pharmacy
-
తెలంగాణ ‘ఎప్’సెట్ షెడ్యూల్ ఇదే..
హైదరాబాద్: తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి ఇప్పటికే వెల్లడించింది. వీటిలో భాగంగా ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు ఎప్‌సెట్ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 22 నుంచి ఎప్‌సెట్(EAPCET) ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సోమవారం(ఫిబ్రవరి3) ఉన్నత విద్యామండలి ప్రకటించింది.ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు జరగనున్నాయి. మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం పరీక్ష జరగనుంది. ఎప్‌సెట్ పరీక్షలు జేఎన్టీయూ నిర్వహిస్తోంది.పీజీ ఈసెట్ షెడ్యూల్ ఖరారు..తెలంగాణ పీజీ ఈసెట్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. మార్చి 12న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.మార్చి 17 నుంచి 19 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.జూన్ 16 నుంచి 19 వరకు పరీక్షలు జరగనున్నాయి.కాగా, ఈ ఏడాది నిర్వహించనున్న అన్ని కామన్ ఎంట్రన్స్ పరీక్ష(సెట్)ల తేదీలను ఇప్పటికే రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. ఒకటి కంటే ఎక్కువ పరీక్షలు రాసే వారికి ఇబ్బంది రాకుండా సెట్ పరీక్షల తేదీలను వేర్వేరు రోజుల్లో ఖరారు చేశారు. -
ఫ్లిప్‌కార్ట్‌తో ముగిసిన సస్తాసుందర్ భాగస్వామ్యం
ఈ–కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ తాజాగా ఆన్లైన్ ఫార్మసీ, హెల్త్‌కేర్(Health care) విభాగంలో తన భాగస్వామ్యాన్ని ముగించిందని ఆన్లైన్లో ఔషధాలను విక్రయిస్తున్న సస్తాసుందర్ తెలిపింది. బ్రాండ్ మేధో సంపత్తి హక్కులను (ఐపీఆర్) తిరిగి పొందినట్లు వెల్లడించింది. వాల్‌మార్ట్ ప్రమోట్ చేస్తున్న ఫ్లిప్‌కార్ట్ 2021లో సస్తాసుందర్ మార్కెట్‌ప్లేస్‌లో 75 శాతం వాటాను రూ.750 కోట్లకు కొనుగోలు చేసింది. కంపెనీ యాప్‌ను ప్రారంభిస్తామని సస్తాసుందర్ గ్రూప్ చైర్మన్ బి.ఎల్.మిత్తల్ తెలిపారు.ఇదీ చదవండి: సీమాంతర పెట్టుబడులకు ముంబై టాప్‘హోల్డింగ్ కంపెనీ సస్తాసుందర్ వెంచర్స్ కొత్తగా ఏర్పడిన అనుబంధ సంస్థ సస్తాసుందర్ హెల్త్‌టెక్ ద్వారా బ్రాండ్ ఐపీఆర్‌లు, పోటీ రహిత హక్కులను ఫ్లిప్‌కార్ట్ హెల్త్ ప్లస్ నుండి తిరిగి పొందింది. ఇందుకోసం సుమారు రూ.100 కోట్ల విలువైన కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్లను ఫ్లిప్‌కార్ట్‌కు విక్రయించాం. చివరి త్రైమాసికంలో లావాదేవీ పూర్తయింది. దీని ఫలితంగా నిలుపుకున్న 25 శాతం వాటాను రైట్ ఆఫ్ చేయడం వల్ల దాదాపు రూ.188 కోట్ల నష్టం వాటిల్లింది. ఇది కేవలం టెక్నికల్ అకౌంటింగ్ నష్టం. కంపెనీకి భౌతిక నష్టం కాదు. ఆరోగ్య వ్యాపారం నుండి నిష్క్రమించాలన్న అంతర్జాతీయ ప్రణాళికను అనుసరించి ఫ్లిప్‌కార్ట్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని నేను భావిస్తున్నాను. ఫ్లిప్‌కార్ట్ హెల్త్ ప్లస్ కంపెనీ వారితోనే ఉంటుంది. వారు ఆ కంపెనీని ఏం చేస్తారనేది వారి ఇష్టం’ అని మిత్తల్ వివరించారు. -
సర్కారు ఆసుపత్రి.. ప్రైవేటు మందు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పెద్దాసుపత్రుల్లో ప్రైవేట్ మందుల మాఫియా రాజ్యమేలుతోంది. పేద రోగులను పీల్చిపిప్పి చేస్తోంది. ఆసుపత్రిలోని ఉచిత ఫార్మసీలో లేని మందును, ఈ ప్రైవేట్ మెడికల్ షాపుల యజమానులు తెప్పిస్తారు. ఏ మందులు తెప్పించాలో డాక్టర్లు వీరికి చెప్తారు. అదే మందును స్టాక్ పెట్టి రోగులకు అమ్ముతారు. అందులో డాక్టర్ కమీషన్ కనీసం 10 నుంచి 20 శాతం ఉంటుందని అంటున్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ ఆసుపత్రులైన గాందీ, ఉస్మానియా, పేట్ల బురుజు, అలాగే వరంగల్‌లోని ఎంజీఎం, కరీంనగర్‌లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో ప్రైవేట్ మందుల షాపులు ఏటా రూ.కోట్లలో వ్యాపారం చేస్తున్నాయి. ఉచిత మందులు ఇవ్వాల్సిన పెద్దాసుపత్రుల్లో బహిరంగంగా ప్రైవేట్ మందుల మాఫియా దోపిడీ కొనసాగుతున్నా, దాన్ని అడ్డుకునే నాథుడే లేకుండా పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాటికి అడ్డుకట్ట వేయడంలో యంత్రాంగం విఫలమవుతోంది. ఆ మందుల దుకాణాలెందుకు? రాష్ట్రంలో కీలకమైన ఈ ఆసుపత్రుల్లో సాధారణ జ్వరం మొదలు... అత్యంత కీలకమైన అవయవ మారి్పడి చికిత్సల వరకు జరుగుతుంటాయి. వీటిల్లో పేదలకు ఉచిత వైద్యం, ఉచిత మందులు ఇవ్వాలనేది లక్ష్యం. అయినా అక్కడ ఉచిత మందుల దుకాణాలున్నా, ప్రైవేట్ మందుల దుకాణాలు ఎందుకు పెట్టారన్నది అంతుబట్టని ప్రశ్న. గాంధీ ఆసుపత్రిలో ఓపీ బ్లాక్‌కు సరిగ్గా ఎదురుగా వరుసగా నాలుగు ప్రైవేట్ మెడికల్ షాపులున్నాయి. ఉస్మానియా ఆసుపత్రిలో ఐదు, నిలోఫర్‌లో రెండు, పేట్లబుర్జు మెటర్నిటీ ఆసుపత్రిలో ఒకటి, కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రెండు ప్రైవేట్ మందుల దుకాణాలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రి ప్రాంగణంలో ప్రైవేట్ మందుల దుకాణాలు ఉండవు.. కానీ దానికి అత్యంత సమీపంలోని మూడు మెడికల్ షాపులు కేన్సర్ మందులను అందుబాటులో ఉంచుతాయి. కొందరు ఆంకాలజిస్టులకైతే నెలకు ఐదారు లక్షల రూపాయల వరకు ఆ దుకాణాల నుంచి కమీషన్ తీసుకుంటున్నారన్న ప్రచారం ఉంది. కొన్ని ఫ్రీగా... కొన్ని కొనుగోలు చేసేలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్ మెడికల్ దుకాణాలకు డాక్టర్లు, సూపరింటెండెంట్లు, రాష్ట్రస్థాయిలో కీలకమైన అధికారుల అండదండలు పుష్కలంగా ఉంటాయి. వారి అండతోనే ప్రైవేట్ మందుల దుకాణాదారులు రెచ్చిపోతుంటారు. రోగికి వైద్యుడు నాలుగు రకాల మందులు రాస్తే, అందులో ప్రభుత్వ దుకాణంలో రెండే ఉంటాయి. మిగిలిన రెండింటిని ప్రైవేట్ దుకాణంలో కొనాల్సిందే. ఒక్కోసారి మందులున్నా కూడా లేవని ప్రభుత్వ ఫార్మసీ వారు చెబుతారు. అప్పుడు ప్రైవేట్‌లో కొనాల్సిందే. ఇక ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రిలో రోగులకు ఇచ్చే మందులన్నీ దాదాపు బేసిక్‌వే. అడ్వాన్స్ ట్రీట్మెంట్కు అవసరమైన మందులు ఇవ్వాలంటే ఎంఎన్‌జే ఆసుపత్రిలో దొరకవు. పైగా అవి అత్యంత ఖరీదైనవిగా ఉంటాయి. కొన్ని డోసులైతే రూ.లక్షల్లో ఉంటాయి. సీఎంఆర్ఎఫ్ కింద బిల్లులు పెట్టి ప్రైవేట్ దుకాణాల్లో కొని వాడుతుంటారు. ఎంఎన్‌జే మినహా మిగిలిన ప్రభుత్వ ఆసుపత్రులకు ఇచ్చే మందులను తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఎంఎస్ఐడీసీ) సరఫరా చేస్తుంది. అయితే చాలామందులు అత్యాధునికమైనవి కాకుండా బేసిక్ మందులనే సరఫరా చేస్తుందన్న ఆరోపణలున్నాయి. ఆయా ప్రైవేట్ దుకాణాలను ఎత్తి వేయడానికి ఎలాంటి ప్రయత్నం జరగకపోవడంతో రోగులు నష్టపోతున్నారు. కాగా, ప్రైవేట్ దుకాణాలు కోర్టుల్లో స్టేలు తెచ్చుకొని చలామణిలో ఉంటున్నాయని చెబుతున్నారు. రోజుకు జరిగే వ్యాపారం » గాంధీ ఆసుపత్రిలోని ప్రైవేట్ మందుల దుకాణాల్లో రూ. 10 లక్షలు » ఉస్మానియాలో రూ. 12 లక్షలు » ఎంఎన్‌జేపై ఆధారపడిన మూడు ప్రైవేట్ దుకాణాల్లో రూ.15 లక్షలు » ఎంజీఎంలో రూ. 5 లక్షలు -
బెల్ట్‌తో కొట్టి.. చితకబాది... పొట్టన పెట్టుకున్నాడు!
బెంగళూరు: కర్నాటకలో సంచలనం సృష్టించిన ఫార్మసీ ఉద్యోగి రేణుస్వామి హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం కన్నడ నటుడు దర్శన్, అతని అభిమానులు రేణుస్వామిని దారుణంగా కొట్టి చంపారు! రేణుస్వామికి తగిన ‘బుద్ధి’ చెప్పాలంటూ నటి పవిత్ర దర్శన్‌ను ఉసిగొలి్పందని తెలుస్తోంది. తన అభిమాన సంఘాల సమన్వయకర్త రాఘవేంద్రను ఈ పనికి దర్శన్ పురమాయించారు. రాఘవేంద్ర తన భర్తను ఇంటి సమీపంలో వాహనం ఎక్కించుకుని తీసుకెళ్లాడని రేణుస్వామి భార్య చెప్పారు. అతన్ని బెంగళూరు సమీపంలో ఒక షెడ్డులో దర్శన్ బెల్ట్‌తో చితకబాదారు. అభిమానులు కర్రలతో కొట్టారు. ఎముకలు విరిగి, సున్నిత ప్రాంతాల్లో అంతర్గత గాయాలై రేణుస్వామి అక్కడిక్కడే మరణించారు. మృతదేహాన్ని మురికికాలువలో పడేశారు. దాన్ని వీధి కుక్కలు తినడం చూసి ఫుడ్ డెలివరీ బాయ్ పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ కేసులో దర్శన్, పవిత్రతో పాటు 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారందరినీ బుధవారం ఘటనా స్థలికి తీసుకెళ్లి సీన్ రీ కన్స్ట్రక్ట్ చేశారు. -
ఇంజనీరింగ్‌లో 74 శాతం.. అగ్రి, ఫార్మాలో 89 శాతం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్ఈఏపీ సెట్–2024) ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఇంజనీరింగ్ విభాగంలో 78.98 శాతం, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 89.66 శాతం అర్హత సాధించారు. ర్యాంకుల్లో రెండు తెలుగు రాష్ట్రాలూ పోటీ పడ్డాయి. రెండు విభాగాల్లోనూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు తొలి 10 ర్యాంకులు సమానంగా వచ్చాయి. ఇంజనీరింగ్ విభాగంలో ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన సతివాడ జ్యోతిరాదిత్య, అగ్రి, ఫార్మసీ విభాగంలో ఏపీకే చెందిన అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన ఆలూరు ప్రణీత ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకొని టాప ర్లుగా నిలిచారు. ఈ మేరకు ఈఏపీ సెట్ ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, వైస్ చైర్మన్లు వెంకటరమణ, మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, జేఎన్టీయూహెచ్ వీసీ కట్టా నర్సింహారెడ్డి, సెట్ కనీ్వనర్ డీన్‌కుమార్, కో–కన్వీనర్ విజయకుమార్ రెడ్డి పాల్గొన్నారు. 74.98 శాతానికి తగ్గిన అర్హులు టీఎస్ఈఏపీ సెట్ ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు జరిగింది. ఇంజనీరింగ్ విభాగానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 2,54,750 మంది దరఖాస్తు చేశారు. వీరిలో 2,40,618 మంది సెట్‌కు హాజరయ్యారు. 1,80,424 మంది అర్హత సాధించారు. అగ్రి, ఫార్మా విభాగంలో రెండు రాష్ట్రాల నుంచి 1,00,432 మంది దరఖాస్తు చేస్తే 91,633 మంది పరీక్ష రాశారు. 82,163 మంది అర్హత సాధించారు. గత రెండేళ్ళతో పోలిస్తే సెట్ రాసిన వారి సంఖ్య పెరిగింది. కానీ అర్హత శాతం తగ్గింది. గత ఏడాది (2023) 3,01,789 మంది ఎంసెట్ పరీక్షకు హాజరయ్యారు. 2,48,814 (86.31%) మంది అర్హత సాధించారు. ఈ ఏడాది (2024) 3,32,251 మంది రాస్తే, ఇందులో 2,62,587 (74.98%) మంది అర్హత సాధించారు. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు కనీస అర్హత మార్కులు లేకపోవడంతో రాసిన అందరూ అర్హులయ్యారు. ఆన్లైన్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ రాష్ట్ర ఈఏపీ సెట్ ఫలితాలను వారం రోజుల్లో ప్రకటించడం అభినందనీయమని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. వారం రోజుల్లో కౌన్సెలింగ్ తేదీలను ప్రకటిస్తామని తెలిపారు. వీలైనంత త్వరగా కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వ నోటిఫికేషన్ వెలువడకుండా యాజమాన్య కోటా సీట్లు భర్తీ చేసే కాలేజీలపై చర్య తీసుకుంటామన్నారు. ఈ ఏడాది ఆన్లైన్ విధానం ద్వారా ఈ సీట్లను భర్తీ చేసే ఆలోచన చేస్తున్నామని, త్వరలోనే ముఖ్యమంత్రితో చర్చిస్తామని చెప్పారు. అనుమతి లేకుండా విద్యార్థులను చేర్చుకున్న గురునానక్, శ్రీనిధి ప్రైవేటు యూనివర్సిటీలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే.. మాది ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం యరకరాయపురం. నాన్న మోహనరావు సాంఘిక సంక్షేమ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా, తల్లి హైమావతి ఆర్టీసీలో పనిచేస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే తెలంగాణ ఈఏపీసెట్‌లో మొదటి ర్యాంకు సాధించగలిగా. –సతివాడ జ్యోతిరాదిత్య, ఫస్ట్ ర్యాంకర్ (ఇంజనీరింగ్)ఐఐటీ బాంబేలో చదవడమే లక్ష్యం.. మా స్వస్థలం ఏపీలోని కర్నూలు జిల్లా పంచలింగాల. నాన్న సూర్యకుమార్ యాదవ్ కమ్యూనికేషన్ విభాగంలో ఎస్పీగా పనిచేస్తున్నారు. నాకు జేఈఈ మెయిన్‌లో 311వ ర్యాంకు వచి్చంది. ప్రస్తుతం జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సన్నద్ధమవుతున్నా. ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్ చేయడమే నా లక్ష్యం. – గొల్లలేఖ హర్ష, సెకండ్ ర్యాంకర్ (ఇంజనీరింగ్) బాంబే ఐఐటీలో సీఎస్ఈ లక్ష్యంప్రతిరోజు 10 గంటల పాటు చదివేవాడిని. తండ్రి బి.రామసుబ్బారెడ్డి, తల్లి వి.రాజేశ్వరి ఇద్దరు ప్రభుత్వ టీచర్లు. మాది ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోని. ఇంజనీరింగ్‌లో 4వ ర్యాంకు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఐఐటీ బాంబేలో సీఎస్ఈ చేయడమే నా లక్ష్యం. – సందేశ్, 4వ ర్యాంకు, ఇంజనీరింగ్, హైదరాబాద్ఐఐటీ బాంబేలో సీఎస్ఈ చదువుతా మాది ఏపీలోని కర్నూలు. నాన్న ఎం.రామేశ్వరరెడ్డి చిరు వ్యాపారి. అమ్మ గృహిణి. జేఈఈ మెయిన్‌లో 36వ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 6వ ర్యాంకు వచ్చాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు తెచ్చుకుని ఐఐటీ బాంబేలో సీఎస్ఈ చదవాలనుకుంటున్నా. – మురసాని సాయి యశ్వంత్‌రెడ్డి, ఐదో ర్యాంకర్ (ఇంజనీరింగ్)నాన్నలాగే అవ్వాలని అనుకుంటున్నా.. రోజుకు 16 గంటలు చదువుతున్నా. రాబోయే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సత్తా చాటి ఐఐటీ బాంబేలో సీటు సాధిస్తా. మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను అవుతా. మెయిన్స్‌లో 5వ ర్యాంకు వచ్చింది. ఈఏపీ సెట్లో ర్యాంకు రావడంతో ఆనందంగా ఉంది. నా తండ్రి అనిల్‌కుమార్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. దీంతో నాన్నలాగే అవ్వాలని చిన్నప్పట్నుంచీ అనుకునేవాడిని. తల్లి మమత ఖాజాగూడ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. – విదిత్, 7వ ర్యాంక్, ఇంజనీరింగ్ (మణికొండ) తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణంతండ్రి రాజేశ్వరరావు పబ్బ, తల్లి లావణ్య పబ్బ, అక్క మానస పబ్బల సహకారం, ప్రోత్సాహంతో ఈ ర్యాంకు సాధించా. బాంబే ఐఐటీలో సీటు సాధించి గొప్ప ఇంజనీర్‌ను కావడమే నా లక్ష్యం. – పబ్బ రోహన్ సాయి, 8వ ర్యాంకు, ఇంజనీరింగ్ (ఎల్లారెడ్డిగూడ) అమ్మా నాన్నల ఆశలు నెరవేరుస్తామంచి కళాశాలలో బీటెక్, ఆ తర్వాత ఎంటెక్ చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడమే నా లక్ష్యం. ఇంటర్మీడియెట్‌లో అధ్యాపకుల బోధన, కోచింగ్‌తోనే ఉత్తమ ర్యాంకు సాధించా. ముఖ్యంగా మా చదువు కోసమే అమ్మా నాన్న ఊరు విడిచి హైదరాబాద్‌కు వచ్చారు. వారు పడుతున్న కష్టాలు రోజూ చూస్తున్నా. మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి మా తల్లిదండ్రుల కష్టాలు తీరుస్తా. వారి ఆశలు నెరవేరుస్తా.–కొంతం మణితేజ, 9వ ర్యాంకు, ఇంజనీరింగ్, వరంగల్తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ర్యాంకులు మాది ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం దళాయిపేట. అమ్మా నాన్న సుశీల, శ్రీనివాసరావు ఇద్దరూ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. నాకు జేఈఈ మెయిన్‌లో261వ ర్యాంకు, ఓబీసీ విభాగంలో 35వ ర్యాంకు వచ్చాయి. తల్లిదండ్రుల ప్రోత్సాహమే ర్యాంకులకు కారణం. –ధనుకొండ శ్రీనిధి, పదో ర్యాంకర్ (ఇంజనీరింగ్ విభాగం) గుండె వైద్య నిపుణురాలినవుతా.. మాది ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లి. నాన్న శ్రీకర్ హోమియో మెడికల్ ప్రాక్టీషనర్‌గా, తల్లి కళ్యాణి ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. అక్క సంవిధ కాగి్నజెంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎయిమ్స్ న్యూఢిల్లీలో ఎంబీబీఎస్ చేసి వైద్యురాలిని కావడమే నా లక్ష్యం. కార్డియాక్ సర్జన్‌గా స్థిరపడాలన్నదే నా ఆకాంక్ష. – ఆలూరు ప్రణీత, ఫస్ట్ ర్యాంకర్ (అగ్రికల్చర్–ఫార్మా) నా కష్టం ఫలించింది.. మాది ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం చిలకలపల్లి. అమ్మా నాన్న కృష్ణవేణి, నారాయణరావు వ్యవసాయం చేస్తున్నారు. మంచి ర్యాంకు సాధించాలనే పట్టుదలతో చదివా. నా కష్టం ఫలించింది. – నగుడసారి రాధాకృష్ణ, సెకండ్ ర్యాంకర్ (అగ్రికల్చర్–ఫార్మా) డాక్టర్ కావడమే లక్ష్యంమధ్య తరగతి కుటుంబం అయినప్పటికీ మా అమ్మానాన్న నా చదువు కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. డాక్టర్ కావాలన్న నా ఆకాంక్షను గుర్తించి హైదరాబాద్‌లోని కాలేజీలో చేర్పించారు. ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికాకుండా చదువుపైనే దృష్టి పెట్టా. నీట్ పరీక్ష బాగా రాశా. – గడ్డం శ్రీవర్షిణి, 3వ ర్యాంకు, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ (హనుమకొండ)వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తానా తల్లిదండ్రులు ఎండీ జమాలుద్దీన్, నుస్రత్ ఖాన్లు. వ్యవసాయ శాస్త్రవేత్తగా ఎదగడమే నా లక్ష్యం. ఆరుగాలం శ్రమించే అన్నదాతలకు అండగా ఉంటూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తా. కరోనా కష్ట కాలంలో అన్ని రంగాలూ కుదేలైనా వ్యవసాయ రంగమే మన దేశాన్ని ఆదుకుంది.– అజాన్ సాద్, 6వ ర్యాంకు, అగ్రికల్చర్ ఫార్మసీ (నాచారం)వైద్య వృత్తి అంటే ఇష్టంనా తల్లిదండ్రులు జయశెట్టి సూర్యకాంత్, భాగ్యలక్ష్మి. నాకు వైద్య వృత్తిపై ఆసక్తి ఎక్కువ. సేవ చేయాలనే తపనతో నీట్ పరీక్ష రాశా. దాంతో పాటు ఈఏపీ సెట్ కూడా రాశా. ఈఏపీలో మంచి ర్యాంకు వచ్చింది. అదే విధంగా త్వరలో రానున్న నీట్ ఫలితాల్లో కూడా మంచి ర్యాంకు సాధిస్తానని ఆశిస్తున్నా. – ఆదిత్య జయశెట్టి, 9వ ర్యాంకు, అగ్రి ఫార్మసీ (కూకట్పల్లి) -
ఈఏపీ సెట్ షురూ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ (టీఎస్ఈఏపీ సెట్) మంగళవారం మొదలైంది. తొలి రోజు జరిగిన పరీక్షకు 90.41 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. 7, 8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి సంబంధించిన సెట్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 9 నుంచి 11 వరకూ ఇంజనీరింగ్ సెట్ ఉంటుంది. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి మొత్తం 1.43 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కంప్యూటర్ బేస్డ్గా జరిగిన ఈ పరీక్షను ఉదయం, సాయంత్రం నిర్వహించారు. ఈ రెండు పూటలకు కలిపి 33,500 మంది హాజరవ్వాల్సి ఉంది. అయితే, 30,280 (90.41%) మంది హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా తొలిరోజు పరీక్ష జరిగిందని ఈఏపీ సెట్ కో–కన్వీనర్ విజయకుమార్ రెడ్డి తెలిపారు. ఒక్క నిమిషం నిబంధన విధించినప్పటికీ విద్యార్థులకు ఇబ్బంది కలగలేదని వెల్లడించారు. వేసవి తీవ్రను దృష్టిలో ఉంచుకుని పరీక్ష కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించామని, అన్ని చోట్ల సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి సంబంధించిన సెట్ బుధవారం కూడా జరుగుతుంది.ఫిజిక్స్ కాస్త టఫ్ఈఏపీ సెట్లో ఫిజిక్స్ విభాగం నుంచి కఠిన ప్రశ్నలు వచ్చినట్టు విద్యార్థులు తెలిపారు. సిలబస్ నుంచే ఇచ్చినప్పటికీ సమాధానాలు డొంక తిరుగుడుగా ఉన్నాయని హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి నీలేష్ తెలిపారు. కఠినమైన ఫిజిక్స్ చాప్టర్స్ నుంచి వచ్చిన ప్రశ్నలకు సమాధానం రాయడానికి ఎక్కువ సమయం పట్టిందని, కొన్ని లెక్కలు వేయడం వల్ల ఇతర సబ్జెక్టులకు సమయం సరిపోలేదని వరంగల్‌కు చెందిన ప్రజ్ఞ చెప్పారు. కెమిస్ట్రీ పేపర్ మధ్యస్థంగా ఉన్నట్టు ఎక్కువ మంది విద్యార్థులు తెలిపారు. ఆర్గానిక్, ఇనార్గన్ చాప్టర్ల నుంచి కొంత ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వచ్చినా, ఇతర చాప్టర్లు తేలికగానే ఉన్నాయన్నారు. కాగా, మూలకాల విశ్లేషణపై పట్టున్న విద్యార్థులకు కెమిస్ట్రీ తేలికగానే ఉంటుందని రసాయన శాస్త్ర నిపుణులు వినోద్ త్రిపాఠీ తెలిపారు. అయితే, ఆప్షన్స్‌లో సమాధానాలు ఒకదానితో ఒకటి పోలినట్టే ఉండటం వల్ల విద్యార్థులు సరైన ఆన్సర్ ఇవ్వడానికి కష్టపడాల్సి వచ్చిందని మరో రసాయన శాస్త్ర అధ్యాపకుడు బీరేందర్ వర్మ అభిప్రాయపడ్డారు. బాటనీ, జువాలజీ సబ్జెక్టుల నుంచి ప్రిపేర్ అయిన ప్రశ్నలే వచ్చినట్టు మెజారిటీ విద్యార్థులు తెలిపారు. మొత్తం మీద జువాలజీ, బాటనీ సబ్జెక్టుల్లో ఎక్కువ స్కోర్ చేసే వీలుందని అధ్యాపకులు చెబుతున్నారు. గత ఐదేళ్ల ఎంసెట్ పేపర్లు ప్రిపరేషన్‌కు తీసుకుని ఉంటే ఎక్కువ మార్కులు సాధించే వీలుందని బాటనీ లెక్చరర్ శ్రుతి తెలిపారు. -
రద్దు చేయం.. సరిచేస్తాం
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తమ ప్రభుత్వం మెట్రో మార్గం, ఫార్మాసిటీ సహా దేనినీ రద్దు చేయడం లేదని.. ప్రజోపయోగకరంగా మార్పులు మాత్రమే చేస్తున్నామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. తమ ప్రభుత్వం ఆస్తులు సృష్టిస్తుందే తప్ప.. రాష్ట్రానికి భారమయ్యే ఏ పనీ చేయబోదని వివరించారు. ఫార్మాసిటీ స్థానంలో ఫార్మా విలేజీలు నిర్మిస్తామన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా, తక్కువ ఖర్చుతోనే శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో రైల్‌ను అనుసంధానిస్తామని తెలిపారు. చెన్నై, ముంబై, బెంగళూరు వంటి నగరాలు శాచురేషన్కు వచ్చాయని.. రాష్ట్రం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేలా, ఎయిర్‌పోర్టుకు అవతలివైపు కోటిన్నర ప్రజలతో కొత్త సిటీని నిర్మించబోతున్నామని చెప్పారు. నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం సచివాలయంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో సీఎం రేవంత్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ ఆధ్వర్యంలోనే మెట్రో విస్తరణ చేపడతాం. మియాపూర్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు విస్తరిస్తాం. అవసరమైతే రామచంద్రాపురం వరకు పొడిగిస్తాం. నాగోల్–ఎల్బీనగర్–ఒవైసీ ఆస్పత్రి మీదుగా ఫలక్‌నుమా–శంషాబాద్ వరకు.. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రోరైల్ విస్తరిస్తాం. అలాగే మైండ్‌స్పేస్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు విస్తరించి పూర్తిస్థాయిలో వినియోగిస్తాం. గత ప్రభుత్వం రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు విస్తరణ కోసం రూ.9వేల కోట్లు వ్యయం చేయడానికి సిద్ధమైంది. అలాగే బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకాపూల్ వరకు మరోలైన్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. మియాపూర్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు విస్తరించకుండా కొత్తగా చేపట్టడం అనవసర వ్యయమే. అక్కడి నుంచి మెట్రో ఎక్కేవారు ఎవరూ ఉండరు. అది నిర్మించి ఉంటే.. కాళేశ్వరం తరహాలో రాష్ట్రానికి భారంగా మారేది. మేం చేసిన మార్పులతో నగరంపై ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. దీనికి కేంద్రం పూర్తిగా నిధులు సమకూర్చే అవకాశం ఉంది. ప్రస్తుత మెట్రోకు అనుసంధానం చేయడం వల్ల వ్యయం కూడా తగ్గుతుంది. ఫార్మాసిటీకి బదులు ఫార్మా విలేజ్‌లు 25వేల ఎకరాల్లో ఒకే చోట ఫార్మాసిటీ నిర్మిస్తే.. చివరికి అంతర్జాతీయ విమానాశ్రయం కూడా పనికిరాకుండా పోతుంది. న్యూయార్క్ ఎయిర్‌పోర్టు మాదిరిగా అవుతుంది. అందుకే ఔటర్ రింగ్‌రోడ్డు– రీజనల్ రింగ్‌రోడ్డు మధ్య పది ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం. నిరుపయోగంగా భూములు తీసుకుని ఒక్కో క్లస్టర్లో వెయ్యి నుంచి మూడు వేల ఎకరాల్లో జీరో పొలుష్యన్ ఉండేలా ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేస్తాం. ఒక్కోదానిలో పది పరిశ్రమలు ఉండేలా చూస్తాం. అక్కడ పనిచేసే వారికి అదే క్లస్టర్లో గృహాలతోపాటు అన్ని సౌకర్యాలతో పూర్తి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ప్రతిపాదిత ఫార్మాసిటీ ప్రాంతంలో కాలుష్య రహిత పరిశ్రమలు, టౌన్íÙప్లు, విద్యాలయాలు, ఆస్పత్రులు, వాణిజ్య భవన సముదాయాలు, వినోద సంబంధిత మల్టీప్లెక్స్‌లు వచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం. బీవైడీ వంటి ఎల్రక్టానిక్ కార్ల కంపెనీలు సహా రాష్ట్రానికి వచ్చే ఎలాంటి పరిశ్రమలనూ వదులుకోబోం. వారికి అవసరమైన రాయితీలు కల్పిస్తాం. ప్రఖ్యాత కంపెనీల ఆధ్వర్యంలో వర్సిటీలు.. రాష్ట్రంలో ప్రత్యేక నైపుణ్య విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకోసం అగ్రశ్రేణి కంపెనీలను ఆహా్వనించాం. టాటా, మహీంద్రా, సెంచురీ సంస్థల ఆధ్వర్యంలో అవి ఏర్పాటవుతాయి. ఒక్కో పరిశ్రమ ఐదు యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తుంది. ఇంటర్ పూర్తిచేసిన వారికి ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్లు ఉంటాయి. విద్యాశాఖ పర్యవేక్షణలోనే ఈ వర్సిటీలు ఉంటాయి. వీటిలో అభ్యసించే వారికి ఆ సంస్థలే ఉపాధి కల్పించడం, క్యాంపస్ రిక్రూట్మెంట్లు వంటి చర్యలు చేపడతాయి. నైపుణ్యంతో కూడిన డిగ్రీ ఉంటే వారికి ఉపాధి గ్యారంటీ అవుతుంది. ఒక్కో యూనివర్సిటీకి ప్రభుత్వం రెండు వందల ఎకరాల వరకు భూమి ఇస్తుంది. ప్రస్తుతం టాటా సంస్థ రూ.1,400 కోట్లు ఐటీఐలపై వెచ్చిస్తే.. మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం రూ.400 కోట్లు వెచ్చిస్తుంది. రాష్ట్ర అతిథి గృహంగా.. వైఎస్సార్ క్యాంప్ ఆఫీసు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి క్యాంపు కార్యాలయంగా వినియోగించిన భవనాన్ని రాష్ట్ర అతిథిగా గృహంగా మారుస్తున్నాం. నివాస భవనాన్ని మంత్రి నివాసంగా కేటాయించాం. కేసీఆర్ క్యాంపు కార్యాలయంగా వినియోగించిన భవనాన్ని కొత్తగా ప్రారంభించనున్న ‘మహాత్మా జ్యోతిబా పూలే ఇనిస్టిట్యూట్ ఫర్ పాలసీ స్టడీస్ అండ్ రీసెర్చ్ ఆన్ సోషల్ జస్టిస్, ఎంపవర్మెంట్’ కోసం వినియోగిస్తాం. వంద పడకల ప్రతి ఆస్పత్రికి నర్సింగ్ కళాశాల రాష్ట్రంలో వంద పడకలున్న ప్రతీ ఆస్పత్రికి అనుబంధంగా ఓ నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేస్తాం. నర్సులకు విదేశాల్లోనూ అధిక డిమాండ్ ఉంది. మధ్య తరగతిలో వృద్ధులను చూసుకునే అవకాశాలు తగ్గుతున్నాయి. వారికి చేదోడువాదోడుగా ఉండే నర్సులకు స్థానికంగానూ ఉపాధి లభిస్తుంది. విదేశాల్లో పనిచేసే నైపుణ్యం ఉన్న, లేనివారికి కూడా ఓరియంటేషన్ ఇప్పిస్తాం. విదేశాల్లోని పరిశ్రమలతో ప్రభుత్వమే సంప్రదింపులు జరిపి ఉద్యోగాలు కల్పిస్తాం. వేతనాలను కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. వారికి ఏ ఇబ్బందులు వచ్చినా ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది..’’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రజల ప్రభుత్వం మాది మాది ప్రజలతో మమేకమయ్యే ప్రభుత్వం. ప్రజావాణి కోసం ప్రజలంతా రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం లేకుండా.. ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళుతోంది. మంత్రులందరినీ కూడా ప్రజల దగ్గరకే వెళ్లాలని కోరాను. 80శాతం సమస్యలు క్షేత్రస్థాయిలోనే పరిష్కారం అవుతాయి. మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండటమే ప్రజా ప్రభుత్వం. మంత్రులు పూర్తి స్వేచ్ఛగా పనిచేస్తున్నారు. గతంలో ఒక్కరే పనిచేసేవారు. ఆయనే ఫోటోలో, ప్రచారంలో ఉండేవారు. ఇప్పుడు మంత్రులంతా ప్రజల్లోనే ఉంటున్నారు. మా పాలనలో పరిపాలన వికేంద్రీకరణ చేశాం. వందరోజులు టార్గెట్‌గా పనిచేస్తున్నాం. -
కనుమరుగు కానున్న 75 ఏళ్లనాటి ఫార్మసీ కౌన్సిల్!
