Pharmacy Students Birthday Party Inside Lucknow Hospital, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Lucknow Hospital Video: బర్త్‌ డే పార్టీ పేరుతో ఆసుపత్రిలో విద్యార్థుల హల్‌చల్‌.. వీడియో వైరల్‌!

Published Mon, Aug 8 2022 5:29 PM | Last Updated on Mon, Aug 8 2022 6:04 PM

Pharmacy Students Birthday Party Inside Lucknow Hospital - Sakshi

లక్నో: పుట్టిన రోజు వేడుకల పేరుతో వికృత చేష్టలకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. అలాంటి సంఘటనే ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లక్నోలో వెలుగు చూసింది. సివిల్‌ ఆసుపత్రిలో ఆదివారం అర్ధరాత్రి బర్త్‌ డే పార్టీ నిర్వహించారు పలువురు ఫార్మసీ విద్యార్థులు. బెల్టుతో కొట్టుకుంటూ, అరుస్తూ రచ్చ రచ్చ చేశారు. సుమారు గంట సమయం పాటు ఆసుపత్రి ప్రాంగణం గోల గోలగా మారిపోయింది. రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆరోగ్య శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి బ్రజేశ్‌ పతక్‌.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తు చేపట్టి కారకులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైరల్‌ వీడియో తన దృష్టికి వచ్చిందని, దర్యాప్తు చేపట్టామని సివిల్‌ ఆసుపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ ఆనంద్‌ ఓజా తెలిపారు. ‘వీడియోలోని వ్యక్తులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.’ అని తెలిపారు.

ఇదీ చదవండి: Viral: 16 ఏళ్ల బాలుడి ముక్కు కొరికేసిన రాజకీయ నేత.. అంత కోపం దేనికో?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement