని.. చట్టాన్ని ఉల్లంఘించిన నేతలు, అధికారులను వదిలిపెట్టేదిలేదని స్పష్టంచేశారు. కాకినాడ పోర్టును అడ్డగోలుగా తుపాకీ పెట్టి లాక్కున్నారని చెప్పారు. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణ పకడ్బందీగా చేయాల్సి ఉన్నందున ఒక్కొక్కటిగా చేస్తున్నామన్నారు. ఈ ఏడు నెలల కూటమి ప్రభుత్వ హయాంలో రూ.6,33,568 కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. 4,10,128 మందికి ఉద్యోగాలు వస్తాయని లోకేశ్ తెలిపారు. స్థిరమైన ప్రభుత్వంవల్లే పెట్టుబడులు ఇక మహారాష్ట్ర, గుజరాత్‌లలో స్థిరమైన ప్రభుత్వం ఉండడంవల్లే వారికి పెట్టుబడులు వస్తున్నాయని, స్థిరమైన ప్రభుత్వంవల్ల పారిశ్రామికవేత్తల్లో ఆత్మవిశ్వాసం నెలకొంటుందని చెప్పారు. జగన్ మళ్లీ రాడని పారిశ్రామికవేత్తలు గ్యారంటీ అడుగుతున్నారని మంత్రి లోకేశ్ చెప్పారు. దావోస్‌లో కాగ్నిజెంట్ ను వారి పెవిలియన్‌కు వెళ్లి కలిశానని, త్వరలోనే ఉత్తరాంధ్రకు మంచి న్యూస్ వస్తుందన్నారు. మరో 90 రోజుల్లో టీసీఎస్ వస్తుందని చెప్పారు. కాలేజీల యాజమాన్యాలకే విద్యాదీవెన నిధులు చెల్లిస్తామన్నారు. ఇక చంద్రబాబు ఏ బాధ్యతలిచ్చినా అహర్నశలు కష్టపడి పనిచేస్తానని, పార్టీకి చెడ్డపేరు మాత్రం తీసుకురానని లోకేశ్ చెప్పారు. -
అయ్యన్న వ్యాఖ్యలతో విస్మయానికి గురైన టీడీపీ నేతలు
-
దావోస్ లో 4 రోజులు తండ్రీకొడుకులు చేసింది ఇదే !
-
దావోస్ నుంచి ఉత్త చేతులతో మొహం చెల్లక అక్కడే ఉన్న లోకేష్
-
40 ఏళ్ల అనుభవం 40 కోట్లు కూడా తేలేదు...వరుదు కళ్యాణి షాకింగ్ రియాక్షన్
-
బాబు దావోస్ టూర్ పై వరుదు కళ్యాణి షాకింగ్ రియాక్షన్
-
దావోస్ తుస్.. పవన్ ఫుల్ ఖుష్!
దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు వెళ్లిన చంద్రబాబు.. లోకేష్ అక్కడ సీఈవోలు.. టెక్ కంపెనీల పెద్దలతో ఫోటోలు దిగారు.. ఎప్పట్లానే కోట్లు కోట్లు.. పెట్టుబడులు అంటూ ఊదరగొట్టినా ఒక్క ఇటుకబట్టీ.. అతుకుల మిల్లు.. అప్పడాల మిషన్ వంటి చిన్న పరిశ్రమల కూడా రాలేదు.. దీన్ని అటు సోషల్ మీడియాలో యూత్ మీమ్స్.. ట్రోలింగులతో పోస్టింగులు పెడుతుండగా అటు టీడీపీ అనుకూల మీడియా మాత్రం సైలెంట్ ఐంది. ఏపీలో అన్ని ప్రాథమిక ప్రక్రియలు పూర్తయి నిర్మాణం మొదలు కావాల్సిన జిందాల్ స్టిల్స్ మహారాష్ట్రకు తరలిపోయింది. అటు కొత్తగా ఒక్కటీ ఒప్పందం జరగలేదు. దీంతో ఇక ఈ దావోస్ విజయోత్సవాలు ఎలా చేయాలన్నదాన్ని పక్కనబెట్టిన తెలుగుదేశం అనుకూల మీడియా ప్రస్తుతానికి ఆ అంశాన్ని చర్చల్లో ఉంచడం లేదు. ఏది ఎలా ఉన్నా ఇప్పుడు ఈ దావోస్ పర్యటన పెద్దగా ఫలితం ఇవ్వకపోవడాన్ని తెలుగుదేశం కక్కలేక మింగలేక ఉంటున్నా అటు లోలోన పవన్ కళ్యాణ్ మాత్రం సంబరపడిపోతూ సెలబ్రేషన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్‌ను ఇగ్నోర్ చేసిన చంద్రబాబు.. లోకేష్వాస్తవానికి మొదట్లో బాబుపట్ల అత్యంత వినయవిధేయతలతో ఉన్న పవన్ ఒక్కోసారి ఆవేశంతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. శాంతిభద్రతలు బాలేవు.. అవసరం ఐతే నేనే హోం శాఖను తీసుకుంటాను.. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తాను అన్నారు.. తిరుమల తొక్కిసలాట మీద కూడా తాను ముందుగా స్పందించి ప్రజలకు ప్రభుత్వం తరఫున సారీ చెప్పడంతోబాటు మీరెందుకు చెప్పరు మీకేం కష్టం.. అన్నట్లుగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.. ఈవో శ్యామలరావును సైతం ప్రశ్నించి ఇరుకునపెట్టేసారు. ఇవన్నీ లోకేష్ ను బాగా ఇరిటేట్ చేశాయని .. పవన్‌ను కంట్రోల్ చేయాలనీ అయన ప్లాన్ చేస్తున్నారని.. అందుకే తనకు డిప్యూటీ సీఎం ఇవ్వాలని కొందరు లీడర్లతో డిమాండ్లు చేయిస్తున్నారన్న ఫీలర్లు కూడా వచ్చాయి. మొత్తానికి అది సమసిపోగా ఇప్పుడు దావోస్ సదస్సుకు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కు తీసుకెళ్లకుండా బాబు.. లోకేష్ ఇద్దరే వెళ్లారు. సీఎం హోదాలో బాబు.. ఐటి మంత్రిగా లోకేష్ వెళ్లారనుకున్నా పవన్‌ను సైతం తీసుకెళ్తే బాగుణ్ణని జనసైనికులు ఆశించారు. కానీ అక్కడ కూడా పవన్ వెళ్తే మీడియా మొత్తం ఆయనచుట్టూ ఉంటుందని.. లోకేష్.. చంద్రబాబును పట్టించుకోదని భయంతోనే ఆయన్ను తీసుకెళ్లలేదని అంటున్నారు..