దేశంలో 75 ఏళ్ల నుంచి భారత ఫార్మసీ కౌన్సిల్ (PCI) కనుమరుగు కాబోతోంది. దీని స్థానంలో నేషనల్ ఫార్మసీ కమిషన్‌ను తీసుకురాబోతోంది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఫార్మసీ చట్టం-1948 చట్టాన్ని భర్తీ చేసే నేషనల్ ఫార్మసీ కమిషన్ ముసాయిదా బిల్లు-2023 ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది. నాణ్యమైన ఫార్మసీ విద్యను ఎక్కువ మందికి అందించడం, దేశవ్యాప్తంగా ఫార్మసీ నిపుణుల లభ్యతను పెంచడం ఈ బిల్లు లక్ష్యం. తాజా పరిశోధనలను ఏకీకృతం చేస్తూ ఫార్మసీ నిపుణులు తమ పరిశోధనలను మరింత మెరుగుపరుచుకునేలా, ఉన్నత నైతిక ప్రమాణాలను నిలబెట్టేలా ఈ బిల్లు ప్రోత్సహిస్తుంది. ఫార్మసీ సంస్థల క్రమబద్ధమైన, పారదర్శక తనిఖీలు, జాతీయ ఫార్మసీ రిజిస్టర్ నిర్వహణ, ఎప్పటికప్పుడు వస్తున్న అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకునే వెసులుబాటును కల్పిస్తుంది. దీంతోపాటు ఫిర్యాదుల పరిష్కారానికి సమర్థవంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తుంది. నేషనల్ ఫార్మసీ కమిషన్‌లో చైర్‌పర్సన్‌తోపాటు 13 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు, 14 మంది తాత్కాలిక సభ్యులు ఉంటారు. ఈ కమిషన్ కింద పనిచేసేలా ఫార్మసీ ఎడ్యుకేషన్ బోర్డు, ఫార్మసీ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్, ఫార్మసీ ఎథిక్స్ అండ్ రిజిష్ట్రేషన్ బోర్డులను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. -
తెర వెనుక వైద్యుడు! వ్యాధులను నివారించడంలో వారిదే కీలక పాత్ర!
ఆరోగ్యం పదికాలాల పాటు పదిలంగా ఉండాలంటే అందులో ఫార్మసిస్ట్ పాత్ర అత్యంత ప్రధానం. ప్రపంచవ్యాప్తంగా నానాటికీ పలెరిగిపోతున్న వ్యాధులను దృష్టిలో ఉంచుకొని, దానికి తగినట్లుగా కొత్త మందులను తయారు చేయడం, నివారణా మార్గాలు కనుగొనడంలో ఫార్మసిస్ట్ పాత్ర కీలకం. ఔషధాల తయారీ, వాటి నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షించడం, తగిన సాంకేతిక పరిజ్ఞానంతో ఔషధాలను నిల్వచేయడం, వ్యాధి గ్రస్థులకు మందుల వినియోగ విధానం పట్ల తగిన సూచనలు, సలహాలు అందజేయడం, వాటి దుష్ఫలితాల పట్ల అవగాహన కల్పించడం లాంటి అనేక విషయాల్లో ఫార్మసిస్ట్ పాత్ర విస్మరించలేనిది. వ్యాధిని గుర్తించి, దానికి తగిన మందును సూచించేవాడు వైద్యుడైతే, ఔషధ ఎంపిక, మోతాదు, వినియోగ విధానం సమస్తమూ అవగాహన కల్పించేది ఫార్మసిస్టు. నిజం చెప్పాలంటే తెర వెనుక వైద్యుడు ఫార్మసిస్టే. అందుకే ఆరోగ్యకేంద్రాల్లో అత్యవసర పరిస్థితుల్లో వైద్యాధికారులు అందుబాటులో లేనప్పుడు చికిత్స అందించే బాధ్యత ఫార్మసిస్టులదే. కేంద్ర ఆరోగ్యశాఖ ‘జాతీయ ఆరోగ్య విధానం–2017’ ఫార్మసిస్టులకు సామాజిక ఆరోగ్యంపై శిక్షణ ఇచ్చి వారి సేవలను క్షేత్రస్థాయిలో వినియోగించుకోవాలని సూచించింది. కొన్ని సమయాల్లో వైద్యులు రాసిన మందులను సమీక్షించే అధికారం కూడా ఫార్మసిస్టుకు ఉంటుంది. మందుల వినియోగంలో ఫార్మసిస్టుల పాత్రను విస్మరించడంవల్ల వాటి వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోయింది. తద్వారా అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టి ప్రాణాంతకమైన దుష్ప్రభావాలు సంభవిస్తున్నాయి. జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ లాంటి యూరోపియన్ దేశాల్లో, సౌదీ అరేబియా లాంటి అరబ్ దేశాల్లో ఫార్మసిస్టులకు పెద్దపీట వేస్తారు. ఆ యా దేశాల్లోని వైద్యులు పరీక్షల అనంతరం వ్యాధిని గుర్తించి, ఫలానా వ్యాధి, ఫలానా మందు అని నిర్ధారణ చేస్తారు. ఆ వ్యాధికి ఏ ఔషధం సరిపోతుందో, అది ఏయే సమయాల్లో, ఏ మోతాదులో, ఏ విధంగా వినియోగించాలో ఫార్మసిస్టే రోగికి సూచిస్తాడు. కొన్ని యూరప్ దేశాల్లో రోగి వ్యాధిని గుర్తించి, ఔషధాన్ని సిఫారసు చేసే అధికారం కూడా ఫార్మసిస్ట్దే. కానీ మనదేశంలో పరిస్థితి దీనికి పూర్తి భిన్నం. భారత్‌లో ఫార్మసిస్టులకు సరైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక, సొంత ఫార్మసీలు పెట్టుకొనే స్థోమత లేక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఫార్మసిస్టు పోస్టులను భర్తీ చేయాలి. నిరుద్యోగులైన ఫార్మసిస్టులకు ఫార్మసీలు ఏర్పాటు చేసు కోడానికి వడ్డీ రహిత రుణ సౌకర్యం కల్పించాలి. ఆ విధంగా ఫార్మసిస్ట్‌ల సేవలను మరింతగా ఉపయోగించుకోవచ్చు. – ఎమ్.డి. ఉస్మాన్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్ – కెమిస్ట్ (చదవండి: భారత సంతతి చిన్నారికి అత్యంత అరుదైన కిడ్నీ మార్పిడి..! బ్రిటన్‌లోనే తొలిసారిగా..) -
రాజ్యసభలో తీవ్ర రగడ
న్యూఢిల్లీ: మణిపూర్ అంశంతోపాటు వివాదాస్పద ముఖ్య ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల బిల్లుపై విపక్ష సభ్యులు ఆందోళన, నినాదాలతో గురువారం రాజ్యసభ అట్టుడికింది. మణిపూర్ హింసపై 267 నిబంధన కింద సభలో చర్చ చేపట్టాలని ఇన్నాళ్లూ పట్టుబట్టిన విపక్షాలు కొంత దిగొచ్చాయి. 176 నిబంధన కింద చర్చ ప్రారంభించాలని, ప్రధాని మోదీ సభకు వచ్చిన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి. ప్రధానమంత్రి ఏమైనా దేవుడా? రాజ్యసభ గురువారం ఉదయం ప్రారంభం కాగానే మణిపూర్ వ్యవహారంపై 176 నిబంధన కింద చర్చ కోసం విపక్ష సభ్యులు పట్టుబట్టారు. వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. ప్రధాని మోదీని సభకు రప్పించాలని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ను కాంగ్రెస్ సభ్యుడు మల్లికార్జున ఖర్గే కోరారు. దీనిపై అభ్యంతరం తెలిపిన అధికార బీజేపీ ఎంపీలపై ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రధానమంత్రి ఎందుకు రాకూడదు? ఆయన ఏమైనా దేవుడా?’ అని ప్రశ్నించారు. ఖర్గే వ్యాఖ్యలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో సభను చైర్మన్ ధన్‌ఖడ్ మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేశారు. అనంతరం వివిధ పార్టీల సభాపక్ష నేతలతో ఆయన సమావేశమయ్యారు. సభకు సహకరించాలని కోరారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా విపక్షాల ఆందోళన ఆగలేదు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. రాజ్యసభ కార్యకలాపాలకు కేంద్ర ప్రభుత్వమే అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. ఓబ్రెయిన్ తీరును కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తప్పుపట్టారు. అనంతరం మల్లికార్జన ఖర్గే మాట్లాడారు. అధికార పక్షం వల్లే సభ సజావుగా సాగడం లేదని మండిపడ్డారు. బీజేపీ ఎంపీల వ్యవహార శైలిని ఆక్షేపిస్తూ ఓ కవిత వినిపించారు. ఖర్గే తీరు గురువింద గింజలా ఉందని పీయూష్ గోయల్ ఎద్దేవా చేశారు. ఖర్గే వ్యాఖ్యలను పలువురు బీజేపీ సభ్యులు ఖండించారు. మిజోరాం ఎంపీ ఒకరు మాట్లాడబోతుండగా చైర్మన్ ధన్‌ఖడ్ అనుమతించలేదు. పార్లమెంట్ సభ్యులకు దేశంలో ఏదో ఒక ప్రాంతం ముఖ్యం కాదని, దేశమంతా సమానమేనని ధన్‌ఖడ్ అన్నారు. ఫార్మసీ(సవరణ) బిల్లుకు ఆమోదం వివాదాస్పద ‘చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అదర్ ఎలక్షన్ కమిషనర్స్(అపాయింట్మెంట్ కండీషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్) బిల్లు–2023ను కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు పట్ల ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం విపక్షాల ఆందోళన మధ్యే కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘పోస్ట్ ఆఫీస్ బిల్లు–2023’ను ప్రవేశపెట్టారు. ఈ తర్వాత కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖమంత్రి మన్సుఖ్ మాండవీయా ప్రవేశపెట్టిన ‘ఫార్మసీ(సవరణ) బిల్లు–2023’ సభలో ఆమోదం పొందింది. అనంతరం సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ధన్‌ఖడ్ ప్రకటించారు. -
సహకార సంఘాల్లో ఔషధాల విక్రయం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: వ్యవసాయాధారిత సేవలు అందించే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్)లో ఇకపై ఔషధాలను కూడా విక్రయించాలని కేంద్ర ప్ర భుత్వం నిర్ణయం తీసుకుంది. చౌకగా లభించే జనరిక్ మందులను గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సహకార సంఘాలు రైతులకు పంట రుణాలు, దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలు ఇప్పిస్తున్నాయి. ధాన్యం, ఇతర పంటల కొనుగోలుతోపాటు కొన్ని జిల్లాల్లో పె ట్రోల్ బంక్‌లు, సూపర్మార్కెట్లు, వే బ్రిడ్జిలు కూడా ఈ సంఘాలు నిర్వహిస్తున్నాయి. ఇదే తరహాలో సొసైటీల్లో జనరిక్ మందులను విక్రయించాలని నిర్ణయించారు. జిల్లాకు నాలుగు సంఘాలు ఎంపిక.. రాష్ట్రవ్యాప్తంగా 906 సహకార సంఘాలున్నాయి. ఇందులో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లకు అనుబంధంగా 798 పీఏసీఎస్‌లు ఉండగా, వాణిజ్య బ్యాంకులకు అనుబంధంగా మరో 108 సహకార సంఘాలున్నాయి. కాగా, ప్రయోగాత్మకంగా ఒక్కో జిల్లాకు నాలుగు జన్ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం సూచన మేరకు ఆర్థిక, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు పకడ్బందీగా నిర్వహించే నాలుగు సొసైటీల వివరాలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల సహకార శాఖాధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాల ప్రకారం జిల్లా సహకార శాఖాధికారుల నుంచి ఎంపిక చేసిన సహకార సంఘాల (సొసైటీ) వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందాయి. ఇదిలా ఉంటే సంగారెడ్డి జిల్లానుంచి ఐదు సంఘాల పేర్లు పంపించారు. ఇస్మాయిల్‌ఖాన్‌పేట్, గుమ్మడిదల, ఝరాసంగం, ఏడాకులపల్లి, అందోల్ సహకార సంఘాలు ఇందులో ఉన్నాయి. ఫార్మసీ లైసెన్స్‌లు ఎలా? ఔషధాలు విక్రయించాలంటే ఫార్మసీ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. అయితే సొసైటీల్లో జన్ ఔషధి కేంద్రాలకు ఫార్మసీ లైసెన్సులు ఎలా? అనే అంశంపై ఇంకా మార్గదర్శకాలు రాలేదని సహకారశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఫార్మసిస్టును నియమించుకుని ఈ కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని కొందరు అధికారులు చెబుతున్నారు. -
ఫార్మాసిటీ కోసం ఆలయ భూములా?
సాక్షి, హైదరాబాద్: ఫార్మాసిటీ ఏర్పాటు కోసం వెయ్యి ఎకరాల ఆలయ భూముల సేకరణను హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తప్పుబట్టింది. దేవాదాయ శాఖ భూములను సాగునీటి ప్రాజెక్టుల కోసమే సేకరించాలని గతంలోనే ద్విసభ్య ధర్మాసనం చెప్పిందని, ఇతర అవసరాల కోసం కాదని స్పష్టంచేసింది. భూ సేకరణ, రెవెన్యూ అధికారులకు సంబంధించిన అంశంలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక వసతుల సంస్థ (టీఎస్ఐఐసీ) పిటిషన్ ఎలా దాఖలు చేస్తుందని ప్రశ్నించింది. ద్విసభ్య ధర్మాసనం విచారణ జరపాల్సిన దేవాదాయ భూ సేకరణపై సింగిల్ జడ్జిని ఆశ్రయించడాన్ని తప్పుబట్టింది. రంగారెడ్డి జిల్లా నందివనపర్తి, సింగారంలో ఓంకారేశ్వర స్వామి ఆలయానికి చెందిన 1,022 ఎకరాల భూ సేకరణపై యథాతథస్థితి విధించింది. నీటి ప్రాజెక్టులకు కాకుండా ఇతర ప్రజావసరాలకు ఆలయ భూములు సేకరించవచ్చన్న నిబంధనలు ఏవైనా ఉంటే.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని టీఎస్ఐఐసీ ఎండీ, రెవెన్యూ–దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి, దేవాదాయ శాఖ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయ ఈవోకు నోటీసులు జారీ చేసింది. తాము తదుపరి ఆదేశాలిచ్చే వరకు భూ సేకరణపై ముందుకెళ్లరాదని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 12కు వాయిదా వేసింది. దేవాదాయ భూముల సేకరణకు హైకోర్టు నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో నందివనపర్తి, సింగారం పరిధిలోని ఓంకారేశ్వర స్వామి ఆలయానికి చెందిన 1,022 ఎకరాల భూముల సేకరణ కోసం టీఎస్ఐఐసీ గత నవంబర్‌లో హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. భూ సేకరణకు అనుమతి ఇస్తూ అదే నెలలో ఉత్తర్వులు జారీ చేశారు. భూ సేకరణ చట్ట ప్రకారం భూమిని సేకరించాలని, ఆ వచ్చిన మొత్తం నగదును ఓంకారేశ్వర స్వామి ఆలయ ఖాతాలో జమ చేయాలని ఆదేశించారు. సదరు మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని సింగిల్ జడ్జి చెప్పారు. ద్విసభ్య ధర్మాసనం అనుమతి తప్పనిసరి సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాటిపర్తి గ్రామానికి చెందిన భక్తులు మోతెకాని జంగయ్య, కుర్మిడ్డకు చెందిన దేవోజీ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టి.వినోద్‌కుమార్, జస్టిస్ పుల్ల కార్తీక్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఆలయ భూముల సేకరణకు ద్విసభ్య ధర్మాసనం అనుమతి తప్పనిసరి అని.. సింగిల్ జడ్జిని ఆశ్రయించి ఉత్తర్వులు పొందడం చెల్లదన్నారు. తాగు, సాగు నీటి ప్రాజెక్టులకు మాత్రమే ఆలయ భూములు సేకరించాలని గతంలో డివిజన్ బెంచ్ పేర్కొందన్నారు. భూసేకరణతో ఎలాంటి సంబంధం లేని టీఎస్ఐఐసీ పిటిషన్ ఎలా వేస్తుందని ప్రశ్నించారు. భూ సేకరణను వెంటనే నిలిపివేయాలని, సింగిల్ జడ్జి ఉత్తర్వులను ఆపాలని కోరారు. ఇతర అవసరాలకు సేకరించవచ్చు... ఇతర ప్రజావసరాలకు కూడా దేవాదాయ భూములను సేకరించవచ్చని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. గతంలో దీనికి సంబంధించి పలు తీర్పులు కూడా ఉన్నాయన్నారు. అయితే వివరాలు సమర్పించడానికి కొంత సమయం కావాలని కోరారు. భూములు ఇచ్చేందుకు ఓంకారేశ్వర ఆలయ కమిటీ, దేవాదాయశాఖ అంగీకరించాయని చెప్పారు. ఇందులో ఇతరులకు అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదన్నారు. -
హైదరాబాద్: పలు మెడికల్ షాపుల లైసెన్స్ లు రద్దు
సాక్షి, హైదరాబాద్: నగరంలో మెడికల్ దుకాణాలపై డ్రగ్ కంట్రోల్ విభాగం మెరుపు దాడులు చేసింది. పలు మెడికల్‌షాపుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. అధిక ధరలు, నాణ్యత లేని మందుల అమ్మకాలను గుర్తించిన అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్న పలు మెడికల్ దుకాణాల లైసెన్స్‌లను శాశ్వతంగా, మరికొన్నింటికి తాత్కాలికంగా రద్దు చేశారు. ఇందర్‌బాగ్ కోటిలోని గణేష్ ఫార్మాసూటికల్స్, అంబర్‌పేట బయోస్పియర్ ఎంటర్ప్రైజెస్, నాంపల్లి సర్దార్ మెడికల్ హాల్, అక్షయ మెడికల్ అండ్ జనరల్ స్టోర్, హైదరాబాద్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్(నాంపల్లి), లంగర్‌హౌజ్‌లోని ఆర్ఎస్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్, చార్మినార్ భారత్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్, హుమాయూన్‌నగర్ అల్-హమ్రా మెడికల్ అండ్ జనరల్ స్టోర్.. ఉప్పల్ శ్రీ అయ్యప్ప మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్, గౌలిగూడ గోకుల్ మెడికల్ షాప్, చార్మినార్ మీరా మెడికల్ షాప్, మంగర్బస్తీ లైఫ్ ఫార్మా.. ఇలా పలు మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ చర్యలు తీసుకుంది. వీటిలో కొన్నింటి లైసెన్స్‌లను తాత్కాలికంగా, మరికొన్నింటిని లైసెన్స్‌లను శాశ్వతంగా రద్దు చేసింది. ఇదీ చదవండి: గట్టు కోసం గొడళ్లతో గొడవ -
ఎస్జీడీ ఫార్మా, కార్నింగ్‌తో తెలంగాణ ఒప్పందం
ఫార్మాస్యూటికల్ ప్యాకేజింగ్ రంగంలో అంతర్జాతీయంగా పేరొందిన ఎస్జీడీ ఫార్మాతోపాటు మరో దిగ్గజ సంస్థ కార్నింగ్ ఇన్కార్పొరేటెడ్తో భవిష్యత్తు భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ద్వారా ప్రపంచస్థాయి సాంకేతికత, తయారీ నైపుణ్యం తెలంగాణకు అందుతుందని పేర్కొంది. అలాగే కారి్నంగ్ అందించే అత్యున్నత నాణ్యతతో కూడిన ఫార్మాస్యూటికల్ ట్యూబ్ టెక్నాలజీ, ఎస్జీడీ ఫార్మా గ్లాస్ వైల్ తయారీ నైపుణ్యాల కలబోతకు ఈ భాగస్వామ్యం దోహదం చేస్తుందని వివరించింది. తద్వారా ఎస్జీడీ ఫార్మాస్యూటికల్ సామర్థ్యం ప్రైమరీ ప్యాకేజింగ్ భారత్‌తోపాటు అంతర్జాతీయ వినియోగదారులకు తెలంగాణ నుంచి సరఫరా అవుతుందని ప్రభుత్వం పేర్కొంది. ప్రైమరీ ప్యాకేజింగ్ రంగంలో కార్నింగ్, తెలంగాణ ప్రభుత్వంతో తాము కుదుర్చుకొనే భాగస్వామ్యం ద్వారా ప్రైమరీ ప్యాకేజింగ్ సప్లై చైన్‌లో తెలంగాణ పురోగమిస్తుందని ఎస్జీడీ ఫార్మా ఎండీ అక్షయ్ సింగ్ వెల్లడించారు. ఈ భాగస్వామ్యం ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలో సుమారు రూ.500 కోట్ల పెట్టుబడి, 150 మందికి శాశ్వత ఉద్యోగాలు, మరో 300 మందికి కాంట్రాక్టు ప్రాతిపదికన 2024 ఆరంభం నాటికి లభిస్తాయి. ఎస్జీడీతో తమ భాగస్వామ్యం ద్వారా కీలకమైన ఔషధాల సరఫరా వేగవంతం అవుతుందని కారి్నంగ్ ఇండియా ఎండీ సు«దీర్ పిళ్లై అన్నారు. ఫార్చూన్ 500 కంపెనీల జాబితాలో ఉన్న కారి్నంగ్... ఎస్జీడీ ఫార్మా భాగస్వామ్యంలో తెలంగాణలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన యూనిట్ ఏర్పడుతుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. తెలంగాణలో ఫార్మాస్యూటికల్ ప్యాకేజింగ్ గ్లాస్ తయారీ ద్వారా లైఫ్ సైన్సెస్ రంగం వృద్ధి శరవేగంగా జరుగుతుందని చెప్పారు. 2030 నాటికి లైఫ్ సైన్సెస్ రంగం విలువ 250 అమెరికన్ డాలర్లకు చేరాలని... తమ భవిష్యత్తు లక్ష్యానికి ఈ భాగస్వామ్యం దోహదం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
‘ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్’గా భారత్
సాక్షి, హైదరాబాద్: వినియోగదారులకు నాణ్యతతో కూడిన ఫార్మా ఉత్పత్తులను అందిస్తామనే భరోసా ఇచ్చి ‘ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్’గా భారతదేశం కీర్తికెక్కిందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా వెల్లడించారు. ‘ఔషధాలు: నాణ్యతా నిబంధనల అమలు’పై కేంద్ర సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్, కేంద్ర రసాయన, ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుబాతో కలిసి రెండ్రోజుల చింతన్ శిబిర్‌ను మాండవీయ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఫార్మా, ఆరోగ్య రంగాలలోని వాటాదారులు, లబ్ధిదారులందరికీ పటిష్టమైన నియంత్రణ వ్యవస్థలను నిర్మించడానికి, అందుకు సంబంధించిన విధానాల కోసం మార్గాలను చర్చించడానికి చింతన్ శిబిర్ ఒక వేదికన్నారు. -
బెల్ట్‌తో కొట్టుకుంటూ బర్త్ డే.. అర్ధరాత్రి ఆసుపత్రిలో విద్యార్థుల రచ్చ!
లక్నో: పుట్టిన రోజు వేడుకల పేరుతో వికృత చేష్టలకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. అలాంటి సంఘటనే ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలో వెలుగు చూసింది. సివిల్ ఆసుపత్రిలో ఆదివారం అర్ధరాత్రి బర్త్ డే పార్టీ నిర్వహించారు పలువురు ఫార్మసీ విద్యార్థులు. బెల్టుతో కొట్టుకుంటూ, అరుస్తూ రచ్చ రచ్చ చేశారు. సుమారు గంట సమయం పాటు ఆసుపత్రి ప్రాంగణం గోల గోలగా మారిపోయింది. రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆరోగ్య శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి బ్రజేశ్ పతక్.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తు చేపట్టి కారకులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైరల్ వీడియో తన దృష్టికి వచ్చిందని, దర్యాప్తు చేపట్టామని సివిల్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ఆనంద్ ఓజా తెలిపారు. ‘వీడియోలోని వ్యక్తులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.’ అని తెలిపారు. #WATCH | UP: Visuals of the birthday party celebrations by pharmacy students inside the civil hospital of Lucknow which has attracted the attention of senior authorities initiating an enquiry into the matter; strict action against those found guilty of disrupting hospital peace pic.twitter.com/EJ94y3waoO — ANI UP/Uttarakhand (@ANINewsUP) August 8, 2022 ఇదీ చదవండి: Viral: 16 ఏళ్ల బాలుడి ముక్కు కొరికేసిన రాజకీయ నేత.. అంత కోపం దేనికో? -
ఐఐటీ–మద్రాస్ అత్యుత్తమం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో అత్యుత్తుమ విద్యా సంస్థల జాబితాలో ఐఐటీ–మద్రాస్ వరసగా నాలుగో ఏడాది తొలి స్థానంలో నిలిచింది. ఉత్తమ విశ్వవిద్యాలయాల విభాగంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)–బెంగళూరు తొలి స్థానం దక్కించుకుంది. ఫార్మసీ విభాగంలో నైపర్–హైదరాబాద్ రెండో ర్యాంకు, న్యాయ విద్యలో హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా నాలుగో ర్యాంకు సాధించాయి. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) కింద 11 విభాగాల్లో ర్యాంకుల జాబితాను కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం విడుదల చేశారు. 2016 నుంచి కేంద్ర విద్యా శాఖ ఈ ర్యాంకులను ప్రకటిస్తోంది. విశ్వవిద్యాలయాల విభాగంలో ఉస్మానియా యూనివర్సిటీకి 22వ ర్యాంకు, ఆంధ్ర యూనివర్సిటీ 36వ ర్యాంకు లభించింది. టాప్–100 ఇంజనీరింగ్ కాలేజీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 9 కాలేజీలున్నాయి. టాప్–100 ఫార్మసీ కాలేజీల్లో రెండు రాష్ట్రాలకు చెందిన 15 కాలేజీలున్నాయి. పరిశోధన విభాగంలో ఐఐటీ–హైదరాబాద్ 12వ ర్యాంకు సాధించింది. మెడికల్ విభాగంలో 50 ర్యాంకులు ప్రకటించగా తెలంగాణ, ఏపీలోని కళాశాలలకు స్థానం దక్కలేదు. ఓవరాల్ ర్యాంకింగ్ ఐఐటీ–మద్రాస్ (87.59 స్కోరు) తొలిస్థానంలో నిలవగా, 83.57 స్కోరుతో ఐఐఎస్సీ–బెంగళూరు రెండోస్థానంలో 82.35 స్కోరుతో ఐఐటీ–బాంబే మూడో స్థానంలో నిలిచాయి. ఐఐటీ–హైదరాబాద్ 62.86 స్కోరుతో 14వ ర్యాంకు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 59.67 స్కోరుతో 20వ ర్యాంకు, ఎన్ఐటీ–వరంగల్ 50.61 స్కోరుతో 45వ ర్యాంకు, ఉస్మానియా యూనివర్సిటీ 50.60 స్కోరుతో 46వ ర్యాంకు సాధించాయి. కాలేజీల విభాగంలో ఆంధ్రా లయోలా కాలేజ్ (విజయవాడ) 52.38 స్కోరుతో 94వ ర్యాంకు సాధించింది. ఇంజినీరింగ్ ఐఐటీ మద్రాస్ 90.94 స్కోరుతో తొలిస్థానం, ఐఐటీ న్యూఢిల్లీ 88.12 స్కోరుతో రెండో స్థానం, ఐఐటీ బాంబే 83.96 స్కోరుతో మూడో స్థానంలో నిలిచాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐఐటీ హైదరాబాద్ 68.03 స్కోరుతో తొమ్మిదో స్థానం, ఎన్ఐటీ వరంగల్ 60 స్కోరుతో 21వ ర్యాంకు, కేఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ 44వ ర్యాంకు, ఐఐటీ తిరుపతి 48.16 స్కోరుతో 56వ ర్యాంకు, ఐఐఐటీ–హైదరాబాద్ 46.41 స్కోరుతో 62వ ర్యాంకు, జేఎన్టీయూ–హైదరాబాద్ 42.77 స్కోరుతో 76వ ర్యాంకు సాధించాయి. మేనేజ్మెంట్ ఐఐఎం–అహ్మదాబాద్ 83.35 స్కోరుతో తొలి ర్యాంకు, ఐఐఎం–బెంగళూరు 82.62 స్కోరుతో 2వ ర్యాంకు, ఐఐఎం–కలకత్తా 78.64 స్కోరుతో మూడో ర్యాంకు సాధించాయి. ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్–హైదరాబాద్ 54.88 స్కోరుతో 32వ ర్యాంకు, ఐఐఎం–విశాఖపట్నం 54.36 స్కోరుతో 33వ ర్యాంకు, కేఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 51.27 స్కోరుతో 47వ ర్యాంకు సాధించాయి. ఫార్మసీ జామియా హమ్దర్ద్–న్యూఢిల్లీ 79.50 స్కోరుతో తొలి ర్యాంకు, నైపర్–హైదరాబాద్ 79.46 స్కోరుతో రెండో ర్యాంకు సాధించగా, హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ 47.38 స్కోరుతో 44వ ర్యాంకు సాధించింది. -
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్ ఫార్మసీలు బంద్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ప్రైవేట్ మందుల దుకాణాలను ఎత్తివేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ప్రభుత్వమే ఉచితంగా మందులు ఇస్తున్నప్పుడు వీటిని ఎందుకు కొనసాగించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో బోధనాసుపత్రులు, జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లోని ప్రైవేట్ ఔషధ దుకాణాలను ఎత్తివేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో వాటిని ఏర్పాటు చేసిన యాజమాన్యాల నుంచి రాజకీయ ఒత్తిడి పెరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఖాళీ చేయబోమని చెబుతున్నట్లు తెలిసింది. అవసరమైతే కోర్టులకు వెళ్లి ఖాళీ చేయించకుండా స్టే తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తామన్నట్లు సమాచారం. అయితే చట్టపరమైన చిక్కులు తలెత్తకుండా వీటిని ఎలా ఖాళీ చేయించాలన్న దానిపై వైద్య, ఆరోగ్యశాఖ కసరత్తు ప్రారంభించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ మందుల దుకాణాలను ఎత్తి వేయాల్సిందేనని మంత్రి హరీశ్‌రావు.. అధికారులకు హుకుం జారీచేశారు. దీంతో తొలగింపునకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ప్రైవేట్ దుకాణాలను ఎత్తివేయడమే కాకుండా.. తక్షణమే అన్ని ఆసుపత్రుల్లో ఉచితంగా అన్ని రకాల మందులు, అవసరమైనన్ని సరఫరా చేయాలని కూడా వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. రోగులు ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది. రోజుకు రూ.లక్షల విక్రయాలు.. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేదలకు ఉచిత వైద్య సేవలు, చికిత్స అందించాలి. ఉచిత వైద్య పరీక్షలు చేయడంతోపాటు ఉచితంగా మందులు ఇవ్వాల్సిన బాధ్యత సర్కారు ఆసుపత్రులపై ఉంది. దీనికోసం ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) మొదలు బోధనాసుపత్రుల వరకు అన్నింటికీ ప్రభుత్వమే ఉచితంగా మందులను సరఫరా చేస్తుంది. దీనికి ప్రభుత్వం మూడేళ్లుగా రూ.330 కోట్ల చొప్పున కేటాయించగా, ఈ ఏడాది రూ.500 కోట్లు కేటాయించింది. అయితే అనేక ఏరియా, జిల్లా, బోధనాసుపత్రుల్లోని ప్రాంగణాల్లో ప్రైవేట్ మెడికల్ షాపులకు కొన్నేళ్ల క్రితం ప్రభుత్వం అనుమతి ఇచ్చిం ది. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ వంటి బోధనాసుపత్రుల్లో అయితే రోజుకు రూ.ల క్షల విలువైన మందుల విక్రయాలు జరు గుతున్నాయి. ఇలా వాటిని నెలకొల్పిన యాజమాన్యాలు నెలకు కోట్లు గడిస్తున్నాయి. ఉచిత మందులున్నా.. అనేక మంది డా క్టర్లు రోగులకు ఆయా ఆసుపత్రుల్లోని ప్రైవే ట్ మెడికల్ షాపుల వద్ద ఉన్న మందులే రాస్తున్నారు. బ్రాండెడ్ మందులే మంచి వన్న భావనను కల్పిస్తున్నారు. అంతేగాక కొన్ని ఆసుపత్రుల్లో కోర్సు ప్రకారం వాడా ల్సిన రోజులకు కాకుండా, తక్కువ రోజులకే మందులు ఇస్తున్నారు. ఉదాహరణకు నెల రోజులకు డాక్టర్ మందులు రాసిస్తే, వారంపది రోజులకే ఉచితంగా ఇస్తున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో సరిపడా మందులు ఉండని పరిస్థితి. మరికొన్నిచోట్ల ఒక మం దు ఉంటే మరోటి ఉండదు. ఇలాంటి కార ణాలతో పేదలు ఆయా ఆసుపత్రుల్లోని ప్రైవేట్ మందుల దుకాణాల్లో కొంటున్నా రు. ఇక కొన్ని ఏరియా, జిల్లా ఆసు పత్రు ల్లోనూ ప్రైవేట్ జనరిక్ మందుల దుకా ణా లను నెలకొల్పారు. వాటిల్లోనూ పేదలు డ బ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుండటంతో ప్రైవేట్ ఔషధ దుకాణాలను ఖాళీ చేయించాలని సర్కార్ నిర్ణయించింది. ‘ప్రైవేట్’లో కొనుక్కోమని రాసిస్తే చర్యలు.. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ప్రైవేట్ ఔషధ దుకాణాలను ఎత్తివేయాలన్న మంత్రి హరీశ్ ఆదేశాల మేరకు చర్యలు చేపడుతున్నాం. ప్రభుత్వమే ఉచితంగా మందులు ఇస్తున్నప్పుడు ప్రైవేట్ మెడి కల్ షాపుల అవసరం ఏముంటుంది?. ఎక్కడైనా ప్రభుత్వ డాక్టర్లు ఉచి త మం దులు ఇవ్వకుండా ప్రైవేట్‌లో కొ నుక్కో మని రాసిస్తే చర్యలు తీసుకుంటాం. –డాక్టర్ అజయ్‌కుమార్, కమిషనర్ -
ఆఫీసుకు రోజూ గుర్రంపై వెళ్తున్న ఉద్యోగి..
