birthday celabrations
-
మహేశ్‌బాబుతో చివరి సినిమా..'లండన్ బ్యూటీ' బర్త్‌డే వేడుకలు (ఫోటోలు)
-
ప్రపంచం మొత్తంలో బుద్ధిమంతుడైన పిల్లాడు.. లవ్ యూ: తిలక్ వర్మ(ఫొటోలు)
-
పార్టీ ఇచ్చిన ఖుష్బూ.. హాజరైన తమిళ స్టార్స్ (ఫోటోలు)
-
ఊరూవాడా సంబరాలు
సాక్షి, అమరావతి: అభివృద్ధి, సంక్షేమ సారథి, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, పార్టీ శ్రేణులు, అభిమానులు సంబరాలు చేసుకొన్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు 26 జిల్లాల్లో ఘనంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని ప్రాంతాల్లో కేక్‌లు కట్ చేశారు. వీధులు, కూడళ్లలో వైఎస్ జగన్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. యువత ర్యాలీలు చేశారు. పేదలు, అనాథలకు వస్త్ర దానాలు చేశారు. భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు, ఆహారం పంపిణీ చేశారు. తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోనూ వైఎస్సార్సీపీ శ్రేణులు, వైఎస్ జగన్ అభిమానులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లండ్ యునెటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా 14 దేశాల్లోనూ జగన్ జన్మదిన వేడుకలను అభిమానులు వైభవంగా నిర్వహించారు.⇒ శ్రీకాకుళం జిల్లా పొందూరులో శివాలయం, మెలియాపుట్టిలోని వేణుగోపాలస్వామి ఆలయం, పాతపట్నంలోని నీలమణి దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. టెక్కలి నియోజకవర్గంలో పేద విద్యార్థులకు దుప్పట్లు పంపిణి చేసి, రక్త దాన శిబిరం నిర్వహించారు. విజయనగరం జిల్లా రాజాంలోని సన్ రైజ్ హాస్పిటల్ వద్ద పెద్ద సంఖ్యలో జగన్ అభిమానులు రక్తదానం చేశారు. విజయనగరం పైడితల్లి ఆలయంలో విశేష పూజలు చేశారు. భోగాపురం మండలం ఎ రావివలసలో 52 కిలోల కేక్ కట్ చేసి, అన్నదానం చేశారు.⇒ పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో అనాధాశ్రమంలో అన్నదానం చేశారు. కురుపాం నియోజకవర్గంలో పేద మహిళకు చీరలు పంపిణీ చేశారు. పాలకొండ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మోదకొండమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.⇒ అనకాపల్లి జిల్లా చోడవరం, పాయకరావుపేట నియోజకవర్గాల్లో పలు చోట్ల అన్నదానం చేశారు. ఆసుపత్రులలో రోగులకు పాలు, రొట్టెలు పంపిణీ చేశారు. నర్సీపట్నం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ సహా నేతలు, కార్యకర్తలు రక్తదానం చేశారు.⇒ తూర్పుగోదావరి జిల్లా దేవరాపల్లి మండలం ఎర్నగూడెంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రాజమండ్రిలో రక్తదాన శిబిరంతో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్, దంత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఏరియా ఆస్పత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరిజిల్లా ఉండి నియోజకవర్గంలో వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు.⇒ ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద 60 కిలోల కేక్ కట్ చేశారు. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో 500 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేసి, అన్నదానం చేశారు.⇒ గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట, నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేసి, అన్నదానం చేశారు.⇒ కర్నూలు జిల్లాలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. ⇒ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీæ చేశారు.⇒ వైఎస్సార్ జిల్లా పులివెందుల పట్టణంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు, ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు వస్త్రాలు పంపిణీ చేశారు. బద్వేల్ నియోజకవర్గంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కమలాపురంలోని అనాథ∙క్షేత్రాలయంలో అనాథ బాలల మధ్య కేక్ కట్ చేసి, వేడుకలు నిర్వహించారు. కడపలో జిల్లా పరిషత్ సర్కిల్ వద్ద పేదలకు అన్నదానం చేశారు. జమ్మలమడుగులో రక్తదాన శిబిరం నిర్వహించారు.హైదరాబాద్‌లో మెగా రక్తదాన శిబిరంసాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం వైఎస్ జగనన్న అభిమాన సంఘం కేపీహెచ్‌బీ కాలనీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రమ్య గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ నేతలు వై.శివరామిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, గోరంట్ల మాధవ్, వేంపల్లి సతీష్‌రెడ్డి, సునీల్‌రెడ్డి, చల్లా మధుసూదన్‌రెడ్డి, వై.ఈశ్వరప్రసాద్‌రెడ్డి, పోసింరెడ్డి సునీల్, ఎస్వీఎస్ రెడ్డి, శ్యామల తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేశారు. మెగా రక్తదాన శిబిరం నిర్వహించడంతో పాటు ఐదు వేల మందికి అన్నదానం చేశారు. చెవిరెడ్డి ఆధ్వర్యంలో భారీగా పేదలకు దుస్తుల పంపిణీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వేలాది మంది మహిళలు, కార్యకర్తలకు దుస్తులు పంపిణీ చేశారు. వేలాదిగా తరలివచి్చన అభిమానులకు అన్నదానం చేశారు. ఒంగోలు వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన రక్తదానం శిబిరంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు రక్తదానం చేశారు. పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. సింగరాయకొండలో అన్నదానం చేశారు.చెన్నైలో ఘనంగా..సాక్షి, చెన్నై: వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను చెన్నైలో శనివారం ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సేవాదళ్ తమిళనాడు అధ్యక్షుడు ఏకే జహీర్ హుస్సేన్ నేతృత్వంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పెరంబూరు, అంబత్తూరు, షొళింగనల్లూరు, తండలం తదితర ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో జగన్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని చోట్లా కేక్‌లు కట్ చేసి, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్ జగన్ ఆయురారోగ్యాలను, విజయాలను కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పిల్లలకు బిర్యానీ పంపిణీ చేశారు. వృద్ధుల ఆశ్రమంలో అన్నదానం చేశారు. షొళింగనల్లూరులో రక్తదాన శిబిరం నిర్వహించారు. చెన్నై శివారులోని తండలంలో బ్రహ్మాండ వేడుకగా బర్త్‌డే కార్యక్రమాన్ని సేవాదళ్ వర్గాలు నిర్వహించాయి. అధ్యక్షుడు జహీర్ హుస్సేన్, ప్రధాన కార్యదర్శి సూర్యారెడ్డి, అధికార ప్రతినిధులు సాయి సింహారెడ్డి, కీర్తి, నేతలు శరవణన్, శరత్‌కుమార్ రెడ్డి, భాను తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పెద్దసంఖ్యలో మహిళలు, యువత, విద్యార్థులు తరలివచ్చారు. -
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో జగన్ బర్త్ డే
-
పులివెందులలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
-
ఎవర్గ్రీన్ స్టైలిష్ స్టార్.. తలైవా రజినీని ఇలా ఎప్పుడైనా చూశారా? (ఫొటోలు)
-
దేశం కోసం క్యాన్సర్‌ను లెక్కచేయని యోధుడు.. హ్యాపీ బర్త్‌డే యువీ (ఫోటోలు)
-
మా ఇంటిదేవతకు హ్యాపీ బర్త్‌డే : బాలీవుడ్ బ్యూటీ సంబరాలు (ఫొటోలు)
-
మహిళ బర్త్‌డే కేక్ కటింగ్.. దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు
ఓ మోడల్ తన పుట్టిన రోజు సందర్భంగా బర్త్‌డే కేక్ కట్ చేయడం విమర్శలకు దారి తీసింది.ఎందుకంటారా?ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కాలభైరవ దేవాలయం ఉంది. తన పుట్టిన రోజు సందర్భంగా దేవాలయానికి మోడల్ మమతా రాయ్ వచ్చింది. అయితే, దైవదర్శనం అనంతరం తన వెంట తెచ్చుకున్న బర్త్‌డే కేకును కాలభైరవ విగ్రహం ఎదుట కట్ చేసి తన పుట్టిన రోజు వేడుకల్ని జరుపుకుంది.శక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాలభైరవ ఎదుట మమతా రాయ్ బర్త్‌డే కేక్ కట్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పవిత్రమైన దేవాయంలో ఆమె కేక్ కట్ చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. పుట్టిన రోజు దైవదర్శనం చేసుకోవడం మంచిదే. ఇలా కేక్ కట్ చేయమని ఎవరు? చెప్పారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, వారణాసిలోని కాశీ విద్వాత్ పరిషత్ అనే సంస్థ దేవాలయంలో జరిగిన ఘటనపై ఆగ్రహం చేసింది. మమతారాయ్ బర్త్‌డే కేక్ కట్ చేస్తున్నా ఆలయ నిర్వహాకులు స్పందించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైంది. चंद पैसों के लिए पंडा-पुजारियों ने हमारे आस्था के केंद्रों को मजाक बना रखा है, आप भी जेब ढीली करिये और गर्भगृह में बर्थडे व एनिवर्सरी सेलिब्रेट कर सकते हैं, काल भैरव मन्दिर में केक काटने का है ये वीडियो #varanasi pic.twitter.com/joznhamSrF— Dr Raghawendra Mishra (@RaghwendraMedia) November 29, 2024 -
50 వేల పాటలు పాడిన సుశీలకు ఇప్పటికీ ఆ పాట విషయంలో బాధే (ఫొటోలు)
-
సీఎం రేవంత్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
-
కమలకు స్టీవీ ‘హ్యాపీ బర్త్‌డే’
జార్జియా: స్వింగ్ స్టేట్స్లో ఒకటైన జార్జియాలో డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ఆదివారం పలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. న్యూ బర్త్ మిషనరీ బాప్టిస్ట్ చర్చితోపాటు, జోన్స్ బోరోలోని డివైన్ ఫెయిత్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్‌లను సందర్శించారు ద్వేషం, విభజన రాజకీయాలు చేసేవారిని కాకుండా కరుణ, ప్రేమతో దేశాన్ని నడిపే నేతను ఎన్నుకోవాలని ప్రజలను హారిస్ కోరారు. ఈ ప్రచార కార్యక్రమాల్లోనే హారిస్ తన 60వ జన్మదినం జరుపుకున్నారు. లెజెండరీ సింగర్ స్టీవీ వండర్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. బాబ్ మార్లే ‘రిడంప్షన్ సాంగ్’లోని పంక్తులతో పాటు నల్లజాతి ఉద్యమ దిగ్గజం మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ జయంతి సందర్భంగా తాను రాసిన ‘హ్యాపీ బర్త్ డే’ పాటను ఆలపించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. హారిస్ చప్పట్లు తన ‘హ్యాపీ బర్త్ డే’పాటను ఆస్వాదించారు. అనంతరం ఈ వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వండర్ గతంలోనూ హారిస్ కోసం ప్రదర్శనలిచ్చారు. గత ఆగస్టులో డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్‌లోనూ ఆయన ఆనూహ్యంగా మెరిశారు. హారిస్‌కు మద్దతుగా 1973 నాటి తన సూపర్ హిట్ సాంగ్ ‘హయ్యర్ గ్రౌండ్’ను ఆలపించి అలరించారు.శుభాకాంక్షల వెల్లువ ప్రచారంలో బిజీగా ఉన్న హారిస్ పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పెన్సిల్వేనియాలో ప్రచారంలో ఉన్న రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ కూడా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్షుడు జో బైడెన్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఆమెను అసాధారణ నాయకురాలిగా అభివరి్ణంచారు. ఉపాధ్యక్ష అభ్యర్థి, మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ కూడా హారిస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అయితే హారిస్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ప్రజల హక్కుల కోసం జీవితమంతా పోరాడుతున్న ఆమెను అధ్యక్షురాలిగా ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ కూడా హారిస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య వివాదం
ప్రభాస్ బర్త్‌డే ఈవెంట్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వివాదంగా మారింది. ప్రభాస్ పుట్టిన రోజు (అక్టోబర్ 23)సందర్భంగా కొంతమంది ఫేక్ ఫ్యాన్స్‌తో కలిసి ప్రసన్న సాహో డబ్బులు వసూలు చేసి కమర్షియల్ ఈవెంట్స్ చేస్తున్నారని ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఉండి వాసు ఆరోపించారు. ఆ ఈవెంట్‌ని కచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. అయితే తాను ఎలాంటి కమర్షియల్ ఈవెంట్ చేయడం లేదని ప్రసన్న సాహో వర్గం వివరణ ఇచ్చింది. (చదవండి: రేణు దేశాయ్ ఇంట చండీ హోమం)ఎవరి దగ్గర తాను డబ్బులు తీసుకోలేదని, కావాలనే తనను టార్గెట్ చేశారంటూ ప్రసన్న మండి పడ్డారు. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా మెగా బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తామని ప్రసన్న సాహో వర్గం వెల్లడించింది.(చదవండి: టాప్ హీరో ఫ్యామిలీ నుంచి పూరీ జగన్నాథ్‌కు ఆఫర్)కాగా, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్‌డేని గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకునేందుకు దేశ వ్యాప్తంగా ఆయన అభిమానులు సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 23న ఆయన కొత్త సినిమాల అప్డేట్స్ రావడంతో పాటు ఆయన నటించిన ఆరు సినిమాలు రీరిలీజ్ అవుతుండడంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. బర్త్‌డే రోజు మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, ఛత్రపతి, ఈశ్వర్, రెబల్, సలార్ చిత్రాలు రీరిలీజ్ చేస్తున్నారు. -
రజినీతో బంధుత్వం.. సినిమాకు రూ.10 కోట్లు.. అనిరుధ్ గురించి ఇవి తెలుసా? (ఫొటోలు)
-
గ్రీస్‌లో సుకుమార్ భార్య బర్త్‌డే సెలెబ్రేషన్స్.. తబిత పోస్ట్ వైరల్
‘‘నలభైలలోనే అసలు జీవితం ఆరంభం అవుతుంది అంటుంటారు. అప్పటివరకూ మనం జీవించినది అంతా ఒక పరిశోధనే’’ అంటున్నారు తబితా సుకుమార్. ప్రముఖ దర్శకుడు సుకుమార్ భార్య తబిత తన పుట్టినరోజుని గ్రీస్‌లో జరుపుకున్నారు. భర్త, పిల్లల సమక్షంలో ఆమె బర్త్ డే సెలబ్రేషన్ జరిగినట్లు తెలుస్తోంది. తబిత వయసు ఇప్పుడు 40. (చదవండి: తమ్ముడి పెళ్లి కోసం అమెరికా వెళ్లిన సామ్)‘‘ఇప్పటివరకూ జీవితంలో నేనింత ఆత్మవిశ్వాసంగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నట్లు అనిపించడంలేదు. ఎందుకంటే ఇప్పుడు నా జీవితంలో ముఖ్యమైన విషయాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి, అనవసర విషయాలకు తక్కువ ఇస్తున్నాను. ఈ దశ చాలా బాగుంది’’ అని పేర్కొని గ్రీస్‌లో దిగిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు తబితా సుకుమార్. కాగా.., ఆ మధ్య విడుదలైన ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ మూవీకి తబిత సమర్పకురాలిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రావు రమేశ్ టైటిల్ రోల్లో నటించారు. View this post on Instagram A post shared by Thabitha Bandreddi (@thabitha_sukumar) -
టీ20 వరల్డ్‌కప్ హీరో.. హ్యాపీ బర్త్‌డే సూర్య (ఫోటోలు)
-
Mallikarjun Kharge: ఎదురొడ్డి నిల్చున్నారు
న్యూఢిల్లీ: రాజ్యాంగం ప్రబోధించిన అంకితభావం, విలువలున్న రాహుల్ గాంధీ దేశంలో తమ వాణిని వినిపించలేకపోయిన కోట్లాది మందికి గొంతుకగా మారారని రాహుల్‌ను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పొగడ్తల్లో ముంచెత్తారు. బుధవారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో రాహుల్ 54వ పుట్టినరోజు వేడుకను పార్టీ కీలక నేతలు జరిపారు. ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ, కోశాధికారి అజయ్ మాకెల్ తదితరుల సమక్షంలో రాహుల్ కేక్ కట్‌చేశారు. పెద్దసంఖ్యలో అక్కడికొచ్చిన కార్యకర్తలు రాహుల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా తన పుట్టినరోజును ఘనంగా జరుపుకోవద్దని సామాజిక, దాతృత్వ కార్యక్రమాల్లో నిమగ్న మవ్వాలని పార్టీ కార్యకర్తలకు రాహుల్ పిలుపునిచ్చారు. ‘‘ కాంగ్రెస్ పాటించే సామరస్యం, భిన్నత్వంలో ఏకత్వం, తపన అన్నీ మీలో ప్రతిబింబిస్తున్నాయి. ప్రతి ఒక్కరి కన్నీటి కష్టాలు తుడిచేసి సత్యానికి ఉన్న శక్తిని చాటుతున్నారు’ అని ఖర్గే ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు. ‘‘ నా ప్రియమైన సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సమాజం కోసం పరితపించే విలక్షణమైన వ్యక్తి, నా స్నేహితుడు, మార్గదర్శకుడు, నేత’ అంటూ ప్రియాంకా ట్వీట్‌చేశారు. ‘‘ప్రియమైన సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రజల పట్ల మీకున్న అంకితభావం దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది’ అని తమిళనాడు సీఎం స్టాలిన్ ట్వీట్‌చేశారు. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్, శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. -