హమ్మయ్య మనకు హ్యాపీఇప్పుడు ఏమీ పెట్టుబడులు లేకుండా తిరిగొచ్చిన లోకేష్.. చంద్రబాబును చూసి పవన్ లోలోన సంతోషపడుతున్నారని అంటున్నారు... తనను పూర్తిగా పక్కనబెట్టేసి అదేదో వాళ్ళ సొంత ఫ్యామిలీ ఫంక్షన్ అన్నట్లుగా వాళ్లిద్దరే వెళ్లడం.. పవన్‌ను కనీసం మాట మాత్రంగా అయినా చెప్పకపోవడం.. ఒకరకంగా ఆయన్ను అవమానించడమే అని అంటున్నారు. ఐటి గురించి నీకేం తెలీదు.. మేం చాలాసార్లు దావోస్ వెళ్లాం.. అవన్నీ నీకు అర్థం కానీ విషయాలు అన్నట్లుగా పవన్‌ను చిన్నచూపు చూసి ఆయన్ను వదిలేశారని ఇది చిన్నతనంగా భావించినా ఏమీ మాట్లాడకుండా పవన్ సైలెంట్ గా ఉన్నారని అంటున్నారు. ఇక ఇప్పుడు దావోస్ సదస్సు తుస్సుమనడంతో పోన్లే.. మనకు సంబంధం లేని విషయం. వాళ్లిద్దరే వెళ్లారు.. వట్టి చేతులతో తిరిగొచ్చారు.. మనదేం పోయింది.. నన్ను ఇగ్నోర్ చేసినందుకు అలాగే జరగాలి అని పవన్ లోలోన ఖుష్ అవుతున్నారని అంటున్నారు..--సిమ్మాదిరప్పన్న -
దావోస్ వైఫల్యాన్ని కప్పిపుచ్చడానికి ఎల్లో మీడియా డైవర్షన్ పాలిటిక్స్
-
లోకేష్ కోసమే బాబు దావోస్ పర్యటన: దేవినేని అవినాష్
సాక్షి, విజయవాడ: మంత్రి నారా లోకేష్‌ను ప్రమోట్ చేయడానికే చంద్రబాబు దావోస్ వెళ్లారని ఆరోపించారు వైఎస్సార్సీపీ నాయకులు దేవినేని అవినాష్. లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలన్న ఆకాంక్షతో ప్రచారం చేస్తున్నారు. ప్రజాధనంతో దావోస్‌లో ఎంజాయ్ చేస్తాం అంటే చూస్తూ ఊరుకోము అంటూ హెచ్చరించారు.తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీలో 29 అనుబంధ సంఘాలకు అధ్యక్షులు నియామకం జరిగింది. అధ్యక్షులుగా నియమితులైన వారిని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అభినందించారు. ఈ క్రమంలో చంద్రబాబు , లోకేష్ దావోస్ పర్యటనపై దేవినేని అవినాష్ స్పందించారు. ఈ సందర్బంగా అవినాష్ మాట్లాడుతూ..‘చంద్రబాబు ఆయన కొడుకు 100 కోట్ల ప్రజాధనంతో దావోస్ పర్యటనకు వెళ్లారు. రూపాయి పెట్టుబడి తీసుకురాలేని దావోస్ పర్యటన వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగిందేమిటి?. నారా లోకేష్‌ను ప్రమోట్ చేయడానికే చంద్రబాబు దావోస్ వెళ్లాడు. లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలన్న ఆకాంక్షతో ప్రచారం చేస్తున్నారు.దావోస్ పర్యటన వల్ల ఏయే పెట్టుబడులు వచ్చాయో ప్రజలకు చెప్పాలి. మహారాష్ట్ర, తెలంగాణ వేల కోట్ల ఒప్పందాలు చేసుకున్నాయి. కానీ, ఆంధ్రప్రదేశ్ ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదు. చంద్రబాబు ఐదు సార్లు దావోస్ వెళ్లినా.. వైఎస్ జగన్ ఒక్కసారి వెళ్లిన పర్యటనతో సమానం. వైఎస్ జగన్ దావోస్ పర్యటనలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు తెచ్చారు. రాష్ట్రాన్ని వైఎస్ జగన్ అన్ని విధాలా అభివృద్ధి చేశారని మేం గర్వంగా చెప్పగలం. చంద్రబాబు, లోకేష్‌కి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు తేవాలి. ప్రజాధనంతో ఎంజాయ్ చేస్తాం అంటే చూస్తూ ఊరుకోం. ప్రజల్లోకి వెళ్తే పథకాలు గురించి నిలదీస్తారని వెళ్లడమే మానేశారు. సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన మధ్య వార్ జరుగుతోంది. తూర్పు బైపాస్‌పై ప్రకటనలు ఇచ్చిన కూటమి నేతలు ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేశారు. కూటమి నేతలు ఎందుకని ఇక్కడి ప్రజల మీద కక్ష కట్టారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, బెజవాడ ఎంపీ కలిసి కేంద్ర పెద్దలతో మాట్లాడి తూర్పు బైపాస్‌కి ఒప్పించాలి. కూటమి నేతలు ప్రతీ పనిలో కలెక్షన్లు వెతుక్కుంటున్నారు. కమీషన్, కరప్షన్ ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు. తూర్పు నియోజకవర్గంలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. జగ్గయ్యపేటలో దొరికిన గంజాయిపై కూటమి నేతలు మాట్లాడాలి. గంజాయి నిర్మూలన చేస్తామని చెప్పిన నేతలు ఇప్పుడు గంజాయి ఎక్కడి నుంచి వస్తుందో తేల్చాలి. చంద్రబాబు హయంలో కాలనాగులు మళ్లీ పడగ విప్పుతున్నారు. పేద వారిని దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. పేదల పక్షాన వైఎస్సార్సీపీ నిలబడుతుంది’ అని కామెంట్స్ ఇచ్చారు. -
లోకేశ్ సీఎం కావాలని కోరుకుంటున్నా: ఎమ్మెల్యే అతిథి
-
KSR Live Show: పాయె.. ఉన్నది కాస్త పాయె.. తండ్రీకొడుకుల దావోస్ టూర్ అట్టర్ ఫ్లాప్.. వట్టి చేతులతో వెనక్కి
-
నారా లోకేష్ రెడ్‌బుక్ అమలులో ముఖ్య పాత్ర ఆయనదే?