-
ఆఫీసుకు రోజూ గుర్రంపై వెళ్తున్న ఉద్యోగి.. ఎందుకో తెలుసా?
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి వల్ల ఆంక్షల నేపథ్యంలో ఇంధన ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో బైక్‌ను వినియోగించడం కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ఓ ఫార్మసీ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఉద్యోగి ప్రతిరోజూ గుర్రం మీద తన కార్యాలయానికి వెళ్తున్నాడు. ఔరంగాబాద్‌లో డీజిల్ ధర రూ.100కు కొన్ని పైసలు తక్కువగా ఉండగా, పెట్రోల్ ధర లీటర్‌కు రూ.115 దాటింది. ఆదివారం లీటర్ పెట్రోల్ ధర 50 పైసలు, లీటర్ డీజిల్ ధర 55 పైసలు పెరిగింది. ఈ నేపథ్యంలో షేక్ యూసుఫ్ తన బైక్‌ను పక్కనపెట్టి తన ఇంటి నుంచి 15 కి.మీ. దూరంలో ఉన్న తన కార్యాలయానికి గుర్రంపై స్వారీ చేస్తూ వెళ్తున్నాడు. అంతకుముందు లాక్డౌన్ సమయంలో ప్రాక్టీస్ చేసినట్లు చెప్పాడు. ‘లాక్డౌన్ తర్వాత గ్యారేజీలు చాలాకాలం పాటు మూసివేసి ఉన్నాయి. దీంతో బైక్‌ను మెయింటెన్ చేయడం సమస్యగా మారింది. కాబట్టి నేను నా వాహనాన్ని పక్కనపెట్టి కతియావాడి గుర్రాన్ని కొనాలని నిర్ణయించుకున్నాను. రోజూ 30 కి.మీ. ప్రయాణం చేస్తా. పలు కుటుంబ ఫంక్షన్లకు కూడా గుర్రం మీదే వెళ్తా. అంతేకాదు గుర్రం మీద ప్రయాణ చేయడం బైక్ మీద వెళ్లడం కంటే చాలా చవక’ అని యూసుఫ్ చెప్పుకొచ్చాడు. చదవండి: ప్రతి ఆదివారం ఈ రోడ్లకు సెలవు.. నేటి నుంచే అమలు! -
డ్రగ్ ఇన్స్పెక్టర్ల దందా! డీల్ కుదిరితే ఒకే.. లేదంటే..
‘మరో సందర్భంలో ఆపరేషన్ జరుగుతుండగా ఓ డ్రగ్ ఇన్స్పెక్టర్ నేరుగా తలుపులు తోసుకుంటూ లోనికివెళ్లాడు. మీ ఫార్మసీలో ఫార్మసిస్ట్ లేడు. ఇది నిబంధనలకు విరుద్ధం. దీన్ని మూసేస్తాం. రేపు మీ ఆసుపత్రి గురించి మీడియాలో వస్తుంది’ అంటూ హెచ్చరికలు. ‘మీ ఫార్మసీలో ఎయిర్ కండిషన్ (ఏసీ) నిర్దేశించిన ప్రమాణాల కంటే తక్కువగా పెట్టారు. మీ ఆసుపత్రిలో ఉన్న మందుల దుకాణాన్ని మూసేస్తున్నాం’ అంటూ పేషెంట్లను చెకప్ చేస్తున్న వైద్యునికి డ్రగ్ ఇన్స్పెక్టర్ బెదిరింపు. సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో డ్రగ్ ఇన్స్పెక్టర్లు ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాలను, ప్రైవేటు వైద్యులను బెదిరిస్తున్న తీరు పై విధంగా ఉంది. డ్రగ్ ఇన్స్పెక్టర్ల ఆగడాలు రోజురో జుకూ శృతి మించుతున్నాయి. ఫార్మసీల్లో తనిఖీల పేరిట ఏకంగా వైద్యులపై బెదిరింపులకు దిగుతున్నారు. ఆసుపత్రి పరువు పోతుందని భయపెట్టి యాజమన్యాలు, వైద్యుల వద్ద అందినకాడికి దండుకుంటున్నారు. కొన్నినెలలుగా అడ్డూ అదుపు లేకుండా సాగుతున్న వీరి ఆగడాలకు అనేక ప్రైవేటు ఫార్మసీ, ఆసుపత్రి యాజమాన్యాలు బెంబేలెత్తిపోతున్నా యి. ఫార్మసీని మూసేస్తారన్న విషయం లోకానికి తెలిస్తే.. ఆసుపత్రి ప్రతిష్ట బజారున పడుతుందన్న సున్నితమైన అంశాన్ని ఆధారంగా చేసుకుని ఒక్కో యాజమాన్యం నుంచి రూ.50 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు వసూలు చేస్తున్నారని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ ఆసుపత్రి నిర్వాహకుడు వాపోయాడు. ఇలా ఇప్పటిదాకా పదుల సంఖ్యలో ఆసుపత్రుల యజమానులను, వైద్యులను బెదిరించి డబ్బులు వసూలు చేశారని సమాచారం. ఆకాశ రామన్న లెటర్ ఆయుధంగా..! విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ముందుగా డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఫార్మసీ షాపులు అటాచ్గా ఉన్న ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ► ఉమ్మడి జిల్లాలో ఈ తరహాలో దాదాపు 600 వరకు ఆసుపత్రులు ఉన్నాయి. ► సదరు ఫార్మసీల్లో అనేక లోపాలు ఉన్నాయని, నిర్దేశిత ప్రమాణాల మేరకు మందులు లేవని, జనరిక్ మందులు విక్రయిస్తున్నారని, బ్రాండెడ్ పేరిట నకిలీ మెడిసిన్ అమ్ముతున్నారని, పీసీడీ మందులు, శాంపిల్ మందులు సేల్ చేస్తున్నారంటూ ఓ ఆకాశరామన్న ఉత్తరం వీరికి పోస్టు ద్వారా అందుతోంది. ► ఇది ఎవరు రాస్తున్నారో తెలియదు. ఇది మరునాడు వారి ఆఫీసుకు చేరగానే వెంటనే రంగంలోకి దిగిపోతున్నారు. ► వస్తూనే ఫార్మసీలోని లోపాలను ఎత్తిచూపుతారు. ఆ తరువాత దాని యజమానిని పిలిపించి నిబంధనల మేరకు చర్యలు చేపట్టాలి. ► కానీ.. వీరు ఇక్కడే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నా రు. నేరుగా ఆసుపత్రిలో రోగులను పరీక్షిస్తున్న వైద్యుల వద్దకు వెళ్తున్నారు. ఆసుపత్రి యాజమాన్యాన్ని పిలిపించాలని, ఆసుపత్రిపై చర్యలు తీసుకుంటామని, మీడియాలో వేయిస్తామంటూ నానా యాగీ చేస్తున్నారు. దీంతో ఆసుపత్రి యా జమాన్యం వారి లోపాలు బయటపడకుండా అడిగినకాడికి ఇచ్చి వారిని బయటికి పంపిస్తున్నారు. ఐఎంఏ జోక్యంతో దిగివచ్చిన వైనం.. ఇటీవల అన్ని అనుమతులు, నిబంధనలు పాటిస్తున్న దాదాపు 15 ఆసుపత్రుల్లోనూ ఇదే విధంగా డబ్బులు వసూలు చేయడం, బెదిరింపులకు దిగడంతో వైద్యులు తీవ్రంగా పరిగణించారు. ఈ విషయాన్ని నేరుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) దృష్టికి తీసుకెళ్లారు. ఫార్మసీలు, ఆసుపత్రిలో లోపాలు ఉంటే దానికి ప్రైవేటు వైద్యులపై బెదిరింపులకు దిగడం, డబ్బులు కావాలని వేధించడం ఏంటని వాపోయారు. దీంతో ఐఎంఏ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ డా.బీఎన్‌రావు సదరు డ్రగ్ ఇన్స్పెక్టర్లను నిలదీశారు. ఫార్మసీలో లోపాలు ఉంటే.. వైద్యులపై ప్రతాపం చూపడం.. డబ్బులు వసూలు చేయడం ఏంటని అడిగారు. వైద్యులను బెదిరిస్తే సహించేది లేదు ఆసుపత్రుల్లో లోపాలు, ఫార్మసీల్లో లోపాలు ఉంటే నిబంధనల మేరకు చర్యలు చేపట్టాలి. వీటిపై సందేహాలుంటే సదరు యజమానులతో మాట్లాడాలి. అంతే తప్ప రోగులను పరీక్షిస్తున్న వైద్యుల గదుల్లోకి రావడం, ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్లు జరుగుతుండగా చొచ్చుకుపోవడాన్ని ఐఎంఏ తీవ్రంగా పరిగణిస్తుంది. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే సహించేది లేదు. – డా.బీఎన్. రావు, ఐఎంఏ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం ఆసుపత్రి పేరు మీద ఉన్న సబ్సిడీ మీద వచ్చే మందులు ఇన్‌పేషెంట్లకే ఇవ్వాలి. వాళ్ల మెడికల్ షాపుల్లో విక్రయించకూడదు. ఇలాంటి అక్రమాలపై వైద్యులను ప్రశ్నించేందుకు డ్రగ్ ఇన్స్పెక్టర్లకు వీలుంది. నిలువ చేసేందుకు లైసెన్సు లేకుండా మందులు స్టోర్‌లో ఉంచడం నేరం. అలాంటి స్టోర్లను తనిఖీ చేసే అధికారం డ్రగ్ ఇన్స్పెక్టర్లకు ఉంది. ఇవి కాకుండా ఓపీలో వైద్యులను, ఆపరేషన్ థియేటర్లలో వైద్యులను ఇబ్బంది పెట్టడం తప్పు. అలాంటి ఫిర్యాదులు ఇంతవరకూ రాలేదు. వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – విజయ్‌గోపాల్, అస్టిస్టెంట్ డైరెక్టర్, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా -
23 నుంచి ఏపీ ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీ ఈఏపీసెట్) బైపీసీ స్ట్రీమ్ మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. బీటెక్ బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, బీఫార్మసీ, ఫార్మాడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. జనవరి 3న సీట్లు కేటాయించనున్నారు. అదే నెల 6లోగా విద్యార్థులు కళాశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. నీట్ కౌన్సెలింగ్ జరగనందున బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ (బీవీఎస్సీ), అగ్రికల్చర్ బీఎస్సీకి కౌన్సెలింగ్ నిర్వహించడం లేదు. కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇలా.. ► అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు: డిసెంబర్ 23 నుంచి 25 వరకు ► ధ్రువపత్రాల పరిశీలన ఆన్లైన్, ఆఫ్‌లైన్ (హెల్ప్‌లైన్ సెంటర్స్): డిసెంబర్ 27 నుంచి 29 వరకు ► ఆప్షన్ల నమోదు: డిసెంబర్ 28 నుంచి 30 వరకు ► ఆప్షన్ల సవరణ: డిసెంబర్ 31 ► సీట్ల కేటాయింపు: జనవరి 3, 2022 ► సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజీల్లో రిపోర్టింగ్: జనవరి 4 నుంచి 6 వరకు. -
ప్లిప్ కార్ట్‌లో స్మార్ట్ఫోన్లే కాదు..మెడిసిన్ కూడా కొనుగోలు చేయొచ్చు
ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ తాజాగా హెల్త్‌కేర్ రంగంలోకి ప్రవేశించింది. ఫ్లిప్‌కార్ట్ హెల్త్+ సర్వీసులు ఆవిష్కరించింది. ఈ క్రమంలో కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న ఆన్లైన్ ఫార్మసీ సేవల సంస్థ సస్తాసుందర్ మార్కెట్‌ప్లేస్ లిమిటెడ్‌లో (ఎస్ఎంఎల్) మెజారిటీ వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ ఎంతన్నది వెల్లడి కాలేదు. ఈ సంస్థ ఆన్లైన్ ఫార్మసీ, డిజిటల్ హెల్త్‌కేర్ ప్లాట్‌ఫాం సస్తాసుందర్‌డాట్‌కామ్‌ను నిర్వహిస్తోంది. నాణ్యమైన వైద్య సేవలను చౌకగా అందించేందుకు ఫ్లిప్‌కార్ట్ హెల్త్+ తోడ్పడగలదని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈ–ఫార్మసీతో మొదలుపెట్టి ఈ–డయాగ్నోస్టిక్స్, ఈ–కన్సల్టేషన్ వంటి కొత్త హెల్త్‌కేర్ సర్వీసులు క్రమంగా అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్ హెల్త్+ కార్యకలాపాలను సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజయ్ వీర్ యాదవ్ పర్యవేక్షిస్తారు. తమకు దేశవ్యాప్తంగా ఉన్న కార్యకలాపాలు, సాంకేతిక సామర్థ్యాలు..హెల్త్–టెక్నాలజీ రంగంలో వినియోగదారులకు సర్వీసులు అందించడంలో సస్తాసుందర్‌కు ఉన్న అనుభవం ఫ్లిప్‌కార్ట్ హెల్త్+కు తోడ్పడగలవని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో ఆరోగ్యంపై శ్రద్ధ మరింతగా పెరిగిందని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రవి అయ్యర్ తెలిపారు. చౌకగా హెల్త్‌కేర్‌కు డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో సస్తాసుందర్‌డాట్‌కామ్ ద్వారా ఈ విభాగంలో అవకాశాలు అందిపుచ్చుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 2013లో ప్రారంభం.. బీఎల్ మిట్టల్, రవి కాంత్ శర్మ 2013లో సస్తాసుందర్‌ను ప్రారంభించారు. దీనికి 490 పైచిలుకు ఫార్మసీల నెట్వర్క్ ఉంది. జపాన్‌కు చెందిన దిగ్గజాలు మిత్సుబిషి కార్పొరేషన్, రోటో ఫార్మా మొదలైనవి ఇందులో ఇన్వెస్ట్ చేశాయి. ప్రస్తుతం సస్తాసుందర్ వెంచర్స్ అనుబంధ సంస్థ ఎస్‌హెచ్‌బీఎల్ (సస్తాసుందర్ హెల్త్‌బడ్డీ) .. ఎస్‌ఎంఎల్‌లో తనకున్న వాటాలు విక్రయిస్తోంది. 2021 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎస్ఎంఎల్ స్టాండెలోన్ టర్నోవరు రూ. 2.58 కోట్లుగాను, నికర విలువ రూ. 4.17 కోట్లుగాను నమోదయ్యాయి. కస్టమర్లకు సులభతరంగా, సౌకర్యవంతంగా నిఖార్సయిన ఔషధాలు, వైద్యపరీక్షలు తదితర సర్వీసులు అందించేందుకు వినూత్న ఆవిష్కరణలపై దృష్టి పెడుతున్నామని సంస్థ వ్యవస్థాపకులు బీఎల్ మిట్టల్, రవి కాంత్ శర్మ తెలిపారు. చదవండి: ఆంధ్రప్రదేశ్‌లో అమెజాన్ డెలివరీ స్టేషన్, ఎక్కడంటే.. -
ఇంజనీరింగ్, ఫార్మసీలో 1.45 లక్షల సీట్లు
సాక్షి, అమరావతి: ఏపీఈఏపీ సెట్లో అర్హత సాధించిన విద్యార్థులు ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానుంది. వెబ్ కౌన్సెలింగ్‌కు కాలేజీల్లోని కోర్సులవారీగా సీట్ల సంఖ్యను ప్రభుత్వం సోమవారం ఖరారు చేసింది. ఈ మేరకు వేర్వేరు జీవోలను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర విడుదల చేశారు. తొలిసారిగా యూనివర్సిటీల కాలేజీలు, ప్రైవేటు అన్ ఎయిడెడ్ కాలేజీలతో పాటు ప్రైవేటు యూనివర్సిటీల్లోని 35 శాతం సీట్లు కూడా కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తున్నారు. 2021–22 విద్యా సంవత్సరంలో తొలి విడత కౌన్సెలింగ్‌కు 1,45,421 ఇంజనీరింగ్, ఫార్మసీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో అత్యధికం కంప్యూటర్ సైన్సు విభాగంలో ఉన్నాయి. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ (ఈసీఈ), మెకానికల్, కెమికల్, సివిల్ వంటి కోర్ సబ్జెక్టులకు సంబంధించినవి ఉన్నాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులకు సంబంధించి మొత్తం 435 కాలేజీలు ఈసారి కౌన్సెలింగ్‌లో ఉన్నాయి. నేటినుంచి వెబ్ ఆప్షన్లు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 5వ తేదీ వరకు ఆప్షన్లను నమోదు చేయవచ్చు. 6వ తేదీన మార్పులు చేసుకోవచ్చు. 10వ తేదీన తొలి విడత సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్ధులు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడంతో పాటు సంబంధిత కాలేజీల్లో ఈనెల 15వ తేదీలోపు చేరాలి. అదే రోజు నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. -
ఏపీ: ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
సాక్షి, విజయవాడ: ఏపీలో ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంజినీరింగ్, ఫార్మసీ అడ్మిషన్లు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. దీని ప్రకారం.. ఈ నెల 25 నుంచి 30 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫీజుల చెల్లింపుకు అవకాశం ఉంది. 26 నుంచి 31 వరకు అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలించనున్నారు. నవంబర్ 1నుంచి 5 వరకు వెబ్ ఆప్షన్లు అవకాశం కల్పించారు. వెబ్ ఆప్షన్ల మార్పులకు నవంబర్ 6 వరకు అవకాశం ఉంది. నవంబర్ 10న ఇంజనీరింగ్, ఫార్మసీ సీట్ల కేటాయించగా.. నవంబర్ 10 నుంచి నవంబర్15 వరకు కాలేజీల్లో రిపోర్టింగ్‌కు అవకాశం కల్పించారు. ఇక నవంబర్ 15 నుంచి ఇంజనీరింగ్, ఫార్మసీ తరగతులు ప్రారంభం కానునున్నాయి. -
ఏపీఈఏపీ సెట్ ఫలితాలను విడుదల చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్
-
ఏపీఈఏపీ సెట్ ఫలితాలు విడుదల
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలోని అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీఈఏపీ సెట్ బైపీసీ స్ట్రీమ్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. మంగళగిరిలోని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 92.85 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాది 80.62 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. రేపటి నుంచి ర్యాంకు కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని మంత్రి సురేష్ తెలిపారు. మొదటి ర్యాంకు- చందం విష్ణు వివేక్(తూర్పుగోదావరి- కోరుకొండ) రెండో ర్యాంకు- శ్రీనివాస కార్తికేయ(అనంతపురం) మూడో ర్యాంకు- బొల్లినేని విశ్వాస్‌రావు(హన్మకొండ) (ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Andhra Pradesh: ‘స్కిల్’ఫుల్ కోర్సులు ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ -
నాలుగేళ్ల ప్రేమ.. ప్రియుడికి మరొకరితో పెళ్లి నిశ్చయం.. దీంతో..
సాక్షి, మద్దిరాల (సూర్యాపేట) : ప్రేమ విఫలమై ఓ యువతి బలవన్మరణానికి పాల్పడడంతో మండల పరిధిలోని ముకుందాపురంలో విషాదం అలుముకుంది. స్థానికులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ముకుందాపురం గ్రామానికి చెందిన గాడ్దుల రామచంద్రు, లక్ష్మమ్మ దంపతుల నాలుగో కుమార్తె ఉమ(22) హైదరాబాద్‌లో బీ ఫార్మసీ చదువుతోంది. లాక్డౌన్ కావడంతో స్వగ్రామం వచ్చింది. నాలుగేళ్లుగా అదే గ్రామానికి చెందిన నర్సింగ్ ఉమేష్, ఉమ ప్రేమించుకుంటున్నారు. కాగా, ఉమేష్‌కు మరో యువతితో కుటుంబ సభ్యులు వివాహం నిశ్చయించారని తెలుసుకుని మనస్తాపానికి గురైంది. దీంతో సోమవారం హైదరాబాద్‌కు వెళ్లింది. గదిలో ఒంటరిగా ఉంటున్న ఉమ ప్రేమ విఫలమైందన్న దిగులుతో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున యువతి తలుపు తీయకపోవడంతో ఇంటి యజమాని చూసి ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులకు సమాచారం అందజేసినట్లు తెలిపారు. చదవండి: బుల్లెట్ కోసం టెక్కీ ఆత్మహత్య -
ఎంసెట్ ఇక ఈఏపీసెట్
సాక్షి, అమరావతి: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ సహా పలు ప్రొఫెషనల్ యూజీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శనివారం ప్రకటించారు. ఇంజినీరింగ్ తదితర కోర్సులకు ఇంతకు ముందు ఏపీ ఎంసెట్ నిర్వహించేవారు. మెడికల్ కోర్సుల ప్రవేశాలకు జాతీయ స్థాయిలో ‘నీట్’ నిర్వహిస్తుండటంతో మెడికల్ విభాగాన్ని ఎంసెట్ నుంచి మినహాయిం చారు. మెడికల్‌ను తొలగించినందున ఏపీ ఎంసెట్ ను ఏపీ ఈఏపీసెట్(ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)–2021 పేరుతో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను ఆగస్టు 19 నుం చి 25 వరకూ నిర్వహిస్తారు. దీనికి సంబంధించి ఈ నెల 24న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. సెప్టెంబర్ మొదటి, రెండో వారాల్లో ఇతర ప్రవేశ పరీక్షలు.. ఐసెట్, ఈసెట్, పీజీఈసెట్, లాసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్ ప్రవేశ పరీక్షలను సెప్టెంబర్ మొదటి, రెండో వారాల్లో నిర్వహించే అవకాశం ఉందని మంత్రి వెల్లడించారు. కరోనా నేపథ్యంలో ఎక్కువ సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఏపీ ఈఏపీసెట్–2021 షెడ్యూల్.. ►అపరాధ రుసుము లేకుండా జూన్ 26 నుంచి జూలై 25వ తేదీ వరకు ►రూ.500 ఫైన్‌తో జూలై 26 నుంచి ఆగస్టు 5 వరకు ►రూ.1,000 లేట్ ఫీజుతో ఆగస్టు 6 నుంచి 10 వరకు ►రూ.5,000 లేట్ ఫీజుతో ఆగస్టు 11 నుంచి 15 వరకు ►రూ.10 వేల అపరాధ రుసుముతో ఆగస్టు 16 నుంచి 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి తెలిపారు. -
టాటా గ్రూప్ చేతికి 1ఎంజీ?
బెంగళూరు: దేశీయంగా ఆన్ లైన్ ఫార్మసీ రంగంలో పోటీ మరింత తీవ్రంకానుంది. కోవిడ్-19 కారణంగా కొద్ది రోజులుగా ఆన్ లైన్ ఫార్మసీ రంగం జోరందుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆన్ లైన్ ఫార్మసీ కంపెనీ 1ఎంజీలో మెజారిటీ వాటా కొనుగోలుకి పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ చర్చలు నిర్వహిస్తున్నట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. తద్వారా ఈ విభాగంలో ప్రధాన కంపెనీలైన మెడ్ ప్లస్, నెట్ మెడ్స్, ఫార్మీజీ, 1ఎంజీ మధ్య పోటీ తీవ్రతరం కానున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే నెట్ మెడ్స్ ప్రమోటర్ కంపెనీ విటాలిక్ లో రిలయన్స్ రిటైల్ 60 శాతం వాటాను సొంతం చేసుకుంది. ఇదేవిధంగా క్లౌడ్ టెయిల్ తో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది. క్లౌడ్ టెయిల్లో అమెజాన్ 24 శాతం వాటా పొందింది. కాగా.. సీక్వోయా క్యాపిటల్ దన్నుగా సేవలందిస్తున్న 1ఎంజీ ఇటీవల 10 కోట్ల డాలర్ల(రూ. 740 కోట్లు) సమీకరణకు సన్నాహాలు చేసినట్లు తెలుస్తోంది. ఇవి ఫలించనట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. సూపర్ యాప్ ఈకామర్స్ బిజినెస్ కోసం టాటా గ్రూప్.. సూపర్ యాప్ ను రూపొందిస్తోంది. దీనిలో భాగంగా పలు ఆన్ లైన్ కంపెనీలలో వాటాల కొనుగోలుపై కన్నేసినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే అటు టాటా గ్రూప్ ప్రతినిధులు, ఇటు 1ఎంజీ సీఈవో ప్రశాంత్ టాండన్ ఈ అంశంపై స్పందించేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. కాగా.. ఆన్ లైన్ గ్రోసరీ కంపెనీ బిగ్ బాస్కెట్లోనూ 50 శాతం వాటా కొనుగోలుకి టాటా గ్రూప్ సిద్ధపడుతున్నట్లు వార్తలు వెలువడిన విషయం విదితమే. ఇందుకు బిలియన్ డాలర్లు(రూ. 7,400 కోట్లు) వెచ్చించనున్నట్లు అంచనాలు వెలువడ్డాయి. తద్వారా డిజిటల్ రిటైల్ ను భారీగా విస్తరించేందుకు టాటా గ్రూప్ ప్రణాళికలు వేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అవకాశాలు అధికం లాక్ డవున్ల నేపథ్యంలో ఇటీవల ఆన్ లైన్ ఫార్మసీ రంగం వేగంగా ఎదుగుతున్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. ఈ సమయంలో 9 మిలియన్ కుటుంబాలు ఈఫార్మసీ సేవలు పొందినట్లు ఫ్రాస్ట్ అండ్ సలివాన్ నివేదిక పేర్కొంది. 2025కల్లా 7 కోట్ల కుటుంబాలకు ఈఫార్మసీ సేవలు అందే వీలున్నట్లు అంచనా వేసింది. దీనికితోడు ఆన్ లైన్ ఫార్మసీ కంపెనీలు ఆన్ లైన్ ల్యాబ్ టెస్టింగ్, డాక్టర్ సేవలు, బీమా క్లెయిములు వంటి సర్వీసులను సైతం అందించే ప్రయత్నాల్లో ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వెరసి ఈఫార్మసీ సర్వీసులకు డిమాండ్ పెరగనున్నట్లు అంచనా వేస్తున్నారు. -
అపోలో ఫార్మసీలో నిలువు దోపిడీ
సాక్షి, హైదరాబాద్: కిందిస్థాయి ఉద్యోగుల జీతాలను షార్టేజ్ పేరుతో నిలువు దోపిడి చేస్తున్న ఘటన రాచకొండ కాప్రా గాంధీ నగర్ అపోలో ఫార్మసీలో చోటుచేసుకుంది. చాలచాలనీ జీతాలు ఇస్తూ అందులోనూ షార్టేజ్ పేరుతో.. ఎగ్జిక్యూటివ్ సిబ్బంది డబ్బులు కాజేయడాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఫార్మసీ ఉద్యోగులు బుధవారం పోలీసులను ఆశ్రయించారు. గాంధీనగర్ అపోలో ఫార్మసీలో ట్రైనీ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న జెస్సీ(బేబీ) ఈ మేరకు పోలీసులను ఆశ్రయించారు. ప్రతినెలా షార్టేజ్ పేరుతో 5వేల నుంచి 8వేల రూపాయల వరకు కాజేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వచ్చే జీతంలో మొత్తం డబ్బులు వారే తీసుకుంటే మేము ఎలా బ్రతకాలి..? మా కుటుంబాల్ని ఎలా పోషించుకోవాలని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా ఇదేంటని అడిగితే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ మా దగ్గర ఉన్నాయని బెదిరింపులకు దిగుతున్నట్లు వివరించారు. (హైదరాబాద్ పోలీసుల సాహసం..) దీంతో ఫార్మసీ ఉద్యోగులు పోలీసులను కలిసి బాధిత ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. పై అధికారులకు తెలియకుండా కింది స్థాయి ఉద్యోగులు మాఫియాగా ఏర్పడి ఉద్యోగులను వేదిస్తున్నట్టు ఫిర్యాదు చేశారు. ఫార్మసీ ఉద్యోగుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న కుషాయిగూడ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
7 వేల ఎకరాలు.. 90 రోజులు!