Anasuya Birthday Photos: ఫ్యామిలీతో అనసూయ బర్త్‌డే సెలబ్రేషన్స్.. రంగమ్మత్త డ్రెస్‌పై ట్రోల్స్ (ఫోటోలు)
-
తిరుపతి @894
సహజంగా ప్రముఖులు, రాజకీయ, వ్యాపార, సెలబ్రెటీలతో పాటు ఎక్కువ మంది పుట్టినరోజును వేడుకగా జరుపుకోవడం చూస్తుంటాం. కానీ భారతదేశంలో ఏనగరానికీ లేని పుట్టిన రోజు ఒక్క తిరుపతి నగరానికి మాత్రమే ఉండడం విశేషం. సమతామూర్తి శ్రీ రామానుజాచార్యులు తన స్వహస్తాలతో 1130 ఫిబ్రవరి 24వ తేదీన గ్రామ ఈశాన్యంలో (నాలుగుకాళ్ల మండపం) వద్ద పునాది వేసినట్లు చరిత్రలో నిరూపితమైంది. అద్వైత పురుషుడైన సమతామూర్తి పుణ్యఫలమే తిరుపతి నగరమైంది. ఈ మేరకు శనివారం 894వ పుట్టిన రోజు వేడుకలకు తిరుపతి నగరం అత్యంత సుందరంగా ముస్తాబైంది. తిరుపతి తుడా: ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి నగరానికి పుట్టినరోజు ఉందన్న విషయాన్ని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, మేధావులు, పండితులతో కలసి 2022లో ప్రకటించారు. చరిత్ర, పురాణ, ఇతిహాసాల ఆధారంగా అద్వైత పురుషుడైన రామానుజాచార్యులు చేతుల మీదుగా తిరుపతి నగరం పురుడు పోసుకుందని సామాజానికి చాటిచెప్పారు. ఈ క్రమంలో శనివారం తిరుపతి నగర 894వ పుట్టినరోజు వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 1130వ ఏటే పునాది శ్రీరామానుజాచార్యులు కంచి నుంచి తిరుమలకు వచ్చే క్రమంలో తన 112వ ఏట నిర్మానుష్యంగా ఉన్న పార్థసారథిస్వామి ఆలయం (నేటి గోవిందరాజస్వామి ఆలయం) ప్రాంతాన్ని ఓ గ్రామంగా నిర్ణయిస్తూ పునాది వేశారు. 1130 ఫిబ్రవరి 24వ తేదీన గ్రామానికి పునాది వేశారని స్పష్టమవుతోంది. కపిలతీర్థం సమీపంలో కొత్తూరు గ్రామం ఉండేది. వివిధ వ్యాధులతో ఆ గ్రామ వాసులు వరుసగా మృత్యువాత పడుతుండడాన్ని శ్రీరామానుజాచార్యులు గుర్తించారు. గోవిందరాజస్వామి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సందర్భంలోనే కొత్తూరు గ్రామ ప్రజలను సంరక్షించడం, నిర్మానుష్య ప్రాంతంగా ఉన్న ఆలయ పరిసర ప్రాంతాలను అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు గరుడ ఆకారంలో కొత్తగా నిర్మిస్తున్న గ్రామానికి హద్దులు పెట్టించి పునాది వేయించారు. ఆగమశాస్త్రోక్తంగా నాడు వేసిన పునాదే నేడు ఆధ్యాత్మిక రాజధానిగా తిరుపతి దేదీప్యమానంగా వెలుగొందుతోంది. ఆ క్రమంలోనే ఆ గ్రామానికి గోవిందరాజపట్నంగా నామకరణం చేశారు. ఆ తరువాత గోవిందరాజపట్నానికి రామానుజపురంగా స్థానికులు పేరును మార్పుచేశారు. కాలక్రమేణా 13వ శతాబ్దంలో తిరుపతిగా ప్రసిద్ధికెక్కింది. హద్దులు ఇవే నాటి గోవిందరాజపట్నానికి కృష్ణాపురం ఠానా, నాలుగుకాళ్ల మండపం, రైల్వేస్టేషన్‌కు తూర్పు ప్రాంతం, బేరివీధి నాలుగు ప్రాంతాల్లో మండపాలను నిర్మించారు. ఆ తరువాత ఆయా ప్రాంతాల్లో శ్రీ ఆంజనేయస్వామి విగ్రహాలను ప్రతిష్టించినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం నాలుగుకాళ్లమండపం మాత్రమే చరిత్రకు సాక్షిగా మిగిలింది. తొలివీధి అదే నాడు తిల్లా గోవిందరాజస్వామిని ప్రతిష్టించే లఘ్నం ఖరారు కావడంతో యుద్ధప్రాతిపాదికన సున్నపు ముద్దలతో గోవిందరాజస్వామి విగ్రహాన్ని సిద్ధం చేశారు. ఆ విగ్రహంలో స్వామి వారి పొట్టలో దేవదాసి తిల్లా వద్ద ఉన్న లోహవిగ్రహాన్ని ప్రతిష్టించి తయారు చేశారని ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. గోవిందరాజపట్నం గ్రామం ఏర్పడ్డాక రామానుజ తిరువీధి (గోవిందరాజస్వామి తూర్పుమాడావీధి) ఏర్పడింది. ఇలా తొలివీధి రామానుజ తిరువీధిగా చరిత్రలో నిలిచింది. కై కాల రెడ్లదే తొలిదర్శనం గోవిందరాజస్వామిని తొలినాళ్లలో దేవదాసి అయిన తిల్లా పూజిస్తూ స్వామివారి బాగోగులు చూసుకునేవారు. ఈ క్రమంలో దేవదాసి అయిన మహిళ పూజలు చేయడం ఏంటని ప్రశ్నించి అవమానించేవారు. ఈ క్రమంలోనే ఆమె కై కాల చెంగారెడ్డి అనే చిన్నారిని దత్తత తీసుకుంది. కై కాల చెంగారెడ్డి ద్వారా ఆలయంలో ఉత్సవాలు, సేవలను నిర్వహించేవారు. ఇందులో భాగంగానే నేటికీ కైకాల కులస్థులకు గోవిందరాజస్వామి ఆలయంలో తొలిదర్శనం కల్పిస్తున్నారు. శ్రీతాతయ్యగుంట గంగమ్మ ఉత్సవాల్లోనూ ఈ వర్గానిదే ఆధిపత్యం. నాటి రాజావీధే నేటి గాంధీరోడ్డు గోవిందరాజపట్నం ఏర్పడ్డాక గ్రామానికి తొలివీధిగా రామానుజ తిరువీధితో పాటు పడమర, తూర్పు, దక్షిణ మాడావీధులు శ్రీవారి అర్చకులు, వారి బంధుమిత్రులకు ఆవాసాలుగా అభివృద్ధి చెందాయి. ఆ తరువాత ఆ వీధికి బజారువీధిగా ఆపై మహాత్మాగాంధీ ఈ రోడ్డులో నడయాడంతో గాంధీరోడ్డుగా మార్పుచెందింది. సున్నం తయారు చేస్తున్న ప్రాంతం సున్నపువీధిగా, ఇసుక నిల్వ ఉంచిన ప్రాంతాన్ని ఇసుక వీధిగా నామకరణం చేశారు. బండ్లు నిలిపే ప్రాంతమే నేటి బండ్ల వీధిగా మారినట్టు తెలుస్తోంది. తొలి భక్తుడు ఆయనే శ్రీమన్నారాయనుడు శ్రీవేంకటేశ్వరుడిగా సప్తగిరులపై కొలువుదీరారు. శ్రీరామానుజాచార్యుల మేనమామ అయిన శ్రీవారి పరమ భక్తుడు తిరుమల నంబి తొలిభక్తుడుగా కీర్తిగడించారు. ఆయన అనుగ్రహంతోనే అడపురి(అలిపిరి) ఓ మహావృక్షం కింద శ్రీరామానుజాచార్యులు వారు ఆధ్వైత పురుషుడుగా, వైఖానస పండితులుగా ప్రసిద్ధి గడించారు. 904 ఏళ్ల క్రితం తిరుమల ఆలయ పరిరక్షణ కోసం జీయంగార్ల వ్యవస్థను తీసుకొచ్చారు. ఇదో చారిత్రక ఘట్టం ఏ నగరానికీ లేని పుట్టిన రోజు తిరుపతి నగరానికి మాత్రమే ఉంది. ఇది నగర ప్రజలకు దక్కిన గౌవరం. పుణ్య పురుషుడైన శ్రీ రామానుజాచార్యుల వారి చేత ఆ శ్రీమన్నారాయణుడే తిరుపతి పుణ్యక్షేత్రానికి పుణాది వేయించారు. ఈ చరిత్ర తెలియడం చారిత్రక ఘట్టమే. అందుకే తిరుపతి పుట్టిన రోజు వేడుకలను ప్రతి ఏటా జరుపుకోవడం మనందరి బాధ్యత. – భూమన కరుణాకరరెడ్డి, టీటీడీ చైర్మన్. ఇప్పటికీ గోవిందరాజపట్నంగానే.. తమిళులు ఇప్పటికీ తిరుపతిని గోవిందరాజపట్నంగానే పిలుస్తుంటారు. కపిలతీర్థం సమీపంలోని కొత్తూరు గ్రామ ప్రజలను రక్షించడం, గోవిందరాజస్వామి ఆలయాన్ని నిర్మించడం, ఈ ప్రాంతం దేదీప్యమానంగా విరాజిల్లాలన్న సంకల్పంతో గరుడ ఆకారంలో గోవిందరాజ పట్ననికి హద్దులు నిర్ణయించారు. – ఆచార్య పేట శ్రీనివాసులరెడ్డి, ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ ఫౌండర్, డైరెక్టర్ -
Vijay Sethupathi Unseen Photos: విజయ్ సేతుపతి చిన్ననాటి ఫోటోలు చూశారా..?
-
మెగా హీరో బర్త్‌డే.. సందడి చేసిన రామ్ చరణ్ దంపతులు!
గతేడాది ఆదికేశవ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం గతేడాది నవంబర్ 24న విడుదలైంది. రిలీజైన మొదటి రోజు నుంచి మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కాగా.. ఉప్పెన చిత్రంతో సూపర్‌హిట్ కొట్టిన వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత వచ్చిన కొండపొలం ,రంగరంగ వైభవంగా చిత్రాల్లో నటించారు. (ఇది చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీకి వచ్చేసిన టాలీవుడ్ స్టార్ హీరో సినిమా!) తాజాగా మెగా హీరో 29వసంతంలోకి అడుగుపెట్టారు. జవనరి 13న వైష్ణవ్ తేజ్ బర్త్ డేను మెగా ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దంపతులు పాల్గొన్ని సందడి చేశారు. వైష్ణవ్ తేజ్‌తో సరదాగా ఫోటోలు దిగుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన అభిమానులు సైతం మెగా హీరోకు విషెస్ చెబుతున్నారు. కాగా.. ప్రస్తుతం రామ్ చరణ్.. శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. A heart-warming glimpse of lovely couple Mega Power star @AlwaysRamCharan & @upasanakonidela with #VaisshnavTej from his birthday celebrations 😍#RamCharan #GameChanger #TeluguFilmNagar pic.twitter.com/yyjBwe52JS — Telugu FilmNagar (@telugufilmnagar) January 14, 2024 -
దుబాయ్‌లో సీఎం జగన్ పుట్టినరోజు సంబరాలు
దుబాయిలో వందలాది జగనన్న అభిమానుల నడుమ అత్యంత వైభవంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అడ్వైజర్ ప్రసన్న సోమిరెడ్డి, వైఎస్సార్సీపీ యువ నాయకులు సింహాద్రిపురం మహమ్మద్ జిలాన్ భాష, తరపట్ల మోహన్, రెడ్డయ్య రెడ్డి, శ్రీనివాస్ చౌదరి, సయ్యద్ నాసర్, చిల్లే తాతాజీ, పాస్టర్ యోహన తదితరుల ఆధ్వర్యంలో దుబాయ్‌లో సీఎం జగన్ జన్మదిన వేడుకల్లో నిర్వహించారు. ఈ వేడుకుల్లో భారీగా అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 600 మంది జగనన్న అభిమానులు, కార్యకర్తలు పాల్గొని సీఎం జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జగనన్న జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ చేసిన అనంతరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన 400 మహిళలకు చీరల పంపిణీతో పాటు సింహాద్రిపురం మహమ్మద్ జిలాన్ భాష, పవన్ కుమార్ ఆధ్వర్యంలో దాదాపు 150 మంది ప్రవాసఆంధ్రులకు APNRTS బీమా పథకంకు ఆర్థిక సహాయం చేశారు.దాదాపు 100 మంది కొత్తవారిని వైఎస్ఆర్సిపి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ప్రసన్న సోమిరెడ్డి, మహమ్మద్ జిలాన్ భాష, మోహన్ తరపట్ల ప్రసంగిస్తూ సీఎం జగన్ పాలనలో ఏపీలో జరిగిన అభివృద్ధిని,సంక్షేమ కార్యక్రామాలని వివరిస్తూ మళ్లీ వచ్చే 2024 ఎలక్షన్లలో పార్టీ కార్యకర్తలు అభిమానులు ఎటువంటి విభేదాలు లేకుండా, ఒకరినొకరు కలుపుకొని, ప్రతి ఒక్కరు ఒక సైనికుడిలా శక్తీ వంచన లేకుండా కృషి చేసి మళ్లీ వైఎస్సార్సీపీ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలన్నారు. తిరిగి వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. చివరగా కార్యక్రమానికి విచ్చేసి, విజయవంతం కావడానికి కృషి చేసిన కార్యకర్తలు, అభిమానులకు, అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బ్రహ్మానందరెడ్డి, ఓగూరి శ్రీనివాస్, పాస్టర్ అనిల్, కొల్లే రవికుమార్, కటికితల ప్రకాశ్, పాలపర్తి నీలిమ, గోసంగి లక్ష్మి, విజయ, మేడిది శ్యామ్, కళ్యాణ్, శ్యామ్ సురేంద్రరెడ్డి, వెంకటరమణారెడ్డి, సయ్యద్ సలీమ్, షేక్ షోయబ్, వెంకటప్పరెడ్డి, ఆర్టీఏ జహీర్, గూడూరు విజయ్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
లండన్‌లో ఘనంగా సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు!
లండన్‌లోని వైఎస్సార్సీపీ యూకే కమిటీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. యూకే నలుమూలల నుంచి వచ్చిన జగన్‌గారి అభిమానులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా పలువురు వక్తలు ప్రసంగించారు. ప్రతీపేదవాడి కోసం జగనన్న మళ్ళీ అధికారంలోకి రావాలని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కమిటీ సభ్యులు ఓబుల్‌రెడ్డి పాతకోట , అనంత్‌రాజు పరదేశి, మలిరెడ్డి కిషోర్ రెడ్డి, మన్మోహన్ యామసాని, జనార్ధన్ చింతపంటి, జయంతి, ప్రతాప్ భీమిరెడ్డి, సురేందర్‌రెడ్డి అలవల, శ్రీనివాసరెడ్డి దొంతిబోయిన, గాంధీ రెడ్డి పోలి, భాస్కర్‌రెడ్డి మాలపాటి, బీవీ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ యూకే కన్వీనర్ డాక్టర్ ప్రదీప్ చింతా ప్రసంగిస్తూ.. రానున్న మూడు నెలల్లో ప్రతిఒక్కరు ఒక సైనికుడిలా పనిచేసి జగన్‌గారి గెలుపుకు కృషిచేయాలన్నారు. డాక్టర్ ప్రదీప్ చింతా, వైఎస్సార్సీపీ యూకే కన్వీనర్ "ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు హర్ధిక జన్మదిన శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది లండన్‌కు వచ్చారు. ఇక్కడ మరింత మందికి సాయం చేద్దాం. ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో మందికి సీఎం జగన్ సపోర్ట్ చేస్తున్నారు. అండగా నిలుస్తున్నారు. మరోసారి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేయడానికి మనవంతుగా ఎంతో కొంత సహకరిద్దాం. సోషల్‌మీడియాలో వచ్చే మూడు నెలల పాటు విధిగా సీఎం జగన్ కోసం పోరాడుదాం. జై జగన్.. హ్యాపీ బర్త్‌డే జగన్. మళ్లీ మళ్లీ ముఖ్యమంత్రిగా గెలవాలి, ప్రజలకు అండగా ఉండాలి." (చదవండి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన ఎన్ఆర్ఐ ప్రతినిధులు) -
బర్త్ డే కానుక?
రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, రానా, ఫాహద్ ఫాజిల్, మంజు వారియర్, రితికాసింగ్, దుషారా విజయన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోందని, రజనీకాంత్– ఫాహద్ కాంబినేషన్లో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని కోలీవుడ్ టాక్. అయితే ఈ సినిమా టీజర్ విడుదలకు వేళ అయిందట. ఈ నెల 12న రజనీకాంత్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్, టీజర్‌ను విడుదల చేసే ఆలోచనలో చిత్రయూనిట్ ఉన్నట్లు కోలీవుడ్ సమాచారం. ఈ సినిమాలో రజనీకాంత్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారని, ఫేక్ ఎన్కౌంటర్స్ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందనే ప్రచారం జరుగుతోంది. లైకా ప్రోడక్షన్స్పై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. అలాగే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కనున్న సినిమా అప్డేట్ కూడా ఈ నెల 12న రావొచ్చని టాక్. -
ఆత్మసంతృప్తి కోసం ఆ పని చేస్తున్నా: రాశీఖన్నా
తమిళసినిమా: నటి రాశీఖన్నా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అంటూ చక్కర్లు కొడుతున్న నటి ఈ బ్యూటీ. చాలా బోల్డ్ ఫొటోలను తరచూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ సినీ వర్గాల్లో అటెన్షన్‌కు గురిచేస్తున్న రాశీఖన్నా తెలుగులో కొన్ని హిట్ చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యింది. అయితే ప్రస్తుతం అక్కడ అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్లో ఎక్కువ దృష్టి సారిస్తోంది. కాగా తమిళంలో అరణ్మణై 4 చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. కాగా బ్యూటీ గురువారం తన పుట్టినరోజు వేడుకను జరుపుకుంది. పలువురు సినీ ప్రముఖులు అందించిన శుభాకాంక్షల్లో మునిగిపోయింది. కాగా ఈ సందర్భంగా ఆమె తన తోటలో కొన్ని మొక్కలను నాటింది. దీనికి సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసింది. అందులో పేర్కొంటూ ‘నా కల్లను రంజింపజేసే విధంగా, నా ఆత్మను సంతృప్తి పరిచే విధంగా ఈ చిన్న బాధ్యతను తీసుకున్నాను. పలు కారణాలతో మొక్కలు పెంచుతున్నాను. ముఖ్యంగా చెట్టు నాకు సంతోషాన్ని పంచుతుంది. నా పుట్టినరోజు సందర్భంగా సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు’ అని పేర్కొంది. నాటిన మొక్కల ఫొటోలు ఇప్పుడు సామాజికమాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) -
సెట్లో బర్త్‌డే సెలెబ్రేషన్స్..చీరకట్టులో మరింత అందంగామేఘా ఆకాశ్
టాలీవుడ్ యంగ్ హీరోయిన్స్‌లో మేఘా ఆకాశ్ ఒకరు. లై సినిమాతో తెలుగు తెరకు పరిచమైన ఈ బ్యూటీ.. ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. ఒకవైపు హీరోయిన్గా నటిస్తూనే..సినిమాల్లోనూ ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటిస్తుంది. నేడు(అక్టోబర్ 26) ఆ అమ్మడి పుట్టిన రోజు. ఈ సారి తన బర్త్‌డే సెలెబ్రేషన్స్‌ని సఃకుటుంబనాం సినిమా సెట్స్‌లో జరుపుకుంది. అచ్చం తెలుగమ్మాయిలా చీర కట్టుకొని.. చిత్రబృందం సమక్షంలో కేక్ కట్ చేసింది. అనంతరం యూనిట్ అంతా తనకు విషెస్ తెలియజేశారు. సఃకుటుంబనాం సినిమా విషయానికొస్తే.. ఇందులో రామ్ కిరణ్ హీరోగా నటిస్తున్నాడు. హెచ్ఎన్జీ మూవీస్ సినిమాస్ పతాకంపై ఉదయ్‌శర్మ దర్శకత్వంలో హెచ్.మహాదేవ్ గౌడ, హెచ్.నాగరత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, సత్య, రాహుల్ రామకృష్ణ. రచ్చరవి, శుభలేఖ సుధాకర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
ప్రస్తుతానికి అందుబాటులో లేను!
