tilak varma
-
వరల్డ్ రికార్డుపై కన్నేసిన తిలక్ వర్మ..
ఇంగ్లండ్-భారత్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ బుధవారం(జనవరి 22) నుంచి ప్రారంభం కానుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టీ20 జరగనుంది. ఈ మ్యాచ్ కోసం సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు అన్ని విధాల సిద్దమైంది.వరల్డ్ రికార్డుపై కన్నేసిన తిలక్..ఇక ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా మిడిలార్డర్ ఆటగాడు, హైదరాబాదీ తిలక్ వర్మ(Tilak varma)ను ఓ వరల్డ్ రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ సెంచరీ సాధిస్తే.. వరుసగా మూడు టీ20 ఇన్నింగ్స్‌లలో సెంచరీలు నమోదు చేసిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. 22 ఏళ్ల తిలక్ వర్మ గత నవంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో ఆఖరి రెండు మ్యాచ్‌లలోనూ సెంచరీలతో మెరిశాడు. ఆ తర్వాత తిలక్‌కు ఇదే తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్. ఈ మ్యాచ్‌లో యువ సంచలనం మరోసారి మూడంకెల స్కోరును అందుకోగల్గితే క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకుంటాడు. ఇప్పటివరకు ఏ క్రికెటర్ కూడా వరుసగా మూడు టీ20 ఇన్నింగ్స్‌లలో సెంచరీ మార్క్‌ను అందుకున్నారు.సంజూ శాంసన్, రూసో, ఫిల్ సాల్ట్ వంటి క్రికెటర్లు వరుసగా రెండు సెంచరీలు నమోదు చేసినప్పటికి.. మూడో సెంచరీని మాత్రం సాధించలేకపోయారు. ఇప్పుడు ఈ రేర్ ఫీట్ సాధించే అవకాశం తిలక్‌కు లభించింది. తిలక్ ఉన్న అద్భుతమైన ఫామ్‌లో ఈ అరుదైన రికార్డు సాధించడం పెద్ద కష్టం కాకపోవచ్చు.అతడు మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశముంది. గత సిరీస్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన బ్యాటింగ్ పొజిషేన్(ఫస్ట్ డౌన్)ను తిలక్‌కు త్యాగం చేశాడు. ఆ పొజిషేన్లోనే బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీలతో మెరిశాడు తిలక్. ఆ సిరీస్ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ ఈ హైదరాబాదీ సత్తాచాటాడు. ఇప్పటివరకు భారత్ తరపున 20 టీ20లు ఆడిన వర్మ..51.33 సగటుతో 616 పరుగులు చేశాడు.ఇంగ్లండ్‌తో తొలి టీ20కి భారత తుదిజట్టు(అంచనా)సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.బెంచ్: వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయి.ఇంగ్లండ్ తుది జట్టు: బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టతెన్), హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్చదవండి: IND vs ENG: భారత్‌తో తొలి టీ20.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన! విధ్వంసకర వీరులకు చోటు -
Ind vs Eng 1st T20: భారత తుదిజట్టులో వీరే!
ఇంగ్లండ్‌తో టీ20 సమరానికి(India vs England T20 Series) టీమిండియా సన్నద్ధమైంది. కోల్‌కతాలోని ప్రసిద్ధ ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం(జనవరి 22) బట్లర్ బృందంతో తొలి టీ20లో తలపడనుంది. ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో 3-1తో ఓటమి తర్వాత భారత జట్టు ఆడుతున్న మొదటి సిరీస్ ఇది.ఈ నేపథ్యంలో తిరిగి విజయాల బాట పట్టాలని.. ఇంగ్లండ్‌తో టీ20లతో పాటు వన్డేల్లోనూ అదరగొట్టాలని టీమిండియా భావిస్తోంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కి ముందు జరిగే ఈ పరిమిత సిరీస్‌లలో విజయాలు సాధించి ఆత్మవిశ్వాసంతో ఐసీసీ టోర్నీలో అడుగుపెట్టాలని పట్టుదలగా ఉంది.ఓపెనింగ్ జోడీ అదేకాగా ఇంగ్లండ్‌తో తొలుత ఐదు టీ20లు, అనంతరం మూడు వన్డేల సిరీస్‌లు ఆడనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి టీ20లో భారత తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ జోడీనే ఓపెనర్లుగా కొనసాగనున్నారు. నిజానికి సంజూ ఓపెనింగ్ బ్యాటర్‌గా ప్రమోట్ అయిన తర్వాతే నిలకడగా రాణిస్తున్నాడు.ఇటీవల సౌతాఫ్రికా గడ్డపై టీ20 సిరీస్‌లో రెండు శతకాలతో చెలరేగిన ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్.. ఓపెనింగ్ స్థానంలో వచ్చి ఇప్పటి వరకు 366 పరుగులు సాధించాడు. అతడి స్ట్రైక్‌రేటు 198.91 కావడం గమనార్హం. ఇక అంతర్జాతీయ టీ20లలో సంజూ ఇప్పటికే మూడు సెంచరీలు తన పేరిట లిఖించుకున్నాడు.మరోవైపు.. అభిషేక్ శర్మ మాత్రం ఐపీఎల్ మాదిరి టీమిండియా తరఫున బ్యాట్ ఝులిపించలేకపోతున్నాడు. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ తర్వాత అతడి సగటు కేవలం 18.85 కావడం గమనార్హం. అయితే, దేశీ టీ20 టోర్నీలో మాత్రం మంచి ఫామ్ కనబరిచాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో పంజాబ్ కెప్టెన్‌గా వ్యవహరించిన అభిషేక్.. 255 పరుగులు చేశాడు.వరుసగా మూడు శతకాలుఇక మూడో స్థానంలో హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ దిగడం ఖాయమే. సౌతాఫ్రికాతో టీ20లలో వరుస శతకాలు బాదిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ సెంచరీతో చెలరేగాడు. తద్వారా పొట్టి ఫార్మాట్లో ఓవరాల్‌గా వరుసగా మూడు శతకాలు సాధించిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు.మరోవైపు.. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రాగా.. ఈసారి కూడా టీమిండియా ఇద్దరు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యాతో పాటు నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా గడ్డపై శతకం(టెస్టు) బాదిన నితీశ్ రెడ్డి.. తనకు గుర్తింపు తెచ్చిన టీ20 ఫార్మాట్లో ఇంగ్లండ్‌పై ఏ మేరకు రాణిస్తాడో చూడాలి! వీరితో పాటు ఫినిషర్ రింకూ జట్టులో ఉండనే ఉంటాడు.షమీ రాక.. రాణాకు నో ఛాన్స్ఇక బౌలర్ల విషయంలో.. ముఖ్యంగా పేసర్ల విషయంలో కాస్త సందిగ్దం నెలకొనే అవకాశం ఉంది. దాదాపు పద్నాలుగు నెలల తర్వాత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఈ సిరీస్‌తో పునరాగమనం చేస్తున్నాడు. కాబట్టి అతడు పూర్తి ఫిట్‌గా ఉంటే యాక్షన్‌లోకి దిగడం లాంఛనమే. అయితే, అతడితో పాటు పేస్ దళంలో అర్ష్‌దీప్ సింగ్ ఒక్కడికే ఛాన్స్ దక్కనుంది.చాంపియన్స్ ట్రోఫీకి ముందు అర్ష్ కూడా వీలైనంత ఎక్కువ క్రికెట్ ఆడతాడు. దీంతో హర్షిత్ రాణా బెంచ్‌కే పరిమితం కావాల్సిన పరిస్థితి. ఇక స్పిన్ విభాగంలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌తో పాటు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తుదిజట్టులో ఆడనుండగా.. వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయిని మేనేజ్మెంట్ పక్కనపెట్టనున్నట్లు సమాచారం. ఇక వికెట్ కీపర్‌గా సంజూ అందుబాటులో ఉంటాడు కాబట్టి ధ్రువ్ జురెల్ కూడా బెంచ్‌కే పరిమితమవ్వాల్సిన పరిస్థితి.ఇంగ్లండ్‌తో తొలి టీ20కి భారత తుదిజట్టు(అంచనా)సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.బెంచ్: వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయి.చదవండి: Ind vs Eng: టీ20, వన్డే సిరీస్‌లకు భారత్, ఇంగ్లండ్ జట్లు ఇవే -
Ind vs Eng: తుదిజట్టులో పంత్‌కు స్థానం ఉండదు!
ఆస్ట్రేలియా పర్యటన తాలూకు చేదు అనుభవం తర్వాత.. స్వదేశంలో మరో మెగా సిరీస్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. ఇంగ్లండ్‌తో టీ20, వన్డేల్లో తలపడనుంది. ఇరు జట్ల మధ్య జనవరి 22- ఫిబ్రవరి 12 వరకు ఈ సిరీస్ కొనసాగనుంది.ఇందులో భాగంగా భారత్- ఇంగ్లండ్ ఐదు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డే మ్యాచ్‌లలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ మాజీ కోచ్ సంజయ్ బంగర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో టీ20ల నేపథ్యంలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh Pant)కు భారత తుదిజట్టులో చోటు దక్కదని అభిప్రాయపడ్డాడు.తుదిజట్టులో పంత్‌కు స్థానం ఉండదు!పంత్‌కు బదులుగా సంజూ శాంసన్ వైపే సెలక్టర్లు మొగ్గుచూపుతారని సంజయ్ బంగర్ అంచనా వేశాడు. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘గత సిరీస్ ప్రదర్శన ఆధారంగా వికెట్ కీపర్ బ్యాటర్‌గా సంజూ శాంసన్(Sanju Samson) టీ20 జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడని చెప్పవచ్చు. వికెట్ కీపర్‌గా, బ్యాటర్‌గా తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు.కాబట్టి మరో వికెట్ కీపర్.. అంటే రిషభ్ పంత్‌కు టీ20 జట్టులో చోటు దక్కడం కష్టం. ఒకవేళ సంజూ ఓపెనర్‌గా వస్తే పరిస్థితి ఒకలా ఉంటుంది. అదే మిడిలార్డర్లో వస్తే మరోలా ఉంటుంది. పంత్ టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన తుదిజట్టులో సభ్యుడైనా ఈసారి మాత్రం టీమ్‌లో స్థానం కోసం గట్టి పోటీని ఎదుర్కొంటున్నాడు. సంజూ అద్భుత ప్రదర్శన కారణంగా పంత్ చోటు గల్లంతైనా ఆశ్చర్యపోనక్కర్లేదు’’ అని సంజయ్ బంగర్ పేర్కొన్నాడు.తిలక్ వర్మకు లైన్ క్లియర్అదే విధంగా.. తెలుగు తేజం, యువ సంచలనం తిలక్ వర్మ(Tilak Varma) కూడా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో కచ్చితంగా ఆడతాడని సంజయ్ బంగర్ జోస్యం చెప్పాడు. ‘‘ఎడమచేతి వాటం బ్యాటర్‌గా ఉండటం తిలక్ వర్మకు అదనపు బలం. జట్టుకు ఇలాంటి ఆటగాడు అవసరం. గత సిరీస్‌లో అతడు కూడా దంచికొట్టాడు. అందుకే తిలక్‌కు లైన్ క్లియర్‌గా ఉంది’’ అని పేర్కొన్నాడు.కాగా సౌతాఫ్రికా గడ్డపై సంజూ శాంసన్, తిలక్ వర్మ శతకాలతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఇద్దరూ చెరో రెండు సెంచరీలు బాదడంతో ప్రొటిస్ జట్టుతో టీ20 సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో నాలుగు మ్యాచ్‌లలో మూడు గెలిచి 3-1తో సౌతాఫ్రికాపై నెగ్గింది. సంజూ, తిలక్ ఊచకోతతొలి టీ20లో 107 పరుగులు సాధించిన సంజూ.. తర్వాత వరుసగా రెండుసార్లు డకౌట్ అయ్యాడు. అయితే, నాలుగో టీ20లో మాత్రం 56 బంతుల్లో 109 పరుగులతో అజేయంగా నిలిచి సత్తా చాటాడు.మరోవైపు.. తిలక్ వర్మ మూడు, నాలుగో టీ20లలో శతక్కొట్టేశాడు. సెంచూరియన్ మ్యాచ్‌లో 56 బంతుల్లో 107 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ హైదరాబాదీ స్టార్.. జొహన్నస్‌బర్గ్‌లో 47 బంతుల్లోనే 120 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును దక్కించుకున్నాడు. కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య జనవరి 22, 25, 28, 31, ఫిబ్రవరి 2వ తేదీల్లో ఐదు టీ20లు జరుగుతాయి.ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఐదు టెస్టులు ఆడిన టీమిండియా ఆతిథ్య జట్టు చేతిలో 3-1తో ఓడింది. తద్వారా పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కంగారూలకు సమర్పించుకుంది. ఈ సిరీస్‌లో రిషభ్ పంత్ 255 పరుగులు సాధించాడు.చదవండి: CT 2025: జైస్వాల్, నితీశ్ రెడ్డిలకు ఆఫర్! మెగా టోర్నీకి ఎంపికయ్యే ఛాన్స్! -