సాక్షి, హైదరాబాద్: ఔషధనగరికి త్వరలోనే పునాదిరాయి పడనుంది. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ప్రాజెక్టుకు ఈ ఏడాది చివరలో కార్యరూపం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రెండో విడత భూసేకరణకు 90 రోజుల గడువు విధించింది. ఈ భూసేకరణ ప్రక్రియ పూర్తికాగానే.. ఫార్మాసిటీకి శంకుస్థాపన చేయనుంది. రంగారెడ్డి జిల్లాలో 19,333 ఎకరాల్లో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టును అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది. ఔషధనగరి ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పర్యావరణ అనుమతి, నిమ్జ్ హోదా లభించినా.. భూసేకరణలో జాప్యంతో ముందడుగు పడలేదు. ఇటీవల అంతర్గత రహదారుల నిర్మాణ పనులు మొదలుపెట్టిన ప్రభుత్వం.. త్వరలోనే దీనికి ముహూర్తం ఖరారు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. తొలిదశలో 7,414 ఎకరాలు..! రెండేళ్ల క్రితమే 7,414 ఎకరాల భూమిని సేకరించిన రెవెన్యూశాఖ.. ఫార్మాసిటీకి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న టీఎస్ఐఐసీకి బదలాయించింది. ఈ మేరకు తొలిదశ పనులు చేపట్టేందుకు మార్గం సుగమం చేసింది. ఈ ప్రాజెక్టుకు 2018 చివర్లోనే అంకురార్పణ చేయాలని ప్రభుత్వం భావించినా.. శాసనసభ ఎన్నికలు రావడంతో వాయిదా పడింది. ఆ తర్వాత భూసేకరణపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. జంటనగరాల నుంచి కాలుష్య ఉద్గారాలు వెదజల్లే పరిశ్రమలను నగరం వెలుపలికి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం, ఫార్మాసిటీని కాలుష్య రహితంగా అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించడంతో అనేక కంపెనీలు అక్కడ కార్యకలాపాలు మొదలు పెట్టడానికి ఆసక్తి చూపాయి. బల్క్ డ్రగ్ మ్యానుఫాక్చరింగ్ అసోసియేషన్ ద్వారా ఇప్పటికే పలు పరిశ్రమలు ఔషధనగరిలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వాన్ని ఆశ్రయించాయి కూడా.. దీనికి తోడు ఫార్మా దిగ్గజాలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. కరోనా సంక్షోభంతో అనేక కంపెనీలు చైనాను వీడి.. భారత్ వైపు తరలిరావడానికి ఆసక్తి చూపుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. టైమ్‌లైన్ 90 రోజులు ఈ నేపథ్యంలోనే రెండో విడత భూసేకరణను 90 రోజుల్లో పూర్తి చేయాలని రెవెన్యూ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి విడతలో సింహభాగం ప్రభుత్వ, అసైన్డ్ భూమి సేకరించిన రెవెన్యూ యంత్రాంగం.. రెండో దశలో అధిక శాతం పట్టా భూములనే తీసుకుంటోంది. నష్ట పరిహారంపై స్థానికుల నుంచి తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నప్పటికీ, న్యాయపర చిక్కులు ఎదురవుతున్న కూడా వెనుకడుగు వేయకుండా.. కోర్డుల్లో పరిహారాన్ని జమ చేసి ముందుకు కదలాలని నిర్ణయించింది. 6,813.88 ఎకరాలను ఆగస్టు నాటికి సేకరించేందుకు గడువు పెట్టుకుంది. ఇందులో ఫార్మాసిటికీ గుండెకాయగా చెప్పుకుంటున్న ముచ్చర్ల, మేడిపల్లి, కుర్మిద్ద, నానక్‌నగర్, తాడిపర్తి, పంజాగూడ గ్రామాల భూములున్నాయి. తాజాగా భూసేకరణ జరిపే ప్రాంతాలివే.. -
ఏపీలో కరోనా కట్టడికి ఫార్మసీ యాప్
-
ఈసారి కొత్త కోర్సులకు ఓకే
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎం బీఏ, ఎంసీఏ కాలేజీల్లో ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియోను అఖిల భారత సాంకేతిక విద్యా మండ లి (ఏఐసీటీఈ) మళ్లీ తగ్గించింది. డీమ్డ్ యూని వర్సిటీలు, అటానమస్ కాలేజీలు, నేషనల్ అ సెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) గుర్తింపు ఉన్న కాలేజీలు 1:15 ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియోను అమలు చేయాలని పేర్కొంది. గతంలో ఇది 1:15 ఉండగా, దాన్ని గతేడాది 1:20కి పెంచింది. ఇప్పుడు మళ్లీ 1:15కు తగ్గించింది. అలాగే పీజీ కోర్సుల్లో (ఎంటెక్) ఇప్పటివరకు ఉన్న ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని 1:12 నుంచి 1:15కు పెంచింది. 2020–21 విద్యా సంవత్సరంలో దేశంలో వృత్తి, సాంకేతిక విద్యా సంస్థల నిర్వహణకు అనుమతి ఇచ్చేందుకు ఏఐసీటీఈ అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్‌బుక్‌ను జారీ చేసింది. అలాగే దానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. యాజమాన్యాలు ఆ నిబంధనలను పాటిస్తూ అనుమతుల కోసం ఈ నెల 6 నుంచి 29లోగా ఆన్లైన్లో ద రఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ఆలస్య రుసు ముతో యాజమాన్యాలు మార్చి 5 వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. దరఖాస్తు చేసుకున్న కాలేజీలకు ఏప్రిల్ 30లోగా అనుమతులు జారీ చేసారు. అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్‌బుక్‌లో మార్పులు కా వాలని కోరుకునే యాజమాన్యాల కోసం ఈనెల 10న ముంబైలో, 12న ఢిల్లీలో, 13 న అనంతపూర్ జేఎన్టీయూ లో సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించింది. హ్యాండ్‌బుక్‌లో ప్రధానాంశాలు - నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ ప్రకారం కొత్త కోర్సులకు అ నుమతి ఇస్తారు. ఆర్టిఫిషియ ల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి వాటికి అనుమతి ఇస్తారు. - కంప్యూటర్ సైన్స్‌లో ఎక్కువ సీట్లు భర్తీ అవుతున్నాయని, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ తదితర ఇతర కోర్సుల్లో 40 శాతమే సీట్లు భర్తీ అవుతున్నాయిని పేర్కొంది. - ఫ్యాకల్టీ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ కోసం చర్యలు చేపట్టాలి. - కాలేజీ అడ్వైజరీ బోర్డులో పా రిశ్రామిక రంగానికి చెందిన వారు ఇద్దరిని నియమించాలి. - 2020–21 నుంచి రెండేళ్ల పా టు కొత్త ఫార్మసీ కాలేజీల ఏర్పాటుకు (డిప్లొమా, డిగ్రీ కోర్సుల కోసం) అనుమతించబోరు. - డీమ్డ్ యూనివర్సిటీలు దూర విద్యా విధానంలో ఎంబీఏ, ఎం సీఏ, ట్రావెల్ అండ్ టూర్స్ కోర్సులను నిర్వహించవచ్చు. ఆయా కో ర్సుల నిర్వహణకు యూజీసీ అనుమతి తప్పనిసరి. కాలేజీల్లో కచ్చితంగా అమలు చేయాల్సినవి.. - క్యాంపస్‌లలో గ్రీనరీకి ప్రా«ధాన్యం ఇవ్వాలి. రెయి న్ వాటర్ హార్వెస్టింగ్ తప్పనిసరిగా అమలు చేయాలి. - విద్యార్థుల అభిప్రాయాల స్వీకరణ, ఫ్యాకల్టీ వివరాలను కాలేజీలో డిస్ప్లే చేయాలి. - స్టూడెంట్స్ సేఫ్టీ ఇన్సూరెన్స్‌ను కచ్చితంగా అమలు చేయాలి. ఉద్యోగుల కోసం గ్రూపు యాక్సిడెంట్ పాలసీ వర్తింపజేయాలి. - ఆన్లైన్ కోర్సులకు ప్రాధాన్యమివ్వాలి. - ఆన్లైన్ ఫిర్యాదులు, పరిష్కార విభా గం ఉండాలి. యూనివర్సిటీ తరఫున అం బుడ్స్మెన్ను నియమించాలి. - లైంగిక వేధింపులను అరికట్టేందుకు, ఫిర్యా దులకు కాలేజీల్లో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలను (ఐసీసీ) ఏర్పాటు చేయాలి. - ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక కమిటీలను ఏర్పాటు చేయాలి. -
ఇక ఆస్పత్రుల్లో ‘అమృత్’ ఫార్మసీలు
సాక్షి, హైదరాబాద్: అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రులకు వస్తున్న నిరుపేద రోగులకు బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే చాలా తక్కువ ధరకే మందులు, సర్జికల్స్, ఇంప్లాట్స్ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కేంద్రం దేశవ్యాప్తంగా ఆలిండియా మెడికల్ సైన్స్(ఎయిమ్స్)ల్లో ప్రారంభించి, విజయవంతమైన దీన్‌దయాళ్ ‘అమృత్’ మెడికల్ స్టోర్స్‌ను ఇకపై తెలంగాణ వ్యాప్తంగా అన్ని బోధనాస్పత్రుల్లో కూడా అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఈ దుకాణాల్లో జనరిక్ మందులతో పాటు బ్రాండెడ్ మందులు, సర్జికల్స్, ఇంప్లాంట్స్‌ను కూడా అందుబాటులో ఉంచనున్నారు. ప్రైవేటు మెడికల్ స్టోర్స్‌లోని బ్రాండెడ్ మందులు, సర్జికల్స్, ఇంప్లాంట్స్ ధరలతో పోలిస్తే ఈ అమృత్ మెడికల్ స్టోర్స్‌లో 30 నుంచి 40 శాతం తక్కువ ధరకే లభించనున్నాయి. ఉస్మానియా ఆస్పత్రిలో హెచ్‌ఎల్‌ఎల్‌కు షాపును కేటాయించారు. రెండు మూడు రోజుల్లో ఇక్కడ ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. నిలోఫర్ సహా ఇతర ఆస్పత్రుల్లో సాధ్యమైనంత త్వరలోనే ఈ దుకాణాలు అందుబాటులోకి తేవాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. బ్రాండెడ్ బాదుడుకు ఇక చెల్లుచీటీ.. ఉస్మానియా మెడికల్ కాలేజీ పరిధిలో ఉస్మానియా జనరల్ ఆస్పత్రి సహా నిలోఫర్, ఈఎన్టీ, సరోజినిదేవి కంటి ఆస్పత్రి, ఫీవర్, ఛాతి ఆస్పత్రి, మానసిక చికిత్సాలయం, పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రి, నయూపూల్ ప్రసూతి ఆస్పత్రులు ఉన్నాయి. ఇక గాంధీ మెడికల్ కాలేజీ పరిధిలో గాంధీ ఆస్పత్రి కొనసాగుతోంది. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల ఓపీకి రోజుకు సగటున 2500 నుంచి 3000 మంది రోగులు వస్తుంటారు. మిగిలిన ఆస్పత్రుల ఓపీలకు రోజుకు సగటున 500 నుంచి 1200 మంది వస్తుంటారు. ప్రభుత్వ ఆస్పత్రులకు టీఎస్ఎంఐడీసీ మందులు సరఫరా చేస్తుంది. వైద్యులు రాసిన వాటిలో చాలా మందులు ప్రభుత్వ ఫార్మసీలో దొరకడం లేదు. దీంతో ఆ మందులను రోగులే స్వయంగా సమకూర్చుకోవాలి. ఇందుకు సమీపంలో ఉన్న ప్రైవేటు మెడికల్ షాపులను ఆశ్రయిస్తుంటే.. దుకాణదారులు బ్రాండెడ్ పేరుతో అధిక ధరల మందులు ఇస్తున్నారు. దీంతో నిరుపేద రోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు. కేవలం అవుట్ పేషంట్లకు మాత్రమే గాక.. ఇన్‌పేషంట్లుగా చికిత్స పొందుతున్న రోగులు కూడా చాలా రకాల మందులను బయటే కొంటున్నారు. అమృత్ స్టోర్స్ ఏర్పాటుతో ఖరీదైన మందులు, సర్జికల్స్, ఇంప్లాంట్స్ సైతం తక్కువ ధరకే పొందే అవకాశం ఉండడంతో పేద రోగులకు మేలు జరగనుంది. ఏళ్ల నుంచి ప్రైవేటు షాపుల దందా గతంలో నిమ్స్ సహా ఉస్మానియా, గాంధీలోనూ జీవన్‌ధార పేరుతో జనఔషధి మెడికల్ స్టోర్స్‌ను ఏర్పాటు చేశారు. రోగుల నుంచి వీటికి మంచి ఆధరణ కూడా లభించింది. అప్పటికే ఆయా ఆస్పత్రుల్లో లీజుపై కొనసాగుతున్న ప్రైవేటు మెడికల్ షాపుల నిర్వహకులు స్థానిక వైద్యులతో కుమ్మక్కై వాటిని సంక్షోభంలోకి నెట్టేశారు. ప్రస్తుతం ఒక్క ఉస్మానియాలోనే విజయవంతంగా కొనసాగుతోంది. గాంధీలో దాదాపు మూతపడే స్థితికి చేర్చారు. ఇక నిమ్స్‌లో మూడేళ్ల క్రితమే దుకాణం ఏత్తేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం గాంధీలో మూడు, ఉస్మానియాలో రెండు, నిలోఫర్‌లో ఒక ప్రైవేటు మెడికల్ స్టోర్లు కొనసాగుతున్నాయి. ఒక్కో స్టోర్‌లో రోజుకు సగటున రూ.2 లక్షల విలువ చేసే మందుల విక్రయాలు జరుగుతున్నట్లు అంచనా. ఇప్పటికే ఆయా దుకానాల లీజు గడువు కూడా ముగిసింది. ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో ప్రైవేటు మెడికల్ షాపులకు అనుమతి ఇవ్వరాదనే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశాల నేపథ్యంలో.. అధికారులు ఇప్పటికే ఆయా దుకాణాల నిర్వహకులకు నోటీసులు జారీ చేశారు. కొంత మంది అధికారులు ఆయా షాపుల నిర్వహాకులతో కుమ్మక్కై.. కోర్టుల నుంచి స్టే ఆర్డర్లు ఇప్పించడం వివాదాస్పదంగా మారింది. -
ఆన్లైన్లో ఔషధాలు... ఇవి తెలుసుకోవాల్సిందే!
డాక్టర్ రాసిన మందుల చీటిని ఫోన్ కెమెరా నుంచి క్లిక్ మనిపించి, దాన్ని మొబైల్ యాప్ నుంచి అప్లోడ్ చేసి, చిటికెలో ఆర్డర్ చేసేయడం... ఆ తర్వాత 24 నుంచి 48 గంటల్లోపు ఇంటికే ఔషధాలు వచ్చేయడం నేడు పట్టణాల్లో చూస్తున్నాం. చిన్న పట్టణాల నుంచి మెట్రోల వరకు ఈ ఫార్మసీ వ్యాపారం విస్తరిస్తోంది. దీనివల్ల మందుల ధరలపై ఎక్కువ తగ్గింపు లభించడంతోపాటు, డాక్టర్ సూచించిన మందుల్లో ఏదో ఒక రకం లేకపోవడమన్న సమస్య కూడా దాదాపుగా ఉండడం లేదు. దేశంలో ఔషధ మార్కెట్ రూపు రేఖలను మార్చేస్తున్న ఆన్లైన్ ఫార్మసీ మార్కెట్‌కు సంబంధించి లాభ, నష్టాలపై అవగాహన కోసమే ఈ కథనం... ఈ–ఫార్మసీల నుంచి తీవ్రమైన పోటీ నెలకొనడం.. సంప్రదాయ ఔషధ దుకాణాలు సేవల గురించి ఆలోచించే విధంగా దారితీసింది. ఈ పోటీ కారణంగా ఆర్డర్ చేస్తే ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా ఇంటికే తీసుకొచ్చి అందిస్తున్నాయి సంప్రదాయ ఫార్మసీ స్టోర్లు. కస్టమర్లను కాపాడుకునేందుకు వారికి అవసరమైన ఔషధాలు తమ వద్ద లేకపోయినా కానీ, ఆర్డర్ చేసి మరీ తెప్పిస్తున్నాయి. గతంతో పోలిస్తే పరిస్థితుల్లో మార్పు లు రావడానికి దోహదం చేసింది కచ్చితంగా ఈ ఫార్మసీలేనని చెప్పుకోవాలి. ఇక వైద్యులు తప్పనిసరిగా ఔషధం బ్రాండెడ్ పేరును కాకుండా, జనరిక్ పేరునే సూచించే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కూడా వినియోగదారులకు ఏ కంపెనీ ఉత్పత్తి కొనుగోలు చేసుకోవాలనే విషయంలో స్వేచ్ఛను కల్పించనుంది. ధరలు ఈ ఫార్మసీలు సాధారణంగా ఔషధ ధరలపై 10 నుంచి 40 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తుంటాయి. ఆయా ఉత్పత్తులను బట్టి డిస్కౌంట్ వేర్వేరుగా ఉంటుంది. పోషక ఉత్పత్తులపై చాలా వరకు ఆన్లైన్ ఫార్మసీలు తక్కువే డిస్కౌంట్ ఇస్తున్నాయి. ప్రిస్క్రిప్షన్ మందులపై (వైద్యులు రాసినవి) ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నాయి. దీంతో ఈ ఫార్మసీల నుంచి కొనుగోలు చేసే వారికి కొంత ఆదా అవడం ఎంతో సౌకర్యంగా ఉంటుందని చెప్పుకోవాలి. అంతేకాదు, ఈ ప్రభావంతో సంప్రదాయ ఫార్మసీ స్టోర్లు కూడా దిగొచ్చి, ఎంఆర్పీపై తగ్గింపు ఇస్తున్నాయి. అయినప్పటికీ ఆన్లైన్ ఫార్మసీల్లోనే డిస్కౌంట్ ఎక్కువ లభిస్తోంది. ఔషధ ధరలపై తగ్గింపులు, ఆర్డర్ చేసే విషయంలో ఆన్లైన్ ఫార్మసీలకే ఎక్కువ మార్కులు పడతాయి. కాకపోతే డెలివరీకి తీసుకునే సమయంలోనే సవాలు నెలకొని ఉంది. ఈ ఫార్మసీ స్టార్టప్ సంస్థలు దీన్ని అధిగమించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, రవాణా పరమైన సమస్యలు మాత్రం అలానే ఉంటున్నాయి. ఓ ఔషధం వెంటనే తీసుకోవాల్సి ఉంటే సమీపంలోని ఫార్మసీ స్టోర్‌కు వెళ్లి కొనుగోలు చేయడమే పరిష్కారం. ఇటువంటి వారు ఆన్లైన్లో మెడిసిన్ ఆర్డర్ చేసి, అవి వచ్చే వరకు వేచి ఉండడం సాధ్యపడదు. కాకపోతే క్రమం తప్పకుండా కొన్ని రకాల జీవనశైలి సమస్యలకు మందులు వాడే వారు మాత్రం తమకు కావాల్సిన మందులను ముందుగానే ఆన్లైన్ ఫార్మసీల నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆన్లైన్లో అయితే ఎక్కువ డిస్కౌంట్ పొందొచ్చు. కాకపోతే కనీస ఆర్డర్ విలువకు తక్కువ కొనుగోలు చేస్తే, డెలివరీ చార్జీలను వసూలు చేస్తున్నాయి. భిన్న రకాలు... ఈ ఫార్మసీల్లో మూడు రకాలు ఉన్నాయి. మొదటిది ఆన్లైన్లో మాత్రమే ఫార్మసీలను విక్రయించే నమూనా. సంబంధిత ఫార్మసీ స్టోర్ పోర్టల్ లేదా యాప్‌లో లాగిన్ అయి, కావాల్సిన మందులను ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఔషధాలను ఇంటికి డెలివరీ చేస్తారు. నెట్‌మెడ్స్, మెడ్‌లైఫ్, 1ఎంజీ, ఎంకెమిస్ట్, ఫార్మ్ఈజీ ఇవన్నీ కూడా ఈ కోవలోనివే. ఇక రెండో నమూనాలో అటు సంప్రదాయ ఫార్మసీ స్టోర్లతో పాటు, ఆన్‌లైన్‌లోనూ ఔషధ విక్రయాలను నిర్వహించే సంస్థలు కూడా ఉన్నాయి. తద్వారా రెండు మార్గాల్లోనూ కస్టమర్లను సంపాదించుకోవడం లక్ష్యం. మెడ్‌ప్లస్ ఈ తరహాలోనే పనిచేస్తోంది. మెడ్‌ప్లస్ సంస్థ 20 శాతం వరకు ఆన్లైన్ ఆర్డర్లపై తగ్గింపు ఇస్తోంది. మెడ్‌ప్లస్ స్టోర్‌కు వెళ్లి రూ.1,000లోపు ఆర్డర్ చేస్తే 10 శాతం డిస్కౌంట్ ఇస్తుంటే, అదే ఆన్లైన్లో ఆర్డర్‌పై 20 శాతం వరకు తగ్గింపు ఇస్తుండడం గమనార్హం. ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేస్తే డిస్కౌంట్ ఆఫర్ చేయడంతోపాటు, ఇంటికి డెలివరీ చేయడం లేదా సమీపంలోని మెడ్‌ప్లస్ స్టోర్‌కు స్వయంగా వెళ్లి తీసుకునే ఆప్షన్లను కూడా ఇస్తోంది. కస్టమర్లు తమ సౌకర్యం కొద్దీ నచ్చినది ఎంచుకోవచ్చు. ఇక మూడో రకం.. ఆన్లైన్లో ఆర్డర్ తీసుకుని కస్టమర్ నివాసం/కార్యాలయం సమీపంలోని ఫార్మసీ స్టోర్‌కు ఆ ఆర్డర్‌ను బదిలీ చేసేవీ ఉన్నాయి. వీఫార్మాసిస్ట్ ఇలానే చేస్తోంది. కావాల్సిన ఔషధాన్ని ఆన్లైన్లో ఆర్డర్ తీసుకుంటూ.. ఆ తర్వాత అదే ఆర్డర్‌ను కస్టమర్ లొకేషన్ సమీపంలోని ఫార్మసీ స్టోర్‌కు బదిలీ చేస్తుంది. ఆ తర్వాత సంబంధిత స్టోర్ ప్రతినిధి కస్టమర్ నివాసానికి ఔషధాలను డెలివరీ చేస్తారు. డెలివరీ సమయంలోనే పేమెంట్ కూడా చేసేయవచ్చు. చట్టం ఏం చెబుతోంది... ఆన్లైన్ ఫార్మసీలు తమ వ్యాపార అవకాశాలను దెబ్బతీస్తుండడంతో సంప్రదాయ ఔషధ వర్తకులు ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వీరి ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్‌లోనే ఆన్లైన్ ఫార్మసీల నియంత్రణకు సంబంధించి ఓ నమూనా విధానాన్ని తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఈ విధానంలో ఆన్లైన్లో ఫార్మసీ నిర్వహించాలంటే సెంట్రల్ లైసెన్సింగ్ అథారిటీ వద్ద రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి. రిజిస్ట్రేషన్ లేకుండా ఎవ్వరూ ఆన్లైన్లో ఔషధాలను ప్రదర్శించడం, పంపిణీ, విక్రయాలు చేయడం నిషిద్ధం. అలాగే, నార్కోటిక్, సైకోట్రాపిక్ ఔషధాలపై నిషేధానికి సంబంధించిన నిబంధనలూ వీటికి వర్తిస్తాయి. రోగుల సమాచారం గోప్యంగా ఉంచడం, ఈ తరహా సమాచారం ఎవరికీ లీక్ అవకుండా, పంచుకోకుండా ఉండాలి. ఇక ఆన్లైన్ ఫార్మసీలను సవాలు చేస్తూ గతేడాది మద్రాసు హైకోర్టు, ఢిల్లీ హైకోర్టుల్లో ఒక్కోటి చొప్పున రెండు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ప్రస్తుతం వీటిపై విచారణ కొనసాగుతోంది. గతేడాది సెప్టెంబర్‌లో విడుదల చేసిన ముసాయిదా నిబంధనలకు అనుగుణంగా.. ఈ ఫార్మసీ ప్రాజెక్టును అమల్లోకి తీసుకురానున్నట్టు ఢిల్లీ హైకోర్టులో వ్యాజ్యంపై విచారణ సందర్భంగా కేంద్రం బదులిచ్చింది. కేంద్ర ప్రభుత్వ విధానం అమల్లోకి వస్తే... లోపాలను నివారించడంతోపాటు, ఆన్లైన్, ఆఫ్‌లైన్ ఫార్మసీల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ఉంటుందని ఈ రంగానికి చెందిన పరిశీలకులు భావిస్తున్నారు. -
నేటి నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, తదితర కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఎంసెట్–2019 కౌన్సెలింగ్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 6 వరకు విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. తర్వాత విద్యార్థులు 3 నుంచి 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్లలో పొరపాట్లు సరిచేసుకోవడానికి వీలుగా 9న ఆప్షన్ల మార్పునకు అవకాశం ఇస్తారు. 11న సీట్లను కేటాయిస్తారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ప్రారంభమవుతుందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి తెలిపారు. ఓసీ, బీసీలు రూ.1,200, ఎస్సీ, ఎస్టీలు రూ.600 ప్రాసెసింగ్ ఫీజు ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎంసెట్ దరఖాస్తులో పేర్కొన్న వివరాలతో దాదాపు లక్ష మంది వరకు విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన వెబ్ సర్వీసింగ్ ద్వారా పూర్తయింది. ఇప్పటికే ఆయా విద్యార్థుల మొబైల్ నెంబర్లకు ఈ సమాచారం అందించారు. ‘హెచ్‌టీటీపీఎస్://ఏపీఈఏఎంసీఈటీ.ఎన్ఐసీ.ఐఎన్’ ద్వారా తమ ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిందో, లేదో విద్యార్థులు తెలుసుకోవచ్చు. పరిశీలన పూర్తికానివారు, ఇతరులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి ఆయా హెల్ప్‌లైన్ కేంద్రాల్లో హాజరుకావాల్సి ఉంటుంది. దివ్యాంగులు, సైనికోద్యోగుల పిల్లలు, స్పోర్ట్స్, గేమ్స్, ఎన్సీసీ, ఆంగ్లో ఇండియన్ కేటగిరీల విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతుంది. జూలై 1 నుంచి 4 వరకు వీరి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. ఎవరెవరికి ఏయే తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందో తెలిపే షెడ్యూల్‌ను ఎంసెట్ కమిటీ.. వెబ్సైట్లో పొందుపరిచింది. వెబ్ ఆప్షన్ల షెడ్యూల్ పొడిగింపు! ఫీజులు, ఈడబ్ల్యూఎస్ కోటా విషయం తేలకుంటే కౌన్సెలింగ్‌ను యథాతథంగా కొనసాగిస్తూనే ఈ షెడ్యూల్లో కొన్ని మార్పులు చేయనున్నారు. వెబ్ ఆప్షన్ల నమోదును రెండు రోజులు వాయిదా వేయాలని యోచిస్తున్నారు. వెబ్ ఆప్షన్లను ఈ నెల 3 నుంచి కాకుండా 5 లేదా 6వ తేదీ నుంచి నమోదు చేసుకొనేలా షెడ్యూల్ ప్రకటించనున్నారు. వెబ్ ఆప్షన్ల గడువును పొడిగిస్తే ఆప్షన్ల మార్పు, సీట్ల కేటాయింపు తేదీలు కూడా రెండు, మూడు రోజుల పాటు వాయిదా పడే అవకాశం ఉందని అధికారవర్గాలు వివరించాయి. విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు తీసుకురావాల్సిన సర్టిఫికెట్లు.. - ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డు - ఏపీ ఎంసెట్ హాల్‌టికెట్ - ఇంటర్మీడియెట్/తత్సమాన మార్కుల మెమోలు - పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం (ఎస్ఎస్సీ/తత్సమాన మెమో) - ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు స్టడీ సర్టిఫికెట్స్ - ప్రైవేటుగా చదివినవారు ఏడేళ్లకు సంబంధించిన నివాస ధ్రువీకరణ పత్రం - ఇతర ప్రాంతాల్లో ఉండి ఏపీకి వచ్చిన ఉద్యోగుల పిల్లలు ఏపీ రెసిడెన్స్ సర్టిఫికెట్ - ఆధార్ కార్డు - ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికెట్ (బీసీ, ఎస్సీ, ఎస్టీ) - తెల్లరేషన్ కార్డు/ఇతరులు ఆదాయ ధ్రువీకరణ పత్రం - అవసరమైనవారికి లోకల్ స్టేటస్ ధ్రువపత్రం - ఎన్సీసీ, స్పోర్ట్స్, దివ్యాంగులు, ఆర్మ్డ్ ఫోర్సెస్ చిల్డ్రన్స్.. వారికి సంబంధించిన ధ్రువపత్రాలు -
వచ్చే నెల మొదటివారంలో ఎంసెట్ ఫలితాలు!
సాక్షి, హైదరాబాద్: వచ్చేనెల మొదటివారంలో తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇంటర్మీడియట్లో ఫెయిలైన విద్యార్థుల రీవెరిఫికేషన్ ఫలితాలను ప్రకటించిన తర్వాత ఎంసెట్ ఫలితాలను వెల్లడించాలని ఎంసెట్ కమిటీ భావిస్తోంది. రీవెరిఫికేషన్ ఫలితాల అనంతరం ఇంటర్మీడియట్ మార్కులకు ఎంసెట్ ర్యాంకుల ఖరారులో 25 శాతం వెయిటేజీని ఇచ్చి తుది ర్యాంకులను ఖరారు చేయాలని భావిస్తోంది. ఈ నెలాఖరులోగా ఇంటర్ బోర్డు ఆ ఫలితాలను వెల్లడిస్తే వచ్చే నెల మొదటి వారంలో ఎంసెట్ ఫలితాలు వెలువడనున్నాయి. ఇంటర్ రీవెరిఫికేషన్ ఫలితాలు ఆలస్యమైతే ఎంసెట్ ర్యాంకుల వెల్లడి కూడా ఆలస్యం కానుంది. చివరి దశకు చేరుకున్న అనుబంధ గుర్తింపు ప్రక్రియ రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. కాలేజీల్లోని లోపాలను గుర్తించి గత నెలలోనే వాటిని సరిదిద్దుకునేలా సమయం ఇచ్చిన జేఎన్టీయూ అనుబంధ గుర్తింపు జారీ ప్రక్రియను ఇటీవల చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు దాదాపు 100 ఇంజనీరింగ్ కాలేజీలకు, 40 వరకు ఫార్మసీ, ఎంబీఏ కాలేజీలకు అనుబంధ గుర్తింపును జారీ చేసినట్లు జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్.యాదయ్య తెలిపారు. ఈనెలాఖరు నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉందని, అప్పటివరకు ఎన్ని కాలేజీలకు, ఎన్నిసీట్లకు అనుబంధ గుర్తింపు ఇచ్చామన్నది చివరలో తెలుస్తుందని వివరించారు. -
ఏపీ పీజీ ఈసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, విజయవాడ : ఏపీ పీజీ ఈసెట్-2019 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ విజయరాజు విడుదల చేశారు. ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షకు 24,248మంది అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే. అయితే, ఈ ఫలితాల్లో 20,986 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఈ నెల 20 నుంచి ర్యాంకు కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చని విజయరాజు తెలిపారు. 12 ఇంజినీరింగ్ పీజీ కోర్సులు, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు త్వరలోనే కౌన్సెలింగ్ జరగనుంది. రాష్ట్రంలో వివిద కాలేజీలలో ఉన్న 21,941 ఎంటెక్, 5495 ఎంఫార్మసీ సీట్లను మెరిట్ ప్రకారం కేటాయించనున్నారు. సబ్జెక్టుల వారిగా మొదటి ర్యాంకులు సాధించిన విద్యార్థుల వివరాలు బయోటెక్ - పి.షామారజిత, ఈస్ట్ గోదావరి కెమికల్ ఇంజనీరింగ్ - ఏ వేదశ్రీ, నెల్లూరు జిల్లా సివిల్ ఇంజనీరింగ్ - మహంతి అంజనీబాయ్, గుంటూరు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ - కెహెచ్ఎన్ సీతారాగిని, గుంటూరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ - ఎం.జ్యోష్న, కడప ఎలక్ట్రానిక్ అండ్ కమ్యునికేషన్ ఇంజనీరింగ్ - టి.మహేంద్ర, ప్రకాశం ఫుడ్ టెక్నాలజీ - పి.రవళి, వెస్ట్ గోదావరి జియో ఇంజనీరింగ్ - ఎ.రవితేజ, కృష్ణా ఇనుస్టుమెంటేషన్ ఇంజనీరింగ్ - ఎస్ఎన్.సింధూరీ, కృష్ణా మెకానికల్ ఇంజనీరింగ్ - ఎ.సాయిచరణ్, కర్నూలు మెటాలజికల్ ఇంజనీరింగ్ - ఎ.సాయిప్రకాష్, వెస్ట్ గోదావరి నానో టెక్నాలజీ - పి.మంత్రునాయక్, ప్రకాశం ఫార్మసీ - పి.పృధ్వీ, కృష్ణా -
హీమోఫీలియా మందుల్లేవ్!
సాక్షి,సిటీబ్యూరో: జన్యుసంబంధమైన హీమోఫీలియా(రక్తస్త్రావం) బాధితులకు మందులు దొరకడం లేదు. తెలంగాణలోని ఏ ప్రభుత్వ ఆస్పత్రిలో కూడా మందులు దొరకడం లేదు. ఎప్పటికప్పుడు మందులు కొనుగోలు చేసి రోగులకు అందుబాటులో ఉంచాల్సిన అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. ప్రతిష్టాత్మక గాంధీ జనరల్ ఆస్పత్రిలో గత మూడు నెలలుగా మందులు లేకపోవడంతో రక్తస్త్రావం సమస్యతో బాధపడుతూ ఆస్పత్రికి చేరుకుంటున్న రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. మందుల కోనుగోలు కోసం జాతీయ ఆరోగ్య మిషన్ ప్రత్యేక బడ్జెట్ కేటాయించినప్పటికీ, వాటిని ఉపయోగించి మందులు కొనుగోలు చేసి ఆయా ఆస్పత్రులకు పంపించడంలో తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా అత్యవసర పరిస్థితుల్లో రక్తం గడ్డకట్టక తీవ్రస్త్రావంతో బాధితులు మృత్యువుతో పోరాడుతున్నారు. బాధితుల ఎదురుచూపు.... రాష్ట్రవ్యాప్తంగా సుమారు 900 మంది హీమోఫీలియా బాధితులు ఉన్నారు. హీమోఫీలియా బాధితులను ఫ్యాక్టర్–7, ఫ్యాక్టర్–8, ఫ్యాక్టర్–9గా విభజించారు. ఏదైనా ప్రమాదంలో గాయపడి తీవ్ర రక్తస్త్రావం అవుతున్నప్పుడు, ముక్కు, ఇతర అవయవాల నుంచి రక్తస్త్రావం అవుతున్నప్పుడు వెంటనే యాంటి హీమోఫీలియా ఇంజక్షన్ చేయాల్సి ఉంటుంది. రోగి వయసు, బరువును బట్టి మందు ఇవ్వాల్సి ఉంటుంది. మార్కెట్లో వాయిల్ ధర రూ.6,500 ఉంది. 35 ఏళ్ల వయసు ఉండి, 70 కేజీల బరువున్న వ్యక్తికి ఒకే రోజు సుమారు మూడు వాయిల్స్ అవసరం అవుతుంటాయి. మందులు, వైద్య పరీక్షల కోసం ఉన్నదంతా ఖర్చు చేసిన నిరుపేద బాధితులకు వీటి ఖరీదు మరింత భారంగా మారింది. హీమోఫీలియా సొసైటీ అభ్యర్థన మేరకు ప్రభుత్వం బాధితులకు ఉచితంగా మందులు అందజేసేందుకు అంగీకరించింది. ఇదే సమయంలో జాతీయ ఆరోగ్య మిషన్ ఇందుకు రూ.4.85 కోట్లు కూడా మంజూరు చేసింది. తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా ఈ మందులను కొనుగోలు చేసి ఉస్మానియా, గాంధీ సహా జిల్లా ఆస్పత్రులకు సరఫరా చేయాలని భావించింది. ఆ మేరకు 2016 నుంచి ఇప్పటి వరకు ఆయా మందుల కోసం రూ.2కోట్లకు పైగా ఖర్చు చేసి ఉస్మానియా, మహబూబ్‌నగర్ ఆస్పత్రులకు పంపిణీ చేశారు. మరో రూ.1.85 కోట్ల వరకు నిధులు ఉన్నాయి. వీటిని గాంధీ ఆస్పత్రికి కేటాయించకపోవడంతో ఇప్పటి వరకు మందులకు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ నిధులు వెచ్చించాల్సి వచ్చింది. గత మూడు మాసాలుగా ఆస్పత్రి అధికారులు వీటి కొనుగోలును నిలిపివేశారు. అదేమంటే హీమోఫీలియా మందులకు ఆస్పత్రికి ఎలాంటి బడ్జెట్ కేటాయించలేదని, ఇలాంటి పరిస్థితుల్లో తాము మాత్రం ఎక్కడి నుంచి కొనుగోలు చేయగలమని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి మందులకు బడ్జెట్ కేటాయిస్తే గానీ రోగులకు అందించలేమని స్పష్టం చేస్తున్నారు. దీంతో రక్తం గడ్డకట్టక రక్తస్త్రావంతో బాధపడుతూ చికిత్స కోసం ఆస్పత్రులకు చేరుకుంటున్న రోగుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. వెంటనే సరఫరా చేయాలి... ఉస్మానియా, గాంధీలో మాత్రమే కాదు తెలంగాణలోని ఏ జిల్లా ఆస్పత్రిలోనూ హీమోఫీలియా మందుల్లేవు. జిల్లా ఆస్పత్రుల్లో ఒకటి రెండు మిగిలి ఉన్నా ఇటీవల వాటిని కూడా వాడేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మందుల కొరత ఏర్పడింది. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఎన్హెచ్ఎం మంజూరు చేసిన నిధులు ఇంకా మిగిలే ఉన్నప్పటికీ, వాటిని ఉపయోగించి మందులు కొనుగోలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అసలే నిరుపేదలు, ఆపై భయంకరమైన జన్యుసంబంధ జబ్బుతో బాధపడుతున్న వారికి మందులు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. ప్రభుత్వం వెంటనే మందులు కొనుగోలు చేసి బాధితులకు అందజేయాలి. – రామారావు, హీమోఫీలియాసొసైటీ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడు -
ఫార్మా హబ్ వైట్ అప్రాన్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మసీ స్టూడెంట్స్‌కు ఎదురయ్యే ప్రధాన సమస్య... ల్యాబ్స్, రసాయనాలు అందుబాటులో ఉండకపోవటం. గ్రామీణ, పట్టణాల్లోని కాలేజీల్లో అయితే మరీనూ! నెల్లూరులో బీ–ఫార్మసీ చదివిన బ్రహ్మం పెద్దపోతులకూ ఇదే సమస్య. కానీ, తాను మాత్రం అక్కడితో ఆగిపోకుండా దీనికో పరిష్కారం చూపించాడు. రసాయనాలు, ల్యాబ్ పరికరాలు, వైద్య ఉపకరణాలను విక్రయించేందుకు ‘వైట్‌అప్రాన్. ఇన్’ ప్రారంభించాడు. మరిన్ని వివరాలు ‘స్టార్డప్ డైరీ’తో ఆయన మాటల్లోనే... ‘‘మాది వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల. నెల్లూరులో బీఫార్మసీ పూర్తయ్యాక.. చదువుకునేటపుడు నాకెదురైన ఇబ్బందులను పరిష్కారం చూపించాలని నిర్ణయించుకున్నా. కానీ, సొంతంగా కంపెనీ పెట్టే ఆర్థిక స్థోమత లేకపోవటంతో ఉద్యోగంలో చేరా. జువెంటస్ లైఫ్ సైన్సెస్‌లో ఏడాది పాటు ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేశా. తర్వాత 104లో చేరా. అక్కడి నుంచి సొంతంగా కంపెనీ పెట్టాలని ఈ ఏడాది జనవరిలో రూ.2 లక్షల పెట్టుబడితో తిరుపతి కేంద్రంగా వైట్‌అప్రాన్ ఈ–ఎడ్యు కామర్స్ ప్రై.లి. ప్రారంభించాం. మాది ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ (ఏపీఐఎస్) ఇంక్యుబేట్ స్టార్టప్. ఫార్మా విద్యార్థులు, కాలేజీలు, యూనివర్సిటీలు, ఆసుపత్రులు, ల్యాబ్స్‌కు రసాయనాలు, ల్యాబ్, వైద్య పరికరాలను విక్రయించడం మా ప్రత్యేకత. హైదరాబాద్ వాటా 20 శాతం.. వైట్అప్రాన్లో రసాయనాలు, ల్యాబ్, వైద్య పరికరాలుంటాయి. అల్యూమినియం అమ్మోనియం, కాల్షియం కార్బైడ్, గ్లూకోమీటర్స్, ఈసీజీ కేబుల్స్, టెస్ట్ ట్యూబ్స్, హెచ్పీఎల్సీ, సర్జికల్ సెట్స్ వంటి సుమారు 10 వేల వరకు ఉత్పత్తులన్నాయి. వీటి ప్రారంభ ధర రూ.100. ప్రస్తుతం నెలకు రూ.30 లక్షల విలువ చేసే ఆర్డర్లు వస్తున్నాయి. ప్రతి ఆర్డర్‌పై 7–12 శాతం వరకు కమిషన్ ఉంటుంది. మా మొత్తం ఆర్డర్లలో 20 శాతం హైదరాబాద్ వాటా. తెలుగు రాష్ట్రాలతో పాటూ బిహార్, హిమాచల్ ప్రదేశ్ నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. రూ.50 కోట్ల ఆదాయం లక్ష్యం.. ప్రస్తుతం రసాయనాలు, ల్యాబ్, వైద్య పరికరాల విభాగంలో 60 మంది వర్తకులు నమోదయ్యారు. వచ్చే ఏడాది నాటికి వెండర్స్ సంఖ్యను వెయ్యికి చేరుస్తాం. బిట్స్ పిలానీ, గీతం, నైపర్, ఎస్వీఎస్ వంటి 25 యూనివర్సిటీలు, కాలేజీలు మా కస్టమర్లుగా ఉన్నాయి. గత నెలలో రూ.12 లక్షల ఆదాయాన్ని ఆర్జించాం. వచ్చే ఏడాది కాలంలో రూ.50 కోట్ల ఆదాయాన్ని లకిష్యంచాం. రూ.15 లక్షల సమీకరణ.. ప్రస్తుతం తిరుపతి, హైదరాబాద్‌లో కార్యాలయాలున్నాయి. వచ్చే ఏడాది కాలంలో లక్ష ఉత్పత్తులతో పాటూ కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, ముంబై మార్కెట్లలో విస్తరించాలన్నది లక్ష్యం. ఆర్డర్ల డెలివరీ కోసం బెంగళూరుకు చెందిన షిప్కరో లాజిస్టిక్ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. త్వరలోనే పోస్టల్ విభాగంతోనూ ఒప్పందం చేసుకుంటాం. ప్రస్తుతం మా కంపెనీలో ఆరుగురు ఉద్యోగులున్నారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ఇన్వెస్టర్ నుంచి రూ.15 లక్షల నిధులను సమీకరించాం’’ అని బ్రహ్మం వివరించారు. -
ప్రాణాలతో చెలగాటం
స్విమ్స్‌లో మెరుగైన సేవలు అందని ద్రాక్షలా మారాయి. ఇక్కడ ఇన్‌పేషెంట్లకు కూడా సరైన సేవలందడం లేదు. కొందరు అధికారులు కమీషన్లకు కక్కుర్తి పడడంతో ఫార్మసీ విభాగంలో అరకొర మందులుంటున్నాయి. వైద్యులు రాస్తున్న ప్రిస్క్రిప్షన్ ఒకటైతే ఫార్మసీలో ఇస్తున్నవి వేరొకటి. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఔట్ సోర్సింగ్ నర్సుల సేవలపై రోగులు పెదవి విరుస్తున్నారు. సిఫార్సు ఉంటేనే అత్యవసర విభాగంలో ఎమర్జెన్సీ కేసులను అనుమతిస్తున్నారు. ఏడుకొండల వేంకటేశ్వర స్వామి పాదాల చెంత టీటీడీ నిర్వహిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని స్విమ్స్ డైరెక్టర్ పట్టించుకోవడం మానేశారనే విమర్శలు పెరుగుతున్నాయి. తిరుపతి (అలిపిరి): రాయలసీమలోని నిరుపేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలందించేందుకు 1986లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్) ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టడంతో స్విమ్స్‌లోనూ తెల్లరేషన్ కార్డులున్న పేదలకు సూపర్‌స్పెషాలిటి సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ ఆస్పత్రి నిర్వహణ తీరు విమర్శలకు తావిస్తోంది. నిరుపేదలకు ఆదరణ కరువవుతోంది. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రి ఎమర్జెన్సీ విభాగానికి వస్తే ప్రాణాలు వదులుకోవాల్సినదుస్థితి. రోగులను అడుగడుగునా వివక్ష వెంటాడుతోంది. నిర్లక్ష్యపు వైద్యం.. స్విమ్స్‌లో 900 మందికిపైగా ఇన్పేషెంట్లుంటారు. 28కిపైగా విభాగాలున్నాయి. జనరల్ మెడిసిన్, సిటీ సర్జరీ వార్డులలో వైద్య సేవలపై యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. బీపీ, షుగర్ వంటి పరీక్షలు నిర్వహించే సమయంలో కూడా నర్సులు బాధ్యతారహితంగా పనిచేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఉదయం అల్పాహారం తీసుకోకుండా షుగర్ శాతం కొలుస్తాయి. ఈ పరీక్ష ఇన్‌పేషెంట్లకు తెల్లవారుజామును 2.30లకే చేస్తున్న సంఘటనలు ఉన్నాయి. ఇలా చేయడం వల్ల షుగర్ శాతం అధికంగా చూపించే ప్రమాదముంది. షుగర్ శాతం అనుగుణంగా వైద్యులు మందులు రాస్తే ఇక ఆ రోగి ఆరోగ్యం మరింత క్షీణించక తప్ప దు. స్విమ్స్‌కు వచ్చి అనారోగ్యం బారిన పడుతున్నామని రోగులంటున్నారు. స్విమ్స్‌లో ఔట్ సోర్సింగ్ నర్సులు మొక్కుబడిగా పనిచేస్తున్నారు. వీరిపై అధికారులకు ఫిర్యా దు చేసినా స్పందన లేదు. అవినీతి ఫార్మసీ.. ఫార్మసీ విభాగం అవినీతిమయంగా మారింది. కమీషన్లందుకుని తిరుపతిలోని కొన్ని మెడికల్ ఏజెన్సీలకు మందుల సరఫరా కాంట్రాక్ట్ అప్పగించారు. ఇందులో అధికంగా జనరిక్ మందులే ఉంటున్నా యి. వైద్యులు సూచించే మందులు ఫార్మసీలో దొరకడం లేదు. ఏజెన్సీలకు లాభమొచ్చే కొన్ని రకాల మందులు మాత్రమే సరఫరా చేస్తున్నారు. రోగులకు అవగాహన లేకుండా ఇక్కడిచ్చే మందులు వేసుకుంటే మరింత అనారోగ్యం పాలవ్వక తప్పదు. స్విమ్స్‌లో ఉన్నత పదవుల్లో ఉన్న సీఎం బంధువుల కమీషన్ల వ్యవహారం వల్ల ఫార్మసీ సేవలు దెబ్బతింటున్నాయి. అత్యవసర విభాగం సేవలు అధ్వానమే. 15 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరో 10 కేసులకు స్ట్రెచర్లపై ఉంచి సేవలందిస్తున్నారు. ఇంతపెద్ద విభాగంలో 10 వెంటిలేటర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సిఫారసు ఉంటేనే ఇక్కడ చేర్చుకుంటున్నారు. ప్రముఖులకు కూడా ఇక్కడ నామమాత్ర వైద్య సేవలే. సాధారణ రోగుల పరిస్థితి దారుణంగా మారింది. 300 మందికిపైగా వైద్యులు, 250 మందికిపైగా నర్సులు పనిచేస్తున్నారు. పీజీలు, నర్సింగ్, ఎంబీబీఎస్, పారామెడికల్ విద్యార్ధులు రోగులకు సేవలందిస్తున్నారు. అయినా ఇన్‌పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదు. రాయలసీమ ప్రాంతం నుంచే గాక నెల్లూరు నుంచి ఓపీ నిమిత్తం రోజుకు 2వేల మంది రోగులు వస్తుంటారు. పట్టించుకోని డైరెక్టర్.. స్విమ్స్‌లో పరిపాలన పూర్తిగా గాడితప్పింది. డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ నెలలో ఎన్ని రోజులు ఆస్పత్రిలో ఉంటారన్నది చెప్పలేని పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిగట్టుకుని ఈయన్ను నియమించారు. గత డైరెక్టర్ డాక్టర్ వెంగ మ్మ ఓపీ, వార్డులను సందర్శించి రోగులకు అందుతున్న సేవలను ఆరా తీసేవారు. సేవా లోపం ఉంటే తక్షణం చర్యలు తీసుకునేవారు. ప్రస్తుత డైరెక్టర్ అందుబాటులో ఉండడం లేదు. వైద్య సేవలపై ఫిర్యాదు చేయాలనుకుంటే కనీసం డైరెక్టర్ ఛాంబర్ గేటు వరకు వెళ్లడం కష్టమే. -
అడవిలో చల్లని తల్లి!