పుట్టినరోజు (అక్టోబర్ 13) సందర్భంగా పూజా హెగ్డే తన తాజా చిత్రం గురించి థ్రిల్లింగ్ న్యూస్ ఒకటి చెప్పారు. షాహిద్ కపూర్ సరసన తొలిసారి ఆమె కథానాయికగా నటించనున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు రోషన్ ఆండ్రూస్ తెరకెక్కించనున్నారు. ఇలా బర్త్ డేకి ఓ థ్రిల్లర్ మూవీకి సైన్ చేయడం పట్ల పూజా హెగ్డే ఆనందంగా ఉన్నారు. ‘‘ఇది నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. ఎందుకంటే కథాంశం కొత్తగా ఉంది. అలాగే నాది చాలా విభిన్నమైన పాత్ర. షాహిద్ కపూర్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనుండటం హ్యాపీగా ఉంది. తను మంచి నటుడు. అందుకే ఈ సినిమా ప్రయాణాన్ని ఆరంభించడానికి ఆసక్తిగా ఉన్నాను’’ అని పేర్కొన్నారు పూజా హెగ్డే. ఇక పుట్టినరోజుని ఎలా జరుపుకున్నారంటే.. ప్రస్తుతం ఈ బ్యూటీ మాల్దీవుల్లో ఉన్నారు. ‘కరెంట్లీ అన్ అవైలబుల్’ (ప్రస్తుతం అందుబాటులో లేను) అంటూ మాల్దీవుల్లో సేద తీరుతున్న ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు పూజా హెగ్డే. -
బర్త్‌డే వేడుకల్లో బెలూన్స్ వాడుతున్నారా?.. ఇది తెలుసుకోండి..
టెన్నెస్సీ: పుట్టిన రోజు వేడుకలే ఆ చిన్నారి పాలిట శాపమయ్యాయి. అందంగా అలంకరించిన బెలూనే చివరికి ఆ చిన్నారి ఉసురుతీసింది. దీంతో, వేడుకలు జరుగుతున్న ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. అందుకే, ప్రమాదకరమైన వాయువులతో నింపిన బెలూన్లతో ఆటలొద్దు.. జాగ్రత్త..! అంటూ చిన్నారి తల్లి హెచ్చరిస్తున్నారు. వివరాల ప్రకారం.. అమెరికాలోని టెన్నెస్సీలో ఇటీవల చోటు చేసుకున్న విషాద ఘటన ఇది. అలెగ్జాండ్రా కెల్లీ అనే ఏడేళ్ల చిన్నారి సెప్టెంబర్ 24వ తేదీన ఏడో పుట్టిన రోజు జరుపుకుంది. బర్త్‌డే వేడుకలో ఆమె తల్లి చన్నా కెల్లీ ఏడంకెతో కూడిన పెద్ద బెలూన్‌తోపాటు మరో 10 రబ్బర్ బెలూన్లను అలంకరించారు. అక్టోబర్ ఒకటో తేదీన ఆదివారం నాడు బెలూన్లుంచిన గదిలోకి వెళ్లి ఆడుకుంటోంది. ఈ క్రమంలో సదరు చిన్నారిని ఇంటి సభ్యులు పట్టించుకోలేదు. అయితే, కొద్దిసేపటి తర్వాత వెళ్లి చూడగా గదిలో అలెగ్జాండ్రా పెద్ద బెలూన్‌పై ఉలుకూపలుకూ లేకుండా పడిపోయి ఉంది. వెంటనే కృత్రిమ శ్వాస(సీపీఆర్) కల్పించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బెలూన్లోని ప్రమాదకరమైన హీలియం వాయువును పీల్చడం వల్లే ఆమె శ్వాస ఆగిపోయి ఉంటుందని భావిస్తున్నారు. చిన్నారి తల్లి చన్నా కెల్లీ ఈ విషాద వార్తను సోషల్‌మీడియాలో పంచుకోవడంతో తాజాగా వెలుగులోకి వచ్చింది. బెలూన్ల వాడకం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులను ఆమె హెచ్చరించారు. -
చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో కొడాలి నాని.. విమర్శలపై క్లారిటీ
సాక్షి, కృష్ణా జిల్లా: తాను శ్రీరామ అనే పదం పలికినా టీడీపీ, జనసేనలకు బూతులానే వినపడుతుందని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు. తానేం మాట్లాడానో చిరంజీవి, ఆయన అభిమానులకు తెలుసని పేర్కొన్నారు. తామంతా క్లారిటీగానే ఉన్నామన్నారు. చిరంజీవి అభిమానుల ముసుగులో టీడీపీ శ్రేణులున్నారని, తనకు చిరంజీవికి మధ్య టీడీపీ అగాధం సృష్టించాలని చూస్తోందని మండిపడ్డారు. 60 శాతం మంది చిరంజీవి అభిమానులే గుడివాడలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కార్యక్రమంలో కొడాలినాని పాల్గొన్నారు. కేక్ కట్ చేసి చిరంజీవి అభిమానులకు పంచారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. తాను మెగాస్టార్‌ను విమర్శించినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. తన వెంట ఉన్న 60 శాతం మంది చిరంజీవి అభిమానులేనన్నారు. ఎవరి జోలికి వెళ్ళని చిరంజీవిని విమర్శించే సంస్కారహీనుడును కాదని పేర్కొన్నారు. అభిమానుల ముసుగులో టీడీపీ కుట్రలు సీఎం జగన్‌ను ఎవరు విమర్శించినా ఊరుకునేది లేదన్నారు. చిరంజీవి అభిమానుల ముసుగులో టీడీపీ, జనసేన శ్రేణులు గుడివాడ రోడ్ల మీద దొర్లారని మండిపడ్డారు. ‘ప్రజారాజ్యం తరపున తన కార్యాలయం మీదుగా ర్యాలీగా వెళ్లిన చిరంజీవికి చేతులెత్తి నమస్కారం పెట్టాను. ఆయనను అనేక సందర్భాల్లో కలిశాను. పెద్దాయనగా చిరంజీవి చెప్పే సూచనలు పాటిస్తాం. చిరంజీవిని విమర్శించినట్లు ఎలా అవుతుంది? తమకు ఇచ్చినట్లే.. డ్యాన్సులు, నటన చేతకాని ఇండస్ట్రీలోని పకోడీ గాళ్ళకు చిరంజీవి సలహాలు ఇవ్వాలనే నేను చెప్పాను. ఇండస్ట్రీలో శిఖరాగ్రాన ఉన్న చిరంజీవికి డాన్సులు, యాక్షన్ రాదా?...ఈ వ్యాఖ్యలు చిరంజీవి గురించి మాట్లాడినట్లు ఎలా అవుతుంది’ అని కొడాలి నాని పేర్కొన్నారు. చదవండి: బరితెగించిన టీడీపీ మాజీమంత్రి.. డబ్బు తీసుకుని పనిచేయాలని ఒత్తిడి -
Dhanush Rare & Unseen Photos: బెస్ట్ యాక్టర్ ధనుష్ బర్త్‌డే స్పెషల్ (ఫొటోలు)
-
ఆస్ట్రేలియాలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రివర్యులు KTR జన్మదినాన్ని పురస్కరించుకొని ఆస్ట్రేలియా లోని సిడ్నీ, మెల్బోర్న్, కాన్బెర్రా ,బ్రిస్బేన్ మరియు అడిలైడ్ పట్టణాలలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. మెల్బోర్న్లో సాయిరాం ఉప్పు ఆధ్వర్యం లో కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు చేశారు . ఈ కార్యక్రమ అనంతరం ఏర్పాటు చేసిన వేడుకలో విశ్వామిత్ర మంత్రి ప్రగడ మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణంలో, బంగారు తెలంగాణను సాధించే దిశగా తెరాస ఆస్ట్రేలియా పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. గిఫ్ట్ ఏ స్మైల్ లో బాగంగా మెల్బోర్న్ లో వినయ్ సన్నీ ఆధ్వర్యంలో పలువురు రక్తదానం చేశారు. ఈ వేడుకలలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా కోర్ కమిటి నాయకులు ప్రవీణ్ లేదెళ్ళ, వేణు నాథ్ , సాయి యాదవ్ , ఉదయ్ ,సాయి కృష్ణ కల్వకుంట్ల ,సురేష్ మండ, రాకేష్, సూర్య రావు ,అశోక్, బాలరాజు, మిస్కీన్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై కేసు నమోదు.. ఎందుకంటే?
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ హంగామా సృష్టించారు. మచిలీపట్నంలోని సిరి కృష్ణ, సిరి వెంకట థియేటర్‌కి జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా అభిమానులు పెద్దఎత్తున చేరుకున్నారు. అక్కడే రెండు మేకలను బలి ఇచ్చి వీరంగం సృష్టించారు. అంతే కాకుండా వాటి రక్తాన్ని ఎన్టీఆర్ బ్యానర్లపై చిందించారు. (ఇది చదవండి: షాకింగ్.. నమ్మలేకపోతున్నాం.. రాజమౌళి, ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్) ఈ క్రమంలో వారు పదునైన ఆయుధాలను బహిరంగంగా తీసుకురావడం.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై రాబర్ట్‌సన్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. సింహాద్రి రీ-రిలీజ్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు విజయావాడలో థియేటర్లో టపాసులు పేల్చడంతో మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. కాగా.. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో దేవర చిత్రంలో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ చిత్రం జనతా గ్యారేజ్ తర్వాత వీరి కాంబినేషన్లో చిత్రం తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్‌లుక్, టైటిల్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపించనున్నారు. అంతేకాకుండా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన వార్ -2లో జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్‌తో జతకట్టనున్నారు. (ఇది చదవండి: ఊర్వశి రౌతేలా నెక్లెస్.. ధరపై నెటిజన్స్ ట్రోల్స్!) -
సినిమా సూపర్ హిట్టయినా లాభాలు రావడం లేదు: బెక్కెం వేణుగోపాల్
‘‘ప్రస్తుతం తెలుగులో కథ కంటే కాంబినేషన్‌ని నమ్ముకుని ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు నిర్మాతలు. దానివల్ల సినిమా సూపర్ హిట్టయినా లాభాలు రావడం లేదు. కాంబినేషన్‌ని నమ్ముకుని పారితోషికాలు పెంచడం వల్ల బడ్జెట్ ఊహించని స్థాయికి చేరుకుంటోంది’’ అన్నారు నిర్మాత బెక్కెం వేణుగోపాల్. నేడు(ఏప్రిల్ 27) బెక్కెం వేణుగోపాల్ బర్త్ డే. ఈ సందర్భంగా బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ– ‘‘2006 అక్టోబర్ 12న నిర్మాతగా నా తొలి చిత్రం ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ విడుదలైంది. మొదటి చిత్రంతోనే హిట్ అందుకున్నాను. ఈ 16 ఏళ్లల్లో సొంతంగా 12 సినిమాలు, వేరే బ్యానర్లతో కలిసి 4 సినిమాలు నిర్మించాను. స్టార్ హీరోలతో, భారీ బడ్జెట్ సినిమాలు తీసేందుకు రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి. ఇక నిర్మాతలను మించిన నటులు ఎవరూ ఉండరు. అప్పుడప్పుడు లోపల అగ్నిపర్వతం బద్దలవుతున్నా బయటికి మాత్రం శాంతంగా ఉండాల్సిన పరిస్థితి. భవిష్యత్‌లో చిన్న చిన్న పాత్రల్లో నటించాలనుంది. కానీ, దర్శకత్వ ఆలోచన లేదు. ప్రస్తుతం కొత్తవాళ్లతో ‘రోటి కపడా రొమాన్స్’, సుడిగాలి సుధీర్‌తో నరేష్ దర్శకత్వంలో నిర్మాత చంద్రశేఖర్ రెడ్డితో కలిసి మరో మూవీ చేస్తున్నాను. అవికా గోర్ ప్రధాన పాత్రలో స్వరూప్ దర్శకత్వంలో ఓటీటీ కోసం ఓ మూవీ నిర్మిస్తున్నాను’’ అన్నారు. -
క్రికెట్ బ్రాండ్ అంబాసిడర్.. క్రికెట్ దేవుడు!
-
వేడుకగా చరణ్ బర్త్‌డే పార్టీ.. టాలీవుడ్ తారల సందడి
ఆర్ఆర్ర్తో గ్లోబల్ స్టార్‌గా మారాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. నాటు నాటుకు ఆస్కార్ రావడంతో చరణ్ విశ్వ వేదికలపై మెరిసాడు. ఈ క్రమంలో ఆయనకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. నాటు నాటు ఆస్కార్ గెలిచిన తరుణంలో టాలీవుడ్‌తో పాటు భారత సినీ పరిశ్రమ పండుగ చేసుకుంటుంది. ఈ క్రమంలో ఆ ఆనందాన్ని మరింత రెట్టింపు చేస్తూ మెగా రామ్ చరణ్ బర్త్‌డే రావడం విశేషం. ఈ నేపథ్యంలో చరణ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ వేడుకగా జరిగాయి. ఆయన భార్య ఉపాసన చరణ్ బర్త్‌డే పార్టీని ఘనంగా నిర్వహించింది. మార్చి 27 రామ్ చరణ్ పుట్టిన రోజు అనే విషయం తెలిసిందే. చరణ్ బర్త్‌డే పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులంత హంగామా చేశారు. అలాగే అమెరికాలోనూ చరణ్ పుట్టిన రోజు సెలబ్రెషన్స్ ఘనంగా జరిగాయి. లాస్ ఏంజిల్స్‌లో రామ్ చరణ్ అభిమానులు.. సర్ ప్రైజ్ గ్రీటింగ్స్ తెలిపారు. ప్రపంచ సినిమా స్టూడియోలకు ప్రసిద్ది అయిన హాలీవుడ్ సైన్ పై.. ఎయిర్ ప్లేన్ బ్యానర్ ఎగురవేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే చరణ్ బర్త్‌డే సందర్భంగా సోమవారం రాత్రి గ్రాండ్ పార్టీ ఇచ్చింది మెగా ఫ్యామిలీ. ఈ పార్టీలో టాలీవుడ్ తారలంతా సందడి చేశారు. ‘చందమామ’ కాజల్ భర్తలో కలిసి హాజరు కాగా.. కొత్త జంట మంచు మనోజ్ భార్య మౌనిక కలిసి పాల్గొన్నాడు. ఈ వేడుకలో కాజల్ జంట, మనోజ్ జంటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే మంచు లక్ష్మి, ఎస్ ఎస్ రాజమౌళి విక్టరి వెంకటేశ్, శ్రీకాంత్, రానా దగ్గుబాటి, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అడవి శేష్, దిల్ రాజుతో పాటు ఇతర దర్శక-నిర్మాతలు చరణ్ బర్త్‌డే సెలబ్రెషన్స్‌లో పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తారలంతా ఒక్కచోట ఇలా కనిపించడం కనుల విందుగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: మై స్వీట్ బ్రదర్ అంటూ ఫొటో షేర్ చేసిన మంచు మనోజ్ డైరెక్టర్‌తో ఏడేళ్లు ప్రేమ, పెళ్లి.. పెళ్లైన వారానికే నరకం చూశా: నటి జయలలిత -
సిద్దిపేటలో హీరో నాని, క్రికెటర్ అంబటి రాయుడు సందడి..