ఏబీ వెంకటేశ్వరరావు.. ఐపీఎస్! పదేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో తరచూ వార్తల్లోకి ఎక్కిన వివాదాస్పద అధికారి. రిటైర్ అయిన తరువాత కూడా తన వ్యాఖ్యలు, వైఖరితో మరిన్ని వివాదాల్లో చిక్కుకుంటున్న వ్యక్తి కూడా. టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్‌ల అండతో ఆయన ఈ మధ్య కాలంలో మరింత చెలరేగిపోతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.తాజాగా ఆయన తన ‘కమ్మ’ కులం వారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, హితబోధ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎవరేమనుకుంటే తనకేమన్నట్టుగా ఆయన మాట్లాడటం.. తన మాటల వల్ల ఇతర కులాల వారి మనోభావాలు ఎంత దెబ్బతింటున్నాయో ఆలోచించకపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క కులం వారు ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావడాన్ని అడ్డుకోగలరా?. కులమతాలకు అతీతంగా అందరూ ఓట్లేస్తేనే ఒక పార్టీ ఎన్నికవుతుంది కదా?. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి అధికారంలోకి రాకుండా కమ్మ కులం వాళ్లు అన్ని రకాలుగా అడ్డుకోవాలన్నది ఏబీ వెంకటేశ్వరరావు ఇచ్చిన పిలుపు! ఇందుకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండాలని, అహర్నిశలు కష్టపడాలని కూడా ఆయన తన కులం వారిని కోరుకున్నారు. కమ్మ వారికి ఏదో పెద్ద సందేశం ఇచ్చానని ఆయన అనుకుంటున్నారేమో తెలియదు కానీ, దీనివల్ల కమ్మ వారిపై మిగిలిన వారికి మరింత వ్యతిరేకత వస్తుంది. అసహ్యం ఏర్పడుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈయన లాంటి వ్యక్తులు కమ్మ కులం వారిని భ్రష్టు పట్టిస్తున్నట్లుగా ఉంది.ఈ క్రమంలోనే ఆయన వైఎస్ జగన్‌పై పరుష పదాలతో విమర్శించారు కూడా. సభ్య సమాజం ఏమాత్రం అంగీకరించని విమర్శలివి. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆయన రెడ్డి, ఇతర కులాల వారిని ఏకం చేస్తున్నారని, వైఎస్ జగన్‌ను అభిమానించే బలహీన వర్గాల వారందరూ ఒక్కతాటిపైకి వచ్చేలా చేస్తున్నారని కొందరు వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం పనితీరుకు ఏబీ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని కూడా అంటున్నారు. వైఎస్ జగన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను చూస్తే అసలు ఆయన ఐపీఎస్ అధికారేనా? అన్న అనుమానం వ్యక్తం చేసిన వాళ్లూ ఉన్నారు. వీటన్నింటిని బట్టి చూస్తే రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు వెనుక కీలక పాత్రధారి ఈయనే అన్న అనుమానమూ వస్తోంది.వాస్తవానికి ఏబీ వెంకటేశ్వరరావు ఒకప్పుడు ఇంత వివాదాస్పదుడు కానేకాదు. ఇంత చెడ్డ పేరూ లేదు. తెలుగుదేశంతో జత కట్టిన తర్వాతే ఇలా తయారయ్యారు అన్నది ఎక్కువ మంది అభిప్రాయం. రెడ్‌బుక్ సృష్టికర్త లోకేష్ కనుసన్నలలో పనిచేస్తూ అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారారన్న విమర్శ ఎదుర్కుంటున్నారు. 2014 టర్మ్‌లో చంద్రబాబు ప్రభుత్వ వ్యవహార శైలి వల్ల కమ్మ వర్గం వారు ఇతర సామాజికవర్గాల దృష్టిలో విలన్ల మాదిరి కనిపించేవారు. తత్ఫలితంగా మిగిలిన కులాలన్నీ ఏకమై తెలుగుదేశం పార్టీని ఓడించాయి. ఆ తర్వాత వివిధ కారణాలతో 2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మళ్లీ ఇదే ధోరణి ఆరంభమైనట్లుగా ఉంది.వీరి రెడ్‌బుక్‌లో ఉన్న పేర్లలో ఎక్కువ భాగం రెడ్డి లేదా షెడ్యూల్ కులాల వారే. వైఎస్ జగన్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేశారన్న కారణంగా ఈ వర్గాల అధికారులు కొందరికి ఏడు నెలలుగా పోస్టింగ్ ఇవ్వలేదు. ఐఏఎస్ టాప్ ర్యాంకర్ ముత్యాలరాజు వంటి వారు కూడా ఈ జాబితాలో ఉన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగల అవకాశం ఉన్న మహిళా ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అవమానించారు. అలాగే టీడీపీ ప్రభుత్వంలో జరిగిన స్కామ్‌లను బయటకు తీశారన్న కోపంతో ఏదో ఒక నెపం పెట్టి కొంతమంది ఐపీఎస్‌లను సస్పెండ్ చేయడం, కేసు పెట్టి అరెస్టు చేయాలన్న ఆలోచన కూడా చేశారు. ఇదంతా ప్రజాస్వామ్యబద్ధంగా ఉందని ఏబీ వెంకటేశ్వరరావు ఫీల్ అవుతుండవచ్చు.కానీ, ఇండియన్ పోలీస్ సర్వీసెస్‌కు ఎంపికై సుదీర్ఘ కాలం బాధ్యతలు నిర్వహించిన ఈయనకు రాజ్యాంగంపై అవగాహన ఉండాలి. ప్రభుత్వం, ముఖ్యమంత్రి పేషీ, మంత్రులు ఎలా పనిచేస్తారో తెలిసి ఉండాలి. లోకేష్ వంటి అనుభవం లేని వారు కక్ష సాధింపు చర్యలకు దిగుతుంటే, వారించవలసిన ఈయనే స్వయంగా కుల ప్రస్తావన తెచ్చి ప్రసంగాలు చేయడం శోచనీయం. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా కాకుండా అడ్డుకునేందుకు దేనికైనా సిద్ధపడాలన్న ఏబీ వ్యాఖ్య వెనుక ఉద్దేశం ఏమిటన్నది చాలామంది వేస్తున్న ప్రశ్న. హింసకు కూడా వెనుకాడవద్దని పరోక్షంగా పిలుపునిస్తున్నారా? అంటూ మీడియాలో కథనాలూ వచ్చాయి.2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల మ్యానిప్యులేషన్ జరిగిందన్న అనుమానాలు ఉన్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ అదే పద్ధతి అవలంబించాలన్నది ఆయన చేస్తున్న సూచనా?. సమాజంలో కులాల కొట్లాటలు ఉంటే ఉండవచ్చు కానీ.. ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత హోదాల్లో పనిచేసే వాళ్లు కూడా ఇంత తక్కువ స్థాయి ఆలోచనలు చేయడం, చెత్త ప్రకటనలు చేయడం ఎంత వరకూ సబబు?. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు వద్ద ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్న ఏబీ శాంతి భద్రతల విషయాన్ని పక్కనబెట్టి రాజకీయంగా వైఎస్సార్సీపీని ఎలా దెబ్బ తీయడమన్న విషయంపైనే దృష్టిపెట్టేవారని చాలా మంది టీడీపీ నేతలు చెబుతారు. ప్రస్తుత ఎమ్మెల్యే బోండా ఉమా పార్టీ సమావేశంలో ఒకసారి మాట్లాడుతూ తెలుగు యువత అధ్యక్ష పదవిని పొందడానికి ఏబీ వెంకటేశ్వర రావు క్లియరెన్స్ తీసుకోవాలని ఆశావహులకు సూచించిన వీడియో అప్పట్లో కలకలం రేపింది.వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకురావడానికి ప్రలోభాలు పెట్టడంలో ఏబీతో పాటు ఒక మీడియా అధినేత విశేష పాత్ర పోషించారని చెబుతారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక ఆయనపై ఇజ్రాయిల్ నుంచి గూఢచర్య పరికరాల కొనుగోలులో జరిగిన అక్రమాలపై కేసు పెట్టి సస్పెండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై విచారణకు ఓకే చేసింది. తనపై ఆ కేసు పెట్టినందుకు ఏబీకి ఆగ్రహం ఉండవచ్చు. కానీ, ఆ కేసులో తాను సచ్ఛీలుడినని రుజువు చేసుకోవచ్చు. ఎటూ ప్రభుత్వం వారిదే కనుక తమకు కావల్సిన జీవోలను తెప్పించుకుంటున్నారని చెబుతున్నారు. కోర్టు ద్వారా రిటైర్మెంట్ రోజున సస్పెన్షన్ ఎత్తివేత ఉత్తర్వు పొందారు. దాన్ని గౌరవించి గత ప్రభుత్వం ఈయనకు పోస్టింగ్ ఇచ్చింది. ఏబీ తన వ్యాఖ్యల్లో వైఎస్ జగన్‌తోపాటు వైఎస్ రాజశేఖరరెడ్డిని కూడా విమర్శించారు.అయితే, వైఎస్సార్ హాయంలో ఈయనకు వచ్చినవన్నీ దాదాపు మంచి పోస్టులేనని సోషల్ మీడియాలో వ్యాప్తిలోకి వచ్చిన వివరాలను బట్టి అర్ధం అవుతుంది. ఉదాహరణకు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుకు కర్నూలు రేంజి డీఐజీ పోస్టు ఇచ్చింది. వైఎస్సార్ సొంత జిల్లా అయిన కడప కూడా ఈ రేంజ్‌లోనే ఉంది. మరి ప్రాముఖ్యత లభించినట్లా? కాదా? హైదరాబాద్‌లో జాయింట్ కమిషనర్, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రిక్రూటింగ్, వైజాగ్ రేంజ్ ఐజీ వంటి బాధ్యతలను కూడా అప్పట్లో అప్పగించారు. వైఎస్సార్ మరణం తర్వాత రోశయ్య ముఖ్యమంత్రి అయ్యాక ఈయనను అంతగా ప్రాధాన్యం లేని ఏపీఎస్పీ బెటాలియన్ ఐజీగా నియమించారు. అయినా వైఎస్సార్‌పై ఈయన విమర్శలు చేయడం ధర్మమా? అన్నది కొందరి ప్రశ్న.ఇక్కడ మరో మాట చెప్పాలి. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేసి అవమానించినప్పుడు కమ్మవారికి అవమానం జరిగినట్లు కాదా?. చంద్రబాబుకో, ఏబీ వంటివారికో ఏదైనా ఇబ్బంది వస్తే, వారిపై ఆరోపణలు వస్తే కమ్మ వారందరికీ వచ్చినట్లా? ఏ కులంలో అయినా లాభం కొందరికే లభిస్తూంటుంది. సంపాదన, పెత్తనం కూడా కొందరికే దక్కుతుంది. అలాంటివారు ఆ కులంలోని ఇతరులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటారు. ఏబీ కూడా సరిగ్గా అదే పని చేసినట్లుగా కనిపిస్తుంది. ఏబీ వెంకటేశ్వరరావు, చంద్రబాబు, లోకేష్ వంటివారి ధోరణి వల్ల రెడ్లతో సహా మిగిలిన పలు కులాల వారిలో అభద్రతాభావం ఏర్పడుతుంది. పైకి కాపులను కలుపుకున్నట్లు కనిపిస్తున్నా వారికి క్షేత్రస్థాయిలో అనేక అవమానాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఇందుకు ఉదాహరణ పెడన నియోజకవర్గం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ఎదుటే ఒక జనసేన నేత ఆత్మహత్యాయత్నం చేయడం. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటి సీఎంగా ఉంటే, ఆయనకు పోటీగా లోకేష్‌ను కూడా ఆ హోదాలోకి తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాలు కాపులలో కాక రేపుతోంది.జనసేన, టీడీపీ మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ఏబీ వెంకటేశ్వరరావు ఈ తరహా అసందర్భ ప్రసంగాలు చేసి సమాజంలో మరింత అశాంతికి దోహదపడడం ఐపీఎస్ హోదాకే అవమానం కాదా? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఉద్యోగంలోకి వచ్చిన ఈయన రిటైరయ్యాక వ్యవహరిస్తున్న తీరు చూశాక, పదవి బాధ్యతలలో ఉన్నప్పుడు నిష్పక్షపాతంగా ఉన్నారని ఎవరైనా అనుకోగలరా?. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బర్త్ డే రోజున లోకేష్ కు ఘోర అవమానం
-
ఏపీలో చినబాబు భజనలో తరిస్తున్న టీడీపీ నేతలు
-
లోకేష్ జన్మదిన వేడుకల్లో రచ్చ.. జనసేన కార్యకర్తపై దాడి