ఆమె చేయి చలవ. ఎంత చలవంటే.. ఎంతటి విషమైనా కళ్లు తేలేయాల్సిందే! ఆకులను రెండు చేతులతో నలిపి రసం పిండిందంటే.. ఏ జబ్బయినా ఇట్టే తట్టా బుట్టా సర్దేయాల్సిందే. అది కేవలం ఆమె నిండు మనసుతో ఇచ్చే మందు శక్తి మాత్రమే కాదు. ఆమె నోటి నుంచి జాలువారే చల్లని మాటలు రోగులకు కొండంత ధైర్యాన్నిస్తాయి. తాము త్వరలోనే కోలుకుంటామన్న భరోసానిస్తాయి. అందుకే అందరూ ఆమెను ‘అడవిలో అమ్మ’ అని ఆప్యాయంగా పిలుస్తుంటారు. ఆమె అసలు పేరు లక్ష్మీ కుట్టి. 75 ఏళ్లు. కేరళలోని తిరువనంతపురం జిల్లా కల్లార్ అటవీ ప్రాంతంలో కొండకోనల్లో తాటాకు గుడిసే ఆమె నివాసం.పురుగో, పుట్రో, పామో, తేలో కుట్టిందంటే.. ఎక్కడెక్కడి నుంచో కొండలు ఎక్కి మరీ లక్ష్మీ కుట్టి దగ్గరకు వస్తుంటారు కేరళవాసులు. లక్ష్మీ కుట్టికి అడవి అన్నా, ఔషధ మొక్కలన్నా పంచప్రాణాలు. 50వ దశకంలో చదువుకున్న తొలి గిరిజన బాలిక ఆమే. తండ్రి చదువెందుకన్నా.. పట్టుపట్టి బడికెళ్లింది. రోజూ పది కిలోమీటర్లు నడిచి వెళ్లి కష్టపడి చదువుకుంది. ఆ బడిలో 8వ తరగతి వరకే ఉండటంతో అక్కడితో చదువు ఆగిపోయింది. తల్లి దగ్గర్నుంచి వైద్యం అడవిలోని కనీసం 500 రకాల వ్యాధులు, రుగ్మతలకు మూలికా వైద్యం చేయటం లక్ష్మీ కుట్టి ప్రత్యేకత. అయితే, పాము లేదా తేలు కుట్టిన సమస్యలతోనే ఎక్కువ మంది తన దగ్గరకు వస్తున్నారని ఆమె అంటారు. తన తల్లి దగ్గరి నుంచే ఈ వైద్యం నేర్చుకున్నానని, ఒక్కటి కూడా మరచిపోలేదంటారు. అయితే, ఈ వందలాది ఔషధ మొక్కల గుణగణాల గురించి, వైద్య పద్ధతుల గురించి ఇప్పటి వరకు ఎక్కడా రాసి పెట్టలేదు. ఇది గమనించిన కేరళ అటవీ శాఖ అరుదైన ఈ సంప్రదాయ వైద్య విజ్ఞానాన్ని గ్రంధస్థం చేయాలని ప్రయత్నిస్తోంది. అందుకు లక్ష్మీ కుట్టి సహకారం తీసుకుంటోంది. ప్రకృతి నుంచి ఫార్మసీ ఈ అడవి బామ్మను వెతుక్కుంటూ అవార్డులు వచ్చాయి. 1995లో తొలిగా ‘నాటు వైద్య రత్న’ అవార్డుతో కేరళ ప్రభుత్వం సత్కరించింది. ఈ అవార్డు వచ్చిన తర్వాత దూర ప్రాంతాల నుంచి కూడా జనం ఆమె వద్దకు వైద్యం కోసం వస్తున్నారు. అవార్డుల పరంపరలో తాజాది భారతీయ జీవవైవిధ్య కాంగ్రెస్ అవార్డు(2016). తనతోపాటు రోజూ బడికి వచ్చి చదువుకున్న మేనబావ మతన్ కానిని 16వ ఏట ఆమె పెళ్లాడింది. ‘నేను తీసుకున్న నిర్ణయాల్లో, సాధించిన విజయాలన్నిటిలోనూ ఆయన నాకు తోడు నీడగా ఉన్నాడు. నేను లేకపోయినా నువ్వు ఇవన్నీ సాధించేదానివే. ఎందుకంటే నువ్వు అంతటి ధీర వనితవు అని అంటూ ఉండేవాడు. ‘‘గత ఏడాది చనిపోయే వరకు నాకు సరైన జీవిత భాగస్వామిగా ఉన్నాడు’ అందామె. వారికి ముగ్గురు మగ సంతానం. విషాదం ఏమిటంటే పెద్ద కొడుకును ఏనుగు చంపేసింది. చిన్న కొడుకు రోడ్డు ప్రమాదంలో అకాల మరణం పాలయ్యాడు. (రెండో కొడుకు రైల్వే చీఫ్ టిక్కెట్ కలెక్టర్‌గా పనిచేస్తున్నాడు). అయినా ఆమె కుంగిపోలేదు, అడవినీ, వైద్యాన్నీ వదల్లేదు. వ్యంగ్య రచయిత్రి కూడా! లక్ష్మీ కుట్టి మూలికా వైద్యురాలిగా మాత్రమే కాదు, వ్యంగ్యం పండించిన కవిగా, రచయిత్రిగా కూడా కేరళలో ప్రసిద్ధి పొందారు! గిరిజన సంస్కృతీ సంప్రదాయాల గురించి, అడవుల ప్రాముఖ్యత గురించి ఆమె వ్యాసాలు రాశారు. వీటి సంకలనం ప్రచురితమైంది. ‘వీటిని గిరిజన భాషలో కాదు, మళయాళంలోనే రాశాను. అలతి పదాలనే వాడాను. పామరులైనా సులువుగా పాడుకునేలా’ అంటారామె. ‘ఈ అడవే నా ప్రపంచం. బయటి ప్రపంచం నాకు చాలానే ఇచ్చింది. అవార్డులు, సత్కారాలతోపాటు పుస్తకాలనూ ఇచ్చింది. అయినా, నేను అడవిని వదలి బయటికి రాలేను. అడవిలో జీవించాలంటే, ధైర్యం ఉండాలి’ అంటున్నది ఒంటరిగానే అడవిలోనే ఉంటున్న ఈ బామ్మగారు. – పంతంగి రాంబాబు -
ఫార్మాసిటీలో పెట్టుబడులు పెడతాం
యూఏఈ ఎక్సే్చంజ్ చైర్మన్ బీఆర్ శెట్టి ఆసక్తి మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన పారిశ్రామికవేత్త సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొల్పనున్న ఫార్మాసిటీ, మెడికల్ డివైజెస్ పార్కుల్లో పెట్టుబడులు పెట్టేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, యూఏఈ ఎక్సే్చంజ్ చైర్మన్ బీఆర్ శెట్టి ఆసక్తి చూపారు. హెల్త్‌కేర్ రంగంలో కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉందని ఆయన పేర్కొన్నారు. బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావుతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు బీఆర్ షెట్టి సూచనప్రాయంగా అంగీకరించారు. తెలంగాణ గురించి తనకు చాలా మంది చాలా విషయాలు చెప్పారని, ఇప్పుడు మంత్రిని కలసి రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి గురించి స్వయంగా తెలుసుకున్నట్లు చెప్పారు. దుబాయ్, అబుదాబిల్లోని పారిశ్రామిక వేత్తలతో సమావేశం ఏర్పాటుచేసి తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు తెచ్చేలా తనవంతు కృషి చేస్తానని చెప్పారు. సంస్థ తరపున సామాజిక సేవా కార్యక్రమాలను సైతం చేపట్టేందుకు అవకాశం ఇవ్వాలని, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తామన్నారు. ఫార్మాసిటీ, మెడికల్ డివైజెస్ పార్కుల్లో పెట్టుబడులు పెట్టాలని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ఆహ్వానించారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం, సింగిల్ విండో అనుమతుల వివరాలను వివరించారు. హైదరాబాద్ బల్క్ డ్రగ్స్ ఉత్పత్తులకు రాజధానిగా అభివృద్ధి చెందిందని, లైఫ్‌సైన్సెస్, ఏరోస్పేస్ రంగాల్లో కూడా అధికంగా పెట్టబడులు వస్తున్నాయన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్ర్రీ
-
నిమిషం ఆలస్యమైనా ప్రవేశం నిరాకరణ
⇔ నేడు ఎంసెట్ పరీక్ష ⇔ గంట ముందు నుంచే పరీక్ష హాల్లోకి అనుమతి ⇔ ఉదయం 10 నుంచి ఇంజనీరింగ్.. ⇔ మధ్యాహ్నం 2:30 గంటలకు అగ్రికల్చర్, ఫార్మసీ సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఎంసెట్–17 పరీక్ష శుక్రవారం జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు ఇంజనీ రింగ్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అగ్రికల్చరల్, ఫార్మసీ పరీక్షలను నిర్వహిస్తారు. పరీక్ష సమయానికి గంట ముందు నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా హాల్లోకి రానివ్వరు. పరీక్ష ప్రారంభానికి ముందుగానే విద్యార్థుల బయోమెట్రిక్ వివరాలను నమోదు చేస్తారని, విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలని ఎంసెట్ కన్వీనర్ ప్రొ.యాదయ్య సూచించారు. ఏర్పాట్లన్నీ పూర్తి పరీక్ష నిర్వహణ కోసం ఎంసెట్ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం ఉదయం 6 గంటలకు ప్రశ్నపత్రం సెట్లను విడుదల చేస్తారు. ఎంసెట్ ఇంజనీరింగ్‌కు 1,41,187, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు 79,061 మంది.. మొత్తంగా 2,20,248 మంది పరీక్షలు రాయనున్నారు. ఇక ఈ ఎంసెట్‌కు ఏపీ నుంచి 35 వేల మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి ♦ పరీక్ష హాల్లోకి ఒక్కసారి వెళ్లిన అభ్యర్థిని పరీక్ష పూర్తయ్యే వరకు బయటకు రానివ్వరు. ♦ విద్యార్థి బ్లాక్/బ్లూ బాల్ పాయింట్ పెన్, పూర్తి చేసిన ఆన్లైన్ దరఖాస్తు ఫారం, హాల్‌టికెట్‌ను మాత్రమే పరీక్ష హాల్లోకి తీసుకెళ్లాలి. ఆన్లైన్ దరఖాస్తు ఫారాన్ని ఇన్విజిలేటర్‌కు అందజేయాలి. ♦ పరీక్ష రాసిన తర్వాత ఓఎంఆర్ జవాబు పత్రాన్ని ఇన్విజిలేటర్‌కు ఇవ్వాలి. లేదంటే ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెడతారు. ♦ క్యాలిక్యులేటర్, మేథమెటికల్/లాగ్ టేబుల్, పేజర్, సెల్ఫోన్లు, వాచీలు వంటి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. తెల్లకాగితాల వంటి వాటినీ తీసుకెళ్లవద్దు. -
కాలేజీల బదిలీకి మే 31 ఆఖరు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర వృత్తి విద్యాకోర్సులు చదువుతున్న విద్యార్థులు ఒక కాలేజీ నుంచి మరో కాలేజీకి బదిలీ అయ్యేందుకు మే 31లోగా దరఖాస్తు చేసుకునేందుకు విద్యాశాఖ వెసులుబాటు కల్పించింది. ఇందుకు ఇరు కాలేజీల నుంచి నిరభ్యంతర సర్టిఫికేట్ (ఎన్ఓసీ) తీసుకోవల్సి ఉంటుంది. ఎన్ఓసీ ఆధారంగా విద్యార్థులు తాము కోరుకున్న కాలేజీకి బదిలీ కావచ్చు. -
‘మేనేజ్మెంట్’ సీట్ల భర్తీ అంతంతే!
ఇంజనీరింగ్ కాలేజీల్లో మిగిలిన 15,744 యాజమాన్య కోటా సీట్లు భర్తీ అయిన సీట్ల సంఖ్య 14,794కే పరిమితం బీఫార్మసీలోనూ అదే పరిస్థితి.. 60 శాతం సీట్లే భర్తీ ప్రభుత్వానికి నివేదించిన ఉన్నత విద్యా మండలి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, ఫార్మ్-డీ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా కింద భర్తీ అయిన సీట్ల లెక్క తేలింది. యాజమాన్య కోటాలో కాలేజీల్లో చేరిన విద్యార్థుల ప్రవేశాలకు ఉన్నత విద్యా మండలి ర్యాటిఫికేషన్లను పూర్తి చేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి లెక్కలు అందజేసేందుకు నివేదికలు సిద్ధం చేసింది. గతేడాది మేనేజ్మెంట్ కోటాలో దాదాపు 55 శాతం సీట్లు భర్తీ కాగా ఈసారి మాత్రం కేవలం 48.44 శాతం సీట్లే భర్తీ అయ్యాయి. ప్రవేశాల కోసం యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చిన సీట్లు కూడా మొత్తం భర్తీ కాలేదు. 2016-17 విద్యా సంవత్సరంలో 219 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,04,598 సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. అందులో 74,060 సీట్లను (ప్రభుత్వ కాలేజీల్లోని 2,805 సీట్లు వంద శాతం కలుపుకొని) 70 శాతం కన్వీనర్ కోటా కింద భర్తీ చర్యలు చేపట్టగా, అందులో 54,172 సీట్లు భర్తీ అయ్యాయి. 30 శాతం మేనేజ్మెంట్ కోటాలో 30,538 సీట్ల భర్తీకి చర్యలు చేపట్టగా అందులో 14,794 సీట్లే భర్తీ అయ్యాయి. 15,744 సీట్లు మిగిలిపోయాయి. అలాగే 123 బీఫార్మసీ కాలేజీల్లో 9,226 సీట్ల భర్తీకి ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టగా మేనేజ్మెంట్ కోటాలోని 2,714 సీట్లలో 1,592 సీట్లే భర్తీ అయ్యాయి. ఇక ఫార్మ్-డీలో 54 కాలేజీల్లోని 1,620 సీట్లలో మేనేజ్మెంట్ కోటా పరిధిలో ఉన్న 486 సీట్లలో 384 సీట్లు భర్తీకాగా 102 సీట్లు మిగిలిపోయాయి. -
‘ఫార్మశీ’లో ఉపాధి అవకాశాలు పుష్కలం
ఎచ్చెర్ల: ఫార్మశీ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టెక్కలి డివిజన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎ.లావణ్య అన్నారు. చిలకపాలెం సమీపంలోని శివానీ ఇ ంజినీరింగ్ కళాశాలలో శనివారం ప్రపంచ ఫార్మశీ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యా బోధన ప్రయోగాత్మకంగా ఉండాలన్నారు. పరిశోధనాత్మక విద్యతోనే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. విదేశాల్లో ఫార్మశిస్టులకు వైద్యులతో సమాన గుర్తింపు ఉందని, రోగానికి అవసరమైన మందులు సూచించేది ఫార్మశిస్టులేనని చెప్పారు. విద్యార్థులు విషయ పరిజ్ఞానం, నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డాక్టర్ రెడ్డీస్ ఉత్పత్తి విభాగం అధికారులు షేకత్దత్, రమాకేపాల్, ఇంజినీరింగ్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ బి.మురళీకృష్ణ, డాక్టర్ జీవీ రమేష్‌బాబు, ఫార్మశీ పిన్సిపాల్ డాక్టర్ పి.వెంకటేశ్వరరావు, నరేంద్రకుమార్ పాల్గొన్నారు. -
ఫార్మసీ రంగానికి ఎంతో ప్రాధాన్యం ఉంది
దివాన్‌చెరువు (రాజానగరం) : ఫార్మసీ రంగానికి ఎంతో ప్రాధాన్యం ఉందని, ఈ కోర్సు చేసిన వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఆదిత్య డిగ్రీ కళాశాల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి అన్నారు. దివాన్‌చెరువులోని వీజేస్ ఫార్మసీ కళాశాలలో బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ మొదటి సంవత్సరం తరగతుల ప్రారంభం సందర్భంగా విద్యార్థులతో శుక్రవారం నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఫార్మసీ రంగంలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని ఫార్మసీ కౌన్సిల్ సభ్యులు డీఎన్ఆర్ ప్రసాద్‌రెడ్డి అన్నారు. దేశంలోని 30 శాతం పరిశ్రమలు హైదరాబాద్, విశాఖపట్నంలోనే ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కేఎన్ విద్యాధర్, కరస్పాండెంట్ జగన్మోహన్రెడ్డి, వైస్ ప్రిన్పిపాల్ డాక్టర్ డి. నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు. -
17, 18 తేదీల్లో పార్మసీ, ఫార్మాడీ తుదివిడత కౌన్సెలింగ్
ఎచ్చెర్ల: శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాల సహాయ కేంద్రంలో ఈ నెల 17, 18 తేదీల్లో తది విడత బైపీసీ స్ట్రీమ్, బీ ఫార్మసీ, ఫార్మా డీ ప్రవేశాలు నిర్వహించనున్నట్టు క్యాంప్ ఆఫీసర్ ఆర్.త్రినాథరావు, అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్ టీవీ రాజశేఖర్‌లు ఆదివారం చెప్పారు. గతంలో హాజరుకాని విద్యార్థులు తమ విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని, సీట్లు పొందిన విద్యార్థులు ఆప్షన్లు మార్చుకోవచ్చని సూచించారు. -
17, 18 తేదీల్లో పార్మసీ, ఫార్మాడీ తుదివిడత కౌన్సెలింగ్
ఎచ్చెర్ల: శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాల సహాయ కేంద్రంలో ఈ నెల 17, 18 తేదీల్లో తది విడత బైపీసీ స్ట్రీమ్, బీ ఫార్మసీ, ఫార్మా డీ ప్రవేశాలు నిర్వహించనున్నట్టు క్యాంప్ ఆఫీసర్ ఆర్.త్రినాథరావు, అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్ టీవీ రాజశేఖర్‌లు ఆదివారం చెప్పారు. గతంలో హాజరుకాని విద్యార్థులు తమ విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని, సీట్లు పొందిన విద్యార్థులు ఆప్షన్లు మార్చుకోవచ్చని సూచించారు. -
‘ఫీవర్’కు సుస్తీ!
► ‘ఓపీ’క లేక సొమ్మసిల్లుతున్న రోగులు ► రిపోర్టు తీసుకొచ్చే సరికి వైద్యులుగాయబ్ ► సాధారణ చికిత్సలకు తప్పని పడిగాపులు ► ఉస్మానియా సహా అన్ని ఆస్పత్రుల ఓపీలు కిటకిట సాక్షి, సిటీబ్యూరో: కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ఆస్పత్రికి వచ్చిన జ్వర పీ డితులకు నేడు కనీస సూదిమందు కూడా వేయలేకపోతున్నారు. సుస్తీ చేసిన ఆస్పత్రికి ఎప్పటికపుడు చికిత్స చేసి గాడిలో పెట్టాల్సిన అధి కారులు దానిని పట్టించుకోవడమే మానేశారు. సాధారణ రోజుల్లో ఆస్పత్రి అవుట్ పేషంట్ విభాగానికి రోజుకు సగటున 600–700 మంది రో గులు వస్తుంటారు. ఇటీవల ఎడతెరపీ లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఓపీకి 2000 మందికి పైగా వస్తున్నారు. అయితే రోగుల సంఖ్యకు తగినన్ని ఓపీ కౌంటర్లు లేక పోవడంతో ఓపీ టికెట్లు తీసుకునేందుకు గంటల తరబడి క్యూలో నిలబడాల్సి రావడంతో తరచూ తొక్కిసలాటలు జరుగుతున్నాయి. దీనికితోడు జ్వరాలతో బాధపడుతున్న వారు క్యూ లైన్లలో నిరీక్షించ లేక సొమ్మసిల్లి పడిపోతున్నా, పట్టించుకునేవారు కరువయ్యారు. ఇటీవల రోగుల తాకిడి పెరగడంతో ఓపీ, ఫార్మసీల సమయాన్ని సాయంత్రం 4 గంటల వరకు పొడిగించడమేగాక రోగుల రద్దీ దృష్ట్యా ఉస్మానియా నుంచి ఇద్దరు సీనియర్ వైద్యులను డిప్యూటేషన్‌పై ఇక్కడికి పంపినట్లు ప్రభుత్వం పేర్కొన్నా రోగుల అవసరాలు తీరడం లేదు. ఒ క్కో వైద్యుడు రోజుకు సగటున 150–200 మంది రోగులను చూడాల్సి వస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈఎన్టీ వైద్యుడు లేక పోవడంతో డిఫ్తీరియాతో బాధపడుతున్న వారికి సరైన వైద్యం అందడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో వారిని ఉస్మానియాకు సిఫార్సు చేస్తున్నారు. ఇప్పటికే పరిస్థితి విషమించి 11 మంది డిఫ్తీరియాతో మృతి చెందడం విశేషం. అందరూ జూనియర్లేః నగరంలోని ఉస్మానియా, గాంధీ, సుల్తాన్‌బజార్, నిలోఫర్, పేట్లబురుజు, ఈఎన్టీ ఆస్పత్రుల్లో సగటున 2000–3000 మంది రోగులు వస్తుంటారు. ఉదయం ఏడు గంటలకు ఓపీ కౌంటర్‌కు చేరుకుని రెండు గంటలకుపైగా క్యూలైన్లో నిలబడి టోకెన్ తీసుకుని ఓపీకి వెళ్తే తీరా అక్కడ జూనియర్ డాక్టర్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. ఒక వేళ సీనియర్లు ఉన్నా...రక్త, మూత్ర పరీక్షలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుని వచ్చేలోగా వారు అక్కడినుంచి వెళ్లి పోతున్నారు. దీంతో సాధారణ చికిత్సల కోసం రెండు మూడు రోజులు ఆస్పత్రిలోనే పడిగాపులు కాయాల్సి వస్తుంది. -
ముగిసిన ఫార్మసీ కౌన్సెలింగ్
ఎచ్చెర్ల: బీ ఫార్మసీ, బయోటెక్నాలజీ, ఫార్మాడీ ప్రవేశాలకు బైపీసీ స్ట్రీం విద్యార్థుకు నిర్వహించిన ధ్రువీకరణ పత్రాల పరిశీలన, వెబ్ కౌన్సెలింగ్ ముగిసింది. మూడు రోజులుగా శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాలలోని సహాయ కేంద్రంలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన జరిపారు. చివరిరోజు బుధవారం 80 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఓసీ, బీసీలు 41 మంది, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 39 మంది ఉన్నారు. మొత్తం మూడు రోజుల ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు 243 మంది హాజరయ్యారు. వీరిలో 189 మంది ఓసీ, బీసీ, 54 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉన్నారు. గత ఏడాది 245 మంది విద్యార్థులు హాజరయ్యారు. కౌన్సెలింగ్ ప్రక్రియను విభాగాధిపతులు మేజర్ కె.శివకుమార్, టీవీ రాజశేఖర్, మురళీకృష్ణ పర్యవేక్షించారు. -
ఇంజనీరింగ్ సీట్లలో భారీగా కోత
79,705 సీట్లకే గుర్తింపు.. 46 వేల సీట్లకు కోత - కాలేజీల అనుబంధ గుర్తింపు జాబితా వెలువరించిన జేఎన్టీయూహెచ్ సాక్షి, హైదరాబాద్ : జేఎన్టీయూహెచ్ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లకు ఈసారి భారీగా కోత పడింది. సీట్లే కాదు కాలేజీల సంఖ్య కూడా తగ్గిపోయింది. గతేడాది మొత్తంగా 1.16 లక్షల సీట్లకు అనుబంధ గుర్తింపు ఇవ్వగా ఈసారి 79,705 సీట్లకే గుర్తింపు ఇచ్చింది. గతేడాది 220 కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వగా.. ఈసారి 158 కాలేజీలకే గుర్తింపు ఇస్తున్నట్టు ఆదివారం రాత్రి జేఎన్టీయూహెచ్ ప్రకటించింది. నిర్దిష్ట ప్రమాణాలు, ఫ్యాకల్టీ, సదుపాయాలు ఉన్న మేరకే కాలేజీల్లో పలు కోర్సులు, బ్రాంచీలకు అనుబంధ గుర్తింపు మంజూరు చేసింది. దీంతో చాలా కాలేజీలు ఒకట్రెండు కోర్సులకే పరిమితమయ్యాయి. 40 కాలేజీలు ఈసారి అనుబంధ గుర్తింపు కోసమే దరఖాస్తు చేసుకోకపోగా, మరో 43 కాలేజీలకు జేఎన్టీయూహెచ్ అనుబంధ గుర్తింపును నిరాకరించింది. వాటిలో 36 వేలకు పైగా సీట్లకు కోత పెట్టింది. ఇక అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) జేఎన్టీయూహెచ్ పరిధిలోని కాలేజీల్లో 1.24 లక్షల సీట్లకు అనుమతి ఇవ్వగా జేఎన్టీయూహెచ్ 158 కాలేజీల్లోని 671 కోర్సుల్లో 79,705 సీట్లకే అనుబంధ గుర్తింపునిచ్చింది. అంటే దాదాపు 46 వేల సీట్లకు కోత పడింది. ఇక ఎంసెట్‌లో 1.04 లక్షల మంది అర్హత సాధించి ర్యాంకులు పొందగా.. 63,777 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్నారు. ప్రస్తుతం వారంతా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అర్హులు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రకటన సోమవారం రానుంది. వాటిల్లో 14 వేల వరకు సీట్లు ఉండగా.. 10 వేల సీట్ల వరకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. దీంతో ఈసారి మొత్తంగా 90 వేల వరకు ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అనుబంధ గుర్తింపు 158 కాలేజీలకే ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అనుబంధ గుర్తింపు కోసం నోటిఫికేషన్ జారీ చేయగా 241 కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. వాటి దరఖాస్తులను పరిశీలించి, క్షేత్రస్థాయిలో జేఎన్టీయూహెచ్ తనిఖీలను నిర్వహించింది. అలాగే మరోవైపు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తనిఖీలు నిర్వహించింది. రెండు విభాగాల తనిఖీ నివేదికలను పోల్చి చూసి 158 కాలేజీల్లో 79,705 సీట్లలో ప్రవేశాలకు అనుమతి ఇచ్చింది. సగం ఫార్మసీ కాలేజీలకు నో జేఎన్టీయూహెచ్ పరిధిలో 89 ఫార్మసీ, 30 ఎంబీఏ కాలేజీలు ఉన్నాయి. ఈసారి 46 ఫార్మసీ కాలేజీల్లోని 4 వేల సీట్లలో ప్రవేశాలకే అనుబంధ గుర్తింపు లభించింది. అనుబంధ గుర్తింపు ఇచ్చిన కాలేజీల్లో కోర్సులు, సీట్ల వివరాలను ఇంజనీరింగ్ ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్‌కు పంపించింది. -
ఏపీలో 43వేల సీట్లు ఖాళీ
ఒకరోజు ముందే ఎంసెట్ తొలివిడత సీట్ల కేటాయింపు సాక్షి, హైదరాబాద్: ఏపీలోని ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కాలేజీల్లో భారీగా సీట్లు మిగిలిపోతున్నాయి. ఏపీ ఎంసెట్‌లో ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్యా కోర్సులకు నిర్వహించిన మొదటి విడత కౌన్సెలింగ్‌కు సంబంధించి సీట్ల కేటాయింపును అడ్మిషన్ల కమిటీ షెడ్యూల్‌కన్నా ఒకరోజు ముందే సోమవారమే పూర్తిచేసింది. రాష్ట్రంలోని కాలేజీల్లో ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో మొత్తం 1,61,512 సీట్లు ఉన్నాయి. అందులో కన్వీనర్‌కోటాలో 1,13,058 సీట్లకు గాను మొదటివిడత కౌన్సెలింగ్‌లో 69,459 (61.4 శాతం) సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 43,599 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. ఎంసెట్‌లో మెరిట్ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నవారిలో అత్యధికులు ఈసారి ఇక్కడి కాలేజీల్లో చేరేందుకు ఆసక్తి చూపలేదని తాజా కేటాయింపులు స్పష్టంచేస్తున్నాయి. అనేకమంది జేఈఈ మెయిన్స్, అడ్వాన్సుతో పాటు పలు ఇతర యూనివర్సిటీలు, డీమ్డ్ వర్సిటీల ప్రవేశపరీక్షల్లో అర్హత సాధించి ఉండడం, వాటిలో చేరేందుకు ఉత్సుకత చూపుతుండడం ఏపీ ఎంసెట్ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు భారీగా మిగిలిపోవడానికి కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. వెబ్సైట్ ద్వారా సెల్ఫ్‌జాయినింగ్ రిపోర్టు సీట్లు కేటాయింపు అయిన అభ్యర్థులకు కాలేజీ, కోర్సుల వారీగా సమాచారాన్ని అడ్మిషన్ల కమిటీ సంక్షిప్త సమాచారాన్ని వారి ఫోన్లకు పంపింది. సీట్లు కేటాయింపుపైన అభ్యర్థులు ‘హెచ్‌టీటీపీఎస్://ఏపీఈఏఎంసీఈటీ.ఎన్ఐసీ.ఐఎన్’లో పొందుపరిచిన సెల్ఫ్‌జాయినింగ్ రిపోర్టు ఆప్షన్ ద్వారా, లేదా సమీపంలోని హెల్ప్‌లైన్ సెంటర్లలో కానీ సెల్ఫ్ రిపోర్టు చేయాలని అడ్మిషన్ల కమిటీ కన్వీనర్ బి.ఉదయలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్లైన్లో సెల్ఫ్‌రిపోర్టింగ్ చేసిన అనంతరం సంబంధిత రిపోర్టింగ్ కాపీలు రెండింటిని ప్రింటవుట్ తీసుకోవాలి. వాటిలో ఒకదాన్ని తమకు కేటాయించిన కాలేజీలకు జులై 1లోగా తీసుకువెళ్లి సమర్పించి మరో దానిపై ఆ కాలేజీనుంచి అకనాలెడ్జిమెంటు చేయించుకోవాలి. తమకు మొదటివిడత కేటాయించిన సీటు సంతృప్తికరంగా ఉందని భావిస్తే అభ్యర్థులు ఆ కాలేజీల్లో రిపోర్టు మాత్రమే చేయాలి. ఒరిజినల్ ధ్రువపత్రాలను, ట్యూషన్ ఫీజులను (ఫీజు రీయింబర్స్‌మెంటు పరిధిలోకి రానివారు) కాలేజీలకు అందించరాదు. చివరి విడత కౌన్సెలింగ్ పూర్తయ్యాక మాత్రమే ఒరిజినల్ ధ్రువపత్రాలు సమర్పించి ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఎంసెట్‌లో అర్హులైన అభ్యర్థులందరికీ రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంటుందని అడ్మిషన్ల కమిటీ వర్గాలు వివరించాయి. ఇంజనీరింగ్, ఫార్మ కాలేజీల్లో తరగతులు జూలై 1నుంచి ప్రారంభమవుతాయని ఉదయలక్ష్మి వివరించారు. -
ఫలించిన కల!