-
శ్రీకాళహస్తిలో సీఎం జగన్ పుట్టినరోజు వారోత్సవాలు
-
సోనియాకు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలియన్స్(యూపీఏ) ఛైర్పర్సన్ సోనియా గాంధీ శుక్రవారం 76వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీతో పాటు పలువురు ప్రముఖులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమెకు మంచి ఆరోగ్యంతో కూడిన సుదీర్ఘ జీవితాన్ని భగవంతుడు ప్రసాదించాలని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ తో పాటు పలువురు నేతలు సోనియా గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు. ‘పుట్టిన రోజు సందర్భంగా యూపీఏ ఛైర్పర్సన్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి శుభాకాంక్షలు. ఆమెకు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నా.’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షిద్ ట్వీట్ చేశారు. యూత్ కాంగ్రెస్ నేత శ్రీనివాస్ బీవీ సైతం ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. రాజస్థాన్‌కు సోనియా.. భారత్ జోడో యాత్ర రాజస్థాన్‌లో కొనసాగుతున్న క్రమంలో గురువారం జైపూర్‌కు చేరుకున్నారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. రెండు రోజుల పాటు రాజస్థాన్‌లో పర్యటించనున్నారు. గురువారం జైపూర్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో సవాయ్ మాధాపుర్కు చేరుకున్నారు. షేర్ బాఘ్ హోటల్లో శుక్రవారం సోనియా జన్మదిన వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పార్టీ సీనియర్ నేతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, సోనియా కూతురు ప్రియాంక గాంధీ సైతం సవాయ్ మాధాపూర్‌కు చేరుకున్నారని చెప్పారు. ‘వారు రంథాంభోర్లో ఉంటారు. డిసెంబర్ 9న అక్కడే సోనియా గాంధీ పుట్టిన రోజు వేడుకలు ఉంటాయి. ’ అని తెలిపారు. ఇదీ చదవండి: ప్రతీ అడుగు పక్కాగా... మోదీ మంత్రం, షా తంత్రం -
Warangal: బర్త్‌డే వేడుకల్లో గొడవ.. శానిటైజర్ తాగిన విద్యార్థినులు
వరంగల్/ఎంజీఎం: హనుమకొండ జిల్లా ఆరెపల్లి సమీపంలోని మహాత్మా జ్యోతిరావుపూలే బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఆదివారం ఉదయం 10వ తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థినులు శానిటైజర్ తాగారు. దీంతో రుతిక, స్ఫూర్తి, జోత్స్న, ఉమాదేవి, చార్విక అనే విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో చికిత్స కోసం వారిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్న వైద్యు లు విద్యార్థినులకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో స్కూల్ నిర్వాహకులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ములుగు జిల్లా పాకాల కొత్తగూడకు సంబంధించిన జ్యోతిరావుపూలే బీసీ రెసిడెన్షియల్ పాఠశాలను ఆరెపల్లి వద్ద ఒక ప్రైవేటు పాఠశాలను అద్దెకు తీసుకుని నిర్వహిస్తున్నారు. కాగా, శనివారం 10వ తరగతి విద్యార్థిని పుట్టినరోజు వేడుకల్లో తలెత్తిన గొడవ ఈ ఘటనకు దారి తీసినట్లు తెలుస్తోంది. బర్త్‌డేకు హాస్టల్లోని వారే కాకుండా ఇతర విద్యార్థులు కూడా హాజరు కావడంతో హాస్టల్ విద్యార్థినుల మధ్య గొడవ చోటు చేసుకుంది. దీంతో ఈ గొడవపై వసతి గృహం అధి కారులు విద్యార్థినులను మందలించినట్లు తెలిసింది. అంతేకాకుండా ఈ విషయాన్ని వారు ఆదివారం ఉదయం ప్రిన్సి పాల్ దృష్టికి తీసుకెళ్లడంతో గొడవతో సంబంధం ఉన్న ఐదుగురు విద్యార్థినులు శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. అధికారులు మాత్రం విద్యారి్థని బర్త్ డే వేడుకల్లో తలెత్తిన గొడవ కారణంగానే ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు. కాగా, హాస్టల్లో విద్యార్థినులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌లు ఆరా తీసినట్లు సమాచారం. ఆస్పత్రి లో ఉన్న విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని వై ద్యులకు సూచించినట్లు తెలుస్తోంది. విచారణకు ఆదేశించిన మంత్రి.. ఈ ఘటనపై మంత్రి సత్యవతి రాథోడ్ విచారణకు ఆదేశించినట్లు చెపుతున్నారు. మరో పక్క ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చే స్తున్నాయి. ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని వరంగల్ అదనపు కలెక్టర్ శ్రీవత్స పరిశీలించారు. ఈ సందర్భంగా వారికి ఎలాంటి వైద్యం అందిస్తున్నారో.. తెలుసుకుని మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. విద్యారి్థనుల తల్లిదండ్రులతో మాట్లాడి హాస్టల్లో జరిగిన సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసు.... ఇప్పట్లో సిట్ ఎదుట సంతోష్ హాజరు లేనట్టే! -
థియేటర్లలో బిల్లా రీ రిలీజ్.. కృష్ణంరాజు కుమార్తె ఎమోషనల్
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సందడి మొదలైంది. పాన్ ఇండియా స్టార్ బర్త్‌డేను పురస్కరించుకుని బిల్లా సినిమాను రెండు రాష్ట్రాల్లో రీ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా థియేటర్ల వద్ద అభిమానులు హల్చల్ చేశారు. ఏపీలోని ఓ థియేటర్లో ఏకంగా బాణాసంచా పేల్చారు. దీంతో అగ్నిప్రమాదం సంభవించింది. తాజాగా ఇవాళ హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌లో ఉన్న సుదర్శన్ థియేటర్లో బిల్లా సినిమాను ప్రదర్శించారు. ఈ షో చూసేందుకు కృష్ణంరాజు పెద్దకుమార్తె ప్రసీద హాజరయ్యారు. అభిమానుల మధ్య కూర్చొని బిల్లా సినిమాను వీక్షించారు. ఫ్రభాస్ ఫ్యాన్స్ మధ్య థియేటర్లో సినిమా చూడడం సంతోషంగా ఉందని ఆమె ఎమోషనల్ అయ్యారు. నాన్నను, అన్నయ్యను స్క్రీన్‌పై చూడడం చాలా ఆనందాన్నిచ్చిందని ఆమె భావోద్వేగంతో మాట్లాడారు. అనంతరం థియేటర్ వద్ద కేక్ కట్ చేసి ప్రభాస్ ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: కృష్ణంరాజు ముగ్గురు కూతుళ్ల గురించి ఈ ఆసక్తిర విషయాలు తెలుసా?) కృష్ణంరాజు పెద్ద కుమార్తె ప్రసీద మాట్లాడుతూ...' ప్రభాస్ అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా బిల్లా సినిమా మళ్లీ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత అన్నయ్యను, నాన్నను స్క్రీన్‌పై చూడడం సంతోషం కలిగించింది. మేమందరం చాలా బాగా సినిమాను ఎంజాయ్ చేశాం. ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తుంటే చాలా ఎమోషనల్‌గా ఫీలయ్యాం. ' అంటూ తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఇటీవలే ప్రభాస్ పెదన్నాన్న కృష్ణంరాజు మరణించిన విషయం తెలిసిందే. -
విఘ్నేశ్ శివన్‌కు నయన్ బర్త్‌డే సర్ప్రైజ్.. ఏంటో తెలుసా..?
కోలీవుడ్ సమ్‌థింగ్ స్పెషల్ జంట విఘ్నేశ్, నయనతార. ఇవాళ విఘ్నేశ్ పుట్టినరోజు సందర్భంగా తన భర్తకు ఆమె స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది. తాజాగా విఘ్నేశ్ పుట్టినరోజు వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించింది నయన్. దుబాయ్‌లోని బూర్జ్ ఖలీఫా ఎదుట కుటుంబ సభ్యుల సమక్షంలో విఘ్నేష్ శివన్ కేక్ కట్ చేశారు.. బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో నయనతార పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. బూర్జ్ ఖలీఫావద్ద కేక్ కటింగ్‌తో పాటు.. టపాసులుకూడా పేల్చుతూ.. విఘ్నేశ్ కుటుంబ సభ్యులు సందడి చేశారు. ఈ లేడీ సూపర్ స్టార్ పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో బిజీగా మారింది. అటు సినిమా షూటింగ్స్ చేస్తూనే.. ఇటు ఫ్యామిలీకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తోంది. తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్.. స్టార్ హీరోయిన్ నయనతార ఈ ఏడాది ఘనంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లికి ముందు ఆమె కొన్ని సినిమాలు అంగీకరించారు. అందులో షారుఖ్ ఖాన్ 'జవాన్' ఒకటి. హిందీలో నయనతారకు తొలి సినిమా ఇది. మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న సినిమా 'గాడ్ ఫాదర్'లోనూ ఆమె నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Nayanthara (@nayantthara) . -
మోదీకి ఇంతకు మించి గొప్ప గిఫ్ట్ మరొకటి లేదు!
న్యూఢిల్లీ: మోదీ పుట్టిన రోజు పురస్కరించుకుని ఎనిమిది చిరుతలు నమీబియా నుంచి కునో నేషనల్ పార్క్‌కి రానున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై మధ్యప్రదేశ్ ముఖ్యమత్రి శివరాజ్ సింగ్ చౌహన్ మాట్లాడుతూ... మోదీకి తాము ఇంతకు మించి గొప్ప బహుమతి ఇవ్వలేమని అన్నారు. అతిపెద్ద వన్యప్రాణులను జంబో జెట్ ద్వారా తరలించడం అనేది చారిత్రాత్మక సంఘటనగా అభివర్ణించారు. దీని వల్ల కునో పాల్పూర్ ప్రాంతం పర్యాటకంగా వేగంగా వృద్ధి చెందుతుందని అన్నారు. భారత్ గతంలో ఆసియాటిక్ చిరుతలకు నిలయంగా ఉంది. ఐతే 1952 నాటికి ఈ జాతులు అంతరించిపోయాయి. ప్రాజెక్ట్ చీతా అనే ఖండాంతర ట్రాన్స్‌లోకేషన్ ప్రాజెక్టులో భాగంగా ఈ చిరుతలను నమీబియా నుంచి భారత్‌కి తీసుకువస్తున్నారు. ఇది ప్రపంచంలోనే తొలి అంతర్ ఖండాంతర భారీ వైల్డ్ మాంసాహార ట్రాన్స్ లోకేషన్ ప్రాజెక్ట్ అని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. ఈ చిరుతలు భారత్‌లోని ఓపెన్ ఫారెస్ట్ గడ్డి భూములు, పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణలో సహాయపడతాయని పేర్కొంది. అంతేగాదు ఇది జీవవైవిధ్యాన్ని పరిరక్షించడానికి, నీటి భద్రత, కార్బన్ సీక్వెస్ట్రేషన్, నేల తేమ సంరక్షణ వంటి పర్యావరణ వ్యవస్థ సేవలను మెరుగుపరచడంలో సహాయపడుతుందని వెల్లడించింది. నమీబియా నుంచి ప్రత్యేక కార్గో విమానంలో వస్తున్న 8 చిరుతలు మధ్యప్రదేశ్‌లోని గాల్వియర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాయి. అక్కడ నుంచి కునో నేషనల్ పార్క్‌కి హెలికాప్టర్లో తరలిస్తారు.ఈ చిరుతల్లో ఐదు ఆడ చిరుతలు రెండు నుంచి ఐదు సంవత్సరాల మధ్య వయసుస్సు గలవి, మూడు మగ చిరుతలు 4 నుంచి 5 ఏళ్ల మధ్య వయసు గలవి ఉన్నాయి. (చదవండి: మోదీ పుట్టిన రోజు ప్రత్యేకం: ఆయన ఆర్మీలో ఎందుకు చేరలేకపోయారో తెలుసా?) డెబ్భై ఏళ్ల తర్వాత స్పెషల్ జర్నీతో భారత్‌లో అడుగు.. చీతాల కోసం ఆ ప్లేస్ ఎందుకంటే.. -
బెల్ట్‌తో కొట్టుకుంటూ బర్త్ డే.. అర్ధరాత్రి ఆసుపత్రిలో విద్యార్థుల రచ్చ!
లక్నో: పుట్టిన రోజు వేడుకల పేరుతో వికృత చేష్టలకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. అలాంటి సంఘటనే ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలో వెలుగు చూసింది. సివిల్ ఆసుపత్రిలో ఆదివారం అర్ధరాత్రి బర్త్ డే పార్టీ నిర్వహించారు పలువురు ఫార్మసీ విద్యార్థులు. బెల్టుతో కొట్టుకుంటూ, అరుస్తూ రచ్చ రచ్చ చేశారు. సుమారు గంట సమయం పాటు ఆసుపత్రి ప్రాంగణం గోల గోలగా మారిపోయింది. రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆరోగ్య శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి బ్రజేశ్ పతక్.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తు చేపట్టి కారకులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైరల్ వీడియో తన దృష్టికి వచ్చిందని, దర్యాప్తు చేపట్టామని సివిల్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ఆనంద్ ఓజా తెలిపారు. ‘వీడియోలోని వ్యక్తులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.’ అని తెలిపారు. #WATCH | UP: Visuals of the birthday party celebrations by pharmacy students inside the civil hospital of Lucknow which has attracted the attention of senior authorities initiating an enquiry into the matter; strict action against those found guilty of disrupting hospital peace pic.twitter.com/EJ94y3waoO — ANI UP/Uttarakhand (@ANINewsUP) August 8, 2022 ఇదీ చదవండి: Viral: 16 ఏళ్ల బాలుడి ముక్కు కొరికేసిన రాజకీయ నేత.. అంత కోపం దేనికో? -
జ్యోతిబా పూలే జయంతి: రచనలపై పోటీ, బహుమతులు
మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ విద్యాసంస్థల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వ్యాస, కవిత, పద్య, చిత్రకళల్లో పోటీలు తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తామని బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. విద్యార్థుల్లో సాహిత్య సృజన పెంచేందుకు, జ్యోతి బా పూలే జీవిత ప్రభావం నేటి సమాజం పై ఎలా ఉంది అన్న విషయం తెలుసుకునేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన జ్యోతిబా పూలే గురించి ఆయన చేసిన సేవల గురించి ప్రతి ఒకరికీ తెలియజేస్తూ గడప గడపకి సాహిత్యాన్ని చేరువ చేసే ప్రయత్నంలో భాగంగా ఈ పోటీలు తెలంగాణ సాహిత్య అకాడమీతో కలిసి నిర్వహిస్తున్నామని బుర్రా వెంకటేశం వివరించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని అన్ని విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు, తెలుగు ఉపాధ్యాయులు ఈ పోటీల్లో పాల్గొన్నవచ్చని వెంకటేశం చెప్పారు. ఆర్సీఓలు, ప్రిన్సిపాల్స్, తెలుగు ఉపాధ్యాయులు విద్యార్థులకు ఈ విషయాలు చెప్పి వారిలో రచనాశక్తిని పెంపొందించాలని ఆయన సూచించారు. ‘జ్యోతి బా పూలే జీవితం-నేటి సమాజం పై ప్రభావం’ అనే అంశంపై రెండుపేజీలకు మించకుండా వ్యాసం, పదికి మించకుండా పద్యాలు లేదా కవిత పంపాలన్నారు. అలాగే చిత్రం వేయాలనుకున్నవారు ఏ4 సైజు పేపరు పై చిత్రం గీసి పంపించాలని తెలిపారు. రాష్ట్రస్థాయిలో ఎంపిక చేసిన ఉత్తమ రచనలకు ఏప్రిల్ 11న హైదరాబాద్ లో నిర్వహించే జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాల్లో బహుమతి ప్రదానం ఉంటుందని అన్నారు. గురుకుల విద్యార్థులతో పాటు హాస్టల్ విద్యార్థులు, టీచర్లు, వార్డన్లు కూడా ఈ పోటీల్లో పాల్గొన్నవచ్చని ఆయన చెప్పారు. అలాగే తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ ఆధ్వర్యంలో ఈ పోటీల్లో వచ్చిన వాటిల్లో అత్యుత్తమైనవి ఎంపిక చేసి పుస్తకంగా తీసుకురానున్నట్టు బుర్రా వెంకటేశం వెల్లడించారు. -
అమీషా.. నన్ను పెళ్లి చేసుకుంటావా?