అన్ని ఫార్మాట్లలో ఆడటమే లక్ష్యం
భారత టి20 జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్‌ను ఒప్పించి దక్షిణాఫ్రికా గడ్డపై మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి వరుస మ్యాచ్‌ల్లో సెంచరీలు కొట్టి భారత టి20 జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్న తిలక్ వర్మ... మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే తన భవిష్యత్ లక్ష్యమని అంటున్నాడు. అంతర్జాతీయ షెడ్యూల్ కారణంగా దేశవాళీల్లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయిన తిలక్ వర్మ... అవకాశం వస్తే నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించాడు. కేవలం బ్యాటర్‌గానే కాకుండా... బౌలింగ్‌పై కూడా దృష్టి సారించడంతో జట్టులో సమతుల్యం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నాడు. అహ్మదాబాద్‌లో జరుగుతున్న దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ జట్టుకు సారథ్యం వహిస్తున్న తిలక్ వర్మ... కర్ణాటకపై రికార్డు ఛేదన తర్వాత తన భవిష్యత్తు లక్ష్యాలను వివరించాడు. తిలక్ చెప్పిన వివరాలు అతడి మాటల్లోనే... » విజయ్ హజారే టోర్నీలో భాగంగా కర్ణాటకతో మ్యాచ్‌లో 99 పరుగుల మీద బ్యాటింగ్ చేస్తున్న అనే విషయాన్ని పట్టించుకోలేదు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఆ ఓవర్లో భారీ షాట్లు ఆడాలని అనుకున్నా... అది కాస్త ఫలించలేదు. ఒక ఆటగాడు 45వ ఓవర్ వరకు క్రీజులో నిలిస్తే 380–400 స్కోరు కూడా ఛేదించగలమని జట్టు సమావేశాల్లో ఎన్నోసార్లు చెప్పాను. జట్టును గెలిపించేంత వరకు క్రీజులో ఉండాలనుకున్నా కానీ దురదృష్టవశాత్తు అది సాధ్యపడలేదు. » కీలక సమయంలో రాణించి జట్టుకు అవసరమైన ఇన్నింగ్స్ ఆడటం ఆనందంగా ఉంది. అంతిమంగా జట్టు విజయం సాధించడమే ముఖ్యం. నా ఇన్నింగ్స్‌తో అది సాధ్యమైనందుకు ఆనందం రెండింతలైంది. » దక్షిణాఫ్రికా పర్యటన సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో చర్చించా. నాలుగో స్థానంలో సూర్యకు మెరుగైన రికార్డు ఉందనే విషయం గుర్తుచేశా. ఆ ప్లేస్‌లో అతడు గతంలో సెంచరీలు సాధించాడు. నాకు మూడో స్థానంలో అవకాశం ఇస్తే నిరూపించుకుంటాను అని చెప్పా. దానికి సూర్యకుమార్ ఒప్పుకోవడంతో బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ దక్కింది. » వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బలంగా భావించా. అందుకు తగ్గట్లే దక్షిణాఫ్రికాపై వరుస మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించా. మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడం ఎంతో బాగుంటుంది. » అండర్–19 స్థాయికి ముందు వరకు నేను ఓపెనర్‌గానే బరిలోకి దిగే వాడిని. స్వింగ్ అవుతున్న బంతులను ఆడేందుకు ఇష్టపడతా. పరిస్థితులు సవాలు విసురుతున్నప్పుడు నాలోని అత్యుత్తమ ఆట బయటకు వస్తుంది. ముందుగా క్రీజులో అడుగు పెడితే... అదనపు సమయం లభించడంతో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి. » భారత్ ‘ఎ’తరఫున, దులీప్ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేశా. అంతర్జాతీయ మ్యాచ్‌ల కారణంగా రంజీ ట్రోఫీలో నిరూపించుకునేందుకు తగినన్ని అవకాశాలు లభించలేదు. కానీ సుదీర్ఘ ఫార్మాట్ కోసం సిద్ధంగా ఉన్నా. నా వరకు శక్తివంచన లేకుండా ప్రయతి్నస్తున్నా. » మూడు ఫార్మాట్లలో జాతీయ జట్టులో చోటు సుస్థిరం చేసుకోవాలని అనుకుంటున్నా. జట్టుకు వీలైనన్ని ఎక్కువ విజయాలు సాధించి పెట్టడమే నా లక్ష్యం. గతేడాది ఐపీఎల్ నుంచే బౌలింగ్‌పై మరింత దృష్టి సారించా. ఎర్ర బంతితో ఎక్కువ బౌలింగ్ సాధన చేస్తున్నా. దాని వల్ల టి20, వన్డే క్రికెట్లో ఆఫ్ స్పిన్నర్‌గా మరింత ప్రభావం చూపగలనని నమ్ముతున్నా. » జట్టును సమతుల్యంగా ఉంచేందుకు నా వంతు కృషి చేస్తా. అందుకోసం బౌలింగ్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నా. బౌలింగ్ చేయగల బ్యాటర్ ఉంటే మేనేజ్మెంట్కు ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. రానున్న మ్యాచ్‌ల్లో మరిన్ని ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం లభిస్తుంది అనుకుంటున్నా. పరిస్థితులకు తగ్గట్లు ఆటతీరును మార్చుకోవడం ముఖ్యం. అందుకు నేను సిద్ధం. -
హ్యాట్రిక్ సెంచరీల వీరుడికి షాక్.. వరుణ్ వీరోచిత శతకంతో..
దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ క్రికెట్ జట్టు అనూహ్య విజయం సాధించింది. భారీ లక్ష్యం ముందున్నా... ఆందోళన చెందకుండా సంయమనంతో ఆడిన గెలుపును సొంతం చేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా మంగళవారం కర్ణాటక జట్టుపై మూడు వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకుంది.చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో హైదరాబాద్ రెండు బంతులు మిగిలి ఉండగా లక్ష్యాన్ని ఛేదించడం విశేషం. వరుణ్ గౌడ్ (82 బంతుల్లో 109 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ శతకంతో హైదరాబాద్ జట్టును గెలిపించాడు.మయాంక్ అగర్వాల్ హ్యాట్రిక్ సెంచరీటాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న కర్ణాటక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (112 బంతుల్లో 124; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగాడు. ఈ సీజన్లో అతడికి వరుసగా ఇది మూడో శతకం. మరోవైపు.. స్మరణ్ (75 బంతుల్లో 83; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.తిలక్ వర్మ @99ఇక హైదరాబాద్ బౌలర్లలో చామా మిలింద్ 3 వికెట్లు పడగొట్టగా... అనికేత్ రెడ్డి 2 వికెట్లు తీశాడు. ముదస్సిర్, రోహిత్ రాయుడులకు ఒక్కో వికెట్ లభించింది. కాగా లక్ష్యఛేదనలో హైదరాబాద్ 49.4 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ తిలక్ వర్మ (106 బంతుల్లో 99; 7 ఫోర్లు, 1 సిక్స్) పరుగు తేడాతో శతకం చేజార్చుకోగా... వరుణ్ గౌడ్ వీరవిహారం చేశాడు.వరుణ్ వీరోచిత శతకంతిలక్, వరుణ్ ఐదో వికెట్‌కు 112 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కబెట్టారు. కీలక సమయంలో తిలక్ వెనుదిరిగినా... చివరి వరకు క్రీజులో నిలిచిన వరుణ్ గౌడ్ భారీ షాట్లతో విరుచుకుపడి జట్టును గెలిపించాడు. తనయ్ త్యాగరాజన్ (17 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్), వరుణ్ ఏడో వికెట్‌కు 71 పరుగులు జోడించారు.చివరి ఓవర్ తొలి బంతికి తనయ్ అవుటైనా... చామా మిలింద్ (4 నాటౌట్)తో కలిసి వరుణ్ హైదరాబాద్‌ను విజయతీరాలకు చేర్చాడు. కర్ణాటక బౌలర్లలో ప్రవీణ్ దూబే, నికిన్ జోస్ చెరో రెండు వికెట్లు తీశారు. ఇక ఈ మ్యాచ్‌లో 82 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 109 నాటౌట్‌గా నిలిచి హైదరాబాద్‌ను గెలిపించిన వరుణ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. తమ తదుపరి మ్యాచ్‌లో శుక్రవారం పంజాబ్‌తో హైదరాబాద్ ఆడుతుంది. చదవండి: సిగ్గుపడాలి!.. టీమిండియాకు ఇలాంటి ఆటగాడు అవసరమా?: ఇర్ఫాన్ పఠాన్ -
99 పరుగుల వద్ద ఔటైన తిలక్ వర్మ
విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో హైదరాబాద్ ఆటగాడు, టీమిండియా ప్లేయర్ తిలక్ వర్మ తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. కర్ణాటకతో ఇవాళ (డిసెంబర్ 31) జరిగిన మ్యాచ్‌లో తిలక్ 99 పరుగుల (106 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్) వద్ద ఔటయ్యాడు. కర్ణాటక నిర్దేశించిన 321 పరుగుల భారీ లక్ష్యఛేదనలో తిలక్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తిలక్ ఔటైనా వరుణ్ గౌడ్ సూపర్ సెంచరీతో (109 నాటౌట్) హైదరాబాద్‌ను విజయతీరాలకు చేర్చాడు. తిలక్ ఔటయ్యాక హైదరాబాద్ గెలుపుపై ఆశలు వదులుకుంది. ఈ దశలో వరుణ్ గౌడ్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. వరుణ్ 82 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేశాడు. వరుణ్ చెలరేగడంతో హైదరాబాద్ మరో రెండు బంతులు మిగిలుండగానే గెలుపు తీరాలకు చేరింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక.. మయాంక్ అగర్వాల్ (112 బంతుల్లో 124; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. కర్ణాటక ఇన్నింగ్స్‌లో నికిన్ జోస్ 37, కేవీ అనీశ్ 11, స్మరణ్ రవిచంద్రన్ 83, అభినవ్ మనోహర్ 1, కృష్ణణ్ శ్రీజిత్ 5, ప్రవీణ్ దూబే 24, విద్యాధర్ పాటిల్ 1, శ్రేయస్ గోపాల్ 19 (నాటౌట్), అభిలాశ్ షెట్టి 4 (నాటౌట్) పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో చామ మిలింద్ 3 వికెట్లు పడగొట్టగా.. అనికేత్ రెడ్డి 2, ముదస్సిర్, రోహిత్ రాయుడు తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హైదరాబాద్ 49.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. కెప్టెన్ తిలక్ వర్మ పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకోగా.. వరుణ్ గౌడ్ అద్భుతమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో తన్మయ్ అగర్వాల్ 35, రోహిత్ రాయుడు 0, హిమతేజ 15, నితేశ్ రెడ్డి 0, అరవెల్లి అవనీశ్ 17, తనయ్ త్యాగరాజన్ 25, చామ మిలింద్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. కర్ణాటక బౌలర్లలో ప్రవీణ్ దూబే, నికిన్ జోస్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. అభిలాశ్ శెట్టి, విద్యాధర్ పాటిల్, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ దక్కించుకున్నారు.మయాంక్ హ్యాట్రిక్ సెంచరీస్ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ హ్యాట్రిక్ సెంచరీలు సాధించాడు. డిసెంబర్ 26న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 127 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 139 పరుగులు చేసిన మయాంక్.. డిసెంబర్ 28న అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 45 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 100 పరుగులు చేశాడు. ఇవాళ (డిసెంబర్ 31) హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మయాంక్ మరో సెంచరీ చేసి హ్యాట్రిక్ సెంచరీలు నమోదు చేశాడు. -