ఉద్యమాలు, ధర్నాలకుదక్కిన ప్రతిఫలం ఎంతోమంది విద్యార్థులకు లబ్ధి పాలమూరు యూనివర్సిటీ : పాలమూరు యూనివర్సిటీ (పీయూ)కు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) గుర్తింపు లభించింది. ఈ మేరకు బుధవారం న్యూఢిల్లీ నుంచి యూనివర్సిటీకి లేఖ పంపారు. ఇక నుంచి దేశంలో ఉన్న అతి ముఖ్యమైన యూనివర్సిటీల సరసన పీయూ నిలవనుంది. దీంతో పాటు ఇక్కడ చదివిన వి ద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉండనుంది. పీసీఐ గు ర్తింపు వచ్చినట్లు లేక రావడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పీసీఐ గుర్తింపు కోసం పీయూ విద్యార్థులు ఏడేళ్ల కాలం నుంచి రోజుల తరబడి ఎన్నో ఉద్యమాలు.. పరీక్షల బహిష్కరణ..ధర్నాలు.. రాస్తారోకోలు చేశారు. దీంతో వాటికి ప్రతిఫలం దక్కింది. పాలమూరు యూనివర్సిటీ 2008 ఆగస్టులో ప్రారంభం కాగా, ఇందులో ఫార్మసీ కళాశాల 2009లో ఏర్పాటు చేశారు. కళాశాల ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు మూడు బ్యాచ్‌లు చదువు పూర్తి చేసుకున్నా బయటికి వెళ్లిపోయారు. ప్రస్తుతం నాలుగో బ్యాచ్ నడుస్తోంది. పీసీఐ అంటే.. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ)ని పార్లమెట్ నామినేట్ చేస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేస్తుంది. దీనిని 1948లో ప్రారంభించారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఫార్మసీ విద్య ఎలా కొనసాగుతుందో అనే విషయాన్ని పరిశీలన చేయడం పీసీఐ బాధ్యత. పీసీఐ గుర్తింపు లేని యూనివర్సిటీలను సందర్శించి అక్కడ కనీస సౌకర్యాలు ఉన్నాయా.. పీసీఐ గుర్తింపు ఇవ్వడానికి ఆ విశ్వవిద్యాలయానికి అర్హత ఉందో లేదో పరిశీలన చేస్తారు. అర్హత ఉంటే ఆ యూనివర్సిటీకి గుర్తింపు ఇస్తారు. గుర్తింపు ఇవ్వడం వల్ల యూనివర్సిటీ ఖ్యాతి పెరగడంతో పాటు అక్కడ చదువుకునే విద్యార్థులకు అన్ని రంగాల్లో అవకాశాలు ఉంటాయి. పీసీఐ వల్లే విద్యార్థులకు జరిగే మేలు.. పీసీఐ గుర్తింపు రావడం వల్ల స్థానికంగా చదువుకునే విద్యార్థులు ఎంతో మేలు చేకూరనుంది.. చదువు పూర్తయిన తర్వాత విద్యార్థులకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఫార్మసిస్టు ఉద్యోగ అవకాశం, డ్రగ్గిస్ట్ ఉద్యోగాలు, రైల్వే ఫార్మసిస్ట్, మిలిటరి ఫార్మసిస్టు, స్వతహాగా మెడికల్ దుకాణం పెట్టుకోవడానికి అవకాశం ఇలా ప్రతి ఉద్యోగానికి పీసీఐ గుర్తింపు ఉన్న సర్టిఫికెట్ చాలా ఉపయోగంగా ఉంటుంది. పీసీఐ గుర్తింపు లేకుంటే ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి ఉద్యోగానికీ వారు అర్హులు కాదు. మార్కెట్లో ఉన్న పెద్ద పెద్ద పరిశ్రమలలో పీసీఐ గుర్తింపు ఉన్న కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు మొదటి ప్రాధాన్యం ఇస్తారు. పీయూను రెండుసార్లు సందర్శించిన పీసీఐ పాలమూరు యూనివర్సిటీని పీసీఐ బృందం 2014 జనవరిలో మొదటిసారి పరిశీలించింది. ఇద్దరు సభ్యుల బృందం.. ఫార్మసీ కళాశాల, హాస్టల్, ఫార్మసీ ల్యాబ్‌లు, ఇతర సౌకర్యాలపై పరిశీలన చేసి వెళ్లింది. అప్పుడు పీసీఐ గుర్తింపు ఇవ్వాల్సిన సౌకర్యాలు స్థానికంగా లేవని నివేదిక ఇవ్వడంతో గుర్తింపు రాలేదు. ఆ తర్వాత 2015 డిసెంబర్లో మరోమారు ఇద్దరు సభ్యుల బృందం సందర్శించింది. సభ్యులు స్థానిక సౌకర్యాలపై కొంతవరకు తృప్తి చెంది వెళ్లారు. పీయూ నుంచి పీసీఐ గుర్తింపు కోసం అవసరం అయిన పత్రాలు పంపించడంతో దాదాపు మూడు నెలల తర్వాత గుర్తింపు ఇస్తూ లేఖ పంపించారు. ఫార్మసీలో 4వ బ్యాచ్ రన్నింగ్.. పీయూలో ఫార్మసీ కళాశాల 2009లో ఏర్పాటు చేశారు. మూడు బ్యాచ్‌లలో 180మంది విద్యార్థులు విద్యను పూర్తి చేసి బయటకు వెళ్లారు. ప్రస్తుతం ఫార్మసీలో 4వ బ్యాచ్ నడుస్తుంది. ఆ విద్యారుల్థ చదువు కూడా మేలో ముగుస్తుంది. దీంతో పీసీఐ వల్ల వెళ్లిపోయిన 180మందితో పాటు ప్రస్తుతం చదువుకుంటున్న 60మందికి కూడా పీసీఐ గుర్తింపు దక్కనుంది. -
ఏప్రిల్ చివరినాటికి ఫీజుల ఖరారు!
ఫీజులపై మొదలైన సంప్రదింపులు మరో నెల రోజుల పాటు చర్చలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వృత్తి విద్యా కాలేజీల్లో వచ్చే మూడేళ్ల పాటు వసూలు చేయాల్సిన ఫీజుల ఖరారు ప్రక్రియ మొదలైంది. ఏప్రిల్ చివరి నాటికి ఫీజులను ఖరారు చేసే అవకాశముంది. తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్ తదితర వృత్తి విద్యా కళాశాలల ఆదాయ వ్యయాలకు సంబంధించిన లెక్కలు, వాటిని బట్టి ప్రతిపాదిత ఫీజులకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించింది. వాటన్నింటిని క్రోడీకరించి, ఆడిటర్ల నేతృత్వంలో కాలేజీ వారీగా ఆదాయ వ్యయాల పరిశీలన, ప్రతిపాదిత ఫీజు ఎంత మేరకు శాస్త్రీయంగా ఉందన్న అంశాలపై పరిశీలన జరుపుతోంది. చాలా కాలేజీలకు సంబంధించి ఈ ప్రక్రియను ఇటీవల పూర్తి చేసింది. అయితే ఆదాయ, వ్యయాలతో సంబంధం లేకుండా, ఫీజులను ప్రతిపాదించిన కళాశాలలతో సంప్రదింపుల కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇప్పటికే మూడు నాలుగు ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ కాలేజీ యాజమాన్యాలతో సమావేశం నిర్వహించింది. ఆయా కళాశాలలకు వచ్చిన ఆదాయం, వారు చేసిన వ్యయానికి సంబంధించిన వివరాలను తెలుసుకోవడంతోపాటు ప్రతిపాదిత ఫీజుల శాస్త్రీయతపై ఓ అంచనాకు వచ్చింది. రెండు మూడు రోజుల్లో కాలేజీ వారీగా సంప్రదింపులను చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెలాఖరు లేదా ఏప్రిల్ మొదటి వారం నాటికి సంప్రదింపులను పూర్తి చేయాలని భావిస్తోంది. అన్ని సదుపాయాలు కలిగి, నాణ్యతా ప్రమాణాలు పాటించే కాలేజీల్లో కనీసంగా 15 శాతానికి అటుఇటుగా ఫీజుల పెంపు ఉండే అవకాశం ఉందని యాజమాన్యాలు భావిస్తున్నాయి. -
ఏప్రిల్ 30లోగానే ఏఐసీటీఈ అనుమతులు
♦ ఆ తరువాత అనుమతులు నో ♦ 2016-17 షెడ్యూల్‌ను జారీ చేసిన ఏఐసీటీఈ ♦ వర్సిటీలు మే 31లోగా అనుబంధ గుర్తింపు ఇవ్వాలి ♦ జూన్ 30లోగా మొదటిదశ ప్రవేశాలు పూర్తి చేయాల్సిందే ♦ ఆగస్టు 1 నుంచి ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ తరగతులు ♦ పక్కాగా అమలు చేయాలని ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ వంటి మేనేజ్మెంట్ కోర్సులకు ఏప్రిల్ 30లోగా అనుమతులు ఇస్తామని, ఆ తరువాత ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇచ్చేది లేదని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) కరాఖండిగా చెప్పింది. వివిధ రాష్ట్రాల్లో యూనివర్సిటీలు కూడా అనుబంధ గుర్తింపు ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లో మే 31లోగా పూర్తి చేయాల్సిందేనని, ఆ తరువాత ఒక్క కాలేజీకి కూడా అనుబంధ గుర్తింపు ఇవ్వడానికి వీల్లేదని స్పష్టం చేసింది. 2016-17 విద్యా సంవత్సరం కోసం కాలేజీలకు అనుమతులు, అనుబంధ గుర్తింపు, ప్రవేశాల కౌన్సెలింగ్, తరగతుల ప్రారంభం తదితర వివరాలతో కూడిన షెడ్యూల్‌ను ఏఐసీటీఈ ప్రకటించింది. కొత్త కాలేజీల అనుమతులకు సంబంధించి 2016-17 ప్రొసీజర్ హ్యాండ్ బుక్ విడుదల చేసింది. వీటిని అమలు చేయాలని ఆదేశించింది. ఏఐసీటీఈ షెడ్యూల్ ఇలా... ► కొత్త కాలేజీలకు అనుమతులు, అదనపు సీట్ల పెంపు, సీట్ల రద్దు, కోర్సుల రద్దు, కాలేజీల మూసివేత వంటి అన్నింటికీ వచ్చే నెల 21లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► వాటన్నింటికి తాము ఏప్రిల్ 10లోగా అనుమతులిస్తాం.. ఒకవేళ ఆలస్యమైనా గరిష్టంగా ఏప్రిల్ 30లోగా పూర్తి చేస్తాం. ► ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ప్లానింగ్, ఎంసీఏ, ఫార్మసీ, ఎంబీఏ వంటి మేనేజ్మెంట్ కోర్సుల అండర్ గ్రాడ్యుయేషన్ (యూజీ), పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ), డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు అన్ని రాష్ట్రాల్లో జూన్ 30లోగా మొదటిదశ ప్రవేశాల కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపును పూర్తి చేయాలి. ► రెండో దశ ప్రవేశాల కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపును జూలై 10లోగా, చివరి దశ ప్రవేశాలను జూలై 20 లోగా పూర్తి చేయాలి. ► ఆగస్టు 1 నుంచి తరగతులను ప్రారంభించాలి. ► యూజీ, పీజీ కోర్సుల్లో సెమిస్టర్లో 75 రోజులపాటు రోజుకు 7 గంటల చొప్పున 525 గంటల పాటు బోధన, ప్రాక్టికల్స్ నిర్వహించాలి. ► వీటికి అదనంగా మరో 15 రోజులు పరీక్షల ప్రిపరేషన్, నిర్వహణకు కేటాయించాలి. మొత్తంగా 90 రోజులు ఉండాలి. ► ఫస్టియర్‌లో మొదటి సెమిస్టర్‌ను ఆగస్టు 1 నుంచి నవంబరు 30 వరకు, రెండో సెమిస్టర్ జనవరి 1 నుంచి ఏప్రిల్ 30 వరకు నిర్వహించాలి. ► ద్వితీయ, తృతీయ, నాలుగో సంవత్సరం విద్యార్థులకు జూలై 15న మొదటి సెమిస్టర్‌ను ప్రారంభించి, నవంబరు 15 నాటికి పూర్తి చేయాలి. రెండో సెమిస్టర్‌ను డిసెంబరు 15న ప్రారంభించి ఏప్రిల్ 15లోగా పూర్తి చేయాలి. -
భారీగా పెరిగిన కటాఫ్
ఇంజనీరింగ్, ఫార్మసీ తొలిదశ సీట్ల కేటాయింపు పూర్తి సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాల్లో ఈసారి కటాఫ్ బాగా పెరిగింది. ఉత్తమ ర్యాంకులు వచ్చిన విద్యార్థులకే మంచి కాలేజీల్లో సీట్లు లభించాయి. టాప్ కాలేజీల్లోని అన్ని బ్రాంచీల్లో కలిపి పరిశీలిస్తే... గతేడాదికంటే ఈ ఏడాది సీట్లు పొందిన విద్యార్థుల సగటు ర్యాంకు సగానికిపైగా పెరిగింది. ఉదాహరణకు సీబీఐటీ వంటి కాలేజీలోని అన్ని బ్రాంచీల్లో గతేడాది 6వేల ర్యాంకు వరకు ఓసీ అభ్యర్థులకు సీట్లు వస్తే... ఈసారి 3వేల ర్యాంకులోపే సీట్లన్నీ నిండిపోయాయి. ఈసారి ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు తగ్గిపోవడం, కోర్టు ఆదేశాల వల్ల వెబ్ కౌన్సెలింగ్‌లో పెట్టిన కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపకపోవడంతో కటాఫ్ భారీగా పెరిగిపోయింది. సీఎస్ఈ, ఈసీఈ వంటి బాగా డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్ల సంఖ్య తగ్గిపోవడం కూడా దీనికి కారణమైంది. ఇంజనీరింగ్ ప్రవేశాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం విద్యార్థులకు సీట్లు కేటాయించారు. విద్యార్థులు క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్లి తమ ర్యాంకు కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్ తెలిపారు. గత నెల 18 నుంచి 23 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టగా.. ఈనెల 17నుంచి 24వ రకు వెబ్ ఆప్షన్లు నిర్వహించారు. 34 కాలేజీలు మూతే! ఈసారి 5 కాలేజీల్లో ఒక్క విద్యార్థీ చేరలేదు. మరో 29 కాలేజీల్లో 9 మందిలోపే విద్యార్థులు చేరారు. ఈ 34 కాలేజీలు ఈసారి మూతపడే అవకాశముంది. ఇక 50 మందిలోపు విద్యార్థులు చేరిన కాలేజీల సంఖ్య కూడా మరో 60 నుంచి 70 వరకు ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ లెక్కన ఈసారి వంద కాలే జీల్లో పెద్దగా విద్యార్థులు చేరలేదన్నది అర్థం అవుతోంది. ఇక 100 శాతం ప్రవేశాలు జరిగిన కాలేజీలు 79 ఉన్నాయి. 9 వేల మందికి లభించని సీట్లు.. ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో కన్వీనర్ కోటాలో 86,313 సీట్లు ఉండగా.. 53,347 సీట్లు (61.81 శాతం) మాత్రమే భర్తీ అయ్యాయి. 32,966 సీట్లు మిగిలిపోయాయి. అయితే ఆప్షన్లు ఇచ్చుకున్న వారిలో 9,321 మంది విద్యార్థులకు సీట్లు రాలేదు. వారి ర్యాంకును బట్టి కాలేజీని ఎంచుకోకపోవడం వల్ల ఇలా జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఫార్మసీకి దెబ్బ: రాష్ట్రంలో 133 ఫార్మసీ కాలేజీల్లో 3,778 ఎంపీసీ స్ట్రీమ్ సీట్లు ఉండగా.. అందులో 125 సీట్లే భర్తీ అయ్యాయి. కాలేజీల సంఖ్య మేర కూడా విద్యార్థులు చేరలేదు. ఇదీ చివరి దశ ప్రవేశాల షెడ్యూల్ * 29న మొదటి దశలో పాల్గొనని వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ * 29 నుంచి 30వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు, ఆప్షన్లలో మార్పులు * 31న సీట్ల కేటాయింపు * ఆగస్టు 1న కాలేజీల్లో చేరేందుకు అవకాశం, అదే రోజునుంచి తరగతులు -
హై బీపీ కౌన్సెలింగ్
నా వయసు 40. ఇటీవలే తల తిరుగుతుంటే డాక్టర్‌ను సంప్రదించి బీపీ చెక్ చేయించుకున్నాను. అప్పుడు నా బీపీ 140/94 ఉంది. డాక్టర్ వరసగా ఐదు రోజుల పాటు ఎక్కడైనా చెక్ చేయించుకొని ఆ విలువలతో మళ్లీ రమ్మన్నారు. ఈ ఐదు రోజులూ మాకు దగ్గర్లోని ఒక ఫార్మసీలో నర్స్ దగ్గర చెక్ చేయించుకుంటే 120/80 ఉంది. నాకు బీపీ ఉన్నట్లా లేనట్లా? - సుధీర్‌కుమార్, నల్లగొండ మీరు డాక్టర్ వద్ద చెక్ చేయించుకున్నప్పుడు వచ్చిన బీపీ ఎక్కువే ఉంది. డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు కలిగే యాంగ్జైటీవల్లనో, ఆందోళన కారణంగానో వచ్చే బీపీని ‘వైట్ కోట్ హైపర్‌టెన్షన్’ అంటారు. మీరు ఫార్మసీలో చెక్ చేయించినప్పటి విలువలు నార్మల్‌గానే ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. మీరు చెప్పిన కింది విలువ 94 చాలా ఎక్కువ. ఏదైనా తేడా ఉన్నప్పుడు అది ప్లస్ లేదా మైనస్ 10 ఉండవచ్చు. కానీ మీరు పేర్కొన్న కింది విలువ 94 ఉండటం అంత మంచి సూచన కాదు. బీపీని కొలిచే సమయంలో నిశితత్వం కూడా అవసరం. కాబట్టి ఈసారి మీరు రోజులోని ఏదో ఒక నిర్ణీత సమయంలో బీపీ కొలతను ఐదురోజుల పాటు తీసుకోండి. అది కూడా ఏ ఫార్మసీ దగ్గరో కాకుండా సర్టిఫైడ్ ఫిజీషియన్ దగ్గరకు వెళ్లి తీసుకోండి. ఆ విలువ నార్మల్‌గా ఉంటే మీకు బీపీ లేనట్టే. ఒకవేళ ఆ విలువలు 140/85 ఉంటే అది ప్రీ-హైపర్‌టెన్షన్ దశగా భావించి, మీ జీవనశైలిలో మార్పులతో బీపీని అదుపులో పెట్టుకోవచ్చు. డాక్టర్ సుధీంద్ర ఊటూరి, కన్సల్టెంట్ లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
నామమాత్రమే
ఉనికి కోల్పోతున్న జనరిక్ మందుల దుకాణాలు ఒక్కో దుకాణంలో నెలకు రూ.6 వేలే అమ్మకం ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తున్నారనే ఆరోపణలు అందుబాటులో లేని మందులు శిధిల స్థితిలో గదులు మరికొన్ని ఏర్పాటు చేస్తామంటున్న అధికారులు మందులు కొనాలంటే సామాన్య మధ్యతరగతి హడలిపోతున్నాయి. డాక్టరు చీటీ పట్టుకుని వెళ్లి చూపించాలంటే జంకుతున్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే అప్పో సప్పో చేసి కొనక తప్పని స్థితి. ఇలాంటి పరిస్థితులనుంచి ఉపశమనం కలిగించడానికి ఉద్దేశించిన జనరిక్(జన ఔషధాలు)పై చాలామందికి అవగాహన కొరవడుతోంది. మందు ఒకటే అయినా పేరు మార్చి కంపెనీలు విక్రయించే బ్రాండ్లవైపే మొగ్గు చూపుతున్నారు. చౌకగా వచ్చే మందులను దూరం పెడుతున్నారు. తమ కమీషన్ల కోసం వైద్యులూ జనరిక్ మందులను సిఫార్సు చేయడం లేదు. దీంతో జనం జేబులకు చిల్లుపడుతోంది. జనరిక్ మందు జనానికి అందకుండా పోతోంది. విశాఖపట్నం: పేద ప్రజలకు తక్కువ రేటుకే ఖరీదైన మందులందించాలనే సుసంకల్పంతో ప్రారంభించిన జీవనధార ఫార్మసీ (జనరిక్ మందుల) షాపులు లక్ష్యానికి ఆమడ దూరంలో ఉన్నాయి. వైద్యుల స్వార్ధం, అధికారుల అలసత్వంతో నీరసించిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా రోగులకు మందులు అందించే పరిస్థితి లేదు. రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలో ఈ జనరిక్ షాపులకు అంకురార్పణ జరిగింది. సామాన్య జనావళికి మందులు సాధారణ ధరకు ఇవ్వాలనేది జనరిక్ లక్ష్యం. అప్పటి కలెక్టరు శ్యామలరావు జనరిక్ పట్ల అపారమైన ఆసక్తి చూపించడంతో దీనిని తర్వాత ప్రభుత్వం ఇతర జిల్లాలకూ విస్తరింపజేసింది. ఆరంభంలో బాగానే ఉన్నా రాన్రానూ ఉనికి కోల్పోయే స్థితికి ఈ జన ఔషధ శాలలు చేరుకున్నాయి. 11 ఫార్మసీల ఏర్పాటు: జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 11 జీవన ధార ఫార్మసీలను ఏర్పాటు చేశారు. కింగ్‌జార్జ్ హాస్పటల్, విక్టోరియా హాస్పటల్, ఈఎన్టి హాస్పటల్, పెదవాల్తేరు, శ్రీహరిపురం, ఆగనంపూడి, తరగపువలస, అనకాప ల్లి, యలమంచిలి, నర్శీపట్నం, వడ్డాది ప్రాం తాల్లో వీటిని నెలకొల్పారు. నడుపుకోమని జిల్లా సమాఖ్యలకు అప్పగించారు. దీంతో మహిళలకు చేయూతనిచ్చేశామని, వారు ఆర్ధికంగా స్వావలంభన సాధించేందుకు అవకాశం ఏర్పడిందని గొప్పలు చెప్పుకున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. అన్నీట్లో నష్టాలు: ైప్రైవేట్ మందుల దుకాణాల్లో దొరికే మందులన్నీ జనరిక్ మందుల దుకాణాల్లో దొరకవు. మందు మూలానికి సంబంధించిన వాస్తవ పేరు కాకుండా కంపెనీలు పెట్టుకున్న బ్రాండ్ నేమ్‌తో చేసే అమ్మకాలు ఇక్కడ ఉండవు. వాస్తవ మందులను డాక్టర్లెవరూ సిఫార్సు చేయడం లేదు. దీంతో జనరిక్ మందులు కొనేవారు కరువయ్యారు. వాస్తవ మందు పేరు ఎక్కడా ప్రిస్కిప్షన్లలో సిఫార్సు చేయడానికి వైద్యులు సిద్ధంగా లేరు. అసలు సిసలైన మందు రేటు వాస్తవానికి తక్కువే. కానీ అదే మందును ఫార్మసీ కంపెనీ ఒక్కో బ్రాండ్ పేరుతో అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. జనరిక్ షాపుల్లో మందులు బయట రేటుకంటే బాగా తక్కువ ధరకు ఇస్తారు. ఈ లెక్కన ఈ దుకాణాలకు తాకిడి ఎక్కువగా ఉం డాలి. జనరిక్ అమ్మకాలను పరిశీలిస్తే ఇందుకు భిన్నంగా ఉంది. గతేడాది జిల్లాలో 11 షాపుల్లోనూ కలిపి రూ.2.10కోట్ల మందుల అమ్మకం జరిగింది. ఈ ఏడాది రూ.2.50 కోట్లకు అమ్మకా లు పెరిగాయని జిల్లా బిజినెస్ మేనేజర్ గురునాథ్ చెబుతున్నారు. ఈ లెక్కన నెలకు రూ. 20.83లక్షలు, రోజుకి రూ.64.44వేలు చొప్పున అమ్ముతున్నారు.అంటే ఒక్కో షాపులో రో జుకి కేవలం రూ.6313 విలువైన మందులు మా త్ర మే విక్రయిస్తోంది. సాధారణంగా ప్రైవేట్ మం దుల షాపులు రోజుకి ఎంత తక్కువ లెక్కేసుకు న్నా రూ.20 వేల నుంచి రూ.1లక్ష వరకూ వ్యా పారం చేస్తుంటాయి. కానీ జనరిక్ మందుల షా పులు వాటి దరిదాపుల్లో కూడా ఉండటం లేదు. ఉద్దేశ్యపూరకంగా నిర్వీర్యం: జనరిక్ మందుల దుకాణాలను వైద్యులు, అధికారులు కావాలనే నిర్వీర్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వైద్యులు తమ వద్దకు వచ్చే రోగులకు జీవనధార(జనరిక్) మందు ఒకటుందని, అక్కడ తక్కువ ధరకే మందులు దొరుకుతాయని చెప్పడం లేదు. ఎక్కువ కాలం నిల్వ ఉంచాల్సినవి, అరుదుగా అవసరమయ్యేవి, అధిక ధర ఉండేవి దాదాపు 20 శాతం మందులు జనరిక్ దుకాణాల్లో దొరకవు. దీనిని సాకుగా చూపించి, ఇక్కడ దొరకని వాటితో పాటు దొరికే వాటిని కూడా ప్రైవేట్ మందుల దుకాణాల్లో తీసుకోవాల్సిందిగా వైద్యులే సూచిస్తున్నారని రోగులు చెబుతున్నారు. ప్రైవేట్ మందుల షాపులతో వైద్యులకు కమిషన్ల ఒప్పందాలు ఉంటాయనేది బహిరంగ రహస్యమే. తమ కమిషన్లు పోతాయని వారు జనరిక్ దుకాణాల గురించి రోగులకు సిఫారసు చేయడం లేదు. అంతే కాకుండా అక్కడ అందుబాటులో ఉండే మందులు రాయకుండా దొరకని మందులు చీటీ రాసివ్వడంతో తప్పనిసరై రోగులు ప్రైవేట్ మందుల షాపుల్లోనే కొంటున్నారు. ప్రజలకు వీటిపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాల్సిన సర్కారు చేతులు ముడుచుకుంది. సాధారణ ప్రజల్లో చాలామందికి జనరిక్ మందులకు ఇదే మూలంతో బ్రాండ్ నేమ్‌తో అమ్మే మందుకు వ్యత్యాసం తెలియడం లేదు.ఫలితంగా మందుల పేరిట భారీగా సొమ్ము వెచ్చించాల్సిన పరిస్థితి. తక్కువ ఖరీదుకు విక్రయిస్తున్నందున..వీటి నాణ్యతపై కొందరికి అపనమ్మకం ఉండటం కూడా జనరిక్ ఔషధ అమ్మకాలను ప్రభావితం చేస్తోందని ఒక వైద్యుడు వ్యాఖ్యానించారు. ఇక జీవనధార ఫార్మసీలను పర్యవేక్షించాల్సిన గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అవి చాలా బాగా నడుస్తున్నాయని చెబుతుండటం విశేషం. కేజీహెచ్‌లో జీవన ధార ఫార్మశీ ఏర్పాటు చేసిన గదిలో సీలింగ్ ఊడి పడిపోతోంది. సరైన సౌకర్యాలు కూడా లేవు. జనరిక్ మందుల షాపులు బాగా నడుస్తున్నాయి. ఏడాదికి రెండు కోట్ల రూపాయలకు మించి విక్రయాలు సాగిస్తున్నాం. దీంతో మరో వారం రోజుల్లో గోపాలపట్నం, నర్శీపట్నంలో రెండు షాఫులు కొత్తగా ఏర్పాటు చేస్తున్నాం. జిల్లాలోని 30 మండలాల్లో మండలానికి ఒకటి చొప్పున జనరిక్ మందుల షాపులను నెలకొల్పాలని భావిస్తున్నాం. -సత్యసాయి శ్రీనివాస్, ప్రాజెక్టు డెరైక్టర్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ. -
ఆ వ్యత్యాసాలెందుకు?