Late Congress Leader Ahmed Patel Son Proposes To Heroine Ameesha Patel: బద్రి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన హీరోయిన్ అమీషా పటేల్. నాని, నరసింహుడు చిత్రాలతో తెలుగులో పాపులర్ అయిన ఈమె గత కొంతకాలంగా ఈమె దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ తనయుడు ఫైజల్ పటేల్‌తో ప్రేమలో మునిగితేలుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ తమ ప్రేమ బంధంపై వీరిద్దరు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే తాజాగా ఫైజల్ 41వ బర్త్‌డే సందర్భంగా గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. 'హ్యాపీ బర్త్ డే మై డార్లింగ్.. ఐ లవ్ యు..అంటూ అమీషా సైతం ట్విట్టర్లో ప్రియుడికి బర్త్‌డే విషెస్ తెలిపింది. దీనికి ఫైజల్ మాత్రం ఆసక్తికరంగా స్పందించాడు. థ్యాంక్యూ అమీషా పటేల్. ఈ సందర్భంగా పబ్లిక్‌గా నీకు ప్రపోజ్ చేస్తున్నా. నన్ను పెళ్లి చేసుకుంటావా? అంటూ సోషల్ మీడియాలో పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. అయితే కాసేపటికే ఫైజల్ ఆ ట్వీట్‌ను డిలీట్ చేశాడు. కానీ అప్పటికే నెటిజన్లు ఈ చాట్‌కి సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసేశారు. కాగా గతంలో ఫైజల్ జైనాబ్ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. కానీ గుండెపోటుతో ఈమె 2016లో చనిపోయింది. అనంతరం ఫైజల్ అమీషా ప్రేమలో పడ్డాడు. ఫైజల్ కంటే అమీషా పటేల్ నాలుగేళ్లు పెద్దది. -
యువరాజ్ సింగ్ గురించి మనకు తెలియని విశేషాలు
''జీవితంలో ఎలా పోరాడాలనేది క్రికెట్ నాకు నేర్పింది.. అందుకే లైఫ్‌లో ఎప్పుడు విశ్వాసం కోల్పోలేదు.. క్రికెట్టే జీవితంలో పోరాడడం.. పడడం.. లేవడం.. ముందుకు సాగడం లాంటివి నేర్పించింది.. నా శ్వాస ఉన్నంతవరకు ఆటకు ఏదో రూపంలో సాయం అందిస్తూనే ఉంటాను''.. భారత మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్‌సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన సందర్భంగా భావోద్వేగంతో పలికిన మాటలు ఇవి. -సాక్షి, వెబ్‌డెస్క్ డిసెంబర్ 12.. ఈ డాషింగ్ ఆల్‌రౌండర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా యువరాజ్ సింగ్‌కు బర్త్‌డే విషెస్ తెలుపుతూ అతని జీవితంలోని కొన్ని ముఖ్య విశేషాలను తెలుసుకుందాం. 19 ఏళ్ల కెరీర్ ప్రస్థానంలో పోరాటాలే ఎక్కువగా చూసిన యువరాజ్ సింగ్ జీవితం అందరికి ఆదర్శ ప్రాయం. ఈ తరానికి యువరాజ్ అంటే గుర్తుకు వచ్చేది.. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు.. డేరింగ్ అండ్ డాషింగ్ క్రికెటర్.. మంచి ఆల్‌రౌండర్‌గా అని మాత్రమే. ఇదంతా యువరాజ్ జీవితంలో ఒకవైపు మాత్రమే. రెండోవైపు చూస్తే యువీ జీవితంలో మనకు తెలియని సంఘటనలు చాలానే ఉన్నాయి. తాను చిన్నతనం నుంచి అనుభవించిన మానసిక సంఘర్షణ.. తండ్రి బలవంతంతో తనకు ఇష్టమైన ఆటను వదిలేయడం.. అస్సలు ఇష్టం లేని క్రికెట్లో అద్భుతాలు చేయడం.. ఆ తర్వాత క్యాన్సర్ మహమ్మరిన పడడం.. దానితో పోరాడి జీవితంలో మళ్లీ ఎదగడం లాంటివి కనిపిస్తాయి. క్రికెట్ అంటే అస్సలు ఇష్టం లేదు యువరాజ్ సింగ్ జన్మించింది క్రికెట్ కుటుంబంలోనే. తన తండ్రి యోగ్రాజ్ సింగ్ అప్పటికే టీమిండియాలో ఫాస్ట్ బౌలర్‌గా ఉన్నాడు. యువీ చిన్నతనంలోనే తల్లిదండ్రులకు విబేధాలు వచ్చి విడిపోయారు. దీంతో తండ్రికి దూరంగా.. తల్లి షబ్నం సింగ్ నీడలో ఎంతో గారబంగా పెరిగాడు. అప్పుడే టెన్నిస్, స్కేటింగ్ మీద యువరాజ్ ఇష్టం పెంచుకున్నాడు. ముఖ్యంగా స్కేటింగ్‌లో అండర్ 14 విభాగంలో నేషనల్ స్కేటింగ్ చాంపియన్‌షిప్ అందుకున్నాడు. పదేళ్ల వయసు వరకు యువరాజ్ చదువుతో పాటు టెన్నిస్, స్కేటింగ్తోనే ఎక్కువ కాలం గడిపాడు. అయితే తల్లి షబ్నంకు, తండ్రి యోగరాజ్‌కు విబేధాలు సమసిపోవడంతో యువీ జీవితం మలుపు తిరిగింది. తాను క్రికెటర్‌గా ఉన్నప్పుడు కొడుకు టెన్నిస్, స్కేటింగ్ లాంటి గేమ్ ఎలా ఆడతాడని.. యువరాజ్‌ను కూడా క్రికెట్లోకి తీసుకురావాలని యోగ్రాజ్ భావించాడు. అప్పటికి యువీకి క్రికెట్ అంటే అస్సలు ఇష్టం లేదు. ఒకరోజు యువీని దగ్గరికి పిలిచిన తండ్రి యోగరాజ్.. స్కేటింగ్‌లో అతను సాధించిన మెడల్‌ను కిందపడేసి ఇకమీదట స్కేటింగ్ ఆడేందుకు వీలు లేదని ఖరాఖండీగా చెప్పాడు. దీంతో తండ్రి మాటను కాదనలేక బలవంతంగానే క్రికెట్లో అడుగుపెట్టాడు. మొదట్లో యువరాజ్‌ను బౌలర్‌గా చూద్దామని భావించిన యోగ్రాజ్ ఉదయాన్నే తనతో పాటు గ్రౌండ్‌కు తీసుకెళ్లి బౌలింగ్ ప్రాక్టీస్ చేయించేవాడు. కానీ యువరాజ్ మాత్రం బ్యాటింగ్ చేయడానికే ఇష్టపడ్డాడు. ఆ తర్వాత ఫీల్డింగ్, బౌలింగ్‌తో వికెట్లను విరగొట్టడం నేర్చుకొని ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. తన బలవంతం మీద క్రికెట్లోకి వచ్చాడని అర్థం చేసుకున్న యోగరాజ్ ఆ దిశగానే ప్రోత్సహించాడు. అంతే అక్కడినుంచి యువరాజ్ క్రికెట్ కెరీర్ మరో మలుపు తీసుకుంది. 13 ఏళ్ల 11 నెలల సమయంలో అండర్-16 విభాగంలో పంజాబ్ తరపున ఆడాడు. ఆ తర్వాత అ1996లో పంజాబ్ తరపున అండర్-19కి సెలక్టయ్యాడు. ఇక్కడే యువరాజ్ తొలిసారి సెంచరీ సాధించి పెద్ద ప్లేయర్ల దృష్టిలో పడ్డాడు. రంజీల్లో ఎదురులేకుండా దూసుకెళ్లిన యువరాజ్‌కు 2000 అండర్ 19 ప్రపంచకప్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. మహ్మద్ కైఫ్ కెప్టెన్సీలో టీమిండియా తరపున బరిలోకి దిగిన యువీ మెరుపులు మెరిపించాడు. ఇక్కడే తొలిసారి సెలక్టర్ల దృష్టిలో పడిన యువరాజ్ 2000 ఐసీసీ నాకౌట్ ట్రోఫీ సందర్భంగా టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. అలా మొదలైన యువీ ప్రస్థానం 19 ఏళ్ల పాటు సాగింది. 19 ఏళ్ల కెరీర్ ప్రస్థానం తన 19 ఏళ్ల కెరీర్లో యువరాజ్ టీమిండియా తరపున 40 టెస్టుల్లో 3 సెంచరీలు.. 11 అర్థసెంచరీల సాయంతో 1900 పరుగులు.. 10 వికెట్లు తీశాడు. ఇక 304 వన్డేల్లో 14 సెంచరీలు.. 52 హాఫ్‌సెంచరీలతో కలిపి 8701 పరుగులతో పాటు 111 వికెట్లు పడగొట్టాడు. ఇక 58 టి20ల్లో 8 అర్థసెంచరీల సాయంతో 1177 పరుగులు చేసిన యువీ బౌలింగ్‌లో 29 వికెట్లు పడగొట్టాడు. ఇక 2003, 2007, 2011 వన్డే ప్రపంచకప్‌లు ఆడిన యువరాజ్‌సింగ్ ఆల్‌రౌండర్‌గా అత్యధిక ఫైనల్స్ ఆడిన ఆటగాడిగా నిలిచాడు. తన కెరీర్లో ఆరు ఇంటర్నేషనల్ ఫైనల్స్(2002 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, 2003 వన్డే వరల్డ్‌కప్, 2007 టి20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2014 టి20 ప్రపంచకప్, 2017 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్) ఆడాడు. ఇందులో టీమిండియా మూడుసార్లు ప్రపంచకప్ గెలిచిన జట్టులో యువరాజ్ సభ్యుడిగా ఉన్నాడు. దీనిలో మొదటిది 2000 అండర్-19 ప్రపంచకప్.. ఇక మిగతా రెండు 2007 టి20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు ఇక 2007 టి20 ప్రపంచకప్ టీమిండియా గెలవడం ఒక ఎత్తు అయితే.. యువరాజ్ ఇంగ్లండ్‌పై ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదడం మరొక ఎత్తు. నిజానికి కోపానికి కేరాఫ్ అడ్రస్‌గా కనిపించే యువరాజ్‌ను గెలికితే ఎలా ఉంటుందో రుచి చూపించాడు. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కవ్వింపు చర్యలతో ఆగ్రహంతో ఊగిపోయిన యువరాజ్ తన కోపాన్ని స్టువర్ట్ బ్రాడ్‌పై చూపించాడు. పూనకం వచ్చిందా అన్నట్లు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది కేవలం 12 బంతుల్లోఏ హాఫ్ సెంచరీ సాధించిన యువీ ఓవరాల్‌గా 14 బంతుల్లో 58 పరుగులు సాధించాడు. క్రికెట్ బతికున్నంతకాలం యువరాజ్ అంటే గుర్తుకువచ్చేది మొదట ఈ ఆరు సిక్సర్లే అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2011 వన్డే వరల్డ్‌కప్.. గోల్డెన్ డేస్ 2011 వన్డే ప్రపంచకప్ యువరాజ్ కెరీర్లో గోల్డెన్ డేస్ అని చెప్పొచ్చు. 28 ఏళ్ల తర్వాత టీమిండియా ప్రపంచకప్ గెలవడంలో యువరాజ్ సింగ్ పాత్ర మరువలేనిది. ఆ ప్రపంచకప్‌లో ఆల్‌రౌండర్‌గా యువరాజ్ దుమ్మురేపాడు. ఆ టోర్నీలో బ్యాటింగ్‌లో 362 పరుగులు.. బౌలింగ్‌లోనూ 15 వికెట్లు తీసి ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కొల్లగొట్టాడు. అంతేకాదు ప్రపంచకప్‌లో ఒక మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీయడంతో హాఫ్ సెంచరీ కొట్టిన ఆటగాడిగానూ.. ఆల్‌రౌండర్‌గానూ యువీ రికార్డులకెక్కాడు. క్యాన్సర్ మహమ్మారి.. గడ్డురోజులు ఇక గోల్డెన్ డేస్ చూసే ప్రతీ ఆటగాడికి గడ్డురోజులు రావడం సహజమే. అలాంటి పరిస్థితిని యువరాజ్ 2011 వన్డే ప్రపంచకప్ ముగిసిన వెంటనే చూడాల్సి వచ్చింది. నిజానికి వన్డే ప్రపంచకప్ జరుగుతున్న సమయంలోనే యువరాజ్ క్యాన్సర్ మహమ్మారికి గురయ్యాడు. ఒక మ్యాచ్‌లో గ్రౌండ్లోనూ రక్తం కక్కుకోవడం సగటు అభిమానిని ఆందోళనకు గురిచేసింది. అయినప్పటికి బాధను ఓర్చుకొని టీమిండియా 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ కప్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ప్రపంచకప్ ముగిసిన నాలుగు నెలల్లోనే ఒక రష్యన్ డాక్టర్ యువరాజ్ ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో అమెరికా వెళ్లిన యువీ అక్కడ మూడు దశల్లో కీమోథెరపీ చేయించుకున్నాడు. 2012 మార్చిలో కోలుకున్న యువరాజ్ భారత్‌కు తిరిగొచ్చాడు. మళ్లీ భారత జట్టులోకి అడుగుపెట్టాలనే దృడ సంకల్పంతో ఫిట్నెస్ మీద దృష్టి పెట్టాడు. 2012 ఐసీసీ టి20 ప్రపంచకప్‌లో శ్రీలంకతో మ్యాచ్ ద్వారా కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. అయితే అప్పటినుంచే యువీ బ్యాటింగ్‌లో ముందున్న పదును క్రమంగా తగ్గడం ప్రారంభమయింది. ఇక అప్పటినుంచి యువరాజ్ కెరీర్ ఒడిదుడుకులకు లోనైంది. వయసు కూడా పెరుగుతుండడం.. కొత్త ఆటగాళ్లకు అవకాశాలు వస్తుండడంతో క్రమక్రమంగా జట్టుకు దూరమయ్యాడు. అడపా దడపా మెరుపులు మెరిపించినప్పటికి యువరాజ్ గాడిన పడలేకపోయాడు. ఇక టీమిండియా తరపున యువరాజ్ చివరి మ్యాచ్‌ను 2017 జూన్ 30న ఆడాడు. అప్పటినుంచి రెండు సంవత్సరాల పాటు ఆటకు దూరంగా ఉన్న యువరాజ్ జూన్ 10, 2019న అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇక చావును జయించిన తన ప్రయత్నాలను.. తిరిగి క్రికెట్లో అడుగుపెట్టడానికి తాను చేసిన పోరాటాన్ని.. జీవితంలోని తన అనుభవాలన్నింటిని ఒక దగ్గర చేరుస్తూ ''ది టెస్ట్ ఆఫ్ మై లైఫ్'' పేరుతో పుస్తకాన్ని రాశాడు. ఐపీఎల్‌లోనూ తనదైన ముద్ర తన హిట్టింగ్తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న యువరాజ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లోనూ తనదైన ముద్ర చూపించాడు. 2014లో రాయల్ చాలెంజర్స్ జట్టు యువీని రూ.14 కోట్లు పెట్టి కొనడం ఒక సంచలనం. ఆ తర్వాత 2015 ఐపీఎల్లో అప్పటి ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర(రూ.16 కోట్లు) సొంతం చేసుకోవడం యువరాజ్కున్న విలువేంటో చూపించింది. అయితే ఇటీవలే యువరాజ్ తాను మళ్లీ క్రికెట్లోకి అడుగుపెడుతున్నానంటూ తన ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్పాడు. వచ్చే ఫిబ్రవరి నుంచి తాను బరిలోకి దిగనున్నట్లు సంకేతాలు ఇచ్చాడు. ఈ విషయం విన్నప్పటి నుంచి యువరాజ్ అభిమానులే కాదు.. సగటు క్రికెట్ అభిమాని కూడా అతని రాకకోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. It's that time of the year. Are you ready? Do you have what it takes? Have a big surprise for all you guys! Stay tuned! pic.twitter.com/xR0Zch1HtU — Yuvraj Singh (@YUVSTRONG12) December 7, 2021 -
ఘనంగా రోజా భర్త సెల్వమణి బర్త్‌డే వేడుకలు
Roja Husband Rk Selvamani Birthday Celebrations: నగరి ఎమ్మెల్యే , సినీ నటి రోజా ప్రొఫెషనల్ లైప్‌లో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీ లైఫ్‌కు కూడా అంతే ప్రాధాన్యం ఇస్తారు. పండుగలు, ఫంక్షన్లు, కుటుంబ సభ్యుల బర్త్‌డే వేడుకలకు మిస్ అవ్వకుండా ప్లాన్ చేసుకుంటారు. తాజాగా రోజా భర్త, డైరెక్టర్ ఆర్. కె. సెల్వమణి పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్‌డే మై లవ్ అంటూ రోజా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలను షేర్ చేసింది. చదవండి: 'రకుల్ పెళ్లి ఆగిపోతుంది.. జైలుకు వెళ్లే అవకాశం'! (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇక కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితుల సమక్షంలో సెల్వమణి బర్త్‌డే వేడుకలు ఘనంగా జరిగాయి. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా సెల్వమణికి పలువురు సినీ ప్రముఖులు సహా నెటిజన్లు బర్త్‌డే విషెస్‌ను తెలియజేస్తున్నారు. చదవండి: నేను అనుకున్నది నిజమైంది.. నా కల నెరవేరింది: సమంత చార్ ధామ్ యాత్ర: ప్రత్యేక పూజలు నిర్వహించిన సామ్ View this post on Instagram A post shared by Roja Selvamani (@rojaselvamani) View this post on Instagram A post shared by Roja Selvamani (@rojaselvamani) -
వర్చువల్‌గా కళాభారతి జమున 85వ జన్మదిన వేడుకలు
ప్రజానటి కళాభారతి డాక్టర్ జమునా రమణారావు ఎనభై ఐదవ (85)వ జన్మదినోత్సవం సందర్భంగా జరిగిన వర్చువల్‌గా సమావేశంలో చాలా మంది ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మీ గారు ఆశీర్వదిస్తూ నేను జమున గారి అభిమానిని ఆ రోజుల్లో జమున గారి సినిమా వస్తుందంటే చాలు ఎదురు చూసి మరీ రాగానే వెళ్ళిపోయేదాన్ని. జమున గారి కట్టు బొట్టు ఎంత సంప్రదాయికంగా ఉండేవో అభినయం అంత అద్భుతంగా ఉంటుంది. అందుకే నాకు నూరు సంవత్సరాల వయసులో జమున గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పే అవకాశం రావడం నిజంగా నాకు చాల సంతోషంగా ఉంది. అష్ట ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆశీర్వదించారు. జమున గారు ప్రతిగా అంత పెద్దావిడ వచ్చి తనను ఆశీర్వదిస్తుంటే స్వయంగా పింగళి వెంకయ్య గారే వచ్చి ఆశీర్వదించినంత ఆనందంగా ఉంది అని తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆళ్ళ శ్రీనివాసరెడ్డి(USA) జమున గారికి డాక్టర్ సీ నారాయణరెడ్డి స్వర్ణ కంకణ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రకటించారు. దర్శకులు కె. విశ్వనాధ్ గారు ఆశీర్వదిస్తూ జమునా, నీకు 85వ పుట్టినరోజంటే నమ్మలేకుండా ఉన్నాం. ఇప్పుడే, నిన్నగాక మొన్న పెద్దమనిషివై నటనలో సత్యభామ లాగా ఇంకా మా కళ్ళ ముందర కనిపిస్తున్నావు. నీకు ఇంత తొందరగా వయస్సు వచ్చిందంటే ఆశ్చర్యంగా ఉంది. నా శుభాకాంక్షలు నీకు ఎప్పుడు కూడా ఉంటాయి. క్షేమంగా ఉండి, ఇంకా ఒక యాభై ఏళ్ళు హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను, సెలవు అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజానటి కళాభారతి డాక్టర్ జమునా రమణారావు ఎనభై ఐదవ(85)వ జన్మ దినోత్సవం అంతర్జాలంలో ఐదు(5) ఖండాలలోని ముప్పై(30) కళాసమితుల సహకారంతో వంశీ గ్లోబల్ అవార్డ్స్ ఇండియా మరియు తెలుగు కళా సమితి ఖతార్ కలిసి పదహారు(16) గంటలుఅత్యంత అద్భుతంగా జరిగింది. వంశీ రామరాజు మాట్లాడుతూ జమునకు డిసెంబర్ నెలలో హైదరాబాద్ లో కనకాభిషేకం చెయ్యబోతున్నట్టు ఆ సందర్భంగా అమెరికా గాన కోకిల శారద ఆకునూరి మెగా సంగీత విభావరి సమర్పించనున్నారని తెలిపారు. పదహారు (16) గంటల సేపు జరిగిన ఈ కార్యక్రమంలో 30 దేశాల నించి 200 మందికి పైగా కవులు కళాకారులు పాల్గొని జమున నటించిన చిత్రాలలోని పాటలు ఎంచుకుని ఆట పాటలతో కార్యక్రమం ఆసాంతం రక్తి కట్టించారు. ఈ కార్యక్రమాన్ని తాతాజీ ఉసిరికల నిర్వహించారు. -
20 రోజులపాటు వేడుకలు
న్యూఢిల్లీ: ఈ నెల 17న ప్రధాని మోదీ పుట్టిన రోజును పురస్కరించుకొని బీజేపీ భారీ కార్యక్రమాలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ‘సేవ సమర్పణ అభియాన్’ పేరుతో 20 రోజుల వేడుకలకు కార్యాచరణ రూపొందించింది. ప్రధాని మోదీ ప్రజా సేవలో అడుగు పెట్టి 20 ఏళ్లు అయిన సందర్భంగా 20 రోజుల పాటు వేడుకలు సాగించనున్నట్లు తెలిపింది. 5 కోట్ల పోస్టు కార్డులు.. 20 రోజుల వేడుకల్లో భాగంగా దేశ వ్యాప్తంగా భారీగా రక్తదాన కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. దీంతో పాటు పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ చీఫ్ జేపీ నడ్డా రాష్ట్ర విభాగాలు అన్నింటికీ సూచనలు పంపించారు. దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ బూత్‌ల నుంచి అయిదు కోట్ల పోస్ట్ కార్డులను ప్రధాని మోదీకి పంపనున్నారు. ప్రజాజీవితానికి అంకిత మైన మోదీలా పార్టీ సభ్యులు కూడా అంకితమవుతామంటూ ఆ కార్డుల్లో రాసి మోదీకి పంపనున్నారు. ఉచితంగా పప్పుధాన్యాలు, వ్యాక్సిన్లు అందిస్తున్నందుకు ఆయన ధన్యవాదాలు తెలుపుతూ హోర్డింగ్‌లు నిర్మించనున్నారు. ఎగ్జిబిషన్ కూడా.. ప్రధాని మోదీ జీవితాన్ని సూచించే ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను తయారు చేయనున్నట్లు బీజేపీ ప్రకటించింది. వర్చువల్‌గా రూపొందించనున్న ఈ ఎగ్జిబిషన్‌ను ప్రజలు నమో యాప్ ద్వారా వీక్షించవచ్చని వెల్లడించింది. గంగా నది శుద్ధి.. వచ్చే ఏడాది మొదట్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ భారీ కార్యక్రమా లను చేపట్టనుంది. వేడుకల్లో భాగంగా గంగానదిని 71 ప్రదేశాల్లో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించను న్నారు. మోదీ జీవితం, ఆయన విజయాలపై నిర్వహించనున్న ప్రత్యేక ఈవెంట్లకు çవివిధ రంగాల ప్రముఖులను ఆహ్వానించ నున్నారు. 2001 అక్టోబర్ 7న మోదీ గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అందుకే అక్టోబర్ వరకు 20 రోజుల పాటు కార్యాచరణ రూపొందించినట్లు తెలిపింది. -
మోదీ బర్త్‌డే: 5 కోట్ల పోస్ట్‌కార్డులు.. థాంక్స్ పీఎం బ్యానర్లు
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ 71వ పుట్టిన రోజు సందర్భంగా బీజేపీ భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 17న మోదీ పుట్టిన రోజు నాడు ప్రజా సేవలో 20 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ‘‘సేవా, సమార్పణ్, అభియాన్’’ పేరిట 20 రోజుల పాటు మెగా ఈవెంట్ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ క్రమంలో 20 రోజుల పాటు దేశవ్యాప్తంగా భారీ ఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్ని రాష్ట్రాల అధ్యక్షులకు సూచనలు జారీ చేశారు. మోదీ పుట్టిన రోజు సందర్భంగా కోవిడ్ సమయంలో ఉచితంగా ఆహారధాన్యాలు సరఫరా చేసినందుకు, కోవిడ్ టీకా వేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో థ్యాంక్స్ పీఎం బ్యానర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అంతేకాక బూత్ స్థాయి నుంచి మోదీని అభినందిస్తూ 5 కోట్ల పోస్ట్ కార్డులను పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కార్యకర్తలందరూ సమీప రేషన్ దుకాణాలకు వెళ్లి మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ వీడియో క్లిప్ రికార్డ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలని పార్టీ సూచించింది. (చదవండి: యూపీలో మళ్లీ యోగి.. పంజాబ్‌లో ‘ఆప్’) ఇక వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఆ రాష్ట్రంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. ముఖ్యంగా గంగా నదిని శుభ్రం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 71 చోట్ల క్లీన్ గంగా పేరిట కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అంతేకాక దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హెల్త్ క్యాంప్‌లు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. పుట్టిన రోజు సందర్భంగా మోదీకి వచ్చే అన్ని బహుమతులను వేలం (pmmementos.gov.in/#/) వేసి ఆ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నారు. ఇక ఈ వేడుకల సందర్భంగా కార్యకర్తలందరూ కోవిడ్ నియమాలు పాటించాలని పార్టీ సూచించింది. చదవండి: ఆస్తులు అమ్మితే ఆటకట్టిస్తాం: ఎంకే స్టాలిన్ -
సుదీప్ బర్త్ డే సందర్బంగా జంతుబలి ఇచ్చిన ఫ్యాన్స్
-
నా విస్కీకి నాలుగేళ్లు : హీరోయిన్ అనుపమ
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. తాజాగా తన విస్కీకు నాలుగేళ్లు పూర్తయ్యాయంటూ అనుపమ చేసిన ఓ పోస్ట్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. విస్కీ అంటూ ఏదో మందు బ్రాండ్ అనుకునేరు..అనుపమ ఎంతో పప్రేమగా పెంచుకుంటున్న కుక్కపిల్ల పేరు. హీరోయిన్ అనుపమకు కుక్కలంటే విపరీతమైన ఇష్టమని ఆమెని ఫాలో అవుతున్న వాళ్లకి తెలిసిందే. పెట్స్‌పై ఎంతో పప్రేమ కురిపించే అనుపమ తన విస్కీ పుట్టినరోజును సెలబ్రేట్ చేసింది. దీనికి సంబంధించిన కుక్కతో దిగిన ఫోటోలను షేర్ చేసింది. గతేడాది చాలా కష్టంగా సాగింది. విస్కీ సోదరుడు టడ్డీ, రమ్లను కోల్పోయి ఎంతో బాధపడుతున్న మా జీవితాల్లో సంతోషం తీసుకొచ్చిన విస్కీకి కృతఙ్ఞతలు అంటూ కుక్కపిల్లపై ఎంతో పప్రేమ కురిపించింది. ఇక సినిమాలవ విషయానికి వస్తే అనుపమ చివరగా బెల్లంకొండ శ్రీనివాస్‌తో రాక్షసుడు అనే సినిమాలో కనిపించింది. ప్రస్తుతం తెలుగులో 18 పేజీస్‌తో పాటు.. తమిళంలో తల్లిపొగతే అనే చిత్రంలో నటిస్తోంది ఈ భామ. View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) చదవండి: సంజనతో బుమ్రా పెళ్లి.. హర్ట్ అయిన అనుపమ సిద్ శ్రీరామ్ ఒక్క పాటకు ఎంత తీసుకుంటాడో తెలుసా? -
నమ్రత మహేష్ బర్త్‌డే ఫోటోలు..