తిలక్ వర్మ విఫలం.. హైదరాబాద్‌ను గెలిపించిన సీపీ తనయుడు
విజయ్ హజారే ట్రోఫీ 2024-25(Vijay Hazare Trophy 2024-25) ఎడిషన్‌లో హైదరాబాద్ రెండో గెలుపు నమోదు చేసింది. పుదుచ్చేరితో శనివారం జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సీవీ మిలింద్ అద్భుత బౌలింగ్‌తో హైదరాబాద్‌ను గెలిపించి.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.కాగా డిసెంబరు 21 దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ఆరంభం కాగా.. హైదరాబాద్ తొలుత నాగాలాండ్‌తో తలపడింది. ఆ మ్యాచ్‌లో 42 పరుగుల తేడాతో గెలుపొందింది. అనంతరం ముంబై చేతిలో మూడు వికెట్ల తేడాతో ఓడిన తిలక్ సేన.. ఆ తర్వాత సౌరాష్ట్రతో మ్యాచ్‌లోనూ ఆరు వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది.ఆకాశమే హద్దుగా చెలరేగిన సీవీ మిలింద్ఈ క్రమంలో అహ్మదాబాద్ వేదికగా శనివారం పుదుచ్చేరితో తలపడిన హైదరాబాద్.. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసింది. లెఫ్టార్మ్ పేసర్ సీవీ మిలింద్(CV Milind) ఆకాశమే హద్దుగా చెలరేగి.. పాండిచ్చేరి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. టాపార్డర్‌లో ఓపెనర్లు గంగా శ్రీధర్ రాజు(2), అజయ్ రొహేరా(0)లతో పాటు.. మిడిలార్డర్లో ఫాబిద్ అహ్మద్(7).. అదే విధంగా లోయర్ ఆర్డర్లో అంకిత్ శర్మ(6), గౌరవ్ యాదవ్(13) రూపంలో ఐదు వికెట్లు(5/13) దక్కించుకున్నాడు.సీవీ మిలింద్కు తోడుగా తనయ్ త్యాగరాజన్ మూడు వికెట్లతో రాణించగా.. ముదాసిర్, శరణు నిశాంత్ ఒక్కో వికెట్ తీశారు. ఈ క్రమంలో హైదరాబాద్ బౌలర్ల ధాటికి పుదుచ్చేరి 31.5 ఓవర్లలో 98 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి.తిలక్ మరోసారి విఫలం.. రాణించిన హిమతేజఓపెనర్లు తన్మయ్ అగర్వాల్(0), నితేశ్ రెడ్డి(5).. వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ తిలక్ వర్మ(6) పూర్తిగా విఫలమయ్యారు. అయితే, నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన కొడిమెల హిమతేజ 42 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలవగా.. తనయ్ త్యాగరాజన్ 22 పరుగులతో అతడికి సహకారం అందించాడు. ఆఖర్లో వరుణ్ గౌడ్ 13(నాటౌట్) చేశాడు. ఈ క్రమంలో 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి తిలక్ సేన 102 పరుగులు చేసి.. పుదుచ్చేరిపై విజయం సాధించింది.సీపీ తనయుడుకాగా సీవీ మిలింద్ మరెవరో కాదు.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కుమారుడు. దేశవాళీ క్రికెట్లో హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న 30 ఏళ్ల ఈ పేస్ బౌలర్.. జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు. ఇక సీవీ ఆనంద్ కూడా అండర్-19 స్థాయిలో క్రికెట్ ఆడారన్న విషయం తెలిసిందే.తిలక్ వర్మ వరుస వైఫల్యాలుఇదిలా ఉంటే.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు విజయ్ హజారే ట్రోఫీ రూపంలో వచ్చిన అవకాశాన్ని టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మ సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. సారథిగానూ, బ్యాటర్‌గానూ అతడు విఫలమమవుతున్నాడు. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన తిలక్ చేసిన పరుగులు 0, 0, 57, 6. సారథిగానూ చిన్న జట్లపై గెలిపించాడే తప్ప.. పెద్ద జట్లపై విజయం అందించలేకపోతున్నాడు.చదవండి: Nitish Reddy: కొడుకంటే ఇలా ఉండాలి! -
శ్రేయస్ అయ్యర్ మెరుపు ఇన్నింగ్స్.. తిలక్ వర్మకు చేదు అనుభవం
విజయ్ హజారే ట్రోఫీ(VHT) 2024-25 సీజన్లో ముంబై జట్టు తొలి గెలుపు నమోదు చేసింది. అహ్మదాబాద్‌లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ను మూడు వికెట్ల తేడాతో ఓడించింది. కాగా దేశవాళీ వన్డే టోర్నమెంట్ VHTలో భాగంగా గ్రూప్-‘సి’లో ఉన్న ముంబై తమ తొలి మ్యాచ్‌లో కర్ణాటకతో తలపడింది.అయితే, ఈ లిస్ట్-‘ఏ’ మ్యాచ్‌లో ముంబై సారథి శ్రేయస్ అయ్యర్ విధ్వంసకర శతకం(55 బంతుల్లో 114 నాటౌట్) బాదినా ఫలితం లేకపోయింది. కర్ణాటక చేతిలో ఏడు వికెట్ల తేడాతో ముంబై పరాజయం చవిచూసింది. ఈ క్రమంలో హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ముంబై ఎటువంటి పొరపాట్లకు తావివ్వలేదు.టాస్ గెలిచిన ముంబై.. తిలక్ వర్మ డకౌట్నరేంద్ర మోదీ స్టేడియం ‘బి’ గ్రౌండ్లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు.. ముంబై బౌలర్ల ధాటికి 169 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్(64), అభిరథ్ రెడ్డి(35) రాణించినా.. కెప్టెన్ తిలక్ వర్మ(0) మరోసారి విఫలమయ్యాడు.ఇక మిడిలార్డర్లో అలెగాని వరుణ్ గౌడ్(1), రోహిత్ రాయుడు(1) పూర్తిగా నిరాశపరచగా.. వికెట్ కీపర్ బ్యాటర్ అరవెల్లి అవినాశ్(52) అర్ధ శతకంతో సత్తా చాటాడు. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరడంతో హైదరాబాద్ 38.1 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. ముంబై బౌలర్లలో స్పిన్నర్ అథర్వ అంకోలేకర్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. ఆయుశ్ మాత్రే మూడు వికెట్లు పడగొట్టాడు.105/7.. ఓటమి అంచుల్లో ఉన్న వేళఅదే విధంగా తనుష్ కొటియాన్ రెండు, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు అంగ్క్రిష్ రఘువంశీ(19), ఆయుశ్ మాత్రే(28) నిరాశపరచగా.. హార్దిక్ తామోర్(0), సూర్యాంశ్ షెడ్గే(6), అథర్వ అంకోలేకర్(5), శార్దూల్ ఠాకూర్(0) పూర్తిగా విఫలమయ్యారు.ఇక ఎనిమిదో స్థానంలో వచ్చిన టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(18) కూడా చేతులెత్తేశాడు. దీంతో ముంబై 105 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన వేళ తొమ్మిదో స్థానంలో బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు.అయ్యర్ ధనాధన్.. తిలక్ సేనకు చేదు అనుభవంమరో ఎండ్ నుంచి తనుష్ కొటియాన్(37 బంతుల్లో 39 నాటౌట్) సహకారం అందించగా.. అయ్యర్ ధనాధన్ దంచికొట్టాడు. కేవలం 20 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 220కి పైగా స్ట్రైక్‌రేటుతో 44 పరుగులతో దుమ్ములేపాడు. ఈ క్రమంలో 25.2 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసిన ముంబై.. తిలక్ సేనపై జయభేరి మోగించింది.ఇక జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ముంబై ఆల్‌రౌండర్ తనుష్ కొటియాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. కాగా ముంబై తమ తదుపరి మ్యాచ్‌లో అరుణాచల్ ప్రదేశ్‌తో గురువారం మ్యాచ్ ఆడనుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ముగిసిన దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టైటిల్‌ను శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ముంబై జట్టు గెలుచుకున్న విషయం తెలిసిందే.చదవండి: PV Sindhu Marriage Photo: పీవీ సింధు పెళ్లి.. తొలి ఫొటో వైరల్ -
MP Vs HYD: రజత్ పాటిదార్ మెరుపులు.. తిలక్ వర్మను వెంటాడిన దురదృష్టం
దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. పేలవ ఆటతీరు కొనసాగించిన తిలక్ సేన.. నాలుగో పరాజయంతో నాకౌట్ దశకు చేరే అవకాశాలను కోల్పోయింది.గ్రూప్ ‘ఎ’లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో హైదరాబాద్ జట్టు మధ్యప్రదేశ్ చేతిలో 7 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 179 పరుగుల లక్ష్యఛేదనలో 14 ఓవర్లు ముగిసేసరికి 125/3తో పటిష్ట స్థితిలో కనిపించిన హైదరాబాద్ జట్టు ఆ తర్వాత మిడిలార్డర్ వైఫల్యంతో 16 బంతుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయి పరాజయాన్ని మూట గట్టుకుంది.రజత్ పాటిదార్ మెరుపులుటాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన మధ్యప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. హర్ష్ గావ్లి (29 బంతుల్లో 51; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధశతకంతో మెరవగా... సుభ్రాంషు సేనాపతి (42; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ రజత్ పాటిదార్ (16 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. హైదరాబాద్ బౌలర్లలో చామా మిలింద్, అజయ్‌దేవ్ గౌడ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.తిలక్ వర్మను వెంటాడినన దురదృష్టంఅనంతరం లక్ష్యఛేదనలో హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులకు పరిమితమైంది. కెప్టెన్ ఠాకూర్ తిలక్ వర్మ (34 బంతుల్లో 46; 1 ఫోర్, 2 సిక్స్‌లు), తన్మయ్ అగర్వాల్ (33 బంతుల్లో 47; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించారు. దీంతో హైదరాబాద్ విజయందిశగా సాగిపోయింది. అయితే మధ్యప్రదేశ్ బౌలర్లు విజృంభించడంతో హైదరాబాద్ మిడిలార్డర్ కుప్పకూలింది.