తిలక్ వర్మ(ఫైల్ ఫోటో)
తెలంగాణ టీ20 లీగ్‌ను మెదక్ ఫాల్కన్స్ ఘనంగా ఆరంభించింది. ఉప్పల్ మైదానం వేదికగా వరంగల్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో మెదక్ ఘన విజయం సాధించింది. వరంగల్ నిర్ధేశించిన 259 పరుగుల భారీ లక్ష్యాన్ని మెదక్.. 7 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో చేధించింది.
ఈ విజయంలో మెదక్ కెప్టెన్ తిలక్ వర్మది కీలక పాత్ర. ఈ టీమిండియా సూపర్ స్టార్ విరోచిత శతకంతో చెలరేగాడు. 52 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్‌లతో 136 (నాటౌట్) పరుగులు చేసి తన జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అతడితో పాటు విక్రం నాయక్ గగులోత్(25), శృజిత్ రెడ్డి(25) రాణించారు. వరంగల్ బౌలర్లలో కులకర్ణి, మన్సూరి తలా రెండు వికెట్లు పడగొట్టారు.
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వరంగల్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. వరంగల్ బ్యాటర్లలో కెప్టెన్ అమన్‌రావ్(48 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్స్‌లతో 142) భారీ సెంచరీతో చెలరేగాడు. మెదక్ బౌలర్లలో తిలక్ వర్మ 2, మధుకర్ 2, సూర్యతేజ, రవి తేజ, రాహుల్ ఒక్కో వికెట్ సాధించారు.