-
కొత్త బంగారు లోకం హీరోయిన్.. గ్రాండ్ బర్త్ డే పార్టీ
-
సూపర్‌స్టార్ రజినీకాంత్ స్పెషల్ ఫోటోలు
-
‘ఆరు అడుగుల బుజ్జిబాబు’
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ నవంబర్ 22న తన పుట్టిన రోజు వేడుకలను కుటుంబ సభ్యులతో జరుపుకున్నాడు. ఈ సందర్భంగా తన సోదరి కృతికా తివారీ సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, '6 అడుగుల బుజ్జి బాబు' అంటూ అతడిని ఆశీర్వదిస్తున్న ఫొటో పోస్ట్ చేసింది. దీంతో పాటు ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో లాక్డౌన్ సమయంలో అతడు ఇంట్లో గడిపిన మధుర క్షణాలకు సంబంధించిన ఫొటోలు ఉన్నాయి. లాక్డౌన్ కారణంగా అన్నింటికి పేకప్ చెప్పి ముంబైలోని తన కుటుంబంతో కార్తీక్ ఆర్యన్ ఎక్కువ సమయాన్ని గడిపాడు. ఈ మధుర క్షణాలకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులకు ఆకట్టుకున్నాడు. త్వరలోనే హర్రర్-కామెడీగా తెరకెక్కుతున్న ‘భూల్ భూలైయా 2’ సినిమా షూటింగ్లో తిరిగి పాల్గొనున్నట్టు తెలిపాడు. ఇందులో కియారా అద్వానీ, టబు నటిస్తున్నారు. పుట్టినరోజు సందర్భంగా తను కొత్తగా ‘ధమాకా’ పేరుతో సినిమా చేయనున్నట్లు ప్రకటించాడు. ఈ చిత్రానికి నీర్జా ఫేమ్ దర్శకుడు రామ్ మాధ్వానీ తెరకెక్కించబోతున్నారు. ఇందులో కార్తీక్ ముంబై ఉగ్రవాద దాడులను కవర్ చేసే జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నాడు. లవర్ బాయ్‌గా పాపులర్ అయిన ఆర్యన్ ఈ సారి కొత్త పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. -
ధోనితో షోయబ్ మాలిక్
దుబాయ్: ఐపీఎల్‌తో తీరిక లేకుండా గడిపిన సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని.. తన భార్య పుట్టిన రోజు సందర్భంగా దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడే కొందరు స్నేహితులతో కలిసి సాక్షి బర్త్ డేను సెలబ్రేట్ చేశారు. సాక్షి సింగ్ గురువారం తన 31వ పుట్టినరోజుని జరుపుకున్నారు. భర్త ధోనితో కలిసి బర్త్‌డే వేడుకలు జరుపుకున్న ఫోటోలను సాక్షి తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా సాక్షి ధోనికి సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గొల్డెన్ డ్రెస్‌లో సాక్షి మెరిసిపోగా, ధోనీ బ్లాక్ కలర్ టీ షర్ట్‌ని ధరించాడు. సాక్షి బర్త్ డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు బయటకొచ్చాయి. కాగా సాక్షి బర్త్ డే పార్టీలో పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్-సానియా మీర్జా దంపతులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సానియా మీర్జా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఈసారి సీఎస్కేకు ఘోర పరాభవం ఎదుర్కొంది. 2011లో తన స్కిల్స్‌తో టీమిండియాకు ప్రపంచ కప్ అందించిన ధోని గతేడాది వన్డేకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2020లో అతడు ఆడతాడో లేదోనని అనుమానాలు వ్యక్తం అవుతున్న తరుణంలో ధోని సీఎస్కే తరపున ఆడుతున్నట్లు ఆ జట్టు యాజమాన్యం స్పష్టం చేసింది. ఇక విరాట్‌కోహ్లికి బీసీసీఐ పితృత్వ సెలవును మంజూరు చేసింది. దీంతో ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు అనంతరం విరాట్ స్వదేశానికి తిరిగి రానున్నారు. (ధోనిని వదలకుంటే సీఎస్కేకు 15 కోట్ల నష్టం) View this post on Instagram A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) -
ఎమ్మెల్యే రోజా పుట్టినరోజు స్పెషల్ ఫొటోలు..
-
హ్యపీ బర్త్‌డే రియల్ హీరో ‘సోనూ సూద్’..
సాయం చేయాలన్న తపన, మంచి మనసు ఉంటే చాలు.. ఎలాగైనా సాయం చేయవచ్చని నిరూపించాడు బాలీవుడ్ రియల్ హీరో సోనూ సూద్. చేసేది విలన్ పాత్రలైనప్పటికీ ప్రజల్లో రియల్ హీరోగా నిలిచాడు. లాక్డౌన్లో వేలాదిమంది వలస కూలీలకు ప్రత్యేక బస్సులు, రైళ్లు ఏర్పాటు చేసి ఇళ్లకు చేర్చి ఆపద్భాందవుడయ్యాడు. నిజానికి సాయం కావాలి అని అర్థించిన ప్రతి ఒక్కరికి సోనూ సూద్ సహాయం అందిస్తున్నాడు. దీంతో లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ తన దాన సేవలను ఇంకా కొనసాగిస్తున్నాడు. అందరి మన్ననలు పొందుతున్న సోనూ సూద్ నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ రోజుతో ఆయన 47వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా సోనూ సూద్‌కు అశేష అభిమానులు, సెలబ్రిటీల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. (సోనూ సూద్ క్రేజ్; చిరు సినిమాలో ముఖ్యపాత్ర) కాగా సోనూ సూద్ జూలై 30,1973లో పంజాబ్‌లో జన్మించారు. తండ్రి శక్తి సాగర్ సూద్ వ్యాపారవేత్త. తల్లి ఉపాద్యాయిని. సోనూ సోదరి మోనికా ప్రస్తుతం సైంటిస్టుగా పనిచేస్తున్నారు. సోనాలిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. 1999లో కలాగర్ అనే తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మూడు సంవత్సరాలకు బాలీవుడ్ లో అడుగుపెట్టాడు. తెలుగులో అరుంధతి సినిమాలో సోనూ సూద్ నటన ఆయనకు మంచి గుర్తింపును తీసుకువచ్చింది. తన పాత్రలతో మనందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుని రియల్ లైఫ్ హీరో అనిపించుకున్నారు. కేవలం అభినయంతోనే కాకుండా గొప్ప నటన నైపుణ్యాలతో అందరిని అకట్టుకున్న సోనూ సూద్ నటించిన కొన్ని బాలీవుడ్ చిత్రాలను ఇప్పుడు చూద్ధాం. (ఆస్పత్రిలో నటుడు.. ఆర్థిక సాయం కావాలంటూ..) 1. ఎంటర్టైన్మెంట్: ఈ సినిమాలో సౌత్, బాలీవుడ్ ఫేమ్ ప్రకాష్ రాజ్, అక్షయ్ కుమార్ నటించినప్పటికీ.. సోనూ తన డైలాగ్స్‌తో స్క్రీన్ మీద తన మార్కును క్రియోట్ చేశారు. 2. దబాంగ్ : ‘దబాంగ్' చిత్రంలో విలన్ పాత్రకు మంచి ఆదరణ లభించింది. అతని బాడీబిల్డింగ్ చాలా చర్చనీయాంశమైంది. ఈ చిత్రంలో చెడి సింగ్ పాత్రకు వందశాతం న్యాయం చేశారు సోనూసూద్. 3. సింగ్ ఈజ్ కింగ్ : సింగ్ ఈజ్ కింగ్ చిత్రానికి బలవంతుడైన విలన్ అయిన లఖన్ సింగ్ పాత్రలో మెప్పించారు. ఈ చిత్రంలో కామెడీ చేయడంలో కూడా సోను తన ప్రతిభను కనబర్చారు. 4. ఆర్ రాజ్‌కుమార్: ఆర్ రాజ్‌కుమార్‌లో షాహిద్ కపూర్, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో కనిపించారు. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సోనూ సూద్ విలన్ శివరాజ్ గుజ్జర్ పాత్రలో అద్భుతంగా మెప్పించారు 5. సింబా: విలన్ పాత్రలో సోను సూద్ చివరిగా విడుదలైనది రణవీర్ సింగ్‌తో చేసిన సింబా. ఇందులో ధ్రువ్ రనాడే పాత్రను పోషించాడు, అతని ప్రశాంతమైన ముఖం, స్వరంతో వెన్నెముకలో వణుకు పుట్టించేలా పాత్ర పోషించాడు. కాగా గురువారం (జులై 30) తన పుట్టినరోజు సందర్భంగా తన జీవితంలో ఒక ప్రత్యేక రోజుగా మార్చుకోవాలని సోనూ సూద్ చూస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఈ హెల్త్ క్యాంప్‌ల ద్వారా 50 వేల మందికి సేవలు అందించనున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ వైద్య శిబిరాలను నిర్వహించేందుకు గ్రామ సర్పంచ్‌లు, కార్యదర్శులతో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి ప్రణాళికతో ముందుకు కదులుతున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించబోతున్నట్లుగా, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్, ఒడియా రాష్ట్రాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడానికి అక్కడి డాక్టర్లతో మాట్లాడుతున్నట్లు సోను సూద్ తెలిపారు. (సోనూ సూద్ వెనుక సోనాలి పాత్ర) ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పీవీ నరసింహారావుకు సీఎం జగన్ నివాళి
సాక్షి, అమరావతి : భారత మాజీ ప్రధాని, బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు శత జయంతిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ట్విటర్ వేదికగా పీవీ గొప్పతనాన్ని వెల్లడించారు. 'పీవీ నరసింహారావు ప్రస్తుతం మన మధ్య లేకపోయినా ఆయన సేవలు మాత్రం ఎప్పటికి గుర్తుండిపోతాయి. ఆయన ఒక తెలివైన రాజకీయవేత్త, రాజనీతిజ్ఞులు, బహుభాషా పండితుడు. దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారిన సందర్భంలో ప్రధాని పదవి చేపట్టిన పీవీ గొప్ప సంస్కరణలు తీసుకువచ్చారు. దేశాన్ని ఆర్ధిక సరళీకరణ వైపు పరుగులు పెట్టించారు. దేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని భవిష్యత్తు తరాల వారు కూడా గుర్తుంచుకుంటారు.' అంటూ పేర్కొన్నారు. -
శతమానం భవతి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ 66వ జన్మదినం సందర్భంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు చేపట్టారు. మంత్రులు, వివిధ శాఖల అధికారులు భారీగా మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తమ పెద్ద కొడుకుగా భావిస్తూ రాష్ట్ర ప్రజలు సీఎం 66వ పుట్టిన రోజును పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నారని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా శాసనసభలో జరిగిన పలు కార్యక్రమాల్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి దంపతులతో పాటు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు పాల్గొన్నారు. శాసనసభ, శాసనమండలిలో విధులు నిర్వహిస్తున్న 280 మంది నాలుగో తరగతి ఉద్యోగులకు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సతీమణి పుష్ప, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సతీమణి అరుంధతి చేతుల మీదుగా దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఫిట్నెస్ సెంటర్ (జిమ్)ను స్పీకర్, మండలి చైర్మన్ కలిసి ప్రారంభించారు. ముఖ్యమంత్రి పుట్టిన రోజు సందర్భంగా లాంగ్ లివ్ కేసీఆర్ అనే నినాదం ముద్రించిన గులాబీ రంగు టీ షర్టులు ధరించి అసెంబ్లీకి వచ్చిన పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సందడి చేశారు. పలువురు అధికారులు, సంఘాల నేతలు కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. జలవిహార్‌లో ఘనంగా వేడుకలు నెక్లెస్ రోడ్‌లోని జలవిహార్‌లో 66 కిలోల భారీ కేక్‌ను కట్ చేసి, 10వేల మందికి విందును ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో భాగంగా కోలాటం, బతుకమ్మ, ఒగ్గుడోలు, పులివేషధారణలు, నృత్యాలు, యక్షగానంతో సహా వివిధ ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. సీఎం కేసీఆర్ జీవిత నేపథ్యాన్ని వివరిస్తూ ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ ప్రారంభించారు. వికలాంగులకు రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ వీల్‌చెయిర్లను పంపిణీ చేశారు. తెలంగాణ భవన్లో... అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమల్లో కేసీఆర్ రోల్ మోడల్‌గా నిలుస్తున్నారని శాసన మండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సీఎం జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో రాష్ట్ర దివ్యాంగుల సహకార కార్పొరేషన్ డా.కె.వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పోచంపల్లి చేతుల మీదుగా 66 మంది దివ్యాంగులకు వీల్చెయిర్లు, 66 మంది అంధులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ రక్తదానం చేశారు. అమెరికా కాలిఫోర్నియాలోని శాన్ఫ్రాన్సిస్కోలో టీఆర్ఎస్ నేత దండె విఠల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 150 ప్రవాస భారతీయ కుటుంబాలు మొక్కలు నాటి, స్థానిక దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మొక్కలు నాటిన మంత్రులు సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని సోమవారం అటవీ, ఇతర శాఖల ఆధ్వర్యంలో భారీ ఎత్తున మొక్కలు నాటారు. మొక్కలు నాటిన వారిలో మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పువ్వాడ అజయ్‌కుమార్, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు. సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్, అటవీ అభివృద్ధి సంస్థ వీసీ, ఎండీ రఘువీర్, కెనరా బ్యాంకు జీఎం వీరభద్ర రెడ్డి, ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ, అటవీశాఖ స్పెషల్ సీఎస్ రాజేశ్వర్ తివారి, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ జనరల్ సి.పార్థసారథి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కమిషనర్ పి.సత్యనారాయణరెడ్డి, విభా గాధిపతులు మొక్కలు నాటారు. పో లీస్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం 56,872 మొక్కలను నాటారు. -
జనం కోసం జగన్
-
హ్యాపీ బర్త్‌డే సీఎం వైఎస్ జగన్
-
‘ప్రపంచంలోని అన్ని ఆనందాలకు అర్హుడివి’
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గత ఏడాది హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ గ్లోబల్ కపుల్ ఏం చేసినా.. ఎక్కడికి వెళ్లిన వారి ఫోటోలు, వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ అందాల భామ ప్రియాంక సోమవారం తన భర్త నిక్ బర్త్ డే సందర్భంగా ఒక వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రియాంక పెళ్లయిన తర్వాత నిక్ మొదటి బర్త్ డే కావడంతో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్లాన్ చేశారు ప్రియాంక. గతంలో వారు సరదాగా, ఆనందంగా గడిపిన సమయంలో తీసుకున్న ఫోటోలన్నింటిని వీడియోగా చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోకి ‘నీతో ఉండే ప్రతి రోజు ఓ కొత్త అనుభూతిని పొందుతాను.. నువ్వు నా జీవితానికి వెలుగువి, ప్రపంచంలోని అన్ని ఆనందాలకు నువ్వు అర్హుడివి నిక్, హ్యాపీ బర్త్ డే మై జాన్’ అంటూ హృదయాన్ని తాకే క్యాప్షన్‌తో షేర్ చేశారు. ఈ వీడియోలో ప్రియంక నిక్‌లు కలిసి సరదాగా వంట చేస్తున్న క్లిప్స్, కొన్ని ప్రైవేట్ కార్యక్రమాలలో వారు చేసిన అల్లరి ఫోటోలతో పాటు ప్రియాంక బర్త్ డేలో సందడి చేసిన ఫోటోలు కూడా ఉన్నాయి. సినిమాల విషయానికి వస్తే ప్రియాంక నటించిన తాజా చిత్రం ‘ది స్కై ఇజ్ పింక్’ ప్రమోషన్ వేడుక టొరంటోలో జరిగింది. అలాగే టొరంటోలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ది స్కై ఇజ్ పింక్ చిత్ర దర్శకుడైన సోనలీ బోస్, కో స్టార్స్ ఫర్హాన్ అక్తర్, రోహిత్ సరఫ్‌లతో కలిసి ప్రియాంక హజరయ్యారు. View this post on Instagram The light of my life. Everyday with you is better than the last. You deserve all the happiness in the world. Thank you for being the most generous loving man I have ever met. Thank you for being mine. Happy birthday Jaan. I love you @nickjonas A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on Sep 16, 2019 at 11:41am PDT -
మీరు లేకుండా మీ పుట్టిన రోజు అసంపూర్ణం
సాక్షి, న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయి.. ప్రస్తుతం తిహార్ జైలులో గడుపుతున్నారు కేంద్ర మాజీ మంత్రి పీ చిదబంరం. ఈ క్రమంలో జైలులోనే తన 74వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోనున్నారు చిదంబరం. ఈ సందర్భంగా చిందబరం తనయుడు కార్తీ తండ్రి పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాక చిదంబరం జైలు పాలైన నాటి నుంచి జరిగిన సంఘటనల గురించి వివరిస్తూ.. రెండు పేజీల లేఖ రాశారు. దానిలో కశ్మీర్ పునర్వ్యస్థీకరణ, ఆర్థిక మందగమనం, దానిపై ఆర్థిఖ మంత్రి నిర్మల సీతారామన్ వ్యాఖ్యలు, గురుత్వాకర్షణ గురించి పియూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు, అస్సాం ఎన్ఆర్సీ, మోదీ ప్రభుత్వం 100 రోజుల వేడక గురించి ప్రస్తావించారు. అంతేకాక ‘మీరు 76వ ఏట అడుగుపెట్టడం.. మోదీ ప్రభుత్వం వంద రోజుల వేడుక చేసుకోవడం రెండు ఒకేలాంటి అంశాలు కాదు. తన అనాలోచిత నిర్ణయాలతో బీజేపీ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింద’ని కార్తీ ఆరోపించారు. దాంతో పాటు ‘మీరు లేకుండా మీ పుట్టిన రోజు వేడుకలు జరపుకోవడం చాలా లోటుగా ఉంది. మీరు లేకపోవడం మా హృదయాలను కదిలించింది. మీరు తిరిగి వచ్చి మాతో పాటు పుట్టిన రోజు వేడకల్లో పాల్గొంటే బాగుంటుందనిపిస్తుంది. కానీ అలా జరగదని తెలుసు’ అంటూ కార్తీ లేఖలో పేర్కొన్నారు. -
హ్యాపీ బర్త్‌డే వానరా!