సాక్షి, చిత్తూరు: ఏపీలో కూటమి అధికారంలోకి రాగానే భాగస్వాములైన జనసేన(Janasena), బీజేపీ నాయకులకు పలుచోట్ల అవమానాలు తప్పలేదు. ఇప్పటికే పలుచోట్ల పచ్చ నేతలు రెచ్చిపోయి కూటమి నేతలపై దాడులకు తెగబడ్డారు. తాజాగా చిత్తూరు జిల్లాలో జనసేన కార్యకర్తను టీడీపీ(TDP) కార్యకర్తలు చితకబాదారు. ఈ క్రమంలో అతడిని తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లాలోని సోమల మండలంలో గురువారం రాత్రి మంత్రి నారా లోకేష్(Nara Lokesh) జన్మదిన వేడుకల్లో బ్యానర్లు కట్టినందుకు, కేక్ కట్ చేసే కార్యక్రమంలో పాల్గొన్నందుకు జనసేన కార్యకర్తను టీడీపీ నాయకులు చితకబాదారు. కందూరులో జనసేన కార్యకర్త మునీర్ బాషా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, లోకేష్ బ్యానర్లు వేసి జన్మదిన సంబరాల్లో పాల్గొన్నారు. దీంతో రెచ్చిపోయిన తెలుగుదేశం నాయకులు మునీర్ బాషాను ‘నువ్వెవడురా రావడానికి’ అంటూ చితకబాదారు.ఈ ఘటనను చూసిన ఆయన తల్లి బిడ్డపై దాడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమెపై కూడా దాడి చేయడంతో పిడికిలి దెబ్బలకు ఆమె పళ్లు రాలిపోయాయి. దీంతో, వెంటనే స్థానికులు పుంగనూరు నియోజకవర్గ జనసేన ఇన్చార్జి చిన్నారాయల్కు సమాచారం అందించారు. ఆయన తన అనుచరులతో ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడి కుటుంబాన్ని పరామర్శించారు. గాయపడిన మునీర్ బాషాను, ఆయన తల్లిని, జనసేన కార్యకర్తలు, నాయకులు కలిసి పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయమై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు జనసేన నేతలు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేస్తారా? లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.గాయపడిన జనసేన కార్యకర్త మునీర్ తాజాగా మాట్లాడుతూ..‘గతంలో మా నాయకుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కందూరులో బ్యానర్లు కట్టొద్దని బెదిరించారు. నేను వాటిని లెక్క చేయలేదు, అప్పుడు నాపై దాడి చేసి గాయపరిచారు, పవన్ కళ్యాణ్ బ్యానర్లు చింపారు. నిన్న రాత్రి నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా నాపై దాడి చేశారు, నా తల్లిని గాయ పరిచారు. నన్ను చంపే అధికారం వాళ్లకు ఎవరు ఇచ్చారు?. నన్ను ఊరు విడిచి వెళ్ళాలి అని బెదిరిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎప్పుడూ జనసేన పార్టీ నాయకుల్ని, నన్ను ఇబ్బంది పెట్టలేదు. టీడీపీ వాళ్ళ కంటే వైఎస్సార్సీపీ నాయకులే బెస్ట్ అనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేశారు. -
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో విద్యార్థులకు శాపంగా లోకేశ్ బర్త్‌డే
-
నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా వాహనాల్లో వచ్చి హల్చల్
-
దావోస్ పర్యటన పబ్లిసిటీ తప్పా ఏం ప్రయోజనం లేదు
-
‘చంద్రబాబు దావోస్ పర్యటన.. ఖర్చు ఫుల్.. పెట్టుబడులు నిల్’
సాక్షి, విశాఖపట్నం: దావోస్ నుంచి ఉత్తి చేతులతో తండ్రి కొడుకులు తిరిగి వస్తున్నారని.. పబ్లిసిటీ కోసం దావోస్ పర్యటన (Davos Tour)ను ఉపయోగించుకున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) దుయ్యబట్టారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజకీయ ప్రసంగాలు విమర్శలు తప్పితే సాధించింది ఏమీ లేదని.. లోకేష్ భజనతో దావోస్ ముగిసిందన్నారు.‘‘కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఎన్ని వేల కోట్లు పెట్టుబడులు తెచ్చారు?. సీఎం చంద్రబాబు రాష్ట్ర ఇమేజ్ను దెబ్బ తీశారు. చంద్రబాబు, లోకేష్ దావోస్ పర్యటన ఖర్చు పుల్, పెట్టుబడులు నిల్.. దావోస్‌లో కూడా లోకేష్ భజన చేశారు. జిందాల్ కంపెనీ రాష్ట్రంలో పెట్టాల్సిన 3.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టు బడులు ఇతర రాష్ట్రాలకు తరలించారు. పెట్టుబడిదారులను వేధింపులకు గురిచేశారు. దావోస్ వెళ్లి రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు’’ అంటూ అమర్నాథ్ ధ్వజమెత్తారు.‘‘బల్క్ డ్రగ్ పార్క్ వైఎస్సార్సీపీ హయాంలో వచ్చింది. ప్రధాని శంకుస్థాపన చేసిన హైడ్రోజన్ గ్రీన్ హబ్ వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రానికి వచ్చింది. ఒక హామీ ఒక స్కీం కూడా అమలు చేయలేదు. నమ్మే వాళ్ళు ఉంటే బిల్ గేట్స్ చంద్రబాబు కలిసి చదువుకున్నాము అంటాడు. చంద్రబాబు బ్రాండ్ ఇమెజ్ పెంచుకోవడానికి దావొస్ వెళ్లారు. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడానికి కాదు.’’ అంటూ గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: విద్యార్థులను మోసగించిన చంద్రబాబు సర్కార్: లేళ్ల అప్పిరెడ్డి -
నారా లోకేష్‌పై మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో మంత్రులు, టీడీపీ నేతల నారా లోకేష్( Nara Lokesh) భజన తారాస్థాయికి చేరింది. లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలని, డిప్యూటీ సీఎం చేయాలంటూ పచ్చ నేతలు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి చంద్రబాబు తర్వాత లోకేషే వారసుడు.. చిన్నపిల్నాడి అడిగినా చెప్తాడంటూ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించాడు.కాగా, సీఎం చంద్రబాబు, నారా లోకేష్ పలువురు మంత్రులు దావోస్ టూర్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు పారిశ్రామికవేత్తల సదస్సుల్లో టీడీపీ నేతలు మరోసారి లోకేష్ భజన ఎత్తుకున్నారు. తమ నాయకుడు లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలని మంత్రి టీజీ భరత్ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఎవరికి నచ్చినా.. నచ్చకపోయినా భవిష్యత్ ముఖ్యమంత్రి లోకేష్ అంటూ కుండబద్దలు కొట్టారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు మరోసారి రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి.ఇదిలా ఉండగా.. మంత్రి నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంను చేయాలని బహిరంగంగా వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: దావోస్.. అంతా తుస్మరోవైపు.. నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే కామెంట్స్‌పై అటు జనసేన నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. టీడీపీ నేతల వ్యాఖ్యలపై జనసేన నాయకుడు కిరణ్ రాయల్.. తమకు పవన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని తమకు ఉందని కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో టీడీపీ నేతలు అత్యుత్సాహం చూపిస్తే తగిన విధంగా వ్యవహరిస్తాం అంటూ కౌంటర్ కూడా ఇచ్చారు. -
దావోస్.. అంతా తుస్
సాక్షి,విజయవాడ : పెట్టుబడులు తేకుండానే సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన ముగిసింది. దావోస్ పర్యటనలో ఒక్క పరిశ్రమతో కూడా ఒప్పందాలు కుదుర్చుకోలేదు. ప్రపంచ ఆర్థిక వేదిక శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఏపీకి భారీగా పెట్టుబడులు తెస్తామని బయలు దేరిన చంద్రబాబు, లోకేష్..కానీ మూడు రోజుల దావోస్ సమావేశాల్లో ఒక్క ఎంఓయూ కూడా జరగలేదు. అదే సమయంలో దేశంలో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో జాతీయ,అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 9.3 లక్షల కోట్లు, తెలంగాణ ప్రభుత్వం రూ.56,300 కోట్ల పెట్టుబడుల ఎంవోయూలు చేసుకున్నాయి. కానీ ఏపీ ప్రభుత్వంతో మాత్రం ఎంవోయూ కుదుర్చుకునేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రాలేదు. దీంతో ఎంవోయూలు లేకుండా పబ్లిసిటీకే చంద్రబాబు దావోస్ పర్యటన పరిమితమైంది.అదే సమయంలో తన దావోస్ పర్యటన కోసం చంద్రబాబు, తనయుడు నారా లోకేష్‌లు రూ.3కోట్లకు పైగా ఖర్చు చేసి జాతీయ మీడియా ఇంటర్వ్యూ ఇచ్చారు. దావోస్ పర్యటనలో రెడ్ బుక్ ప్రస్తావన తెచ్చి పారిశ్రామిక వేత్తలకు నారా లోకేష్ చెడు సందేశం పంపారు. దావోస్ పర్యటనలో లోకేష్ సీఎం కావాలంటూ పరిశ్రమల మంత్రి టీజీ భరత్ భజన చేశారు. బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ పబ్లిసిటీకే పరిమితమైంది. ఏపీలో ఎటువంటి కొత్త ప్రాజెక్టుకు ఎంవోయూ చేసుకోని మైక్రోసాఫ్ట్. దావోస్ నుండి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ఏపీ అధికారులు తిరుగుముఖం పట్టారు. -
టీడీపీలో నారా లోకేష్ బర్త్‌డే చిచ్చు!
అన్నమయ్య, సాక్షి: టీడీపీ జాతీయ కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు ఆ పార్టీలో చిచ్చురాజేసింది. తంబళ్లపల్లె టీడీపీలో ఇప్పటికే వర్గపోరు నడుస్తుండగా.. లోకేష్ బర్త్‌డేతో అది రచ్చకెక్కింది. డిప్యూటీ సీఎం, సీఎం అంటూ లోకేష్‌పై సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకున్న వేళ ఈ ఘటన మరింత చర్చనీయాంశంగా మారింది.మంత్రి నారా లోకేష్(Nara Lokesh Babu) జన్మదినం సందర్బంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆ పార్టీలో రెండు వర్గాల మధ్య చిచ్చును మరింత రాజేశాయి. ఈ క్రమంలో నారా లోకేష్ సహా ఇతర మంత్రులు ఉన్న ఫ్లెక్సీలను చించిపాడేసింది మరో వర్గం. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తతలు చోటుచేసుకోగా.. కేసు నమోదైంది.ఏం జరిగిందంటే.. తంబళ్లపల్లె టీడీపీలో మాజీ ఎమ్మెల్యే శంకర్(Shankar) వర్సెస్ ఇంఛార్జి దాసరిపల్లి జై చంద్రారెడ్డి(dasaripalli Jai Chandrareddy) వర్గాల మధ్య చాలాకాలంగా వర్గపోరు నడుస్తోంది. నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని ఆకర్షించే ఉద్దేశంతో పోటాపోటీగా ఫ్లెక్సీలు వెలిశాయి. బుధవారం రాత్రి శంకర్ వర్గీయులు పట్టణంలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. శంకర్ ప్రధాన అనుచరుడు, మండల బీసీ సెల్ అధ్యక్షుడు పురుషోత్తం బాబు ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అదే సమయంలో..ఇంఛార్జి జైచంద్రారెడ్డి విడిగా తన అనుచరులతో లోకేష్ పుట్టినరోజు కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. అందులో శంకర్‌కు చోటు లేకుండా చూసుకున్నారు కూడా!. అయితే రాత్రికి రాత్రే కేవలం శంకర్ వర్గం ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీలను ఎవరో చించేశారు. చంద్రారెడ్డి ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీలు మాత్రం అలాగే ఉన్నాయి. దీంతో ఇది చంద్రారెడ్డి వర్గీయుల పనిగా పురుషోత్తం అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. -
లోకేష్ టార్గెట్ సీఎం సీట్.. పవన్ కు పంగనామం
-
సజ్జన్ జిందాల్‌కు క్షమాపణ చెప్పండి: Yanamala Nagarjuna Yadav
-
ఏపీలో బడా నేతల కాలక్షేపం కబుర్లు!