పూర్తి వివరాలను మా ముందుంచండి జేఎన్టీయూకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లోని సౌకర్యాలు ఏఐసీటీఈ, పీసీఐ నిబంధనల మేరకు ఉన్నాయో..? లేదో..? తేల్చేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ సమర్పించిన నివేదికలోని వివరాలతో జేఎన్టీయూ (హైదరాబాద్) సమర్పించిన నివేదిక వివరాలు సరిపోలకపోవడాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో వ్యత్యాసాలు ఎందుకు ఉన్నాయో చెప్పాలని జేఎన్టీయూను ఆదేశించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని జేఎన్టీయూ తరఫున హాజరైన అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డిని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ), భారతీయ ఫార్మసీ మండలి (పీసీఐ) నిర్ధేశించిన నిబంధనల మేరకు 143 ఇంజనీరింగ్, 7 ఫార్మసీ కాలేజీల్లో సరైన సదుపాయాలు లేవని, ఆ కాలేజీల్లో భారీ లోపాలున్నాయని, అందువల్ల వాటికి అఫిలియేషన్‌ను నిరాకరిస్తున్నట్లు పేర్కొంటూ జేఎన్టీయూ గత నెల 29న ప్రొసీడింగ్స్ జారీ చేసింది. దీన్ని సవాల్‌చేస్తూ కాలేజీలు గురువారం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా దీనిపై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. -
ఎంసెట్ ఉండాల్సిందే
ప్రభుత్వానికి నివేదించిన ఉన్నతాధికారుల కమిటీ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి నిర్వహిస్తున్న ఎంసెట్ పరీక్షను ఇకముందూ కొనసాగించాల్సిందేనని ఉన్నతాధికారుల బృందం ప్రభుత్వానికి నివేదించింది. రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌తో సహా ఉన్నత విద్యారంగంలో ప్రైవేటు రంగందే పైచేయిగా ఉండడం వల్ల ఎంసెట్ రద్దు విపరిణామాలకు దారితీస్తుందని కమిటీ అభిప్రాయపడింది. ఇంజనీరింగ్, ఫార్మా ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఎంసెట్‌తో పాటు ఉన్నత విద్యారంగంలో చేపట్టాల్సిన మార్పులు, చేర్పులపై ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్ .ఎం.డోబ్రియాల్ నేతృత్వంలో ప్రభుత్వం ఆరుగురు సభ్యుల బృందాన్ని సెప్టెంబర్ 19న ఏర్పాటు చేసింది. కమిటీలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ పి.విజయప్రకాశ్, అనంతపురం జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, కాకినాడ జేఎన్టీయూ ప్రొఫెసర్ సీహెచ్ సాయిబాబు, కాలేజీయేట్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ విద్యా గెడైన్స్ అధికారి ఆర్.డేవిడ్ కుమార్‌స్వామి, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ డిప్యుటీ డైరక్టర్ ఎస్పీ శ్రీకాంత్‌లను సభ్యులుగా నియమించింది. ఈ కమిటీ తమిళనాడులో పర్యటించి అక్కడి ఇంటర్మీడియెట్ విద్య, ఉన్నత విద్య, ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి అధ్యయనం చేసి వచ్చింది. ఇటీవలే ఈ నివేదికను డోబ్రియాల్ ప్రభుత్వానికి సమర్పించారు. ఆనివేదిక ప్రకారం ‘ఇంటర్మీడియెట్, ఉన్నత విద్య, సాంకేతిక విద్యారంగాలకు సంబంధించి తమిళనాడుకు, ఆంధ్రప్రదేశ్‌కు వ్యత్యాసముంది. తమిళనాడు విద్యారంగంలో ప్రభుత్వ పరిధే ఎక్కువ. స్కూళ్లు కాలేజీల్లో 85 శాతం ప్రభుత్వం ఏర్పాటు చేసినవే. దీంతో పాటు అక్కడి పరీక్షల విధానం కూడా ఎంతో పకడ్బందీగా అమలవుతోంది. అక్రమాలకు తావులేకుండా కఠినమైన పద్ధతులను అక్కడ అమలు చేస్తున్నారు. ఏపీలో అందుకుభిన్నంగా స్కూళ్లు, ఇంటర్మీడియెట్ కాలేజీల్లో 80 శాతానికి పైగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి. తమిళనాడులో ఇంజనీరింగ్, ఫార్మాకోర్సుల్లో ప్రవేశానికి ఏపీలో మాదిరిగా ఎంసెట్ వంటి పరీక్ష నిర్వహించడం లేదు. ఎంసెట్‌తో పనిలేకుండా ఇంటర్మీడియెట్ మార్కుల ఆధారంగా ప్రవేశాలు జరుగుతున్నాయి. తమిళనాడులో ఇంటర్మీడియెట్ కాలేజీలు అత్యధికం ప్రభుత్వానివే అయినందున ఆ పబ్లిక్ పరీక్షలు పగడ్బందీగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా కొనసాగుతున్నాయి. ఏపీలో ప్రభుత్వ పరిధి తక్కువగా ఉండి ప్రైవేటు భాగస్వామ్యమే ఎక్కువైంది. ఈ తరుణంలో ఎంసెట్ పరీక్ష రద్దు చేయడం సరికాదు. ఇంటర్మీడియెట్ మార్కుల ఆధారంగా ఇంజనీరింగ్ ప్రవేశాల కల్పన వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. గ్రా మీణ, ప్రభుత్వ కాలేజీల్లోని విద్యార్థులకన్నా ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లోని పిల్లలకే ఇంటర్మీడియెట్ మార్కులు అధికంగా తెప్పించుకొని ఇంజనీరింగ్ సీట్లు వారికే కేటాయింపులు జరుగుతాయి. దీంతో గ్రామీణ, ప్రభుత్వ కాలేజీల్లోని విద్యార్థులు నష్టపోతారు. ఎంసెట్‌ను యధావిథిగా కొనసాగించడం అనివార్యం’ అని సూచించినట్టు అధికారవర్గాలు తెలిపాయి ఉమ్మడి ఎంసెట్ తప్పదు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఉమ్మడిగానే ఎంసెట్‌ను నిర్వహించాల్సి ఉంటుందని ఉన్నత విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఉన్నత విద్యా ప్రవేశాలు ఉమ్మడిగా జరగాలని విభజన చట్టంలో ఉందని, ఎంసెట్ అనేది ప్రవేశాలకు సంబంధించినదే కనుక పరీక్షను ఉమ్మడిగానే నిర్వహించకతప్పదని చెబుతున్నారు. ఇంటర్మీడియెట్ పరీక్షలు వేర్వేరుగా జరుగుతున్నందున మూల్యాంకనం, మార్కులివ్వడంపై ఒక రాష్ట్రంపై మరో రాష్ట్రానికి అనుమానాలు తలెత్తే పరిస్థితి ఉంటుందని, ఈ తరుణంలో ఇంటర్మీడియెట్ మార్కులకు వెయిటేజీ ఇవ్వడం పూర్తిగా రద్దుచేస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. ఎంసెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తే ఎలాంటి వివాదాలకూ తావుండదని పేర్కొంటున్నారు. -
కోర్సు కాగానే కొలువు!
పారిశ్రామిక అవసరాల మేరకు వృత్తి విద్యా కోర్సుల సిలబస్ ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో సమూల మార్పులు పారిశ్రామిక వర్గాల నిపుణులతో కాలేజీల్లో బోధన కోర్సు ప్రథమ సంవ త్సరం నుంచే పరిశ్రమలతో కాలేజీల అనుసంధానం మంత్రులు, పారిశ్రామిక వర్గాల సమావేశంలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక అవసరాల మేరకు వృత్తి విద్యా కోర్సులను సమూలంగా మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. చదువులు పూర్తి చేసుకొని బయటకు రాగానే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు దొరికేలా కోర్సుల్లో మార్పులు తీసుకురానుంది. కోర్సు మొదటి సంవత్సరం నుంచే పరిశ్రమలతో కాలేజీలను అనుసంధానం చేయనుంది. పారిశ్రామిక వర్గాలకు చెందిన నిపుణులతో కాలేజీల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పించనుంది. సాధారణ, గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల విద్యార్థులకు పారిశ్రామిక అవసరాలపై ప్రతి ఏటా వేసవి సెలవుల్లో ప్రత్యేక తరగతులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటితోపాటు విద్యార్థులు కాలేజీకి వెళ్లలేని పరిస్థితిలో ఉంటే ఇంటర్నెట్ ఆధారిత వర్చువల్ క్లాసెస్ నిర్వహించేందుకు చర్యలు చేపట్టనుంది. కోర్సుల్లో మార్పుచేర్పులపై గురువారం సచివాలయంలో విద్యామంత్రి జగదీశ్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ భేటీలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రదీప్ చంద్ర, విద్యాశాఖ, ఐటీ శాఖ కార్యదర్శులు వికాస్‌రాజ్, హర్‌ప్రీత్‌సింగ్, సాంకేతిక విద్య కమిషనర్ శైలజా రామయ్యార్, జేఎన్టీయూ రిజిస్ట్రార్ ఎన్వీ రమణరావులతోపాటు ఫిక్కీ, సీఐఐ, నాస్కామ్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇటు పారిశ్రామికరంగానికి, అటు విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడేలా ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర కోర్సుల సిలబస్‌లో మార్పులు తీసుకురావాలని సమావేశంలో నిర్ణయించారు. ఇదీ ప్రస్తుత పరిస్థితి.. రాష్ట్రంలో గతేడాది 271 ఇంజనీరింగ్ కాలేజీల నుంచి 74,617 మంది బీటెక్ గ్రాడ్యుయేట్లు, 5,406 మంది ఎంటెక్ గ్రాడ్యుయేట్లు, 96 ఫార్మసీ కాలేజీల నుంచి బీఫార్మసీ 4,575 మంది, ఎంఫార్మసీ పూర్తి చేసుకొని 767 మంది, 41 ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలనుంచి మరో 10 వేల మంది కోర్సులు పూర్తి చేసుకొని బయటకు వచ్చారు. కానీ అందులో అత్యధిక మంది నెలకు కేవలం రూ.5 వేలలోపు వేతనంతోనే పనిచేస్తున్నారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యా విధానం లేకపోవడం, నైపుణ్యాల కొరతే ఇందుకు ప్రధాన కారణం. అలాగే ఎక్కువ శాతం విద్యార్థులు పరిశ్రమ అధారిత ప్రాజెక్టులను చేయడం లేదు. రాష్ట్రంలో మొత్తంగా 431 వృత్తి విద్యా కాలేజీలు అఖిల భారత సాంకేతిక విద్యామండలి నుంచి అనుమతి పొందినవి ఉంటే అందులో 100 కాలేజీల్లో మాత్రమే క్యాం పస్ రిక్రూట్మెంట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పరిశ్రమల అవసరాల మేరకు విద్యార్థులను తయారు చేయడంతోపాటు చదువు పూర్తి చేసుకున్న వెంటనే మంచి ఉపాధి అవకాశాలు లభించేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇకపై ఇలా.. పరిశ్రమలకు, కాలేజీల మధ్య నిరంతర పర్యవేక్షణకు ఉన్నత స్థాయిలో రెండు సమన్వయ కమిటీలను త్వరలో ఏర్పాటు చేస్తారు. తెలంగాణ అకాడమీ ఆధ్వర్యంలో స్కిల్స్ అండ్ నాలెడ్జ్ టాస్క్ పేరుతో కార్యక్రమం చేపడతారు. కాలేజీల్లో పనిచేసే ఫ్యాకల్టీకి పారిశ్రామికవర్గాలతో శిక్షణ ఇప్పిస్తారు. విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు పెంచడంతోపాటు ఎంటర్పెన్యూర్ స్కిల్స్ అలవర్చుకునేందుకు వీలుగా స్టార్ట్ అఫ్ కంపెనీలతో విద్యార్థులకు ప్రత్యేక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తారు. అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు లభించేలా సిలబస్‌లో మార్పులు ఉంటాయి. విద్యా సంస్థలతో పరిశ్రమలు కలసి పనిచేసేలా కేంద్రం చేసిన చట్టం అమలుకు నోచుకోవడం లేదన్న అభిప్రాయం ప్రభుత్వంలో ఉంది. అందుకు విద్యార్థులకు అప్రెంటిస్షిప్ని లేదా ప్రాక్టీస్ స్కూల్ చట్టాన్ని తీసుకురావాలని భావిస్తోంది. ఐటీఐ వంటి శిక్షణ సంస్థలను పటిష్టం చేయనుంది. పరిశ్రమలకు సంబంధించిన అవసరాలపై ఏటా 60 నుంచి 90 రోజులు శిక్షణ ఉంటుంది. ఇండస్ట్రీ అవసరాలపై షార్ట్ టర్మ్ కోర్సులను ప్రవేశపెడతారు. 5, 7వ సెమిస్టర్లో ప్రత్యేకంగా పూర్తి స్థాయిలో పారిశ్రామిక శిక్షణ ఉండేలా మార్పులు తెస్తారు. మూడు, నాలుగో సంవత్సరం విద్యార్థులు జాతీయ స్థాయిలో పరిశ్రమలను సందర్శించేలా చర్యలు చేపడతారు. -
‘గాంధీ’ ఫార్మసీకి తాళం
* ఉద్యోగుల మధ్య గొడవే కారణం! * మందుల కోసం ఆందోళనకు దిగిన రోగులు గాంధీ ఆస్పత్రి : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఇరువురు ఉద్యోగుల మధ్య తలెత్తిన ఘర్షణతో ఫార్మసీకి తాళం పడింది. దీంతో మందుల కోసం రోగులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రి అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఓ వృద్ధురాలు సోమవారం ఉదయం ఓపీ విభాగంలో వైద్యపరీక్షలు చేయించుకుంది. ైవైద్యుడు ఉచితంగా ఇచ్చే మందులను ఫార్మసీలో తీసుకొమ్మని చీటీ రాసి ఇచ్చాడు. దాన్ని వృద్ధురాలు పోగొట్టుకుంది. గాంధీ ఆస్పత్రి ఓపీ విభాగంలో ల్యాబ్‌టెక్నీషియన్‌గా పనిచేస్తున్న జగదీష్ వృద్ధురాలి పరిస్థితి గమనించి కంప్యూటరీ ఓపీ చిట్టీపై ఉన్న మందులను మరో కాగితంపై రాసిచ్చాడు. దీనికి ఫార్మసీలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి నవీన్ తీవ్ర అభ్యంతరం తెలపడంతో వాగ్వివాదం జరిగింది. ఈదశలో నవీన్ ఫార్మసీకి తాళం వేసి సూరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. రోగులకు మందులు అందక ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న ఆస్పత్రి అధికారులు వెంటనే ఫార్మసీని తెరిపించి మందులు ఇప్పించారు. రోగుల మధ్య తొక్కిసలాట జరగడంతో అవుట్‌పోస్ట్, స్పెషల్ ప్రొటెక్షన్ పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్ధారు. ఇటువంటి ఘటనలు జరగడం పట్ల ఆస్పత్రి పాలనాయంత్రాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
సాంబరెడ్డికి అమెరికా ఫార్మా సొసైటీ ఫెల్లో..
ప్రపంచంలో 15 అత్యంత ప్రతిభావంత శాస్త్రవేత్తల్లో స్థానం వరంగల్: వరంగల్ జిల్లాకు చెందిన ఫార్మసీ వైద్య శాస్త్రవేత్త, అమెరికాలో టెక్సాస్ ఏ అండ్ ఎం వర్సిటీ ప్రొఫెసర్ సాంబరెడ్డికి ప్రతిష్టాత్మక అమెరికా ఫార్మా సొసైటీ ఫెల్లో(ఏఏపీఎస్) అవార్డు లభించింది. మెదడు సంబంధ జబ్బులకు నూతన ఔషధాలు కనుగొనడంలో 20 ఏళ్లుగా పరిశోధనలు చేసి, నరాల వ్యాధులకు చికిత్సలు కనిపెట్టి ప్రపంచ ఫార్మారంగానికి కీర్తి ప్రతిష్టలు తీసుకువస్తున్నందుకు ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ బిరుదు అందుకున్న వారిని ప్రపంచంలోని 15 అత్యంత ప్రతిభావంత శాస్త్రవేత్తల్లో ఒకరిగా గౌరవిస్తారు. అమెరికాలోని కాలిఫోర్నియా శాండియాగో నగరంలో నవంబర్ 21న అమెరికా ఫార్మాస్యూటికల్ శాస్త్రవేత్తల సంఘం వార్షిక సమావేశంలో జరిగిన అవార్డు బంకేట్లో అమెరికా ఫార్మా అధ్యక్షురాలు డాక్టర్ మేరిలిన్ మెర్రిస్ ఈ అవార్డును సాంబరెడ్డికి ప్రదానం చేశారు. -
జీప్యాట్ - 2015
ఫార్మసీలో పీజీ చేయడానికి అవకాశం కల్పిస్తున్న పరీక్ష.. గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (జీప్యాట్). దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్లు మాస్టర్ ఆఫ్ ఫార్మసీ (ఎం.ఫార్మసీ)లో ప్రవేశానికి జీప్యాట్ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటాయి. 2015 సంవత్సరానికి జీప్యాట్ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో సంబంధిత వివరాలు.. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) జీప్యాట్ నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తోంది. గతేడాది నుంచి జీప్యాట్ను కంప్యూటర్ ఆధారితంగా నిర్వహిస్తున్నారు. ఈ స్కోర్ ఆధారంగా ఏఐసీటీఈ గుర్తింపు ఉన్న అన్ని ఇన్స్టిట్యూట్లలో ఎంఫార్మసీ కోర్సులో అడ్మిషన్ పొందొచ్చు. పరీక్ష విధానం: జీప్యాట్ను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందు లో మొత్తం 125 ప్రశ్నలు ఉంటాయి. వీటికి మూడు గంట (180 నిమిషాలు)ల్లో సమాధానాలను గుర్తించాలి. సిలబస్ బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఉంటుంది. ప్రశ్నలు అప్లికేషన్ పద్ధతిలో ఉంటాయి. మల్టిపుల్ చాయిస్, అసెర్షన్-రీజన్, స్టేట్మెంట్ బేస్డ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు కేటాయించిన మార్కులు నాలుగు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి తప్పుకు ఒక మార్కు కోత విధిస్తారు. సిలబస్: ఫార్మాస్యూటిక్స్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ అనాలసిస్, ఫార్మకాలజీ, మెడిసినల్ కెమిస్ట్రీ, ఫార్మోకోగ్నసీ, బయోకెమిస్ట్రీ, క్లినికల్ ఫార్మసీ, ఫిజికల్ ఫార్మసీ, బయోఫార్మాస్యూటిక్స్ తదితర అంశాలను సిలబస్‌లో చేర్చారు. ఇందులో ఫార్మాస్యూటిక్స్, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, ఫార్మకాలజీ వంటివి కీలక చాప్టర్లు. వీటిలో ఫార్మాస్యూటిక్స్‌కు ఎక్కవగా వెయిటేజీ లభిస్తుంది. స్కాలర్షిప్: జీప్యాట్ స్కోర్ ఏడాదిపాటు చెల్లుబాటు అవుతుంది. ఈ స్కోర్ ఆధారంగా అన్ని సెంట్రల్, స్టేట్ యూనివర్సిటీలలో ప్రవేశం పొందొచ్చు. నిర్దేశించిన విధంగా ఎంఫార్మసీ కోర్సులో ప్రవేశం పొందితే నెలకు రూ. 8 వేల స్కాలర్షిప్ లభిస్తుంది. అంతేకాకుండా ఈ స్కోర్ ఆధారంగా సీసీఎంబీ, సీడీఆర్ఐ వంటి పరిశోధన సంస్థల నుంచి ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ చేయవచ్చు. ఉస్మానియా, జేఎన్టీయూ వంటి యూనివర్సిటీల నుంచి పార్ట్ టైం/ఫుల్ టైం పీహెచ్డీ కోర్సుల్లో కూడా చేరొచ్చు. ఇతర ప్రయోజనాలు: జీప్యాట్ ప్రిపరేషన్ ఫార్మసీ నేపథ్యంగా నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు- పీజీఈసెట్, మణిపాల్సెట్, బిట్స్-పీజీ, ఫార్మ్పీజీ (భారతీయ విద్యాపీఠ్), ప్రభుత్వ రంగంలో ఫార్మాసిస్ట్, డ్రగ్ ఇన్స్పెక్టర్ల నియామకం కోసం నిర్వహించే పరీక్షలు. బెనారస్ హిందూ యూనివర్సిటీ, బిట్స్ పిలానీ, పంజాబ్ యూనివర్సిటీ, బాంబే కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వంటి ప్రముఖ ఇన్స్టిట్యూట్లలో కూడా జీప్యాట్ స్కోర్‌తో ప్రవేశం పొందొచ్చు. నోటిఫికేషన్ సమాచారం అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫార్మసీ (ఇంటర్మీడియెట్/10+2 తర్వాత నాలుగేళ్ల కోర్సు). చివరి సంవత్సరం విద్యార్థులు కూడా అర్హులే. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: జనవరి 12, 2015 ఆన్లైన్ పరీక్ష తేదీలు: ఫిబ్రవరి 23-24, 2015 ఫలితాల విడుదల: మార్చి 27, 2015. వెబ్సైట్: www.aicte-gpat.in జీప్యాట్‌లో డిగ్రీ స్థాయిలో సిలబస్ ఉంటుంది. కాబట్టి జీప్యాట్ ప్రిపరేషన్ ఫార్మసీ నేపథ్యంగా ఇతర ప్రవేశ/పోటీ పరీక్షలకు సులువుగా సన్నద్ధమవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫార్మా కంపెనీల్లో నియామకాల సందర్భంలోనూ జీప్యాట్ స్కోరు సాధించినవారికి ప్రాధాన్యత లభిస్తోంది. ఈ పరీక్షలో మంచి స్కోరు సొంతం చేసుకోవాలంటే అభ్యర్థులు ప్రధానంగా ఐదు సబ్జెక్టులపై పట్టు సాధించాలి. అవి.. ఫార్మాస్యూటిక్స్, ఫార్మకాలజీ, ఫార్మకోగ్నసీ, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్ట్రీ. ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీలోని ఆర్గానిక్ కెమిస్ట్రీపై ప్రత్యేక దృష్టి సారించాలి. అలాగే జ్యురిస్ప్రుడెన్స్, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ అంశాల నుంచి కూడా ప్రశ్నలు అడుగుతున్నారు. తక్కువ సమయంలో సిలబస్ పూర్తి చేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలి. రివిజన్‌కు తగిన సమయం కేటాయించాలి. ఏదైనా అంశాన్ని అభ్యసించిన తర్వాత అందులోని ప్రశ్నలతోపాటు గత జీప్యాట్/ గేట్ -ఫార్మసీ ప్రశ్నపత్రాలను విధిగా ప్రాక్టీస్ చేయాలి. తద్వారా ప్రశ్నల సరళిపై అవగాహన ఏర్పడుతుంది. - ఎ. విజయేంద్ర చారి, మాస్టర్స్ ఫార్మసీ అకాడమీ, హైదరాబాద్ -
బి కేటగిరీ సీట్లపై మాదే అధికారం!
* తెలంగాణ, ఏపీ ఉన్నత విద్యా మండళ్ల తకరారు * విభజన చట్టం ప్రకారం తమదే అధికారమంటున్న ఏపీ * మా సీట్లను మేమే భర్తీ చేస్తామంటున్న తెలంగాణ * అనుమతులపై ప్రైవేటు కాలేజీల్లో తీవ్ర అయోమయం * ఆన్‌లైన్‌తో సంబంధం లేకుండానే సీట్లు భర్తీ చేసేసిన కాలేజీలు * గడువులోపే పూర్తి చేసినట్లు పాత తేదీలతో కౌన్సిళ్లకు సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీతో పాటు అన్ని ప్రొఫెషనల్ కోర్సుల కాలేజీల్లోని ‘బి’ కేటగిరీ సీట్ల భర్తీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నత విద్యామండళ్ల మధ్య వివాదాస్పదంగా మారుతోంది. తెలంగాణ ప్రాంతంలోని కాలేజీల్లో బి కేటగిరీ సీట్ల భర్తీ వ్యవహారం తామే చేపడతామని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇంతకుముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాలేజీలు పూర్తిచేసే సీట్ల భర్తీని ఆమోదించే అధికారం తమదేనని స్పష్టంచేసింది. అయితే దీనిపై ఏపీ ఉన్నత విద్యామండలి తన అభ్యంతరాన్ని తెలియచేసింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఉమ్మడిగా జరిగే ఉన్నత విద్యావ్యవహారాలపై ఏపీ ఉన్నత విద్యామండలికే సర్వాధికారాలుంటాయని ఏపీ మండలి వాదిస్తోంది. ఈ అభ్యంతరాలను తోసిపుచ్చిన తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆ ప్రాంత కాలేజీల్లోని బి కేటగిరీ సీట్ల భర్తీకి ఆమోదం తెలిపే అధికారం తమదేనని ఇటీవల జేఎన్టీయూ, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలకు లేఖలు రాసింది. తెలంగాణ ప్రాంతంలోని బి కేటగిరీ సీట్ల భర్తీకి సంబంధించిన నివేదికలన్నీ తమకే నివేదించాలని స్పష్టంచేసింది. తెలంగాణ ప్రాంతంలోని ప్రయివేటు ప్రొఫెషనల్ కాలేజీల్లోని బీటెక్, ఎంటెక్ కోర్సులే కాకుండా ఎంబీఏ, ఎంసీఏ, లా, ఫార్మసీ, బీఈడీ, బీపీఈడీ కోర్సులకు సంబంధించి 2014-15 విద్యాసంవత్సరానికి సీట్ల భర్తీకి ఆమోదం తమనుంచే తీసుకోవాలని పేర్కొంది. ఆయా యూనివర్సిటీల రిజిస్ట్రార్ల పేరిట తెలంగాణ ఉన్నత విద్యామండలి ఈనెల 9వ తేదీన వేర్వేరు లేఖలు రాసింది. ఈ లేఖలతో రెండు మండళ్ల మధ్య నెలకొన్న వివాదం మరింత ముదిరింది. ఈ వివాదంతో ఎవరినుంచి అనుమతి తీసుకోవాలన్నది ప్రయివేటు కాలేజీల్లో తీవ్ర అయోమయానికి దారితీస్తోంది. తెలంగాణ మండలి ప్రకటనతో ఆ ప్రాంతంలోని కొన్ని కాలేజీలు బి కేటగిరీ సీట్ల భర్తీ ఫైళ్లు ఏపీ మండలికి కాకుండా తెలంగాణ మండలికి సమర్పించారు. కొన్ని కాలేజీలు ఏపీ మండలికి కూడా పంపించాయి. చట్టం ప్రకారం అంతిమ అధికారం తమదేనని, తెలంగాణ మండలి ఆమోదం చెల్లదని ఏపీ మండలి అంటోంది. ఆన్‌లైన్‌తో సంబంధం లేకుండానే... మరోవైపు ప్రైవేటు ప్రొఫెషనల్ కాలేజీల్లోని మేనేజ్మెంటు కోటా (బి కేటగిరీ) సీట్ల భర్తీని కూడా మెరిట్ ప్రాతిపదికన భర్తీచేస్తామని అధికారులు ముందు ప్రకటించారు. ఆమేరకు ఆన్లైన్లోనే బి కేటగిరీ సీట్లకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించారు. కానీ చాలా కాలేజీలు మేనేజ్మెంటు కోటా సీట్లను ఆన్లైన్ దరఖాస్తులతో సంబంధం లేకుండా ఇష్టానుసారం భర్తీ చేసేశాయి. సీట్లను అమ్ముకున్నాయన్న ఆరోపణలున్నాయి. మెరిట్ విద్యార్థులు ఆయా కాలేజీలకు వెళ్లినా బి కేటగిరీ సీట్ల గురించి సమాచారం కూడా ఇవ్వకుండా వెనక్కు పంపేశాయి. -
ఎంటెక్, ఎంఫార్మసీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో గందరగోళం
ప్రొవిజనల్ సర్టిఫికెట్ తెస్తేనే వెరిఫికేషన్ అంటున్న అధికారులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోలేని దుస్థితిలో విద్యార్థులు హైదరాబాద్: ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో గందరగోళం నెలకొంది. ప్రొవిజనల్ సర్టిఫికెట్లు తేవడం లేదనే సాకుతో అనేక మంది విద్యార్థుల సర్టిఫికెట్లను వె రిఫై చేసేందుకు హెల్ప్ లైన్ కేంద్రాల్లోని అధికారులు తిరస్కరిస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు, విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. రాష్ట్రంలోని 269 పీజీ ఇంజనీరింగ్, 104 ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈనెల 6వ తేదీ నుంచి ప్రక్రియ మొదలుపెట్టారు. పీజీఈసెట్ రాసిన విద్యార్థులకు 9వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభించారు. అయితే, రీయింబర్స్మెంట్ కింద రావాల్సిన ఫీజులను విద్యార్థులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని మొదట్లో యాజమాన్యాలు మెలిక పెట్టిన నేపథ్యంలో సర్టిఫికెట్లు లేకపోయినా, వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో చేసేదేమీ లేక బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు యాజమాన్యాలు కూడా సర్టిఫికెట్లు ఇవ్వడం ప్రారంభించాయి. ఇందులో భాగంగా హెల్ప్‌లైన్ కేంద్రాలకు కౌన్సెలింగ్ నిర్వహణ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇపుడు విద్యార్థులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రాల్లోని అధికారులే ఇబ్బందులు పెడుతున్నట్లు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీల నుంచి తెచ్చుకున్న సర్టిఫికెట్లు కాకుండా సంబంధిత యూనివర్సిటీ జారీ చేసే ప్రొవిజనల్ సర్టిఫికెట్ తీసుకురాలేదనే సాకుతో వెరిఫికేషన్‌కు తిరస్కరిస్తుండటంతో వారు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే పరిస్థితి లేకుండా పోయింది. గుంటూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రొవిజనల్ సర్టిఫికెట్ తరువాత అందజేసేందుకు వీలు కల్పించాలని, మొదట సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు అవకాశం కల్పించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. -
అర్హులైన బోధకులుంటేనే కౌన్సెలింగ్ అవకాశం
విద్యార్థులకు రూ.2,500 కోట్ల మేర ఆర్థిక సాయం {పమాణాలు లేని కాలేజీలకు ప్రజాధనం ఎలా వెచ్చిస్తాం? సరైన తనిఖీలు లేకుండానే అఫిలియేషన్లు ఇచ్చిన ఏఐసీటీఈ హైకోర్టుకు నివేదించిన ఏజీ రామకృష్ణారెడ్డి నిర్ణయం వాయిదా వేసిన న్యాయమూర్తి హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు వెబ్‌కౌన్సెలింగ్ నుంచి 174 కాలేజీల తొలగింపు, అఫిలియేషన్లరద్దు వ్యవహారంపై నిర్ణయం సోమవారానికి వాయిదా పడింది. ఈ మేరకు ఉభయపక్షాల వాదనలను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి శనివారం విన్నారు. జేఎన్టీయూ హైదరాబాద్ తమ కౌన్సెలింగ్ కాలేజీల జాబితా నుంచి తమను తొలగించి అఫిలియేషన్లను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాదాపు 150కి పైగా ప్రైవేటు ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి శనివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా వాదనలు విన్నారు. జేఎన్టీయూ హైదరాబాద్ తరఫున అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి వాదించారు. అఫిలియేషన్ల రద్దును, కౌన్సిలింగ్ నుంచి కాలేజీల తొలగింపును ఆయన సమర్థించారు. సౌకర్యాలు లేనప్పుడు ప్రమాణాలు ఎలా మెరుగవుతాయని, విద్యాప్రమాణాలు లేని కాలేజీల్లో చదువుకున్నవారు ఎలా ప్రయోజకులవుతారని ఆయన ప్రశ్నించారు. ఈ విద్యాసంవత్సరం నుంచి నిబంధనలకు అనుగుణంగా బోధనా సిబ్బందిని నియమించుకుంటే, వాటికి వెబ్‌కౌన్సెలింగ్ జాబితాలో స్థానం కల్పిం చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దాదాపు 141 కాలేజీలు శుక్రవారం జేఎన్టీయూహెచ్ వైస్ చాన్సలర్‌ను సంప్రదించి, లోపాలను సరిదిద్దుకుంటున్నామంటూ అఫిడవిట్లు ఇచ్చి, కౌన్సెలింగ్‌లో స్థానం కల్పించాలని కోరాయని వివరించారు. అర్హులైన బోధనా సిబ్బంది ఉండేలా చూడడమే తమ ఉద్దేశమన్నారు. బోధనా సిబ్బంది కోసం తాము ఒత్తిడి చేస్తుంటే, కాలేజీలు ఎందుకు ఇబ్బంది పడుతున్నాయో తమకు అర్థంకావడం లేదన్నారు. ఈ ఏడాది విద్యార్థులకు రూ.2,500 కోట్ల మేర సాయంచేయనున్నామని, ఇదంతా ప్రజాధనమని, ప్రమాణాలు లేని, సౌకర్యాలు లేని కాలేజీల కోసం ఇంత ప్రజాధనాన్ని వృథా చేయలేమన్నారు. ఏఐసీటీఈ క్షేత్రస్థాయిలో కాలేజీలను సందర్శించకుండానే అఫిలియేషన్లు ఇచ్చిందని, అలాంటివాటికి ఎటువంటి విలువలేదని ఏజీ తేల్చి చెప్పారు. విశ్వవిద్యాలయాలపై ఏఐసీటీఈ పెత్తనం చెల్లదని, అది సలహా మండలి మాత్రమేనన్నారు. కాలేజీల తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి, మరికొందరు వాదిస్తూ, లోపాలను సరిదిద్దుకునే సమయం ఇవ్వకుండా ఒకేసారి 174 కాలేజీల తలరాతను జేఎన్టీయూహెచ్ మార్చివేసిందన్నారు. తాము యూనివర్సిటీ అధికారాలను ప్రశ్నించడం లేదని, అయితే చట్టం ప్రకారం నడచుకోలేదన్నదనే తమ అభ్యంతరమన్నారు. అఫిలియేషన్ రద్దుతో రెండు, మూడేళ్ల విద్యార్థుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. వాదనలు విన్న న్యాయమూర్తి తన నిర్ణయాన్ని వాయిదా వేశారు. లోపాలు దిద్దుకుంటున్నాం.. తమ కాలేజీల్లో లోపాల సవరించుకుంటున్నట్టు వివరిస్తూ తెలంగాణలోని 170 ఇంజనీరింగ్ కాలేజీలు డెఫిషియెన్సీ కాంప్లియన్స్ రిపోర్టులను అఫిడవిట్ల రూపంలో హైదరాబాద్ జేఎన్టీయూకు అందజేసినట్టు తెలిసింది. లోపాలను సరిదిద్దుతున్నామని, అఫిలియేషన్లు ఇవ్వాలని, కౌన్సెలింగ్‌లో అవకాశం కల్పించాలని అవి కోరినట్టు తెలిసింది. 174 కాలేజీలకు యూనివర్సిటీ అఫిలియేషన్లను నిరాకరించిన సంగతి తెలిసిందే. -
సైన్స్ అభివృద్ధితోనే సమాజ పురోగతి
విద్య అంటే ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సులే కాదు... ‘ఇన్స్పైర్’ శిక్షణ సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి కేయూ క్యాంపస్ : సైన్సపై ఆసక్తి పెంచుకుని నిర్దేశిత లక్ష్యంతో భవిష్యత్‌లో రాణించేలా ముందుకు సాగాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి విద్యార్థులకు సూచించారు. సైన్స అభివృద్ధితోనే సమాజ పురోగతి కూడా సాధ్యమవుతుందని పేర్కొన్నా రు. ఇన్స్పైర్ ఇంటర్న్‌షిప్ సైన్స్ క్యాంపు శిక్షణ కాకతీయ యూనివర్సిటీ జువాలజీ విభాగం ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పరిపాలన భవనం సెనేట్ హాల్లో శిక్షణను పాపిరెడ్డి ప్రారంభించి మాట్లాడా రు. విజ్ఞానాన్ని అందిస్తూనే భవిష్యత్‌లో ఉపాధి కల్పించేందుకు విద్య ఉండాల్సిన అవసరముందన్నారు. ప్రస్తుతం ఎనిమిదో తరగతి నుంచే ఐఐటీ ఫౌండేషన్ కోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తుండడంతో విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఇంజినీరింగ్ కోర్సులపై ఆసక్తి చూపిస్తుండడంతో విద్యార్థులు తప్పనిసరిగా ఆ కోర్సుల్లో చేరినా నైపుణ్యాలు లేకపోవడంతో చిరు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారని పాపిరెడ్డి తెలిపారు. టాప్ ఇంజినీరింగ్ కాలేజీల్లో చదివి కొంతమేర కష్టపడిన వారికే ఉపాధి లభిస్తోందన్నారు. ఈ మేరకు చదువంటే ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సులే కాకుండా పలు సైన్స్ కోర్సులు ఉన్నాయని గుర్తించాలని సూచించారు. ఇన్స్పైర్ శిక్షణకు వచ్చిన వారిలో ఎక్కువ మంది గ్రామీణ విద్యార్థు లు ఉన్నారని, ఐదు రోజుల శిక్షణలో వారికి సైన్స్‌పై అవగాహన పెరుగుతుందని పాపిరెడ్డి అభిప్రాయపడ్డారు. విషయ పరిజ్ఞానం ఉండడం లేదు.. విద్యార్థులకు ఇంటర్లో మార్కులు ఎక్కువగానే వస్తున్నా సబ్జెక్టుల పరంగా విషయ పరిజ్ఞానం ఉండడం లేదని భట్నాగర్ అవార్డు గ్రహీత, హైదరాబాద్‌లోని ఐఐసీటీ డిప్యూటీ డెరైక్టర్ డాక్టర్ జి.నరహరశాస్త్రి అన్నారు. ఈ మేర కు ఆసక్తి ఉన్న కోర్సుల్లోనే చేరి అందులో రాణించాలని సూచించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 68 ఏళ్లు గడిచినా పరిశోధన రంగంలో అనుకున్న మేర పురోగతి లేదని.. దీన్ని అధిగమించేందుకు దేశంలోని ప్రసిద్ధ సైంటిస్టుల జీవిత చరిత్రలు చదివి విద్యార్థులు ఉత్తేజం పొందాలని కోరారు. కేయూ ఇన్చార్జ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంఏ. సింగరాచార్య, క్యాంపస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.రామస్వామి మాట్లాడుతూ విలువలతో కూడిన విద్య నేటి సమాజానికి అవసరమన్నారు. ఇన్స్పైర్ కోఆర్డినేటర్ ఎం.కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థుల కోసం కేయూలో ఇన్స్పైర్ నిర్వహించడం ఇది మూడోసారని తెలిపారు. ప్రస్తుతం 150మంది విద్యార్థులు పాల్గొంటుం డగా, వివిధ పరిశోధనా సంస్థల శాస్త్రవేత్తలు పాల్గొని అవగాహన కల్పిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జువాలజీ విభాగాధిపతి ఎం.స్వామి, సైన్స్ డీన్ ఎ.సదానందం, డాక్టర్ వెంకయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాపిరెడ్డి, నరహరిశాస్త్రిని నిర్వాహకులు సన్మానించారు. -
టీ ఉన్నత విద్యామండలి చట్టవిరుద్ధం
గవర్నర్‌కు ఏపీ ఉప ముఖ్యమంత్రుల ఫిర్యాదు.. న్యాయం చేయాలని వినతి హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర ఉన్నత విద్యా కోర్సుల ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప ఆదివారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే కల్పించుకొని న్యాయం చేయాలని కోరారు. ఉన్నత విద్యలో ఉమ్మడి ప్రవే శాలుంటాయని విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నా, అందుకు విరుద్ధంగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఏర్పాటు చేశారని చెప్పారు. విభజన చట్టంలో ఉమ్మడి ప్రవేశాలు నిర్వహించాల్సి ఉండగా తెలంగాణ ప్రభుత్వం వేరేగా కౌన్సెలింగ్ ఎలా నిర్వహిస్తుంద ని, ఈ విషయంలో కల్పించుకోవలసిన బాధ్యత గవర్నర్‌కే ఉంటుందని మంత్రులు తెలిపారు. ఆగస్టు 1వ తేదీలోగా కౌన్సెలింగ్ ముగించి 15వ తేదీలోగా క్లాసులు ప్రారంభించాలని సుప్రీంకోర్టు ఇదివరకే సూచించిందని, తెలంగాణ ప్రభుత్వ తీరు ఇందుకు భిన్నంగా ఉందని వారు వివరించారు. అనంతరం డిప్యూటీ సీఎంలు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ తీరు వల్ల రెండు రాష్ట్రాల్లోని విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలేజీల యాజమాన్యాలు తీవ్ర ఆందోళనతో ఉన్నారని చెప్పారు. ‘‘సమైక్య రాష్ట్రంలో ఎంసెట్ ద్వారా అన్ని ప్రాంతాల విద్యార్థులకు న్యాయం జరిగింది. ఈ ఏడాది కూడా సకాలంలో కౌన్సెలింగ్ నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని చాలాసార్లు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరాం. అయితే, కౌన్సెలింగ్ ఆలస్యం చేయడంతో తల్లిదండ్రులు, యాజమాన్యాలు ఆందోళనతో ఉన్నారు. దీనిపై చర్చిద్దాం రండన్నా తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. ఇప్పుడు తెలంగాణకు ప్రత్యేకంగా ఉన్నత విద్యా మండలిని ఏర్పాటు చేయడాన్ని మేం సమ్మతించం. ఇక్కడి ప్రవేశాలు వేరుగా చేస్తే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు స్థానికేతరులుగా మారి అవకాశాలు కోల్పోతారు’’ అని చెప్పారు. సోమవారం సుప్రీం కోర్టు నుంచి వచ్చే తీర్పులో స్పష్టత ఉంటే ఇబ్బంది ఉండదని, ఆ ప్రకారం నిర్ణయం తీసుకుంటామని గవర్నర్ కూడా అభిప్రాయపడ్డారని తెలిపారు. గవర్నర్‌తో భేటీకి ముందు ఉప ముఖ్యమంత్రులు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తదితరులు ఏపీ సీఎంతో భేటీ అయ్యారు. -
ఎంసెట్.. ఉత్తమ స్కోరెంత..?