సాక్షి, కర్నూలు : మృతి చెందిన తల్లి వానరం వద్ద బిక్కమొహం వేసుకుని దిగా లుగా కూర్చున్న పిల్ల వానరాన్ని మూడేళ్ల క్రితం అక్కున చేర్చుకున్న ఓ వ్యక్తి దానికి పాలుపోసి పెంచి పెద్ద చేయడమే కాకుండా ఏటా పుట్టినరోజు వేడుకలు కూడా నిర్వహిస్తూ తన ప్రేమకు తిరుగులేదని నిరూపిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం వానర సుతునికి మూడో బర్త్‌డే వేడుకలు ఘనంగా నిర్వహించాడు. సంజామలకు చెందిన మంగలి రాముడు వృత్తి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. జాలి గుణం కల్గిన ఈయన ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ముందుంటాడు. మూడేళ్ల క్రితం స్థానిక పోలీస్‌స్టేషన్ సమీప ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఓ కోతి.. పిల్లను ప్రసవించి కాసేపటికే మృతి చెందింది. ఆ సమయంలో తల్లి శవం వద్దే దిగాలుగా కూర్చున్న పిల్ల వానరాన్ని చూసి మంగలి రాముడు జాలిపడ్డాడు. ఇంటికి తీసుకెళ్లి సొంత బిడ్డలా డబ్బా పాలుపట్టి పెంచాడు. గురువారం కోటవీధిలోని ఆంజనేయస్వామి, రామాలయంలో వానరసుతునికి బర్త్ డే వేడుకలు నిర్వహించాడు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టాడు. -
బర్త్‌డేకి డబ్బులు ఇవ్వలేదని కోడుకు ఘాతుకం
-
బర్త్‌డేకు డబ్బులు ఇవ్వలేదని తల్లిదండ్రులపై..
సాక్షి, ప్రకాశం: జిల్లాలోని మార్కాపురంలో ఎస్సీ బీసీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. పుట్టినరోజు వేడుకలకు తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేదని ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఎస్సీ బీసీ కాలనీకి చెందిన మురారి జలయ్య, తల్లి లక్ష్మి కుమారుడు ప్రసాద్ బర్తడే వేడుకలకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో తల్లిదండ్రులపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో తండ్రి మురారి జలయ్యతో పాటు తల్లి లక్ష్మి, నాయనమ్మకు గాయాలు అయ్యాయి. వెంటనే వారిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తండ్రి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ఘాతుకానికి పాల్పడిన ప్రసాద్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : బర్త్‌డేకి డబ్బులు ఇవ్వలేదని కోడుకు ఘాతుకం -
నేడు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ జన్మదినం
-
షారుఖ్ బర్త్‌డే పార్టీని అడ్డుకున్న పోలీసులు
ముంబై: బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ బర్త్‌డే పార్టీని పోలీసులు అడ్డుకున్నారు. శుక్రవారం తన 53వ జన్మదిన వేడుకలను జరుపుకున్న షారుఖ్.. బాంద్రాలోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో రాత్రి పార్టీ ఏర్పాటు చేశారు. తనకు సన్నిహితులైన కొందరు మిత్రులను ఆ పార్టీకి పిలిచారు. అర్థరాత్రి దాటిన తర్వాత కూడా పెద్ద శబ్దాలతో కూడిన సంగీతం ఆగక పోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. నగరంలోని రెస్టారెంట్లు అర్థరాత్రి ఒంటి గంట తర్వాత పనిచేయరాదనే నిబంధనలున్నాయంటూ కార్యక్రమాన్ని ఆపుచేయించారు. -
అవుకు రాజు అండీ... అవుకు రాజు
ఎవరీ అవుకు రాజు? ఏమా కథ? అంటే.. మరెవరో కాదు.. ఆయన అభినయ చక్రవర్తి. అబ్బా.. అవుకు రాజు ఎవరో తెలియదు.. మళ్లీ అభినయ చక్రవర్తి అని కొత్త ట్విస్ట్ ఏంటీ అనుకుంటున్నారా? ఆ విషయానికే వస్తున్నాం. అభినయ చక్రవర్తి అంటే కన్నడ స్టార్, ‘ఈగ’ ఫేమ్ సుదీప్. అవుకు రాజు కూడా ఆయనే. సుదీప్ పుట్టినరోజు నేడు. కన్నడ చిత్ర సీమలో అభిమానులంతా ఆయన్ను ముద్దుగా అభినయ చక్రవర్తి అని పిలుస్తారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ‘సైరా’లో ఆయన అవుకు రాజు పాత్ర చేస్తున్నారు. చిరంజీవి టైటిల్ రోల్లో కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై సురేఖ కొణిదెల సమర్పణలో రామ్‌చరణ్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సుదీప్ పుట్టినరోజు సందర్భంగా చిత్రంలోని ఆయన లుక్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. యుద్ధ సన్నివేశానికి సంబంధించినట్లుగా ఉన్న ఈ స్టిల్‌లో అవుకు రాజుతోపాటు బ్యాక్‌గ్రౌండ్‌లో బ్రిటిష్ సైన్యం కనిపిస్తోంది కదూ. సో.. అవుకు రాజు బ్రిటిష్ వైపు అని అర్థం చేసుకోవచ్చేమో. వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల కానున్న ‘సైరా’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, జగపతిబాబు, విజయ్ సేతుపతి ముఖ్య తారాగణంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి అమిత్ త్రివేది స్వరకర్త, రత్నవేలు ఛాయాగ్రాహకుడు. -
ఘనంగా మంత్రి ‘జోగు’ జన్మదిన వేడుకలు
ఆదిలాబాద్‌టౌన్: రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న జన్మదిన వేడుకలను బుధవారం ఆయన నివాసంలో కార్యకర్తలు, నాయకుల మధ్య కేక్ కట్‌చేసి ఘనంగా జరుపుకున్నారు. అంతకు ముందు పట్టణంలోని శాంతినగర్ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి జోగు రామన్నకు రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఐ నర్సింహన్, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర మంత్రులు పలువురు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. స్వీ ట్లు, పండ్లు పంచిపెట్టారు. టపాసులు పేల్చి సం బరాలు జరుపుకున్నారు. ఆ ప్రాంతమంతా సం దడి సందడిగా కనిపించింది. మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్, డీసీసీబీ చైర్మన్ ముడుపు దామోదర్‌రెడ్డి, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రంగినేని మనీషా, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరె రాజన్న, మావల సర్పంచ్ రఘుపతి, పార్టీ మా వల మండల అధ్యక్షుడు నల్ల రాజేశ్వర్, ఐసీడీఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, పద్మశాలి సంఘం జి ల్లా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ, జాగృతి జి ల్లా అధ్యక్షుడు రంగినేనీ శ్రీనివాస్, పీఆర్టీయూ జి ల్లా అధ్యక్షుడు కొమ్ము కృష్ణకుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణ, మాజీ జెడ్పీ చైర్పర్సన్ జట్టు అ శోక్, బోథ్ మాజీ మార్కెట్ చైర్మన్ తులశ్రీనివాస్, మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కా ర్యదర్శులు మెట్టు ప్రహ్లాద్, సూరం భగవాండ్లు, జిల్లా అధికారులు, వివిధ సంఘాల నాయకులు, తరలివచ్చి మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. -
లండన్‌లో తొలి బర్త్‌డే!
ఫస్ట్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను లండన్‌లో ప్లాన్ చేశారు బాలీవుడు బ్యూటీ సోనమ్ కపూర్. ఆల్రెడీ 32 సార్లు బర్త్‌డే కేక్‌ను కట్ చేసిన సోనమ్‌కి తొలి బర్త్‌డే ఏంటి బాస్? అంటే.. నిజమే. ఇప్పటివరకూ జరుపుకున్న బర్త్ డేలకు కేక్‌లను ముక్కలు చేసింది కుమారిగా. ఇప్పుడు శ్రీమతి అయ్యాక జరుపుకుంటున్న తొలి బర్త్‌డే ఇది. ఈ ఏడాది మేలో ఆనంద్ ఆహుజాతో సోనమ్ కపూర్ ఏడు అడుగులు వేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 9న సోనమ్ పుట్టినరోజు. సోనమ్ 33వ బర్త్‌డే సెలబ్రేషన్స్ లండన్‌లో జరగనున్నాయి. ‘‘ఓ పని మీద లండన్ వెళ్తున్నాను. ఆనంద్ కూడా అక్కడికి వస్తాడు. సో.. నా బర్త్‌డే సెలబ్రేషన్స్ కూడా అక్కడే జరుగుతాయి. ఈ సెలబ్రేషన్స్‌లో నా సిస్టర్ రియా, స్నేహితులు సెహాల్యఖాన్, సయంక్తా నాయర్ కూడా పాల్గొంటారు. స్వర భాస్కర్ని జాయిన్ అవ్వమన్నాను. కానీ ‘వేరే వర్క్స్ వల్ల రాలేకపోతున్నాను’ అని స్వర చెప్పింది’’ అని సోనమ్ కపూర్ పేర్కొన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే... ఆమె నటించిన ‘సంజు’, తండ్రి అనిల్ కపూర్‌తో కలిసి నటిస్తోన్న ‘ఎక్ లడ్కీ కో దేఖా తో ఏసా లగా’ సినిమాలు ఈ ఏడాదే రిలీజ్ కానున్నాయి. -
కోలగట్ల సేవా స్ఫూర్తి ఆదర్శం
విజయనగరం మున్సిపాలిటీ : ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి సేవా స్ఫూర్తిని, సేవానిరతిని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని మాజీ మంత్రి, నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త పెనుమత్స సాంబశివరాజు అన్నారు. ఎమ్మెల్సీ కోలగట్ల జన్మదిన వేడుకల్లో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని పెనుమత్స ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత తరం రాజకీయాల్లో ప్రజల వెన్నంటే ఉండే వ్యక్తి కోలగట్ల అని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా కోలగట్ల రెండవ కుమార్తె శ్రావణి, అల్లుడు ఈశ్వర్ కౌషిక్‌లు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ సేవకు మించిన ఆత్మ సంతృప్తి దేనికి సాటిరాదన్న విషయాన్ని తన తండ్రి చెబుతుండేవారని, ఆయన పుట్టిన రోజు సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించటం ఆనందంగా ఉందన్నారు. తన తండ్రిపై ప్రజల ఆదరణ నిరంతరం ఇలానే ఉండాలని ఆకాంక్షించారు. ఈశ్వర్ కౌషిక్ మాట్లాడుతూ ప్రజల కోసం, సేవానిరతి కోసం పరితపించే వ్యక్తి పుట్టిన రోజు నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న యువతకు అభినందనలు తెలిపారు. కోలగట్ల స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. కోలగట్లపై నాయకులు, అభిమానులు, కార్యకర్తలు చూపెడుతున్న ప్రేమాభిమానాలు వెలకట్టలేనివన్నారు. ఈ సందర్బంగా నిర్వహించిన జిల్లా రక్తనిధి కేంద్రం వైద్యులు డాక్టర్ సత్యశ్రీనివాస్ నేతృత్వంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 215 మంది యువత స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ విజయనగరం నగర కన్వీనర్ వేణు, మండల అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసరావు, సీనియర్ కౌన్సిలర్లు ఎస్‌వివి.రాజేష్, సీతారామమూర్తి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఎస్.బంగారునాయుడు, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి బొద్దాన అప్పారావు, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి జివి.రంగారావు, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు అల్లు చాణక్య, పార్టీ నాయకులు సత్తరపు శంకరావు, పట్నాన పైడిరాజు, రెడ్డి గురుమూర్తి, మార్రోజు శ్రీను, గండ్రటి సన్యాసిరావు, ఈశ్వరరావు, తవిటిరాజు, ప్రసాద్, ఆవాల్కుమార్, సురేష్, కేశవ, నారాయణరావు, లక్ష్మణరావు, పండు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
‘కత్తి’లాంటి బర్త్‌డే పార్టీ!
సాక్షి ప్రతినిధి, చెన్నై: రౌడీ..బర్త్‌డే వేడుకకు అట్టహాసంగా ఏర్పాట్లు చేసుకున్నాడు. వాసన పసిగట్టిన పోలీసులు ఆఖరి నిమిషంలో ఎంటర్ కావటంతో కథ రివర్సయింది. చెన్నై సూలైమేడుకు చెందిన బిన్నీ (40)కి పెద్ద రౌడీ అనే పేరుంది. చెన్నైకి చెందిన ఓ మంగళవారం ఇతని పుట్టిన రోజు కావటంతో నగర శివార్లలోని ఓ లారీ షెడ్డులో వేడుకలకు ఏర్పాట్లు చేసుకున్నాడు. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలకు చెందిన 150 మందికి పైగా రౌడీలకు ఆహ్వానాలు పంపాడు. రాత్రికల్లా అందరూ షెడ్డు వద్దకు చేరుకోగా బాణసంచాతో వారికి స్వాగతం పలికారు. ఆనవాయితీ ప్రకారం బిన్నీ పిడికత్తితో కేక్ కూడా కోశాడు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. దీంతో అంబత్తూరు డిప్యూటీ కమిషనర్ సర్వేష్రాజ్ నేతృత్వంలో 70 మంది పోలీసులు మెరుపుదాడి చేసి 75మంది రౌడీలను అదుపులోకి తీసుకున్నారు. బిన్నీతోపాటు మరో 50 మంది మాత్రం తప్పించుకున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న మారణాయుధాలతోపాటు 50కి పైగా సెల్ఫోన్లు, 50 బైకులు, 8 కార్లను స్వాధీనం చేసుకున్నారు. నేరాల ప్రణాళిక, సమాచారం చేరవేత, అమలు కోసం రౌడీలంతా సెల్ఫోన్లలో ఒక ప్రత్యేక వాట్సాప్ గ్రూపును కూడా నడుపుతున్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నామని చెన్నై పోలీస్ కమిషనర్ విశ్వనాథన్ తెలిపారు. రౌడీల నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్న మారణాయుధాలు, మొబైల్ ఫోన్లు. -
ఆ అగ్ని ప్రమాదంలో ఇద్దరు హీరోలు...
