
టీమిండియా నయా స్టార్, హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ

ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌తో బిజీగా ఉన్నాడు

కోల్‌కతాతో బుధవారం జరిగిన తొలి టీ20లో 19 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. రెండో టీ20కి సన్నద్ధమయ్యాడు

ఇందుకోసం జట్టుతో కలిసి చెన్నైకి చేరుకున్నాడు. ఇరుజట్ల మధ్య శనివారం రెండో టీ20 జరుగుతుంది

ఇదిలా ఉంటే.. తిలక్ వర్మ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశాడు

తన పెంపుడు కుక్క ట్రిగ్గర్ పుట్టినరోజును సెలబ్రేట్ చేసిన ఫొటోలను పంచుకున్న తిలక్ వర్మ..

‘‘ప్రపంచంలో మొత్తంలో అందరికంటే అత్యుత్తమైన అబ్బాయి. నా హృదయంలో భాగం. నేను చేసే ప్రతి చిలిపి పనిలోనూ నా పార్ట్‌నర్. వి లవ్ యూ ట్రిగ్గర్ ’’ అంటూ విషెస్ తెలిపాడు

ట్రిగ్గర్‌కు టీ- షర్ట్ వేయడంతో పాటు.. కళ్లకు గ్లాస్ పెట్టి.. వాడికి ఇష్టమైన రీతిలో కేక్ కట్ తయారు చేయించిన ఫొటోలను పంచుకున్నాడు.