మికిల్ జైస్వాల్ (0), ప్రతీక్ రెడ్డి (1), తనయ్ త్యాగరాజన్ (9) విఫలమయ్యారు. చివర్లో మిలింద్ (19; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా ఆడినా హైదరాబాద్ జట్టును గట్టెక్కించలేకపోయాడు. మధ్యప్రదేశ్ బౌలర్లలో కుమార్ కార్తికేయ, కమల్ త్రిపాఠి చెరో 3 వికెట్లు తీశారు. మొత్తం 8 జట్లున్న గ్రూప్ ‘ఎ’లో 6 మ్యాచ్‌లాడిన హైదరాబాద్ జట్టు రెండింటిలో గెలిచి, నాలుగింటిలో ఓడిపోయి 8 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. గురువారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో మిజోరంతో హైదరాబాద్ తలపడనుంది. స్కోరు వివరాలు మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్: సుభ్రాంషు సేనాపతి (సి) రాహుల్ బుద్ధి (బి) నితిన్ సాయి యాదవ్ 42; హర్ష్ గావ్లి (సి) తన్మయ్ (బి) అజయ్‌దేవ్ గౌడ్ 51; రజత్ పాటిదార్ (సి) రోహిత్ రాయుడు (బి) నితిన్‌సాయి యాదవ్ 36; హర్‌ప్రీత్ సింగ్ (సి) తిలక్ వర్మ (బి) మిలింద్ 12; వెంకటేశ్ అయ్యర్ (సి) తనయ్ త్యాగరాజన్ (బి) మిలింద్ 22; అనికేత్ వర్మ (బి) మిలింద్ 0; రాహుల్ బాథమ్ (సి) నితిన్‌సాయి యాదవ్ (బి) అజయ్‌దేవ్ గౌడ్ 5; కమల్ త్రిపాఠి (సి) తిలక్ వర్మ (బి) అజయ్‌దేవ్ గౌడ్ 1; కుమార్ కార్తికేయ (నాటౌట్) 0; అవేశ్ ఖాన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1–92, 2–105, 3–142, 4–151, 5–151, 6–163, 7–165, 8–177. బౌలింగ్: రవితేజ 4–0–42–0; మిలింద్ 4–0–33–3; అజయ్ దేవ్ గౌడ్ 4–0–20–3; తనయ్ 4–0–51–0; నితిన్ సాయి 4–0–29–2.హైదరాబాద్ ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (సి) కమల్ త్రిపాఠి (బి) కార్తికేయ 47; రోహిత్ రాయుడు (సి) హర్‡్ష (బి) అవేశ్ ఖాన్ 8; తిలక్ వర్మ (సి) అనికేత్ వర్మ (బి) కమల్ త్రిపాఠి 46; రాహుల్ బుద్ధి (సి) అనికేత్ వర్మ (బి) కార్తికేయ 20; మికిల్ జైస్వాల్ (సి) రజత్ (బి) కార్తికేయ 0; ప్రతీక్ రెడ్డి (సి అండ్ బి) కమల్ త్రిపాఠి 1; తనయ్ త్యాగరాజన్ (సి) కార్తికేయ (బి) కమల్ త్రిపాఠి 9; అజయ్‌దేవ్ గౌడ్ (సి) పాటిదార్ (బి) అవేశ్ ఖాన్ 12; మిలింద్ (సి) అనికేత్ వర్మ (బి) రాహుల్ బాథమ్ 19; రవితేజ (నాటౌట్) 1; నితిన్‌సాయి యాదవ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–31, 2–87, 3–125, 4–125, 5–127, 6–128, 7–143, 8–167, 9–168.బౌలింగ్: అవేశ్ ఖాన్ 4–0–31–2; ఖెజ్రోలియా 2–0–30–3; రాహుల్ 3–0–27–1; కమల్ 4–0–31–3; వెంకటేశ్ అయ్యర్ 3–0–24–0; కార్తికేయ 4–0–25–3. చదవండి: సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం.. శివమ్ దూబే ఊచకోత -
తిలక్ వర్మ విఫలం.. అన్మోల్ప్రీత్ సింగ్ విధ్వంసం
దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు మూడో పరాజయం నమోదు చేసింది. డిఫెండింగ్ చాంపియన్ పంజాబ్‌తో మ్యాచ్‌లో ఏడు పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. ఆల్‌రౌండర్ చామా మిలింద్ (22 బంతుల్లో 55; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపులు మెరిపించినా హైదరాబాద్‌ను విజయతీరాలకు చేర్చలేకపోయాడు.అన్మోల్ప్రీత్ సింగ్ విధ్వంసంగ్రూప్ ‘ఎ’లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా ఆదివారం జరిగిన ఈ పోరులో .. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసింది పంజాబ్. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. అన్మోల్ప్రీత్ సింగ్ (36 బంతుల్లో 60; 8 ఫోర్లు, ఒక సిక్స్) అర్ధశతకం సాధించగా... రమణ్‌దీప్ సింగ్ (11 బంతుల్లో 39 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), నేహల్ వధేరా (31; ఒక ఫోర్, 2 సిక్స్‌లు) రాణించారు.హైదరాబాద్ బౌలర్లలో రవితేజ, అజయ్‌దేవ్ గౌడ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. చామా మిలింద్, రోహిత్ రాయుడు (37 బంతుల్లో 56; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో రాణించగా... మికిల్ జైస్వాల్ (23 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు.తిలక్ వర్మ విఫలంకెప్టెన్ తిలక్ వర్మ (9), తన్మయ్ అగర్వాల్ (9), రాహుల్ బుద్ధి (5), అజయ్‌దేవ్ గౌడ్ (6), రవితేజ (0), ప్రతీక్ రెడ్డి (4) విఫలమయ్యారు. ఇన్నింగ్స్ చివరి బంతి వరకు క్రీజులో నిలిచిన మిలింద్ భారీ సిక్స్‌లతో విరుచుకుపడినా... జట్టును విజయతీరానికి చేర్చలేకపోయాడు. పంజాబ్ బౌలర్లలో నమన్ ధీర్ 5 వికెట్లు పడగొట్టాడు. తదుపరి మ్యాచ్‌లో మంగళవారం మధ్యప్రదేశ్‌తో హైదరాబాద్ తలపడనుంది. స్కోరు వివరాలు పంజాబ్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (బి) అజయ్‌దేవ్ గౌడ్ 21; ప్రభ్‌సిమ్రన్ సింగ్ (సి) తిలక్ వర్మ (బి) మిలింద్ 1; అన్మోల్ప్రీత్ సింగ్ (సి) ప్రతీక్ రెడ్డి (బి) అజయ్‌దేవ్ గౌడ్ 60; నేహల్ వధేరా (సి) మిలింద్ (బి) నితిన్‌సాయి యాదవ్ 31; నమన్ ధీర్ (సి) రాహుల్ బుద్ధి (బి) రవితేజ 9; సానీ్వర్ సింగ్ (సి) రోహిత్ రాయుడు (బి) రవితేజ 24; రమణ్‌దీప్ సింగ్ (నాటౌట్) 39; అర్ష్‌దీప్ సింగ్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 5, మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–13, 2–28, 3–115, 4–115, 5–149, 6–151. బౌలింగ్: రవితేజ 4–0–49–2; మిలింద్ 4–0–28–1; అజయ్‌దేవ్ గౌడ్ 4–0–38–2; రక్షణ్ రెడ్డి 2–0–26–0, నితిన్‌సాయి యాదవ్ 4–0–40–1; రోహిత్ రాయుడు 2–0–13–0. హైదరాబాద్ ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (సి) జసిందర్ సింగ్ (బి) నమన్ 9; రోహిత్ రాయుడు (సి) సాన్వీర్ సింగ్ (బి) నమన్ 56; తిలక్ వర్మ (సి) అర్ష్‌దీప్ (బి) జసిందర్ 9; మికిల్ జైస్వాల్ (సి) అన్మోల్ప్రీత్ (బి) మయాంక్ మార్కండే 39; రాహుల్ బుద్ధి (సి) అభిషేక్ శర్మ (బి) జసిందర్ 5; అజయ్‌దేవ్ గౌడ్ (సి) రమణ్‌దీప్ సింగ్ (బి) నమన్ 6; రవితేజ (ఎల్బీ) (బి) నమన్ 0; ప్రతీక్ రెడ్డి (స్టంప్డ్) ప్రభ్‌సిమ్రన్ (బి) నమన్ 4; మిలింద్ (సి) రమణ్‌దీప్ (బి) అర్ష్‌దీప్ 55; నితిన్‌సాయి యాదవ్ (రనౌట్) 0; రక్షణ్ రెడ్డి (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 189. వికెట్ల పతనం: 1–25, 2–57, 3–118, 4–120, 5–127, 6–127, 7–133, 8–141, 9–142, 10–189. బౌలింగ్: అభిషేక్ 1–0–10–0; అర్‡్షదీప్ 4–0–47–1; బల్తేజ్ సింగ్ 3–0–35–0; నమన్ ధీర్ 4–0–19–5; జసిందర్ సింగ్ 4–0–44–2; మయాంక్ మార్కండే 2–0–22–1; సాన్వీర్ సింగ్ 2–0–14–0. -
భీకర ఫామ్‌లో తిలక్ వర్మ.. హ్యాట్రిక్ సెంచరీలు.. ఇప్పుడు..!
టీమిండియా ఆటగాడు తిలక్ వర్మ నవంబర్ నెలలో అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ నెలలో తిలక్ ఏకంగా మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. నవంబర్ 13న సౌతాఫ్రికాపై సెంచరీ (107 నాటౌట్ (56 బంతుల్లో)) చేసిన తిలక్.. ఆతర్వాత నవంబర్ 15న ఆదే సౌతాఫ్రికాపై మరో సెంచరీ (120 నాటౌట్ (47 బంతుల్లో)) బాదాడు. ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో తిలక్ ఓ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. నవంబర్ 23న మేఘాలయతో జరిగిన తొలి మ్యాచ్‌లో 67 బంతుల్లో శతక్కొట్టిన (151) తిలక్.. ఆతర్వాతి మ్యాచ్‌లో (నవంబర్ 25) బెంగాల్‌పై హాఫ్ సెంచరీ (57) చేశాడు. దీని తర్వాత ఒక్క మ్యాచ్‌లో విఫలమైన తిలక్, తిరిగి ఇవాళ (నవంబర్ 29) బీహార్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో హాఫ్ సెంచరీతో (51 నాటౌట్) మెరిశాడు. మొత్తంగా నవంబర్ మాసం తిలక్‌కు అచొచ్చినట్లుంది. ఈ నెలలో తిలక్ ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో సత్తా చాటాడు. టీ20ల్లో హ్యాట్రిక్ సెంచరీలు నమోదు చేసిన తొలి క్రికెటర్‌గా తిలక్ ప్రపంచ రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. ఈ ఫీట్‌ను కూడా తిలక్ నవంబర్లోనే సాధించాడు.ఇదిలా ఉంటే, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా బీహార్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ అజేయమైన సెంచరీతో రాణించాడు. ఈ మ్యాచ్‌లో బీహార్‌పై హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బీహార్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. తెలకపల్లి రవితేజ 4 వికెట్లు తీసి బీహార్‌ను దెబ్బకొట్టాడు. మిలింద్, అజయ్ దేవ్ గౌడ్ తలో 2, నితిన్ సాయి యాదవ్ ఓ వికెట్ పడగొట్టారు. బీహార్ ఇన్నింగ్స్‌లో కుమార్ రజనీశ్ (22) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్ 12.3 ఓవర్లలో వికెట్ నష్టపోయి విజయతీరాలకు చేరింది. తిలక్ వర్మ (31 బంతుల్లో 51 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు), రోహిత్ రాయుడు (33 బంతుల్లో 56 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) హైదరాబాద్‌ను గెలిపించారు. -
తిలక్ వర్మ విఫలం.. హైదరాబాద్‌కు మరో ఓటమి
రాజ్‌కోట్: బ్యాటర్ల వైఫల్యంతో దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు వరుసగా రెండో పరాజయం మూటగట్టుకుంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 24 పరుగుల తేడాతో రాజస్తాన్ చేతిలో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. కార్తీక్ శర్మ (27 బంతుల్లో 58; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ధశతకంతో ఆకట్టుకోగా... దీపక్ హుడా (46; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 97 పరుగుల జోడించడంతో రాజస్తాన్ జట్టు మంచి స్కోరు చేయగలిగింది. హైదరాబాద్ బౌలర్లలో రవితేజ, అనికేత్ రెడ్డి చెరో 2 వికెట్లు పడగొట్టారు.అనంతరం లక్ష్యఛేదనలో హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 163 పరుగులకే పరిమితమైంది. ఈ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీతో విజృంభించిన హైదరాబాద్ కెప్టెన్ తిలక్ వర్మ (13) ఈసారి విఫలం కాగా... తన్మయ్ అగర్వాల్ (33; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), తనయ్ త్యాగరాజన్ (32 నాటౌట్; 3 ఫోర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. రాజస్తాన్ బౌలర్లలో మానవ్ సుతార్, అనికేత్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. తాజా టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక విజయం, రెండు పరాజయాలు ఖాతాలో వేసుకున్న హైదరాబాద్ జట్టు 4 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్‌లో రేపు బిహార్‌తో హైదరాబాద్ ఆడుతుంది. -
టీ20 క్రికెట్ లో హ్యాట్రిక్ సెంచరీలు.. తిలక్ వర్మ నయా రికార్డ్..!