సాక్షి, న్యూఢిల్లీ : ముంబై నగరం, కమలామిల్స్లోని రూఫ్‌టాప్ రెస్టారెంట్లో గురువారం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో పుట్టిన రోజు జరుపుకుంటున్నఅమ్మాయితో పాటు ఆ వేడుకలకు హాజరైన అతిథుల్లో 14 మంది దుర్మరణం చెందిన విషయం తెల్సిందే. పక్క భవనంలో పనిచేస్తున్న ఇద్దరు సెక్యూరిటీ గార్డులు సకాలంలో అప్రమత్తమై సహాయ సహకారాలు అందించకపోతే ప్రాణ నష్టం భారీగా జరిగేదని తెల్సింది. పక్క భవనంలోని టైమ్స్‌నౌ కార్యాలయంలో సర్వర్ గదిలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న మహేశ్ సాబ్లీ, సురజ్ గిరి అగ్ని ప్రమాదం నుంచి దాదాపు 150 మందిని రక్షించారు. రూఫ్‌టాప్ రెస్టారెంట్ కలిగిన నాలుగంతస్తుల భవనంలో మంటలు రాజుకోవడం దాదాపు అర్థరాత్రి సమయంలో ఈ ఇద్దరు సెక్యూరిటీ గార్డులు గమనించారు. సూరజ్ తక్షణమే అగ్నిమాపక దళానికి ఫోన్ చేయగా, మహేశ్ నాలుగో అంతస్తు వరకు పైపులు పట్టుకొని ఎక్కి అక్కడి ఎగ్జిట్ డోర్‌ను పగులగొట్టి మంటల్లో చిక్కుకున్నవారు రక్షించుకోవడానికి దోహదపడ్డారు. ఈలోగా అగ్నిమాపక దళానికి ఫోన్‌చేసిన సూరజ్ గ్రౌండ్ ఫ్లోర్‌కు వెళ్లి భవనం నుంచి బయటకు వెళ్లే దారులను తెరిచి తొక్కిసలాట జరుక్కుండా బాధితులకు దారిచూపారు. దట్టమైన పొగతో ఒకరికొకరు కనిపించని స్థితిలో ఈ ఇద్దరు సెక్యూరిటీ గార్డులు చేసిన సహాయం ఎంతో ఉపయోగపడింది. అనంతరం ప్రాణాలతో బయటపడిన బాధితులు వారిరువుకి కృతజ్ఞతలు తెలియజేశారు. వారి కృషిని అగ్నిమాపక సిబ్బంది, మీడియా ప్రశంసించింది. -
ముంబైలో ఘోరం
సాక్షి, ముంబై: అది ముంబై, లోయర్‌పరేల్ ప్రాంతంలోని కమలామిల్స్ కాంపౌండ్‌లో ఉన్న ఓ భవనంలోని రూఫ్‌టాప్ పబ్ ‘1 అబవ్’.. సమయం రాత్రి 12 గంటలు దాటింది. అక్కడంతా సందడిగా ఉంది. ఓ బర్త్‌డే పార్టీ సందర్భంగా పండగ వాతావరణం నెలకొని ఉంది. బర్త్‌డే గర్ల్ ఖుష్బూ బన్సాలీ అప్పుడే కేక్ కట్ చేసి ఆత్మీయులతో పంచుకుంటోంది. క్షణాల్లో పరిస్థితి మారింది. అకస్మాత్తుగా ఎక్కడో చిన్నగా ప్రారంభమైన మంటలు.. క్షణాల్లో పబ్ అంతా వ్యాపించాయి. చూస్తుండగానే భవనాన్ని చుట్టుముట్టాయి.. ఓవైపు మంటలు, మరోవైపు కమ్ముకుంటున్న పొగతో పబ్‌లో భీతావహ వాతావరణం నెలకొంది. ప్రాణభయం.. హాహాకారాలు.. ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు వెళ్లే ఇరుకైన మార్గాల వద్ద తొక్కిసలాట. మంటల నుంచి తప్పించుకునేందుకు వాష్‌రూమ్‌ల్లో దాక్కున్న వారికి పొగతో ఊపిరాడని పరిస్థితి నెలకొంది. ఈ దుర్ఘటనలో అప్పుడే పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న ఖుష్బూ సహా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 11 మంది మహిళలున్నారు. మరో 21 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ విచారణకు ఆదేశించారు. తప్పుచేసినవారు ఎంతవారైనా వదిలిపెట్టబోమన్నారు. నలుగురు అగ్నిమాపక సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఇదే భవనంలో ఉన్న పలు చానెళ్ల కార్యాలయ ఉద్యోగులు ప్రాణాలతో బయటపడ్డారు. అసలేం జరిగింది? లోయర్ పరేల్‌లోని కమలా మిల్స్ కాంపౌండ్‌లోని ఓ భవనం పై అంతస్తు రూఫ్‌టాప్‌లో 1 అబవ్ అనే పబ్ ఉంది. గురువారం రాత్రి ఖుష్బూ బన్సాలీ అనే యువతి తన 29వ పుట్టినరోజు జరుపుకునేందుకు 10 మంది స్నేహితురాళ్లతో కలిసి వచ్చారు. వేరే వాళ్లు కూడా ఇదే సమయంలో పబ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. సంగీతం హోరు.. అదే భవంతిలో కింద ఉన్న సంస్థల్లోకి వినబడుతోంది. ఇంతలోనే పబ్‌లో మంటలంటుకుని క్షణాల్లోనే విస్తరించాయి. మంటలు ఎగిసిపడటం, దట్టమైన పొగ వ్యాపించటంతో అక్కడున్న వారికి ఏం జరిగిందో అర్థంకాలేదు. ప్రాణాలు కాపాడుకునేందుకు తలోదిక్కు పరుగులు తీశారు. మెట్లకు దగ్గరగా ఉన్న వారు ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన వారు పరుగులు తీస్తుండగానే.. అగ్నికీలలు ఎగిసి పడ్డాయి. వెంటనే మూడో అంతస్తులో ఉన్న మోజో పబ్‌కూ ఈ మంటలు విస్తరించాయి. ప్రమాదం నుంచి తప్పించుకునే సమయంలో చాలా మంది అక్కడే ఉన్న టాయిలెట్స్‌లోకి వెళ్లారు. బాధితుల్లో చాలా మంది కాలిన గాయాలకంటే ఊపిరాడకే చనిపోయారని.. బాధితులను తరలించిన కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఖుష్బూ స్నేహితురాళ్లతోపాటు ఈ వేడుకకు వచ్చిన అమెరికాకు చెందిన భారత సంతతి సోదరులిద్దరు, వారి బంధువు కూడా అగ్నికి ఆహుతయ్యారు. పబ్‌లోని వెదురుతో నిర్మించిన కనోపీ వద్ద ఘటన జరగటంతో మంటలు వేగంగా విస్తరించినట్లు తెలుస్తోంది. ప్రాణాలు కాపాడుకునేందుకు మెట్లవైపు పరుగులు తీసే క్రమంలో తొక్కిసలాట జరిగింది. నిలువెల్లా నిర్లక్ష్యం! ఈ భవనం మొత్తంమీద సరైన భద్రతా ప్రమాణాల్లేవు. దీనికి తోడు.. మూడు, నాలుగు అంతస్తుల్లో ఉన్న మోజో, 1 అబవ్ పబ్బుల నిర్వాహకులు పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది. మంటలను ఆర్పే పరికరాలు లేకపోవటంతోనే ప్రమాదం తీవ్రత పెరిగింది. కిందకు వెళ్లే అత్యవసరమార్గాలన్నీ మూసే ఉన్నట్లు తెలిసింది. ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది మరో మార్గంలో కొందరిని తరలించి ఉండకపోతే మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండేది. అటు ఇలాంటి పబ్బులపై కఠినమైన చర్యలు తీసుకోవటంలో బీఎంసీ వైఫల్యం కూడా కొట్టొచ్చినట్లు కనబడుతోంది. 1 అబవ్ పబ్‌కు మూడుసార్లు హెచ్చరికలు జారీ చేశామని అధికారులు చెబుతున్నారు. అధికారులకు మామూళ్లు ముడుతున్నందునే వీరిపై చర్యలు తీసుకోలేదని ముంబై వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యంగా మేల్కొన్న అగ్నిమాపక దళాలు తేరుకుని 10 ఫైరింజన్లు, 18 ట్యాంకర్లతో మంటలార్పేందుకు నాలుగు గంటలు పట్టింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ‘నేను రాత్రి షిప్టులో ఉన్నాను. పబ్ ఫ్లోర్ నుంచి అరుపులు వినిపించాయి. బయటకు వచ్చి చూడగానే 1 అబవ్ ఫ్లోర్ పూర్తిగా కాలిపోయింది. మంటల కారణంగా మా కార్యాలయం ప్రధాన ద్వారాన్ని మూసేశారు’ అని చానెల్ ఉద్యోగి ఒకరు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో 1 అబవ్ రెస్టారెంట్లో ఉన్న డాక్టర్ సులభా అరోరా.. ఇంకా షాక్‌నుంచి తేరుకోలేదు. తను ప్రాణాలతో బయటపడతాననుకోలేదని ఘటనను గుర్తుచేసుకుంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. నిర్వాహకులపై కేసులు 1 అబవ్ యజమానులు హ్రతేశ్ సంఘ్వీ, జిగర్ సంఘ్వీ, అభిజిత్ మకా సహా పలువురిపై ఐసీపీ 337 (ఇతరుల భద్రతను, ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం), 338 (తీవ్ర నష్టాన్ని కలిగిస్తూ ప్రాణాలకు హాని కల్గించటం) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కేసు నమోదైన వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కలసిరాని ‘29’ ముంబై: దేశ ఆర్థిక రాజధానికి 29వ తేదీ కలిసిరాలేదు. ఈ ఏడాదిలో 29వ తేదీన మూడు ఘోర ప్రమాదాలు ముంబైని వణికించాయి. ఆగస్టు 29న కుండపోత వర్షం కురవడంతో ముంబైలోని రవాణా మార్గాలన్నీ స్తంభించిపోయాయి. ఈ వర్షాలకు దాదాపు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. నెలరోజుల తర్వాత మళ్లీ 29వ తేదీనే ముంబైలోని ఎల్ఫిన్‌స్టోన్ రోడ్డు– పరేల్ రైల్వేస్టేషన్లను కలిపే పాదచారుల బ్రిడ్జీపై జరిగిన తొక్కిసలాటలో 23 మంది చనిపోయారు. తాజాగా డిసెంబర్ 29న 1 అబవ్ పబ్ అగ్ని ప్రమాదంలో 14 మంది దుర్మరణం చెందారు. 29న 29 ఏళ్లకే.. 1 అబవ్ పబ్‌లో సంగీతాన్ని ఆస్వాదిస్తూ కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఖుష్బూ చాకోలెట్ కేక్‌ను కట్‌చేసింది. ఖుష్బూ వీడియాను ఆమె స్నేహితులు ఫేస్బుక్లో ఉంచారు. ‘హ్యాపియెస్ట్ బర్త్‌డే ఖుష్బూ’ అని క్యాప్షన్ జతచేశారు. కానీ విధి వక్రించింది. కొన్ని క్షణాలకే పబ్‌ను మంటలు చుట్టుముట్టాయి. ఇందులో ఖుష్బూ సహా 14 మంది చనిపోయారు. సెల్ఫీలు, మద్యంతో పెరిగిన తీవ్రత పబ్‌లో మంటలు చెలరేగినప్పుడు అతిథుల్లో కొందరు సెల్ఫీలు తీసుకుంటూ, మరికొందరు తప్పతాగి ఉండటంతో సహాయక చర్యలు ఆలస్యమయ్యాయని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఈ భవన సెక్యూరిటీగాఉన్న మహేశ్ సబ్లే మాట్లాడుతూ..‘రాత్రి 12.30 సమయంలో పెద్దఎత్తున గందరగోళం చెలరేగడంలో నేను టెర్రస్‌పైనున్న ఆఫీస్ నుంచి బయటికొచ్చాను. తీవ్ర ఆందోళనలతో ఉన్న ప్రజలు నావైపు పెద్దసంఖ్యలో దూసుకొచ్చారు. దీంతో 150 నుంచి 200 మందికి కిందకు వెళ్లడానికి దారిచూపించాను. వీరందర్ని కిందకు పంపాక టాయిలెట్లలో ఉండిపోయిన మరో 10 మందిని బయటకు తీసుకొచ్చాను. వీరందరికీ స్వల్పంగా కాలిన గాయాలయ్యాయి. మంటలు ఎక్కువ కావడంతో మరోసారి నేను లోపలకు వెళ్లలేకపోయాను’ అని తెలిపారు. -
తాను మరణించినా.. కూతురి జన్మదినం
భార్యఎంత కష్టపడుతున్నా చూసీచూడనట్టుంటాడు.., కూతురు నీళ్ల బకెట్ మోసినా తట్టుకోలేడు! భార్య బిర్యానీ చేసినా కాంప్లిమెంట్ ఇవ్వడు.., కూతురు మ్యాగీ చేసినా అదో గిన్నిస్ రికార్డ్ లా అందరికీ చెప్పుకుంటాడు! పిచ్చి నాన్న... లోకంలో శుభాలన్నీ కూతురికే కలగాలనుకుంటాడు.. ఏ కష్టం దగ్గరికి రానివ్వకుండా అడ్డుగోడలా ఉంటాడు! నాన్న అంటే కనిపించే ఒక భరోసా మాత్రమే కాదు.. కూతురు భవిష్యత్తుని బంగారం చేసే దేవుడు కూడా.. అమ్మ ఎంత తిట్టినా నవ్వొస్తుంది.. కానీ నాన్న కొద్దిగా మందలించినా ఏడుపొస్తుంది. కూతురి గుండెలో నాన్నకెప్పుడూ ప్రథమ స్థానం.. నాన్నకు కూతురే ప్రపంచం. అలాంటి ఓ తండ్రి, కూతుళ్ల అనుబంధాన్ని చాటే ఈ స్టోరీ మీకోసం... ఇక్కడ తండ్రి భుజాలపై కనిపిస్తున్న బుజ్జాయి పేరు బెయిలీ సెల్లర్స్. ఇప్పుడు @SellersBailey పేరుతో ట్విటర్లో అందరికీ సుపరిచితురాలైంది. తండ్రితో తన చిన్ననాటి జ్ఞాపకాలను ట్విటర్లో వివరిస్తూ మనసును కదిలించే ఓ ఘటన గురించి వివరించింది. అదొక్కటి చాలు.. కూతుళ్లంటే తండ్రులకు ఎంత ప్రేమో..! ఇక మ్యాటర్‌లోకి వెళ్తే.. సెల్లర్స్ టీనేజ్‌లో అడుగుపెట్టే సమయానికే తండ్రికి దూరమైంది. క్యాన్సర్ బారిన పడి మరణించాడు. తన తండ్రి గురించి సెల్లర్స్ చెబుతూ... ‘క్యాన్సర్‌కు ఉన్న ఓ గొప్ప లక్షణమేంటంటే.. తాము బతకమనే విషయాన్ని బాధితులకు ముందే చెప్పేస్తుంది. జీవితాన్ని సర్దుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. అందుకేనేమో నాన్న నా కోసం అన్ని సిద్ధం చేసి వెళ్లిపోయాడు. బతికున్నన్ని రోజులు నాకు ఏ కష్టం కలగకుండా చూసుకోవడమే కాదు.. తాను వెళ్లిపోయిన తర్వాత కూడా నేను సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు. కన్నబిడ్డల కోసం ఆస్తిపాస్తులు ఇవ్వడం తల్లిదండ్రులందరు చేసే పనే. కానీ మా నాన్న నాకోసం జీవితం మొత్తానికి సరిపడా సంతోషాలనిచ్చి వెళ్లిపోయాడు. అందుకే ఇప్పటికీ నా పుట్టిరోజు నాడు నాన్న దగ్గర నుంచి ఫ్లవర్ బొకే, బర్త్ డే గిఫ్ట్ వచ్చేస్తుంది. అదెలాగా? అని ఆశ్చర్యపోతున్నారు కదూ.. తాను బతకలేననే విషయం తెలుసుకున్న నాన్న... బతికున్నప్పుడే నా పుట్టినరోజుల కోసం ముందుగానే బర్త్ డే గిఫ్ట్‌లను ఆర్డర్ ఇచ్చేశారు. ఇప్పుడు ఆయన లేకున్నా.. అవి సమయానికి నా చేతికి అందుతుంటే.. నాన్న స్వయంగా ఇచ్చినట్టే అనిపిస్తోంది’ అంటూ పలు ట్విటర్ సందేశాలను పోస్ట్ చేసింది. నిజమేకదా.. ఈ లోకంలో లేకపోయినా కూతురు బర్త్ డేను జరుపుతున్న తండ్రి బెయిల్‌కు మనమంతా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే! -
ఆమె లేదు.. అయినా పుట్టినరోజు వేడుక ఆగలేదు
మర్చిపోవడానికి ఆమె జ్ఞాపకం కాదు.. 42 ఏళ్లు కొనసాగిన అనుబంధం.. అంతకుమించి ప్రాణంపదం. అందుకే దివంగత అరుణా షాన్‌బాగ్ పుట్టినరోజు వేడుకల్ని సోమవారం ఘనంగా నిర్వహిచారు ముంబైలోని కేఈఎం ఆసుపత్రి నర్సులు, డాక్టర్లు. వార్డుబాయ్ చేతిలో తీవ్ర లైంగిక హింసకు గురై, 42 ఏళ్లపాటు ఎలాంటి కదలికలు లేకుండా అరుణ జీవించిన నాలుగో నంబర్ గదిని నర్సులు అందంగా అలంకరించారు. ఉదయం నుంచి వరుసగా ఆ గదికి వచ్చిన నర్సులు.. బెడ్‌పై పూలు ఉంచి నివాళులు అర్పించారు. ఆ తరువాత కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. చికిత్స సమయంలో అరుణను ఉంచిన 4వ నంబర్ గదికి ఆమె పేరు పెట్టాలని నర్సులు కోరుతున్నట్లు, తర్వరలోనే దానిపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు కేఈఎం ఆసుపత్రి డీన్ అవినాష్ సుపే తెలిపారు. థానేలోని నర్సింగ్ కళాశాలకు అరుణ షాన్‌బాగ్ పేరు పెట్టనున్నట్లు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, అరుణ జీవితగాథ ఆధారంగా జర్నలిస్ట్ నేహా పురవ్ రూపొందించిన మరాఠి చిత్రం 'వ్యథ అరుణాచి' ఈ సాయంత్రం విడుదల కానుంది.