ఇద్దరు ప్రజా ప్రతినిధులు.. అది కూడా పెద్ద స్థాయి వారు కలిస్తే ఏం మాట్లాడుకోవాలి? ప్రజలకు ఎలాంటి మేలు చేయాలి? ఇచ్చిన వాగ్ధానాల అమలు ఎలా? ఆ క్రమంలో వస్తున్న ఇబ్బందులను అధిగమించడం ఎలా? వంటివని మనం అనుకుంటాం. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం దీనికి భిన్నంగా జరుగుతోంది. ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇటీవల అమరావతికి వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణా కరకట్టపై నిర్మించిన అక్రమ భవనంలో భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌లు కూడా హాజరైన ఈ సమావేశంలో వాళ్లు మాట్లాడుకున్న విషయాలు తెలిస్తే సామాన్యులు విస్తు పోవాల్సిందే. తెలుగుదేశం మీడియా చెప్పిన దాని ప్రకారమే.. ఈ సమావేశంలో ప్రధాన చర్చ మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు ఉన్న భవనాలపై సాగింది! అంత పెద్ద నేతలు ఇంత చీప్‌గా టైమ్‌పాస్ మాటలు మాట్లాడుకుంటారా? అబద్ధాల ముచ్చట్లు పెట్టుకుంటారా?. జగన్ భవనాల గురించి ఇప్పుడు చర్చించుకోవాల్సిన అవసరం ఏమిటన్న అనుమానం మీకూ రావచ్చు. అయితే ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా జగన్‌పై బురద చల్లడమే లక్ష్యంగా పనిచేస్తున్న పచ్చ బ్యాచ్‌కు మాత్రం ఈ సందేహం రాలేదు. అందుకే టీడీపీ జాకీ మీడియా ఆ సొల్లు పురాణాన్ని పతాక శీర్షికలకు ఎక్కించి సంతోషించింది. ‘‘జగన్ జల్సా భవన్లు’’లపై ఆరా తీసిన అమిత్ షా అంటూ ఆనందపడింది. టీడీసీ,జనసేన, బీజేపీల కూటమి అధికారంలోకి వచ్చి ఏడున్నర నెలలు కావస్తున్నా ఈ పచ్చ మూక జగన్‌పై విమర్శలు మినహా సాధించిందేమీ లేదన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో కూటమి పెద్దలు ఇలా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు నివాసాన్ని చూస్తూ, ‘‘నది పక్కన మీ ఇల్లు చాలా బాగుంది’’ అని అమిత్ షా మెచ్చుకున్నారట. పనిలో పనిగా జగన్ పాలెస్ల గురించి ఆరా తీసినట్లు తెలిసిందని ఈ జాకీ మీడియా రాసింది. అది చూస్తే ఒకటి మాత్రం స్పష్టం అవుతుంది. అమిత్ షా మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇంటి గురించి అడిగి ఉండే అవకాశం లేదు. ఎందుకంటే అది అక్కడ టాపిక్ కాదు. కానీ.. విజయవాడలో ప్రకృతి వైపరీత్యానికి కారణమైన చంద్రబాబు ఇంటి గురించి హోం మంత్రి అడిగారన్న సమాచారమే బయటకు వెళితే అది తమకు ఇబ్బంది అవుతుంది కనుక టీడీపీ నేతలు పనిగట్టుకుని ఇలా అబద్ధాలు ప్రచారం చేసి ఉండాలి. హైదరాబాద్‌లో జగన్‌కు వంద గదలు ప్యాలెస్ ఉందని టీడీపీ నేతలు చెబితే అమిత్ షా చెవిలో పువ్వు పెట్టుకుని విన్నారన్నమాట!. ఈ సోది రాసిన పత్రిక వారికి నిజం తెలియదా? నాలుగు బెడ్ రూమ్‌ల ఇల్లు ఉంటే వంద రూమ్లని వీళ్లు రాస్తారా? కడుపునకు అన్నం తినేవారు ఎవరైనా ఇంత చెత్తగా వార్తా కథనాలు ఇచ్చి పాఠకులను మోసం చేస్తారా?. జగన్ ఇంటి గురించి నిజంగానే సమాచారం కావాలంటే నిమిషాలలో తెప్పించుకునే శక్తి అమిత్ షా కు ఉండదా? బెంగుళూరులో ఇల్లు ఉంది, తాడేపల్లిలో ఇల్లు ఉందని చెప్పారట. ఈ రోజుల్లో కాస్త మధ్యతరగతి, ఉన్నతాదాయ వర్గాలవారు సైతం ఆయా ముఖ్యమైన నగరాలలో రెండు, మూడు ఇళ్లు కలిగి ఉంటున్నారు. అందులోను హైదరాబాద్‌తోపాటు ఏపీలోని సొంత ప్రాంతంలో కూడా ఇళ్లు ఉంటాయి. దానిని భూతద్దంలో చూపి జగన్ పై దుష్ప్రచారం చేయడానికి వీరు చూపిన శ్రద్ద రాష్ట్ర సమస్యలను వివరించడంపై పెట్టి ఉంటే బాగుండేది. పోనీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లకు హైదరాబాద్ లో ఇళ్లు లేవా? ఏపీలోని అమరావతి ప్రాంతంలో ఇళ్లు లేవా? అవి ఎంత భారీగా ఉన్నాయో తెలియదా? అవి ప్యాలెస్‌లు కాదా? కృష్ణ కరకట్టపై అక్రమంగా నిర్మించిన ఇంటిలో చంద్రబాబు నివాసం ఉండడం లేదా? ఆ ప్యాలెస్ ప్రభుత్వానిది అని ఒకసారి, లింగమనేని రమేష్ ది అని మరోసారి మాటలు మార్చలేదా? ఆ ఇల్లు మునిగిపోకుండా చూడడానికి బుడమేరు లాకులను ఎత్తివేసిన ఫలితంగానే విజయవాడ మునిగిందన్న సంగతి నిజం కాదా? హోం మంత్రి అమిత్ షా కు పర్యావరణం, ప్రకృతి వైపరీత్యాల నివారణలపై ఏమాత్రం శ్రద్ద ఉన్నా ముందుగా చేయవలసిన పని ఏమిటి? చంద్రబాబు కృష్ణానది ఒడ్డున కోస్టల్ రెగ్యులేషన్ చట్టాన్ని అతిక్రమించిన కట్టిన ఇంటిలో ఎలా ఉంటున్నావని హోం మంత్రి ప్రశ్నించాలి కదా? ఆ పని చేయలేదా? చేసినా దాని గురించి ప్రచారం చేయకుండా జగన్ పై కట్టుకధలు వ్యాప్తిలోకి తెచ్చారా? చంద్రబాబుకు జూబ్లిహిల్స్ లో ఉన్నది ఎంత పెద్ద పాలెస్సో ఆ రోడ్డులోకి వెళ్లి చూసిన వారందరికి తెలుస్తుంది. ఆ భవన నిర్మాణానికి ఏ,ఏ దేశాల నుంచి వస్తువులు తెప్పించింది ఆ రోజుల్లో పలు వార్తలు వచ్చాయి కదా? అయినా ఆయన చాలా సింపుల్ గా ఉన్నట్లు అనుకోవాలి. తాజాగా.. అమరావతి సుమారు ఐదెకరాల విస్తీర్ణంలో ఇల్లు కట్టుకుంటున్నారని చెబుతున్నారు కదా. ఇది కాకుండా కుప్పంలో కూడా గృహ నిర్మాణం చేస్తున్నారు కదా? వీటి గురించి ఏమి చెబుతారు? ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. ఉమ్మడి ఏపీ విభజన తర్వాత ఆ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఇల్లు కట్టుకున్న ఏకైక నేత వైఎస్ జగన్. అంతేకాదు. సతీసమేతంగా పూర్తిగా అక్కడే నివసిస్తున్న నేత కూడా ఆయనే. చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు పూర్తిగా అక్కడే ఉంటున్నారా? చంద్రబాబు కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోనే నివసిస్తుంటారు కదా! ఇది తప్పని చెప్పడం లేదు. కాని ఎదుటి వ్యక్తిమీద మాత్రం బురద వేసి సంతోషపడుతుండడమే దారుణమనిపిస్తుంది. అమిత్ షా కు మరో విషయం గుర్తుకు రాలేదా? ఈ మధ్య కాలంలో ఏడిఆర్ నివేదిక ఒకటి వచ్చింది కదా? అందులో చంద్రబాబు రూ.931 కోట్ల ఆస్తితో అత్యంత ధనికుడైన సీఎం అని వెల్లడైంది కదా? దానిపై హోం మంత్రి వివరాలు తెలుసుకునే యత్నం చేయలేదా? ప్రధాని మోదీతో పాటు అమిత్ షా కూడా 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబును ఉద్దేశించి అవినీతిపరుడు అని తీవ్ర స్థాయిలో విమర్శించారు కదా! మళ్లీ పొత్తు కుదరగానే నీతిమంతుడు అయిపోయారా? అలాగే చంద్రబాబు కూడా వీరిద్దరిని ఎన్ని మాటలు అన్నారు. జనం ఇవేవి గుర్తుకు తెచ్చుకోరాదన్న ఉద్దేశంతో జగన్ పై డైవర్ట్ చేస్తుంటారు.అమిత్ షా మరుసటి రోజు ఎన్డీఆర్ఎఫ్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఏపీకి మూడు లక్షల కోట్ల రూపాయల మేర కేంద్రం సాయం చేసిందని ప్రకటించారు. అది నిజమా? కాదా? దానిని ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి కాస్త మార్చి రాశాయి. ఏపీకి మూడులక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అమిత్ షా అన్నట్లు ఈనాడు మార్చేసింది. హిందూ పత్రికలో మాత్రం మూడు లక్షల కోట్ల ఆర్థిక సాయం చేసినట్లు అమిత్ షా చెప్పారని పేర్కొన్నారు. అమరావతి రాజధాని కోసం రూ.15 వేల కోట్ల గ్రాంట్ ఇచ్చారని చంద్రబాబు తన ప్రసంగంలో చెబితే, అమిత్ షా మాత్రం దానిని రుణంగానే చెప్పారన్న సంగతి తెలుస్తుంది. హడ్కో, వరల్డ్ బ్యాంకు ద్వారా రూ.27 వేల కోట్ల రుణం ఇప్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. వక్రీకరించి వార్తలు రాసి పాఠకులను టీడీపీ జాకీ మీడియా మోసం చేస్తోందని పదే,పదే రుజువు చేసుకుంటున్నాయి. కేంద్రం నిజంగానే రూ.మూడు లక్షల కోట్లు సాయం చేసి ఉంటే ఆ డబ్బంతా ఏమైపోయిందో అర్థం కాదు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా, పెద్దగా అభివృద్ది పనులు ఏమీ చేపట్టకుండా ఆ నిధులు ఎటు మళ్లిస్తున్నారో ప్రభుత్వం వివరించాలి. ఇవి చాలక ఇప్పటికే రూ.70 వేల కోట్ల అప్పులు తీసుకు వచ్చారు. కరెంటు ఛార్జీల రూపంలో రూ.15 వేల కోట్ల మేర బాదారు. ఈ విషయాల గురించి కానీ విభజన హామీల గురించి ప్రస్తావించకుండా అమిత్ షా భజన చేయడానికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు అధిక సమయం కేటాయించినట్లు ఉంది. కేంద్రం మద్దతుతో వెంటిలేటర్ నుంచి బయటపడ్డామని, ఇప్పటికీ పేషంటే అని చంద్రబాబు చెబుతున్నారు. యథాప్రకారం రూ.పది లక్షల కోట్ల అప్పు అని అదని, ఇదని గత ప్రభుత్వానికి సంబంధించి అబద్దాలు చెప్పి అమిత్ షాను మోసం చేస్తే ఏమి లాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగైతే సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదో తెలపాలి కదా! అమిత్ షా తో తమ సూపర్ సిక్స్, ఎన్నికల ప్రణాళిక హామీల అమలు తీరు గురించి మాత్రం చర్చించలేదు. జగన్ ఇళ్ల గురించి ఇంత కీలక నేతలు మాట్లాడుకున్నారంటే ప్రజల పట్ల వీరికి ఉన్న చిత్తశుద్ది ఏమిటో తెలియడం లేదా! పోచికోలు కబుర్లు చెప్పుకోవడానికి వీరికి ఇంత ఖాళీ టైమ్ ఉంటుందా!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
KSR Live Show: ఏపీ ఫ్యూచర్ సీఎం లోకేష్ అట..!