-
తిలక్ వర్మ విధ్వంసకర సెంచరీ.. టీ20 ఫార్మాట్లోనే తొలి బ్యాటర్‌గా.. వరల్డ్ రికార్డు!
టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో వరుసగా మూడు శతకాలు బాదిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సాధించాడు. కాగా అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ తరఫున వెలుగులోకి వచ్చిన ఈ హైదరాబాదీ.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నాడు.ముంబై తరఫున అరంగేట్రంలోనే అదరగొట్టిన తిలక్ వర్మ.. టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలోనే గతేడాది భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 20 టీ20లు, 4 వన్డేలు ఆడిన తిలక్ వర్మ ఆయా ఫార్మాట్లలో 68, 616 పరుగులు చేశాడు.సౌతాఫ్రికా గడ్డపై వరుసగా రెండు శతకాలుఇక అంతర్జాతీయ టీ20లలో తిలక్ వర్మకు ఇటీవలే రెండు సెంచరీలు బాదడం విశేషం. ఇటీవల సౌతాఫ్రికా గడ్డపై ఈ ఘనత సాధించాడు. తాజాగా అతడు దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ తరఫున బరిలోకి దిగాడు.ఫోర్లు, సిక్సర్ల వర్షం ఇక్కడా.. తిలక్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ కేవలం 51 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. మేఘాలయతో మ్యాచ్‌లో ఫోర్లు(14), సిక్సర్ల(10) వర్షం కురిపిస్తూ పరుగుల విధ్వంసం సృష్టించాడు. కేవలం 67 బంతుల్లోనే 151 పరుగులతో దుమ్ములేపి కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచి హైదరాబాద్‌కు 248 పరుగులు భారీ స్కోరు అందించాడు.సహచర బ్యాటర్ తన్మయ్ అగర్వాల్(55)తో కలిసి 122 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో పాటు.. రాహుల్ బుద్ధి(30)తో కలిపి 84 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. రాజ్‌కోట్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మేఘాలయ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు ఆదిలోనే షాక్ తగిలింది.సుడిగాలి ఇన్నింగ్స్‌లో ఆఖరి వరకు అజేయంగాఓపెనర్ రాహుల్ సింగ్ డకౌట్ అయ్యాడు. అయితే, మరో ఓపెనర్ తన్మయ్ సహకారం అందించగా కెప్టెన్ తిలక్ వర్మ ఈ మేర సుడిగాలి ఇన్నింగ్స్‌లో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో హైదరాబాద్ కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి 248 రన్స్ చేసింది.హైదరాబాద్ భారీ విజయంఇక కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన మేఘాలయ హైదరాబాద్ బౌలర్ల ధాటికి 69 పరుగులకే కుప్పకూలింది. 15.1 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. దీంతో హైదరాబాద్ ఏకంగా 179 పరుగులతో భారీ విజయం సాధించింది. ఇక హైదరాబాద్ బౌలర్లలో అనికేత్ రెడ్డి నాలుగు, తనయ్ త్యాగరాజన్ మూడు, మికిల్ జైస్వాల్, సరణు నిషాంత్, తెలకపల్లి రవితేజ ఒక్కో వికెట్ పడగొట్టారు.చదవండి: Ind vs Aus 1st Test: ఎవరు అవుట్?.. రాహుల్ ద్రవిడ్ మనసంతా ఇక్కడే..!Tilak Varma becomes the FIRST ever player to score 3 back-to-back T20 centuries.2 for India vs South AfricaToday in SMAT pic.twitter.com/ctVqGgm1wd— Kausthub Gudipati (@kaustats) November 23, 2024 -
తిలక్ @3
దుబాయ్: దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌లో రెండు సెంచరీలతో విజృంభించిన భారత యువ ఆటగాడు ఠాకూర్ తిలక్ వర్మ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టి20 ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. సఫారీలపై ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన తిలక్ వర్మ ఐసీసీ బుధవారం విడుదల చేసిన టి20 బ్యాటింగ్ తాజా ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్–10లోకి ప్రవేశించడమే కాకుండా... కెరీర్ అత్యుత్తమంగా 3వ స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో తిలక్ 69 స్థానాలు ఎగబాకడం విశేషం. ఈ జాబితాలో ఆ్రస్టేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ (855 పాయింట్లు) తొలి స్థానంలో ఉండగా... ఇంగ్లండ్ ప్లేయర్ ఫిల్ సాల్ట్ (828 పాయింట్లు) రెండో ర్యాంక్‌లో ఉన్నాడు. ప్రస్తుతం భారత్ నుంచి అత్యుత్తమ ర్యాంక్ గల ఆటగాడిగా తిలక్ వర్మ (806 పాయింట్లు) నిలవగా... సూర్యకుమార్ (788 పాయింట్లు) ఒక స్థానం కోల్పోయి నాలుగో ర్యాంక్‌కు పరిమితమయ్యాడు. భారత్ నుంచి యశస్వి జైస్వాల్ (8వ ర్యాంక్) కూడా టాప్–10లో చోటు దక్కించుకున్నాడు. ఇదే సిరీస్‌లో రెండు సెంచరీలతో సత్తా చాటిన ఓపెనర్ సంజూ సామ్సన్ 22వ ర్యాంక్‌కు చేరాడు.నాలుగు నెలల తర్వాత... ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా నాలుగు నెలల తర్వాత మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ ఏడాది జూన్ 29న తొలిసారి నంబర్‌వన్ ర్యాంక్ కు ఎగబాకిని పాండ్యా ఆ తర్వాత తన టాప్ ర్యాంక్‌ను కోల్పోయాడు.అయితే దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో అటు బ్యాట్‌తో ఇటు బంతితో రాణించిన హార్దిక్ 244 పాయింట్లతో మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి అత్యుత్తమంగా రవి బిష్ణోయ్ ఎనిమిదో ర్యాంక్‌లో ఉన్నాడు. -
ICC: వరల్డ్ నంబర్ వన్‌గా హార్దిక్ పాండ్యా.. దూసుకువచ్చిన తిలక్ వర్మ.. ఏకంగా..
ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా సత్తా చాటాడు. టీ20 మెన్స్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో మరోసారి అగ్రస్థానం సంపాదించాడు. ఇటీవల సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్న హార్దిక్.. వరల్డ్ నంబర్‌వన్‌గా అవతరించాడు.ఈ మేరకు ఐసీసీ బుధవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి అగ్రపీఠం కైసవం చేసుకున్నాడు. ఈ క్రమంలో నేపాల్‌కు చెందిన దీపేంద్ర సింగ్ ఐరీ, ఇంగ్లండ్ విధ్వంసకర వీరుడు లియామ్ లివింగ్‌స్టోన్‌ను హార్దిక్ పాండ్యా అధిగమించాడు.తిలక్ వర్మ ఏకంగా 69 స్థానాలు ఎగబాకిమరోవైపు.. టీమిండియా యువ సంచలనం, సెంచరీల వీరుడు తిలక్ వర్మ ఏకంగా 69 స్థానాలు ఎగబాకి.. టీ20 మెన్స్ బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌లో మూడో ర్యాంకు సాధించడం విశేషం. అదే విధంగా.. మరో శతకాల వీరుడు సంజూ శాంసన్ కూడా 17 స్థానాలు జంప్ చేసి.. 22వ ర్యాంకుకు చేరుకున్నాడు. కాగా ఇటీవల నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా సౌతాఫ్రికాలో పర్యటించిన విషయం తెలిసిందే.సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో సఫారీ గడ్డపై 3-1తో ఈ సిరీస్‌ను భారత జట్టు సొంతం చేసుకుంది. ఇందులో 31 ఏళ్ల హార్దిక్ పాండ్యా ఇటు బంతితో.. అటు బ్యాట్‌తో రాణించి తన వంతు పాత్ర పోషించాడు.ముఖ్యంగా నిర్ణయాత్మక నాలుగో టీ20లో మూడు ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి.. టీమిండియా గెలుపునకు బాట వేశాడు.సంజూ శాంసన్ సైతంఇక రెండో టీ20లోనూ 39 పరుగులతో అతడు అజేయంగా నిలిచాడు. కాగా టీ20 ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా ప్రథమ స్థానం సంపాదించడం ఇది రెండోసారి. ఇక తిలక్ వర్మ సఫారీలతో సిరీస్‌లో వరుస సెంచరీలతో చెలరేగాడు. మూడో టీ20లో 107 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ హైదరాబాదీ బ్యాటర్.. నాలుగో మ్యాచ్‌లో కేవలం 47 బంతుల్లోనే 120 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు.. సంజూ శాంసన్ సౌతాఫ్రికాలో తొలి టీ20లో 107, నాలుగో టీ20లో 109(నాటౌట్) పరుగులు సాధించాడు.ఐసీసీ టీ20 మెన్స్ ఆల్‌రౌండర్ల ర్యాంకులు టాప్-51. హార్దిక్ పాండ్యా(ఇండియా)- 244 రేటింగ్ పాయింట్లు2. దీపేంద్ర సింగ్ ఐరీ(నేపాల్)- 231 రేటింగ్ పాయింట్లు3. లియామ్ లివింగ్‌స్టోన్(ఇంగ్లండ్)- 230 రేటింగ్ పాయింట్లు4. మార్కస్ స్టొయినిస్(ఆస్ట్రేలియా)- 209 రేటింగ్ పాయింట్లు5. వనిందు హసరంగ(శ్రీలంక)- 209 రేటింగ్ పాయింట్లుఐసీసీ టీ20 మెన్స్ బ్యాటర్ల జాబితా టాప్-51. ట్రవిస్ హెడ్(ఆస్ట్రేలియా)- 855 రేటింగ్ పాయింట్లు2. ఫిల్ సాల్ట్(ఇంగ్లండ్)- 828 రేటింగ్ పాయింట్లు3. తిలక్ వర్మ(ఇండియా)- 806 రేటింగ్ పాయింట్లు4. సూర్యకుమార్ యాదవ్(ఇండియా)- 788 రేటింగ్ పాయింట్లు5. బాబర్ ఆజం(పాకిస్తాన్)- 742 రేటింగ్ పాయింట్లు.టాప్-10లో అర్ష్‌దీప్ సింగ్ఇదిలా ఉంటే.. టీ20 బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్‌కు చెందిన ఆదిల్ రషీద్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. వనిందు హసరంగ(శ్రీలంక), ఆడం జంపా(ఆస్ట్రేలియా), అకీల్ హొసేన్(వెస్టిండీస్), మహీశ్ తీక్షణ(శ్రీలంక) టాప్-4లో ఉన్నారు. ఇక టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ మూడు స్థానాలు మెరుగుపరుచుకుని తొమ్మిదో ర్యాంకు పొందాడు.చదవండి: కోహ్లి పాకిస్తాన్లో ఆడాలని అనుకుంటున్నాడు: పాక్ దిగ్గజ బౌలర్ షాకింగ్ కామెంట్స్ -
నాకు కాదు.. వాళ్లకు థాంక్యూ చెప్పు: తిలక్ వర్మతో సూర్య
టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ సఫారీ గడ్డపై అదరహో అనిపించాడు. అంతర్జాతీయ టీ20లలో రెండు వరుస సెంచరీలతో చెలరేగి సౌతాఫ్రికాపై సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో తిలక్ వర్మ సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సైతం ఈ హైదరాబాదీ ఆట తీరును కొనియాడకుండా ఉండలేకపోయాడు. నాలుగో టీ20 ముగిసిన తర్వాత తిలక్‌తో సంభాషిస్తూ.. వరుసగా రెండు శతకాలు బాదడం ఎలాంటి అనుభూతినిచ్చిందని ప్రశ్నించాడు. ఇందుకు బదులిస్తూ.. ఇదంతా మీ వల్లే అంటూ తిలక్ వర్మ కెప్టెన్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. అయితే, సూర్య మాత్రం.. ‘‘నువ్వు థాంక్స్ చెప్పాల్సింది నాకు.. కాదు సెలక్టర్లకు’’ అంటూ చమత్కరించాడు.ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. టీ20 సిరీస్‌లో సౌతాఫ్రికాపై 3-1తో విజయం తర్వాత తిలక్ వర్మ.. కెప్టెన్ సూర్యకుమార్‌తో సంతోషాన్ని పంచుకుంటూ.. ‘‘అసలేం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. నాలో ఎన్నెన్నో భావోద్వేగాలు చెలరేగుతున్నాయి.నాకు అవకాశం ఇచ్చినందుకు టీమ్‌కు ధన్యవాదాలు తెలుపుకొంటున్నా. ఇలా వరుసగా టీ20 సెంచరీలు.. అది కూడా సవాళ్లకు నెలవైన సౌతాఫ్రికా పిచ్‌లపై సఫారీ జట్టుపై చేస్తానని అస్సలు ఊహించలేదు. నిజంగా చాలా గొప్పగా అనిపిస్తోంది. మీకు కూడా థాంక్యూ’’ అని సూర్యపై అభిమానం చాటుకున్నాడు.ఇందుకు బదులుగా సూర్యకుమార్ స్పందిస్తూ.. ‘‘ఇతగాడు ఎంత హుందాగా కృతజ్ఞతలు చెబుతున్నాడో చూడండి. అయినా నాకు నువ్వు థాంక్యూ చెప్పాల్సిన అవసరం లేదు. సెలక్టర్ సర్ అక్కడ కూర్చుని ఉంటారు’’ అంటూ సెలక్టర్లను మర్చిపోవద్దన్న ఉద్దేశంలో తిలక్ వర్మను సరదాగా ట్రోల్ చేశాడు. ఆ సమయంలో తిలక్ వర్మతో పాటు అక్కడే ఉన్న మరో సెంచరీల హీరో సంజూ శాంసన్ కూడా నవ్వులు చిందించాడు. ఈ దృశ్యాలు టీమిండియా అభిమానులను ఆకర్షిస్తున్నాయి.కాగా.. నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికా వెళ్లిన టీమిండియా 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో తొలి, ఆఖరి టీ20లలో సంజూ శతకాలు బాదగా.. మూడు, నాలుగో టీ20లో తిలక్ వర్మ సెంచరీలు కొట్టాడు. సంజూ, తిలక్ అద్భుత ప్రదర్శన కారణంగా టీమిండియా ఆయా మ్యాచ్‌లలో గెలిచి సఫారీ టూర్ విజయాన్ని పరిపూర్ణం చేసుకుంది. ఇదిలా ఉంటే.. సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును తిలక్ వర్మ సొంతం చేసుకోవడం విశేషం. Jersey number secret, hairdo and a special message for #TeamIndia Captain @ImRo45 🤗Skipper SKY interviews 'Humble' centurions @IamSanjuSamson & @TilakV9 💯WATCH 🎥 🔽 #SAvIND | @surya_14kumar— BCCI (@BCCI) November 16, 2024 -
'పుష్ప 3'లో నటించాలనుకుంటున్నావా? తిలక్-సూర్య డిస్కషన్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 'పుష్ప' ఫీవర్ నడుస్తోంది. ఆదివారం జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం బిహార్‌లో ఎంత రచ్చ జరుగుతుందో ఇప్పటికే సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. సగటు సినీ ప్రేక్షకుడు ఈ మూవీ కోసం వెయిటింగ్. ఇప్పుడు ఈ సినిమా క్రేజ్ టీమిండియా జట్టు వరకు చేరింది. లేటెస్ట్ సెన్సేషన్ హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ పెట్టుకున్నారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌ని టీమిండియా 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో రెండు సెంచరీలు చేసిన తిలక్ వర్మ హీరో అయిపోయాడు. దీంతో ఇతడిని కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఇంటర్వ్యూ చేశాడు. నిన్ను ఓ ప్రశ్న అడుగుతాను, నీ హెయిర్ స్టైల్ సీక్రెట్ ఏంటి? ఈ హెయిర్‌ను చూసి అందరు అల్లు అర్జున్.. అల్లు అర్జున్ అని అంటున్నారు.. ఏంటి అక్కడ తెలుగు సూపర్ స్టార్.. ఇక్కడ నీవు అని సూర్య అడిగాడు.(ఇదీ చదవండి: ఇంత దిగజారుతావ్ అనుకోలేదు.. హీరో ధనుష్‌తో నయనతార గొడవ)దీనికి సమాధానమిచ్చిన తిలక్ వర్మ.. ఏం లేదు, ఈ హెయిర్ స్టైల్‌ని ఇప్పుడే మొదలుపెట్టా. అప్పటి నుంచి అల్లు అర్జున్, అల్లు అర్జున్ అని పిలుస్తున్నారు. చాలామంది ఆయనలానే కనిపిస్తున్నావ్ అని అంటున్నారు. నాకు లాంగ్ హెయిర్ బాగా అనిపించింది. హెల్మెట్ పెట్టుకున్నప్పుడు మస్త్ అనిపిస్తుంది. అందుకే ఇలా పెంచాను అని చెప్పాడు.ఏంటి మరి 'పుష్ప 3'లో నటించాలనుకుంటున్నావా? అని సూర్య అడగ్గా.. అలాంటిది ఏం లేదు, నా పని బాల్, బ్యాట్‌తో ఆడటం మాత్రమే. గ్రౌండ్లో ఆడాలి.. బయటకెళ్లి ఎంజాయ్ చేయాలి. మిగతాది ఆ దేవుడు చూసుకుంటాడు అని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో చూసి అటు క్రికెట్ ఫ్యాన్స్, ఇటు అల్లు అర్జున్ అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.(ఇదీ చదవండి: 'పుష్ప' కోసం శ్రీలీల రెమ్యునరేషన్.. ఒక్క పాట కోసం అన్ని కోట్లా..!)Nicee @alluarjun @TilakV9 🧡 pic.twitter.com/q708J77eiY— Yash 🪓🐉 (@YashR066) November 16, 2024 -
సరిలేరు మీకెవ్వరు!
ప్రపంచ క్రికెట్లో ఏ జట్టయినా మేటి ఆటగాళ్ల నిష్క్రమణతో డీలా పడటం సహజమే! టీమిండియా విషయంలో మాత్రం అందుకు భిన్నమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఏ ఫార్మాట్లోనైనా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా వంటి ప్లేయర్లు ఆటకు వీడ్కోలు పలికితే వారి స్థానాలను భర్తీ చేయడం అంత సులువు కాదు. ఈ ఏడాది ఐసీసీ టి20 ప్రపంచకప్ నెగ్గిన అనంతరం ఈ ముగ్గురు పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా... దిగ్గజాలను మైమరిపించేందుకు మేమున్నామంటూ యువతరం దూసుకొస్తోంది!సంజూ సామ్సన్ సుదీర్ఘ కెరీర్‌ను గాడిన పెట్టుకునే ప్రయత్నం చేస్తుంటే... అడిగి మరీ బరిలోకి దిగిన మూడో స్థానంలో తానే సరైన వాడినని హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ నిరూపించుకున్నాడు. సూర్యకుమార్ తన సారథ్యంతో సత్తా చాటుతుంటే... హార్దిక్ పాండ్యా అసలు సిసలు ఆల్‌రౌండర్‌గా తనని తాను ఆవిష్కరించుకుంటున్నాడు. ‘ఛోటా పటాకా... బడా ధమాకా’ మాదిరిగా అభిõÙక్ శర్మ చెలరేగుతుంటే... ‘నయా ఫినిషర్’ తానే అని రింకూ సింగ్ నిరూపించుకుంటున్నాడు. టి20ల్లో ప్రమాదకర బౌలర్‌గా అర్‡్షదీప్ సింగ్ పరిణతి సాధిస్తే... వరుణ్, రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో వైవిధ్యంతో కట్టిపడేస్తున్నారు. వీరంత సమష్టిగా కదం తొక్కుతుండటంతో భారత జట్టు ఈ ఏడాది టి20ల్లో జైత్రయాత్ర సాగించింది. ఆడిన 26 మ్యాచ్‌ల్లో 24 విజయాలతో అదరగొట్టిన నేపథ్యంలో ప్రత్యేక కథనం. –సాక్షి క్రీడా విభాగం టి20 ఫార్మాట్లో నిర్వహించిన తొలి ప్రపంచకప్ (2007) గెలిచిన తర్వాత... మరోసారి వరల్డ్ కప్ ట్రోఫీ ముద్దాడేందుకు సుదీర్ఘ కాలం నిరీక్షించిన టీమిండియా... ఈ ఏడాది రెండోసారి జగజ్జేతగా నిలిచింది. చాన్నాళ్లుగా ఐసీసీ ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్న భారత జట్టు ఆ కల నెరవేర్చుకోవడంతో పాటు... అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టింది. వరల్డ్‌కప్‌లో ఒక్క మ్యాచ్ ఓడకుండా కప్ కైవసం చేసుకున్న టీమిండియా... మరో ఐదు సిరీస్‌లు సైతం చేజిక్కించుకుంది. అఫ్గానిస్తాన్‌పై 3–0తో, జింబాబ్వేపై 4–1తో, శ్రీలంకపై 3–0తో, బంగ్లాదేశ్‌పై 3–0తో, దక్షిణాఫ్రికాపై 3–1తో సిరీస్‌లు హస్తగతం చేసుకుంది. ఇందులో అఫ్గానిస్తాన్‌తో సిరీస్ తర్వాత టి20 వరల్డ్‌కప్ జరగ్గా... ఆ తర్వాత నుంచి సీనియర్ ప్లేయర్లు లేకుండా యువ ఆటగాళ్లతోనే టీమిండియా అద్భుతాలు చేసింది. కోహ్లి, రోహిత్, జడేజా వంటి సీనియర్లు ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడం... మిగిలిన కీలక ఆటగాళ్లు కూడా అన్ని సిరీస్‌లకు అందుబాటులే లేకపోవడం ఇలాంటి ఎన్నో ప్రతికూలతల మధ్య కూడా యువ ఆటగాళ్లు సత్తా చాటారు. భవిష్యత్తుపై భరోసా ఇస్తూ... బాధ్యత తీసుకునేందుకు మేమున్నామంటూ ముందుకు వచ్చారు. ఫలితంగా ఈ ఏడాది ఆడిన 26 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ల్లో భారత్ 24 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. అందులో రెండు ‘సూపర్ ఓవర్’ విజయాలు కూడా ఉన్నాయి. ఓడిన రెండింట్లో ఒకటి వరల్డ్‌కప్ నెగ్గిన వారం రోజుల తర్వాత సరిగ్గా కుదురుకోకుండానే జింబాబ్వేతో ఆడిన మ్యాచ్ ఒకటి అయితే... తాజాగా దక్షిణాఫ్రికా సిరీస్‌లో చివరి వరకు పోరాడి ఓడిన రెండో టి20 మరొకటి. ఈ రెండు మినహా మిగిలిన మ్యాచ్‌లు చూసుకుంటే మన జట్టు చక్కటి ప్రదర్శన కనబర్చింది. ఓవరాల్‌గా విజయాల శాతాన్ని పరిశీలిస్తే... భారత్ 92.31 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. 2018లో పాకిస్తాన్ 19 మ్యాచ్‌లాడి 17 గెలిచి 89.47 శాతంతో రెండో స్థానంలో ఉంది. ప్రతి 12 బంతులకో సిక్స్... టీమిండియా జైత్రయాత్ర వెనక యువ ఆటగాళ్ల దూకుడు ఉందనేది వాస్తవం. ఈ ఏడాది గణాంకాలు చూస్తే... భారత జట్టు సగటున ప్రతి 12 బంతులకో సిక్స్ బాదింది. జాతీయ జట్టులో చోటు సుస్థిరం చేసుకోవాలనుకునే ప్రతి ఆటగాడు తమకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని చెలరేగుతుండటం వల్లే ఇది సాధ్యమైంది. ముఖ్యంగా ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన తిలక్ వర్మ, అభిõÙక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, రింకూ సింగ్ వంటి హిట్టర్ల వల్ల జట్టు బ్యాటింగ్ శైలి మారిపోయింది. గతంలో కుదురుకున్నాక భారీ షాట్లు ఆడాలనే ధోరణి ఎక్కువగా కనిపించే టీమిండియాలో... ఇప్పుడు బాదుడే పరమావధి అనేది స్పష్టమవుతోంది. దక్షిణాఫ్రికాతో సిరీస్ సందర్భంగా వన్‌డౌన్‌లో అవకాశం దక్కించుకున్న తిలక్ వర్మకు... టీమిండియా తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఇదే నూరిపోసానని వెల్లడించాడు.