రాష్ట్రంలో ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మసీ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ఎంసెట్ (ఇంనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) మే 22న ముగిసింది.. ఇంజనీరింగ్, మెడికల్ విభాగాలకు కలిపి దాదాపు 3 లక్షల 70 వేల మందికిపైగా విద్యార్థులు హాజరైన ఈ పరీక్ష.. గతంతో పోల్చితే ఏ విధంగా ఉంది.. సబ్జెక్ట్, చాప్టర్ల వారీగా వచ్చిన ప్రశ్నలు.. వాటి క్లిష్టత.. తదితర అంశాలపై విశ్లేషణ.. మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్‌లో అధిక శాతం ప్రశ్నలు తెలిసినవే. కానీ వీటిని సాధించే ప్రక్రియ సుదీర్ఘమైంది కావడంతో ఎక్కువ సమయాన్ని వెచ్చించాల్సి వచ్చింది.మ్యాథమెటిక్స్ నుంచి అడిగిన 80 ప్రశ్నల్లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం నుంచి 40 ప్రశ్నలు, ద్వితీయ సంవత్సరం నుంచి 40 ప్రశ్నలు వచ్చాయి. కాబట్టి రెండు సంవత్సరాల సిలబస్‌కు సమప్రాధాన్యతనిచ్చారని చెప్పొచ్చు.ప్రశ్నల క్లిష్టతను పరిశీలిస్తే.. 51 ప్రశ్నలు సులభమైనవి కాగా 18 ప్రశ్నలు మధ్యస్తంగా ఉన్నాయి. 11 ప్రశ్నలు క్లిష్టమైనవి.కాలిక్యులేషన్స్ సుదీర్ఘమైనవి కావడంతో సాధారణ విద్యార్థులు 60 శాతం ప్రశ్నలను ప్రయత్నించలేని స్థితి. ముఖ్యంగా ఇన్డేఫైనేట్ ఇంటిగ్రేషన్, పారాబొలా, వన్ డిటర్మెనెంట్, వన్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్ నుంచి అడిగిన ప్రాబ్లమ్స్‌కు ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి వచ్చింది. సులభమైన 51 ప్రశ్నల్లో అంశాల వారీగా వచ్చిన ప్రశ్నలు: కాలిక్యులస్-11, ట్రిగ్నోమెట్రీ-9, ఆల్జీబ్రా-9, ప్రొబాబిలిటీ-3, వెక్టర్ ఆల్జీబ్రా-4, కోఆర్డినేట్ జ్యామెట్రీ-15.మధ్యస్తంగా ఉన్న 18 ప్రశ్నల్లో అంశాల వారీగా వచ్చిన ప్రశ్నలు: కాలిక్యులస్-4, ట్రిగ్నోమెట్రీ-3, ఆల్జీబ్రా-5, ప్రొబాబిలిటీ-2, వెక్టర్ ఆల్జీబ్రా-1, కోఆర్డినేట్ జ్యామెట్రీ-3,క్లిష్టమైన 11 ప్రశ్నల్లో అంశాల వారీగా వచ్చిన ప్రశ్నలు: కాలిక్యులస్-4, ట్రిగ్నోమెట్రీ-1, ఆల్జీబ్రా-1, ప్రొబాబిలిటీ-2, వెక్టర్ ఆల్జీబ్రా-1, కోఆర్డినేట్ జ్యామెట్రీ-2.బెస్ట్ స్కోర్: 80. యావరేజ్ స్కోర్: 55. ఫిజిక్స్ ఇంజనీరింగ్ విభాగంలోని ఫిజిక్స్ పేపర్ సులభంగానే ఉందని చెప్పొచ్చు. ఫిజిక్స్ నుంచి అడిగిన 40 ప్రశ్నల్లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం నుంచి 20 ప్రశ్నలు, ద్వితీయ సంవత్సరం నుంచి 20 ప్రశ్నలు వచ్చాయి. కాబట్టి రెండు సంవత్సరాల సిలబస్‌కు సమప్రాధాన్యతనిచ్చారని చెప్పొచ్చు. మొత్తం 40 ప్రశ్నల్లో సులభమైన ప్రశ్నలు-18, మధ్యస్తమైనవి-20, క్లిష్టమైనవి-2. నూతన సిలబస్ నుంచి 3 ప్రశ్నలు వచ్చాయి.మొదటి సంవత్సరం సిలబస్ నుంచి అంశాల వారీగా వచ్చిన ప్రశ్నలు: ఫిజికల్ వరల్డ్-1, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్-1, మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్-2, మోషన్ ఇన్ ఏ ప్లేన్-2, లాస్ ఆఫ్ మోషన్-4, వర్క్, ఎనర్జీ, పవర్-1, సిస్టమ్ ఆఫ్ ప్రాక్ట్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్-1, ఆసిలేషన్స్-1, గ్రావిటేషన్-1, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్-1, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్-1, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్-2, థర్మోడైనమిక్స్-2. ద్వితీయ సంవత్సరం సిలబస్ నుంచి అంశాల వారీగా వచ్చిన ప్రశ్నలు: వేవ్స్-1, రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్-2, వేవ్ ఆప్టిక్స్-1, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్-1, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్-1, కరెంట్ ఎలక్ట్రిసిటీ-2, మూవింగ్ చార్జెస్ అండ్ మాగ్నటిజం-2, మాగ్నటిజం అండ్ మ్యాటర్-1, ఎలక్ట్రోమాగ్నటిక్ ఇండక్షన్-1, ఆల్టర్నేటింగ్ కరెంట్స్-1, ఎలక్ట్రోమాగ్నటిక్ వేవ్స్-1, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్-1, ఆటమ్స్-1, న్యూక్లి-1, సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్-2, కమ్యూనికేషన్ సిస్టమ్స్-1.బెస్ట్ స్కోర్: 38-40. యావరేజ్ స్కోర్: 15-20. కెమిస్ట్రీ కెమిస్ట్రీ పేపర్ సులభం నుంచి మధ్యస్తంగా ఉందని చెప్పొచ్చు.ఈ సబ్జెక్ట్ నుంచి అడిగిన 40 ప్రశ్నల్లో..ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం నుంచి 21 ప్రశ్నలు, ద్వితీయ సంవత్సరం నుంచి 19 ప్రశ్నలు ఇచ్చారు. వీటిలో 28 ప్రశ్నల (70 శాతం) క్లిష్టత సులభం నుంచి మధ్యస్తంగా ఉంది. ప్రాథమిక అంశాలు, సింపుల్ కాలిక్యులేషన్‌పై అవగాహన ఉంటే వీటిని సులభంగానే సాధించవచ్చు. 10 ప్రశ్నలు (25 శాతం) న్యూమరికల్ బేస్డ్గా ఉన్నాయి. ఇందులో కూడా 6 ప్రశ్నలు ఫార్ములా ఆధారితంగా ఇచ్చారు. వీటిని సాధారణ విద్యార్థులు కూడా సాధించవచ్చు.ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అడిగిన 8 ప్రశ్నలు.. ఎటువంటి గందరగోళానికి (ట్విస్ట్)గురి చేయకుండా నేరుగా ఉన్నాయి. ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి 13 ప్రశ్నలు, పాలిమర్స్-బయో-ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ నుంచి 4 ప్రశ్నలు వచ్చాయి. అత్యధికంగా ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 15 ప్రశ్నలు ఇచ్చారు.గఅ , గఐఐఅ గ్రూప్ మూలకాలు, ఆల్డీహైడ్స్, కీటోన్స్, బేసిక్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఎటువంటి ప్రశ్నలు రాకపోవడం గమనార్హం.బెస్ట్ స్కోర్: 38-40. యావరేజ్ స్కోర్: 25-28. మెడికల్ బోటనీ బోటనీ పేపర్ నిరాశపరిచిందని చెప్పొచ్చు. దీని ప్రభావం మిగతా సబ్జెక్ట్లపై కూడా ఉండొచ్చు. ఊహించిన ప్రామాణికత మేరకు ప్రశ్నపత్రాన్ని రూపొందించలేదని భావించవచ్చు. ఈ మధ్యకాలంలో బోటనీ పేపర్‌ను రూపొందించే క్రమంలో విపరీత ధోరణులు కనిపిస్తున్నాయి. ఒక ప్రశ్నను రాసుకుని దాన్ని ఇన్‌డెరైక్ట్‌గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ ప్రశ్నకు ఎటువంటి తార్కిక ముగింపు ఉండటం లేదు. ఇటువంటి ధోరణి ఈ సంవత్సరం కూడా కనిపించింది. ఫలితంగా ఇచ్చిన ఐచ్ఛికాంశాలాధారంగా సమాధానాన్ని గుర్తించే పద్ధతిని అనుసరించాల్సి వచ్చింది. అంతేకాకుండా సమాధానాలు ఇచ్చే ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది. దాంతో ఎక్కువ సమయాన్ని వెచ్చించాల్సి రావడం మరో కీలక అంశం. డయాగ్రామ్స్ ఆధారంగా అడిగిన ప్రశ్నల్లో పటాలను పైతరగతుల పుస్తకాల నుంచి నేరుగా కాపీ చేశారు. వీటికి సంబంధించి అంశాలు సిలబస్‌లో ఉన్నప్పటికీ.. డయాగ్రామ్స్, వాటి వివరణ పాఠ్యపుస్తకాల్లో లేకపోవడ ం గమనార్హం.ఈ సబ్జెక్ట్ నుంచి అడిగిన 40 ప్రశ్నల్లో.. ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం నుంచి 19 ప్రశ్నలు, ద్వితీయ సంవత్సరం నుంచి 21 ప్రశ్నలు ఇచ్చారు. వీటిల్లో అసెర్షన్-రీజన్ ప్రశ్నలు 2, మ్యాచ్ ది ఫాలోయింగ్-10 (మొదటి సంవత్సరం నుంచి 6, ద్వితీయ సంవత్సరం నుంచి 4), మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు-8. బెస్ట్ స్కోర్: 38. యావరేజ్ స్కోర్: 25-27. జువాలజీ నూతన సిలబస్‌తో తొలిసారి నిర్వహిస్తున్న ఎంసెట్ కావడంతో పేపర్ ఏవిధంగా ఉంటుంది? ప్రశ్నల క్లిష్టత వంటి అంశాల పట్ల విద్యార్థుల్లో కొంత ఆందోళన నెలకొని ఉంది. కానీ జువాలజీ విషయంలో మాత్రం ప్రశ్నపత్రం సులభంగా ఉండటంతో పాటు స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉందని చెప్పొచ్చు. జువాలజీ నుంచి అడిగిన 40 ప్రశ్నల్లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం నుంచి 18 ప్రశ్నలు, ద్వితీయ సంవత్సరం నుంచి 22 ప్రశ్నలు వచ్చాయి. రెండు సంవత్సరాల సిలబస్‌కు సమప్రాధాన్యతనిచ్చే ప్రయత్నం చేశారు. నాలుగైదు ప్రశ్నలు మినహా మిగతా ప్రశ్నలను నేరుగా(డెరైక్ట్) అడిగారు. అధిక శాతం ప్రశ్నలు ప్రాథమిక అవగాహన ఆధారంగా వచ్చాయి. సాధారణ విద్యార్థులు సైతం వీటికి సమాధానం గుర్తించగలరు.ప్రశ్నలను నేరుగా ఇవ్వడం వల్ల అధిక శాతం తప్పులు చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇదే సమస్య చాలా మంది విద్యార్థులకు ఎదురైంది.పటాలాధారంగా అడిగే ప్రశ్నలు ఈ సారి కనిపించలేదు. ఊహించిన విధంగానే హ్యుమన్ అనాటమీ, సీనియర్ ఇంటర్‌లోని ఫిజియాలజీ అంశం నుంచి 11 ప్రశ్నలు వచ్చాయి. 4 ప్రశ్నలు వస్తాయని అంచనా వేసిన జెనెటిక్స్ నుంచి 6 ప్రశ్నలు ఇచ్చారు. బెస్ట్ స్కోర్: 39-40 యావరేజ్ స్కోర్: 35 ఫిజిక్స్ మెడికల్ విభాగంలో ఫిజిక్స్ పేపర్ సులభంగానే ఉందని చెప్పొచ్చు. ఫిజిక్స్ నుంచి అడిగిన 40 ప్రశ్నల్లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం నుంచి 20 ప్రశ్నలు, ద్వితీయ సంవత్సరం నుంచి 20 ప్రశ్నలు వచ్చాయి. కాబట్టి రెండు సంవత్సరాల సిలబస్‌కు సమప్రాధాన్యతనిచ్చారని చెప్పొచ్చు. మొత్తం 40 ప్రశ్నల్లో సులభమైన ప్రశ్నలు-25, మధ్యస్తమైనవి-15.నూతన సిలబస్ నుంచి 3 ప్రశ్నలు వచ్చాయి.మొదటి సంవత్సరం సిలబస్ నుంచి అంశాల వారీగా వచ్చిన ప్రశ్నలు: ఫిజికల్ వరల్డ్-1; యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్-1, మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్-1, మోషన్ ఇన్ ఏ ప్లేన్-3, లాస్ ఆఫ్ మోషన్-2, వర్క్ ఎనర్జీ పవర్-2, సిస్టమ్ ఆఫ్ ప్రాక్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్-2, ఆసిలేషన్స్-2, గ్రావిటేషన్-1, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్-1, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్-1, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్-1, థర్మోడైనమిక్స్-3. ద్వితీయ సంవత్సరం సిలబస్ నుంచి అంశాల వారీగా వచ్చిన ప్రశ్నలు: వేవ్స్-1, రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్-2, వేవ్ ఆప్టిక్స్-1, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్-1, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్-1, కరెంట్ ఎలక్ట్రిసిటీ-2, మూవింగ్ చార్జెస్ అండ్ మాగ్నటిజం-2, మాగ్నటిజం అండ్ మ్యాటర్-2, ఆల్టర్నేటింగ్ కరెంట్స్-1, ఎలక్ట్రో మాగ్నటిక్ వేవ్స్-1, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్-1,ఆటమ్స్-1,న్యూక్లి-1, సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్-2, కమ్యూనికేషన్ సిస్టమ్స్-1. బెస్ట్ స్కోర్: 40 యావరేజ్ స్కోర్: 15-20 కెమిస్ట్రీ కెమిస్ట్రీ..చాలా మంది విద్యార్థులకు సంతోషం కలిగించే విధంగా ఉందని భావించవచ్చు. ఇందులోని ప్రశ్నలు సులభం నుంచి మధ్యస్తంగా ఉన్నాయి.ఈ సబ్జెక్ట్ నుంచి అడిగిన 40 ప్రశ్నల్లో..ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం నుంచి 21 ప్రశ్నలు, ద్వితీయ సంవత్సరం నుంచి 19 ప్రశ్నలు ఇచ్చారు. వీటిల్లో 25 ప్రశ్నల (62.5 శాతం) క్లిష్టత సులభం నుంచి మధ్యస్తంగా ఉంది. ప్రాథమిక అంశాలు, సింపుల్ కాలిక్యులేషన్‌పై అవగాహన ఉంటే వీటిని సులభంగానే సాధించవచ్చు. 13 ప్రశ్నలు (33 శాతం) న్యూమరికల్ బేస్డ్గా ఉన్నాయి. ఇందులో 9 ప్రశ్నలు మధ్యస్తం నుంచి క్లిష్టత స్థాయి వరకు ఉన్నాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అడిగిన 8 ప్రశ్నలు, ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి 13 ప్రశ్నలు, పాలిమర్స్-బయో- ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ నుంచి 4 ప్రశ్నలు వచ్చాయి. అత్యధికంగా ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 15 ప్రశ్నలు ఇచ్చారు.గఅ , గఐఐఅ గ్రూప్ మూలకాలు, ఆల్డీహైడ్స్, కీటోన్స్, బేసిక్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఎటువంటి ప్రశ్నలు రాకపోవడం గమనార్హం.బెస్ట్ స్కోర్: 39 యావరేజ్ స్కోర్: 20-25 -
ప్రశాంతంగా ఎంసెట్
విజయనగరం రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలో గురువారం నిర్వహించిన ఎంసెట్-2014 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు జిల్లాలో 5,228 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 4,712 మంది హాజరయ్యా రు. 516 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాలేదు. విజయనగరం జేఎన్టీయూకే కళాశాలతో పాటు పరిసర ప్రాంతాల్లోని సీతం ఇంజినీరింగ్ కళాశాల, డెంకాడ మండలం చింతలవలసలో ఉన్న ఎంవీజీఆర్, మోదవలసలోని ప్రావీణ్య ఇంజినీరింగ్ కళాశాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం ఆరు కేంద్రాల్లో నిర్వహించిన ఇంజినీరింగ్ పరీక్షకు 3,834 మంది హాజరు కావాల్సి ఉండగా 3,484 మంది హాజరై 350 మంది గైర్హాజరయ్యారు. ఇంజినీరింగ్‌లో 90.87 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం నిర్వహించిన అగ్రికల్చరల్, మెడిసన్ పరీక్షకు 1,394 మంది హాజరు కావాల్సి ఉండగా 1228 మంది హాజరై, 166 మంది గైర్హాజరయ్యారు. మెడి సిన్ విభాగంలో 88.09 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు ఎంసెట్ రీజినల్ కోఆర్డినేటర్ జి.యేసురత్నం తెలిపారు. ఎంసెట్ ఎంట్రన్స్ పరీక్షకు ఒక్క నిమిషమైనా ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు ముందుగా ప్రకటించడంతో అభ్యర్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. జగిత్యాల జేఎన్టీయూ ప్రొఫెసర్ మధుసూదనరావు, జేఎన్టీయూ హైదరాబాద్ ప్రొఫెసర్ ఇంద్రాణి ప్రత్యేక అబ్జర్వర్లుగా వ్యవహరించారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడంతో అభ్యర్థులు బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కొంతమంది అభ్యర్థులు ఆటోలు, మోటారు సైకిళ్లపై పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. అభ్యర్థులతో పాటు వచ్చిన తల్లిదండ్రులు, ఇతరులను పరీక్షా కేంద్రాలకు దూరంగా నిలిపివేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్‌ను అమలు చేయడంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షలు ప్రశాంతగా జరిగాయి. అయితే అభ్యర్థులకు తోడుగా వచ్చిన వారు పరీక్ష జరుగుతున్న సమయమంతా ఎండలో ఇబ్బందులు పడ్డారు. అనేక మంది పరీక్షా కేంద్రాలకు సమీపంలో ఉన్న చెట్లు నీడనే ఆశ్రయించారు. అభ్యర్థుల తల్లిదండ్రులు మంచినీటికి ఇబ్బందులు పడకుండా స్వచ్ఛంద సంస్థలు పరీక్షా కేంద్రాల సమీపంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి తాగునీరు, మజ్జిగను అందించారు. విజయనగరం పట్టణానికి చెందిన ఉడాకాల నీ సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో ఉచితంగా మజ్జిగ, తాగునీరు పంపిణీ చేశారు. -
ఎంసెట్ ప్రశాంతం
శ్రీకాకుళం న్యూకాలనీ, న్యూస్‌లైన్: ఇంజినీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం గురువారం జరిగిన ఎంసెట్-2014 పరీక్ష జిల్లాలో ప్రశాం తంగా ముగిసింది. జిల్లా కేంద్రంతోపాటు శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 11 కేంద్రాల్లో జరిగిన ఇంజినీరింగ్ విభాగానికి 4,801 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 4,291 (89.38 శాతం) మంది హాజరయ్యారు. 510 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు నాలుగు కేంద్రాల్లో జరిగిన మెడిసిన్ పరీ క్షకు 1658 మందికిగాను 1503 (91.65 శాతం) మంది హాజరయ్యారు. 155 మంది డుమ్మా కొట్టారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు అనుమతించబోమని అధికారులు స్పష్టం చేయడంతో విద్యార్థులు ఉరుకులు, పరుగులు తీశారు. పలాస, ఇచ్ఛాపురం, కవిటి, టెక్కలి, సీతంపేట, రాజాం, నందిగాం, హిరమండలం, కొత్తూరు, పాతపట్నం తదితర సుదూర ప్రాంతాల నుంచి పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి విద్యార్థులు ఆపసోపాలు పడ్డారు. కాగా పరీక్ష ముగిసిన తర్వాత జవాబుపత్రాలను, ఇతర మెటీరియల్‌ను పటిష్ట పోలీసు బందోబస్తు నడుమ ఇక్కడ నుంచి తరలించారు. 144వ సెక్షన్, పటిష్ట బందోబస్తు ఎంసెట్ పరీక్ష జరిగిన అన్ని కేంద్రాల వద్ద 144వ సెక్షన్‌ను పటిష్టంగా అమలు చేశారు. ముఖ్యంగా మెడిసిన్ పరీక్ష జరిగిన నాలుగు కేంద్రాల వద్ద రెట్టింపు బందోబస్తును అధికారులు ఏర్పాటు చేశారు. ప్రతీ కేంద్రం వద్ద కనీసం ముగ్గురు పోలీసులతోపాటు స్పెషల్ పార్టీకి చెందిన బృందాలు కూడా నిఘా పెట్టాయి. పరీక్ష కేంద్రాల లోపలికి ఆయా కళాశాలలకు చెంది, గుర్తింపు కార్డు చూపించిన సిబ్బందిని మినహా మిగిలిన వారిని పోలీసులు అనుమతించలేదు. గురువారం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో విద్యార్థులు చెమటతో తడిసిముద్దయ్యారు. కిక్కిరిసిన హోటళ్లు, బస్సులు సుదూర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు భోజనాలు చేసేందుకు ఎగబడటంతో స్థానికం గా హోటళ్లు, రెస్టారెంటులు, టిఫిన్ షాపులు కిటకిటలాడాయి. బస్సులు, ఆటోలు, మాక్సీక్యాబ్‌లు కిక్కిరిపోయాయి. కాగా విద్యార్థులను తరలించేందుకు ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను కేటాయించింది. వీటితోపాటు శ్రీ శివానీ, వెంకటేశ్వర, శారద, వైష్ణవి, గురజాడ కళాశాలల యాజమాన్యాలు వివిధ కేంద్రాల వద్ద ఉచిత బస్సులను ఏర్పాటు చేశాయి. ఇంజినీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, డిగ్రీ తదితర కోర్సులను అందిస్తున్న ప్రైవేటు కళాశాలలు తమ కరపత్రా లు (బ్రోచర్లు)ను విద్యార్థులకు అందజేసేం దుకు ఎగబడ్డాయి. హాట్ కేకుల్లా అమ్ముడైన ‘సాక్షి ఎంసెట్’ బుక్లెట్స్ మరోవైపు పరీక్ష కేంద్రాల వద్ద ‘సాక్షి’ ఎంసెట్ ఇంజినీరింగ్, మెడికల్ కౌన్సెలింగ్ పుస్తకాలు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఇంజినీరింగ్, మెడికల్ కౌన్సిలింగ్ సమగ్ర సమాచారాన్ని కేవలం రూ.75తో బుక్లెట్స్ రూపంలో అందించడంతో కోనుగోలు చేసేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎగబడ్డారు. -
14 మంది విద్యార్థులకు గాయాలు
అలంపురం(పెంటపాడు), న్యూస్‌లైన్ : అలంపురంవద్ద జాతీయరహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కళాశాల బస్సులో ప్రయాణిస్తున్న 14 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బస్సు పెంటపాడు మండలం బి.కొండేపాడు, తణుకు మండలం దువ్వ తదితర గ్రామాలకు చెందిన ఇంజినీరింగ్, ఫార్మశీ విద్యార్థులను ఎక్కించుకుని శనివారం ఉదయం జాతీయరహదారి మీదుగా క ళాశాలకు బయలుదేరింది. అలంపురం ఆంజనేయస్వామి విగ్రహ సమీపంలోకి వచ్చేసరికి ముందువెళుతున్న ట్రాలీ లారీని ఓవర్ టేక్ చేయబోయి దానిని ఢీకొట్టింది. బస్సులోని క్లీనర్‌తోపాటు 14 మంది ఇంజినీరింగ్, ఫార్మశీ విద్యార్థుల కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. వారిని 108లో తణుకు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారందరికీ స్వల్పగాయాలయ్యాయని, ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. వేగంగా వెళుతున్న బస్సు ముందు వెళుతున్న ట్రాలీని ఓవర్ టేక్ చేసి, దానిముందు వెళుతున్న మరో వాహనాన్ని తప్పించే క్రమంలో ఈ ప్రమాద ం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో బస్సు పల్టీ కోట్టేదని, అయితే బస్సు డ్రైవర్ సమయోచితంగా బ్రేక్ వేయటంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పారు. ఘటనా స్థలాన్ని ఎస్సై సీహెచ్ రమేష్ పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. -
ఫార్మసీ, డయాగ్నస్టిక్ సేవల బలోపేతానికి కృషి
విశాఖపట్నం-మెడికల్, న్యూస్‌లైన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫార్మసీ, డయాగ్నస్టిక్ సేవల్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయం తో ఉందని రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు జి.శాంతారావు చెప్పారు. గురువారం ఆయన కింగ్ జార్జి ఆస్ప త్రి, ఆంధ్ర వైద్య కళాశాలలను సందర్శించారు. కేజీహెచ్ ఇన్చార్జి సూపరింటెండెంట్ జి.వెంకటేశ్వరరెడ్డి, ఏఎంసీ ప్రిన్సిపాల్ ఎస్.వి.కుమార్లతోపాటు అన్ని వైద్య విభాగల అధిపతులతో సమావేశమై వైద్య సిబ్బంది, పరికరాల కొరతపై చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రోగులను బయటకు పంపకుండా చూసేందుకే ఈ సౌకర్యమ న్నారు. అత్యవసర మందులు అం దుబాటులో ఉండేలా చూస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 300 మంది అసిస్టెంట్ల ప్రొఫెసర్ల నియామకానికి సీఎం అనుమతి లభించిందని, ఆర్థిక శాఖ అనుమతి లభించిన వెంటనే భర్తీ చేస్తామని చెప్పారు. సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాల్లో నర్సుల కొరత వేధిస్తోందని నర్సుల సంఘం నేతలు ఆయన దృష్టికి తేగా త్వరలో పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. రోగుల వసతి కోసం టి.సుబ్బరామిరెడ్డి నిర్మిస్తున్న డార్మె ట్రీ పనులను డీఎంఈ పరిశీలించారు. ఆయన వెంట డిప్యూటీ సూపరింటెంట్ బి.ఉదయ్‌కుమార్, ప్రొఫెసర్లు శివకుమార్, సుబ్బారావు, మెట్ట రాజగోపాల్, డిప్యూటీ సివిల్ సర్జన్ ఆర్.ఎం.ఓ.శాస్త్రి ఉన్నారు. ఏఎంసీలో రూ.25 కోట్లతో ఎండీఆర్ ల్యాబ్ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఏఎంసీకి మల్టీ డిసిప్లినరీ రీసెర్చి లేబొరేటరీ (ఎండీఆర్)ని మంజూరు చేసింది. ఈ ల్యాబ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.5 కోట్లు వంతున ఐదేళ్లపాటు నిధులను సమకూరుస్తుందని డీఎంఈ డాక్టర్ శాంతారావు తెలిపారు. -
ఫార్మసీలో గాయాలతో ప్రత్యక్షమైన కంగారూ
-
ఎంసెట్ ఫార్మశీ కౌన్సెలింగ్ ప్రారంభం
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్ : ఫార్మశీ, ఫార్మా-డీ, బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం చేపట్టిన వెబ్ కౌన్సెలింగ్‌లో భాగంగా ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ ర్యాంకర్ల ధ్రువీకరణ పత్రాల పరిశీలన సోమవారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీలోని హెల్ప్‌లైన్ కేంద్రంలో ప్రారంభమైంది. తొలిరోజు 33 వేలలోపు ర్యాంకర్ల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించగా 58 మంది హాజరయ్యారు. వీసీ ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి ధ్రువీకరణ వెరిఫికేషన్ పత్రాన్ని ర్యాంకర్‌కు అందజేశారు. కార్యక్రమంలో చీఫ్ వెరిఫికేషన్ అధికారులు ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య, డాక్టర్ కె.స్వప్నవాహిని, బోధకులు వి.మల్లికార్జునరావు, హనుమంతు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 21 వరకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన కొనసాగనుంది. ఎన్ఎస్ఎస్ సేవలు విస్తరించాలి జాతీయ సేవాపథకం సేవలను విస్తరించాలని వీసీ లజపతిరాయ్ పిలుపునిచ్చారు. జిల్లాలో జాతీయ సేవా పథకం అమలుపై ఆయన సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని కళాశాలల్లో ఎన్ఎస్ఎస్ యూనిట్లు ఏర్పాటు చేసి విద్యార్థుల్లో సేవాదృక్పథం, నాయకత్వ లక్షణాల వృద్ధికి కృషి చేయాలన్నారు. సమాజం పట్ల అవగాహన, సేవా దృక్పథం ఉన్న విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుంటారన్నారు. ఇంకుడు గుంతల ఏర్పాటు, పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. సమీక్షలో స్టేట్ లైజన్ అధికారి పి.రామచంద్రరావు, రీజియన్ అధికారి ఆర్.గోపాలకృష్ణ, ఆంధ్రా యూనివర్సిటీ అధికారి ప్రొఫెసర్ పాల్, జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ గంజి సంజీవయ్య తదితరులు పాల్గొన్నారు. సిలబస్‌కు ఎనలేని ప్రాధాన్యం విద్యార్థి జీవితానికి ఉపయోగ పడేదే నిజమైన విద్య అని, ప్రతి కోర్సు రూపకల్పనలో సిలబస్‌కు ఎనలేని ప్రాధాన్యం ఉందని వీసీ లజపతిరాయ్ చెప్పారు. సోమవారం నిర్వహించిన ఎడ్యుకేషన్, గణితం, తెలుగు విభాగాల బోర్డాఫ్ స్టడీస్ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఉపాధి అవకాశాలకు అనువైన సిలబస్‌తోనే అన్ని విభాగాలు బలోపేతమవుతాయని వివరించారు. విద్యార్థి భవిష్యత్తు తాను చదివే కోర్సుపై ఆధారపడి ఉంటుందన్నారు. అందుకే డిగ్రీ, పీజీ స్థాయిల్లో సిలబస్ కమిటీలు వేశామన్నారు. కామన్ కోర్ సిలబస్, యూజీసీ నిబంధనలకు లోబడి పాఠ్యాంశాల్లో మార్పులు చేస్తామని చెప్పారు. ప్రిన్సిపాల్ మిర్యాల చంద్రయ్య, బోర్డాఫ్ స్టడీస్ చైర్మన్లు, సభ్యులు పాల్గొన్నారు.