‘వికెట్ పడ్డా ఫర్వాలేదు. దూకుడు మాత్రం తగ్గించొద్దు. సహజసిద్ధమైన షాట్లు ఆడితేనే మెరుగైన ఫలితాలు వస్తాయి’అని లక్ష్మణ్ తనకు చెప్పినట్లు తిలక్ మ్యాచ్ అనంతరం వెల్లడించాడు. ఈ ఏడాది 4.68 బంతులకో బౌండరీ (ఫోర్, సిక్స్) కొట్టిన భారత జట్టు ఈ జాబితాలో ఆస్ట్రేలియా (4.39) తర్వాత రెండో స్థానంలో నిలిచింది. ఏడు సెంచరీలు.. 2024 క్యాలెండర్ ఏడాదిలో భారత ఆటగాళ్లు ఒక్క టి20 ఫార్మాట్లోనే ఏడు సెంచరీలు బాదారు. సంజూ సామ్సన్, తిలక్ వర్మ తాజా సిరీస్‌లోనే చెరో రెండు సెంచరీలు బాదగా... అంతకుముందు సామ్సన్ హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌పై మరో శతకం సాధించాడు. రోహిత్ శర్మ, అభిషేక్ శర్మ కూడా ఒక్కోసారి మూడంకెల స్కోరు అందుకున్నారు. ఒక ఏడాదిలో టి20ల్లో ఒక జట్టు ప్లేయర్లు చేసిన అత్యధిక సెంచరీలు ఇవే కావడం విశేషం. సెంచరీ నమోదైన ప్రతి మ్యాచ్‌లోనూ టీమిండియా 200 పైచిలుకు పరుగులు చేసింది. మొత్తంగా 2024లో తొమ్మిది సార్లు భారత జట్టు 200+ స్కోర్లు నమోదు చేసింది. ప్రపంచంలో మరే జట్టు ఏడు సార్లకు మించి ఈ ఫీట్ అందుకోలేదు. ఈ క్రమంలో టీమిండియా 9.55 రన్‌రేట్‌తో పరుగులు రాబట్టింది. ఇది ఆ్రస్టేలియా (9.87) తర్వాత రెండో అత్యధికం. కేవలం బ్యాటింగ్‌లోనే మెరుపులు మెరిపిస్తే ఈ స్థాయి జైత్రయాత్ర సాధ్యమయ్యేది కాదు! బ్యాటర్ల మెరుపులకు బౌలర్ల సహకారం కూడా తోడవడంతోనే ఈ నిలకడ సాధ్యమైంది. ఈ ఏడాది పొట్టి ఫార్మాట్లో భారత జట్టు పదిసార్లు ప్రత్యర్థులను ఆలౌట్ చేసింది. సగటున ప్రతి మ్యాచ్‌లో టీమిండియా 8.39 వికెట్లు పడగొట్టింది. 2023 వరకు టీమిండియా కేవలం నాలుగు మ్యాచ్‌ల్లోనే ప్రత్యర్థిపై 100 పరుగుల తేడాతో విజయం సాధించగా... ఈ ఒక్క ఏడాదే మూడు సార్లు ఆ ఫీట్ నమోదు చేయడం కొసమెరుపు! ఫ్యూచర్ స్టార్స్ యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ ఇప్పటికే నిరూపించుకోగా... ఇప్పుడు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. గత ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ అయిన తిలక్ వర్మ... ఈసారి సఫారీ టూర్లో రెండు సెంచరీలతో అదరగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’అవార్డు గెలుచుకున్నాడు. నాలుక మడతేసి కొడితే బంతి బౌండరీ దాటాల్సిందే అన్న తరహాలో... దక్షిణాఫ్రికాలో విధ్వంస రచన చేసిన తిలక్‌పై సర్వత్ర ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో మాదిరిగా కాకుండా ఒకే బంతికి భిన్నమైన షాట్లు ఎలా ఆడొచ్చో తిలక్ చివరి మ్యాచ్‌లో నిరూపించాడు. జాన్సన్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ చివరి బంతికి తిలక్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా కొట్టిన సిక్సర్ చూస్తే అతడు ఎంత పరిణతి సాధించాడో ఇట్టే చెప్పేయోచ్చు. గతంలో సంప్రదాయ షాట్లతోనే పరుగులు రాబట్టేందుకు ఎక్కువ ప్రయత్నించిన తిలక్... తాను కూడా వికెట్‌కు నాలుగు వైపులా పరుగుల వరద పారించగలనని నిరూపించుకున్నాడు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ , కోచ్ మాటలను బట్టి చూస్తే... తిలక్ మూడో స్థానంలో కుదురుకున్నట్లే అనిపిస్తోంది. ఇప్పటి వరకు 20 టి20లు ఆడిన తిలక్ వర్మ రెండు సెంచరీలు, రెండు హాఫ్‌సెంచరీలతో 51.33 సగటుతో 616 పరుగులు సాధించాడు. ఇన్నాళ్లు కోహ్లి ఆడిన మూడో స్థానంలో నిలకడ కొనసాగించగలిగితే 22 ఏళ్ల తిలక్‌కు మంచి భవిష్యత్తు ఉండనుంది. -
తిలక్ వర్మ సరికొత్త చరిత్ర.. విరాట్ కోహ్లి ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్
దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా యువ ఆటగాడు, హైదరాబాదీ తిలక్ వర్మ విధ్వంసం సృష్టించాడు. వరుస సెంచరీలతో తిలక్ సత్తాచాటాడు. ప్రోటీస్‌తో జరిగిన మూడో టీ20లో అద్బుత సెంచరీతో చెలరేగిన తిలక్.. ఇప్పుడు జోహన్స్‌బర్గ్ వేదికగా జరిగిన ఆఖరి టీ20లో అదే ఇన్నింగ్స్‌ను రిపీట్ చేశాడు.ఈ మ్యాచ్‌లో కేవలం 47 బంతులు మాత్రమే ఎదుర్కొన్న తిలక్ వర్మ.. 9 ఫోర్లు, 10 సిక్స్‌లతో 120 పరుగులు చేశాడు. ఈ సిరీస్ అసాంతం తిలక్ అద్బుతమైన ప్రదర్శన కరబరిచాడు. మొత్తం నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 140 సగటు, 198 స్ట్రైక్‌రేటుతో తిలక్ 280 పరుగులు చేశాడు. ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డులు రెండు కూడా తిలక్ దక్కాయి.కోహ్లి రికార్డు బ్రేక్ఈ క్రమంలో తిలక్ వర్మ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా తిలక్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి పేరిట ఉండేది.2020-21లో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కోహ్లి 147 స్ట్రైక్‌రేటుతో 231 పరుగులు సాధించాడు. తాజా సిరీస్‌తో కోహ్లి ఆల్‌టైమ్ రికార్డును ఈ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ బ్రేక్ చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 135 పరుగుల తేడాతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది. దీంతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1 తేడాతో టీమిండియా ఎగరేసుకుపోయింది.చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు -
టీమిండియా సరికొత్త చరిత్ర.. దెబ్బకు ఆసీస్ వరల్డ్ రికార్డు బ్రేక్
దక్షిణాఫ్రికా పర్యటనను టీమిండియా అద్బుత విజయంతో ముగించింది. జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో 135 పరుగులతో భారత్ గెలుపొందింది. తద్వారా నాలుగు మ్యాచ్‌ల సిరీస్ 3-1తో సూర్య సేన సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు.సిక్సర్లు, ఫోర్ల వర్షంతో వాండరర్స్ మైదానం తడిసి ముద్దైంది. తిలక్ వర్మ, సంజూ శాంసన్ అద్బుత సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశారు. తిలక్ వర్మ 47 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్స్‌లతో 120, సంజూ శాంసన్ 56 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్స్‌లతో 109 పరుగులు చేసి ఆజేయంగా నిలిచారు. అదేవిధంగా ఈ యువ జోడీ రెండో వికెట్‌కు 210 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని జోడించారు.దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. అనంతరం 284 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక ప్రోటీస్ జట్టు కేవలం 148 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా పలు అరుదైన రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది.ఆసీస్ రికార్డు బద్దలు..👉సౌతాఫ్రికాపై టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా టీమిండియా వరల్డ్ రికార్డు నెలకొల్పింది. దక్షిణాఫ్రికాపై భారత్ ఇప్పటివరకు 31 టీ20లు ఆడి 18 విజయాలు సాధించింది. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. ఆస్ట్రేలియా సౌతాఫ్రికాపై 25 మ్యాచ్‌ల్లో 17 విజయాలు నమోదు చేసింది.తాజా మ్యాచ్‌తో ఆసీస్ అల్‌టైమ్ రికార్డును భారత్ బ్రేక్ చేసింది. టీ20ల్లో సౌతాఫ్రికాపై అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో భారత్, ఆస్ట్రేలియా తర్వాత వెస్టిండీస్ (14), ఇంగ్లండ్ (12), పాకిస్తాన్ (12), శ్రీలంక (5), న్యూజిలాండ్ (4), ఐర్లాండ్ (1), నెదర్లాండ్స్ (1) జట్లు ఉన్నాయి.👉టీ20ల్లో భారత్‌కు ఇది రెండో అత్యధిక స్కోరు(284). గత నెలలో హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ 297 పరుగులు చేసింది. 👉అంతర్జాతీయ టీ20ల్లో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం(210) జోడించిన జోడీగా తిలక్-శాంసన్ నిలిచారు. దీంతో రోహిత్, రింకూ (190; అఫ్గానిస్తాన్‌పై 2024లో) రికార్డు కనుమరుగైంది.చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు -
అందులో సీక్రెట్ ఏమీ లేదు.. వారిద్దరూ మాత్రం అద్బుతం: సూర్య
జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో 135 పరుగులతో టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది. తద్వారా నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-1 తేడాతో భారత్ సొంతం చేసుకుంది. ఆఖరి టీ20లో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు.తిలక్ వర్మ (47 బంతుల్లో 120 నాటౌట్; 9 ఫోర్లు, 10 సిక్స్‌లు), సంజూ శాంసన్ (56 బంతుల్లో 109 నాటౌట్; 6 ఫోర్లు, 9 సిక్స్‌లు) మెరుపు సెంచరీలతో చెలరేగారు. ఫలితంగా టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో దక్షిణాఫ్రికా 18.2 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటైంది.భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లతో సత్తాచాటగా.. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ఈ విజయం తనకెంతో ప్రత్యేకమని సూర్య చెప్పుకొచ్చాడు.వారిద్దరూ అద్బుతం: సూర్య"పరిస్థితులకు అనుగుణంగా మారి ఆడటంలో ఎటువంటి రహస్యం లేదు. మేము డర్బన్‌లో అడుగుపెట్టిన వెంటనే మా ప్రణాళికలను సిద్దం చేసుకున్నాము. మేము గతంలో దక్షిణాఫ్రికాకు వచ్చినప్పుడు ఎలా ఆడామో ఈ సారి కూడా అదే బ్రాండ్ ఆఫ్ క్రికెట్‌ను కొనసాగించాలని నిర్ణయించుకున్నాము.ఫలితాలు గురించి మేము ఎప్పుడూ ఆలోచించలేదు. తిలక్ వర్మ, సంజూ శాంసన్ ఇద్దరూ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇద్దరిలో ఎవరిది గొప్ప నాక్ అని ఎంచుకోవడం నాకు చాలా కష్టంగా ఉంది. వారిద్దరితో పాటు అభిషేక్ కూడా తన బ్యాటింగ్ స్కిల్స్‌ను ప్రదర్శించాడు.ఉష్ణోగ్రత తగ్గిన అనంతరం బౌలింగ్‌కు అనుకూలిస్తుందని భావించాం. చక్కని లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తే ప్రత్యర్ధి బ్యాటర్లను కట్టడి చేయవచ్చని మా బౌలర్లకు చెప్పారు. అందుకు తగ్గట్టే వారు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మేము ఇక్కడే మా తదుపరి టీ20 వరల్డ్‌కప్‌ను ఆడనున్నాము.దక్షిణాఫ్రికా వంటి పరిస్థితుల్లో విజయాలు సాధించడం అంత ఈజీ కాదు. కాబట్టి ఇది ఎంతో ప్రత్యేకమైన విజయం. కోచింగ్ స్టాప్ కూడా మాకు ఎంతో సపోర్ట్‌గా ఉన్నారు. ఈ సిరీస్ మొదటి రోజే మాకు ఓ క్లారిటీ ఇచ్చేశారు. మీకు నచ్చిన విధంగా ఆడడండి, మేము కూర్చోని మీ ప్రదర్శనను ఎంజాయ్ చేస్తాము అని మాతో చెప్పారు" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో సూర్య పేర్కొన్నాడు.చదవండి: #Rohit Sharma: రెండోసారి తండ్రైన రోహిత్ శర్మ.. మగబిడ్డకు జన్మనిచ్చిన రితికా -
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు
టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ తిరిగి తన ఫామ్‌ను అందుకున్నాడు. జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో శాంసన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. వరుసగా రెండు టీ20ల్లో డకౌటై నిరాశపరిచిన సంజూ.. ఆఖరి మ్యాచ్‌లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తనదైన స్టైల్లో ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు.తిలక్ వర్మతో స్కోర్ బోర్డును ఈ కేరళ స్టార్ బ్యాటర్ పరుగులు పెట్టించాడు. కేవలం 56 బంతులు మాత్రమే ఎదుర్కొన్న శాంసన్.. 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేశాడు. ఇక అద్భుత సెంచరీతో చెలరేగిన శాంసన్ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.చరిత్ర సృష్టించిన శాంసన్👉అంతర్జాతీయ టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా శాంసన్ ప్రపంచ రికార్డు సాధించాడు. ఈ ఏడాది టీ20ల్లో సంజూకు ఇది మూడో సెంచరీ. తద్వారా ఈ రేర్ ఫీట్‌ను సంజూ తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు ప్రపంచక్రికెట్లో ఏ బ్యాటర్ కూడా ఒకే ఏడాదిలో మూడు టీ20 సెంచరీలు సాధించలేదు.👉అదేవిధంగా ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో రెండు సెంచరీలు సాధించిన రెండో ఆటగాడిగా శాంసన్ నిలిచాడు. సంజూ కంటే ముందు ఇంగ్లండ్‌కు చెందిన ఫిల్ సాల్ట్ ఈ ఫీట్ నమోదు చేశాడు.భారత్ ఘన విజయంఇక ఈ మ్యాచ్‌లో 135 పరుగుల తేడాతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది. తద్వారా నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-1తో టీమిండియా సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది.భారత బ్యాటర్లలో శాంసన్‌తో పాటు తిలక్ వర్మ(47 బంతుల్లో 120 నాటౌట్) సూపర్ సెంచరీతో మెరిశాడు. అనంతరం లక్ష్య చేధనలో ప్రోటీస్ కేవలం 148 పరుగులకే కుప్పకూలింది.చదవండి: #Rohit Sharma: రెండోసారి తండ్రైన రోహిత్ శర్మ.. మగబిడ్డకు జన్మనిచ్చిన రితికా -
సఫారీలకు చుక్కలు చూపించిన టీమిండియా.. రికార్డులు బ్రేక్ (ఫొటోలు)
-
తిలక్, సామ్సన్ వీర విధ్వంసం.. మూడో టీ20లో సౌతాఫ్రికా చిత్తు
వాండరర్స్‌లో బౌండరీల వర్షం... సిరీస్‌లో తొలి మ్యాచ్ సెంచరీ హీరో, మూడో మ్యాచ్ శతక వీరుడు ఈసారి జత కలిసి సాగించిన పరుగుల ప్రవాహానికి పలు రికార్డులు కొట్టుకుపోయాయి. తిలక్ వర్మ, సంజు సామ్సన్ ఒకరితో మరొకరు పోటీ పడుతూ బాదిన సెంచరీలతో జొహన్నెస్‌బర్గ్ మైదానం అదిరింది. వీరిద్దరి జోరును నిలువరించలేక, ఏం చేయాలో అర్థం కాక దక్షిణాఫ్రికా బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. టీమిండియా ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 23 సిక్సర్లు ఉండగా... బౌండరీల ద్వారానే 206 పరుగులు వచ్చాయి. అనంతరం మైదానంలోకి దిగక ముందే ఓటమిని అంగీకరించినట్లు కనిపించిన సఫారీ టీమ్ 20 ఓవర్లు కూడా పూర్తిగా ఆడలేకపోయింది. 3 ఓవర్లు ముగిసేసరికి 10/4 వద్ద నిలిచిన ఆ జట్టు మళ్లీ కోలుకోలేదు. జొహన్నెస్‌బర్గ్: సఫారీ పర్యటనను భారత టి20 జట్టు అద్భుతంగా ముగించింది. అన్ని రంగాల్లో తమ ఆధిపత్యం కొనసాగిస్తూ నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 3–1తో సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన చివరి పోరులో భారత్ 135 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. హైదరాబాద్ క్రికెటర్ ఠాకూర్ తిలక్ వర్మ (47 బంతుల్లో 120 నాటౌట్; 9 ఫోర్లు, 10 సిక్స్‌లు), సంజు సామ్సన్ (56 బంతుల్లో 109 నాటౌట్; 6 ఫోర్లు, 9 సిక్స్‌లు) మెరుపు సెంచరీలతో విధ్వంసం సృష్టించారు. తిలక్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ కాగా... వరుసగా రెండు డకౌట్ల తర్వాత సామ్సన్‌కు ఈ సిరీస్‌లో ఇది రెండో శతకం కావడం విశేషం. వీరిద్దరు రెండో వికెట్‌కు 86 బంతుల్లోనే ఏకంగా 210 పరుగులు జోడించారు. అనంతరం దక్షిణాఫ్రికా 18.2 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటైంది. ధనాధన్ జోడీ... పవర్‌ప్లేలో 73 పరుగులు... 10 ఓవర్లు ముగిసేసరికి 129... 15 ఓవర్లలో 219... చివరి 5 ఓవర్లలో 64... ఇదీ భారత్ స్కోరింగ్ జోరు! గత కొన్ని మ్యాచ్‌లలో వరుసగా విఫలమైన అభిõÙక్ శర్మ (18 బంతుల్లో 36; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఈసారి కాస్త మెరుగైన ఆటతో దూకుడు ప్రదర్శించాడు. అభిషేక్ అవుట య్యాక సామ్సన్, తిలక్ జత కలిసిన తర్వాత అసలు వినోదం మొదలైంది. ప్రతీ బౌలర్‌పై వీరిద్దరు విరుచుకుపడి పరుగులు సాధించారు. మహరాజ్ ఓవర్లో తిలక్ రెండు వరుస సిక్స్‌లు కొట్టగా... స్టబ్స్ ఓవర్లో సామ్సన్ అదే పని చేశాడు. సిపామ్లా ఓవర్లో ఇద్దరూ కలిసి 3 సిక్సర్లతో 20 పరుగులు రాబట్టారు. కెప్టెన్ మార్క్రమ్ ఓవర్లో తిలక్ మరింత రెచ్చిపోతూ వరుసగా 4, 6, 6, 4 బాదాడు. సామ్సన్ స్కోరు 27 వద్ద ఉన్నప్పుడు క్రీజ్‌లోకి వచ్చిన తిలక్ ఒకదశలో అతడిని దాటేసి సెంచరీకి చేరువయ్యాడు. అయితే ముందుగా 51 బంతుల్లోనే సామ్సన్ శతకం పూర్తి చేసుకోగా... తర్వాతి ఓవర్లోనే తిలక్ 41 బంతుల్లో ఆ మార్క్‌ను అందుకున్నాడు. టపటపా... భారీ ఛేదనను చెత్త ఆటతో మొదలుపెట్టిన దక్షిణాఫ్రికా గెలుపు గురించి ఆలోచించే అవకాశమే లేకపోయింది. తొలి రెండు ఓవర్లలో హెన్డ్రిక్స్ (0), రికెల్టన్ (1) వెనుదిరగ్గా... మూడో ఓవర్లో అర్ష్ దీప్ వరుస బంతుల్లో మార్క్రమ్ (8), క్లాసెన్ (0)లను పెవిలియన్ పంపించాడు. ఆ తర్వాత స్టబ్స్, మిల్లర్... చివర్లో జాన్సెన్ (29; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) కొద్దిసేపు నిలబడినా లాభం లేకపోయింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (నాటౌట్) 109; అభిషేక్ (సి) క్లాసెన్ (బి) సిపామ్లా 36; తిలక్ వర్మ (నాటౌట్) 120; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో వికెట్ నష్టానికి) 283. వికెట్ల పతనం: 1–73. బౌలింగ్: జాన్సెన్ 4–0–42–0, కొయెట్జీ 3–0–43–0, సిపామ్లా 4–0–58–1, సిమ్‌లేన్ 3–0–47–0, మహరాజ్ 3–0–42–0, మార్క్రమ్ 2–0–30–0, స్టబ్స్ 1–0–21–0. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) సామ్సన్ (బి) పాండ్యా 1; హెన్డ్రిక్స్ (బి) అర్ష్ దీప్ 0; మార్క్రమ్ (సి) బిష్ణోయ్ (బి) అర్ష్ దీప్ 8; స్టబ్స్ (ఎల్బీ) (బి) బిష్ణోయ్ 43; క్లాసెన్ (ఎల్బీ) (బి) అర్ష్ దీప్ 0; మిల్లర్ (సి) తిలక్ (బి) వరుణ్ 36; జాన్సెన్ (నాటౌట్) 29; సిమ్‌లేన్ (సి) బిష్ణోయ్ (బి) వరుణ్ 2; కొయెట్జీ (సి) సామ్సన్ (బి) అక్షర్ 12; మహరాజ్ (సి) తిలక్ (బి) అక్షర్ 6; సిపామ్లా (సి) అక్షర్ (బి) రమణ్‌దీప్ 3; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (18.2 ఓవర్లలో ఆలౌట్) 148. వికెట్ల పతనం: 1–1, 2–1, 3–10, 4–10, 5–96, 6–96, 7–105, 8–131, 9–141, 10–148. బౌలింగ్: అర్ష్ దీప్ 3–0–20–3, పాండ్యా 3–1–8–1, రమణ్‌దీప్ 3.2–0–42–1, వరుణ్ 4–0–42–2, బిష్ణోయ్ 3–0–28–1, అక్షర్ 2–0–6–2. 283 టి20ల్లో భారత్‌కు ఇది రెండో అత్యధిక స్కోరు. గత నెలలో హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ 297 పరుగులు చేసింది. 210 సామ్సన్, తిలక్ జోడించిన పరుగులు. ఏ వికెట్‌కైనా భారత్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం. రోహిత్, రింకూ (190; అఫ్గానిస్తాన్‌పై 2024లో) రికార్డు కనుమరుగైంది. 5 అంతర్జాతీయ టి20ల్లో వరుసగా రెండు శతకాలు చేసిన ఐదో బ్యాటర్ తిలక్ వర్మ. భారత్ తరఫున సామ్సన్ ఇదే సిరీస్‌లో ఆ రికార్డు నమోదు చేయగా... గతంలో మరో ముగ్గురు గుస్తావ్ మెక్‌కియాన్, ఫిల్ సాల్ట్, రిలీ రోసో ఈ ఘనత సాధించారు. 3 ఒకే మ్యాచ్‌లో ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇది మూడోసారి. గతంలో చెక్ రిపబ్లిక్, జపాన్ బ్యాటర్లు ఈ ఫీట్ నమోదు చేశారు.